తాడేపల్లి : స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి వైఎస్ జగన్ నివాళులర్పించారు. బ్రిటీష్ పాలకుల నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచి, ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కొనియాడారు. ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆ మహావీరుడి పేరు పెట్టుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
బ్రిటీష్ పాలకుల నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచి, ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆ మహావీరుడి పేరు పెట్టుకోవడం మనందరికీ గర్వకారణం. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 24, 2026


