ఒక రివార్డ్ పాయింట్.. రూ.1 అనుకుంటున్నారా? | Credit Card Reward Points Secret Explained In Telugu, Know How To Get Maximum Value, Read Full Story For Details | Sakshi
Sakshi News home page

ఒక రివార్డ్ పాయింట్.. రూ.1 అనుకుంటున్నారా?

Jul 27 2026 9:28 AM | Updated on Jul 27 2026 10:32 AM

Credit Card Reward Points Secret How to Get Maximum Value

క్రెడిట్ కార్డుతో మనం చేసే ప్రతి స్వైపింగ్ లేదా ఆన్‌లైన్ కొనుగోలుపై బ్యాంకులు రివార్డ్ పాయింట్లను ఖాతాలో జమ చేస్తుంటాయి. అయితే మెజారిటీ వినియోగదారులు ‘ఒక రివార్డ్ పాయింట్‌ అంటే ఒక రూపాయి’ అనే అపోహలో ఉంటారు. వాస్తవానికి బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ప్రతీ రివార్డ్ పాయింట్‌ విలువ మీరు దాన్ని ఏ విధంగా రిడీమ్ (వినియోగం) చేసుకుంటున్నారు అనే అంశంపై ఆధారపడి 20 పైసల నుంచి ఒక రూపాయి వరకు మారుతుంటుంది.

రీడెంప్షన్ పద్ధతిని బట్టి పాయింట్‌ విలువ

  • పాయింట్లను విమాన టికెట్లు లేదా హోటల్ రూమ్‌ల కోసం ఉపయోగిస్తే ప్రతి పాయింట్‌కు అత్యధికంగా కార్లును అనుసరించి రూ.0.50- రూ.1.00 వరకు లభిస్తుంది.

  • అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వౌచర్లుగా మార్చుకుంటే ఒక పాయింట్ విలువ రూ.0.30-రూ.0.50 మధ్య ఉంటుంది.

  • రివార్డ్ పాయింట్లను నేరుగా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుగా మార్చుకుంటే బ్యాంకును బట్టి ఒక పాయింట్‌కు కేవలం రూ.0.20-రూ.0.25 మాత్రమే వస్తుంది.

  • బ్యాంకు రివార్డ్ క్యాటలాగ్‌లో లభించే ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు కొనుగోలు చేస్తే పాయింట్ విలువ రూ.0.10-రూ.0.20 కి పడిపోతుంది.

గరిష్ఠంగా మలచుకోవడానికి సూత్రాలు

  • భారతదేశంలో చాలా క్రెడిట్ కార్డ్ పాయింట్లకు 12-36 నెలల గడువు ఉంటుంది. వాడకుండా వదిలేస్తే పాయింట్లు రద్దయిపోతాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ రివార్డ్ పోర్టల్‌ను తనిఖీ చేసి పాయింట్లను రీడీమ్ చేసుకోవడం శ్రేయస్కరం.

  • ప్రయాణాలు, ఇంధనం లేదా ఆన్‌లైన్ షాపింగ్‌ల కోసం ప్రత్యేక కో-బ్రాండెడ్ కార్డ్‌లను వాడటం వల్ల సాధారణ 1X పాయింట్ల కంటే 5X-10X వేగంతో ఎక్కువ పాయింట్లు లభిస్తాయి.

  • రివార్డ్ పాయింట్ల ఆశతో అనవసర ఖర్చులు చేయడం లేదా క్రెడిట్ కార్డ్ బిల్లు బకాయిలపై నెలకు 3%-3.5% (ఏడాదికి 36% - 42%) వడ్డీ చెల్లించడం వల్ల మీరు పొందే 1%-2% రివార్డ్ ప్రయోజనం పూర్తిగా వ్యర్థమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement