‘నీట్’ న్యూస్‌ పేపరా?.. బీజేపీ ఎంపీ నవ్వులపాలు! | Ravi Kishan Trolled for Calling NEET Exam | Sakshi
Sakshi News home page

‘నీట్’ న్యూస్‌ పేపరా?.. బీజేపీ ఎంపీ నవ్వులపాలు!

Jul 22 2026 1:54 PM | Updated on Jul 22 2026 2:10 PM

Ravi Kishan Trolled for Calling NEET Exam

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై న‌టుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్‌పై జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నీట్ పరీక్షా పత్రాన్ని పొరపాటున ‘వార్తాపత్రిక’ (న్యూస్‌పేపర్) అని అనడంతో సోషల్ మీడియాలో ఆయన తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతున్నారు.

నీట్ పేపర్ లీకేజీ కేసులో పట్టుబడిన 13 మంది నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని రవికిషన్ డిమాండ్ చేశారు. పిల్లల భవిష్యత్తుతో ఎవరూ ఆటలాడుకోకుండా ఉండేలా అత్యుత్తమ లాయర్లను నియమించి వారికి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. అయితే ప్రసంగిస్తున్న సమయంలో ఆయన నీట్ పరీక్షను ‘న్యూస్‌పేపర్’ అని తప్పుగా సంబోధించారు. ఈ చిన్న పొరపాటే సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కారణమైంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement