రూ.50,000 కోట్ల టార్గెట్ ఫిక్స్.. డిఫెన్స్ ఎగుమతుల్లో దూకుడు! | India Defense Export Explosion, How Made In India Products Dominating Global Markets, Exports Set To Hit ₹50,000 Crore | Sakshi
Sakshi News home page

రూ.50,000 కోట్ల టార్గెట్ ఫిక్స్.. డిఫెన్స్ ఎగుమతుల్లో దూకుడు!

Jul 27 2026 9:59 AM | Updated on Jul 27 2026 10:05 AM

India Defense Export Explosion How Made in India Dominating Global Markets

భారత రక్షణ ఉత్పత్తి రంగం అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేస్తోంది. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.50,000 కోట్ల రక్షణ ఎగుమతుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా చేరుకుంటుందని కేంద్ర రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. గత దశాబ్దంలో ఆత్మనిర్భర్ భారత్ పిలుపుతో విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకున్న భారత్ నేడు గ్లోబల్ సౌత్ దేశాలకు నమ్మకమైన భద్రతా భాగస్వామిగా రూపాంతరం చెందుతోందని చెప్పారు.

విశ్వవ్యాప్తంగా పెరిగిన డిమాండ్

గత ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.38,000 కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది ఏకంగా 61 శాతం వృద్ధి కావడం గమనార్హం. 2014 ప్రాంతంలో కేవలం రూ.600 కోట్లకు పరిమితమైన ఎగుమతులు నేడు ఈ స్థాయికి చేరడం భారత రక్షణ పారిశ్రామిక వ్యవస్థ సామర్థ్యానికి అద్దం పడుతోందని రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సంప్రదాయ యుద్ధ సామగ్రి, ఆర్టిలరీ షెల్స్, క్షిపణులు, డ్రోన్ సాంకేతికతలకు భారీ డిమాండ్ ఏర్పడింది. భారత ఆయుధ వ్యవస్థలు క్షేత్రస్థాయిలో నాణ్యతను నిరూపించుకోవడంతో అనేక దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని చెప్పారు.

లైన్ ఆఫ్ క్రెడిట్ రూపంలో ప్రోత్సాహం

ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని కొనుగోలుదారులను మరింత ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఆర్థిక పరిమితులు ఉన్న వర్ధమాన దేశాలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించేందుకు (లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌) ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ కేబినెట్ నోట్ సిద్ధం చేసింది. ఇది అమల్లోకి వస్తే భారతీయ ఆయుధాల విక్రయాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

ప్రభుత్వ రంగం, యూరప్ భాగస్వామ్యాలు

గతంలో ప్రైవేట్ కంపెనీలకే పరిమితమైన ఎగుమతుల వృద్ధిలో ప్రస్తుతం హిందూస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్‌) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరోవైపు, యూరప్ దేశాల్లో శ్రామిక శక్తి కొరత, వయోవృద్ధుల జనాభా పెరుగుతుండటంతో తక్కువ వ్యయంతో నాణ్యమైన తయారీ సామర్థ్యం ఉన్న భారత స్థానిక పరిశ్రమలతో భాగస్వామ్యానికి పాశ్చాత్య దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.

ఇదీ చదవండి: ఒక రివార్డ్ పాయింట్.. రూ.1 అనుకుంటున్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement