లామినె యమాల్..(Lamine Yamal) కేవలం 18 ఏళ్ల వయసులోనే స్పెయిన్కు ఫిఫా వరల్డ్ కప్ అందించిన ఫుట్‌బాల్ సంచలనం.
స్పెయిన్ యువ సంచలనం లమీన్ యమాల్ పేరు వెనుక ఓ భావోద్వేగ కథ ఉంది. ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసిస్తున్న ఈ యువ ఆటగాడి పూర్తి పేరు లమీన్ యమాల్ నస్రౌయి ఎబానా (Lamine Yamal Nasraoui Ebana)
స్పెయిన్ సంప్రదాయం ప్రకారం తండ్రి ఇంటి పేరు నస్రౌయి, తల్లి ఇంటి పేరు ఎబానా. అయితే ఫుట్‌బాల్ ప్రపంచంలో అతను లమీన్ యమాల్ పేరుతోనే గుర్తింపు పొందాడు.
2007లో జన్మించిన యమాల్, చిన్నతనంలోనే బార్సిలోనా లా మాసియా అకాడమీలో చేరి అసాధారణ ప్రతిభతో ప్రపంచ ఫుట్‌బాల్‌లో తనదైన ముద్ర వేశాడు.
ఇప్పుడు స్పెయిన్ జాతీయ జట్టుకు కీలక ఆటగాడిగా ఎదిగిన యమాల్, తన పేరులో దాగి ఉన్న ఈ భావోద్వేగ కథతో మరోసారి అభిమానులకు చేరువయ్యాడు.
16 ఏళ్లకే యూరో కప్ గోల్ కొట్టి అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
ఈ కుర్రాడు.. భవిష్యత్తులో మెస్సి, రొనాల్డో స్థానాలను భర్తీ చేసే స్థాయికి ఎదుగుతున్నాడని క్రీడాలోకం కీర్తిస్తోంది.
Photo Credit : @lamineyamal (instagram)


