న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలు ప్రొటోకాల్ రగడకు వేదికయ్యాయి. విపక్ష నేతలకు వెనక వరుసల్లో సీట్లు కేటాయించడం వివాదానికి దారితీసింది. సోమవారం కర్తవ్యపథ్‌లో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీకి మూడో వరుసలో స్థానం కల్పించారు. లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలైన వారిద్దరినీ మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అవమానించిందని కాంగ్రెస్ ఆరోపించింది. వారు మూడో వరుసలో కూర్చున్న ఫొటోలను ఆ పారీ్టకి చెందిన పలువురు నేతలు ఎక్స్‌లో పంచుకున్నారు.
తమ నేతలకు సీట్ల కేటాయింపులో వివక్ష ఎందుకని నిలదీశారు. ఇవి చిల్లర చేష్టలంటూ మండిపడ్డారు. మోదీ సర్కారు ఆత్మన్యూనతకు ఈ ఉదంతం నిదర్శనమని రణ్‌దీప్ సుర్జేవాలా తదితరులు విమర్శించారు. యూపీఏ హయాంలో బీజేపీకి చెందిన విపక్ష నేత ఎల్‌కే అడ్వాణీకి తొలి వరుసలోనే స్థానం దక్కేదని వారు గుర్తు చేశారు. అయితే వేడుకలు ప్రారంభమైన కాసేపటికి ఖర్గే మొదటి వరుసలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పక్క సీటుకు మారారు. కాంగ్రెస్ విమర్శల్లో అహంకారమే తప్ప మరేమీ లేదంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనేవాలా ఎదురుదాడికి దిగారు.
क्या देश के विपक्ष के नेता के साथ ऐसा व्यवहार किसी मर्यादा, परंपरा और प्रोटोकॉल के मापदंड पर खरा उतरता है ?
ये केवल हीन भावना से ग्रस्त सरकार की कुंठा दिखाता है ।
प्रजातंत्र में मतभेद रहेंगे मगर श्री @RahulGandhi के साथ किया जाने वाला ये व्यवहार अस्वीकार्य है। pic.twitter.com/b4mdU9BU7G— Randeep Singh Surjewala (@rssurjewala) January 26, 2026


