అమెరికా గగనతలంలో ఏదో జరుగుతోంది.. అత్యంత రహస్య సైనిక స్థావరాలపైనే గుర్తుతెలియని వస్తువులు ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, అవి మామూలు విమానాల్లా లేవు.. డ్రోన్లలా కనిపించడం లేదు.. గంటకు ఏకంగా 1,800 మైళ్ల వేగంతో దూసుకెళ్తున్నాయి. శబ్దం లేదు.. పొగ లేదు.. ఇంజిన్ ఆనవాళ్లు లేవు. అసలు అవి ఎవరివి? అమెరికా ప్రయోగిస్తున్న అత్యాధునిక యుద్ధ సాంకేతికతా? శత్రు దేశాల నిఘా వ్యవస్థలా? లేక ఇన్నాళ్లూ చర్చల్లో ఉన్న యూఎఫ్‌ఓలేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న తరుణంలో అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన కొత్త రహస్య పత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గుర్తుతెలియని వైమానిక దృగ్విషయాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేసే కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 23న మరో విడత పత్రాలను విడుదల చేసింది. గత ఏడాది కాలంలో కనీసం మూడు సందర్భాల్లో రహస్య సైనిక స్థావరాలపై నల్లటి త్రిభుజాకార వస్తువులు కనిపించినట్లు ఈ పత్రాలు వెల్లడించాయి. ముఖ్యంగా, అమెరికా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించే పశ్చిమ ప్రాంతంలోని ఓ సున్నితమైన జాతీయ భద్రతా కేంద్రం సమీపంలో ఈ తరహా ఘటన నమోదైంది. అయితే, భద్రతా కారణాలతో ఘటన జరిగిన ఖచ్చితమైన ప్రాంతం, తేదీలను అధికారులు వెల్లడించలేదు.
NEW: Mysterious black triangles were spotted ripping through the air, traveling 1,800 mph over secret US military bases this past year, according to the Pentagon. According to the new government files, the triangles were spotted at least three different times. Agents say they were working at a surveillance station in an undisclosed mountain range when they saw the black triangle coming over the horizon. "We estimated the object’s wingspan at approximately nine to 15 feet, its depth at six to nine feet, and its thickness at one to two feet," they said to the FBI. According to the report, the triangles made no sound, had no exhaust, and showed a consistent heat signal when scanned by their thermal device, meaning it didn't register hotter anywhere as an engine would. "The exterior presented as a [seamless], featureless surface lacking any discernible structural discontinuities, propulsive apertures, intake structures, aerodynamic control effectors, or cockpit features," a memo said. Government officials say the objects were not American technology. The latest UFO file dump included the following sketches.
— Collin Rugg (@CollinRugg) October 23, 2026
మూడు సెకన్లలో 2.4 కిలోమీటర్లు!
ఈ ఘటనకు సంబంధించిన నివేదికలోని వేగం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాక్షుల అంచనా ప్రకారం.. ఓ నల్లటి త్రిభుజాకార వస్తువు కేవలం మూడు సెకన్లలో 1.5 మైళ్ల దూరం ప్రయాణించింది. అంటే గంటకు సుమారు 1,800 మైళ్లు.. అంటే గంటకు దాదాపు 2,900 కిలోమీటర్లు. ఆ వేగం యుద్ధ విమానాన్ని తలపించినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఆ వస్తువు రెక్కల విస్తీర్ణం 9 నుంచి 15 అడుగుల వరకు, లోతు 6 నుంచి 9 అడుగుల వరకు, మందం 1 నుంచి 2 అడుగుల వరకు ఉన్నట్లు అంచనా వేశారు. దాని ఆకారాన్ని వివరించేందుకు అధికారులు కొన్ని స్కెచ్‌లను విడుదల చేశారు. కానీ, వస్తువు కనిపించిన సమయంలో తీసిన అసలు ఫొటోలు లేదా వీడియోలు మాత్రం అందుబాటులో లేవు.
ఇంజిన్ ఎక్కడుంది? శబ్దం ఎందుకు లేదు?
సాధారణ విమానం గాల్లో ప్రయాణిస్తుంటే దాని ఇంజిన్ శబ్దం, ఎగ్జాస్ట్ లేదా ఇతర సంకేతాలు గుర్తించే అవకాశం ఉంటుంది. కానీ ఈ త్రిభుజాకార వస్తువుల విషయంలో అలాంటి ఆనవాళ్లేవీ కనిపించలేదని సాక్షులు తెలిపారు. థర్మల్ పరికరాల ద్వారా పరిశీలించినప్పుడు వాటి ఉపరితలంపై దాదాపు ఒకే తరహా వేడి కనిపించినట్లు నివేదికల్లో పేర్కొన్నారు. సాధారణ విమానాలు, డ్రోన్లలో ఇంజిన్ ప్రాంతాల్లో కనిపించే ప్రత్యేకమైన వేడి వీటిలో గుర్తించలేకపోయారు. గాలి ప్రవేశ ద్వారాలు, ఇంజిన్ రంధ్రాలు, దిశను నియంత్రించే భాగాలు, కాక్‌పిట్ వంటి ఆనవాళ్లు కనిపించలేదని వివరించారు.
Triangular object hovered stationary then moved straight and steady over Highway 24 in Nashville, TN — Oct 21, 2026, 5:33 AM Triangular Unidentified Anomalous Phenomena (UAPs), often historically referred to as "Black Triangles," are a highly prominent class of UAP characterized by large, dark, silent, and geometric hulls with illuminated corners. Reports of these craft have spanned decades, consistently describing flight dynamics that seemingly defy conventional aviation physics, such as instantaneous acceleration or motionless hovering without visible propulsion systems or rotor wash.
— UFO mania (@maniaUFO) October 22, 2026
అమెరికా భద్రతా వ్యవస్థకు కొత్త సవాలా?
అత్యంత ఆందోళన కలిగిస్తున్న విషయం వాటి వేగం ఒక్కటే కాదు.. అవి కనిపించిన ప్రాంతాలు కూడా. అమెరికా ప్రభుత్వం అత్యాధునిక సైనిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించే సున్నితమైన కేంద్రాలపైనే గుర్తుతెలియని వస్తువులు సంచరించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అవి ఎవరి నియంత్రణలో ఉన్నాయి? అక్కడి సాంకేతిక పరిజ్ఞానాన్ని గమనించేందుకు వచ్చాయా? వాటి వెనుక ఏదైనా దేశం ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు.. ఇది అమెరికాకు చెందిన సాంకేతికత కాదని అధికారులు భావించినట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది. అయినప్పటికీ, ఆ వస్తువులు ఇతర దేశాలకు చెందినవని నిర్ధారించే ఆధారాలు లేవు. వాటి అసలు స్వరూపం, ప్రయాణ విధానం, నియంత్రణ వ్యవస్థ గురించి కూడా స్పష్టత లేదు. ఖచ్చితమైన ప్రదేశాలు, తేదీలు రహస్యంగా ఉండటంతో స్వతంత్ర పరిశీలనకు పరిమితులు ఏర్పడ్డాయి.
గ్రహాంతరవాసుల వాహనాలేనా?
ఈ వస్తువుల వివరాలు వెలుగులోకి రావడంతో అవి గ్రహాంతరవాసులకు చెందినవా? అనే చర్చ మరోసారి మొదలైంది. అయితే, ఇప్పటివరకు విడుదలైన పత్రాలు అలాంటి నిర్ధారణకు ఎలాంటి ఆధారాలనూ అందించలేదు. గుర్తుతెలియని వస్తువులు కనిపించాయని చెప్పడం ఒకటైతే, అవి భూమికి వెలుపల జీవుల నుంచి వచ్చాయని నిరూపించడం మరొకటి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. వాటి ఆకారం, వేగం, శబ్దం లేకుండా కదిలినట్లు వచ్చిన వాంగ్మూలాలు అసాధారణంగా కనిపిస్తున్నాయి. కానీ వాటి మూలం, పనిచేసే విధానం, అసలు స్వరూపం ఏమిటనేది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన పత్రాలు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోగా, మరిన్ని సందేహాలకు తెరతీశాయి.
ఇదీ చదవండి: భారత్‌కు షాకిచ్చిన మాల్దీవులు.. ఇది రెండోసారి..


