అర్ధరాత్రి నడిరోడ్డుపై దీన స్థితిలో పావలా శ్యామల | Actress Pavala Syamala Abondened on Footpath After Hospital Rejected Treatment | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి నడిరోడ్డుపై దిక్కుతోచని స్థితిలో పావలా శ్యామల

May 16 2026 11:49 AM | Updated on May 16 2026 5:43 PM

Actress Pavala Syamala Abondened on Footpath After Hospital Rejected Treatment

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నటి పావలా శ్యామల పరిస్థితి రోజురోజుకూ మరింత దయనీయంగా మారుతోంది. అటు వృద్ధాప్య సమస్యలు, ఇటు అనారోగ్యం ఆమెను మరింత కుంగదీస్తున్నాయి. ప్రస్తుతం ఆర్కే ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమె శుక్రవారం రాత్రి అస్వస్థతకు లోనవగా చికిత్స కోసం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. 

దీన స్థితిలో నటి
కానీ చికిత్సకు సరిపడా డబ్బు తన దగ్గర లేకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యం ఆమెకు ట్రీట్‌మెంట్‌ చేసేందుకు నిరాకరించింది. అంతేకాకుండా ఓ క్యాబ్‌ ఎక్కించి ఆమెను బలవంతంగా పంపించేసింది. అయితే క్యాబ్‌ డ్రైవర్‌ సైతం ఆమెను మధ్యలోనే దింపేశాడు. కూకట్‌పల్లిలోని ఓ జంక్షన్‌ వద్ద రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై దించేసి నిర్దాక్షిణ్యంగా వెళ్లిపోయాడు. దీంతో అర్ధరాత్రి కటిక చీకటిలో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ కూర్చుండిపోయింది. 

ఆస్పత్రిలో చికిత్స
కాసేపటికి ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు.. ఆమె ఆశ్రయం పొందుతున్న ఆర్కే ఫౌండేషన్‌కు సమాచారమివ్వడంతో వారు తనను సనత్‌నగర్‌లోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఒకప్పుడు తన నటనతో ఎంతోమందిని నవ్వించిన నటి ఇప్పుడిలా రోడ్డుపై దయనీయ స్థితిలో కనిపించడం చూసి సినీప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పావలా శ్యామల పరిస్థితి తెలుసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. సాయం చేయడం కోసం తన టీంను ఆసుపత్రికి పంపినట్లు సమాచారం.

చదవండి: సూర్యకు భారీ పారితోషికం.. మరి త్రిషకెంతో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement