64 ఏళ్ల నాటి సూప్‌ డబ్బా పెయింటింగ్..అన్ని కోట్లు ఖరీదా..! | A 64 year old painting of a soup can just fetched 9026000 Dollar | Sakshi
Sakshi News home page

64 ఏళ్ల నాటి సూప్‌ డబ్బా పెయింటింగ్..అన్ని కోట్లు ఖరీదా..!

Nov 22 2026 3:06 PM | Updated on Nov 22 2026 3:11 PM

A 64 year old painting of a soup can just fetched 9026000 Dollar

ఒక కళాఖండం సాధారణ వస్తువుని సైతం విలాసవంతమైనదిగా మార్చేయగలదు. అందుకు ఈ సంఘటనే ఉదాహరణ. సరదాగా స్నేహితుడికి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఒక చిన్న డబ్బాపై గీసిన కళాఖండం..ఇవాళ ఏ రేంజ్‌లో ధర పలుకుతుందో తెలిస్తే కంగుతింటారు. 

ఆండీ వార్హోల్‌ 1962లో చిత్రించిన పెయింటింగ్‌ వేలంలో ఏకంగా రూజ 83 కోట్లకు పైనే అమ్ముడు పోవడం విశేషం. నార వస్త్రంపై కేసిన్‌ గ్రాఫైట్‌ సృష్టించి క్యాంప్‌బెల్స్‌ సూప్‌ క్యాన్‌ పెయింటింగ్‌ నవంబర్‌ 19న న్యూయార్క్‌లోని క్రిస్టీస్‌ వేలంలో ఈ రేంజ్‌లో అమ్ముడుపోయింది. ప్రతిష్టాత్మకమైన సోనాబెండ్ కలెక్షన్ ఫౌండేషన్ నుంచి 64 ఏళ్ల నాటి ఈ పాప్‌ ఆర్ట్‌ కళాఖండంపై తీవ్రమైన వేలం పాట పోటీ ఎదురైంది. 

చిత్రించడానికి గల కారణాలు..
ఈ కళాఖండం తొలితరం పాప్‌ కళకు చెందినదట. వార్హోల్‌ తన సూప్‌ క్యాన్‌లను కళాఖండాలకు కేరాఫ్‌గా మార్చిన కాలమట. ఆయన దీనిని 1962లో చిత్రించారు. సిల్క్‌ స్క్రీన్‌ కాన్వాస్‌ల వలె కాకుండా, సూప్‌క్యాన్‌లపై చేతితో చిత్రించే ఆర్ట్‌ అట ఇది. ఒక రకంగా ఇది కళాత్మక పరిణామంలో ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించొచ్చు. 

వార్హోల్‌ స్నేహితుడైన ఫోటోగ్రాఫర్‌ ఎడ్వర్డ్‌ వల్లోవిచ్‌కు గిఫ్ట్గా ఇచ్చిన కళాఖండం ఇది. ఆ తర్వాత ఇలియానా, మైఖేల్‌ సోనాబెండ్‌ సేకరణలో చేరింది. ఆపై బాల్టిమోర్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌కు దీర్ఘకాలిక రుణంపై ఇచ్చారు. ఇటీవలే ‘క్యాంప్‌బెల్స్ సూప్ క్యాన్’  ది సోనాబెండ్ కలెక్షన్ మాంటోవాలో ప్రదర్శనకు ఉంచగా, అక్కడ ఇది ఏకంగా 83 కోటలకు పైగా ఖరీదు పలికింది. ఆ సొమ్ము అంతా సోనాబెండ్‌ కలెక్షన్‌ ఫౌండేషన్‌కు మద్దతుగా ఉంటుందట.

అదే ప్రత్యేకతే..!
లాస్ ఏంజిల్స్‌లోని ఫెరస్ గ్యాలరీలో మొదటిసారి ప్రదర్శించినప్పుడే పాప్‌ కళకు ఒక శక్తిమంతమైన చిత్రణగా పరిగణించారు. ప్రకాశవంతమైన రంగు, గ్రాఫిక్ ప్రభావం,అరుదైన చేతితో గీసిన నాణ్యత అన్నీ కలిసి ఈ ప్రత్యేకమైన చిత్రంలో కళాకారుడి హస్తం ఉదన్ని ప్రత్యేకతంగా తెలియజేస్తాయి. దీన్ని గీయడం కోసం వార్హోల్ క్యాంప్‌బెల్ కార్పొరేట్ స్టేషనరీ నుంచి అసలు మూల చిత్రం భాగాలను కత్తిరించాడు. ఆ కత్తిరించిన ముక్కలకు ట్రేసింగ్‌ పేపర్‌పై అతికించి, దీన్ని కాన్వాస్‌పైకి ప్రొజెక్ట్‌ చేశాడు. 

ఆ సూప్‌ డబ్బానే ఎందుకంటే..
వారోల్‌ ఆ సూప్‌నే ఇరవే ఏళ్లుగా ఇష్టంగా తినేవాడట. ఒకేరకమైన ఆహారాన్నే పదేపదే తినేవాడట. ఒకసారి ఎవరో వ్యక్తి తన జీవితం తనని శాసిస్తుందని అనడంతో అప్పుడే దీనిపై గీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందట. వందల లేదా వేలు ఖరీదుకి మించని ఒక ప్రొడక్ట్‌సపై ఈ ప్రతిష్టాత్మకమైన కళాఖండం చిత్రించి దాని విలువను అమాంతం కోట్లలో పెంచేశాడు కదా..!.

 

ఇదీ చదవండి: ఇన్నోవేషన్‌ ఇన్సులిన్‌: మేడిన్‌ ల్యాబ్‌..!
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement