breaking news
Spain vs Argentina
-
FIFA World Cup 2026 : స్పెయిన్ యువ సంచలనం లమీన్ యమాల్ (ఫొటోలు)
-
స్పెయిన్ యువ సంచలనం పేరు వెనుక ఆసక్తికర కథ
స్పెయిన్ యువ సంచలనం లమీన్ యమాల్ పేరు వెనుక ఓ భావోద్వేగ కథ ఉంది. ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసిస్తున్న ఈ యువ ఆటగాడి పూర్తి పేరు లమీన్ యమాల్ నస్రౌయి ఎబానా (Lamine Yamal Nasraoui Ebana).స్పెయిన్ సంప్రదాయం ప్రకారం తండ్రి ఇంటి పేరు నస్రౌయి, తల్లి ఇంటి పేరు ఎబానా. అయితే ఫుట్‌బాల్ ప్రపంచంలో అతను లమీన్ యమాల్ పేరుతోనే గుర్తింపు పొందాడు.యమాల్ తండ్రి మౌనిర్ నస్రౌయి మొరాకోకు చెందినవాడు. తల్లి షీలా ఎబానా ఈక్వటోరియల్ గినియాలో జన్మించారు. యమాల్ పుట్టినప్పుడు ఇద్దరూ చాలా చిన్న వయసులో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన ఇద్దరు స్నేహితుల పేర్లు లమీన్ మరియు యమాల్. వారి సహాయానికి కృతజ్ఞతగా తమ కుమారుడికి 'లమీన్ యమాల్' అని పేరు పెట్టినట్లు స్పానిష్ మీడియా వెల్లడించింది. అయితే ఆ ఇద్దరు వ్యక్తుల వివరాలు ఇప్పటికీ బయటకు రాలేదు. (Story Behind Lamine Yamal Name)'లమీన్' అనే పేరు అరబిక్‌లో నమ్మకమైన వ్యక్తి, నిజాయితీ గలవాడు అనే అర్థం ఇస్తే, 'యమాల్' (జమాల్) అంటే అందం, సొగసు, ఆకర్షణ అనే అర్థాలు ఉన్నాయి.2007లో జన్మించిన యమాల్, చిన్నతనంలోనే బార్సిలోనా లా మాసియా అకాడమీలో చేరి అసాధారణ ప్రతిభతో ప్రపంచ ఫుట్‌బాల్‌లో తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు స్పెయిన్ జాతీయ జట్టుకు కీలక ఆటగాడిగా ఎదిగిన యమాల్, తన పేరులో దాగి ఉన్న ఈ భావోద్వేగ కథతో మరోసారి అభిమానులకు చేరువయ్యాడు.ఇదిలా ఉంటే, జులై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగే ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో అర్జెంటీనా-స్పెయిన్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ మ్యాచ్ నేపథ్యంలో యమాల్, అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ మధ్య కొన్ని యాదృచ్ఛిక విషయాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. వీరిద్దరికి 19 సంఖ్యతో ముడిపడిన అనుబంధం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.2007లో యునిసెఫ్ నిర్వహించిన ఛారిటీ ఫోటోషూట్‌లో అప్పటి 20 ఏళ్ల మెస్సీ, ఆరు నెలల చిన్నారి యమాల్‌కు స్నానం చేయించాడు. అదే చిన్నారి ఇప్పుడు 2026 ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీకి ప్రత్యర్థిగా నిలబడ్డాడు.ఈ ఫోటోషూట్‌కు సరిగ్గా 19 ఏళ్ల తర్వాత జులై 19న జరిగే ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీ-యమాల్ ఒకరినొకరు ఎదుర్కోనున్నారు.ప్రపంచకప్ ఫైనల్‌కు కొద్ది రోజుల ముందే (జూలై 13) యమాల్ తన 19వ పుట్టినరోజు జరుపుకున్నాడు.మెస్సీ, యమాల్ తమ మొదటి ప్రపంచకప్ గోల్‌ను 18 ఏళ్ల వయసులో, 19వ నంబర్ జెర్సీ ధరించి నమోదు చేయడం మరింత ఆశ్చర్యకరం. -
19తో ముడిపడ్డ మెస్సీ-యమాల్ అనుబంధం
ఫిఫా వరల్డ్‌కప్ 2026 తుది అంకానికి చేరింది. అర్జెంటీనా-స్పెయిన్ జట్లు ఫైనల్‌కు చేరాయి. జులై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో ఈ రెండు జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇరు జట్లకు చెందిన స్టార్ ఆటగాళ్లు లియోనల్ మెస్సీ (అర్జెంటీనా), లమీన్ యమాల్ (స్పెయిన్) మధ్య కొన్ని యాదృచ్ఛిక విషయాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా 19 సంఖ్యతో మెస్సీ-యమాల్‌కు ముడిపడిన అనుబంధం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.2007లో యునిసెఫ్ నిర్వహించిన ఛారిటీ ఫోటోషూట్‌లో అప్పటి 20 ఏళ్ల మెస్సీ, ఆరు నెలల చిన్నారి యమాల్‌కు స్నానం చేయించాడు. అదే చిన్నారి ఇప్పుడు 2026 ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీకి ప్రత్యర్థిగా నిలబడ్డాడు.ఈ ఫోటోషూట్‌కు సరిగ్గా 19 ఏళ్ల తర్వాత జులై 19న జరిగే ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీ-యమాల్ ఒకరినొకరు ఎదుర్కోనున్నారు. ప్రపంచకప్ ఫైనల్‌కు కొద్ది రోజుల ముందే (జూలై 13) యమాల్ తన 19వ పుట్టినరోజు జరుపుకున్నాడు.మెస్సీ, యమాల్ తమ మొదటి ప్రపంచకప్ గోల్‌ను 18 ఏళ్ల వయసులో, 19వ నంబర్ జెర్సీ ధరించి నమోదు చేయడం మరింత ఆశ్చర్యకరం.ఒకప్పుడు తాను స్నానం చేయించిన చిన్నారి... ఇప్పుడు ప్రపంచకప్ కిరీటం కోసం తనతో పోటీపడటాన్ని మెస్సీ సహా ప్రపంచమంతా నమ్మలేకపోతుంది. ఈ విషయాలు ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత అరుదైన యాదృచ్ఛికాలుగా నిలిచిపోతాయి. -
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌కు ట్రంప్
అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగనున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు. ఈ సమాచారాన్ని వైట్‌హౌస్ అధికారికంగా ధృవీకరించింది.వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్రంప్ శుక్రవారం న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఫిఫా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, ఆదివారం ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.ఇప్పటికే ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో కూడా ఫైనల్ అనంతరం ట్రంప్‌తో కలిసి విజేత జట్టుకు ప్రపంచకప్ ట్రోఫీ అందజేస్తామని ప్రకటించారు.అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన 102 మ్యాచ్‌లకు ట్రంప్ గానీ, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గానీ హాజరుకాలేదు. అయితే అమెరికా జట్టు ఆడిన కొన్ని మ్యాచ్‌లకు కేబినెట్ సభ్యులు హాజరయ్యారు.అమెరికా చరిత్రలో అత్యధికంగా వీక్షించబడిన, అత్యంత భద్రతతో నిర్వహించిన, అత్యంత విజయవంతమైన ప్రపంచకప్‌కు ట్రంప్ హాజరుతో ఘన ముగింపు లభిస్తుందని లెవిట్ పేర్కొన్నారు.ఫైనల్ మ్యాచ్ న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉంటే, ఇటీవల అమెరికా ఆటగాడు ఫోలారిన్ బాలోగన్ రెడ్‌కార్డు సస్పెన్షన్ వ్యవహారంలో ట్రంప్ ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినోతో మాట్లాడిన విషయం వివాదాస్పదమైంది. ట్రంప్ విజ్ఞప్తి చేసినప్పటికీ నిర్ణయ ప్రక్రియలో తాను జోక్యం చేసుకోలేదని ఇన్ఫాంటినో స్పష్టం చేశారు.అనంతరం బాలోగన్పై విధించిన ఒక మ్యాచ్ నిషేధాన్ని ఫిఫా తాత్కాలికంగా ఎత్తివేయడం విమర్శలకు దారితీసింది. అయినప్పటికీ, ప్రీక్వార్టర్‌లో బెల్జియం చేతిలో అమెరికా 1-4 తేడాతో ఓటమి పాలైంది. -
19 ఏళ్ల క్రితం స్నానం చేయించిన 'ఆ' చిన్నారే ఫైనల్లో మెస్సీ ప్రత్యర్ది
ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న అరుదైన ఘటనకు 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ వేదిక కానుంది. 19 ఏళ్ల క్రితం తాను స్నానం చేయించిన చిన్నారినే అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీ, ప్రపంచకప్ ఫైనల్లో ఎదుర్కోనున్నాడు. కాలం రాసిన ఈ అద్భుత కథ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.2007లో యునిసెఫ్ నిర్వహించిన ఓ సేవా కార్యక్రమంలో భాగంగా "డియారియో స్పోర్ట్" అనే పత్రిక ఓ ఫొటోషూట్ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో అప్పటి 20 ఏళ్ల మెస్సీ, యాదృచ్ఛికంగా ఎంపికైన శిశువు, నేటి స్పెయిన్ సూపర్ స్టార్ "లామినే యమాల్"కు ప్లాస్టిక్ టబ్‌లో స్నానం చేయిస్తూ ఫొటోలకు పోజులిచ్చాడు.ఆ చిన్నారి భవిష్యత్తులో ప్రపంచ ఫుట్‌బాల్‌లో సంచలనంగా మారతాడని, ఒకరోజు ప్రపంచకప్ ఫైనల్లో తన ప్రత్యర్థిగానే నిలుస్తాడని మెస్సీ ఊహించి ఉండడు.ఈ ఫొటోలు చాలా సంవత్సరాలు వెలుగులోకి రాలేదు. అయితే 2024లో యమాల్ తండ్రి వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. మెస్సీ చేతుల్లో కనిపించిన ఆ శిశువే స్పెయిన్ యువ సంచలనం లామినే యమాల్ అని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోయారు.ప్రస్తుతం యమాల్ స్పెయిన్ జట్టులో అత్యంత కీలక ఆటగాడిగా ఎదిగాడు. అద్భుతమైన డ్రిబ్లింగ్, సృజనాత్మక ఆటతీరుతో క్లబ్, దేశం తరఫున వరుస రికార్డులు నెలకొల్పుతూ ప్రపంచ ఫుట్‌బాల్ భవిష్యత్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. 2026 ప్రపంచకప్‌లోనూ అతని ప్రదర్శన స్పెయిన్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది.మరోవైపు 39 ఏళ్ల వయసులోనూ మెస్సీ తన మాంత్రిక ఆటతో అర్జెంటీనాను మరోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో చివరి నిమిషాల్లో అందించిన రెండు అద్భుత అసిస్టులతో అర్జెంటీనా విజయానికి మార్గం సుగమం చేశాడు.ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల్లో ఒకవైపు మరో ప్రపంచకప్ కోసం పోరాడుతున్న మెస్సీ, మరోవైపు కొత్త యుగానికి నాంది పలకాలని భావిస్తున్న యువ సంచలనం యమాల్ నిలవనున్నారు.19 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఓ యాదృచ్ఛిక ఫొటో కథ, ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత భావోద్వేగభరితమైన ఫైనల్‌కు నేపథ్యంగా మారింది. రెండు తరాల మధ్య జరిగే ఈ పోరు ఫుట్‌బాల్ క్రీడలో చారిత్రక ఘట్టంగా నిలవనుంది. -
జింబాబ్వేపై గెలిచాక ధోనీ ఏం చేశాడు..?
హరారే: జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0 తో క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని యువ సేన రిలాక్స్ అయింది. మూడో వన్డే ముగిసిన అనంతరం కొన్ని రోజుల నుంచి తీవ్ర ఒత్తిడిలో ఉన్న మహీ మళ్లీ మిస్టర్ కూల్ గా కనిపించాడు. మహీ చిన్న పిల్లాడిలా మారిపోయి యువ ఆటగాళ్లతో పోటీపడి గేమ్ లో పాల్గొన్నాడు. యువ ఆటగాళ్లతో సరదాగా గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేశాడు. భారత పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని యువ ఆటగాళ్లతో కలసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు. అయితే మైదానంలో దికి ధోనీ దూకుడు ప్రదర్శించాడని మాత్రం భావించవద్దు. ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి వీడియో గేమ్ ఆడారు. స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనా అంటూ తన ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. ఫుట్ బాల్ జట్లు స్పెయిన్, అర్జెంటీనా అంటూ విడిపోయి ధోని, ఉనద్కత్, కరుణ్ నాయర్, మన్దీప్ సింగ్‌లు వీడియో గేమ్ ఆడుతున్నట్లు మహీ పోస్ట్ చేసిన ఫొటోలో కనిపిస్తున్నారు. అక్షర్ పటేల్ మాత్రం ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు రెట్టించిన ధోనీ సేన రెట్టించిన ఉత్సాహంతో సన్నద్ధమైంది. ఇరు జట్ల మధ్య శనివారం సాయంత్రం గం.4.30ని.లకు హరారే స్పోర్ట్ క్లబ్ స్టేడియంలో తొలి టీ 20 ప్రారంభం కానుంది.


