డిశ్చార్జ్ తర్వాత వాంగ్‌చుక్ ‍ప్రణాళిక ఇదే.. | Sonam Wangchuk To Be Discharged From Hospital After Ending 26 Day Hunger Strike, Returns To Ladakh Via Rajghat | Sakshi
Sakshi News home page

డిశ్చార్జ్ తర్వాత వాంగ్‌చుక్ ‍ప్రణాళిక ఇదే..

Jul 27 2026 9:20 AM | Updated on Jul 27 2026 10:29 AM

Sonam Wangchuk to Be Discharged from Hospital, Returns to Ladakh via Rajghat

న్యూఢిల్లీ: నిరాహార దీక్ష విరమించిన ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ సోమవారం గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. అనంతరం ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పిస్తారని, ఆ తర్వాత లడఖ్‌కు పయనమవుతారని ఆయన బృందం వెల్లడించింది.

గత శుక్రవారం అర్ధరాత్రి తన 26 రోజుల నిరాహార దీక్షను ముగించిన వాంగ్‌చుక్, ఆస్పత్రిలో కోలుకున్న తర్వాత సోమవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. నీట్ పరీక్షలో అవకతవకలను నిరసిస్తూ, నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించడానికి ముందు, జూన్ 28న కూడా ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

జూన్ 28న విద్యార్థుల నేతృత్వంలోని ఆందోళనలో చేరిన వాంగ్‌చుక్ 26 రోజుల పాటు నిరవధిక దీక్ష కొనసాగించారు. జూలై 18న ఆయనను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ తనను ఖైదీలా నిర్బంధించారని ఆయన ఆరోపించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స కోసం ఆయనను మేదాంత ఆస్పత్రికి తరలించారు. నీట్-యూజీ పేపర్ లీక్, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై బాధ్యుల నుంచి జవాబుదారీతనం కోరుతూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో జూన్ 20న ప్రారంభమైన ఈ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో శనివారం ముగిసింది.

ఇది కూడా చదవండి: భారత విద్యార్థులకు థన్‌బర్గ్ ఎందుకు మద్దతు పలికారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement