హైదరాబాద్ : ఇన్నాళ్లూ పుస్తకాలతో కుస్తీ పట్టి.. పాఠాలను బట్టీపట్టి.. ఎట్టకేలకు పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులు ఇంటి బాటపట్టారు. గురువారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ముగియడంతో నగరంలోని పలు జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా స్వగ్రామాలకు తరలివెళ్లారు.


