భోపాల్‌లో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మిస్ పూణే , కంటెంట్ క్రియేటర్ 33 ఏళ్ల ట్విషా శర్మ మరణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మరణించడానికి ముందు శరీరంపై పలు చోట్ల తీవ్ర గాయలయ్యాయని ఫోరెన్సిక నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో మరణపూర్వ గాయాలు అంటే ఏంటీ?, ఫోరెన్సిక్ వైద్యులు వాటిని ఎలా గుర్తిస్తారు వంటి వాటి గురించి తెలుసుకుందామా.!.
ఫోరెన్సిక్ దర్యాప్తులలో ఇవి అత్యంత కీలకమైన ఆధారాలు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మరణిస్తే పోస్ట్‌మార్టం నిర్వహించడానికి తరలిస్తారు పోలీసులు. అక్కడ ఫోరెన్సిక నిపుణులు ఆ వ్యక్తి ఎలా మరణించాడో నిర్థారించే ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత నిపుణులు పోస్ట్‌మార్టం నివేదికలో మరణానికి ముందు గాయాలు, మరణానంతర గాయాలు అని పేర్కొంటూ ఇస్తారు. ఇవి కేసుని చేధించడానికి ఎంత కీలకం అంటే..ఆయా వ్యక్తుల మరణానికి కారణమైన నేరస్తులను వెలకితీయడానికి ప్రధాన ఆధారాలు.
'మరణపూర్వ గాయాలు' అంటే ..
ఫోరెన్సిక్ వైద్యంలో, "మరణపూర్వ" అంటే మరణానికి ముందు జరిగే గాయలని అర్థం. జీవించి ఉండగానే అయ్యిన గాయాలని అర్థం. అవి
కోతలు లేదా రాపిడి గాయాలు
వాపు
ఎముకలు విరగడం
అంతర్గత రక్తస్రావం
బలహీనమైన దెబ్బలు
ఆత్మరక్షణ గాయాలు తదితరాలు.
వైద్యులు చెప్పేదేమిటంటే, ఈ పదం గాయాలు ఎలా జరిగాయో దానంతట అదే వెల్లడించనప్పటికీ, మరణానికి దారితీసిన పరిస్థితులను నిర్థారించడంలో కీలకపాత్ర పోషిస్తుంద.
ఎలా గుర్తిస్తారంటే?
మరణానంతర పరీక్ష సమయంలో, ఫోరెన్సిక్ నిపుణులు మరణానికి ముందు శరీరం గాయానికి ప్రతిస్పందించిందని చూపే ఆధారాలను సేకరిస్తారు. కణజాలంలోకి రక్తస్రావం, వాపు లేదా ఉబ్బరం, రంగు మార్పులతో కూడిన కమిలిన గాయాలు, రక్తం గడ్డకట్టడం, రక్త ప్రసరణ చురుకుగా ఉందని సూచించే కణజాల ప్రతిచర్యలు వంటివి ముఖ్యమైన సంకేతాలు. గుండె ఇంకా రక్తాన్ని పంపింగ్ చేస్తూ, శరీరం సజీవంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రతిస్పందనలు సాధ్యమవుతాయి.
ఇవి చట్టపరంగా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న నివేదిక. దర్యాప్తు అధికారులు ఈ గాయాలు మరణానికి ఏవిధంగా దోహదపడ్డాయి, ఆ టైంలో ఏదైన పెనుగులాట జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగాయ, స్వయంగా జరిగినవా వంటివి నిర్థారిస్తారు. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న కేలుసలలో లేదా ఏదైన కుట్రపన్ని ఉద్దేశ్యపూర్వకంగా చంపేసిన ఘటనల్లోనే ఇలాంటి బహుణ మరణ పూర్వగాయాలకు ఆస్కారం ఉంటుంది. అదీగాక పోలీసులు వైద్య నివేదికలు లేకుండా ఒక నిర్ధారణకు రాకూడదని నిపుణులు హెచ్చరిస్తుంటారు.
మరణానంతర గాయాలు అంటే..
మరణం తర్వాత కలిగే గాయాలను మరణానంతర గాయాలు అంటారు. ఇవి సాధారణంగా అవే జీవసంబంధమైన ప్రతిచర్యలను చూపించవు.
మరణానికి పూర్వం-మరణానంతర గాయాల మధ్య వ్యత్యాసం..
మరణానికి ముందు గాయాలు
మరణానికి ముందు సంభవిస్తాయి
రక్తస్రావం, వాపును చూపుతాయి
గాయం జరిగినప్పుడు శరీరం సజీవంగా ఉందని సూచిస్తాయి
మరణానంతర గాయాలు
మరణం తర్వాత సంభవిస్తాయి
సాధారణంగా వాపు లేదా కణజాల ప్రతిచర్య ఉండదు
ఇది రవాణా సమయంలో, పర్యావరణానికి గురైనప్పుడు లేదా శరీరాన్ని తాకినప్పుడు జరగవచ్చు. ఇక్కడ కేసుని చేధించడంలో ఫోరెన్సిక్ నివేదిక అనేది దర్యాప్తులో ఒక భాగం మాత్రమే. అధికారులు ఒక నిర్ధారణకు రావడానికి ముందు పోలీసుల ఇన్విస్టిగేషన్, సాక్షుల వాంగ్మూలాలు, టాక్సికాలజీ నివేదికలు, డిజిటల్ ఆధారాలు, వైద్య చరిత్ర వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.
(చదవండి: సింగింగ్'తో జీర్ణక్రియ మెరుగుపడుతుందా? హార్వర్డ్ నిపుణుల షాకింగ్ విషయాలు)


