Delhi
-
వార్షికోత్సవం చేసుకుంటున్నారా?: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఫిరాయింపులపై చర్యలు తీసుకునేందుకు ఇంకెంత సమయం కావాలి? ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తి అయ్యేవరకు వేచి చూడటం రీజనబుల్ టైం (తగిన సమయం) అవుతుందా? న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి ఒక గడువు అనేది ఉండాలి కదా? పార్టీ ఫిరాయింపులపై మొదటి ఫిర్యాదు అందినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత సమయం అవుతోంది? ఏడాది అవుతోందని వార్షికోత్సవం జరుపుకుంటున్నారా?..’ అంటూ స్పీకర్ కార్యాలయాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మీరు అడిగే సమయానికి ఒక నిర్దేశిత గడువు అనేది ఉండదా? అని ప్రశ్నిస్తూనే.. మరోపక్క ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చా లేదా? అనే అంశంపై మాత్రమే తాము వాదనలు వింటున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. అదేరోజు స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శుల వాదనలను వింటామని తెలిపింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ల పేర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ).. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాందీలపై బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు, తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మైస్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, ముకుల్ రోహత్గిలు హాజరయ్యారు. ఎస్ఎల్పీపై సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం, రిట్ పిటిషన్‌పై దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు వాదనలు వినిపించారు. ఆ తీర్పుల ఆధారంగా చర్యలకు అవకాశం: ఆర్యమా సుందరం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా గతేడాది మార్చి 15న తొలిసారి స్పీకర్‌కు తాము ఫిర్యాదు చేశామని ఆర్యమా సుందరం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఫిరాయింపులపై తొలిసారి కోర్టును ఆశ్రయించామని, జూన్‌లో రిట్ పిటిషన్ వేశామని చెప్పారు. దానం నాగేందర్ కాంగ్రెస్ బీ ఫామ్‌పై ఎంపీ ఎన్నికలకు పోటీ చేశారని, మరో ఎమ్మెల్యే తన కుమార్తె కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని ప్రచారం చేశారని, తెల్లం వెంకట్రావ్ సైతం పార్టీ ఫిరాయించారని పేర్కొన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదని, కనీసం నోటీసులు ఇవ్వలేదని వివరించారు. దీనిపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా ఈ వ్యవహారంపై విచారణ సమయాన్ని ఖరారు చేయాలన్న సింగిల్ బెంచ్ నాలుగు వారాలు గడువు ఇచ్చిందని గుర్తు చేశారు. దీనిపై స్పీకర్ కార్యాలయం అప్పీల్ కు వెళ్లగా.. స్పీకర్‌కు తగినంత సమయం ఇవ్వాలన్న గ్రౌండ్స్‌పై ఈ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టిందని తెలిపారు. కానీ ఇప్పటివరకు ఆ తగినంత సమయం అంటే ఎంతో చెప్పలేదన్నారు. స్పీకర్ తీసుకోవాల్సిన సమయంపై సుభాష్ దేశాయ్, కేశం మేఘాచంద్, రాజేంద్ర సింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఈ తీర్పుల ఆధారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని విన్నవించారు. స్పీకర్ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాతే.. ఈ ఏడాది ఫిబ్రవరి 13న మూడు వారాల్లో రిప్లై ఇవ్వాలని స్పీకర్‌కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చిందని ఆర్యమా సుందరం గుర్తు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయి జోక్యం చేసుకున్నారు. ‘ఇప్పటికి ఏడాది అంటే...పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా? వార్షికోత్సం జరుపుకుంటున్నారా?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. కేసు విషయంలో డిలే ట్యాక్టిక్స్ (ఆలస్యం చేసే చిట్కాలు) ఉపయోగించొద్దని అన్నారు. సుందరం తన వాదనలు కొనసాగిస్తూ.. ‘స్పీకర్ క్వాషి జ్యుడీషియరీ అధికారాలతో ఉన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌పై కూడా ఉంది. ఒకవేళ అది జరగడం లేదు అని భావిస్తే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది. స్పీకర్ క్వాషి జ్యుడీషియరీ అధికారాలతో ఒక ట్రిబ్యునల్‌గా వ్యవహరించాలి. స్పీకర్ అధికారాల్లోకి వెళ్లాలని, ఆయన విధుల్లో జోక్యం చేసుకోవాలని కోరడం లేదు కానీ, రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని మాత్రమే మేము కోరుతున్నాం’ అని అన్నారు. ఆ ధర్మాసనాలు స్పష్టంగా చెప్పలేదు: జస్టిస్ గవాయి గతంలో ఇలాంటి కేసులు విచారించిన రాజ్యాంగ ధర్మాసనాలు స్పీకర్‌కు సమయంపై స్పష్టత ఇవ్వలేదని, ఉన్నత ధర్మాసనాల తీర్పులను తాము తిరిగి ఎలా రాయగలమని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. దీంతో ‘తగినంత సమయం’ అనే విషయంలో ఒక్కో కేసులో ఒక్కో విధంగా నిర్ణయాలు జరిగాయని సుందరం చెప్పారు. వారంలోపే హైకోర్టును ఆశ్రయించారు: సింఘ్వీ ఫిరాయింపులపై గతేడాది జూలై మొదటి వారంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే, 9వ తేదీ నాటికే హైకోర్టులో పిటిషన్ వేశారని సింఘ్వీ చెప్పారు. నారిమన్ కేసులో ఫిర్యాదుకు, పిటిషన్‌కు మధ్య నిర్దిష్ట గడువు ఉండాలని కోర్టు తీర్పునిచ్చిందని చెప్పారు. ఇక్కడ ఫిరాయింపులపై ఫిర్యాదు అందగానే స్పీకర్ స్పందించి నోటీసులు ఇచ్చారని చెబుతుండగా జస్టిస్ గవాయి జోక్యం చేసుకుని.. గత విచారణ సందర్భంగా స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన విషయం గుర్తు చేశారు. వారిపై చర్యలు తీసుకోండి: బీజేఎల్పీ నేత పిటిషన్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాది మిథున్ శశాంక్ జోక్యం చేసుకుని.. ఫిరాయింపులకు సంబంధించి రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తావించబోతుండగా.. జస్టిస్ గవాయి ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ‘తాము ఈ కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాం. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్‌కి ఆదేశాలు జారీ చేయవచ్చా లేదా అన్న అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాం..’ అని చెప్పారు. కాగా ఈ వ్యవహారంలో తాము వాదనలు వినిపించేందుకు సుదీర్ఘ సమయం కావాలని రోహత్గి కోరారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. -
ద్రవ్యబిల్లుతో భారీ పన్ను ఉపశమనం
న్యూఢిల్లీ: ఆర్థిక బిల్లు, 2025తో పన్ను చెల్లింపుదారులకు భారీ ఉపశమనం లభించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ద్రవ్యబిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రభుత్వం తరఫున బదులిస్తూ నిర్మల సుదీర్ఘంగా ప్రసంగించారు. ‘‘ నూతన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక బిల్లుతో పన్ను చెల్లింపుదారులకు భారీగా ఉపశమనం లభించనుంది. మరోవైపు వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లలో 13.14 శాతం వృద్ధి అంచనాలు రావడం సంతోషకరం. ఇది వ్యక్తిగత ఆదాయాల పెంపును ప్రతిబింబిస్తుంది. కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణతో వస్తూత్పత్తి కర్మాగారాలకు ఎంతో తోడ్పాటునందిస్తున్నాం.దేశీయ సరకులకు విలువ జోడింపు సాధ్యమవుతుంది. ఎగుమతులూ ఊపందుకుంటాయి. వాణిజ్యం పెరుగుతుంది. దీంతో సాధారణ ప్రజలకూ ప్రయోజనం చేకూరుతుంది’’ అని అన్నారు. 2025–26 ఆర్థికసంవత్సర బడ్జెట్లో వార్షిక ఆదాయపన్ను రిబేట్ పరిమితిని (కొత్త పన్ను విధానం) రూ. 7 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచడం తెల్సిందే. ‘‘శాలరీ తరగతులకు సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్‌ను సైతం లెక్కలోకి తీసుకుంటే వాళ్లకు ఏటా రూ.12.75 లక్షల వరకు పన్ను రిబేట్ రూపంలో భారీ ఉపశమనం లభించనుంది.ఆదాయపన్ను రిబేట్‌ను పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్లమేర తగ్గనుంది. ఏటా రూ.12 లక్షలకు పైబడి ఆదాయం ఉన్న వారూ కొంతమేర ఉపశమనం పొందొచ్చు. ఇక ఇన్‌కమ్‌ట్యాక్స్‌కు సంబంధించి ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న మధ్యతరగతి వాళ్లను సముచితంగా గౌరవించేందుకే ప్రభుత్వం ఐటీ రిబేట్‌ను ఏకంగా ఒకేసారి రూ.12 లక్షలకు పెంచింది’’ అని నిర్మల అన్నారు.రూ.13.6 లక్షల కోట్ల ఆదాయం‘‘2025–26 ఆర్థికంలో వ్యక్తిగత ఆదాయపన్ను వసూళ్లు రూ.13.6 లక్షల కోట్లకు చేరుకునే వీలుంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన అంచనాలు రూ.12.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక ఆన్లైన్ ప్రకటనలకు సంబంధించి ఇప్పుడు వసూలు చేస్తున్న 6 శాతం ఈక్వలైజేషన్ లెవీ లేదా డిజిటల్ పన్నును రద్దుచేయాలనుకుంటున్నాం’’ అని నిర్మల చెప్పారు. దీని కారణంగా గూగుల్, మెటా, ‘ఎక్స్’ వంటి సంస్థలు లబ్ధిపొందే వీలుంది. ‘‘ పారిశ్రామిక ఉత్పత్తులపై విధించే 7 శాతం కస్టమ్స్ సుంకాలను తొలగిస్తాం. 21 రకాల టారిఫ్ రేట్లు ఉండగా వాటిని ఎనిమిదికి తెచ్చాం. అందులో ‘సున్నా’ టారిఫ్ విభాగం కూడా ఉంది. ముడిసరుకులపై దిగుమతి సుంకాలు తగ్గించిన కారణంగా ఉత్పత్తి వ్యయాలు తగ్గి ఇకపై భారత్ నుంచి ఎగుమతులు ఊపందుకోనున్నాయి’’ అని మంత్రి అన్నారు.వర్షాకాల సమావేశంలో కొత్త ఆదాయపన్ను బిల్లు‘‘వర్షాకాల సమావేశంలో కొత్త ఆదాయ పన్ను బిల్లుపై చర్చిస్తాం. ఈ బిల్లును ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టాం. ప్రస్తుతం ఈ బిల్లును సెలక్ట్ కమిటీ పరిశీలిస్తోంది. సెలక్ట్ కమిటీ అధ్యయనం తర్వాత తుది నివేదికను పార్లమెంట్ తదుపరి సెషన్ తొలి రోజునే సమర్పించాల్సి ఉంది. అందుకే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చిస్తాం’’ అని నిర్మల అన్నారు. సాధారణంగా జూలై నుంచి ఆగస్ట్ దాకా వర్షాకాల సమావేశాలుంటాయి.35 సవరణలతో ఆర్థిక బిల్లుకు లోక్‌సభలో ఆమోదంపన్ను అధికారులు సెర్చ్ కేసుల్లో బ్లాక్ అసెస్మెంట్ కోసం అసెసీ మొత్తం ఆదాయం కాకుండా కేవలం బయటకు వెల్లడించని ఆదాయాన్నే గుర్తించేందుకు వీలుగా ఆర్థిక బిల్లు, 2025లో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ సవరణలకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో 2024 సెప్టెంబర్ 1, ఆ తర్వాత కాలానికి ఇది వర్తించనుంది. సెర్చ్ కేసుల్లో మొత్తం ఆదాయం స్థానంలో వెల్లడించని ఆదాయం అన్న క్లాజును ప్రభుత్వం చేర్చింది. దీంతో సహా మొత్తం 35 సవరణలతో కూడిన ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించింది. మొత్తంగా రూ.50.65 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నూతన ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను మోదీ సర్కార్ రూపొందించడం తెల్సిందే. -
‘జమిలి’ జేపీసీ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏకకాలంలో పార్లమెంట్ దిగువ సభ, రాష్ట్రాల్లో శాసనసభకు ఎన్నికలు నిర్వహించడానికి ఉద్దేశించిన లోక్‌సభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులపై అధ్యయనానికి ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) గడువును లోక్‌సభ మంగళవారం పొడిగించింది. ఈ కమిటీ కాల పరిమితిని పెంచేందుకు లోక్‌సభ తన అంగీకారం తెలిపింది. బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, జేపీసీ ఛైర్మన్ అయిన పీపీ చౌదరి ప్రతిపాదించిన సంబంధిత తీర్మానానికి లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర వేసింది. వర్షాకాల సమావేశాల చివరివారంలో తొలి రోజు వరకు కాలపరిమితిని పొడిగించింది. ఏకకాల ఎన్నికల నిర్వహణకు తీసుకొచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం గతంలో లోక్‌సభలో ప్రవేశపెట్టింది.అయితే ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూప, స్వభావాలను మార్చేలా ఉందని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేయడంతో కేంద్రప్రభుత్వం ఆ బిల్లును పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఇందుకోసం కొత్తగా 39 మంది ఎంపీలతో కమిటీని ఏర్పాటుచేయడం తెల్సిందే. లోక్‌సభ నుంచి 27, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులతో కమిటీ కొలువుతీరింది. అయితే రాజ్యసభ నుంచి కొత్త వ్యక్తి జేపీలో సభ్యునిగా ఉంటారని లోక్‌సభ ప్రధాన కార్యదర్శి మంగళవారం ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో జేపీసీలో ఒక ఖాళీ ఏర్పడింది. వాస్తవానికి ఈ కమిటీ కాలపరిమితి ఈ సెషన్ చివరి వారం తొలిరోజుతో ముగుస్తుంది. అంటే ఏప్రిల్ నాలుగోతేదీతో ముగియనుంది. అయినప్పటికీ ఈ బిల్లుకు సంబంధించిన పని ఇంకా పూర్తికాలేదని, అందుకే కాలపరిమితి పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అధికార వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ అంశంపై ఇప్పటికే పలువురు న్యాయనిపుణులతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించింది. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత వర్గాలతో ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రంజన్ గొగోయ్, సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా జేపీసీ కమిటీ ఎదుట హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. -
సుంకాల కోతకు సిద్ధం!
న్యూఢిల్లీ: ఇండియాలో సుంకాలు అధికంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తమ ఉత్పత్తులపై విచ్చలవిడిగా సుంకాలు వసూలు చేస్తున్న దేశాల ఉత్పత్తులపై అదేస్థాయిలో సుంకాలు విధిస్తామని ఆయన ఇప్పటికే హెచ్చరించారు. ఇందులో చైనా, ఇండియా, మెక్సికో వంటి దేశాలు ఉన్నాయి. అమెరికాలో వచ్చే నెల 2వ తేదీ నుంచి ఈ ప్రతీకార టారిఫ్‌లు అమల్లోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.అమెరికా నుంచి దిగుమతి అయ్యేవాటిలో 55 శాతం ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని నిర్ణయాని కొచ్చినట్లు ప్రభుత్వ వర్గాల ను ఉటంకిస్తూ ఓ ప్రముఖ వార్తా సంస్థ తెలియజేసింది. తగ్గించే సుంకాల విలువ 23 బిలియన్ డాలర్లు(రూ.1.96 లక్షల కోట్లు)గా ఉండే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. టారిఫ్‌ల తగ్గింపు నిర్ణయం నుంచి మాంసం, మొక్కజొన్న, గోధుమలు, పాడి ఉత్పత్తులకు మినహాయింపు ఇవ్వనున్నట్లు పేర్కొంది. వీటిపై టారిఫ్‌లు యథాతథంగా అమలవుతాయని వివరించింది. అల్మాండ్స్, పిస్తా, ఓట్మీల్, క్వినోవా వంటి వాటిపై సుంకాలు తగ్గుతాయని తెలిపింది.అమెరికా–ఇండియా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలోభాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికాలో ప్రతీకార సుంకాల వల్ల భారతదేశ ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ ప్రభావాన్ని తగ్గించడానికే అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌ల భారాన్ని భారత ప్రభుత్వం తగ్గించబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.భారత్‌తో అమెరికాకు వాణిజ్య లోటుప్రస్తుతం ఇండియాలో అమెరికా ఉత్పత్తులపై 5 శాతం నుంచి 30 శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి. కొన్ని రకాల ఉత్పత్తులపై సుంకాలను క్రమంగా తగ్గిస్తూ.. పూర్తిగా ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదన ఇప్పటికైతే చర్చల దశలోనే ఉంది. అమెరికాలో పెంచిన టారిఫ్‌లు అమల్లోకి వచ్చేలోగానే ఆ దేశంతో స్పష్టమైన ఒప్పందం చేసుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. టారిఫ్‌ల భారం ఇరుదేశాలపై పడకుండా ఈ ఒప్పందం ఉండొచ్చని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అమెరికా ఉత్పత్తులపై ఇండియాలో సుంకాలు తగ్గిస్తే... ఇండియా ఉత్పత్తులపై అమెరికాలో సుంకాలు తగ్గించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఒకవేళ ప్రతీకార సుంకాల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గకపోతే భారత ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశం ఉంది. భారత ప్రధాని మోదీ ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. టారిఫ్‌ల వివాదాన్ని పరిష్కరించుకోవడానికి సాధ్యమైనంత త్వరగా వాణిజ్య చర్చలు ప్రారంభించాలని ఇరువురు నేతలు నిర్ణయానికొచ్చారు. ప్రస్తుతం ఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 45.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ లోటును పూర్తిగా పూడ్చుకోవాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. -
ఈ ఏడాది ఐటీఈఎస్ కొలువుల జోరు
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశీ ఐటీఈఎస్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎనేబుల్డ్ సర్విసెస్) రంగం గణనీయంగా వృద్ధి చెందనుంది. ఉద్యోగావకాశాలు 20 శాతం మేర పెరగనున్నాయి. ఏఐ ఆధారిత నియామకాల సేవల ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాహైర్ రూపొందించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 42,000 మంది ఉద్యోగార్థుల ప్రొఫైల్స్, 11,000 పైచిలుకు రిక్రూటర్–క్యాండిడేట్ల ఇంటర్వ్యూ వివరాల అధ్యయనం ఆధారంగా సంస్థ దీన్ని రూపొందించింది. తమ ‘ఇన్‌స్టాహైర్ టెక్ శాలరీ ఇండెక్స్ 2025‘ ప్రకారం అనుభవం, డొమైన్లవ్యాప్తంగా జీతభత్యాల డైనమిక్స్ కూడా మారుతున్నట్లు తెలిపింది.కొత్త టెక్నాలజీల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఉద్యోగావకాశాలు 75 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక తాత్కాలిక ఉద్యోగుల గిగ్ ఎకానమీ, రిమోట్ వర్క్ విధానాలు కూడా పరిశ్రమ రూపురేఖలను తీర్చిదిద్దడంలో కీలకంగా ఉంటున్నాయని ఇన్‌స్టాహైర్ నివేదిక తెలిపింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ జాబ్ మార్కెట్లో పోటీపడేందుకు దాదాపు 40 శాతం మంది ఉద్యోగులు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ పొందడమో లేదా ప్రస్తుతమున్న వాటిని మరింతగా మెరుగుపర్చుకోవడంపైనో దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. నివేదికలోని మరిన్ని వివరాలు.. ⇒ వివిధ స్థాయుల్లో అనుభవమున్న డెవ్ఆప్స్ నిపుణులకు, ముఖ్యంగా ఏడబ్ల్యూఎస్ నైపుణ్యాలున్న వారికి 10 శాతం మేర వేతన వృద్ధి ఉంటోంది. 0–5 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రంట్ ఎండ్ డెవలపర్ల వేతనం వార్షికంగా సుమారు రూ. 1.5 లక్షలు తగ్గగా, ఆరేళ్ల పైగా అనుభవమున్న ఫ్రంట్ ఎండ్ నిపుణుల శాలరీలు వార్షికంగా సుమారు రూ. 4 లక్షల మేర పెరిగాయి. మొబైల్ డెవలప్మెంట్, డేటా సైన్స్ విభాగాల్లోనూ ఇదే ధోరణి నెలకొంది. ⇒ బ్యాక్ఎండ్ నైపుణ్యాలకు సంబంధించి పైథాన్ నిపుణులకు అత్యధికంగా వేతనాలు ఉంటున్నాయి. ప్రతి అయిదేళ్ల అనుభవానికి వేతనం రెట్టింపు స్థాయిలో ఉంటోంది. జావాకి కూడా మంచి డిమాండ్ నెలకొంది. ఫ్రెషర్స్ నుంచి పదేళ్ల పైగా అనుభవమున్న వరకు వివిధ స్థాయుల్లోని ఉద్యోగుల వేతనాలు అయిదు రెట్లు పెరిగాయి. ⇒ ప్రతిభావంతులకు హాట్‌స్పాట్‌గా బెంగళూరు కొనసాగుతోంది. దేశీయంగా 35 శాతం మంది టెక్నాలజీ సిబ్బందికి కేంద్రంగా ఉంటోంది. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్ (చెరి 20 శాతం చొప్పున), పుణె (15 శాతం), చెన్నై (10 శాతం) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ⇒ చండీగఢ్, జైపూర్, ఇండోర్‌లాంటి ద్వితీయ శ్రేణి నగరాలు ఆకర్షణీయమైన టెక్ హబ్‌లుగా ఎదుగుతున్నాయి. ⇒ నిపుణులు, నాన్–మెట్రో ప్రాంతాలకు రీలొకేట్ అయ్యేందుకు రిమోట్ పని విధానంపరమైన వెసులుబాటు ఉపయోగకరంగా ఉంటోంది. ⇒ సైబర్‌సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ స్టార్టప్‌ల సారథ్యంలో నియామకాలు జోరందుకోనున్నా యి. ఏఐ అనుభవానికి కంపెనీలు ప్రా ధాన్యం ఇస్తున్నందున వైవిధ్యం కన్నా నైపుణ్యాలను బట్టి నియమించుకునే ధోరణి పెరుగుతోంది. ⇒ కంపెనీలు వినూత్న హైరింగ్ వ్యూహాలను అమలు చేస్తుండటంతో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి పెట్టే నిపుణులకు కెరియర్ వృద్ధి మెరుగ్గా ఉంటుంది. -
జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసు : జస్టిస్ వర్మ ఇంటికి ‘సుప్రీం’ కమిటీ
ఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సందర్భంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నియమించిన ముగ్గురు ప్రధాన న్యాయమూర్తుల కమిటీ ఇవాళ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటికి వెళ్లింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బయపడ్డ నోట్ల కట్టల గురించి దర్యాప్తు చేపట్టనుంది.మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత భారీ మొత్తంలో కాలిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జస్టిస్ యశ్వంత్ వర్మపై ఆరోపణలు వెల్లువెత్తాయి.#WATCH | Delhi | Three-member Judge committee to probe allegations against Justice Yashwant Varma leaves from his residence pic.twitter.com/A3Fw8N12X9— ANI (@ANI) March 25, 2025 ఇదే అంశంపై విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు..పలు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కమిటీని నియమించింది. ఆ కమిటీలో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీఎస్ సందవాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్‌లను సభ్యులుగా చేర్చింది. కాలిన నోట్ల కట్టల విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా అంటూ పలు రిపోర్టులు వెలుగులోకి వచ్చింది. దీంతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, మరో నలుగురు సీనియర్ న్యాయమూర్తుల కొలీజియం జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అల్హదాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేసింది.నోట్ల కట్టల విషయంలో స్పష్టత వచ్చే వరకు న్యాయపరమైన పనులు కేటాయించవద్దని సుప్రీం కోర్టు.. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర ఉపాధ్యాయకు ఆదేశాలు జారీ చేసింది. -
రాజ్యసభలో ‘కాశీనాయన’ కూల్చివేతల ప్రస్తావన.. గళమెత్తిన వైఎస్సార్సీపీ ఎంపీ
సాక్షి, ఢిల్లీ: కాశీనాయన జ్యోతి క్షేత్రంలో కూల్చివేతలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఎంపీ మేడా రఘునాథరెడ్డి అన్నారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. కాశీనాయన క్షేత్రం ప్రాంతాన్ని అటవీ శాఖ నుంచి డీనోటిఫై చేయాలని డిమాండ్ చేశారు. క్షేత్రం కార్యకలాపాల కోసం 33 ఎకరాల భూమిని కేటాయించాలన్నారు. కాశీనాయన క్షేత్రం దాదాపు 100 అన్నదాన సత్రాలను నిర్వహిస్తోందని.. ఆధ్యాత్మిక గురువు కసిరెడ్డి నాయన బోధనలు ఎందరికో ఆదర్శమని మేడా రఘునాథరెడ్డి అన్నారు.కాగా, తెలుగు రాష్ట్రాల్లో అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రం.. ఆధ్యాత్మికవేత్తలకు దివ్యానుభూతిని కలిగిస్తోంది. ఏ సమయంలో వెళ్లినా అన్నదానం జరుగుతుండడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే అనాథలకు ఇది ఆకలి తీర్చే ఒక దేవాలయం. వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం, కాశినాయన మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలో దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ధార్మిక సేవలు కొనసాగుతున్నాయి. అయితే అటవీ ప్రాంతం పేరుతో ఈ ఆశ్రమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఇప్పటికే సత్రాలు, వాష్ రూమ్‌లను కూల్చివేశారు.గతంలో అటవీ శాఖ అధికారులు అక్కడి నిర్మాణాలపై అభ్యంతరాలు తెలిపినా కూల్చివేత వరకూ వెళ్లలేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న 13 హెక్టార్ల భూమిని అటవీ చట్టం నుంచి మినహాయించాలని అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు లేఖ కూడా రాశారు. అటవీ సంరక్షణ చట్టం రాకముందు నుంచే ఇక్కడ దేవాలయాలు ఉన్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సైతం పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి ఇదే సమస్యను తీసుకెళ్లారు.అయితే కూటమి ప్రభుత్వం మాత్రం వెనుకా ముందు చూడకుండా కూల్చివేతలు చేపట్టింది. నెల్లూరు జిలాకు చెందిన కాశినాయన అనే సిద్ధుడు బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతనతో దేశాటన చేస్తూ పుణ్యక్షేత్రాల్లో గడిపారు. పాడుబడ్డ దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయమన్న గురువు ఆదేశాల ప్రకారం జ్యోతి క్షేత్రంలో నరసింహస్వామి దేవాలయాన్ని 1980వ దశకంలో పూర్తి చేశారు. కాశినాయన పరమపదించాక 1995 నుంచి జ్యోతిక్షేత్రం... కాశినాయన క్షేత్రం అయ్యింది. ఇక్కడి నుంచి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కాలిబాట కూడా ఉంది. జ్యోతిక్షేత్రంలో నిర్మాణాలకు గతంలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి, మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి సైతం సహకారం అందించడం గమనార్హం. -
మోదీ కోసం ఛావా స్పెషల్ స్క్రీనింగ్
న్యూఢిల్లీ: బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఛావా’’(Chhaava)ను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించబోతున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎంపీల కోసం పార్లమెంట్‌లోనే ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు.మార్చి 27న పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో ఛావా సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ స్క్రీనింగ్‌కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు హాజరుకాబోతున్నట్లు సమాచారం. చిత్ర దర్శకుడితో పాటు తారాగణం కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని న్యూస్18 తన కథనంలో పేర్కొంది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన చిత్రమే ‘ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు (Chhatrapati Shivaji Maharaj) శంభాజీ మహారాజ్(Sambhaji Maharaj) జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా.. దినేష్ విజన్ నిర్మించారు. రష్మిక మందన్నా, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 14న విడుదలై సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. కేవలం హిందీలోనే రూ.750 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రీసెంట్గా ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయగా.. భారీ వసుళ్లను సాధించింది. ఛావా సక్సెస్‌పై గతంలోనే ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనానికి హాజరై ఆయన.. ప్రస్తుతం దేశంలో ఛావా హవా కొనసాగుతోందంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఛావా చిత్రానికి స్ఫూర్తినిచ్చిన నవల(ఛావా) రచయిత శివాజీ సావంత్‌కు ఈ ఘనతంతా దక్కుతుందని అభినందించారు. -
పార్లమెంట్‌కు చేరిన ‘నోట్ల కట్టల జడ్జి’ వ్యవహారం
న్యూఢిల్లీ, సాక్షి: అధికారిక బంగ్లాలో కాలిపోయిన నోట్ల కట్టలతో వార్తల్లోకి ఎక్కిన జస్టిస్ యశ్వంత్ శర్మ వ్యవహారం పార్లమెంట్‌కు చేరింది. ఈ అంశంపై చర్చ జరగాలంటూ లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ ఘటన న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు కలిగించడంతో పాటు ఆ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్న ఆయన.. సంబంధిత న్యాయ శాఖ మంత్రి నుంచి ఈ వ్యవహారంపై వివరణ ఇప్పించాలని స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు లోక్‌సభ కార్యదర్శికి సోమవారమే లేఖ రాశారాయన. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో.. తీవ్ర అభ్యంతరాల నడుమే ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు కొలిజీయం. అయితే జస్టిస్ వర్మను హైకోర్టులోకి అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటామని అలహాబాద్ బార్ అసోషియేషన్ నిరసనకు సిద్ధమైంది. నివారమే ఈ వ్యవహారంపై ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని సీజేఐ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువంటూ లేని ఈ కమిటీ విచారణ.. సాధ్యమైనంత త్వరలో ప్రారంభం కానుంది.హోలీ రోజు జడ్జి బంగ్లాలో అగ్నిప్రమాదం జరగ్గా.. ఓ గదిలో కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ వీడియోను పోలీస్ కమిషనర్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయకు సమర్పించగా.. ఆయన దానిని తన నివేదికలో పొందుపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించారు. దీనిపై సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి నివేదిక మొత్తాన్ని ఫొటోలు, వీడియోలతో సహా తన వెబ్సైట్లో పెట్టింది. వెబ్సైట్లో పెట్టిన ఆ వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు.. జస్టిస్ వర్మ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఇది తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా దీనిని పేర్కొన్నారు. -
అదృష్టవశాత్తూ ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదు: సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీం కోర్టు(Supreme Court)లో మంగళవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించారని.. ఆ 10 మందిపై అనర్హత వేటు విషయంలో తెలంగాణ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, కాబట్టి అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్(BRS) తరఫున ఈ జనవరిలో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, ఆగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం వాదనలు వింటోంది. మంగళవారం వాదనలు మొదలవ్వగానే.. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ సంగతిని స్పీకర్ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో స్పీకర్‌ను ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఉంటుందా? లేదంటే రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? అని కోరారు. బీఆర్ఎస్ తరఫున న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫిర్యాదులపై ఏం చేస్తారో.. 4 వారాల్లో షెడ్యూల్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినా పార్టీ మారిన వారికి స్పీకర్ నోటీసులు ఇవ్వలేదు. ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటీసు ఇచ్చారు. 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని.. ఫిబ్రవరి 13న స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికి 3 వారాలైంది.. నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదు. మేము ఫిర్యాదు చేసి ఏడాదైనా స్పీకర్ షెడ్యూల్ కూడా చేయలేదు’’ అని సుందరం వాదించారు. బీఆర్ఎస్ వాదనలు.. కీ పాయింట్స్ 2024 మార్చి 18న మొదట ఫిరాయింపులపై శాసనసభ స్పీకర్ ఫిర్యాదు చేశాంమొదటి ఫిర్యాదు చేసినా నోటీసులు ఇవ్వలేదుహైకోర్టుకు వెళ్లేంత వరకు కూడా నోటీసులు ఇవ్వలేదురీజనబుల్ టైంలోనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పిందిహైకోర్టు చెప్పినా ఎలాంటి చర్యలు లేవుదానం నాగేందర్‌పై ఫిర్యాదు చేసినా.. ఆయనకు నోటీసులు ఇవ్వలేదుదానం ఎంపీగా పోటీ చేసినా చర్యల్లేవ్‌కడియంకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా.. చర్యలు లేవ్‌అనర్హత పిటిషన్ విచారణపై షెడ్యూల్ చేయాలని.. హైకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చిందిస్పీకర్ 7 రోజుల సమయం ఇస్తూ నోటీసులు ఇచ్చారుముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేరకంగా సమాధానం ఇచ్చారుపార్టీ మారినవాళ్లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారుముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ప్రచారం చేశారునోటీసులు ఇచ్చామని స్పీకర్ అంటున్నారు.. కానీ, ఆ కాపీలు మాకు అందజేయలేదుస్పీకర్ అధికారాలు సైతం న్యాయసమీక్ష పరిధిలోనే ఉంటాయిన్యాయ సమీక్షకు స్పీకర్ అతీతులు కాదుఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయంపై నిర్దిష్టమైన గడువు విధించాలినాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలిఈక్రమంలో స్పందించిన జస్టిస్ గవాయ్.. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా? అని వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులు ఉన్నప్పటికీ.. ఎప్పటిలోగా తేల్చాలనే విషయంపైనే స్పష్టత కొరవడిందని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు ఆ తీర్పును కాదని ఎలా ముందుకు వెళ్లగలమని చెప్పింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించింది.ధర్మాసనం ఇంకా ఏమందంటే..ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది?: ధర్మాసనంఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరించొద్దుఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదు వచ్చి ఎంతకాలమైంది?రీజనబుల్ టైం అంటే గడువు ముగిసేవరకా?మొదటి ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత టైం గడిచింది.నాలుగు వారాలైనా షెడ్యూల్ ఫిక్స్ చేయలేదా?అదృష్టవశాత్తూ.. ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదుమూడు వారాల సమయం విషయంలో మాత్రం స్పీకర్ రీజనబుల్‌గా ఉన్నారుతెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పులో డివిజన్ బెంచ్ జోక్యం సరైందో కాదో చూస్తాం?కౌంటర్ దాఖలుకు ప్రతివాదులు మరింత సమయం కోరగా.. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలి బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ బీఆర్ఎస్ తరఫున వాదనలు ముగియడంతో తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజు స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. మరోవైపు.. స్పీకర్ తరఫున సోమవారం(మార్చి 24వ తేదీన) అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్లో.. ‘‘రీజనబుల్ టైం అంటే గరిష్టంగా మూడు నెలలే అని అర్థం కాదు. ఒక్కో కేసు విచారణకు ఒక్కో రకమైన సమయం అవసరం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. కానీ, స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టుకు వెళ్లారు. స్పీకర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న తర్వాతే.. న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు. .. అనర్హత పిటిషన్ లను విచారించి నిర్ణయం తీసుకునే అధికారం కేవలం స్పీకర్ కే ఉంది. గత సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే అంశాన్ని చెబుతున్నాయి. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే....పిటీషనర్లే దురుద్దేశపూర్వకంగా కోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదన్నది సరికాదని.. చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని.. కాబట్టి ఈ పిటిషన్లను డిస్మిస్ చేయాలి’’ అని కోరారు. 👉కారు గుర్తుపై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు అయ్యింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలైంది. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది సుప్రీం కోర్టు(Supreme Court). కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు ఈ పిటిషన్లు వేశారు. అయితే.. 👉ఈ పిటిషన్లకు సంబంధించి.. కొద్దిరోజుల క్రితం మహిపాల్‌రెడ్డి, తాజాగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సుప్రీం కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, పార్టీ ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని అందులో పేర్కొన్నారు. కేవలం ఎమ్మెల్యే హోదాలోనే సీఎంను కలిశామని తెలిపారు. అందువల్ల తమపై దాఖలైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్కు తాము రాజీనామా చేయలేదని.. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చేరలేదని.. మీడియాలో వచ్చిన వార్తలలో నిజం లేదని.. కాబట్టి ఈ అనర్హత పిటీషన్లకు విచారణ అర్హత లేదని వాటిల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఉన్న ఫొటోలు, పోస్టర్లను, తమ ఫొటోలతో కూడిన పార్టీ ఫ్లెక్సీల ఫొటోలనూ అఫిడవిట్లో జత చేశారు. ఇప్పటికే ఈ కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. గతంలో తెలంగాణ స్పీకర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తగినంత సమయం అంటే ఎంతో చెప్పాలని కోరింది. గత విచారణలో.. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదన్న పేర్కొంది. -
నోటీసిచ్చి.. 24 గంటల్లో కూల్చేస్తారా?
న్యూఢిల్లీ: ఇంటిని కూల్చేస్తామంటూ నోటీసు ఇచ్చి 24 గంటల్లోపే బుల్డోజర్తో ఇంటిని కూల్చేస్తున్న ఘటనలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి మండిపడింది. నిబంధనలను పాటిస్తూనే ఇళ్ల కూలి్చవేత ప్రక్రియను యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కొనసాగిస్తోందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి చేసిన వాదనలను జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాల సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. 2023లో పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ పొలిటీషియన్ అతీఖ్ అహ్మద్‌కు చెందినదిగా భావిస్తున్న ప్రయాగ్‌రాజ్ నగరంలోని భవనాలను అధికారులు కూల్చేశారు(Prayagraj Demolitions). దీనిపై జులి్ఫకర్ హైదర్ అనే న్యాయవాది, ప్రొఫెసర్ అలీ అహ్మద్, ఇద్దరు వితంతువులు, మరో వ్యక్తి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. గ్యాంగ్స్టర్విగా భావించి మా ఇళ్లను కూల్చేశారని బాధితులు కేసు వేశారు. అయితే ఈ కేసును అలహాబాద్ హైకోర్టు కొట్టేయడంతో వాళ్లంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ‘‘ఇళ్లను నిర్దయగా కూల్చేయడం చూస్తుంటే మాకే షాకింగ్‌గా ఉంది. కూలి్చవేతకు అనుసరించిన విధానం సైతం షాకింగ్‌కు గురిచేస్తోంది. మార్చి ఆరో తేదీ రాత్రి నోటీసులు ఇచ్చి మరుసటి రోజే కూల్చేస్తారా?. ఇలాంటి పద్ధతిని న్యాయస్థానాలు ఏమాత్రం అంగీకరించవు. ఒక్క కేసులో వీటిని పట్టించుకోకుండా ఉన్నామంటే ఇక ఇదే కూలి్చవేతల ధోరణి కొనసాగుతుంది. నోటీసులు అందుకున్నాక బాధితులు వాటిపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా అధికారులు ఇవ్వలేదు. 24 గంటల్లోపు భవనాలను కూల్చేశారు. ఈ కేసులో తిరిగి ఇంటిని నిర్మించుకుంటామని బాధితులు కోరితే అందుకు మేం అనుమతిస్తాం. అయితే కేసు తుదితీర్పు వాళ్లకు వ్యతిరేకంగా వస్తే బాధితులే ఆ కొత్త ఇళ్లను నేలమట్టం చేయాల్సి ఉంటుంది’’అని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిపై ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్(Attorney General) వాదించారు. ‘‘లీజు గడువు దాటాక అక్రమంగా ఆ నివాసస్థలాల్లో పిటిషనర్లు ఉంటున్నారు. వాస్తవానికి 2020 డిసెంబర్లో తొలిసారి, 2021 జనవరి, మార్చి నెల ఆరో తేదీన నోటీసులు ఇచ్చారు. తర్వాతే కూల్చారు’’అని వాదించారు. దీనిపై జడ్జి అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘గతంలో సాధారణ రీతిలో నోటీసులు ఇచ్చారు. చట్టప్రకారం రిజిస్టర్ పోస్ట్‌లో పంపాలి. అలాకాకుండా మామూలుగా పంపేసి, చివరి నోటీసు మాత్రం రిజిస్టర్ పోస్ట్ లో పంపించి వెంటనే కూల్చేస్తారా?’’అని ధర్మాసనం నిలదీసింది. మళ్లీ ఇంటి నిర్మాణాల విషయంలో అఫిడవిట్ సమర్పించేందుకు పిటిషనర్లను అనుమతిస్తూ కేసు విచారణను న్యాయస్థానం వాయిదావేసింది. ‘క్రికెట్’ నినాదాలతో కూల్చేశారు గత నెల ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ ఆట సందర్భంగా భారతవ్యతిరేక నినాదాలు చేశారంటూ ఎఫ్ఐఆర్ నమోదుచేసి తమ ఇల్లు కూల్చారంటూ కితాబుల్లా హమీదుల్లా ఖాన్ వేసిన పిటిషన్‌పై స్పందన తెలపాలని మహారాష్ట్ర సర్కార్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఆదేశించింది. ఆస్తుల కూలి్చవేతకు సంబంధించి గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని, ఈ అంశంలో సర్కార్‌పై, మాలాŠవ్న్ మున్సిపల్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేటర్లపై ఉల్లంఘన కేసు నమోదుచేయాలని బాధితుడు సుప్రీంకోర్టును కోరాడు. అయితే ఎఫ్ఐఆర్ నమోదుచేసి సింధుదుర్గ్ జిల్లాలో పాతసామాను దుకాణం, ఇల్లు రెండూ అక్రమ నిర్మాణాలని పేర్కొంటూ అధికారులు ఫిబ్ర వరి 24న వాటిని కూల్చేశారు. భారతవ్యతిరేక నినాదాలు చేశాడంటూ తొలుత పిటిషనర్‌తోపాటు అతని 14ఏళ్ల కుమారుడిని అరెస్ట్‌చేసి తర్వాత కుమారుడిని వదిలేశారు. తర్వాత భార్యాభర్తలను అరెస్ట్‌చేసి జైలుకు పంపారు. ఈ సమయంలోనే ఇల్లు, దుకాణం కూల్చేశారు. -
భార్యకు భర్త యజమాని కాడు!
ప్రయాగ్‌రాజ్: భార్య తనతో ఉన్న ఇంటిమేట్ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన వ్యక్తిపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోగానే భార్యకు భర్త యజమాని అయిపోడని వ్యాఖ్యానించింది. అతనిపై క్రిమినల్ కేసు కొట్టేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘ఇంటిమేటెడ్ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేసి దరఖాస్తుదారుడు (భర్త) వివాహ బంధానికున్న పవిత్రతను ఉల్లంఘించారు. భార్య తనపై ఉంచిన నమ్మకాన్ని పోగొట్టారు. భార్య గౌరవాన్ని కాపాడలేకపోయారు. ఇలాంటి కంటెంట్‌ను షేర్ చేయడం భార్యాభర్తల మధ్య బంధాన్ని నిర్వచించే గోప్యతను ఉల్లంఘించడమే అవుతుంది. ఈ నమ్మక ద్రోహం వైవాహిక బంధం పునాదినే దెబ్బతీస్తుంది’అని విచారణ సందర్భంగా జస్టిస్ వినోద్ దివాకర్ వ్యాఖ్యానించారు. భార్య అంటే భర్తకు కొనసాగింపు కాదని, తనకంటూ సొంత హక్కులు, కోరికలు, ఉన్న వ్యక్తని ఆయన పేర్కొన్నారు. తామిద్దరూ సాన్నిహిత్యంతో ఉన్న వీడియోలను తన భర్త మొబైల్లో చిత్రీకరించి, తనకు తెలియకుండా ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడని, తరువాత బంధువులు, గ్రామస్తులతో పంచుకున్నాడంటూ మీర్జాపూర్ జిల్లాలో ప్రద్యుమ్న్ యాదవ్ అనే వ్యక్తిపై అతని భార్య కేసు నమోదు చేసింది. తాను ఆమె భర్త కాబట్టి అది నేరం కాదని, తనపై మోపిన క్రిమినల్ కేసులను కొట్టేయాలని ప్రద్యుమ్న్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. భార్యాభర్తల మధ్య రాజీ కుదిరే అవకాశం ఉంది కాబట్టి.. కేసును కొట్టేయాలంటూ ఆయన తరపు న్యాయవాది సైతం వాదించారు. ఫిర్యాదుదారు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య అయినప్పటికీ, ఆమెను అశ్లీల వీడియో తీసి బంధువులకు, గ్రామస్తులకు పంపే హక్కు భర్తకు లేదని కోర్టు తేల్చి చెప్పింది. -
విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు టాస్క్‌ఫోర్స్
న్యూఢిల్లీ: ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం వంటి ఘటనల నేపథ్యంలో ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ప్రధానంగా దృష్టిపెట్టింది. రెండేళ్ల క్రితం ఐఐటీ(ఢిల్లీ)లో విద్యనభ్యసిస్తూ ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థుల విషయంలో ఎఫ్ఐఆర్లు నమోదుచేయాలంటూ సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం సోమవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఆత్మహత్యల అంశంలో దర్యాప్తు చేయాలని సూచిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘ వేర్వేరు ఉన్నతవిద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు కలచివేస్తున్నాయి. విద్యార్థులు తనవు చాలిస్తూ తమ జీవితాలను అర్థంతరంగా ముగిస్తున్న ఉదంతాలకు చరమగీతం పాడాల్సిందే. విద్యార్థులు ఆత్మహ త్యలు చేసుకోకుండా నివారించే సమగ్ర, విస్తృతస్థాయి, స్పందనా వ్యవస్థలను బలోపేతం చేయాలి. ప్రైవేట్ కాలేజీలు సహా ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిస్థితిని పట్టించుకునే చట్టపరమైన, సంస్థాగతమైన వ్యవస్థ సమర్థంగా లేదు. ఒకవేళ ఉన్నా అందులో అసమానతలు ఎక్కువయ్యాయి. విద్యార్థులు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా నివారించే నివారణ వ్యవస్థ కావాలి. అందుకే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవీంద్రభట్ సారథ్యంలో నేషనల్ టాస్క్‌ఫోర్స్ (ఎన్టీఎఫ్)ను ఏర్పాటుచేస్తున్నాం. ఇందులో రాష్ట్రాల ఉన్నతవిద్య, సామాజిక న్యాయం, సాధికారత, న్యాయ, మహిళ, చిన్నారుల అభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. ఆత్మహత్యలకు దారితీస్తున్న కారణాల గుర్తింపు, ఆత్మహత్యల నివారణకు సంబంధించి నియమనిబంధనల పటిష్ట అమలుపై ఎన్టీఎఫ్ ఒక సమగ్ర నివేదికను రూపొందించనుంది. ఈ నివేదిక తుది రూపు కోసం ఎన్టీఎఫ్ దేశంలోని ఎలాంటి ఉన్నత విద్యాసంస్థలోనైనా ఆకస్మిక తనిఖీలు చేస్తుంది. ప్రస్తుత నిబంధనలకు తోడు అదనపు సిఫార్సులు చేసే అధికారమూ ఎన్‌టీఎఫ్‌కు ఉంది’’అని సుప్రీంకోర్టు పేర్కొంది.4 నెలల్లో మధ్యంతర నివేదికఎన్టీఎఫ్ తమ మధ్యంతర నివేదికను నాలుగు నెలల్లోపు సమర్పించాల్సి ఉంటుంది. 8 నెలల్లోపు సమగ్ర నివేదికను సమర్పించాలి. 2023లో ఢిల్లీ ఐఐటీలో ఇద్దరు విద్యార్థులు మరణిస్తే ఎఫ్ఐఆర్ నమోదుకు ఢిల్లీ హైకోర్టు గతేదాడి జనవరిలో నిరాకరించిన నేపథ్యంలో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టు ఆదేశించడంతో తాజాగా సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. 2018 నుంచి 2023 ఏడాది వరకు ఉన్నతవిద్యాసంస్థల్లో 98 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ సహాయక మంత్రి 2023లో ప్రకటించడం తెల్సిందే. ఈకాలంలో ఐఐటీల్లో 39, ఎన్ఐటీల్లో 25, కేంద్రీయ వర్సిటీల్లో 25, ఐఐఎంలలో నలుగురు, ఐఐఎస్ఈఆర్లలో ముగ్గురు, ఐఐఐటీల్లో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. -
ఉగాదికి అటు ఇటుగా!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో నెలలుగా ఊరిస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సమయం సమీపించింది. ఉగాదికి కొంచెం అటు ఇటుగా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎంతమందికి అవకాశం దక్కుతుందన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. నలుగురా? లేక ఐదుగురా? అన్నది తేలాల్సి ఉంది. ఏఐసీసీ వర్గాలు, రాష్ట్ర నేతలు అందిస్తున్న సమాచారం మేరకు.. సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి పేర్లు ఖరారైనట్లు తెలుస్తుండగా, మిగతా పేర్లపై నేడో, రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. విస్తృత చర్చలు..అనేక కోణాల్లో పరిశీలన ప్రస్తుతం ఆరు కేబినెట్ స్థానాలు ఖాళీ ఉండగా, వీటి భర్తీపై గత కొన్ని నెలలుగా విస్తృత కసరత్తు జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్లు పలుమార్లు హైకమాండ్‌తో చర్చలు జరిపినా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం కీలకమైన కులగణన పూర్తికావడం, దానికి చట్టబద్ధత కల్పించే బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం, మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీకి వచ్చిన రేవంత్, భట్టి, ఉత్తమ్, మహేశ్‌గౌడ్‌లు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌లతో ఇందిరా భవన్లో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన చర్చల్లో జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక వర్గాలు, పారీ్టలో పనిచేసిన అనుభవం, సీనియార్టీ ఆధారంగా కొత్త మంత్రుల ఎంపికపై చర్చించినట్లు తెలిసింది. పార్టీ బీ–ఫామ్‌ల మీద గెలిచిన ఎమ్మెల్యేలకే మంత్రివర్గంలో చోటు కల్పించాలని, కాంగ్రెస్‌లో చేరిన ఇతర పారీ్టల ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరాదని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలెవరికీ పదవులు దక్కే అవకాశం లేదని పారీ్టవర్గాలు చెబుతున్నాయి. గుర్తించిన నేతలపై విస్తృత చర్చ సోమవారం నాటి భేటీలో మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఇదివరకే గుర్తించిన పేర్లపై మరోమారు చర్చించారు. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి.సుదర్శన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్, కరీంనగర్ జిల్లా నుంచి ఆది శ్రీనివాస్, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, ఆమేర్ అలీఖాన్‌ల పేర్లు ఉన్నాయి. అలాగే మహిళా కోటాలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరును కూడా పరిశీలించినట్టు సమాచారం. ఆమెను ఎమ్మెల్సీగా ప్రకటించినప్పుడే కేబినెట్లోకి కూడా తీసుకుంటారనే ప్రచారం జరిగింది. నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేనందున సుదర్శన్‌రెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రేమ్‌సాగర్ వైపు భట్టి మొగ్గు వెలమ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవికి పోటీ ఎక్కువగా ఉంది. ఈ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్ రావు, మదన్మోహన్, మైనంపల్లి రోహిత్‌తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ల మధ్య పోటీ నెలకొంది. అయితే ఈ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే జూపల్లి కష్ణారావు ఉన్నందున మరొకరికి అవకాశం ఇవ్వాలా? లేదా? అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించినట్టు తెలిసింది. మదన్మోహన్కు పార్టీ పెద్దలు, రోహిత్‌కు సీఎం ఆశీస్సులు! మదన్మోహన్ పార్టీ పెద్దల నుంచి ఒత్తిళ్లు తెస్తుండగా, రోహిత్‌కు ముఖ్యమంత్రి మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి పారీ్టలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్‌లలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ ఉన్నా, తాజా నిర్ణయం నేపథ్యంలో వారికి అవకాశం లేదని తెలిసింది. నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే ఎస్టీ (లంబాడా) కోటాలో శంకర్‌నాయక్‌ను ఎమ్మెల్సీగా చేసినందున, బాలూనాయక్‌ను కేబినెట్లోకి తీసుకోకుండా డిప్యూటీ స్పీకర్‌గా చేయాలన్న ప్రతిపాదనలపై చర్చలు జరిగాయి. త్వరలో కార్యవర్గం! పీసీసీ కార్యవర్గ ప్రకటన కూడా త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఏఐసీసీ పెద్దలతో భేటీలో ఈ అంశం కూడా చర్చకు రాగా ముందుగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 20 మందికి పైగా వైస్ ప్రెసిడెంట్లను ప్రకటించేందుకు నిర్ణయం జరిగినట్లు తెలిసింది. కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీపై సైతం చర్చించినట్లు చెబుతున్నారు. అలాగూ కులగణనపై ప్రజలు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఎస్సీ వర్గీకరణపై ఏమనుకుంటున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుందనే అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రుల శాఖల్లో మార్పులు?కొత్తగా నలుగురిని లేక ఐదుగురిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఏయే శాఖలు వారికి కేటాయించాలి, కొంతమంది మంత్రుల శాఖల్లో మార్పులు చేయాలా? కొందరికి కీలక శాఖలు అప్పగించాలా? అన్న దానిపైనా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి వద్ద ఉన్న మున్సిపల్, హోం, విద్యా శాఖలను సీనియర్ మంత్రులకు ఇవ్వాలన్న చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పాత మంత్రుల శాఖలు కొన్ని మార్చే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏప్రిల్ 23న హైదరాబాద్ ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు.. కేంద్ర ఎన్నికల సంఘం సోమ వారం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీ ప్రభా కర్ రావు పదవీకాలం మే 1తో ముగియనుంది. తాజాగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు మార్చి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 4న నామినేషన్లు స్వీకరిస్తారు, ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 9 గడువు. ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 25న ఓట్ల లెకింపు, ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ తెలిపింది. -
‘జస్టిస్ యశ్వంత్ తీర్పులన్నీ రివ్యూ చేయాలి’
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణల అనంతరం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న తాజా నిర్ణయంపై పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తోంది. ప్రధానంగా అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు(న్యాయవాదులు) తమ నిరసన స్వరం పెంచారు. ఆ జడ్జి మాకొద్దంటూ ఇప్పటికే సీజేఐకి లేఖ రాసిన బార్ సభ్యులు.. మరోమారి అదే విషయాన్ని గట్టిగా నొక్కి చెబుతున్నారు.‘ ఇప్పటికే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు విషయాన్ని క్లియర్ గా లేఖ ద్వారా తెలియజేశాం. ఆయన్ని ఇక్కడకు(అలహాబాద్ హైకోర్టు) బదిలీ చేయవద్దని కోరాం. ఎందుకంటే ఏ కోర్టు అయినా చెత్త పడేసి ప్లేస్ కాదు కదా. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిగి క్లీన్ చీట్ వచ్చే వరకూ జస్టిస్ వర్మ అక్కడే ఉండాలి. జస్టిస్ వర్మ అక్కడే ఉంటే సుప్రీంకోర్టు కూడా ఆయనపై విచారణను చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం ఉంటుంది. ఆయన ఇప్పటివరకూ ఇచ్చిన తీర్పులు అన్నింటిపై రివ్యూ చేయాలి. ప్రజల్లో నమ్మకం చూరగొనాలంటే ఆయన తీర్పులపై మళ్లీ సమీక్షలు అవసరం. సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దర్యాప్తు చేయించాలి’ అని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ డిమాండ్ చేశారు. మాకొద్దంటున్నా.. అలహాబాద్ హైకోర్టకే జస్టిస్ వర్మ -
టీడీపీ ఎంపీలు మూగబోయినా మేం పోరాడుతూనే ఉంటాం
న్యూఢిల్లీ, సాక్షి: ఒకవైపు ఏపీకి తీరని అన్యాయం జరుగుతుంటే.. మరోవైపు ఏ ఒక్క అంశంపైనా టీడీపీ ఎంపీలు(TDP MPs) నోరు విప్పడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. అయితే.. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారాయన. ఫైనాన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం వైఎస్సార్సీపీ తరఫున ఆయన చర్చలో పాల్గొన్నారు. పోలవరం అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే దమ్ము టీడీపీ ఎంపీలకు లేదు. ప్రాజెక్టు ఎత్తు(Polavaram Hight)పై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. పోలవరం ఎత్తును 45 . 72 నుంచి 41.15 తగ్గించడం అన్యాయం. దాదాపు 194 టీఎంసీల కెపాసిటీతో దీనిని డిజైన్ చేశారు. కానీ, ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ 115 టీఎంసీలకు పడిపోతుంది. అలాగే.. రూ.60 వేల కోట్ల వ్యయం అవుతుండగా కేవలం 30 వేల కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వం పరిమితం అవుతోంది. పార్లమెంటులో ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోకపోవడం అన్యాయం. 👉టీడీపీ ఎంపీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag Steel Plant Privatization) అంశాన్ని ప్రస్తావించలేకపోతున్నారు. ఓవైపు ప్రైవేటీకరణ చేస్తామని, మరోవైపు మద్దతిస్తామని విరుద్ధ ప్రకటన చేస్తున్నారు. ప్రైవేటీకరణే జరిగితే ఉద్యోగులకు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది.👉ఏపీలో రూ.2,000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తవుతుంది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు నిర్మాణాన్ని నిలిపివేసింది. మంజూరైన సీట్లను సైతం తాము కాలేజీని నడపలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అమ్మివేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మెడికల్ కాలేజీలను నడిపేలా చర్యలు తీసుకోవాలి. 👉ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా ఉన్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం విస్మరించింది. విభజన చట్టంలోని హామీలను మరిపోయింది. ఒక కిలోమీటర్ నేషనల్ హైవే నిర్మించడానికి 20 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. కానీ, అమరావతిలో మాత్రం 40 నుంచి 50 కోట్ల రూపాయలకు పెంచారు. ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడమే. ఇందులో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరుగుతోంది. ఈ గణాంకాల పైన అధికారిని నియమించి దర్యాప్తు చేయాలి. 👉వైఎస్సార్ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టారు. కానీ, గడిచిన 11 నెలల నుంచి ఏపీలోని కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేయడం లేదు. విద్యార్థులు డబ్బు చెల్లిస్తే తప్ప హాల్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద చెల్లించాల్సిన బకాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. ఫలితంగా రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఏపీలో గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ‘‘మేము రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కేసులకు భయపడేది లేదు.. ప్రశ్నిస్తూనే ఉంటాం ఏపీకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తుంటాం’’ అని మిథున్ రెడ్డి అన్నారు. -
మాకొద్దంటున్నా... అలహాబాద్ హైకోర్టుకే యశ్వంత్ వర్మ!
ఢిల్లీ : అవినీతి మరక అంటుకుని దాని నుంచి ఎలా బయటపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను.. అలహాబాద్ హైకోర్టుకే బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం మరోమారు నిర్ణయం తీసుకుంది. యశ్వంత్ వర్మ బదిలీ అంశానికి సంబంధించి గురువారం, సోమవారాల్లో ప్రత్యేకంగా రెండు సార్లు సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం చివరకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని.. కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్లాల్సి ఉంటుంది.ఢిల్లీ హైకోర్టులో నో వర్క్..!అవినీతి ఆరోపణల అనంతరం ఏం జరుగుతుందా అని ఉత్కంఠ ఏర్పడింది. యశ్వంత్ యధావిధిగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారా.. లేక అలహాబాద్ హైకోర్టు వెళతారా అనే సందిగ్థంలో ఉండగా సుప్రీంకోర్టు కొలీజియం ఎట్టకేలకు అలహాబాద్ హైకోర్టుకు పంపడానికే మొగ్గుచూపింది. ఢిల్లీ హైకోర్టులో యశ్వంత్ కు ఎటువంటి బాధత్యలు అప్పగించకపోవడంతోనే.. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసనలు..అయితే అలహాబాద్ హైకోర్టు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తొలుత తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్.. దీనిపై తీవ్రంగా మండిపడింది. అవినీతి ఆరోపణలు ఉన్న యశ్వంత్ ను ఇక్కడకు ఎలా బదిలీ చేస్తారంటూ నేరుగా సీజేఐకే లేఖ రాసింది. ఆ ‘ చెత్త’ మాకొద్దంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే బదిలీకి, అవినీతి అంశానికి ఎటువంటి సంబంధం లేదని సీజేఐ చెప్పుకొచ్చారు. యశ్వంత్ పై దర్యాప్తు జరుగుతుందంటూనే బదిలీని సమర్ధించుకుంది ధర్మాసనంకాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది. 2021లో అలహాబాద్ నుంచి ఢిల్లీ హైకోర్టుకు..ఈ నేపథ్యంలో యశ్వంత్ ను అలహాబాద్ హైకోర్టు బదిలీ చేయడం, ఆపై తమకు ఆ జడ్జి వద్దని అక్కడ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులోనే యశ్వంత్ కొనసాగుతారని భావించారు. కానీ అక్కడ ఆయన చేదు అనుభవం ఎదురుకావడంతో ఇప్పుడు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. 2021 లో అలహాబాద్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన యశ్వంత్.. మళ్లీ అక్కడికే వెళ్లడానికి దాదాపు రంగం సిద్ధం కావడంతో అలహాబాద్ హైకోర్టులో ఆయనకు ఏ పరిణామాలు ఎదురవుతాయో చూడాల్సిందే.సుప్రీంకోర్టులో పిల్..యశ్వంత్ వర్మ ఇంట్లో వెలుగుచూసిన నోట్ల కట్టల వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశిస్తూ ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్0 దాఖలైంది. ముందు భారీగా నోట్ల కట్టలు దొరికాయనే ఆరోపణలపై ముందుగా ఎప్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టులో పలువురు న్యాయవాదులు పిల్ దాఖలు చేశారు. -
పార్లమెంట్‌ను కుదిపేసిన డీకే శివకుమార్ వ్యాఖ్యలు
బెంగళూరు/న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు.. సోమవారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేశాయి. డీకేఎస్ వ్యాఖ్యలతో రాజ్యాంగాన్నే మార్చేయాలన్న కాంగ్రెస్ మనస్తత్వం బయటపడిందని బీజేపీ విమర్శించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టి కౌంటరే ఇచ్చింది. ఈ క్రమంలో రాజ్యసభ 2గం.దాకా కార్యకలాపాలకు దూరంగా ఉండగా, లోక్‌సభ పదే పదే వాయిదా పడుతూ వచ్చింది.కర్ణాటక ప్రభుత్వం మైనారిటీ కోటా కింద కాంట్రాక్టులలో నాలుగు శాతం ముస్లింలకు కేటాయించడంపై బీజేపీ, కాంగ్రెస్‌లు విమర్శలతో పార్లమెంట్‌ను వేడెక్కించాయి. ప్రత్యేకించి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇది రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు జేపీ నడ్డా అన్నారు. ‘‘మతం పేరుతో రిజర్వేషన్లను రాజ్యాంగం అనుమతించలేదు. మైనార్టీలను కాంగ్రెస్ మభ్యపెడుతోంది. ఇలాంటి చట్టాలను(కర్ణాటక తెచ్చిన చట్టం గురించి ప్రస్తావిస్తూ..), విధానాలను ఉపసంహరించుకోవాలి. బీఆర్ అంబేద్కర్ మార్గదర్శకత్వంలో రూపొందించిన రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరు’’ అని నడ్డా అన్నారు.అయితే.. నడ్డా వ్యాఖ్యలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగాన్ని మారుస్తానని డీకే శివకుమార్ అనలేదని.. ఆ మాటకి వస్తే బీజేపీ నేతలే రాజ్యాంగంపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతేకాదు.. గతంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ భారత రాజ్యాంగాన్ని మారుస్తానని బహిరంగంగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.ఈ అంశం ఇటు లోక్‌సభలోనూ దుమారం రేపగా.. సభ పదే పదే వాయిదా పడుతూ వచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజ్జు డీకేఎస్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇది రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ ఎంపీలు కౌంటర్లతో సభ హీటెక్కింది. మతపరమైన రిజర్వేషన్లు.. ప్రత్యేకించి ముస్లింల కోసం రాజ్యాంగానికి కొన్ని మార్పులు అవసరం అని శివకుమార్ అన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాను అనలేదని తాజాగా నడ్డా విమర్శల నేపథ్యంలో శివకుమార్ స్పందించారు. బీజేపీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. నేను JP నడ్డా కంటే ఎక్కువ సెన్సిబుల్, సీనియర్ పొలిటీషియన్ అని అన్నారు. నేను గత 36 ఏళ్లుగా అసెంబ్లీలో ఉన్నాను. నాకు ప్రాథమిక ఇంగితజ్ఞానం ఉంది. వివిధ నిర్ణయాల (కోర్టు ద్వారా) తర్వాత మార్పులు ఉంటాయని క్యాజువల్‌గా చెప్పాను. రాజ్యాంగాన్ని మార్చబోతున్నామని నేను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. మాది జాతీయ పార్టీ. మా పార్టీ ఈ దేశానికి రాజ్యాంగాన్ని తీసుకువచ్చింది అని అన్నారాయన. -
ఎంపీల జీతభత్యాలు పెంచిన కేంద్రం
న్యూఢిల్లీ, సాక్షి: ఎంపీల జీతభత్యాల విషయంలో కేంద్రం సోమవారం కీలక ప్రకటన చేసింది. ఉభయ సభల్లోనూ ఎంపీలకు జీతాలను పెంచుతున్నట్లు సోమవారం అధికారికంగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ ఓ నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ పెంపు అమల్లో ఉండడం. ప్రస్తుతం ఎంపీల జీతం రూ. లక్ష ఉండగా.. దానిని లక్షా 24 వేలకు పెంచింది. అలాగే దినసరి భత్యం రూ.2 వేల నుంచి 2,500కు పెంచింది. మాజీ ఎంపీల పెన్షన్ రూ.25 వేల నుంచి 31 వేలకు పెంచినట్లు తెలిపింది. ఈ మేరకు సంబంధిత పార్లమెంట్ యాక్ట్ 1954కు సవరణ చేసింది. అయితే రెండేళ్లుగా ఇది ఆచరణలో ఉన్నప్పటికీ.. చట్టసభ సభ్యులకు పరిహారాన్ని పెంచాలనే ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా ఈ ‘సర్దుబాట్ల’ను అధికారికంగా తెలియజేసిందంతే. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం చట్ట సభ్యుల జీతాలను 100 శాతం పెంచుకుని వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలూ చెలరేగుతున్నాయి. -
న్యాయ వ్యవస్థపై... నమ్మకం పోతోంది
న్యూఢిల్లీ: దేశ వ్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల నియామకం వంటి అంశాలు పద్ధతి ప్రకారం జరగడం లేదన్నారు. ఈ వాస్తవాన్ని న్యాయ వ్యవస్థతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించినప్పుడే మెరుగైన ప్రత్యామ్నాయం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయిన సిబల్ శనివారం పీటీఐకి ఇచి్చన ఇంటర్వ్యూలో పలు అంశాలపై తన మనోగతాన్ని వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు దొరికిందన్న వార్తలపై స్పందించేందుకు నిరాకరించారు. ‘‘దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది. ఇలాంటప్పుడు వాస్తవాలు తెలియకుండా మాట్లాడటం బాధ్యతాయుత పౌరుని లక్షణం కాదు’’ అన్నారు. సిబల్ ఇంకా ఏం చెప్పారంటే...ఈసీ ఓ విఫల వ్యవస్థ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ విఫల వ్యవస్థ. రాజ్యాంగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేని ఈసీపై ప్రజలకు విశ్వాసం లేదు. వారి నమ్మకాన్ని తిరిగి ఎంత త్వరగా పొందగలిగితే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అంతే అవకాశముంటుంది. ఈవీఎంలతోపాటు ఎన్నికల ప్రక్రియ కలుషితమైందని ప్రతిపక్షాలకు చెప్పాలనుకుంటున్నా. ఈసీ వెలువరించే ఫలితాలు అనేక దశల్లో ఎన్నికల ఫలితాలను తారుమారు చేశాక విడుదల చేసేవి అయి ఉండొచ్చు. ఇలాంటి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాలి. విపక్ష ఇండియా కూటమి పార్టీలు కూటమిగా ఒకే అజెండాతో సాగాలి. సైద్ధాంతిక ప్రాతిపదిక, విధానాలు రూపొందించుకోవాలి. కూటమి అభిప్రాయాల వ్యక్తీకరణకు సమర్థుడైన ప్రతినిధి ఉండాలి. అప్పుడే కూటమి ప్రభావం చూపే అవకాశముంటుంది. న్యాయవ్యవస్థలో అవినీతి మూడు రకాలు మన న్యాయవ్యవస్థ పనితీరుపై ఏళ్లుగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అందులో ఒకటి అవినీతి. ఈ అవినీతికి అనేక కోణాలున్నాయి. వీటిలో ఒకటి న్యాయమూర్తి ప్రతిఫలం ఆశించి తీర్పులివ్వడం. రెండోది భయం, స్వార్థం లేకుండా తీర్పులిస్తామన్న ప్రమాణానికి భిన్నంగా తీర్పులివ్వడం. దీనికో ఉదాహరణ చెబుతాను. ప్రస్తుతం జిల్లా కోర్టు, సెషన్స్ కోర్టులు 95 శాతం కేసుల్లో బెయిల్‌ను తిరస్కరిస్తున్నాయి. ఇక్కడే తేడా జరుగుతోంది. బెయిలిస్తే అది వారి కెరీర్‌పై ప్రభావం చూపుతుందని భయపడుతున్నారేమో! మూడో రకం అవినీతి న్యాయమూర్తులు మెజారిటీ సంస్కృతిని బాహాటంగా ఆమోదిస్తుండటం, రాజకీయపరమైన వైఖరిని వ్యక్తం చేస్తుండటం. పశ్చిమ బెంగాల్లో ఓ న్యాయమూర్తి ఒక రాజకీయ పార్టీకి అనుకూల వైఖరిని వ్యక్తపరిచారు. తర్వాత రాజీనామా చేసి అదే పార్టీలో చేరిపోయారు. మరో జడ్జి తాను ఆర్ఎస్ఎస్ మద్దతుదారునంటూ బహిరంగంగానే ప్రకటించేశారు. భారత్‌లో మెజారిటీ సంస్కృతిదే పైచేయిగా ఉండాలని అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ యాదవ్ వీహెచ్‌పీకి సంబంధించిన కార్యక్రమంలోనే వ్యాఖ్య లు చేశారు. హిందువులు మాత్రమే ఈ దేశాన్ని విశ్వగురువుగా మార్చగలరనడమే గాక మైనారిటీ సమాజాన్ని అవమానించేలా మాట్లాడారు. ఆయనపై జరిపిన రహస్య విచారణ ఫలితం ఏమైందో ఎవరికీ తెలియదు. ఇలాంటి వ్యవహారాలను సరైన గాడిలో పెట్టాలి. ఇలాంటి వివాదాంశాలపై సుప్రీంకోర్టు తక్షణం స్పందించి ఎందుకు పరిష్కరించలేకపోతోందో అర్థం కావడం లేదు!ప్రత్యామ్నాయమే లేదు! అవినీతికి పాల్పడిన న్యాయమూర్తులపై రాజ్యాంగంలోని 124వ అధికరణం కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు 50 మందికి మించిన రాజ్యసభ సభ్యుల సంతకాలతో పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారు. ఇదంత త్వరగా తెమిలేది కాదు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై పెట్టిన తీర్మానం వీగిపోయింది. న్యాయమూర్తులపై రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ముందుకు వెళ్లలేనప్పుడు ఇతర ప్రభావవంతమైన ప్రత్యామ్నాయ మార్గాలు లేనే లేవు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్న న్యాయవ్యవస్థ తనకు తాను వేసుకోవాలి. ఇక్కడే న్యాయ వ్యవస్థపై నమ్మకం క్షీణిస్తున్నట్టు కనిపిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థపై విమర్శలు పోవాలంటే ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కలిసి ప్రత్యామ్నాయం ఆలోచించాలి. కొలీజియం ఆశించినట్టుగా పనిచేయడం లేదని సుప్రీంకోర్టు గ్రహించాలి. కేవలం నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ)తో సమస్య పరిష్కారం కాదని కేంద్రం కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఇది సాధ్యం. -
ఈ వారమే లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వక్ఫ్ సవరణ బిల్లు–2024ను ఈ వారంలోనే లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 4వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న దృష్ట్యా, అంతకుముందే ఈ వారంలోనే బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికను ఇప్పటికే స్పీకర్ ఓం బిర్లాకు అందించింది. వక్ఫ్ బోర్డుల్లో కనీసం నలుగురు ముస్లిమేతరులను చేర్చుకోవచ్చని భూ వివాదాలపై దర్యాప్తు అధికారాన్ని కలెక్టర్ల నుంచి సీనియర్ రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు బదిలీ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ఉండేందుకు వీలు కల్పించడం, కలెక్టర్లకు అదనపు అధికారాల వంటివాటిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
జస్టిస్ వర్మపై దర్యాప్తు... కీలక దశకు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నగదు దొరికిన ఘటనపై దర్యాప్తు కోసం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చురుగ్గా వ్యవహరిస్తోంది. తొలి దశ దర్యాప్తును ఇప్పటికే పూర్తిచేసింది. విచారణ కీలకమైన రెండో దశకు చేరినట్లు తెలిసింది. ఈ దశలో లభించే సాక్ష్యాధారాలే జస్టిస్ వర్మ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. త్రిసభ్య కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ జీఎస్ సంధావాలియా, కర్నాటక హైకోర్టు సీజే జస్టిస్ అనూ శివరామన్ ఉన్న విషయం తెలిసిందే. కమిటీ దర్యాప్తును సీజేఐ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. తొలి దశ దర్యాప్తులో ఫిర్యాదు ఆధారంగా కొందరు సాక్షులను మాత్రమే ప్రశ్నించారు. అందులో తేలిన అంశాల ఆధారంగా రెండో దశలో మరింత లోతుగా విచారిస్తున్నారు. విచారణ పూర్తవగానే సీజేఐకి కమిటీ నివేదిక సమర్పించనుంది. ఇందుకు గడువేమీ నిర్దేశించలేదు. జస్టిస్ వర్మ ఇంట్లో భారీగా నగదు దొరికిందన్న వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. కాలిపోయినట్లు చెబుతున్న నోట్ల కట్టల వీడియోలు, ఫొటోలను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉపాధ్యాయకు పోలీసు కమిషనర్ అందజేశారు. వాటిని ఆయన సుప్రీంకోర్టుకు సమరి్పంచారు. ఇందుకు సంబంధించి శనివారం రాత్రి సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వీడియోలు, ఫొటోలు సంచలనం సృష్టించాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నెల 14న జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం సందర్భంగా తమ సిబ్బందికి అక్కడ నోట్ల కట్టలేవీ దొరకలేదని ఢిల్లీ ఫైర్ సరీ్వసెస్ చీఫ్ అతుల్ గార్గ్ తొలుత ప్రకటించారు. తానలా అనలేదంటూ మర్నాడే వివరణ ఇచ్చారు. నోట్ల కట్టల విషయం నిజమేనని తేలితే జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ సిఫార్సు చేయవచ్చు. అనంతరం పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ఆమోదించడం ద్వారా హైకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి ఆయనను శాశ్వతంగా తొలగించవచ్చు. సీజేఐ ఖన్నాపై ప్రశంసల వర్షం జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన నగదుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, కీలక డాక్యుమెంట్లను సుప్రీంకోర్టు ప్రజా బాహుళ్యంలోకి తీసుకురావడం గొప్ప విషయమని న్యాయ నిపుణులు అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ఇది చాలా అరుదైన ఘటన. ఇలాంటి ఉదంతాల్లో వివరాలను సాధారణంగా గోప్యంగా ఉంచుతుంటారు. కానీ వాటిని వెబ్సైట్లో అందరికీ అందుబాటులో తేవడం ద్వారా గొప్ప సంస్కరణకు సీజేఐ శ్రీకారం చుట్టారు. ఆయనకు మా సెల్యూట్’’ అని సీనియర్ అడ్వొకేట్లు సంజయ్ హెగ్డే, ఇందిరా జైసింగ్, ఆదిష్ సి.అగర్వాల్ తదితరులు అభినందించారు. జస్టిస్ వర్మపై అంతర్గత విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటును కూడా ప్రశంసించారు. జస్టిస్ వర్మ ఇంట్లో దొరికిన డబ్బు కట్టల వీడియోను చూసి ఆందోళన చెందానని ఆదిష్ చెప్పారు. పెద్ద మొత్తంలో నగదు కాలిపోయిన స్థితిలో దొరకడం పట్ల పలు అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ఈ విషయంలో నిజానిజాలు నిగ్గుతేలాలని సీనియర్ న్యాయవాది మార్కండేయ ఖట్జూ అన్నారు. నాపై కుట్రలు: జస్టిస్ వర్మ నా ఇంట్లో ఎలాంటి నగదూ దొరకలేదు కాలిపోయాయంటున్న నోట్లతో సంబంధం లేదు నా ప్రతిష్టను దెబ్బతీసేందుకే నిరాధార ఆరోపణలు న్యూఢిల్లీ: తన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం తర్వాత నోట్ల కట్టలేవీ లభించలేదని, తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తేల్చిచెప్పారు. పెద్ద ఎత్తున నగదు లభ్యమైనట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. నిరాధార ఆరోపణలతో తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.కె.ఉపాధ్యాయకు ఆయన లేఖ రాశారు. ఆ నోట్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అవి అక్కడికెలా వచ్చాయో తనకు తెలియదన్నారు. ‘‘అగ్నిప్రమాదం జరిగిన రోజు నేను ఇంట్లో లేను. ప్రమాదం తర్వాత స్టోర్‌రూంలో కాలిన కరెన్సీ నోట్ల కట్టలను అధికారులు తొలగించడం గానీ, స్వాదీనం చేసుకోవడం గానీ జరగలేదని నా కుమార్తె, సిబ్బంది చెప్పారు. కాలిన నోట్లను అధికారులు నా కుటుంబసభ్యులకు చూపలేదు. ఆ నోట్లను వారు బయటకు తీసుకెళ్లినట్లు నా కుటుంబీకులు చూడలేదు. నాకు గానీ, నా కుటుంబీకులకు గానీ స్టోర్‌రూంలో నగదు భద్రపర్చే అలవాటు లేదు. ఆ గదిలో మంటల్లో పాక్షికంగా కాలిన నగదు దొరికినట్లు చెప్పడం పూర్తిగా అర్థరహితం, అసంబద్ధం. దీని వెనక కుట్ర ఉంది’’ అని ఆరోపించారు. అందరూ స్వేచ్ఛగా తిరిగే స్టోర్‌రూంలో ఎవరైనా భారీగా నగదు దాస్తారా అని ప్రశ్నించారు. ప్రమాదం జరిగినప్పుడు లేని నోట్లు తర్వాత అక్కడెలా ప్రత్యక్షమయ్యాయో దర్యాప్తు అధికారులే తేల్చాలన్నారు. ‘‘మేం బ్యాంకు ఖాతాల నుంచే ఆర్థిక లావాదేవీలు చేస్తుంటాం. నగదు అవసరమైనప్పుడు బ్యాంకు నుంచి విత్‌డ్రా చేస్తుంటాం. వాటికి అన్ని లెక్కలూ ఉన్నాయి’’ అని చెప్పారు. -
జడ్జి ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంలో కీలక మలుపు!
ఢిల్లీ : హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yaswant Varma) ఇంట్లో కాలిన నోట్ల కట్టల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లోనే కాదు ఇంటి సమీపంలో చెత్త కుప్పలో కాలిన రూ.500 నోట్లు ప్రత్యక్షమవ్వడంతో కాలిన నోట్ల కట్టల ఘటనలో కీలక మలుపు తిరిగినట్లైంది.హోలీ పండుగ (మార్చి 14)న ఢిల్లీలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున కాలిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. ఇదే అంశంపై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం,ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.#WATCH | A sanitation worker, Inderjeet says, "We work in this circle. We collect garbage from the roads. We were cleaning here 4-5 days back and collecting garbage when we found some small pieces of burnt Rs 500 notes. We found it that day. Now, we have found 1-2 pieces...We do… pic.twitter.com/qnLjnYvnfe— ANI (@ANI) March 23, 2025 ఈ విచారణ నేపథ్యంలో,జస్టిస్ వర్మ నివాసానికి సమీపంలోని చెత్తను శుభ్రం చేస్తున్న సమయంలో కాలిన రూ.500 నోట్ల ముక్కలు కనిపించాయి. అందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ కాలిన నోట్లు ఎవరివన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుడు ఇంద్రజిత్ మీడియాతో మాట్లాడుతూ.. మేం నాలుగైదు రోజుల క్రితం ఈ వీధిని శుభ్రం చేసే సమయంలో మాకు కాలిన నోట్ల కనిపించాయి. అవి ఎక్కడ నుంచి వచ్చాయో మాకు తెలియదు. శుభ్రం చేయడం మా పని. శుభ్రం చేసే సమయంలో ఇప్పటికీ కాలిన నోట్ల ముక్కలు కనిపిస్తున్నాయని అన్నారు. మరోవైపు, తన ఇంట్లో డబ్బులు లభ్యమైనట్లు వస్తున్న ఆరోపణలపై జస్టిస్ యశ్వంత్ వర్మ స్పందించారు. ఢిల్లీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు లేఖ రాశారు. ఈ ఘటనలో నిజా నిజాలు నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు. -
‘నాకే షాకింగ్‌గా ఉంది’.. కాలిన నోట్ల కట్టలపై జస్టిస్ యశ్వంత్ వర్మ
ఢిల్లీ: అగ్ని ప్రమాదం సందర్భంగా తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయంటూ వస్తున్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma)తో పాటు అతని కుటుంబ సభ్యులు ఖండించారు. ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయనే ప్రచారం జరగడం షాకింగ్‌గా ఉందన్నారు. తన ప్రతిష్ట దెబ్బతీయాలని కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు.ఢిల్లీ హైకోర్టు సీజేకు లేఖఆ డబ్బులు తన ఇంట్లో దొరకలేదని, ఆ గది తన ప్రధాన నివాసానికి ఏమాత్రం సంబంధలేదని తెలిపారు. ఇంట్లో సహాయకులు మాత్రమే ఆ గదిని వినియోగించుకునే వారని చెప్పారు. ఈ మేరకు జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు (devendra kumar upadhyaya) జస్టిస్ వర్మ ఒక లేఖ రాశారు. #BREAKING Video shared by Delhi Police Commissioner regarding the fire at Justice Yashwant Varma’s house, when cash currencies were discovered. pic.twitter.com/FEU50vHwME— Live Law (@LiveLawIndia) March 22, 2025 ఖండిస్తున్నానుఆ లేఖలో ‘నోట్ల కట్టలు దొరికాయని ఆరోపణలు వస్తున్న స్టోర్ రూం నిరుపయోగంగా ఉండేది. పాత ఫర్నిచర్, సీసాలు, వంట సామగ్రి, పరుపులు, పాత స్పీకర్లు, తోట పనికి అవసరమైన సామగ్రి, అలాగే సీపీడబ్ల్యుడి (CPWD) మెటీరియల్ వంటివి అక్కడ నిల్వ ఉంచేవారు. ఇంట్లో సహాయకులకు అందుబాటులో ఉండే గది. నా ఇంటికి దీనికి సంబంధం లేదు. కాని దీనిని నా ఇంటి భాగంగా చూపించడాన్ని నేను ఖండిస్తున్నాను.బ్యాంక్ ట్రాన్సాక్షన్‌ను పరిశీలించండిమార్చి 14న నేను, నా సతీమణి మధ్యప్రదేశ్‌లో ఉన్నాం. ప్రమాదం జరిగే సమయంలో తన ఇంట్లో తమ కుమార్తె, తల్లి మాత్రమే ఉన్నారు. మార్చి 15న తాము భోపాల్ నుంచి ఇండిగో విమానంలో ఢిల్లీకి తిరిగి వచ్చాం. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో నా కుమార్తె, నా ప్రైవేట్ సెక్రటరీ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారి కాల్ రికార్డులను పరిశీలించొచ్చు. అయితే, అగ్ని ప్రమాదం అదుపులోకి వచ్చాక అక్కడ నగదు కనిపించలేదు. నా కుటుంబ సభ్యులెవరూ స్టోర్ రూంలో నగదు ఉంచలేదు. మా డబ్బు లావాదేవీలు అన్ని బ్యాంకింగ్ చానెల్స్ ద్వారానే జరుగుతాయి. యూపీఐ, కార్డుల ద్వారా లావాదేవీలు చేస్తాంనాకే షాకింగ్‌గా ఉందిఈ సందర్భంగా నాకు షాకింగ్‌గా అనిపించిన విషయం ఏంటంటే? నా ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయంటూ వెలుగులోకి వచ్చిన వీడియోలు,ఫొటోలు.. అగ్ని ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలోనే కనిపించలేదు. నా మీద కుట్ర జరుగుతోందని నాకు అనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఘటన నా వ్యక్తిత్వాన్ని, న్యాయవ్యవస్థలో నా నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. గతంలో కూడా సోషల్ మీడియాలో నాపై నిరాధార ఆరోపణలు వచ్చాయి. ఇది కూడా వాటికి కొనసాగింపు అనేది నా అనుమానం.నా ప్రతిష్ట దెబ్బతీయాలని కుట్ర నా న్యాయ జీవితంలో, నా న్యాయ నిర్ణయాల్లో ఎప్పుడూ ఎవరికీ అనుమానం రాలేదు. కానీ ఇప్పుడు, ఆధారాలు లేని ఆరోపణలతో నా ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. నా నిజాయితీని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణల వెనుక ఉన్న అసలు నిజాన్ని బయట పెట్టాలని కోరుతున్నాను’ అని సుదీర్ఘంగా రాసిన లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కమిటీఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పంజాబ్ హర్యాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీఎస్ సందవాలియా, కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్ ఉన్నారు.కాగా, ఈ కేసు పరిణామాలు తేలే వరకు జస్టిస్ వర్మకు కొత్త న్యాయపరమైన పనులను కేటాయించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించారు. -
మంటల్లో కాలిపోయిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో వీడియోలు..
ఢిల్లీ: దేశంలో భారీ అవినీతి ఆరోపణ నడుమ జస్టిస్ యశ్వంత్ వర్మ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న యశ్వంత వర్మ ఇంట్లో ఇటీవల అగ్ని ప్రమాదం జరగ్గా, అక్కడ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. నోట్ల కట్టలన్నీ మంటల్లో కాలిపోయాయి దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు.ఇక, అగ్ని ప్రమాదం సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ.. శనివారం 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. అందులో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతోపాటు ఢిల్లీ పోలీసు కమిషనర్ అందించిన వివరాలు, ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. అగ్నిమాపక శాఖ ఆపరేషన్ వివరాలూ ఫొటోలు, వీడియోల్లో ఉన్నాయి. సీజేఐ రాసిన లేఖ కూడా ఉంది.ఢిల్లీ హైకోర్టు సీజే సమర్పించిన నివేదికను పరిశీలిస్తే.. సగం కాలిన నోట్ల కట్టలను గురించి అధికారిక ప్రస్తావన కనిపించింది. దీనిపై అధికారిక సమాచారం ఉందన్న విషయం అందులో ఉంది. మరోవైపు స్టోర్ రూంలో తానుగానీ, తన కుటుంబ సభ్యులుగానీ ఎటువంటి నగదును ఉంచలేదని సీజే జస్టిస్ ఉపాధ్యాయకు ఇచ్చిన వివరణలో జస్టిస్ యశ్వంత్ వర్మ పేర్కొన్నారు. తమకు చెందిన నగదు దొరికిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.BREAKING 🚨Video of the cash pile at Justice Yashwant Varma’s residence. Delhi Police submits video of the cash pile, Supreme Court makes the video public. Justice Varma has said he has no knowledge of any such cash: pic.twitter.com/T0l5pkJvMK— Shiv Aroor (@ShivAroor) March 22, 2025మరోవైపు.. జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా శనివారం త్రిసభ్య కమిటీ నియమించారు. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగ్, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామన్‌ను సభ్యులుగా నియమించారు. ఇదిలా ఉండగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మకు ఎలాంటి న్యాయ సంబంధిత విధులు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయను సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశించారు. -
జస్టిస్ యశ్వంత్ వర్మపై విచారణకు త్రిసభ్య కమిటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా శనివారం త్రిసభ్య కమిటీ నియమించారు. ఈ కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగ్, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామన్‌ను సభ్యులుగా నియమించారు.మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మకు ఎలాంటి న్యాయ సంబంధిత విధులు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయను సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశించారు. సీజేఐకి నివేదిక సమర్పించిన జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నోట్ల కట్టలు లభ్యమైన ఘటనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ తమ నివేదికను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు లభించడంపై జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ అంతర్గత విచారణ చేపట్టారు. సాక్ష్యాధారాలు, సమాచారం సేకరించారు. సంబంధిత అధికారులతో చర్చించారు. అన్ని అంశాలతో నివేదిక సిద్ధం చేసి, సీజేఐకి అందజేశారు. దీని ఆధారంగా జస్టిస్ యశ్వంత్ వర్మపై సుప్రీంకోర్టు తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. -
వినోద్‌కుమార్ శుక్లాకు జ్ఞానపీఠం
న్యూఢిల్లీ: ప్రఖ్యాత హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా(88) 59వ జ్ఞానపీఠ అవార్డుకు ఎంపికయ్యారు. దేశంలో అత్యున్నత సాహితీ పురస్కారానికి ఎంపిౖకైన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మొట్టమొదటి రచయితగా నిలిచారు. అదేవిధంగా, ఈ అవార్డు స్వీకరించనున్న 12వ హిందీ రచయితగా నిలిచారు. కథలు, కవితలతోపాటు వ్యాస రచనలో ప్రజ్ఞాశాలి అయిన శుక్లా సమకాలీన గొప్ప హిందీ రచయితల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.అవార్డు కింద రూ.11 లక్షల నగదుతోపాటు సరస్వతీ మాత కాంస్య విగ్రహం, ప్రశంసాపత్రం అందుకోనున్నారు. ప్రముఖ కథా రచయిత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రతిభా రాయ్ సారథ్యంలో జ్ఞానపీఠ ఎంపిక కమిటీ సమావేశమై వినోద్‌కుమార్ శుక్లాను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. హిందీ సాహిత్యంలో సృజనాత్మకత, విలక్షణమైన రచనాశైలికి ఆయన చేసిన అద్భుతమైన కృషిని గుర్తిస్తూ శుక్లాను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మాధవ్ కౌశిక్, దామోదర్ మౌజో, ప్రభా వర్మ, అనామిక, ఎ.కృష్ణారావు, ప్రఫుల్ శిలేదార్, జానకీ ప్రసాద్ శర్మతోపాటు కమిటీ డైరెక్టర్ మధుసూదన్ ఆనంద్ పాల్గొన్నారు.‘ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డుకు ఎంపికవుతానని ఎన్నడూ అనుకోలేదు. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. రచనా వ్యాసంగం ఇకపైనా కొనసాగిస్తా. ముఖ్యంగా చిన్నారుల కోసం రచనలు చేస్తా’అంటూ వినోద్ కుమార్ శుక్లా స్పందించారు. తన విలక్షణమైన భాషా పటిమ, లోతైన భావోద్వేగాలకు పేరుగాంచిన శుక్లా ‘దీవార్ మే ఏక్ ఖిడ్కీ రహతీ థీ’ పుస్తకానికి 1999లో సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.శుక్లా రచించిన నౌకరీ కీ కమీజ్(1979) అనే నవల అనంతరం మణి కౌల్ సినిమాగా తీశారు. సబ్ కుచ్ హోనా బచా రహేగా(1992)అనే కవితా సంకలనం ఆయనకు ఎంతో పేరు తెచి్చపెట్టింది. భారతీయ రచయితల కోసం 1961లో నెలకొల్పిన జ్ఞానపీఠ అవార్డును మొట్టమొదటిసారిగా 1965లో ‘ఒడక్కుజల్’అనే కవితా సంకలం వెలువరించిన మలయాళ కవి జి. శంకర కురూప్ అందుకున్నారు. -
అప్పుడు కూడా జడ్జి యశ్వంత్ ఇంట్లో నోట్ల కట్టల కుప్ప!
న్యూఢిల్లీ: జస్టిస్ యశ్వంత్ వర్మ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పేరు. భారీ అవినీతి ఆరోపణ నడుమ యశ్వంత్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న యశ్వంత వర్మ ఇంట్లో ఇటీవల అగ్ని ప్రమాదం జరగ్గా, అక్కడ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కనిపించాయని ఒకవైపు ఆరోపణలు.. వీటి విలువ కోట్ల రూపాయిలు ఉంటుందని మరొవైపు అంచనాలు. ఒకవైపు జస్టిస్ ఇంట్లో ఏమీ నగదు దొరకలేదని ఢిల్లీ అగ్ని మాపక చీఫ్ అన్నట్లు ఒకవైపు, తాను అనలేదని మళ్లీ మరొకవైపు. ఇవే వార్తలు గత రెండు రోజుల నుంచి. చక్కర్లు కొడుతున్నాయి.అంటే ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిగితేనే అసలు విషయం బయటకురాదు. న్యాయవవస్థలో ఉన్న ఒక జడ్జిపై ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ‘లెక్క సరిచేసుకునే’ బాధ్యత సదరు జడ్జిపై కూడా ఉంటుంది. ఇప్పటివరకూ జస్టిస్ యశ్వంత్ వర్మ నుంచి ఒక్క మాట పెదవి దాటలేదు. మరి ఆయన మౌనం పాటిస్తున్నారా.. వెనుక ఉండి ఏమైనా ‘ కథ’ నడిపిస్తున్నారా అనేది కూడా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.2018లోనే వర్మపై సీబీఐ ఎఫ్ఐఆర్..!తాజాగా జరిగింది ఒకటైతే,. 2018లో జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సింబాలి సుగర్ మిల్స్ కుంభకోణానికి సంబంధించి యశ్వంత్ పై కేసు ఫైల్ చేసింది సీబీఐ. దానికి ఆ సమయంలో యశ్వంత్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో యశ్వంత్ వర్మ ఇంట్లో లెక్కల్లో చూపని భారీ నగదు దొరకడంతో సీబీఐ ఎప్ఐఆర్ నమోదు చేసింది. అయితే 2012 సంవత్సరంలో జనవరి, మార్చి నెలల మధ్యలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)కి సింభోలి షుగర్ మిల్స్ వందల కోట్లలో టోకరా వేసి ఘటన అప్పట్లో సంచలనమైంది.. సదరు బ్యాంకును మోసం సుమారు రూ. 148.59 కోట్లను అక్రమ మార్గంలో సింభోలి షుగర్ మిల్స్ ఖాతాలోకి మళ్లించారు. 5వేలు మంది రైతులకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి బ్యాంక్ రుణానికి వెళ్లి, ఆ రైతుల పేర్లతో తప్పుడు పత్రాలు(కేవైసీ) సృష్టించి మోసానికి తెరలేపారు సింభోలి షుగర్ మిల్స్.2015లో అసలు విషయం వెలుగులోకి..అయితే సింభోలి షుగర్ మిల్స్ మోసం చేసిన విషయాన్ని ఓబీసీ బ్యాంకు 2015లో గ్రహించింది. ఆ షుగర్ మిల్స్ తీసుకున్న రుణం మోసం చేసి తీసుకున్నదిగా డిక్లేర్ చేసింది. ఇందులో మొత్తం రుణం రూ. 97.85 కోట్లు కాగా, అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ. 109 కోట్లుగా బ్యాంకు పేర్కొంది. దీనిపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించిన గుర్పాల్ సింగ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అప్పటి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కి గుర్పాల్ సింగ్ అల్లుడు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఎప్ఐఆర్ ఆధారంగా ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కూడా రంగంలోకి దిగింది. ఈ రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు సమాంతరంగా దర్యాప్తు చేశాయి. అయితే ఈ కేసులో పెద్దగా పురోగతి కనిపించకపోవడంతో దర్యాప్తు అంశం పక్కకు పోయింది.అలహాబాద్ హైకోర్టు జోక్యంతో 2023లో మళ్లీ కొత్తగా..ఈ భారీ అవినీతిని సీరియస్ గా తీసుకున్న అలహాబాద్ హైకోర్టు.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. న్యాయవవస్థను కుదిపేసిన ఈ తరహా అవినీతిపై దర్యాప్తు కచ్చితంగా సమగ్రంగా జరగాలని పేర్కొంది. ఇందులో రుణాలు ఎగవేతకు సంబంధించి ఏడు బ్యాంకులను లింక్ చేసింది హైకోర్టు. సుమారు ఏడు బ్యాంకులు కలిపి బయారూ. 900 కోట్లు సింభోలి షుగర్ మిల్స్ కు రుణాన్ని మంజూరు చేసినట్లు గుర్తించిన హైకోర్టు.. ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దాంతో 2024 ఫిబ్రవరిలో సీబీఐ రంగంలోకి దిగింది. దీనికి సంబంధించిన కంపెనీ డైరెక్టర్లు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెకర్లపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి విచారణను తిరిగి ప్రారంభించింది. -
బిలియన్ కోల్ ఫీట్.. భారత్‌కు ఇది గర్వకారణం
న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తిలో భారత్ ఒక బిలియన్ టన్నుల మైలురాయిని అధిగమించడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతికతలు, సమర్థవంతమైన పద్ధతులతో ఉత్పత్తిని పర్యావరణానికి హాని చేయకుండానే బొగ్గు ఉత్పత్తిని పెంచగలిగామని చెప్పారాయన... పెరుగుతున్న విద్యుత్ డిమాండ్లకు ఇది పరిష్కారం చూపుతుంది. ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు ప్రతి భారతీయుడికి ఉజ్వల భవిష్యత్తును ఇస్తుంది. మోదీ నాయకత్వంలో గ్లోబల్ ఎనర్జీ లీడర్‌గా భారత్ ఎదుగుతోంది అని కిషన్‌రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్ చేశారు. ఇది దేశం గర్వించదగ్గ విషయమన్న ప్రధాని మోదీ.. ఎనర్జీ అవసరాలను తీర్చడానికి మన సొంత కాళ్లపై నిలబడుతున్నామని చెప్పారు. కరెంట్ ఉత్పత్తితో పాటు వివిధ ఫ్యాక్టరీలలో బొగ్గును వాడతారన్నది తెలిసిందే. 2023–24 లో 99.78 కోట్ల టన్నుల బొగ్గును ఇండియా ఉత్పత్తి చేయగా, 2024–25 లో 108 కోట్ల టన్నులను ఉత్పత్తి చేసింది. -
సీనియర్ న్యాయవాదికి షోకాజ్ నోటీస్
న్యూఢిల్లీ: అనుచిత ప్రవర్తన ఆరోపణలెదుర్కొంటున్న సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రాకు షోకాజ్ నోటీసు పంపాలని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ నిర్ణయించింది. ఆయనకు ఇచ్చిన సీనియర్ హోదాను ఎందుకు తొలగించరాదో తెలిపాలని కోరనుంది. సీనియర్ లాయర్‌కు సుప్రీంకోర్టు ఫుల్‌బెంచ్ ఇలా నోటీసు ఇవ్వడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుప్రీం జడ్జీలందరూ హాజరై ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. షోకాజ్ నోటీసు ఇవ్వాలని సెక్రటరీ జనరల్ భరత్ పరాశర్‌ను కోరారు. సీనియర్ హోదాను రద్దు చేసుకునేందుకు ముందుగా వాదనను వినిపించేందుకు మల్హోత్రాకు ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 20వ తేదీన ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్‌ల ధర్మాసనం మల్హోత్రా తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఎన్నిసార్లు హెచ్చరించినా కోర్టును తప్పుదోవ పట్టించడం మానుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. శిక్షాకాలం పూర్తి కాకమునుపే ఖైదీలను విడిపించే ప్రయత్రాల్లో భాగంగా వాస్తవాలను దాచినట్లు మల్హోత్రాపై ఆరోపణలు చేసింది. ఆయనకు ఇచ్చిన సీనియర్ గుర్తింపు రద్దు చేసే విషయాన్ని ప్రధాన న్యాయమూర్తికే వదిలేస్తున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఫుల్ బెంచ్ షోకాజ్ నోటీసు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. కాగా, మల్హోత్రాకు సుప్రీంకోర్టు 2024 ఆగస్ట్ 14న సీనియర్ లాయర్ హోదా ఇచ్చింది. -
న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు లభ్యం కావడం సంచలనాత్మకంగా మారింది. ఇదంతా లెక్కల్లో చూపని అక్రమ నగదేనని అధికారులు చెబుతున్నారు. సాక్షాత్తూ న్యాయమూర్తి ఇంట్లో భారీగా సొమ్ము లభించడం రాజకీయంగా పెనుదుమారం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తీవ్రంగా స్పందించారు.యశ్వంత్ వర్మపై బదిలీ వేటు వేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అవినీతికి పాల్పడి అక్రమంగా నగదు కూడబెట్టినట్లు విచారణలో తేలితే యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే, ఆయన ఇంట్లో ఎంత నగదు దొరికిందనే సంగతి అధికారులు ఇంకా బయటపెట్టలేదు. ఈ నెల 14వ తేదీన నగదు లభించగా, ఈ నెల 20దాకా ఆయన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించడం గమనార్హం. వారం రోజులదాకా విషయం బయటకు రాలేదు. అగ్నిప్రమాదంతో బయటపడ్డ నగదు ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని అధికారిక నివాసంలో జస్టిస్ యశ్వంత్ వర్మ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన రాత్రి సమయంలో ఆ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 11.30 గంటల సమయంలో యశ్వంత్ వర్మ కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఢిల్లీ ఫైర్ సర్విసు సిబ్బందితోపాటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మంటలను అర్పివేశారు. ఆ సమయంలో యశ్వంత్ వర్మ ఇంట్లో లేరు. మంటలను ఆర్విన తర్వాత గదులను తనిఖీ చేస్తుండగా, ఓ గదిలో భారీగా నోట్లకట్టలు ఉన్నట్లు గుర్తించి పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ హోంశాఖకు తెలియజేశారు. నగదు వివరాలను తెలియజేస్తూ ఒక రిపోర్టు అందజేశారు.హోంశాఖ ఈ రిపోర్టును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించింది. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభించడాన్ని జస్టిస్ సంజీవ్ ఖన్నా తీవ్రంగా పరిగణించారు. ఆయన నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం గురువారం సమావేశమైంది. యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. వాస్తవానికి యశ్వంత్ వర్మ 2021లో అలహాబాద్ హైకోర్టు నుంచే బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. తాజా వివాదం నేపథ్యంలో యశ్వంత్ వర్మ శుక్రవారం విధులకు హాజరు కాలేదు. ఆయనపై సుప్రీంకోర్టు కొలీజియం అంతర్గత విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.కేవలం బదిలీతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కొలీజియంలోని కొందరు సభ్యులు సూచించినట్లు సమాచారం. యశ్వంత్ వర్మ వ్యవహార శైలిపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నుంచి కొలీజియం వివరణ కోరింది. తాజా వివాదంపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం విచారణ ప్రారంభించారు. యశ్వంత్ వర్మ విషయంలో తప్పుడు వార్తలు, పుకార్లు ప్రచారంలోకి వస్తున్నా యని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నామని, విచారణతో దీనికి సంబంధం లేదని స్పష్టంచేసింది. పూర్తి విచారణ తర్వాతే చర్యలు తీసుకుంటామని తెలియజేసింది. పదవి నుంచి తొలగించవచ్చా? న్యాయమూర్తులు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తేలితే శాశ్వతంగా పదవి నుంచి తొలగించాలంటూ 1999లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. హైకోర్టు జడ్జిపై ఫిర్యాదు అందితే తొలుత ప్రధాన న్యాయమూర్తి విచారణ ప్రారంభించాలి. సదరు జడ్జి నుంచి వివరణ కోరాలి. జడ్జి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోయినా లేక లోతైన దర్యాప్తు అవసరమని భావించినా అందుకోసం అంతర్గత కమిటీని నియమించాలి. ఆరోపణలు నిజమేనని కమిటీ దర్యాప్తులో తేలితే.. పదవికి రాజీనామా చేయాలంటూ జడ్జిని ఆదేశించాలి. శాశ్వతంగా పదవి నుంచి తొలగించడానికి అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ పార్లమెంట్‌కు సిఫా ర్సు చేయాలి. అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదిస్తే జడ్జి పదవి ఊడినట్లే. ఫైర్ సిబ్బందికి నగదు దొరకలేదు: డీఎఫ్ఎస్ చీఫ్ జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో తమ సిబ్బందికి ఎలాంటి నగదు దొరకలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్(డీఎఫ్ఎస్) చీఫ్ అతుల్ గార్గ్ శుక్రవారం చెప్పారు. అగ్నిప్రమాదం జరిగినట్లు ఈ నెల 14న రాత్రి 11.35 గంటలకు కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చిందని, తమ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి మంటలు ఆర్వివేశారని అన్నారు. 15 నిమిషాల్లో ఈ ప్రక్రియ ముగిసిందన్నారు. వారికి నగదేమీ దొరకలేదన్నారు. పార్లమెంట్లో అభిశంసించాలి జస్టిస్ యశ్వంత్ వర్మను బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించడం పట్ల పలువురు సీనియర్ న్యాయవాదులు విస్మయం వ్యక్తంచేశారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జిని మరో కోర్టుకు బదిలీ చేయడం ఏమిటని అడ్వొకేట్ వికాస్ సింగ్ ప్రశ్నించారు. ఆయనతో వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అవినీతిపై కఠినంగా వ్యవహరించాల్సిన వృత్తిలో ఉన్న వ్యక్తి అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకోకుండా వదిలేయడం ఏమిటని అన్నారు.చట్టం దృష్టిలో అందరూ సమానమేనని పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి, పూర్తి నిజాలు బయటపెట్టాలని మరో అడ్వొకేట్ రాకేశ్ ద్వివేది చెప్పారు. యశ్వంత్ వర్మ తప్పు చేసినట్లు రుజువైతే చట్టప్రకారం శిక్షించాలని సూచించారు. యశ్వంత్ వర్మ వ్యవహారంలో సుప్రీంకోర్టు కొలీజియం పూర్తి పారదర్శకంగా, నిజాయతీగా పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ వెల్లడించారు. ఈ నెల 14న నోట్ల కట్టలు దొరికితే ఈ నెల 21న విషయం బయటపడడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.పనికిరాని చెత్త మాకొద్దుయశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ కొలీజియం సిఫార్సు చేయడాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం వ్యతిరేకించింది. తమ హైకోర్టు చెత్తకుండీ కాదని తేల్చిచెప్పింది. పనికిరాని చెత్తను ఇక్కడికి తరలిస్తామంటే అంగీకరించే ప్రసక్తే లేదని హెచ్చరించింది. ఈ మేరకు బార్ అసోసియేషన్ ఒక తీర్మానం ఆమోదించింది. ఎవరీ యశ్వంత్ వర్మ? వివాదానికి కేంద్ర బిందువుగా మారిన జస్టిస్ యశ్వంత్ వర్మ 1969 జనవరి 6న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హన్స్‌రాజ్ కాలేజీలో బీకాం(ఆనర్స్), మధ్యప్రదేశ్‌లోని రేవా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తిచేశారు. 1992 ఆగస్టు 8న అడ్వొకేట్‌గా న్యాయవాద వృత్తి ఆరంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2014 అక్టోబర్ 13న అలహాబాద్ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరి 1న అదే కోర్టులో శాశ్వత జడ్జిగా ప్రమాణం చేశారు. 2021 అక్టోబర్ 11న ఢిల్లీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. జడ్జిల నియామకం పారదర్శకంగా జరగాలి: కపిల్ సిబల్ ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభ్యం కావడం నిజంగా ఆందోళనకరమైన అంశమని సీనియర్ అడ్వొకేట్, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. న్యాయ వ్యవస్థలో అవినీతిని ఎంతమాత్రం సహించడానికి వీల్లేదని చెప్పారు. న్యాయ వ్యవస్థలో అవినీతి అక్రమాలు పునరావృతం కాకుండా న్యాయమూర్తుల నియామకాన్ని మరింత పారదర్శకంగా మార్చాలని అభిప్రాయపడ్డారు. జడ్జిలను చాలాచాలా జాగ్రత్తగా నియమించాలని పేర్కొన్నారు. అవినీతి అనేది మొత్తం సమాజానికే కీడు చేస్తుందని హెచ్చరించారు. దేశంలో అవినీతి తగ్గుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అవినీతి పెరిగిపోతోందని కపిల్ సిబల్ స్పష్టంచేశారు. మరొకరైతే పెద్ద వివాదం అయ్యేది: ధన్‌ఖడ్ జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము దొరకడాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ శుక్రవారం రాజ్యసభలో లేవనెత్తారు. న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం అవసరమని, అందుకోసం చట్టసభలు చొరవ తీసుకోవాలని అన్నారు. దీనిపై ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను కోరారు.ఈ వ్యవహారంపై సభలో నిర్మాణాత్మక చర్చ జరగడానికి ఒక విధానం రూపొందించే విషయం ఆలోచిస్తానని ధన్‌ఖడ్ చెప్పారు. జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభ్యమైన వెంటనే ఆ విషయం బయటకు రాకపోవడం తనను బాధించిందని వ్యాఖ్యానించారు. ఒకవేళ రాజకీయ నాయకుడు లేదా ప్రభుత్వ అధికారి లేదా పారిశ్రామికవేత్త ఇంట్లో డబ్బులు దొరికి ఉంటే వెంటనే పెద్ద వివాదం అయ్యేదని అన్నారు.బదిలీతో చేతులు దులుపుకోవద్దు: కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మను కేవలం బదిలీ చేసి, చేతు లు దులుపుకోవడం సరైంది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖే రా శుక్రవారం పేర్కొన్నారు. ఆ డబ్బు ఎవరిదో, ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ఈడీ, సీబీఐల కంటే అగ్నిమాపక శాఖే అద్భుతంగా పనిచేస్తోందని పవన్ ఖేరా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసులో బిగ్ ట్విస్ట్
ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయంటూ పెద్ద ఎత్తున కలకలం రేగిన గంటల వ్యవధిలోనే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లోలేని సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని, ఆ సమయంలో అగ్ని మాపక సిబ్బందికి భారీ స్థాయిలో నోట్ల కట్టలు దొరికాయని జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే చెలరేగింది.అయితే యశ్వంత్ వర్మ ఇంట్లో ఎటువంటి నోట్ల కట్టలు దొరకలేదని ఢిల్లీ అగ్ని మాపక సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ ఒక్కసారిగా ట్విస్ట్ ఇచ్చారు. తాము అగ్ని ప్రమాదం జరిగిందనే సమాచారంతో జడ్జి వర్మ ఇంటికి వెళ్లినమాట వాస్తవమేనని కానీ అక్కడ ఎటువంటి నోట్ల కట్టలు దొరకలేదంటూ స్పష్టం చేశారు.‘ మా కంట్రోల్ రూమ్ కు మార్చి 14వ తేదీ రాత్రి గం. 11. 30 నిమిషాలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. భారీ అగ్ని ప్రమాదం జరిగిందనేది దాని సారాంశం. దాంతో మా అగ్ని మాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో అక్కడికి వెళ్లారు. మేము సరిగ్గా 11.45 నిమిషాలకు అక్కడ వెళ్లారు మా సిబ్బంది. 15 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలీసులకు కూడా మేము సమాచారం ఇచ్చాం. అగ్ని ప్రమాదాన్ని నివారించిన తర్వాత మా టీమ్ అక్కడ నుండి వెళ్లిపోయింది. మా ఆపరేషన్ లో ఎటువంటి నగదు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో లభించలేదు’ అని స్పష్టం చేశారు. -
‘మీకెందుకివ్వాలమ్మా భరణం?’.. మహిళ కేసులో హైకోర్టు కీలక తీర్పు!
ఢిల్లీ: భర్త నుంచి తాత్కాలిక భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉన్నత చదువులు చదువుకున్నారు. వివాహం కాకముందు ఉద్యోగం చేశారు. భారీ మొత్తంలో వేతనం తీసుకున్నారు. అలాంటి మీకు భరణం ఎందుకివ్వాలి? అని ప్రశ్నించింది. ఉద్యోగం చేసేందుకు అన్నీ అర్హతలు ఉన్న పిటిషినర్‌కు భరణం ఇచ్చే అంశాన్ని ప్రోత్సహించడం లేదని వ్యాఖ్యానించింది. వెంటనే, ఆమె అర్హతకు తగ్గ ఉద్యోగాన్ని చూసుకోవాలని సూచించింది. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. వాళ్లిద్దరూ భార్య, భర్తలు. 2019 డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. అనంతరం సింగపూర్‌లో సెటిల్ అయ్యారు. అయితే, సింగపూర్‌కు వెళ్లిన తనని.. తన భర్త, అతని తల్లిదండ్రులు వేధిస్తున్నారనే కారణంతో భార్య ఫిబ్రవరి 2021లో భారత్‌కు తిరిగి వచ్చారు. తన బంగారాన్ని ఆమ్మి స్వదేశానికి వచ్చినట్లు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన బంధువులు ఇంట్లో నివాసం ఉంటున్నారు. కాబట్టి, తన భర్త నుంచి భరణం కావాలని కోరుతూ జూన్ 2021లో ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది. దీంతో మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లో తన భర్త భారీ మొత్తంలో సంపాదిస్తూ లగ్జరీగా బతుకుతున్నారని, తనకు ఎలాంటి సొంత ఆదాయం లేదని, భర్త నుంచి తాత్కాలిక భరణం కోరుతున్నట్లు పేర్కొన్నారు.ఆ పిటిషన్‌పై జస్టిస్ చంద్రదారి ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సమయంలో సీఆర్పీసీ సెక్షన్ 125 ను సమర్ధిస్తూనే ఉద్యోగం చేసేందుకు అన్నీ అర్హతలు ఉండి, ఖాళీగా ఉండే మహిళల విషయంలో ఇది వర్తించదు. అందుకే, మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు వ్యాఖ్యానించింది. ఉన్నత విద్య, మంచి ఉద్యోగం చేసిన అనుభవం ఉన్న భార్య.. భర్త నుంచి భరణం పొంది ఖాళీగా ఉండడాన్ని సహించదు. కాబట్టి, కోర్టు ఈ కేసులో తాత్కాలిక భరణాన్ని ప్రోత్సహించడం లేదు. ఎందుకంటే పిటిషనర్ ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లుగా, వివాహానికి ముందు దుబాయ్‌లో మంచి ఆదాయం సంపాదించినట్లు గుర్తించింది. ఆమె చదివిన చదువుకు మంచి ఉద్యోగాలు, వేతనాలు వస్తాయని కోర్టు భావిస్తోంది. ఆమె.. తన భర్త ఇచ్చే తాత్కాలిక భరణం మీద ఆధారపడకుండా స్వయంగా సంపాదించుకునే అవకాశాలపై దృష్టి సారించాలని సూచించింది. అదే సమయంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. -
‘ఇదేమీ చెత్త బుట్ట కాదు.. మాకెందుకు ఆ జడ్జి?’
న్యూఢిల్లీ: భారీ అవినీతి ఆరోపణలతో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ((Justice Yaswant Varma) ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలిజీయం((Supreme Court Collegium) ) తీసుకున్న నిర్ణయంపై సదరు హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక హైకోర్టులో అవినీతిని చేసిన జడ్జిని తమకెందుకు బదిలీ చేస్తున్నారంటూ ప్రశ్నించింది. అలహాబాద్ హైకోర్టుకు యశ్వంత్ వర్మను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలిజీయం తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసింది అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్.‘సుప్రీంకోర్టు కొలిజీయం తీసుకున్న నిర్ణయం చాలా సీరియస్ అంశం. అలహాబాద్ హైకోర్టు ఏమైనా చెత్త బుట్టా.. ప్రస్తుతం యశ్వంత్ వర్మ అంశం చాలా తీవ్రమైనది. ప్రస్తుత పరిస్థితిపై విచారణ జరగాలి. అసలే అలహాబాద్ హైకోర్టుకు జడ్జిలు తక్కువగా ఉన్నారు. చాలా ఏళ్ల నుంచి అలహాలబాద్ హైకోర్టులో జడ్జిల కొరత తీవ్రంగా ఉంది. ఆ తరుణంలో అవినీతి మరకలు అంటుకున్న యశ్వంత్ సిన్హా మాకెందుకు? అంటూ సీజేఐకి రాసిన లేఖలో పేర్కొంది.రూ. 15 కోట్లు పైమాటే..?అయితే అగ్ని ప్రమాదంతో బయటపడిన జస్టిస్ యశ్వంత్ వర్మ కరెన్సీ కట్ల వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ నోట్ల కట్టలు విలువ ఎంత ఉంటుందని ఇప్పటివరకూ అధికారంగా ప్రకటించకపోయినా, వాటి విలువ రూ. 15 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. నిజంగా ఒకవేళ ఆ నోట్ల కట్టల విలువ భారీ స్థాయిలో ఉంటే జడ్జి యశ్వంత్ వర్మ చిక్కుల్లో పడినట్లే. ఈ అంశంపై సీజేఐ సంజీవ్ ఖన్నా తీవ్రంగా దృష్టి సారించినట్లు సమాచారం.మార్చి 14వ తేదీన జస్టిస్ వర్మ ఇంట్లో లేని సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలను ఆర్పడానికి వచ్చిన అగ్ని మాపక సిబ్బంది నోట్ల కట్టలు కనిపించాయి. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలపడంతో సీజ్ చేసి ఉన్నతాధికారులకు అందించారు. ఈ వ్యహహారం కాస్తా ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది.గతంలో అలహాబాద్ హైకోర్టు జడ్జిగా పని చేసిన అనుభవం ఉన్న యశ్వంత్ వర్మ.. బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. తాజాగా నోట్ల కట్టల వ్యవహారం బయటపడటంతో వర్మ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకూ యశ్వంత్ వర్మ స్పందించకపోవడంతో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు మరింత బలం చేకూర్చున్నట్లే అవుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.బదిలీకి దర్యాప్తునకు సంబంధం లేదుజస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందని సుప్రీంకోర్టు స్సష్టం చేసింది. దర్యాప్తునకు, బదిలీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయనే కారణం చేత అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశామని వార్తల్లో నిజం లేదన్నారు. ఈ రెండు అంశాలకు ఎటువంటి సంబంధం లేదని ధర్మాసనం పేర్కొంది. -
ఆ రోజులు పోయాయి.. ఉగ్రవాదంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కశ్మీర్లో ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని.. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. శుక్రవారం ఆయన రాజ్యసభలో హోం శాఖ పనితీరుపై జరిగిన చర్చలో సమాధానం ఇస్తూ.. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్‌ను నాశనం చేశాయంటూ ఆయన మండిపడ్డారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడటంపైనే తాము ప్రధానంగా దృష్టి పెట్టినట్లు అమిత్ షా వెల్లడించారు.కశ్మీరీ యువకులు ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారన్న అమిత్ షా.. గతంలో జరిగినట్లు ఉగ్రవాదులకు సానుభూతిగా ఆందోళనలు జరగడం లేదన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదులను దేశ భక్తులుగా కొనియాడే రోజులు పోయాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కశ్మీర్లో సినిమా ధియేటర్లు కూడా నిండుతున్నాయని అమిత్ షా అన్నారు.‘‘మా ప్రభుత్వ హయాంలో నక్సలిజాన్ని దాదాపుగా రూపుమాపాం. 2026 మార్చికల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఉగ్రవాదాన్ని జీరో టోలరెన్స్ విధానంతో కఠినంగా అణిచివేశాం కశ్మీర్లో రాళ్లురువ్వే సంఘటనలు పూర్తిగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ హయాంలో పోలిస్తే మా హయాంలో కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు చాలా వరకు తగ్గిపోయాయి. వేర్పాటు వాదానికి ఆర్టికల్ 370 మూల కారణం. పిఎఫ్ఐ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించాం. బింద్రే సానుభూతిపరులను జైలు ఊచలు లెక్కబెట్టించాము’’ అని అమిత్ షా వివరించారు. -
ఆ తీర్పు ముమ్మాటికీ తప్పే!: కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు జడ్జి రామ్ మనోహర్ మిశ్రా ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. మహిళలను అభ్యంతకరంగా తాకడం లైంగిక దాడి కిందని రాదంటూ ఓ మైనర్ బాలిక కేసులో ఆయన తీర్పు ఇవ్వడం తెలిసిందే. అయితే తీర్పు సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని అంటున్నారు కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి. అలహాబాద్ హైకోర్టు తీర్పు సమ్మతం కాదన్న మంత్రి అన్నపూర్ణ.. దానిని పరిశీలించాలని సుప్రీం కోర్టును కోరారు. అలాంటి తీర్పులతో సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అసలేం జరిగిందంటే..?2021 నవంబరులో.. ఉత్తరప్రదేశ్‌లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన మైనర్ కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగివస్తోంది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు లిఫ్ట్ పేరిట ఆ బాలికను తమతో బైక్‌లపై తీసుకొచ్చారు. మార్గమధ్యంలో ఆ యువకులు అమ్మాయిపై అత్యాచారానికి యత్నించారు. ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురిచేశారు. బాలిక అరుపులు విని అటుగా వెళ్తున్నవారు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన.. పైజామా తాడు తెంపినంత మాత్రాన అత్యాచార యత్నం కిందకు రాదంటూ పేర్కొన్నారు. తద్వారా నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని చెబుతూనే.. అదే చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354-బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారాయన. -
ఏపీలో అరాచక పాలనపై కేంద్రం మౌనం సరికాదు: పిల్లి సుభాష్ చంద్రబోస్
సాక్షి, ఢిల్లీ : ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోందని పార్లమెంట్ వేదికగా చెప్పుకొచ్చారు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. అరాచకాలు కొనసాగుతున్న ఈ పరిపాలనను సరిదిద్దాలన్నారు. ఏపీలో విషయంలో కేంద్ర మౌనంగా ఉంటే.. అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అలాగే, ఏపీలో బీసీ కులగణన జరగాలన్నారు.రాజ్యసభలో కేంద్ర హోం శాఖ పనితీరుపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా చర్చలో వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ పక్షనేత పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. చర్చలో ఆయన మాట్లాడుతూ..‘తిరుపతి తొక్కిసలాట ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. తొక్కిసలాట ఘటనపైన కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలి. సౌమ్యుడైన ఎంపీ మిథున్ రెడ్డిపై, రెడ్డప్పపై దాడి జరిగింది. ఆయన ఇల్లు, కార్లు ధ్వంసం చేశారు. ఇదేం రకమైన పరిపాలన?. దీనిపైన కేంద్రం చర్యలు తీసుకోవాలి.ఏపీలో అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పెడుతున్నారు. 680 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపైన కేసులు పెట్టారు. ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోంది. దీని ఉపేక్షిస్తే కేంద్ర హోంమంత్రి పైన మచ్చ పడుతుంది. పోసాని కృష్ణమురళిపై కేసుల పైన కేసులు పెడుతున్నారు. సీఎంపైన విమర్శలు చేసినందుకు కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజం. అరాచకాలు కొనసాగుతున్న ఈ పరిపాలనను సరిదిద్దాలి. కేంద్ర మౌనంగా ఉంటే.. అన్యాయం జరుగుతుంది.ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇవ్వడం లేదు. వారికి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంటే డీఓపీటీ ఏం చేస్తుంది?. సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నారు. కీలక దృఢ నిర్ణయాలు తీసుకోవాల్సిన కేంద్ర హోం శాఖ పట్టించుకోవడం లేదు. కేంద్రంలో తమ బలంపై ఆధారపడి ఉన్న ప్రభుత్వం ఉందనే ధైర్యంతో ఏపీలో అనర్ధాలు కొనసాగుతున్నాయి. నా రాజకీయ జీవిత చరిత్రలో ఇన్ని అక్రమ కేసులు ఎప్పుడు చూడలేదు. ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోంది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సరిదిద్దాలి. గుంటూరు మిర్చి రైతులకు మద్దతు ధర కోసం వైఎస్ జగన్ వెళితే సెక్యూరిటీ ఇవ్వలేదు. సెక్యూరిటీని విత్ డ్రా చేశారు. సెక్యూరిటీపైన రాజకీయ క్రీడలు ఆడుతున్నారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
జడ్జి బంగ్లాలో నోట్ల కట్టలు.. సుప్రీం కోర్టు సీరియస్
న్యూఢిల్లీ: ఆయనొక న్యాయమూర్తి. హోలీ పండుగ కోసం కుటుంబంతో సహా సొంత ఊరికి వెళ్లారు. సరిగ్గా అదే టైంలో ఆయన అధికారిక బంగ్లాలో మంటలు చెలరేగాయి. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పుతున్న టైంలో ఒక గదిలో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో అంతా షాక్‌కు గురయ్యారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. ఆయనపై బదిలీ వేటు వేసింది!.ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ(Justice Yaswant Varma) ఇంట నోట్ల కట్టలు బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ కరెన్సీకి సరైన లెక్కలు కూడా లేవని సమాచారం. దీంతో ఆయనను సుప్రీం కోర్టు కొలిజీయం(Supreme Court Collegium) ఏకాభిప్రాయంతో ఆయన్ని బదిలీ కింద అలహాబాద్ హైకోర్టుకు పంపించి వేసింది. అయితే.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 14వ తేదీన జస్టిస్ వర్మ ఇంట్లో లేని టైంలో ఫైర్ యాక్సిడెంట్ కాగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలు ఆర్పిన సిబ్బందికి నోట్ల కట్టలు కనిపించాయి. ఆ కరెన్సీని పోలీసులు సీజ్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు సుప్రీం కోర్టు దృష్టికి విషయాన్ని చేరవేశారు. అయితే ఆ కరెన్సీ విలువ ఎంత అనేది మాత్రం బయటపెట్టలేదు.జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంతో.. న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బ తినే అవకాశం ఉందనే సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో.. ఆయన్ని రాజీనామా చేయమని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన గనుక రాజీనామా చేయకుంటే అంతర్గత దర్యాప్తునకు ఆదేశించి.. అటుపై పార్లమెంట్ ద్వారా ఆయన్ని తొలగించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు నోట్ల కట్టల వ్యవహారంపై జస్టిస్ యశ్వంత్ వర్మ ఇప్పటిదాకా స్పందించలేదు.యశ్వంత్ వర్మ గతంలో అలహాబాద్ హైకోర్టులో విధులు నిర్వహించారు. 2021లో ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.తొలగింపు ఎలాగంటే..అవినీతి, అవకతవకలకు పాల్పడే న్యాయమూర్తుల విషయంలో చర్యల కోసం 1999లో సుప్రీం కోర్టు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం.. తొలుత భార త ప్రధాన న్యాయమూర్తి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు న్యాయమూర్తి నుంచి వివరణ కోరాల్సి ఉంటుంది. ఆ వివరణతో సంతృప్తి చెందితే ఫర్వాలేదు. అలాకాని పక్షంలో ఒక కమిటీ వేసి అంతర్గత దర్యాప్తునకు సీజేఐ ఆదేశించొచ్చు. ఈ కమిటీలో ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ఇద్దరు హైకోర్టు జడ్జిలు ఉంటారు.ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా.. సదరు న్యాయమూర్తిని రాజీనామా చేయమని చీఫ్ జస్టిస్ కోరవచ్చు. అప్పుడు ఆ జడ్జి రాజీనామా చేస్తే ఫర్వాలేదు. ఒకవేళ చేయని పక్షంలో.. ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం సదరు జడ్జిని తొలగించే అధికారం పార్లమెంట్‌కు ఉంది. -
పార్లమెంట్లో టీ–షర్టుల రగడ
న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై విపక్ష సభ్యులు గొంతెత్తారు. గురువారం లోక్‌సభలో తీవ్ర అలజడి సృష్టించారు. ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రయత్నించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించబోమని హెచ్చరించారు. తమిళనాడుకు చెందిన డీఎంకే సభ్యులు సభలో టీ–షర్టులు ధరించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.నియోజకవర్గాల పునర్విభజనపై చర్చకు అనుమతి ఇవ్వాలని విపక్ష సభ్యులు కోరగా, స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. ప్రస్తుతానికి ఆ అంశం ప్రభుత్వ పరిశీలనలో లేదని, దానిపై ఇప్పుడు చర్చ అక్కర్లేదని తేల్చిచెప్పారు. నినాదాలు రాసి ఉన్న టీ–షర్టులు ధరించి సభకు వచ్చిన డీఎంకే ఎంపీలపై ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. నిబంధనలు అతిక్రమించడం ఏమిటని మండిపడ్డారు. ఎవరైనా సరే సభా సంప్రదాయాలు పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. సభ గౌరవాన్ని కాపాడాలని అన్నారు.బయటకు వెళ్లి దుస్తులు మార్చుకొని రావాలని డీఎంకే సభ్యులకు సూచించారు. ఎంపీలకు గౌరవప్రదమైన వేషధారణ అవసరమని హితవు పలికారు. మధ్యా హ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. విపక్ష ఎంపీలు నినాదాలు కొనసాగించారు. సభ సజా వుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణ ప్రసాద్ పదేపదే కోరినా విపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో సభను శుక్రవారానికి కృష్ణ ప్రసాద్ వాయిదా వేశారు.రాజ్యసభలోనూ అదే తీరు పార్లమెంట్ ఎగువ సభలోనూ టీ–షర్టుల రభస చోటుచేసుకుంది. డీఎంకే ఎంపీలు నినాదాలు రాసిన టీ–షర్టులు ధరించి సభకు వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ‘‘పునర్విభజన–తమిళనాడు పోరాటం సాగిస్తుంది. కచ్చితంగా విజయం సాధిస్తుంది’’ అని ఆ టీ–షర్టులపై రాసి ఉంది. ‘అనాగరికులు’ అంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను డీఎంకే ఎంపీలు తప్పుపట్టారు. తమ టీ–షర్టులపై ‘అన్సివిలైజ్డ్’ అని రాసుకున్నారు. నినాదాలు ఆపేసి సభా కార్యకలాపాలకు సహకరించాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పలుమార్లు కోరినా, డీఎంకే ఎంపీలు వెనక్కి తగ్గలేదు.దాంతో సభ పలుమార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం పునఃప్రారంభమైన తర్వాత కూడా సభ అదుపులోకి రాకపోవడంతో చైర్మన్ మరుసటి రోజుకి వాయిదా వేశారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో సభ నిష్ప్రయోజనంగా మారడం ఇదే మొదటిసారి. అంతకుముందు వివిధ పార్టీల సభా నాయకులతో చైర్మన్ ధన్‌ఖడ్ తన చాంబర్లో భేటీ అయ్యారు.సభలో టీ–షర్టులు ధరించకూడదని డీఎంకే సభ్యులకు సూచించారు. అలాంటి దుస్తులతో పార్లమెంట్‌కు రావడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టంచేశారు. అయితే, సభలో టీ–షర్టులు కచ్చితంగా ధరిస్తామని, నిరసన తెలియజేస్తామని డీఎంకే ఎంపీలు బదులిచ్చారు. సభ నుంచి సస్పెండ్ చేసినా తమకు అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ నెత్తుటిధార
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/బీజాపూర్/కాంకేర్/న్యూఢిల్లీ: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వారికి కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్ మరోసారి రక్తమోడింది. బస్తర్ అడవుల్లో నెల రోజులుగా నిశ్శబ్ద వాతావరణం ఉండగా గురువారం ఒక్కసారిగా తుపాకులు గర్జించాయి. బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో కనీసం 30 మంది మావోయిస్టులు మరణించారు. దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులోని బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పశ్చిమ బస్తర్ డివిజన్‌కు చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో డీఆర్జీ, టాస్‌్కఫోర్స్, సీఆర్పీఎఫ్కు చెందిన సుమారు 700 మంది భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఉదయం 7 గంటల సమయంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. కాల్పుల అనంతరం ఘటనాస్థలిలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా మధ్యాహ్నం సమయానికి 18 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించగా, సాయంత్రం 6 గంటల సమయానికి ఈ సంఖ్య 26కు చేరింది. ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున ఏకే 47, ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలను స్వా«దీనం చేసుకున్నట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ ప్రకటించారు. మావోయిస్టుల కాల్పుల్లో ఒక జవాను వీరమరణం పొందినట్లు వెల్లడించారు. మావోల మృతదేహాలను జిల్లా కేంద్రమైన బీజాపూర్‌కు తరలించారు. కాంకేర్–నారాయణపూర్ మధ్య.. మరో ఘటనలో కాంకేర్–నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉత్తర బస్తర్–మాడ్ డివిజన్ కమిటీ సమావేశమైందనే సమాచారంతో రెండు జిల్లాల భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఉదయం 8 గంటల సమయంలో మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు కాంకేర్ ఎస్పీ ఇందిరా కల్యాణ్ ప్రకటించారు. భారీగా ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ మృతులను నారాయణ్‌పూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ రెండు చోట్లా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, నారాయణపూర్ జిల్లాలో తుల్తులీ వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. టీసీఓఏను దాటుకుని.. ఛత్తీస్‌గఢ్‌లో గతేడాది చివరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు భద్రతా దళాలు ఉధృతంగా దాడులు చేశాయి. ఈ దాడుల్లో జనవరిలో 50 మంది, ఫిబ్రవరిలో 40 మంది మావోయిస్టులు చనిపోయారు. అయితే మార్చిలో వేసవి రావడంతో ట్యాక్టికల్ కౌంటర్ ఆఫెన్సివ్ క్యాంపెయిన్ (వ్యూహాత్మక ఎదురుదాడులు, టీసీఓఏ) పేరుతో మావోలు ఎదురుదాడికి సిద్ధమయ్యారు. దీంతో గత నెల రోజులుగా నెమ్మదించిన భద్రతా దళాలు గురువారం దూకుడు కనబరిచాయి. దీంతో రెండు ఎన్కౌంటర్లలో 30 మంది మావోలు చనిపోయారు. మొత్తంగా ఈ ఏడాదిలో 120 మంది మావోయిస్టులు చనిపోవడం గమనార్హం. ఏడాదిలోగా మావోయిస్టురహిత భారత్: అమిత్ షా ‘నక్సల్ ముక్త్ భారత్ అభియాన్’ దిశగా భద్రతా బలగాలు మరో గొప్ప విజయం సాధించాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తంచేశారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారని గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నిషేధిత సీపీఐ(మావోయిస్టు) సభ్యులపై మోదీ ప్రభుత్వం అత్యంత కఠిన వైఖరి అవలంబిస్తోందని స్పష్టంచేశారు. లొంగిపోతే అన్ని రకాల వసతులు కల్పిస్తామని హామీ ఇస్తున్నా.. కొందరు లెక్కచేయడం లేదన్నారు. అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, తగిన చర్యలు కచ్చితంగా ఉంటాయని హెచ్చరించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి భారత్.. మావోయిస్టురహిత దేశంగా మారడం తథ్యమని అమిత్ షా పునరుద్ఘాటించారు. మరో ఏడాదిలోగా మావోయిస్టులను పూర్తిగా అంతం చేయబోతున్నట్లు సంకేతాలిచ్చారు. మోదీ పాలనలో మావోయిస్టులకు చావుదెబ్బ 2025లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 104 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మరో 164 మంది లొంగిపోయారని పేర్కొంది. 2024లో 290 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించగా, 1,090 మంది అరెస్టయ్యారని, 881 మంది లొంగిపోయారని తెలిపింది. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల వ్యవధిలో 16,463 మావోయిస్టు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, మోదీ సర్కారు వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 దాకా వీటి సంఖ్య 53 శాతం తగ్గిపోయిందని, పదేళ్లలో కేవలం 7,744 హింసాత్మక ఘటనలు జరిగాయని హోంశాఖ స్పష్టంచేసింది. అదే సమయంలో మావోయిస్టుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది సంఖ్య 1,851 నుంచి 509కు పడిపోయినట్లు తెలిపింది. సాధారణ పౌరుల మరణాల సంఖ్య 4,766 నుంచి 1,495కు తగ్గిపోయినట్లు పేర్కొంది. 2004–14తో పోలిస్తే 2014–24లో భద్రతా సిబ్బంది మరణాలు 73 శాతం, పౌరుల మరణాలు 70 శాతం పడిపోయాయని ఉద్ఘాటించింది. 2014లో దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 126 ఉండగా, 2024లో కేవలం 12 మాత్రమే ఉన్నాయని ప్రకటించింది. మావోయిస్టుల నియంత్రణ కోసం గత ఐదేళ్లలో కొత్తగా 302 సెక్యూరిటీ క్యాంప్‌లు, 68 నైట్ ల్యాండింగ్ హెలిప్యాడ్లు ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ వివరించింది. మృతుల్లో అగ్రనేతలు?బీజాపూర్, కాంకేర్ ఎన్కౌంటర్లలో కేంద్ర కమిటీ సభ్యులతోపాటు డివిజన్ కమిటీ మెంబర్లు మరణించి ఉండొచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. బడా నేతలతోపాటు ఈ రెండు కమిటీలకు రక్షణ కల్పించే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ–2, పీఎల్‌జే–5)కి చెందిన ప్లాటూన్ దళ సభ్యులు కూడా మృతుల్లో ఎక్కువ మంది ఉండే అవకాశముందని తెలుస్తోంది. -
Amit Shah : నక్సల్స్‌కు అమిత్‌షా వార్నింగ్
ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నక్సల్స్‌కు హెచ్చరికలు జారీ చేశారు. లొంగిపోయేందుకు మావోయిస్ట్‌లకు కేంద్రం అవకాశం ఇస్తుంది. కాదు కూడదు అంటే వారి పట్ల కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. వచ్చేడాది మార్చి నెల లోపు నక్సలిజాన్ని అంతచేస్తామని పునరుద్ఘాటించారు.గురువారం, ఛత్తీస్ ఘడ్ దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 22మంది (అమిత్‌షా ట్విట్ చేసే సమయానికి)మావోయిస్టులు మృతి చెందారు.ఈ ఎన్‌కౌంటర్‌పై అమిత్‌షా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నక్సల్ భారత్ ముక్త్ అభియాన్’ భారత సైనికులు మరో విజయం సాధించారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బిజాపుర్,కంఖేర్ రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన కూంబింగ్‌లో 22మంది నక్సల్స్ మరణించారు. కేంద్రం నక్సల్స్ లొంగిపోయేందుకు అవకాశం ఇస్తుంది. కాదు కూడదు అంటే.. వారిపట్ల కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందని హెచ్చరించారు. వచ్చే ఏడాది మార్చి లోపు నక్సల్స్ రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ‘नक्सलमुक्त भारत अभियान’ की दिशा में आज हमारे जवानों ने एक और बड़ी सफलता हासिल की है। छत्तीसगढ़ के बीजापुर और कांकेर में हमारे सुरक्षा बलों के 2 अलग-अलग ऑपरेशन्स में 22 नक्सली मारे गए।मोदी सरकार नक्सलियों के विरुद्ध रुथलेस अप्रोच से आगे बढ़ रही है और समर्पण से लेकर समावेशन की…— Amit Shah (@AmitShah) March 20, 2025 -
‘కోర్టులోనే తేల్చుకుంటా’.. దిశ కేసుపై ఆదిత్య ఠాక్రే!
ముంబై: ఐదేళ్ల క్రితం చనిపోయిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశ సాలియన్ కేసులో ఊహించని మలుపు తిరిగింది. దిశ సాలియన్ ముంబైలోని ఓ భవనం నుంచి పడిపోవడంతో మరణించారు. పోలీసులు ప్రమాదవశాత్తూ సంభవించిన మరణంగా అప్పట్లో కేసు నమోదు చేశారు. తాజాగా శివసేన యూబీటీ ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, ఇతరులపై కేసు నమోదు చేయాలని దిశ తండ్రి సతీశ్ సాలియన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెది ప్రమాదవ శాత్తూ జరిగిన మరణం కాదని, ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి, హతమార్చారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఆదిత్య ఠాక్రే స్పందించారు. న్యాయ స్థానంలోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే దిశ సాలియన్ జూన్8,2020 ముంబైలోని మలాద్ అనే ప్రాంతానికి చెందిన అపార్ట్మెంట్ 14వ ఫ్లోర్ నుంచి కిందపడి చనిపోయారు. విచారణ చేపట్టిన పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్‌లో(ఏడీఆర్)ప్రమాదవశాత్తూ మరణించినట్లు కేసు నమోదు చేశారు. సరిగ్గా ఆ ఘటన జరిగిన ఆరురోజుల తర్వాత బాంద్రాలోని తన ఫ్లాట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాదాస్పద స్థితిలో మరణించారు.దిశ సాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు దిశ సాలియన్, సుశాంత్ సింగ్ రోజుల వ్యవధిలో ఇద్దరూ అనుమానాస్పదంగా మరణించడంపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రమాదవశాత్తూ పడి చనిపోయినట్లు తేల్చారు. పోలీసుల దర్యాప్తుపై దిశ తండ్రి సైతం సంతృప్తిని వ్యక్తం చేశారు. తమ కుమార్తె మరణంలో ఎలాంటి అనుమానం లేదని, కేసు దర్యాప్తుపై పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అనూహ్యంగా ఐదేళ్ల తర్వాత దిశ సాలియన్ కేసు ఊహించని మలుపు తిరిగింది. గురువారం దిశ తండ్రి సతీష్ సాలియన్ సంచలన ఆరోపణలు చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కింద పడితో ఒక్క దెబ్బకూడా తగల్లేదంట ఆ పిటిషన్లో జూన్ 8,2020లో దిశ తన ఇంట్లో పార్టీని ఏర్పాటు చేసిందని,ఆ పార్టీకి శివసేన యూబీటీ ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, అతని బాడీ గార్డ్లు, నటులు సూరజ్ పంచోలి,డినో మోరియాలు పాల్గొన్నారని తెలిపారు. పార్టీలో తన కుమార్తె సామూహిక అత్యాచారానికి గురైందని, బలవంతంగా, క్రూరంగా లైంగిక వేధింపులకు గురైంది’ అని ఆమె తండ్రి పిటిషన్లో పేర్కొన్నారు. అదే సమయంలో పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కిందపడి దిశ చనిపోయిందని చెబుతున్నప్పటికీ ఆమె శరీరంలో ఒక్క ఫ్రాక్చర్ కూడా లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఘటనా స్థలంలో రక్తం లేదని అన్నారు. అటాప్సీ రిపోర్ట్‌పై అనుమానం కేసులో నిందితుల్ని రక్షించేందుకు రాజకీయ పలుకుబడితో దిశ అటాప్సీ రిపోర్ట్‌ను సైతం మార్చారని తెలిపారు. అందుకు ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాలే నిదర్శనమన్నారు. నిందితుల్ని కేసు నుంచి భయటపడేసేందుకు రాజకీయ పలుకుబడితో పోలీస్ శాఖ దిశ ప్రమాదవశాత్తూ మరణించారని బలం చేకూరేలా అటాప్సీ రిపోర్ట్‌ను మార్చారని పిటీషన్లో వెల్లడించారు.అంతేకాదు, ఫోరెన్సిక్ సాక్ష్యాలు నాశనం చేయడం, సీసీటీవీ ఫుటేజీలను మార్చడం, పోస్టుమార్టం రిపోర్ట్‌పై ఎలాంటి అనాలసిస్ చేయకుండా హడావిడిగా దహన సంస్కారాలు చేశారని, పొలిటికల్ లీడర్ల ప్రోద్బలంతో పోలీసులు కేసును నీరు గార్చారని చెప్పారు.పిటిషన్లో సుశాంత్ గురించి ప్రస్తావిస్తూదిశ సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో నటుడు సుంశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని ప్రస్తావించారు. మరణించిన రోజే సుశాంత్ సింగ్ భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించారు.కానీ తన కుమార్తె డెడ్ బాడీని 50 గంటలు, అంతకంటే ఎక్కువ సమయం తీసుకుని పోస్టు మార్టం నిర్వహించారు. పోస్టు మార్టం ఆలస్యం వెనక లైంగిక దాడి సాక్ష్యాల్ని ధ్వంసం చేయడం, ప్రధాన నిందితుడు ఆదిత్యా ఠాక్రేను రక్షించే ప్రయత్నం చేసినట్లు మరిన్ని ఆరోపణలు చేశారు. సీబీఐకి అప్పగించాలి కాబట్టి, తన కుమార్తె దిశా మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్వాధీనం చేసుకుని సమగ్ర దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. అందుకు, 2023లో మానవ హక్కుల సంఘం నేత, సుప్రీం కోర్టు,హై కోర్టు లిటిగెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రషీద్ ఖాన్ పఠాన్ దాఖలు చేసిన మునుపటి పిటిషన్‌తో తాను దాఖలు చేసిన ఈ కొత్త పిటిషన్‌ను అనుసంధానించాలని అభ్యర్థించారు. దిశ మరణంపై ముంబై పోలీసు చీఫ్‌కి రషీద్ ఖాన్ పఠాన్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో దిశా మరణంలో నిందితులుగా ఉన్న వ్యక్తిలపై హత్యానేరం కింద అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. ఆ ఫిర్యాదును సైతం పరిగణలోకి తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. 2023లో మహారాష్ట్ర ప్రభుత్వం దిశ మరణంపై ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT)ఏర్పాటు చేసింది. కానీ సిట్ దర్యాప్తు అధికారులు దిశ సాయిలిన్ రిపోర్టు ఇంకా సమర్పించలేదు.అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధందిశ సాలియన్ తంత్రి సతీష్ సాలియన్ తన కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఐదేళ్ల తర్వాత 228 పేజీల పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం దిశ మరణిస్తే.. ఇప్పుడే పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించారు. మొఘలు చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న వివాదం మహారాష్ట్రను కుదిపేస్తున్నది. సమాధిని తొలగించాలంటూ నాగ్‌పూర్‌లో కొందరు చేపట్టిన నిరసన హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. ఆ వివాదం నుంచి భయటపడేందుకే దిశసాలియన్ కేసును తెరపైకి తెచ్చారని మాట్లాడారు. శివసేన ఎమ్మెల్యే ఆదిత్యా ఠాక్రే సైతం స్పందించారు. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రయత్నిస్తున్నారని, న్యాయస్థానంలో ఈ అంశంపై స్పందిస్తామని అన్నారు. మహారాష్ట్ర మంత్రి సంజయ్ శిర్సాట్ దిశ కేసులో నిందితులకు కఠిన శిక్ష విధించాని అన్నారు. తన కుమార్త మరణాన్ని తట్టుకోలేక దిశ తండ్రి బహిరంగంగా ముందుకు వచ్చి పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. -
భారత ప్రభుత్వంపై X దావా.. స్పందించిన కేంద్రం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫారమ్ ఎక్స్(X Plat Form) భారత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలకు దిగింది. చట్టాలకు విరుద్ధంగా తమ కంటెంట్‌ను నియంత్రించాలని చూస్తోందని, ఏకపక్షంగా సెన్షార్‌షిఫ్‌నకు పాల్పడుతోందని.. ఇది యూజర్ల స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని కోర్టుకెక్కింది. అయితే ఈ పరిణామంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది.ఈ వ్యవహారంలో ప్రభుత్వం తగిన రీతిలో స్పందిస్తుంది.. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ తప్పనిసరిగా చట్టాన్ని గౌరవించాల్సిందే అని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం(Indian Government)పై కర్ణాటక హైకోర్టులో ఎక్స్(పూర్వపు ట్విట్టర్) రిట్ పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఎం నాగప్రసన్న బెంచ్ ఈ పిటిషన్‌ను విచారణ జరుపుతోంది.ఐటీ యాక్ట్-2000 సెక్షన్ 79(3)(b) ప్రకారం.. కేంద్రం సేఫ్ హార్బర్ (Safe Harbor Provision) అనే నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ప్రభుత్వం కోరిన సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లు తప్పనిసరిగా బ్లాక్ చేయడమో లేదంటే తొలగించడమో చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ న్యాయపరమైన రక్షణ కోల్పోతుంది. అయితే.. ఈ సెక్షన్‌ను సవాల్ చేస్తూ ‘ఎక్స్’ కర్ణాటక ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.భారతదేశంలో సరైన చట్టపరమైన విధానాలతో కాకుండా.. ఆన్లైన్లో కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి చట్టవిరుద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని X ఆ రిట్ పిటిషన్లో ఆరోపించింది. కంటెంట్‌ను బ్లాక్ చేసే అంశంపై ఐటీ యాక్ట్‌లోని 69(A) సెక్షన్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని, అది ఏయే సందర్భాల్లో అనే అంశంపైనా శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు(2015లో)ను సైతం ఎక్స్ గుర్తు చేసింది. అయితే.. 69(A) సెక్షన్ కింద కాకుండా.. స్పష్టమైన నిబంధనలు లేని సెక్షన్ 79(3)(b)తో కంటెంట్‌ను నియంత్రించాలని ప్రభుత్వం చూస్తోందని.. ఈ సెక్షన్ ద్వారా కంటెంట్ బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని ఎక్స్ అంటోంది. సాక్ష్యాలుగా 2024 ఫిబ్రవరిలో రైల్వే శాఖ పంపిన ‘బ్లాకింగ్ ఆదేశాలను’ కోర్టుకు చూపించింది. ఇది తమ వ్యాపార లావాదేవీలను దెబ్బ తీయడమే అవుతుందన్న ఎక్స్.. పైగా ఇలాంటి చర్యలు యూజర్ల స్వేచ్ఛను హరించడం అవుతుందని వాదించింది. అంతేకాదు.. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నడిపించే సహయోగ్ పోర్ట్‌లో తమను చేరాలంటూ ప్రభుత్వం బలవంత పెడుతోందని ఆరోపించింది. అయితే.. తాము 2021 భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఐటీ మార్గదర్శకాలను పాటిస్తున్నామన్న ఎక్స్.. ఇప్పటివరకైతే ప్రభుత్వం తమపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపింది. శ్రేయా సింఘాల్ కేసులో..సోషల్‌మీడియా వేదికల్లో చట్టవిరుద్ధ, ప్రమాదకర కంటెంట్‌ను పోస్ట్ చేసిన వారిని సెక్షన్ 66ఏ కింద అరెస్టు చేసేందుకు వీలుండేది. ఈ సెక్షన్ ప్రకారం.. నిందితులకు మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించొచ్చు. అయితే పలు రాష్ట్రాల్లో ఈ సెక్షన్‌ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. 2015లో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ విచారణ సందర్భంగా సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
రాజ్యసభ సాక్షిగా మళ్లీ దొరికేసిన చంద్రబాబు
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ సాక్షిగా చంద్రబాబుది దుష్ప్రచారమని తేట తెల్లమైంది. విశాఖపట్నంలో దొరికింది డ్రగ్స్ కాదని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖపట్నంలో సీబీఐ 25 వేల కిలోల డ్రైడ్ ఈస్ట్‌ను సీజ్ చేసిందని పేర్కొంది. అయితే అందులో నార్కోటిక్స్ లాంటి మత్తు పదార్థాలు లేవని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ నిర్ధారించిందని తెలిపింది. ఈ విషయాన్ని సంబంధిత కోర్టులో ఫైల్ చేశామని.. ఆ కేసు సెప్టెంబర్ 21, 2024లో క్లోజ్ అయిందని రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు.సంధ్యా ఆక్వా ప్రతినిధులు బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ ఆర్డర్ పెట్టగా, మార్చి 16న విశాఖ పోర్టుకు ఎస్‌ఈకేయూ4375380 కంటెయినర్లో వెయ్యి బ్యాగుల సరుకు వచ్చింది. ఇంటర్‌పోల్ సమాచారంతో ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు అందులో తనిఖీ చేశారు. మార్చి 19న గుజరాత్ ల్యాబ్ నుంచి వచ్చిన నిపుణులు 49 నమూనాలు సేకరించి, 27 నమూనాల్లో డ్రగ్స్ అవశేషాలు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ, జడ్జి ఆధ్వర్యంలో మరో 100 నమూనాలు సేకరించింది. ఆ నమూనాలను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తీసుకెళ్లారు. 8 నెలల తర్వాత నివేదిక వచ్చింది. -
మస్క్ గ్రోక్‌పై భారత ప్రభుత్వం సీరియస్!
న్యూఢిల్లీ: ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడితే.. ప్రతిచర్య తీవ్రంగానే ఉంటుంది. మనిషికే కాదు.. మనిషి తెచ్చిన సాంకేతికతకూ అందుకు మినహాయింపు లేకుండా పోయింది. తాజాగా.. ఇలాన్ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బోట్ గ్రోక్(Grok) వ్యవహారం ఇప్పుడు ఇలాగే మారింది. ఎక్స్ నుంచి సోషల్ మీడియాలో అటు ఇటు తిగిరి.. చివరకు ప్రభుత్వం దృష్టికి చేరింది. అన్‌ఫిల్టర్ భాష.. సెన్సార్‌లేని పదజాలంతో గ్రోక్ యూజర్లకు సమాచారం అందిస్తుండడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో స్క్రూటినీ(పరిశీలన)కి దిగింది. రెచ్చగొట్టే తరహా సమాచారాన్ని గ్రోక్ యూజర్లకు ఎందుకు అందిస్తోందంటూ ఎక్స్‌ను తాజాగా కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆరా తీసింది. మరీ ముఖ్యంగా హిందీ భాషను అలా దుర్వినియోగపర్చడంపై ఆరా తీసింది. అయితే.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, తమ వివరణకు కొంత సమయం ఇవ్వాలని అవతలి నుంచి సమాధానం వచ్చినట్లు సమాచారం. ఆ వివరణ ఆధారంగా.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని హెచ్చరించి సరిపెట్టడమా? లేదంటే చర్యలు తీసుకోవడమా? ఉంటుందని మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇలాన్ మస్క్(Elon Musk)కు చెందిన ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ గ్రోక్ చాట్‌బాట్ సేవల్ని అందిస్తోంది. అయితే భారతీయ కొందరు యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ హిందీ యాసలో సమాధానాలు ఇస్తోంది. అలాగే కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుండడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. చాట్‌జీపీటీ సహా చాలావరకు ఏఐ చాట్బాట్లు వివాదాస్పద అంశాల జోలికి పోవడం లేదు. అలాగే.. భాష విషయంలోనూ సెన్సార్డ్గా ఉంటున్నాయి. కానీ, గ్రోక్ అందుకు విరుద్ధంగా ఉండడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. Grok 3 Voice Mode, following repeated, interrupting requests to yell louder, lets out an inhuman 30-second scream, insults me, and hangs up pic.twitter.com/5GtdDtpKce— Riley Goodside (@goodside) February 24, 2025ఏఐ రీసెర్చర్ రిలే గూడ్సైడ్(Riley Goodside)కు గ్రోక్తో ఎదురైన చేదు అనుభవం ఆ మధ్య వైరల్ అయ్యింది. పదే పదే ఆయన గ్రోక్‌ను వాయిస్ మోడ్‌లో ప్రశ్నలతో విసిగించారు. దీంతో అది ఓపిక నశించి.. మనిషి తరహాలోనే అరుస్తూ ఆయన్ని బూతులు తిట్టి.. ఆ సంభాషణను అక్కడితోనే ముగించింది. -
వచ్చే నెలలోనే కొత్త సారథి..!
సాక్షి, న్యూఢిల్లీ: కాషాయ దళానికి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ వచ్చే నెలలో కొలిక్కి రానుంది. పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే ఖరారు చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి చివరికే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావించినా వివిధ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో వచ్చే నెల రెండో వారంలోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రాంతం, అనుభవం, విధేయతల అనుగుణంగా పలువురు సీనియర్ నేతల పేర్లపై చర్చ జరుగుతుండగా, దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భిన్న ప్రాతిపదికలు.. జాతీయ అధ్యక్షుడి ఎంపికలో ప్రధానంగా నాలుగు అంశాల ప్రాతిపదికన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రాంతం, విధేయత, అనుభవంతో పాటు కొత్తగా మహిళను నియమించే అంశం తెరపైకి వచి్చంది. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే, దక్షిణాది రాష్ట్రాలకు ఈసారి అవకాశం ఇవ్వాలన్న చర్చ జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి అధ్యక్షుడి రేసులో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. 45 ఏళ్లుగా పార్టీలో ఉన్న అనుభవం, యువమోర్చా నుంచి పార్టీలో పనిచేసిన అనుభవం ఆయనకు అనుకూలంగా మారుతోంది. దక్షిణాది నుంచి గతంలో బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తి, వెంకయ్య నాయుడు అధ్యక్షులుగా సేవలందించారు. ఇప్పటివరకు పార్టీ మహిళా అధ్యక్షురాలు లేనందున ఈసారి మహిళా అధ్యక్ష కోణంలోనూ చర్చ జరుగుతోంది. ఇందులో తమిళనాడుకు చెందిన కీలక నేత వనతి శ్రీనివాసన్ పేరు ముందు వరుసలో ఉంది. వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు మహిళల మద్దతు కూడగట్టేందుకు ఈమె ఎంపిక కలిసొస్తుందన్నది పార్టీ అంచనా. బీజేపీ ప్రభుత్వం ఇటీవలే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళను ఎంపిక చేసింది. అదే వరుసలో మహిళను జాతీయ అధ్యక్షురాలిగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. విధేయత, పార్టీలో పనిచేసిన అనుభవం ఆధారంగా చూస్తే భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు సన్నిహితులు. పైగా యూపీ, మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. వ్యూహాలు రచించడంలో దిట్టలైన వీరిద్దరిలో ఒకరి ఎంపిక జరిగితే అది కచ్చితంగా మోదీ, షాల సూచన మేరకే జరిగిందనే చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆర్ఎస్ఎస్ మద్దతున్న నేతలుగా మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత ముఖ్యమంత్రులైన మనోహర్‌లాల్ ఖట్టర్, శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరికి ఆర్ఎస్ఎస్ నుంచి పూర్తిగా మద్దతున్నా, కేంద్రంలో వీరికున్న ప్రాధాన్యం దృష్ట్యా అధ్యక్ష ఎంపికలో వీరిని పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? తేలాల్సి ఉంది. -
బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్యం, వ్యవసాయం, విద్యారంగాల్లో సాంకేతికత వినియోగంపై ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ కలిసి పనిచేసేలా ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ ఢిల్లీలో బుధవారం ఎంఓయూపై సంతకాలు చేశారు. బిల్‌గేట్స్‌ను కేంద్ర సహాయ మంత్రులు చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులతో కలిసి సీఎం భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య సుమారు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చలు జరిగాయి. భేటీ అనంతరం చంద్రబాబు ఈ విషయాన్ని ‘ఎక్స్ ద్వారా తెలిపారు. ‘ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై చర్చించాం. స్వర్ణాంధ్రప్రదేశ్–2047 దార్శనికతను సాకారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. గేట్స్ ఫౌండేషన్‌తో ఈ భాగస్వామ్యం మన ప్రజలను శక్తిమంతం చేయడంలో, లక్ష్యాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నా. ఏపీ పురోగతికి బిల్‌గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పోస్టు చేశారు. దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తాం: బిల్గేట్స్ఏపీ ప్రభుత్వంతో ఒప్పందంపై బిల్‌గేట్స్ హర్షం వ్యక్తం చేసినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘తక్కువ ఖర్చుతో కూడిన డయాగ్నొస్టిక్స్, వైద్య పరికరాలను స్థానికంగా తయారు చేయడం ద్వారా పేదల బతుకుల్లో కొత్త వెలుగులు నింపే సామర్థ్యం మన భాగస్వామ్యానికి ఉందన్న సంగతి నన్ను ఎంతో ఉత్సాహపరుస్తుంది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ప్రాథమిక విద్యా రంగాల్లో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ఏఐ టెక్నాలజీతో మనం పరిష్కరించవచ్చు. ఆయా రంగాల్లో మనం సాధించే విజయాలు మొత్తం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తాయనడంలో సందేహం లేదు’ అని బిల్‌గేట్స్ పేర్కొన్నట్టు తెలిపింది.నేను నిద్రపోను..మిమ్మల్ని పోనివ్వను కూటమి ఎంపీలకు సీఎం చంద్రబాబు క్లాస్ సాక్షి, న్యూఢిల్లీ: ‘ఎంపీలుగా గెలిచి ఏడు నెలలు గడిచింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మీరేం చేస్తున్నారు. ఏయే మంత్రులను, ఏ అధికారులను కలిశారో చెప్పండి. పనిలో మీరు వహించిన నిర్లక్ష్యానికి ఫుల్స్టాప్ పెట్టండి. మీ పనితీరు మార్చుకోండి’ అంటూ సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలకు క్లాస్ పీకారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళతానంటే కుదరదంటూ హెచ్చరించారు. ఢిల్లీ వచ్చిన సీఎం చంద్రబాబు.. మంగళవారం రాత్రి కూటమి ఎంపీలతో సమావేశమయ్యారు. ఒక్కో ఎంపీ పనితీరుపై చంద్రబాబు ప్రశ్నించారు. కేవలం పార్లమెంట్‌కు వెళ్లి హాజరు వేయించుకుంటే సరిపోదని, పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన బాధ్యత ఉందని హెచ్చరించారు. పనితీరుపై అసంతృప్తి.. కేవలం ఇద్దరు ఎంపీల పనితీరుపై మాత్రమే చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేంద్ర మంత్రులను కలవడం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు ఇవ్వాలని కోరినట్టు ఆ ఇద్దరు ఎంపీలు సీఎం దృష్టికి తెచ్చారు. ‘మీ ఇద్దరి సంగతి సరే. మిగతా వాళ్లు ఎందుకు సరిగా పనిచేయడం లేదు. బీజేపీ, జనసేన, టీడీపీ ఎంపీలు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి కదా? మరి మిగతా వారు ఎందుకు ఈ చొరవ చూపడం లేదు. మీరు సాధించింది ఏంటి? రాష్ట్రానికి సంబంధించిన నిధులు, అభివృద్ధిపై మీరు ఎందుకు పనిచేయడం లేదు. ఎవరైనా నాకు ఒకటే. నిరంతరం కష్టపడి పనిచేయాల్సిందే. పదేపదే కేంద్ర మంత్రులను కలవాల్సిందే. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిందే. ఇకపై నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అంటూ ఎంపీలపై అసహనం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. -
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీం కోర్టులో కీలక పరిణామం
సాక్షి,ఢిల్లీ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతకు (MLAs Disqualification) సంబంధించిన కేసు కొనసాగుతున్న తరుణంలో సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాను పార్టీ ఫిరాయించలేదని,కాంగ్రెస్‌లో చేరలేదంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ అఫిడవిట్లో తాను ఇప్పటికీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచాక మర్యాదపూర్వకంగా తాను సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని స్పష్టం చేశారు. మీడియా వక్రీకరించిందని, తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ అంశంపై బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ పార్టీమీద గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై చివరి సారిగా (మార్చి 4,మంగళవారం) జరిగిన విచారణలో ఎమ్మెల్యేల అన్హత విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పార్టీ మారి నెలలు గడుస్తున్నా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాప్యం చేయడంపై తీవ్రంగా పరిగణించింది. విచారణలో ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెండ్ డెడ్’ ధోరణి సరైంది కాదని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ(మార్చి 25)లోగా వివరణ ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు, తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్ కార్యాలయం, తెలంగాణ శాసనసభ కార్యదర్శి, భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. విచారణను మార్చి 25కి వాయిదా వేసింది. -
Central Cabinet Meeting : యూపీఐ లావాదేవీలపై కేంద్రం గుడ్ న్యూస్!
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌లో యూపీఐ లావాదేవీలు 210 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో భాగంగా భీమ్-యూపీఐ లావాదేవీలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి రెండు వేల రూపాయల లోపు లావాదేవీలకు 0.15శాతం ఇన్సెంటివ్ అందించనుంది. దీంతో పాటు చిరు వ్యాపారుల్ని ప్రోత్సహించేందుకు రూ.1500 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. యూపీఐ లావాదేవీలు రూ. 210 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రూ. 2 వేలు కంటే తక్కువ విలువ కలిగిన లావాదేవీలకు ఎలాంటి ఛార్జీ లేవు. అయితే ప్రస్తుత యూపీఐ విధానంలో కస్టమర్ బ్యాంక్, ఫిన్‌టెక్ సంస్థ, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్, యాప్ సంస్థ ద్వారా 4 అంచెల్లో లావాదేవీలు పెరుగుతున్నాయి. తద్వారా లావాదేవీల్లో చార్జీలను భరించాల్సి వస్తోంది. రూ.1,500 కోట్లు ఇన్సెంటివ్ రూపంలో చిన్న లావాదేవీలకు ఛార్జీలు విధించడంలేదు’అని తెలిపారు. దీంతో పాటు పలు కీలక నిర్ణయ తీసుకుంది. వాటిల్లో అసోంలో బ్రౌన్‌ఫీల్డ్ అమ్మోనియా యూరియా ఫ్యాక్టరీకి ఆమోదంరూ.10,601 కోట్లతో అమ్మోనియా కాంప్లెక్స్ ఏర్పాటురూ.2,790 కోట్లతో దేశంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి పచ్చజెండాగోకుల్ మిషన్‌కు రూ.3,400 కోట్లు కేటాయింపురూ.4,500 కోట్లతో మహారాష్ట్రలో గ్రీన్‌ఫీల్డ్ హైవేకు ఆమోదం📡 𝐋𝐈𝐕𝐄 NOW 📡Cabinet Briefing by Union Minister @AshwiniVaishnaw📍National Media Centre, New DelhiWatch live on #PIB's📺▶️Facebook: https://t.co/ykJcYlNrjj▶️YouTube: https://t.co/mg8QxoZ6iC https://t.co/KR5nK7NkSN— PIB India (@PIB_India) March 19, 2025 -
మోదీ ఆహ్వానం.. భారత్‌కు సునీతా విలియమ్స్ రాక
ఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సునీతా విలియమ్స్ రాకపై భారత ప్రధాని మోదీ స్పందించారు. సునీత సాధించిన విజయాల పట్ల 140 కోట్ల పై చిలుకు భారతీయులు ఎంతగానో గర్విస్తున్నారని మోదీ అన్నారు. ఈ క్రమంలో సునీతా విలియమ్స్‌ను మోదీ భారత్‌కు ఆహ్వానించారు. ఈ మేరకు ఆమెకు రాసిన లేఖను ఢిల్లీలో తనను కలిసిన నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోకు అందించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ లేఖలో..‘మీరు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా మా అందరి హృదయాలకు ఎప్పుడూ అత్యంత సన్నిహితంగానే ఉంటారు. అతి త్వరలో మిమ్మల్ని భారత్‌లో చూసేందుకు ఆత్రుతగా ఉన్నాం. తిరిగి రాగానే భారత్‌కు రండి. అద్వితీయ విజయాలు సాధించిన మీవంటి ఆత్మియ పుత్రికకు ఆతిథ్యమిచ్చేందుకు దేశం ఎదురు చూస్తోంది. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుతున్నాను’ అంటూ సునీతకు లేఖ రాశారు. ఈ క్రమంలో మోదీ లేఖపై సునీతా విలియమ్స్ కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సందర్బంగా ఆమె సోదరి ఫాల్గుని పాండ్యా మీడియాతో మాట్లాడుతూ.. సునీతా విలియమ్స్ తిరిగి భూమికి చేరుకోవడం ఆనందంగా ఉంది. త్వరలో భారత్‌లో పర్యటిస్తారు. మేమందరం కలిసి టూర్‌కు వెళ్లాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. దానికి కొంచెం సమయం పడుతుంది. ఇదే సమయంలో సునీత మరోసారి అంతరిక్ష యాత్ర చేపడతారా? అని ప్రశ్నించగా.. అది ఆమె ఎంపిక అని చెప్పుకొచ్చారు. అనంతరం, మోదీకి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.#SunitaWilliams & #ButchWilmore's HomecomingWe are very excited for her to come back. Although we never felt we were far away from her because we were constantly in communication with her...: Falguni Pandya, Sunita Williams' cousin, speaks to @MadhavGK@TheNewsHour AGENDA pic.twitter.com/LKBN9iFuRY— TIMES NOW (@TimesNow) March 18, 2025 -
తెలంగాణ మార్గం చూపింది.. దేశమంతా జనగణన జరగాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన మరో వాగ్దానాన్ని నెరవేరుస్తూ బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఆమోదించిందని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. జనగణన విషయంలో తెలంగాణ.. దేశానికి ఓ మార్గం చూపిందని, ఈ జనగణన దేశమంతా జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ మంగళవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశా రు. ‘జనగణన ద్వారా మాత్రమే వెనుకబడిన వర్గాల హక్కులు సాధ్యమవుతా యని కాంగ్రెస్ పార్టీ మరోమారు స్పష్టం చేసింది. తెలంగాణ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఇప్పటి వరకు రిజర్వేషన్ల విషయంలో ఉన్న 50 శాతం పరిమితి తొలగింపునకు మార్గం సుగమమైంది. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభించనుంది’ అని రాహుల్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. మీకు అండగా ఉంటాం: ప్రియాంక ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చింది. 42% రిజర్వేషన్లతో బీసీ వర్గాలు మరింత అభివృద్ధి సాధిస్తారు. తెలంగాణ ప్రజలు, బీసీ వర్గాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది కేవలం రిజర్వేషన్ల కల్పన మాత్రమే కాదు. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం. మీరు మమ్మల్ని నమ్మినట్టుగానే, మేం మీకు అండగా ఉంటాం. జై తెలంగాణ, జైహింద్, జైకాంగ్రెస్’ అని ప్రియాంక ఫేస్బుక్లో పోస్టు చేశారు. కలలు సాకారమవుతున్నాయి: సీఎం రేవంత్ రాహుల్, ప్రియాంకాగాంధీలు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘గర్వించదగిన రోజు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం వాగ్దానాలను నెరవేర్చుతోంది. రాహుల్, ప్రియాంక నేతృత్వంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కలలను సాకారం చేస్తూ, ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ, ప్రతి గ్యారంటీని నిజం చేస్తూ ముందుకెళుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన విప్లవాత్మక నిర్ణయం. సామాజిక న్యాయ అమలులో తెలంగాణ దేశానికి మార్గదర్శనం చేయడం గర్వకారణం. ఆ ఇద్దరి ప్రేరణకు ధన్యవాదాలు’ అని రేవంత్‌రెడ్డి రీట్వీట్ చేశారు. -
‘ఉపాధి హామీ’ని ప్రభుత్వం నీరుగారుస్తోంది
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో తెచ్చిన ప్రతిష్టాత్మక మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ సర్కార్ నెమ్మదిగా నీరుగారుస్తోందని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ విమర్శించారు. మంగళవారం రాజ్యసభలో జీరోఅవర్‌లో ఉపాధిహామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులు, దేశవ్యాప్తంగా అమలుతీరును సోనియా ప్రస్తావించారు. ‘మా ప్రభుత్వం 2005లో తెచ్చిన ఉపాధి హామీ చట్టం లక్షలాది మంది గ్రామీణ పేదలకు భరోసాగా నిలిచింది.అయితే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని క్రమపద్ధతిలో నిర్వీర్యంచేయడం చాలా ఆందోళనకరం. ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపులు రూ.86,000 కోట్ల వద్దే స్తబ్ధుగా ఆగిపోయాయి. ఇది చాలా ఆందోళనకరం. ద్రవ్యోల్బణ సంబంధ సవరణల తర్వాత ఈ కేటాయింపుల్లో మరో రూ.4,000 కోట్లు తెగ్గోశారు. కేటాయించిన నిధుల్లో కేవలం 20 శాతం నిధులను మాత్రమే పాత బకాయిలు తీర్చేందుకు వినియోగించనున్నారు.ఇంత తక్కువ కేటాయింపులతో పాత బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు?’’అని కేంద్రాన్ని ఆమె నిలదీశారు. తప్పనిసరిగా ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్‌లను అమలుచేయడం మానుకోవాలని, వేతన చెల్లింపులలో నిరంతర జాప్యాలను మానుకోవాలని, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతన రేట్లు పెంచాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కనీస వేతనం రూ. 400కు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఉపాధి పథకాన్ని కార్యక్రమాన్ని కొనసాగించడానికి, విస్తరించడానికి నిధులను పెంచాలని ఆమె కోరారు. ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ మరియు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ వంటి తప్పనిసరి అవసరాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి కనీసం 150 రోజుల పని దొరికేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. లక్షలాది మంది గ్రామీణ పేదలకు గౌరవప్రదమైన ఉపాధి, ఆర్థిక భద్రతను అందించే కార్యక్రమం కోసం ఈ చర్యలు అవసరమని సోనియా సూచించారు. -
మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకొస్తాం
న్యూఢిల్లీ: మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రభు త్వం కట్టుబడి ఉందని, రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు అన్ని విధాలా సహకరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మణిపూర్ బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంత్రి రాజ్యసభలో మంగళవారం సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కారు మణిపూర్‌లో హింసను నిర్మూలించలేకపోయిందన్నారు. రాష్ట్రాన్ని ప్రధాని మోదీ సందర్శించకపోవడంపై ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు.గతంలో హింస జరిగినప్పుడూ ప్రధానులు మణిపూర్‌ను సందర్శించలేదన్నారు. 1993లో మణిపూర్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా నాగాలు, కుకీల మధ్య ఘర్షణల్లో 750 మంది మరణించారని, 350 గ్రామాలను తగులబెట్టారని, అయినా అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుగానీ, హోంమంత్రి శంకర్రావు చవాన్గానీ రాష్ట్రాన్ని సందర్శించలేదని చెప్పారు. మణిపూర్‌పై దృష్టి సాధించడం లేదని ప్రతిపక్షాల విమర్శలనూ ఆమె తిప్పికొట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా బందులు, దిగ్బంధాలతో రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి జనం అల్లాడినా ఏ మంత్రి రాష్ట్రానికి వెళ్లలేదని గుర్తు చేశారు. కానీ, అక్కడ సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించారని వెల్లడించారు.ప్రతిపక్షాల కంటే సున్నితంగానే ఆలోచిస్తున్నామని, దేశంలోని ప్రతిరాష్ట్రం గురించి శ్రద్ధ తీసుకుంటున్నామని వెల్లడించారు. మణిపూర్ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పూర్తి మద్దతునిస్తున్నామని తెలిపారు. శాంతి నెలకొల్పి తే ఆర్థికంగా మెరుగుపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో చెదరుమదురు ఘటనలు మినహా.. మరణాలు, అగ్ని ప్రమాదాలు, కాల్పుల సంఘటనలు, నిరసనల కేసులు తగ్గుముఖం పట్టాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.శాంతిభద్రతల పరిరక్షణకు 286 కంపెనీల సీఏపీఎఫ్, 137 కంపెనీల ఆర్మీ, అస్సాం రైఫిల్స్.. రాష్ట్ర పోలీసులతో కలిసి పని చేస్తున్నాయన్నారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వా«దీనం చేసుకుంటున్నారని, జాతీయ రహదారిపై స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మణిపూర్ బడ్జెట్ వివరాలను ఆమె సభకు వెల్లడించారు. ఒకరిపై ఒకరు వేలెత్తిచూపుతూ ఉంటే మణిపూర్‌కు ఎవరూ సాయం చేయరన్నారు. మేకిన్ ఇండియా మంచి ఫలితాలను ఇస్తోంది మేకిన్ ఇండియా పథకంపై ప్రతిపక్షాల విమర్శలను మంత్రి తోసిపుచ్చారు. మేకిన్ ఇండియా భారత రక్షణ రంగాన్ని నికర ఎగుమతిదారుగా మార్చిందని ఆమె చెప్పారు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, అవి మంచి ఫలితాలను ఇస్తున్నాయని సీతారామన్ తెలిపారు. తన వాదనను బలపరిచే డేటాను సభకు తెలియజేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు మంచి ఫలితాలను ఇచ్చాయని, ఇప్పటివరకూ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయని, 9.5 లక్షల మందికి ఉపాధినిచ్చాయని చెప్పారు. తృణమూల్ ఎంపీల వాకౌట్ మణిపూర్ బడ్జెట్‌పై చర్చలో భాగంగా మంత్రి ఇచ్చిన సమాధానంపై తృణమూల్ కాంగ్రెస్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ పార్టీ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడారు. మణిపూర్ బడ్జెట్‌పై మంత్రి ఇచ్చిన సమాధానం కంటితుడుపుగా ఉందని ఎంపీ సుస్మితాదేవ్ అన్నారు. 22 నెలలుగా మణిపూర్ కాలిపోతుంటే అల్లర్లను ఆపడానికి ప్రధాని, హోంమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. -
వేల కన్నీళ్లను మేం తుడవలేకపోవచ్చు, కానీ.. : సుప్రీం కోర్టు
‘‘ఏ సంస్థను మేం ఇక్కడ నిందించడం లేదు. అలాగే వాటి పని తీరును మేం తప్పుబట్టడం లేదు. దేశంలో వేల మంది కన్నీళ్లు పెడుతున్నారు. అంతమంది కన్నీళ్లను మేం తుడవలేకపోవచ్చు. కానీ, వాళ్ల సమస్యలను మేం ప్రస్తావిస్తాం. కచ్చితంగా సీబీఐ విచారణ జరిపిస్తాం. ఇది మాత్రం స్పష్టం’’ అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. న్యూఢిల్లీ: బ్యాంకులకు, బిల్డర్లు.. డెవలపర్లు మధ్య నలిగిపోతూ ఏళ్ల తరబడి సొంతింటి కల కోసం ఆశగా ఎదురు చూస్తున్న కొందరు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్లను ఒక్కటిగా విచారణ జరిపిన జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.. వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది. బిల్డర్లు, డెవలపర్లు తమ చేతికి ఇంటి తాళాలు ఇవ్వకపోయినా.. ఇంకోవైపు నుంచి బ్యాంకులు ఈఎంలు కట్టాలని వేధిస్తున్నాయని పలువురు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో హోంబయ్యర్లను లోన్లకు మాధ్యమంగా ఉపయోగించుకుంటున్నారని.. ఒకవేళ బయ్యర్లు గనుక అభ్యంతరాలు వ్యక్తం చేస్తే బ్యాంకులు వాళ్లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ తరుణంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కాలపరిమితితో కూడిన సీబీఐ దర్యాప్తునకు కచ్చితంగా ఆదేశిస్తామని తెలిపింది. అలాగే.. ఈ పనిని ఎలా చేపట్టాలనే దానిపై ఒక ప్రణాళికను దాఖలు చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థను కోరింది. ఈ క్రమంలో ఫైనాన్షియర్ల తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీపై జస్టిస్ సూర్యకాంత్ మండిపడ్డారు.బ్యాంకులు ఎలా పనిచేస్తాయో మాకు తెలుసు. సైట్లో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని మీకు తెలుసు. అయినా కూడా 60 శాతం పేమెంట్ చేసేశారు. సైట్లో ఏం జరుగుతోందో తెలుసుకోకుండా ఇలా ఏలా చేశారు? అని ప్రశ్నించారు. ఇది ఇది లక్షల మంది జీవితాలకు సంబంధించిన అంశమని, అవసరమైతే మూలాల్లోకి వెళ్లి పరిశీలిస్తామని, సహాయం కోసం అమీకస్ క్యూరీని నియమించుకునే అవకాశాలు కూడా పరిశీలిస్తామని పేర్కొంటూ తదుపురి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సాధారణంగా కేసులు ఎక్కువగా ఉన్నప్పుడే అమీకస్ క్యూరీని కోర్టు నియమించుకుంటుంది.ఇదిలా ఉంటే.. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని హోంబయ్యర్లకు కిందటి ఏడాది జులైలో తన ఆదేశాల ద్వారా భారీ ఊరట ఇచ్చింది సుప్రీం కోర్టు. ఇంటి తాళాలు అందుకోని యాజమానులపై ఈఎంఐ రికవరీ సహా బలవంతపు చర్యలు ఉండకూడదని స్పష్టం చేసింది. అయితే ఆ దేశాల ఆచరణకు నోచుకోవడం లేదు. పైగా ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న సందర్భాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. -
ఏపీ డీజీపీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు
ఢిల్లీ: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై మూడు రోజుల్లోగా జవాబు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరపాలన్న వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై ఏపీ ఎన్నికల సంఘం స్పందించింది.ఏపీ డీజీపీ నుంచి వివరణ కోరింది. -
విశాఖ స్టీల్‌ప్లాంట్: కేంద్రం ట్విస్ట్.. చంద్రబాటు నాటకాలు బట్టబయలు
విశాఖపట్నం, సాక్షి: విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణ అంశంలో కేంద్రం ట్విస్ట్ ఇచ్చింది. ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గడం ఉత్తమాటేనని తేల్చేసింది. దీంతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నాటకాలు.. మోసాలు బట్టబయలు అయ్యాయివైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ ఇప్పటిదాకా లభించలేదు. కానీ, అది జరగనివ్వబోమంటూ ఏపీలోని కూటమి ప్రభుత్వం మోసపూరిత ప్రకటనలు చేస్తూ వస్తోంది. అయితే మరోవైపు ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతుండడం చూస్తున్నదే. ఈ తరుణంలో.. పబ్లిక్ గ్రీవెన్స్‌కు కార్మిక నాయకుడు పాడి త్రినాథ్ రాసిన లేఖకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవాళ బదులిచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో కార్పొరేట్ సంస్థ అయిన RINL ప్రైవేటీకరణ విషయంలో ఎటువంటి మార్పు లేదని కేంద్రం స్పష్టం చేయడం గమనార్హం.కేంద్రం తాజా ప్రకటనపై పోరాట సంఘాలు భగ్గుమన్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలన్నదే మా మొదటి, ప్రధాన డిమాండ్. ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగలేదని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకుంటాం అంటే కుదరదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్‌ను కాపాడాలి.:::అయోధ్య రామ్, పోరాట కమిటీ కన్వీనర్ -
ఓటర్ కార్డ్‌తో ఆధార్ లింక్.. కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ : ఓటర్ ఐడీకి ఆధార్ (Linking of Aadhaar with Voter ID) అనుసంధానం చేసుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆధార్ కార్డ్‌తో ఓటర్ ఐడీ అనుసంధాన ప్రక్రియను కేంద్రం ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.ఓటరు ఐడీల్లో అవకతవకలు జరుగుతన్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఓటరు కార్డును.. ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే అంశంపై మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నిర్వచన్ సదన్‌లో భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar), ఈసీలు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు డాక్టర్ వివేక్ జోషి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, యూఐడీఏఐ, ఈసీఐ సాంకేతిక నిపుణులు భేటీ అయ్యారు.ఈ భేటీ ప్రధాన ఉద్దేశ్యం అర్హులైన వారందరికీ ఓటర్లుగా నమోదు చేసుకోనే అవకాశం కల్పించడంతో పాటు నకిలీ ఐడీ కార్డులను తొలగించడం వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఓటర్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.ఈపీఐసీని ఆధార్‌తో లింక్ చేయడం కోసం ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఆధార్ కార్డు ఓటర్ కార్డు అనుసంధానానికి ఎన్నికల సంఘం నిర్ణయించింది.ఈసీ నిర్ణయంతో త్వరలో యూఐడీఏఐ,ఈసీఐ నిపుణుల మధ్య సాంకేతిక ప్రక్రియ ప్రారంభం కానుంది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, భారత పౌరుడికి మాత్రమే ఓటు హక్కు. ఆధార్ కార్డు ద్వారానే పౌరుడి గుర్తింపు నిర్ధారణ. ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం1950లోని సెక్షన్ 23(4), 23(5), 23(6)లోని నిబంధనల ప్రకారం, సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా మాత్రమే జరుగుతుందని నిర్ణయించబడింది అని కేంద్రం ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. -
పూజా ఖేద్కర్ కేసు జాప్యం దేనికి?
న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ శిక్షణా అధికారిణి పూజా ఖేద్కర్‌కు సుప్రీం కోర్టు(Supreme Court)లో మరోసారి ఊరట లభించింది. ఆమెను అరెస్ట్ చేయొద్దంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను మంగళవారం మరోసారి కోర్టు పొడిగించింది. ఈ క్రమంలో.. దర్యాప్తు ఆలస్యంపైనా సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.తనంతట తానుగా విచారణకు సహకరిస్తానని ఆమె చెప్పారు. అయినా కూడా ఇంత ఆలస్యం దేనికి? అంటూ ఢిల్లీ పోలీసులపై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వెల్లగక్కింది. ఈ కేసులో త్వరగతిన దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.2022 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) పరీక్షలో ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించారని పూజా ఖేద్కర్‌పై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి.. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని పేర్కొంటూ ముందస్తు బెయిల్ కోరుతూ ఆమె తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు దానిని తిరస్కరించడంతో.. ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయతే ముందస్తు బెయిల్‌పై విచారణ జరుగుతుండగానే.. ఈ ఏడాది జనవరిలో ఆమెను అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆ ఆదేశాలను పొడిగించింది. పూజా ఖేద్కర్(Puja Khedkar) వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు ఢిల్లీ పోలీసుల తరఫు వాదనలు వినిపించిన అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు. కానీ, పరీక్ష రాసే సమయం నాటికి ఆమెకు కంటి చూపు సరిగా లేదని, ఆమె ఫోర్జరీకి పాల్పడిందన్న అభియోగంలోనూ నిజం లేదని పూజా తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఆ వాదనను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు ఆమె లాయర్‌కు తేల్చి చెప్పింది.ఈ పిటిషన్‌పై ఇప్పటివరకు ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. ఫోర్జరీ వ్యవహారంపై విచారణకు ఆమెను కస్టడీలోకి తీసుకునే విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో విచారణ త్వరగతిన పూర్తయ్యేలా చూడాలని ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తూ పూజా పిటిషన్ విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది. -
పదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలిచ్చాం
న్యూఢిల్లీ: రైల్వేలో పదేళ్లలో 5 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అయినా నియామకాలపై ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయని ఆరోపించారు. రైల్వేలో రిక్రూట్మెంట్ జరగలేదని సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు రాజ్యసభలో సోమవారం ఆయన సమాధానమిచ్చారు. మొత్తం 12 లక్షల మంది ఉద్యోగుల్లో గత పదేళ్లలోనే 40 శాతం నియామకాలు జరిగాయని వెల్లడించారు. నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ఇటీవల జరిగిన లోకో పైలట్ల పరీక్షకు 156 నగరాల్లోని 346 కేంద్రాల్లో 18.4 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. లెవల్ 1 నుంచి లెవల్ 6 నియామకాలకు 2.32 కోట్ల మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా భర్తీ చేశామని తెలిపారు. రైల్వే, రక్షణ వంటి శాఖలపై రాజకీయాలు సరికాదన్నారు. మంత్రి స్పందన సరిగా లేదంటూ విపక్షాలు అభ్యంతరం వెలిబుచ్చాయి. నిరసన వాకౌట్ చేశాయి.అత్యాధునిక భద్రతా చర్యలు మహాకుంభ్ మేళా సందర్భంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ సహా డేటా భద్రంగా ఉందని మంత్రి అన్నారు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరుపుతోందని, దాదాపు 300 మంది నుంచి వివరాలు సేకరిస్తున్నామని, వాస్తవాలు తెలుసుకుంటున్నామని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు దేశ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే 60 స్టేషన్లను గుర్తించామని వైష్ణవ్ తెలిపారు. వీటన్నింటిలోనూ అత్యాధునిక సాంకేతికతతో కూడిన భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. నిలకడగా ఆర్థిక పరిస్థితి రైల్వే ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందన్న మంత్రి.. కోవిడ్ మహమ్మారి సందర్భంగా ఎదురైన సవాళ్లను విజయవంతంగా అధిగమించిందని చెప్పారు. ప్యాసింజర్ రైళ్లు, కార్గో ట్రాఫిక్ రెండింటిలోనూ వృద్ధి నమోదైందన్నారు. 2023 –24 మధ్య సుమారు రూ 2,78,000 కోట్ల ఆదాయం వచి్చందన్నారు. సిబ్బంది వ్యయం, పెన్షన్ చెల్లింపులు, ఇంధన వ్యయాలు, ఫైనాన్సింగ్‌పై రైల్వే ఖర్చు చేసిందన్నారు. తన సొంత ఆదాయంతోనే వ్యయాన్ని భరిస్తోందని, ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కార్గో, సరుకు రవాణా ఆదాయంతో ప్రయాణికుల చార్జీల సబ్సిడీ చెల్లిస్తున్నామన్నారు. పొరుగు దేశాలతో పోలిస్తే మన రైల్వేలో అన్ని కేటగిరీల్లో టికెట్ చార్జీలు తక్కువగా ఉన్నాయని వివరించారు. మార్చి 31 నాటికి 1.6 బిలియన్ టన్నుల సరుకు రవాణాతో మన దేశం ప్రపంచంలోని మొదటి మూడు దేశాల్లో ఒకటిగా ఉంటుందన్నారు. 50 వేల కిలోమీటర్ల ట్రాక్‌ల నిర్మాణం, 12 వేల అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణం, 14 వేల వంతెనల పునరి్నర్మాణం మన రైల్వే సాధించిన విజయాలని మంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు. ఎగుమతుల రంగంలో.. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వస్తువుల ఎగుమతులను రైల్వే ఎలా పెంచుతోందో వివరించారు ఆ్రస్టేలియాకు మెట్రో కోచ్‌లు ఎగుమతి చేస్తున్నామన్నారు. బ్రిటన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఆ్రస్టేలియాలకు బోగీలు, ఫ్రాన్స్, మెక్సికో, రొమేనియా, స్పెయిన్, జర్మనీ, ఇటలీలకు ప్రొపల్షన్లు, మొజాంబిక్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు ప్రయాణికుల బోగీలు ఎగుమతి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. మొజాంబిక్, సెనెగల్, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్‌లకు లోకోమోటివ్లను ఎగుమతి చేస్తున్నామని, సమీప భవిష్యత్‌లో బీహార్‌లోని సరన్ జిల్లాలో ఉన్న మర్హోరా వద్ద తయారైన 100కు పైగా లోకోమోటివ్లను ఎగుమతి చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన పశి్చమబెంగాల్, తమిళనాడు, కేరళలో నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఆయా రాష్ట్రాల సహకారాన్ని కోరారు. పేద, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో రైల్వేలు విఫలమయ్యాయన్న ఆరోపణలు వైష్ణవ్ తోసిపుచ్చారు. -
సుప్రీం జడ్జిగా బాగ్చీ ప్రమాణం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమి తులైన కలకత్తా హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇతర న్యాయమూర్తుల సమక్షంలో సుప్రీంకోర్టు ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. జస్టిస్ బాగ్చీ అత్యున్నత న్యాయస్థానంలో ఆరేళ్లకు పైగా ఉంటారు. బాగ్చీ ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. మరో పోస్టు ఖాళీగా ఉంది. బాగ్చీ 2031 మే 25న సీజేఐగా బాధ్యతలు చేపడతారు. అక్టోబర్ 2న ఆయన పదవీ విరమణ వరకూ కొనసాగుతారు. 1966 అక్టోబర్ 3న జన్మించిన జస్టిస్ బాగ్చీ.. 2011 జూన్27న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 జనవరి 4న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అప్పటినుంచి అక్కడే విధులు నిర్వహించారు. 13 ఏళ్లకు పైగా హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన ఆయన ప్రధాన న్యాయమూర్తుల తో సహా హైకోర్టు న్యాయమూర్తుల ఉమ్మడి అఖిల భారత సీనియారిటీలో 11వ స్థానంలో ఉన్నారు. సీజేఐ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం మార్చి 6న జస్టిస్ బాగ్చీ పేరును సిఫారసు చేసింది. -
చంద్రయాన్–5 మిషన్‌కు ప్రభుత్వ ఆమోదం
న్యూఢిల్లీ: చంద్రయాన్–5 మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ వి.నారాయణన్ తెలిపారు. ఇది 250 కిలోల భారీ రోవర్‌ను చంద్రుడి ఉపరితలంపైకి తీసుకెళ్తుందన్నారు. చంద్రుడి ఉపరితలం, కూర్పుపై సమగ్ర అధ్యయనం ఈ అధునాతన రోవర్ లక్ష్యమని ఆయన వెల్లడించారు. చంద్రయాన్–5 మిషన్‌కు మూడు రోజుల కిందటే అనుమతి లభించిందని, జపాన్ సహకారంతో దీన్ని చేపడతామని తెలిపారు. చంద్రయాన్‌ను ఇండియన్ లూనార్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తారు. చంద్రుని మీద అన్వేషణ కోసం భారత్ చేస్తున్న ఐదో ప్రయోగం ఇది. చంద్రయాన్–3 అద్భుత విజయం సాధించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చంద్రయాన్–3.. 25 కిలోల రోవర్‌ను తీసుకెళ్లగా, చంద్రయాన్–5 మిషన్ 250 కిలోల బరువున్న రోవర్‌ను తీసుకెళ్లనుంది. ఇక 2019లో ప్రయోగించిన చంద్రయాన్–2కు చివరిదశలో ఎదురుదెబ్బ తగిలింది. 2027 నాటికి చంద్రయాన్–4ను ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. -
37 కిలోలు, రూ.75 కోట్లు!
న్యూఢిల్లీ/బనశంకరి: కర్నాటక పోలీసులు 37 కిలోల ఎండీఎంఏ (మెథిలీన్ డయాక్సీ మెథాంఫెటమైన్) అనే సింథటిక్ డ్రగ్‌ను పట్టుకున్నారు. దీని విలువ రూ.75 కోట్లని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ ఆదివారం మీడియాకు తెలిపారు. గత సెప్టెంబరులో మంగళూరులో హైదర్ అలీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 15 గ్రాముల ఎండీఎంఏ స్వాదీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో బెంగళూరులో ఓ నైజీరియా దేశస్తున్ని పట్టుకోగా రూ.6 కోట్ల విలువైన ఎండీఎంఏ దొరికింది.ఇది అంతర్జాతీయ డ్రగ్స్ దందా అని, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల ద్వారా అక్రమ రవాణా జరుగుతోందని గుర్తించారు. మంగళూరు పోలీసులు బాంబా ఫాంట్ (31), అబిగైల్ అడోనిస్(30) అనే దక్షిణాఫ్రికన్లను అరెస్ట్ చేసి ట్రాలీ బ్యాగుల్లో దాచిన 37 కిలోల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ఎండీఎంఏను మోల్లీ, ఎక్స్టసీ అని పలు పేర్లతో పిలుస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఇంఫాల్, గౌహతి జోన్లలో రూ.88 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ డ్రగ్ టాబ్లెట్లను పట్టుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.ఇందుకు సంబంధించి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా సభ్యులైన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారని ఆదివారం ‘ఎక్స్’లో వెల్లడించారు. ‘‘ఎన్సీబీ ఇంఫాల్ జోన్ అధికారులు ఈ నెల 13న లిలాంగ్ ప్రాంతంలో ఓ ట్రక్కులో సోదాలు జరిపి టూల్‌బాక్స్‌లో దాచిన 102.39 కిలోల మెథాంఫెటమైన్ ట్యాబ్లెట్లను పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అసోం సరిహద్దుల్లో ఓ వాహనం స్పేర్ టైర్లో దాచిన 7.48 కిలోల మెథాంఫెటమైన్ టాబ్లెట్లను పట్టుకున్నారు’’ అని తెలిపారు. -
నేటి నుంచి రైసినా డైలాగ్
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయాలు, ఆర్థికాంశాలపై భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ సదస్సు ‘రైసినా డైలాగ్’ 10వ ఎడిషన్ సోమవారం ఢిల్లీలో ప్రారంభం కానుంది. మూడు రోజులు జరిగే ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. 125 దేశాలకు చెందిన సుమారు 3,500 మంది ప్రతినిధులు కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.వీరిలో న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టఫర్ లక్సన్, అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ తులసీ గబార్డ్, 20 దేశాల విదేశాంగ మంత్రులతో పాటు పలువురు ప్రభుత్వాధినేతలు, సైనిక కమాండర్లు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులున్నారు. తొలిసారిగా తైవాన్ సీనియర్ భద్రతాధికారి కూడా ఇందులో పాల్గొననున్నారు. భారత్, తైవాన్‌ల మధ్య పెరుగుతున్న సహకారానికి ఇది నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు.న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ సోమవారం కీలకోపన్యాసం చేస్తారు. వివిధ అంశాలపై కీలక చర్చలుంటాయి. వర్తమాన అంశాల్లో ప్రపంచ దేశాల మధ్య సహకారానికి ఈ సదస్సు అవకాశాలను అన్వేషిస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. ఢిల్లీలో అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు, భారత ప్రభుత్వ అధికార స్థానానికి మారుపేరుగా నిలిచిన రైసినా హిల్ నుంచి ఈ సదస్సుకు రైసినా డైలాగ్ అని నామకరణం చేశారు. -
శాంతికి యత్నించినప్పుడల్లా... నమ్మకద్రోహమే
న్యూఢిల్లీ: దాయాది దేశానికి విశ్వసనీయత అనేదే లేదని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పాకిస్తాన్‌తో శాంతి కోసం ప్రయత్నించిన ప్రతిసారీ వైరం, నమ్మకద్రోహమే ఎదురయ్యాయన్నారు. ఇక పరస్పర విశ్వాసాన్ని పాదుగొల్పాల్సిన బాధ్యత పాక్‌దేనని స్పష్టం చేశారు. అమెరికా కృత్రిమ మేధ పరిశోధకుడు అలెక్సీ అలెగ్జాండ్రోవిచ్ ఫ్రిడ్మ్యాన్ నిర్వహించిన ‘లెక్స్ ఫ్రిడ్మ్యాన్’ పాడ్‌కాస్ట్‌లో మోదీ పాల్గొన్నారు.తన బాల్యం, చాయ్‌వాలా రోజులు మొదలుకుని చావుపుట్టుకల దాకా పలు అంశాలపై మనోగతాన్ని పంచుకున్నారు. ‘‘నా శక్తి నా పేరులో లేదు. నా వెనక దన్నుగా నుంచున్న 140 కోట్ల పై చిలుకు భారతీయుల్లో దాగుంది’’ అని అభిప్రాయపడ్డారు. ఏదో సాధించేందుకే పైవాడు నన్నిక్కడికి పంపాడు. ఆ ప్రయత్నాల్లో నేను ఏనాడూ ఒంటరిగా లేను. నన్నిక్కడికి పంపిన ఆ శక్తే అన్నివేళలా నాకు తోడుగా నిలుస్తూ వస్తోంది’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘నేను శక్తిమంతుడినని ఎన్నడూ అనుకోను. అలా చెప్పుకోను కూడా. వినయంతో కూడిన ప్రధాన సేవకున్ని మాత్రమే అని చెప్పుకుంటా’’ అన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...శాంతిపథంలో నడుస్తారనే ఆశిస్తున్నా పాక్‌తో భారత్ ఎన్నోసార్లు శాంతియత్నాలు చేసింది. ఆ దేశంతో దౌత్య సంబంధాల మెరుగుదలకు ఎన్నడూ లేనంతగా కృషి చేశా. నా ప్రమాణస్వీకారానికి కూడా ఆహ్వానించా. కానీ ప్రతిసారీ వారినుంచి శత్రుత్వం, నమ్మకద్రోహమే స్వాగతం పలికాయి. పాక్‌లో అస్థిరత, అశాంతి, ఉగ్రవాదం తిష్టవేశాయి. ఇప్పటికైనా మార్పొస్తుందని, వాళ్లు శాంతిపథంలో పయనిస్తారని ఆశిస్తున్నాం. పాక్ ప్రజలు కూడా శాంతి కోసం ఎదురుచూస్తున్నారు.చర్చలతోనే పరిష్కారం ప్రస్తుత పరిస్థితులు ఉక్రెయిన్, రష్యా మధ్య అర్థవంతమైన చర్చలకు అవకాశం కల్పిస్తున్నాయి. ముందుగా ఆ రెండు దేశాలూ చర్చించుకోవడం అవసరం. అమెరికాతో సహా ఎన్ని దేశాలు అండగా ఉన్నా యుద్ధక్షేత్రంలో పరిష్కారాలుండవని ఉక్రెయిన్ కూడా గ్రహించాలి. చర్చలు, సంప్రదింపులే మార్గం. రెండు దేశాలతోనూ నాకు సత్సంబంధాలున్నాయి. యుద్ధం పరిష్కారం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు నేరుగా చెప్పగలను. చైనాతో ఉండాల్సింది స్పర్ధ మాత్రమే భారత్, చైనా మధ్య పోటీ తత్వం ఉండాల్సిందే. అది స్పర్ధగానే సాగాలి తప్ప సంఘర్షణగా మారకూడదు. విభేదాలు వివాదాలు కారాదు. వాస్తవా«దీన రేఖ వెంట 2020 ఏడాదికి ముందునాటి పరిస్థితులు నెలకొల్పేందుకు ఇరుదేశాలు కృషిచేస్తున్నాయి. ప్రాచీనకాలం నుంచీ ఇరుదేశాలు పరస్పరం ఎంతో నేర్చుకున్నాయి. ఒక దశలో సగం ప్రపంచ జీడీపీని ఈ రెండు దేశాలే సమకూర్చాయి.ఆర్ఎస్ఎస్ నుంచి జీవిత పాఠాలు ఆర్ఎస్ఎస్ వంటి గొప్ప సంస్థ నుంచి జీవిత పాఠాలు నేర్చుకోగలగడం నా అదృష్టం. అంత పెద్ద స్వచ్ఛంద సంస్థ మరోటి లేదనుకుంటా. గుజరాత్లో మా ఇంటి సమీపంలో ఆర్ఎస్ఎస్ ‘శాఖ’ నిర్వహించేటప్పుడు వినిపించే దేశభక్తి గీతాలు నాలో దేశంపట్ల ప్రేమను విపరీతంగా పెంచాయి.మానవుని ఊహను ఏఐ చేరలేదు ప్రతి యుగంలోనూ మనిషి సాంకేతికతతో పోటీపడ్డాడు. కృత్రిమ మేధ ఎంత శక్తిమంతమైనదైనా మనిషి ఊహాశక్తిని అందుకోలేదు. ఏఐ విస్తరణ, అభివృద్ధిలో భారత్‌ది కీలక పాత్ర. ‘ఇంజనీర్లు కావాలని అమెరికాలో ప్రకటన ఇస్తే ఒక గదికి సరిపడా దరఖాస్తులొస్తాయి. అదే భారత్‌లో అయితే ఏకంగా ఓ ఫుట్‌బాల్ స్టేడియం నిండేన్ని దరఖాస్తులు వెల్లువెత్తు్తతాయి’ అని ఒక అమెరికా కంపెనీ ఉన్నతాధికారి నాతో అన్నారు.గోధ్రా అల్లర్లను ఎక్కువచేసి చూపారు 2002 గోధ్రా అల్లర్లను మరీ ఎక్కవ చేసి చూపారు. అవి గుజరాత్ చరిత్రలోనే అత్యంత దారుణమైన గొడవలన్నట్టుగా ప్రత్యర్థి పారీ్టలు ప్రచారం చేశాయి. నిజానికి నేను సీఎం కావడానికి చాలాకాలం ముందునుంచే గుజరాత్లో దాదాపు ఏటా మత కల్లోలాలు జరిగేవి. కానీ 2002 నుంచి అవి పూర్తిగా ఆగిపోయాయి. తటస్థ ఈసీ గొప్పది భారత ఎన్నికల సంఘం చాలా గొప్పది. స్వతంత్రంగా, తటస్థంగా వ్యవహరిస్తుంది. కోట్లాది మంది పాల్గొనే ఎన్నికల ప్రక్రియను సమర్థంగా నిర్వహించే తీరును ప్రపంచదేశాలు చూసి నేర్చుకోవాలి. విశ్వవిద్యాలయాలు కేస్ స్టడీగా అధ్యయనం ఇటీవలి ఎన్నికల్లో నిప్పులు కక్కే ఎండల్లోనూ 64.6 కోట్ల మంది ఓటేశారు. ఈ సంఖ్య ఉత్తర అమెరికా జనాభా కంటే రెట్టింపు.ట్రంప్ 2.0 మరింత సిద్ధమై వచ్చారుఅమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు, నాకు మధ్య పరస్పర నమ్మకముంది. ఇరువురం జాతి ప్రయోజనాలకు పెద్దపీట వేసేవాళ్లమే. ట్రంప్‌కు తెగువ ఎక్కువ. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. రెండోసారి అధ్యక్షునిగా మరింత సన్నద్ధతతో వచ్చారాయన. క్లియర్ రోడ్‌మ్యాప్‌తో ముందుకెళ్తున్నారు’’ అని మోదీ అన్నారు.చాక్ పొడితో బూట్ పాలిష్బాల్యమంతా దుర్భర దారిద్య్రమే: మోదీతన బాల్యం దుర్భర పేదరికం మధ్యే గడిచిందని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘‘స్కూలుకు వేసుకెళ్లడానికి బూట్లు కూడా ఉండేవి కాదు. ఒకసారి చిన్నాన్న తెల్లరంగు కాన్వాస్ షూ కానుకగా ఇచ్చాడు. వాటిని పాలిష్ చేసుకోవడానికి కూడా డబ్బులుండేవి కాదు. దాంతో క్లాస్రూముల్లోని చాక్‌పీస్ పొడితో పాలిష్ చేసుకునేవాన్ని. కానీ పరిస్థితులను చూసి నేనెన్నడూ డీలా పడలేదు. ప్రతి దశనూ వినమ్రంగానే స్వీకరిస్తూ ముందుకు సాగా. మా నాన్న చాయ్ దుకాణానికి వచ్చేవారిని చూసి, వారి మాటలు విని ఎంతో నేర్చుకున్నా. ఆ అనుభవాల సారాన్ని ప్రజాజీవితంలో అమలు చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు. జీవితం క్షణభంగురం జీవితం క్షణభంగురమని, ఎన్నాళ్లు బతికినా మరణం ఖాయమని మోదీ అన్నారు. ‘‘కనుక చావును తలచుకుని భయపడే బదులు జీవితాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. శక్తియుక్తులన్నింటినీ ప్రపంచమేలు కోసం ధారపోయాలి. అప్పుడు ఆనందం సొంతమవుతుంది’’ అని ప్రజలకు సూచించారు. భారత్, పాక్ క్రికెట్ జట్లపై... భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లలో ఏది మెరుగైందనే అంశంపై మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘వాటిలో ఏది మెరుగో చెప్పేందుకు నేను నిపుణుడిని కాదు. కానీ కొన్నిసార్లు ఫలితాలు వాస్తవాలు చెబుతాయి. ఇటీవలే భారత్, పాక్ జట్లు ఒక మ్యాచ్ ఆడాయి. వాటిలో ఏది మెరుగైనదో ఆ ఫలితమే చెప్పిందని అనుకుంటున్నా’’ అని ఛాంపియన్ ట్రోఫీని ఉద్దేశించి అన్నారు. ఆ మ్యాచ్‌లో పాక్ జట్టుపై భారత్ విజయం సాధించడం తెలిసిందే. నా జీవితాన్నే మార్చేసిన ఉపవాసం ఉపవాసం తన జీవితాన్నే మార్చేసిందని మోదీ చెప్పారు. ‘‘ఉపవాసం సనాతన ఆచారం. దానితో లాభాలు అన్నీ ఇన్నీ కావు. జ్ఞానేంద్రియాలను పదును పెడుతుంది. ఎరుకను పెంచుతుంది. రొటీన్‌కు భిన్నంగా, సృజనాత్మకంగా ఆలోచిస్తాం. సూక్ష్మ విషయాలను కూడా గుర్తించగలం. ఇవన్నీ నా వ్యక్తిగత అనుభవాలు’’ అని వివరించారు. ఈ పాడ్‌కాస్ట్ కోసం తాను 45 గంటలుగా ఉపవాసమున్నానని, మంచినీళ్లు తప్ప మరేమీ తీసుకోలేదని ఫ్రిడ్మాన్ చెప్ప డంతో ప్రధాని నవ్వేశారు. ‘నాకిది నిజంగా గొప్ప గౌరవం’ అన్నారు. -
ఏప్రిల్ నుంచి హైదరాబాద్‌లో యాపిల్ ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: తైవాన్ దిగ్గజం ఫాక్స్‌కాన్‌కి చెందిన హైదరాబాద్ ప్లాంటులో ఏప్రిల్ నుంచి యాపిల్ ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి ఎగుమతుల కోసమే వీటిని తయారు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. టెక్ దిగ్గజం యాపిల్ ఇప్పటికే తమ ఐఫోన్లను భారత్‌లో తయారు చేస్తుండగా, ఎయిర్‌పాడ్స్ రెండో కేటగిరీగా ఉంటుందని వివరించాయి. దాదాపు రూ. 3,500 కోట్లతో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు 2023 ఆగస్టులో ఫాక్స్‌కాన్ ప్రకటించింది.భారత్‌పైనా ప్రతీకార టారిఫ్‌లు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో యాపిల్ ఇక్కడ ఉత్పత్తిని తగ్గించుకుని, అమెరికాలో పెట్టుబడులు పెట్టనుందనే వార్తల నేపథ్యంలో, ఎయిర్‌పాడ్స్ తయారీని ప్రారంభించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియా సెల్యులార్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ప్రకారం హియరబుల్స్, వేరబుల్స్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు భారత్‌లో 20 శాతంగా ఉండగా, అమెరికాలో అసలు లేనే లేవు. అమెరికా నుంచి స్మార్ట్ఫోన్లు, హియరబుల్స్, వేరబుల్స్‌పై దిగుమతులపై సుంకాలను తొలగిస్తే భారత్‌కి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఐసీఈఏ పేర్కొంది. -
బోట్‌వాలాకు ఐటీ నోటీసులు, 45 రోజుల్లో 30 కోట్ల సంపాదన ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
లక్నో: మహాకుంభమేళా (maha kumbh 2025) పడవ వ్యాపారి పింటు మహరా (pintu mahara) రూ.౩౦కోట్ల సంపాదనలో ట్విస్ట్ చేసుకుంది. తాను ఒక్కబోటు మీద రూ.30 కోట్లు సంపాదించలేదని, పదుల సంఖ్యలో పడవలు ఉండగా.. కుంభమేళా కోసం అదనంగా మరిన్ని పడవలు కొనుగులో చేసినట్లు పింటు మహరా చెబుతున్నారు. ఇందుకోసం తన ఆస్తుల్ని తాకట్టు పెట్టినట్లు చెప్పారు. అయితే, ఐటీ అధికారులు తనకు నోటీసులు (12.8 Crore Rupees Tax Notice) జారీ చేయడంపై.. ఆ మొత్తాన్ని ఎలా చెల్లించాలో అర్ధం కావడం లేదని తలలు పట్టుకుంటున్నాడు. ఇదే అంశం విషయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాడు. మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన వేడుకను ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ప్రభుత్వం విజయ వంతం చేసింది. భారతీయ ఆధ్యాత్మికతకు, ఆత్మకు ప్రతిరూపంగా భావించే మహా కుంభమేళా భక్తితో పాటు ఆర్థికంగా కొన్ని కోట్లాది మంది జీవితాల్ని మార్చేసింది. వారిలో ప్రయాగరాజ్‌లో త్రివేణి సంగమం తీరాన ఉన్న అరైల్ గ్రామానికి చెందిన పడవ వ్యాపారి పింటు మహరా.సీఎం యోగి నోట.. కుంభమేళా జనవరి 13న పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమై ఫిబ్రవరి 26 మహా శివరాత్రి నాడు ముగిసింది. అయితే, పడవ వ్యాపారం చేసుకునే పింటు మహరా 45 రోజుల్లో రూ.30 కోట్లు సంపాదించారు. దీంతో పింటు పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం యోగి ఆధిత్యనాథ్ (Yogi Adityanath) పింటు పేరును ప్రస్తావించారు. కుంభమేళా వల్ల పింటు రూ.౩౦కోట్లు సంపాదించడమే కాదు,౩౦౦ మందికి పరోక్షంగా ఉపాధి అవకాశం కల్పించామని చెప్పాడు. సీఎం యోగి ప్రకటనతో ఐటీ శాఖ నోటీసులు? సీఎం యోగి ఆధిత్యనాథ్ ప్రకటన ప్రకారం.. పింటు మహరా కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. జనవరి 23 నుండి ఫిబ్రవరి 26 వరకు ఒక్కో పడవ సగటున రూ. 23 లక్షల లాభాల్ని అర్జించారని పేర్కొన్నారు. అంతే, సీఎం యోగి ప్రకటనతో ఆదాయపు పన్ను శాఖ పింటు మహరా రూ. 12.8 కోట్ల పన్ను నోటీసు జారీ చేసిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.రూ.12.8కోట్లు ట్యాక్స్ అంటే ఎలా?ఆదాయపు పన్నుశాఖ పింటు మహ్రాకు నోటీసులు పంపిందనే సమాచారంపై సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ ప్లాన్ ఏకే నందన్ స్పందించారు. పింటు మహరా రోజుకు రూ. 500 సంపాదించే సాధారణ పడవ వ్యాపారి. మహాకుంభమేళాతో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. భక్తుల రద్దీతో ఒక్కో ప్రయాణానికి ఛార్జీ వేలల్లో వసూలు చేశారు. ఫలితంగా తన మొత్తం ఆదాయం రూ. 30 కోట్లకు చేరింది. అదే సమయంలో ఆదాయపు పన్ను శాఖ రూ.12.8 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు అందించడంతో ఆందోళన చెందుతున్నాడని అన్నారు. పన్నుల గురించి తెలియని ఒక సామాన్యుడు ఇప్పుడు పెద్ద మొత్తంలో పన్నుల భారాన్ని ఎదుర్కోవడం బాధాకరం’ అని అన్నారు. పింటూ మహర కుటుంబం ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదు. అయితే, ఈ అధిక ఆదాయం పన్ను చట్టాల ప్రకారం పెద్ద మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితిని తెచ్చి పెట్టిందన్నారు. ఆస్తుల్ని తాకట్టు పెట్టిమరోవైపు, పింటు మహర రూ.౩౦కోట్ల సంపాదనలో ట్విస్ట్ చేసుకుంది. 42 రోజుల్లో తాను ఒక్క పడవమీదే రూ.౩౦ కోట్లు సంపాదిస్తున్నానని అనుకుంటున్నారు. అదేం లేదు.కుంభమేళాకు ముందు తన వద్ద 60 బోట్లు ఉండేవి. కుంభమేళా రద్దీని అంచనా వేసి మరో 70 బోట్లు అప్పు చేసి కొన్నా. అందుకోసం ఇంట్లో నగలు, ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి అప్పు తెచ్చినట్లు పలు మీడియా ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. -
లోక్‌సభ ఎన్నికల కోసమే ఇండియా కూటమి
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికల కోసం ఏర్పాటైందే తప్ప, రాష్ట్రాల్లో ఎన్నికల కోసం కాదని సీపీఎం నేత, పార్టీ మధ్యంతర సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష లౌకిక పార్టీలతో కూడిన విస్తృత వేదిక ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి విస్తృత కూటమి మాత్రమే ఎన్నికల రాజకీయ ప్రయో జనాలకు పరిమితమై పోకుండా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.శనివారం ఆయన పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలపై మా ట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సా రథ్యంలోని ఎన్డీఏను దీటుగా ఎదు ర్కోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడటం తెల్సిందే. అయితే, లోక్‌సభ ఎన్నికల అనంతరం జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి చర్చలు జరగలేదని కారత్ వివరించారు. ప్రతిపక్ష పార్టీలు ఐకమత్యంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఎంతో ఉందన్నారు. కూటమి పార్టీలకు రాష్ట్రాల్లో తమ సొంత రాజకీయ సమీకరణాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.ఇండియా కూటమి ఏర్పాటు, అన్ని రాష్ట్రాల్లో కాకున్నా కనీసం కొన్ని చోట్లయినా సభ్య పార్టీల్లో సమన్వయం కుదరడంతో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ కోల్పోయేందుకు కారణమైందన్న విషయం మాత్రం వాస్తవమని కారత్ విశ్లేషించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ముఖ్యంగా మహారాష్ట్రలో ఫలితాలపై ఆయన మాట్లాడుతూ.. ‘లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ మెరుగైన పనితీరు కనబరిచి, బీజేపీకి షాక్ ఇవ్వగలిగింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి కూటమిలో అనైక్యత కారణంగా ఫలితాలు తారుమారయ్యాయి’అని కారత్ చెప్పారు. ‘జార్ఖండ్‌కు వచ్చే సరికి ఫలితాలు వేరుగా ఉన్నాయి. ఇండియా కూటమిలోని పార్టీలు ఇక్కడ ఐక్యంగా పనిచేసి, బీజేపీని ఓడించాయి.పరిస్థితులను బట్టి రాష్ట్రాల్లో ఫలితాలు మారుతూ వచ్చాయి’అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష లౌకికవాద పార్టీలు విశాల వేదిక ఏర్పాటు కోసం ముందుగా ఆయా పార్టీల అవసరాలను, లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటూ ఒక రూపు తీసుకు రావాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే, బిహార్, తమిళనాడుల్లో ఇటువంటి కూటములు కొనసాగుతున్నాయని గుర్తు చేసిన ప్రకాశ్ కారత్.. పశ్చిమబెంగాల్, ఢిల్లీల్లో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. బెంగాల్లో టీఎంసీ, సీపీఎంలకు పొసగనట్లే ఢిల్లీలో కూడా కాంగ్రెస్, ఆప్‌లు కలిసి సాగడం సాధ్యం కాని నేపథ్యముందని తెలిపారు.అసలు ఇండియా కూటమి లక్ష్యం ఎన్నికలేనా? అదే అయితే, ఎన్నికల నుంచి ఎన్నికల వరకు ఈ కూటమి కొనసాగుతుందా?అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని కారత్ వ్యాఖ్యానించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి ఇండియా కూటమి వైఖరి ఎంతో సంక్లిష్టంగా తయారవుతుందని చెప్పారు. ‘ప్రతిపక్ష ఐక్య వేదిక పూర్తిగా ఎన్నికలకు సంబంధించింది అనుకోరాదు. మోడీ ప్రభుత్వం, బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీల వేదిక ఇది’అని కారత్ తెలిపారు.లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమాఖ్య విధానం పరిరక్షణ గురించి ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చెందుతున్నట్లయితే ఉమ్మడి వేదిక ఏర్పాటుకు ఇప్పటికీ అవకాశాలున్నాయని, ఇదే ప్రాతిపదికగా ఈ ఉద్యమాన్ని తీసు కువెళ్లవచ్చునని పేర్కొన్నారు. మోదీ ప్ర భుత్వం, దాని విధానాలకు ప్రత్యామ్నా యమే లక్ష్యమైతే ఆ దిశగా ఇండియా కూ టమిని నిర్మించుకోవాల్సి ఉంటుందని కారత్ తెలిపారు.బెంగాల్లో సీపీఎంను మళ్లీ నిలబెడతాంపశ్చిమబెంగాల్లో సీపీఎంను మళ్లీ బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ప్రకాశ్ కారత్ వివరించారు. ఇందులో భాగంగా, వామపక్ష, ప్రజాస్వామిక శక్తులను బీజేపీ, టీఎంసీలకు వ్యతిరేకంగా ఏకం చేస్తా మన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేసే విషయమై ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదని కారత్ వెల్లడించారు.బెంగాల్లో పార్టీ పునాదులు బలహీనమయ్యాయని, అందుకే ఎన్నికల్లో ఫలితాలను సాధించలేక పోతోందని వివరించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మద్దతును తిరిగి కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పారు. ఈ విషయంలో కొంతమేర ఫలితాలు కనిపించాయన్నారు. అదే సమయంలో కేరళలో అనూహ్యంగా వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ కూటమి, దీర్ఘ కాలం అధికారంలో కొనసాగడంపై దృష్టి సారించిందని అన్నారు.త్రిభాష సూత్రంపై కేంద్రం మొరటు ధోరణినూతన విద్యా విధానంలోని త్రిభాష సిద్ధాంతం అమలుపై కారత్ మాట్లాడు తూ..‘దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాల విష యంలో కేంద్రం సున్నితంగా వ్యవహరించడం లేదు. అన్ని భాషలకు సమాన ప్రా ముఖ్యం ఇవ్వాలే తప్ప, ఒక భాషను బల వంతంగా అమలు చేసేందుకు ప్రయత్నించరాదు’అని కారత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ విషయంలో తమిళనాడు అభి ప్రాయాలకు తగు ప్రాతిపదిక ఉందని చె ప్పారు. హిందీని ప్రోత్సహించాలన్నది కేంద్రం ఉద్దేశంగా ఉందన్నారు. దక్షిణాది రా ష్ట్రాల అభ్యంతరాలకు కారణమిదేనని కార త్ తెలిపారు. విద్యావిధానంపై కేంద్రంతో పాటు రాష్ట్రాలకు సమాన హక్కులు ఇవ్వా లని ఆయన సూచించారు. ప్రస్తుతం ఈ విషయంలో కేంద్రం పెత్తనమే కనిపిస్తోందని సీపీఎం నేత ప్రకాశ్ కారత్ చెప్పారు. -
వ్యూయర్షిప్లో జియోహాట్‌స్టార్ కొత్త రికార్డులు
న్యూఢిల్లీ: దేశీయంగా లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ వ్యూయర్షిప్లో జియోహాట్‌స్టార్ కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇటీవల ముగిసిన ‘ఐసీసీ పురుషుల క్రిక్రెట్ చాంపియన్స్ ట్రోఫీ 2025’ మ్యాచ్‌లకు సంబంధించి 540 కోట్ల వ్యూస్, దాదాపు 11,000 కోట్ల నిమిషాల వాచ్‌టైమ్ నమోదైంది. డిస్నీ స్టార్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన వయాకామ్ 18 విలీనంతో జియోహాట్‌స్టార్ ఏర్పాటైన తర్వాత స్ట్రీమ్ చేసిన తొలి భారీ క్రికెట్ టోర్నమెంట్ ఇది.ఇందులో న్యూజిల్యాండ్ మీద భారత్ గెల్చిన ఫైనల్ మ్యాచ్‌కి ఏకంగా 124.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఒక దశలో, ఏకకాలంలో వీక్షించిన వారి సంఖ్య 6.12 కోట్లుగా నమోదైంది. గతంలో డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారమైన 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ని అత్యధికంగా 5.9 కోట్ల మంది వీక్షించారు.తాజా టోర్నిలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌కు 60.2 కోట్ల స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చాయి. భారత్‌లో డిజిటల్ స్ట్రీమింగ్కు పెరుగుతున్న ఆదరణను తాజా గణాంకాలు సూచిస్తున్నాయని జియోస్టార్ డిజిటల్ సీఈవో కిరణ్ మణి తెలిపారు. ఐసీసీ టోర్నమెంటును తొలిసారిగా తెలుగు, తమిళం తదితర తొమ్మిది భాషల్లోను, సైన్ ల్యాంగ్వేజ్లోను, ఆడియో కామెంటరీ రూపంలోనూ అందించినట్లు వివరించారు. -
కార్మిక శక్తిలో కనబడని మహిళా ప్రాతినిధ్యం
న్యూఢిల్లీ: చేతివృత్తులు, నైపుణ్యాలతో కూడిన కార్మికశక్తిలో (బ్లూకాలర్ ఉద్యోగాలు) మహిళల భాగస్వామ్యం ప్రతి ఐదుగురిలో ఒకరిగానే (20 శాతం) ఉన్నట్టు జాబ్ ప్లాట్‌ఫామ్ ‘ఇండీడ్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా వేతనాల్లో తీవ్ర అంతరాలు, పనిచేసే చోటు పారిశుద్ధ్య పరిస్థితులు దారుణంగా ఉండడం వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుండడం మహిళలను పనులకు దూరం చేస్తోంది. టైర్ 1, 2 పట్టణాల్లో 14 రంగాల్లోని 4,000 కంపెనీలు, ఉద్యోగులను ఇండీడ్ సర్వే చేసింది. సర్వే అంశాలు.. ⇒ 2024లో 73 శాతం కంపెనీలు బ్లూ కాలర్ ఉద్యోగాల్లోకి మహిళలను నియమించుకున్నట్టు తెలిపాయి. బ్లూకాలర్ ఉద్యోగాలన్నీ శ్రామికశక్తితో కూడినవే. ⇒ రిటైల్, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, నిర్మాణం, రియల్ ఎస్టేట్, రవాణా, ఆతిథ్య పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం సగటున 30 శాతం స్థాయిలో ఉంది. ⇒ అదే టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఐటీ/ఐటీఈఎస్ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం 10 శాతం కంటే తక్కువగా ఉంది. ⇒ ఆర్థిక స్వాతంత్య్రం కోసం మహిళలు బ్లూకాలర్ ఉద్యోగాలు కోరుకుంటున్నారు. కానీ, పరి పరిస్థితులు కఠినంగా ఉంటున్నట్టు చెబుతున్నారు. ⇒ ఉద్యోగ వేళలు (షిఫ్ట్‌లు) అనుకూలంగా లేవని సగం మందికి పైగా తెలిపారు. కఠినమైన పనివేళల కారణంగా మహిళలు ఉద్యోగం, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోలేకపోతున్నారు. ⇒ పురుషులతో పోల్చితే 42 శాతం మంది మహిళలు తమకు తక్కువ వేతనం చెల్లిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు కెరీర్లో పురోగతి (పదోన్నతులు తదితర) ఉండడం లేదని భావిస్తున్నారు. ⇒ సర్వేలో పాల్గొన్న ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు నైపుణ్యాలను పెంచుకుంటామని ఆసక్తి చూపించారు. అయితే, నైపుణ్య శిక్షణ తమకు సవాలుగా పేర్కొన్నారు. నేర్చుకునేందుకు సరైన మార్గాలు లేకపోవడం కెరీర్లో ముందుకు వెళ్లేందుకు అడ్డంకిగా పేర్కొన్నారు. ⇒ 78% కంపెనీలు 2025లో మహిళలను నియమించుకుంటామని చెప్పాయి. గతేడాదితో పోల్చితే నియామకాల ఉద్దేశ్యం 5% పెరిగింది. ⇒ అయితే సరిపడా నైపుణ్యాలు కలిగిన వారు లభించడం లేదని, దీనికితోడు వలసలు తమ కు సమస్యాత్మమని కంపెనీలు పేర్కొన్నాయి. ⇒ ఇన్సూరెన్స్, పెయిడ్ మెడికల్ లీవ్‌ను మహిళలు కోరుకుంటుండగా, ఆరోగ్య సంరక్షణ వ్యయాలు పెరిగిపోవడం తమకు సవాలుగా కంపెనీలు తెలిపాయి. మెరుగైన విధానాలతోనే.. ‘‘మరింత మంది మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు వ్యాపార సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ నిజమైన ప్రగతి అన్నది వారిని కాపాడుకునేందుకు మెరుగైన విధానాలు అమలు చేయడం, కెరీర్లో పురోగతికి వీలు కల్పించడం, ఆర్థిక భద్రత, ఆరోగ్య సంరక్షణ దిశగా విధానాలు అమలు చేయడం కీలకం’’అని ఇండీస్ సర్వే సూచించింది. -
సైబర్ నేరాల కట్టడికి ‘ఐ4సీ’
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: రోజుకో తరహా మోసంతో అమాయకులను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లకు దర్యాప్తు సంస్థలు తమదైన శైలిలో అడ్డుకట్ట వేస్తున్నాయి. ఇటీవల డిజిటల్ అరెస్టుల పేరిట మోసగాళ్ల ఆగడాలు బాగా పెరగడంతో వారికన్నా ఒకడుగు ముందుకేసి, వారు మోసాలకు వినియోగిస్తున్న సిమ్‌కార్డు లు, స్కైప్ ఐడీలు, వాట్సాప్ నంబర్లను బ్లాక్ చేస్తున్నాయి. తాము చేపట్టిన చర్యల్లో భాగంగా సైబర్ మోసగాళ్లు డిజిటల్ స్కామ్‌లకు వాడిన సుమారు 7.81 లక్షల సిమ్‌లను బ్లాక్ చేసినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. సైబర్ నేరాలకోసం వినియోగిస్తున్న 2,08,469 ఐఎంఈఐ నంబర్లను కూడా బ్లాక్ చేసినట్లు పేర్కొంది. దేశంలో జరుగుతున్న డిజిటల్ స్కామ్‌లు, సైబ ర్ నేరాలపై ఇటీవల ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశంలోని అన్ని రకాల సైబర్ నేరాలను సమన్వయంతో పరిష్కరించేందుకు హోంశాఖ ఆధ్వర్యంలోని ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’(ఐ4సీ) కృషి చేస్తోందన్నారు. వార్తా పత్రికలు, మెట్రో రైళ్లలో ప్రకటనలు, ఆకాశవాణి.. తదితర మాధ్యమాల ద్వారా దీనిపై ప్రచారం చేస్తున్నామన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాలర్‌ట్యూన్ ప్రచా రాన్ని ప్రారంభించామన్నారు. టెలికం సర్వీస్ ప్రొవైడర్లు రోజుకు 7 నుంచి 8 సార్లు విధిగా ప్రతి వినియోగదారుడికి వినిపించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిజిటల్ స్కామ్‌లపై 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణం స్పందిçస్తున్నామని చెప్పారు. డిజిటల్ స్కామ్‌ల కోసం ఉపయోగించిన 3,962 స్కైప్ ఐడీలు, 83,668 వాట్సాప్ ఖాతాలను ఐ4సీ గుర్తించి బ్లాక్ లిస్టులో పెట్టిందన్నారు. అలాగే అంతర్జాతీయ స్ఫూఫ్డ్ కాల్స్‌ను కూడా గుర్తించి అరికడుతున్నట్లు తెలిపారు. వివిధ సైబర్ నేరాలపై వచ్చిన 13.36 లక్షల ఫిర్యాదుల ఆధారంగా రూ.4,386 కోట్లు నేరగాళ్లబారిన పడకుండా చర్యలు తీసుకున్నట్లు బండి వివరించారు. -
ప్రశాంతంగా ముగిసిన హోలీ, రంజాన్ ప్రార్థనలు
న్యూఢిల్లీ: దేశమంతటా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. జనం రంగుల్లో మునిగితేలారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. హోలీ రంగులతో ఇళ్లు, వీధులు కొత్తరూపు సంతరించుకున్నాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ప్రజలంతా ఆనందోత్సాహాలతో గడిపారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు రెండో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఏడాది హోలీ, రంజాన్ శుక్రవారం ప్రార్థనలు ఒకేరోజు వచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసు కోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు. మసీదుల వద్ద పెద్ద సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల డ్రోన్లు సైతం మోహరించారు. కొన్ని ప్రాంతాల్లో మసీదు కమిటీల పిలుపు మేరకు హోలీ ఉత్సవాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పట్టణంలో మొఘల్ పాలకుల కాలంనాటి షాహీ జామా మసీదులో గత ఏడాది నవంబర్‌లో సర్వే ప్రారంభించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అక్కడ భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రంజాన్ ప్రార్థనలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తలేదు. సంభాల్‌లో సంప్రదాయ ‘చౌపాయ్ కా జులూస్’ శాంతియుతంగా జరిగింది. పోలీసుల చర్యలు సత్ఫలితాలిచ్చాయి. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు, రంజాన్ ప్రార్థనలు ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ఉద్యోగాల కంటే నిరుద్యోగులు ఎన్నో రెట్లు ఎక్కువ
న్యూఢిల్లీ: దేశంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల కంటే వాటిని ఆశించే నిరుద్యోగులు ఎన్నో రెట్ల ఎక్కువగా ఉన్నారని సుప్రీంకోర్టు వెల్లడించింది. వాస్తవ పరిస్థితి ఇదేనని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఆయా ఉద్యోగాలు కచ్చితంగా అర్హులకే దక్కేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అవకతవకలకు చోటు లేకుండా జాగ్రత్త వహించాలని స్పష్టంచేసింది. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను సంబంధిత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారానే భర్తీ చేయాలని, అక్రమ మార్గాలు అనుసరించకూడదని తేల్చిచెప్పింది. పరీక్షల్లో అక్రమాలను అరికట్టాలని పేర్కొంది. రాజస్తాన్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నిబంధనలు పాటించకుండా రాజీపడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజస్తాన్‌లో 2022లో అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పోస్టుల భర్తీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఓ సెంటర్లో ఒక అభ్యర్థి బదులు మరో అభ్యర్థి(డమ్మీ) హాజరైనట్లు తేలింది. ఇద్దరు అధికారుల ప్రోద్బలంతోనే ఇదంతా జరిగినట్లు విచారణలో గుర్తించారు. ఆ ఇద్దరు అధికారులు రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్ మంజూరయ్యింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కింది కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వును తోసిపుచ్చింది. రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఈ నెల 7వ తేదీన నిందితులను ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేలాది మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారని, వారికి అన్యాయం జరిగేలా ఎవరూ ప్రవర్తించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కొందరు స్వలాభం కోసం ఉద్దేశపూర్వకంగా చేసే తప్పులతో ఇతరులు నష్టపోవడానికి వీల్లేదని ఉద్ఘాటించింది. పోటీ పరీక్షల పారదర్శకతను దెబ్బతీయొద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. -
‘భార్య అలా చేస్తే భర్తకు ఇంతకు మించిన నరకం మరొకటి ఉండదు’ :హైకోర్టు
భోపాల్ : పెళ్లైన మహిళలు, వారి పురుష స్నేహితుల సాన్నిహిత్యంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం తర్వాత పురుషుడు లేదా స్త్రీ తమ స్నేహితులతో అసభ్యకరమైన ఫోన్ ఛాటింగ్‌లు చేయకూడదని, తన భార్య ఆ తరహా చాటింగ్‌లు చేస్తుంటే ఏ భర్త కూడా సహించలేడని పేర్కొంది. దిగువ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ సందర్భంగా ఫోన్ ఛాటింగ్‌పై వ్యాఖ్యానించింది. నా భార్య చాటింగ్ చేస్తోందిమధ్యప్రదేశ్కు చెందిన భార్య,భర్తల గొడవ ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే చర్చకు దారితీసింది. 2018లో దంపతులకి వివాహమైంది. అయితే, ఆ ఇద్దరి దంపతుల మధ్య పొరపొచ్చలొచ్చాయి. అప్పుడే తన భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ‘విచారణలో నా భార్య వివాహం తరువాత కూడా ఆమె ప్రియుడితో మాట్లాడుతోంది. అందుకు వాట్సప్ చాటింగే నిద్శనం. పైగా ఆ చాటింగ్ అసభ్యంగా ఉందని ఆధారాల్ని అందించారు.లేదు.. నా భర్తే నాకు రూ.25లక్షల భరణం ఇవ్వాలికానీ పిటిషనర్ భార్య మాత్రం భర్త చేస్తున్న ఆరోపణల్ని ఖండించింది. నా భర్త చెప్పినట్లుగా నేను ఎవరితోను సాన్నిహిత్యంగా లేను. చాటింగ్ చేయడం లేదు.నా భర్త కావాలనే నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు పుట్టించాడు. నా ఫోన్ హ్యాక్ చేసి మరి మరో ఇద్దరు పురుషులతో చాటింగ్ కూడా చేశారు. నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించనందుకు రూ.25లక్షలు భరణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పలు ఆరోపణలు చేసింది.భార్యే నిందితురాలుఅంతేకాదు, ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు భార్య-భర్త ఏపిసోడ్ భర్త చెప్పేవన్నీ నిజాలేనని నిర్ధారించింది. వాటిని నివృత్తి చేసుకునేందుకు భార్య తండ్రిని సైతం విచారించింది. విచారణలో ఆమె తండ్రి కూడా అంగీకరించారు. తన కుమార్తె పరాయి మగాడితో చాటింగ్ చేస్తుందన్న విషయాన్ని గుర్తించినట్లు కోర్టుకు చెప్పారు. దీంతో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.నాకు విడాకులొద్దు.. భర్తతోనే కలిసుంటాఫ్యామీలి కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ బాధిత మహిళ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు జస్టిస్ వివేక్ రష్యా, జస్టిస్ గజేంద్ర సింగ్‌ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో పిటిషనర్ తన ప్రియుడితో సె* లైఫ్ గురించి చాటింగ్ చేసినట్లు గుర్తించింది. భార్య పరాయి పురుషుడితో ఈ తరహా చాటింగ్ చేస్తే ఏ భర్త సహించలగడనే అభిప్రాయం వ్యక్తం చేసింది. భర్తలకు ఇంతకంటే నరకం మరొకటి ఉండదువివాహం తర్వాత, భర్త మరియు భార్య ఇద్దరూ తమ స్నేహితులతో మొబైల్, చాటింగ్, ఇతర మార్గాల ద్వారా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉందని గుర్తు చేస్తూ.. సంభాషణ స్థాయి సౌమ్యంగా, గౌరవప్రదంగా ఉండాలి. ముఖ్యంగా, మహిళ.. పురుషుడితో.. పురుషుడు స్త్రీతో మాట్లాడితే జీవిత భాగస్వామికి వ్యతిరేకంగా ఉండకూడదు’ అని కోర్టు పేర్కొంది. ఒక భాగస్వామి ఇలా అసభ్యకరమైన చాటింగ్ చేస్తే.. భర్తలకు ఇంతకంటే నరకం మరొకటి ఉండదని తెలిపింది. చివరగా.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. -
Ranya Rao : మరో బిగ్ షాక్.. రన్యారావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
బెంగళూరు : కన్నడ నటి రన్యారావు (Ranya Rao) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. భారీ మొత్తంలో అక్రమంగా బంగారం (Gold) తరలిస్తూ పట్టుబడిన రన్యా రావుకు బెంగళూరు ఆర్థిక నేరాల కోర్టు (Court for Economic Offences) ఆమెకు బెయిల్ తిరస్కరించింది. బంగారం స్మగ్లింగ్ కేసులో రన్యారావు బెంగళూరు ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆమె వెనక గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ ఉందనే అనుమానం వ్యక్తం చేసింది. .డీఆర్ఐ అధికారుల విచారణ ముమ్మరంఇటీవల బెంగళూరు ఎయిర్ పోర్టులో రూ.12.56కోట్లు విలువైన గోల్డు బార్స్‌ని స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు పట్టుబడిన కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI)దర్యాప్తు అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రన్యారావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.2.06కోట్లు విలువ చేసే బంగారం, రూ.2.67కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. రన్యారావు కేసులో భర్త?ఈ క్రమంలో గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు సైతం కేసు విచారణ చేపట్టారు. రన్యా రావు తన భర్త జతిన్ హుక్కేరి క్రెడిట్ కార్డును ఉపయోగించి బెంగళూరు నుండి దుబాయ్‌కు రౌండ్ ట్రిప్ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అతని పాత్ర ఎంత? అనే దిశగా విచారణ ప్రారంభించారు. రన్యారావు భర్తకు తాత్కాలిక ఊరటడైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) బెంగళూరులోని హుక్కేరికి చెందిన పది ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఇదే కేసులో డీఆర్ఐ అధికారులు తనని అరెస్ట్ చేయకుండా ఉండేలా ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం హుక్కేరీని అరెస్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.రన్యారావుకు ఫోన్ చేసింది ఎవరు?డీఆర్ఐ విచారణలో రాన్యా రావుకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. సదరు అగంతకులు రన్యారావును గోల్డ్ స్మగ్లింగ్ చేయాలని ఆదేశించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని రన్యారావును విచారించగా.. యూట్యూబ్‌లో చూసి బంగారం అక్రమంగా ఎలా తరలించాలో నేర్చుకున్నట్లు వెల్లడించారు. ఇక ఆమెను దుబాయ్ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ 3 aగేటు సమీపంలో ఓ వ్యక్తి వద్ద గోల్డ్‌ను తీసుకున్నానని, అంతకుముందు గోల్డ్ స్మగ్లింగ్ చేయలేదని చెప్పినట్లు సమాచారం. -
రైలు హైజాక్‌లో ఢిల్లీ హస్తమంటూ పాక్ కూతలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్ విషం చిమ్మే ప్రయత్నం చేసింది. ఇటీవల బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు రైలును హైజాక్ చేయడంలో, వారిని రెచ్చగొట్టడంతో భారత్ పాత్ర ఉంది పాకిస్థాన్ ఆరోపించింది. అంతేకాకుండా పొరుగుదేశాల్లో అస్థిరతకు భారత్ కృషి చేస్తోందని ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు అంటూ విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.ఇటీవల బలుచిస్తాన్‌లో ప్యాసింజర్ రైలు హైజాక్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు భారత్ కారణమంటూ తాజాగా పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్ఖత్ అలీఖాన్ వ్యాఖ్యలు చేశారు. భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండకు పాల్పడుతోందన్నారు. భారత మీడియా బీఎల్ఏను కీర్తిస్తోంది. ఇది అధికారికంగా కాకపోయినా ఒక విధంగా ప్రసారం చేస్తోంది అంటూ ఇష్టానుసారం ఆరోపణలు గుప్పించారు.ఈ నేపథ్యంలో షఫ్ఖత్ అలీఖాన్ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘పాక్ విదేశీ విధానంలో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్ నిరాధార ఆరోపణలు చేస్తోంది. వారు ఇతరుల వైపు వేళ్లు చూపించే బదులు తమ అంతర్గత సమస్యలపై దృష్టిసారిస్తే బాగుంటుంది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. ముందు అవ్వన్నీ చూసుకోవాలి’ అంటూ హితవు పలికారు.Our response to media queries on the remarks made by the Pakistan side ⬇️🔗 https://t.co/8rUoE8JY6A pic.twitter.com/2LPzACbvbf— Randhir Jaiswal (@MEAIndia) March 14, 2025ఇదిలాఉండగా.. ఇటీవల పాక్‌లోని బలోచిస్థాన్‌లో ప్రయాణికుల రైలును వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 400 మంది ప్రయాణిస్తున్న ఈ రైలుపై మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా.. 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్‌ను పేల్చి జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఇప్పటికే బలోచ్ మిలిటెంట్లు 33 మందిని చంపేసినట్లు పాకిస్థాన్ సైన్యం ప్రకటించింది. 21 మంది ప్రయాణికులతో సహా నలుగురు సైనికులు వారి చేతిలో హతమయ్యారని తెలిపింది. -
థరూర్ సీపీఎంలో చేరబోరు: కారత్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సీపీఎం పార్టీలో చేరతారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ తాత్కాలిక సమన్వయకర్త ప్రకాశ్ కారత్ తోసిపుచ్చారు. ఆయన పార్టీ వీడుతున్నట్లు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదన్నారు. కేవలం కేరళలో స్టార్టప్‌లు సాధిస్తున్న గణనీయమైన ప్రగతి గురించి మాత్రమే మాట్లాడారని చెప్పుకొచ్చారు. శశిథరూర్ సాధారణ వ్యక్తి కాదని ప్రశంసించిన కారత్.. ఆయన నిక్కచ్చి అభిప్రాయాలు కొన్నిసార్లు కాంగ్రెస్‌కు అసౌకర్యాన్ని కలిగిస్తాయన్నారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం సాధిస్తున్న పారిశ్రామికాభివృద్ధిని ప్రశంసిస్తూ థరూర్ గత నెలలో ఓ ఆంగ్ల పత్రికలో వ్యాసం రాశారు. ఇది రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ దానిపై ప్రశ్నల వర్షం కురిపించగా.. సీపీఎం వ్యాసాన్ని స్వాగతించింది. అయితే తాను ప్రభుత్వాన్ని ప్రశంసించలేదని, కేవలం స్టార్టప్ రంగంలో రాష్ట్ర ప్రగతిని ఎత్తి చూపానని థరూర్ స్పష్టం చేశారు. ఆ తరువాత మలయాళంలో ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేరళలో పార్టీ నాయకత్వ బాధ్యతలకు తాను అర్హుడినని ప్రకటించారు. సంసిద్ధతను సైతం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన కాంగ్రెస్‌లో ఒక వర్గాన్ని కలవరపరిచింది. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ థరూర్ మీడియాపై మండిపడ్డారు. -
పంచాయతీ ఎన్నికల జాప్యం.. సంక్షేమానికి విఘాతం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల జాప్యం కారణంగా ప్రజాభివృద్ధికి విఘాత కలుగుతోందని పంచాయతీరాజ్ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక అభివృద్ధి నిధులు నిలిచిపోయాయని గుర్తుచేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తగు చర్యలు చేపట్టాలని స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తమ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ (2025–26) నివేదికను బుధవారం పార్లమెంట్‌కు సమర్పించింది. ఇందులో పంచాయతీ ఎన్నికల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ‘73వ రాజ్యాంగ సవరణ ద్వారా అన్ని రాష్ట్రాలు గ్రామ స్థాయిలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ఈ(3) ప్రకారం పంచాయతీ ఎన్నికలను ఆ గ్రామపంచాయతీ కాలపరిమితి ముగిసేలోపు లేదంటే రద్దయ్యాక ఆరు నెలల వ్యవధిలోపు పూర్తి చేయాలి. ఒక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కచ్చితంగా పాటించాల్సిన రాజ్యాంగపరమైన నిబంధన’ అని కమిటీ పేర్కొంది. ‘‘ పుదుచ్చేరి (2011), కర్ణాటక (2021), మహారాష్ట్ర (2022), మణిపూర్ (2022), లక్షద్వీప్ (2022), అస్సాం(2023), జమ్మూకశ్మీర్ (2023), లద్దాఖ్ (2023)లలో వివిధ కారణాల వల్ల పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్‌లలో 2024 ఏడాదిలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ఇంకా నిర్వహించలేదు’’ అని కమిటీ తెలిపింది. ఈ విషయంలో సంబంధిత రాష్ట్ర హైకోర్టు, ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాయని తెలిపింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం వల్ల గ్రామ అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాలకు కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఆగిపోయాయని పేర్కొంది. ‘‘ఈ గ్రాంట్లు, నిధులు మంజూరు పంచాయతీలకు సకాలంలో సాకారం అయి ఉంటే ఆయా గ్రామాల ప్రజలు వివిధ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ఫలాలను అందుకుని ఉండేవారు’’ అని కమిటీ వ్యాఖ్యానించింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగని కారణంగా నిధుల లభ్యత లేకపోవడంతో గ్రామాల్లో ప్రజల పరిస్థితి మెరుగ్గా లేదని రాష్ట్రాల పర్యటనల్లో తేలినట్లు కమిటీ పార్లమెంట్ దృష్టికి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించేలా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సత్వరం అత్యున్నత స్థాయి చర్యలు చేపట్టాలని కమిటీ సిఫార్సు చేసింది.‘ఉపాధి’కి నిధులు పెంచాలిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకానికి నిధులు పెంచాలని, కార్మికుల కనీస వేతనాలను పెంచాలని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ‘ గతంతో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనూ గ్రామీణ ఉపాధి పథకానికీ కేటాయింపులు తగ్గాయి. ఇప్పుడు కేవలం రూ.86,000 కోట్ల కేటాయింపులు చేశారు. గ్రామాల్లో తీవ్ర పేదరికం, నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న గ్రామీణులకు ఉపాధిహామీ పథకం ఇన్నాళ్లూ కీలకమైన రక్షణచట్రంగా నిలిచింది. కరోనా కాలంలో కోట్లాది మంది పేదలను ఈ పథకం ఆదుకుంది. అణగారిన వర్గాలకు ఉపాధిని కల్పించే ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు తగినంత బడ్జెట్ కేటాయింపులు చేయడం చాలా అవసరం. అందుకే ఈ పథకానికి కేటాయింపులు సమధికంగా పెంచాలి. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖపై గ్రామీణాభివృద్ధి శాఖ ఒత్తిడి తీసుకురావాలి’’ అని కమిటీ సిఫార్సు చేసింది. పెరుగుతున్న జీవన వ్యయం, గ్రామీణ కార్మికుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రోజువారీ వేతన రేట్లు తగిన విధంగా సవరించాలని సూచించింది. -
పదేళ్ల తుప్పును వదిలిస్తున్నాం!
సాక్షి, న్యూఢిల్లీ: పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని తుప్పు పట్టించిందని, దానిని వదిలించే పనిలో తామున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పట్టిన తుప్పును ఒకేసారి వదిలించాలంటే వ్యవస్థ దెబ్బతింటుందని, అందుకే నెమ్మది నెమ్మదిగా వదిలిస్తూ అభివృద్ధి దిశగా ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతోందని, నిధుల సాధనలో ఇద్దరు కేంద్ర మంత్రులూ ఏమాత్రం పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.గురువారం విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్ కొద్దిసేపు మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘ఏ ముఖ్యమంత్రికైనా అధికారం చేపట్టిన తర్వాత అన్నీ సర్దుకోవడానికి రెండేళ్లు సమయం పడుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ఇలా ఎవరి పాలనైనా చూడండి.. గత పాలకులు పరిపాలించిన దానిని చక్కదిద్దడానికే రెండేళ్లు సమయం పట్టింది. ఓ పక్క రాష్ట్రాన్ని సర్దుకుంటూ మరోపక్క ప్రతీ హామీని అమలుచేస్తూ ముందుకెళ్తున్నా’అని చెప్పారు.కేంద్ర మంత్రి అయినందునే కిషన్‌రెడ్డి టార్గెట్ ‘కేంద్ర మంత్రివర్గంలో పనిచేసే వాళ్లు ఎవరైనా సొంత రాష్ట్రాల సమస్యలను లేవనెత్తుతారు. ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తారు. నిర్మలా సీతారామన్ అలాగే చెన్నై మెట్రోను సాకారం చేశారు. కానీ, మన కిషన్‌రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన అంశాలేవీ పట్టించుకోరు. నేను ముఖ్యమంత్రిని కాబట్టే కదా? అందరూ నన్ను టార్గెట్ చేస్తోంది.కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి కాబట్టే ఆయనను టార్గెట్ చేస్తున్నాం. రాష్ట్రానికి ఏం తెచ్చారని అడిగితే తప్పేంటి? మూసీ, ట్రిపుల్ ఆర్, మెట్రో ఇలా ఎన్నో ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో ఆయన ఏమైనా మాట్లాడారా? ఆయన కేంద్రంతో మాట్లాడి అనుమతులు తెప్పిస్తే పనులు మొదలుపెట్టొచ్చు. కిషన్‌రెడ్డి రాష్ట్రం కోసం మాట్లాడరు, మరో మంత్రి బండి సంజయ్ ఒక నిస్సహాయ మంత్రి ’అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. హిందీని రుద్దడం ఏంటి? మూడు భాషల విధానాన్ని రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. ‘అసలు హిందీ జాతీయ భాష ఏంటి? మీరు అనుకుంటే సరిపోతుందా? హిందీ అనేది దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష. ఆ తర్వాత అత్యధికమంది మాట్లాడే భాష తెలుగే. మూడో వరుసలో బెంగాల్ భాష ఉంటుంది. మీరు హిందీ మాట్లాడతారు కదా? అందరూ అదే మాట్లాడాలంటే ఎలా?’అని రేవంత్ అన్నారు. ‘గాంధీ కుటుంబంతో సీఎంకు సాన్నిహిత్యం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. గాంధీ కుటుంబంతో అందరూ అనుకునేదానికంటే ఎక్కువే సాన్నిహిత్యం ఉంది’ అని తెలిపారు.ప్రజలకు చెప్పకపోతే ఎలా? ‘రూ.7 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు ఆ విషయాన్ని ప్రజలకు చెప్పకపోతే ఎలా? పదవుల విషయంలో నేను సమీకరణాలను చూడలేదు, కేవలం నేను ఇచ్చిన మాటనే చేశా. రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీ, వివిధ చైర్మన్ పదవులు అన్నీ కూడా పార్టీ కోసం కష్టపడిన వారికే ఇచ్చాను. విజయశాంతి ఎన్నికల్లో పోటీ చేయనన్నారు, ఆమె పార్టీకోసం ఎంతో కాలం కష్టపడి పనిచేశారు అందుకే ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు.నేను ఇక్కడ కులగణన చేశాను మరి ఏపీలో బీజేపీ అధికారంలో ఉంది అక్కడ ఎందుకు చేయడం లేదు? కేసీఆర్ అసెంబ్లీలో జరిగే చర్చలకు కూడా రావాలి. ఓన్ట్యాక్స్ రెవెన్యూలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగం గణనీయంగా తగ్గింది. నేను 2029 ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రజలే ఈ విషయాలన్నీ గమనిస్తారు. చెప్పినవి చేస్తే వాళ్లే మనకు అండగా నిలుస్తారు’అని రేవంత్ చెప్పారు. వచ్చే మే నెలలో హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఆ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. -
మరో షాక్.. ఆప్ నేతలపై కేసు నమోదుకు రాష్ట్రపతి అనుమతి?
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలపై కేసుల నమోదుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఢిల్లీలోని పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణంలో రూ.1300 కోట్ల మేర కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి అనుమతి లభించినట్లు సమాచారం.ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పబ్లిక్ వర్క్స్ శాఖ 2400 తరగతి గదుల నిర్మాణంలో అవకతవకలు ఉన్నట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) 2020 ఫిబ్రవరి 17న తన నివేదికలో పేర్కొంది. ఈ క్రమంలోనే 2022లో ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ డైరెక్టరేట్ ఈ కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తునకు సిఫారసు చేస్తూ ప్రధాన కార్యదర్శికి నివేదికను సమర్పించింది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా ఉన్న వీరిపై ఎఫ్ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు సమాచారం. -
ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడే.. ఈ రూపాయి (₹) సింబల్‌ను డిజైన్ చేసింది..
ఢిల్లీ: జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాష సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం,తమిళనాడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రతుల్లో రూపాయి (₹) సింబల్‌ను (Rupee symbol row) తొలగించింది. ఆ స్థానంలో తమిళనాడులో రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చింది. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లైంది. ఈ క్రమంలో ఆ రూపాయి సింబల్ డిజైన్ ఎవరు తయారు చేశారు? అనే అంశంపై నెట్టింట్లో పెద్ద ఎత్తున జరుగుతోంది.రూపాయి సింబల్‌ను ఎవరు డిజైన్ చేశారు?ఇక ఆ రూపాయి డిజైన్‌ను చేసింది మరెవరోకాదు తమిళనాడు అధికార డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎన్.ధర్మలింగం కుమారుడు ఐఐటీ ప్రొఫెసర్ డీ.ఉదయ్‌కుమార్ ధర్మలింగం. తొలిసారిగా ఈ రూపాయి సింబల్ 2010లో నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ వినియోగంలోకి తెచ్చారు. రూపాయి డిజైన్ ఎలా చేశారంటే?2010 నాటి యూపీఏ ప్రభుత్వం రూపాయి డిజైన్ చేసేందుకు దేశవ్యాప్తంగా పోటీ నిర్వహించింది. అయితే, ఈ కాంటెస్ట్‌లో ఐఐటీ ముంబైలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఉదయ కుమార్ సైతం పాల్గొన్నారు. రూపాయి సంకేతం డిజైన్ చేయడంలో దేవనాగరి, రోమన్ భాషల్ని కలుపుతూ రూపాయి డిజైన్ చేశారు. రూపాయి సింబల్ కోసం దేవనగరి భాషలోని ‘ర’ను రోమన్‌లోని ‘ఆర్’ కలిపి రూ (₹) సింబల్‌ను తయారు చేశారు. సరిగ్గా ఐఐటీ గౌహతి డిజైన్ విభాగంలో కొత్త ఉద్యోగంలో చేరే ఒక రోజు ముందు కేంద్రం రూపాయి సింబల్ కోసం ఏర్పాటు చేసిన పోటీ విజేతల్ని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా వందల కొద్ది డిజైన్లు పరిశీలించగా.. ఆ డిజైన్లు అన్నింటిల్లో ఉదయకుమార్ డిజైన్ చేసిన రూపాయి డిజైన్‌ను కేంద్రం ఎంపిక చేసింది.భారత కరెన్సీలో రూపాయి సింబల్ 2010 జూలై 15న,మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కరెన్సీ నోట్లపై ఉదయ కుమార్ డిజైన్ చేసిన రూపాయి సింబల్‌ను చేర్చింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారత కరెన్సీ గుర్తింపు అమాంతం పెరిగినట్లు ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో తిరువణ్ణామలై సమీపంలో ఉన్న మారూరు గ్రామంలో జన్మించిన ఉదయ కుమార్ రూపాయి సింబల్‌ను ఎలా డిజైన్ చేశారో వివరించారు. ఇక, ప్రస్తుతం ఉదయ కుమార్ ఐఐటీ గౌహతి డిజైన్ విభాగం హెచ్ఓడీగా ఉన్నారు. ఐఐటీ-హైదరాబాద్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వంటి అనేక సంస్థలకు లోగోలు డిజైన్ చేశారు. -
ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్.. పేపర్ లీకేజీలపై రాహుల్ ట్వీట్
ఢిల్లీ: ప్రశ్నాపత్రాల లీకేజీలను వ్యవస్థాగత వైఫల్యంగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా.. లీక్‌ల కారణంగా కష్టపడి చదివే ఎంతో మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని.. దీనిపై పోరాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విభేదాలు పక్కన పెట్టి కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు.‘ప్రశ్నాపత్రాల లీకులతో ఆరు రాష్ట్రాల్లోని 85 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్న రాహుల్.. వీటి కారణంగా కష్టపడి చదివే విద్యార్థులతో పాటు వారి కుటుంబాలు కూడా ఒత్తిడికి గురవుతున్నాయన్నారు. వారి కష్టానికి తగిన ఫలితం అందడం లేదన్నారు. దీంతో కష్టపడి పనిచేయడం కంటే నిజాయితీగా లేకపోవడమే మంచిదనే తప్పుడు సంకేతాలు భవిష్యత్ తరాలకు వెళ్తుందంటూ అభిప్రాయవ్యక్తం చేసిన రాహుల్.. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు.‘‘ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం లీకులను అడ్డుకోలేకపోయింది. ఇది వారి వైఫల్యానికి నిదర్శనం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విభేదాలు పక్కనబెట్టి దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే వీటిని అరికట్టగలం. ఈ పరీక్షలు మన పిల్లల హక్కు. దాన్ని ఎలాగైనా రక్షించాలి’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.6 राज्यों में 85 लाख बच्चों का भविष्य ख़तरे में - पेपर लीक हमारे युवाओं के लिए सबसे ख़तरनाक "पद्मव्यूह" बन गया है।पेपर लीक मेहनती छात्रों और उनके परिवारों को अनिश्चितता और तनाव में धकेल देता है, उनके परिश्रम का फल उनसे छीन लेता है। साथ ही यह अगली पीढ़ी को गलत संदेश देता है कि… pic.twitter.com/nWHeswvMOC— Rahul Gandhi (@RahulGandhi) March 13, 2025 -
దక్షిణాదిపై బీజేపీ పగబట్టింది: రేవంత్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేది లేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ విషయంలో తెలంగాణలోని అన్ని పార్టీలపై సమావేశం నిర్వహిస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో డీలిమిటేషన్‌పై మార్చి 22న తమిళనాడు ప్రభుత్వ నిర్వహించే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని డీఎంకే నేతలు, ఎంపీలు ఆహ్వానించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్ చూపించిన చొరవ అభినందనీయం. 22వ తేదీన తమిళనాడులో జరిగే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి వెళ్లే అంశంపై ఏఐసీసీ అనుమతి తీసుకొని వెళ్తాం. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది. డీలిమిటేషన్ లిమిట్ ఫర్ సౌత్ లాగా ఉంది.డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేదే లేదు. ఉత్తరాది రాష్ట్రాల కన్నా దక్షిణాది రాష్ట్రాలు అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రావాలని కోరుతున్నాం. డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి తన గళం కేంద్ర క్యాబినెట్లో వినిపించాలి. తెలంగాణలోని అన్ని పార్టీలపై సమావేశం నిర్వహిస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
ఇన్స్టాగ్రామ్ పరిచయం.. భారత్‌కు రావడమే ఆమెకు శాపమైంది
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం ఢిల్లీకి వచ్చిన విదేశీయురాలిపై లైంగిక దాడి జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం..భారత్‌కు చెందిన కైలాష్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన మహిళకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. దీంతో, ఆమెను భారత్‌కు రావాల్సి కైలాష్ కోరారు. దీంతో, ఆమె.. మహారాష్ట్ర, గోవాలో పర్యటించేందుకు ఇక్కడికి వచ్చారు. అక్కడ పర్యటనలో ఉండగా ఆమె.. కైలాష్కు ఫోన్ చేసి తన దగ్గరకు రావాలని కోరింది. అయితే, తాను అంత దూరం ప్రయాణించలేనని కైలాష్.. ఆమెకు చెప్పాడు. ఢిల్లీకి రావాలని ఆమెకు కైలాష్ సూచించారు.ఈ క్రమంలో బాధితురాలు మంగళవారం ఢిల్లీకి చేరుకుంది. అనంతరం, మహిపాల్‌పూర్‌లోని ఒక హోటల్లో బస చేసింది. ఆ తర్వాత ఆమె.. కైలాష్కు ఫోన్ చేసి తాను హోటల్లో ఉన్నట్టు తెలిపింది. దీంతో, కైలాష్ తన స్నేహితుడు వసీంతో కలిసి హోటల్‌కు వెళ్లారు. రాత్రి వారిద్దరూ అక్కడే బస చేశారు. అదే అదునుగా భావించిన వసీం.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో మరుసటి రోజు ఉదయమే బాధితురాలు.. మహిళ వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కైలాష్, వసీంను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. అలాగే, మార్గదర్శకాల ప్రకారం.. ఈ ఘటనపై బ్రిటిష్ హైకమిషన్‌కు సమాచారం అందించారు. ఇక, కైలాష్ ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలిసింది. తనకు ఇంగ్లీష్ మాట్లాడటం కష్టమని, తనతో కమ్యూనికేట్ చేయడానికి గూగుల్ ట్రాన్స్‌లేట్ ఉపయోగించేవాడని పోలీసులకు బాధితురాలు తెలిపింది.British Woman Allegedly Raped In Delhi Hotel By Man She Met on Instagram @anushkagarg2000 reports pic.twitter.com/kGI9dWxwJ2— NDTV (@ndtv) March 13, 2025 -
Madras High Court : మాతృభాషలో చదవడం, రాయడం వస్తేనే ప్రభుత్వ ఉద్యోగం..
చెన్నై: జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు- కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కీలక వ్యాఖ్యాలు చేసింది. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి తప్పని సరిగా తమిళంలో చదవడం, రాయడం వచ్చి ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది. తమిళనాడు విద్యుత్ బోర్డు (TNEB)లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పొందాలంటే తప్పని సరిగా తమిళ భాష పరీక్ష (Tamil Language Test)లో తప్పని సరిగా ఉత్తీర్ణత సాధించాలి. లేదంటే ఉద్యోగానికి అనర్హులు. టీఎన్ఈబీ నిర్వహించిన తమిళ లాంగ్వేజ్ టెస్టులో ఫెయిలైన అభ్యర్థి ఇదే అంశాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ సమయంలో హైకోర్టు కోర్టు ధర్మాసనం తమిళ మాతృభాష గురించి ప్రస్తావించింది.తమిళనాడు రాష్ట్రం తేని జిల్లాకు చెందిన జే.జైకుమార్ రాష్ట్ర విద్యుత్ శాఖ ఉద్యోగి. అయితే జైకుమార్ రెండేళ్లలో తమిళ లాంగ్వేజ్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సింది. కానీ పాసవ్వలేదు. దీంతో విద్యుత్ శాఖ అతన్ని విధుల నుంచి తొలగించింది. తమిళ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఫెయిల్ కావడంతో ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ తమిళనాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తండ్రి నావల్ సర్వీస్‌లో పని చేయడం వల్ల తాను సీబీఎస్ఈ స్కూల్లో చదివానని, అందువల్ల తాను తమిళం నేర్చుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌పై జి జయచంద్రన్, ఆర్ పూర్ణిమా ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా పిటిషనర్‌కు మాతృభాష తమిళం రాకపోవడంపై పిటిషనర్‌కు పలు ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ ఉద్యోగులు తమిళం రాకుండా ఎలా పని చేయగలరు? రోజువారి పనులను ఎలా చేస్తారు? ఏ రాష్ట్రంలోనైనా, ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర భాష తెలియాలి. అలా లేనిపక్షంలో ఉద్యోగాలు ఎలా చేస్తారు?’అని బెంచ్ వ్యాఖ్యానించింది.అభ్యర్థులు ప్రభుత్వ భాష పరీక్షను నిర్ణీత సమయంలో పాసవాలని, తమిళ భాష నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అనంతరం, ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసును ఆరువారాల పాటు వాయిదా వేసింది. -
ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరం మనదే!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో కిటకిటలాడుతున్న మన దేశం కాలుష్య నగరాల జాబితాలోనూ టాప్‌లో ఉంది. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన మొదటి 20 నగరాల్లో మనవి ఏకంగా 13 నగరాలున్నాయి. ఇందులో మొదటి స్థానంలో అస్సాంలోని బిర్నిహాట్ (Byrnihat) నిలిచింది. దేశ రాజధానుల్లో ప్రపంచంలోనే అత్యంత కలుషితమైందిగా ఢిల్లీ (Delhi) అగ్రస్థానంలో ఉంది.స్విట్జర్లాండ్ కంపెనీ ఐక్యూ ఎయిర్ మంగళవారం వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్–2024 పేరిట ఈ నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత దేశాల్లో భారత్ 2023లో మూడో ర్యాంకులో ఉండగా తాజాగా కాస్తంత మెరుగ్గా ఐదో స్థానానికి చేరింది. టాప్–20లోని అత్యంత కలుషితమైన నగరాల్లో పొరుగు దేశం పాకిస్తాన్లోనివి నాలుగు ఉండగా, చైనాకు చెందిన ఒక నగరముంది.టాప్–20లో.. బిర్నిహట్, ఢిల్లీ, ముల్లన్పూర్(పంజాబ్), ఫరీదాబాద్, లోని, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నోయిడా, భివాడి, ముజఫర్‌నగర్, హనుమాన్‌గఢ్, నోయిడా (Noida) ఉన్నాయి. భారత్‌లోని 35 శాతం నగరాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన పరిమితికి మించి వార్షిక పీఎం 2.5 స్థాయిలు పది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.కాగా, అస్సాం– మేఘాలయ సరిహద్దుల్లోని బర్నిహట్‌లో డిస్టిలరీలు, ఐరన్, స్టీల్ ప్లాంట్ల కారణంగా ఎక్కువ కలుషిత ఉద్గారాలు ఉన్నట్లు నివేదిక వివరించింది. గాలి కాలుష్యం భారత్‌లో ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమించిందని, ఆయుర్దాయం సగటున 5.2 ఏళ్లు తగ్గుతోందని తెలిపింది. భారత్ ఏటా 15 లక్షల మంది గాలి కాలుష్యం (Air Pollution) కారణంగా చనిపోతున్నట్లు లాన్సెట్ తెలిపింది. డేటా ఉంది.. చర్యలేవి?: సౌమ్య స్వామినాథన్ గాలి నాణ్యత డేటా సేకరణలో భారతదేశం పురోగతి సాధించిందని, అయితే కాలుష్య నియంత్రణకు తగినంత చర్యలు చేపట్టడం లేదని WHO మాజీ ప్రధాన శాస్త్రవేత్త, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాదారు సౌమ్య స్వామినాథన్ (Soumya Swaminathan) అన్నారు. 'మన దగ్గర డేటా ఉంది కాబట్టి కాలుష్య నివారణ చర్యలు అవసరం. బయోమాస్‌ను LPGతో భర్తీ చేయడం వంటి కొన్ని పరిష్కారాలు సులభంగా చేయొచ్చు. భారతదేశంలో ఇప్పటికే దీని కోసం ఒక పథకం ఉంది, కానీ అదనపు సిలిండర్లకు ప్రభుత్వం మరింత సబ్సిడీ ఇవ్వాలి. మొదటి సిలిండర్ ఉచితం, కానీ పేద కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు అధిక సబ్సిడీలు పొందాలి. ఇది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బహిరంగ వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది. నగరాల్లో ప్రజా రవాణాను విస్తరించాలి, అలాగే వ్యక్తిగత వాహనాలపై నియంత్రణ అవసరం. ఉద్గార నివారణ చట్టాలను కఠినంగా అమలు చేయడం చాలా ముఖ్యం. పరిశ్రమలు, నిర్మాణ ప్రదేశాల ఉద్గారాలను తగ్గించడానికి గట్టిగా ప్రయత్నించాల'ని సౌమ్య స్వామినాథన్ అన్నారు. చదవండి: జట్కా మటన్ అంటే ఏంటి, ఎక్కడ దొరుకుతుంది? -
ఇష్టానుసారం మాటలు కాదు.. దమ్ముంటే నిరూపించండి: మిథున్ రెడ్డి సవాల్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో టీడీపీ మరో కొత్త నాటకానికి తెర లేపిందన్నారు వైఎస్సార్సీపీ లోక్‌సభపక్షనేత, ఎంపీ మిథున్‌రెడ్డి. తప్పుడు ఆరోపణలతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. టీడీపీకి దమ్ముంటే ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు.వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసింది. క్షక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తప్పుడు ఆరోపణలతో మా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. టీడీపీ మళ్లీ కొత్త నాటకానికి తెరలేపింది. లిక్కర్ స్కాం చేశామని ఆరోపణలు చేస్తున్నారు.. దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయండి. మొదట 50వేల కోట్ల రూపాయల స్కాం అని ప్రచారం చేశారు. ఇప్పుడు మూడువేల కోట్ల రూపాయల స్కాం అని ఆరోపణలు చేస్తున్నారు. మూడువేల కోట్ల రూపాయలు మడిచి జేబులో పెట్టుకుంటారా?.ఢిల్లీలో ప్రభుత్వ దుకాణాలను ప్రైవేటులో నడిపారు. కానీ, మా ప్రభుత్వంలో పారదర్శకంగా ప్రభుత్వమే దుకాణాలను నిర్వహించింది. మేము భూములు కబ్జా చేశామని తప్పుడు ఆరోపణలు చేశారు. అఫిడవిట్లో కాకుండా, అదనపు భూమి మాకు ఏమైనా ఉంటే చూపించండి. అరెస్టు చేసిన గౌతమ్ తేజ్ వ్యక్తికి పాలీ గ్రాఫ్ టెస్ట్ చేశారు. అందులో కూడా ఆయన నేరం చేయలేదని తేటతెల్లమైంది. వందల మైన్ కాదు ఒక్క మైన్‌లో కూడా అక్రమాలు చూపండి. ఒక్క ఆరోపణకైనా సాక్ష్యం చూపించారా?. మీకు దమ్ముంటే ఆరోపణలను రుజువు చేసి చూపించండి.ఎర్రచందనం విషయంలోను ఇలాగే తప్పుడు ఆరోపణలు చేశారు. మాపై బురద కొట్టి పారిపోతున్నారు. పసలేని ఆరోపణలు చేస్తున్నారు. అటవీ భూములు కబ్జా చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. మా కుటుంబంపైనే 75 ఎకరాల భూమి ఉందని కలెక్టర్ రిపోర్టు ఇచ్చారు. కలెక్టర్ చేసిన దర్యాప్తులో కూడా టీడీపీ ఆరోపణలు రుజువు కాలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రెండు నెలల్లో ట్రిపుల్ ఆర్ ఆమోదం!
సాక్షి, న్యూఢిల్లీ: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) క్లియరెన్స్‌లన్నీ త్వరలో పూర్తికానున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ ఆమోదానికి వెళ్తుందని చెప్పారు. ఈప్రక్రియ అంతా రెండు నెలల్లో పూర్తి చేస్తామని కేంద్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కోమటిరెడ్డి మంగళవారం ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనలతో కలిసి గడ్కరీతో భేటీ అయ్యారు.ట్రిపుల్ ఆర్, హైదరాబాద్–విజయవాడ ఆరులేన్ల రోడ్డు, 12 ఆర్వోబీలు తదితర అంశాలపై గడ్కరీతో చర్చలు జరిపారు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు విమానాశ్రయాల గురించి పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. కొత్తగూడెం, రామగుండం, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎయిర్‌పోర్టుల అంశంపై చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. 95 శాతం భూసేకరణ చేశాం 2018–19లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రకటించగా.. అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కోమటి రెడ్డి విమర్శించారు. తాము అధికారం చేపట్టిన నాటి నుంచి కేంద్రంతో టచ్‌లో ఉంటూ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జంగారెడ్డి–భువనగిరి–చౌటుప్పల్ వరకు టెండర్లు పిలిచామన్నారు. 95 శాతం భూసేకరణను క్లియర్ చేశామని, కేంద్రం నుంచి ఆమోదం వచ్చాక వారికి పరిహారమిస్తామని తెలిపారు.‘హైదరాబాద్–విజయవాడ ఆరులేన్ల రహదారిని మచిలీపట్నం వరకు పొడిగిస్తున్నామని, ఇందుకు కన్సల్టెంట్‌ను పిలిచినట్లు గడ్కరీ తెలిపారు. అయితే, హైదరాబాద్–విజయవాడ వరకు ఇప్పటికే భూసేకరణ పూర్తయినందున త్వరగా టెండర్లు పిలవాలని కోరాను. రెండు ప్యాకేజీలుగా ఈ రహదారిని నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది.మొదటి ప్యాకేజీలో మల్కాపూర్–విజయవాడ, రెండో ప్యాకేజీలో విజయవాడ–మచిలీపట్నం వరకు నిర్మాణం జరిపేందుకు గడ్కరీ ఒప్పుకున్నారు. పర్వతమాల పథకం కింద యాదగిరిగుట్ట, భువనగిరి కోటకు, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ఆనకట్ట మీదుగా నాగార్జున కొండను కలుపుతూ, మంథనిలోని రామగిరి కోట ప్రాంతాల్లో రోప్‌వేలు అడిగాను. వీటిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు’అని కోమటిరెడ్డి చెప్పారు.అనర్హత వేటు పడుతుందనే అసెంబ్లీకి కేసీఆర్ అనర్హత వేటు పడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక లేనట్లేనని, ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. ‘కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తానని కేసీఆర్ అంటున్నారు, ఒకవేళ కేసీఆర్ ఒక అంశాన్ని ఎత్తి చూపితే పది అంశాలను సభ ముందు పెడతాం. దళిత సీఎం నుంచి జర్నలిస్ట్‌ల వరకు కేసీఆర్ చేసిన మోసాలను ఎండగడతాం’అని అన్నారు. రేవంత్‌రెడ్డి పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలిపారు. సీఎం మార్పు జరుగుతుందని వస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనంటూ కొట్టిపడేశారు. -
14 నెలలైనా.. హామీల అమలులో అదే కాలయాపన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు ప్రకటించి, అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఆ హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ బీజేపీ అని, తాము చేయలేకపోయిన హామీలను ఇంకొకరి మీద వేసి, వారు అడ్డుకుంటున్నారు అని ఎప్పుడూ ఎవరినీ నిందించలేదని పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డిని కిషన్‌రెడ్డి విమర్శించారు. కొత్త ప్రాజెక్టుల పేరు మీద రూ. 1.5 లక్షల కోట్లు కావాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చిన్నపిల్లల నవ్వులాటలా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్థిక వనరులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని కిషన్‌రెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో భారతీయ పురాతన చేతివృత్తుల వైభవాన్ని గుర్తుచేస్తూ రచించిన ‘వూట్జ్: ద ఫర్గాటెన్ మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ డెక్కన్’పుస్తకాన్ని కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, తన వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతున్నారని విమర్శించారు. ఇది దివాలాకోరు విధానం, బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 7.5 లక్షల కోట్లు అప్పు చేసిందని, తమకు తెలియదని, రాష్ట్ర అప్పు రూ.3.5 లక్షల కోట్లే అనుకున్నానని రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నానని, హామీలు అమలు చేయలేకపోతున్నానంటూ ముఖ్యమంత్రి మాట మార్చడం రాహుల్‌గాం«దీ, రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతకు అద్దం పడుతోందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు తామే హామీ ఇచ్చామని, తప్పకుండా అమలు చేస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా, మహిళలకు ఇచ్చిన హామీలు, జాబ్ కేలండర్, నిరుద్యోగ భృతి, రైతులు, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, పెన్షన్లు సహా ఇచి్చన అన్ని హామీల గురించి ప్రస్తావిస్తామన్నారు. వీటన్నింటి గురించి శాసనసభలో చర్చిస్తే బాగుంటుందని కిషన్‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో రాష్ట్రాన్ని దోపిడీ చేశారని, రియల్టర్లను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామన్న భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తనపై వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు. తనను ఎవరు తిట్టినా వారి విజ్ఞతకే వదిలేస్తానని చెప్పారు. -
ఇండస్ఇండ్ ఇన్వెస్టర్లకు షాక్
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియో ఖాతాల నిర్వహణలో రూ. 2,100 కోట్లమేర అంతరం నమోదైనట్లు తాజాగా ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ వెల్లడించింది. అయితే బ్యాంక్‌వద్ద తగినంత రిజర్వులు, మూలధనం ఉండటంతో కవర్ చేసుకోగలమని పేర్కొంది. అయితే యాజమాన్యం హామీ ఇచ్చినప్పటికీ ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తాయి. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇండస్ఇండ్ షేరు 10% పతనమైంది. ఆపై మరింత బలహీనపడుతూ 20% సర్క్యూట్‌ను తాకింది. సర్క్యూట్ నుంచి రిలీజ్ అయ్యాక మరింత దిగజారింది. వెరసి ట్రేడింగ్ ముగిసేసరికి 27% కుప్పకూలి రూ. 657 వద్ద నిలిచింది. ఒక దశలో రూ. 649 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఏం జరిగిందంటే? ఖాతాలో వ్యత్యాసాన్ని గతేడాది(2024) సెప్టెంబరు– అక్టోబర్‌లో గుర్తించినట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈవో, ఎండీ సుమంత్ కథ్పాలియా పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రాథమిక సమాచారాన్ని ఆర్బీఐకు గత వారమే నివేదించినట్లు తెలియజేశారు. అయితే తుది వివరాలు బయటి ఏజెన్సీతో చేయిస్తున్న ఆడిట్ ద్వారా వెల్లడికానున్నట్లు పేర్కొన్నారు. నివేదిక ఏప్రిల్ మొదట్లో వెలువడనున్నట్లు తెలియజేశారు. లాభదాయకత, మూలధన పటిష్టత నేపథ్యంలో ఈ ప్రభావాన్ని బ్యాంక్ సర్దుబాటు చేసుకోగలదన్నారు. 2024 ఏప్రిల్1కు ముందు 5–7ఏళ్లుగా డెరివేటివ్ పోర్ట్‌ఫోలియో ఖాతాలో తేడా నమోదవుతూ వచ్చిందని చెప్పారు. ఎక్స్ఛేంజీలకు సమాచారం...డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో కొన్ని అంతరాలున్నట్లు సోమవారం ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదించింది. వీటి వల్ల బ్యాంక్ నెట్‌వర్త్‌పై 2.35 శాతంమేర ప్రతికూల ప్రభావం పడే వీలున్నట్లు పేర్కొంది. అంతర్గత సమీక్ష ద్వారా ఈ అంశాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. వీటిని స్వతంత్రంగా సమీక్షించి నిర్ధారించేందుకు బయటి ఏజెన్సీని ఎంపిక చేసినట్లు తెలిపింది.కాగా.. ట్రెజరీ బిజినెస్‌లో గుర్తించిన వ్యత్యాసం అంతర్గత, చట్టబద్ధ, ఆర్బీఐ ఆడిట్లలో బయటపడకపోవడం గమనార్హం! 2024 ఏప్రిల్ 1నుంచి డెరివేటివ్స్‌లో ఇంటర్నల్ ట్రేడ్‌ను నిలిపివేస్తూ 2023 సెప్టెంబరులో జారీ అయిన ఆర్బీఐ సర్క్యులర్ కారణంగా అంతర్గత బుక్‌పై సమీక్షకు తెరతీసినట్లు సుమంత్ వెల్లడించారు. దీంతో బయటి ఆడిట్‌కు ఆదేశించినట్లు తెలియజేశారు. అయితే బ్యాంక్ ఎండీ, సీఈవోగా తిరిగి ఎంపిక చేయడంలో ఆర్బీఐపై ఈ అంశంప్రభావం చూపి ఉండవచ్చని పేర్కొన్నారు. బ్యాంక్ బోర్డు మూడేళ్ల కాలానికి ప్రతిపాదించగా.. గత వారం ఆర్బీఐ ఏడాది కాలానికే సుమంత్ బాధ్యతల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రూ. 19,000 కోట్లు ఆవిరి...షేరు భారీ పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే ఇండస్ఇండ్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు ఒక్కరోజులోనే రూ. 19,000 కోట్లమేర చిల్లుపడింది. ఈ నెల 10న నమోదైన రూ. 70,150 కోట్ల నుంచి బ్యాంక్ మార్కెట్ విలువ తాజాగా రూ. 51,168 కోట్లకు క్షీణించింది. బ్యాంక్ షేరు 2018 ఆగస్ట్‌లో రూ. 2038 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. గతేడాది అంటే 2024 ఏప్రిల్ 8న రూ. 1,576 వద్ద నమోదైన గరిష్టం నుంచి తాజాగా 52 వారాల కనిష్టం రూ. 649ను తాకింది. వెరసి 59 శాతం పతనమైంది. ఫండ్స్ లబోదిబో ఇది ఇండెక్స్ షేరు కావడంతో 2025 ఫిబ్రవరికల్లా 35 మ్యూచువల్ ఫండ్స్ 360 పథకాల ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేశాయి. 20.88 కోట్ల షేర్లను కలిగి ఉన్నాయి. ఈ హోల్డింగ్స్ విలువ రూ. 20,670 కోట్లు కాగా.. షేరు తాజా పతనంలో రూ. 6,970 కోట్లు ఆవిరైంది. దీంతో హోల్డింగ్స్ విలువ రూ. 13,700 కోట్లకు పరిమితమైంది. ఇక ప్యాసివ్ ఫండ్స్ సైతం బ్యాంక్ షేర్ల పతనంతో ప్రభావితమైనట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. -
Dharmendra Pradhan: కేంద్ర మంత్రిపై ప్రివిలేజ్ మోషన్
న్యూఢిల్లీ: తమిళుల మనోభావాలు దెబ్బతీశారంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై మండిపడుతున్న డీఎంకే పార్టీ.. ఆయనపై ప్రివిలేజ్ మోషన్(Privilege motion) ఇచ్చింది. ఆయన చట్ట సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో ఈ తీర్మానం దాఖలు చేశారు.తమిళనాడు.. అక్కడి ప్రజలు అనాగరికులు(Uncivilized) అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని డీఎంకే, 8 కోట్ల మంది తమిళుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా అని అన్నారామె.జాతీయ విద్యా విధానం విషయంలో తమిళనాడు ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని.. ఈ విషయంలో ఏమాత్రం నిజాయితీ లేకుండా వ్యవహరించిందని ధర్మేంద్ర ప్రధాన్(dharmendra pradhan) మండిపడిన సంగతి తెలిసిందే. ‘‘వాళ్లకు ఏమాత్రం నిజాయితీ లేదు. విద్యార్థుల జీవితాలు నాశనం చేసేలా రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ సోమవారం బడ్జెట్ మలివిడత సమావేశాల సందర్భంగా లోక్‌సభ వ్యాఖ్యలు చేశారు. దీంతో డీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగగా.. సభ వాయిదా పడింది.అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై డీఎంకే భగ్గుమంది. ధర్మేంద్ర ప్రధాన్వి తలపొగరు వ్యాఖ్యలని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఇది తమిళులను అవమానించడమేనని,ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరిస్తారా? అంటూ మండిపడ్డారు.మరోవైపు.. పీఎం శ్రీ(PM SHRI) పథకం విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఎంవోయూపై సంతకాలకు అంగీకరించి.. ఆపై వెనక్కి తగ్గిందని ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. అయితే ఇది ఏమాత్రం నిజం కాదని.. ఈ ప్రకటన పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించేదేనని.. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని డీఎంకే అంటోంది. ఈ నేపథ్యంలో ఎంపీ కనిమొళి ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయగా.. ఆ తీర్మానాన్నిస్పీకర్ ఓం బిర్లా పరిశీలించనున్నారు. ఒకవేళ స్పీకర్ గనుక ఆ తీర్మానాన్ని అంగీకరిస్తే దర్యాప్తునకు ఆదేశిస్తారు. అందులో ఉల్లంఘన జరిగినట్లు తేలితే క్రమశిక్షణా ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటారు. -
తమిళులు అనాగరికులు!
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు, తమిళనాడులోని అధికార డీఎంకేకు మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న రగడ పార్లమెంటునూ తాకింది. ‘అనాగరికులు’ అంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. వాటిపై డీఎంకే ఎంపీల నిరసనలు, ఆందోళనలతో సోమవారం రెండో విడత బడ్జెట్ సమావేశాల తొలి రోజు లోక్‌సభ అట్టుడికిపోయింది. తమిళుల ఆత్మగౌరవాన్ని మంత్రి దారుణంగా దెబ్బతీశారంటూ డీఎంకే ఎంపీ కనిమొళి దుయ్యబట్టారు. ఆయనపై సభాహక్కుల తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించారు. ప్రధాన్ వ్యాఖ్యలపై తమిళనాడు అంతటా డీఎంకే శ్రేణులు నిరసనకు దిగాయి. ఆయన దిష్టి బొమ్మలు తగలబెట్టాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ‘‘మంత్రివి అహంకారపూరిత వ్యాఖ్యలు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి’’ అంటూ హెచ్చరించారు. ‘‘తమిళ ప్రజలందరినీ మంత్రి ఘోరంగా అవమానించారు. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ సమర్థిస్తారా?’’ అని ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలు దారుణమంటూ కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలు కూడా లోక్‌సభ ప్రాంగణంలో దుయ్యబట్టాయి. డీఎంకేకు నిజాయితీ లేదు! సభ ప్రారంభం కాగానే నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అంశాన్ని డీఎంకే సభ్యులు లేవనెత్తారు. దాన్ని తమ రాష్ట్రంపై బలవంతంగా రుద్దేందుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం పీఎంశ్రీ పథకంపై ప్రశ్నకు ప్రధాన్ బదులిస్తూ డీఎంకే ఎంపీల తీరుపై తీవ్రంగా స్పందించారు. వారికి నిజాయితీ లేదంటూ ఆక్షేపించారు. ‘‘కర్ణాటక, హిమాచల్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా పీఎంశ్రీని అమలు చేస్తున్నాయి. అది తమకూ అంగీకారమేనని పలువురు డీఎంకే ఎంపీలు నాతో స్వయంగా చెప్పారు. ఈ మేరకు స్టాలిన్ కూడా ప్రకటన చేశారు. తర్వాత ఏ ’సూపర్ సీఎం’ జోక్యం చేసుకున్నాడో గానీ, ఉన్నట్టుండి యూటర్న్ తీసుకున్నారు. కేవలం భాషాపరమైన వివాదాలు సృష్టించడమే పనిగా ఫక్తు రాజకీయాలు చేస్తున్నారు. తమిళ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. విద్యార్థుల భవితవ్యం దృష్ట్యా స్వార్థాన్ని పక్కనపెట్టి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, ఎన్ఈపీకి అంగీకరించాలని హితవు పలికారు. వీటిపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ఎన్ఈపీ అంగీకారమేనని ప్రధాన్‌తో తామెన్నడూ చెప్పలేదన్నారు. ఆయన పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. నిరసనలు, నినాదాలు, ఆందోళనలతో హోరెత్తించారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసే ప్రయత్నాలు మానుకోవాలంటూ డిమాండ్ చేశారు. శాంతించాలంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా వెనక్కు తగ్గలేదు. దాంతో సభ కాసేపు వాయిదా పడింది. మళ్లీ సమావేశమయ్యాక కూడా రగడ కొనసాగింది. కేంద్రానికి వ్యతిరేకంగా డీఎంకే సభ్యులు నినాదాలు కొనసాగించారు. ఎన్ఈపీని, హిందీ తప్పనిసరంటున్న త్రిభాషా సూత్రాన్ని డీఎంకే ముందునుంచీ వ్యతిరేకిస్తోందని కనిమొళి అన్నారు. ప్రధాన్ వ్యాఖ్యలు, ప్రత్యేకంచి ఒక పదం తమను తీవ్రంగా బాధించిందని ఆవేదన వెలిబుచ్చారు. దాంతో మంత్రి స్పందిస్తూ, ‘‘నా సోదరి రెండు అంశాలు లేవనెత్తారు. తమిళనాడు ప్రభుత్వం, ఎంపీలు, తమిళ ప్రజలను ఉద్దేశించి నేనలాంటి పదం వాడకుండా ఉండాల్సిందని అన్నారు. ఆ పదాన్ని వెనక్కు తీసుకుంటున్నా’’ అని ప్రకటించారు. అవి రికార్డుల్లోకి వెళ్లబోవని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ తమిళ ప్రజలను అవమానించేలా ప్రధాన్ దారుణ వ్యాఖ్యలు చేశారన్నారు. విద్యావిధానం వంటి అంశాలను ఏ రాష్ట్రంపైనా బలవంతంగా రుద్దరాదని కనిమొళి అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. మంత్రి తమను అబద్ధాలకోరులు అనడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు. త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు అంగీకరించేదే లేదని ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం కూడా అన్నారు. ‘‘హిందీని మాపై రుద్దడాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈ విషయంలో రాష్ట్రంలో అన్ని పార్టీలదీ ఒకే వైఖరి’’ అని స్పష్టం చేశారు. మీపై చర్యలు తప్పవ్ మారన్‌పై స్పీకర్ ఆగ్రహం డీఎంకే సభ్యుడు దయానిధి మారన్‌పై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. ఎన్ఈపీపై డీఎంకే సభ్యుల ఆందోళన సందర్భంగా పోడియం వద్ద మారన్ ఏవో వ్యాఖ్యలు చేశారు. వాటిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఆయనపై కఠిన చర్యలు తప్పవని ప్రకటించారు. ‘‘మాట్లాడేటప్పుడు కాస్త నోరు జాగ్రత్త. మీ వ్యాఖ్యలు రికార్డులకు ఎక్కి ఉంటే తక్షణమే చర్యలు తీసుకునేవాడిని’’ అంటూ హెచ్చరించారు. మారన్‌పై చర్యలకు తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజుకు సూచించారు. లేదంటే తానే చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. సభ గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తనను సహించే ప్రసక్తే లేదని స్పీకర్ స్పష్టం చేశారు. -
ఈసీ తీరుపై... అన్నీ అనుమానాలే!
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా అవకతవకలు, నకిలీ ఓటర్ కార్డులు, ఓటర్ల సంఖ్యలో అనూహ్య పెరుగుదల, ఇష్టారాజ్యంగా ఓటర్ల తొలగింపు తదితర అంశాలను కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలన్నీ సోమవారం లోక్‌సభలో లేవనెత్తాయి. వీటిపై సందేహాలు, నానాటికీ దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆరోపణలు మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతనే ప్రశ్నార్థకంగా మార్చాయంటూ ఆందోళన వెలిబుచ్చాయి. పైగా వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం అరకొర స్పందన మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నాయి. కనుక ఈ మొత్తం అంశంపై లోక్‌సభలో పూర్తిస్థాయి చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇది ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో చేస్తున్న డిమాండని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ ఓటర్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుందా అని ప్రశ్నించారు. ‘‘కేంద్రం తయారు చేయదన్నది నిజమే. కానీ ఇవన్నీ మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అందుకే ఈ అంశంపై సవివరమైన చర్చకు మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని రాహుల్ బదులిచ్చారు. ‘‘ఓటర్ల జాబితాల విశ్వసనీయతను దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలన్నీ ప్రశ్నిస్తున్నాయి. మహారాష్ట్రతో సహా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిపక్షాలు దీనిపై అనుమానాలు లేవనెత్తాయి’’ అని గుర్తు చేశారు. ఇది చాలా తీవ్రమైన అంశమంటూ సమాజ్‌వాదీ, ఆర్జేడీ, బిజూ జనతాదళ్, ఆప్ కూడా గొంతు కలిపాయి. దీన్ని పార్లమెంటు చర్చకు స్వీకరించాల్సిందేనని పట్టుబట్టాయి. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ ఓటర్ల జాబితా అంశాన్ని జీరో అవర్‌లో లేవనెత్తారు. ‘‘ఓటర్ల ఫొటో గుర్తింపు కార్డు నంబర్లలో నకిలీల సమస్య దశాబ్దాలుగా ఉంది. కానీ పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన అనంతరమే కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై స్పందించింది. సమస్యను మూడు నెలల్లో పరిష్కరిస్తామని ప్రకటించింది’’ అంటూ దృష్టికి తెచ్చారు. అంటే ఇంతకాలంగా తప్పిదాలు జరుగుతూ వస్తున్నట్టే కదా అని ఆయన ప్రశ్నించారు. ‘‘బెంగాల్, హరియాణాల్లో నకిలీ ఓటరు కార్డులు దొరికాయి. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. దానిపై అందరూ ప్రశ్నలు లేవనెత్తారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలప్పుడూ ఇలాగే జరిగింది. ఇవన్నీ తీవ్రమైన లోటుపాట్లే. వచ్చే ఏడాది బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికలున్నందున ఆలోపే ఓటర్ల జాబితాలను పూర్తిగా సవరించాలి’’ అని డిమాండ్ చేశారు. ఈ తప్పిదాలపై దేశ ప్రజలకు ఈసీ బదులివ్వాల్సిందేనన్నారు. ఈ అంశంపై సమగ్ర చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలతో హోరెత్తించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పక్షపాతరహితంగా వ్యవహరించాలని సమాజ్‌వాదీ సభ్యుడు ధర్మేంద్రయాదవ్ అన్నారు. ‘‘మహారాష్ట్రలో నెలల వ్యవధిలోనే కొత్తగా లక్షలాది ఓటర్లు ఎలా పుట్టుకొచ్చారు? ఢిల్లీలోనూ అదే జరిగింది. 2022లో యూపీలోనూ ఇదే చేశారు’’ అని ఆరోపించారు.రాజ్యసభలోనూ... రాజ్యసభలో కూడా జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రయత్నించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అందుకు అనుమతివ్వలేదు. దీనితో పాటు డజనుకు పైగా అంశాలపై 267వ నిబంధన కింద చర్చకు డిమాండ్ చేస్తూ విపక్షాలు ఇచి్చన నోటీసులన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. ‘‘మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఆర్నెల్లలోనే ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇదెలా సాధ్యం? దీనిపై కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీ వద్ద సమాధానమే లేదు. ఓటింగ్ ప్రక్రియ కోసం ఉపయోగించిన ఫొటో ఓటర్ల జాబితాను ఎక్సెల్ ఫార్మాట్లో మాకు అందజేయాలని డిమాండ్ చేస్తే ఈసీ నేటికీ స్పందించనే లేదు. దేశవ్యాప్తంగా ఓటర్ల పేర్లను ఇష్టారాజ్యంగా తొలగించడం, డూప్లికేట్ ఈపీఐసీ నంబర్ల వంటి తీవ్ర తప్పిదాలు, లోటుపాట్లు ఇష్టారాజ్యాంగా చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ ఎన్నికల ప్రక్రియ తాలూకు సమగ్రతనే సవాలు చేస్తున్నాయి. పైగా ఈ తప్పిదాలను స్వయంగా ఈసీయే అంగీకరించింది. కనుక వీటన్నింటిపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందే. అందుకు మోదీ సర్కారు అంగీకరించాల్సిందే’’ అంటూ అనంతరం ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తద్వారా ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్నేళ్లుగా ఘోరంగా విఫలమవుతోందని అంతకుముందు టీఎంసీ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ సభలో దుయ్యబట్టారు. ఇందుకు ఈసీపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘డూప్లికేట్ ఓటర్ కార్డుల అంశాన్ని సీఎం మమతే తొలిసారి లేవనెత్తారు. దీనిపై ఈసీ ఇచ్చిన వివరణ ఎన్నికల నిర్వహణ నిబంధనలకే విరుద్ధంగా ఉంది’’ అని ఆరోపించారు. అనుమానాలన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం, ఈసీపై ఉందని ఆప్ సభ్యుడు సంజయ్‌సింగ్ అన్నారు. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హరియాణా పౌరులకు విచ్చలవిడిగా ఓటరు కార్డులిచ్చారని ఆరోపించారు. తద్వారా ఎన్నికల ప్రక్రియనే ప్రహసనంగా ఈసీ మార్చేసిందని దుయ్యబట్టారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా ఆరోపించారు. ‘‘ఎన్నికల ప్రక్రియే పార్లమెంటు ఉనికికి ప్రాణం. ఎన్నికల అవకతవకలపై ఇక్కడ చర్చించేందుకు అవకాశమివ్వకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు’’ అన్నారు. -
బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి.. రాజ్యసభలో వైఎస్సార్సీపీ డిమాండ్
ఢిల్లీ: తిరుపతిలో కొత్తగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. రాజ్యసభలో రైల్వే సవరణ బిల్లుపై చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి చర్చలో పాల్గొన్నారు.రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎంపీ మేడ రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిలో కొత్తగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి. చెన్నై, బెంగళూరుకు సమాన దూరంలో ఉన్న తిరుపతికి భారీ సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు.భారీ సంఖ్యలో ప్రయాణికులను నేపథ్యంలో ఈ డివిజన్ ఫీజిబిలిటీ ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాసు రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దాలి. అన్నమయ్య జిల్లాలో నందలూరు రైల్వే స్టేషన్ వద్ద ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ స్థాపించాలి. అక్కడ 400 ఎకరాల భూమి, అవసరమైన నీరు అందుబాటులో ఉంది.వైజాగ్ రైల్వే జోన్లో వాల్తేరు జోనును సంపూర్ణంగా విలీనం చేయాలి.రైల్వే బోర్డులో ఏపీకి తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. ప్రీమియం ట్రైన్లలో సామాన్య ప్రయాణికుల కోసం ఐదు కోచ్ లు అదనంగా ఏర్పాటు చేయాలి. రైల్వే ప్రమాదాల నేపథ్యంలో ఇండిపెండెంట్ సేఫ్టీ ఆడిట్ జరగాలి.అపరిశుభ్రమైన రైలు నాణ్యతలేని ఆహారం తదితరు అంశాలపై ప్రయాణికుల ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.’అని కోరారు. -
బడ్జెట్ సమావేశాలు: రాజ్యసభ నుంచి వాకౌట్
Parliament Live Updates March 10th: పార్లమెంట్ మలి(రెండో) విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాసేపటికే ఉభయ సభల్లో విపక్షాలకు ఆందోళనలకు దిగాయి.లోకసభ వాయిదామధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేసిన స్పీకర్జాతీయ విద్యా విధానంలో త్రిభాషా వ్యవస్థకు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన గందరగోళం నడుమ సభను కాసేపు వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా #Loksabha adjourned till 12 noon. pic.twitter.com/OWiOwstBES— Lok Poll (@LokPoll) March 10, 2025 #WATCH | On the New Education Policy and three language row, Union Education Minister Dharmendra Pradhan says, "...They (DMK) are dishonest. They are not committed to the students of Tamil Nadu. They are ruining the future of Tamil Nadu students. Their only job is to raise… pic.twitter.com/LdBVqwH6le— ANI (@ANI) March 10, 2025 రాజ్యసభ నుంచి ప్రతిపక్షం వాకౌట్పెద్దల సభను కుదిపేసిన డీలిమిటేషన్ వ్యవహారంరాజ్యసభ నుంచి కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ డీలిమిటేషన్(నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ అంశంపై చర్చించాలని, అనుమానాలను నివృత్తి చేయాలని పట్టుబట్టిన విపక్షాలుప్రతిపక్షాల చర్యలపై ఎన్డీయే సభ్యుల ఆగ్రహం #WATCH | Delhi: Rajya Sabha MP Rekha Sharma says, "The opposition always obstructs the House and important issues are left behind...Today also they will do something similar and we are ready for that too...only those issues will come up in Parliament which are for the… pic.twitter.com/uWHQDiXooN— ANI (@ANI) March 10, 2025 రాజ్యసభలో టీమిండియాకు శుభాకాంక్షలుఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్టీమిండియాకు రాజ్యసభలో అభినందనలు #WATCH | Delhi: On behalf of Rajya Sabha members, Rajya Sabha Deputy Chairman Harivansh Narayan Singh congratulates the Indian team for clinching the Champions Trophy (Source: Sansad TV) pic.twitter.com/1HcsW5GgFb— ANI (@ANI) March 10, 2025 ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలువక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలుఓటర్ల జాబితాలో అవకతవకలు, త్రిభాషా అంశం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం పై విధించే సుంకాల పై చర్చ జరపాలని డిమాండ్ చేసే అవకాశం మార్చి 10 నుండి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్న సమావేశాలు2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను డిమాండ్ ఫర్ గ్రాంట్ల పై జరుగనున్న చర్చనేడు లోక్ సభలో రెండో విడత పద్దులను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్మణిపూర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్లోక్ సభలో నేడు త్రిభువన్ సహకారి యూనివర్సిటీ బిల్లు ను ప్రవేశపెట్టనున్న కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షాఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ ను, త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయంగా మారుస్తూ బిల్లుఈ సమావేశాల్లో బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, 2024, ఇమ్మిగ్రేషన్ ఆండ్ ఫారినర్స్ బిల్లు,2025, రైల్వేస్ చట్ట సవరణ బిల్లు లను పార్లమెంట్ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్న కేంద్రంఈ సమావేశాల్లో వక్స్ బోర్డ్ సవరణ బిల్లు, 2024 ను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం -
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు
ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్(Jagdeep Dhankar) అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అయితే, ఛాతి నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయనకు ఛాతి నొప్పితో బాధపడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో, తెల్లవారుజామున 2 గంటలకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యబృందం తెలిపింది. ఇక, ధన్కర్ అస్వస్థత విషయం తెలిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎయిమ్స్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు. Vice President Jagdeep Dhankhar was admitted to the cardiac department at AIIMS Delhi in the early morning. He is stable and under observation: AIIMS Hospital Sources— ANI (@ANI) March 9, 2025 -
నేడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు పూర్తయ్యింది. నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ఖారారు చేయనుంది. కాగా, చివరి నిమిషంలో తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది. కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేకపోవడంతో పర్యటన రద్దు అయ్యింది. ఇవాళ రాష్ట్ర అగ్రనేతలతో ఫోన్లో కేసీ వేణుగోపాల్ మాట్లాడనున్నారు. ఎమ్మెల్సీస్థానాల కోసం కాంగ్రెస్‌లో భారీ పోటీ నెలకొంది. తమకు అవకాశం కల్పించాలంటూ ఆశావహులు కోరుతున్నారు. నేడు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించే అవకాశముంది.కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠ నెలకొంది, ఎమ్మెల్సీ బరిలో ఓసీ కేటగిరి నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, కుసుమ కుమార్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.బీసీ కేటగిరి నుండి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్పేటి జైపాల్, గాలి అనిల్ ఉన్నారు. ఎస్సీ కేటగిరి నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్, బానోతు విజయాభాయి, రేఖా నాయక్ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
రైల్వే ప్రయాణికులకు గమనిక.. ప్లాట్‌ఫామ్‌పై ఎంట్రీకి కొత్త రూల్!
సాక్షి, న్యూఢిల్లీ: రైలులో ప్రయాణించాలనుకునే వారు ఇకపై కన్ఫార్మ్ టికెట్ ఉంటేనే ప్లాట్‌ఫామ్ పైకి వెళ్ల గలుగుతారు. పైలట్ ప్రాజెక్టు కింద న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, సూరత్, వారణాసి, అయోధ్య, పాట్నా రైల్వే స్టేషన్లలో ఈ వ్యవస్థను తక్షణమే అమల్లోకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు రైల్వే శాఖ ఆదేశాలను పాటించాలని సూచనలు చేశారు.తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 60 ప్రధాన రైల్వే స్టేషన్లలోని అనధికార ఎంట్రీ పాయింట్లను మూసివేసి.. కన్ఫార్మ్ టికెట్లు ఉన్న ప్రయాణీకులను మాత్రమే ప్లాట్‌ఫామ్‌లపైకి అనుమతించాలని నిర్ణయించారు. మహా కుంభమేళా సందర్భంగా దేశంలోని 60 రైల్వే స్టేషన్లలో తాత్కాలికంగా వెయింటింగ్ రూములు ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ, సూరత్, పాట్నాల్లో రద్దీని నియంత్రించడంలో ఇవి ఎంతో ఉపయోగపడ్డాయి. రైలు విచ్చిన తర్వాతే ప్రయాణికులను ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతించారు. ఇదే పద్ధతిని ఇప్పుడు శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించారు.60 స్టేషన్లలో తాత్కాలికంగా నిర్మించిన వెయిటింగ్ రూములను శాశ్వతంగా ఉపయోగపడేలా మార్చబోతున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో రైళ్ల సామర్థ్యం మేరకే టికెట్లు విక్రయిస్తారు. ఈ స్టేషన్లలో రైల్వే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. కుంభమేళా సందర్భంగా ఢిల్లీ స్టేషన్లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. BIG BREAKING NEWS 🚨 Only confirmed ticket holders will be allowed to enter platforms at 60 railway stations.Big decision by Railway Minister Ashwini Vaishnav to decongest stations.Those without a ticket or with a waiting list ticket will wait in the outside waiting area.… pic.twitter.com/IEmxJok5AE— Times Algebra (@TimesAlgebraIND) March 8, 2025 -
కేంద్ర మంత్రికి పొన్నం ప్రభాకర్ లేఖ.. ఎందుకంటే
సాక్షి, హైదరాబాద్: తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ నుంచి ప్రతిరోజు తిరుపతికి రైలు నడపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళతారని పొన్నం ప్రభాకర్ ప్రస్తావించారు.ప్రస్తుతం కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి రెండు సార్లు, గురువారం, ఆదివారం మాత్రమే రైలు వెళ్తుందన్నారు. ఆ ఎక్స్ ప్రెస్ రైలు తిరుపతి నుంచి కరీంనగర్‌కు బుధ, శనివారాల్లో బయలుదేరుతుందన్నారు. యూపీఏ హయాంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలు తిరుపతికి వెళ్లడానికి వీలుగా ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోందని, ఈ క్రమంలో ఈ రైలు ప్రతిరోజు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గత పదేళ్లుగా రైల్వే శాఖ మంత్రిగా మీకు, స్థానిక ఎంపీ బండి సంజయ్‌కి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ లేఖలో పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా రైలును నడిపేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
Women's Day : మహిళలకు ప్రతీ నెల రూ. 2,500!
ఢిల్లీ: మహిళా దినోత్సవం రోజున బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఆ రాష్ట్ర మహిళలకు తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచితంగా నెలకు రూ. 2,500 చొప్పున అందిస్తామని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. ‘మహిళా సమృద్ధి యోజనా’ పథకంలో భాగంగా ఈ హామీని అమలు చేయాలని ఢిల్లీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాబినెట్ భేటీలో మహిళలకు రూ. 2500 స్కీమ్‌కు ఆమోద ముద్ర పడింది. దీనిపై సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. ‘ ఈరోజు మహిళల దినోత్సవం. మన క్యాబినెట్ సమావేశం కూడా అందుకే ఈరోజున పెట్టాం. మహిళా సమృద్ధి యోజనా పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ హామీని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చాం. దాన్ని ఇప్పుడు అమలు చేయబోతున్నాం’ అని ఆమె తెలిపారు. ఈ స్కీమ్ కోసం రూ. 5,100 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఇందుకోసం ఒక కమిటీని తన నేతృత్వంలోనే ఏర్పాటు చేసి మరీ పథకాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందుకోసం ఒక వెబ్ పోర్టల్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్లు అతి త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు రేఖా గుప్తా.మహిళా సమృద్ధి యోజనా పథకానికి ఆమోద ముద్ర పడింది. ఇందుకోసం పోర్టల్ త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం. ఇక్కడ నుంచి అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు సంబంధించిన వివరాలను పోర్టల్ పొందుపరుస్తాం. దీనికి ముగ్గురు మంత్రుల కమిటీ ఉంది. కపిల్ శర్మ, అశిష్ సూద్, పర్వేష్ వర్మలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని మంత్రి మన్ జిందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు. -
వణక్కం.. ఇక అంతా వీళ్ల చేతుల్లోనే!
న్యూఢిల్లీ, సాక్షి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) మహిళా దినోత్సవం సందర్భంగా.. నారీశక్తికి వందనం అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోసారి అత్యంత అరుదైన నిర్ణయం తీసుకున్నారాయన. తన సోషల్ మీడియా అకౌంట్ల బాధ్యతలను ఎంపిక చేసిన మహిళలకు అప్పజెప్పారు. ఈ క్రమంలోనే వణక్కం.. అంటూ ఆయన ఖాతా నుంచి ఓ పోస్ట్ అయ్యింది.ఇవాళ తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ బాధ్యతను ఇండియన్ గ్రాండ్ చెస్ మాస్టర్ వైశాలి రమేష్‌బాబు(Vaishali Rameshbabu)కి అప్పగించారు. ఇదే విషయాన్ని మోదీ ఎక్స్ ఖాతా నుంచి వైశాలి తెలియజేశారు. తాను చెస్ ప్లేయర్‌నని, దేశం తరఫు ప్రాతినిధ్యం వహించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని పోస్ట్ చేశారామె. ప్రధాని ఖాతాను నిర్వహించడం తనకు దక్కిన గౌరవమని అన్నారు. ఈరోజంతా ఆమే ఆయన ఖాతా బాధ్యతలను చూసుకోనున్నారు. ఆరో ఏట నుంచి నేను చెస్ ఆడుతున్నాను. అది నాకొక ఉత్తేజకరమైన ప్రయాణం. మీరు ఎంచుకున్న మార్గంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా మీ కలలు సాకారం చేసుకోవడానికి ముందుకుసాగండి. ఆడపిల్లలకు అండగా నిలవాలని తల్లిదండ్రులు, తోబుట్టువులను ఈసందర్భంగా కోరుతున్నాను. వారి సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. వారు అద్భుతాలు చేయగలరు అని వైశాలి సందేశం ఉంచారు. మరోవైపు.. వైశాలితో పాటు న్యూక్లియర్, స్పేస్ సైంటిస్ట్‌లు అయిన ఎలినా మిశ్రా, శిల్పి సోనీ.. మోదీ ఖాతా నుంచి పోస్టులు పెట్టారు. భారతదేశం సైన్స్ పరిశోధనలకు అత్యంత అనుకూలమైన ప్రదేశమన్నారు. మరింత ఎక్కుమంది మహిళలు ఈ రంగాన్ని ఎంచుకోవాలని కోరారు.నేను అనితా దేవిని.. నలందా జిల్లాకు చెందిన అనితాదేవి ప్రధాని ఖాతా నుంచి తన విజయాలు వెల్లడించారు. ‘‘నేను జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. నా కాళ్ల మీద నిలబడి, సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఉండేది. 2016లో ఆ దిశగా అడుగేశాను. అప్పుడే స్టార్టప్‌లపై క్రేజ్ పెరుగుతోంది. నేను కూడా మాదోపుర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌ను ప్రారంభించాను. నాతో కలిసి పనిచేసిన మహిళలు స్వయంసమృద్ధి సాధించడం నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చింది. వారి కుటుంబాలు బాగుపడటం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఆర్థిక స్వాతంత్య్రం మహిళలకు గౌరవాన్ని ఇస్తుందని నా నమ్మకం. మీరు అంకిత భావం, కృషితో ముందుకుసాగాలని బలంగా అనుకుంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు’’ అంటూ తన స్టోరీ వెల్లడించారు.ప్రధాని మోదీ గతంలోనూ ఇలానే తన సోషల్ మీడియా అకౌంట్లను స్ఫూర్తిదాయకమైన మహిళలకు అప్పగించారు కూడా. ఇక.. మహిళా దినోత్సవం(Women's Day 2025) పురస్కరించుకొని ఇవాళ ప్రధాని భద్రతను కూడా పూర్తిగా మహిళా పోలీసులే పర్యవేక్షించనుండడం గమనార్హం. ప్రస్తుతం ఆయన గుజరాత్ పర్యటనలో ఉన్నారు. అంతకు ముందు తన మహిళా దినోత్సవ సందేశంలో.. ‘‘వివిధ అభివృద్ధి పథకాల ద్వారా ఎన్డీయే ప్రభుత్వం మహిళా సాధికారికతకు కృషి చేస్తోంది’’ అని అన్నారాయన. -
ఎయిరిండియా నిర్వాకం.. ఐసీయూలో వృద్ధురాలు
ఎయిరిండియా విమానయాన సంస్థపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ వృద్ధురాలికి వీల్‌ఛైర్ సేవలు నిరాకరించడంతో ఆమె కిందపడి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందుతుండగా.. ‘తప్పనిసరి పరిస్థితుల్లో..’ అంటూ ఆమె మనవరాలు జరిగిందంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యాన్ని ఆమె ఎండగట్టడంతో.. దెబ్బకు ఎయిరిండియా దిగొచ్చింది. రాజ్ పశ్రీచా(82) మాజీ సైనికాధికారి భార్య. తన కుటుంబ సభ్యులతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లడానికి ఎయిరిండియా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఉన్న ఆమెకు వీల్‌ఛైర్ కోసం బుక్ చేసుకోగా.. అది కన్ఫర్మ్ అయ్యింది. అయితే గంటసేపైనా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కుటుంబ సభ్యుల సాయంతో ముందుకు వెళ్లారు. కాలు జారి కిందపడి గాయపడ్డారు.ఆమె తలకు గాయం కాగా.. ముక్కు, నోటి నుంచి రక్తం కారింది. అయితే ఆ టైంలోనూ సిబ్బంది ఎవరూ సాయానికి ముందుకు రాలేదని, తామే మెడికల్ కిట్ కొనుక్కొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశామని మనవరాలు పరుల్ కన్వర్(Parul Kanwar) తెలిపారు. ఆపై కాసేపటికి వీల్‌ఛైర్ వచ్చిందని.. గాయాలతోనే ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చామని తెలిపారు. అయితే.. ఈ మధ్యలో విమాన సిబ్బంది సాయం కోరగా.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆమెకు వైద్య సేవలు అందాయని, తలకు రెండు కుట్లు పడ్డాయని తెలిపారామె. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎడమ వైపు భాగానికి పక్షవాతం సోకిందని, మెదడులో రక్తస్రావం జరిగిందేమోననే అనుమానాలను వైద్యులు వ్యక్తం చేశారని పరుల్ తెలిపారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె.. మనిషి జీవితానికి కొంచెమైనా విలువ ఇవ్వండి అంటూ ఎయిరిండియా సిబ్బందిని ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఈ ఘటనపై డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA), ఎయిరిండియాలకు ఫిర్యాదు చేశామని, చర్యలకు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారామె.అయితే పరుల్ పోస్టుపై ఎయిరిండియా స్పందించింది. ఆమె సోషల్ మీడియా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నామని బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ నెంబర్, పూర్తి వివరాలను తమకు అందించాలని ఎయిరిండియా ఆమెను కోరింది. అయితే ఘటనపై దర్యాప్తు పూర్తైతేగానీ తాను ఎయిరిండియాతో సంప్రదింపులు జరపబోనని తేల్చారామె. -
మాది టీ20 మోడల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానిది టీ–20 మోడల్, దేశానికి రోల్‌మోడల్ అని.. గుజరాత్ మోడల్ కాలం చెల్లిన టెస్ట్ మ్యాచ్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గుజరాత్ మోడల్లో ఏ విధమైన సంక్షేమం లేదని, ఏమైనా అభివృద్ధి ఉందనుకుంటే అది మోదీ సీఎంగా ఉన్నప్పుడు ప్రయత్నించినదేనని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి అయిన తర్వాత కూడా మోదీ గుజరాత్ కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.దేశంలో ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే సహకరించడం లేదని.. గుజరాత్‌కు వెళ్లి పెట్టుబడులు పెట్టా లని చెబుతున్నారని విమర్శించారు. మోదీ ప్రధాని అయి ఉండీ ఇదేం పద్ధతని ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియాటుడే కాన్క్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘గుజరాత్ మోడల్‌కు, తెలంగాణ మోడల్‌కు మధ్య ఎంతో తేడా ఉంది.మాది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నమూనా. తెలంగాణ నమూ నాతో ఎవరూ పోటీపడలేరు. అహ్మదాబాద్, హైదరాబాద్‌లోని మౌలిక వసతులను పోల్చిచూడాలి. హైదరాబాద్‌తో పోటీపడేలా ఔటర్ రింగు రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్‌కు ఉన్నాయా? గుజరాత్లో ఫార్మా, ఐటీ పెట్టుబడులు ఉన్నాయా? గుజరాత్లో ఏం ఉంది? హైదరాబాద్ ఇప్పుడు అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలతో పోటీపడట్లేదు. మేం న్యూయార్క్, సియోల్, టోక్యోలతో పోటీపడాలనుకుంటున్నాం. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు కట్టారా? హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడు ప్రారంభమైంది కాదు. 450 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న నగరం. కులీకుతుబ్ షా నుంచి ప్రారంభమై నిజాం సర్కార్, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం, స్వాతంత్య్రం తర్వాత మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. అలా ఇప్పుడు నేను అభివృద్ధి చేస్తున్నా. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు ఏమైనా కట్టారా? హైదరాబాద్‌లో ప్రముఖ కట్టడాలన్నీ 450 ఏళ్ల కింద ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాలు మారినా సీఎంలు మారినా అభివృద్ధి కొనసాగింది. బీసీలకు బీజేపీ అన్యాయం జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీస్తున్నప్పుడు బీసీల లెక్కలు ఎందుకు చేయకూడదు. అందుకే జనగణనలో కులగణన కూడా చేపట్టాలని శాసనసభలో తీర్మానం చేశాం. బీసీలకు బీజేపీ అన్యాయం చేసింది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చింది. ఇప్పుడు ఓబీసీలకు ఇవ్వాలనుకుంటున్నాం.బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ, ఐటీ... కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలుగా యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, విద్యార్థి కాంగ్రెస్‌లు ఉంటే.. బీజేపీకి అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ, ఐటీలు పనిచేస్తున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా, ఉదారంగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ బలహీనత. అయినా పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.ముఖ్యమంత్రిగా నేను ప్రధాన మంత్రిని గౌరవిస్తా.. అదే సమయంలో పార్టీ వేదికపై పార్టీ విషయాలు మాట్లాడుతా. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.వంద కోట్లు ఆఫర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకించాయి. మేం ప్రజల కోసం రూ.100 కోట్లు తేవాలనుకున్నాం. బీజేపీ అదానీ నుంచి తీసుకున్న బాండ్లను ఎందుకు వెనక్కి ఇవ్వలేదో చెప్పాలి?..’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మోదీతో విభేదాల్లేవు.. ఆయన విధానాలతోనే.. అభివృద్ధి విషయంలో ఎవరిపైనా పక్షపాతం చూపవద్దనే నేను కోరుతున్నాను. ప్రధాని మోదీ గిఫ్ట్ సిటీని గుజరాత్‌కు తీసుకెళ్లారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఆ అవకాశం ఇవ్వలేదు? ప్రధాని మోదీతో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు. నేను మోదీ విధానాలతో విభేదిస్తున్నాను. దేశానికి ప్రధానిగా ఉన్నందున మోదీకి గౌరవం ఇవ్వాలి. ఆయనను కలసి తెలంగాణకు కావల్సినవి అడగడం నా హక్కు, నా బాధ్యత. ఆదాయంతో అన్నీ చేయగలమనుకున్నా.. అందరిలాగే 2023లో అధికారంలోకి వచ్చే వరకు కూడా నేను రాష్ట్రానికి రూ.3.75 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉందని అనుకున్నాను. వచ్చే ఆదాయంతో అన్నీ చేయగలమనుకున్నాను. సీఎం కురీ్చలో కూర్చున్న తర్వాత తెలంగాణకు రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందన్న అసలు విషయం బయటపడింది. కేసీఆర్ పదేళ్ల కాలంలోనే రూ.6 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి వెళ్లారు. దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నం ఒకే దేశం– ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపైన మాత్రమే గాకుండా గ్యారంటీలపై, మూలధన వ్యయంపై చర్చ జరగాలి. దక్షిణాదిలో బీజేపీకి అధికారం, ప్రాతినిధ్యం లేనందునే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఇందుకోసం నియోజకవర్గాల పునర్విభజన అనే ఆయుధాన్ని ఎంచుకుంది. దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.కుటుంబ నియంత్రణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిస్తే దక్షిణాది రాష్ట్రాలు అమలు చేసినందుకు ఇప్పుడు మాపై ప్రతీకారం తీర్చుకుంటారా? కొత్త కొత్త మార్గాల ద్వారా దక్షిణాదిని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తోంది. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే కుటుంబ నియంత్రణ విధానానికి ముందటి 1971 లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి. లేకుంటే కేవలం బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలే ఎక్కువగా లబ్ధిపొందుతాయి. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలే కాకుండా పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాలు కలసి రావాలి. హైదరాబాద్‌కు ‘ఒలంపిక్స్’ చాన్స్ ఇవ్వాలి.. ఒలంపిక్స్ నిర్వహించేందుకు అహ్మదాబాద్ కన్నా వంద రెట్లు ఎక్కువగా హైదరాబాద్‌లో వసతులున్నాయి. అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో ఏమేం వసతులు ఉన్నాయో తేల్చాలి. ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణలో హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వాలి. ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు ఒలంపిక్స్ ఎందుకు జరగకూడదు? అహ్మదాబాద్‌కు నరేంద్ర మోదీ బ్రాండ్ అంబాసిడర్.. రాబోయే రోజుల్లో హైదరాబాద్ బ్రాండ్‌ను నేను ఎక్కడికి తీసుకెళతారో చూడండి. -
బాలుడికి చెంపదెబ్బ.. పోలీస్ అధికారి ట్రాన్స్ఫర్, ఆగిన శాలరీ హైక్
గాంధీ నగర్ : ప్రధాని మోదీ ఇవాళ తన సొంతరాష్ట్రమైన గుజరాత్లో పర్యటించారు. అయితే, ఈ పర్యటనకు ముందు రోజు అంటే నిన్న ప్రధాని మోదీ ఖాళీ కాన్వాయ్‌తో రిహార్సల్స్ నిర్వహించారు అధికారులు. అంత వరకు బాగానే ఉన్నా.. కాన్వాయ్ రిహార్సల్స్ సమయంలో ఓ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు.ప్రధాని మోదీ రాక నేపథ్యంలో సెక్యూరిటీ రిత్యా ఆయా ప్రాంతాల్లో ఖాళీ కాన్వాయ్‌తో రిహార్సల్స్ నిర్వహిస్తుంటారు. గుజరాత్ పర్యటన వేళ గుజారత్‌లోని రతన్ చౌక్ వద్ద పోలీస్ ఉన్నతాధికారులు మోదీ కాన్వాయ్‌తో రిహారాల్స్ నిర్వహించారు. ఆ సమయంలో 17ఏళ్ల బాలుడు సైకిల్ తొక్కుకుంటూ పొరపాటున రిహార్సల్స్ జరిగే ప్రాంతం వైపు వచ్చాడు. వెంటనే రెప్పపాటులో సైకిల్‌ను వెనక్కి తిప్పాడు.అదే సమయంలో పక్కనే విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి ఎస్ బీఎస్ గాధ్వీ సదరు బాలుడిని జుట్టు పట్టుకుని లాగారు. ఆపై చెంప చెల్లు మనిపించాడు. దీంతో బాలుడు వెక్కివెక్కి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లి పోయాడు. అయితే, బాలుడిపై సదరు పోలీస్ అధికారి దాడి సమయంలో స్థానికంగా పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసు అధికారిపై విమర్శలు వెల్లువెత్తాయి. సంబంధిత వీడియోలు సైతం వైరల్‌గా మారాయి. వైరలైన వీడియోలపై డిప్యూటీ పోలీస్ కమిషనర్ అమిత్ వానాని స్పందించారు. గాధ్వీ తీరు క్షమించరానిది. ప్రస్తుతం,మ్రోబి జిల్లాలో పోలీస్‌స్టేషన్‌లో విధిలు నిర్వహిస్తున్న ఆయన్ను కంట్రోల్ రూంకి ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపారు. అంతేకాదు, ఏడాదిపాటు శాలరీ ఇంక్రిమెంట్ సైతం నిలిపివేసినట్లు తెలుస్తోంది.This Gujarat Police officer brutally thrashed a harmless kid on a cycle just for coming in between the convoy of Police VVIP movement rehearsal.Look at how he makes a fist and punches the kid. NAME AND SHAME THIS COP UNITL HE IS SUSPENDED! pic.twitter.com/5a08yvdUVd— Roshan Rai (@RoshanKrRaii) March 7, 2025 -
కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీలు ఎవరు?.. స్థానాలు ‘నాలుగు’ రేసులో 16 మంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆదివారం(మార్చి 9న) తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సందర్బంగా ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ కానున్నారు.తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు అనే సస్పెన్స్ కాంగ్రెస్ పార్టీ నేతలు నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.. ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అదే రోజున ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ కానున్నారు. ఇక, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్ఠానం ఖరారు చేయనుంది. కాంగ్రెస్ నేతల భేటీ సందర్భంగానే మంత్రి వర్గ విస్తరణ, పార్టీలో కీలక పదవులు కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. అన్ని పదవులు భర్తీ చేసి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.మరోవైపు.. ఎమ్మెల్సీ బరిలో ఓసీ కేటగిరి నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, కుసుమ కుమార్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీసీ కేటగిరి నుండి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్పేటి జైపాల్, గాలి అనిల్ ఉన్నారు. ఎస్సీ కేటగిరి నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్ , బానోతు విజయాభాయి, రేఖా నాయక్ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. తెలంగాణ ఎమ్మెల్సీల నామినేషన్లు దాఖలుకు ఈ నెల 10 చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే వడపోత ప్రక్రియ ప్రారంభించారు. పలువురి పేర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 20న ఎమ్మెల్సీ ఎన్నికల జరుగుతున్న క్రమంలో ఖాళీ అయిన ఐదు స్థానాలలో నాలుగు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. ఇక, నాలుగు సీట్లలో ఒకటి సీపీఐకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జైమాల్యా బాగ్చీ
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జైమాల్యా బాగ్చీని సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం గురు వారం కేంద్ర ప్రభు త్వానికి సిఫార్సు చేసింది. 2013 జూలై 18న జస్టిస్ అల్తమస్ కబీర్ పదవీ విరమణ చేసిన చేసిన తర్వాత కలకత్తా హైకోర్టు నుంచి ఏ న్యాయమూర్తి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందలేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ప్రత్యేకంగా ప్రస్తావించింది. కొలీజియం సిఫా ర్సును కేంద్రం ఆమోదిస్తే జస్టిస్ జైమాల్యా బాగ్చీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితు లవుతారు. ఆయన పదవీకాలం ఆరేళ్లకుపైగా ఉన్నందున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. -
గంగా మాత ఆశీస్సులతో దేశ సేవ: ప్రధాని మోదీ
హర్సిల్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇక్కడ ఏదో ఒక సీజన్‌కు పరిమితం కాకుండా ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచు కొండలు, ప్రకృతి రమణీయతతో కూడిన సుందరమైన రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ఆఫ్–సీజన్ అనేదే ఉండకూడదని పేర్కొన్నారు. పర్యాటర రంగాన్ని అభివృద్ధి చేసుకుంటే స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ గురువారం ఉత్తరాఖండ్‌లో పర్యటించారు. ఉత్తరకాశీ జిల్లాలోని ముఖ్వా గ్రామంలో గంగా మాత ఆలయాన్ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. తనను గంగా మాత దత్తత తీసుకున్నట్లు భావిస్తున్నానని, ఆ తల్లి ఆశీస్సులే తనను కాశీ(వారణాసి)కి తీసుకెళ్లాయని, దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాయని వ్యాఖ్యానించారు. అనంతరం హర్సిల్ గ్రామంలో బహిరంగ సభలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌లో శీతాకాలంలో పర్యటిస్తే చక్కటి అనుభూతి లభిస్తుందని అన్నారు. దేశమంతా పొగమంచుతో కప్పబడి ఉన్న సమయంలో ఉత్తరాఖండ్ మాత్రం సూర్యకాంతిలో స్నానమాడుతూ కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 12 నెలల టూ రిజం విజన్‌ను ప్రధానమంత్రి ప్రశంసించారు. పర్యాటకులను ఆకర్శించడానికి బహుముఖ చర్యలు అవసరమని పేర్కొన్నారు. వేసవి కాలంలో పర్యాటకులతో కళకళలాడే ఉత్తరాఖండ్ చలికాలంలో మాత్రం ఖాళీగా దర్శనిస్తోందని, ఈ పరిస్థితి మారాలని స్పష్టంచేశారు. అన్ని సీజన్లలో పర్యాటకులు భారీగా తరలివచ్చేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కోరారు. వింటర్ టూరిజం మనం లక్ష్యం కావాలని అన్నారు. చలికాలంలోనే అసలైన ఉత్తరాఖండ్‌ను అనుభూతి చెందవచ్చని పర్యాటకులకు సూచించారు. గిరిజన గ్రామమైన జడూంగ్ నుంచి హర్సిల్ విలేజ్ వరకూ ట్రెక్, బైక్ జర్నీని ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో రెండు కీలకమైన రోప్‌వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు గుర్తుచేశారు. రోప్‌వే ప్రాజెక్టుతో కేదార్నాథ్ ప్రయాణం 9 గంటల నుంచి 30 నిమిషాలకు తగ్గిపోతుందని వెల్లడించారు. వివాహాలు చేసుకొనేందుకు, సినిమాలు, షార్ట్‌ఫిలింల షూటింగ్‌లకు ఉత్తరాఖండ్‌లో చక్కటి వేదికలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సరిహద్దు గ్రామమైన హర్సిల్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి మోదీయేనని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ పేర్కొన్నారు. రేపు గుజరాత్లో మోదీ పర్యటన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన గుజరాత్లో పర్యటించనున్నారు. నవసారి జిల్లాలో లఖ్పతి దీదీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మహిళా పోలీసులు, మహిళా సిబ్బంది ఆధ్వర్యంలోనే నిర్వహించబోతున్నారు. -
కుటుంబ నియంత్రణపై నా ఆలోచన మారింది
సాక్షి, న్యూఢిల్లీ : జనాభా నియంత్రణ విషయంలో తన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన రిపబ్లిక్ టీవీ ‘లిమిట్లెస్ ఇండియా’ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా నిర్వహణ భారత్‌కు చాలా ముఖ్యమైనదని చెప్పారు. ప్రస్తుతం చైనా, జపాన్, యూరప్‌లలో జనాభా పెరుగుదల తగ్గిపోయిందని అన్నారు. 2047 కల్లా దేశంలో 65% మంది ప్రజలు 35 ఏళ్లలోపు వారు ఉంటారన్నారు. కుటుంబ నియంత్రణ విధానాన్ని సక్రమంగా నిర్వహించినందుకు దక్షిణ భారత దేశంలో జనాభా తగ్గిందన్నారు. ఇప్పుడు జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాదిలో ఆలోచనా విధానం మారాలని సూచించారు. బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువ మంది జనాభాతో దేశాన్ని కాపాడుతున్నాయని, ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలూ అనుసరించాలని చెప్పారు.మెట్రో ప్రాజెక్టులకు వందశాతం సహాయం చేయండివిశాఖపట్నం, విజయవాడ నగరాలకు మెట్రో ప్రాజెక్టుల అనుమతులను త్వరితగతిన ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ ప్రాజెక్టులకు వంద శాతం ఖర్చును కేంద్రమే భరించాలని విన్నవించారు. చంద్రబాబు గురువారం ఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖల మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశమై ఈమేరకు విజ్ఞప్తి చేశారు. ఈ భేటీ వివరాలను సీఎం ఎక్స్ ద్వారా వెల్లడించారు. విశాఖపట్నంలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్‌కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నందున జాతీయ రహదారులకు మెట్రోను అనుసంధానించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టు అమరావతి ప్రవేశ ద్వారంగా ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందన్నారు. విజయవాడలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ భేటీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. లూథ్రాతో చంద్రబాబు రహస్య భేటీ?ఎలాగైనా కేసులన్నీ క్లోజ్ అయ్యేలా చూడాలని వినతి!సాక్షి, న్యూఢిల్లీః సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్థార్థ లూథ్రాతో సీఎం చంద్రబాబు రహస్యంగా సమావేశమైనట్లు తెలిసింది. ఈ భేటీలో గతంలో చంద్రబాబుపై నమోదైన కేసులను ఎత్తివేసే అంశంపై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. గురువారం రాత్రి ఢిల్లీ వచ్చిన చంద్రబాబు రిపబ్లికన్ టీవీ నిర్వహించిన ‘లిమిట్ లెస్ ఇండియా’ సదస్సుకు హాజరయ్యారు. సదస్సు అనంతరం ఆయన నేరుగా డిఫెన్స్ కాలనీలోని లూథ్రా నివాసానికి వెళ్లారు. దాదాపు 40 నిమిషాలు వీరిద్దరూ పలు విషయాలపై చర్చించినట్లు తెలిసింది. ఏం చేసైనా సరే తనపై ఉన్న కేసులన్నీ త్వరితగతిన క్లోజ్ అయ్యేలా చూడాలని లూథ్రాను చంద్రబాబు కోరినట్లు విశ్వసనీయ సమచారం.ఆ కేసులన్నీ మూసేద్దాం2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన దోపిడీని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణాల కుట్రదారు, లబ్ధిదారు చంద్రబాబే అనే విషయాన్ని సిట్ ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. నిబంధనలకు విరుద్ధమని చెప్పినా సరే సీఎం హెూదాలో చంద్రబాబు ఆదేశించడంతోనే అక్రమాలకు పాల్పడాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు, ఇతరులు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. అక్రమ నిధులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి, టీడీపీ బ్యాంకు ఖాతాలకు చేరినట్టు ఆధారాలను సిట్ సేకరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కేసుల నుంచి చంద్రబాబు పేరు తప్పించేందుకు కుట్ర పన్నుతోంది. చంద్రబాబు అవినీతి కేసుల్లో గతంలో సిట్ సేకరించిన డాక్యుమెంటరీ ఆధారాలను తారుమారు చేసే విషయాలపై లూథ్రాతో చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. ఈ కేసులన్నింటి నుంచి త్వరితగతిన ఉపశమనం కలిగేలా మార్గాలను చూడాలని లూథ్రాను సీఎం కోరినట్లు సమాచారం. దేశంలో తానే సీనియర్ ముఖ్యమంత్రినని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్షగట్టి తనని జైలుపాలు చేసిందని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. వైఎస్సార్సీపీ పదే పదే ఆ కేసులను ప్రస్తావించడం, ప్రజల్లోకి తీసికెళ్లడం వల్ల తనపై ప్రజల్లో నమ్మకం పోతుందని, అందుకే ఆ కేసుల నుంచి వీలైనంత త్వరగా ఉపశమనం కలిగేలా చూడాలని లూథ్రాను కోరినట్లు సమాచారం. గురువారం రాత్రి చంద్రబాబు ఢిల్లీలోని అధికార నివాసంలో బస చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడకు వెళ్లనున్నారు. -
‘మెడలో తాళి, నుదుటున బొట్టు లేదు.. మీ భర్త మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు’: కోర్టు
ముంబై : వాళ్లిద్దరూ భార్యా, భర్తలు. అయితే, భర్త తనని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు విడాకులు కావాలని కోరింది. ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో న్యాయమూర్తికి, మహిళకు మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పూణేకు చెందిన అంకుర్ ఆర్ జగిధర్ లాయర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ తన భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ తనని సంప్రదించిందని, అందుకే ఆమె తరుఫున వాదిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా తన క్లయింట్ కేసు పూణే జిల్లా కోర్టులో విచారణకు వచ్చిందని, విచారణ సమయంలో న్యాయమూర్తితో జరిగిన వాదనలను భార్య తరుఫు లాయర్ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో పూణే జిల్లా కోర్టులో ‘‘నా క్లయింట్ విడాకుల కేసు విచారణ జరిగింది. విచారణలో భర్త తన డిమాండ్లను నెరవేర్చాలని కోర్టును కోరింది. అయితే, ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి నా క్లయింట్‌ను ఇలా ప్రశ్నించారు. ‘‘ఏమ్మా.. మిమ్మల్ని చూస్తుంటే మొడలో మంగళసూత్రం, నుదుట బొట్టు పెట్టుకునేవారిలా కనిపించడం లేదే? వివాహం జరిగిన స్త్రీగా మీరు కనిపించకపోతే.. మీ వారు.. మిమ్మల్ని ఎలా ఇష్టపడతారు? అందుకే భర్తలతో ప్రేమగా ఉండండి. కఠువగా ఉండకండి అని సలహా ఇచ్చారు.అంతేకాదు.. మాటల మధ్యలో న్యాయమూర్తి ఇలా అన్నారు. ‘‘ఒక స్త్రీ బాగా సంపాదిస్తే, ఆమె ఎప్పుడూ తనకంటే ఎక్కువ సంపాదిస్తున్న భర్తనే కోరుకుంటుంది. తక్కువ సంపాదిస్తున్న వ్యక్తి చాల్లే అని సరిపెట్టుకోదు. అదే బాగా సంపాదించే వ్యక్తి తాను వివాహం చేసుకోవాలనుకుంటే, తన ఇంట్లో పాత్రలు కడిగే పనిమనిషినైనా సరే వివాహం చేసుకోవాలనుకుంటాడు. కాబట్టి మీరు మీ భర్త పట్ల కాస్త ప్రేమను చూపించండి. కఠినంగా ఉండొద్దు అని ఇద్దరు దంపతుల్ని ఒక్కటి చేసే ప్రయత్నం చేశారని వివరిస్తూ’’ సదరు న్యాయవాది రాసిన సోషల్ మీడియా పోస్టు నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. -
తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ గురువారం ఉదయం ఓ సందేశం విడుదల చేశారాయన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించి గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. కొత్తగా ఎన్నికైన మా అభ్యర్థులకు అభినందనలు. గొప్ప శ్రద్ధతో పని చేసిన పార్టీ కార్యకర్తలను చూసి నేను గర్విస్తున్నా’’ అని ఎక్స్ పోస్టులో సందేశం ఉంచారాయన. ఇదిలా ఉంటే.. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలిచారు. ఇక.. ఉత్కంఠ భరితంగా సాగిన ఉమ్మడి కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా చిన్నమైల్ అంజిరెడ్డి నెగ్గారు. టీచర్స్ ఎమ్మెల్సీగా కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ మాత్రం ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు.. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అల్ఫోర్స్ నరేందర్రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో అంజిరెడ్డి జయకేతనం ఎగురవేశారు. -
త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో రాష్ట్రంలో ‘ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్’ బిల్లును తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం ఎంపిక చేసుకున్న మీడియాతో సీఎం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో అనేక భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. ప్రతి పది కేసుల్లో ఆరు భూ వివాదాలకు సంబంధించినవే అన్నారు. భూముల కంప్యూటరీకరణలో సరైన విధానం లేక సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. ప్రైవేటు భూములను బలవంతంగా 22ఏలో చేర్చారని.. అటవీ భూములను అధికారులతో కలిసి ఆక్రమించారని ఆరోపించారు. గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు విజయవంతంగా అమలవుతోందని, దాని అమలును ఏపీలో కూడా అనుమతించాలని కోరినట్లు చెప్పారు. డీలిమిటేషన్ నిరంతర ప్రక్రియనియోజకవర్గాల పునర్విభజన అనేది నిరంతర ప్రక్రియ అని.. దీనిపై సమయానుకూలంగా స్పందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో జనాభా నియంత్రణను ప్రోత్సహించానని, ఇప్పుడు జనాభాను పెంచాలనే విషయం అర్థమై పిలుపునిస్తున్నట్లు చెప్పారు.పోలవరం 2027 కల్లా పూర్తిగత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల బకాయిలను వదిలిపెట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు తెలిపినట్లు చంద్రబాబు చెప్పారు. రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు నీరందించేందుకు.. సముద్రంలో కలిసే జలాలను వినియోగించుకుంటామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పోలవరంను 2027 కల్లా పూర్తి చేస్తామని తెలిపారు. 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ఎనిమిది లైన్లతో 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. శ్రీశైలం ఆలయం వద్ద ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు రోడ్డును విస్తరించాలని, వినుకొండ–అమరావతి తదితర ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. డీపీఆర్‌లు సిద్ధం చేసిన తర్వాత టెండర్లు పిలుస్తామని గడ్కరీ చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మిర్చి క్వింటాకు రూ.11,781 మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకొందన్నారు. కాగా, ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాల సర్దుబాటుకే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. -
చాలా బాగుంది.. ఎలా తయారు చేస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ/భద్రాచలం: ‘యే క్యాహై?.. బహుత్ అచ్ఛా హై.. ఇస్కో కైసే బనాతే హో? (ఇదేంటి? చాలా బాగుంది..! ఎలా తయారు చేస్తారు?)’.. అంటూ అగ్గిపెట్టెలో పట్టేలా చేతితో నేసిన చీరను చూసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆశ్చర్యానికి గురయ్యారు. సిరిసిల్ల చేనేత కళాకారులపై ప్రశంసలు కురిపిస్తూ చీర తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లోని అమృత్ ఉద్యాన్‌లో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా ‘వివిధతా కా అమృత్ మహోత్సవ్’ సౌత్ ఎడిషన్ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంబోత్సవానికి ముందు తెలంగాణ పెవిలియన్‌ను సందర్శించిన రాష్ట్రపతిని.. గవర్నర్, ఉపముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి తెలంగాణ చేనేత కళాకారుల పనితనాన్ని, చేతివృత్తుల ప్రాముఖ్యతను వివరించారు. ఉత్సవ ప్రారంభంలో కళాకారులు ప్రదర్శించిన గుస్సాడీ నృత్యం ఆహూతులను అలరించింది. ఈనెల 9 వరకు ఉత్సవం కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెవిలియన్‌లో రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్‌తో సహా 20 మంది పలు ప్రాంతాలకు చెందిన ప్రముఖ చేనేత కార్మికులు, 20 మంది నిపుణులతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్లో ‘భద్రాద్రి’ ఉత్పత్తులు తెలంగాణ నుంచి భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని మహిళలు రూపొందించిన పలు రకాల సబ్బులు, షాంపూలు, మిల్లెట్ బిస్కెట్లు, కరక్కాయ పౌడర్, తేనె, న్యూట్రీ మిక్స్ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచినట్టు పీఓ రాహుల్ తెలిపారు. ఆదివాసీ గిరిజన మహిళలు రూపొందించే ఉత్పత్తులు, వాటి వల్ల ప్రయోజనాలను ఇతర రాష్ట్రాల ప్రతినిధులు, ప్రజలకు తెలియజేసి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేలా గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ సూచనలతో ఈ స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
‘నా భార్య నా రక్తం తాగేస్తోంది.. ఏం చేయమంటారు!’
లక్నో: ‘నా భార్యకు నాకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. తను ప్రతి రోజు నా కలలోకి వస్తుంది. నా గుండెలపై కూర్చుంటుంది. నా రక్తాన్ని తాగేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే నేను నిద్ర పోలేకపోతున్నా. ఫలితమే నా విధుల్లో సమయ పాలన పాటించలేకపోతున్నా’అంటూ ఓ పారామిలటరీ జవాన్ తన కమాండర్‌కు లేఖ రాశారు. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య పోరు పడలేక సదరు జవాన్ రాసిన ఆ లేఖను లక్షల మంది నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఇంతకి ఏం జరిగింది?దేశంలో శాంతి భద్రతలకు విఘూతం కలగకుండా డేగ కన్నుతో నిత్యం రక్షణ కల్పించే పారా మిలరీ విభాగంలో ప్రొవిన్సియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ (pac) విభాగం ఉంది. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా 44వ ప్రదేషిక్ ఆర్మ్డ్ కాన్స్టేబులరీ (Pradeshik Armed Constabulary) విభాగంలో ఓ జవాన్ విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో సిన్సియర్‌గా, స్ట్రిక్ట్‌గా ఉండే సదరు జవాన్‌లో ఇటీవల కాలంలో సమయ పాలన లోపించింది. డ్యూటీ టైంకు రాకపోవడం,షేవింగ్ చేసుకోకపోవడం, చిందవందరగా యూనిఫారమ్ ధరించడం, ఇచ్చిన పనిని సకాలంలో చేయకుండా ఆలస్యం చేస్తుండేవారు.విధుల్లో నిర్లక్ష్యం.. అందుకు కారణంఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గత నెల 17న పీఏసీ 44వ బెటాలియన్ జీస్వ్కాడ్ కమాండర్ మదుసూధన్ శర్మ సదరు జవాన్‌కు విధుల్లో అలసత్వం వహిస్తున్నారని, వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో.. మందురోజు విధులు ఎలా జరిగాయో తెలుసుకుని.. ఆ రోజు విధులు ఎక్కడ నిర్వహించాలో ప్రతి రోజు ఉదయం బ్రీఫింగ్ ఉంటుంది. ఆ బ్రీఫింగ్‌కు గైర్హాజరు కావడం కాకుండా ఆలస్యంగా రావడం, మిలటరీ విభాగంలో విధులు నిర్వహించే వారు తప్పని సరిగా ఫుల్ షేవింగ్ చేసుకోవాలి. కానీ అలా షేవింగ్ చేసుకోకుండా విధులు నిర్వహించడం, ఇష్టానుసారంగా యూనిఫారమ్ ధరించడం, ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయకుండా ఆలస్యం ఎందుకు చేస్తున్నారో లేఖలో పేర్కొన్నారు. వివరణ ఇచ్చేందుకు ఒకరోజు సమయం కూడా ఇచ్చారు.అసలేం జరిగిందంటే?కమాండర్ నుంచి వచ్చిన లేఖపై సదరు పీఏసీ జవాన్ వివరణ ఇచ్చారు. తాను విధుల్లో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారో భావోద్వేగంతో పలు కారణాల్ని జత చేశారు. ‘సార్ నేను ఫిబ్రవరి 16న డ్యూటీకి ఆలస్యంగా వచ్చాను. ఎందుకంటే వ్యక్తిగత సమస్యలు నన్ను తీవ్రంగా వేధిస్తున్నాయి. వాటి వల్ల రాత్రిపూట నిద్రపోవడం కష్టంగా మారింది. కొద్ది రోజుల క్రితం నా భార్యతో గొడవలు జరిగాయి. గొడవ తర్వాత నా భార్య నా కలలోకి వస్తుంది. నా గుండెలపై కూర్చుకుంటుంది. నా రక్తాన్ని తాగేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి తోడు నా తల్లిని అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. కారణంగా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నాను. తీవ్ర మనోవేధనకు గురవుతున్నా. దీని నుంచి భయటపడేందుకు చికిత్స తీసుకుంటున్నాను. నేను పడుతున్న కష్టాల నుంచి విముక్తి కలిగించేలా ఓ దారి చూపాలని ఆ లేఖలో ప్రాధేయపడ్డారు. ఆ లేఖపై 44వ బెటాలియన్ పీఏసీ కమాండంట్ సత్యేంద్ర పటేల్ స్పందించారు. ఆన్లైన్లో వైరల్ అవుతున్న లేఖ నిజమేనా? అదే నిజమైతే ఎవరు రాశారో? పరిశీలిస్తాం. సదరు జవాన్‌కు ఇబ్బందులు ఉంటే అతనికి అండగా నిలుస్తాం. చికిత్స కూడా అందిస్తాం’అని అన్నారు. -
రాహుల్ గాంధీకి కోర్టు రూ.200 జరిమానా.. ఎందుకంటే?
లక్నో: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీకి (Rahul Gandhi) కోర్టు ఫైన్ విధించింది. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్‌సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాహుల్‌పై పరువు నష్టం దావా కేసు నమోదైంది. అయితే, ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ గాంధీ లక్నోలోని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (acjm)ముందు హాజరు కావాల్సి ఉంది.కానీ రాహుల్ కోర్టు విచారణకు గైర్హాజరయ్యారు. రాహుల్ తీరుపై ఏసీజేఎం న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.200 ఫైన్ విధించారు. ఇదే కేసులో ఏప్రిల్ 14న కోర్టు విచారణకు తప్పని సరిగా హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. -
సగం జనాభా లావెక్కింది
న్యూఢిల్లీ: ప్రపంచ జనాభాలో సగానికి పైగా వయోజనులు ఊబకాయులుగా మారిపోయారు! 2050 నాటికి ఇది 57 శాతం దాటనుంది. అంతేగాక పిల్లలు, టీనేజర్లు, యువకుల్లో మూడింట ఒక వంతు ఊబకాయులుగా మారొచ్చని లానెస్ట్ జర్నల్ అంచనా వేసింది. 200 పైగా దేశాలకు చెందిన గ్లోబల్ డేటాను విశ్లేషించిన మీదట ప్రచురించిన తాజా అధ్యయనంలో ఈ వివరాలను వెల్లడించింది. దశాబ్ద కాలంలో ముఖ్యంగా అల్పాదాయ దేశాల్లో ఊబకాయం వేగంగా పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీని కట్టడికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ)కు చెందిన ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ నాయకత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఊబకాయుల సంఖ్య 1990తో పోలిస్తే నేడు రెట్టింపైంది. 2021 నాటికి ప్రపంచ వయోజనుల్లో సగం మంది ఊబకాయులుగా మారిపోయారు. 25 ఏళ్లు, అంతకు పైబడ్డ వారిలో ఏకంగా 100 కోట్ల పురుషులు, 111 కోట్ల మంది మహిళలు అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ ధోరణులు ఇలాగే కొనసాగితే 2050 ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య పురుషుల్లో 57.4 శాతానికి, స్త్రీలలో 60.3 శాతానికి పెరగవచ్చు. ఇక 1990 నుంచి 2021 నాటికి పిల్లలు, టీనేజర్లలో ఊబకాయులు 8.8 శాతం నుంచి 18.1 శాతానికి పెరిగారు. 20–25 మధ్య వయసు యువతలో 9.9 నుంచి 20.3 శాతానికి పెరిగింది. చైనాలో 62 కోట్లు ఊబకాయుల సంఖ్య 2050 నాటికి చైనాలో 62.7 కోట్లు, భారత్‌లో 45 కోట్లు, అమెరికాలో 21.4 కోట్లకు చేరనుంది. సబ్ సహారా ఆఫ్రికా దేశాల్లో ఈ సంఖ్య ఏకంగా 250 శాతానికి పైగా పెరిగి 52.2 కోట్లకు చేరుతుదని అంచనా. నైజీరియా 2021లో 3.66 కోట్ల మంది అధిక బరువుతో ఉండగా 2050 కల్లా 14.1 కోట్లకు చేరనుంది. సామాజిక వైఫల్యం... వయోజనుల్లో సగం ఊబకాయులే కావడాన్ని సామా జిక వైఫల్యంగా చూడాలని ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ అన్నారు. యువతలో ఊబకాయం వేగంగా పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు. ‘‘కొత్తగా వచ్చిన బరువు తగ్గించే మందుల ప్రభావాన్ని అధ్యయనం పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటే విపత్తును ఎంతో కొంత నివారించవచ్చు’’అని ఆమె వెల్లడించారు. ఆరోగ్య వ్యవస్థలకు సవాలు ఊబకాయం పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు సవాలేనంటున్నారు ఆస్ట్రేలియాలోని మర్డోక్ చి్రల్డన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ జెస్సికా కెర్. ‘‘పిల్లలు, టీనేజర్ల విషయంలో ఇప్పట్నుంచే శ్రద్ధ పెడితే ఊబకాయాన్ని నివారించడం సాధ్యమే. యూరప్, దక్షిణాసియా దేశాల్లో పిల్లలు, టీనేజర్లు అధిక బరువుతో ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.ఉత్తర అమెరికా, ఆస్ట్రలేషియా, ఓషియానియా, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా ఊబకాయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టీనేజీ బాలికల్లో ఎక్కువగా ఉంది’’అని చెప్పారు. భావి తరాలు అనారోగ్యం బారిన పడకుండా చూడటం, ఆర్థిక, సామాజిక నష్టాలను నివారించడం తక్షణ కర్తవ్యమని సూచించారు. -
ప్రపంచం చూపు.. భారత్ వైపు
న్యూఢిల్లీ: ప్రపంచమంతా భారత్‌ను నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారీ స్థాయిలో చర్యలు చేపట్టాలని పారిశ్రామిక రంగానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తయారీ రంగాన్ని, ఎగుమతులను మరింతగా ప్రోత్సహించేందుకు త్వరలోనే ప్రభుత్వం రెండు పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. నియంత్రణలు, పెట్టుబడులు, సులభతరమైన వ్యాపార నిర్వహణకు సంబంధించిన సంస్కరణలపై బడ్జెట్ తదనంతర వెబినార్‌లో మాట్లాడుతూ ఆయన ఈ అంశాలను పేర్కొన్నారు.ప్రపంచ డిమాండ్‌ను తీర్చగలిగేలా భారత్‌లో తయారు చేయగల కొత్త ఉత్పత్తులను గుర్తించాలని పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. ‘దీన్ని సాకారం చేసే సత్తా మన దేశానికి, మీకు (పరిశ్రమలు) ఉంది. ఇదొకొ గొప్ప అవకాశం. ప్రపంచ ఆకాంక్షల విషయంలో మన పరిశ్రమలు ప్రేక్షక పాత్ర వహించకుండా, అందులో కీలకపాత్ర పోషించాలి. మీకు మీరే అవకాశాలను అందింపుచ్చుకోవాలి’ అని పారిశ్రామికవేత్తలకు మోదీ సూచించారు. ‘భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి ఇంజిన్‌గా నిలుస్తోంది. అందుకే ప్రతి దేశం భారత్‌తో ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. మన తయారీ రంగం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు చౌక రుణాలివ్వాలి... దేశవ్యాప్తంగా ఉన్న ఆరు కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు సకాలంలో, తక్కువ వడ్డీ రేట్లకు నిధులను అందించే దుకు కొత్త తరహా రుణ పంపిణీ విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళా ఎంట్రప్రెన్యూర్లకు తొలిసారిగా రూ. 2 కోట్ల వరకు రుణాలను అందించనున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈలకు కేవలం రుణాలివ్వడమే కాకుండా, మార్గనిర్దేశం, తోడ్పాటు అందించేలా మెంటార్షిప్ ప్రోగ్రామ్‌లను రూపొందించాలన్నారు. ఏ దేశ ప్రగతికైనా మెరుగైన వ్యాపార పరిస్థితులు చాలా కీలకమని, అందుకే తమ ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో 40,000కు పైగా నిబంధనల అమలు అడ్డంకులను తొలగించిందన్నారు. జనవిశ్వాస్ 2.0 చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. బడ్జెట్లో ఎంఎస్ఎంఈ రుణాలపై గ్యారంటీ కవరేజీని రెట్టింపు స్థాయిలో రూ.20 కోట్లకు పెంచామని, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల నిమిత్తం రూ.5 లక్షల వరకు పరిమితితో క్రెడిట్ కార్డులను అందించనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. -
ఆ దేశాలపై సుంకాలు.. భారత్‌కు అవకాశాలు
న్యూఢిల్లీ: చైనా, మెక్సికో, కెనడాపై అమెరికా అధిక దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) మోపడం అన్నది, భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో అవకాశాలను విస్తృతం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దేశం నుంచి వ్యవసాయం, ఇంజనీరింగ్, మెషిన్ టూల్స్, గార్మెంట్స్, టెక్స్టైల్స్, రసాయనాలు, లెదర్ పరిశ్రమకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మొదటి నాలుగేళ్ల పదవీ కాలంలో చైనాపై అధిక సుంకాల బాదుడు నుంచి ఎక్కువగా లాభపడిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. మెక్సికో, కెనడాలపై 25 శాతం సుంకాలు 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ లోగడే ప్రకటించారు. చైనా ఉత్పత్తులపైనా టారిఫ్‌ను 20 శాతానికి పెంచుతున్నట్టు పేర్కొనడం తెలిసిందే. ‘‘అమెరికా విధించిన సుంకాలతో అమెరికా మార్కెట్లో చైనా, మెక్సికో, కెనడా వస్తువుల ధరలను పెంచేస్తాయి. దీంతో వాటి పోటీతత్వం తగ్గిపోతుంది. భారత ఎగుమతిదారులు ఈ అవకాశాలను సొంతం చేసుకోవాలి’’అని భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. భారత్‌కు ప్రయోజనం: జీటీఆర్ఐ ప్రైవేటు పరిశోధనా సంస్థ అయిన గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. వాణిజ్య యుద్ధం భారత్‌కు అనుకూలిస్తుందని, ఎగుమతులను పెంచుకోవడంతోపాటు అమెరికా కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి సాయపడుతుందని పేర్కొంది. చైనాపై అధిక సుంకాలు భారత్ తన తయారీరంగాన్ని బలోపేతం చేసుకునేందుకు అవకాశంగా మలుచుకోవాలని సూచించింది. ఒప్పందాలకు కట్టుబడని ట్రంప్ వైఖరి దృష్ట్యా ఆ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ హెచ్చరించారు. దీనికి బదులు జీరోకి జీరో టారిఫ్ డీల్‌ను కుదుర్చుకోవాలని సూచించారు. సుంకాలేతర చర్యలు భారత ఎగుమతులకు అడ్డు: డీజీఎఫ్టీ అభివృద్ధి చెందిన దేశాలు విధించిన నాన్ టారిఫ్ (సుంకాలు కాని ఇతర చర్యలు)లు భారత వస్తువులకు మార్కెట్ అవకాశాలను పరిమితం చేయొచ్చని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ సారంగి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) విధించిన కార్బన్ ట్యాక్స్, డీఫారెస్టేషన్ నిబంధనలను ప్రస్తావించారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థతో భారత్ అనుసంధానమై ఉండకపోవడం, అధిక దిగుమతి సుంకాలు, టెక్నాలజీ పరంగా అననుకూలత, అధిక లాజిస్టిక్స్ వ్యయాలు వంటి ఇతర సవాళ్లు కూడా ఉన్నట్టు చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల దుందుడుకు పారిశ్రామిక విధానాలు సైతం భారత ఎగుమతులకు అవరోధంగా మారొచ్చన్నారు. ‘‘2023–24లో 437 బిలియన్ డాలర్ల వస్తు ఎగుమతులకు గాను 284 బిలియన్ డాలర్ల రుణ సాయం అవసరం. కానీ, అందించిన రుణ సాయం 125 మిలియన్ డాలర్లుగానే ఉంది. 2030 నాటికి ఎగుమతుల రుణ డిమాండ్ 650 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది’’అని సారంగి వివరించారు. -
రూ.1,891 కోట్ల బియ్యం బకాయిలివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు రావాల్సిన బియ్యం బకాయిలు రూ.1,891 కోట్లను విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని ఆయన నివాసంలో సీఎం రేవంత్‌తోపాటు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిశారు. ⇒ ఎఫ్‌సీఐకి 2014–15 ఖరీఫ్ కాలంలో రాష్ట్రంనుంచి సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అప్పుడు అదనపు లెవీ సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని కేంద్రమంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. ⇒ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్ నెలలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ⇒ 2021 జూన్ నుంచి 2022 ఏప్రిల్ వరకు నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ⇒ సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) గడువును నెల రోజులు కాకుండా కనీసం నాలుగు నెలలు పొడిగించాలని, అప్పుడే సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని కేంద్రమంత్రికి తెలియజేశారు. 4,000 మెగావాట్ల మంజూరును పునరుద్ధరించండి తెలంగాణకు పీఎం కుసుమ్ కింద గతంలో ఇచ్చిన 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి అనుమతులను పునరుద్ధరించాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు గతంలో నాలుగు వేల మెగావాట్లకు అనుమతులు ఇచ్చిన కేంద్రం, తర్వాత దానిని వెయ్యి మెగావాట్లకు కుదించిందంటూ కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుదుత్పత్తిని తాము ప్రోత్సహిస్తున్నామంటూ కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి మాణిక్‌రాజ్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరాం: మంత్రి ఉత్తమ్ తెలంగాణకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. ‘ఉదయం, సాయంత్రం రెండుసార్లు కేంద్రమంత్రిని కలిశాం. తెలంగాణకు గత పదేళ్ల నుంచి పౌరసరఫరాల విషయంలో కొన్ని బకాయిలున్నాయి. గతంలో కొన్ని డాక్యుమెంటేషన్ పెండింగ్ వల్ల ఆ నిధులు రాలేదు. సుమారు రూ.2వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సి ఉంది. వాటిని విడుదల చేయాలని కోరాం. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క నాయకత్వంలో మహిళా సంఘాలకు కూడా సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామని, ‘పీఎం కుసుమ్’పథకం కింద వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి 4వేల మెగావాట్ల సబ్బిడీ ఇవ్వాలని కోరాం. గిరిజన, మారు ప్రాంతాలకు సబ్సిడీతో సహా అదనంగా సోలార్ పంప్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. అన్ని విషయాల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించారు. అన్ని విజ్ఞప్తులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు’అని ఉత్తమ్ తెలిపారు. -
నిర్ణయం ఇంకెప్పుడు?
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ప్రతిసారీ ‘‘స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారు’’ అంటున్నారు. తగినంత సమయం అంటే ఎంత? ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకా?. తగినంత సమయాన్ని కోర్టు ఫిక్స్ చేయాలా? వద్దా?. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. చట్ట సభల గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా? ప్రజాస్వామ్యానికి అర్థం ఏం ఉంటుంది? ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే విధంగా వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదు..’ అంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ కార్యాలయం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా అందజేయాలని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం ఆదేశించింది. ఈ నోటీసులపై వీరంతా ఈనెల 22లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఓ ఎస్ఎల్పీ, మరో రిట్ పిటిషన్‌పై విచారణ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌లపై ఎస్ఎల్పీ, మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహీపాల్ రెడ్డి, అరెకపూడి గాందీలపై రిట్ పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. కాగా ఈ రెండు పిటిషన్లపై తాజాగా మంగళవారం సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు, స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, ముకుల్ రోహత్గీ తదితరులు వాదనలు వినిపించారు. ఏడాది కావొస్తున్నా చర్యలు లేవు ‘గతేడాది మార్చి, ఏప్రిల్‌లో పార్టీ ఫిరాయింపులపై తొలిసారి కోర్టును ఆశ్రయించాం. అనంతరం జూన్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. ఏడాది అవుతున్నా ఇప్పటివరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఆర్టికల్ 32, 226 ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి సమయం అవసరం లేదు. ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ బీ ఫాంపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. మరో ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ పార్టీ కోసం లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు వాళ్లు పార్టీ ఫిరాయించినట్టే. దీనిపై తొలుత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా..విచారణకు సమయాన్ని ఖరారు చేయాలంటూ సింగిల్ బెంచ్ నాలుగు వారాలు గడువు ఇచ్చింది. దీనిపై స్పీకర్ కార్యాలయం అప్పీల్‌కు వెళ్లింది. అయితే స్పీకర్‌కు తగినంత సమయం ఇవ్వాలన్న భావనతో ఈ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంను ఆశ్రయించాం. కానీ స్పీకర్ కార్యాలయం ఇప్పటివరకు ఆ తగినంత సమయం అంటే ఎంతో చెప్పనేలేదు. స్పీకర్ సమయం తీసుకునే విషయంలో సుభాష్ దేశాయ్, కేశం మేఘాచంద్, రాజేంద్ర సింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ తీర్పుల ఆధారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది..’ అని అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయంపై ఎలాంటి గడువు ఫిక్స్ చేయలేదని జస్టిస్ బీఆర్ గవాయి అన్నారు. రాణా కేసులో మూడు నెలల సమయం ఇవ్వాలని చెప్పిందని తెలిపారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ అధికారం ఉన్నచోట ఒకలా... లేనిచోట మరోలా వ్యవహరిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది అర్యమ సుందరం వాదించారు.స్పీకర్‌కు కోర్టు ఆదేశాలివ్వడానికి అవకాశం లేదుస్పీకర్ కార్యదర్శి తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదిస్తూ.. ‘ఫిరాయింపులపై గతేడాది జూలై మొదటి వారంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే 9వ తేదీ నాటికే కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ఫిరాయింపులపై ఫిర్యాదు అందగానే స్పీకర్ స్పందించారు.. నోటీసులు ఇచ్చారు. వారి నుంచి రిప్లై రాగానే నిర్ణయం తీసుకుంటారు. అసలు స్పీకర్ నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోవాలని లేదు. రాజ్యాంగబద్ధంగా అత్యంత ఉన్నతమైన పదవుల్లో స్పీకర్ పదవి ఒకటి. ఈ పదవిలో ఉన్న స్పీకర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం లేదు..’ అని చెప్పారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘స్పీకర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం లేదూ అంటే.. న్యాయమే డిసైడ్ చేస్తుంది ఆగండి..’ అంటూ వ్యాఖ్యానించింది. నోటీసుల జారీకి ఆదేశాలిచ్చింది. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కూడా వీరికి నేరుగా నోటీసులు ఇవ్వొచ్చని తెలిపింది. ఈనెల 25న ఐటెం నంబర్–1గా కేసును విచారిస్తామని స్పష్టం చేసింది. -
ప్రైవేట్ ఆస్పత్రులలో మెడిసిన్ కొనుగోలు.. రాష్ట్రాలకు సుప్రీం చివాట్లు
ఢిల్లీ : ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం పేదలకు అందని ద్రాక్షాగా మారింది. ఇదే అంశంపై సుప్రీం కోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను చివాట్లు పెట్టింది. సామాన్యులకు వైద్య సంరక్షణ,మౌలిక సదుపాయాలు కల్పిస్తూ భరోసా ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడింది. వైద్యాన్ని సామాన్యులకు దూరం చేయడమేకాదు.. వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులలో చేరేలా పరోక్షంగా సులభతరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రైవేట్ ఆస్పత్రులు తాము నిర్వహించే మెడికల్ షాపుల్లోనే మెడిసిన్లు, ఇంప్లాంట్స్, ఇతర మెడికల్ కేర్ ఉత్పుత్తులు కొనుగోలు చేయాలని పేషెంట్లను, వారి కుటుంబ సభ్యులను ఒత్తిడి చేస్తున్నాయని పిల్లో పేర్కొన్నారు. అంతేకాదు, రోగులకు అమ్మే మెడిసిన్లను సైతం వాస్తవ ధరకంటే అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని హైలెట్ చేశారు. ఫలితంగా రోగులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్రాలు ప్రైవేట్ ఆస్పత్రులపై నియంత్రణ, దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తూ.. తమ ఫార్మసీలలో మాత్రమే మెడిసిన్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేయాలని పిల్లో కోరారు. ఆ పిల్‌పై ఇవాళ సుప్రీం కోర్టు జస్టిస్ సూర్యకాంత్, ఎన్కే సింగ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా మేము మీతో ఏకీభవిస్తున్నాము.. అయితే దీన్ని ఎలా నియంత్రించాలి? అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు.The Supreme Court is hears a Public Interest Litigation (PIL) challenging the practice of hospitals and in-house pharmacies compelling patients to purchase medicines exclusively from their designated pharmacy.Bench: Justice Surya Kant and Justice N. Kotiswar Singh pic.twitter.com/jS3RLmZBwJ— Bar and Bench (@barandbench) March 4, 2025 ఈ సందర్భంగా తమ ఫార్మసీలలోనే మెడిసిన్ తీసుకోవాలని పేషెంట్లపై ఒత్తిడి చేసే ఆస్పత్రులపై తగు చర్యలు తీసుకునేలా ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ మార్కెట్లో మెడిసిన్ తక్కువ ధరలో దొరికినప్పుడు అక్కడే కొనుగోలు చేసుకోవచ్చు. అలా కాకుండా హాస్పిటల్‌కు చెందిన ఫార్మసీలలో మెడిసిన్ కొనుగోలు చేయాలని పేషెంట్లపై ఒత్తిడి చేయొకూడదని సూచించింది.మరోవైపు, కేంద్ర ప్రభుత్వానికి ప్రైవేట్ హాస్పిటల్స్, వైద్య సంస్థలు పౌరులను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకునే అవసరాన్ని నొక్కిచెప్పింది. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన ఫార్మసీలలో మెడిసిన్ కొనుగోలు అంశంపై సుప్రీం కోర్టు ఒరిస్సా, ఆరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్,రాజస్థాన్‌లకు నోటీసులు జారీచేసింది. దీనిపై ఆయా రాష్ట్రాలు సుప్రీంలో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయి.మెడిసిన్ ధరలు కేంద్రం జారీ చేసిన ధర నియంత్రణ ఆదేశాలపై ఆధారపడ్డాయని, అత్యవసర మెడిసిన్ సైతం అందుబాటులో ఉండేందుకు ధరలు నిర్ణయించబడ్డాయని తెలిపాయి. హాస్పిటల్ ఫార్మసీల నుండి మందులు కొనుగోలు చేయాలని పేషెంట్లపై ప్రైవేట్ ఆస్పత్రులు బలవంతం చేయడంలేదు’కేంద్రం సైతం సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చింది. -
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీతో మరోసారి రేవంత్ భేటీ
ఢిల్లీ : కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సమావేశమయ్యారు. 2024 25 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు రూ. 1, 468.94 కోట్లను విడుదల చేయాలని కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 343. 27 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని కేంద్రమంత్రిని రేవంత్ కోరారు. సీఎం రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ తెలంగాణకు సంబంధించిన సమస్యలను విన్నవిస్తున్నారు. తమ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర మంత్రులకు విన్నవిస్తున్నారు.నిన్న సీఆర్ పాటిల్‌తో భేటీ..కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న(సోమవారం) భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ చర్చించారు. సీఎం వెంట తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం, భీమా ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ స్టేజి -2కు సంబంధించి భూసేకరణ, వివాదాలు 18,189 కోట్ల రూపాయల పెండింగ్ పనులు గురించి రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది.ప్రధానంగా కృష్ణా జలాల అంశంపై కేంద్ర జలశక్తి మంత్రికి వివరించారు. దీనిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జలాలను ఏపీ అన్యాయంగా తరలించుకుపోతోందని, ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశం అనంతరం పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. -
తృటిలో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. బోగీలు రెండుగా విడిపోయి..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో(Uttar Pradesh) ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణిస్తున్న రైలు బోగి రెండుగా విడిపోయాయి. 200 మీటర్ల మేర ప్రయాణించాయి. బోగి విడిపోవడంపై అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే ఆ రైలు ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది.పోలీసుల సమాచారం మేరకు..బీహార్ నుంచి ఒడిశాలోని పురి ప్రాంతానికి నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ (Nandan Kanan Express ) బయలుదేరాల్సి ఉంది. అయితే, మార్గం మధ్యలో ఉత్తర ప్రదేశ్‌లో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ్ స్టేషన్ (Pandit Deen Dayal Upadhyaya (DDU) లో నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ బోగీ విడిపోయింది. #WATCH | Chandauli, Uttar Pradesh: The coupling of the Nandan Kanan Express broke near the Pandit Deen Dayal Upadhyaya (DDU) Junction, splitting it into two parts. pic.twitter.com/QjqUHN7tfe— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 4, 2025ట్రైన్ ఆరు బోగీలు విడిపోయి 200 మీటర్లు ముందుకు వెళ్లిపోయాయి. మిగతా 15 బోగీలు వెనకే ఉన్నాయి. బోగీలు విడిపోవడంతో రైల్లోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో కేకలు వేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రైన్‌ను నిలివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికుల్ని సురక్షితంగా మరో కోచ్‌కు తరలించారు. అనంతరం, రైలు బోగీ విడిపోవడంపై రైల్వే అధికారులు ఆరా తీశారు. ఈ క్రమంలోనే రైలు కప్లింగ్ విరిగిపోయిన విషయాన్ని గుర్తించారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి దాన్ని మళ్లీ అతికించారు. -
పాకిస్థానీ అనడం నేరమేమీ కాదు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: వ్యక్తిగత దూషణకు సంబంధించిన ఓ కేసులో దేశ సర్వోన్నత న్యాయం మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మియాన్-టియాన్, పాకిస్థానీ అనడం నేరమేమీ కాదని, అలా అనడం వల్ల మతపరమైన మనోభావాలు దెబ్బ తిన్నాయన్న వాదన అర్ధరహితమని వ్యాఖ్యానించింది.జార్ఖండ్‌లో పని చేసే ఓ ప్రభుత్వ ఉద్యోగి.. ఆర్టీఐ దరఖాస్తు వెరిఫికేషన్‌లో భాగంగా ఓ వ్యక్తిని సంప్రదించారు. అయితే ఆ టైంలో మతం ప్రస్తావన తెచ్చి ఆ వ్యక్తి.. సదరు ఉద్యోగిని దుర్భాషలాడాడు. దీంతో తన విధులకు ఆటంకం కలిగించాడంటూ ఆ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడంతో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితుడికి జార్ఖండ్ హైకోర్టులో ఊరట దక్కలేదు. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మియాన్-టియాన్, పాకిస్థానీ అని సంబోధించడం ద్వారా తన మనోభావాలు దెబ్బన్నాయని ఫిర్యాదుదారు అంటున్నారు. ముమ్మాటికీ అలాంటి వ్యాఖ్యలు అప్రస్తుతం. అయినప్పటికీ.. అది మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం ఏమాత్రం కాదని స్పష్టం చేస్తూ ఆ వ్యక్తికి ఊరట కలిగించింది. -
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. ప్రభుత్వానికి,ఈసీకి.. సుప్రీం నోటీసులు
సాక్షి, ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరిగింది. బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపుల అంశంపై మార్చి 22 లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 25 కి వాయిదా వేసింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైమ్ అంటే ఎంతో చెప్పాలని ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా ?. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి. ఎంత సమయం కావాలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదు’అని బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది అర్యమ సుందరం తన వాదనలు వినిపించారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడమంటే రాజ్యంగమిచ్చిన విధులను నిర్వహించడంలో విఫలమైనట్లేనని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసింది. గత విచారణలోగత విచారణ సందర్బంగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైమ్ అంటే ఎంతో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బీఆర్ఎస్ వాదనలు వినిపించింది. ఈ నేపథ్యంలో రీజనబుల్ టైం ఎంతో చెప్పాలంటూ కోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది.ఇక, తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇటీవలే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం బాలరాజు సహా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు.మరోవైపు.. గత వాదనల్లో.. తెలంగాణ స్పీకర్ (Telangana Speaker) తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తగిన సమయం.. సరైన సమయం.. అంటూ స్పీకర్ చెబుతూ కాలయాపన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేదాకా ఆగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై పూర్తి వాదనలు విన్నాకే ‘ఆ సరైన సమయం’పై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే స్పీకర్‌కు సూచనలు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనుందా అనే ఆసక్తి నెలకొంది.ఇంతకు ముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో రిత్విక్ చౌదరీ, యూకీ బాంబ్రీ
న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 24 ఏళ్ల రిత్విక్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 65వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. సాంటియాగోలో జరిగిన చిలీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలో కొలంబియాకు చెందిన నికోలస్ బరియెంతోస్తో కలిసి ఆడిన రిత్విక్ డబుల్స్ టైటిల్ గెలిచాడు.దాంతో అతని ర్యాంక్ మెరుగైంది. మరోవైపు భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ కూడా తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా)తో కలిసి దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో యూకీ డబుల్స్ టైటిల్ గెలిచాడు. ఫలితంగా తాజా ర్యాంకింగ్స్‌లో యూకీ ఐదు స్థానాలు పురోగతి సాధించి 39వ ర్యాంక్‌లో నిలిచాడు. భారత దిగ్గజం రోహన్ బోపన్న ఒక స్థానం మెరుగుపర్చుకొని 21వ ర్యాంక్‌లో ఉన్నాడు.మెక్సికోలో జరిగిన అకాపుల్కో ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలోసెమీఫైనల్ చేరుకున్న భారత ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ మరోసారి కెరీర్ బెస్ట్ 61వ స్థానానికి చేరుకున్నాడు. భారత ఇతర ప్లేయర్లు అర్జున్ ఖడే 87వ స్థానంలో, జీవన్ నెడుంజెళియన్ 93వ స్థానంలో ఉన్నారు. బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టోర్నిలో డబుల్స్ టైటిల్ సాధించిన హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ ఏకంగా 30 స్థానాలు మెరుగుపర్చుకొని 109వ ర్యాంక్‌లో నిలిచాడు. రామ్‌కుమార్ రామనాథన్ 19 స్థానాలు ఎగబాకి 167వ ర్యాంక్‌లో, సాకేత్ మైనేని 24 స్థానాలు పురోగతి సాధించి 220వ ర్యాంక్‌లో నిలిచారు. -
అతి తెలివి కుర్రాళ్లు!
న్యూఢిల్లీ: దేశమంతటా రచ్చ అయిన ‘ఇండియా హాజ్ గాట్ టాలెంట్’ యూట్యూబ్ షో వివాదం తాలూకు మంటలు ఇంకా చల్లారడం లేదు. ఆ షోలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా చిక్కుల్లో పడటం తెలిసిందే.మెదడులోని చెత్తనంతా వాంతి రూపంలో బయట పెట్టుకున్నారంటూ సుప్రీంకోర్టు ఆయనకు తీవ్రంగా తలంటింది కూడా. ఈ వ్యవహారంలో రణ్వీర్తో పాటు సదరు షో హోస్ట్ సమయ్ రైనా కూడా పలు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇంతటి రగడకు కారణమైన ఆ వివాదాస్పద ఎపిసోడ్‌పై ఇటీవల కెనడాలో నిర్వహించిన ఒక షోలో సమయ్ వ్యంగ్యాస్త్రాలు విసిరి తాజాగా మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురయ్యారు.‘‘బాగా ఫన్నీగా ఏవేవో చెప్పి నవ్విస్తానని అనుకుంటున్నారేమో! బీర్‌బైసెప్స్ (రణ్వీర్ అలహాబాదియా)ను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి! బహుశా నా టైం బాగా లేనట్టుంది. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నా పేరే సమయ్’’ అని ప్రేక్షకులను ఉద్దేశించి రైనా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ షో టికెట్లు కొనడం ద్వారా నా కోర్టు ఖర్చులను భరించినందుకు కృతజ్ఞతలు’’ అంటూ ముక్తాయించారు. సోమవారం అలహాబాదియా పిటిషన్‌పై విచారణ సందర్భంగా రైనా తాజా వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ వాటిపై కన్నెర్ర చేసింది.‘‘ఈ అతి తెలివి కుర్రాళ్లు తమకే అన్నీ తెలుసనుకుంటారు. మనల్ని బహుశా పనికిరాని పాత తరంగా భావిస్తారేమో తెలియదు! వీళ్లలో ఒకరు కెనడాకు వెళ్లి మరీ ఆ పనికిమాలిన ఎపిసోడ్‌ను మరోసారి పనిగట్టుకుని ప్రస్తావించారు. ఈ కోర్టు న్యాయపరిధి ఎంతటిదో, తలచుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోగలదో బహుశా వీళ్లకు తెలిసినట్టు లేదు’’ అంటూ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా హెచ్చరించారు.‘‘కాకపోతే ఎంతైనా వాళ్చ్లు కుర్రాళ్లు. మేం అర్థం చేసుకోగలం. అందుకే అలాంటి చర్యలేవీ తీసుకోదలచలేదు’’ అని స్పష్టం చేశారు. చేసిన తప్పులకు వాళ్లు ఇప్పటికైనా పశ్చాత్తాపపడుతున్నారని ఆశిస్తున్నట్టు చెప్పారు. హక్కులతో పాటే బాధ్యతలు అలహాబాదియాకు కూడా ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ గట్టిగా చురకలు వేశారు. ‘‘కొందరు గిరాకీ లేని వ్యక్తులు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట పనికిరాని వ్యాసాలు రాసి వదులున్నారని మాకు తెలుసు. వారిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా బాగా తెలుసు. ప్రాథమిక హక్కులు తమ సొత్తని ఎవరైనా భావిస్తే పొరపాటు.మన దేశంలో ఎవరికైనా సరే, బాధ్యతలతో పాటు హక్కులు వర్తిస్తాయి. హక్కులను ఆస్వాదించాలంటే వాటితో పాటుగా రాజ్యాంగం కల్పించిన బాధ్యతలను నిర్వర్తించి తీరాల్సిందే. దీన్ని అర్థం చేసుకోని వారిని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు’’ అని హెచ్చరించారు. రణ్వీర్ యూట్యూబ్ షోపై విధించిన నిషేధాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ఎత్తేసింది. ఇకపై నైతిక ప్రమాణాలకు లోబడి పద్ధతిగా వ్యవహరించాలని హెచ్చరించింది. ఈ మేరకు హామీ పత్రం సమర్పించాల్సిందిగా ఆదేశించింది. -
మా ప్రయోజనాలు కాపాడండి: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ పరీవాహకంలో సుమారు 70శాతం తెలంగాణలోనే ఉండగా.. 30 శాతం మాత్రమే ఏపీలో ఉందని వివరించారు. అందువల్ల కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన 70శాతం వాటా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి నదికి సంబంధించి తెలంగాణ వాటా నికర జలాలు తేల్చిన తర్వాతే.. ఏపీ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి ని కోరారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ... కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పక్షపాతంతో ఏపీకి 66శాతం, తెలంగాణకు 34శాతం నీటి కేటాయింపులు చేసిందని కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ కేటాయింపుల వల్ల ఎన్నో ఏళ్లుగా తెలంగాణ నష్టపోతోందని.. ఈ ఏడాది సైతం ఏపీ కేటాయించిన మొత్తానికి మించి నీరు తరలించుకుపోయిందని వివరించారు. ఇక ముందు ఏపీ ఇలా వాటాకు మించి జలాలను తరలించుకు పోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి వెంటనే టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయాలని.. అవసరమైతే అందుకయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని కేంద్ర మంత్రికి తెలియజేశారు.ఈ ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించండిపాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను 2022లోనే సమర్పించినా.. అనుమతుల్లో ఆలస్యం చేస్తున్నారని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ వివరించారు. అదే సమయంలో న్యాయస్థానాల పరిధిలో ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు మాత్రం అనుమతులు ఇచ్చారన్నారు. సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ బ్యారేజీలకు మాత్రం అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. ఈ మూడు ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), సాంకేతిక సలహా మండలి (టీఏసీ) నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని కోరారు.ఏపీ తీరు చట్టవిరుద్ధంఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం గోదావరి–బనకచర్ల అనుసంధాన పథకానికి రూపకల్పన చేసిందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వివరించారు. ఆ పథకానికి కేంద్ర జల సంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ), కేఆర్ఎంబీల నుంచి ఎటువంటి అనుమతి పొందలేదని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్లోనూ ఈ ప్రాజెక్టుపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు. గోదావరిలో తెలంగాణకు సంబంధించి నికర జలాల వాటాలు తేల్చాలని.. రాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. పాలమూరు– రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, మోదికుంట వాగు, చనాకా కొరట బ్యారేజీ (డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్), చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల పథకాలకు ‘సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)’, ‘పీఎంఆర్పీ 2024’ కింద తగిన ఆర్థిక సాయం అందజేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా మౌలిక వసతుల అభివృద్ధి కింద 50 సంవత్సరాల వడ్డీలేని రుణాలను ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని, ఈ క్రమంలో ఏర్పడే ముంపునకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాలని కోరారు. -
ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీకి నవరత్న హోదా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరో రెండు ప్రభుత్వరంగ సంస్థలు నవరత్న హోదా సాధించాయి. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ)లకు నవరత్న హోదా కల్పిస్తున్నట్లు కేంద్రం చెప్పింది. దీంతో నవరత్న హోదా పొందిన 25వ కంపెనీగా ఐఆర్సీటీసీ, 26వ కంపెనీగా ఐఆర్ఎఫ్సీ అవతరించాయని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సోమవారం వెల్లడించింది. కంపెనీల ఆర్థిక పనితీరు, నిర్వహణ ఆధారంగా నవరత్న, మహారత్న హోదాలను కేంద్రం మంజూరు చేస్తుంది. -
అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడికి ఐఎస్ఐ కుట్ర.. భగ్నం చేసిన భారత్
గాంధీనగర్: అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడి చేసేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్(Pakistan) ఐఎస్ఐ ఉగ్రదాడిని భారత్ భగ్నం చేసింది. గుజరాత్, హర్యానా యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా హర్యానాలో ఉగ్రవాది రెహ్మాన్‌ను అరెస్ట్ చేసింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ(ISI)తో సంబంధాలున్న ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో పట్టుబడ్డాడు. భద్రతా సంస్థల సమాచారం మేరకు.. ఐఎస్ఐ సంస్థ అబ్దుల్ రెహ్మాన్ ద్వారా అయోధ్య రామ్ మందిరంపై దాడి చేయించేందుకు ప్లాన్ చేసింది. ఉగ్రదాడిలో భాగంగా అబ్దుల్ రెహ్మాన్ రామమందిరంపై రెక్కీ నిర్వహించాడు. సమాచారాన్ని సేకరించి ఐఎస్ఐకి చేరవేర్చాడు. అనంతరం, అబ్దుల్ రెహ్మాన్ ఫైజాబాద్ నుంచి ట్రైన్లో మొదట ఫరీదాబాద్ చేరుకున్నాడు. ఫరీబాదాబాద్‌లో హ్యాండ్ గ్రనేడ్లను సేకరించాడు. వాటిని తీసుకుని ట్రైన్ ద్వారా అయోధ్య వెళ్లాల్సి ఉంది. అనంతరం ఆ హ్యాండ్ గ్రనేడ్‌తో రామమందిరంపై దాడి చేసేలా ప్లాన్ వేశాడు. అంతకంటే ముందే దేశ భద్రతా సంస్థలు అందించిన సమాచారంతో గుజరాత్ ఏటీఎస్, ఫరీదాబాద్ ఏటీఎస్ స్క్వాడ్ అబ్దుల్ రెహ్మాన్‌ను అదుపులోకి తీసుకున్నాయి. అయోధ్యరామ మందిరంపై ఉగ్రదాడిని భగ్నం చేశాయి. -
సుప్రీం కోర్టులో రణవీర్ అల్హాబాదియాకు ఊరట
ఢిల్లీ : తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించి వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాకు సుప్రీం కోర్టులో (supreme court) ఊరట దక్కింది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆగిపోయిన పాడ్ కాస్ట్ ‘ది రణ్వీర్ షో’తో పాటు ఇతర షోలను తిరిగి ప్రారంభించుకోవడంతో పాటు వాటిని ప్రసారం చేసుకోవచ్చని తెలిపింది.‘ఇండియాస్ గాట్ లాటెంట్’ (India's Got Latent) వేదికగా యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో అల్హాబాదియా వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. అల్హాబాదియా చేస్తున్న షోలు సైతం ఆగిపోయాయి. అయితే, అల్హాబాదియా తాను ఇంటర్వ్యూలు, షోలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అంతేకాదు,తాను చేస్తున్న షోలపై సుమారు 280 మంది ఆధారపడ్డారని, షోలు ఆగిపోవడం వల్ల వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అల్హబాదియా పిటిషన్‌పై కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Solicitor General Tushar Mehta) తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా తాను ఉత్సుకతతో అల్హాబాదియా షోను చూశానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ఆ షో అసభ్యంగా మాత్రమే కాదు.. వక్రంగా ఉందని వ్యాఖ్యానించారు. హాస్యం, అసభ్యత, వక్రబుద్ధి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందని నొక్కి చెప్పారు.ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్ర్యం ప్రాథమిక హక్కు, అశ్లీలత విషయంలో స్పష్టమైన సరిహద్దు ఉండాలని పునరుద్ఘాటించింది. ఈ సందర్భంగా అల్హాబాదియాకు సుప్రీం కోర్టు చురకలంటించింది. భావప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయని, అసభ్య పదజాలం వాడటం హాస్యం కాదని మందలించింది. అల్హాబాదియా షోలు చేసుకోవచ్చని, నైతికంగా, మర్యాద ఉండాలని సూచించింది.👉చదవండి : హాస్యం పేరిట అల్హాబాదియా నీచపు వ్యాఖ్యలు -
రైతులకు శుభవార్త..రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్.. ఎక్కడంటే?
రైతులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్‌ను కేవలం రూ.5 మాత్రమే అందిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలో అమలు చేయనుంది.ఈ సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ... మధ్యప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం రైతులను ప్రోత్సహించడం. వారి జీవితాలను మెరుగుపరచడం. విద్యుత్ సమస్యలు లేకుండా, సాగునీటి అవసరాలను తీర్చేందుకు సౌర (సోలార్) పంప్‌లను ఏర్పాటు చేయబోతున్నాం. వచ్చే మూడు సంవత్సరాల్లో 30 లక్షల సోలార్ పంప్‌లను రైతులకు అందించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. రైతుల నుండి సౌర విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. తద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశముంది.కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో సరైన రోడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడ్డాం. కానీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది’ అని వ్యాఖ్యానించారు. -
కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం బంద్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం విక్రయించకుండా నిబంధన విధించింది. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. పెట్రోల్ వాహనాలు 15 ఏళ్లు, డీజిల్ వాహనాలు పదేళ్లు దాటితే ఇంధనం విక్రయించే ప్రసక్తే లేదని శనివారం తేల్చిచెప్పింది. వాహనాల గడువు తీరిపోయిందో లేదో తెలుసుకొనేందుకు పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని పెట్రోల్, డీజిల్ పంపుల యజమాన్యాలకు సూచించింది. కాలుష్య నియంత్రణ(Pollution control)పై శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.కాలం చెల్లిన వాహనాల(old vehicles)కు ఇంధనం విక్రయించకూడదని నిర్ణయించినట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మత్రి మంజీందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. ఈ విషయాన్ని త్వరలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖకు తెలియజేస్తామని పేర్కొన్నారు. గడువు తీరిపోయిన వాహనాలు రోడ్లపైకి రాకుండా నిరోధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టంచేశారు.ఢిల్లీలో 425కుపైగా ఇంధన బంకులు ఉన్నాయి. నగరంలో కాలం చెల్లిన వాహనాలు 55 లక్షలు ఉన్నట్లు అంచనా. ఇందులో 66 శాతం ద్విచక్ర వాహనాలు, 54 శాతం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం ప్రజారవాణా బస్సుల్లో 90 శాతం సీఎన్జీ బస్సులనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. -
వాహనదారులకు అలర్ట్.. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం విక్రయించకుండా నిబంధన విధించింది. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.కాగా, పెట్రోల్ వాహనాలు 15 ఏళ్లు, డీజిల్ వాహనాలు పదేళ్లు దాటితే ఇంధనం విక్రయించే ప్రసక్తే లేదని శనివారం తేల్చి చెప్పింది. వాహనాల గడువు తీరిపోయిందో లేదో తెలుసుకునేందుకు పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని పెట్రోల్, డీజిల్ పంపుల యాజమాన్యాలకు సూచించింది. కాలుష్య నియంత్రణపై శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం విక్రయించకూడదని నిర్ణయించినట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మత్రి మంజీందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. ఈ విషయాన్ని త్వరలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖకు తెలియజేస్తామని పేర్కొన్నారు.గడువు తీరిపోయిన వాహనాలు రోడ్లపైకి రాకుండా నిరోధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టంచేశారు. ఢిల్లీలో 425కుపైగా ఇంధన బంకులు ఉన్నాయి. నగరంలో కాలం చెల్లిన వాహనాలు 55 లక్షలు ఉన్నట్లు అంచనా. ఇందులో 66 శాతం ద్విచక్ర వాహనాలు, 54 శాతం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం ప్రజా రవాణా బస్సుల్లో 90 శాతం సీఎన్జీ బస్సులనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. -
Delhi: ఆ వాహనాలకు ఇంధనం బంద్..!
ఢిల్లీ : నిత్యం తీవ్ర వాయు కాలుష్యం(Delhi Pollution)తో కొట్టిమిట్టాడే ఢిల్లీలో కాలుష్య నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది తాజా బీజేపీ ప్రభుత్వం. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలను బీజేపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఈరోజు(శనివారం) సమీక్ష నిర్వహించారు పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా.ఈ సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. పాత వాహణాలపై ఆంక్షలు, స్మోగ్ నిరోధక చర్యలు తప్పనిసరి చేయడంతో పాటు పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ కు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని నిర్ణయించింది. ఢిల్లీలోని అన్ని ఎత్తైన భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి యాంటీ స్మోగ్ గన్ లను ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నఆరు. ఢిల్లీలో కొన్ని పెద్ద హోటళ్లు, కొన్ని పెద్ద కార్యాలయం సముదాయాలు, ఢిల్లీ విమానాశ్రయం, పెద్ద నిర్మాణ స్థలాలకు వెంటనే యాంటీ స్మోగ్ ఎక్స్ ని ఇన్ స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయనున్నారు.వాహనాలకు 15 ఏళ్లు దాటితే..ఇక 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఢిల్లీ బంకుల్లో ఇంధనం నిలిపివేయనున్నారు. 15 ఏళ్ల పైబడిని వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
మణిపూర్ సంక్షోభం.. కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న మణిపూర్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జనసంచారంపై ఉన్న ఆంక్షలను ఎత్తేయాలని.. మార్చి 8వ తేదీ నుంచి ఆ రాష్ట్రంలో సాధారణ స్థితి నెలకొల్పాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) సంబంధిత ఆదేశాలను జారీ చేశారు.మార్చి 8వ తేదీ నుంచి మణిపూర్(Manipur)లో అన్ని రోడ్లపై ప్రజలు స్వేచ్ఛగా తిరగాలి. ఎవరైనా జనసంచారానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోండి అని అమిత్ షా మణిపూర్ అధికార యంత్రాంగానికి సూచించారు. మణిపూర్‌లో రాష్ట్రపతి విధింపు తర్వాత.. అక్కడి శాంతి భద్రతలపై జరిగిన తొలి సమీక్షా సమావేశం ఇదే కావడం గమనార్హం.ఈ సమావేశానికి మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా(Ajay Kumar Bhalla), ఇతర ఉన్నతాధికారులు, సైన్యం.. పారామిలిటరీ తరపున ప్రతినిధులు హాజరయ్యారు. 2023 మే నుంచి ఈ ఈశాన్య రాష్ట్రంలో తెగల వైరంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రయత్నాలను కేంద్రం ఇప్పుడు ముమ్మరం చేసింది.దాదాపు రెండేళ్లుగా జాతుల మధ్య వైరంతో రగులుతున్న మణిపుర్లో కల్లోల పరిస్థితుల నేపథ్యంలో.. ఇటీవల ఫిబ్రవరి 13వ తేదీన సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించిన కేంద్ర ప్రభుత్వం అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కల్లోల పరిస్థితులను ఆసరాగా చేసుకుని భద్రతా బలగాలకు చెందిన ఆయుధాలను కొందరు ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో.. అక్కడి ప్రజలకు గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కీలక విజ్ఞప్తి చేశారు. తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఏడు రోజుల్లోగా అప్పగించాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్ణీత సమయంలోగా ఆయుధాలను తిరిగి ఇస్తే ఎలాంటి చర్యల ఉండవని.. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
బద్రీనాథ్: భారీగా విరిగిపడ్డ మంచుచరియలు.. చిక్కుకున్న కార్మికులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) హిమపాతం భారీ బీభత్సం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా భారీగా మంచుకురుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చమోలి-బద్రినాథ్ (Badrinath) జాతీయ రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మంచులో ((Avalanche) 57మంది రోడ్డు నిర్మాణ కార్మికులు కూరుకుపోయారు.మంచు చరియలు విరిగిపడడంతో అప్రమత్తమైన సహాయకబృందాలు 10 మంది కార్మికులను రక్షించాయి. సమాచారమందుకున్న పోలీసులు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మిగిలిన కార్మికుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ గాలింపు చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్,ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. जनपद चमोली में माणा गांव के निकट BRO द्वारा संचालित निर्माण कार्य के दौरान हिमस्खलन की वजह से कई मजदूरों के दबने का दुःखद समाचार प्राप्त हुआ।ITBP, BRO और अन्य बचाव दलों द्वारा राहत एवं बचाव कार्य संचालित किया जा रहा है।भगवान बदरी विशाल से सभी श्रमिक भाइयों के सुरक्षित होने की…— Pushkar Singh Dhami (@pushkardhami) February 28, 2025మంచు చరియలు కింద రోడ్డు నిర్మాణ కార్మికులు చిక్కుకున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎక్స్ వేదికగా ధృవీకరించారు. మంచు చరియల కింద చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయట పడాలని ప్రార్థించారు.చమోలి జిల్లా మనా గ్రామ సమీపంలో బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ (బ్రో) చేపడుతున్న నిర్మాణ పనులలో చాలా మంది కార్మికులు మంచు చరియల కింద చిక్కుకున్నారనే విచారకరమైన సమాచారం అందింది. నిర్మాణ కార్మికులను రక్షించేందుకు ఐటీబీపీ, బ్రో రెస్క్యూ బృందాలతో పాటు ఇతర రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలను నిర్వహిస్తున్నాయి. కార్మికులందరూ సురక్షితంగా ఉండాలని నేను ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. -
ఆప్ నెత్తిన కాగ్ మరో పిడుగు
న్యూఢిల్లీ: గత ఆప్ ప్రభుత్వానికి సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(CAG) మరో నివేదికను విడుదల చేసింది. ఆరోగ్య భద్రత, మౌలిక వసతుల కల్పనలో గత సర్కార్ పూర్తి నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందని, కరోనా సమయంలోనూ నిధులను సక్రమంగా వినియోగించలేకపోయిందని సంచలన విషయాలు వెల్లడించింది.గత ఆరేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాల్లో తీవ్ర అవినీతికి పాల్పడిందనేది ఆ నివేదిక సారాంశం. ఆప్ ప్రతిష్టాత్మకంగా భావించిన మొహల్లా క్లినిక్స్‌లో తగినంత మౌలిక సదుపాయాలు లేకపోవడం దగ్గరి నుంచి అత్యవసర నిధులను వినియోగించకపోవడం దాకా ఎన్నో వివరాలను కాగ్ తన నివేదికలో పొందుపరిచింది. అంతేకాదు..ఢిల్లీ వ్యాప్తంగా చాలా ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు అందట్లేదన్న విషయం గురించి ప్రముఖంగా కాగ్ ప్రస్తావించింది. ఢిల్లీలో ఉన్న 27 ఆస్పత్రుల్లో 14 హాస్పిటల్స్‌లో ఐసీయూ సదుపాయం లేదని వెల్లడించింది. 16 ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంకులు లేవని తెలిపింది. ఎనిమిది ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా సదుపాయం లేదని తెలిపింది. పదిహేన్నింటిలో మార్చురీ సదుపాయాల్లేవని తెలిపింది. 12 ఆస్పత్రులకు ఆంబులెన్స్ సదుపాయాలు లేవని వెల్లడించింది. ఇక ఆప్ ప్రభుత్వం అప్పట్లో మొహల్లా క్లినిక్స్(Mohallah Clinics) ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వెయ్యికి పైగా ఏర్పాటు చేయాలని భావించినా.. అందులో 2023 నాటికి సగం మాత్రమే పూర్తి చేయగలిగిందని తెలిపింది. అయితే వాటిలోనూ సరైన సౌకర్యాలు, వైద్య సదుపాయాలు లేవని తెలిపింది. మొహల్లా క్లినిక్స్‌తో పాటు ఆయుష్ డిస్పెన్సరీల్లో మౌలిక వసతులు సరిగా లేవని పేర్కొంది. విద్యుత్ సదుపాయం, చెకప్ టేబుల్స్, చివరికి టాయిలెట్స్ సదుపాయాలు కూడా లేవని తెలిపింది. వీటికి తోడు అదనంగా సిబ్బంది కొరత కూడా ఉందని నివేదించింది. ఇక.. అత్యవసర సేవల కోసం వినియోగించాల్సిన నిధుల్ని కూడా ఆప్ పక్కన పెట్టిందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. మరీ ముఖ్యంగా కరోనా టైంలో.. రూ.200 కోట్ల నిధులను, వైద్య సిబ్బంది కోసం కేటాయించిన మరో రూ.30 కోట్లను, అత్యవసర ఔషధాలతో పాటు పీపీఈ కిట్ల కోసం కేటాయించిన ఇంకో రూ.83 కోట్లను వినియోగించకుండా పోయిందని తెలిపింది. ఆస్పత్రులకు సంబంధించి కొత్త ప్రాజెక్టుల విషయంలో కాలయాపనతో భారం పెరిగిందని, దీనివల్ల ఢిల్లీలోని ఇతర ఆస్పత్రుల నిర్వహణపై ప్రభావం పడిందని కాగ్ తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ కాగ్ నివేదిక ఇవాళ ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.మరోవైపు.. మద్యం విధానంపై కాగ్ రూపొందించిన నివేదిక అంశం ఎన్నికల ముందు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. 2021-22లో తీసుకొచ్చిన మద్యం విధానం కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కాగ్ తేల్చింది. కొత్త మద్యం విధానం కారణంగా అప్పటి ప్రభుత్వం రూ.941.53 కోట్ల ఆదాయం కోల్పోయిందని, లైసెన్సు ఫీజుల కింద మరో రూ.890.15 కోట్లు నష్టపోయిందని, ఇక.. లైసెన్సుదారులకు మినహాయింపుల రూపంలో మరో రూ.144 కోట్లు కోల్పోయినట్లు వెల్లడించింది. ఈ నివేదికను తాజాగా బీజేపీ ప్రభుత్వం(BJP Government) అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందులోని అంశాలను బయటపెట్టగా, ఆప్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగింది. దీంతో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. -
ఢిల్లీ అసెంబ్లీ గేట్ వద్ద ఆప్ ఎమ్మెల్యేల నిరసన
న్యూఢిల్లీ: ఆప్‌కు చెందిన ప్రతిపక్ష నేత ఆతిశీ సహా సస్పెండైన ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీ అసెంబ్లీ గేట్ వద్దే ధర్నాకు దిగారు. వారంతా అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయతి్నంచగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, గేటు వెలుపలే నిరసన చేపట్టారు. మంగళవారం అసెంబ్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగం సమయంలో ఆప్ సభ్యులు అంతరాయం కలిగించారు. సీఎం కార్యాలయంలో ఉన్న భగత్ సింగ్, అంబేడ్కర్ చిత్రపటాలను బీజేపీ ప్రభుత్వం తొలగించడంపై ప్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో, ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం మేరకు ఆప్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలకుగాను సభలో ఉన్న 21 మందిని మూడు రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ విజేంద్ర గుప్తా ప్రకటించారు. అనంతరం ఆప్ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలిపారు. తిరిగి గురువారం అసెంబ్లీ ప్రారంభమవగానే ఆవరణలోకి వచ్చేందుకు ఆప్ ఎమ్మెల్యేలు ప్రయతి్నంచగా సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్దే వారిని అడ్డుకున్నారు. దీనిపై ఆతిశీ మండిపడ్డారు. బీజేపీ నియంతృత్వ పోకడలకు హద్దే లేకుండా పోతోందన్నారు. అసెంబ్లీ గేటు వెలుపలే పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆమె ధర్నాకు దిగారు. అంబేడ్కర్ ఫొటోలున్న ప్లకార్డులను చేబూని ‘జై భీం, బీజేపీ నియంతృత్వం చెల్లదు’అంటూ కంజర వాయిస్తూ నినాదాలు చేశారు. ‘అసెంబ్లీలో జై భీం అని నినాదాలు చేసినందుకే మమ్మల్ని మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ రోజు, మమ్మల్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి కూడా అడుగుపెట్టనివ్వలేదు. ఇది చాలా తప్పు. ప్రతిపక్షం గొంతు మీరెలా నొక్కుతారు? యావత్తూ ప్రతిపక్షాన్ని అసెంబ్లీకి దూరంగా ఎలా ఉంచుతారు?’అని ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ ప్రశ్నించారు.మాకు సమయమివ్వండి..: రాష్ట్రపతికి ఆప్ లేఖ శాసన సభ్యులను అసెంబ్లీ ఆవరణలోకి రాకుండా అడ్డుకోవడంపై ఆప్‌నకు చెందిన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం ఆతిశీ గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. ‘రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, షహీద్ భగత్ సింగ్‌ల చిత్రపటాలను బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి తొలగించింది. ఈ చర్య ఈ ఇద్దరు మహనీయులకే కాదు, దళితులు, వెనుకబడిన, అణగారిన వర్గాల వారికీ అవమానం. ఈ చర్యను ఆప్ వ్యతిరేకించింది. అసెంబ్లీలో దీనిపై ప్రస్తావించేందుకు ప్రయత్నించిన ఆప్ ఎమ్మెల్యేలను స్పీకర్ మూడు రోజులపాటు అప్రజాస్వామికంగా సస్పెండ్ చేశారు’అని ఆ లేఖలో ఆతిశీ వివరించారు. ‘గురువారం, అసెంబ్లీ గేటు వద్ద భారీ బారికేడ్లు, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వం శాసనసభ్యులను అసెంబ్లీ ఆవరణలోకి రానివ్వలేదు. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులును శాసనసభలోకి రానివ్వకపోవడం అప్రజాస్వామికం. తీవ్రమైన ఈ విషయంలో మీరు తక్షణమే జోక్యం చేసుకుని, 28వ తేదీన మీతో మాట్లాడేందుకు ఆప్ ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వగలరు’అని అందులో కోరారు. -
వైఎస్ జగన్ పరువు నష్టం కేసు విచారణ వాయిదా
ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తనపై తప్పుడు కథనాలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై వేసిన పరువునష్టం కేసు విచారణ జూలై 16వ తేదీకి వాయిదా పడింది. అమెరికాలో ఆదానీ గ్రూపు పై దాఖలైన కేసులో భాగంగా వైఎస్ జగన్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతిలు తప్పుడు కథనాలు ప్రచురించాయి. దీనిపై వైఎస్ జగన్ రూ. 100 కోట్ల పరువు నష్టం కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా, ఈ కేసు ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి రాదని ఉషోదయ పబ్లికేషన్స్ అప్లికేషన్ దాఖలు చేసింది. ఆ అప్లికేషన్ కు కౌంటర్ దాఖలు చేస్తామని వైఎస్ జగన్ తరుపు న్యాయవాది దయ కృష్ణన్ హైకోర్టుకు తెలిపారు. దాంతో తదుపరి విచారణ జూలై 16 కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. -
‘అతడికి ఉరిశిక్ష సరైందే’.. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్
ముంబై: మహారాష్ట్ర పూణేలోని ఓ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో దారుణం జరిగింది. నిలిపి ఉన్న బస్సులో నిందితుడు.. యువతిపై దారుణానికి ఒడిగట్టాడు . ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర అధికార శివసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధినేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్లు ఈ తరహా దారుణాలకు పాల్పడే నిందితుల్ని ఉరితీయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బస్సులో జరిగిన దుర్ఘటనపై మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి చెందిన పార్టీ నేతలు గురువారం స్వర్గేట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన బాట పట్టారు. మహా ప్రభుత్వం మహిళల భద్రత కంటే ఉచితాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో బస్సు దుర్ఘటనపై ఏక్నాథ్ షిండే స్పందించారు. పుణే ఘటన చాలా దురదృష్టకరం. నిందితులు ఎవరైనా ఉపేక్షించబోం. అలాంటి వారిని ఉరితీయాలి’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు అజిత్ పవార్ సైతం దారుణంపై మీడియాతో మాట్లాడారు. స్వర్గేట్ బస్ స్టేషన్లో జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరం, బాధాకరం, అవమానకరమైనది. నిందితుడు చేసిన నేరం క్షమించరానిది. ఇలాంటి నేరస్తులకు మరణశిక్ష తప్ప మరొకటి ఉండదు. దారుణంపై సమాచారం అందుకున్న వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేయాలని పూణే పోలీసు కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. ఇంటికి వెళ్లేందుకు.. బస్సు కోసం ఎదురు చూస్తూపూణేలోని నిత్యం రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్‌లో యువతిపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సతారా జిల్లాలోని ఫల్తానా ప్రాంతానికి చెందిన యువతి మంగళవారం తెల్లవారుజామున పోలీస్ స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న స్వర్గేట్ బస్టాండ్‌లో బస్సు కోసం వేచిచూస్తోంది. అసలే ఆలస్యం అవుతుంది. బస్సులు కనిపించడం లేదని యువతి ఆందోళనకు గురైంది. ఆ సమయంలో బాధితురాలికి సమీపంలో దత్తాత్రేయ రాందాస్ గాడే (36) కనిపించాడు. బస్సులు రాకపోకల గురించి ఆరా తీసింది. సమీపంలో ఓ ఉన్న బస్సును చూపిస్తూ.. ఆ బస్సు మీ ఊరు వెళుతుందని నమ్మించే ప్రయత్నించాడు. ప్లాట్‌ఫారమ్ మీదకు రావాల్సిన బస్సు ఆక్కడ ఎందుకు ఆగి ఉంది? ఆగి ఉంటే లైట్లు ఎందుకు ఆర్పేశారు? అని ఇలా ప్రశ్నించింది. దీంతో గాడే.. బస్సులో ప్రయాణికులు ఉన్నారని, అందరూ నిద్రలో ఉండడం వల్ల లైట్లు ఆర్పేశారు. కావాలంటే మీరే చూడండి అంటూ యువతిని నమ్మించాడు. గాడే మాటల్ని నమ్మిన యువతి బస్సు దగ్గరికి వెళ్లింది. ప్రయాణికులు ఉన్నారా? లేరా? అని చూసేందుకు బస్సు డోర్ ఓపెన్ చేసింది. వెంటనే నిందితుడు యువతిని బస్సు లోపలికి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తనపై జరిగిన దారుణాన్ని తన స్నేహితురాలికి చెప్పడంతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పలు కేసులు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 8 బృందాలుగా విడిపోయి గాలింపులు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. పోలీసుల గాలింపు చర్యల్లో బస్సులో యువతిపై అత్యాచారానికి పాల్పడింది 36ఏళ్ల దత్తాత్రయ రాందాస్ గాడే అని నిర్ధారించారు. గాడేపై గతంలో దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఆ కేసుల్లో జైలు శిక్షను అనుభవించి 2019లో నుండి బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. తాజాగా, మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. -
రేవంత్.. మెట్రో అడ్డుకున్నట్టు నిరూపించే దమ్ముందా?: కిషన్‌రెడ్డి సవాల్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి. నిజంగా రేవంత్‌కు ధైర్యం ఉంటే తాను మెట్రోను అడ్డుకున్నా అనే విషయం నిరూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు మెట్రోపై ప్లానింగ్ ఉందా? అని ప్రశ్నించారు.కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి గాలి మాటలు. బెదిరింపు రాజకీయాలకు నేను భయపడను. నేను మెట్రోను అడ్డుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజంగా రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఇది నిరూపించాలి. ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలను మానుకోవాలి. సీఎం స్థాయి వ్యక్తి అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో.. ప్రధాని నరేంద్ర మోదీని అడిగి.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రజలకు హామీలు ఇచ్చారా?. హామీల, పథకాల అమలు విషయంలో మాపై తోసేసి చేతులు దులుపుకుంటున్నారు. దమ్ములేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పథకాలకు అవసరమైన వనరులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత సీఎంకు లేదా?. ప్రధానికి కాగితం ఇవ్వగానే పనులు అయిపోతాయా? అని ప్రశ్నించారు.అంతకుముందు, ప్రధానితో సమావేశానంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘హైదరాబాద్‌లో మెట్రో రెండోదశ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ వద్దకు వెళ్లకుండా కిషన్‌రెడ్డే అడ్డుకున్నారు. తన మిత్రుడు కేసీఆర్ పదేళ్లలో చేయని పని ఇప్పుడు చేస్తే రేవంత్‌రెడ్డికి పేరొస్తుందనే అలా చేశారు. నాకు రాష్ట్ర ప్రయోజనాల కంటే పేరు ముఖ్యం కాదు. కావాలంటే అనుమతులు, నిధులు తెప్పించి ఆ పేరును కిషన్‌రెడ్డినే తెచ్చుకోమనండి. నేను కూడా ఆయన పేరే ఊరూరా ప్రచారం చేస్తా. సన్మానిస్తాం అన్నారు. అలాగే, తెలంగాణ అభివృద్ధికి అవసరమైన ఐదు ప్రాజెక్టులకు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విన్నవించాం. వాటికి అనుమతులు, నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లదే. లేకపోతే వారిద్దరూ గుజరాత్‌కో.. ఇంకో రాష్ట్రానికో వెళ్లిపోవాలి. తెలంగాణలో వారికి తిండి దండగ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
చేయూత ఇవ్వండి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ వినతులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తమ సహకారాన్ని, ఆర్ధిక చేయూతను అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో మెట్రోరైలు ఫేజ్–2కు అనుమతులు, రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులకు నిధుల మంజూరు, సెమీ కండక్టర్ మిషన్‌కు అనుమతి విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించేందుకు మంగళవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు బుధవారం ఉదయం మోదీని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో.. రాష్ట్ర ప్రాజెక్టులకు రావాల్సిన అనుమతులు, నిధుల విషయమై వినతులు సమరి్పంచారు. వీటిపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు భేటీ అనంతరం ముఖ్యమంత్రి తెలిపారు. టన్నెల్ ప్రమాదంపై ప్రధాని ఆరా.. సీఎంతో భేటీ సందర్భంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం, సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఆరా తీశారు. టన్నెల్లో ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. గత పదేళ్లుగా టన్నెల్ పనులు నిలిచిపోవడంతో.. నీటì ఊటలు పెరిగి, మట్టి వదులు కావడంతో ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వేశామని సీఎం వివరించారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టామని.. నిత్యం ఇద్దరు, ముగ్గురు మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12శాఖల అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని వివరించారు. చిక్కుకున్న వారిని బయటికి తెచ్చేందుకు కేంద్రం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తామని ప్రధాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కాగా ఈ భేటీలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలు చర్చకు రాలేదు. వీటిపై పూర్తిస్థాయి నివేదికలు అందాకే ప్రధానితో చర్చించాలనే ఉద్దేశంతోనే ఈ అంశాలను ప్రస్తావించనట్టు తెలిసింది. ప్రధానికి సీఎం చేసిన వినతులు ఇవీ.. – హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు సౌకర్యాన్ని అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–2కు అనుమతులివ్వాలి. గత ప్రభుత్వం పదేళ్లుగా హైదరాబాద్‌లో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదు. నగరంలో ఫేజ్–2 కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల పొడవైన ఐదు కారిడార్లను ప్రతిపాదించాం. ఈ ప్రాజెక్టును వెంటనే అనుమతించాలి. – రీజనల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో ఇప్పటికే 90శాతం భూసేకరణ పూర్తయినందున.. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని కూడా వెంటనే మంజూరు చేయాలి. ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం పూర్తయితే ఆర్ఆర్ఆర్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలం. దక్షిణ భాగం భూసేకరణకు అయ్యే వ్యయంలో 50శాతం భరించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉంది. ఆర్ఆర్ఆర్కు సమాంతరంగా రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉంది. ఈ రైలు పూర్తయితే తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోని రైలు మార్గాలతో అనుసంధానం సులభం అవుతుంది. ఈ మేరకు రీజనల్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వాలి. సముద్ర మార్గం లేని తెలంగాణకు వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సులువుగా చేసేందుకు రీజనల్ రింగు రోడ్డు సమీపంలో డ్రైపోర్ట్ అవసరం. ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్టులను కలిపేందుకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, దానికి ఆనుకొని రైలు మార్గం మంజూరు చేయాలి. – తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మీకత మూసీ నదితో ముడిపడి ఉంది. రాజధాని హైదరాబాద్ నగరం మధ్యలో ప్రవహిస్తున్న దృష్ట్యా.. మూసీ పునరుజ్జీవనానికి సహకరించాలి. ఈసా, మూసా నదుల సంగమంలో ఉన్న బాపూఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్, కరకట్టల నిర్మాణం, మూసీ–గోదావరి నదుల అనుసంధానంతో కలిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సాయం అందజేయాలి. బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 222.7 ఎకరాల రక్షణ భూములను బదిలీ చేసేందుకు సహకరించాలి. – రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ కేడర్ పోస్టులు రాగా.. 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయి. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయండి – సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనుమతించాలి. -
నిర్మాత కేదార్ మరణంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ : టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి (Kedar Selagamsetty) మరణంపై సీఎం రేవంత్‌రెడ్డి (cm revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజినెస్ పార్ట్నర్ ఫ్రెండ్ కేదార్ చనిపోవడం వెనక మిస్టరీ ఏమిటి? అంటూ ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ దానిపైన ఎందుకు విచారణ కోరడం లేదు? రాడిసన్ కేసులో కేదార్ నిందితుడుగా ఉన్నారని రేవంత్ అన్నారు.‘‘కేసులతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? ముందు సంజీవరెడ్డి, తర్వాత రాజలింగం, ఇప్పుడు కేదార్.. వారి మరణాల వెనకాల మిస్టరీ ఉంది. దీనిపైన కేటీఆర్ ఎందుకు విచారణ కోరలేదు ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తాం’’ అని రేవంత్ చెప్పారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి .. ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జరిగిన మీడియా చిట్‌చాట్‌లో రేవంత్ మాట్లాడారు.ప్రధాని మోదీతో సీఎం రేవంత్ చర్చప్రధాని మోదీతో ఐదు అంశాలపై చర్చించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైల్ పేజ్ 2 విస్తరణ, దక్షిణభాగానికి రీజినల్ రింగ్ రోడ్డు అనుమతి, రీజినల్ రింగ్ రైల్వే ఏర్పాటు, మూసి పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఆర్ధిక సహాయం, మూసి గోదావరి లింకు కోసం ఆర్థిక సహాయం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని పీఎం మోదీని కోరినట్లు చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరాఇక శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (slbc) సొరంగ మార్గంలో ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సొరంగంలో గల్లంతైన ఎనిమిది మందిని కాపాడే చర్యలు గురించి ఆరా తీసినట్లు రేవంత్ చిట్‌చాట్‌లో చెప్పారు. 11 శాఖలు సమన్వయంతో రెస్క్ ఆపరేషన్స్ చేస్తున్నామని, సొరంగంలో గల్లంతైన ఎనిమిది మందిని కాపాడే చర్యలు కొనసాగిస్తూనే.. ప్రమాదానికి కారణాలేంటి, దీని నుంచి ఎలా బయటపడాలనే కోణంలో ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోందని బదులిచ్చామన్నారు. -
Jammu and Kashmir: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల కలకలం సృష్టిస్తున్నాయి. పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు నాలుగు రౌండ్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.బుధవారం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్ మానీ బల్లా రోడ్డు, ఫాల్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ జవాన్ల వాహనంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని డిఫెన్స్ అధికార ప్రతినిథి తెలిపారు.ఉగ్రవాదుల కాల్పులపై సమాచారం అందుకున్న వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని డిఫెన్స్ అధికార ప్రతినిథి వెల్లడించారు. అనంతరం, ఉగ్రవాదుల ఏరివేతకు సెర్చ్ ఆపరేషన్‌ను మొదలు పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం, ఉగ్రవాదుల కోసం సుందర్ బానీ ఏరియా మొత్తాన్ని ఆర్మీ జవాన్లు జల్లెడ పడుతున్నారు. -
ఆప్ సర్ప్రైజ్.. ఎంపీగా కేజ్రీవాల్?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత సైలెంట్ అవుతారని భావించిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).. పార్టీ కన్వీనర్ హోదాలో క్రమం తప్పకుండా పార్టీ మీటింగ్‌లకు హాజరవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్లబోతున్నారంటూ ఓ ప్రచారం తెర మీదకు వచ్చింది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం చవిచూసింది. మాజీ సీఎం కేజ్రీవాల్ కూడా ఓడిపోవడంతో ఢిల్లీ రాజకీయాలకు ఆయన శాశ్వతంగా దూరం అవుతారని, అందుకు ‘లిక్కర్ స్కామ్’ అవినీతి మరకే కారణమని విశ్లేషణలు నడిచాయి. ఈ కారణంగానే ప్రతిపక్ష నేతగా అతిషీని ఎంపిక చేశారని కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలో..పంజాబ్ లూథియానా వెస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఆప్ ఆశ్చర్యకరరీతిలో అభ్యర్థిని ఎంపిక చేసింది. కిందటి నెలలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి మృతి చెందారు. దీంతో.. రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను ఆ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిగా ఈ ఉదయం ప్రకటించింది ఆప్. సంజీవ్ అరోరా(Sanjeev Arora) 2022లో ఆప్ తరఫున పంజాబ్ రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2028తో ముగియనుంది. దీంతో అరోరాను అసెంబ్లీకి పంపి.. ఆ ఎంపీ సీటును కేజ్రీవాల్‌కు అప్పజెప్పబోతున్నారన్నది ఆ ప్రచార సారాంశం. లూథియానా వెస్ట్ ఉప ఎన్నికకు ఈసీ ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు. అయితే ఆర్నెల్ల లోపు ఎన్నిక నిర్వహించాలన్న నిబంధన ప్రకారం.. జులై 11లోపు ఈ ఉపన్నిక జరిగే అవకాశం ఉంది.అందుకేనా సమీక్షలు!ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. పంజాబ్ ఆప్ కేడర్‌తో కేజ్రీవాల్ వరుసబెట్టి సమావేశాలు జరిపారు. ఒకానొక టైంలో.. భగవంత్ మాన్‌ను తప్పించి కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అవుతారంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ చర్చల సారాంశం.. బహుశా రాజ్యసభ స్థానం కోసమే అయి ఉంటుందని ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. -
ప్రధాని మోదీతో రేవంత్ భేటీ.. మెట్రో, ఆర్ఆర్ఆర్పై చర్చ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటుగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ సహా మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. మెట్రో ఫేజ్-2 లైన్ ఎయిర్పోర్ట్ పొడిగింపు, దానికి కావాల్సిన ఆర్థిక సహాయం అనుమతులు, మూసీ నది సుందరీకరణ నిధులు, కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, తెలంగాణకు ఐటీఐఆర్, ఐఐఎం, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు, ఆర్థిక సహాయం గురించి చర్చించినట్టు తెలుస్తోంది. -
అరగంటలో 350 కిలోమీటర్ల జర్నీ!
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి జైపూర్(రాజస్థాన్) మధ్య దూరం 300 కిలోమీటర్లు ఉంటుంది. అంతటి దూరాన్ని నిమిషాల్లో చేరుకోగలిగితే ఎలా ఉంటుంది?.. ఇలాంటి హైస్పీడ్ ప్రయాణం కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తొలి అడుగు వేసింది. ఐఐటీ మద్రాస్ ఆలోచనతో భారత తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. హైపర్‌లూప్(Hyperloop) అనేది అత్యంత అధునాతనమైన రవాణా వ్యవస్థ. గంటకు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం ఈ రవాణా వ్యవస్థ లక్ష్యం. సుదుర గమ్యాలను నిమిషాల వ్యవధిలో చేరుకునేలా చేయడమే దీని ఉద్దేశం. అందుకే దీన్ని రవాణా వ్యవస్థలో హైపర్‌లూప్‌ను గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్నారు. వందేభారత్ తర్వాత బుల్లెట్ రైల్ మీద దృష్టిసారించిన భారతీయ రైల్వే(Indian Railways) ఇప్పుడు మరో ఘనత వైపు అడుగులేస్తోంది. భారత తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) మీడియాకు తెలియజేశారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో 422 మీటర్ల దూరం ఉన్న ట్రాక్‌ను రూపొందించారు. ఈ హైపర్‌లూప్ ప్రాజెక్టు వాస్తవరూపం దాలిస్తే అరగంటలోపే ఢిల్లీ నుంచి జైపూర్‌కు చేరుకోవచ్చన్నమాట. The hyperloop project at @iitmadras; Government-academia collaboration is driving innovation in futuristic transportation. pic.twitter.com/S1r1wirK5o— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 24, 2025రోడ్డు, రైలు, నీరు, వాయు రవాణా మార్గాల తర్వాత ఫిఫ్త్ ట్రాన్స్‌పోర్టేషన్‌గా హైపర్లూర్ను చెబుతుంటారు. వాక్యూమ్ ట్యూబ్స్‌లో పాడ్స్ ద్వారా ప్రయాణమే హైపర్‌లూప్. గొట్టాల్లాంటి ఆ నిర్మాణాల్లో గాలి నిరోధకత.. పాడ్లను అధిక వేగంతో ప్రయాణించేలా చేస్తుంది. 2013లో ఇలాన్ మస్క్ ప్రచారంతో దీని గురించి ఎక్కువ చర్చ నడిచింది. అమెరికా, చైనా ఇలా చాలా దేశాలు ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రధాన నగరాలను అనుసంధానించడం కోసమైనా హైపర్‌లూప్ టెక్నాలజీ వినియోగంలోకి తేవాలని యూఏఈ సైతం భావిస్తోంది. -
మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్(Sajjan Kumar)కు జీవితఖైదు పడింది. అల్లర్లలో తండ్రీకొడుకుల హత్య కేసులో ఆయన ప్రమేయాన్ని నిర్దారించిన ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం.. ఇదివరకే దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయనకు శిక్ష ఖరారు చేస్తూ స్పెషల్ జడ్జి కావేరీ భవేజా ఆదేశాలు జారీ చేశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద గంపు మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, గృహదహనాలకు పాల్పడింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల(Anti Sikh Riots)లో భాగంగా నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో అల్లరిమూక.. జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌ను హతమార్చింది. ఆపై ఆ ఇంట దోపిడీకి పాల్పడింది. ప్రత్యక్ష సాక్షి, జస్వంత్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది.సజ్జన్ కుమార్ కేవలం ఈ అల్లర్లలో పాల్పొనడమే కాకుండా ఆ గుంపునకు నాయకత్వం వహించాడని, ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని పేర్కొంటూ ఫిబ్రవరి 12వ తేదీ స్పెషల్ కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. సజ్జన్ కుమార్‌కు మరణశిక్ష విధించాలన్న జస్వంత్ భార్య పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఆయనకు జీవితఖైదు(Life Imprisonment) విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. పంజాబీ బాఘ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అయితే 2015లో అమిత్ షా(Amit Shah) చొరవతో అప్పట్లో ఈ కేసును సిట్ దర్యాప్తు చేసింది. మరోవైపు.. 2021, డిసెంబర్ 16వ తేదీన సజ్జన్ కుమార్‌పై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. ఎవరీ సజ్జన్ కుమార్?ఢిల్లీలో ఓ బేకరీ ఓనర్ అయిన సజ్జన్ కుమార్‌కు.. సంజయ్ గాంధీతో దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయి. అలా ఢిల్లీ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో ఔటర్ ఢిల్లీ నుంచి లోక్‌సభకు తొలిసారి గెలిచారు. 1991, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే స్థానానికి ఆయన ఎన్నికయ్యారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు (8,55,543)పోలైన నేతగా రికార్డు సృష్టించారు. అయితే.. 2018లో సిక్కుల ఊచకోత కేసులో దోషిగా కోర్టు ప్రకటించడంతో ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.సజ్జన్‌కు శిక్ష-ఎప్పుడు ఏం జరిగిందంటే.. 1991: అల్లర్లలో జస్వంత్, తరుణ్ దీప్ సింగ్‌ల హత్యపై కేసు నమోదు1994: జులై 8 సరైన ఆధారాలు లేవని చెబుతూ సజ్జన్ కుమార్ విచారణకు ఢిల్లీ కోర్టు నిరాకరణ2015 ఫిబ్రవరి 12: సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం2016 నవంబర్ 21: మరింత దర్యాప్తు అవసరమని కోర్టుకు తెలిపిన సిట్2021 ఏప్రిల్ 06: సజ్జన్ కుమార్ అరెస్ట్2021 మే 5 : సజ్జన్‌పై పోలీసుల ఛార్జ్‌షీట్ నమోదు2021, జులై 26: ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం2021, అక్టోబర్ 1: కోర్టులో వాదనలు ప్రారంభం2021, డిసెంబర్ 16: సజ్జన్ కుమార్‌పై అభియోగాలు నమోదు చేసిన కోర్టుజనవరి 31, 2024: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తుది వాదనలు విన్న కోర్టు2024, నవంబర్ 8: వాదనలు పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ప్రత్యేక కోర్టు2025, ఫిబ్రవరి 12: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు2025, ఫిబ్రవరి 25: సజ్జన్ కుమార్‌కు జీవితఖైదు ఖరారునానావతి కమిషన్ నివేదిక ప్రకారం.. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో మొత్తం 2,733 మంది మరణించారు. మొత్తం 587 ఎఫ్ఐఆర్లలో కేవలం 28లో మాత్రమే 400 మందికి శిక్షలు పడ్డాయి. ఇప్పటికే యావజ్జీవంఇక ఢిల్లీ కంటోన్మెంట్(Delhi Cantonment)లో జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఆయనకు గతంలోనే యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 1984 సిక్కు అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా నిర్దారిస్తూ 2018లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది . ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష పడడంతో.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. -
ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల నష్టం.. ఢిల్లీ మద్యం పాలసీపై కాగ్ రిపోర్ట్
ఢిల్లీ : దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో ప్రభుత్వానికి రూ.2002 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. తాజా కాగ్ నివేదికతో కోర్టు విచారణ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.కాగా, నవంబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు నూతన మద్యం విధానం కొనసాగింది. కుంభకోణం వెలుగు చూడడంతో నూతన మద్యం విధానం రద్దయ్యింది. ఈ లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ , మనీష్ సిసోడియా, కవిత సహా పలువురు కీలక నేతలు జైలు శిక్షను అనుభవించారు. -
సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ నేతలకు ఊరట
సాక్షి, ఢిల్లీ: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం తరువు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. బెయిల్‌ను వ్యతిరేకించగా, ఈ కేసుపైనే ఎందుకు స్పెషల్ అటెన్షన్ అంటూ సిద్ధార్థ లూత్రాను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఇది రాజకీయపరమైన కేసు అని.. పాస్ పోర్ట్‌ను ఇప్పటికే సరెండర్ చేశామన్నారు. దాడికి పాల్పడ్డ 30 మందికి ఏపీ హై కోర్టు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన రోజు అక్కడ లేరు. వీళ్ల ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవు’’ అని కపిల్ సిబల్ పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, న్యాయవాది అల్లంకి రమేష్ హాజరయ్యారు.