‘జంతర్ మంతర్’ లవ్‌ స్టోరీ.. తలకు గాయంతో వివాహం! | NEET Love Story Mohan Srivastava Jantar Mantar | Sakshi
Sakshi News home page

‘జంతర్ మంతర్’ లవ్‌ స్టోరీ.. తలకు గాయంతో వివాహం!

Jul 27 2026 10:12 AM | Updated on Jul 27 2026 10:45 AM

NEET Love Story Mohan Srivastava Jantar Mantar

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరిగిన ‘నీట్’ పేపర్ లీక్ నిరసన ప్రదర్శన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫలితంగా కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నిరసనలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి యువత తరలివచ్చింది. ఈ క్రమంలోనే బీహార్‌కు చెందిన మోహన్ శ్రీవాస్తవ్‌, ఢిల్లీకి చెందిన ఓ యువతి మధ్య చిగురించిన ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
 

నీట్ పేపర్ లీక్ నిరసనల్లో పాల్గొనేందుకు మోహన్ బీహార్ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఆందోళన ప్రాంతంలో భోజన వసతి లేకపోవడంతో ఒ యువతి అతనికి ఆహారం అందించింది. తర్వాతి రోజు తాగునీరు కూడా తెచ్చి ఇచ్చింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య మంచి స్నేహానికి దారితీసింది. ఆ యువతి కూడా ‘నీట్’ పరీక్ష రాసి, పేపర్ లీక్ బాధితురాలే కావడంతో ఆందోళనలో పాలుపంచుకుంది.

ఈ క్రమంలో పోలీసులు జరిపిన లాఠీచార్జిలో మోహన్ తలకు తీవ్ర గాయమై అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్పందించిన ఆ యువతి అతనిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడింది. మోహన్ కోలుకున్నాక ఆమె తన ప్రేమను వ్యక్తం చేసింది. మోహన్ కూడా తన మనసులోని భావాన్ని బయటపెట్టాడు. గాయాలతో బాధపడుతూనే మోహన్‌ ఆ యువతిని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఒంటరిగా ఢిల్లీకి వెళ్లిన మోహన్, ఆందోళన ముగిశాక నూతన వధువుతో కలిసి బీహార్‌కు తిరుగుముఖం పట్టాడు.

ఇది కూడా చదవండి: ఇక గడ్కరీకి ‘బొద్దింకల’ బెడద?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement