breaking news
USA
-
అమెరికా మిచిగాన్ లో దుండిగుడి ఘాతుకం
-
అమెరికాలో విమాన ప్రమాదం.. హుటాహుటిన ఫ్లైట్ నుంచి దిగిపోయిన ప్రయాణికులు
-
విమానం టేకాఫ్ సమయంలో మంటలు.. భయంతో ప్రయాణీకుల పరుగులు
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో తృటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA-3023 ల్యాండింగ్ గేర్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రన్‌పై పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. కొలరాడలోని డెన్వర్ విమానాశ్రయంలో పెను విమానం ప్రమాదం తప్పింది. మియామాకి వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA-3023లో మంటలు చేలరేగాయి. బోయింగ్ 737 మాక్స్ 8 విమానం టేకాప్‌కు సిద్ధమవుతున్న సమయంలో (స్థానిక సమయం) మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. త తర్వాత కొద్దిక్షణాల్లోనే మంటలు చెలరేగాయి. డెన్వర్ విమానాశ్రయ పరిపాలన వెంటనే అగ్నిమాపక శాఖను వెంటనే అప్రమత్తం చేసింది. దాంతో ఫైర్స్టాఫ్ వెంటనే విమానం వద్దకు చేరుకొని మంటలను ఆర్పి వేసింది. ఈ ఘటనతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు విమానం నుంచి కిందకు దిగి.. రన్‌పై పరుగులు తీశారు. మంటలు వ్యాపించిన సమయంలో విమానంలో 173 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Landing gear bursts into flames on American Airlines plane at Denver airport. One person was injured. pic.twitter.com/VQlOAkQQwp— Pop Crave (@PopCrave) July 27, 2025విమానం నుంచి దట్టమైన పొగలు వస్తున్న సమయంలో పలువురు ప్రయాణికులు ఒక చేత్తో తమ పిల్లలు.. మరోచేత్తో తమ లగేజీతో స్లయిడ్‌పై నుంచి జారుతూ కిందకు వచ్చారు. ఈ ఘటనపై డెన్వర్ విమానాశ్రయం, అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటన విడుదల చేశాయి. ఈ ఘటనలో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే గాయాలయ్యాయి. సదరు వ్యక్తికి మొదట ప్రథమ చికిత్స చేసి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులను అందరినీ బస్‌లో టెర్మినల్‌కు తరలించారు. విమానం టైర్‌కు సంబంధించిన నిర్వహణ విషయంలో ఇప్పటికీ హెచ్చరికలు చేసినట్లుగా ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఈ ఘటన తర్వాత సర్వీస్ నుంచి తొలగించి, దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో విమానాశ్రయంలోని రన్‌వేపై కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. విమానాన్ని రన్ వే నుంచి తొలగించిన తర్వాత మళ్లీ రాకపోకలు మొదలయ్యాయి.🚨EMERGENCY AT DENVER AIRPORT: An American Airlines Boeing 737 Max 8 was forced to evacuate passengers after its landing gear caught fire during landing.Why always Boeing?pic.twitter.com/FT5tLeqtOr— 𝗗𝗼𝗻𝗮𝗹𝗱𝗼 𝗧𝗿𝘂𝗺𝗽ø 🇺🇲 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 (@TrumpUpdateHQ) July 27, 2025There was a plane on fire at Denver airport today.Here's a woman who was nearly in a plane crash yesterday explaining her experience.pic.twitter.com/YCDMPPi4YF— Owen Shroyer (@OwenShroyer1776) July 27, 2025 -
థాయ్, కంబోడియా శాంతి చర్చలకు గ్రీన్‌సిగ్నల్: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: థాయ్‌ల్యాండ్-కంబోడియా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఆగ్నేయాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలను తన మధ్యవర్తిత్వంతో విరమింపజేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలకు త్వరలోనే ముగింపు పడనుందని ట్రంప్ చెప్పారు. ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణ చర్చలకు అంగీకరించాయని వెల్లడించారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా.. కాల్పుల విరమణకు సంబంధి కంబోడియా ప్రధాని హున్ మానెట్, థాయ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్ వెచాయాచాయ్‌లతో మాట్లాడానని.. ఇరువురు తక్షణ కాల్పుల విరమణకు, శాంతి నెలకొల్పేందుకు అంగీకరించారని చెప్పారు. వారు వెంటనే సమావేశమై చర్చించేందుకు సమ్మతించారన్నారు. అయితే ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తారు, శాంతి చర్చలు ఎక్కడ జరుగుతాయని వివరాలను ఆయన వెల్లడించలేదు. కాగా, కాల్పుల విమరణకు సూత్రప్రాయంగా సుముఖతను వ్యక్తం చేసినట్లు థాయ్‌లాండ్ తాత్కాలిక ప్రధాని ఫేస్బుక్ వేదికగా వెల్లడించారు. అయితే కంబోడియా నిజాయితీగా వ్యవరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఘర్షణలు ఇలాగే కొనసాగితే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ప్రమాదంలో పడతాయని ఇద్దరినీ హెచ్చరించానని వెల్లడించారు.ఇక, ఇటీవలి కాలంలో పలు దేశాల మధ్య యుద్ధాల విషయంలో ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపిన ట్రంప్.. తన మధ్యవర్తిత్వంతోనే పాక్, భారత్ మధ్య కాల్పులు నిలిచాయని పదేపదే చెప్పారు. అనంతరం, భారత ప్రధాని మోదీ ప్రకటనతో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.Donald J. Trump Truth Social 07.26.25 12:23 PM EST pic.twitter.com/QB03NMNe9G— Fan Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) July 26, 2025ఇదిలా ఉండగా.. థాయ్‌ల్యాండ్, కంబోడియా మధ్య ఘర్షణలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ 33 మంది మరణించారు. దాదాపు 1.68 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సరిహద్దు వెంబడి ఉన్న అనేక గ్రామాల్లో దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. దాడుల్లో ఎఫ్-16 విమానాలు, డ్రోన్లను కూడా వినియోగించినట్టు అధికారులు తెలిపారు. గత గురువారం సరిహద్దులో ఒక మందుపాతర పేలి ఐదుగురు థాయ్‌ల్యాండ్ సైనికులు గాయాలపాలు కావడం ఈ సంఘర్షణకు దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాలూ పరస్పరం దౌత్య సిబ్బందిని ఉపసంహరించాయి. కంబోడియాలో తాజాగా 12 మరణాలు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 13కు చేరింది. ఈ పోరాటాన్ని నిలుపుదల చేయాల్సిందిగా ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియన్)పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. తమ దేశ సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 37,635 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని కంబోడియా సమాచార మంత్రి నెత్ ఫియాక్ట్రా వెల్లడించారు. -
ఇక చాలు.. గాజాలో పని ముగించండి
గాజాలో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్‌ను ఉధృతం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్‌ను కోరారు. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ సంస్థ తిరస్కరించింది. ఈ పరిణామంతో రగిలిపోయిన ట్రంప్.. ఆ సంస్థ కథ ముగించాల్సిందేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.స్కాట్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మా ప్రతిపాదనే తిరస్కరిస్తారా?. వాళ్లకు(హమాస్) ఒప్పందం చేసుకోవాలనే ఆలోచన నిజంగా లేనట్లు ఉంది. వాళ్లు చావాలనుకుంటున్నారేమో. గాజాలో దాడులను ఉధృతం చేయండి. ప్రక్షాళన చేయండి’’ అంటూ ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి పిలుపు ఇచ్చారాయన.హమాస్ ఒప్పందానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే వారు శాంతికి కాకుండా హింసకు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు చివరి బంధీల వద్దకు వచ్చాం. వాళ్లు ఒప్పందం చేయాలనుకోవడం లేదు. వాళ్లను వేటాడాల్సిందే అని ట్రంప్ అన్నారు.ట్రంప్ తరఫున పశ్చిమాసియా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్.. ఇజ్రాయెల్- హమాస్ చర్చల నుంచి వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటిరోజే ట్రంప్ విరుచుకుపడడం గమనార్హం. విట్కాఫ్ ప్రకారం.. ప్రస్తుతానికి ఈ చర్చల నుంచి అమెరికా వెనక్కి తగ్గుతోంది. శాంతి ఒప్పందం పట్ల హమాస్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. కొత్త వ్యూహాం కోసం దోహా నుంచి తిరిగి వాషింగ్టన్ వెళ్తునట్లు తెలిపారాయన.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ పాలనను ముగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే.. హమాస్ నేత బాసెమ్ నైమ్ మాత్రం, చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయి అని పేర్కొన్నారు. విట్కాఫ్ వ్యాఖ్యలు కేవలం ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఒత్తిడి కలిగించేందుకు చేసినవని విమర్శించారు. మరోవైపు.. మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్ కూడా చర్చలు సానుకూలంగానే సాగుతున్నట్లు చెబుతున్నాయి. చర్చల్లో కొంత పురోగతి సాధించామని, చర్చలు నిలిపివేయడం సాధారణ ప్రక్రియ అని, అమెరికాతో కలిసి కాల్పుల విరమణ కోసం కోసం ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పారు.ఇక.. గాజాలో మానవతా సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆహార కొరత, బాలలలో పోషకాహార లోపం, వందల మంది ఆకలితో మరణించడంలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. UNICEF, UNRWA వంటి సంస్థలు తక్షణ సహాయం అవసరం అని హెచ్చరిస్తున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం ఆహారం సరిపడా పంపించామని, ఐరాసనే సరైన పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తోంది. -
వీసాల ఆలస్యాన్ని పట్టించుకోండి
న్యూఢిల్లీ: అమెరికా విద్యార్థి వీసాల జారీలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని ఆ దేశ ఉన్నతాధికార వర్గాల దృష్టికి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లింది. కొంతకాలంగా విద్యార్థి వీసా దరఖాస్తుల స్క్రీనింగ్ తదితరాలను అమెరికా కఠినతరం చేయడం తెలిసిందే. దాంతో వీసా అపాయింట్మెంట్లు పొందడమే విద్యార్థులకు చాలా కష్టంగా మారిపోయింది. ఫలితంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ అమెరికా విదేశాంగ శాఖ వర్గాలతో, ఢిల్లీలోని ఆ దేశ దౌత్య కార్యాలయంతో దీనిపై లోతుగా చర్చించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌సింగ్ ఈ మేరకు వెల్లడించారు. భారత విద్యార్థుల ఆందోళనలను ఎప్పటికప్పుడు అమెరికా దృష్టికి తీసుకెళ్తున్నట్టు ఆయన వివరించారు. శుక్రవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత సమాధానమిచ్చారు. అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించేవారు తదితరులను దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు అన్నిరకాల చర్యలూ తీకుంటున్నట్టు జూన్ 18న విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసిందని మంత్రి గుర్తు చేశారు. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి వీసాల జారీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి 14 మంది భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యుల బృందం కూడా కృషి చేస్తోంది. దెబోరా రాస్ వీరికి నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారత విద్యార్థుల వాటా ఏటా 900 కోట్ల డాలర్ల మేరకు ఉంటుందని ఆమె అన్నారు. అంతేగాక పరిశోధనలు, ఇన్నొవేషన్లలో వారిది కీలక పాత్ర గుర్తు చేశారు. కొత్త వీసాల జారీని ఆపేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా కాన్సులేట్లన్నింటినీ ట్రంప్ సర్కారు గత మేలో ఆదేశించడం తెలిసిందే. రెండు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు విద్యార్థి వీసాల ప్రాసెసింగ్ గత నెల మొదలైంది. కొత్త నిర్దేశకాల ప్రకారం వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ కార్యకలాపాలు, సోషల్ మీడియా ఖాతాల తనిఖీ (వెట్టింగ్)ను అమెరికా పెద్ద ఎత్తున చేపట్టింది. ఇందుకు వీలుగా సోషల్ ఖాతాల వివరాలను పబ్లిగ్గా అందుబాటులో ఉంచాల్సిందిగా ఆశావహులందరికీ సూచించింది.అక్రమ వలసలపై... అమెరికాలోకి అక్రమ వలసలు, మనుషుల అక్రమ రవాణా కట్టడిలో ఆ దేశ ప్రభుత్వంతో నిరంతరం టచ్‌లో ఉన్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా కీర్తివర్ధన్ సింగ్ రాజ్యసభకు వివరించారు. వాటికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ–మైగ్రేట్ పోర్టల్, సోషల్ మీడియా హ్యాండిళ్లు తదితరాల ద్వారా ఈ విషయంలో విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు అడ్వైజరీలు జారీ చేస్తున్నట్టు చెప్పారు. -
పాలస్తీనాకు మద్దతుగా ఫ్రాన్స్
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ పాలస్తీనాకు మద్దతుగా నిలిచారు. ఆ దేశ సార్వభౌమత్వాన్ని ఫ్రాన్స్ గుర్తిస్తుందని మాక్రాన్ చెప్పారు. ఈ విషయాన్ని సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అధికారికంగా ప్రకటిస్తానన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. గాజాలో యుద్ధం ఆగిపోవడం, అక్కడి జనాభాను ఆకలి నుంచి రక్షించడమే ప్రస్తుతం మన ముందున్న అత్యవసర కర్తవ్యమని పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు జరిగిన వెంటనే ఆయన ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చారు. యూదు వ్యతిరేకతను ఖండించారు. ఆ తరువాతి కాలంలో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం, రానురాను పెరిగిన సంక్షోభం పట్ల ఆయన తీవ్ర నిరాశ చెందారు. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తామని గతంలో పలుమార్లు చెప్పిన ఆయన.. తాజాగా పునరుద్ఘాటించారు. నిర్లక్ష్యపూరిత నిర్ణయం: అమెరికాపాలస్తీనా పట్ల ఫ్రాన్స్ తీరును అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించాయి. ఇది హమాస్ ప్రచారానికి ఉపయో గపడే నిర్లక్ష్య పూరిత నిర్ణయ మని విదేశాంగ మంత్రి మార్కో రూబి యో అన్నారు. ‘‘యూ ఎన్ జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా రాజ్యాన్ని గు ర్తించాలనే మాక్రాన్ ప్ర ణాళికను అమెరికా తిరస్కరిస్తుంది. ఈ నిర్లక్ష్య నిర్ణయం హమా స్ ప్రచా రానికి ఉపయో గపడుతుంది. శాంతిని దెబ్బ తీస్తుంది’’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఫ్రాన్స్ తీరు సిగ్గుచేటు: ఇజ్రాయెల్ఇక మాక్రాన్ ప్రకటనపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలస్తీనాను గుర్తించడమంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమేనని, ఇది ఇజ్రాయెల్ అస్తిత్వానికి ముప్పు కలిగిస్తుందని ప్రధాని బెంజమిన్ నెతాన్యాహూ అన్నారు. గాజా ఇజ్రాయెల్‌ను నిర్మూలించే లాంచ్ ప్యాడ్ అవుతుందని, దాని పక్కన శాంతియుతంగా జీవించలేమని తెలిపారు. ఫ్రాన్స్ నిర్ణయం సిగ్గుచేటని ఇజ్రాయెల్ ఉప ప్రధాని యారివ్ లెవిన్ అన్నారు. అది ఫ్రెంచ్ చరిత్రపై ఒక నల్ల మచ్చని, ఉగ్రవాదానికి నేరుగా సహాయమందించడమని చెప్పారు. తాము ఆక్రమించిన వెస్ట్ బ్యాంక్‌కు ఇజ్రాయెల్ సార్వభౌమత్వాన్ని వర్తింపజేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. స్వాగతించిన హమాస్.. ఫ్రాన్స్ ప్రకటనను పాలస్తీనియన్ అథారిటీ సీనియర్ అధికారి హుస్సేన్ అల్–షేక్ స్వాగతించారు. ఇది అంతర్జాతీయ చట్టాల పట్ల ఫ్రాన్స్ నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కులకు, రాజ్య స్థాపనకు మద్దతివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాలస్తీనా గుర్తింపు విషయంలో ప్రపంచంలోని అన్ని దేశాలు, యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్‌ను అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు. -
మోజు తగ్గుతోంది.. మొగ్గు మారుతోంది..!
విదేశాల్లో చదువు కోవడం అంటే భారత విద్యార్థులకు మోజు.. అందులోనూ అమెరికా, కెనడా, యూకే వంటి దేశాల్లో చదవడం అంటే అది మరింత క్రేజు. మరి ఇప్పుడు భారత విద్యార్థుల అభిరుచి మారిందా? అంటే అవుననక తప్పదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విదేశాల్లో చదవడం కష్టతరంగా మారింది. ప్రధానంగా వీసా నిబంధనలు కఠినతరం కావడం, ఖర్చులు పెరగడం వంటి తదితర కారణాలతో భారత విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆసక్తి తగ్గిపోతోంది. అదే సమయంలో భారతదేశంలోనే మెరుగైన అవకాశాలు లభించడం వంటి కారణాలతో విదేశాల్లో చదువుకు వెనకడుగు వేస్తున్నారు. విదేశాల్లో భారత విద్యార్థుల చదువుల అంశానికి సంబంధించి పలు నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. యూఎస్, యూకేను వదిలేద్దాం..!గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య గణనీయకంగా తగ్గింది. 2023 నాటికి విదేశాల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య 8.92 లక్షలు ఉండగా, అది 2024 నాటికి 7.59 లక్షలకు తగ్గింది. దీనికి కారణాలు మాత్రం ప్రధానంగా అగ్రదేశాలైన యూఎస్ఏ, యూకే, కెనడాల్లో చదవాలనే కోరిక ఒకటి. అయితే ఈ దేశాల్లో వీసాల నిబంధనలు కఠినతరంగా మారాయి. దాంతో అమెరికా, యూకే, కెనడాలపై దృష్టి పెట్టడం లేదు. దాంతో విదేశాల్లో చదవాలనుకునే భారత్ విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఇదొక కారణంగా మారింది. ప్రస్తుతం పలువురు విద్యార్థుల మాత్రమే యూఎస్, యూకేలపై దృష్టి సారిస్తుండగా, అధిక శాతం మంది మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో కొంతమంది భారత్‌లోనే ఉన్నత చదువులకు ఆసక్తి చూపిస్తుండగా, మరి కొంతమంది మాత్రం వీసా నిబంధనలు సులభతరంగా ఉండి ఫీజులు తక్కువగా ఉండే దేశాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.కెనడా అసలే వద్దు..!గతంలో అమెరికాలో చదువు కోవడానికి వీలు లేకపోతే, కెనడా వైపు దృష్టి సారించే వారు అధిక శాతం మంది భారత విద్యార్థులు. అయితే జస్టిన్ ట్రూడో హయాంలో భారత్-కెనడా దౌత్స సంబంధాలు దెబ్బ తినడంతో పాటు అక్కడ వీసా నిబంధనలు కూడా కఠినతరంగా మారాయి.ట్రూడో హయాంలో వీసా పరిమితులు, ఎస్డీఎస్ (Student Direct Stream ప్రోగ్రాం రద్దు, వర్క్ పరిమితులు వంటి మార్పులు భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఒక విషయాన్ని గమనిస్తే 2023లో 2.33 లక్షల మంది విద్యార్థులు కెనడా వెళ్లగా, 2024లో అది కాస్తా1.37 లక్షలకు పడిపోయింది. అంటే కెనడా అసలే వద్దు అనే నిర్ణయానికి అధిక శాతం భారత విద్యార్థులు వచ్చారనేది ఈ గణాంకాల్ని బట్టి అర్ధమవుతోంది.బంగ్లా, ఉజ్బెకిస్థాన్‌లో ఉన్నత చదువులు..విదేశాల్లో చదువాలనుకునే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఒకటైతే, అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లడానికి వీసా తదితర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో బంగ్లదేశ్, ఉజ్భెకిస్తాన్, సింగపూర్, రష్యా వైపు మొగ్గు చూపిస్తున్నారు. 2023లో 20,368 మంది భారత విద్యార్థులు బంగ్లాదేశ్ వైపు మొగ్గు చూపగా, మరుసటి ఏడాదికి అది కాస్త పెరిగి 29,232కు చేరింది. 2023 నాటికి ఉజ్బెకిస్థాన్‌లో చదువుకునే భారత విద్యార్థుల సంఖ్య 6, 601 ఉంగా, అది 2024 నాటికి 9,915 చేరింది. ఇక 2023లో రష్యా వైపు 25,503లో భారత విద్యార్థులు ఆసక్తి చూపగా, 2024 నాటికి 31,444 విద్యార్థులకు చేరింది. ఇక సింగపూర్ విషయానికొస్తే ఏడాదిలో 12,000 నుంచి 14,000 మంది విద్యార్థులకు చేరింది. ఎందుకీ మార్పు..?అసలు విదేశాల్లో చదువు అనేది భారీ ఖర్చుతో కూడుకున్నదైతే, అందులో వీసా తదితర నిబంధనల్లో భారీగా మార్పులు చేయడం మరొకటి. ఇది ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తోంది. యూఎస్, యూకే, కెనడాల్లోనే వీసా నిబంధనల్లో కఠినమైన మార్పులు వచ్చాయి. దాంతో ‘ ఎందుకీ తలనొప్పి’ అని భావించే చిన్న దేశాల వైపు చూస్తున్నారు. తక్కువ ఖర్చుతో మెడికల్, టెక్నికల్ విద్య పూర్తి చేసే అవకాశాలు అధికంగా ఉండటంతో పాటు వీసా ప్రక్రియ సులభతరంగా ఉండటం మరొక కారణం. భారతీయ విద్యార్థులకు అనుకూలమైన కోర్సులు కూడా ఆయా దేశాల్లో ఉండటం కూడా ప్రత్యామ్నాయంగా వాటివైపు చూడటానికి ప్రధానమైన అంశంగా మారింది ఇక భద్రత పరంగా కూడా అక్కడ పెద్దగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉండవని భావించే బంగ్లాదేశ్, సింగపూర్, రష్యా, ఉజ్బెకిస్థాన్ తదితర దేశాల వైపు చూడటానికి మరొక కారణంగా చెప్పవచ్చు. -
తొమ్మిది కాదు.. ఐదో నెలలోనే పుట్టేశాడు.. వండర్ బేబీ!
సాధారణంగా ఏడో నెల్లోనే శిశువులు పుట్టడం గురించి వినే ఉంటాం. వాళ్లను ప్రి మెచ్యూర్ బేబీలుగా పిలుస్తుంటారనే విషయం తెలిసిందే. సాధారణంగా 32 నుంచి 37 వారాల మధ్య పుడితే ప్రిమెచ్యూర్ అంటారు. అదే 28 నుంచి 32 వారాల మధ్య అయితే వెరీ ప్రిమెచ్యూర్ అంటారు. ఇవేమి కాకుండా అంతకు మించి.. 28 వారాలకు ముందుగానే ప్రసవించిన శిశువుని ఎక్స్ట్రీమ్ ప్రిమెమెచ్యూర్ బేబి అంటారు. ఇలాంటి శిశువులు చాల రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వాళ్లని కాపాడటం వైద్యులకు అత్యంత సవాలుగా ఉంటుంది. అలా పుట్టి బతికి బట్టకట్టి రికార్డు నెలకొల్పి సెలబ్రిటీ హోదాను అందుకున్నాడు ఈ వండర్ కిడ్. అంతకుమునుపు ఉన్న శిశువు పేరిట రికార్డుని ఒక్క రోజు తేడాతో బ్రేక్ చేసీ ఈ ఘనతను అందుకున్నాడు. అమెరికాలోని అయోవా నగరంలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అయోవ నగరంలో జూలై 05, 2024లో మోలీ, రాండాల్ కీన్ అనే దంపతులకు నాష్ కీన్ అనే మగ శిశువు జన్మించాడు. ప్రసవ తేదీకి ముందుగా 133 రోజులు అంటే సుమారు 19 వారాల ముందు జన్మించాడు. తల్లిదండ్రుల సైతం అతడి అనూహ్య జననానికి నివ్వెరపోయారు. తమ బిడ్డ బతుకుతాడా లేదా అన్న ఆశ నిరాశల మధ్య తల్లడిల్లిపోయారు తల్లిదండ్రులు. ఆ చిన్నారి పుట్టినప్పడు కేవల 10 ఔన్సులు బరువుతో జన్మించాడు. చెప్పాలంటే ద్రాక్షపండంతా పరిమాణం. నాష్ పొటాటోగా పిలిచే ఆ శిశువుకి అయోవా చిల్డ్రన్స్ హాస్పిటల్ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి అత్యంత జాగ్రత్తగా చికిత్స అందించింది. అక్కడే ఆరు నెలల వైద్య సంరక్షణలో ఉన్నాడు. పాపం ఆ తల్లిదండ్రలు తమ బిడ్డ తమకు దక్కుతాడా లేదా అన్న భయంతో కాలం వెళ్లదీశారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించి వారి బిడ్డ బతికిబట్టకట్టడమే గాక ఈ ఏడాది తొలిపుట్టిన రోజు జరుపుకున్నాడు. అప్పటి వరకు ఆ శిశువు ఆస్పత్రిలో మానిటర్లు, వైర్లు మధ్యే గడిపాడు. ఈ చిన్నారి నాష్ 20 వారాల ప్రినేటల్ చెకప్ అనంతరం డెలివరీ చెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడిందని నాటి చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది తల్లి మోలీ. అలా మొత్తం ఆరు నెలల చికిత్స అనంతరం 2025 జనవరి ప్రారంభంలో ఇంటికి వెళ్లేందుకు అనుమతి లభించినట్లు తెలిపారామె. అప్పటి నుంచి క్రమంగా పుంజుకుంటుం సాధారణ చిన్నారిలా రూపుదిద్దుకున్నాడని అన్నారు. అయినప్పటికీ..ఆ శిశువుకి ప్రత్యేక వైద్య సహాయం తప్పనిసరి. ఎందుకంటే అతనకు ఇంకా ఆక్సిజన్ తీసుకుంటున్నాడు, స్వల్ప వినికిడి సమస్య, ఫీడింగ్ ట్యూబ్ ఉంది. ప్రతి నెల ప్రత్యేక వైద్య డేకేర్‌కి వెళ్లి చికిత్స తీసుకుంటుంటాడు. "అసలు ఇలా ఇంతముందు జన్మించాడే అనే ఆ రోజు తల్లడిల్లా. బహుశా అదే వాడికి సెలబ్రిటీ హోదాని అచ్చి అందరి ఆశీర్వాదం పొందేలా చేసిందని భావోద్వేగంగా చెబుతోంది". ఆ చిన్నారి తల్లి. కాగా, 2020లో అలబామాలో 21 వారాల్లో జన్మించి ఒక చిన్నారి గిన్నిస్ రికార్డులకి ఎక్కగా..దాన్ని కేవలం ఒక్క రోజు తేడాతో ఈ చిన్నారి నాష్ బ్రేక్ చేసి రికార్డునే తిరగరాశాడు. (చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ కిచెన్ మనదేశంలోనే..! రోజుకి ఏకంగా..) -
మాక్రాన్‌పై ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా ఆగ్రహం
పాలస్తీనాను దేశంగా గుర్తించాలన్న ఫ్రాన్స్ నిర్ణయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా తప్పుబట్టాయి. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇప్పటికే ఈ నిర్ణయం తీసేసుకోగా.. సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే..మాక్రోన్ నిర్ణయాన్ని ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా ఖండించాయి. ఇది అక్టోబర్ 7వ తేదీ నాటి బాధితులకు ద్రోహం చేయడంలాంటిదేనని అమెరికా విదేశాంగ కార్యదర్శి మాక్రో రుబియో అన్నారు. మాక్రోన్ నిర్ణయాన్ని సిగ్గుచేటుగా పేర్కొన్న రుబియో.. ఇది హమాస్‌కు అనుకూలంగా ఉందంటూ మండిపడ్డారు.ఐరాస సాధారణ అసెంబ్లీలో పాలస్తీనాకు దేశం గుర్తింపు కోసం ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేస్తున్న ప్రయత్నాలు ఖండించదగ్గవి. 2023 అక్టోబవర్ 7వ తేదీన ఇస్లామిక్ గ్రూప్ హమాస్ దాడులతోనే గాజాకు ఈ పరిస్థితి వచ్చింది. అలాంటి సంస్థకు మద్దతుగా ఫ్రాన్స్ నిర్ణయం ఉంది. ఇది సిగ్గుచేటు అని రుబియో ట్వీట్ చేశారు.The United States strongly rejects @EmmanuelMacron’s plan to recognize a Palestinian state at the @UN general assembly. This reckless decision only serves Hamas propaganda and sets back peace. It is a slap in the face to the victims of October 7th.— Secretary Marco Rubio (@SecRubio) July 25, 2025మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ పాలస్తీనాకు దేశం గుర్తింపు ఇవ్వడమంటే.. అది ఉగ్రవాదానికి బహుమతి ఇచ్చినట్లేనని అన్నారు. పైగా ఇది ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించే అంశమేనని అభిప్రాయపడ్డారాయన.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 142 దేశాలు పాలస్తీనాకు దేశం గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే యూరప్ దేశం నుంచి ఈ డిమాండ్ చేస్తున్న పవర్ఫుల్ దేశంగా ఇప్పుడు ఫ్రాన్స్ ఈ జాబితాలో నిలిచింది.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. తీవ్ర మానవ సంక్షోభం తలెత్తడంపై ఇప్పటికే పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు దాడులు.. మరోవైపు సాయం అందకుండా ఈ పరిస్థితికి ఇజ్రాయెల్ కారణమైందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది(ఫ్రాన్స్ కూడా ఇదే గళం వినిపిస్తోంది). అయితే ఇజ్రాయెల్ మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది. ఈ తరుణంలో ఫ్రాన్స్ నిర్ణయం ఆసక్తికర పరిణామాలకు దారి తీసే అవకాశం లేకపోలేదు. -
సీఈవోతో సరసాల ఎపిసోడ్లో కీలక మలుపు
వాషింగ్టన్: ప్రముఖ మ్యూజిక్ కాన్సర్ట్ ‘కోల్డ్ ప్లే’ ఎపిసోడ్లో మరో కీలక మలుపు తిరిగింది. కంపెనీ మాజీ సీఈవో ఆండీ బైరాన్‌ను కౌగిలించుకున్నందుకు అమెరికా టెక్ సంస్థ ఆస్ట్రానమర్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ కాబోట్‌ను సైతం సంస్థ బయటకు సాగనంపింది. సంస్థ పరువు తీశారంటూ ఆమెతో బలవంతంగా రాజీనామా చేయించింది. ఈ క్రమంలో హ్యూమన్ రిసోర్స్ చీఫ్ కాబోట్ ఇప్పుడు తమ కంపెనీలో లేరని, రాజీనామా చేశారంటూ ఆస్ట్రానమర్ ఓ ప్రకటనలో తెలిపింది. గత బుధవారం మాసెచూసెట్స్ స్టేట్ బోస్టన్లోని గిల్లెట్ స్టేడియంలో కోల్డ్ ప్లే కాన్సర్ట్ జరిగింది. ఆ కాన్సర్ట్‌లో ఆస్ట్రానమర్ సీఈవో ఆండీ బిరాన్,హెచ్ఆర్ హెడ్ క్రిస్టిన్ కాబోట్‌లు హాజరయ్యారు. అయితే,కాన్సర్ట్ జరిగే సమయంలో ఆండీ, క్రిస్టెన్ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో వారిపై స్పాట్ లైట్ పడడం, ఆ దృశ్యం పెద్దస్క్రీన్లో కనిపించడంతో వారి ప్రేమాయణం బయటపడింది. సీఈవో వ్యవహారం ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదని నెటిజన్లు చురకలు వేయగా... విడాకులు ఇవ్వనున్నట్లు ఆయన భార్య సంకేతాలిచ్చింది.సంస్థ ఆస్ట్రానమర్ ఆండీని పదవి నుంచి బలవంతంగా తొలగించింది. సీఈవో బాధ్యతల్ని మరొకరికి అప్పగించింది. అవమానం భారం తట్టుకోలేని ఆండీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో హెచ్ఆర్ హెడ్ క్రిస్టెన్ కబోట్ సైతం సంస్థకు రాజీనామా చేయడం టెక్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. Andy Byron, CEO of Astronomer, was caught at a Coldplay concert apparently having an affair with the company’s CPO, Kristin Cabot.Both Byron and Cabot are married to other people.Most awkward moment of 2025?pic.twitter.com/bVOTq6XgF8— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) July 17, 2025 -
పత్రాలన్నీ వెంట ఉండాల్సిందే
వాషింగ్టన్: అసలు కంటే కొసరు పనే ముఖ్యమన్న తరహా లో అమెరికా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎలాగూ వీసా నిబంధనలు, ఎయిర్‌పోర్ట్‌లో క్షుణ్ణంగా తనిఖీలు దాటుకొని అమెరికాలోకి అడుగుపెట్టినా దాదాపు ప్రతి ఒక్క అమెరికాయేతర వ్యక్తులంతా ఎక్కడ పడితే అక్కడ అధికారులు అడిగే అన్ని రకాల డాక్యుమెంట్లను చూపించాల్సిందేనని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్స్(సీబీపీ) విభాగం హెచ్చరికలు జారీచేసింది. గ్రీన్‌కార్డ్ సాధించిన వ్యక్తులు సహా అమెరికా పౌరసత్వం పొందని వారంతా నిరంతరం తమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను తమ వెంటేసుకుని తిరగాల్సిందేనని సీబీపీ పే ర్కొంది. అధికారులు అడిగినప్పుడు చూపించకపోతే జరిమానా ముప్పు తప్పదని, కొన్ని సార్లు అత్యల్పస్థాయి నేరాభియోగాలను సైతం ఎదుర్కో వాల్సిఉంటుందని సీబీపీ హెచ్చరించింది. 18 ఏళ్లు, ఆపైబడిన వారందరికీ ఇదే నియమం వర్తించనుంది. దీంతో విద్య, ఉద్యోగాల కోసం వచ్చే భారతీ యులు, వారి వెంట వచ్చే కుటుంబసభ్యులు, చిన్నారులకు కొత్త సమస్య వచ్చిపడింది. సినిమా, షాపింగ్, పార్క్, హోటల్, ఆస్పత్రి, రైల్వేస్టేషన్.. ఇలా ఎక్కడికి వెళ్లినా ముఖ్యమైన రిజిస్ట్రేషన్ పత్రా లు పట్టుకెళ్లడమంటే ఎంతో ఇబ్బందితో కూడిన వ్యవహారం. అక్రమంగా వలసవచ్చారని ఏ క్షణాన ఎవరిపై అనుమానం వచ్చినా వెంటనే అధికారులు సోదాలు, తనిఖీలుచేసేందుకు వీలుగా విదేశీయు లకు ఈ అడ్వైజరీని జారీచేసినట్లు సీబీపీ తెలిపింది. -
ట్రంప్ ఎఫెక్ట్ : కేన్ షుగర్ కోకా కోలా కమింగ్ సూన్
కోకా-కోలా తన ట్రేడ్‌మార్క్ కోకా-కోలా లైనప్‌ను విస్తరింపజేస్తూ అమెరికా మార్కెట్ కోసం అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌కు బదులుగా చెరకు చక్కెరతో తయారు చేసిన కేన్ షుగర్ కోకా కోలా సాఫ్ట్ డ్రింక్‌ను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కంపెనీ రెండవ త్రైమాసిక ఆదాయాలప్రకటన సందర్బంగా ఈ విషయాన్ని ప్రకటించింది. డైట్ కోక్ అభిమానిగా పేరుగాంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తర్వాత కోకా-కోలా అమెరికాలో కేన్ షుగర్ కోక్‌ను ప్రారంభించినట్లు ధృవీకరించింది.గత వారం అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో నిజమైన చెరకు చక్కెరతో చేసిన కోక్కోసం కోకా-కోలాను ఒప్పించానని పేర్కొంటూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. జూలై 16న ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన పోస్ట్‌లో తాను దీనిపై తాను కోకా-కోలాతో మాట్లాడుతున్నానని, వారు అలా చేయడానికి అంగీకరించారని" తెలిపారు.మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలకు అమెరికా మొక్కజొన్న పరిశ్రమనుంచి సహా మిశ్రమ స్పందనలు వచ్చాయి.అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌ను చెరకు చక్కెరతో భర్తీ చేయడం సమంజసం కాదు. అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్ తయారీ ఉద్యోగాలు, అమెరికన్ రైతులు , వాణిజ్య లోటును తగ్గించడంకోసమే ఉన్నారంటూ కార్న్ రిఫైనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు , CEO జాన్ బోడే విమర్శించారు. అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌ను చెరకు చక్కెరతో భర్తీ చేయడం వల్ల వేలాది అమెరికన్ ఆహార తయారీ ఉద్యోగాలు తగ్గిపోతాయి. వ్యవసాయ ఆదాయం తగ్గుతుంది ,విదేశీ చక్కెర దిగుమతులు పెరుగుతాయన్నారు.ఇదీ చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పట్టుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవంకాగా కోకా-కోలా మొదట తన అన్ని పానీయాలలో చెరకు చక్కెరను ఉపయోగించేది. కానీ 1984లో చక్కెర ధరలు పెరగడంతో అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌కు మారిందని ఫార్చ్యూన్ తెలిపింది. సాధారణంగా "మెక్సికన్ కోక్" అని పిలువబడే చెరకు చక్కెర కోకా-కోలా, మెక్సికో నుండి దిగుమతుల ద్వారా అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే అందుబాటులో ఉంది, అక్కడ దీనిని గాజులో బాటిల్ చేసి సాంప్రదాయ తీపి పద్ధతులను ఉపయోగించి తయారు చేస్తారు.చదవండి: ఏనుగులంటే ప్రాణం : కానీ మల్టీ మిలియనీర్ని ఏనుగే తొక్కేసింది! -
భారతీయులకు ఉద్యోగాలు ఆపండి
న్యూయార్క్/వాషింగ్టన్: విపరీతమైన వీసా ఆంక్షలు అమలుచేస్తూ, సోషల్‌మీడియా ఖాతాలను జల్లెడపడుతూ వీలైనంతవరకు భారతీయులను అమెరికా గడ్డపై కాలుమోపకుండా అడ్డు తగులుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు నేరుగా అక్కడి కంపెనీలకే ఆదేశాలు ఇచ్చేందుకు తెగించారు. చట్టబద్ధంగా, అత్యంత నైపుణ్యముండి వీసాలతో అమెరికాకొస్తున్న భారతీయులను కాదని, అమెరికన్లకే కొలువుల్లో పట్టంకట్టాలని ట్రంప్ అక్కడి టెక్ దిగ్గజ సంస్థలకు హితవు పలికారు. బుధవారం వాషింగ్టన్లో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ పాల్గొని ప్రసంగించారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలనుద్దేశిస్తూ సూటిగా సూచనలు ఇచ్చారు. ‘‘ వేర్పాటు వాదంలాంటి ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) భావాజలంలో మన అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు కొట్టుకుపోతున్నాయి. గ్లోబలైజేషన్ కోసం పరితపిస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీలన్నీ కోట్లాది మంది అమెరికన్ల విశ్వాసాన్ని కోల్పోయి కృతçఘ్నులుగా తయారవుతున్నాయి. మీరు తోటి అమెరికన్ల పట్ల తీవ్ర నిర్లక్ష ధోరణిని కనబరుస్తున్నారు. అమెరికాలో లభించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఇక్కడి కంపెనీలు చైనాలో భారీ ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నాయి. భారత్ నుంచి తక్కువ జీతభత్యాలకు ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఐర్లాండ్‌లో నష్టాలు వస్తున్నాయన్న సాకుతో ఇక్కడ లాభాలను తక్కువచేసి చూపిస్తూ పన్నుల భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇవన్నీ చేస్తూ మీ తోటి అమెరికన్పౌరుల ఉద్యోగ హక్కులను కాలరాస్తున్నారు. ఇక నా హయాంలో మీ ఆటలు సాగవు. అమెరికా టెక్నాలజీ సంస్థలన్నీ మన దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలి. ఫ్యాక్టరీల కల్ప నలో, ఉద్యోగాల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యం దక్కాలి. ఇకనైనా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం ఆపండి. అమెరికన్లకు ఉపాధి కల్పించండి. మిమ్మల్ని నేను అడిగేది ఇదొక్కటే. ఈ పని మీరు ఖచ్చితంగా చేస్తారనే భావిస్తున్నా’’ అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.#WATCH | Trump promises to bring tech jobs back home, slamming US firms for outsourcing to China and hiring Indian workers abroad.#DonaldTrump #UnitedStates #China #India pic.twitter.com/p2KLKkDqj9— News18 (@CNNnews18) July 24, 2025 ట్రంప్ వ్యాఖ్యలు.. భారతదేశంపై ప్రభావంట్రంప్ వ్యాఖ్యలు అమెరికా-భారత టెక్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇండియన్ IT ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ రంగం పై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది.“No more Indian workers” అని ట్రంప్ స్పష్టంగా హెచ్చరించారు.Apple, Google, Tesla వంటి కంపెనీలు భారతదేశం లో ఉద్యోగాలు ఇవ్వడం పై 25% టారిఫ్ విధించవచ్చని హెచ్చరిక జారీ చేశారు. -
రీఎంట్రీలో దుమ్ములేపుతున్న స్టార్ ప్లేయర్
వాషింగ్టన్: సుదీర్ఘ విరామం తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్‌లో పునరాగమనం చేసిన అమెరికా దిగ్గజం వీనస్ విలియమ్స్ సింగిల్స్ విభాగంలోనూ శుభారంభం చేసింది. సిటీ డీసీ ఓపెన్–500 టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో 45 ఏళ్ల వీనస్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో వీనస్ 6–3, 6–4తో ప్రపంచ 35వ ర్యాంకర్, 23 ఏళ్ల పేటన్ స్టెర్న్స్పై గెలుపొందింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వీనస్ తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది.ఈ గెలుపుతో మహిళల ప్రొఫెషనల్ టెన్నిస్‌లో విజయం సాధించిన రెండో అతిపెద్ద వయస్కురాలిగా వీనస్ గుర్తింపు పొందింది. ఇంతకుముందు 2004లో మార్టినా నవ్రతిలోవా 47 ఏళ్ల వయస్సులో సింగిల్స్ మ్యాచ్ నెగ్గింది. 2024 మయామి ఓపెన్‌లో చివరిసారి ఆడిన వీనస్ ఆ తర్వాత గాయాల కారణంగా ఆటకు విరామం ఇచ్చింది. 2023 ఆగస్టులో జరిగిన సిన్సినాటి ఓపెన్ టోర్నీ తర్వాత వీనస్ సింగిల్స్ మ్యాచ్ నెగ్గడం ఇదే మొదటిసారి కావడం విశేషం.‘నేను పూర్తి ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని పదేపదే ప్రార్థిస్తున్నాను’ పేటన్‌పై విజయానంతరం వీనస్ వ్యాఖ్యానించింది. ఈ మ్యాచ్‌ను వీనస్ కాబోయే భర్త, ఇటలీకి చెందిన సినీ నటుడు, నిర్మాత ఆండ్రియా ప్రెటి కూడా తిలకించాడు.విజయంతో రీఎంట్రీఇక పునరాగమనంలో వీనస్ విలియమ్స్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఏడాది తర్వాత రాకెట్ పట్టిన ఆమె డీసీ ఓపెన్‌లో శుభారంభం చేసింది. కెరీర్లో సింగిల్స్, డబుల్స్‌లో కలిపి 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన 45 ఏళ్ల వీనస్ తన దేశానికే చెందిన హైలీ బాప్టిస్ట్‌తో కలిసి డీసీ ఓపెన్ డబుల్స్‌లో ఆడుతోంది. తొలి రౌండ్లో వీనస్–హైలీ జంట 6–3, 6–1తో 2014 వింబుల్డన్ రన్నరప్ యూజీనీ బుచార్డ్ (కెనడా)–క్లార్వీ (అమెరికా) ద్వయంపై విజయం సాధించింది.మూడేళ్ల తర్వాత డబుల్స్ మ్యాచ్ ఆడిన వీనస్... కిక్కిరిసిన మైదానంలో మొదట తడబడినా... ఆ తర్వాత తన ట్రేడ్‌మార్క్ షాట్లతో ఆకట్టుకుంది. ‘ఆటను ఆస్వాదించాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగాను. ప్రస్తుతం అదే నా ప్రాథమిక లక్ష్యం. నాపై నేను ఎక్కువ ఒత్తిడి పెంచుకోవాలని అనుకోవడం లేదు. గెలుపంటే నాకు ఇష్టం.ఎలాంటి స్థితిలో అయినా గెలిచేందుకే ప్రయత్నిస్తా. అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించా’ అని వీనస్ వెల్లడించింది. 2024 మయామి ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు దూరమైన వీనస్... వైల్డ్ కార్డ్‌తో తాజా టోరీ్నలో బరిలోకి దిగింది.దీంతో తమ అభిమాన ప్లేయర్ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఈ మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 2022 యూఎస్ ఓపెన్‌లో సోదరి సెరెనా విలియమ్స్‌తో కలిసి బరిలోకి దిగిన అనంతరం వీనస్ ఇక డబుల్స్ మ్యాచ్ ఆడలేదు. వింబుల్డన్‌లో ఐదు (2000, 2001, 2005, 2007, 2008) సింగిల్స్ టైటిల్స్ గెలిచిన వీనస్... 2000, 2001లో యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఖాతాలో వేసుకుంది.డబుల్స్‌లో 14 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన వీనస్... ఒలింపిక్స్‌లో 4 పసిడి పతకాలు చేజిక్కించుకుంది. ఇక ఇదే టోర్నీ సింగిల్స్‌లో సైతం వీనస్ బరిలోకి దిగనుంది. తొలి రౌండ్లో ప్రపంచ 35వ ర్యాంకర్ 23 ఏళ్ల పేటన్ స్టెర్న్‌తో తలపడనుంది.యూఎస్ ఓపెన్‌లో వీనస్ వచ్చే నెలలో జరగనున్న గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో వీనస్ విలియమ్స్ బరిలోకి దిగనుంది. మిక్స్డ్ డబుల్స్‌లో అమెరికాకే చెందిన రీలీ ఒపెల్కాతో కలిసి వీనస్ ఆడనుంది. వింబుల్డన్ రన్నరప్ అమండా అనిసిమోవా (అమెరికా) కూడా యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లో పాల్గొననుంది. హోల్గర్ రూనె (డెన్మార్క్)తో కలిసి ఆమె డబుల్స్‌లో బరిలోకి దిగనుంది.ఈ మేరకు యూఎస్ ఓపెన్ నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. కొత్తగా చేర్చిన జాబితాలో మొత్తం 25 జోడీలు పోటీపడుతున్నాయి. పేర్లు నమోదు చేసుకునేందుకు మరో వారం రోజులు గడువు ఉన్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సింగిల్స్ మ్యాచ్‌లు ఆగస్టు 24 నుంచి ప్రారంభం కానుండగా... అందకు వారం రోజులు ముందుగానే మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లు మొదలవుతాయి. -
అపాచీ ఆగయా
న్యూఢిల్లీ: భారత సైన్యంలో మైలురాయి లాంటి ఘట్టం చోటుచేసుకుంది. 15 నెలల నిరీక్షణకు తెరపడింది. అత్యాధునిక ఏహెచ్–64ఈ అపాచీ హెలికాప్టర్లు అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో అడుగుపెట్టాయి. మొదటి బ్యాచ్‌లో భాగంగా మూడు హెలికాప్టర్లను అమెరికా మిలటరీ సరుకు రవాణా విమానంలో మంగళవారం ఇండియాకు చేర్చారు. ఒప్పందం ప్రకారం 2024 మార్చి నెలలోనే రావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో పలుమార్లు జాప్యం చోటుచేసుకుంది. ఏహెచ్–64ఈ అపాచీ హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ రూపొందించింది. ఎడారిని భ్రమింపజేసే రంగులో ఉన్న ఈ చాపర్లను రాజస్తాన్‌లోని జైపూర్‌లో మోహరించబోతున్నారు. ఇవి ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ మలీ్టరోల్ కాంబాట్ హెలికాప్టర్లు. ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. ఒప్పందం ప్రకారం బోయింగ్ సంస్థ మొత్తం ఆరింటిని సరఫరా చేయాల్సి ఉండగా, మిగతా మూడు హెలికాప్టర్లను ఈ ఏడాది ఆఖరు కల్లా అందించనుంది. ఇప్పటికే 22 ఈ–మోడల్ అపాచీలను బోయింగ్ కంపెనీ భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) అందజేసింది. ఏహెచ్–64ఈ అపాచీలను సరఫరా చేయడం ఇదే మొదటిసారి. మొత్తం ఆరు హెలికాప్టర్ల కోసం భారత ప్రభుత్వం అమెరికా సర్కార్‌తోపాటు బోయింగ్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ.4,168 కోట్లు. శత్రువులపై నిప్పుల వాన అపాచీ హెలికాప్టర్ల రాక పట్ల భారత సైన్యం హర్షం వ్యక్తంచేసింది. వీటితో సైనిక దళాల పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుందని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రధానంగా భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో కీలక సైనిక ఆపరేషన్ల కోసం ఏహెచ్–64ఈ అపాచీలను ఉపయోగించబోతున్నారు. ఉగ్రవాదుల కార్యకాలపాలను కట్టడి చేయడంతో కీలక పాత్ర పోషించబోతున్నాయి. ముష్కరుల గుండెల్లో వణుకు పుట్టించడం తథ్యమని నిపుణులు అంటున్నారు. భూఉపరితలంతోపాటు ఆకాశంలో శత్రువుల ఉనికిని గుర్తించి, దాడి చేయడంలో అడ్వాన్స్డ్ టార్గెటింగ్ సిస్టమ్స్‌తో కూడిన ఈ హెలికాప్టర్లకు తిరుగులేదని చెబుతున్నారు. అమెరికా సైన్యంలో వీటి శక్తిసామర్థ్యాలు నిరూపితం కావడంతో కొనుగోలు చేసేందుకు ఎన్నో దేశాలు ఆసక్తి చూపుతున్నాయని బోయింగ్ సంస్థ తెలియజేసింది. ⇒ ఏహెచ్–64ఈ అపాచీ అటాక్ హెలికాప్టర్లలో తుపాకులు, రాకెట్లు, క్షిపణుల వంటి బహుళ ఆయుధాలు అమర్చారు. 30 ఎంఎం ఎం230 చైన్ గన్, 70 ఎంఎం హైడ్రా రాకెట్లు ఇందులో అంతర్భాగమే. తక్కువ దూరం, ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలపై సులువుగా దాడి చేయొచ్చు. ⇒ గంటకు 365 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 480 కిలోమీటర్ల పరిధిలో పనిచేయగలవు. ఆటోమేటిక్ చైన్ గన్ నిమిషానికి 625 రౌండ్లు పేల్చగలదు. ⇒ ఇక ఏజీఎం–114 హెల్ఫైర్ క్షిపణులతో భూమిపై ఆరు కిలోమీటర్ల దూరంలోని సాయుధ వాహనాలు, యుద్ధ ట్యాంక్‌లను సైతం ధ్వంసం చేయొచ్చు. ⇒ గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే స్ట్రింగర్ మిస్సైళ్లు మరో ప్రత్యేకత. గాలిలో ప్రయాణిస్తుండగానే శత్రుదేశాల హెలికాప్టర్లు, మానవ రహిత వాహనాలను కూల్చేయవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే అపాచీలు శత్రువులపై నిప్పుల వర్షం కురిపించి, తుత్తునియలు చేయగలవు. ⇒ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేయడం మరో ప్రత్యేకత. పగలు, రాత్రి, వర్షంలో, దుమ్ములో, ధూళిలో, పొగలో... భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నా ముందుకు దూసుకెళ్లి దాడి చేసేలా ఇందులో సెన్సార్లు, టార్గెటింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ⇒ సంక్లిష్టమైన యుద్ధ వాతావరణాల్లోనూ సమర్థంగా పనిచేస్తాయి. దృఢమైన నిర్మాణం కావడంతో శత్రువుల దాడిని తట్టుకుంటాయి. చిన్నపాటి ఆయుధాలు ప్రయోగించినా ఏమాత్రం చెక్కుచెదిరే ప్రసక్తే ఉండదు. అపాచీలో ఇద్దరు ప్రయాణించవచ్చు. ఒకరు పైలట్‌గా వ్యవహరిస్తారు. మరొకరు ఆయుధ వ్యవస్థను నియంత్రిస్తారు. ⇒ అపాచీ హెలికాప్టర్లు అమెరికా సైన్యంలో గత 40 ఏళ్లుగా సేవలందిస్తున్నాయి. 1980వ దశకం తర్వాత కీలకమైన ఆపరేషన్లలో పాల్గొన్నాయి. విశ్వసనీయత, ప్రభావశీలతను నిరూపించుకున్నాయి. -
ఆయన నన్ను అదోలా చూస్తూ ఉండిపోయాడు
అమెరికాను కుదిపేసిన లైంగిక కుంభకోణం ఎప్స్టీన్ ఫైల్స్‌లో.. అమెరికా విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన ఆరోపణలకు దిగారు. ఈ వ్యవహారంలో ట్రంప్ పాత్రపైనా ఎఫ్‌బీఐ దర్యాప్తు జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారామె.1996లో మరియా ఫార్మర్ ఫిర్యాదుతోనే జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రముఖ ఫైనాన్షియర్ ఎప్స్టీన్తో పాటు అతని సన్నిహితురాలైన గిస్లేన్ మాక్స్‌వెల్‌పై కేసులు నమోదు అయ్యాయి. అటుపై ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖులు ఉన్నారన్న ఆరోపణల నడుమ.. అగ్రరాజ్యంలో ఈ కేసు సంచలనాత్మకంగా మారింది.తాజాగా.. న్యూయార్క్ టైమ్స్‌కి మరియా ఫార్మర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ట్రంప్‌నూ ఎఫ్‌బీఐ విచారించాలని కోరారామె. అది 1995లో ఓ అర్ధరాత్రి. నేను మాన్‌హట్టన్‌లోని ఎప్స్టీన్ ఆఫీస్‌లో ఉన్నా. కాస్త కురచైన దుస్తులే నేను వేసుకుని ఉన్నా. ఇంతలో సూట్లో ఓ వ్యక్తి వచ్చారు. నా కాళ్ల వంకే చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ఎప్స్టీన్ లోపలికి నడుచుకుంటూ వచ్చారు. ‘‘లేదు.. లేదు.. ఆమె నీకోసం రాలేదు’’ అంటూ ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ సమయంలో ‘‘ఆ పిల్లకి 16 ఏళ్లు ఉంటుందా?’’ అని ఆయన ఎప్స్టీన్ను అడగడం నేను విన్నాను అని ఫార్మర్ చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి ఎవరో కాదని.. డొనాల్డ్ ట్రంప్ అని ఆమె బాంబ్ పేల్చారు.అయితే ఎప్స్టీన్తో ఉండగా ట్రంప్ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఏనాడూ తాను చూడలేదని, కానీ, ఆరోజు జరిగింది మాత్రం తాను జీవితాంతం గుర్తు పెట్టుకున్నానని అన్నారామె. ‘‘ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే విషయాన్ని నేను 1996, 2006లో ఎఫ్‌బీఐ ముందు చెప్పాను. కానీ, ఇప్పటిదాకా ఆయన్ని దర్యాప్తు సంస్థ విచారించలేదు. ఎందుకు?’’ అని ప్రశ్నించారామె. అయితే..ఎప్స్టీన్ వ్యవహారంలో(ఫైల్స్‌లోనూ) ఇప్పటిదాకా ట్రంప్ పాత్ర ఉన్నట్లుగానీ, కనీసం అనుమానితుడిగానైనా ఆయన పేరు ఉన్నట్లుగానీ ఏ దర్యాప్తు సంస్థ చెప్పలేదు. ఇక మరియా ఫార్మర్ తాజా ఆరోపణలను వైట్‌హౌజ్ వర్గాలు కొట్టిపారేశాయి. ‘‘ఎప్స్టీన్ ఆఫీస్‌కు అధ్యక్షుడు ట్రంప్ ఏనాడూ వెళ్లింది లేదు. పైగా అతని(ఎప్స్టీన్)పై ఆరోపణలు రాగానే తన క్లబ్ నుంచి ట్రంప్ బయటకు పంపించేశారు కూడా’’ అని కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ షెవుంగ్ మీడియాకు తెలిపారు. ప్రెస్ సెక్రటరీ కరోలీన్ లీవిట్ న్యూయార్క్ టైమ్స్ కథనాలను తీవ్రంగా తప్పుబట్టారు. జెఫ్రీ ఎప్స్టీన్కు ట్రంప్ నడుమ మధ్య సంబంధాలు ఉన్నాయని చెప్పేందుకు.. తిరగదోడి మరీ చెత్తను ప్రచురిస్తున్నారంటూ మండిపడ్డారు.ట్రంప్-ఎప్స్టీన్ మధ్య సంబంధాల గురించి చర్చ దశాబ్దాలుగా నడుస్తోంది. ఈ ఇద్దరూ కలిసి పలు పార్టీల్లో పాల్గొన్న ఫొటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ విషయంలో ట్రంప్ మద్దతుదారులే తరచూ ఆయన్ని తరచూ విమర్శిస్తుండడం గమనార్హం. అయితే ట్రంప్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నారు. లైంగిక ఆరోపణల తర్వాత అతనికి(ఎప్స్టీన్) దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.2003లో ఎప్స్టీన్కు ట్రంప్ బర్త్‌డే విషెస్.. అది కూడా విచిత్రంగా చెప్పారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ఇచ్చింది. ఈ కథనంపై భగ్గుమన్న ట్రంప్.. సదరు వార్తా సంస్థపై 10 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ మరియా ఫార్మర్ ఇంటర్వ్యూను ప్రచురించడంపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ఈ స్కామ్‌కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి.ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఇదే కేసులో అరెస్టైన ఎప్స్టీన్ సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్‌వెల్‌పై.. అమ్మాయిలను, బాలికలను సరఫరా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. చైల్డ్సెక్స్ ట్రాఫికింగ్ కేసులో 2021లో ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తోంది. ఈ కేసులో ఉపశమనం కోసం ఆమె సుప్రీం కోర్టులో అప్పీల్ చేయగా.. అది విచారణ దశలో ఉంది. -
8 వేల మంది ప్రొఫెషనల్స్‌కి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో భారత్‌లో 8,000 మంది ప్రొఫెషనల్స్‌కు కృత్రిమ మేధ (ఏఐ) సంబంధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అమెరికాకు చెందిన బీపీవో సంస్థ వర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ (వీజీఎస్) తెలిపింది. కాంటాక్ట్ సెంటర్ ప్రక్రియలను మెరుగుపర్చే వీఅసిస్ట్ టూల్‌తో ఈ శిక్షణా కార్యక్రమం తమ సంస్థ అంతర్గతంగా సామర్థ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని వివరించింది. కస్టమర్ల నుంచి వచ్చే క్వెరీలను మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, విశ్లేషించుకుని, సముచిత కేటగిరీల కింద వర్గీకరించడం (కాంటాక్ట్ సెంటర్, కస్టమర్ సర్వీస్, వ్యాపార అవసరాలు) ద్వారా కంపెనీ సిబ్బంది తగిన పరిష్కార మార్గాలను అందించేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. ఏఐ రాకతో దేశీ బీపీవో రంగంలో కూడా శరవేగంగా పెను మార్పులు వస్తున్నాయని వీజీఎస్ ప్రెసిడెంట్ గగన్ ఆరోరా తెలిపారు. అధునాతన టెక్నాలజీలు, ఏఐ దన్నుతో 2033 నాటికి ఈ విభాగం 280 బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం 2025లో ఇది 139.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఉద్యోగులు, ఏఐ మధ్య సమతూకం సాధించడం ద్వారా ఏజెంట్ల పనితీరును మెరుగుపర్చుకోవడంతో పాటు కస్టమర్లకు కూడా మరింత సంతృప్తికరమైన సేవలు అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. -
ట్రంప్ కసి.. ఒబామా అరెస్టు అంటూ ఏఐ వీడియో
సంచలన ఆరోపణల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘చట్టానికి ఎవరూ అతీతులు కాదని’ సందేశంతో ఆయన ఆ పోస్ట్ చేశారు. అయితే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అరెస్ట్ అయిన నేపథ్యంతో ఉన్న ఏఐ వీడియోను తన ట్రూత్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేయడం గమనార్హం. ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంలో మాజీ అధ్యక్షుడు ఒబామాను ఎఫ్‌బీఐ అరెస్టు చేసినట్లుగా ఆ వీడియో ఉంది. ఒబామా చేతుల్ని వెనక్కి విరిచి మరీ అధికారులు బేడీలు వేశారు. ఆ సమయంలో నవ్వుతూ కనిపించారు ట్రంప్. అటుపై ఒబామా కటకటాల్లో ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. అంతకంటే ముందు ఈ వీడియోలో.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పలువురు నేతలు చెప్పిన సందేశాన్ని దానికి జత చేశారు. ఆ నేతల్లో ముందుగా ఉంది ఒబామానే కావడం గమనార్హం. Donald #Trump reposts AI-generated video depicting Barack #Obama being arrested.#MAGA | #USApic.twitter.com/crkL8bew9l— Shivanshi Singh (@Shivansshi) July 21, 2025 అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై సంచలన ఆరోపణలకు దిగారు. 2016లో ట్రంప్ విజయం టైంలో ఒబామా ప్రభుత్వం కుట్రలకు తెర తీసిందని.. రష్యా ఎన్నికల జోక్యంపై కల్పిత ఇంటెలిజెన్స్ నివేదికలు తయారు చేయించారని, తద్వారా ట్రంప్ అధ్యక్ష పదవికి అర్హత లేదని చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారామె. ఈ క్రమంలో ఆమె అమెరికా న్యాయవిభాగానికి US Department of Justiceకి కొన్ని డాక్యుమెంట్లు సమర్పించినట్లు సమాచారం. Treason, Tulsi & Trump! Gabbard has accused #BarackObama of 'weaponizing intelligence' against #DonaldTrunp in 2016 - I explain why timing and intention of this huge claim is being questioned 👇#EpsteinFiles #TulsiGabbard pic.twitter.com/orQbiEICNK— Shreya Upadhyaya (@ShreyaOpines) July 20, 2025 ఈ వ్యవహారంపై రిపబ్లికన్ నేతలు గబ్బార్డ్‌కు మద్దతు తెలుపుతూ.. ఆమెపై ప్రశంసలు గుప్పించారు. అయితే డెమోక్రట్లు మాత్రం ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరణతో కూడినవిగా, ఆధారాలు లేనివిగా అభివర్ణించారు. మరోవైపు Obama ఇంకా ఈ ఆరోపణలపై స్పందించలేదు. అయితే ఈ ఆరోపణలు వెల్లువెత్తిన మరుసటిరోజే ట్రంప్ ఇలా ఓ ఏఐ వీడియో తన అధికారిక ఖాతాలో పోస్ట్‌చేయడం గమనార్హం. -
వలసదారులకు గుడ్ న్యూస్.. ఇక ఊపిరి పీల్చుకోండి..!
-
హెచ్–1బీ వీసాకు కొలువుతో లింకు!
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అధ్యక్షునిగా పాలించిన కాలంలో అమలై తర్వాత బైడెన్ హయాంలో బుట్టదాఖలైన ఒక విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ట్రంప్ తొలివిడత అమెరికా అధ్యక్షునిగా పరిపాలించిన కాలంలో హెచ్–1బీ వీసాల కోసం లాటరీ విధానాన్ని పక్కనబెట్టి ఆయా కంపెనీలు ఉద్యోగానికి ఇచ్చే జీతభత్యాల ఆధారంగా వీసాలను జారీచేయాలని నిర్ణయించారు. ఆ విధానాన్నే ఆనాడు అమలుచేశారు. దీంతో కంపెనీలు మరింత మంది ఉద్యోగులను ఉన్నత ఉద్యోగాలకు తీసుకుంటాయని, తక్కువ స్థాయి ఉద్యోగాలు అమెరికన్లకే దక్కుతాయని ట్రంప్ సర్కార్ భావించింది. అయితే విదేశాల నుంచి వచ్చే నిపుణులైన ఉద్యోగులకు అన్ని స్థాయిల ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో జో బైడెన్ సర్కార్ ఈ విధానాన్ని రద్దుచేసి మళ్లీ లాటరీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ లాటరీ విధానానికి స్వస్తిపలికి ఉద్యోగి జీతం, హోదా, పొజిషన్ ఆధారంగా హెచ్–1బీ వీసాలు ఇవ్వాలని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం భావిస్తోంది. ఇందులోభాగంగా సంబంధిత ప్రతిపాదనను సమీక్షించాలంటూ శ్వేతసౌధంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ ఫర్ రివ్యూ విభాగానికి తన ప్రతిపాదనలను పంపింది.వాస్తవానికి ప్రతి సంవత్సరం ఎన్ని హెచ్–1బీ వీసాలు జారీ చేయాలనే పరిమితిని అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం 85,000 హెచ్–1బీ వీసాలను జారీచేస్తున్నారు. వీటిలో 20,000 వీసాలను మాస్టర్స్ డిగ్రీ పట్టా ఉన్న ఉద్యోగులు ప్రత్యేకంగా కేటాయించారు. వీటిలో అత్యధికం అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలే సాధిస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసి తమ ఉద్యోగుల్లో ఎక్కువ మందికి వీసా దక్కేలా చేస్తున్నాయి. ఇక ఎలాంటి పరిమితి లేని వీసాలను విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాల కోసం కేటాయించారు.2026 ఏడాదికి జారీచేయాల్సిన వీసాల కోసం స్వీకరించాల్సిన దరఖాస్తులు సరిపడా రావడంతో వాటి ప్రాసెస్‌ను నిలిపివేశారు. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సరీ్వసెస్ విభాగం శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ లెక్కన 2026 సంవత్సరానికి లాటరీ విధానం ఉండకపోవచ్చని స్పష్టమైంది. పొజిషన్ ఆధారంగా వీసాల జారీ ప్రక్రియలను అమెరికాలోని ఆర్థికరంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. అత్యధిక వృత్తి నైపుణ్యాలున్న వ్యక్తులకే అత్యధికంగా హెచ్–1బీ వీసాలు దక్కే అవకాశం ఉండటంతో వారి కృషి, పని ద్వారా అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత మెరుగుపడుతుందని వారు ఆశిస్తున్నారు. -
అమెరికాలో తప్పిన ఘోర విమాన ప్రమాదం
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. డెల్టా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 767 ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో బోయింగ్ విమానం ఎడమ ఇంజిన్ నుండి మంటలు రావడం కనిపిస్తోంది. అట్లాంటాకు వెళ్లాల్సిన ఈ డెల్టా ఎయిర్ లైన్స్ విమానం లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.❗️Boeing 787 Makes Emergency Landing in LA 🇺🇸 - Engine ON FIRE 🔥Video claims to show a Delta Airlines flight bound for Atlanta on Friday making an emergency landing at LAX. The engine reportedly caught fire shortly after take-off.📹 @LAFlightsLIVE https://t.co/t1HBVLDi0P pic.twitter.com/vYNgkpZJcq— RT_India (@RT_India_news) July 19, 2025శుక్రవారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్ మంటల్లో చిక్కుకున్నట్లు గుర్తించడంతో.. అట్లాంటాకు వెళ్లాల్సిన డెల్టా ఎయిర్ లైన్స్ విమాన్నాన్ని లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఎల్ఏఎక్స్)కి తిరిగి మళ్లించి, అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ విమాన ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, అగ్నిమాపక సిబ్బంది రన్‌వేపై మంటలను చల్లార్చడంతో ముప్పు తప్పిందని అధికారులు తెలిపారు. ఏవియేషన్ A2Z నివేదిక ప్రకారం ఈ విమానం విమానాశ్రయం నుండి బయలుదేరిన వెంటనే ఇంజిన్‌లో మంటలు వ్యాపించాయి. విమాన సిబ్బంది అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి మళ్లించేలా మార్గనిర్దేశం చేసింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ విమానం దాదాపు 25 సంవత్సరాల క్రితం నాటిది.డెల్టా ఇలాంటి సమస్యను ఎదుర్కోవడం ఈ ఏడాది ఇదేమీ మొదటిసారి కాదు. గత ఏప్రిల్‌లో ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా విమానం మంటల్లో చిక్కుకుంది. అట్లాంటాకు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 282 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సహాయకులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. -
లాస్ ఏంజిల్స్‌లో ఘోర ప్రమాదం
అమెరికా కాలిఫోర్నియా స్టేట్ లాస్ ఏంజిల్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వాహనం జనం మీదకు దూసుకెళ్లిన ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. వీళ్లలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం లాస్ ఏంజిల్స్ ఈస్ట్ హాలీవుడ్‌లోని శాంటా మోనికా బులివర్డ్ వద్ద ఓ వాహనం గుంపులోకి దూసుకెళ్లింది, ఈ ఘటనలో 20 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఆంబులెన్సులు, ఫైర్ సిబ్బంది క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించాయి. గాయపడ్డవాళ్లలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మరో 8–10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. టాకోలను విక్రయించే ఓ బండిని ఢీకొట్టి, ఆపై క్లబ్ బయట ఉన్న గుంపులోకి వాహనం దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. వాహన డ్రైవర్ స్పృహ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని కొందరు చెప్పినప్పటికీ.. పోలీసులు ఎలాంటి ఎలాంటి ధృవీకరణ చేయలేదు. BREAKING: Sad and chaotic news coming from East Hollywood, Los Angeles where over 20 people injured and many in critical condition!A vehicle had plowed into a crowd of people, the Los Angeles Fire Department reported on Saturday.The incident occurred on Santa Monica… pic.twitter.com/i0JuEJyhlN— I Came, I Saw, They died 🇺🇸📢🇺🇸 (@4ortunefame) July 19, 2025 -
భారత్, పాక్‌పై ట్రంప్ పిచ్చి వ్యాఖ్యలు.. నెటిజన్ల ఆగ్రహం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నోటి దురుసుతో భారత్‌పై వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ పాత పాటే పాడారు. ఈసారి మరో అడుగు ముందుకేసి.. ఐదు జెట్లు కూలినట్టు తనకు సమాచారం ఉందని ట్రంప్ చెప్పారు. అయితే, కాల్పులు విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని ప్రధాని మోదీ స్వయంగా ట్రంప్‌తోనే చెప్పినప్పటికీ అధ్యక్షుడి వైఖరిలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తామే ఆపామని ట్రంప్ తెలిపారు. యుద్ధ సమయంలో విమానాలు కూల్చేశారని వ్యాఖ్యానించారు. ఐదు జెట్లు కూలినట్టు తనకు సమాచారం ఉందన్నారు. రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ ఉన్నాయి. ఇరు దేశాల మధ్య జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపామన్నారు. భారత్-పాక్ మధ్య పరిస్థితి తీవ్రమవుతుండగా.. ట్రేడ్ ద్వారా సమస్యను పరిష్కరించామని చెప్పారు. ట్రేడ్ డీల్ కావాలంటే యుద్ధం ఆపాలన్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి.Trump just reminded India who’s boss again. He said I stopped war b/w India , Pakistan but dropped a bonus 5 Indian jets shot down ⚡️. Sorry Don it’s 6-Nill 💀 pic.twitter.com/ookpeprp9K— Awais 🐺 (@awais4226) July 19, 2025భారత్-పాక్ మధ్య కాల్పులు ఆగితే, అందుకు క్రెడిట్ తీసుకుంటున్న ట్రంప్, తన బుద్ధి మార్చుకోవడం లేదు. గతంలోనే ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత ప్రధాని మోదీ.. ఈ విషయంలో అమెరికా ప్రమేయమేదీ లేదని తేల్చిచెప్పారు. ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకే ఫోన్లో చెప్పానని మోదీ స్పష్టం చేశారు. తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఆ సమయంలో తన జోక్యమేమీ లేదని.. భారత్-పాక్ దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని చెప్పిన ట్రంప్.. మరోసారి మాట మార్చి వ్యాఖ్యలు చేశారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌నకు మతి మరుపు ఏమైనా వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు. -
‘ఊహలొద్దు.. దర్యాప్తు ముందుంది’: విమాన ప్రమాదంపై అమెరికా
వాషింగ్టన్: అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తును ముగించాలనే తొందరపాటు పలువురిలో కనిపిస్తున్నదని అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు (ఎన్టీఎస్బీ) చైర్పర్సన్ జెన్నిఫర్ హోమెండి పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ఇప్పటివరకూ వచ్చిన నివేదికలు ఊహాజనితమైనవేనని ఆయన అన్నారు.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-7 ప్రమాదంపై ఎన్టీఎస్బీ సాయంతో భారత విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ)దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రస్తుత తరుణంలో ఊహాగానాలకు దూరంగా ఉండాలని ఏఏఐబీ, ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్‌బెల్ విల్సన్ ప్రజలను కోరారు. ‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఇటీవలి మీడియా నివేదికలు ఊహాజనితమైనవి. ఏఏఐబీ తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. పూర్తి దర్యాప్తునకు ఇంకా సమయం పడుతుంది. ఏఏఐబీ కొనసాగుతున్న దర్యాప్తుకు మద్దతు ఇస్తున్నాం’ అని ఎన్టీఎస్బీ ‘ఎక్స్’లో ఒక పోస్టులో తెలిపింది. Statement from NTSB Chairwoman Jennifer Homendy:“Recent media reports on the Air India 171 crash are premature and speculative. India’s Aircraft Accident Investigation Bureau just released its preliminary report. Investigations of this magnitude take time. We fully support the…— NTSB Newsroom (@NTSB_Newsroom) July 18, 2025ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ప్రకారం బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లోని రెండు ఇంధన నియంత్రణ స్విచ్‌లను టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకు కటాఫ్ స్థానాన్ని గుర్తించారు. 10 సెకన్ల తర్వాత స్విచ్‌లను పునరుద్ధరించినప్పటికీ, విమానం అప్పటికే థ్రస్ట్‌ను కోల్పోయింది. ఇది ప్రమాదానికి దారితీసింది. అలాగే కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్.. కెప్టెన్ సుమీత్ సభర్వాల్‌ను ఎందుకు కట్ఆఫ్ చేశారని అడగటం వినిపిస్తుంది. అందుకు ప్రతిగా అతను అలా చేయలేదని చెప్పడం రికార్డయ్యింది. ఈ నివేదిక నేపధ్యంలో భారతదేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ దేశంలోని అన్ని బోయింగ్ 737, 787 విమానాలలో ఇంధన నియంత్రణ వ్యవస్థలను తనిఖీ చేయాలని ఆదేశించింది. పరిశీలన దరిమిలా వాటిలో ఎటువంటి లోపం లేదని ఎయిర్ ఇండియా ప్రకటించింది. -
చైనా యూటర్న్?.. పాక్‌కు షాక్.. అమెరికాకు మద్దతు?
న్యూఢిల్లీ: ఇంతకాలం పాకిస్తాన్‌కు మద్దతు పలుకుతూ, అమెరికాను వ్యతిరేకిస్తున్నట్లు కనిపించిన చైనా ఇప్పుడు తన పంథాను మార్చుకుంది. భారత్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రతిస్పందనను చూసి, చైనా తన తీరు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిచిన చైనా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన కఠిన వైఖరిని పునరుద్ఘాటించింది.చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడాన్ని సమర్థించారు. ఉగ్రవాదానికి వ్యతిరేక సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన ప్రాంతీయ దేశాలకు పిలుపునిచ్చారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. ఇది లష్కరే తోయిబాకు ప్రాక్సీ సంస్థ. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏప్రిల్ 25న ఈ దాడిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో 2025, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. నాలుగు రోజుల పాటు సరిహద్దుల్లో డ్రోన్,క్షిపణి దాడులు సాగాయి. అనంతరం ఈ సంఘర్షణ ముగింపునకు భారత్- పాకిస్తాన్ ఒక అవగాహనకు వచ్చాయి. -
అమెరికా కల చెదురుతోంది..!
ముదురు పాకాన పడుతున్న అమెరికా వీసా సంక్షోభం భారతీయ విద్యార్థుల పాలిట పిడుగుపాటుగా మారుతోంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటినుంచీ విద్యార్థి వీసాలపై నానారకాల ఆంక్షలు విధిస్తుండటంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి అన్న చందంగా తయారవుతోంది. దాంతో పై చదువుల నిమిత్తం అగ్ర రాజ్యానికి వెళ్లే మనవాళ్ల సంఖ్యలో ఈ ఏడాది ఏకంగా 70 నుంచి 80 శాతం తగ్గుదల నమోదైందని హైదరాబాద్‌కు చెందిన పలు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు ఆందోళన వెలిబుచ్చారు. వీసా అపాయింట్మెంట్లను ఉన్నట్టుండి ఫ్రీజ్ చేయడం, వీసా దరఖాస్తుల తిరస్కరణల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటం వంటివి కూడా ఇందుకు కారణంగా నిలుస్తున్నట్టు వారు వివరించారు. ‘‘మామూలుగానైతే ఏటా ఈ సమయానికల్లా విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని, అమెరికా వెళ్లే ఏర్పాట్లలో తలమునకలుగా ఉంటారు. ఈసారి మాత్రం మేమింకా వీసా స్లాట్లు అందుబాటులోకి వచ్చాయా అని రోజూ ఎంబసీ పోర్టల్‌ను చెక్ చేసుకునే దశలోనే ఉన్నాం! ఇంత దారుణ గత కొన్నేళ్లలో ఎన్నడూ లేదు’’ అంటూ వాపోయారు. ఇది చాలదన్నట్టు ఈసారి వీసా స్లాట్లను అమెరికా ఎంబసీలు దశలవారీగా విడుదల చేస్తున్నాయి. చెప్పా పెట్టకుండా ఉన్నట్టుండి కొత్త నిబంధనలు తెచ్చేస్తున్నాయి. ఇలాంటి ఆకస్మిక నిర్ణయాలు మొత్తం వీసా ప్రక్రియపై విద్యార్థుల్లో టెన్షన్ పెంచేస్తున్నాయి. అంతేకాదు. ఎలాగోలా వీసా స్లాట్లు బుక్కయినా, స్లాట్ దొరికిందంటూ విద్యార్థులకు కన్ఫర్మేషన్ రావడం లేదు. కొత్తగా అప్డేట్ చేసిన స్లాట్ సిస్టంను ఎంబసీలు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుండటమే ఇందుకు కారణం కావచ్చని కన్సల్టెంట్లు అంటున్నారు. కానీ ఈ పరిణామం విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి లోను చేస్తోంది. ‘‘మరికొద్ది రోజుల్లో గనక వీసా స్లాట్లను విడుదల చేయకపోతే వేలాది మంది భారత విద్యార్థుల అమెరికా చదువుల కల కల్లగా మిగిలిపోనుంది. వాళ్లు తీవ్ర ఆందోళనతో రోజూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు’’ అని ఓ కన్సల్టెంటు ఆవేదన వెలిబుచ్చారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ మాత్రం వీసా స్లాట్ల ప్రక్రియ పునఃప్రారంభమైందని, అపాయింట్మెంట్ల కోసం విద్యార్థులు తరచూ వెబ్సైట్లో చూస్తుండాలని సూచించారు. గతేడాది రికార్డు స్థాయిలో ఏకంగా 3.3 లక్షల మందికి పైగా భారత విద్యార్థులు పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. ఈ విషయంలో చైనాను అధిగమించి భారత్ తొలి స్థానంలో నిలిచింది కూడా! కానీ ట్రంప్ రాకతో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. 2024 జనవరి నాటికి 11.6 లక్షలకు పైగా భారత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. యూరప్ దేశాలకు వెళ్తున్న మన విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇతర దేశాలే ముద్దు అమెరికా వీసా కోసం అష్టకష్టాలు పడేకంటే ఇతర దేశాలను చూసుకోవడమే మేలని భారత విద్యార్థుల్లో అత్యధికులు భావిస్తున్నారు. ‘‘అమెరికా కలలను నిజం చేసుకునే ప్రయత్నంలో ఇప్పటికే ఏడాది వృథా చేసుకున్నా. ఇంకా దానిమీదే ఆశలు పెట్టుకుని మరో ఏడాది కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేను. నాలాంటి ఎంతోమంది విద్యార్థుల అమెరికా కలలకు నా ఉద్దేశంలోనైతే ముగింపు కార్డు పడ్డట్టే’’ అని 23 ఏళ్ల ఓ ఆశావహ విద్యార్థి చెప్పుకొచ్చాడు. ఇప్పుడతను ఆటోమోటివ్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసేందుకు జర్మనీ వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు.214(బి)తోనే సమస్య! గత మార్చిలోనే వీసా స్లాట్లు బుక్ చేసుకుని ఎట్టకేలకు ఇంటర్వ్యూ దాకా వెళ్తున్న భారత విద్యార్థుల్లో అత్యధికులకు ఎంబసీ నుంచి మొండిచెయ్యే ఎదురవుతోంది! ఈ పరిణామంపై కన్సల్టెంట్లే విస్తుపోతున్నారు. మంచి అకడమిక్, సోషల్ మీడియా రికార్డు తదితరాలుండి, గతేడాది దాకా అనాయాసంగా వీసాలు లభించిన ప్రొఫైళ్లను ఈసారి నిర్ద్వంద్వంగా తిరస్కరించేస్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌లోని 214(బి) సెక్షనే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చదువు పూర్తయ్యాక మాతృదేశానికి కచ్చితంగా తిరిగి వెళ్తామన్న నమ్మకాన్ని ఎంబసీ అధికారులకు మనవాళ్లు కల్పించలేకపోతున్నారు. ‘‘ఈ నిబంధనలు కొత్తవేమీ కాదు. ఏళ్లుగా ఉన్నవే. కానీ వాటిని ఈ ఏడాదే తొలిసారి అమలు చేస్తున్నారు’’ అని డాలస్‌లో ఇమిగ్రేషన్ కన్సల్టింగ్ సంస్థ నడుపుతున్న రవి లోతుమల్ల వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాతో వాణిజ్య చర్చలు.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయమై భారత్ ఎంతో జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు భారీగా సబ్సిడీలు ఇస్తున్న వ్యవసాయ రంగం విషయంలో అప్రమ్తతంగా ఉండాలన్నారు. భారత్‌లో ఈ రంగంలో సబ్సిడీలు తక్కువగా ఉన్నట్టు చెప్పారు. నియంత్రణల్లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్లోకి వచ్చి పడితే అప్పుడు స్థానిక ఉత్పత్తిదారులకు సమస్యలు మొదలవుతాయన్నారు. భారత వృద్ధి 6–7 శాతం స్థాయిలో స్థిరపడిందంటూ.. అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితుల ఫలితంగా ఒక శాతం లోపు వృద్ధి ప్రభావితం కావొచ్చని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ దీర్ఘకాలంలో భారత్‌కు అనుకూలిస్తుందన్నారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘‘ఉదాహరణకు వ్యవసాయం తదితర రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాల నుంచి మరింతంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించొచ్చు. దీనివల్ల మన పాలు, పాల పొడి, చీజ్ తదితర ఉత్పత్తులకు అదనపు విలువ తోడవుతుంది. దీనివల్ల పాల ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారు’’అని రాజన్ పేర్కొన్నారు. కనుక ఎంతో జాగ్రత్తగా, తెలివిగా చర్చలు నిర్వహించాలంటూ.. భారత అధికారులు ఈ దిశగానే సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజన్ ప్రస్తుతం అమెరికాలోని చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. భారత్ ముందు అవకాశాలు.. తమ దేశ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు రాయితీలు ఇవ్వాలంటూ అమెరికా ఎప్పటి నుంచో భారత్‌ను డిమాండ్ చేస్తోంది. తాజా వాణిజ్య ఒప్పందం విషయంలోనూ తమ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు ద్వారాలు పూర్తిగా తెరవాలంటూ పట్టుబడుతోంది. కానీ, ఈ విషయంలో భారత్ సుముఖంగా లేకపోవడంతోనే వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతుండడం తెలిసిందే. మన దేశంలో కోట్లాది మంది పాడి, సాగు రంగంపై ఆధారపడి ఉండడంతో కేంద్ర సర్కారు ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో రాజన్ సూచనలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు పెట్టుబడులు, ఎగుమతులకు నష్టం కలిగిస్తాయని రాజన్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో భారత్ ముందు అవకాశాలు కూడా ఉన్నట్టు చెప్పారు. చైనా, ఇతర ఆసియా దేశాలపై అమెరికా విధించిన టారిఫ్‌లు భారత్ కంటే ఎక్కువగా ఉండడాన్ని ప్రస్తావించారు. కనుక కొంత వరకు తయారీ అవకాశాలు భారత్‌కు రావొచ్చన్నారు. కానీ, అదే సమయంలో అమెరికాకు భారత్ తయారీ ఎగుమతుల గణనీయంగా లేవంటూ.. భారత్‌పై విధించే టారిఫ్‌లు ఎలాంటివి అయినా కొంత వరకు ప్రభావం చూపించొచ్చన్నారు. భారత్‌పై అమెరికా 26 శాతం అదనపు టారిఫ్‌లను (10 శాతం బేసిక్ సుంకానికి అదనం) విధించగా.. వాణిజ్య ఒప్పందానికి వీలుగా ఆగస్ట్ 1 వరకు అమలును వాయిదా వేయడం తెలిసిందే. -
16 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ, సప్త సముద్రాలు దాటి పెళ్లి : వైరల్ లవ్ స్టోరీ
"మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అంటే ఇదేనేమో. ఒక అమెరికా మహిళ వేల మైళ్ల దూరంలో ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సప్తసముద్రాలు దాటి అదీ తన కన్నా చిన్నవాడైన వ్యక్తిని మనువాడింది. ప్రేమకు సరిహద్దులు..అవధులు లేవు అని నిరూపించిన ఆ ప్రేమ జంట గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. అమెరికాలోని ఇల్లినాయిస్కు చెందిన మిండీ రాస్ముస్సేన్ (Mindy Rasmussen, 47) , అప్పర్ దిర్ జిల్లా నివాసి 31 ఏళ్ల ఫేస్బుక్ ప్రేమికుడు సాజిద్ జెబ్ ఖాన్‌ను ప్రేమించింది. ప్రియుడ్ని పెళ్లాడేందుకు ఏకంగా అమెరికా నుంచి పాకిస్తాన్‌కు వెళ్లింది. అంతేకాదు ఇస్లాంలోకి మతం మారింది. మధ్య 16 సంవత్సరాల వయస్సు తేడా స్పష్టంగా ఉన్నప్పటికీ, ఈ నెల ప్రారంభంలో సాంప్రదాయ నిఖా వేడుకలో వివాహం చేసుకున్నారు. సామాజిక విమర్శలను పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆ జంట ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను గెలుచుకుంటోంది.ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!ఫేస్ బుక్ పరిచయంస్థానిక మీడియా కథనాల ప్రకారం దాదాపు ఒక సంవత్సరం క్రితం ఫేస్బుక్ ద్వారా ఆన్లైన్లో పాకిస్తాన్‌కు చెందిన సాజిద్ జెబ్ ఖాన్ పరిచయం ఏర్పడింది. మొదట్లో అందరిలాగానే మామూలుగా మాట్లాడుకునే వారు. అది కాస్తా సుదీర్ఘ వీడియో కాల్స్‌గా మారింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ముందుగా రాస్ముస్సేన్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అటు వీరి ప్రేమకు ఇరు కుటుంబాలూ అంగీకారం తెలిపాయి. ఈ నెల ప్రారంభంలోనే 90 రోజుల వీసా గడువుతో రాస్ముస్సేన్ అమెరికా నుంచి ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Islamabad International Airport) వచ్చింది. ఆమెకు ప్రేమగా స్వాగతం తెలిపిన సాజిద్ జెబ్ ఖాన్ స్వగ్రామానికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు కూడా సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. ఇస్లాం మతాన్ని స్వీకరించి ‘జులేఖ’గా పేరు మార్చుకుంది. ఆ తరువాత కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిఖా చేసుకున్నారు. తమ నిఖా వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాస్ముస్సేన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకుంది. దీంతో ఈ లవ్‌స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. -
పహల్గాం ఉగ్రదాడిపై అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన
-
అమెరికా నుంచి 1,563 మంది భారతీయుల బహిష్కరణ
వాషింగ్టన్: ఈ ఏడాది జనవరి 20న అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు అమెరికా 1,563 మంది భారతీయులను బహిష్కరించి స్వదేశానికి సాగనంపిందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. బహిష్కరించిన వారిలో ఎక్కువ మందిని వాణిజ్య విమానాల్లో తిప్పి పంపించిందని విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.ట్రంప్ తొలిసారిగా అధ్యక్షుడిగా సేవలందించిన కాలంలో మొదటి నెలలోనే 37,660 మంది వివిధ దేశాలకు చెందిన వలసదారులను బహిష్కరించడం గమనార్హం. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కేవలం 3,000 మందిని మాత్రమే బహిష్కరించడం గమనార్హం. ప్రస్తుతం 18,000 వేలకుపైగా భారతీయులు సరైన పత్రాలు లేకుండా జీవిస్తున్నట్లు అమెరికా సిద్ధం చేసిన ఒక నివేదిక పేర్కొంది. #WATCH: #Delhi: MEA spokesperson Randhir Jaiswal says, "Since 20 January of this year, till yesterday, some 1563 Indian nationals have been deported from the United States so far. Most of these Indian nationals have come by commercial flight..." (ANI)#Indians #US #Deportation pic.twitter.com/9IP4cY8cDi— Prameya English (@PrameyaEnglish) July 17, 2025 -
చోరీ చేసినా వీసా రద్దు: అమెరికా
న్యూఢిల్లీ: అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు అక్కడి నిబంధనలు కచ్చితంగా పాటించాలని భారత్‌లో అమెరికా రాయబార కార్యాలయం స్పష్టంచేసింది. ఒకవేళ ఇతరులపై దాడులకు పాల్పడినా, చోరీ చేసినా వీసా రద్దయ్యే ప్రమా దం ఉంటుందని పేర్కొంది. చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడంతోపాటు భవిష్యత్తులో అమెరికా వీసా పొందడానికి కూడా అర్హత కోల్పోతారని తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. మళ్లీ అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఉండదని తేల్చిచెప్పింది. అమెరికాలో భారతీయ మహిళ ఒకరు దుకాణంలో చోరీ చేస్తూ పోలీసులకు దొరికిపోయిన నేపథ్యంలో అమెరికన్ ఎంబసీ ఈ హెచ్చరికలు జారీ చేసింది. -
రష్యాపై ఆంక్షలు విధిస్తే ప్రత్యామ్నాయాలు ఉన్నాయ్
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ఆర్థిక ఆంక్షల రిస్క్ ను కేంద్రం తోసిపుచ్చింది. రష్యా దిగుమతుల విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే, ఇతర దేశాల నుంచి ముడి చమురు సరఫరాతో అధిగమిస్తామని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. దేశ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల రూపంలోనే సమకూరుతోంది. సాధారణంగా మధ్యప్రాచ్యం నుంచి భారత్‌కు ముడి చమురు సరఫరా అధికంగా అవుతుండేది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత నుంచి మారిన పరిణామాలతో గత మూడేళ్లుగా రష్యా ప్రధాన సరఫరాదారుగా మారిపోయింది. పాశ్చాత్య దేశాలు కొనుగోళ్లు తగ్గించడంతో భారత్ తదితర దేశాలకు రష్యా తక్కువ ధరకే చమురు సరఫరా చేస్తోంది. దీంతో భారత రిఫైనరీలు రష్యా ముడి చమురు దిగుమతుల వైపు మళ్లాయి. ఇప్పుడు మొత్తం దిగుమతుల్లో 40 శాతం రష్యా నుంచే ఉంటున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి పురి దీనిపై మాట్లాడారు. చమురు సరఫరా మార్కెట్లోకి ఇటీవలి కాలంలో గయానా తదితర కొత్త సరఫరాదారులు ప్రవేశించగా, ఇప్పటికే ఉన్న బ్రెజిల్, కెనడాలు సరఫరాను పెంచినట్టు చెప్పారు. గతంతో పోల్చిచూస్తే భారత్ ముడి చమురు సరఫరాలు వైవిధ్యంగా మారినట్టు తెలిపారు. సాధారణంగా 27 దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 40కు చేరినట్టు తెలిపారు. స్థిరంగానే చమురు ధరలు ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెల్ ధర 68.5 డాలర్ల వద్ద ఉండగా.. రానున్న నెలల్లోనూ 65 డాలర్ల స్థాయిలో స్థిరంగా కొనసాగొచ్చని మంత్రి పురి అభిప్రాయపడ్డారు. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతం మించి పెంచే విషయమై నీతి ఆయోగ్ అధ్వర్యంలో పరిశ్రమల ప్రతినిధులతో చర్చిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు రష్యా సరఫరా నిలిచిపోతే ఉక్రెయిన్–రష్యా సంక్షోభం ముందు నాటి విధానానికి (పూర్వపు సరఫరా చైన్‌కు) మళ్లుతామని ఐవోసీ చైర్మన్ ఏఎస్ సాహ్నే ఇదే కార్యక్రమంలో భాగంగా స్పష్టం చేశారు. -
అమెరికా అలస్కా తీరంలో భారీ భూకంపం
-
‘ఆగస్టు ఒకటిన మాకు డబ్బే డబ్బు’: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్ డీసీ: అమెరికా విధించిన సుంకాల గడువు తరుముకొస్తున్న తరుణంలో అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉందని ప్రకటించారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు ఒకటి తమకు ఒక ముఖ్యమైన రోజు కానున్నదని, ఆ రోజున తమ దేశానికి పెద్దమొత్తంలో డబ్బు వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.భారతదేశంతో తాము కొత్త వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు చెబుతూనే, దీనిపై భారతదేశం- అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ ఆ సమావేశంలో తెలిపారు. ఆగస్టు ఒకటిన తమ దేశానికి గణనీయంగా డబ్బు వస్తుందని, తాము పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని ట్రంప్ ప్రకటించారు. ఇప్పడు ఇంకో ఒప్పందం కుదరబోతోందని, అది బహుశా భారతదేశంతో కావచ్చని, దీనిపై చర్చల్లో ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు. వారికి తాము ఒప్పందానికి సంబంధించి, ఒక లేఖ పంపామని తెలిపారు. భారతదేశంతో ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు.భారత మార్కెట్లకు లబ్ధి చేకూర్చే ఒప్పందంపై అమెరికా పనిచేస్తోందని అన్నారు. కాగా భారత్- అమెరికా మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు (బీటీఏ) ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల మేరకు ముందుకు సాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం ఐదవ రౌండ్ చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వ అధికారులు ఏఎన్ఐకి తెలిపారు. -
అమెరికాను వణికించిన భూకంపం.. సునామీ హెచ్చరిక!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని అలస్కా సముద్ర తీరం భారీ భూకంపం కారణంగా వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదు అయినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. అలాగే, సునామీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. దీంతో, అధికారులు అప్రమత్తమన్నారు. ఇక, భూకంపానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. వివరాల ప్రకారం.. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.37 గంటలకు అలస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతగా దీన్ని గుర్తించారు. 20.కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. స్యాండ్ పాయింట్ సిటీకి 87 కి.మీ దూరంలో దీని ఎపీసెంటర్ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ముందస్తు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు.We got this incredible footage of today's earthquake from a resident in Sand Point, about 50 miles from the epicenter. We are grateful to those who shared their experiences -- it allows others to understand what an earthquake is like, and be better prepared. We are also grateful… pic.twitter.com/5tkqcbgp9Y— Alaska Earthquake Center (@AKearthquake) July 17, 2025 #BREAKING: Water levels have dropped significantly in the last 30 minutes near Raspberry Island, Alaska, following the M7.2 earthquake.This could be a sign of an incoming tsunami wave.#TsunamiWarning #Alaska #RaspberryIsland #Earthquake pic.twitter.com/nbK8cSKpil— upuknews (@upuknews1) July 16, 2025మరోవైపు.. యూఎస్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అలస్కా, అలస్కా పెనిన్సులా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. గంట తర్వాత హెచ్చరికలను విరమించుకున్నారు. భూకంపాలు తరుచుగా వచ్చే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో అలస్కా ఉంది. 1964 ఉత్తర అమెరికా ప్రాంతంలో 9.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక, 2023లో కూడా అలస్కాలో భూమి కంపించింది. అప్పుడు 7.2 తీవ్రతతో భూమి కంపించడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. Receding waters ahead of the Alaska Tsunami pic.twitter.com/IEaF9UDCRS— Gpena (@SunPowerFusion) July 16, 2025🚨 BREAKING: Water is now receding along the Alaskan coast following the 7.3 earthquake, a clear sign a tsunami is approaching.Residents of Sand Point, Alaska have been ordered to EVACUATE IMMEDIATELY.The National Weather Service and U.S. Tsunami Warning Center have issued an… pic.twitter.com/tcg1GslJsV— Hank™ (@HANKonX) July 16, 2025 -
తగ్గుతున్న అమెరికా ఇమేజ్
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిప్రాయంలో మార్పు వస్తోంది. అందరి హాట్ ఫేవరెట్‌గా ఉన్న అమెరికా ఇమేజ్ తగ్గిపోతోంది. అంతేకాదు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్ల సానుకూలత గణనీయంగా తగ్గిపోతోంది. చైనా, ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ పట్ల ఆదారణ పెరుగుతోంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన కొత్త సర్వే ఈ విషయాలు వెల్లడించింది. గతంలో నిర్వహించిన సర్వేల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. చైనా పట్ల వ్యతిరేకత ఉండేది. కానీ.. తీరు మారుతోంది. ఇటీవలి సంవత్సరాలతో పోలిస్తే.. ఇప్పుడు రెండు అగ్రరాజ్యాలు సమానంగా అభిమానాన్ని సంపాదించుకుంటున్నాయి. 8 దేశాలు అమెరికా వైపు.. 7 దేశాలు చైనా వైపు.. జనవరి 8 నుంచి ఏప్రిల్ 26 వరకు యూఎస్ సహా 25 దేశాలలో 30,000 మందికి పైగా వ్యక్తులను ప్యూ సర్వే చేసింది. 24 దేశాల్లో నిర్వహించిన తాజా సర్వేలో, ఎనిమిది దేశాలలో అమెరికాను గొప్పగా అభివరి్ణంచారు. ఏడు దేశాలలో చైనాను పొగిడారు. మిగిలిన దేశాల్లో రెండింటికీ సమాన గౌరవం లభించింది. ముఖ్యంగా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీతో సహా 10 అధిక ఆదాయ దేశాల్లో 35% మంది మాత్రమే అమెరికా పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. గత సంవత్సరం 51% ఉండగా.. ఇప్పుడది 35 శాతానికి పడిపోయింది. ఈ ధనిక దేశాల్లో 32% మంది చైనా పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఇది గత సంవత్సరం 23% మాత్రమే ఉంది. అంటే తొమ్మిది శాతం పెరిగింది. ఇక అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై తమకు నమ్మకం ఉందని 22% మంది చెప్పారు. ఇది గత సంవత్సరం 17%గానే ఉంది. అంటే ఈ ఏడాదికి 5శాతం పెరిగింది. ట్రంప్ విదానాలే కారణం! ఈ మార్పునకు కారణమేంటనేదీ ప్యూ రీసెర్చ్ సెంటర్ తేల్చలేకపోయింది. అయితే.. అభివృద్ధి చెందుతున్న భౌగోళిక రాజకీయ మార్పులు, నాయకత్వం అవగాహన ఈ ఫలితాలకు కారణమై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ పరిపాలన విదేశాంగ విధాన నిర్ణయాలపై విమర్శలు పెరుగుతున్న తరుణంలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. విదేశీ సహాయాన్ని తగ్గించడం, సాంప్రదాయ మిత్రదేశాలపై సుంకాలను విధించడం, అంతర్జాతీయ విద్యార్థులను ప్రభావితం చేసే వలస విధానాలను కఠినతరం చేయడం వంటి వరుస విధాన చర్యలు అమెరికా పట్ల విశ్వసనీయతను పోగొడుతున్నాయని డెమొక్రాట్ సెనేటర్ల బృందం ఆరోపించింది. అమెరికావైపే ఇజ్రాయెలీలు.. ఇక.. ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం.. పాలస్తీనా, ఇరాన్‌లపై తమ యుద్ధానికి మద్దతు ఇచ్చిన అమెరికా పట్లనే ఎక్కువ సానుకూలంగా ఉన్నారు. 83% మంది ఇజ్రాయేలీలు అమెరికాను ఇష్టపడుతుండగా.. 33% మంది చైనా పట్ల తమ సానుకూలతను తెలిపారు. వారిలో 69% మంది ట్రంప్‌పై తమకు నమ్మకం ఉందని చెబుతుండగా, 9% మంది మాత్రమే జిన్‌పింగ్ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. -
ఇండోనేషియా తోవలో భారత్: వాణిజ్య ఒప్పందంపై ట్రంప్
వాషింగ్టన్: అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటన చేశారు. అమెరికా-ఇండోనేషియా వాణిజ్య ఒప్పందం మార్గంలోనే భారత్ పయనిస్తున్నదని అన్నారు. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు లేదా ఏకపక్ష సుంకాలను ఎదుర్కోనేందుకు ట్రంప్ నిర్ణయించిన ఆగస్టు ఒకటి గడువుకు ముందే దీనిపై భారత్- అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.ఇండోనేషియాతో తాను ప్రకటించిన వాణిజ్య ఒప్పందం మాదిరిగనే భారత్ కూడా ఇదే మార్గంలో పనిచేస్తున్నదని, ఇది అమెరికా, భారత మార్కెట్లకు అత్యధిక లబ్ధి చేకూరుస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా- ఇండోనేషియా వాణిజ్య ఒప్పందం ప్రకారం అమెరికాలోకి దిగుమతులపై 19 శాతం సుంకం ఉంటుంది. అయితే అమెరికా నుండి ఇండోనేషియాకు ఎగుమతులపై ఎటువంటి సుంకం ఉండదని వాషింగ్టన్లో ట్రంప్ ప్రకటించారు. భారత్ కూడా ఇదే మార్గంలో పనిచేస్తోందని, భారత్‌తో ఇదే విధమైన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామన్నారు.ఆగస్టు 1 నాటికి ఒప్పందం కుదుర్చుకోకపోతే 35 శాతం వరకు సుంకాలు విధిస్తామని ట్రంప్ యూరోపియన్ యూనియన్‌కు లేఖలు పంపారు. అమెరికా- భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఒకవేళ ఇండోనేషియా ఒప్పందాన్ని ప్రతిబింబిస్తే, భారతదేశ ఎగుమతులపై 19 శాతం సుంకం ఉండనుంది అలాగే యూఎస్ నుండి దిగుమతులపై ఎటువంటి సుంకం ఉండదని తెలుస్తోంది. -
అమెరికాను ముంచెత్తిన వరదలు
వాషింగ్టన్: న్యూయార్క్ నగరంతో సహా అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. అనేక నగరాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. గ్యాస్ స్టేషన్లు, సబ్‌వేలు మునిగిపోయాయి. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి. సోమవారం సాయంత్రానికే న్యూయార్క్, వాషింగ్టన్, బాల్టీమోర్, నెవార్క్, న్యూజెర్సీ, వర్జీనియా వంటి అనేక ప్రాంతాలలో వరద హెచ్చరికలు జారీ చేశారు.సాయంత్రమే స్టేటెన్ ఐలాండ్, మాన్‌హట్టన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. న్యూయార్క్‌లో వాహనాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. డ్రైవర్లకు రెస్క్యూ సిబ్బంది సహాయం చేశారు. న్యూజెర్సీలో వరదల కారణంగా బస్సులు, రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఆకస్మిక వరదలు, భారీ వర్షాల కారణంగా న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పౌరులు ఇళ్లలోనే ఉండాలని, అనవసరమైన ప్రయాణాలను నివారించాలని సూచించారు. న్యూజెర్సీలోని కొన్ని ప్రాంతాల్లో 5 అంగుళాల వరకు వర్షం కురిసింది.టెక్సాస్‌లో 131కి చేరిన మృతులు.. మరోవైపు టెక్సాస్‌లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 131కి పెరిగింది. గ్రేటర్ కెర్విల్లే ప్రాంతంలో 97 మంది ఆచూకీ తెలియలేదు. కెర్ కౌంటీ మరణాల్లో దాదాపు మూడింట ఒక వంతు మంది పిల్లలే కావడం గమనార్హం. విమాన కార్యకలాపాలకు అంతరాయం.. తుఫాను కారణంగా సోమవారం ఒక్క రోజే అమెరికా అంతటా విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 10,000 విమానాలు ఆలస్యమయ్యాయి. 1,600 కంటే ఎక్కువ రద్దయ్యాయి. ఫ్లోరిడాను భారీ వర్షాలు ముంచెత్తే అవకావం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇది విమాన రాకపోకలను మరింత ప్రభావితం చేయనుంది. -
బ్రిక్స్... ట్రంప్... కాగితం పులి కథ!
బ్రెజిల్‌లోని రియో డి జనేరో నగరంలో ఈ నెల 6–7 తేదీలలో జరిగిన ‘బ్రిక్స్’ 17వ శిఖరాగ్ర సమావేశాలను ఒకవైపు, దానిపై మొదటినుంచే కత్తులు దూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను మరొకవైపు గమనించగా కాగితం పులి కథ గుర్తుకు వస్తుంది. బ్రిక్స్... తన సభ్య దేశాల అభివృద్ధికి, పరస్పర సహకారానికి ఏర్పడినటువంటిది. 2009లో స్థాపించినప్పటి నుంచి గత 16 సంవత్సరాలలో అందుకు అనుగుణంగా వ్యవహరిస్తూ వచ్చింది తప్ప, అమెరికాకు గానీ, మరొకరికిగానీ వ్యతిరేకంగా ఎప్పుడు ఏ చర్యలూ తీసుకోలేదు. అయినప్పటికీ, అమెరికా అధ్యక్షులందరికి భిన్నమైన రీతిలో ట్రంప్ మాత్రం బ్రిక్స్‌ను తమకు వ్యతిరేకమైన కూటమి అంటున్నారు. అధికారానికి వచ్చిన కొత్తలో బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇపుడు బ్రెజిల్ సమావేశాలకు ముందు రోజున 10 శాతం అన్నారు. బ్రిక్స్‌లో చేర రాదంటూ ప్రపంచ దేశాలను కొన్ని నెలలుగా ఒత్తిడి చేస్తున్నారు. కానీ, ఈసారి సమావేశాలు ముగిసే నాటికి, ట్రంప్‌ను అమెరికా సన్నిహిత దేశాలు సహా ఎవరూ ఖాతరు చేయనట్లు స్పష్టమైంది. జనాభా... జీడీపీ... 40 శాతం వాటా!2009లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలలో బ్రిక్‌గా మొదలైన సంస్థ, దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారటం తెలిసిందే. ట్రంప్ హెచ్చరికలు చేసిన మరునాడే ఇండోనేషియా పూర్తి సభ్య దేశంగా చేరింది. ఇపుడు బ్రెజిల్లో బేలారూస్, బొలీవియా, కజకిస్థాన్, క్యూబా, నైజీరియా, మలేషియా, థాయ్‌లాండ్, వియత్నాం,ఉగాండా, ఉబ్జెకిస్తాన్ భాగస్వామ్య దేశాలుగా కొత్తగా చేరాయి. బ్రెజిల్ సమావేశాల కన్న ముందు మాసాలలో ఈజిప్టు, ఇథియో పియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ పార్ట్నర్ దేశాలయ్యాయి. ఈ జాబితాను విశ్లేషించినట్లయితే నాలుగు విషయాలు దృష్టికి వస్తాయి. ఒకటి, సంఖ్య రీత్యా ఇపుడవి మొత్తం 21 దేశాలు. రెండు, అమెరికా, యూరప్‌తో కూడిన పాశ్చాత్య ప్రపంచానికి బయటగల ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాలన్నింటికి అందులో ప్రాతినిధ్యం ఉంది. మూడు, వాటిలో అనేకం ఆర్థికంగా శక్తిమంతమై నవి. నాలుగు, బహుశా అంతకన్న విశేషంగా పలు దేశాలకు అమెరి కాకు అనుకూలమైనవనే పేరున్నది. అటువంటి పేరే గల ఆసియన్ కూటమి దేశాలు కూడా బ్రిక్స్‌కు తోడుకావటం మరొక విశేషం.తాజా విస్తరణ తర్వాత బ్రిక్స్ దేశాల జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో 41 శాతానికి చేరింది. వీటి జీడీపీ ప్రపంచ జీడీపీలో 40 శాతం అయింది. ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాల కూటమి అయిన జి–7కు మించిపోయిన లెక్కలు. బ్రిక్స్ నెలకొల్పిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్‌డిబి) రుణ సహాయాలతో 40 బిలియన్ డాలర్ల విలువ గల 120 అభివృద్ధి పథకాలను వర్ధమాన దేశాలలో అమలుపరుస్తున్నారు. అమెరికా చెప్పు చేతలలో గల ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ తరహా షరతులుగానీ, ఆయా దేశాల ఆర్థిక విధా నాలలో జోక్యం గానీ బ్రిక్స్ బ్యాంక్ నుంచి ఉండవు.అమెరికాకు ఎందుకు కలవరం?అమెరికా తన డాలర్‌ను ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ ప్రపంచ దేశాల కరెన్సీ విలువలను, మార్కెట్లను, బ్యాంక్ చెల్లింపులను, రిజర్వ్‌లను నియంత్రిస్తున్నందున, తమకు సరిపడని దేశాల డాలర్ అకౌంట్లను స్తంభింపజేస్తున్నందున, డాలర్ మారకం నుంచి విముక్తి అవసరమని బ్రిక్స్ దేశాలు కొంతకాలం క్రితమే నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా నిరుడు అక్టోబర్‌లో రష్యాలోని కజాన్ నగరంలో జరిగిన 16వ సమావేశాలలో ఇందుకు మరింత కదలిక వచ్చింది. ఆ ప్రకారం బ్రిక్స్ దేశాలు డాలర్‌తో సంబంధాలను ఒకే సారి పూర్తిగా తెంచుకోవటంగాక, తమ మధ్య వాణిజ్యానికి పరస్పర చెల్లింపులు డాలర్లో గాక వీలైనంత మేర తమ సొంత కరెన్సీలలో జరుపుకోవాలనీ, ఆ స్థాయిని క్రమంగా పెంచుకోవాలనీ నిర్ణయించుకున్నాయి. ఈ పని బ్రిక్స్ దేశాల మధ్యనే గాక, ఇతర దేశాలతోనూ జరిగేందుకు ప్రయత్నించాలని భావించాయి. అనగా డాలర్ పాత్రను, ఆధిపత్యాన్ని తగ్గించటమన్నమాట!నిజానికి స్థానిక కరెన్సీలలో చెల్లింపుల పద్ధతి స్వల్ప స్థాయిలో గతంలోనూ ఉండేది. కానీ బ్రిక్స్ నిర్ణయాలతో అది గణనీయంగా పెరిగి ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో 30 శాతానికి మించినట్లు అంచనా. బ్రెజిల్ విస్తరణతో ఈ ధోరణి పెరిగినట్లయితే, త్వరలో 50 శాతానికి చేరే అవకాశం ఉంది. బ్రిక్స్ అంటే అమెరికా అధ్యక్షుడు ఎందుకింత కలవరపడుతున్నారో, దీన్ని బట్టి తేలికగా అర్థం చేసు కోవచ్చు. ప్రపంచంపై అమెరికా సామ్రాజ్యవాదపు ఆధిపత్యం వెంటనే అంతం కాక పోయినా క్రమంగా బలహీనపడుతుంది. మారిన పరిస్థితులలో ఒకప్పటివలె బ్రిక్స్ వంటి దేశాలపై ప్రత్యక్ష యుద్ధాలు చేయలేరు గనుక, టారిఫ్‌ల హెచ్చింపు, ఇతర వాణిజ్య ఆంక్షల రూపంలో ఆర్థిక యుద్ధాలు ప్రకటిస్తున్నారు. వాస్తవానికి, అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, ఇతరుల నుంచి వస్తున్న పోటీలను తట్టుకునేందుకు ఆయన స్వపర భేదాలు లేకుండా అన్ని దేశాలపై ఎడాపెడా టారిఫ్‌ల యుద్ధం ఆరంభించారు. అయితే, బ్రిక్స్‌తో వైరం భిన్నమైనది. ఆ సంస్థ వర్ధమాన దేశాల కోసం భిన్న మైన, దీర్ఘకాలిక, ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టించే అజెండాతో పని చేస్తున్నది. ఆర్థికంగానే కాదు. అభివృద్ధి నమూనా దృష్ట్యా కూడా. వాణిజ్యంలో ‘స్వేచ్ఛ’ కోసం...మరొక కీలకమైన అంశం స్వేచ్ఛా వాణిజ్యం. ఈ భావనను ముందుకు తెచ్చి డబ్ల్యూటీవోను నెలకొల్పిన అమెరికా కూటమి, దానిని తమ ప్రయోజనాలకు అనుకూలమైనంత కాలం ఉపయోగించుకుని, ఇటీవల ఇతర దేశాలు కూడా లాభపడుతుండటంతో ఆ నియమాలను భంగపరచజూస్తున్నది. స్వేచ్ఛా వాణిజ్యం యథా తథంగా కొనసాగటమే గాక, ఆ సంస్థలో వర్ధమాన దేశాల గొంతుకలు వినవస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలన్నది బ్రిక్స్ వాదనలలోని ముఖ్యాంశాలలో ఒకటి. ఆ పని జరిగితే వర్ధమాన దేశాల వనరులకు, ఉత్పత్తులకు తగిన ధరలు లభిస్తాయి. ధనిక రాజ్యాలు ఇతరులను ఒత్తిడి చేసి తక్కువ ధరలకు కొనుగోలు చేయటం, తమ ఉత్పత్తులను మాత్రం అధిక ధరలకు విక్రయించటం వంటి పరిస్థితి పోతుంది. మరొక స్థాయిలో బ్రిక్స్ దేశాలు అమెరికా ఏకధ్రువ ప్రపంచం ఆమోదయోగ్యం కాదనీ, బహుళ ధ్రువ ప్రపంచం తమ లక్ష్యమనీ స్పష్టంగానే చెప్తున్నాయి. బ్రిక్స్ గురించి యూరోపియన్ దేశాలు ఇంతవరకైతే వ్యతిరేకంగా మాట్లాడలేదుగానీ, అమెరికా వైపు చూస్తు న్నాయి. కజాన్, రియో డి జనేరో సమావేశాల దరిమిలా ట్రంప్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామాల తక్షణ ప్రభావాల గురించి కూడా కొంత చెప్పు కోవాలి. ఇండియాను టారిఫ్‌లతో లొంగదీసి ఒప్పందాలు చేసుకో జూడగా, దానిపై ఒకవైపు చర్చలు సాగిస్తూనే, తాము కూడా 25 శాతం ఎదురు సుంకాలు విధించగలమని భారత ప్రభుత్వం డబ్ల్యూటీవోలో స్పష్టం చేసింది. తామూ అదే పని చేయగలమని బ్రెజిల్, వియత్నాం, ‘ఆసియాన్’, దక్షిణాఫ్రికా మొదలైనవి హెచ్చరించాయి. చైనా, రష్యా సరేసరి. టారిఫ్‌లు ప్రకటించినపుడు ట్రంప్ మాట్లాడుతూ 90 రోజులలో 90 ఒప్పందాలు చేసుకోగలమని,అందరూ క్యూలు కడుతున్నారని ఆట్టహాసంగా అన్నారు. 90 రోజులు గడిచేసరికి జరిగినవి ఇంగ్లండ్, వియత్నాంలలో మాత్రమే. కెనడా, యూరప్ సైతం ధిక్కార స్వరంలోనే ఉన్నాయి. ఈ పరిణా మాల మధ్య బ్రిక్స్‌ను ఢీకొంటున్న ట్రంప్, కాగితం పులిగా మిగలటం తప్ప గత్యంతరం కనిపించదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ట్రంప్ వేస్తారు.. మేము భరిస్తాం: రష్యా
బీజింగ్: వచ్చే 50 రోజుల్లోపు ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని, వంద శాతం సుంకాలను ఆ దేశం ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా స్పందించింది. ఈరోజు(మంగళవారం, జూలై 15) షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమ్మిట్‌కు హాజరైన రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ప్రెస్ కాన్పరెన్స్‌లో మాట్లాడారు. దీనిపై అమెరికా అధ్యక్షడు ట్రంప్ విధిస్తామన్న సుంకాలపై కాస్త వ్యంగ్యంగా బదులిచ్చారు లావ్రోవ్. ‘ ట్రంప్ సుంకాలు వేస్తానన్నారు కదా.. అది కూడా వంద శాతం దాటి సుంకాలన్నారు. వేయనీయండి.. మేము భరిస్తాం. ఈ రకమైన బెదిరింపులు మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి’ అంటూ బదులిచ్చారు. పుతిన్.. నీకు 50 రోజుల సమయమేకాగా, ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మరో అడుగు ముందుకేశారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సోమవారం( జూలై 14) నాడు హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు 50 రోజుల సమయం ఇస్తున్నా, ఆ లోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. ‘ పుతిన్ చర్యలు చాలా నిరాశను కల్గిస్తున్నాయి. యుద్ధంపై 50 రోజుల్లో డీల్‌కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్‌లు చవిచూస్తుంది. ఆ టారిఫ్‌లు కూడా వంద శాతం దాటే ఉంటాయి. రష్యా యొక్క మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి.- ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాం’ అని ట్రంప్ స్పష్టం చేశారు. వైట్ హౌస్‌లో నాటో చీఫ్ మార్క్ రూట్‌ను కలిసిన నేపథ్యంలో ట్రంప్ కాస్త ఘాటుగా స్పందించారు. ఇదీ చదవండి:ట్రంప్-పుతిన్ బ్రొమాన్స్ ముగిసిందా? -
Shubhanshu Shukla: భూమిపైకి శుభాంశు శుక్లా
వాషింగ్టన్: అంతరిక్షంలో భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ శుభాంశు శుక్లా నింగి నుంచి సగర్వంగా నేలకు తిరిగొచ్చాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్న శుభాంశు.. మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూపైకి చేరుకున్నారుయాక్సియం-4 మిషన్ లో భాగంగా... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 2.50 నిమిషాలకు కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండింగ్ అయ్యారు. డ్రాగన్ స్పేస్ క్యాప్స్‌లో భూమి మీదకు చేరుకున్నారు. వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించేందుకు స్పేస్ ఎక్స్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఎస్ఎస్ నుంచి ఘనంగా వీడ్కోలు ఐఎస్ఎస్లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు, కరచాలనాలు ముగిసిన అనంతరం వాతావరణం ఉద్వేగపూరితంగా మారింది. 18 రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరేసుకున్నారు. ముఖ్యంగా శుభాంశు రుచి చూపిన క్యారెట్, పెసరపప్పు హల్వాను ఎన్నటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు. జూన్ 25న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ప్రారంభంశుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర జూన్ 25, 2025న ప్రారంభమైంది. అమెరికాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా శుక్లా బృందం అంతరిక్షంలోకి వెళ్లింది. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ప్రవేశించారు. అక్కడ పైలట్ శుక్లా నేతృత్వంలోని గ్రూప్ మొత్తం 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది. ఇందులో శుక్లా ఒక్కరే స్వయంగా 7 ప్రయోగాలు నిర్వహించారు. ఫ్లోటింగ్ వాటర్ బబుల్ ఐఎస్ఎస్లో 60కి పైగా ప్రయోగాలు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో 18 రోజులు గడిపింది. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేపట్టింది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. మానవ జీర్ణవ్యవస్థ ఖగోళంలో ఎలా పని చేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియోను ఆయన రూపొందించారు. దాంతోపాటు నలుగురు వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతులపైనా ప్రయోగాలు చేసి చూసింది. ఆ క్రమంలో ఫ్లోటింగ్ వాటర్ బబుల్ తయారు చేసి అందులో గడిపింది. అది అద్భుతమైన అనుభవమని శుభాంశు గుర్తు చేసుకున్నారు. ‘‘ఐఎస్ఎస్లో ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదించా. ముఖ్యంగా కిటికీ పక్కన కూచుని కిందకు చూడటాన్ని. బహుశా నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అది’’ అని చెప్పారు. అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు.76 లక్షల మైళ్లు..288 భూ ప్రదక్షిణలు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో గడిపిన 18 రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా 76 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది. ఆ క్రమంలో 288 సార్లు భూప్రదక్షిణలు చేసింది. నవభారత శకమిది శుభాంశు భావోద్వేగం భూమికి తిరుగు ప్రయాణమయ్యే ముందు శుభాంశు ఐఎస్ఎస్లో వీడ్కోలు ప్రసంగం చేశారు. 41 ఏళ్ల ముందు రాకేశ్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలు పెట్టిన క్షణాలను, అక్కడినుంచి భారత్ కనిపించిన తీరును వర్ణించిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘మా తిరుగు ప్రయాణం సందర్భంగా ఈ రోజు ఆకాశం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో చూడాలని మా బృందమంతా ఉత్సాహపడుతోంది. నేటి భారత్ ఘనమైన ఆకాంక్షల భారత్. నిర్భయ భారత్. సగర్వంగా తలెత్తుకుని సాగుతున్న భారత్. అందుకే నేడు కూడా నా దేశం మిగతా ప్రపంచమంతటి కంటే మిన్నగా (సారే జహా సే అచ్ఛా) కనిపిస్తోందని చెప్పగలను’’ అంటూ నాడు రాకేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలను శుభాంశు పునరుద్ఘాటించారు. అక్కడి సహచరులపై శుభాంశు ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని జూన్ 25న ఫాల్కన్–9 రాకెట్ ద్వారా అంతరిక్షానికి పయనమయ్యే క్షణాల్లో నేనస్సలు ఊహించలేదు! ఇదంతా ఇదుగో, ఇక్కడ నా వెనక నుంచున్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది. ఈ యాత్రను మా నలుగురికీ అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది వీళ్లే. అంకితభావంతో కూడిన ఇలాంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పని చేయడం నిజంగా మరచి పోలేని అనుభూతి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. -
ట్రంప్ సర్కార్‌కు భారీ ఊరట.. ఆ 1,400 మంది తొలగింపునకు లైన్ క్లియర్
తీవ్ర ఉత్కంఠ నడుమ.. అమెరికా సుప్రీం కోర్టులో ట్రంప్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఆ దేశ విద్యాశాఖను రద్దు చేసే ప్రక్రియను కొనసాగించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఆ శాఖకు సంబంధించిన 1,400 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ముమ్మురం చేయనున్నారు.ఎన్నికల ప్రచారం నుంచే విద్యాశాఖను మూసివేయాలని ట్రంప్ భావిస్తూ వస్తున్నారు. మార్చి 11వ తేదీన విద్యాశాఖలో సగానికి పైగా ఉద్యోగుల భారం తగ్గించుకోనున్నట్లు కార్యదర్శి లిండా మెక్ మహోన్ ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా.. 21వ తేదీన విద్యాశాఖ(Department of Education) మూసివేత ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. నాలుగు దశాబ్దాలుగా భారీగా ఖర్చు చేస్తున్నా అమెరికాలో విద్యా ప్రమాణాలు మెరుగుపడటం లేదని, ఇంకా యూరప్ దేశాలు.. చైనా కంటే వెనుకబడే ఉన్నామని, కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారాయన. అయితే.. విద్యార్థులకు ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలు మాత్రం కొనసాగిస్తామని అన్నారాయన.మార్చి-మే మధ్యలో.. మొత్తం 1,400 మంది ఉద్యోగులను విధుల్లోంచి తొలగించారు. ఇది మొత్తం ఉద్యోగుల్లో సగానికి సగం. మిగతా సగాన్ని పెయిడ్ లీవ్‌లో ఉంచి.. ఇతర విభాగాల్లోకి సర్దుబాట చేయడం ముమ్మరం చేశారు. ఈలోపు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై డెమెక్రట్స్తో పాటు మసాచుసెట్స్ పబ్లిక స్కూల్ సిస్టమ్స్ & యూనియన్స్ పిటిషన్లు వేశాయి.అయితే మే 22వ తేదీన బోస్టన్ ఫెడరల్ కోర్టు ఉద్యోగుల తొలగింపును నిలిపివేయాలని ఆదేశించింది. తొలగించిన వాళ్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సిందేనని జడ్జి యోంగ్ జోన్ ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ యూఎస్ సర్క్యూట్ కోర్టు(బోస్టన్)ను ట్రంప్ ప్రభుత్వం ఆశ్రయించగా.. అక్కడ చుక్కెదురైంది. ఈ క్రమంలో..సుప్రీం కోర్టు జులై 14న కింది కోర్టు ఇచ్చిన నిలుపుదల ఆదేశాలను పక్కనపెడుతూ.. విద్యాశాఖను రద్దు చేసే ప్రక్రియ కొనసాగించవచ్చని 6-3 తేడాతో ఎమర్జెన్సీ బెంచ్ తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలో ఎలాంటి వివరణను తీర్పు సందర్భంగా న్యాయమూర్తులు చదివి వినిపించకపోవడం గమనార్హం. కోర్టు నిర్ణయాన్ని అమెరికకా విద్యాశాఖ కార్యదర్శి లిండా మెక్ మహో స్వాగతించారు. అయితే ఈ తీర్పు రాజ్యాంగానికి ముప్పు కలిగించొచ్చని, విద్యా రంగానికి హాని కలిగించే అవకాశం ఉందని తీర్పును వ్యతిరేకించిన ముగ్గురు న్యాయమూర్తులు అభిప్రాయపడుతున్నారు.లిండా.. ఫస్ట్ అండ్ లాస్ట్ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక.. మార్చి 3వ తేదీన డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సీఈవో లిండా మెక్ మహోన్(Linda McMahon) విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు. మార్చి 3వ తేదీన ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే.. విద్యాశాఖ రద్దు ఫైల్‌పై సంతకం చేసే సమయంలో అమెరికాకు లిండా మెక్ మహోన్నే చివరి విద్యాశాఖ కార్యదర్శి కావొచ్చని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.ఎందుకీ నిర్ణయమంటే..అమెరికాలో 1979 నుంచి విద్యాశాఖ విభాగాన్ని ఫెడరల్ గవర్నమెంట్ చూసుకుంటోంది. విద్యాశాఖ నిర్వహణలో పరిమితమైన పాత్రే పోషిస్తున్నప్పటికీ.. ఫండింగ్ విషయంలో మాత్రం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకు విద్యాశాఖ రద్దు నిర్ణయానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారు. ఎన్నికల సమయంలో తన ప్రచారంలోనూ ట్రంప్ ఈ నిర్ణయం తప్పకుండా అమలు చేస్తానని ప్రకటించడం తెలిసిందే. అయితే.. తాజా ట్రంప్ ఆదేశాలతో ఇక నుంచి స్టేట్స్(రాష్ట్రాలు) ఆ బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. అయితే.. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇటు డెమోక్రట్లు, అటు విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఇది ట్రంప్ తీసుకున్న మరో వినాశకార నిర్ణయమని డెమోక్రట్ సెనేటర్ చుక్ షూమర్ అభిప్రాయపడుతున్నారు. -
బెంగళూరు బోయ్.. అమెరికా అమ్మడు : ఓ అందమైన ప్రేమకథ
‘‘బెంగళూరు బోయ్.. అమెరికా అమ్మడు" వీరి నిజ జీవిత ప్రేమగాథ ఇది సోషల్ మీడియా ద్వారా మొదలై, సరిహద్దులు దాటిన ప్రేమగా నిలిచింది. తొలి చూపులోనే ఏదో తెలియని ఆకర్షణ, సప్త సముద్రాల అవల ఉన్నా చేరువ కావాలనుకున్నారు. నా ప్రతి శ్వాసవి నువ్వే..అన్నట్టు ఊసులాడుకున్నారు. కట్ చేస్తే.. ఇదే అందమైన ప్రేమకథగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పదండి ఈ ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.హ్యూమన్స్ ఆఫ్ బాంబే షేర్ చేసిన పోస్ట్ ప్రకారం సోషల్ మీడియా ద్వారానే లవ్‌బర్డ్స్ బెంగళూరుకు అబ్బాయి, అమెరికా అమ్మాయి పరిచయం, ప్రేమకు దారితీసింది.. ప్రతీక్షణం టచ్‌లో ఉన్నారు ఒకరి అభిప్రాయాలను పంచుకున్నారు. వీడియో కాల్స్ వర్చ్యవల్ డిన్నర్స్. ఇక విడిగాబతకలేమని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అంతే ఆ అమ్మాయి అమెరికా నుండి ఇండియాకు వచ్చేసింది. ఆఅబ్బాయి పేరే దీపక్. అమ్మాయిపేరు హన్నా. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) ఆర్టిస్ట్ దీపక్ 2023, ఏప్రిల్‌లో ఒక ప్రదర్శన కోసం ముంబైకి వెళ్ళినప్పుడు హన్నా అమ్మాయిని చూశాడు. తొలిచూపులోనే హన్నాపై ఇష్టం పెంచుకున్నాడు. మొత్తం మీద ధైర్యం చేసి మాటకలిపాడు. ముంబైలో ఆ కాసేపటి పరిచయంతో ఆశ్చర్యంగా ఇద్దరూ స్నేహితులైపోయారు. ఇద్దరూ ఫోన్ నెంబర్లు పంచుకున్నారు. ఇక అప్పటినుంచి వీరి ప్రణయ గాథకు అడుగులు పడ్డాయి. తమ స్నేహం కేవలం ఆకర్షణ కాదు అంతకుమించి అని దీపక్ ఫిక్స్ అయిపోయాడు. మనుషులు దూరమైనా..మనసులు దగ్గరే!ఇంతలో ఆమె ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఆమె ఢిల్లీకి వెళ్లిన తర్వాత కూడా, వారి కమ్యూనికేషన్ ఎప్పుడూ ఆగలేదు. రోజువారీ సందేశాలు, తరచు కాల్స్, ఎన్నో ఆలోచనలు, మరెన్నో అభిప్రాయాలు వారి బంధాన్ని మరింత పటిష్టం చేశాయి. నెమ్మదిగా వారి స్నేహం ప్రేమగా వికసించింది. త్వరలోనే అమెరికాకు తిరిగి వెళ్లిపోతున్న సమయంలో తన భావాలతో కూడిన భావోద్వేగ పెయింటింగ్‌ను అందించాడు. అంతే ఆమె కూడా ఫిదా అయిపోయింది.కానీ హన్నా అమెరికాకు వెళ్లిపోయింది. ఆ దూరం వారిద్దరి మధ్యా ప్రేమ మరింతపెరిగింది. చివరికి దీపక్ తన తల్లితో తన ప్రేమ గురించి చెప్పాడు. హన్నా ఫోటో చూడగానే తల్లి తక్షణమేఅంగీకరించింది. అటు హన్నా కూడా తన ప్రియుడిని తన కుటుంబానికి పరిచయం చేసింది. భాషా అంతరాలు ఉన్నప్పటికీ పరస్పరం అంగీకరించారు.ఒక సంవత్సరం తర్వాతఫిబ్రవరి 2024లో తల్లిదండ్రులతో కలిసి ఇండియాకు వచ్చింది హెన్నా. విమానాశ్రయంలో ఆత్మీయంగా హెన్నాను ఆలింగనం చేసుకున్న క్షణం ఇక విడిచి ఉండటం కష్టమని నిర్ణయించు కున్నారు. ఆ హగే వారి జీవితంలో కీలక నిర్ణయానికి నాంది పలికింది. అదే ఏడాది జూలై 26న అందమైన ఎర్రచీరలో పెళ్లి కూతురిలా ముస్తాబైంది హన్నా. సన్నిహితుల సమక్షంలో ఇద్దరూ అపురూపంగా పెళ్లి చేసుకున్నారు.జీవితంలో మొదలైన అందమైన మలుపు ఎంతో హృద్యంగా సాగిపోతోంది. ఒకరి ప్రపంచంలో ఒకరిగా మారిపోయారు. దీపక్ తల్లి హన్నాకు సాంప్రదాయ భారతీయ ఆహారాన్ని ఎలా తయారు చేయాలో నేర్పిస్తోంటే, హన్నా పాశ్చాత్య వంటకాలను పరిచయం చేసింది. ఈ ప్రేమికుల పెళ్లి ఇద్దరు వ్యక్తుల కలయికను కాదు, రెండు విభిన్న సంస్కృతులు, ఆచారాలు, హృదయాలను కలయిక. వీరి అందమైన లవ్‌స్టోరీకి త్వరలోనే తొలి వసంతం నిండబోతోంది. ప్రేమ పెళ్లికి దేశం, ప్రాంతం, భాషా ఇలాంటివేవీ అడ్డురావని నిరూపించారు. దీపక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం 93 వేలకు పైగా అనుచరులు ఉన్నారు. -
పగలంతా తేనె పలుకులు, రాత్రైతే..
ఉక్రెయిన్ సంక్షోభంలో.. పుతిన్ వైఖరి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుతిన్ విధానాలు తనకేమాత్రం నచ్చడం లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. ఈ ఇద్దరు దేశాధినేతలు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటుండడం తెలిసిందే.రష్యా అధ్యక్షుడు పుతిన్ వైఖరి పట్ల నేను తీవ్ర నిరాశ చెందారు. పుతిన్ శాంతి కోసం మాట్లాడతారని అనుకున్నాను. కానీ రాత్రికి రాత్రి ఉక్రెయిన్‌పై దాడులు చేయిస్తున్నారు. ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు అని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి పుల్‌స్టాప్ పెట్టే దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడితే.. పుతిన్-జెలెన్స్కీ వైఖరి వల్ల నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి. దీంతో ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారు. పైగా ట్రంప్-పుతిన్‌లు తరచూ ఈ అంశంపై ఫోన్లో మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. రష్యాపై ఆంక్షలు?రష్యాపై కొత్త ఆంక్షలు విధించే అవకాశాన్ని ట్రంప్ సూచన ప్రాయంగా తెలియజేశారు. మేము రేపు ఏం చేస్తామో చూడండి అంటూ మీడియాతో వ్యాఖ్యానించారాయన. అమెరికా సెనేటర్లు ఇప్పటికే రష్యాపై ‘స్లెడ్జ్‌హామర్’(కఠినమైన) ఆంక్షల బిల్లును ప్రతిపాదించిన సమాచారం. పైగా ఈ బిల్లు రష్యా విషయంలో ఆంక్షలు విధించేందుకు ట్రంప్‌కు విస్తృత అధికారాలను కల్పించనుందని తెలుస్తోంది.తాజా వ్యవహారంతో ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరీముఖ్యంగా అమెరికా-రష్యా సంబంధాల్లో కీలక మలుపుగా భావించబడుతున్నాయి. ట్రంప్ మాటలు, చర్యలు.. ఉక్రెయిన్ ఉద్రిక్తతల్లో రష్యాపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను అందించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌కు ఇది ఎంతో అవసరమని అని ఆయన.. ఈ ఆయుధాల ఖర్చును అమెరికా భరించదని, యూరోపియన్ యూనియన్ 100% చెల్లించనుందని తెలిపారు.ఈ క్రమంలో ఇది జస్ట్ బిజినెస్ అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. -
అమెరికాపై టారిఫ్‌లు నిలిపేసిన ఈయూ
బ్రస్సెల్స్: అమెరికా వస్తువులపై నేటి నుంచి అమల్లోకి రానున్న ప్రతీకార సుంకాలను యూరోపియన్ యూనియన్(ఈయూ) నిలిపివేసింది. ఆగస్టు ఒకటి నుంచి ఈయూ, మెక్సికోపై 30% కొత్త సుంకాలను ట్రంప్ ప్రకటించడంతో ఈయూ వెనుకడుగు వేసింది. ఈ నెలాఖరు నాటికి ట్రంప్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే ఆశతో ఉంది. ఇది చర్చలకు సమయమని యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లేయన్ అన్నారు. చర్చలు జరపడానికి ఆగస్టు మొదటి తేదీ వరకు తమకు సమయం ఉందన్నారు. ఒప్పందానికి రాలేకపోతే, ప్రతీకారానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. -
యూఎస్ ఎయిడ్ కోత.. దక్షిణాఫ్రికాలో నిలిచిన హెచ్ఐవీ టీకా ట్రయల్స్
జొహన్నెస్‌బర్గ్: డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం యూఎస్ ఎయిడ్ (యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెలవప్ మెంట్) నిధులను పూర్తిగా నిలిపివేసింది. ఇందుకు సంబంధించిన యంత్రాంగాన్ని పూర్తిగా తొలగించింది. ఈ చర్య ప్రపంచ వ్యాప్తంగా ‘యూఎస్ ఎయిడ్’సాయం అందుకునే పలు దేశాలతోపాటు వివిధ కీలకమైన సంస్థలపైనా పడింది. ముఖ్యంగా మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన హెచ్ఐవీకి విరుగుడును తీసుకువచ్చే ప్రయత్నాలకు ట్రంప్ చర్య ఆఖరి క్షణంలో అడ్డుకట్ట వేసింది. దక్షిణాఫ్రికాలో బ్రిలియంట్ కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవీ టీకా ‘లెనకపవిర్’ను రూపొందించారు. దీనికి అమెరికా యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆమోదముద్ర వేసింది. మరో వారం రోజుల్లో దక్షిణాఫ్రికాలోని యువతపై టీకా క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సమయంలో పిడుగులాంటి వార్త వారికి అందింది. అదే యూఎస్ ఎయిడ్ నిలిపివేత. దీంతో, ఈ కార్యక్రమం కింద పనిచేస్తున్న దాదాపు 100 మంది పరిశోధకులు హతాశులయ్యారు. నిధుల్లేకుండా వారు ముందుకు సాగేందుకు ఏమాత్రం అవకాశాల్లేవు. దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని సాయం కోరినా ఫలితం కనిపించలేదు. ఇప్పుడిక అన్ని కార్యక్రమాలను నిలిపివేయడం మినహా గత్యంతరం లేదని వారంటున్నారు. బ్రిలియంట్ కార్యక్రమం చీఫ్ గ్లెండా గ్రె..‘హెచ్ఐవీకి విరుగుడు కనుగొనడంలో ఆఫ్రికా ఖండం చాలా కీలకమైంది.హెచ్ఐవీని అరికట్టేందుకు లెనకపవిర్ టీకాను ఏడాదిలో రెండు సార్లు ఇస్తే సరిపోతుంది. ప్రపంచంలోనే ఇలాంటి మొట్టమొదటి వ్యాక్సిన్ ఇది. అవకాశమిస్తే ట్రయల్స్‌ను ప్రపంచంలోనే అందరికంటే చౌకగా, సమర్థంగా, వేగవంతంగా పూర్తి చేయగలం’అని ఆమె అన్నారు. గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో నోవావ్యాక్స్ టీకా తయారీలో దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కీలకంగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. అమెరికా నిర్ణయం ఫలితంగా సుమారు 8 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు ఉద్యోగాలు కోల్పోయారు. శ్వేత వర్ణం వారిని వేధిస్తున్నామంటూ అమెరికా ప్రభుత్వం తమపై అనవసర ఆరోపణలు మోపి ఎంతో కీలకమైన ఆరోగ్యరంగానికి నిధులను ఆపేయడం అన్యాయమని దక్షిణాఫ్రికా ప్రభుత్వం వాపోతోంది. -
లక్షల మంది హృదయాల్లో భగవద్గీత జ్ఞానాన్ని నింపిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ
వాషింగ్టన్: గత 65 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా, ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికను పంచుతూ, ఆ శక్తిని, భక్తిని అందరికీ అందించడమే కాకుండా అనేక దేవతా ఆలయాలను భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో నిర్మించి, మన సనాతన సంప్రదాయాలను పరిరక్షిస్తున్నారు. పరపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. లక్షల మందికి మంత్రోపదేశాలు చేసి వారి జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతిని అందించారు శ్రీ స్వామీజీ. శ్రీ కృష్ణ పరమాత్మ మానవాళికి అందించిన భగవద్గీతను ప్రపంచవ్యాప్తంగా వున్న అసంఖ్యాకమైన భక్తులకు ప్రచారం చేస్తూ వారి జీవన మార్గాన్ని సుగమం చేస్తున్నారు శ్రీ స్వామీజీ.అలా పూజ్య స్వామీజీ చూపిన మార్గంలో భగవద్గీతను కంఠస్థం చేసి ఎందరో తమ జీవితాల్లో మార్పును చూస్తున్నారు. మన సనాతన ధర్మం ద్వారా సమసమాజ నిర్మాణానికి అహర్నిశం శ్రమిస్తూ ఆధ్యాత్మికతను సుస్థిరం చేస్తున్న మహనీయులు, అవధూత పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద మహాస్వామీజీ. అంతే కాకుండా గత 10 సంవత్సరాలుగా విశేషంగా భగవద్గీతను అమెరికాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు శ్రీ స్వామీజీ. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలో నిర్వహించిన విధంగా పది వేలమంది భక్తులతో అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ ఫ్రీస్కో నగరంలోని అలెన్ స్టేడియంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భగవద్గీతను పఠించారు. -
వీసా వచ్చిందని మురిసిపోకండి.. ట్రంప్ సర్కార్ కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ: వీసా కష్టాల కడలిని ఈది అమెరికాలో అడుగుపెట్టాక సైతం వీసాదారులపై ‘స్క్రీనింగ్’ కత్తి వేలాడుతూనే ఉంటుందని ట్రంప్ సర్కార్ స్పష్టంచేసింది. ఏ చట్టాలు, నిబంధనల ప్రకారం విదేశీయులకు వీసా మంజూరు చేశామో అవే చట్టాలు, ఇమిగ్రేషన్ నిబంధనలను ఇక్కడికొచ్చాక అతిక్రమిస్తున్నట్లు తేలితే వెంటనే బహిష్కరించి దేశం నుంచి వెళ్లగొడతామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం శనివారం ఒక అడ్వైజరీని విడుదలచేసింది.‘‘అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్, టెలిగ్రామ్, లింక్డ్ఇన్ వంటి మీ సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలు ఇచ్చారు. అమెరికా వ్యతిరేక, హమాస్ ప్రతికూల సోషల్‌మీడియా పోస్ట్‌లు, వీడియోలు, వ్యాఖ్యానాలు ఉంటే ఆయా దరఖాస్తుదారులకు వీసాలను తిరస్కరించాం. అంతా సక్రమంగా ఉండి వీసాలు పొందిన విదేశీయులు ఆనందపడాల్సిన పనిలేదు. వీసాలు మంజూరైనా సరే మీపై సోషల్‌మీడియా ‘స్క్రీనింగ్’ప్రక్రియ ఇక మీదటా కొనసాగుతుంది. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్ట్‌లపై ఓ కన్నేస్తాం. అమెరికా గడ్డపై ఉంటూ మా చట్టాలు, ఇమిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వెంటనే వీసాను రద్దుచేస్తాం. అలాంటి వ్యక్తులను బహిష్కరించి దేశం నుంచి వెళ్లగొడతాం’’అని అడ్వైజరీ ద్వారా అమెరికా హెచ్చరించింది.‘అమెరికాలో ఉన్నంతకాలం ఇక్కడి చట్టాల ప్రకారం నడుచుకోవాలి. వీసా స్క్రీనింగ్‌లో భాగంగా మీ సోషల్‌మీడియా అకౌంట్లలోని పోస్ట్‌లు, వీడియోలు, వ్యాఖ్యానాలను ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలించేందుకు వీలుగా అందరికీ కనిపించేలా సెట్టింగ్‌లను ‘పబ్లిక్’మోడ్‌లోనే కొనసాగించండి. జాతీయ భద్రతకు లోబడే వీసా జారీ అనేది ఉంటుంది. అందుకే ఎఫ్,ఎం,జే ఇలా ప్రతీ వీసాదారుడు ఈ నిబంధనలను అనుసరించాలి’ అని సూచించింది. -
ట్రంప్‌కు మరో షాక్.. రాజీనామా యోచనలో కాష్ పటేల్!
ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు విషయంలో విభేదాలతో ఎలాన్ మస్క్ డోజ్‌ను వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాష్ పటేల్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో అదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది.వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కాష్ పటేల్(కశ్యప్ ప్రమోద్ పటేల్) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో రాజీనామా చేస్తారనే ఊహాగానాల నడుమ.. కాష్ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డాన్ రాజీనామా చేసిన వెంటనే తన పదవి నుంచి వైదొలగాలని కాష్ భావిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినోఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని అమెరికా న్యాయ విభాగం.. ఎఫ్‌బీఐ కలిపి విచారిస్తోంది. అయితే ఈ కేసును అటార్నీ జనరల్ పామ్ బాండీకు అప్పగించినప్పటి నుంచి ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బోంగినో ఎఫ్‌ఐబీకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలోనే కాష్ పటేల్ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బోంగినో గనుక రాజీనామా చేస్తే.. కాష్ తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. పామ్ బాండీ‘‘ఈ దర్యాప్తులో పామ్ బాండీ ఉండాలని కాష్ పటేల్ కూడా కోరుకోవడం లేదు. బాండీ మరికొన్ని పత్రాలను విడుదల చేయకపోవడంపైనా ఎఫ్‌బీఐ వర్గాల్లో తీవ్ర అసహనం నెలకొంది. అందుకే బోంగినో గనుక వీడితే ఆయన కూడా ఎఫ్‌బీఐని వీడే అవకాశం ఉంది’’ అని ఓ ప్రముఖ జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎఫ్‌బీఐకి, డీవోజే(డిపార్ట్మెంట ఆఫ్ జస్టిస్)కు నడుమ పొసగట్లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ట్రంప్ అనుచరురాలు లారా లూమర్ సైతం ధృవీకరించడం గమనార్హం. పారదర్శకత లోపించిందనేది ప్రధాన ఆరోపణతో ఎఫ్‌బీఐ వర్గాలు బాండీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నాయంటూ లూమర్ తెలిపారు. ఈ క్రమంలో బాండీని.. బ్లోండీ అంటూ ఆమె ఎద్దేవా చేయడం గమనార్హం. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే.. ఎప్స్టీన్ ఫైల్స్‌లో.. ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామని ఫిబ్రవరిలో ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పామ్ బాండీ ప్రకటించారు. అయితే తాజాగా డీవోజే-ఎఫ్‌బీఐ సంయుక్తంగా విడుదల చేసిన మెమోలో.. ఎలాంటి ఆధారాల్లేవని, కేసును ముగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాండీ మాటమార్చి.. తన గత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఎలాన్ మస్క్ సైతం ఈ వ్యవహారంపై ట్రంప్ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. మరోవైపు ట్రంప్ ఈ వ్యవహారంపై తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా ఎఫ్‌బీఐ వర్సెస్ జ్యూడీషియల్ డిపార్టెమెంట్ వ్యవహారంపై వైట్‌హౌజ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకోవైపు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) ఉద్యమకారులు సైతం ఈ పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.కశ్యప్ పూర్వీకులు భారత్‌లోని గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్‌గా వివిధ హోదాల్లో సేవలందించారు. ఆ సమయంలోనే ట్రంప్‌కు ఆయన దగ్గరయ్యారు. ఫిబ్రవరి 22వ తేదీన ఎఫ్‌బీఐ 9వ డైరెక్టర్‌గా కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పామ్ బాండీ కాష్‌తో ప్రమాణం చేయించగా.. భగవద్గీత మీద చేయి ఉంచి ఆయన బాధ్యతలు చేపట్టారు. -
అమెరికాను హడలెత్తిస్తున్న ఈగ
న్యూ వరల్డ్ స్క్రూవార్మ్.. అగ్రరాజ్యం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈగ. ముఖ్యంగా పాడి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఈ ఎగిరే జీవుల సంతతిని నియంత్రించడానికి ఏకంగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి స్టెరిలైజ్ చేసిన మగ ఈగలను వదలడానికి ఏర్పాట్లు చేస్తోంది. న్యూ వరల్డ్ స్క్రూవార్మ్‌ను సైన్స్ పరిభాషలో కొష్లియోమియా హొమినివోరక్స్ అంటారు. ఇవి ప్రధానంగా పరాన్న జీవులు. అంటే ఆవులు, గేదెలు, గుర్రాలు, గొర్రెల వంటి జంతువులపై ఆవాసం ఏర్పర్చుకుంటాయి. వాటి శరీరంపై గాయాలు చేసి, మాంసాన్ని భక్షిస్తాయి. దాంతో ఆయా జంతువులకు ప్రాణాపాయం సంభవిస్తుంది. అమెరికాతోపాటు దక్షిణ అమెరికా దేశాల్లో ఈగలు పెద్ద సమస్యగా మారిపోయాయి. 2023 నుంచి సెంట్రల్ అమెరికాలో వీటి వ్యాప్తి పెరిగిపోయింది. పనామా, కోస్టారికా, నికరాగ్వా, హోండూరస్, గ్యాటెమాలా, ఎల్‌సాల్వెడార్ తదితర దేశాల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఈగలు గత ఏడాది దక్షిణ మెక్సికోకు చేరుకున్నాయి. అటునుంచి అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. వీటి దెబ్బకు అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో పశువుల వ్యాపార కేంద్రాలు మూసివేయాల్సి వచ్చింది. మెక్సికో నుంచి పశువుల దిగుమతి నిలిపివేశారు. పాలు ఇచ్చే ఆవులు, గేదెలు మరణిస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు 35,000 న్యూవరల్డ్ స్క్రూవార్మ్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. నమోదు కానివి మరెన్నో ఉన్నాయి. ఎలా నియంత్రిస్తారు? స్క్రూవార్మ్ ఈగలను అరికట్టడానికి పెద్ద తతంగమే ఉంటుంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్లుగా ఈగలను ఈగలతోనే నియంత్రిస్తారు. మగ ఈగలను సేకరించి, ప్రయోగశాలలో స్టెరిలైజ్ చేస్తారు. ఇలాంటి కోట్లాది మగ ఈగలను హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో వదులుతారు. ఇవి ఆడ ఈగలతో జతకడతాయి. దాంతో ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అవి గుడ్లు పెట్టలేవు. ఫలితంగా సంతానోత్పత్తి తగ్గిపోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇదే వ్యూహం అమలు చేస్తున్నారు. అయితే, అమెరికాలో స్టెరిలైజేషన్ కేంద్రం ప్రస్తుతం ఒక్కటే ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని కేంద్రాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా చట్టసభ సభ్యులు జూన్ 17న ప్రభుత్వానికి లేఖ రాశారు. అమెరికా వ్యవసాయ శాఖ వెంటనే స్పందించింది. ‘ఫ్లై ఫ్యాక్టరీ’ ప్రారంభిస్తామని ప్రకటించింది. టెక్సాస్–మెక్సికో సరిహద్దుల్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. పశువుల రక్తమాంసాలు రుచి మరిగిన ప్రాణాంతక ఈగలను అంతం చేయడం చెప్పినంత సులువు కాదు. ఇది చాలా వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియ. మెక్సికోలో ఈగల లార్వాల ఉనికిని గుర్తించడానికి జాగిలాలు ఉపయోగిస్తున్నారు. ఇవి వాసన ద్వారా లార్వాలను పసిగడతాయి. ఇందుకోసం జాగిలాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. మనుషులకు ముప్పు స్వల్పమే పూర్తిగా ఎదిగిన స్క్రూవార్మ్ పశువులపై గాయాలున్న చోట వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు అక్కడే మాంసం తింటూ ఎదుగుతాయి. పశువుల పుండే వాటికి ఆవాసం. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరిపోతాయి. మరో పశువుపై వాలి సంతతిని వృద్ధి చేస్తాయి. అమెరికాలో ఇలాంటి ఈగల బెడద ఇదే మొదటిసారి కాదు. 1960, 1970వ దశకంలో విపరీతంగా బాధించాయి. అప్పట్లో పాడి పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది. మగ ఈగల ద్వారా అతికష్టంమీద, ఎంతో ఖర్చుతో వీటిని నియంత్రించగలిగారు. స్క్రూవార్స్మ్ మృత పశువుల కంటే బతికి ఉన్న పశువులపై ఉండడానికే ఇష్టపడతాయి. ఇంట్లో పెంచుకొనే శునకాలు, పిల్లులకు కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి. మనుషులకు కూడా ముప్పు ఉన్నప్పటికీ అది చాలా స్వల్పమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాలో అపర కుబేరులు మనవాళ్లే..
విదేశాల్లో పుట్టి అమెరికాలో అపర కుబేరులుగా ఎదిగినవాళ్లలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ 2025 ర్యాంకింగ్స్‌లో 12 మంది భారత సంతతి బిలియనీర్లు చోటు దక్కించుకోవడంతో అత్యధిక మంది విదేశీ అమెరికన్ కుబేరులకు జన్మస్థానంగా భారత్ నిలిచింది. 2022లో కేవలం ఏడుగురు భారత సంతతి బిలియనీర్లు ఉండగా ఇప్పుడు గణనీయంగా పెరిగారు.అమెరికాలో విదేశీ సంతతి సంపన్నుల తాజా జాబితాలో భారత్.. ఇజ్రాయెల్, తైవాన్లను అధిగమించింది. ఈ రెండు దేశాలకు చెందినవారు చెరో 11 మంది ఈ జాబితాలో ఉన్నారు. స్వయం కృషితో ఎదిగిన ఈ భారత సంతతి కుబేరులు.. విదేశాలలో జన్మించిన యూఎస్ బిలియనీర్ల మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్ల సంపదలో గణనీయ వాటాను అందిస్తున్నారు.ఆల్ఫాబెట్ అధినేత సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వంటి కొత్తవారు ఇటీవల ఈ జాబితాలో చేరినప్పటికీ అంతగా గుర్తింపు లేని దిగ్గజాలతో పోలిస్తే వారు ఆశ్చర్యకరంగా తక్కువ ర్యాంకులో ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ దిగ్గజం జెడ్ స్కేలర్ వ్యవస్థాపకుడు జే చౌదరి 17.9 బిలియన్ డాలర్ల సంపదతో భారత సంతతి అమెరికన్ బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉన్నారు. విద్యుత్తు, నీరు లేని మారుమూల హిమాలయ గ్రామం పనోహ్ లో జన్మించిన చౌదరి గ్రాడ్యుయేట్ చదువుల కోసం 1980లో తొలిసారి అమెరికా వెళ్లారు.భారత సంతతి అపర కుబేరులు వీళ్లే..జే చౌదరి (17.9 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (జెడ్ స్కేలర్)వినోద్ ఖోస్లా (9.2 బిలియన్ డాలర్లు) - సన్ మైక్రో సిస్టమ్స్, వెంచర్ క్యాపిటల్రాకేష్ గంగ్వాల్ (6.6 బిలియన్ డాలర్లు) - ఎయిర్‌లైన్స్ (ఇండిగో సహ వ్యవస్థాపకుడు)రోమేష్ టి.వాధ్వానీ (5.0 బిలియన్ డాలర్లు) - సాఫ్ట్వేర్ - సింఫనీ టెక్నాలజీ గ్రూప్రాజీవ్ జైన్ (4.8 బిలియన్ డాలర్లు) - ఫైనాన్స్ (జీక్యూజీ పార్టనర్స్ చైర్మన్)కవితార్క్ రామ్ శ్రీరామ్ (3.0 బిలియన్ డాలర్లు) - గూగుల్, వెంచర్ క్యాపిటల్రాజ్ సర్దానా (2.0 బిలియన్ డాలర్లు) - టెక్నాలజీ సేవలు (ఐటీ సంస్థ టీసీజీఐ)డేవిడ్ పాల్ (1.5 బిలియన్ డాలర్లు) - వైద్య పరికరాలు (వెల్క్వెస్ట్ / న్యూరోసిగ్మా)నికేష్ అరోరా (1.4 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ)ఫోర్బ్స్ తాజా డేటా ఆధారంగా అమెరికాలోని అత్యంత ధనవంతులైన భారత సంతతి బిలియనీర్లు వీరే. టెక్ దిగ్గజాలు సుందర్ పిచాయ్ (1.1 బిలియన్ డాలర్లు), సత్య నాదెళ్ల (1.1 బిలియన్ డాలర్లు) 10, 11వ స్థానాల్లో నిలిచారు. -
ట్రంప్ పొగిడినా కష్టాలే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనుషుల్ని మెచ్చడం అత్యంత అరుదు. అందునా తనకు నచ్చని దేశాల అధ్యక్షులను వైట్‌హౌజ్‌కు పిలిపించుకుని మరీ అవమానించడం ఆయనొక అలవాటుగా మార్చుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన ఓ దేశ అధ్యక్షుడ్ని మెచ్చుకుంటే.. అది కూడా బెడిసి కొట్టింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ , దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీని తన ఓవెల్ ఆఫీస్‌లో మీడియా సమక్షంలోనే డిక్టేటర్(నియంత) అంటూ తిట్టిపోశారు. అలాగే.. రామఫోసా ముందు ఓ వీడియో ప్రదర్శించి.. సౌతాఫ్రికాలో తెల్లవాళ్లను ఊచకోతలు కోస్తున్నారంటూ ఏకంగా ఓ తప్పుడు వీడియోను ప్రదర్శించి మరీ విమర్శలు గుప్పించారు.ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మినహా ఆయన ప్రత్యేకంగా ఎవరినీ ప్రశంసించింది లేదు. తాజాగా లిబీరియా అధ్యక్షుడు జోసెఫ్ బొకాయ్పై ట్రంప్ ప్రశంసలు గుప్పించారు. ఇప్పటిదాకా వైట్‌హౌజ్‌కు వచ్చిన ఏ నేత కూడా ఇంత అందంగా ఆంగ్లంలో మాట్లాడలేదంటూ.. Such good English అని ట్రంప్ వ్యాఖ్యానించారు. Where did you learn to speak so beautifully? అంటూ ఆరా తీశారు. తనకు తెలిసిన అమెరికన్ల కంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడారంటూ కితాబిచ్చారు.Trump to Liberia’s President “Your English is beautiful better than some Americans I know.” 🇱🇷😂FYI: English is Liberia’s official language.#Trump #Liberia #JosephBoakai #Politics pic.twitter.com/WidIjSWA3N— A.S (@DHAS013) July 10, 2025అయితే ఈ పొగడ్త వివాదాస్పదంగా మారింది. లిబీరియా అధికార భాష ఆంగ్లమే. పైగా బొకాయ్ లిబీరియాలోనే విద్యనభ్యసించారు. దీంతో ఆఫ్రికా అంతటా ట్రంప్ వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ఆఫ్రికన్ యూత్ యాక్టివిస్ట్ ఆర్చీ హారిస్ స్పందిస్తూ.. మా దేశం ఆంగ్ల భాష మాట్లాడే దేశం. ఈ ప్రశ్నను ప్రశంసగా కాక, అవమానంగా భావించాను అని అన్నారు.దక్షిణాఫ్రికా రాజకీయ నాయకురాలు వెరోనికా మెంటే స్పందిస్తూ.. ట్రంప్ అలా అన్నాక కూడా బొకాయ్ ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోలేదు? అని ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలపై వైట్ హౌస్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యను హృదయపూర్వక ప్రశంసగా, ట్రంప్ ఆఫ్రికా దేశాలకు మిత్రుడిగా అభివర్ణించింది. లిబీరియా.. 1822లో అమెరికన్ కాలనైజేషన్ సొసైటీ ద్వారా స్థాపించబడింది. 1847లో స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆంగ్ల భాష అధికార భాషగా ఉంది, కానీ అనేక స్థానిక భాషలు కూడా మాట్లాడబడతాయి. -
ఘనంగా ముగిసిన నాట్స్ 8వ తెలుగు సంబరాలు
ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో 8వ నాట్స్ తెలుగు సంబరాలు వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సంభరాల్లో వేలాదిమంది తరలి వచ్చారు.....వేదిక ప్రాంగణం తెలుగువాళ్ళతో క్రిక్కిరిసిపోయింది. మహాసభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, ఈ తెలుగు సంబరాలు విజయవంతానికి కృషి చేశారు.అంతే కాక సంబరాల కమిటీ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, చైర్, కో చైర్, టీం మెంబర్లు, విజయవంతానికి కృషి చేశారు. ఈ తెలుగు సంబరాల్లో నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, అల్లు అర్జున్, శ్రీలీల తో పాటు అలనాటి నటీమణులు జయసుధ, మీనా సందడి చేసారు...థమన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసారు సంబరాలకు వచ్చిన వారిని ఉర్రుతలూగించారు...తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేల నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా ఈ తెలుగు సంభరాలు అంభరాన్ని అంటాయి...నాట్స్ తెలుగు సంబరాల కోసం సైనికుల్లా పని చేసిన ప్రతి ఒక్కరికి... హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు నాట్స్ కమిటీ కన్వీనర్ పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ......ఈ వేడుకలకు వచ్చిన అతిధులకు, కమ్యూనిటీకి, కళాకారులకు, సహకరించిన వలంటీర్లు అందరికీ నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ ధన్యవాదాలుతెలియజేశారు...ఇది మన తెలుగు సంబరం జరుపుకుందాం కలిసి అందరం అనే నినాదం ప్రారంభమైన ఈ సంభరాల్లో 20 వేల మందికి పైగా హాజరయ్యారు...నాట్స్ కన్వీనర్ పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, సెక్రెటరీ మల్లాది శ్రీనివాస్చక్కని ప్రణాళిక, సమన్వయంతో తమ సత్తా చాటారు..సంబరాలే కాక సామాజిక బాద్యత గా హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి నాట్స్ 85లక్షల విరాళం అందజేసింది. ఈ విరాళాన్ని ఆస్పత్రి చైర్మన్, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు.. నాట్స్ లీడర్ షిప్ అందజేశారు. నందమూరి బాలకృష్ణ-వసుంధర దంపతులను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.. అనేక సాంస్కృతిక సామాజిక సేవ కార్యక్రమాలు సైతం విజయవంతంగా నిర్వహించారు.. -
ట్రంప్ టార్గెట్‌గా ఇరాన్ భారీ ప్లాన్.. సన్‌బాత్ సమయంలో డ్రోన్‌తో దాడికి..
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్‌గా ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా నివాసం సురక్షితం కాదని.. అధ్యక్షుడు సన్‌బాత్ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్ ట్రంప్‌ను ఢీకొట్టవచ్చని హెచ్చరించారు. దీంతో, ఇరాన్ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. మరోవైపు.. ఇరాన్ వ్యాఖ్యలకు ట్రంప్ సెటైరికల్ కౌంటరివ్వడం గమనార్హం.ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదే సమయంలో ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా సైన్యం కూడా పెద్దఎత్తున దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో తమపై దాడులకు ట్రంప్, అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ హెచ్చరించారు. ఇక, తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) సలహాదారు జావద్ లారిజాని తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇకపై ఆయన ఫ్లోరిడా నివాసం కూడా సురక్షితం కాదు. మార్-ఎ-లాగో రిసార్ట్‌లో అధ్యక్షుడు సన్‌బాత్ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్ ఆయన్ను ఢీకొట్టవచ్చని హెచ్చరించారు. ఇది చాలా సులభమైన పని అని వ్యాఖ్యానించారు. 2020లో ఇరానియన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యలో ట్రంప్ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన ఈ హెచ్చరికలు చేశారు. స్థానిక మీడియాలో ఆయన వ్యాఖ్యలు ప్రసారమయ్యాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.Larijani: "We can target Trump's navel!"Javad Larijani, in a televised program, said:"Trump can no longer sunbathe in Mar-a-Lago, because while he's lying down, a tiny drone might target his stomach and hit his navel!" pic.twitter.com/QOJfNlWpNL— Radio Faryad (@radiofaryad) July 8, 2025ట్రంప్ కౌంటర్.. ఇరాన్ అధికారి లారిజాని వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. లారిజాని వ్యాఖ్యలను ముప్పుగా భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా.. ట్రంప్ స్పందిస్తూ.. ఆయన వ్యాఖ్యలను ముప్పు అనే అనుకుంటున్నా. వాస్తవానికి అది నిజమో, కాదో తెలియదు అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ట్రంప్.. మీరు చివరిసారిగా ఎప్పుడు సన్‌బాత్‌కు వెళ్లారు అని విలేకరి అడగ్గా.. ట్రంప్ నవ్వుతూ తనకు ఏడేళ్ల వయసులో అని సమాధానం ఇచ్చారు. సన్‌బాత్ తనకు అంతగా ఇష్టం ఉండదని నవ్వుతూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.బ్లడ్ పాక్ట్ క్రౌడ్ ఫండింగ్..ఇదిలా ఉండగా.. అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్‌గా చాలా విషయాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ నాయకత్వానికి శత్రువులుగా భావిస్తున్న వారిపై, ఖమేనీని టార్గెట్ చేసిన వారిపై బ్లడ్ పాక్ట్ అనే ప్లాట్‌ఫామ్ చర్యలు తీసుకునేందుకు సిద్దమైనట్టు సమాచారం. ట్రంప్‌నకు బౌంటీ ఇవ్వాలని బ్లడ్ పాక్ట్ క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి బెదిరింపులు రావడం గమనార్హం. ఇది జులై 8 నాటికి ఇది 27 మిలియన్ డాలర్లను సేకరించినట్టు తెలుస్తోంది. -
ఎఫ్–1 వీసాలు తగ్గాయ్!
యూఎస్‌లో చదువుకోవాలని, అక్కడ స్థిరపడాలన్న భారతీయ విద్యార్థుల కలలపై ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస వ్యతిరేక విధానం తీవ్ర ప్రభావం చూపుతోంది. దాని ఫలితంగానే భారతీయ విద్యార్థులకు వీసాలు భారీగా తగ్గాయి. 2025 మార్చి–మే మధ్య జారీ అయిన ఎఫ్–1 విద్యార్థి వీసాలు.. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 27% క్షీణించాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత వలసలపై కఠిన చర్యలు తీసుకోవడం, అలాగే అభ్యర్థుల సామాజిక ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే అనుమతించడం ఇందుకు ప్రధాన కారణాలు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి అంతర్జాతీయ విద్యార్థుల జీవితాలు కష్టాల్లో పడ్డాయి. అమెరికన్ యూనివర్సిటీలు ఏటా ఆగస్టు–డిసెంబర్, జనవరి–మే సెమిస్టర్లకు రెండుసార్లు ప్రవేశాలు కల్పిస్తాయి. భారతీయ విద్యార్థులు సాధారణంగా ఆగస్టు–డిసెంబర్ సెమ్నే ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. దీని కోసం 6 నెలల ముందు నుంచే వీసా కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. అలా సాధారణంగా ఏటా మార్చి–జూలై మధ్య వీసాల సందడి ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం మార్చి–మే మధ్య భారతీయ విద్యార్థులు 9,906 ఎఫ్–1 (విద్యా) వీసాలను పొందారు. గత ఏడాది ఇదేకాలంలో 13,478 వీసాలను అందుకున్నారు. కోవిడ్–19 తర్వాత 2025 మార్చి–మే నెలల్లో అత్యల్ప స్థాయిలో వీసాలు మంజూరు అయ్యాయని అమెరికా విదేశాంగ శాఖ తాజా నివేదిక తెలిపింది. భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం మార్చి–మే నెలల్లో 2022లో 10,894, 2023లో 14,987 వీసాలు జారీ చేసింది. ఏప్రిల్ నాటికి యూఎస్ అధికారులు అక్కడి కనీసం 32 రాష్ట్రాల్లో అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేశారని ఎన్బీసీ న్యూస్ తెలిపింది. వీసా దరఖాస్తుదారుల పరిశీలన కోసం యూఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తోంది.ప్రాసెసింగ్‌కు సమయం.. విద్యార్థుల దరఖాస్తులు తగ్గడం, తిరస్కరణలు పెరగడం, ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడంలో జాప్యం వీసాల తగ్గుదలకు కారణం అయి ఉండొచ్చని యూఎస్ రాయబార కార్యాలయం చెబుతోంది. ఎఫ్–1 వీసాల ప్రాసెసింగ్‌కు ఎక్కువ సమయం పడుతుందన్న అంచనాతో దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. విద్యార్థులకు ఇచ్చే నాన్–ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుల షెడ్యూలింగ్ ప్రారంభం అయిందని, దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ కోసం సంబంధిత ఎంబసీ, కాన్సులేట్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. ‘ప్రపంచవ్యాప్తంగా వీసా జారీ ప్రక్రియ అత్యున్నత ప్రమాణాలకు లోబడి ఉందని నిర్ధారించుకోవడానికి, దరఖాస్తుల పూర్తి పరిశీలనకు తగినంత సమయం ఇవ్వడానికి కాన్సులర్ విభాగాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. వీసా దరఖాస్తుదారులకు యూఎస్‌కు లేదా మా ప్రయోజనాలకు హాని కలిగించే ఉద్దేశం లేదని, వారు కోరిన వీసా కోసం వారి అర్హతను విశ్వసనీయంగా వెల్లడించారని నిర్ధారించుకోవడానికి అనునిత్యం పని చేస్తున్నాం’ అని యూఎస్ ఎంబసీ ప్రతినిధులు చెబుతున్నారు.మనవాళ్లే ఎక్కువ.. వీసా జారీలో ఇటీవల తగ్గుదల ఉన్నప్పటికీ.. వాస్తవానికి అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య వృద్ధి గణనీయంగా ఉంది. ఓపెన్ డోర్స్ 2024 డేటా ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో యూఎస్‌లో అడ్మిషన్స్ తీసుకున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికం కావడం విశేషం. గత ఏడాది జనవరి–సెపె్టంబర్లో భారతీయ విద్యార్థులు 64,008 ఎఫ్–1 వీసాలు అందుకున్నారు. ఇదే కాలంలో 2023లో 1.03 లక్షలు, 2022లో 93,181 వీసాలు జారీ అయ్యాయి. తనిఖీలు కఠినం ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల గురించి లోతుగా పరిశీలించడం ప్రారంభించిన తరుణంలో ఈ తగ్గుదల నమోదు కావడం గమనార్హం. పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు, ప్రభుత్వ వ్యతిరేక చర్యలతో ముడిపడి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయులతో సహా అనేక మంది వ్యక్తులకు వీసాల రద్దు కూడా జరిగింది. దరఖాస్తుదారుల సోషల్ మీడియా కార్యకలాపాలపై మరింత కఠినమైన తనిఖీలను ప్రవేశపెట్టడానికి మే 27 నుంచి జూన్ 18 వరకు కొత్త దరఖాస్తులను నిలిపివేశారు. విద్యార్థి వీసా దరఖాస్తుదారుల కోసం కొత్త ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడాన్ని నిలిపివేయాలని రాయబార కార్యాలయాలు, కాన్సులర్ విభాగాలను మే నెలలో యూఎస్ ప్రభుత్వం ఆదేశించింది. అంతర్జాతీయ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలన తప్పనిసరి చేయాలని భావించడం కూడా ఇందుకు కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్, ఎం, జే విభాగాల వీసాల స్క్రీనింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి సోషల్ మీడియా ఖాతాల అయిదు సంవత్సరాల వివరాలను బహిరంగపరచాలని న్యూఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయం దరఖాస్తుదారులకు ఆదేశించింది. -
ట్రంప్ తిరుగుబాట!
ఈసారి ఎలాగైనా నోబెల్ శాంతి బహుమతి చేజిక్కించుకోవాలన్న ఆత్రపడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఆగ్రహించి ఉక్రెయిన్‌కు తిరిగి ఆయుధాలు సరఫరా చేయబోతున్నట్టు మంగళవారం ప్రకటించారు. ట్రంప్ వచ్చే నాటికే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగా దాన్ని ఆపాలంటూ పిలుపునిచ్చి పలు దఫాలు రెండు దేశాలతోనూ మాట్లాడారు. దూతల్ని పంపారు. కానీ పుతిన్ ముందు అవేమీ పనిచేయలేదు. మారణాయుధాల డ్రోన్లతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాలపై దాడులు సాగిస్తూనే ఉన్నారు. అమెరికా నుంచి ఆయుధ సరఫరా నిలిచి పోవటం, దాడులకు అనువైన వేసవి కాలం కావటం రష్యాకు కలిసొచ్చింది. తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెస్క్ ప్రాంతాన్ని కైవసం చేసుకోవటం ఆయన లక్ష్యంగా కనబడుతోంది. 2022 తర్వాత ఈ ప్రాంతంలో రష్యాది పైచేయి కావటం ఇదే తొలిసారి. ఇప్పటికే డొనెస్క్ ప్రాంతంలో మూడింట రెండొంతుల ప్రాంతం రష్యా దళాల అధీనమైంది. అక్కడి కాస్టన్టేనుకా నగరం తమ వశమైతే డొనెస్క్ ప్రాంతంలో వరసగా ఉన్న నగరాలన్నీ కుప్పకూలుతాయని ఆ దళాలు భావిస్తున్నాయి.దౌత్యం నెరపదల్చుకున్నప్పుడు నిర్దిష్టమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలి. మధ్యవర్తిగా రెండు పక్షాలతో మాట్లాడి వారి డిమాండ్లేమిటో ముందు తెలుసుకోవాలి. అటు ఉభయ పక్షాలూ కొంత తగ్గటానికి సిద్ధపడాలి. తగ్గటం మాట అటుంచి రష్యా–ఉక్రెయిన్లు రెండూ యుద్ధం కొన సాగింపులోని నిరర్థకతను గుర్తించటం లేదు. ఎప్పటిలా అమెరికా ఆయుధాలు అందజేస్తే తన వంతుగా రష్యాపై దాడులు సాగిస్తాననీ, పర్యవసానంగా ఎప్పటికైనా ఆధిక్యత సాధించగలననీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెబుతున్నారు. ఈ మాటలు మాట్లాడేది ఆయనే అయినా, పలికి స్తున్నది పాశ్చాత్య దేశాలు. ట్రంప్ ఊగిసలాట ధోరణి, దేనికీ కట్టుబడి ఉండని ఆయన వైఖరి వగైరాలు ఏదో దశలో ఉక్రెయిన్‌కు అక్కరకొస్తాయని అవి భావిస్తున్నాయి. నిజానికి ఉక్రెయిన్ ఈ యుద్ధంలో ఎప్పుడో ఓటమిపాలైంది. దాన్ని కప్పిపుచ్చటానికి బైడెన్ ఏలుబడిలోని అమెరికా, పాశ్చాత్య దేశాలూ ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌కు అధునాతన ఆయుధాలందిస్తూ రష్యా నగరాలపై, దాని యుద్ధ నౌకలపై, ఇతరేతర కీలక ప్రాంతాలపై దాడులు కొనసాగేలా చూశాయి. కానీ ట్రంప్ వచ్చాక ఆయుధ సాయం ఆగిపోయింది. ఆర్థిక సాయమూ నిలిచిపోయింది. పాశ్చాత్య దేశాలు అతి కష్టమ్మీద తమ వంతుగా ఆ బరువును భుజాలకెత్తుకున్నా అది ఏ మూలకూ చాలటం లేదు. అందుకే గత పక్షం రోజులుగా రష్యా సాగిస్తున్న వరస దాడులతో ఉక్రెయిన్‌కు ఊపిరాడటం లేదు. డొనెస్క్ నగరాన్ని రక్షించటంలో నిమగ్నమైన తన దళాలకు ఆహారమూ, ఆయుధాలూ పంపటం మాట అటుంచి కనీసం గాయపడినవారిని వెనక్కి తీసుకొచ్చే వెసులుబాటు కూడా దొరకటం లేదు. ఆ నగరం చుట్టూవున్న ప్రాంతాలన్నీ రష్యా చేజిక్కించుకుంది. నిజానికి ఈ యుద్ధం ఉక్రెయిన్ స్వయంకృతం. అమెరికా, పాశ్చాత్య దేశాల మాట విని రష్యాపై గిల్లికజ్జాలకు పోయింది. పక్షంరోజుల్లో రష్యాను దారికి తీసుకురాగలమని పాశ్చాత్య దేశాలు విశ్వసించాయి. రష్యా తమపైకి దండెత్తి వస్తే ‘నాటో’ సైన్యాలతో దాన్ని సులభంగా మట్టికరిపించగలమను కున్నాయి. ఇందుకోసం ఉక్రెయిన్‌లో తమకు అనుకూలుడైన జెలెన్స్కీకి పట్టంగట్టాయి. రష్యాతో సమవుజ్జీ కాకపోవటంతో ఇప్పటికే ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. పాశ్చాత్య దేశాల బాసటతో రష్యాకు నష్టం కలిగించిన మాట నిజమే అయినా, అదే ఇప్పుడు రష్యా పట్టుదలకు కారణమైంది. యుద్ధం ఆపాలని ట్రంప్ నేరుగా పుతిన్‌తో ఫోన్ సంభాషణలు సాగించినప్పుడు ఆయన ‘మూల కారణాల’ను ప్రస్తావించారని, అవి పరిష్కారం అయితే తప్ప యుద్ధం ఆపేది లేదన్నారని కథనాలు వెలువడ్డాయి. ఆ మూల కారణాల్లో నాటో దూకుడు ఒకటైతే, ఉక్రెయిన్ను ఉసిగొల్పటం రెండోది. యూరప్ భద్రతకు సంబంధించి కొత్త అమరిక ఉండాలని, యుద్ధం ఆగాక ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వమీయరాదని పుతిన్ కోరుతున్నారు. నాటో కూటమి ఏర్పడినప్పుడు సోవియెట్ యూనియన్ నుంచి పశ్చిమ యూరప్‌ను పరిరక్షించటమే ధ్యేయమని అది ప్రకటించింది. అదే నిజమైతే 1989లో సోవియెట్ కుప్పకూలి అనేక దేశాలుగా విడివడినాక నాటో అవసరం ఏముంది? సోవియెట్ చివరి అధినేత గోర్బచెవ్ అప్పట్లో ఒక ప్రతిపాదన చేశారు. ‘నాటోను రద్దయినా చేయండి... లేక ఆ కూటమిలో మాకు చోటైనా ఇవ్వండి’ అన్నదే దాని సారాంశం. అందువల్ల యూరప్ బలపడుతుందనీ, సౌభాగ్యవంతమవుతుందనీ ఆయన చెప్పారు. కానీ అమెరికా ఇందులో కీడు శంకించింది. యూరప్ తనను మించి ఎదుగుతుందని భయపడింది.తూర్పు యూరప్ దేశాలను నాటోలో చేర్చుకోబోమని అప్పట్లో గోర్బచెవ్కి హామీ ఇచ్చారు. కానీ అర డజను దేశాలకు సభ్యత్వమిచ్చారు. వేరే దేశాలతో సరిహద్దు తగాదాలు లేని దేశాలను మాత్రమే చేర్చుకోవాలన్న నిబంధనకు మంగళం పాడారు. చివరకు ఉక్రెయిన్ను చేర్చుకోవటానికీ సిద్ధపడ్డారు. రష్యాపైకి ఉసిగొల్పారు. వీటిని చర్చించకుండా, ఎలాంటి పరిష్కారం అవసరమో యోచించకుండా ట్రంప్ తన ట్రూత్ సామాజిక మాధ్యమం ద్వారా ‘యుద్ధం ఆపండం’టూ సందేశాలు పెడుతూ, నోబెల్ శాంతి బహుమతి కోసం ఎదురుచూస్తూ కాలం గడిపితే ఫలితం ఉండదు. ట్రంప్ నిజంగా యుద్ధం ఆపదల్చుకుంటే తటస్థ ఉక్రెయిన్‌కు పూచీపడాలి. నాటో విస్తరణ ఉండబోదని తెలపాలి. ట్రంప్ ఆ పని చేయగలరా? -
డాలస్ లో జరిగిన కారు ప్రమాదంలో తెలుగు కుటుంబం మృతి
-
త్వరలో ఇండియాతో ట్రేడ్ డీల్
న్యూయార్క్: ఇండియాతో అతి త్వరలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని, ఈ విషయంలో ఇప్పటికే చాలా సమీపంలోకి వచ్చామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇతర దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే ఉత్పత్తులపై ఎంతమేరకు సుంకాలు విధించబోతున్నామో తెలియజేస్తూ తమ అధికారులు ఆయా దేశాలకు లేఖలు పంపిస్తున్నారని వెల్లడించారు. యునైటెడ్ కింగ్డమ్(యూకే), చైనాతో తాజాగా ట్రేడ్ డీల్ కుదిరిందని, ఇకపై భారత్‌తో ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చేశామని అన్నారు.స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. లేఖలు పంపించడం వరకే తమ బాధ్యత అని, తమతో ఒప్పందానికి ముందుకు రావాలో వద్దో ఆయా దేశాలే తేల్చుకోవాలని, తుది నిర్ణయం వారిదేనని పరోక్షంగా స్పష్టంచేశారు. కొన్ని దేశాలు తమ ఉత్పత్తులపై 200 శాతం దాకా సుంకాలు విధిస్తున్నాయని, అమెరికాను దోచుకోవడమే వాటి విధానామా? అని ప్రశ్నించారు. ఇకపై అమెరికాలో ఉత్పత్తులు విక్రయించుకోవాలంటే సుంకాలు చెల్లించకతప్పదని తేలి్చచెప్పారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని, ఆ ఘనత తనకే చెందాలని ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. మాట వినకపోతే వ్యాపారం, వాణిజ్యం నిలిపివేస్తానని హెచ్చరించడంతో ఆ రెండు దేశాలు దారికొచ్చాయని అన్నారు.విదేశాలపై ఏప్రిల్ 2న విధించిన సుంకాల తాత్కాలిక రద్దును ట్రంప్ సర్కారు ఆగస్టు 1వ తేదీ దాకా పొడిగించిన సంగతి తెలిసిందే. మరోవైపు ట్రంప్ సంతకంతో అమెరికా ప్రభుత్వం లేఖలు పంపించిన దేశాల జాబితాలో ఇండియా లేకపోవడం గమనార్హం. బంగ్లాదేశ్, బోస్నియా, కాంబోడియా, ఇండోనేషియా, జపాన్, కజకిస్తాన్, మలేషియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, టునీíÙయా తదితర దేశాలకు ఈ లేఖలు అందాయి. మయన్మార్, లావోస్‌పై 40 శాతం టారిఫ్ మయన్మార్, లావోస్‌పై డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ మోత మోగించారు. రెండు దేశాల ఉత్పత్తులపై 40 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయా దేశాల అధినేతలకు రాసిన లేఖలను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. అలాగే కాంబోడియా, థాయ్‌లాండ్‌పై 36 శాతం, సెర్బియా, బంగ్లాదేశ్‌పై 35 శాతం, ఇండోనేíÙయాపై 32 శాతం, దక్షిణాఫ్రికా, బోస్నియా, హెర్జిగోవినాపై 30 శాతం, కజకిస్తాన్, మలేషియా, టునీíÙయాపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవి ఆగస్టు 1 నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఈ టారిఫ్‌లకు ప్రతీకారంగా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు పెంచే ఆలోచన చేయొద్దని ఆయా దేశాల అధినేతలను సున్నితంగా హెచ్చరించారు. జపాన్, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. బ్రిక్స్‌పై 10 శాతం సుంకాలుపునరుద్ఘాటించిన ట్రంప్న్యూయార్క్/వాషింగ్టన్: బ్రిక్స్ కూట మిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. తమ దే శాన్ని, కరెన్సీ (డాలర్) ఆధిపత్యాన్ని దెబ్బ తీసేందుకే అది ఆవిర్భవించిందని మంగళవారం ఆరోపించారు. ‘‘డాలర్‌కు అంతర్జాతీయంగా ఉన్న విలువను నాశ నం చేసేందుకు బ్రిక్స్ దేశాలు ప్రయ త్ని స్తున్నాయి. తెలివైన అధ్యక్షుడెవరూ అలా జరగనివ్వరు. అది ఒక పెద్ద ప్రపంచ యుద్ధంలో ఓటమి చవిచూడటం వంటిదే.అలా ఎప్పటికీ జరగనివ్వం. ప్రపంచ కరెన్సీల్లో ఇప్పటికీ, ఎప్పటికీ డాలరే కింగ్. దాని ఆధిపత్యాన్ని సవాలు చేయాలనుకుని బ్రిక్స్ దేశాలు అనుకుంటే, తద్వారా మాతో ఆటలు ఆడాలనుకుంటే అభ్యంతరం లేదు. కానీ అందుకు మూల్యంగా వాటన్నింటిపైనా మరో 10 శాతం సుంకాలు విధించి తీరతాం. కేవలం బ్రిక్స్‌కూటమిలో ఉన్నందుకు అవి చెల్లించాల్సిన భారీ మూల్యమిది. అందుకు అవి సిద్ధంగా ఉన్నాయని నేను భావించడం లేదు’’ అన్నారు. -
భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి మరింత చేరువయ్యాం: ట్రంప్
భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందానికి మరింత చేరువయ్యామని వ్యాఖ్యానించారాయన. 14 దేశాలకు టారిఫ్ లేఖలు పంపిన తదనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజాగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూకు ఇచ్చిన ప్రైవేట్ డిన్నర్ సందర్భంగా ట్రంప్ భారత వాణిజ్య ఒప్పందంపై వ్యాఖ్యానించారు. ‘‘భారత్‌తో ఒక గొప్ప ఒప్పందం జరగబోతోంది. ఇది చాలా ప్రత్యేకమైన డీల్ అవుతుంది’’ అని అన్నారు. ఇప్పటికే యూకే, చైనాతో ఒప్పందాలు కుదిరాయన్న ఆయన.. ఇతర దేశాలు అమెరికా షరతులకు అంగీకరించకపోతే సుంకాల మోత తప్పదని హెచ్చరించారు. వారు(ఒప్పందాలకు దిగిరాని వారు) ఎంత టారిఫ్ చెల్లించాలో లేఖలో చెబుతున్నాం అని ట్రంప్ చెప్పారు. భారత్‌కు కలిగే లాభాలు:మార్కెట్ ప్రాప్యత: అమెరికా మార్కెట్‌కు భారత ఉత్పత్తులకు ఎగుమతుల అవకాశాలు పెరగొచ్చు.తక్కువ దిగుమతి సుంకాలు: భారత్‌కు వస్తువులు దిగుమతి చేసుకునే ఖర్చు తగ్గవచ్చు.టెక్నాలజీ ట్రాన్స్ఫర్: మౌలిక సదుపాయాలు, హైటెక్ రంగాల్లో భాగస్వామ్యం మెరుగుకావొచ్చు.భద్రతా సహకారం: వ్యూహాత్మక మైత్రి బలపడే అవకాశం ఉంటుంది.మరోవైపు.. భారత వాణిజ్య ప్రతినిధి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం వాషింగ్టన్లో చర్చలు జరుపుతోంది. వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్‌లు, డిజిటల్ గోప్యత, పౌర హక్కులు వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఒప్పందం కుదరకపోతే, తాత్కాలికంగా నిలిపిన 26% దిగుమతి సుంకాలు మళ్లీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈ ఒప్పందం కుదిరితే మాత్రం రెండు దేశాల ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశం లేకపోలేదు. ఏ దేశాలపై.. ట్రంప్ ఎంతెంత టారిఫ్ (ఆగస్టు 1 నుంచి అమలు):దేశంటారిఫ్ శాతంజపాన్, దక్షిణ కొరియా, కజకస్తాన్, మలేషియా, ట్యునీషియా25%మయన్మార్, లావోస్40%దక్షిణాఫ్రికా, బోస్నియా30%ఇండోనేషియా32%బంగ్లాదేశ్, సెర్బియా35%కంబోడియా, థాయిలాండ్36% -
మమ్దానీని వెంటాడుతున్న పాత పోస్టులు.. ఏం జరగనుంది?
న్యూయార్క్: న్యూయార్క్ నగర మేయర్ పదవికి పోటీ పడుతున్న జొహ్రాన్ మమ్దానీ చిక్కుల్లో పడ్డారు. 2015లో మమ్దానీ ‘ఎక్స్’లో అల్ ఖైదా ఉగ్రవాదికి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అతడిని వెంటాడుతున్నాయి. అమెరికాలో జన్మించిన అన్వర్ అల్–ఔలాకీ అనే మత బోధకుడు తీవ్రవాదం బాట పట్టడానికి ఎఫ్‌బీఐ నిఘా కారణం కావచ్చు అంటూ అప్పట్లో ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన అప్పటి వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీశాయి.అయితే, వందశాతం కమ్యూనిస్ట్ పిచ్చోడంటూ మమ్దానీని ఉద్దేశించి అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన తర్వాతర ఆయన పాత పోస్టులు తాజాగా వెలుగు చూశాయి. న్యూమెక్సికోలో యెమెన్ దేశస్తుల కుటుంబంలో జన్మించిన ఔలాకీ అమెరికాలోని మసీదుల్లో బోధనలు చేసేవాడు. అటు తర్వాత అల్‌ఖైదాలో అగ్ర నాయకుల్లో ఒకడయ్యాడు.అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్ తదితరాలపై 2001 సెప్టెంబర్ 11న దాడులకు పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులు ఇతడికి సన్నిహితులని తేలడంతో ఎఫ్‌బీఐ నిఘా పెంచింది. అటు తర్వాత అతడు 2004లో యెమెన్‌కు వెళ్లిపోయాడు. అమెరికా ఆస్తులపై దాడులు ఇతడు ఉగ్రవాదులకు పిలుపు ఇచ్చాడనే ఆరోపణలపై 2011లో అధ్యక్షుడు ఒబామా ఆదేశాల మేరకు యెమెన్‌పై జరిపిన డ్రోన్ దాడుల్లో హతమయ్యాడు. ఎలాంటి నేరారోపణలు లేని అమెరికా పౌరుడిని ప్రభుత్వమే చంపడం అసాధారణ విషయమని న్యూయార్క్ పోస్ట్ అప్పట్లో వ్యాఖ్యానించింది. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కి చెందిన కుటుంబం సజీవ దహనం
కుత్బుల్లాపూర్: అమెరికాలోని డాలస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. ఆదివారం రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు కారును ఢీకొట్టింది. దీంతో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న శ్రీ వెంకట్, తేజస్విని దంపతులతోపాటు కొడుకు సిద్ధార్థ, కూతురు మృద కాలిపోయారు. తిరుమలగిరికి చెందిన పశుపతినాథ్–గిరిజ దంపతుల కుమారుడు శ్రీ వెంకట్‌కు జీడిమెట్లకు చెందిన తేజస్వినితో 2013లో వివాహం జరిగింది.పశుపతినాథ్ కొంపల్లి ఎన్‌సీఎల్‌లో నివాసముంటున్నారు. ఉద్యోగ నిమిత్తం మూడేళ్ల క్రితం కుటుంబంతో సహా శ్రీ వెంకట్–తేజస్విని దంపతులు డాలస్‌కు వెళ్లారు. శ్రీ వెంకట్ సోదరి దీపిక అట్లాంటాలో ఉండగా, మూడు రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి అక్కడకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టగా మంటలు చెలరేగి నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే వీరితో పాటు ప్రయాణించాల్సిన శ్రీవెంకట్ తల్లిదండ్రులు విమానంలో డాలస్‌కు వచ్చారు. తమ కొడుకు ఇంటికి రాలేదంటూ ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. -
బ్రిక్స్‌కు మద్దతిచ్చే దేశాలపై 10% అదనపు సుంకాలు: ట్రంప్
వాషింగ్టన్/బీజింగ్: బ్రిక్స్ కూటమివి అమెరికా వ్యతిరేక విధానాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆ కూటమికి మద్దతిచ్చే ఏ దేశమైనా తమనుంచి 10 శాతం అదనపు సుంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని సోమవారం హెచ్చరించారు. ‘‘బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలతో జతకట్టే ఏ దేశం మీదైనా అదనంగా 10% సుంకం విధిస్తాం. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవు’’ అని ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. కొత్త టారిఫ్ నియమాలు, సవరించిన వాణిజ్య ఒప్పంద నిబంధనలను వివరిస్తూ ఆయా దేశాలకు తక్షణం అధికారిక లేఖలు పంపుతున్నట్టు ప్రత్యేక పోస్టులో తెలిపారు. ట్రంప్ ప్రకటనను చైనా తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఇలా సుంకాలను ఆయుధంగా వాడటం దారుణమని మండిపడింది. ఇది ఎవరికీ లాభం చేయబోదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. ‘‘అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి బ్రిక్స్ ఒక వేదిక. అది ఏ దేశానికీ వ్యతిరేకంగానో, లక్ష్యంగానో లేదు’’ అని స్పష్టం చేశారు.ఖండించిన రియో డిక్లరేషన్బ్రెజిల్లోని రియోడి జనీరోలో జరిగిన బ్రిక్స్ తాజా శిఖరాగ్ర సమావేశం అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. ట్రంప్ సుంకాల విధానాలను బ్రిక్స్ దేశాధినేతలు తీవ్రంగా విమర్శించారు. ‘రియో డి జనీరో డిక్లరేషన్’లో ఈ మేరకు స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘సుంకాలను విచక్షణారహితంగా పెంచడం ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీసి మరింత తగ్గించే ప్రమాదముంది. ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల్లో అనిశ్చితికి కారణమవుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నియమాల ఆధారిత, బహిరంగ, పారదర్శక, న్యాయమైన, సమానమైన బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థకు తమ మద్దతును పునరుద్ఘాటించారు. అనంతరం దీనిపై ట్రంప్ మరోసారి తీవ్రంగా ప్రతిస్పందించారు. అమెరికా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న దేశాలపై 10% అదనపు సుంకాలు తప్పవని పునరుద్ఘాటించారు. భారత్‌తో సహా అనేక దేశాల దిగుమతులపై అదనపు సుంకాలను ప్రకటించిన ట్రంప్ తర్వాత వాటి అమలును 90 రోజుల పాటు నిలిపేయడం తెలిసిందే. ఆ గడువు జూలై 9తో ముగుస్తుంది. తదనంతరం అమెరికా మార్కెట్లోకి ప్రవేశించే భారత వస్తువులపై అదనంగా 26 శాతం దిగుమతి సుంకం పడుతుంది. ప్రస్తుత సుంకాల బెదిరింపులతో ఆ భారాన్ని మరింత పెంచనుంది. -
మస్క్‌ను చూస్తే జాలేస్తోంది.. అమెరికా అధ్యక్షుడి సంచలన ఆరోపణలు
అమెరికాలో రాజకీయంగా మరో సంచలనం రేగింది. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా పార్టీ ఏర్పాటుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మస్క్ పార్టీని అసంబద్ధమైనదిగా ఆయన అభివర్ణిస్తూ.. తీవ్ర ఆరోపణలే చేశారాయన. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. పరిపాలన సజావుగా సాగిపోతోంది. మరోవైపు డెమొక్రట్లు తమ ప్రాబల్యం కోల్పోతున్నారు. అయినప్పటికీ అమెరికా రాజకీయ వ్యవస్థ ఈ రెండు పార్టీలకు అనుకూలంగా ఉంది. ఈ తరుణంలో మూడో పార్టీ ఏర్పాటు అనేది అసంబద్దమైన చర్య. మూడో పార్టీ అమెరికా చరిత్రలో ఎప్పుడూ విజయవంతం కాలేదు అని ట్రంప్ అన్నారు. మూడో పార్టీని ఎవరు ఏర్పాటు చేసుకున్నా(మస్క్‌ను ఉద్దేశిస్తూ..) తమకేం ఫరక్ పడదని, అయితే ఆ పార్టీ వల్ల అమెరికా రాజకీయాల్లో గందరగోళం నెలకొంటుంది. దేశంలో అస్తవ్యస్తత నెలకొని కలహాలు చెలరేగే అవకాశమూ ఉంది అని ట్రంప్ హెచ్చరించారు. మస్క్ గతంలో తనకు మద్దతు ఇచ్చినా.. ఇప్పుడు పూర్తిగా మారిపోయారని ట్రంప్ అంటున్నారు. ‘‘మస్క్‌ను చూస్తే జాలేస్తోంది. గత ఐదువారాలుగా ఆయన అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఓ పోస్ట్ చేశారు. నేను ప్రవేశపెట్టిన బిల్లులో Electric Vehicle (EV) Mandate రద్దు చేయడం ముఖ్యాంశంగా ఉంది. దీని వల్ల ప్రజలు ఇకపై గ్యాస్, హైబ్రిడ్ లేదా కొత్త టెక్నాలజీ వాహనాలను స్వేచ్ఛగా కొనుగోలు చేయవచ్చు. అయితే మస్క్ గతంలో ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చి.. ఇప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అంతేకాదు.. మస్క్ తన సన్నిహితులను NASA చీఫ్‌గా నియమించాలనుకున్నారు. కానీ ఆ వ్యక్తి రిపబ్లికన్ పార్టీకి మద్దతు లేని డెమొక్రాట్ కావడం వల్లే అలా నియమించడం అనుచితమని భావించా. అమెరికా ప్రజలను రక్షించడమే నా ముందుకు ప్రధాన కర్తవ్యం’’ అంటూ ట్రంప్ పోస్టులో ప్రస్తావించారు.ఇదిలా ఉంటే.. బిగ్ బ్యూటీఫుల్ బిల్లును వ్యతిరేకిస్తూ ట్రంప్ పాలనా విభాగం డోజ్ నుంచి బయటకు వచ్చేసిన ఎలాన్ మస్క్ విమర్శలను తీవ్రతరం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో బిల్లు ఆమోదం గనుక పొందితే మూడో పార్టీ పెడతానంటూ చెబుతూ వచ్చారు. తాజాగా అదీ జరగడంతో శనివారం రాత్రి తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(పూర్వపు ట్విటర్)లో ‘అమెరికా పార్టీ’ని ప్రకటించారు. అమెరికాలో రెండు ప్రధాన పార్టీలు.. ఒకే పార్టీ వ్యవస్థగా మారిందని, ప్రజలకు తిరిగి స్వేచ్ఛ ఇవ్వడమే తన లక్ష్యమని చెబుతూ అమెరికా పార్టీ పేరును ప్రకటించారు. అలాగే.. ప్రజలలో 65% మంది మూడవ పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఓ పోల్‌ను చూపించారు. ఈ క్రమంలో ట్రంప్ ప్రవేశపెట్టిన భారీ ఖర్చుల బిల్లును(బిగ్ బ్యూటీఫుల్ బిల్)ను మరోసారి తీవ్రంగా విమర్శించారు. -
‘రెండు తలల పాము’తో మస్క్ ఎలక్షన్ ‘వెర్రి’!
వాషింగ్టన్: అమెరికా (usa) రాజకీయాల్లో కీలక మలుపు అంటూ,. ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (elon musk) రాజకీయ రంగంలోకి వస్తున్నానంటూ ఆయన స్వయంగా షేర్ చేసిన కొత్త పార్టీ ప్రకటన.. తాజాగా పెద్ద చర్చకు దారి తీసింది. ‘ది అమెరికా పార్టీ’ (the america party) అనే పేరుతో మూడో రాజకీయ శక్తిని ప్రకటించిన మస్క్, ఆ పార్టీకి రెండు తలల పాము మీమ్‌ను షేర్ చేశారు. కానీ మస్క్ నిజంగానే కొత్త పార్టీని పెట్టారా.. ?లేక జనాల్ని వెర్రివాళ్లను చేయడానికే ఇలా చేశారా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే.. అమెరికన్ చట్టాల ప్రకారం..ఆయన అధ్యక్షుడిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు అనర్హులు. దీంతో మస్క్ కొత్త పార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మస్క్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదంటే.. కొత్త పార్టీ లేదు. ఏమీ లేదు. తూచ్ అని పక్కకు తప్పుకుంటారా? అని చూడాల్సి ఉండగా.. మస్క్ సౌతాఫ్రికన్ పౌరుడుమస్క్ 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా, అమెరికన్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన అనర్హులు. ప్రస్తుత అమెరికా రాజ్యాంగాల ప్రకారం.. ఆర్టికల్ 2, సెక్షన్ 1 ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సదరు అభ్యర్థి అమెరికా పౌరుడై ఉండాలి. తద్వారా మస్క్‌కు అర్హత లేదు. కారణం ఆయన జన్మస్థలం దక్షిణాఫ్రికా కావడం. మస్క్ పార్టీపై సవాలక్ష ప్రశ్నలుఈ నేపథ్యంలో, మస్క్ పార్టీ విస్తరణకు ముందు వ్యతిరేక వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయన మాత్రం అధ్యక్ష పదవిపై నిర్ణయం వచ్చే ఏడాది చెబుతానంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ.. మస్క్ టార్గెట్ ఏంటి? అమెరికాను పాలించాలని చూస్తున్నారా? పార్టీగా ప్రభావం చూపాలని అనుకుంటున్నారా? అనేది సదరు అమెరికన్ పౌరుల్లో పుట్టుకొస్తున్న సవాలక్ష ప్రశ్నలు.. ఈ ప్రశ్నలన్నింటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. మస్క్‌కే మద్దతు ఈ క్రమంలో మస్క్ కొత్త పార్టీ ఏర్పాటు? అందుకు గల కారణాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీలు ప్రజల స్వేచ్ఛను హరించుతున్నాయని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదించిన కీలక ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, మస్క్ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జులై 4న తన కొత్త పార్టీని ప్రకటించారు. ముందుగా కొత్త పార్టీ స్థాపన విషయంలో నెటిజన్ల అభిప్రాయాల్ని సేకరించారు. కొత్త పార్టీకి మద్దతుగా 1.2మిలియన్ల మంది నెటిజన్లు స్పందించారు. దాదాపు 80 శాతం మంది మస్క్‌కు మద్దతు తెలిపారు. ఈ ఫలితాల ఆధారంగా, ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆయన కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.త్వరలోనే పార్టీ లోగో ప్రకటనపార్టీ పేరు ది అమెరికా పార్టీగా నామకరణం చేసినా.. పార్టీ గుర్తును రెండు తలల పాము మీమ్‌ను షేర్ చేస్తూ తన పార్టీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నిలబడుతుందనే సంకేతాలిచ్చారు. ఇది అధికారిక పార్టీ లోగోగా ప్రకటించలేదు కానీ.. ప్రారంభ దశలో పార్టీ భావజాలానికి ప్రతీకగా ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీకి ప్రత్యేక లోగో, జెండా, రంగులు ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికల్లో మస్క్ పోటీఇక వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో 2–3 సెనేట్ స్థానాలు, 8–10 ప్రతినిధుల సభ స్థానాల్లో ఎలాన్ మస్క్ పోటీ చేయనున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం. తన పార్టీ ద్వారా ప్రజల గొంతుకను వినిపించడమే తన పార్టీ ఉద్దేశమనే నినాధాలతో ప్రజల్లోకి వెళ్లనుంది. ఎన్నికల్లో మస్క్ లేజర్ ఫోకస్ వ్యూహం అమెరికాలో ప్రతినిధుల సభ (House of Representatives) సభ్యుల పదవీకాలం కేవలం 2 సంవత్సరాలు. పదవీ కాలం పూర్తయిన వెంటనే ప్రతినిధుల సభ (House of Representatives) లోని 435 స్థానాలకు, సెనేట్ (Senate) లోని 34 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తన పార్టీ సైతం ఈ ఎన్నికల బరిలో దిగేలా ఎలాన్ మస్క్ లేజర్ ఫోకస్ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ఈ స్ట్రాటజీ ప్రకారం దేశంలోని అన్నీ స్థానాల్లో పోటీ చేయకుండా.. కేవలం గెలిచే స్థానాల్లో పోటీకి దిగడం, గెలుపు సమీకరణాల్ని మార్చే ప్రయత్నం చేయడం వంటి అంశాలు దీని కిందకే వస్తాయి.మస్క్ ముందున్న సవాళ్లుకాగా,మస్క్ సంపద, ప్రభావం ఉన్నప్పటికీ, మూడో పార్టీగా ఎదగడం సవాలుతో కూడుకున్నదే. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరుఫున మస్క్ ప్రచారం చేశారు. ఆ సమయంలో నేను అమెరికా అధ్యక్షుడిని కాలేను. ఎందుకంటే? నేను సౌతాఫ్రికాలో జన్మించాను. మా తాత అమెరిన్. నేను ఆఫ్రికన్. కాబట్టి నేను అమెరికాకు అధ్యక్షుడిని కాలేను. రాకెట్లను, కార్లను నిర్మించడమే తన లక్ష్యమని చెప్పుకున్న మస్క్ ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీ ప్రకటించడం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని పరోక్ష సంకేతాలివ్వడంపై అమెరికన్లు పెదవి విరుస్తున్నారు. మస్క్‌కు ఎలక్షన్ ఎర్రి ఉందంటూ మండిపడుతున్నారు. -
ప్రతి బిడ్డ కల ఇది..! వీడియో వైరల్
తల్లిదండ్రులు పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వాళ్లు కోరుకున్న చదువు అందుకోవాలని ఆస్తిపాస్తులను అన్నింటిని అమ్మి, అప్పుల్లో కూరుకుపోడవడానికి కూడా సిద్ధపడతారు. అయితే పిల్లలు మంచి పొజిషన్లో సెటిల్ అయ్యాక తమ తల్లిదండ్రుల చేసిన త్యాగాలను మరవకుండా..వారిని మంచిగా చూసుకుంటే అదే పదివేలు వారికి. ఇక్కడ అలానే ఓ కుమారుడు తన తల్లిదండ్రుల త్యాగాలకు సరైన ఫలితం దక్కాలని ఏం చేశాడో తెలిస్తే విస్తుపోతారు. బంధాల విలులకు సరైన నిర్వచనం ఇది కదా అనిపిస్తుంది. అమిత్ కశ్యప్ అనే టెకీ తన తల్లిందడ్రులను విమానంలో లాస్ వేగాస్ తీసుకువచ్చాడు. ఎన్నడు తమ ఊరు నుంచి బయటకు రానివారు తొలిసారి కొడుకుతో కలిసి అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కారు. ఆ వృద్ధ తల్లిదండ్రులు విమానం కిటికీలోంచి చూస్తున్న దృశ్యాలు, వాళ్ల ముఖకవళికలను ఓ వీడియోల రికార్డు చేసి మరి షేర్ చేసుకున్నారు కశ్యప్. అలాగే లాస్ వేగాస్‌లో అడుపెట్టాక ఓ కారులో ఇరువురు రద్దీగా ఉండే వీధులు, జీవన విధానం తిలకిస్తున్న దృశ్యాలు వంటివి వీడియోలో కనిపిస్తాయి. అంతేగాదు పోస్ట్‌లో తన తల్లిదండ్రులు ఎప్పుడు ఊరి విడిచిపెట్టలేదని, అయితే పెద్ద పెద్ద కలలు కంటున్న కొడుకుని వెన్నుతట్టి ప్రోత్సహించారని అన్నారు. దాని ఫలితం వారికి అందించాలనే ఇలా చేశా అని రాసుకొచ్చారు. అంతలా మనకోసం అన్నింటిని వదులుకున్న మన తల్లిందండ్రులకు నిశబ్దంగా వారు ఊహించనిది ఇవ్వాల్సిన బాధ్యత మనదే అని అన్నారు. నెటిజన్లు కూడా ఇది ప్రతిబిడ్డ కల అని, మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ అతడిపై ప్రశంసల జల్లు కురిపించారు. View this post on Instagram A post shared by Amit Kashyap (@realamitkashyap) (చదవండి: ఫ్యామిలీతో వెళ్లాలంటే బిజినెస్ క్లాస్ వద్దు..! వైరల్‌గా సీఈవో పోస్ట్..) -
‘ఇతరుల జోక్యం లేకుండా’.. దలైలామాకు అమెరికా శుభాకాంక్షలు
వాషింగ్టన్: ఈరోజు (జూలై 6) టిబెటన్ల ఆధ్మాత్మిక గురువు దలైలామా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. అయితే అమెరికా దలైలామాకు ప్రత్యేక సందేశంతో శుభాకాంక్షలు తెలిపింది. ఒకవైపు టిబెటిన్లకు మద్దతు పలుకుతున్నట్లు, మరోవైపు చైనాను హెచ్చరిస్తున్నట్లు అమెరికా సందేశం ఉండటం విశేషం.90వ పుట్టినరోజు జరుపుకుంటున్న దలైలామాకు అమెరికా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. టిబెటన్లు తమ మత పెద్దలను స్వేచ్ఛగా, ‘ఇతరుల జోక్యం లేకుండా’ ఎన్నుకునే సామర్థ్యాన్ని కాపాడుకునేందుకు అమెరికా మద్దతు ఇస్తుందని పేర్కొంది. ప్రపంచానికి దలైలామా ఐక్యత, శాంతి, కరుణల సందేశాన్ని అందిస్తూ, ప్రజల్లో శాంతి నెలకొల్పుతున్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు.చైనా పేరు ఎత్తకుండానే రూబియో.. టిబెటన్ల సాంస్కృతిక, మత స్వేచ్ఛకు అమెరికా మద్దతు ఇస్తుందనే సందేశాన్ని తెలియజేశారు. టిబెటన్ల హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు యునైటెడ్ స్టేట్స్ కట్టుబడి ఉందన్నారు. టిబెటన్ల ప్రత్యేక భాష, సాంస్కృతిక, మతపరమైన వారసత్వాన్ని కాపాడే ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తున్నామని, ఇతరుల జోక్యం లేకుండా వారు మత పెద్దలను స్వేచ్ఛగా ఎన్నుకునే సామర్థ్యాన్ని కాపాడుతామని అన్నారు. తదుపరి దలైలామాను ఎన్నుకునే హక్కు తమకే ఉందని చైనా చెబుతున్న ప్రస్తుత తరుణంలో అమెరికా వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కాగా టిబెట్‌పై చైనా చారిత్రక అధికారాన్ని డిమాండ్ చేస్తోంది. సామ్రాజ్య యుగం నాటి సంప్రదాయాలను గుర్తుచేస్తూ, తదుపరి దలైలామాను ఆమోదించే హక్కు తమకే ఉందని బీజింగ్ తరచూ చెబుతోంది. టిబెట్‌లో అనుసరించే మతపరమైన ఆచారాలపై కఠినమైన నియంత్రణను కొనసాగిస్తోంది. -
ఎలాన్ మస్క్ పార్టీ ప్రకటన.. అమెరికాలో మూడో పార్టీ సక్సెస్ ఎలా ఉందంటే?
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘ది అమెరికా పార్టీ’ స్థాపిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో, అమెరికాలో మరోసారి మూడో రాజకీయ పార్టీ అంశం తెరపైకి వచ్చింది. కాగా.. దీనిని రిపబ్లికన్, డెమొక్రటిక్ అనే రెండు పార్టీల వ్యవస్థకు సవాల్‌గా మస్క్ అభివర్ణించారు.అయితే, పార్టీ అధికారికంగా నమోదైనట్లు ఫెడరల్ ఎలక్టోరల్ కమిషన్ ఇంకా ధ్రువీకరించలేదు, దానికి సంబంధించి ఇంకా ఎలాంటి పత్రాలనూ కమిషన్ ప్రచురించలేదు. ఆ పార్టీ అధికారికంగా నమోదైందా? లేదా? అనేది అమెరికా ఎన్నికల అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఆ పార్టీని ఎవరు నడిపిస్తారు, ఎలా ఉండబోతోందనే విషయాలను మస్క్ కూడా వెల్లడించలేదు. ఒకవేళ మస్క్ పార్టీని ఎన్నికల గుర్తిస్తే మూడో పార్టీ అవతరించే అవకాశం ఉంది. మస్క్ పార్టీ ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తికరంగానే మారనుంది.రెండు పార్టీలదే హవా..ఇక, ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో మెజార్టీ అధ్యక్షులు కేవలం రెండు పార్టీల నుంచే వచ్చారు. అవే రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి. గత అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. ఇదిలా ఉండగా.. అమెరికా ఇప్పటికే పలుమార్లు కొందరు వ్యక్తులు మూడో పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కేవలం ఒకే ఒకరు జార్జ్ వాషింగ్టన్ మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి.. అమెరికాకు అధ్యక్షుడు అయ్యారు. ఆయన 1789-97 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. ఇదిలా ఉండగా.. అమెరికా రాజకీయ చరిత్రను పరిశీలిస్తే.. పలు పార్టీలను కొందరు నాయకులు ప్రారంభించినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కేవలం ఒకటి, రెండు పార్టీలు మాత్రమే ఎన్నికల్లో ఓట్లను చీల్చగలిగాయి. అంతే తప్ప అధికారంలోకి మాత్రం రాలేకపోయాయి. మెజార్టీ నేతలు తమ మార్కును ఎన్నికల్లో చూపించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మాస్క్ కొత్త పార్టీ.. అమెరికాలో ఎంత మేరకు ప్రభావం చూపించనుంది అనేది ఆసక్తికరంగా మారింది. అమెరికన్లు మస్క్‌ను ఎలా ఆదరిస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది.అమెరికాలో మూడో పార్టీ చరిత్ర ఇలా..Anti-Masonic Party (1828): ఇది అమెరికాలో మొట్టమొదటి మూడో పార్టీగా గుర్తించబడుతుంది. మాసన్రి సంస్కృతిని వ్యతిరేకిస్తూ ఏర్పడింది.Liberty Party (1840): దాస్యవ్యవస్థను వ్యతిరేకించడానికి ఏర్పడింది.Free Soil Party (1848): స్లేవరీ విస్తరణకు వ్యతిరేకంగా.Know-Nothing Party (1850): మైగ్రేషన్, కాథలిక్ వ్యతిరేక భావాలతో పనిచేసింది.Populist Party (People’s Party, 1890s): రైతుల హక్కులు, ఫెడరల్ బ్యాంక్ రిఫార్మ్స్, డైరెక్ట్ సెనేటర్ ఎలెక్షన్స్ వంటివి మద్దతుగా ఉంది.Progressive Party (1912): టెడి రూజవెల్ట్ నాయకత్వంలో ఏర్పడింది. సామాజిక న్యాయం, కార్మిక హక్కులు, వ్యాపార నియంత్రణపై దృష్టి సారించింది.Socialist Party (1901-1950): యుజీన్ డెబ్స్ వంటి నాయకులు ప్రముఖులుగా నిలిచారు.Libertarian Party (1971): వ్యక్తిగత స్వేచ్ఛ, ఉచిత మార్కెట్ సిద్ధాంతాలపై నమ్మకంతో ఏర్పడింది.Green Party (1990): పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, శాంతి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రారంభమైంది.Reform Party (1995): రాస్ పెరో స్థాపించాడు. ప్రభుత్వ ఖర్చులు తగ్గింపు, కరపన్ను సవరణలు వంటివి ప్రధాన అంశాలు.అయితే, అమెరికాలో పలు పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ కేవలం మూడు పార్టీలు మాత్రమే ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించాయి.Theodore Roosevelt (Progressive Party 1912): మూడో పార్టీ అభ్యర్థిగా అత్యధిక ఓట్లు (27%) పొందిన అభ్యర్థి.Ross Perot (Independent/Reform Party 1992): సుమారు 19% ఓటు బ్యాంక్ సంపాదించాడు.George Wallace (American Independent 1968) : ఐదు రాష్ట్రాల్లో విజయం సాధించారు.Ralph Nader (Green Party 2000): ఎన్నికల్లో డెమోక్రాట్ల ఓటు చీల్చాడనే వాదన ఉంది.RFK Jr Cornel West (Independent 2024): ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ప్రభావం చూపించకలేకపోయారు. ఇప్పటి వరకు మూడో రాజకీయ పార్టీ, అభ్యర్థి సాధించిన ఓట్ల శాతం.. -
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పై యుద్ధం ప్రకటించిన మస్క్
-
టెక్సాస్ అతలాకుతలం.. చిన్నారులు సహా 51 మంది మృతి
కెర్విల్లె: అమెరికాలోని టెక్సాస్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికి వరకు 51 మృతి చెందగా.. పలువురు గల్లంతు అయ్యారు. తాజాగా సమ్మర్ క్యాంప్‌పైకి వరద దూసుకెళ్లిన ఘటనలో 23 మంది బాలికలు గల్లంతయ్యారు. కనిపించకుండా పోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.కొన్ని నెలలపాటు కురవాల్సిన వాన గురువారం రాత్రి సమయంలో అనూహ్యంగా కేవలం కొన్ని గంటల్లోనే కురిసిందని అధికారులు తెలిపారు. గ్వాడలుపె నది సమీపంలోని హంట్ అనే చిన్న పట్టణం వద్ద ‘క్యాంప్ మిస్టిక్’పేరుతో నిర్వహించే సమ్మర్ క్యాంప్‌లో 750 మంది బాలికలు పాల్గొన్నారు. వరద ప్రమాదం ముంచుకు రావడంతో అధికారులు కొందరు బాలికలను హెలికాప్టర్ ద్వారా తరలించారు. మిగతా వారిని వంతెన మీదుగా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. పలుచోట్ల వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. Good morning. Please keep Texas in your prayers—especially the flood victims, the missing, their families, and the first responders searching for them.Tragedy in Texas: Flash floods along the Guadalupe River have taken 13 lives. 23 young Christian girls from Camp Mystic are… pic.twitter.com/nH5QJz9Mc6— ꜱǫʏʟᴀʀᴋ (@Kralyqs) July 5, 2025 Texas flood in 50 minutes time. pic.twitter.com/ynRpULEgHI— 0HOUR (@0HOUR1__) July 6, 2025This video of the Guadalupe was shot in Kerrville, Tx from the Center Bridge. Watch how fast these flood waters were traveling & washing everything in front of it out.It goes from low & barley flowing to over the top of the bridge in around 35 minutes.I sped the video up to… pic.twitter.com/NcQe4UAQBa— Clyp Keeper (@DGrayTexas45) July 6, 2025This is a nightmare this lady and her bed ridden husband are in a flooded home in Texas and nobody is coming to help them! 😡 pic.twitter.com/Xp2WmiuCDl— Suzie rizzio (@Suzierizzo1) July 5, 2025 -
కొత్తపార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటన
-
అన్నంతపనీ చేసిన మస్క్.. పార్టీ ఫ్యూచర్ ప్లాన్ ఇదే..
వాషింగ్టన్ డీసీ: టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్ బిగ్ బ్యూటీఫుల్ చట్టం తీసుకువచ్చిన దరిమిలా, దాన్ని వ్యతిరేకిస్తూ మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. తాను అనుకున్నది సాధించేవరకూ వదలని చెప్పే మస్క్ ఇప్పుడు అమెరికాలో కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు.ప్రముఖ టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్, అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని స్థాపనపై ప్రకటన చేశారు. ఈ పార్టీకి ‘అమెరికా పార్టీ’ అని పేరు పెట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో విభేదాల నేపధ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. ఎలన్ మస్క్ తన ‘ఎక్స్’లో ఒక పోల్ నిర్వహించి, తన 22 కోట్ల మంది ఫాలోవర్స్‌ను ఓ ప్రశ్న అడిగారు ‘అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పాల్సిన సమయం వచ్చిందా?" అని అడిగినప్పుడు 80 శాతం మంది అవును అని సమాధానమిచ్చారు. By a factor of 2 to 1, you want a new political party and you shall have it!When it comes to bankrupting our country with waste & graft, we live in a one-party system, not a democracy.Today, the America Party is formed to give you back your freedom. https://t.co/9K8AD04QQN— Elon Musk (@elonmusk) July 5, 2025ఈ ఫలితాలను వెల్లడిస్తూ మస్క్ ఓ ప్రకటనలో ‘అమెరికాలో 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే కొత్త రాజకీయ పార్టీ అవసరమని తెలిపారు. ఇది ప్రధాన పార్టీలైన డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మస్క్ అభివర్ణించారు. కొత్త పార్టీ సాయంతో 2026 మధ్యంతర ఎన్నికల్లో హౌస్, సెనేట్ సీట్లపై మస్క్ దృష్టి సారించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ఇప్పుడు మస్క్ ‘అమెరికా పార్టీ’ వీటికి సవాలుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అమల్లోకి ‘బిగ్ బ్యూటిఫుల్’ చట్టం
వాషింగ్టన్: పన్ను చెల్లింపుదారులపై ట్యాక్స్ భారం తగ్గించడం, వలసచట్టాల అమలుకు కావాల్సిన నిధులను సేకరించడం, రక్షణరంగ బడ్జెట్ పెంపు వంటి ఎన్నో లక్ష్యాలతో రూపొందించిన కీలక ‘వన్ బిగ్ బ్యూటిఫుల్’బిల్లు ఎట్టకేలకు అమెరికాలో చట్టంగా అమల్లోకి వచ్చింది. అమెరికా సెనేట్, ప్రతినిధుల సభలో సుదీర్ఘ చర్చలు, ఉత్క ంఠతో కూడిన ఓటింగ్‌ల నడుమ ఆమోదం పొందిన ఈ బిల్లుపై అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ట్రంప్ శ్వేతసౌధంలో సంతకంచేశారు. రెండో దఫా అధ్యక్షుడయ్యాక రిపబ్లికన్ పార్టీపై తన పట్టు సడలలేదని తాజా బిల్లు ద్వారా ట్రంప్ నిరూపించుకున్నారు. మరో దశాబ్దకాలంలో అమెరికా ఆర్థికలోటును మరో 3.3 ట్రిలియన్ డాలర్లు పెంచేసే చట్టంగా అపవాదును మూటగట్టుకున్న దాదాపు 870 పేజీల ఈ కొత్త చట్టంలోని కొన్ని కీలక అంశాలపై క్లుప్తంగా.. 2017నాటి పన్నుల్లో కోత కొనసాగింపు ట్రంప్ తొలిదఫా అధ్యక్షునిగా ఎన్నికైనప్పుడు ప్రజలు చెల్లించాల్సి పన్ను రేటును తగ్గించారు. పరిశ్రమలకూ దీనిని వర్తింపజేశారు. ప్రభుత్వానికి తక్కువ పన్ను చెల్లించిన కారణంగా తమ వద్ద మిగిలిపోయిన సొమ్మును జనం ఖర్చుచేస్తారు. ఇలా వస్తుసేవల వినియోగం పెరిగి ఆర్థికాభివృద్ది ఊపందుకుంటుందని ట్రంప్ ఆశిస్తున్నారు. వైద్యసాయంపై భారీ కోత ఏ ప్రభుత్వమైనా కొత్త పథకం తెస్తే అందులో వైద్య ప్రయోజనాలు పెరుగుతాయి. కానీ ఈ బిల్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య ప్రయోజనాలకు గండికొడుతోంది. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు/కుటుంబాలు/ వికలాంగులకు మెడికల్ ఎయిడ్ ప్రయోజనాలు దూరంకానున్నాయి. దీంతో మెడికల్ ఇన్సూరెన్స్ రక్షణలేక లక్షలాది మంది తమ సొంత డబ్బులను వైద్యం కోసం ఖర్చుచేయాల్సిఉంటుంది. ఎక్కువ గంటలు పనిచేసే వ్యక్తులకే అధిక మెడిక్ఎయిడ్ నిబంధనను చేర్చారు. ప్రస్తుతం అమెరికాలో 7.1 కోట్ల మంది ప్రభుత్వ వైద్య బీమా సదుపాయాన్ని పొందుతున్నారు. కొత్త చట్టం కారణంగా 1.7 కోట్ల మందికి ఈ సదుపాయం దూరమవుతుంది. పెన్షన్లు, గౌరవ భృతిపై పన్నుల తగ్గింపు రిటైర్డ్ ఉద్యోగులు, వికలాంగులు, ఇతర పెన్షనర్లపై విధించే సామాజిక భద్రతా ఆదాయ పన్నును తగ్గించారు. 65 ఏళ్లు పైబడిన వాళ్లకు అందే పెన్షన్, ఇతర ప్రయోజనాలపై మూలఆదాయం వద్ద కోతను 4,000 డాలర్లకు పరిమితం చేశారు. తగ్గనున్న ఫుడ్ కూపన్ల లబి్ధదారులు బైడెన్ హయాంలో అందించిన పునరుత్పాదక ఇంధన వనరుల ప్రోత్సాహక ప్రయోజనాలకు ప్రభుత్వం ఈ చట్టం ద్వారా కోతపెట్టింది. సౌర, పవన విద్యుత్ సంస్థలకు ఇచ్చే పన్ను ప్రయోజనాలను తగ్గించి ఆ మేరకు బొగ్గు, చమురు సంస్థలకు ప్రయోజనం కల్పించనున్నారు. కార్లు కొనేందుకు వాహనరుణం తీసుకుంటే అందుకు చెల్లించే వడ్డీని సైతం తగ్గించారు. తక్కువ ఆదాయవర్గాలకు అందించే ఫుడ్ కూపన్లు(టోకెన్లు) తగ్గించనున్నారు. ప్రస్తుతం 4 కోట్ల మంది ఈ ఫుడ్ టోకెన్లను ఉపయోగించుకుంటున్నారు. కొత్త చట్టం కారణంగా 47 లక్షల మంది ఆ అర్హతను కోల్పోతారు. భారీగా రక్షణ బడ్జెట్ రక్షణ బడ్జెట్‌ను మరో 150 బిలియన్ డాలర్లు పెంచనున్నారు. సరిహద్దు గోడనిర్మాణం, అక్రమంగా చొరబడిన విదేశీయుల కోసం మొత్తంగా 1,00,000 పడకలతో నిర్బంధ కేంద్రాలను నిర్మించనున్నారు. -
భారత్ అభ్యర్థన.. నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం!
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి.. మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు. అతడిని అప్పగించాలన్న భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు అభ్యర్థించాయి. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అమెరికా అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం..నేహల్‌పై ఉన్న ప్రధాన ఆరోపణలు:పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయిమనీ లాండరింగ్ మరియు నేరపూరిత కుట్ర కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారునీరవ్ మోదీకి సంబంధించిన అక్రమ ఆస్తులను దాచడంలో, సాక్ష్యాలను నాశనం చేయడంలో నేహల్ పాత్ర ఉన్నట్లు భారత దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయిఇంకా, నేహల్ మోదీపై అమెరికాలోని ప్రముఖ డైమండ్ కంపెనీ LLD డైమండ్స్‌ను దాదాపు రూ.19 కోట్ల మేర మోసం చేసిన కేసు కూడా నమోదైంది. తప్పుడు ఒప్పందాల ద్వారా డైమండ్లను తీసుకుని, వాటిని స్వప్రయోజనాల కోసం అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(54) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దాదాపు ₹14,000 కోట్ల మోసానికి పాల్పడి 2018లో దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన లండన్(యూకే)లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన అప్పగింత కోసం భారత్ అభ్యర్థించగా.. ఆ కేసు అక్కడి కోర్టులో విచారణ జరుగుతోంది. నేహల్ అరెస్టుతో నీరవ్ మోదీ కేసులో పురోగతి సాధించినట్లేనని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. -
అమెరికాలోని టెక్సాస్ లో వరదల బీభత్సం.. 24 మంది చిన్నారులు మృతి
-
వైట్‌హౌస్‌లో సందడి.. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై ట్రంప్ సంతకం
వాషింగ్టన్: అమెరికాలో ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేశారు. దీంతో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారింది. వైట్‌హౌస్ వేదికగా రిపబ్లికన్ సభ్యులు, అధికారుల సంబురాల మధ్య ట్రంప్.. ఈ బిల్లుపై సంతకం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ట్రంప్ మద్దతుదారులు, మిత్రపక్షాలు, మిలిటరీ కుటుంబాలు, వైట్‌హౌస్ సిబ్బంది తరలివచ్చారు.అనంతరం, వైట్‌హౌస్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ఈ చట్టంతో అందరికీ లబ్ధి జరుగుతుంది. సాయుధ బలగాల నుంచి మొదలు రోజూవారీ కార్మికుల వరకు కొత్త చట్టం మద్దతుగా ఉంటుంది. అమెరికా చరిత్రలోనే మా ప్రభుత్వం అతిపెద్ద పన్నుకోత, వ్యయకోత, సరిహద్దు భద్రతలో అతిపెద్ద పెట్టుబడి సాధించిది. అమెరికా ప్రజలు ఇంత ఆనందంగా ఉండటం గతంలో నేను ఎప్పుడూ చూడలేదు. ఈ బిల్లు ఆమోద ప్రక్రియలో మద్దతుగా నిలిచిన ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్‌కు, సెనెట్ మెజారిటీ లీడర్ జాన్ థునెకు ధన్యవాదాలు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. SIGNED. SEALED. DELIVERED. 🧾🇺🇸President Trump’s One Big Beautiful Bill is now LAW — and the Golden Age has never felt better. pic.twitter.com/t0q2DbZLz5— The White House (@WhiteHouse) July 4, 2025ఇదిలా ఉండగా.. ప్రభుత్వ వ్యయాన్ని తీవ్రంగా తగ్గించడం, వలస చట్టాలను అమలు చేయడానికి కావాల్సిన కఠినమైన కొత్త విధానాలకు నిధులు సమకూర్చడం, పలు పన్ను కోతలను శాశ్వతం చేయడం వంటివి వన్ బిగ్ బ్యూటిఫుల్ చట్టంలో ఉన్నాయి. ఈ బిల్లుపై ఇటీవల సెనెట్‌లో సుదీర్ఘ చర్చ సాగింది. ముగ్గురు రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ 51-50 తేడాతో అక్కడ ఆమోదం లభించింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టై బ్రేకర్‌గా మారి బిల్లును గట్టెక్కించారు. అనంతరం ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. ప్రతినిధుల సభలో బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. 🚨 NOW: President Trump and our INCREDIBLE First Lady Melania share a kiss on the White House balcony as the crowd chants “FOUR MORE YEARS!”What an EPIC day for our country!And THE BEST IS YET TO COME! 🇺🇸💥 pic.twitter.com/XSmJ8S9Ud4— Nick Sortor (@nicksortor) July 5, 2025మరోవైపు.. వైట్‌హౌస్‌లో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై ట్రంప్ సంతకం చేస్తున్న సందర్భంగా అక్కడ అమెరికా స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్లు గగనతలంలో చక్కర్లు కొట్టాయి. కాగా, ఇటీవల ఇరాన్ అణుకేంద్రాలపై ఇవి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆకాశంలో ఫైటర్ జెట్లు చక్కర్లు కొడుతుండగా వైట్‌హౌస్ నుంచి ట్రంప్ వీక్షించారు. This angle of the B-2 and F-35 flyover of the White House before Trump signs the One Big Beautiful Bill 🔥 pic.twitter.com/z5M8f4NVl4— johnny maga (@_johnnymaga) July 4, 2025ఇది కూడా చదవండి: వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు.. ఎన్నారైలకు అలర్ట్ -
‘జేన్ స్ట్రీట్’ స్కామ్!
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడినందుకు గాను అమెరికన్ సంస్థ జేన్ స్ట్రీట్ (జేఎస్) గ్రూప్‌పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు ట్రేడింగ్ చేయకుండా గ్రూప్ సంస్థలపై నిషేధం విధించింది. అక్రమంగా ఆర్జించిన రూ. 4,843 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో అకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశించింది. స్టాక్ సూచీలను ప్రభావితం చేసి, జేఎస్ గ్రూప్ భారీగా లబ్ధి పొందిందనే ఆరోపణలపై చేపట్టిన విచారణలో భాగంగా సెబీ ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జేన్ స్ట్రీట్ (జేఎస్) గ్రూప్‌లో భాగమైన జేఎస్ఐ ఇన్వెస్ట్మెంట్స్, జేఎస్ఐ2 ఇన్వెస్ట్మెంట్స్, జేన్ స్ట్రీట్ సింగపూర్, జేన్ స్ట్రీట్ ఏషియా ట్రేడింగ్ సంస్థలకు ఇవి వర్తిస్తాయి. 2023 జనవరి–2025 మే మధ్య కాలంలో 21 ఎక్స్పైరీ తేదీల్లో సూచీలను ప్రభావితం చేసే విధంగా క్యాష్, ఫ్యూచర్స్ మార్కెట్లో గ్రూప్ పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేసినట్లు, తద్వారా ఆప్షన్స్ మార్కెట్లో పొజిషన్లతో భారీగా లాభాలు ఆర్జించినట్లు సెబీ విచారణలో తేలింది. జేన్ స్ట్రీట్, దాని అనుబంధ సంస్థలు భారతీయ ఆప్షన్స్ మార్కెట్లో అనధికారిక ట్రేడింగ్ వ్యూహాలు అమలు చేస్తున్నాయంటూ 2024 ఏప్రిల్‌లో మీడియాలో వార్తలు రావడం ఈ కేసుకు బీజం వేశాయి. ఎక్స్పైరీ రోజు దగ్గరపడే సమయంలో, ఇండెక్స్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యేలా, జేఎస్ గ్రూప్ సందేహాస్పద ట్రేడింగ్ లావాదేవీలు నిర్వహిస్తోందని సెబీ గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఇలాంటివి చేయబోమంటూ ఎన్ఎస్ఈకి హామీ ఇచ్చినప్పటికీ గ్రూప్ సంస్థలు తమ తీరును మార్చుకోలేదని ఉత్తర్వుల్లో సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘2025లో ఎన్ఎస్ఈ జారీ చేసిన అడ్వైజరీని కూడా పట్టించుకోకుండా, లెక్కలేనితనాన్ని ప్రదర్శిస్తూ జేఎస్ గ్రూప్ వ్యవహరించిన తీరు చూస్తే, మిగతా ఎఫ్‌పీఐలు, మార్కెట్ వర్గాల్లాగా, అది నమ్మతగినది కాదని అర్థం అవుతోంది. గతంలోలాగే లావాదేవీలు కొనసాగించేందుకు జేఎస్ గ్రూప్‌ను అనుమతిస్తే ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు కచ్చితంగా భంగం వాటిల్లుతుందని ప్రాథమిక సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి’’ అని సెబీ వ్యాఖ్యానించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ జేఎస్ గ్రూప్ అక్రమంగా ఆర్జించిన రూ. 4,843.57 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో అకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఉత్తర్వులకు సంబంధించినవి అయితే తప్ప, తమ అనుమతి లేకుండా, జేఎస్ గ్రూప్ సంస్థల ఖాతాల్లో ఎలాంటి డెబిట్ లావాదేవీలను జరగనివ్వరాదంటూ బ్యాంకులకు సెబీ ఆదేశాలు ఇచ్చింది. ఇతరత్రా సూచీల్లోనూ జేఎస్ గ్రూప్ ట్రేడింగ్ లావా దేవీలపై సెబీ విచారణ చేపడుతోంది. సెబీ ఉత్తర్వుల ప్రకారం ఇండెక్స్, స్టాక్ ఆప్షన్లలో ట్రేడింగ్ ద్వారా జేఎస్ గ్రూప్ రూ.44,358 కోట్లు ఆర్జించింది. స్టాక్ ఫ్యూచర్స్‌లో రూ.7,208 కోట్లు, ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో రూ. 191 కోట్లు, క్యాష్ సెగ్మెంట్లో రూ. 288 కోట్లు నష్టపోయింది. దీంతో 2023 జనవరి–2025 మార్చి మధ్య మొత్తం మీద రూ.36,671 కోట్లు అక్రమంగా ఆర్జించింది. ఏం చేసింది.. ఎలా చేసింది..స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువగా ఉండే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్స్ సెగ్మెంట్స్‌లో ట్రేడింగ్ ద్వారా సూచీలను ప్రభావితం చేసి, దాన్నుంచి లాభాలు పొందిందని జేఎస్ గ్రూప్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం అది రెండు కీలక వ్యూహాలు అమలు చేసిందని సెబీ విచారణలో వెల్లడైంది. దీని ప్రకారం, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్, ఫ్యూచర్లలో ’జేఎస్ గ్రూప్’ ఉదయం పెద్దయెత్తున కొనుగోళ్లు చేసి, సాయంత్రం భారీగా అమ్మేసేది. అలాగే ఎక్స్పైరీ రోజున ఆఖరు రెండు గంటల్లో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యేలా ఏదో ఒకదాన్ని భారీగా కొనడమో లేదా అమ్మడమో చేసేది. ఉదాహరణకు.. జేఎస్ గ్రూప్ ఉదయాన్నే కొన్ని ఎంపిక చేసుకున్న బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ షేర్లను భారీగా కొనేసేది. అదే సమయంలో ఇండెక్స్ ఆప్షన్స్‌ను షార్ట్ (అమ్మేయడం) చేసేది. ట్రేడింగ్ ముగిసే సమయం దగ్గరపడే కొద్దీ షేర్లను ఒక్కసారిగా అమ్మేసేది. దీంతో షేరు ధర పడిపోయేది. ఫలితంగా షేర్లపరంగా నష్టాలు వచ్చినప్పటికీ, సమాంతరంగా తీసుకున్న ఇండెక్స్ షార్ట్ ఆప్షన్లలో భారీగా లాభాలు వచ్చేవి. దీనివల్ల, ఉదయం రూ. 10 దగ్గర ఉన్న ఆప్షన్.. సాయంత్రానికి ఎకాయెకిన రూ.300–రూ. 400 అయిపోతుంది. లేదా అటుది ఇటవుతుంది. ఇలా ఎక్స్పైరీ రోజుల్లో ఇలా అసా ధారణ తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడటంతో సాధారణ ట్రేడర్లు భారీగా నష్టపోతారు. వాల్యూమ్స్‌పై ప్రభావం.. జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలను మార్కెట్ వర్గాలు స్వాగతించాయి. దీనితో చిన్న ట్రేడర్లకు కాస్త ఊరట లభించగలదన్నాయి. కాకపోతే ఆప్షన్స్ వాల్యూమ్స్‌పైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఆప్షన్స్ ట్రేడింగ్ వాల్యూమ్స్‌లో జేన్ స్ట్రీట్ లాంటి ట్రేడింగ్ సంస్థల వాటా దాదాపు 50 శాతం వరకు ఉంటుందని జిరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తెలిపారు. ఇలాంటి సంస్థలు వెనక్కి వెళ్లిపోతే దాదాపు రిటైల్ కార్యకలాపాలపైనా ప్రభావం పడొచ్చని వివరించారు. ఫలితంగా బిడ్–ఆస్క్ స్ప్రెడ్ (కొనుగోలు, అమ్మకం బిడ్ల మధ్య వ్యత్యాసం), తీవ్ర ఒడిదుడుకులు, అనిశ్చితి పెరిగిపోవచ్చన్నారు. ఇది ఇటు ఎక్సే్చంజీలకు, అటు బ్రోకర్లకు మంచి వార్త కాకపోవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి పెద్ద సంస్థలపై మన మార్కెట్ ఎంతగా ఆధారపడిందనేది దీనితో తెలిసిపోతుందని కామత్ తెలిపారు. స్టాక్స్ కుదేలు.. జేఎస్ గ్రూప్‌పై సెబీ చర్యలతో ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలతో, విదేశీ సంస్థల ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే ప్లాట్‌ఫాంలు, సంస్థల షేర్లు శుక్రవారం గణనీయంగా క్షీణించాయి. బీఎస్ఈలో నువామా వెల్త్ మేనేజ్మెంట్ షేరు 11.26%, స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఏంజెల్ వన్ షేరు 6%, బీఎస్ఈ షేరు 6.42%, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) 2.3% క్షీణించాయి. జేఎస్ గ్రూప్‌పై సెబీ చర్యలతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతిందని లెమన్ మార్కెట్స్ డెస్క్ అనలిస్ట్ గౌరవ్ గర్గ్ తెలిపారు.ఏమిటీ జేన్ స్ట్రీట్.. ఆర్థిక సేవల రంగానికి సంబంధించిన జేన్ స్ట్రీట్ గ్రూప్ 2000లో ట్రేడింగ్ సంస్థగా అమెరికాలో కార్యకలాపాలు ప్రారంభించింది. అమెరికాతో పాటు యూరప్, ఆసియాలోని 45 దేశాల్లో, 5 కార్యా లయాల్లో 2,600 మంది సిబ్బంది ఉన్నారు. 2020 డిసెంబర్లో ఇది భారత్‌లో కార్యకలాపాలు ఆరంభించింది. -
పెళ్లైన 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. AIతో తల్లిదండ్రులు కాబోతున్న జంట!
వాషింగ్టన్: వైద్య చరిత్రలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) అద్భుతం చేసింది. పెళ్లైన 18 ఏళ్ల తర్వాత మహిళ గర్భం దాల్చేందుకు దారి చూపించింది. త్వరలో ఆమె అమ్మ కాబోతుంది. అంతేకాదు స్టార్ పద్ధతిలో గర్భం దాల్చిన ప్రపంచంలో తొలి మహిళగా చరిత్రలో నిలిచారు. ఇంతకీ ఆ ఎవరా? తల్లి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మాత్రమే కాదు. మానవ జీవితాల్లో పెనుమార్పులు తెస్తున్న అద్భుత సాధనం. ఏఐతో ఉద్యోగాలకు ఎసరు అని అనుకునే వారికంటే దాని వల్ల మా జీవితాలే మారిపోయాయని సంతోషపడే వారు కోకొల్లలు. అలాంటి వారిలో ఈ మహిళ ఒకరు. వ్యక్తిగత భద్రత దృష్ట్యా ఆమె పేరు బహిర్గతం చేయలేదు.వివరాల్లోకి వెళితే.. వాళ్లిద్దరూ భార్య,భర్తలు. వివాహం జరిగి 18 ఏళ్లవుతుంది. సంతనాలేమి సమస్యతో బాధపడుతున్నారు. సంతానం కోసం ఎక్కని గుడి లేదు. మొక్కని దేవుడు లేడు. సంతానం కోసం ఎన్ని ప్రయత్నాలో చేయాలో అన్నీ చేశారు. గతంలో అనేక సార్లు ఐవీఎఫ్ (In Vitro Fertilization) ద్వారా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. కారణం? ఆమె భర్త అజోస్పెర్మియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నారు. అంటే వీర్యంలో స్పెర్మ్ కనిపించకపోవడం అన్నమాట.అయితే, ఈ నేపథ్యంలో ఆ దంపతులు కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్‌ను ఆశ్రయించారు. అక్కడ స్టార్(Sperm Tracking and Recovery) అనే ఏఐ ఆధారిత పద్ధతిని ఉపయోగించారు.ఈ పద్దతిలో ఏఐ గంటలో 8 మిలియన్లకు పైగా చిత్రాలను స్కాన్ చేసి, మానవ కంటికి కనిపించని 44 స్పెర్మ్‌లు గుర్తించింది.అలా గుర్తించిన స్పెర్మ్‌లను ఉపయోగించి ఐవీఎఫ్ ద్వారా గర్భధారణ జరిపారు. ఈ స్టార్ పద్ధతిలో గర్భం దాల్చిన ప్రపంచంలో తొలి మహిళగా ఆమె చరిత్రలో నిలవడం గమనార్హం. ఏఐ ఎలా పనిచేస్తుంది?వైద్యులు స్పెర్మ్ నమూనాను ఒక ప్రత్యేక చిప్‌పై ఉంచి హై-పవర్డ్ ఇమేజింగ్ ద్వారా స్కాన్ చేస్తారు. ఏఐ అల్గోరిథం స్పెర్మ్ ఆకారాన్ని, కదలికలను గుర్తించి వాటిని వేరు చేస్తుంది. ఇది సూక్ష్మతతో కూడిన, వేగవంతమైన ప్రక్రియ, మానవ నిపుణులు రెండు రోజులు వెతికినా కనిపించని స్పెర్మ్‌లను ఏఐ ఒక గంటలో కనిపెట్టగలిగింది.వైద్య చరిత్రలో గేమ్ చేంజర్ఈ స్టార్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన డాక్టర్ జెవ్ విలియమ్స్ మాట్లాడుతూ..‘ఇది గేమ్ చేంజర్. అమ్మ తనాన్ని నోచుకోలేక ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది తల్లులకు ఈ ఏఐ టెక్నాలజీ ఓ వరం’ అని అన్నారు.కాగా, ప్రస్తుతం ఈ విధానం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది, కానీ భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ఇలా ఏఐ కేవలం యంత్రాల మేధస్సు కాదు, అది మనిషి ఆశలకు రూపం కూడా కావచ్చనే నానుడిని నిజం చేసింది. -
వాట్ ఏ టైమింగ్..? ఓ పక్క గర్ల్‌ఫ్రెండ్‌కి లవ్ ప్రపోజ్ మరోవైపు..
ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేసి మరి ప్రపోజ్ చేస్తుంటారు. ఎలాంటి డిస్టబెన్స్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని మరి అందుకోసం ప్లాన్ చేసుకుంటారు. కాస్త ధనవంతులైతే..వారి రేంజ్‌కి తగ్గట్లుగా ఏ ఫ్లైట్ లేదా అత్యుద్భుతమైన పర్యాటక ప్రదేశంలోనో ప్లాన్ చేస్తారు. కానీ ఈ జంట ఎలాంటి ప్రదేశాన్ని ఎంచుకుందో చూస్తే నోరెళ్లబెడతారు. అమెరికాకు చెందిన బ్రైస్ షెల్టన్, పైజ్ బెర్డోమాస్లకు ప్రకృతి వైపరిత్యాలను నిలయమైన ప్రదేశాలంటే అమితా ఆసక్తి. ఆ ఇష్టంతోనే విభిన్న వాతావరణ ప్రాంతాలున్న చోటులను అన్వేషిస్తూ టూర్లు చుట్టొస్తారిద్దరు. ఇద్దరు అభిరుచులు ఒక్కటే. మంచి స్నేహితులు కూడా. ఆ క్రమంలో ఇద్దరి మధ్య ఇష్టం కాస్తా ప్రేమగా మారింది. అయితే ఓ మంచి టైంలో తన గర్ల్‌ఫ్రెండ్ బెర్డోమాస్కు ఆ విషయం తెలిపేలా ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు.అందుకోసం 18 వారాలుగా నిరీక్షించి మరీ షెల్టన్ తన గర్ల్‌ఫ్రెండ్ బెర్డోమాస్ని సౌత్ డకోటాకు తీసుకువస్తాడు. అక్కడ షెల్టన్ సరిగ్గా ప్రపోజ్ చేస్తుండగా..తను కోరుకున్నట్లుగా హఠాత్తుగా టోర్నోడో వస్తుంది. పైగా ఆ దృశ్యాన్ని క్లిక్ మనిపించి మరీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు షెల్టన్. అలాంటి భయంకర ప్రకృతి వైపరిత్యం టైంలోనే తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నా..కానీ సరిగ్గా ఆ టైంకి ఇలా జరుగుతుందా లేదా అని చాలా భయపడ్డానని చెబుతున్నాడు షెల్టన్. ఇక్కడ షెల్టన్ చెప్పే సమయానికే ఆ టోర్నడో(సుడిగాలి) వారిని సమీపించేస్తోంది కూడా. కానీ ప్రేమకు అవేమి కనిపించవు అన్నట్లుగా మునిగిపోయారు ఇద్దరు. అతడి గర్ల్‌ప్రెండ్ సైతం ఈ సర్‌ప్రైజ్‌కి ఆశ్చర్యంతో ఉబితబ్బిబైంది.How on earth could this day ever be topped. Experienced this in South Dakota with the love of my life and now FIANCE as he proposed in the most epic way imaginable. Cannot wait to spend the rest of my life with you @BryceShelton01 ❤️😭 pic.twitter.com/YwaaLF9tMm— Paige Berdomas🌪 (@tornadopaigeyy) June 29, 2025 (చదవండి: "దాల్ తల్లి": ఆ విదేశీ బామ్మ నిస్వార్థ సేవకు మాటల్లేవ్ అంతే..!) -
ట్రంప్ మెగా బిల్లు: ఎన్నారైలకు బిగ్ అలర్ట్
ట్రంప్ కలల బిల్లు.. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. గురువారం సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగులో బిల్లు ఆమోదం పొందింది. అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం లభించింది. ట్రంప్ సంతకం తర్వాతనీ ఈ బిల్లు చట్టంగా మారనుంది. అటు అమెరికా రాజకీయాల్లో, ఇటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా నిపుణులు ఈ బిల్లును భావిస్తున్నారు. అయితే ఇది ఎన్నారైలపై ఎంతంగా ప్రభావం చూపించనుందో ఓ లుక్కేద్దాం.. నగదు బదిలీలపై 1% రెమిటెన్స్ పన్ను2026 జనవరి 1 నుంచి, అమెరికా నుంచి భారత్‌కు పంపే నగదు ఆధారిత బదిలీలపై 1% పన్ను విధించనున్నారు.నగదు, మనీ ఆర్డర్, చెక్కుల రూపేణా పంపేవాటికి ఇది వర్తిస్తుంది. మొదట ఇది 5%గా ప్రతిపాదించబడింది. తర్వాత 3.5%కి తగ్గించి చివరకు 1 శాతంగా నిర్ణయించారు. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. తరచూ డబ్బు పంపే కుటుంబాలకు ఇది లక్షల్లో అదనపు భారం కానుంది.అయితే డిజిటల్ మార్గాలు ఉపయోగించే వారు పన్ను నుంచి తప్పించుకోవచ్చు. అయితే.. భారత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే వయసు పైబడినవాళ్లు ఇంకా నగదు మార్గాన్నే నమ్ముకుంటున్నారనేది గుర్తించాల్సిన విషయం. ఉదాహరణకు.. నెలకు $500 పంపే వ్యక్తి.. ఏడాదికి $6,000 పంపుతాడు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు అమల్లోకి వస్తే.. $60 అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. గణనీయమైన భారంగానే మారనుంది.భారత్‌కు వచ్చే రెమిటెన్స్‌లో తగ్గుదలబిగ్ బ్యూటిఫుల్ బిల్ (Big Beautiful Bill) ద్వారా అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1% రెమిటెన్స్ పన్ను ప్రభావం కేవలం ప్రవాస భారతీయులకే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ మొత్తానికే గణనీయంగా ఉండనుంది. రెమిటెన్స్ (Remittance) అంటే ఒక వ్యక్తి విదేశంలో పని చేసి, అక్కడి నుంచీ తన స్వదేశంలోని కుటుంబానికి లేదా ఖాతాకు డబ్బు పంపడం.2023–24లో భారత్‌కు వచ్చిన మొత్తం రెమిటెన్స్ 135.46 బిలియన్ డాలర్లు. అందులో 32 బిలియన్ డాలర్లు అమెరికా నుంచే వచ్చింది. అయితే1% పన్ను విధానం వల్ల 10–15% తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉంది. అంటే.. 12–18 బిలియన్ డాలర్ల వరకు నష్టం జరగవచ్చు. రెమిటెన్స్‌లు భారతదేశానికి విదేశీ కరెన్సీ ప్రవాహంలో ప్రధాన భాగం. కాబట్టి ఈ తగ్గుదల వల్ల విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడుతుంది. డాలర్ నిల్వలు తగ్గి, రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణం (inflation) పెరగడానికి దారితీయవచ్చు. అదే సమయంలో..రెమిటెన్స్‌లు అనేక కుటుంబాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ముఖ్యంగా కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అనేక కుటుంబాలకు. అయితే.. డబ్బు తక్కువగా రావడం వల్ల విద్య, వైద్యం, పెళ్లిళ్లు, గృహ నిర్మాణం వంటి అవసరాలపై ప్రభావం పడుతుంది.ఇంకోవైపు.. బ్యాంకింగ్ వ్యవస్థపై ఇది ప్రభావం చూపించనుంది. రెమిటెన్స్ తగ్గితే బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతాయి, ఇది వడ్డీ రేట్ల పెరుగుదలకు దారితీయవచ్చు.మరీ ముఖ్యంగా గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. వలసలకు ఇక గడ్డు కాలమే?ఈ బిల్లుతో వలస నియంత్రణ మరింత కఠినతరం కాబోతోంది. వీసా ఫీజులు పెరిగాయి. H-1B, L-1 వీసాలతో పాటు ఆశ్రయం దరఖాస్తులకు(Asylum Applications) భారీ రుసుములు విధించబడ్డాయి. అక్రమంగా వచ్చినవారిపై ఓ రేంజ్లో జరిమానాలు విధించాలని నిర్ణయించారు. డిపోర్టేషన్ బలగాల విస్తరణ వంటి చర్యలు ప్రవేశపెట్టబడ్డాయి. అక్రమ వలసదారులను తనిఖీలు చేయడం.. అవసరమైతే అక్కడికక్కడే అరెస్టులు చేసే అవకాశాలు ఉంటాయి. ఇది అమెరికాలో ఉన్న ఎన్నారైలకు మాత్రమే కాదు.. అక్కడ చదువుతున్న విద్యార్థులకు, ఉద్యోగార్థుల్లో కూడా భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా.. అమెరికాలో శాశ్వత నివాసం అనే కలకు బిగ్ బ్యూటీఫుల్ బిల్ ఒక శరాఘాతంగా పరిణమించబోతోందనే చెప్పొచ్చు.పెట్టుబడి ప్రణాళికల్లో మలుపులు!కార్పొరేట్ సంస్థలు, పెద్ద స్థాయి పెట్టుబడిదారులకు ఈ బిల్లుతో పన్ను మినహాయింపులు ఉన్నా.. ఎన్నారైల వాస్తవ ప్రయోజనాలు మాత్రం పరిమితంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా పన్ను రీఫండ్లు U.S. పౌరులకు మాత్రమే వర్తించడంతో, ఎన్నారైల ఆసరా మరింత దెబ్బతినే అవకాశమే కనిపిస్తోంది.సాధారణంగా రియల్ ఎస్టేట్ అనేది ప్రవాస భారతీయులకు కేవలం పెట్టుబడి కాదు.. భారత్‌తో అనుబంధానికి ఆధారం కూడా. ఈ పన్ను వల్ల భారత్‌లో ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన పెద్ద మొత్తాల బదిలీలపై అదనపు ఖర్చు వస్తుంది. అలాంటి సందర్భంలో ఈ పన్ను వారి ఆర్థిక ప్రయోజనాలపై కాదు, భావోద్వేగాలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.ఈ క్రమంలో.. దీర్ఘకాలికంగా ఆస్తులు కొనాలని భావించిన వారు, ఇప్పుడు పన్ను అమలుకు ముందు ముందుగా డబ్బు పంపించి కొనుగోలు పూర్తిచేయాలని చూస్తున్నారు. ఇది ఒక రకంగా బిల్లు అమలుకు ముందు ఆస్తి రద్దీ(Rush) అనే పరిస్థితిని తెచ్చింది. దీంతో పన్ను అమలుకు ముందు తాత్కాలికంగా బదిలీల పెరుగుదల జరిగే అవకాశం నిపుణులు అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్‌తో పాటు విద్య, ఆరోగ్య ఖర్చులపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. కంప్లయన్స్ భారముఎన్నారైలు బిగ్ బ్యూటీఫుల్ బిల్లును క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నారైలు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరాన్ని తెచ్చి పెట్టింది. ఎటువంటి మార్గంలో డబ్బు పంపుతున్నారో జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే అనవసర పన్నులు పడే అవకాశం ఉంది. కఠినమైన KYC నిబంధనలతో పాటు NRE/NRO ఖాతాలపై నియంత్రణ ఉంటుంది. తద్వారా పాస్‌పోర్ట్, వీసా, నివాస ధృవీకరణ వంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం పెరుగుతుంది. డబ్బు ఎలా అమెరికా దాటి పోతుంది అనే దానిపై మరింత పర్యవేక్షణ ఉంటుంది. పన్ను రీఫండ్లు కేవలం అమెరికా పౌరులకు మాత్రమే వర్తిస్తాయి — NRIs కు కాదు. అంటే, గ్రీన్ కార్డు హోల్డర్లు, H-1B వీసాదారులు, ఇతర ఎన్నారైలు ఈ ప్రయోజనాలను పొందలేరు.కాబట్టి ఈ బిల్లు ప్రవాస భారతీయులపై (NRIs) కేవలం పన్ను భారం మాత్రమే కాదు, నియంత్రణ (compliance) భారాన్ని కూడా పెంచుతోంది. ఇది పెద్ద మొత్తంలో డబ్బు పంపే వారికి మాత్రమే కాదు, చిన్న మొత్తాల్లో తరచూ పంపే వారికి కూడా అదనపు కాగితాలు, సమయం, ఖర్చు పెరుగుతాయి.ఎన్నారైలు డబ్బు పంపడాన్ని తగ్గిస్తే, భారత్‌లోని కుటుంబాల ఆదాయం తగ్గుతుంది. ఇది వారి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలతో పాటు కుటుంబాలపై, చివరికి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా ఉంది. ఏంటీ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఒక విస్తృత ఆర్థిక, పన్ను, వలస విధానాల చట్టం. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణే లక్ష్యంగా తెస్తున్నట్లు చెబుతున్నారాయన.పన్ను కోతలు2017లో అమలైన పన్ను కోతలను శాశ్వతం చేస్తుంది.కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలకు పన్ను మినహాయింపులు కల్పిస్తుంది.టిప్పులు, ఓవర్‌టైమ్‌పై పన్ను మినహాయింపుటిప్ ఆదాయం పై పన్ను రద్దు, ఓవర్‌టైమ్ ఆదాయంపై $12,500 వరకు మినహాయింపు.చైల్డ్ టాక్స్ క్రెడిట్ పెంపుపిల్లలపై టాక్స్ క్రెడిట్ $2,000 నుంచి $2,200కి పెంపు.కానీ తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇది పూర్తిగా వర్తించదు.1% రెమిటెన్స్ పన్నుఅమెరికా నుంచి భారత్ వంటి దేశాలకు నగదు బదిలీలపై 1% పన్ను విధించబడుతుంది.బ్యాంక్, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా(డిజిటల్ లావాదేవీలు) పంపిన డబ్బుకు మినహాయింపు ఉంది.వలస నియంత్రణ కఠినతరంICE అధికారుల నియామకం, డిపోర్టేషన్ కేంద్రాల విస్తరణ, వీసా ఫీజుల పెంపు వంటి చర్యలు ఉన్నాయి.మెడికేడ్, ఫుడ్ స్టాంపులపై కోతలుతక్కువ ఆదాయ గల అమెరికన్లకు ఆరోగ్య, ఆహార సహాయ కార్యక్రమాల్లో కోతలు విధించబడ్డాయి.పునరుత్పాదక శక్తికి ఎదురుదెబ్బసౌర, గాలి శక్తి పథకాలపై పన్ను రాయితీలు తగ్గించబడ్డాయి, ఇది గ్రీన్ ఎనర్జీ రంగానికి నష్టంగా మారుతుంది.లాభాలు ఎవరికీ?కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలు, టిప్/ఓవర్‌టైమ్ వేతనదారులు లాభపడతారు. కానీ తక్కువ ఆదాయ గల కుటుంబాలు, వలసదారులు, పునరుత్పాదక శక్తి రంగం నష్టపోతాయి.ప్రతిపక్షాల అభ్యంతరాలుడెమొక్రాట్లు, సామాజిక కార్యకర్తలు ఈ బిల్లును "సంపన్నులకు లాభం, సామాన్యులకు నష్టం" అని విమర్శిస్తున్నారు. హకీం జెఫ్రీస్ అనే నేత 8 గంటల పాటు బిల్లుకు వ్యతిరేకంగా ప్రసంగించారు. -
బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం
-
గాల్లో ఉన్న విమానంలో టెన్షన్.. ప్రయాణికుడిపై ఇషాన్ శర్మ దాడి
వాషింగ్టన్: భారత సంతతి ఇషాన్ శర్మ విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాట పెరిగి చివరకు తన్నుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఇషాన్ తీవ్రంగా గాయపడ్డాడు. విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ఇషాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మ(21) అమెరికాలోని న్యూవార్క్లో నివసిస్తున్నాడు. జూలై 1న ఫిలడెల్ఫియా నుంచి ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించాడు. ఆ విమానం గాలిలో ఉన్న సమయంలో ఇషాన్ శర్మ నవ్వడం, ఏదో మాట్లాడటంపై ముందు సీటులో కూర్చొన్న కీన్ ఎవాన్స్ ఆందోళన చెందాడు. అనంతరం, క్యాబిన్ సిబ్బంది సహాయం కోరే బటన్ నొక్కాడు. అది గమనించిన ఇషాన్ శర్మ.. ఎవాన్స్‌ను అడ్డుకుని అతడి గొంతుపట్టుకుని కొట్టాడు. దీంతో, వారి మధ్య వాగ్వాదం పీక్ స్టేజ్‌కు చేరుకుంది.ఆగ్రహంతో ఎవాన్స్ కూడా తిరిగి శర్మను కొట్టడంతో అతడి కంటికి గాయమైంది. గొడవ పెద్దది కావడంతో విమాన సిబ్బంది వారిద్దరిని నిలువరించారు. ఆ విమానం మయామిలో ల్యాండ్ కాగానే భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇషాన్ శర్మ తనపై దాడికి ముందు ‘హా హ హ హ హ హ’ అంటూ నవ్వాడని, తనను కించపర్చడంతోపాటు చస్తావని బెదిరించినట్లు ఎవాన్స్ ఆరోపించాడు. అనంతరం, ఇషాన్ తరుఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. ఇషాన్ శర్మ విమానంలో ధ్యానం చేస్తున్నాడని తెలిపారు. అయితే తనను ఎగతాళి చేస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లుగా ఎవాన్స్ భావించడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. అంతేగానీ, ఉద్దేశపూర్వకంగా ఎవాన్స్‌ను కొట్టలేదని క్లారిటీ ఇచ్చాడు. No more vacation…🫣| #ONLYinDADE * Man gets kicked off of Frontier flight after getting into altercation pic.twitter.com/us6ipoW5E7— ONLY in DADE (@ONLYinDADE) July 1, 2025 -
Neha Reddy అమెరికాలో అందెల సవ్వడి, డాక్టర్ కావాలనేది కల
..మన కళలు మనతో ఉంటే ఏ దేశంలో ఉన్నా...మన దేశం మనలో ఉన్నట్లే! ఆ భావనతో కూచిపూడికి దగ్గరైంది నేహా. మన ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేహ నృత్యప్రదర్శన ఇచ్చింది. అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ నేహా రెడ్డి ఆళ్లకు భారతీయ నృత్యకళలపై మంచి అవగాహన ఉంది.చిన్నవయసులోనే కూచిపూడి నృత్యకారిణిగా ‘శభాష్’ అనిపించుకుంది. తల్లిదండ్రులు శివరామిరెడ్డి, నాగమల్లేశ్వరిల చొరవ, ప్రోత్సాహంతో వర్జీనియాలోని ‘కళామండపం’ నృత్య పాఠశాలలో గురువు మృణాళిని సదానంద దగ్గర కూచిపూడి నేర్చుకుంది నేహ.రేపు శనివారం మరోసారి తన నృత్యప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయింది. నృత్యంలోనే కాదు చదువులోనూ రాణిస్తున్న నేహాకు డాక్టర్ కావాలనేది లక్ష్యం. నృత్య కళలో మరింతగా రాణించాలని, డాక్టర్ కావాలనే తన కలను నెరవేర్చుకోవాలని ఆశిద్దాం.ఇదీ చదవండి : Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్ -
ట్రంప్ భారీ విజయం.. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు సభ ఆమోదం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల సాకారమైంది. ట్రంప్ కలల బిల్లు అయిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. దీంతో, ఈ బిల్లును తీసుకురావడంలో ట్రంప్ విజయం సాధించారు.అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును గురువారం ప్రవేశపెట్టారు. అనంతరం, దీనిపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ క్రమంలో జరిగిన ఓటింగులో బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించారు. బిల్లును వ్యతిరేకిస్తూ.. సభ మైనారిటీ నేత హకీం జెఫ్రీస్.. 8 గంటల 32 నిమిషాలపాటు మాట్లాడారు. ఇక, అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం లభించింది. ట్రంప్ సంతకం తర్వాత చట్టంగా మారనుంది. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణ లక్ష్యంగా ఈ బిల్లును ట్రంప్ తీసుకొచ్చారు. ✅ The House of Representatives just officially PASSED the One Big Beautiful Bill.The largest middle-class tax cut in American history — and so much more — is on its way to President Trump's desk.MAGA! pic.twitter.com/V3U8xhenrS— Rapid Response 47 (@RapidResponse47) July 3, 2025ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్' అమెరికా కాంగ్రెస్‌లో అధికారికంగా ఆమోదం పొందడంపై పలువురు స్పందిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం అనేది ట్రంప్ సాధించిన పెద్ద విజయంగా ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. పన్ను తగ్గింపులు, రక్షణ, సరిహద్దు భద్రతపై భారీ నిధులు కేటాయించే ఈ బిల్లు అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ బిల్లులో మెడికెయిడ్ ఖర్చుల్లో కోతలు, వలస నియంత్రణ, గ్రీన్ ఎనర్జీ పథకాల్లో మార్పులు వంటి అంశాలు కూడా ఉన్నాయి. ఈ బిల్లు ఆమోదానికి ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. రిపబ్లికన్ సభ్యులతో ఆయనే మాట్లాడారు.The One Big Beautiful Bill:✅ Passed ✅ Signed ✅ Heading to President Trump’s desk to become lawMuch-needed and much-deserved relief for hardworking Americans is on the way! pic.twitter.com/zoh2dKlfO5— Speaker Mike Johnson (@SpeakerJohnson) July 3, 2025ట్రంప్ ఆనందం.. ఈ బిల్లు ఆమోదం పొందడంపై ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా సోషల్ టూత్ వేదికగా ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్.. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో రిపబ్లికన్లు బిల్లును ఆమోదించారు. తద్వారా మన పార్టీ ఏకతాటిపై ఉంది. ఈ బిల్లు ఆమోదంతో దేశం వేడిగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) వైట్ హౌస్‌లో ఈ బిల్లుపై సంతకం వేడుక జరుగుతుందని ప్రకటించారు. అన్ని పార్టీలకు చెందిన అమెరికా శాసనసభ్యులను, సెనేటర్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అదే రోజు అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం కావడం గమనార్హం. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని, అలాగే కొత్త సువర్ణ యుగం ప్రారంభాన్ని కలిసి జరుపుకుందాం. అమెరికా ప్రజలు ఎప్పటికన్నా సంపన్నులుగా, సురక్షితులుగా, గర్వంగా ఉండేలా ఈ శాసన బిల్లుతో మార్పు తీసుకొస్తాం అని పేర్కొన్నారు.( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - Jul 03, 2025, 6:15 PM ET )The Republicans in the House of Representatives have just passed the “ONE BIG BEAUTIFUL BILL ACT.” Our Party is UNITED like never before and, our Country is “HOT.” We are going to have a… pic.twitter.com/qR2Dql3IYh— Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) July 3, 2025బిల్లుకు సంబంధించిన కీలక అంశాలు..2017లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమలు చేసిన పన్ను తగ్గింపును ఈ బిల్లు ద్వారా శాశ్వతంగా అమలు చేయనున్నారు. ఓవర్‌టైం వేతనాలు, టిప్ ద్వారా ఆదాయం పొందే కార్మికులకు ప్రత్యేక పన్ను మినహాయింపులు అందించే ఏర్పాటు చేశారు. అలాగే SALT (State And Local Tax) మినహాయింపు పరిమితిని 10,000 డాలర్ల నుంచి 40,000 డాలర్లకు పెంచారు. ఈ కొత్త మినహాయింపులు తదుపరి 10 సంవత్సరాల్లో ఫెడరల్ బడ్జెట్ లోటును 3.4 ట్రిలియన్ డాలర్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఫుడ్ స్టాంప్ పథకంలో మార్పులు చేశారు. కొత్త బిల్లు ద్వారా రాష్ట్రాలు కూడా ఈ పథకానికి సంబంధించిన వ్యయాన్ని పంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే పని చేయగల వ్యక్తులకు వయో పరిమితిని 54 నుంచి 64 సంవత్సరాలకు పెంచారు.వలస నియంత్రణపై ఫోకస్...ఈ బిల్లులో సరిహద్దు గోడ నిర్మాణానికి 46 బిలియన్ డాలర్లు, వలసదారుల నిర్బంధ కేంద్రాల విస్తరణకు 45 బిలియన్ డాలర్లు, సిబ్బంది శిక్షణ, నియామకానికి 30 బిలియన్ డాలర్లు కేటాయించారు. ఆశ్రయం కోరే వ్యక్తుల కోసం ముందుగా ప్రతిపాదించిన 1,000 డాలర్ల ఫీజును 100 డాలర్లకు తగ్గించారు. బిల్లులో భాగంగా, ట్రంప్ ప్రభుత్వం బైడెన్ హయాంలో ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పథకాలు నిలిపివేసింది.ఆరోగ్య పథకంలో భారీ కోతలుతక్కువ ఆదాయ వర్గాల కోసం ఉన్న మెడికెయిడ్ ఆరోగ్య పథకంలో భారీ కోతలు విధించారు. కొత్తగా విధించిన పని నిబంధనలతో, సుమారు 1.2 కోట్ల మంది తమ వైద్య బీమా కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు మెడికెయిడ్ సేవలు నిలిపివేయడం, లింగ మార్పు చికిత్సలకు నిధులు నిలిపివేయడం వంటి చర్యలు బిల్లులో పొందుపరిచారు. రూరల్ ఆసుపత్రులను పరిరక్షించేందుకు 50 బిలియన్ డాలర్ల నిధులు ఏర్పాటు చేశారు. -
అమెరికా–పాక్ రక్షణ బంధం బలోపేతం!
వాషింగ్టన్: అమెరికా–పాకిస్తాన్ మధ్య రక్షణ బంధం క్రమంగా బలోపేతం అవుతోంది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన అపరేషన్ సిందూర్‌లో భారీగా నష్టపోయిన పాక్ సైన్యం అమెరికాకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్(పీఏఎఫ్) చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇదొక ఉన్నత స్థాయి పర్యటన. పాకిస్తాన్ వైమానిక దళం అధినేత అమెరికాలో అధికారికంగా పర్యటిస్తుండడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో ఇటీవల ఘనమైన ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలో పర్యటనలో భాగంగా జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికా అత్యున్నత సైనికాధికారులతో, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. యూఎస్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేవిడ్ అల్విన్‌ను కలుసుకున్నారు. విస్తృతంగా చర్చలు జరిపారు. అమెరికాతో రక్షణ సహకారం పెంపొందించుకోవడం, కలిసి పనిచేయడం, టెక్నాలజీ ఆధారిత సైనిక మారి్పడి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ పర్యటనతో అమెరికా–పాక్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారం, పరస్పర ప్రయోజనాలు మరింత వృద్ధి చెందుతాయని ఆశిస్తున్నట్లు పాకిస్తాన్ వైమానిక దళం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరుదేశాల సంబంధాల్లో ఇదొక కీలక మైలురాయి అని అభివరి్ణంచింది. తమ వైమానిక దళాన్ని ఆధునీకరించాలని పాకిస్తాన్ నిర్ణయానికొచ్చింది. ఇందుకోసం అమెరికా సాయాన్ని అర్థిస్తోంది. అమెరికా నుంచి 70 ఎఫ్–16 బ్లాక్ ఫైటర్జెట్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఏఐఎం–7 స్పారో ఎయిర్–టు–ఎయిర్ మిస్సైళ్లు, ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ బ్యాటరీలు సమకూర్చుకోవాలని భావిస్తోంది. చైనా ఇచ్చిన ఆయుధాలపై ఆధారపడడం క్షేమంకాదని ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు తెలిసొచ్చింది. అందుకే అమెరికా ఆయుధాలపై దృష్టి పెట్టింది. అందుకు అమెరికా సైతం సానుకూలంగా స్పందిస్తుండడం చర్చనీయాంశంగా మారతోంది. -
నీళ్లు నమిలిన క్వాడ్!
అమెరికాలో బుధవారం జరిగిన చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అనుకున్న విధంగానే కశ్మీర్‌లోని పెహల్గామ్లో మొన్న ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడిచేసి 26 మందిని పొట్టన బెట్టుకున్న ఉదంతాన్ని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటంలో సహకరించుకోవటానికి సిద్ధంగా ఉన్నామని ఉమ్మడి ప్రకటన తెలియజేసింది. ‘ఇందుకు కారకులైనవారినీ, దాడిలో పాల్గొన్నవారినీ, వారికి ఆర్థికంగా సహకరించినవారినీ ఎలాంటి జాప్యం లేకుండా శిక్షించటానికి ఐక్యరాజ్యసమితి దేశాలన్నీ తోడ్పడాల’ని సూచించింది. క్వాడ్ వంటి కూటములు ఏర్పడటం వెనకుండే ధ్యేయం సంక్షోభ సమయాల్లో సమష్టిగా అడుగు మందుకేయటం కోసమే. కానీ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తున్నా ఆ దేశాన్ని వేలెత్తి చూపటానికీ, అటువంటి కార్యకలాపాలు మానుకోవాలని హెచ్చరించటానికీ కూటమిలోని మిగతా మూడు దేశాలూ సిద్ధంగా లేవంటే క్వాడ్ ఆవిర్భావానికి గల ప్రాతిపదికే ప్రశ్నార్థకంగా మిగిలినట్టు లెక్క. పెహల్గామ్ ఘటన అనంతరం మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడిచేసింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ సైన్యం మనపై క్షిపణులతో, డ్రోన్లతో దాడికి దిగాక మన దళాలు వాటిని తిప్పికొట్టడంతోపాటు అక్కడి వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇరు దేశాల మధ్యా ఇది పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించే సూచనలు కనబడ్డాయి. కారణాలేమైతేనేం...నాలుగు రోజుల అనంతరం కాల్పుల విరమణకు ఇరు దేశాలూ అంగీకరించాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ పరిణామాలను ఎంతో ఆందోళనతో గమనించాయి. కానీ ఉమ్మడి ప్రకటన పాక్ పేరెత్తి ఖండించకుండా మర్యాదపూర్వకంగా, లౌక్యంగా మాట్లాడితే ఒరిగేదేమిటి? క్వాడ్ ఈనాటిది కాదు. పద్దెనిమిదేళ్ల క్రితం జపాన్ ద్వారా మన దేశాన్ని ఒప్పించి ఈ కూటమి ఏర్పాటుకు నాంది పలికింది అమెరికాయే. 2007లో కూటమి ఏర్పాటుపై చర్చించటానికి నాలుగు దేశాలూ సమావేశమైనప్పుడే చైనా ఉరిమింది. తనకు వ్యతిరేకంగానే ఈ కూటమి ఏర్పడుతున్నదంటూ నిష్టూరానికి పోయింది. ఏడాది గడవకముందే జపాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి కూటమి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. 2008లో ప్రభుత్వం మారి ఆస్ట్రేలియా సైతం నిష్క్రమిస్తున్నట్టు తెలియజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో 2017లో తిరిగి క్వాడ్‌కు జీవం పోసింది అప్పటి ట్రంప్ ప్రభుత్వమే. అప్పటికల్లా దక్షిణ చైనా, తూర్పు చైనా సముద్ర జలాల్లో చైనా కార్యకలాపాలు పెరిగాయి. ‘అన్నీ నేనే... అంతా నాదే’ అంటూ పగడాల దిబ్బలు, ఇసుక మేటలు చైనా తన ఖాతాలో వేసుకుంది. అంతటితో ఊరుకోక స్ప్రాట్లీ దీవుల చుట్టూ ఏడు కృత్రిమ దీవుల నిర్మాణం ప్రారంభించింది. ఇది జపాన్‌తో పాటు ఆస్ట్రేలియానూ... ఆ రెండు దేశాలకూ అన్ని విధాలా అండగా ఉంటున్న అమెరికానూ చికాకు పెట్టిన పర్యవసానంగానే క్వాడ్ మళ్లీ పురుడు పోసుకుంది. సారాంశంలో ఇది అమెరికా, చైనాల మధ్య జరిగే ఆధిపత్య పోరులో భాగంగా వచ్చింది. అందులో మనల్ని భాగస్వాముల్ని చేసి తన వివాదాన్ని మనకు కూడా అంటించిన అమెరికా మనకు సమస్య వచ్చినప్పుడు మాత్రం మనవైపుండదని పెహల్గామ్ రుజువు చేసింది. మరి ఇలాంటి కూటములు పెట్టి ప్రయోజనమేమిటి? విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబల్ అన్నట్టు పాకిస్తాన్‌తో మిగిలిన మూడు సభ్య దేశాలకూ, ముఖ్యంగా అమెరికాకూ స్నేహ సంబంధాలుండటం వల్ల ఉమ్మడి ప్రకటనలో నేరుగా దాన్ని ప్రస్తావించటానికి మొహమాటపడి ఉండొచ్చు. మరి అదే పరిస్థితి మనకు ఉండదా? మనకూ, పాకిస్తాన్‌కూ వున్న వైషమ్యాలపై క్వాడ్ పెట్టేనాటికే మిగిలిన మూడు దేశాలకూ అవగాహన ఉండాలి. మరి ఎందుకు కలుపుకొన్నట్టు? ఇలాంటి పరిస్థితి తలెత్తగలదని ఆనాడు తెలియదా?భూగోళంలో ఏమూల ఉగ్రవాదం ఉన్నా దాన్ని నిర్మూలించేదాకా వదలబోమని, దానిపట్ల దయాదాక్షిణ్యాలుండబోవని 2001లో తాను చేసిన శపథం అమెరికాకు గుర్తుందా? క్వాడ్ కూటమి సమావేశానికి ముందు మన విదేశాంగ మంత్రి జైశంకర్ మూడు దేశాల విదేశాంగ మంత్రులతో విడివిడిగా భేటీ అయ్యారు. పెహల్గామ్, తదనంతర పరిణామాలపై వారితో చర్చించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును వివరించారు. బహుశా దాని పర్యవసానంగా కనీసం పెహల్‌గామ్‌ను ప్రకటనలో ప్రస్తావించి చర్య తీసుకోవాలన్న డిమాండైనా చేశారు. లేకుంటే దానికి కూడా దిక్కు లేకపోయేదేమో! పాకిస్తాన్ ఎన్ని తప్పుడు పనులకు పాల్పడుతున్నా అమెరికాకు ఆ దేశమంటే మోజు. ‘రెండు దేశాలనూ బెదిరించి యుద్ధం ఆపాన’ని గొప్పలు పోయిన ట్రంప్, ఆ తర్వాత వారం గడవకుండా ఆ దేశ ఆర్మీ చీఫ్‌తో భేటీ అయి పొగడ్తలతో ముంచెత్తారు. చైనాతో మనకు సరిహద్దు వివాదాలున్న సంగతి నిజమే. ఆ విషయంలో మన దేశం రాజీ పడకుండా చర్చలు సాగిస్తోంది. దురాక్రమణకు ప్రయత్నించినప్పుడల్లా ఎదుర్కొంటున్నది. క్వాడ్ ఉనికిలోకి రాకముందునుంచీ అది కొనసాగుతోంది. పరస్పరం సహకరించుకోవటానికీ, ఎదగటానికీ కూటములు అవసరం. అధునాతన సాంకేతికతల్లో తోడ్పడే అత్యంత కీలకమైన ఖనిజాల, ఇతర వనరుల సరఫరాపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఎదిగేందుకు, సరఫరాలకు అంతరాయం ఏర్పడకుండా చూసేందుకూ సమష్టిగా కృషి చేయాలని క్వాడ్ తీర్మానించటం హర్షించదగ్గదే. ఈ ఏడాది చివరిలో క్వాడ్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు మన దేశంలో జరుగుతున్న నేపథ్యంలో కూటమి భాగస్వాముల్లో మరింత సదవగాహన, సమన్వయం అవసరమని... కీలక సమయాల్లో నిర్మొహమాటంగా ఉండటం ముఖ్యమని తెలుసుకుంటే మంచిది. -
ఏంటీ కిరికిరి?..అమెరికా-పాక్‌ల మధ్య అసలేం జరుగుతోంది?
అమెరికా పర్యటనకు ఇటీవలే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వెళ్లి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో డిన్నర్ పార్టీలో సుదీర్ఘంగా మాట్లాడారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికా పర్యటనలో ఉన్నారు. పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమెరికాకు వెళ్లడం దశాబ్దం తర్వాత ఇదే తొలిసారి. ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ మాత్రం గుమ్మనంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ వ్యూహాత్మకమ చర్యా లేక ప్రధానిని పక్కన పెట్టేశారా? అనేది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉంది. భారత్ చేపట్టిన ఆపరేషన్సింధూర్ తర్వాత పాక్ ప్రధాని మనకు సోయలో కూడా కనిపించడం లేదు. పాక్‌లో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట ఎక్కడా వినిపించకపోవడం ఒకటైతే, పాక్‌కు చెందిన రక్షణ వ్యవస్థలోని కీలక అధికారులు వాషింగ్టన్లో దర్శనమిస్తూనే ఉన్నారు. భారత్ కొట్టిన దెబ్బతో పాక్ ఆర్మీ ఎంత పేలవంగా ఉందో తేలిపోవడంతో ఇప్పుడు దానిపై వారు దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అమెరికా-పాకిస్తాన్ల మధ్య ఏదో జరుగుతుందనే అనుమానం మాత్రం ప్రతీ ఒక్కరికీ ఏదో మూలన తొలుస్తూనే ఉంది. భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే చర్యలకు అమెరికాతో కలిసి కుట్రలు చేస్తుందా అనేది మరొక కోణంలో చూడాల్సి వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్(ఫైల్‌ఫోటో)చైనాను దెబ్బతీయాలన్నేదే లక్ష్యమా?పాక్‌కు భారత్ శత్రువు అయితే, అమెరికాకు చైనా శత్రువు అనేది కాదనలేని సత్యం. మరి భారత్, చైనాల సరిహద్దుల్లో ఉన్న దేశం పాకిస్తాన్. మరి చైనాను దెబ్బతీయాలన్నా కూడా అమెరికాకు పాక్ సాయం అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకునే పాకిస్తాన్ ఆర్మీనే పదే పదే యూఎస్‌కు ట్రంప్ పిలుపించుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఆ క్రమంలోనే పాకిస్తాన్‌ను కాకాపట్టి.. చైనా దెబ్బకొట్టాలనే ఉద్దేశంలో ట్రంప్ ఉన్నారా? అనేది ప్రధానంగా అనుమానించాల్సి వస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రధానికి ఉండే విలువ ఏమిటో అందరికీ తెలిసిందే. మరి అటువంటింది పాక్ ప్రధానిని పక్కన పెట్టి మరీ రక్షణ రంగంలోని కీలక అధికారులతో అమెరికా సమావేశాలేంటో ఎవరికీ అర్థం కావడం లేదు.పునః నిర్మాణంలో ఉగ్రస్థావరాలుఇటీవల సమకూరిన నిధులతో పాక్‌లోని ఉగ్రస్థావరాలను, ఆర్మీ క్యాంపులను మరమ్మత్తులు చేసే పనిలో పడ్డ పాక్.. ఇప్పడు అమెరికా యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సిద్ధమైందనేది ప్రముఖంగా వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలకు పాకిస్తాన్ కొనుగోలుకు ఇప్పటికే పాక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ పాక్‌కు అమెరికా ఎంత సపోర్ట్‌గా ఉందనేది తేటతెల్లమవుతుండగా, భారత్‌తో మాత్రం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది అగ్రరాజ్యం. కొన్ని రోజుల క్రితం కెనడా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ ఆహ్వానించినా, అందుకు మోదీ వెళ్లలేదు. ఇది స్వయంగా మోదీ చెప్పినమాట. అమెరికా కుతంత్రాలు ఇప్పటికే ప్రధాని మోదీకి అర్ధం కావడంతోనే ట్రంప్ డిన్నర్ ఆహ్వానాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించారు. ఇరుదేశాల మధ్య ఏదో కిరికిరి..?ఇక చైనా కూడా పాక్‌కు అండగానే ఉంటుంది. ఇటీవల భారత్‌తో జరిగిన యుద్ధంలో కూడా పాక్‌కే సపోర్ట్ చేసింది చైనా. అదే సమయంలో ‘చైనా యుద్ధ సామాగ్రినే’ పాక్ ఎక్కువగా కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది. అంటే ఏదో కిరికిరి ఉందనేది కామన్ మ్యాన్‌కు అర్థం అవుతున్న విషయం. విలువకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పాకిస్తాన్.. చైనాను పక్కన పెట్టడం కూడా పెద్ద పనేం కాదు. పెద్దన్నగా చెప్పుకునే అమెరికా అండదండలు పాకిస్తాన్‌కు ఉండటంతో తన పాత మిత్రుడు చైనాను దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడని దేశం అది. అసలు అమెరికా వ్యూహం ఏమిటి?, పదే పదే వాషింగ్టన్లో పాక్ ఆర్మీ అధికారుల దర్శనం ఏమిటి?, అమెరికా-పాక్‌ల మధ్య ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల కలకలం రేపాయి. బుధవారం (జూలై 2) రాత్రి చికాగోలో డ్రైవ్ బై కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. చికాగో స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చికాగో నగరంలోని రివర్ నార్త్ (River North) ప్రాంతం ఆర్టిస్ లాంజ్ (Artis Lounge) అనే నైట్‌క్లబ్‌లో రాపర్ మెలో బక్స్ (Mello Buckzz) ఆల్బమ్ రిలీజ్ పార్టీ జరుగుతోంది.ఆ సమయంలో ఓ వాహనం లోపల ఉన్న అగంతకులు నైట్‌క్లబ్ వెలుపల గుమికూడిన జనంపై కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ దుర్ఘటనలో పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.అగంతకులు జరిపిన కాల్పుల్లో 13 మంది మహిళలు, 5 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్ట్రోజర్ హాస్పిటల్, నార్త్‌వెస్టర్న్ మెమోరియల్ హాస్పిటల్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో ఇదే ప్రదేశంలో మరోసారి కాల్పులు జరగడం గమనార్హం.Yet another mass shooting in Chicago media won't tell you about.Initial reports of 3 dead, 20+ injured following gunfire after a record release party.But it's only Black people with illegal handguns again so, HO, HUM, doesn't fit the narrative. pic.twitter.com/DNm5sXLd1i— BarleyPop (@MikePilbean) July 3, 2025 -
ఊహలకందని విధ్వంసం.. 78 బంతుల్లో 28 సిక్సర్ల సాయంతో 263 పరుగులు
అమెరికాలో జరిగిన ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్‌లో ఊహలకందని విధ్వంసం జరిగింది. ఎడిసన్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించే ఓ ఆటగాడు 78 బంతుల్లో 17 ఫోర్లు, 28 సిక్సర్ల సాయంతో 337.18 స్ట్రయిక్‌రేట్‌తో 263 పరుగులు (నాటౌట్) చేశాడు. క్రికెట్ చరిత్రలో బహుశా ఇంతటి విధ్వంసం ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు. ఈ మ్యాచ్‌కు అధికారిక గుర్తింపు ఉందో లేదో తెలియదు కానీ.. సోషల్‌మీడియాలో మాత్రం ఈ వార్త హల్చల్ చేస్తుంది. ఇంతటి విధ్వంసానికి కారకుడు ఎవరని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. View this post on Instagram A post shared by Loudoun Cubs Cricket Academy (@loudouncubs)వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల కిందట అమెరికాలో క్రికెట్ లీగ్ ఆఫ్ న్యూజెర్సీ (CLNJ) అనే క్రికెట్ టోర్నీ (40 ఓవర్ల ఫార్మాట్) జరిగింది. ఇందులో భాగంగా ఎడిసన్ క్రికెట్ క్లబ్, ఈసీసీ షార్క్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రౌనక్ శర్మ (ఎడిసన్ క్రికెట్ క్లబ్) అనే ఆటగాడు సిక్సర్ల సునామీ సృష్టించి 78 బంతుల్లో అజేయమైన 263 పరుగులు చేశాడు. ఇందులో రౌనక్ తన తొలి సెంచరీని కేవలం 27 బంతుల్లోనే చేయడం మరో విశేషం.Raunaq Sharma lit up club cricket with a jaw-dropping 263 off just 78 balls against ECC Sharks!🔥💯His knock, in a 40-over clash, stands as one of the most explosive and highest-scoring innings in limited-overs cricket history. (official or unofficial) pic.twitter.com/3MuBcCQ2QW— CricTracker (@Cricketracker) July 3, 2025ఇదే టోర్నీలో అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లోనూ రౌనక్ ఇదే తరహాలో విధ్వంసం సృష్టించాడు. NJ Lions CCతో జరిగిన మ్యాచ్‌లో 81 బంతుల్లో 15 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 209.88 స్ట్రయిక్‌రేట్‌తో 170 పరుగులు చేశాడు.దీనికి ముందు జరిగిన మరో టోర్నీలో (WMCB T20 League Elite Division) కూడా రౌనక్ ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. ఓ మ్యాచ్‌లో 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ టోర్నీ మొత్తంలో 9 మ్యాచ్‌లు ఆడిన రౌనక్.. 220.65 స్ట్రయిక్‌రేట్‌తో 50.75 సగటున 406 పరుగులు చేశాడు. 33 ఏళ్ల రౌనక్ శర్మ భారత్‌లోని ముంబైలో జన్మించాడు. కుడి చేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన ఆయన.. క్రికెట్ అవకాశాల కోసం యూఎస్ఏకు వలస వెళ్లాడు. ప్రస్తుతం రౌనక్ హ్యూస్టన్ స్టార్స్ అనే అమెరికన్ జట్టుకు ఆడుతున్నాడు. రౌనక్‌కు టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో మంచి పరిచయం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరు చిన్నతనంలో కలిసి ఆడారట. -
అందుకే ట్రంప్ నన్ను టార్గెట్ చేశారు
ట్రంప్-మామ్దానీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మమ్దానీని అరెస్ట్ చేయాలని, ఆయన్ని దేశం నుంచి వెళ్లగొట్టాలని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో ట్రంప్ వ్యాఖ్యలపై మమ్దానీ ఘాటుగానే స్పందించారు. వాషింగ్టన్: న్యూయార్క్ నగర మేయర్ పదవికి భారతీయ మూలాలున్న అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ.. తనను అరెస్ట్ చేసి, దేశం నుండి పంపించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన ఈ వ్యాఖ్యలు అమెరికాలో వర్గ విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నమేనని అన్నారాయన. 33 ఏళ్ల ఈ డెమొక్రటిక్ సోషలిస్ట్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలే గుప్పించారు. వర్కింగ్ క్లాస్ పీపుల్‌ను ట్రంప్ మోసం చేశారు. ఆ విషయం నుంచి అమెరికన్ల దృష్టిని మరల్చేందుకు ఆయన తనను లక్ష్యంగా చేసుకున్నారని మమ్దానీ అన్నారు. ‘‘నిన్న ట్రంప్ నన్ను అరెస్ట్ చేయాలని, దేశం నుండి పంపించాలని, పౌరసత్వం తీసేయాలని అన్నారు. నేను ఈ నగరానికి తరాలుగా మొదటి వలసదారుడిగా, మొదటి ముస్లిం, దక్షిణాసియా మూలాలున్న మేయర్‌గా నిలవబోతున్నాను. ఇది నేను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో అనే దానికంటే, నేను ఏం కోసం పోరాడుతున్నానో దాన్ని దృష్టి మళ్లించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నమే అని మమ్దానీ అన్నారు. రిపబ్లికన్లపై తన పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారాయన. Donald Trump is attacking me because he is desperate to distract from his war on working people. We must and we will fight back. pic.twitter.com/pKEwnijJaG— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) July 2, 2025న్యూయార్క్ నగర మేయర్ పదవీ రేసులో.. డెమొక్రటిక్ ప్రైమరీలో మాజీ గవర్నర్ ఆండ్రూ కువోమోపై జోహ్రాన్ మమ్దానీ సంచలన విజయం సాధించారు. ఆపై ట్రంప్ సహా రిపబ్లికన్లు మమ్దానీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మమ్దానీ పెద్ద కమ్యూనిస్టు పిచ్చోడని.. న్యూయార్క్‌ను నాశనం చేయకుండా తానే కాపాడతానని ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈలోపు.. ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్‌పై మమ్దానీ తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లు అమెరికన్ల ఆరోగ్యాన్ని హరించివేస్తుందని, ఆకలితో ఉన్నవారి నుంచి ఆహారాన్ని లాక్కుంటుందని, ధనవంతులకే మళ్లీ లాభాలు చేకూర్చే విధంగా ఉంది అని మమ్దానీ విమర్శించారు. -
మనోళ్ల అక్రమ వలసలు తగ్గాయి
వాషింగ్టన్: ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 10,300 మందికి పైగా భారతీయులు అక్రమంగా అమెరికా లోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డారు. వైట్‌హౌస్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. అయితే 2024తో పోలిస్తే భారతీయుల అక్రమ వలసలు 70 శాతం తగ్గినట్టు వెల్లడించింది. గతేడాది జనవరి– మే మధ్య 34,535 మంది భారతీ యులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పట్టుబడ్డారు. అంటే సగటున రోజుకు 230 మంది! 2025లో ఇది రోజుకు 69కి తగ్గింది. ట్రంప్ రెండోసారి గద్దెనెక్కాక ఇమిగ్రేషన్ నిబంధనల అమలును కఠినతరం చేయడమే ఇందుకు కారణమని ప్రభుత్వం తెలిపింది. అమెరికా లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి పట్టుబడ్డ 10,382 మంది భారతీయుల్లో గుజరాత్‌కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తారని ఊహించే స్మగ్లింగ్ సిండికేట్ 2024 చివరి నుంచి తమ కార్యకలాపాలను తగ్గించిందని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి దాకా ఏకంగా 6 లక్షలకు పైగా అక్రమ వలసదారులను అమెరికా సరిహద్దుల వద్ద అరెస్టు చేసింది. 2024లో ఇదే కాలంలో 12,33,959 మంది పట్టుబడ్డారు. పట్టుబడ్డ 10,382 మంది భారతీయుల్లో 30 మంది ఒంటరి మైనర్లున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 500 మందికి పైగా భారతీయ మైనర్లను అమెరికా అరెస్టు చేసింది. అనేక దేశాల నుంచి ఏటా వేలాది మంది తమ పిల్లలను అమెరికా–మెక్సికో, అమెరికా–కెనడా సరిహద్దులో వదిలి వెళ్తారు. వారికి అమెరికన్ పౌరసత్వం లభిస్తుందనే ఆశతో ఇలా చేస్తుంటారు. ఈ పిల్లలంతా 12–17 ఏళ్లు, అంతకంటే చిన్న వయసు వారని నివేదికలు చెబుతున్నాయి.పత్రాల్లేని వారు 2.2 లక్షలుడిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) 2024 ఏప్రిల్ నివేదిక ప్రకారం అమెరికాలో 2.2 లక్షల మంది భారతీయులు ఎలాంటి అనుమతి పత్రాలూ లేకుండా అనధికారికంగా నివసిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివకరూ 332 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది. అయినా ప్రమాదకరమైన డంకీ మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి భారతీయులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు ప్రమాదకరమైన సముద్ర మార్గాల్లోనూ వెళ్తున్నారు. గత మే 9న కాలిఫోర్నియా తీరంలోని డెల్మార్ సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో 14 ఏళ్ల భారతీయ బాలుడు, అతని 10 ఏళ్ల అతని సోదరి మరణించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
సంక్షేమానికి ‘అగ్రజుల’ వాతలు!
సంక్షేమానికి భారీగా కోత పెడుతూ అమెరికా, బ్రిటన్ ఏకకాలంలో తీసుకొచ్చిన బిల్లులు మంగళవారం ఆమోదం పొందాయి. అమెరికాలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బిల్లు సంక్షేమానికి కోత పెట్టడంతో పాటు సంపన్నులు చెల్లించే పన్నుల్ని కూడా తగ్గించింది. అసలే రిపబ్లికన్లకు అరకొర మెజారిటీ ఉన్న సెనేట్‌లో ఆ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో అనుకూలురూ, వ్యతిరేకులూ సమంగా ఉన్న సభలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వేసిన ఒక్క ఓటుతో ఆ బిల్లు గట్టెక్కింది. రిపబ్లికన్లకు ఆధిక్యత ఉన్న ప్రతినిధుల సభలో అది సునాయాసంగా ఆమోదం పొందుతుంది. బ్రిటన్‌లో లేబర్ పార్టీ ప్రభుత్వానికి అంత ‘అదృష్టం’ లేదు. బిల్లుపై లేబర్ పార్టీలో తిరుగుబాటు చెలరేగటంతో ఆఖరి నిమిషంలో ప్రధాని కియర్ స్టార్మర్ దాని తీవ్రతను తగ్గించారు. ఈ కోతల ద్వారా ఖజానాకు ఏటా 600 కోట్ల పౌండ్లు మిగిల్చాలన్నది లేబర్ ప్రభుత్వం ధ్యేయమైనా, బిల్లు గట్టెక్కటానికి వీలుగా దిగిరాక తప్పలేదు. అగ్రరాజ్యాలు రెండింటిలో ఒకే రోజు సంక్షేమానికి కోత పెట్టే బిల్లులు రావటం ప్రభుత్వాల వైఖరిలో వచ్చిన మార్పునకు అద్దం పట్టాయి. తప్పుడు ప్రాథమ్యాలూ, అనవసర వ్యయాలతో ఖజానాలను ప్రభుత్వాలు దివాలా తీయిస్తూ, పర్యవసానంగా వచ్చిపడుతున్న సంక్షోభాల నుంచి గట్టెక్కటానికి పౌరుల పట్ల తమ బాధ్యతల్ని వదిలించుకో జూస్తున్నాయి. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ చాలా చోట్ల ఈ ధోరణే కొనసాగుతోంది. కాకపోతే ట్రంప్ దేన్నయినా బాహాటంగా చేస్తారు. ట్రంప్ చర్య అమెరికాను రెండు రకాలుగా దెబ్బ తీయబోతోంది. దశాబ్దాలుగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ బిల్లు గండికొడుతుంది. దీన్ని పూడ్చుకోవటానికి ఆయన సంక్షేమంపై పడ్డారు. ఆరోగ్య బీమాకూ, ఆహార కూపన్లకూ కోత పెట్టడం వల్ల 2034 నాటికి అట్టడుగునున్న కోటి 20 లక్షలమంది జనాభాకు ఉన్న కాస్త ఆసరా ఎగిరిపోతుంది. ఆ మేరకు పన్నులు కూడా తగ్గిస్తున్నామన్న రిపబ్లికన్ల వాదన అర్థరహితం. ఎందుకంటే పారిశ్రామికవేత్తల మాట అటుంచి వార్షిక ఆదాయం 2,17,000 డాలర్లున్న ఉద్యోగికి 12,500 మేర పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ వార్షిక ఆదాయం 35,000 డాలర్లున్న బడుగు ఉద్యోగికి లబ్ధి కేవలం 150 డాలర్లు. ఖజానా ఆదాయం పడిపోయాక తిరిగి అప్పులు చేయక తప్పదు గనుక 2034 కల్లా అమెరికా రుణం మరో 3.8 లక్షల కోట్ల డాలర్ల మేర పెరుగుతుంది. ప్రభుత్వంలో అనవసర వ్యయాన్ని తగ్గిస్తామనే పేరిట ‘డోజ్’ ద్వారా భారీయెత్తున ఉద్యోగుల్ని ఇంటికి పంపిన ట్రంప్ ప్రభుత్వం తీరా సంపన్నులపై పన్నులు తగ్గించి దేశ రుణభారాన్ని మరింత పెంచుతోంది. ఇదంతా 2017లో తాను అమలు చేసిన పన్ను కోతల కొనసాగింపేనని ట్రంప్ అంటున్నా అందులో నిజం లేదు. దాన్ని కొనసాగించకపోతే పౌరులు అదనంగా 68 శాతం పన్నులు చెల్లించాల్సి వస్తుందని ఆయన ఊదరగొట్టారు. ఇదంతా అంతర్గత సమస్య. కానీ దీని పర్యవసానాలు అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ఉంటాయి. బహుళజాతి సంస్థలపై పన్ను విధింపు గురించి జీ–7, ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓసీడీఈ)లు 2021లో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒకచోట పన్ను రాయితీ పొందిన సంస్థపై వేరే దేశంలో పన్ను విధించటానికి ఈ ఒప్పందం అనుమతిస్తోంది. దాని ప్రకారం ట్రంప్ కోతలతో లాభపడే సంస్థలపై పన్నులు వేసే అధికారం వేరే దేశాలకుంటుంది. కానీ ఈ పరిస్థితిని ట్రంప్ సహిస్తారా? కెనడా వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. ఆ దేశం 2021 నాటి ఒప్పందానికి అనుగుణంగానే అమెరికన్ సంస్థలపై డిజిటల్ సర్వీస్ టాక్స్ (డీఎస్టీ) విధించింది. కానీ దీన్ని ఉపసంహరించుకోనట్టయితే భారీగా సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించటంతో కెనడా డీఎస్టీ వసూలు నిలిపివేసింది. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ సైతం అమెరికా నుంచి ఇలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొనక తప్పదు. అవి కెనడా మాదిరిగా రాజీకొస్తాయా లేదా అన్నది చూడాలి.మొత్తానికి ట్రంప్ చర్యల వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో ఒక అనిశ్చితి ఏర్పడబోతోంది. గత ఒప్పందంతో ద్వంద్వ పన్నుల మోత నుంచి తప్పించుకున్న బహుళజాతి సంస్థలు ఇకపై చాలా దేశాల్లో పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఇది అంతిమంగా అమెరికాతో చాలా దేశాలకు వైషమ్యం తెస్తుంది. ఆ సంగతలా ఉంచి సెనేట్ ఆమోదించిన కోతల బిల్లుపై ప్రతినిధుల సభలో రిపబ్లికన్ సభ్యులు ప్రభుత్వ వ్యయంపై మరింత కోత విధించాలని పట్టుబడుతున్నారు. అదే జరిగితే సాంఘిక భద్రతకు సంబంధించిన పథకాల్లో అత్యధిక భాగం రానున్న కాలంలో అదృశ్యమవుతాయి. బ్రిటన్‌ది వేరే కథ. మానసిక వైకల్యం కారణంగా ఉద్యోగం చేయలేమంటున్న వారికిచ్చే పింఛన్ నిబంధనల్ని కఠినం చేయటం ద్వారా 480 కోట్ల పౌండ్లు ఆదా చేయొచ్చని స్టార్మర్ ఆశించారు. కానీ స్వపక్షం నుంచి వచ్చిన ఒత్తిళ్లతో ఆ నిబంధనల్ని కొత్త దరఖాస్తుదార్లకు పరిమితం చేశారు. దాంతో ప్రభుత్వం 200 కోట్ల పౌండ్లకు మించి ఆదా చేయలేకపోవచ్చని నిపుణుల అంచనా. రిటైరైన వారికిచ్చే రాయితీలూ వగైరాలపై కూడా కోతలు గణనీయంగా ఉన్నాయి. వీటి పర్యవసానంగా 2030 నాటికి లక్షన్నర మంది పౌరులు పేదరికంలోకి జారుకుంటారని అంటున్నారు. ఏడాది క్రితం అధికారంలోకొచ్చిన స్టార్మర్ కన్సర్వేటివ్ పార్టీ అడుగు జాడల్లో పయనిద్దామని ప్రయత్నించి భంగపడ్డారు. కానీ అమెరికాలో ట్రంప్ మాటే నెగ్గింది. మొత్తానికి రానున్న కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సంక్షేమానికి గడ్డు రోజులే. -
శత్రు భీకర అపాచీలొస్తున్నాయ్
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తన వైమానిక సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్న తరుణంలో భారత వాయుసేనకు అమెరికా నుంచి తీపి కబురు అందింది. ఐదేళ్ల క్రితంనాటి ఒప్పందంలో భాగంగా తొలి దఫా అపాచీ యుద్ధ హెలికాప్టర్లను అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అమెరికా నుంచి తెప్పిస్తున్న ఈ అధునాతన హెలికాప్టర్లు వచ్చాక వీటిని వాయుసేన దళాలకు అందించనున్నారు. పాకిస్తాన్ సరిహద్దు వెంట కీలక మిషన్లలో ఇవి పాలుపంచుకోనున్నాయి. దాదాపు రూ.5,140 కోట్ల ఒప్పందంలో భాగంగా భారత్‌కు అమెరికా ఆరు అపాచీ ఏహెచ్–64ఇ రకం యుద్ధ హెలికాప్టర్లను అందచేయాల్సి ఉంటుంది. 15 నెలల క్రితమే తొలి బ్యాచ్ హెలికాప్టర్లను డెలివరీ చేయాల్సిఉన్నా ఇంతవరకు అది ఆచరణలో సాధ్యంకాలేదు. ఎట్టకేలకు ఈనెలలోనే మూడింటిని అప్పజెప్పనున్నారు. వీటిని వెంటనే పాక్ సరిహద్దులో మోహరించనున్నట్లు తెలుస్తోంది. రవాణాకు సంబంధించిన 2024 మార్చిలోనే కొన్ని హెలికాప్టర్లను అందుకున్నా యుద్ధ హెలికాప్టర్ల అందజేత మాత్రం ఇన్ని నెలలుగా ఆలస్యమైంది. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కోర్కు తొలుత గత మే–జూన్‌లో ఇస్తామని అమెరికా ప్రకటించింది. తర్వాత ఈ గడువును పొడిగించింది. తర్వాత డిసెంబర్‌కల్లా ఇస్తామని తెలిపింది. ఆ గడువు కూడా ముగిసింది. ఇక 2025 జూన్‌లో ఇస్తామని ఇటీవల ప్రకటించింది. సరఫరా గొలుసులో అవాంతరాల కారణంగా భారత్‌కు అప్పగింత ఆలస్యమైందని అమెరికా వివరణ ఇచ్చింది. రెండో దఫా మూడు హెలికాప్టర్లను మరుసటి ఏడాదిలో అందజేయనున్నట్లు అమెరికా పేర్కొంది. పశ్చిమ సరిహద్దు వెంట భారత సైనికదళాల ప్రత్యేక ఆపరేషన్లలో నూతన తరం అపాచీ హెలికాప్టర్లు కీలక బాధ్యతలు నెరవేర్చనున్నాయి. వేగం, దాడి, లక్ష్య చేధనలో తిరుగులేని సామర్థ్యాలు నూతన హెలికాప్టర్ల సొంతం. కొత్త హెలికాప్టర్ల చేరికతో భారత అమ్ములపొది మరింత శక్తివంతంకానుంది. 2015నాటి ఒప్పందం ప్రకారం ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లను భారత వాయుసేన అందుకుంది. వీటికి తోడుగా అత్యంత శక్తివంతమైన, ఎటాక్ హెలికాప్టర్లు అత్యావశ్యకం కావడంతో ఇలా నూతన తరం ఏహెచ్–64ఇ కోసం భారత్ అమెరికాకు ఆర్డర్ ఇచ్చింది. మెరుపుదాడిలో దిట్ట→ 2012లో తయారుచేసిన ఏహెచ్–64డీ బ్లాక్–3ని మరింత ఆధునీకరించి ఏహెచ్–64ఈ గార్డియన్‌గా రూపాంతరీకరించారు.→ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. గరిష్టంగా ఏకధాటిగా 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.→ గరిష్టంగా 16 హెల్ఫైర్ రకం చిన్న క్షిపణులు, 2.75 అంగుళాల వ్యాసముండే 76 రాకెట్లు, వందల బుల్లెట్ల వర్షం కురిపించే 30 ఎంఎం బుల్లెట్ చైన్ ఇందులో అమర్చారు.→ గరిష్టంగా 10,543 కేజీల బరువులను మోసుకెళ్లగలదు. నిమిషానికి 2,800 అడుగుల ఎత్తుకు ఎగరగలదు.→ గరిష్టంగా 20,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు→ నూతన తరం హెలికాప్టర్లో జాయింట్ టాక్టిక్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒకేసారి నిరాటంకంగా భిన్నరకాల సైనిక వ్యవస్థలతో ఇది అనుసంధానమవుతుంది. అంటే క్షిపణిని ప్రయోగించి మిస్సైల్ లాంచర్, భూస్థిర రాడార్లు, కమాండర్ కంట్రోల్ సెంటర్లు, తోటి హెలికాప్టర్లు, యుద్ధ విమానాలతో ఇది అనుసంధానమై ఉంటుంది.→ కమ్యూనికేషన్, నావిగేషన్, సెన్సార్, దాడికి సంబంధించి అధునాతన టెక్నాలజీతో దీనిని రూపొందించారు.→ తాను సేకరించిన డేటాను, శత్రుజాడను రెప్పపాటు కాలంలో సైనిక స్థావరాలు, వ్యవస్థలకు చేరవేసి అప్రమత్తంచేస్తుంది. తనపై దాడికి తెగబడే శత్రు హెలికాప్టర్లు, భూ స్థిర స్థావరాలపై బుల్లెట్ల వర్షం కురిపించగలదు.→ ఇన్ఫ్రారెడ్ లేజర్ సాంకేతికతతో వర్షం వంటి అననుకూల పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని వేగంగా, సులభంగా గుర్తించి దాడి చేయగలదు→ టీ700– జనరల్ ఎలక్ట్రిక్701డీ రకం శక్తివంతమైన ఇంజిన్లు ఇందులో ఉంటాయి. అధునాతన రెక్కల కారణంగా ఇది చాలా వేగంగా నిట్టనిలువుగా గాల్లోకి ఎగరగలదు. → అన్ని రకాల డ్రోన్ల నుంచి సీ, డీ, ఎల్, కేయూ బ్యాండ్ల ద్వారా వీడియో డేటాను తెప్పించుకుని విశ్లేషించి కమాండ్ సెంటర్‌కు చేరవేయగలదు→ వీటిలో ఇంధన ట్యాంక్ కూడా పెద్దది. దీంతో ఎక్కువ సేపు శత్రువుతో పోరాడేందుకు ఇది ఎంతో అనువైంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
విదేశీయులకు ట్రంప్ మరో బిగ్ షాక్
వాషింగ్టన్: విదేశీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. విద్యార్ధులు,విజిటర్ల వీసాలపై నిర్ధిష్ట సమయాన్ని విధించనున్నారు. ఆ గడువు పూర్తయిన విద్యార్థులు, విజిటర్లు వారి వీసాల్ని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ కాకపోతే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలో విదేశీయులపై ఆంక్షల కత్తి వేలాడుతున్నట్లైందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అక్రమ వలస దారులు అరికట్టేలా అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులు, టూరిస్టులు దేశంలో ఉండే సమయాన్ని నిర్ధేశించనుంది. ఆ సమయం గడువు దాటిన తర్వాత దేశంలో ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త వీసా ప్రతిపాదనలు తెచ్చింది.ఇప్పటి వరకు ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని రద్దు చేసి, ప్రతి వీసాకు నిర్దిష్ట గడువు విధించాలని ట్రంప్ సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం F-1 (విద్యార్థులు), J-1 (ఎక్స్చేంజ్ విజిటర్లు) వీసాలపై ఉన్నవారు తమ విద్యను కొనసాగిస్తున్నంత వరకు అమెరికాలో ఉండే హక్కు ఉంది. కొత్త ప్రతిపాదన అమలైతే, వారు పూర్తిగా గడువు ముగిసేలోపు దేశాన్ని విడిచి వెళ్లాలి లేదా వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేయాలి.త్వరలోనే అమలుప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదనను హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ సిద్ధం చేసి, ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (OMB) సమీక్షకు పంపింది. ప్రజల అభిప్రాయాల కోసం 30–60 రోజుల గడువు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఆ తరువాత ఈ కొత్త వీసా రూల్స్ అమల్లోకి రానున్నాయి. విదేశీ విద్యార్థులపై ట్రంప్ చర్యలు:ట్రంప్ పాలనలో అక్రమ వలసదారుల తొలగింపు, యూనివర్సిటీలపై నియంత్రణ పెరిగింది. హార్వర్డ్ యూనివర్సిటీపై 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ ఫండింగ్‌ను నిలిపివేశారు. ట్రంప్ విధించిన షరతులను హార్వర్డ్ తిరస్కరించడంతో విదేశీ విద్యార్థులకు ప్రవేశాన్ని నిషేధించారు. అయితే, ఇటీవల ఓ ఫెడరల్ న్యాయమూర్తి ఈ నిర్ణయాన్ని నిలిపివేశారు. అయినప్పటికీ విదేశీయులపై ట్రంప్ మరిన్ని కఠిన ఆంక్షలు విధించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానంపై దృష్టిసారించినట్లు సమాచారం. -
అదేదో మీ ముద్దుల భార్యతోనే మొదలుపెట్టండి!
వలసదారుల బహిష్కరణ విషయంలో దూకుడు పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కౌంటర్ పడింది. అమెరికా పౌరసత్వం పొందిన వారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సంతకాల సేకరణ జరుగుతోంది. అదేదో.. తన ముద్దుల భార్య మెలానియా నుంచే మొదలుపెట్టాలంటూ డిమాండ్ చేస్తూ ఏకంగా సంతకాల సేకరణ చేపట్టారు. ‘‘Deport Melania" అనే పేరుతో అమెరికాలో ఆన్లైన్లో సంతకాల సేకరణ ప్రారంభమైంది. ఈ పిటిషన్లో మెలానియా ట్రంప్, ఆమె తల్లిదండ్రులు, కుమారుడు బారన్ అమెరికా నుంచి బహిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ ఏమన్నారంటే.. అమెరికన్ పౌరసత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న విదేశీ మూలాలవారు దేశం నుంచి వెళ్లిపోవాలి అని. ట్రంప్ చెప్పిన దానిప్రకారం.. విదేశాల నుంచి వచ్చి పౌరసత్వం పొందిన వారిని బహిష్కరించాలంటే, ముందుగా ఆయన కుటుంబం నుంచే ఆ ప్రక్రియ ప్రారంభించాలి అనేది ఈ పిటిషన్ ఉద్దేశం. మెలానియా పౌరసత్వంపై వివాదం ఏంటంటే.. మెలానియా ట్రంప్ అసలు పేరు మెలనియా క్నావ్స్. స్లోవేనియాలో జన్మించారు. 1970 ఏప్రిల్ 26న అప్పటి యుగోస్లావియాలోని నోవో మెస్టో (Novo Mesto) అనే పట్టణంలో జన్మించారు. ప్రస్తుతం ఇది స్లోవేనియా దేశంలో భాగంగా ఉంది. బాల్యంలో ఆమె సెవ్నికా అనే గ్రామంలో గడిపారు. ఆమె తండ్రి కార్లు అమ్మేవారు. తల్లి బట్టల పరిశ్రమలో పని చేసేది. తన 16వ ఏట మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించిన మెలానియా.. తర్వాత పారిస్, మిలాన్‌లకు వెళ్లి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఆపై మోడలింగ్ కోసం వీసా ద్వారా 1996లో అమెరికాకు వచ్చారు. మెలానియా 2000లో EB-1 వీసా (Einstein Visa) కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2001లో ఆమెకు ఈ వీసా మంజూరు అయ్యింది. అయితే అప్పటికి ఆమె సాధారణ ఫ్యాషన్ మోడల్ మాత్రమే. ఆమెకు అంత స్థాయి అంతర్జాతీయ గుర్తింపు కూడా లేదు అనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2005లో ట్రంప్‌ను వివాహం చేసుకున్న ఆమె.. 2006లో అమెరికా పౌరసత్వం పొందారు.EB-1 వీసా అంటే.. ఇది అమెరికా ప్రభుత్వం ఇచ్చే ఉన్నత ప్రతిభ కలిగిన వ్యక్తుల కోసం ప్రత్యేక వీసా. సాధారణంగా నోబెల్ బహుమతి విజేతలు, ఒలింపిక్ పతకాలు, పులిట్జర్, అకాడమీ అవార్డులు వంటి అంతర్జాతీయ గుర్తింపు ఉన్నవారికి మాత్రమే ఈ వీసా లభిస్తుంది. అయితే, మెలానియా నిజంగానే ఆ గుర్తింపునకు అర్హత ఉన్న వ్యక్తేనా? అనే విషయంపై వివాదం నడుస్తోందక్కడ. 2025 జూన్‌లో జరిగిన అమెరికా కాంగ్రెస్ విచారణలో డెమొక్రాటిక్ ప్రతినిధి జాస్మిన్ క్రాకెట్ వ్యాఖ్యానిస్తూ.. మెలానియా పొందింది Einstein వీసా అయితే లెక్క సరిపోవడం లేదంటూ విమర్శించారు.ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై తీసుకుంటున్న కఠిన చర్యలు, వీసా రద్దులు, చైన్ మైగ్రేషన్((పౌరులు తమ కుటుంబ సభ్యులకు గ్రీన్ కార్డులు పొందించే విధానం) వ్యతిరేకత వంటి విధానాలను ప్రోత్సహిస్తోంది. అదే సమయంలో.. ఆమె పొందిన పౌరసత్వం చట్టబద్ధమైనదే. కానీ, తన పౌరసత్వం ద్వారా ట్రంప్ భార్య మెలానియా తన తల్లిదండ్రులకు గ్రీన్ కార్డులు ఇప్పించారు. అంటే.. ఏ రకంగా చూసుకున్నా ట్రంప్ పాలసీకి ఈ చర్యగా విరుద్ధంగా ఉంది. అందుకే.. ఆ మొదలుపెట్టేదోదో మెలానియాతోనే మొదలుపెట్టండి అని అమెరికన్లు సంతకాల పిటిషన్ చేపట్టారు. -
హెలికాప్టర్ నుంచి రూ. 4 లక్షలు పైనే డబ్బుల వర్షం..!
కొందరు సాయం, దాతృత్వం వంటి పదాలకు కొత్త అర్థాలు ఇస్తారు. అది దానం చేసినట్లు మనల్ని అవమానిస్తున్నట్లు కూడా అర్థం కాదు. చూడటానికి తమ డాబు దర్పం చూపించుకోవడానికి చేసిన దానదర్శంలా ఉంటుంది. ఇక్కడొక వ్యక్తి తన తన అంత్యక్రియల తంతులో వేలాదిగా డబ్బు పేద ప్రజలకు పంచాలనేది అతడి కోరికి. అతన ఆలోచన బాగానే ఉన్నా ఇచ్చిన విధానం చూస్తే..ఎవ్వరికైన చిర్రెత్తుకొస్తుంది. ఇదేం దాతృత్వం రా బాబు అని నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.డెట్రాయిట్‌కి చెందిన 58 ఏళ్ల డారెల్ ప్లాంట్ థామస్ తన అంత్యక్రియల సమయంలో పేద ప్రజలకు ఎంతో కొంత డబ్బు సాయం చేయాలనేది అతడి కోరిక. సమాజం తనను చిరకాలం గుర్తించుకునేలా తన దానం ఉండాలని ఆశించాడు. ఆయన గత నెల జూన్ 27న తుదిశ్వాస విడిచారు. దాంతో అతడి కొడుకులు డేరెల్, జోంటే ఇద్దరు తండ్రి కోరకి మేరకు హెలికాప్టర్ ఏర్పాటు చేసి మరీ గులాబి రేకుల తోపాటు సుమారు రూ. 4 లక్షల పైన నగదును ఆకాశం నుంచి వర్షంలా కురిపించారు. దాంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడి ప్రజజీవనం స్థబించిపోయింది. అంతేగాదు ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఆ నగదు, గులాబి పూరేకులు పడిన రహదారిని మొత్తం మూసేశారు కూడా. రోడ్లపైనే పాదాచారులు, వాహనదారులు గులాబి రేకుల తోపాటు పడుతున్న నగదును తీసుకోవడానికి రావడంతో ఒక్కసారిగా పరిస్థితి అంతా గందరగోళంగా మారింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఇలా ఒకవైపు రహదారిని మొత్తం మూసేసింది. అయితే అధికారులు గులాబి రేకులు మాత్రమే అనుకున్నారట..ఇలా డబ్బుల వర్షం కురిసినట్లు తెలియదని చెబుతుండటం గమనార్హం. అయితే పోలీసులు ఆ డబ్బులను ఏమి స్వాధీనం చేసుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ పలువురు మాత్రం ఇది దాతృత్వంలా లేదని. ఇది సరైన విధానం కాదని మండిపడ్డారు. అలాగే యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ఘటనపై సీరియస్‌గా దర్యాప్తు చేస్తోంది. Detroit man has a helicopter drop money from the sky as his last wish.58-year-old car wash owner Darrell "Plant" Thomas passed away in June and wanted to give his community one final gift.On the day of his funeral, Thomas' sons Darell and Jonte organized a helicopter to drop… pic.twitter.com/ZOhM5gFXJE— Collin Rugg (@CollinRugg) July 1, 2025 (చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!) -
అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్ స్థానం ..! హాట్‌టాపిక్‌గా అమెరికా వంటకాలు..
కొన్ని వంటకాలు యావత్తు ప్రపంచం మెచ్చేలా ప్రజాదరణ పొందుతాయి. అంతేగాదు ఆ వంటకాల కారణంగా ఆ దేశం పేరు, అక్కడ ప్రజల ఆహార విధానాలు ఫేమస్ అవుతాయి కూడా. అంతేగాదు వంటకాల కారణంగా దేశాధినేతలు కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాక నైపుణ్యంతో మహామహులనే మనసుదోచుకోవచ్చనే సామెత ఉండనే ఉంది కూడా. అందుకు చరిత్రలో కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ట్రావెల్ గైడ్ అయిన టేస్ట్ అట్లాస్ ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యుత్తుమ వంటకాల జాబితాను విడుదల చేసింది. అయితే ఆ జాబితాలో అమెరికా చేరడమే నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. మరి ఆ జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..ప్రపంచవ్యాపంగా ఉన్న ఆహారప్రియులు ఇష్టపడే వంటకాల ఆధారంగా ర్యాంకుల ఇచ్చి మరీ జాబితాను అందించింది. ఆ జాబితాలో గ్రీస్ 4.60 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో వరుసగా ఇటలీ, మెక్సికో, స్పెయిన్, పోర్చుగల్ నిలిచాయి. వైవిధ్యభరితమైన ఆహార సంస్కృతికి నిలయమైన భారత్ 12వ స్థానం దక్కించుకుంది. భారతదేశంలోని వంటకాలే అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాలగా నిర్ణయించి మరి ఈ ర్యాంకు ఇచ్చిందట. అలాగే మన దేశంలోని అత్యుత్తమ వంటకాల లిస్ట్‌ని కూడా ఇచ్చింది. అందేలె..రోటీ, నాన్, చట్నీ, బిర్యానీ, పప్పు, బటర్ చికెన్, తందూరి చికెన్ వంటి ప్రముఖ వంటకాలు ఉన్నాయి. అయితే ఈ జాబితాలో మన భారతీయులు సైడ్ డిష్‌గా తినే పచ్చడి(చట్నీ) కూడా ఆ జాబితాలో ఉండడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు భారతదేశంలో ఆయా వంటకాలను ఎక్కడ ఆస్వాదించాలో వంటి వాటి వివరాలను కూడా టేస్ట్ అట్లాస్ అందించడం విశేషం. అయితే ఈ సారి ది బెస్ట్ రెసిపీల్లో అమెరికా వంటకాలు చేరడమే సర్వత్ర చర్చనీయాంశమైంది. పైగా అది ఏకంగా భారత్ తర్వాతి స్థానంలో అమెరికా(13) చోటుదక్కించుకోవడం మరింత వివాదాస్పదమైంది. ఎందుకంటే పెరూ(14), లెబనాన్ (26), థాయిలాండ్ (28), ఇరాన్ (41) వంటి దేశాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో ఉండటంతో నెట్టింట రకరకాల చర్చలకు దారితీసింది. అసలు యూఎస్ వంటకాలంటే ఏంటి అంటూ సెటైర్లు వేస్తు కామెంట్లు చేయగా, మరికొందరు బ్రో ఉందిగా మెక్‌డొనాల్డ్స్ అని కామెడీ మీమ్స్‌తో పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: పుట్టగొడుగులను అలా వండితే ఆరోగ్య ప్రయోజనాలు నిల్..! నిపుణుల షాకింగ్ విషయాలు..) -
America: ‘ఇస్కాన్’లో బుల్లెట్ పేలుళ్లు.. తక్షణ చర్యలకు భారత్ డిమాండ్
శాన్ ఫ్రాన్సిస్కో: హోలీ ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన అమెరికాలోని స్పానిష్ ఫోర్క్‌లో గల ఇస్కాన్ రాధా కృష్ణ ఆలయ ప్రాంగణంలో తాజాగా బుల్లెట్ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా ఆలయానికి భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ఇస్కాన్ తెలిపిన వివరాల ప్రకారం రాత్రివేళ ఆలయంలో భక్తులు, అతిథులు ఉన్న సమయంలో ఆలయ భవనం చుట్టుపక్కల 20 నుండి 30 బుల్లెట్ కాల్పులు జరిగాయి.శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ దాడిని ఖండిస్తూ, ఇస్కాన్‌కు సంఘీభావం తెలిపింది. అలాగే నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరింది. కాన్సులేట్ తన ‘ఎక్స్’ పోస్ట్‌లో స్పానిష్ ఫోర్క్, ఉటాలోని ఇస్కాన్ రాధా కృష్ణ ఆలయంలో జరిగిన కాల్పుల సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులపై సత్వర చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరుతున్నామని పేర్కొంది. We strongly condemn the recent firing incident at the ISKCON Sri Sri Radha Krishna temple in Spanish Fork, Utah. The Consulate extends full support to all the devotees and the community and urges the local authorities to take prompt action to bring the perpetrators to justice.…— India in SF (@CGISFO) July 1, 2025ఈ ఏడాది మార్చి 9న కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లోని బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (బీఏపీఎస్)) హిందూ ఆలయంపై ఖలిస్తానీ గ్రూపు దాడి చేసింది. నాటి వివరాలను బీఏపీఎస్ తన అధికారిక పేజీలో వివరించింది. గత ఏడాది సెప్టెంబర్ 25 రాత్రి కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలోని స్వామి నారాయణ మందిరంపై కూడా విధ్వంసక శక్తులు దాడిచేశాయి. ఇటువంటి ఘటనలు స్థానిక హిందువులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇది కూడా చదవండి: అరెస్టు హెచ్చరికలు.. ట్రంప్‌పై జోహ్రాన్ మమ్దానీ ఫైర్ -
అరెస్టు హెచ్చరికలు.. ట్రంప్‌పై జోహ్రాన్ మమ్దానీ ఫైర్
వాషింగ్టన్: అమెరికాలో ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక పాలనలో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపధ్యంలో ఆయనపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) విధి నిర్వహణకు అడ్డుతగిలితే డెమొక్రాట్ జోహ్రాన్ మమ్దానీని అరెస్టు చేస్తామని ట్రంప్ సారధ్యంలోని రిపబ్లికన్ పార్టీ ప్రకటించింది.దీనిపై భారత సంతతికి చెందిన న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ స్పందిస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు తాను తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. మమ్దానీ అధికారికంగా న్యూయార్క్ నగర మేయర్ పదవికి డెమొక్రాటిక్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. రాబోయే నవంబర్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొననున్నారు. డెమొక్రాటిక్ అభ్యర్థిగా ధృవీకరణ జరిగిన వెంటనే ఆయన ట్రంప్ తీరుపై మండిపడ్డారు. ఒక ప్రకటనలో అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులను పట్టించుకోనని స్పష్టం చేశారు. My statement on Donald Trump's threat to deport me and his praise for Eric Adams, who the President "helped out" of legal accountability. https://t.co/m7pNcT2DFS pic.twitter.com/UcYakMx4lI— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) July 1, 2025యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు తనను అరెస్టు చేస్తానని, తన పౌరసత్వాన్ని తొలగించి, నిర్బంధ శిబిరంలో ఉంచుతానని హెచ్చరించారని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్ చర్యలు ప్రజాస్వామ్యంపై దాడిని సూచిస్తున్నాయన ఆరోపించారు. 2021లో డెమొక్రాట్‌గా ఎన్నికైన ఆడమ్స్‌ను అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించడంలో ఆశ్చర్యమేమీ లేదని, అది మేయర్ ఆడమ్స్ పదవీకాలానికి ముగింపు పలకాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తుందని అన్నారు.దక్షిణాసియాలోని ఉగాండాలో జన్మించిన జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ అసెంబ్లీ సభ్యునిగా ఉన్నారు. ఆయన నవంబర్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలిస్తే, ఈ నగరానికి తొలి ముస్లిం మేయర్ కానున్నారు. కాగా మమ్దానీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని పలువురు రిపబ్లికన్లు అధ్యక్షుడు ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఆయన ఇటీవలే అంటే.. 2018లోనే అమెరికా పౌరసత్వం పొందారని అంటున్నారు.ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన షురూ.. షెడ్యూల్ ఇదే.. -
పశుబలం తప్ప ఏం మిగిలింది?
ప్రపంచంలో కెల్లా గొప్ప ప్రజాస్వామ్యమని చెప్పుకునే అమెరికాకు పశుబలం తప్ప ఏం మిగిలింది? ప్రజాస్వామ్యం అనే మాటకు అంతర్జాతీయంగా వచ్చే మొదటి అర్థం, అంతర్జాతీయ చట్టాలను, నియమ నిబంధనలను, అంతర్జాతీయ వ్యవస్థలను గౌరవించటం. ఇతర దేశాలతో గల సంబంధాలలో ప్రజాస్వామికంగా వ్యవహరించటం. ఆ విధంగా ప్రపంచానికి ప్రజాస్వామిక ఆదర్శంగా నిలవాలి. కానీ అమెరికా వీటన్నిటినీ బాహాటంగా ఉల్లంఘిస్తూ వస్తున్నది. ఈ ధోరణి క్రమంగా పెరుగుతున్నది. అందుకు కారణం తన ఏకధృవ ఆధిపత్యానికి సవాళ్లు ఎదురవుతుండటం. ఈ చర్చను ప్రస్తుతానికి ఇరాన్ అంశంతోనే మొదలుపెట్టి చూద్దాము. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరగటమే కాదు, అసలు యుద్ధమే ముగిసిపోయిందన్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ఘనంగా ప్రకటించిన తర్వాత, జూన్ 28న అన్న మాటలను గమనించండి – ‘యుద్ధంలో నాశనమైన ఇరాన్ అధినేత ఖొమైనీ, యుద్ధంలో తామే గెలిచామని మూర్ఖంగా ప్రకటిస్తున్నారు. మూడు అణు కేంద్రాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. యుద్ధ సమయంలో దాక్కున్న ఆయన అమెరికా, ఇజ్రాయెల్ సేనల చేతిలో నీచమైన చావు చావకుండా నేనే కాపాడాను. టెహ్రాన్ దిశగా భారీ సంఖ్యలో వెళుతుండిన ఇజ్రాయిల్ విమానాలను తిప్పించాను. ఆ దాడి జరిగితే అక్కడ వేలాదిమంది చనిపోయేవారు. అయినప్పటికీ ఇరాన్ అధినేత నాకు కృతజ్ఞతలు చెప్పలేదు. పైగా తామే గెలిచామంటున్నారు. ఇరాన్ అణు పరిశోధనలు తిరిగి ప్రారంభిస్తే మళ్ళీ బాంబులు వేయిస్తా. ఇరాన్‌పై ఆంక్షలను సడలించాలనుకున్నాను గాని ఇక ఆ పని చేయను.’కేవలం ఈ మాటలను విశ్లేషిస్తే చాలు అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం అంతర్జాతీయ చట్టాలను, నియమ నిబంధనలను, అంతర్జాతీయ వ్యవస్థలను ఏ విధంగా గౌరవిస్తున్నదో తెలిసేందుకు. ప్రజాస్వామికంగా పెద్దమనిషి తరహాలో వ్యవహరించేందుకు ట్రంప్‌కు ఏమీ లేదు. బాంబులు తప్ప, పశుబలం తప్ప. విషయాన్ని సూటిగా మరొకమారు చెప్పుకోవాలంటే కళ్లెదుట కనిపిస్తున్నవి కొన్ని ఉన్నాయి. అణువ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)లో స్వచ్ఛందంగా భాగస్వామి అయిన ఇరాన్‌కు ఆ సంస్థ నిబంధనల ప్రకారం శాంతియుత ప్రయోజనాల కోసం అణు ఇంధన శుద్ధికి పూర్తి హక్కు ఉంది. వారు ఆ ప్రకారం కట్టుబడటమే కాక, మారణాయుధాల తయారీ ఇస్లాం బోధనలకు విరుద్ధం కనుక ఆ పని చేయబోమంటూ ఫత్వా సైతం జారీ చేసుకున్నారు. వారు నిబంధనలను ఉల్లంఘించలేదని అణుశక్తి పర్యవేక్షణ సంస్థ (ఐఏఈఏ) స్వయంగా చెప్తున్నది. కాదు, కొద్ది వారాలలోనే బాంబులు తయారు చేయనున్నారు అంటూ ఇజ్రాయిల్ అనే శత్రుదేశం పాతికేళ్లుగా ఆరోపిస్తూ వస్తున్నది. అమెరికా దానికి వత్తాసు పలుకుతోంది.ఇజ్రాయిల్ కుప్పలుగా తయారు చేసుకున్న అణ్వస్త్రాలను గురించి అమెరికా సహా నాటో కూటమి దేశాలు ఎన్నడూ పొరపాటున అయినా పల్లెత్తు మాట అనడంలేదు. ఒక యూఎన్ఓ సభ్య దేశం మరొక యూఎన్ఓ సభ్య దేశంపై అసత్యపు ఆరోపణలతో, సైనిక దాడి జరుపుతున్నా వ్యతిరేకించకపోవడం ప్రజాస్వామ్యమా? చివరికి తానే రంగంలోకి దిగి బాంబుదాడులు జరపడం ఏమిటి? కొన్ని యూరోపియన్ ప్రజాస్వామిక రాజ్యాలు అందుకు సహకరించటమేమిటి? ఇజ్రాయెల్ తన ఆత్మరక్షణ కోసం ఇదంతా చేస్తున్నది అంటున్న వారు, ఇరాన్ వల్ల ఏర్పడిన ముప్పు ఏమిటో, ఇరాన్ అణ్వాయుధాల తయారీ స్థాయికి వెళ్లిందన్న ఆరోపణలకు ఆధారాలేమిటో, తామందరూ సభ్యులైన యూఎన్ఓ అనే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడైనా చర్చించారా?వారు ఆ పని చేయలేదు, చేయరు కూడా. అమెరికన్ సామ్రాజ్యవాదం ఎల్లప్పుడూ నమ్ముకున్నది అంతిమంగా బల ప్రయోగాన్నే. ప్రస్తుత సందర్భం ఒక ఉదాహరణ మాత్రమే. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇందుకు అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఏ ప్రజాస్వామిక వ్యవస్థలతోనూ నిమిత్తం లేకుండా, కేవలం అసత్య ఆరోపణలతో ఈ చర్యలకు పాల్పడే అధికారం వారికి ఎక్కడి నుంచి వచ్చిందసలు? కనిపిస్తున్నదే, పశుబలం నుంచి వచ్చింది. ఆ బలానికి మూలాధారం సామ్రాజ్యవాద ప్రయోజనాలు. ఎటునుంచి, ఎటువంటి ఎదురు లేకుండా, ఏ అంతర్జాతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలతో నిమిత్తం లేకుండా, మంచైనా, చెడైనా ఏకఛత్రాధిపత్యంగా సాగాలనే దురహంకారం. ప్రస్తుత యుద్ధ సందర్భంలో మొదటి నుంచి చివరి వరకు, పైన పేర్కొన్న ట్రంప్ మాటలతో సహా కనిపించేది అదే.యుద్ధంతో తక్షణ సంబంధం గల విషయాలు ఇవి కాగా, మౌలిక స్థాయి సంబంధాలు కలవాటిని చూద్దాం. మూలం ఎక్కడుంది? పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పడకుండా ఇజ్రాయిల్, అమెరికాలు మొదటి నుంచి అడ్డుకుంటుండడంలో ఉంది. అంతర్జాతీయ ప్రజాస్వామిక సంస్థలకు అమెరికా చేస్తున్న హాని గురించి పలు దృష్టాంతాలు ప్రస్తావనకు వస్తున్నాయి. పారిస్ పర్యావరణ పరిరక్షణ నిర్ణయాల నుంచి, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నుంచి ఉపసంహరించుకోవటాలు, అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్‌పై దాడి, పనామా కాలువను, గ్రీన్‌ల్యాండ్‌ను, కెనడాను ఆక్రమించుకోగలమని బెదిరింపులు, అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ (స్విఫ్ట్)తో పాటు డాలర్ శక్తిని ఆధారం చేసుకుంటూ తమకు నచ్చని దేశాలపై ఆంక్షలు, వందల కోట్ల డాలర్లను తమ బ్యాంకులలో స్తంభింప చేయటం, తమ నియంత్రణలోకి తీసుకొని మరెవరికో ఇవ్వటం వంటివన్నీ ప్రజాస్వామ్యమా? మొదట చెప్పుకున్నట్లు వీటికి ఆధారం అంతర్జాతీయ ప్రజాస్వామిక సంస్థల నియమ నిబంధనలు కాదు. వారికి మిగిలిన ఆధారం పశుబలం మాత్రమే.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మస్క్‌కు ట్రంప్ వార్నింగ్ ..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. ‘బిగ్, బ్యూటిఫుల్ బిల్’తో వారి మధ్య అప్పట్లో సాగిన వాగ్యుద్ధం మరోసారి తీవ్ర రూపు దాలుస్తోంది. బిల్లును వ్యతిరేకిస్తున్న మస్క్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో ఎవరికీ దక్కని విధంగా ఆయన సబ్సిడీలు పొందారని ఆక్షేపించారు. సబ్సిడీలే లేకపోతే రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి వంటివేవీ ఉండేవి కాదన్నారు. దుకాణం మూసేసి, ఇంటికి (దక్షిణాఫ్రికా) వెళ్లాల్సి వస్తుందంటూ ఎద్దేవా చేశారు. ‘‘బిగ్ బిల్లు మన దేశ చాలా సంపదను ఆదా చేస్తుంది. బహుశా డోజ్ దీని గురించి బాగా ఆలోచించాలి. మస్క్ పొందుతున్న ప్రభుత్వ సబ్సిడీలు, కాంట్రాక్టులను పరిశీలించాలి’’ అని తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు.‘‘మస్క్ నన్ను అధ్యక్షునిగా ఆమోదించడానికి చాలా ముందునుంచే ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నా. ఈ అంశం నా ప్రచారంలో ప్రధానంగా ఉంటూ వస్తోంది. ఎలక్ట్రిక్ కార్లకు నేనేమీ వ్యతిరేకం కాదు. అవి మంచివే. కానీ అంతా వాటినే వాడాలని మాత్రం ఎవరూ బలవంతం చేయకూడదు’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం ఫ్లోరిడా వెళ్లేముందు వైట్‌హౌస్ ఆవరణలో ఈ అంశంపై మరోసారి మీడియాతో మాట్లాడారు. ‘‘మస్క్‌కు బాగా అసంతృప్తి ఉంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలచా. ఆయన మరెంతో నష్టపోవాల్సి రావచ్చు.ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన డోజ్‌ను మస్క్పైకి ఉసిగొల్పాల్సి రావచ్చు. బహుశా అదే ఆయన్ను కబళించే రాకాసిగా మారవచ్చు!’’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మస్క్ స్పందిస్తూ, తనకిస్తున్న సబ్సిడీలను ఎత్తేయాలంటూ ట్రంప్‌కు సవాలు విసిరారు. ఆ తర్వాత ఈ అంశంపై మీడియాతో ట్రంప్ స్పందించారు. మస్క్‌ను అమెరికా నుంచి తిప్పి పంపించే యోచన ఉందా అని ప్రశ్నించగా ‘‘నాకు తెలియదు. దీనిపై దృష్టి సారించి చూడాలి’’ అని బదులిచ్చారు. డోజ్‌కు ఇటీవలి దాకా సారథ్యం వహించింది మస్కే కావడం విశేషం. ఆయన 1971లో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించారు. అమెరికాలో ఏళ్ల తరబడి నివసించిన అనంతరం 2002లో ఆ దేశ పౌరసత్వం పొందారు.కొత్త పార్టీ దేశావసరం: మస్క్బిగ్, బ్యూటిఫుల్ బిల్‌పై మస్క్ నెల రోజులుగా ట్రంప్‌తో విభేదిస్తున్నారు. తుది ఓటింగ్‌కు ముందు సోమవారం కాంగ్రెస్‌లో ట్రంప్ చర్చించిన సందర్భంగా మస్క్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాన్ని రుణ బానిసత్వపు బిల్లుగా అభివర్ణించారు. ‘‘ఈ బిల్లు వల్ల జాతీయ రుణం మరో 3 లక్షల కోట్ల డాలర్లకు పైగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నిజంగా ప్రజల గురించి ఆలోచించే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి బహుశా సమయం ఆసన్నమైంది’’ అని మస్క్ ఎక్స్‌లో పోస్టు చేశారు. బిల్లును విమర్శించడంతోనే ఆగలేదు.హౌస్ ఫ్రీడమ్ కాకస్ చైర్మన్ ప్రతినిధి ఆండీ హారిస్‌తో సహా ప్రముఖ రిపబ్లికన్ చట్టసభ సభ్యులపైనా విమర్శలు గుప్పించారు. ‘చరిత్రలో అతిపెద్ద రుణ పరిమితి పెరుగుదలతో రుణ బానిసత్వ బిల్లుకు మీరు ఓటు వేసి.. మిమ్మల్ని మీరు ఫ్రీడమ్ కాకస్ అని ఎలా పిలుచుకుంటారు?’ అని మస్క్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలంటూ మొన్నటిదాకా ప్రచారం చేసి, ఇప్పడిలా దేశ చరిత్రలోనే అతిపెద్ద రుణ పెరుగుదల బిల్లుకు ఓటేసిన ప్రతి కాంగ్రెస్ సభ్యుడూ సిగ్గుతో తల దించుకోవాలని వ్యాఖ్యానించారు. మస్క్ పోస్టును సోషల్ మీడియాలో ఏకంగా 2.6 కోట్ల మందికి పైగా చూడటం విశేషం. బిల్లు ఆమోదం పొందితే కొత్త పార్టీ పెడతానంటూ ఆ తర్వాత కొద్ది గంటలకే మస్క్ మరో పోస్ట్ పెట్టారు. ‘ఈ పిచ్చి బిల్లు రిపబ్లికన్ పార్టీకి ఆత్మహత్యాసదృశమే అవుతుంది.అది ఆమోదం పొందితే ఆ మర్నాడే ‘అమెరికా పార్టీ’ ఏర్పడుతుంది. డెమొక్రాట్–రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయం ఇప్పుడు దేశానికెంతో అవసరం. రాబోయే పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఆ పోస్టును ఏకంగా 3.2 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటికే ప్రతినిధుల సభ ఆమోదం పొందిన ‘బిగ్’ బిల్లుపై మూడు రోజులుగా సెనేట్‌లో తీవ్రస్థాయి చర్చ జరుగుతోంది. మంగళవారం ఇది ఆమోదం పొందింది. దీనితో విద్యుత్ వాహనాలకు ప్రస్తుతం అందుతున్న భారీ సబ్సిడీలు పూర్తిగా అటకెక్కుతాయి. మస్క్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ఎక్స్ ప్రభుత్వం నుంచి భారీ కాంట్రాక్టులు, సబ్సిడీలు పొందుతున్న విషయం తెలిసిందే. -
దుకాణం బంద్ చేసి.. మస్క్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
బిగ్ బ్యూటీఫుల్ బిల్లుపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఎలాన్ మస్క్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. అతడు (మస్క్) అమెరికాలో వ్యాపారం చేయలేకపోతే దుకాణం మూసేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి వస్తుంది అని హెచ్చరించారు. ఒకసారి ఆయన అమెరికా ప్రభుత్వం నుంచి పొందిన సబ్సిడీలను తాను చూసుకోవాలి. అమెరికా చరిత్రలోనే ఎవరూ పొందలేనంత సబ్సిడీలను మస్క్ పొందారు. అలాంటి వ్యక్తి నా ప్రభుత్వంలో DOGE (Department of Government Efficiency) చీఫ్‌గా పనిచేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఒకవేళ ఆ సబ్సిడీలే వద్దనుకుంటే ఆయన తన వ్యాపారాలను బంద్ చేసుకోవచ్చు. అమెరికా వదిలి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లిపోవొచ్చు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే జరిగితే.. ఇంకా రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి అవసరం ఆయనకు ఉండదు. పైగా మన దేశానికి భారీగా డబ్బు ఆదా అవుతుంది. దీనిపై DOGE (Department of Government Efficiency) గట్టిగా పరిశీలన చేయాలి. ఇది పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసే అవకాశం! అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన భారీ ఖర్చుల బిల్లు(One Big, Beautiful Bill)పై ఎలాన్ మస్క్ మొదటి నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంతోనే ఆయన డోజ్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. అయితే మస్క్ ఎంతగా విమర్శించినప్పటికీ.. ట్రంప్ మాత్రం మస్క్ మంచి స్నేహితుడనే చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో.. బిల్లు గనుక ఆమోదం పొందితే ఆ మర్నాడే తాను రాజకీయ పార్టీని ప్రకటిస్తానని మస్క్ తాజాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ట్రంప్ కూడా ఇప్పుడు ఘాటుగా స్పందించడం మొదలుపెట్టారు. ట్రంప్ రెండో దఫా అధ్యక్ష విజయంలో ఎలాన్ మస్క్ కీలక పాత్రే పోషించారు. ఆ ఎన్నికల సమయంలో దాదాపు $300 మిలియన్ల విరాళాలు ఇచ్చారు. కానీ బిల్లు కారణంగా ఇప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ట్రంప్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే మస్క్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. -
పప్పన్నం చేత్తో తిన్నందుకు తిట్టిపోస్తున్నారే!
న్యూయార్క్: న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వాన్ని గెల్చుకున్న జోహ్రామ్ ఖ్వామీ మమ్దానీ ఏం చేసినా ఇప్పుడు విమర్శల వర్షం కురుస్తోంది. ఇప్పుడు తాపీగా కూర్చుని పప్పన్నం తిన్నా సరే అమెరికా రాజకీయనేతలు తీవ్రంగా తప్పుబట్టడం ఇప్పుడు కొత్త వార్తాంశంగా నిలిచింది. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మమ్దానీ భోజనం చేస్తూ కనిపించారు. ఒక చిన్న ప్లేట్లో అన్నం, పప్పు చేత్తో కలుపుకుని కడుపారా తిన్నారు. ‘‘ ప్రపంచాన్ని చూసే దృక్కోణాన్ని నేను అభివృద్ధి చెందుతున్న(థర్డ్ వరల్డ్) దేశాల నుంచే నేర్చుకున్నా’’ అని అన్నారు. అయితే ఈ వీడియోను ‘ఎడ్ ఓక్నెస్’ అనే ‘ఎక్స్’ ఖాతాలో ఒకతను పోస్ట్‌చేసి మమ్దానీ తీరును తప్పుబట్టారు. ‘‘ అన్నాన్ని చేత్తో తింటూ ఆయన తనకు థర్డ్ వరల్డ్ స్ఫూర్తి అని చెబుతున్నారు’’ అని ఆ నెటిజన్ వ్యాఖ్యానించారు. దీనికిఅమెరికా దిగువసభ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీ యువనేత బ్రాండన్ జీనీ గిల్ సైతం మద్దతు పలికి మమ్దానీని తప్పుబట్టారు. Civilized people in America don’t eat like this.If you refuse to adopt Western customs, go back to the Third World. https://t.co/TYQkcr0nFE— Congressman Brandon Gill (@RepBrandonGill) June 30, 2025‘‘ అమెరికాలో ఉంటూ అనాగరికంగా తింటున్నారు. మీకు థర్డ్ వరల్డ్ స్ఫూర్తి అయితే ఆ థర్డ్ వరల్డ్‌లోనే బతకండి. అక్కడికి వెళ్లిపొండి’’ అని ఒక క్యాప్షన్ పెట్టారు. ‘‘ రాజకీయ జిమ్మిక్కులో భాగంగానే ఆయన ఇలా చేత్తో తింటున్నారు. సాధారణంగా ఆయన చేత్తో కాకుండా చెంచాలు, ఫోర్క్‌లతో తింటారు’’ అని కొందరు నెటిజన్లు విమర్శించారు. మ్యాన్‌హాట్టన్ జిల్లా అటార్నీ రేసులో ఉన్న రిపబ్లికన్ నాయకురాలు మాడ్ మరూన్ సైతం విమర్శించారు. అయితే మరికొందరు మాత్రం మమ్దానీకి మద్దతు పలికారు. ‘‘ఆయన చక్కగా చేత్తో కలుపుకుని తిన్నారు. తినడం అనేది ఆయా వ్యక్తుల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అలవాట్లకు సంబంధించిన అంశం. ఇది పూర్తిగా జాత్యహంకారమే’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ రాజకీయంగా ఆయనను ఎదుర్కొనే సత్తాలేక ఆయన వ్యక్తిగత అలవాట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. చేత్తో తినని వాళ్లకే అమెరికా చెందుతుందని రాజ్యాంగంలో రాశారా?. చేత్తో తింటే అనాగరికం ఎలా అవుతుంది?’’ అని మరికొందరు మమ్దానీకి మద్దతు పలికారు. ‘‘ టాకూస్, ఫ్రెంచ్ ప్రై, బర్గర్, పిజ్జా, లేస్ ప్యాకెట్ ఎలా తింటారు?. చేత్తోనేకదా తినేది. మరి అలాంటప్పుడు పప్పన్నం హాయిగా చేత్తో కలిపి తింటే తప్పేంటట?’’ అని మరికొందరు వాదించారు. ‘‘ అమెరికాలో అన్నం చేత్తో తినడం కూడా తప్పేనా?. అమెరికా ఎటు పోతోంది?’’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. -
‘అచ్చం వెన్నలా..’.. ‘ఫోర్డో’దాడులపై ట్రంప్..
న్యూఢిల్లీ: ఇరాన్‌లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు మద్దతు పలుకుతూ, రంగంలోకి దిగిన అమెరికా తన సత్తాను చాటుతూ, మూడు అణుకేంద్రాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల గురించి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ తమ బీ-2 స్టెల్త్ ఫైటర్ విమానాలు విసిరిన బాంబులు ఇరాన్‌లోని అత్యంత రక్షణాత్మక ఫోర్డో అణు కేంద్రంపై వెన్నలా విస్తరిస్తూ వెళ్లి, దానిని ధ్వంసం చేశాయని వ్యాఖ్యానించాయి.ట్రంప్ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘వారు(ఇరాన్) బాంబులు లోపలికి వెళ్లే అవకాశం ఉన్న ద్వారాన్ని మూసివేసేందుకు ప్రయత్నించారు. అయితే తమ బాంబులు వెన్నలా ఆ ద్వారం గుండా సంపూర్ణంగా దూసుకెళ్లాయి. జూన్ 22న ఫోర్డో, నటాంజ్ ఇఫ్సహాన్ అణుకేంద్రాలపై సాగించిన ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’ విజయవంతమయ్యింది. ఆ దేశ అణు కార్యక్రమాన్ని నిర్మూలించాం. ఫోర్డోను కాపాడుతున్న వేల టన్నుల రాతి భాగాన్ని బంకర్ బస్టర్ బాంబు దాడులు కొల్లగొట్టాయి. వారు దాడికి ముందు అక్కడి యురేనియం నిల్వలను ఆ ప్రదేశం నుండి తరలించలేదు. ఫోర్డోను ధ్వంసం చేయడం కష్టమని తొలుత భావించాం. ఈ దాడులు ఎప్పటికి పూర్తి చేస్తామో కూడా ముందుగా చెప్పలేకపోయాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. “Like Absolute Butter”: Trump On How US Struck Iran’s Fordow Nuclear Site https://t.co/GzjLqH6sz6 - #bharatjournal #news #bharat #india— Bharat Journal (@BharatjournalX) June 29, 2025ఫోర్డో అణుకేంద్రం ఇరాన్లో అత్యంత రహస్య ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది పర్వతం దిగువ భాగంలో ఉంది. వైమానిక దాడులు, విదేశీ జోక్యాన్ని నిరోధించేందుకు ఇరాన్ దీనిని పటిష్టంగా నిర్మించింది. కాగా యురేనియం నిల్వలను వృద్ధి చేయడాన్ని ఆపాలని టెహ్రాన్(ఇరాన్)కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. అయితే ఇందుకు ఇరాన్ అంగీకరించకపోవడంతో ఆ దేశంలోని అణుకేంద్రాలపై అమెరికా.. జీబీయూ-57 బంకర్ బస్టర్లు, టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసింది.ఇది కూడా చదవండి: Mann Ki Baat: తెలంగాణను మెచ్చుకున్న ప్రధాని మోదీ..ఎందుకంటే.. -
వాస్తవిక రాజకీయం
ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగానైనా విరామం లభించింది. ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై అమెరికా బంకర్ బస్టర్ బాంబులు వేసింది. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై చర్చ చాలాకాలం పాటు కొనసాగుతుంది. బహుశా కోర్టు మెట్లూ ఎక్కవచ్చు. సుమారు 15 కిలోటన్నుల బరువున్న బంకర్ బస్టర్ బాంబులు అణుస్థావరాలను ధ్వంసం చేసే అవకా శాలు తక్కువే. అంటే ఇరాన్ అణు కార్యక్రమం స్తంబించిపోలేదు. పోనీ అమెరికా బాంబులతో ఆ ప్రాంతంలో శాంతి నెలకొందా? ఇరాన్ లో ప్రభుత్వం మారిందా? ఊహూ! కాదనే చెప్పాలి. బాంబు దాడులకు బదులుగా ఇరాన్ పొరుగున ఉన్న ఖతార్‌లోని అమెరికన్ స్థావరాలపై దాడులు చేసింది. అది కూడా అమెరికాకు ముందుగానే చెప్పి! ఇందుకు ట్రంప్ స్వయంగా ఇరాన్‌కు ధన్యవాదాలూ చెప్పారు. ఏదైతేనేమి... ప్రస్తుతానికైతే శాంతి నెలకొన్నట్టు గానే కనిపిస్తోంది. ప్రపంచ చమురు ఉత్పత్తిలో 20 శాతం కంటే ఎక్కువ రవాణా అయ్యే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పార్లమెంట్ బంద్ చేయాలని తీర్మానించినా ప్రస్తుతానికి ఆ నిర్ణయం అమల్లోకైతే రాలేదు. మధ్యప్రాచ్యంలో యుద్ధమంటే సహజంగానే చమురు ధరల్లో పెరుగుదల ఉంటుంది. తద్వారా ద్రవ్యోల్బణం పెరగడం, పెట్టుబడిదారులు సంశయంలో పడిపోవడం, వాణిజ్యంపై దుష్ప్రభావం సహజంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రపంచ చమురు షేక్ అమెరికా! ఐదో వంతు ముడిచమురు అక్కడే ఉత్పత్తి అవుతోంది. సొంత అవసరాలు పోను ఎగుమతి చేస్తోంది కూడా! ఈ కారణంగానే ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తరువాత కూడా చమురు ధర మునుపటిలా బ్యారెల్‌కు 100 – 150 డాలర్ల స్థాయికి చేరలేదు. రెండూ కావాల్సిన దేశాలే!వీటన్నింటి ప్రభావం భారత్‌పై ఎలా ఉండ బోతోంది? భారత్ ఇప్పుడు జాగరూకతతో, ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇరు దేశాలతో సత్సంబంధాలున్న దేశంగా మరింత బ్యాలెన్ ్సడ్గా ఉండాలి. రక్షణ, నిఘా ఉత్పత్తుల విషయంలో ఇజ్రాయెల్ ఇప్పుడు భారత్‌కు కీలకంగా మారిన విషయం తెలిసిందే. హైఫా నౌకాశ్రయంలో భారతీయుల పెట్టు బడులున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో ఇరు దేశాలూ పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఇజ్రా యెల్‌తో మన వ్యాపారం గణనీయంగా పెరిగి 500 కోట్ల డాలర్లకు చేరుకుంది. మరోవైపు ఇరాన్ మనకు చమురు సరఫరా చేస్తూండటం గమనార్హం. మన రూపాయిల్లోనే ముడిచమురు కొనుగోలుకు అవకాశం కల్పించిన దేశం కూడా ఇరానే! మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా చాబహార్ నౌకాశ్రయాన్ని ఇండియా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. మన దిగుమతుల్లో 32 శాతం చమురు, 52 శాతం ఎల్ఎన్ జీ హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అవుతోంది. ఇందులో తేడా వస్తే దాని ప్రభావం మన వంటింటి గ్యాస్ సిలిండ ర్లపై పడుతుంది. ఎరువుల ఉత్పత్తిలోనూ తేడా లొస్తాయి. రష్యా నుంచి చమురు తెచ్చుకోవడం సులువు కాదు. ఇలా చేయడం అమెరికాకు ఆగ్రహం తెప్పించేదే. చమురు ధరలు ద్రవ్యోల్బణాన్ని మాత్రమే కాకుండా, విదేశీ మారక ద్రవ్య నిల్వలపై, ద్రవ్య లోటుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువను 87 కంటే దిగువకు చేర్చవచ్చు. ముడి చమురు బ్యారెల్ ధర పది డాలర్లు పెరిగితే భారత స్థూల జాతీయోత్పత్తి 0.3 శాతం వరకూ తగ్గవచ్చుననీ, ద్రవ్యోల్బణం 0.4 శాతం పెరుగుతుందనీ ఒక అంచనా. స్టాక్ మార్కెట్లు కూడా పెరిగే చమురు ధరలకు స్పందించి పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. నైతిక ప్రశ్నలూ ఉన్నాయి...రాజకీయాల్లో నైతికత లేని రోజులివి. అయితే, ఏమాత్రం రెచ్చగొట్టే చర్యలకు దిగకున్నా ఒక సార్వభౌమ దేశంపై జరిగిన దాడిని ఖండించరాదా అన్న ప్రశ్న వస్తోందిక్కడ. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిని ‘షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ ’ తన ప్రకటనలో ఖండించింది. ఇండియా ఆ ప్రకటనపై సంతకం చేయకుండా దూరం జరిగింది. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం: గాజా ప్రాంతంలో వెంటనే బేషరతుగా కాల్పుల విరమణ జరగాలన్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లోనూ భారత్ పాల్గొనకపోవడం. ఈ తీర్మానానికి అమెరికా భాగస్వాములైన ఆస్ట్రేలియా, జపాన్ , యూకేలతోపాటు 149 దేశాలు మద్దతిచ్చాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు 12 దేశాలు వ్యతిరేకించాయి. భారత్ ఉద్దేశం ఏమిటి అంటే... ఇజ్రాయెల్, అమెరికాలతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న వాస్తవిక రాజకీయం అనాలి. అయితే ఇది గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం వహించాలన్న భారత్ కాంక్షను తక్కువ చేసేది కూడా! ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవిక రాజకీయం చేయడం మన సైద్ధాంతిక మార్గాన్ని తప్పినట్లు అవుతుంది. మన ట్రాక్ రికార్డులో మచ్చగా మిగులుతుంది. ఏ కూటమితోనూ జతకట్ట కూడదన్న అలీనోద్యమ స్ఫూర్తిని దెబ్బతీసినట్లవుతుంది.ప్రస్తుతం భారతదేశం చాలా సంతులనంతో వ్యవహరిస్తోందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ మన విధానాన్ని స్పష్టం చేసేందుకు ఇదో మంచి అవకాశం కూడా. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను నడిపించే మూలభూత విలువలను నిర్వచించుకోవాల్సిన తరుణమిది. వ్యూహాత్మక స్వావ లంబన, దేశీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం వంటివి అంతర్జాతీయ స్థాయిలో అసందిగ్ధతకు, పిరికితనానికి కారణం కారాదు. రష్యా–ఉక్రెయిన్ , ఇజ్రాయెల్– పాలస్తీనా– ఇరాన్ ఘర్షణలు భారత ఆర్థిక, దౌత్య, రాజకీయ నైపుణ్యానికి సవాలు విసురుతున్న మాట వాస్తవం. అజిత్ రానాడే వ్యాసకర్త ఆర్థికవేత్త -
అమెరికా.. మమ్మల్ని ఆదుకోండి: జెలెన్ స్కీ వేడుకోలు
రష్యా-ఉక్రెయిన్ యద్దాన్ని ఆపేశానని ఇది వరకే బడాయి కబుర్లు చెప్పిన అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా చేసిన అతిపెద్ద దాడిపై ఏం చెబుతారు?, ఇదే మాటను ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆవేదనతో కూడిన స్వరంతో ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రష్యా డాడులకు తట్టుకోలేని స్థితిలో ఉన్నామని, ఈ సమయంలో అమెరికా తమకు తక్షణ రక్షణ సాయం చేయాలని వేడుకుంటున్నారు. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు కూడా తమ అండగా నిలబడి, రష్యాను ఎదుర్కోనేందుకు సాయం చేయాలని జెలెన్ స్కీ సుదీర్ఘమైన ఉద్వేగభరిత పోస్ట్ పెట్టారు. ‘మాకు రక్షణ కావాలి. అది కూడా తక్షణమే కావాలి. రష్యా మా దేశంలోని ప్రతీదాన్ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. ప్రస్తుతం మేము జీవన పోరాటం చేస్తున్నాం. స్మిలాలోని నివాసిత ప్రాంతంలో కూడా రష్యా భీకరమైన దాడులు చేసింది. మా ఎఫ్-16 పైలట్ రష్యా దాడుల్లో చనిపోయాడు. సుదీర్ఘకాలంగా రష్యా చేస్తున్న యుద్ధం ఆపేలా కనిపించడం లేదు. వారికి భీకర దాడులు చేసే శక్తి సామర్థ్యాలు ఉండటంతో మాపై వరుస పెట్టి దాడుల చేస్తూ వస్తోంది. ఈ వారంలోనే 114 మిస్సెళ్లను, 1270 డ్రోన్లతో దాడి చేయడంతో పాటు 1,100 పైగా బాంబులు విసిరింది. ప్రపంచం శాంతి కోసం పిలుపునిచ్చినప్పటికీ, చాలా కాలం క్రితమే యుద్ధం చేస్తూనే ఉండాలని పుతిన్ నిర్ణయించుకున్నాడు. ఇది పుతిన్ వైఖరిని స్పష్టం చేస్తంది. ఈ యుద్ధాన్ని ముగించాలి. దురాక్రమణదారుడిపై ఒత్తిడి అవసరం, అలాగే మాకు రక్షణ కూడా అవసరం. అమెరికాతో పాటు యూరప్ దేశాలు, మిగతా భాగస్వాముల మాకు అండంగా ఉండండి. ఇప్పటివరకూ మాకు సాయంగా ఉన్నవారందరికీ ధన్యవాదాలు’ అని జెలెన్ స్కీ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇక తాము అమెరికా డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా కొనుగోలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తమ పరిస్థితిని చెప్పుకొచ్చారు జెలెన్ స్కీ.Almost all night long, air raid alerts sounded across Ukraine — 477 drones were in our skies, most of them Russian-Iranian Shaheds, along with 60 missiles of various types. The Russians were targeting everything that sustains life. A residential building in Smila was also hit,… pic.twitter.com/1ExZhYAMBg— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 29, 2025 రష్యా-ఉక్రెయిన్ వార్ చరిత్రలోనే.. అతి పెద్ద దాడి ఇదే -
అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్‌తో..
మన భారతీయులు అమెరికాలో పనిచేసేటప్పుడు విచిత్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. రానురాను అక్కడి పద్ధతులకు అలవాటు పడిపోతుంటారు. అది కామన్. అయితే కొన్ని విషయాల్లో ఎవ్వరైనా రాజీపడలేం. ఇక్కడ అలానే ఓ భారతీయ మహిళ తన వ్యక్తిగత అలవాటు రీత్యా ఆఫీసులో ఊహించిన విధంగా ఇబ్బంది పడింది. అయితే పాపం ఆమె అలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదంటూ ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో తన అనుభవాన్ని పేర్కొనడంతో నెట్టింట ఈ విషయం వైరల్‌గా మారింది.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన రుంజున్ అనే భారతీయ మహిళ తన ఆహారపు అవాట్ల రీత్యా ఆఫీస్ ఈవెంట్లో పాల్గొనలేకపోతుంది. మిగతా ఉద్యోగుల్లా ఆమె తన కార్యలయం ఇచ్చిన విందు కార్యక్రమానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అస్సలు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వుతుందని ఆమె భావించలేదు. నెట్టింట ‘ది వికెడ్ వెజిటేరియన్’ మహిళగా పేరుగాంచిన ఆమె ఆఫీస్‌లో ఊహించని విధంగా ఇబ్బందిని ఎదుర్కొంటుంది. తన వర్క్‌ప్లేస్‌లో యజమాన్యం తన సిబ్బందినందరిని మరుసటి రోజుకి భోజనాలు తెచ్చుకోవద్దని బహిరంగ ప్రకటన ఇచ్చింది. దాంతో అంతా మరుసటి రోజు ఇచ్చే విందు కోసం ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. వారిలానే ఈమహిళ కూడా కుతుహలంగా ఉంది. అయితే అక్కడ ఉద్యోగులంతా తమ కంపెనీ ఇచ్చే విందులో పాల్గొని ఖుషి చేస్తుంటే.. ఈ భారతీయ మహిళా ఉద్యోగి మాత్రం అక్కడ నుచి నిశబ్దంగా నిష్క్రమించాల్సి వస్తుంది. ఎందుకుంటే ఆ విందులో అక్కడ రకరకాల ప్లేవర్ల శాండ్విచ్లు సుమారు 60 రకాలు పైనే ఉన్నాయి. వాటిలో అత్యంత ఆరోగ్యకరమైనవి కూడా ఉన్నాయి. అయితే అన్నీ నాన్‌వెజ్ శాండ్‌విచ్‌లే గానీ ఒక్క వెజ్ శాండ్విచ్ కూడా లేకపోవడంతో కంగుతింటుంది ఆమె. అక్కడకి వెజ్ శాండ్విచ్ కావాలని సదరు ఫుడ్ కేటరింగ్‌కి చెప్పినా..తినాలనుకుంటే..వాటి మధ్యలో ఉండే మాంసాన్ని తీసేసి తినవచ్చేనే ఉచిత సలహ ఇవ్వడంతో మరింత షాక్ అవుతుంది. అస్సలు అలా ఎలా తినగలను చాలా బాధపడింది. తనలాంటి ప్యూర్ వెజిటేరియన్లకు అది మరింత ఇబ్బందని, తింటే వాంతులు వస్తాయని వాపోయింది. తనకోసం వెజ్ శాండ్విచ్ ప్రిపేరవ్వదని భావించి ఆ ఈవెంట్ నుంచి నెమ్మదిగా నిష్క్రమించింది. అయితే అక్కడున్న వారంతా గిల్టీగా ఫీల్ అయ్యి..సదరు భారతీయ మహిళ రింజూన్‌కు మరేదైనా తెప్పిస్తామని రిక్వెస్ట్ చేశారు. కానీ ఆమెకు అప్పటికే ఆకలిగా ఉండటంతో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్లు ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది. ఆ పోస్ట్‌ని చూసిన నెటిజన్లు తాము కూడా అలాంటి సమస్యనే ఫేస్ చేశామంటూ ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ.. పోస్టులు పెట్టారు.(చదవండి: ఆ ఊళ్లో నెమళ్ల బెడద..) -
కిరికిరి మొదటికి వచ్చింది .. మరోసారి బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ విమర్శలు
వాషింగ్టన్: అపరకుబేరుడు ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ ఏడాది ట్రంప్ ప్రవేశపెట్టిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై ఎలాన్ మస్క్ తాజాగా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ బిల్లును అమలు చేసేలా దిశగా దాదాపు చర్చకు సిద్ధమవుతోంది. ఇందుకోసం 1,000 పేజీల ప్రతిపాదనను సిద్దం చేసింది. ఈ తరుణంలో.. ఆ బిల్లు అవివేకం, విధ్వంసకరం’ అని మస్క్ అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా మస్క్ ట్వీట్ చేశారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్‌ను చట్టం చేసే ప్రయత్నంలో ‘బిల్లు డ్రాఫ్ట్’ను అమెరికా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ క్రమంలో బిల్లు డ్రాఫ్ట్‌ను మస్క్ తప్పుబట్టారు. తాజా సెనేట్ డ్రాఫ్ట్ బిల్లు మిలియన్ల మంది ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అధికార రపబ్లికన్ పార్టీ లీడర్లకు ఇదే నా హెచ్చరిక. బిల్లు చట్టంగా మారిస్తే విధ్వంసం సృష్టించినట్లే. అంతేకాదు, చట్టం అమలైతే ఇప్పటికే స్థాపించిన పరిశ్రమలు, ప్రారంభించబోయే పరిశ్రమలకు రానున్న రోజుల్లో అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే పేర్కొన్నారు. ఇంతకుముందు కూడా హౌస్‌లో ప్రవేశపెట్టిన బిల్లును మస్క్ వ్యతిరేకించారు. ఆబిల్లుకు ఆమోదం లభించడంతో టెస్లా విలువ భారీగా పతనమైంది. నాటి నుంచి గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్‌ల మధ్య వైరం మొదలైంది. దుబారా ఖర్చుల్ని తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (doge) సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వరుసగా ట్రంప్ తీరును బహిరంగంగా ఎండగడుతూ వచ్చారు. ఒకానొక దశలో నేను ప్రచారం చేయకపోతే రిపబ్లికన్ అధికారంలోకి వచ్చేదే కాదు. ఆ పార్టీ నేతలు 50కే పరిమితమయ్యేదని వ్యాఖ్యానించారు. ఎప్సిటీన్ ఫైళ్లలో ట్రంప్ ఉన్నారంటూ బాంబు పేల్చారు. అందుకే ఎప్సిటీన్ ఫైళ్లను బహిర్గతం చేయటం లేదంటూ ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. The latest Senate draft bill will destroy millions of jobs in America and cause immense strategic harm to our country!Utterly insane and destructive. It gives handouts to industries of the past while severely damaging industries of the future. https://t.co/TZ9w1g7zHF— Elon Musk (@elonmusk) June 28, 2025ట్రంప్ సైతం మస్క్‌ను అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేశారు. మస్క్ తీరు ఇలాగే కొనసాగితే మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి ఏమైందో ఏమో.. తాను చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ మస్క్ క్షమాపణలు చెప్పారు. అనూహ్యంగా మళ్లీ బిగ్ బ్యూటిఫుల్ బిల్‌ను వ్యతిరేకిస్తూ కామెంట్లు పెట్టారు. మరి ఈ కామెంట్లకు ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
సుంకాలపై ట్రంప్ కొత్త ట్విస్ట్.. అధ్యక్ష పదవిపై సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పలు దేశాలపై విధించే సుంకాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలపై నిర్ణయం తీసుకోవడానికి అమెరికాకు చాలా వెసులుబాటు ఉందన్నారు. సుంకాలను తిరిగి విధించడానికి జులై తొమ్మిది గడువును ఇప్పుడే నిర్ణయించలేమని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక.. తాజాగా, అమెరికా అధ్యక్ష పదవిని ఉద్దేశిస్తూ ఆ పదవిలో ఉండటం చాలా ప్రమాదకరమని ఆయన తెలిపారు.అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా దిగుమతుల విషయంలో సుంకాలపై నిర్ణయం తీసుకోవడానికి మాకు స్వేచ్చ ఉంది. సుంకాల విధింపును అనుకున్న సమయం కంటే కుదించవచ్చు లేదా పొడిగించవచ్చు. అయితే, నేను వ్యక్తిగతంగా తొందరగా ముగించడానికే ఇష్టపడతాను. మీ అందరికీ ఓ విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు 25 శాతం చెల్లిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. అయితే సుంకాలపై పెంపు నిర్ణయం మరింత వాయిదా పడే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బీసెంట్ సంకేతాలు ఇచ్చారు. అమెరికా కార్మిక దినోత్సవం (సెప్టెంబర్ 1) నాటికి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు.కెనడాతో కష్టం..అలాగే, కెనడాతో వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ కంపెనీలపై విధిస్తున్న డిజిటల్ ట్యాక్స్‌ను దాడిగా అభివర్ణించారు. ఇందుకు దీటుగా కెనడాపై కూడా సుంకాలు విధిస్తామని అన్నారు. త్వరలో ఈ వివరాలు వెల్లడిస్తానని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ‘ఇది చాలా దారుణమైన పన్ను, అందుకే కెనడాతో వాణిజ్య చర్చలన్నిటికీ తక్షణం ముగింపు పలుకుతున్నాము. కెనడాతో వాణిజ్యం చాలా కష్టం. వారు తమ తీరు మార్చుకునే వరకూ ఎలాంటి చర్చలూ ఉండవు’ అని పేర్కొన్నారు.అధ్యక్ష పదవి డేంజర్..ఇక, తాజాగా ట్రంప్ హైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ గతేడాది పెన్సిల్వేనియాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన హత్యాయత్నాన్ని ట్రంప్ గుర్తుచేసుకున్నారు. అనంతరం, ట్రంప్.. అధ్యక్ష పదవి ప్రమాదకరమైనది. ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటుందని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి బాధ్యతలను కారు రేసింగ్, బుల్ రైడింగ్ లాగే ఇక్కడ కూడా చావు ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేమన్నారు. ఈవిషయం తనకు ఎవరైనా ముందే చెప్పి ఉంటే.. తాను ఈ రేసులో ఉండేవాడిని కాదన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన వృత్తి అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, గతంలో ట్రంప్‌పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది.HOLY SH*T 🚨 President Trump just ENDED trade talks with Canada announcing massive tariffs soonAMERICA WILL NOT BE BULLIEDWE WILL NOT BACK DOWN pic.twitter.com/voOXgaBEes— MAGA Voice (@MAGAVoice) June 27, 2025ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చాక పలు దేశాలపై భారీగా టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయా దేశాలతో ఎగుమతులు, దిగుమతుల టారిఫ్‌లపై నిర్ణయం తీసుకోవడం, వాణిజ్య ఒప్పందం చేసుకోవడం కోసం 90 రోజుల పాటు పెంచిన సుంకాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ గడువు జులై తొమ్మిదో తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఎడిసన్‌లో అతిపెద్ద బౌలింగ్ కేంద్రం ప్రారంభం
ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ థీమ్ మినీ పుట్టింగ్, లగ్జరీ బౌలింగ్ గమ్యస్థానమైన అల్బాట్రోస్ న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ప్రారంభమైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ వేడుక ఇటీవల వైభవంగా జరిగింది. ఇందులో ఎడిసన్ మేయర్ శామ్ జోషి, స్థానిక నాయకులు, మీడియా, ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు.ఎడిసన్‌లోని 991 యుఎస్-1 వద్ద ఏర్పాటైన అల్బాట్రోస్ న్యూజెర్సీలో సామాజిక వినోదానికి ఒక కొత్త బెంచ్ మార్క్ ను ఏర్పరుస్తుంది. 50,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఇది అద్భుతమైన థీమ్డ్ మినీ పుట్టింగ్, అప్స్కేల్ బౌలింగ్, ఎలివేటెడ్ డైనింగ్, క్రాఫ్ట్ కాక్టెయిల్స్ వంటి హంగులతో సాయంత్రం వేళ ఆటవిడుపును మరింత హుషారుగా మారుస్తుంది."మా గ్రాండ్ ఓపెనింగ్ ఒక అద్భుతమైన వేడుక, చివరికి అల్బాట్రోస్లోకి అతిథులను స్వాగతించడం మాకు చాలా సంతోషంగా ఉంది" అని అల్బాట్రోస్ ఎన్జె ప్రెసిడెంట్ స్టీఫెన్ సాంగర్మానో అన్నారు. "ఇది కేవలం వినోద వేదిక మాత్రమే కాదు- ఇది మరచిపోలేని సాటిలేని విధంగా రూపొందించబడిన సామాజిక ఆటస్థలం. మినీ పుటింగ్, లగ్జరీ బౌలింగ్ నుంచి క్రాఫ్ట్ కాక్టెయిల్స్, వైబ్రెంట్ డైనింగ్, లైవ్ డీజేల వరకు ఎక్కడా ఇలాంటివి లేవు’ అన్నారు."ప్రపంచ స్థాయి వినోదం, 350 కి పైగా ఉద్యోగాలు కల్పిస్తున్న అల్బాట్రోస్ ఎడిసన్‌కు గేమ్ ఛేంజర్. మా మొత్తం కమ్యూనిటీకి శక్తిని తెస్తోంది" అని ఎడిసన్ మేయర్ సామ్ జోషి అన్నారు. "175,000 డాలర్ల అంచనా పన్నులతో మా స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, కుటుంబాలు, స్నేహితులు, సందర్శకులు కనెక్ట్ కావడానికి, ఆనందించడానికి నూతన, ఉత్తేజకరమైన ప్రదేశాన్ని అందించే గమ్యస్థానానికి స్వాగతం పలకడం నిజంగా ఉత్తేజకరమైనది. ఎడిసన్ ఇంత డైనమిక్, సృజనాత్మక వేదికకు నిలయంగా ఉండటం మాకు గర్వకారణం’ అని పేర్కొన్నారు. -
అమెరికాతో అణు చర్చలు జరపబోమని ఇరాన్ ప్రకటన
-
చాలా వెతికాం.. కనిపిస్తే కథ ముగించేవాళ్లం: ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ మరోసారి సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కోసం చాలా వెతికామని, ఆయన కనబడితే కచ్చితంగా చంపేవాళ్లమని అంగీకరించింది. అయితే ప్రాణ భయంతోనే ఖమేనీ పారిపోయి దాక్కున్నారంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వ్యాఖ్యానించారు.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన కోసం చాలా చోట్ల వెతికామని, జాడ తెలిసి ఉంటే కచ్చితంగా మట్టుపెట్టేవాళ్లమని, కానీ ఆ విషయం తెలుసుకున్న ఖమేనీ లోతైన బంకర్లలో దాక్కున్నారని వ్యాఖ్యానించారాయన. ఖమేనీని అంతమొందించేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చాం. కానీ, ఆయన సురక్షితంగా ఎక్కడో బంకర్లో దాక్కుని క్షిపణి దాడులు చేయించారు. ఇది అత్యంత తీవ్రమైన యుద్ధ నేరం కిందకే వస్తుంది అని కాట్జ్ అభిప్రాయపడ్డారు. అయితే భవిష్యత్తులో అలాంటి ప్రయత్నాలు సాగుతాయా? అనే ప్రశ్నకు.. ఆయన మౌనం వహించారు. ఇదిలా ఉంటే.. ఖమేనీపై కాట్జ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేం కాదు. టెల్ అవీవ్‌పై జూన్ 14వ తేదీన ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 47 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన కాట్జ్.. ఖమేనీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఖమేనీకి ఇక భూమ్మీద ఉండే హక్కు లేదు అని, ఖమేనీ పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని ఆ సమయంలో కాట్జ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కూడా ఖమేనీపై విరుచుకుపడ్డారు. ఖమేనీ అభినవ హిట్లర్ అని, ఆయన ప్రాణాలతో లేకుంటేనే శాంతి నెలకొంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అమెరికా మాత్రం ఖమేనీ ఎక్కడ దాక్కున్నారనే పక్కా సమాచారం తమ వద్ద ఉందని చెబుతూ.. ఆయన్ని చంపే ఉద్దేశం లేదని, బేషరతుగా లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. ఖమేనీ తనకు వస్తున్న బెదిరింపులను తేలికగానే తీసుకుంటూ వచ్చారు. ఇరాన్ ఎప్పటికీ లొంగదు, బెదిరింపులకు భయపడదు అని సోషల్ మీడియాలో, ఇటు టెలివిజన్ ప్రసంగంలో పేర్కొంటూ వస్తున్నారు.ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రారంభం అయ్యాక.. ఆయన టెహ్రాన్‌ను వీడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలతో సంబంధాలు లేకుండా.. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌కు దూరంగా.. గట్టి భద్రత మధ్య ఆయన సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు వరుస కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో కాల్పుల విరమణ తర్వాత ఆయన జాడ లేదంటూ ఇరాన్ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆయన తాజాగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అయితే అందులో 86 ఖమేనీ కాస్త నీరసంగా కనిపించారు. -
అమెరికా దాడుల ఎఫెక్ట్.. ట్రంప్‌కు షాకిచ్చిన ఇరాన్
టెహ్రాన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ ఊహించిన షాకిచ్చింది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం సందర్భంగా తమపై అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాతో ఎలాంటి అణుచర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు.అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ వచ్చేవారం ఇరాన్‌తో అణుచర్చలు జరగనున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై తాజాగా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఈ సందర్బంగా అబ్బాస్.. అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించి సమావేశమయ్యే ఆలోచన మాకు లేదు. ఇటీవల ఇరాన్‌పై అమెరికా చేసిన దాడులు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి. ఇరాన్ అణు కార్యక్రమం పునరుద్ధరణపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అమెరికాతో చర్చల్లో పాల్గొనే ఆలోచనే లేదు అని కుండబద్దలు కొట్టారు.#Iran's Foreign Minister Seyed Abbas Araghchi says that no arrangement or commitment was made to resume negotiations with the United States, amid heightened tensions following attacks by Israel and United States on Iranian territory. File Photo pic.twitter.com/LZruhGwi4K— All India Radio News (@airnewsalerts) June 27, 2025మరోవైపు.. నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. వచ్చేవారం టెహ్రాన్‌తో అణుచర్చలు జరుపుతామన్నారు. అణ్వాయుధాలు తయారుచేయాలన్న ఆశయాన్ని వదిలేసేలా ఇరాన్‌తో ఒప్పందం చేసుకొనే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇరాన్ చమురుపై ఆంక్షల విషయంలో కూడా చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు ట్రంప్ హింట్ ఇచ్చారు.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌పై యుద్ధంలో ఇరాన్ విజయం సాధించిందని, అమెరికా జోక్యం చేసుకోకుండా ఉంటే ఆ దేశం నాశనమయ్యేదని ఇరాన్ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. ఖతార్‌లోని అమెరికా స్థావరంపై దాడి చేసి అగ్రరాజ్యాన్నీ చాచి చెంపదెబ్బ కొట్టామని అన్నారు. మళ్లీ తమపై దాడి చేసే ప్రయత్నం చేస్తే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై బంకర్ బ్లస్టర్ బాంబులు, క్రూజ్ క్షిపణులతో అమెరికా చేసిన దాడులు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఈ దాడుల్లో అగ్రరాజ్యం ఏమీ సాధించలేకపోయిందని అన్నారు. ఖతార్‌లో అమెరికా స్థావరంపై తాము చేసిన దాడికి చాలా ప్రాధాన్యం ఉందని చెప్పారు. అమెరికా స్థావరాలకు చేరగల సత్తా తమ దేశానికి ఉందని నిరూపితమైందని అన్నారు. భవిష్యత్తులోనూ అవసరమైన సందర్భాల్లో ఇలాంటి దాడులు చేస్తామని అమెరికాను ఖమేనీ హెచ్చరించారు. -
భారత్ తో అమెరికా బిగ్ డీల్
-
భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం
వాషింగ్టన్: భారత్‌తో త్వరలో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చాలారోజులుగా కొనసాగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు. ట్రంప్ గురువారం శ్వేతసౌధంలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. త్వరలో గొప్ప ఒప్పందాలు పట్టాలెక్కబోతున్నాయని, వాటిలో ఒక ఒప్పందం బహుశా ఇండియాతోనే కావొచ్చని పేర్కొన్నారు. అది భారీగానే ఉంటుందని ఉద్ఘాటించారు. వ్యాపారం, వాణిజ్యం విషయంలో ఇండియాతో కలిసి పని చేయబోతున్నామని వివరించారు. ప్రతి దేశంతోనూ తమకు చక్కటి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అమెరికాతో ట్రేడ్ డీల్ ప్రతి దేశం ఆసక్తి చూపుతోందని అన్నారు. ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొనే పనిలో తమ ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైందని తెలిపారు. అయితే, ప్రతి ఒక్కరితో ఒప్పందాలకు రావాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు వాణిజ్యం అమెరికాతో తదుపరి వాణిజ్య చర్చల కోసం భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ బృందం గురువారం వాషింగ్టన్కు చేరుకుంది. మధ్యంతర ట్రేడ్ డీల్‌ను వచ్చే నెల 9వ తేదీ కల్లా ఖరారు చేసుకొనేందుకు ఇరుదేశాలు ప్రయతి్నస్తున్నాయి. ఇండియా ఉత్పత్తులపై ఏప్రిల్ 2న విధించిన అధిక టారిఫ్‌లను జూలై 9 దాకా ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. గడువులోగా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వ్యవసాయం, పాడి పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులపై సుంకాలను చాలావరకు మినహాయించాలని అమెరికా కోరుతుండడం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. ఎలక్ట్రిక్ వాహనాలు, మద్యం, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, కొన్ని రకాల పండ్లు, జన్యుమారి్పడి పంటలపై సుంకాలు భారీగా తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. వ్రస్తాలు, వజ్రాలు, బంగారు అభరణాలు, తోలు ఉత్పత్తులు, ప్లాస్టిక్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, ఆరటి పండ్లపై సుంకాల్లో కోత విధించాలని అమెరికాను భారత్ కోరుతోంది. వాణిజ్య ఒప్పందంలో ఇరుదేశాల డిమాండ్లకు ఏమేరకు ప్రాధాన్యం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ ప్రస్తుతం 191 బిలియన్ డాలర్లుగా ఉంది. 2030 నాటికి దీన్ని ఏకంగా 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఇరుదేశాలు పట్టుదలతో ఉన్నాయి. #WATCH | "...We just signed (trade deal) with China. We're not going to make deals with everybody... But we're having some great deals. We have one coming up, maybe with India, a very big one. We're going to open up India. In the China deal, we're starting to open up China.… pic.twitter.com/fJwmz1wK44— ANI (@ANI) June 26, 2025చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం అమెరికా, చైనా మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అయితే, ఈ ఒప్పందం వివరాలు బహిర్గతం చేయలేదు. రెండు రోజుల క్రితమే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ తాజాగా స్పష్టంచేశారు. అమెరికాతో ఒప్పందం కుదిరిన మాట నిజమేనని చైనా వాణిజ్య శాఖ సైతం ధ్రువీకరించింది. చైనాలోని అరుదైన ఖనిజాలను అమెరికా కంపెనీలు సులభంగా పొందడానికి వీలుగా ఒప్పందానికి రాబోతున్నట్లు రెండు వారాల క్రితం ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, తాజా ఒప్పందంలో ఈ అంశాన్ని చేర్చారా? లేదా? అనేది బయటపెట్టలేదు. అమెరికా కాలేజీల్లో చదువుకుంటున్న చైనా విద్యార్థుల వీసాలను రద్దుచేసే ప్రక్రియను నిలిపివేస్తామని అమెరికా ఇప్పటికే హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల నడుమ వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. -
మైనస్‌లోకి అమెరికా జీడీపీ
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో (జనవరి–మార్చి/క్యూ1) అంచనాలకు మించి క్షీణతను చవిచూసింది. ట్రంప్ గందరగోళ వాణిజ్య విధానాలతో వ్యాపారపరమైన అనిశి్చతులకుతోడు బలహీన వినియోగ డిమాండ్ ప్రభావం చూపించాయి. జీడీపీ మైనస్ 0.5 శాతానికి పడిపోయినట్టు అమెరికా వాణిజ్య శాఖ తన మూడవ, తుది అంచనాలను ప్రకటించింది. ద్వితీయ అంచనాల్లో క్షీణత 0.2 శాతంగానే ఉండొచ్చన్న వాణిజ్య శాఖ అంచనాలను మించి ఆర్థిక వ్యవస్థ కుంగుబాటునకు గురైంది. మూడేళ్లలోనే మొదటిసారి అమెరికా జీడీపీ మైనస్‌లోకి వెళ్లినట్టయింది. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండే కీలకమైన వినియోగదారుల వ్యయం నిదానించినట్టు తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. మార్చి త్రైమాసికంలో వినియోగం 1.2 శాతంగా ఉంటుందని అంచనా వేయగా, ఇది 0.5 శాతానికి పరిమితమైంది. 2024 చివరి త్రైమాసికంలోనూ వినియోగం 4 శాతం వృద్ధిని చూసింది. నాలుగేళ్లలోనే ఒక త్రైమాసికం పరంగా ఇది అతి తక్కువ వినియోగం కావడం గమనార్హం. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడానికి ట్రంప్ టారిఫ్‌లు సైతం ప్రభావం చూపించాయి. టారిఫ్‌లు అమల్లోకి రావడానికి ముందే పెద్ద మొత్తంలో దిగుమతులకు అక్కడి సంస్థలు మొగ్గు చూపించాయి. 2024 చివరి త్రైమాసికంలో అమెరికా జీడీపీ 2.4 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. -
అమెరికా చెంప చెళ్లుమనిపించాం
దుబాయ్: ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై క్షిపణులు ప్రయోగించి ఇరాన్ తన సత్తాను చాటిందని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. దాడులతో అమెరికా చెంప చెళ్లుమనిపించామని ఆయన అన్నారు. యుద్ధంలో మేమే గెలిచామని ఆయన ప్రకటించారు. ఇరాన్‌పై బాంబుదాడులు చేసిన అమెరికాకు ఒనగూరింది శూన్యమని ఆయన ఎద్దేవాచేశారు. మరోసారి ఇరాన్‌పై దాడికి సాహిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికాను ఖమేనీ హెచ్చరించారు. యుద్ధం ముగిశాక తొలిసారి ఖమేనీ ఒక వీడియో సందేశం ఇచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్‌లకు హెచ్చరికలు చేస్తూ పది నిమిషాలకుపైగా ఖమేనీ మాట్లాడిన ఆ వీడియోను ఇరాన్ ప్రభుత్వ అధికారిక టెలివిజన్ గురువారం ప్రసారం చేసింది. I offer my congratulations on the victory over the fallacious Zionist regime.— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025 My congratulations on our dear Iran’s victory over the US regime. The US regime entered the war directly because it felt that if it didn’t, the Zionist regime would be completely destroyed. It entered the war in an effort to save that regime but achieved nothing.— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025 The fact that the Islamic Republic has access to key US centers in the region and can take action whenever it deems necessary is a significant matter. Such an action can be repeated in the future too. Should any aggression occur, the enemy will definitely pay a heavy price.— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025అమెరికా రాకుంటే ఇజ్రాయెల్ ధ్వంసమయ్యేది‘‘యుద్ధంలో ఇజ్రాయెల్‌ను రక్షించేందుకే అమెరికా తప్పని పరిస్థితుల్లో రంగప్రవేశం చేసింది. అమెరికా గనక జోక్యంచేసుకోకపోయి ఉంటే మా దాడుల్లో ఇజ్రాయెల్ దారుణంగా ధ్వంసమయ్యేది. అయినా సరే అమెరికా స్థావరాలపైనా క్షిపణుల్ని ప్రయోగించి మా సత్తా చాటాం. ఖతార్‌లోని దోహా నగర సమీపంలోని అల్–ఉదేయిద్ అమెరికా ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడులు చేశాం. ఇరాన్‌పై అమెరికా దాడులను ట్రంప్ అతిశయోక్తిగా చెప్తున్నారు. నిజానికి ఇరాన్‌పై దాడులతో అమెరికా సాధించింది శూన్యమే. జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్ నాశనమవుతుందన్న అంచనాతోనే అమె రికా యుద్ధంలోకి అడుగుపెట్టింది. కానీ లక్ష్యసాధనలో పూర్తిగా విఫలమైంది. మా ఇస్లామిక్ రిపబ్లిక్ జయకే తనం ఎగరేసింది. ఇది అమెరికాకు ఘోర పరాభవం. భవిష్యత్తులో మరోసారి మాపై దాడి చేయాలని అమెరికా భావిస్తే ఇంతకంటే పెద్దస్థాయిలో పరాభవం ఎదుర్కోక తప్పదు’’ అని ఖమేనీ హెచ్చరించారు. అయితే ఈ వీడియోలో ఖమేనీ కాస్తంత నీరసంగా కనిపించారు. -
దేశపు యువరాణి ట్రంప్‌ను వెక్కిరించింది?!.. వీడియో వైరల్
ఆమ్స్టర్డ్యామ్: అధికారిక పర్యటనలో భాగంగా నెదర్లాండ్ వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను (Donald Trump) ఆ దేశపు క్వీన్ మాక్సిమా (Queen Maxima) వెక్కిరించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల నెదర్లాండ్స్ (Netherlands)లో నాటో సమ్మిట్ జరింగింది. ఆ సమ్మిట్‌కు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. అక్కడ రాజకీయ అతిథిగా హుయిస్ టెన్ బోష్ అనే రాయల్ ప్యాలెస్‌లో కింగ్ విలెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమా అతిథిలుగా వచ్చారు. అక్కడ జరిగిన అధికారిక ఫోటోషూట్ సమయంలో ట్రంప్ మాట్లాడిన తరవాత, క్వీన్ మాక్సిమా అతని ముఖభావాలను అనుకరించినట్లు కనిపించింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని భావించగా, మరికొంతమంది మాత్రం ఇది యాదృచ్ఛికంగా జరిగిందని అంటున్నారు. ఇది నిజంగా ట్రంప్‌ను వెక్కిరించారా? లేక కేవలం సరదాగా జరిగిన సంఘటనా అన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది. Queen #Máxima of the #Netherlands mocked #Trump's facial expressions.🙃No hint of condemnation – just understanding. pic.twitter.com/hNP3Rp2UaM— Boris Alexander Beissner (@boris_beissner) June 25, 2025 -
మీరు భారతీయుడిలా కాదు.. పాకిస్తానీలా కనిపిస్తున్నారు: కంగనా
న్యూఢిల్లీ: న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేశారు. డెమొక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మమ్దానీ గెలుపొందిన తర్వాత అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించగా, కంగనా రనౌత్ సైతం అతని గెలుపును ఉద్దేశిస్తూ మండిపడ్డారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ ద్వారా మమ్దానీ భారతీయుడి కంటే పాకిస్తానీగానే ఎక్కువగా కనిపిస్తున్నాడని ఆరోపించారు కంగనా. @మమ్దానీ తల్లి మీరా నాయర్.. భారత అత్యుత్తమ చిత్ర నిర్మాణ రంగానికి కృషి చేసి పేరు సంపాదించారు. పద్మశ్రీ కూడా గెలుచుకున్నారు. ఆమె న్యూయార్క్‌లో ఉన్నప్పటికీ భారత్‌లో పుట్టి పెరిగారు. గుజరాత్‌కు చెందిన మెహ్మద్ మమ్దానీని మ్యారేజ్ చేసుకుని న్యూయార్క్‌లో సెటిల్ అయ్యారు. మెహ్మద్ మమ్దానీకి కూడా రచయితగా మంచి గుర్తింపు ఉంది. మరి జోహ్రాన్ మమ్దనీ మాత్రం పాకిస్తానీలాగా కనిపిస్తున్నాడు. భారత మూలాలు ఎక్కడ కనిపించడం లేదు. అతని భారత మూలాల్లో జరిగిందేదో జరిగింది. కానీ మమ్దానీ మాత్రం యాంటీ ఇండియన్ కాబోతున్నాడు’ అని కంగనా రనౌత్ రాసుకొచ్చారు. His mother is Mira Nair, one of our best filmmakers, Padmashri , a beloved and celebrated daughter born and raised in great Bharat based in Newyork, she married Mehmood Mamdani ( Gujarati origin) a celebrated author, and obviously son is named Zohran, he sounds more Pakistani… https://t.co/U8nw7kiIyj— Kangana Ranaut (@KanganaTeam) June 26, 2025 కాగా, 33 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ డెమొక్రాటిక్ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించి రేసులో నిలిచాడు. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య సిరియా మోడల్ రమా దువాజీ(rama duwaji). రాజకీయ నాయకుడిగా, సామాజిక కార్యకర్తగా న్యూయార్క్ మేయర్ రేసు ప్రచారంలో తొలి నుంచి.. ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో ఏడాదిగా దూసుకుపోతున్నాడు. అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్, బెర్నీ సాండర్స్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు.అయితే జోహ్రాన్ మమదానీకి జనాల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా యువతలో. సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. మద్దతుదారులతో డ్యాన్స్ చేస్తూ, మజ్జిగ పంచుతూ సంబరాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నారై కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్ సాంగ్స్, డైలాగులతో షార్ట్ వీడియోలతో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. -
గాలిలో ఉండగానే విమానంలో మంటలు
-
ఖండాంతర క్షిపణి అభివృద్ధి కోసం పాక్ యత్నాలు
వాషింగ్టన్: పాకిస్తాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని భారీగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ‘విదేశీ వ్యవహారాల’ నిఘా నివేదిక వెల్లడించింది. అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం) తయారీ యత్నాలను ముమ్మరం చేస్తోందని పేర్కొంది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 5,500 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. చైనా సహకారంతో పాక్ ఇందుకు పూనుకున్నట్టు సమాచారం. ఐసీబీఎంలు తయారుచేస్తే పాక్‌ను అమెరికా తన అణ్వస్త్ర శత్రువుగా ప్రకటించడం ఖాయమని ఆ దేశ ఉన్నతాధికారులు స్పష్టంచేసినట్లు నివేదిక పేర్కొంది. అమెరికా భూభాగాన్ని తాకగలిగే స్థాయిలో సుదూరం నుంచి క్షిపణులను ప్రయోగించే సత్తా ఉన్న రష్యా, చైనా, ఉత్తర కొరియాను అమెరికా ‘అణ్వస్త్ర విరోధులు’గా ప్రకటించింది. ‘‘ఖండాంతర క్షిపణితో అమెరికాను లక్ష్యంగా చేసుకునే ఏ దేశాన్నీ అమెరికా తన మిత్రుడిగా భావించదు’’ అని ఆ దేశ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.ఐసీబీఎంలు లేని పాక్పాక్ వద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సాంకేతికత లేదు. ఐసీబీఎం క్షిపణులు లేవు. 2022లో భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించే మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి షాహీన్–3ను ప్రయోగించింది. ఇది 2,700 కి.మీ.కు పైగా ప్రయాణించగలదు. భారత్‌లోని ఎన్నో నగరాలు దాని పరిధిలోకి వచ్చాయి. దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు పాక్‌పై అమెరికా పలు ఆంక్షలు విధించింది. క్షిపణులను రూపొందించే ‘నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్’, మరో మూడు సంస్థలపై నిషేధం విధించింది. వీటితో వ్యాపారంచేసే తమ దేశీయ సంస్థల ఆస్తులను స్తంభింపజేస్తామని గతంలోనే అల్టిమేటమిచ్చింది. ఈ చర్యలను పాక్ తప్పుబట్టింది. అమెరికా స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని ఆరోపించింది. ఎన్పీటీపై సంతకం చేయని పాక్ వద్ద 170 అణువార్హెడ్లు పోగుబడినట్లు పాత నివేదికలు వెల్లడిస్తున్నాయి. -
అణుఫైటర్ల కొనుగోలు
లండన్: వరుస ఉద్రిక్తతలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో యూకే తన రక్షణ వ్యవస్థపై దృష్టి పెట్టింది. అణ్వస్త్ర వ్యవస్థను పటిష్టం చేసుకుంటోంది. అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే ఎఫ్–35 ఏ ఫైటర్ జెట్లు 12 అమెరికా నుంచి కొనుగోలు చేయనున్నట్టు ప్రధాన మంత్రి కియిర్ స్టార్మర్ ప్రకటించారు. ‘తీవ్రమైన అనిశ్చితి యుగంలో ఈ విమానాలు మన సాయుధ దళాలను బలోపేతం చేస్తాయి. మన రక్షణ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సైన్యానికి మద్దతు ఇస్తాయి’ అని స్టార్మర్ తెలిపారు. కొత్త విమానాలను నార్ఫోక్లోని ఆర్ఏఎఫ్ మార్హామ్లో ఉంచుతారు. శత్రు దాడులను నివారించడానికి, నాటో సభ్యుల మధ్య అణుశక్తిని పంచుకునే కార్యక్రమంలో భాగంగా ఇవి ఉంటాయి. యూకే అన్ని అంతర్జాతీయ ఒప్పందాలు, నిబంధనలకు కట్టుబడి ఉంటుంది. ‘దేశవ్యాప్తంగా 100 వ్యాపారాలకు, 20,000 కంటే ఎక్కువ ఉద్యోగా కల్పించే ఈ ఎఫ్35 డ్యూయల్ కెపాసిటీ విమానాలు మన రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో కొత్త శకానికి నాంది పలుకుతాయి. మన దేశాన్ని, మన మిత్రదేశాలను బెదిరించే శత్రువుల నుంచి ముప్పును అరికడతాయి’ అని స్టార్మర్ అన్నారు.స్వాగతించిన నాటో.. ఈ ప్రకటనను నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే స్వాగతించారు. ఆయన దీనిని బ్రిటన్ నుంచి కూటమికి బలమైన సహకారంగా అభివర్ణించారు. ఈ నిర్ణయం నాటో ఫస్ట్ వ్యూహ్యాన్ని బలపరచడమే కాదు, యూకే ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతుందని రక్షణ కార్యదర్శి జాన్ హీలీ అన్నారు. బ్రిటిష్ భూభాగంపై భవిష్యత్తులో దాడులు జరిగే అవకాశం ఉందని యూకే రక్షణ వ్యవస్థ ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. రష్యా అతిపెద్ద ముప్పుగా మిగిలిందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఈ కొనుగోళ్ల ప్రకటన వెలువడింది.బలమైన అణుబంబాలను మోసుకెళ్లే జెట్లు..ఎఫ్–35ఏ విమానం బీ61–12 అనే ప్రత్యేకమైన బాంబును మోసుకెళ్ల గలదు. అవి 0.3, 1.5, 10, 50 కిలో టన్నుల పేలుడు పదార్థాలను మోయ గలవని అమెరికన్ సైంటిస్ట్స్ సమాఖ్య తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమాపై వేసిన బాంబు బరువు 15 కిలోటన్నులు. ఈ జెట్ విమానాలను యూఎస్ కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసింది. ఎఫ్–35ఏ పాత ఎఫ్–35బీ కంటే ఖరీదు తక్కువని, ప్రతి విమానంపై 25% వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. -
ఫోన్లో జేడీ వాన్స్ మీమ్ ఉన్నందుకు అమెరికాలో ప్రవేశించనివ్వలేదు
న్యూయార్క్: ఫోన్లో జేడీ వాన్స్ బట్టతల మీమ్ ఫొటో ఉన్నందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అమెరికాలో ప్రవేశించనివ్వలేదని నార్వేకు చెందిన పర్యాటకుడు ఆరోపించారు. తనకు ఎలాంటి నేరచరిత్ర లేకపోయినా.. తాను నెవార్క్ విమానాశ్రయంలో దిగిన మరుసటి రోజు తిప్పి పంపారని తెలిపాడు. నార్వేకు చెందిన 21 ఏళ్ల మాడ్స్ మికెల్సెన్ న్యూయార్క్, టెక్సాస్, ఆస్టిన్‌లలో స్నేహితులను కలవడానికి అమెరికాకు వెళ్లాడు. అలాగే తన తల్లితో కలిసి రోడ్ ట్రిప్‌లో జాతీయ ఉద్యానవనాలను సందర్శించాలనుకున్నాడు. కానీ నెవార్క్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు మికెల్సెన్ను అడ్డుకున్నారు. ‘నన్ను అనేక మంది సాయుధ గార్డులు ఉన్న గదికి తీసుకెళ్లారు. అక్కడ నా బూట్లు, మొబైల్ ఫోన్, బ్యాక్‌ప్యాక్‌ను తీసుకున్నారు. అధికారులు నా ఫోన్‌ను అన్‌లాక్ చేయమని ఒత్తిడి తెచ్చారు. నిరాకరిస్తే జైలు శిక్ష లేదా 5వేల డాలర్ల జరిమానా విధిస్తామని బెదిరించారు. సందర్భాన్ని వివరించిన తర్వాత కూడా, అధికారులు నా వస్తువులను తనిఖీ చేశారు. వేలిముద్రలను తీసుకున్నారు. రక్త నమూనాలను సేకరించారు. అమెరికాలో నేను కలవాలనుకున్న వారందరి పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, వృత్తుల వివరాలు అడిగారు. నేను పన్నెండు గంటలు ప్రయాణించాను. సరిగ్గా నిద్రపోలేదు. వారు ప్రశ్నించడం ప్రారంభించే ముందే శారీరకంగా, మానసికంగా పూర్తిగా అలసిపోయాను. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాద కుట్రలు, మితవాద తీవ్రవాదంలో పాల్గొన్నట్లు అధికారులు నాపై ఆరోపణలు చేశారు. కానీ నిజానికి కారణం అది కాదు. నా ఫోన్లో జేడీ వాన్స్ మీమ్ ఫొటో ఉంది. అందులో ఆయన బట్టతలతోఉన్నారు. అలాగే నేను చేతిలో ఒక చెక్క పైపుతో ఉన్న ఫొటో కూడా వారికి నచ్చలేదు. ఈ రెండు చిత్రాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నన్ను అడ్డుకుంటాయని అనుకోలేదు. మరునాడు నన్ను నార్వే వెళ్ళే విమానంలో ఎక్కించారు’అని మికెల్సెన్ ఆరోపించారు. ఈ వీడియో సామా జిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. -
నిక్షేపంగా న్యూక్లియర్ సైట్లు
వేల కేజీల బరువైన భారీ బాంబులను యురేనియం శుద్ధి కేంద్రాలపై పడేసి వాటిని నామరూపాల్లేకుండా చేశామని అమెరికా, ఇజ్రాయెల్ అధినేతలు శెభాష్ అని తమకుతామే జబ్బలు చరుచుకున్నారు. అయితే వాస్తవంలో ఇరాన్‌కు అంతటి నష్టమేమీ జరగలేదని స్వయంగా అమెరికా నిఘా నివేదిక ఒకటి పేర్కొంది. పర్వతగర్భ ఫోర్డో అణుకేంద్రాన్ని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా కొండపైభాగంపై అరడజను దాకా జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్‌నెన్స్ పెనిట్రేటర్ గైడెడ్ బాంబులను అమెరికా పడేసింది. అయితే కొండ పైభాగం మాత్రమే కూలిపోయిందని, అంతర్భాగంలో ఉన్న అణుకేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని తాజా నివేదిక కుండబద్దలుకొట్టింది. అమెరికా రక్షణశాఖ(పెంటగాన్)లోని నిఘా విభాగమైన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(డీఐఏ) టాప్ సీక్రెట్ కేటగిరీలో రూపొందించిన ఈ నివేదికలోని కీలక అంశాలు అంతర్జాతీయ మీడియాకు లీక్ అయ్యా యి. ఈ వివరాలను సీఎన్ఎన్ వార్తాసంస్థ తొలుత తన కథనంలో బహిర్గతంచేసింది. అణుబాంబు తయారుచేయకుండా ఇరాన్‌ను శాశ్వతంగా నిలువరించామన్న ట్రంప్ వ్యాఖ్య ల్లో నిజం లేదని ఈ నివేదికతో స్పష్టమైంది. ముందుజాగ్రత్తగా ఇరాన్ ఆ మూడు యురేనియం శుద్ధి కర్మాగారాల నుంచి ముడి యురేనియం, శుద్ధిచేసిన యురేనియం నిల్వలు, సెంట్రిఫ్యూజ్‌లను ముందే వేరే చోట్లకు తరలించిందన్న వాదనలకు ఈ నివేదికతో బలం చేకూరింది. నివేదికలో ఏముంది? ఈ మూడు అణుకేంద్రాల్లోని కీలక నిర్మాణాలు, మౌలిక వసతులు, పరికరాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని, దాడుల కారణంగా యురేనియం శుద్ధి కార్యక్రమానికి మాత్రం తాత్కాలికంగా బ్రేక్ పడిందని నివేదిక పేర్కొంది. ధ్వంసమైన విభాగాలను పునరుద్ధరించి మరి కొన్ని నెలల్లో ఇరాన్ మళ్లీ న్యూక్లియర్ సైట్లను పూర్వస్థితికి తీసుకురాగలదని నివేదిక అభిప్రాయపడింది. నతాంజ్, ఫోర్డో ప్లాంట్లను భూగర్భంలో నిర్మించగా ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్‌ను నేలపై నిర్మించారు. అమెరికా జలాంతర్గామి నుంచి ప్రయోగించిన టోమాహాక్ క్రూజ్ క్షిపణుల ధాటికి ఇస్ఫహాన్ అణుకేంద్రం మాత్రమే బాగా దెబ్బతింది. ఈ అంశాన్ని ఇరాన్ సైతం ఒప్పుకుంది. అయితే భూగర్భంలో నిర్మించిన నతంజ్, ఫోర్డోలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. భూగర్భ నిర్మాణాల అవసరాలు తీర్చే నేలపై నిర్మించిన అనుబంధ నిర్మాణాలు మాత్రమే దాడుల్లో ధ్వంసమయ్యాయని నివేదిక పేర్కొంది. బయటివైపు నిర్మించిన విద్యుత్, ఇంధన సంబంధ వ్యవస్థలు నాశనమయ్యాయి. కానీ భూగర్భంలోని సెంట్రిఫ్యూజ్ నిర్వహణ వ్యవస్థలు నిక్షేపంగా ఉన్నాయని, అక్కడి సెంట్రీఫ్యూజ్‌లను దాడులకు ముందే తరలించారని నివేదిక వెల్లడించింది. ఈ లెక్కన ఇరాన్ అణుకార్యక్రమం తాత్కాలికంగా వాయిదాపడిందిగానీ శాశ్వతంగా ఆగిపోలేదు. మరికొన్ని నెలల్లో రిపేర్లు, పునర్నిర్మాణాల తర్వాత భూగర్భ కేంద్రాల్లో మళ్లీ యురేనియం శుద్ధి కార్యక్రమం మొదలయ్యే అవకాశముందని నివేదిన అంచనావేసింది. అదంతా అబద్ధం: ట్రంప్ అంతపెద్ద బాంబులేసినా ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ ఇంకా పనిచేసే స్థితిలోనే ఉందని తమ దేశ నిఘా నివేదిక పేర్కొనడంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు తన సొంత సామాజికమాధ్యమం ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్‌లు పెట్టారు. ‘‘అణురియాక్టర్లకు ఎలాంటి నష్టం జరగలేదన్న వార్తలన్నీ అబద్ధం. నకిలీ వార్తలను నమ్మకండి. ఇరాన్‌లోని అణుకేంద్రాలన్నీ సర్వనాశనమయ్యాయి. తప్పుడు, అబద్ధాలు కథనాలు వండివార్చినందుకు న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్ వార్తాసంస్థల చెంపలను అమెరికా పౌరులు చెళ్లుమనిపించాలి. బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించడం అనేది చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సైనికదాడి. ఇంతటి గొప్పదాడిని ఈ మీడియాసంస్థలు తక్కువచేసి చూపిస్తున్నాయి. లక్ష్యాలను ఖచ్చితత్వంతో పేలి్చన పైలెట్లను అభినందించాల్సిందే. పైలెట్లు అద్భుతంగా పనిచేశారు. వీళ్ల సాహసాన్ని మీడియా కించపరుస్తోంది’’అని అన్నారు. ముఖ్యంగా సీఎన్ఎన్పై ట్రంప్ తిట్లదండకం మొదలెట్టారు. ‘‘సీఎన్ఎన్ మొత్తం తప్పుడు కథనాలనే ప్రసారంచేస్తుంది. నేను కూడా సీఎన్ఎన్ ఛానలే చూస్తా. మరో ప్రత్యామ్నాయం లేదుమరి. అందులో అంతా చెత్తే ఉంటుంది. అన్ని నకిలీ వార్తలే’’అని అన్నారు. స్పందించిన శ్వేతసౌధం నివేదిక రూపకల్పనను ఒప్పుకున్న వైట్‌హౌస్.. ఆ నివేదికలోని అంశాలతో మాత్రం విబేధించడం విశేషం. ట్రంప్ సర్కార్ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి అసత్యాలను మీడియాలో ప్రచారంచేస్తున్నారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ‘‘అత్యంత రహస్యమైన ఆ నివేదికలోని అంశాలు లీక్ అయిన మాట వాస్తవమే. అంతర్గత నిఘా విభాగ కిందిస్థాయి సిబ్బందిలో కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారు. అధ్యక్షుడు ట్రంప్‌ను అపకీర్తి పాలుచేద్దామని కొందరు కుట్ర పన్ని ఇలా లీక్ చేశారు. ఇరాన్ అణుకార్యక్రమాలను అడ్డుకునేందుకు వేలకిలోమీటర్లు ప్రయాణించి, తెగించి బాంబులేసిన యుద్ధవిమాన పైలట్ల ధైర్యసాహసాలను ఈ లీక్‌వీరులు కించపరిచారు. ఒక్కోటి 13,600 కేజీల బరువుండే 14 భారీ బాంబులను పేలిస్తే ఎంతటి వినాశనం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇరాన్ అణుకేంద్రాలు పూర్తిగా పనికిరాకుండా పోయాయి’’అని కరోలిన్ చెప్పారు. లీక్‌కు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ఎఫ్బీఐతో దర్యాప్తు చేయిస్తున్నామని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. లీక్ అయిన నివేదిక కేవలం అంచనా నివేదిక అని ఆయన వ్యాఖ్యానించారు. నిజం దాస్తున్న ఇరాన్! శత్రు దేశం కారణంగా నష్టం జరిగితే దేశ ప్రతిష్ట దృష్ట్యా స్వల్పనష్టమే జరిగిందని ఎవరైనా తక్కువ చేసి చెబుతారు. ఆ లెక్కన ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ భఘైల్ సైతం తమ అణుకేంద్రాలు తక్కువస్థాయిలోనే ధ్వంసమయ్యాయని చెప్పాలి. కానీ ఆయన భారీ నష్టం వాటిల్లిందని బుధవారం మీడియాతో అన్నారు. దీని వెనుక అంతరార్థం వేరే ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వేరే చోట జరిగే తమ అణుకార్యక్రమంపై ఎవరికీ అనుమానం రావొద్దనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా అబద్ధాలు చెబుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పునర్నిర్మాణాల తర్వాత మళ్లీ అణుకార్యక్రమాన్ని మొదలెట్టే విషయం బయటకు పొక్కితే అతిగా అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనూ ఇస్మాయిల్ ఇలా అబద్ధాలు చెబుతున్నారని తెలుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్పేస్‌లోకి శుభాంశు శుక్లా.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము ఏమన్నారంటే
సాక్షి,ఢిల్లీ: ఇస్రో-నాసా సంయుక్త యాక్సియం-4 మిషన్ కోసం అంతరిక్షంలోకి బయల్దేరిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla)కు రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకంక్షలు తెలిపారు. శుభాంశు శుక్లా స్పేస్‌లోకి 1.4 బిలియన్ల మంది భారతీయుల శుభాకాంక్షల్ని,నమ్మకాల్ని, ఆకాక్షంల్ని మోసుకెళ్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. శుభాంశు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన మిషన్ స్పెషలిస్ట్స్లావోష్ ఉజ్నాన్స్కీ,హంగేరీ మిషన్ స్పెషలిస్ట్ టిబోర్ కాపులకు మోదీ శుభాంక్షలు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణంపై స్పందించారు. గ్రూప్ కెప్టెన్‌గా శుభాంశు శుక్లా భారత అంతరిక్ష విభాగంలో సరికొత్త రికార్డ్లను సృష్టించారు. అంతరిక్షంలోకి ఈ భారతీయుడి ప్రయాణం పట్ల మొత్తం దేశం ఉత్సాహంగా గర్వంగా ఉంది. శుభాంశు తన ఆక్సియం మిషన్ 4లోని అమెరికా, పోలాండ్, హంగేరీ వ్యోమగాములుతో తమదంతా ‘వసుధైవ కుటుంబం (ఒకే కుటుంబం)’గా నిరూపించారని ముర్ము అన్నారు.భారత సంతతికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్‌గా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియమ్ స్పేస్ నిర్వహిస్తున్న Ax-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళుతున్నారు. ఈ మిషన్ ద్వారా రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్రలో నిలవనున్నారు. We welcome the successful launch of the Space Mission carrying astronauts from India, Hungary, Poland and the US. The Indian Astronaut, Group Captain Shubhanshu Shukla is on the way to become the first Indian to go to International Space Station. He carries with him the wishes,…— Narendra Modi (@narendramodi) June 25, 2025 As Group Captain Shubhanshu Shukla creates a new milestone in space for India, the whole nation is excited and proud of an Indian’s journey into the stars. He and his fellow astronauts of Axiom Mission 4 from the US, Poland and Hungary prove the world is indeed one family –…— President of India (@rashtrapatibhvn) June 25, 2025 -
పాక్ టార్గెట్ అమెరికా??.. ఇది జోక్ కాదు బాస్!
ఎవ్వడ్రా వీడు.. ఘోల్లుమనే జోక్ వేశాడు అనుకుంటున్నారా?. కానీ ఇదే నిజం. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రపంచమంతా దృష్టిసారించిన వేళ..పాక్ రహస్యంగా శక్తివంతమైన.. అదీ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్ల తయారీ చేపట్టింది!. ఈ విషయాన్ని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించినట్లు ఫారిన్ ఎఫైర్స్ అనే పత్రిక కథనం ప్రచురించింది. దీర్ఘ శ్రేణి నూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్ల(ICBM) తయారీని పాకిస్థాన్ రహస్యంగా చేపడుతోంది. వీటి సామర్థ్యం ఏకంగా.. అమెరికాకు చేరుకోగలదని వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. చైనా సాయంతో పాక్ వీటిని అభివృద్ధి చేస్తోంది. ఒకవేళ పాకిస్థాన్ అలాంటి క్షిపణులను సమకూర్చుకుంటే.. ఆ దేశాన్ని అణ్వస్త్ర శత్రువుగా అమెరికా గుర్తించడం ఖాయమని వాషింగ్టన్ నిఘా వర్గాలు స్పష్టం చేశాయని సదరు కథనం పేర్కొంది.అమెరికాను తాకగలిగే అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశం ఏదైనా సరే.. అమెరికాకు శత్రువుగానే చూడాల్సి వస్తుందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యలను సదరు నివేదిక ప్రముఖంగా పేర్కొంది. ఈ కథనాన్ని వైట్‌హౌజ్ వర్గాలు ధృవీకరించాల్సి ఉంది. ఐసీబీఎం అంటే.. ఖండాలను దాటగలిగే సామర్థ్యం ఉన్న క్షిపణులు. ఇందులో అణ్వాయుధాలతో పాటు సాధారణ యుద్ధ క్షిపణులు కూడా ఉంటాయి. వీటి లక్ష్యం.. 5,500 కిలోమీటర్లు దాకా ఉండొచ్చు. అయితే ప్రస్తుతానికి పాక్ దగ్గర అలాంటి క్షిపణలేం లేవు. ప్రస్తుతం అమెరికా జాబితాలో రష్యా, చైనా, ఉత్తర కొరియాలు ఉన్నాయి.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ తన ఆర్థికాభివృద్ధిని పణంగా పెట్టి.. ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెట్టిందని ఆ దేశ మీడియా నుంచే కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే దేశ రక్షణ బడ్జెట్‌ను 20 శాతం పెంచింది. ఏకంగా 9 బిలియన్ డాలర్లకు కేటాయించింది. షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ డిమాండ్లను సంతృప్తిపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ బడ్జెట్లో పెంచిన నిధులతో ఆపరేషన్ సిందూర్‌లో దెబ్బతిన్న టెర్రర్ క్యాంప్‌లను మళ్లీ పునరుద్ధరించనుందని తెలుస్తోంది. అలాగే చైనా నుంచి భారీగా ఆయుధ సంపత్తిని పాక్ దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే ఆ దేశ విధానంలో.. షార్ట్, మీడియం రేంజ్ మిస్సైల్స్ మాత్రమే ఉన్నాయి. చివరగా.. 2022లో పాక్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ షాహీన్-3ను ప్రయోగించింది. దీని పరిధి.. 2,700 కిలోమీటర్లు. ఇదిలా ఉంటే.. తమ దేశం చేపట్టే అణు పరీక్షలు భారత్ ముప్పును ఎదుర్కొనేందుకేనని పాక్ పలుమార్లు బాహాటంగానే ప్రకటించుకుంది. కిందటి ఏడాది.. పాక్ మీద లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ కార్యక్రమంపై అమెరికా ఆంక్షలు విధించగా.. పాక్ వాటిని పక్షపాత ధోరణిగా ప్రకటించింది.ప్రస్తుతం పాక్ దగ్గర 170 న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయి. తద్వారా న్యూక్లియర్ నాన్ ప్రొలైఫ్రేషన్ ట్రీటీ(NPT)కి పరిధిని ఉల్లంఘించింది. న్యూక్లియర్ వెపన్స్‌ను కట్టడి చేయడం, తద్వారా అణు శక్తిని పరిమితంగా(శాంతి పరిధికి లోబడి) ఉపయోగించుకోవాలని చెప్పడం ఈ ఒప్పంద ఉద్దేశం.ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం.. మే నెలలో పాక్ ఉగ్రశిబిరాలపై, ఆ దేశ ప్రధాన ఎయిర్‌బేస్‌లపై దాడులు జరిపింది. ఆ సమయంలో పాక్ తన హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించిందని.. అయితే భారత రోబస్ట్ ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్ దానిని అడ్డుకుందనే ప్రచారం జోరుగా నడిచింది. అటుపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు పాక్ న్యూక్లియర్ కార్యకలాపాలపై దృష్టిసారించాలని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని కోరారు. పాక్ అలాంటి ఆయుధాల విషయంలో హద్దులు మీరి ప్రవర్తించదనే ఆశిస్తున్నట్లు రాజ్‌నాథ్ కూడా వేరుగా ఓ ప్రకటన చేశారు. -
మా ట్రంప్‌కు నోబెల్ ఇవ్వండి.. అమెరికా నుంచి నామినేషన్
-
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. నష్టం ఎవరికి? నెగ్గిందెవరు?
ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగానైనా తెరపడింది. క్షిపణి మోతలు, సైరన్ల హోరు కాస్త తగ్గింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలతో ఇరుపక్షాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పు చందంగానే ఉందన్నది నిపుణుల అంచనా. అయితే... పదమూడు రోజులపాటు సాగిన ఈ యుద్ధంలో నెగ్గిందెవరు? తగ్గిందెవరు? కష్టమెవరికి? నష్టమెవరికి?.. ఇరాన్ అణుకార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా జూన్ 13వ తేదీన ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్‌పై దాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కేవలం అయిదంటే అయిదు రోజుల్లో ఇజ్రాయెల్ ఇరాన్‌లోని వందకుపైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 330 వరకూ క్షిపణులు ప్రయోగించింది. ప్రతిగా ఇరాన్ జూన్ పదమూడుతో మొదలుపెట్టి వరుసుగా వారం రోజులపాటు ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ క్షిపణి నిరోధక వ్యవస్థ ఐరన్ డోమ్ కొన్నింటిని నిరోధించగలిగినా... మిగిలినవి ప్రాణ, ఆస్తినష్టానికి కారణమయ్యాయి. అయితే.. జూన్ ఇరవైన అమెరికా రంగ ప్రవేశంతో యుద్ధం తీరుతెన్నులు మారాయి. అణుస్థావరాలపై దాడులు చేయడం ద్వారా అమెరికా అతిపెద్ద తప్పు చేసిందని, ఈ దాడులు యుద్ధ ప్రకటనేని హూంకరించిన ఇరాన్ మధ్యప్రాచ్యంలోని అమెరికన్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది కూడా. అయితే ఆ తరువాత జూన్ 22న రోజు గడవకముందే ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు స్వయంగా ప్రకటించడంతో సర్వత్ర ఆశ్చర్యం వ్యక్తమైంది. అయితే ఈ కాల్పుల విరమణ అమెరికా ఒత్తిడితో బలవంతంగా కుదిరిందే కానీ స్వచ్ఛందంగా ప్రకటించింది కాదని దౌత్య, మిలటరీ వర్గాలు అంటున్నాయి. ఇరాన్ క్షిపణి దాడులతో బెంబేలెత్తిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ జోక్యం చేసుకోవాల్సిందిగా అమెరికాను అభ్యర్థించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ట్రంప్ ఈ అభ్యర్థనను మన్నించి ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేశారు. ఇలా ట్రంప్ నెతన్యాహ్యూ తన మాట వినేలా చేసుకున్నాడని, అందుకే ఇష్టం లేకపోయినా కాల్పుల విరమణకు అంగీకరించాలని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా.. ఇజ్రాయెల్ రెచ్చగొట్టనంత వరకూ తాము ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియన్ స్పష్టం చేయగా... ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ ‘యుద్ధం ముగియలేదు’ ప్రకటించడం గమనార్హం. ఇందుకు తగ్గట్టుగానే ఇరాన్ మళ్లీ దాడులకు దిగిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ టెహ్రాన్‌పై క్షిపణులను ప్రయోగించింది. ఒక అణుశాస్త్రవేత్త మృతికి కారణమైంది కూడా. ఇదిలా ఉంటే... ఫొర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్లలోని అణు స్థావరాలపై ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ సమీప భవిష్యత్తులో అణ్వాయుధాలను తయారు చేయలేదని ట్రంప్ ప్రకటించగా... జరిగిన నష్టం తక్కువేనని, కొన్ని నెలల్లోపే అణ్వాయుధాలకు కావాల్సినంత శుద్ధ యురేనియంను సిద్ధం చేసుకోగలమని ఇరాన్ చెబుతోంది. ఇందులో ఏమాత్రం వాస్తవమున్నా అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ రెండు ఇరాన్‌పై దాడుల పరంపర కొనసాగించే అవకాశాలే ఎక్కువ.మొత్తమ్మీద చూస్తే ఈ యుద్ధంలో ఇరాన్‌దే పైచేయిగా కనిపిస్తోంది. అణ్వాయుధ కార్యక్రమాల నిలిపివేత, ఇరాన్లో ప్రభుత్వ మార్పు అనే రెండు లక్ష్యాలతో యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్ వాటిని సాధించలేకపోయింది. అణు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రభుత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేయడం ద్వారా ఇరాన్ అమెరికాను కూడా తోసిరాజు అనగలిగింది!:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
వలస ఖైదీలను మూడో దేశానికి పంపొచ్చు.. అమెరికా సుప్రీంకోర్టు
వాషింగ్టన్: వలసదారులను వారి స్వదేశాలకు కాక ఇతర దేశాలకు తిరిగి పంపించే ప్రక్రియకు అమెరికా సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. వలసదారులను మూడో దేశానికి పంపడం వల్ల వారు ఎదుర్కొనే ప్రమాదాలను అధికారులకు చెప్పడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును తోసిపుచ్చింది. ఇది అక్రమాలకు వారు అనుభవించే ప్రతిఫలమని కోర్టు వ్యాఖ్యానించింది.వలసదారుల బహిష్కరణలపై కఠిన వైఖరి అవలంబిస్తున్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఊరటను ఇచ్చింది. ఈ కేసులో మయన్మార్, దక్షిణ సూడాన్, క్యూబా, మెక్సికో, లావోస్, వియత్నాం దేశాలకు చెందిన ఎనిమిది మంది వలసదారులు ఉన్నారు. వీరిని మే నెలలో దక్షిణ సూడాన్‌కు వెళ్తు విమానంలో పంపించారు.అయితే వలసదారులను మూడో దేశాలకు తరలిస్తే అక్కడ వారు హింసకు లేదా హత్యకు గురయ్యే అవకాశం ఉందన్న అప్పీళ్లను సుప్రీం కొట్టిపారేసింది. కోర్టు తీర్ప భయంకరమైనదని నేషనల్ ఇమ్మిగ్రేషన్ లిటిగేషన్ అలయన్స్ తెలిపింది. ఈ నిర్ణయం తమ క్లయింట్లను హింసకు, మరణానికి గురిచేసిందన్నారు. ఈ తీర్పు అమెరికా ప్రజల భద్రత, రక్షణకు విజయమని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. ఎనిమిది మంది వలసదారులు అమెరికాలో హత్య, దహనం, సాయుధ దోపిడీతో సహా క్రూరమైన నేరాలకు పాల్పడ్డారని తెలిపింది. కానీ, ఖైదీలలో చాలా మందిపై ఎటువంటి నేరారోపణలు లేవని వలసదారుల న్యాయవా దులు సుప్రీంకోర్టుకు వినిపించారు. -
ఇంతకీ గెలిచిందెవరు?
పన్నెండు రోజులపాటు భీకరంగా సాగి కాల్పుల విరమణ ఒప్పందం దిశగా పయనించిన ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో తామే విజయం సాధించామని ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఎవరికి వారు ప్రకటించుకున్నారు. తన వల్లే యుద్ధం ఆగిందని ట్రంప్ ఇప్పటికే ప్రకటించుకోగా, తమ ప్రయత్నం కారణంగానే సమరం సమసిపోయిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు.దీంతో ఈ ఘర్షణలో నిజంగా గెలుపు జెండా ఎవరు ఎగరేశారనే అంశంపై చర్చ మొదలైంది. అయితే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత విజయం సాధించారనే వాదనా వినిపిస్తోంది. అణుక్షేత్రాలను కుప్పకూల్చి ఇరాన్ కోలుకోలేని దెబ్బతీశానని అమెరికా ప్రకటించుకుంది. సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలుసహా వైమానిక స్థావరాలు, క్షిపణి లాంచర్లను నాశనంచేసి ఇరాన్‌కు బుద్ధి చెప్పానని ఇజ్రాయెల్ గొప్పలు పోయింది. అమెరికాను సైతం ఎదిరించి పోరాడి తమ సత్తా చూపామని ఇరాన్ ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో యుద్ధాగ్ని నుంచి ఎవరు ఏ ప్రయోజనాలు పొందారనేది ఆసక్తికరంగా మారింది.ట్రంప్‌కు శాంతిదూతగా మార్కులుఇజ్రాయెల్– హమాస్ యుద్ధం, ఉక్రెయి న్–రష్యా యుద్ధంలో జోక్యం చేసుకుని శాంతిస్థాపనకు శతథా ప్రయత్నించానని ట్రంప్ చెప్పుకున్నారు. అయితే అక్కడ విఫలమైనా ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధాన్ని ఆపి సఫలీకృతుడిని అయ్యానని ట్రంప్ చెబుతున్నారు. శాంతిని కోరుకుంటూనే ఫోర్డో అణుకేంద్రంపై బాంబులేయడమేంటని అమెరికాలోనూ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.దోహాలోని తమ స్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినా ట్రంప్ సంయమనం కోల్పోలేదు. ఈ విషయంలో ట్రంప్‌కు మంచి మార్కులు పడ్డాయి. శాంతికాముకులు ట్రంప్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. శాంతి నోబెల్ కోసం ఎదురుచూస్తున్న ట్రంప్ ఆశలు ఈ కాల్పుల విరమణతో చిగురించినట్లే భావించాలి.గగనతలంపై ఇజ్రాయెల్ విజయంక్షిపణి లాంచర్లను నాశనం చేయడం ద్వారా ఇరాన్ గగనతలంపై తాము పూర్తి పట్టుసాధించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. ఇది తన ఘన విజయమని చెప్పారు. ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఉన్నతాధి కారులు, అణు శాస్త్రవేత్తలను అంతంమొందించారు. సైనిక, వైమానిక స్థావరాలను ధ్వంసంచేశారు. అణుకేంద్రాలు, మౌలిక వసతు లను కోలు కోనంతగా దెబ్బ తీశారు.ఇవన్నీ తన విజ యాలేనని నెతన్యా హూ సొంత డబ్బా భజా యించారు. శత్రుదేశాన్ని పలు రకాలుగా దెబ్బ కొట్టడం ద్వారా ఒక రకంగా నెతన్యా హూ భారీ స్థాయిలో పాపులారిటీ, ప్రజాదరణను పెంచుకున్నారు. వచ్చే ఏడాది తమ దేశంలో జరగబోయే ఎన్నికల్లో ఈ యుద్ధపర్వం నెతన్యాహూ పార్టీ విజయావకాశాలు అమాంతం పెంచింది. యుద్ధంలో తనకు తోడుగా అగ్రరాజ్యం కలిసివచ్చేలా ట్రంప్‌ను ఒప్పించడంలోనూ నెతన్యాహూ విజయం సాధించారు.అగ్రరాజ్యాన్నీ ఢీకొట్టగలనని ఇరాన్ సంకేతంతమ ఉనికే ప్రశ్నార్థకమైతే అగ్రరాజ్యం అమెరికాను సైతం ఢీకొట్టగలమని దోహా యూఎస్ స్థావరంపై క్షిపణి దాడులతో ఇరాన్ నిరూపించింది. ఘర్షణ మరింతగా విస్తరించకుండా గౌరవప్రదంగా యుద్ధక్షేత్రం నుంచి ఎలా నిష్క్రమించాలో తమకూ తెలుసునని ఇరాన్ రుజువు చేసింది. పశ్చిమాసి యాలో ఎ న్నో దేశాల్లో అమెరికా స్థావరా లున్నా తమకు మిత్రదే శమైన ఖతార్‌లోని స్థావ రం మీదనే ఇరాన్ వ్యూహా త్మకంగా క్షిపణుల్ని ప్రయోగించింది.అమెరికా, ఇరాన్ కయ్యా నికి తమ భూభాగం రణక్షే త్రంగా మారొద్దని ఖతార్ సైతం మధ్యవర్తిత్వానికి ముందుకు రావాలనే వ్యూహంతో ఇరాన్ కేవలం అల్ ఉదేయిద్ బేస్‌పైనే దాడులు చేసింది. వందల కేజీల యురేనియంను దాచిపెట్టి మధ్యవర్తి త్వానికి తన వైపు కొన్ని అస్త్రాలున్నాయని ప్రపంచానికి చాటిచెప్పింది.కొసమెరుపుఇప్పటికే హమాస్– ఇజ్రాయెల్ పోరు, ఉక్రెయిన్–రష్యా రణం, హౌతీ తిరుగుబాటుదారులు చమురునౌకలపై దాడులతో అధిక పెట్రో ధరల కత్తి గుచ్చుకుంటుందన్న భయాలతో ప్రపంచదేశాలు అల్లాడుతున్న వేళ 12 రోజులకే ఇజ్రాయెల్, ఇరాన్ వార్ కంచికి చేరడం అందరికీ పెద్ద ఊరట. అయితే అంతెత్తున ఎగసిన యుద్ధజ్వాలలు పూర్తిగా ఆరిపోతాయో లేదోనన్న అనుమానాలూ ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్నాయి.ఈ దేశాలు నివురుగప్పిన నిప్పులా ఉన్న విద్వేషాలను మళ్లీ రాజేసుకుని పశ్చిమాసియా ప్రశాంతతకు గండి కొడతాయేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడులతో పాఠం నేర్చుకున్న ఇరాన్ మళ్లీ అత్యంత రహస్యంగా యురేనియంను వేరే చోట శుద్ధిచేస్తే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితీ ఉంది. అందుకే వీలైనంత త్వరగా శాంతిచర్చలు మొదలెట్టి దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవడం అత్యావశ్యకం. -
విరమణ... నిజంగానా?!
ఎప్పటిలాగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బహుపాత్రాభినయంతో అందరినీ మెప్పిస్తున్నారు. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు సాగించిన కొన్ని గంటలకే ఇరాన్–ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, దాన్ని తాము స్వాగతిస్తున్నా మని మంగళవారం మధ్యాహ్నం ట్రంప్ ప్రకటించారు. దీనికి ఇరాన్ సానుకూలంగా స్పందించినా ఇజ్రాయెల్ మౌనం పాటించింది. ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఇరాన్ రాజధాని తెహ్రాన్‌పై అది బాంబుల వర్షం కురిపించింది. రెండు దేశాలూ పరస్పరం ‘ఎందుకో కూడా తెలియని’ విధంగా కాల్పుల విరమణ ఒడంబడికను ఉల్లంఘిస్తున్నాయని ట్రంప్ నిందించి తన ‘తటస్థతను’ చాటు కున్నారు! ఇంతకూ కాల్పుల విరమణ నిజమేనా? ఒక సమాచారం ప్రకారం ఖతార్‌లోని అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించాక ట్రంప్ చొరవ తీసుకుని ఇరాన్‌తో మాట్లాడి కాల్పుల విరమణకు ఒప్పించమని ఖతార్‌ను కోరారు. ఖతార్ తీసుకొచ్చిన ప్రతిపాదనకు ఇరాన్ అంగీకారం తెలిపింది. ఇరాన్ ఈ సంగతి బాహాటంగానే చెప్పింది. కాల్పుల విరమణ గురించి ట్రంప్ బతిమా లుకున్నారని వెల్లడించింది. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత కాసేపటికే దాడులకు దిగడాన్నిబట్టి ఇజ్రాయెల్‌కు ఈ పరిణామం ససేమిరా ఇష్టం లేదని బోధపడుతోంది. యుద్ధం ఆపటం సులభ మేమీ కాదు. కాల్పుల విరమణ ప్రకటనకూ, దాని ఆచరణకూ మధ్య గంటలు మాత్రమే కాదు... రోజుల వ్యవధి కొనసాగటం రివాజే. మొన్న భారత్–పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పంద మైనా, రష్యా–ఉక్రెయిన్ల కాల్పుల విరమణ అయినా ఈ సంగతే చెబుతాయి.యుద్ధానికి ముందు నెల నుంచి ట్రంప్ ఇరాన్‌కు రోజువారీ హెచ్చరికలు జారీచేస్తూ వచ్చారు. అణు ఒప్పందంపై మొండి పట్టుదలకు పోతే దేశం సర్వనాశనమవుతుందని బెదిరించారు. ఆఖరికి ఒకపక్క ఇరాన్ అమెరికాతో చర్చలు సాగిస్తుండగానే పన్నెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ ఎలాంటి కవ్వింపూ లేకుండా ఆ దేశంపై దాడులు సాగించి ఇరాన్ సైనిక దళాల చీఫ్‌లు ఇద్దరినీ, అణు శాస్త్రవేత్తలతోసహా పలువురినీ హత్య చేసింది. ఇది తప్పని చెప్పాల్సిన ట్రంప్... ప్రతీకార దాడులకు దిగితే ఖబడ్దార్ అంటూ తిరిగి ఇరాన్‌నే హెచ్చరించారు. ఆఖరికి శనివారం అర్ధరాత్రి దాటాక అమెరికా తానే రంగంలోకి దిగి బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్లో మూడు అణు స్థావరాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇంతా అయినాక హఠాత్తుగా ట్రంప్ కొత్త రాగం అందుకున్నారు. ఏకపక్ష యుద్ధం ప్రారంభానికి పూర్వమే ఇరాన్ బలహీనతలు బయటపడ్డాయి. దశాబ్దాల ఆంక్షలతో అన్నివిధాలా దెబ్బతిన్న దేశం మెరుగ్గా ఉండగలదని ఎవరూ భావించలేరు. ఒకపక్క నేరుగా అమెరికా, ఇజ్రాయెల్ కుటిలత్వం తెలుస్తున్నా మిత్రులనుకున్నవారు కూడా ఖండించ టానికి సిద్ధపడకపోవటం... అండగా ఉండగలవని భావించిన రష్యా, చైనాలు ప్రకటనలకే పరిమితం కావటం, గల్ఫ్ దేశాలు నామమాత్రంగా ఖండించి ఊరుకోవటం ఇరాన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి ఉంటాయి. అణు ఒప్పందానికి సిద్ధపడతామని ప్రకటించి ఆ దిశగా అడుగులేస్తున్న దేశం ప్రపంచంలో ఇలా ఏకాకిగా మిగిలిపోవటం వర్తమాన విషాదం. యుద్ధం పర్యవసానంగా ఇరాన్లో పలు దేశాల పెట్టుబడులు దెబ్బతింటాయి. పైగా ప్రపంచానికి పెద్ద పోలీసుగా వ్యవహరిస్తూ తాము చెప్పిందే ఒప్పందమని ఒత్తిడి తెచ్చే ధోరణి రేపన్నరోజు ఎవరికైనా ముప్పే. ఇజ్రాయెల్ దగ్గర... ఆ మాటకొస్తే పశ్చిమాసియాలో అణుబాంబుల జాడలేకపోతే, ఇరాన్ మాత్రమే ఆ పని చేస్తే దాన్ని నియంత్రించటంలో హేతుబద్ధత ఉన్నదని నమ్మినా తప్పుబట్టనవసరం లేదు. కానీ అసలు అమెరికా, రష్యా మొదలుకొని ఏకపక్ష యుద్ధాలతో అందరూ తమ బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టుకుంటుండగా ఒక్క ఇరాన్ మాత్రమే ధూర్త దేశమని ఎందుకు భావించాలి? ఇంతకూ ట్రంప్ హఠాత్తు నిర్ణయం వెనకున్న కారణాలేమిటి? సైనిక స్థావరంపై దాడి చేస్తున్నా మని ఇరాన్ ముందస్తు సమాచారం ఇవ్వటం, అందుకు అనుగుణంగా అమెరికా తన సైనికుల్ని తరలించటంతోపాటు క్షిపణుల్ని కూల్చే ఏర్పాటు చేసుకోవటం సాధ్యమైంది. ఒకే ఒక్కటి పేలినా దానివల్ల నష్టం లేదు. అది ట్రంప్‌కు నచ్చినట్టుంది. దానికితోడు ఆయన అందలం ఎక్కటంలో కీలకపాత్ర పోషించిన ‘మాగా’ ఈ యుద్ధంపై చీలిపోయింది. గట్టి మద్దతుదారైన స్టీవ్ బెనన్ లాంటివారు సైతం ట్రంప్‌ను తప్పుబట్టారు. ఆ ఒత్తిళ్ల మాటెలావున్నా యూరప్ నుంచి వస్తున్న వార్తలు అమెరికాను భయపెట్టి ఉండాలి. అమెరికా తర్వాత బంగారం నిల్వల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న జర్మనీ (3,352 టన్నులు), ఇటలీ (2,452 టన్నులు) ఆ నిల్వల్లో మూడోవంతు భాగాన్ని అమెరికా ఫెడరల్ రిజర్వ్‌లో ఉంచాయి. దాన్ని వెనక్కుతేవాలని ఆ దేశాల్లో డిమాండ్లు బయల్దేరాయి. నిల్వల విలువ 24,500 కోట్ల డాలర్ల పైమాటే. ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతను దెబ్బతీసేలా ట్రంప్ వ్యవహరించటం, ప్రపంచాన్ని అస్థిరపరిచే నిర్ణయాలు తీసుకోవటం తదితర కారణాల వల్ల అమెరికాలో బంగారం ఉంచటం సురక్షితం కాదని విపక్షాలు వాదిస్తున్నాయి. అది ఆచరణ రూపందాలిస్తే అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత కుంగిపోవటం ఖాయం. పైగా లండన్‌తో పాటు ప్రపంచంలోనే కీలకమైన బంగారం కేంద్రంగా వెలిగిపోతున్న న్యూయార్క్ కళ అడుగంటు తుంది. అందుకే ట్రంప్ పునరాలోచనలో పడ్డారా? లేక ముందస్తు సమాచారం ఇచ్చిన ఇరాన్ ‘మంచితనం’ నచ్చిందా? మొత్తానికి అగ్ని గుండం కాబోతున్న పశ్చిమాసియాలో సామరస్య గాలులు వీచటం ఆహ్వానించదగ్గది. ఇది పూర్తి స్థాయిలో సాకారం కావాలని ఆశించాలి. -
ట్రంప్ సహనం కోల్పోయిన వేళ.. అంత మాట అనేశారేంటి?
వాషింగ్టన్: ఇజ్రాయెల్-ఇరాన్‌లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ అంత ఎత్తున లేచారు. తన మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ అని ఇరు దేశాలు ప్రకటించిన కాసేపటికే మళ్లీ క్షిపణులతో యుద్ధానికి దిగడంపై ట్రంప్ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. ‘నాకు చెప్పిందేమిటి?.. మీరు చేస్తున్నదేంటి? అని ట్రంప్ మండిపడ్డారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ట్రంప్.. సహనాన్ని కోల్పోయి అభ్యంతరకర పదజాలాన్ని కూడా వాడారు. ఇక వారి ఇస్టం.. వారికిష్టమొచ్చింది చేస్కుంటారు అంటూ ట్రంప్ మీడియా సాక్షిగా అసహనం ప్రదర్శంచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ః మీడియాలో వైరల్‌గా మారింది. Trump is absolutely FUMING that Israel & Iran have broke the ceasefire:“We basically have two countries that have been fighting so long and so hard that they don't know what the f*ck they're doing.”He also warned Israel directly on Truth Social: “DO NOT DROP THOSE BOMBS.” pic.twitter.com/yHQeUybgUK— J Stewart (@triffic_stuff_) June 24, 2025 అయితే ఆటు తర్వాత ఇరు దేశాల కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినట్లు తెలిపారు. ఇక ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోరంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు తిరిగి సొంత గడ్డపైకి వచ్చేస్తాయని, అదే సమయంలో ఇరాన్ కూడా ఒక మెట్టు దిగిందన్నారు. ఇక తక్షణమే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ట్రంప్ తెలిపారు. -
ఆ అదృశ్య యుద్ధ విమానం వెనుక భారతీయ మేధావి!
వార్ టెక్నాలజీలో అత్యద్భుతం.. నార్త్రోప్ B-2 స్పిరిట్ బాంబర్. తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా ప్రయోగించడంతో వీటి గురించి మరోసారి చర్చ నడుస్తోంది. అయితే ఈ యుద్ధ విమానాల రూపకల్పనలో భారతీయ మూలాలున్న మేధావి కూడా ఉన్నారు. కాలక్రమంలో.. గూఢచర్యం ఆరోపణలతో ఆయన జైలు పాలు కావడం ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోదగిన అంశం.నోషిర్ షెరియర్జీ గోవాడియా(Noshir Sheriarji Gowadia).. ముంబైలోని ఓ పార్శీ కుటుంబంలో 1944లో జన్మించారీయన. ఆపై 19 ఏళ్ల వయసులో ఉన్నత విద్య కోసం అమెరికాకు వలస వెళ్లి.. అక్కడ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. 1969లో ఆయనకు అమెరికా పౌరసత్వం లభించింది. ఇంజినీరింగ్ మేధావిగా నార్త్రోప్ గ్రుమ్మన్ కార్పొరేషన్లో B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్‌కు సంబంధించిన ప్రొపల్షన్ సిస్టమ్‌ను రూపకల్పన చేయడంలో గోవాడియా కీలక పాత్ర పోషించారు. అయితే..దశాబ్దంన్నర తర్వాత.. అనారోగ్య కారణాలతో నార్త్రోప్ గ్రుమ్మన్ నుంచి తప్పుకున్న ఆయన న్యూమెక్సికోలో డిఫెన్స్ కన్సల్టింగ్ సంస్థ ప్రారంభించారు. అయితే 1997లో DARPAతో వివాదం కారణంగా ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దయింది. దీంతో.. చాలా కాలం ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారు. 2005 అక్టోబర్ 15వ తేదీన హవాయ్‌లోని విల్లాపై దాడి చేసిన ఎఫ్‌బీఐ డబ్బుతో రహస్య సమాచారానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది. చైనాతో రహస్య సంబంధాల నేపథ్యంలో ఆయన్ని అదే తేదీన అరెస్ట్ చేసింది. విచారణలో నివ్వెరపోయే విషయాలు అధికారులకు తెలిజేశారు. గోవాడియా చైనాలోని చెంగ్డూ, షెన్జెన్ వంటి నగరాలకు ఆరు సార్లు ప్రయాణించి, స్టెల్త్ మిసైల్ ఎగ్జాస్ట్ డిజైన్ చేయడంలో సహాయం చేశారని నిర్ధారించారు. బదులుగా చైనా నుంచి కనీసం $110,000 పొందారని తేలింది. మొత్తం 14 అభియోగాలలో ఆయన దోషిగా తేలడంతో 2011లో హోనోలులు కోర్టు ఆయనకు 32 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అలా ఒక మేధావి జీవితం.. గూఢచారిగా కటకటాల పాలైంది. కీలకంగా గోవాడియానే.. B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్‌ను అమెరికా డిఫెన్స్ కంపెనీ నార్త్రోప్ (ఇప్పటి నార్త్రోప్ గ్రుమన్) రూపొందించింది. ఈ ప్రాజెక్టులో అనేక మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పనిచేశారు. మరీ ముఖ్యంగా హాల్ మార్కేరియన్ (Hal Markarian),నోషిర్ షెరియర్జీ గోవాడియా(Noshir Sheriarji Gowadia) గురించి చెప్పుకోవాలి. మార్కేరియన్.. 1979లో B-2 బాంబర్‌కు సంబంధించిన తొలి డిజైన్ స్కెచ్‌లు రూపొందించారు. ఆయన ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. విమానం యొక్క ప్రాథమిక ఆకృతికి బీజం వేశారు. అయితే.. భారతీయ మూలాలున్న ఇంజినీర్ గోవాడియా B-2 బాంబర్‌లోని స్టెల్త్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, విమానం ఎగ్జాస్ట్‌ను రాడార్, హీట్ సెన్సర్లకు కనిపించకుండా చేయడంలో ఆయన టెక్నాలజీ కీలకమైంది. వీళ్లిద్దరితో పాటు ఇర్వ్ వాలాండ్, జాన్ కాషెన్, హాన్స్ గ్రెల్మాన్ వంటి స్టెల్త్ టెక్నాలజీ నిపుణులు కూడా భాగస్వాములయ్యారు.వియత్నాం, యోమ్ కిప్పూర్ యుద్ధాల సమయంలో అమెరికా ఎదుర్కొన్న సమస్యల్ని అధిగమించేందుకు నోషిర్ గోవాడియా నేతృత్వంలో.. ‘స్టెల్త్’ సాంకేతికతను అభివృద్ధి చేయడం ప్రారంభమైంది. ‘బ్లూబెర్రీ మిల్క్‌షేక్’ అనే కోడ్ నేమ్‌తో సాగిన గోప్యమైన ప్రాజెక్టులో గోవాడియా కీలకపాత్ర వహించారు. బాంబర్ ఇంజిన్ ఎగ్జాస్ట్‌ను రాడార్, హీట్ సెన్సర్లకు దృశ్యమవకుండా చేయడం ఆయన ప్రాథమిక లక్ష్యం. ఈ ప్రయత్నంలో ఆయన ఘన విజయం సాధించారు. B-2 బాంబర్ ప్రత్యేకతలుబీ2 బాంబర్.. దట్టమైన యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ డిఫెన్స్లలోకి చొచ్చుకుపోవడానికి తక్కువ-పరిశీలించదగిన స్టీల్త్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. అందుకే దీనిని స్టెల్త్ బాంబర్ అని పిలుస్తారు. స్టెల్త్ డిజైన్: ఇది ఫ్లయింగ్-వింగ్ ఆకృతిలో ఉండి, రాడార్‌కు కనిపించకుండా ఉండేలా రూపొందించబడింది. దీని రాడార్ క్రాస్ సెక్షన్ ఒక చిన్న పక్షి స్థాయిలో మాత్రమే ఉంటుంది.ఇన్ఫ్రారెడ్ & హీట్ సిగ్నేచర్ తగ్గింపు: ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను ప్రత్యేకంగా రూపొందించి, హీట్ సెన్సర్లకు కనిపించకుండా చేస్తుంది.అత్యధిక పరిధి: ఒకసారి మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్‌తో 10,000 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు.అత్యంత ఖచ్చితమైన దాడులు: 40,000 పౌండ్ల బాంబులు మోసే సామర్థ్యం ఉంది, అందులో న్యూక్లియర్ బాంబులు కూడా ఉంటాయి.క్రూ సౌకర్యాలు: దీన్ని “ఫ్లయింగ్ హోటల్” అని కూడా పిలుస్తారు—ఇందులో బెడ్, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, టాయిలెట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎందుకంటే కొన్ని మిషన్లు 40 గంటలపాటు సాగుతాయి.తయారీ ఖర్చుబీ2 బాంబర్ ఖర్చు: సుమారు $2.1 నుండి $2.2 బిలియన్ (2025 నాటికి ₹17,000 కోట్లకు పైగా).మొత్తం ప్రోగ్రాం వ్యయం: అభివృద్ధి, పరీక్షలు, ఉత్పత్తి కలిపి $79 బిలియన్ ఖర్చయింది.ప్రతి మిషన్ ఖర్చు: ఒక B-2 మిషన్‌కు సగటున $3–4 మిలియన్ ఖర్చవుతుంది. ఎందుకంటే ఒక్క గంట ఫ్లైట్ ఖర్చే $150,000 ఉంటుంది.చైనా డ్రోన్ నిజంగా B-2ని పోలి ఉందా?అవును.. 2025 మేలో చైనాలోని మలాన్ టెస్ట్ బేస్ వద్ద శాటిలైట్ చిత్రాల్లో కనిపించిన స్టెల్త్ డ్రోన్ B-2 స్పిరిట్‌ను పోలి ఉంది. దీని వింగ్స్పాన్(సుమారు 52 మీటర్లు), టెయిల్‌లెస్ ఫ్లయింగ్-వింగ్ డిజైన్, ఇన్ఫ్రారెడ్-సిగ్నేచర్ తగ్గింపు లక్షణాలు.. ఇవి అన్నీ B-2 లక్షణాలను ప్రతిబింబిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది చైనా యొక్క H-20 ప్రాజెక్ట్ లేదా కొత్త హై-ఆల్టిట్యూడ్ స్టెల్త్ డ్రోన్ కావచ్చు. అయితే ఈ డ్రోన్ రూపకల్పనకు నోషిర్ గోవాడియా అందించిన గోప్య సమాచారం ప్రభావం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇరాన్ కంటే ముందు.. అమెరికా దీనిని ప్రయోగించిన సందర్భాలు🕊️ 1999 – కొసోవో యుద్ధం (Operation Allied Force)- B-2 బాంబర్లు తొలిసారిగా యుద్ధంలో పాల్గొన్న సందర్భం.- మిస్సోరీలోని వైట్మాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి నేరుగా సెర్బియాకు వెళ్లి, కీలక లక్ష్యాలపై ఖచ్చితమైన బాంబింగ్ చేశారు.- ఒక్కో మిషన్ 30 గంటలకు పైగా సాగింది. 🏔️ 2001–2002 – ఆఫ్ఘానిస్తాన్ (Operation Enduring Freedom)- తాలిబాన్ స్థావరాలు, శిక్షణ శిబిరాలు, గుహలపై దాడులు.- అమెరికా నుంచి నేరుగా ఎగిరి, మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్‌తో లక్ష్యాలను చేరుకున్నారు. 🏜️ 2003 – ఇరాక్ యుద్ధం (Operation Iraqi Freedom)- ప్రారంభ దాడుల్లో భాగంగా సద్దాం హుస్సేన్‌కు చెందిన కమాండ్ సెంటర్లు, మిస్సైల్ సదుపాయాలపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి. 🌍 2011 – లిబియా (Operation Odyssey Dawn)- మూడు B-2 బాంబర్లు లిబియాలోని ఎయిర్‌ఫీల్డ్స్, ఫోర్టిఫైడ్ షెల్టర్లపై దాడి చేసి, నో-ఫ్లై జోన్ అమలు ప్రారంభానికి దోహదం చేశాయి. ⚔️ 2017 – సిరియా (అధికారికంగా నిర్ధారణ కాలేదు)- ఐసిస్ స్థావరాలపై B-2 బాంబర్లు GBU-57 బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేశాయని నివేదికలు ఉన్నాయి. 🚀 2024 – యెమెన్- హౌతీ తిరుగుబాటుదారులపై దాడి. ఈ మిషన్ ద్వారా బీ-2 బాంబర్ సామర్థ్యాన్ని మళ్లీ ప్రపంచానికి చూపించారు. 🌑 2025 – ఇరాన్ (Operation Midnight Hammer)- 7 B-2 బాంబర్లు 37 గంటల పాటు ఎగిరి, ఇరాన్‌లోని Fordow, Natanz, Isfahan న్యూక్లియర్ కేంద్రాలపై 30,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేశాయి. -
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. కొనసాగుతున్న యుద్ధం?
జెరూసలేం: పశ్చిమాశియాలో యుద్ధం పున:ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడిచింది. ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడింది. దీంతో ఇజ్రాయెల్ కాల్పుల్ని తిప్పికొట్టింది. ఇరాన్‌పై ప్రతిదాడులకు దిగింది. దీంతో గంటల వ్యవధిలో ఇరు దేశాల మధ్య యుద్ధం పున:ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇరాన్ దాడులకు దిగిందని హెచ్చరించింది. దాడులు ఇలాగే కొనసాగితే కోలుకోలేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే, ఇజ్రాయెల్ వార్నింగ్ ఇరాన్ స్పందించింది. ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విమరణ ఒప్పందం జరిగిన తరువాత తాము ఎలాంటి కాల్పులు జరపలేదని . అయినప్పటికీ ఇరుదేశాల మధ్య కాల్పుల మోత మోగూతూనే ఉంది. ⭕️"In light of the severe violation of the ceasefire carried out by the Iranian regime, we will respond with force."-The Chief of the General Staff, LTG Eyal Zamir in a situational assessment now— Israel Defense Forces (@IDF) June 24, 2025 12 రోజులుగా కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలికారు. ఇరు దేశాలు తన మధ్యవర్తిత్వం వల్ల యుద్ధం ఆగిపోయింది.ఇజ్రాయెల్, ఇరాన్‌లు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని తన ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. దీంతో పశ్చిమాశియాలో కొనసాగుతున్న యుద్ధానికి ముగిసినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై భీకరదాడి చేసింది. ఇజ్రాయెల్ సైతం అదే తరహాలో ఇరాన్ దాడుల్ని ప్రతిఘటించింది. ఇరాన్ దాడుల్ని జ్రాయెల్ భూభాగంలోకి క్షిపణులను ప్రయోగించిన తర్వాత ఇరాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్)మంగళవారం ఆరోపించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పూర్తి కాల్పుల విరమణ అని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి. -
అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలు.. ఖతార్‌లోని అమెరికా స్థావరంపై బాలిస్టిక్ క్షిపణి దాడులు... కువైట్, ఇరాక్, బహ్రెయిన్‌లోని యూఎస్ ఎయిర్ బేస్‌లపైనా దాడి జరిపినట్లు వార్తలు
-
ఎవరి కోసం ఈ యుద్ధం?
అకారణ యుద్ధాలతో నిండా మునిగి, ఆర్థికంగా పతనావస్థకు చేరుకున్న అమెరికా, మరోసారి పశ్చిమాసియా రణరంగంలో దూకి తన మూర్ఖత్వాన్ని చాటుకుంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ‘నాకెందుకో నోబెల్ బహుమతి రావటం లేద’ని వగచి 48 గంటలు కాలేదు... తన యుద్ధోన్మాదాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇంటా బయటా ‘వద్దుగాక వద్ద’ని మొత్తుకుంటున్నా, ఆంక్షలతో బక్కచిక్కిన ఇరాన్‌పై తన ప్రతాపాన్ని చూపారు. ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’ పేరిట శనివారం అర్ధరాత్రి దాటాక అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ కొండప్రాంతాల్లోని భూగర్భంలో వున్న ఫోర్దో, నతాంజ్, ఇసాఫన్ అణుస్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో అమెరికా చెబుతున్నట్టు ఆ స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయా లేదా అన్నది ఇంకా తెలియాల్సివుంది. కానీ ఫోర్దో కేంద్రంపై సోమవారం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు మరోసారి దాడి చేశాయన్నది గమనిస్తే తీవ్ర నష్టం కలిగివుండొచ్చనిపిస్తోంది. ఇందుకు ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఎన్నడూలేని విధంగా హోర్ముజ్ జలసంధిని మూసేయాలని ఇరాన్ కేబినెట్ నిర్ణయించటం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై పిడుగుపాటే. ఇరాన్‌పై అమెరికా పగ ఈనాటిది కాదు. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం అనంతరం అమెరికా రాయబార కార్యాలయంపై దాడిచేసి 52 మంది దౌత్యవేత్తలనూ, పౌరులనూ 444 రోజుల పాటు బందీలుగా చేసిన వైనాన్ని ఆ దేశం మరిచిపోలేకపోతోంది. బందీలను విడిపించ టానికి అప్పటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ సైతం విఫలమైంది. ఆ పరాభవంనుంచి కోలుకోలేక ఏదో సాకుతో ఆంక్షలు విధిస్తూనేవుంది. ఆ తర్వాత 1980లో అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను ఇరాన్‌పైకి ఉసిగొల్పింది. ఎనిమిదేళ్ల ఆ యుద్ధం రెండు దేశాలనూ దెబ్బతీయగా, అమెరికా ఆయుధ విక్రయంతో బాగుపడింది. అటుపై అడపా దడపా ఇజ్రాయెల్‌తో దాడులు చేయిస్తూనే ఉంది. కొత్త కొత్త ఆంక్షలతో ఇరాన్‌ను దెబ్బతీస్తూనే ఉంది. తీరికూర్చుని వేరే దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, వనరుల కైంకర్యానికి ప్రయత్నించటం అమెరికా విదేశాంగ విధానంలో భాగం. ఇరాన్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన జాతీయవాది ప్రధాని మహమ్మద్ మొసాదిని 1953లో బ్రిటన్‌తో చేతులు కలిపి సైనికకుట్రతో కూల్చిన పాపం అమెరికాదే. అప్పట్లో బ్రిటన్ చేతుల్లోవున్న ఇరాన్ చమురు కంపెనీని జాతీయం చేయటంతో రెండు దేశాలూ ఈ దుస్సాహసానికి ఒడిగట్టాయి. అటుపై తమ కీలు బొమ్మ మహ మ్మద్ రెజా పెహ్లవీని అందలమెక్కించాయి. రెండు దశాబ్దాలు గడవకుండానే అతగాడు పదవీభ్ర ష్టుడయ్యాడు. ఇస్లామిక్ దేశాల్లో అమెరికా జోక్యంతో ఛాందసవాదుల ప్రాబల్యం పెరగటం 1953 నాటి ఇరాన్‌తో మొదలుపెట్టి ఇటీవలి బంగ్లాదేశ్ వరకూ కనబడుతూనే ఉంది. అఫ్గానిస్తాన్, ఇరాక్, లిబియా, లెబనాన్, సోమాలియా, సిరియా వగైరాలన్నీ ఇందుకుదాహరణ. అఫ్గాన్‌లో తాలిబన్లు మొదలుకొని సిరియాలో ఐఎస్ వరకూ అన్ని ఉగ్రవాద సంస్థల పుట్టుకకూ అమెరికాయే కారణం. డెమాక్రాట్లు మళ్లీ నెగ్గితే అమెరికాను సర్వనాశనం చేస్తారని, మూడో ప్రపంచయుద్ధానికి కారకు లవుతారని అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం చేసిన పెద్ద మనిషి ఇప్పుడు తానే ఆ పెను ముప్పు వైపు అడుగులేశారు. అమెరికన్ కాంగ్రెస్‌కు మాట మాత్రమైనా చెప్పలేదు. అంతర్జాతీయ చట్టాల్ని లేశమాత్రమైనా గౌరవించలేదు. చివరకు ఏమవుతుందోనన్న చింత అసలే లేదు. యుద్ధాల్ని ప్రారంభించటం తేలిక. వాటి ముగింపు ఎవరి వల్లా కాదు. వ్యక్తుల ఇష్టానిష్టాలకు అది లోబడి ఉండదు. అసలే పశ్చిమాసియా వైరుద్ధ్యాల పుట్ట. పరస్పరం కలహించుకునే దేశాలు అక్కడ డజనుకు పైగా ఉంటాయి. అలాంటిచోట ‘తగుదునమ్మా...’ అంటూ ట్రంప్ వేలెట్టి పెద్ద తప్పు చేశారు. కానీ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సింది... అమెరికన్ పౌరులూ, ప్రపంచ ప్రజానీకం.మూడున్నర దశాబ్దాల ఏలుబడిలో అలీ ఖమేనీకి ఇది పరీక్షా సమయం. దాడులకు లొంగి ట్రంప్‌తో దౌత్యానికి సిద్ధపడతారా లేక ఇజ్రాయెల్ అంతు చూసేదాకా వదలరా అన్నది తేలటానికి సమయం పడుతుంది. కానీ శక్తిమంతమైన అమెరికాపై ప్రతీకార దాడులకు దిగి భారీ నష్టానికి సిద్ధ పడకపోవచ్చు. అకారణ దాడులపై రౌద్రంగా ప్రకటనలిస్తున్నా ఆచరణ రూపం దాల్చక పోవచ్చు. అటు అమెరికా సైతం ఇరాన్ అణ్వాయుధ ప్రయత్నాలపై యుద్ధమే తప్ప ఆ దేశంపై యుద్ధం తమ ఉద్దేశం కాదంటోంది. కానీ ఇజ్రాయెల్, అమెరికాల ఉమ్మడి దురాలోచన ఇరాన్లో నాయకత్వ మార్పు... అమెరికా ప్రాపకంతో నడిచే ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వంటి ఆర్థిక సంస్థల ప్రమేయం లేకుండా సర్వస్వతంత్రంగా, నిటారుగా నిలబడగల్గిన ఇరాన్‌ను ‘ప్రధాన స్రవంతి’కి మళ్లించటం. ఆ రెండూ మాత్రం నెరవేరే అవకాశం లేనే లేదు. ఇరాన్లో పెట్టుబడులు లేవు గనుక అమెరికా ఎంతకైనా తెగిస్తుంది. కానీ మనకు ఆ దేశంతో ఆర్థికబంధం ఉంది. పాకిస్తాన్ ప్రమేయం లేకుండా మధ్య ఆసియా దేశాలతో, అఫ్గాన్‌తో నేరుగా, చౌకగా వాణిజ్యాన్ని నెరపగలిగే చాబహార్ పోర్టు ఇరాన్లో నిర్మించింది మనమే. కానీ ఆంక్షల కారణంగా అది అరకొరగా ఉంది. ఇరాన్ చౌకగా ఇచ్చే చమురును కూడా ఆ ఆంక్షల పర్యవసానంగానే కాలదన్నుకున్నాం. ఈ యుద్ధం ఉగ్రరూపం దాలిస్తే ఆర్థికంగా మరింత నష్టపోతాం. చైనా, రష్యాల పరిస్థితి కూడా ఇదే. అటు నాటో కూటమి సైతం అయోమయంలో పడింది. అందుకే ఈ మతిమాలిన యుద్ధం చాలించమని ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలన్నిటిపైనా ఉంది. -
అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు
టెహ్రాన్/టెల్ అవీవ్/దోహా/వాషింగ్టన్/న్యూఢిల్లీ: కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అగ్రరాజ్యంపై ఇరాన్ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పనిచెప్పింది. ఖతార్‌లోని అమెరికా వైమానికస్థావంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బమ్రెయిన్‌లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపైనా దాడిచేసినట్లు వార్తలొచ్చాయి. దోహా నగర సమీపంలోని అల్–ఉదేయిద్ అమెరికా ఎయిర్‌బేస్‌పై ఆరు స్వల్ప శ్రేణి, మధ్యస్థాయి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులకు ఇరాన్ ‘ఆపరేషన్ బేషరత్ ఫతాహ్’ అని పేరుపెట్టింది. ఇరాక్‌లోని అయిన్ అల్ అసద్ బేస్‌పై ఇరాన్ రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇక్కడ ఏ స్థాయిలో ధ్వంసం జరిగిందనేది తెలియరాలేదు. అయితే క్షిపణులను తమ గగనతల రక్షణవ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని అమెరికా ప్రకటించింది. తమ స్థావరాలపై దాడుల నేపథ్యంలో శ్వేతసౌధంలోని సిచ్యుయేషన్ రూమ్‌కు వెళ్లి తాజా పరిస్థితిపై రక్షణ మంత్రి హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఛైర్మన్ జనరల్ డ్యాన్ కెయిన్, ఉన్నతాధికారులతో అధ్యక్షుడు ట్రంప్ సమీక్ష జరుపుతున్నట్ల తెలుస్తోంది. మరోవైపు పలు దేశాల్లోని స్థావరాలపై ఇరాన్ క్షిపణులు దూసుకొస్తుండటంతో సమీప దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ గగనతలాలను మూసేశాయి. తమ పైనా యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కువైట్, ఖతార్, బహ్రెయిన్ ప్రకటించాయి. అల్ ఉదేయిద్ ఎయిర్‌బేస్ నుంచి జూన్ 19వ తేదీలోపే కీలక యుద్ధ, ఇంధన విమానాలను అమెరికా సురక్షితంగా వేరే చోటుకు తరలించినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఉదేయిద్ బేస్‌లో ఏకంగా 10,000 మంది అమెరికా సైనికులు ఉంటారు. గత పాతికేళ్లుగా దీనిని అమెరికా వాడుతోంది. ఈ బేస్‌పై దాడులు చేయబోతున్నట్లు ఖతార్ ప్రభుత్వానికి ఇరాన్ కొన్నినిమిషాల ముందే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పేలుళ్ల శబ్దాలు దోహా సిటీదాకా వినిపించాయి. దీంతో ఎవరూ బయటకు రావొద్దని సంస్థలు, విద్యాలయాలు, ఆఫీస్‌లకు ప్రభుత్వం వెంటనే సందేశాలు పంపింది. ఆరుబయటకు రావొద్దని ఖతార్‌లోని తమ పౌరులకు భారత్, అమెరికా, బ్రిటన్ ఎంబసీలు అడ్వైజరీలు జారీచేశాయి. ఖతార్ గగనతలాన్ని మూసేయడంతో దోహాసిటీకి వెళాల్సిన రెండు ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు మార్గమధ్యంలో వెనుతిరిగాయి. కొచ్చి నుంచి మస్కట్‌కు అక్కడి నుంచి కన్నూర్‌కు తిరిగి వచ్చినట్లు ఎయిర్ఇండియా తెలిపింది. ప్రస్తుతం ఖతార్‌లో తమ విమానమేదీ లేదని పేర్కొంది.అమెరికా అండతో చెలరేగిన ఇజ్రాయెల్అగ్రరాజ్యం అమెరికా భీకర బాంబుదాడులు చేసి, అండగా ఉన్నానని అభయ హస్తమివ్వడంతో సోమవారం ఇజ్రాయెల్ ఇరాన్‌పై చెలరేగిపోయింది. కారాగారం, మిలటరీ విమానాశ్రయాలు, స్వచ్ఛంద సంస్థ, రెవల్యూషనరీ గార్డ్ కోర్ ప్రధాన కార్యాలయం, అణుకేంద్రం, ప్రభుత్వ ఆఫీస్... ఇలా ఇరాన్‌లోని భిన్న రంగాల భవనాలపై క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ పేలుళ్ల మోత మోగించింది. కీలక ఫోర్డో పర్వతగర్భ యురేనియం శుద్ధి కర్మాగారంపై తన వంతుగా క్షిపణి దాడులు చేసి మరింత వినాశనానికి పాల్పడింది. వేల కేజీల బాంబులను అమెరికా పడేసి విధ్వంసం సృష్టించిన మరుసటిరోజే ఇజ్రాయెల్ ఇదే న్యూక్లియర్ సెంటర్‌పై దాడులకు దిగింది. టెహ్రాన్‌లోని మిలటరీ కేంద్రాలపై ఏకంగా 50 యుద్దవిమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఆరు ఇరాన్ ఆర్మీ ఎయిర్‌పోర్ట్‌లలో నిలిపి ఉంచిన ఎఫ్–15, ఎఫ్–5, ఏహెచ్–1 విమానం సహా 15 యుద్దవిమానాలు, హెలికాప్లర్లను ధ్వంసంచేసింది. రన్‌వేలపై బాంబులేసింది. టెహ్రాన్‌లోని పాలస్తీన్ స్క్వేర్, రెవల్యూషనరీ గార్డ్ కోర్ ప్రధాన కార్యాలయంపై, బసీజ్ వాలంటీర్ కోర్ భవనంపై దాడులు చేసింది. ఉత్తర టెహ్రాన్‌లోని ప్రముఖ మానవతా సంస్థ ‘ఇరానియన్ రెడ్ క్రిసెంట్’ భవనంపైనా ఇజ్రాయెల్ నిర్దయగా బాంబులేసింది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ సైతం దీటుగా బదులిచ్చింది. ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్3’ పేరిట హైఫా, టెల్ అవీవ్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులను ఉధృతం చేసింది. వ్యూహాత్మకంగా కారాగారంపై..యుద్ధంలో సాయుధ బలగాలతోపాటు నిరాయుధ ఖైదీలుండే ఎవిన్ జైలు పైనా ఇజ్రాయెల్ గురిపెట్టింది. అయితే ఖైదీల గదులపై కాకుండా కారాగారం ప్రధాన ద్వారాన్ని బద్దలకొడుతూ డ్రోన్ దాడులుచేసింది. దీంతో గేటు తునాతునకలైంది. ఇరాన్ పాలకుల నిరంకుశపాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుపాలైన ఉద్యమకారులు, విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను విడిపించేందుకే ఇలా డ్రోన్‌తో గేటును ధ్వంసంచేశారని తెలుస్తోంది.ప్రభుత్వాన్ని పడగొట్టడంపై ట్రంప్ దృష్టిఇరాన్ను ఏలుతున్న సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ రాజకీయవర్గాన్ని గద్దె దింపాలని ట్రంప్ భావిస్తున్నట్లు ఆయన మాటల్లో స్పష్టమైంది. సోమవారం ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ ఇరాన్‌ను ప్రస్తుత ప్రభుత్వం గొప్ప దేశంగా అవతరింపజేయడంలో ఘోరంగా విఫలమైంది. ఇలాంటి విఫల ప్రభుత్వం అధికారంలో కొనసాగడం ఎంతవరకు సబబు అనిపించుకుంటుంది?’ అని ట్రంప్‌వ్యాఖ్యానించారు. ఇరాన్‌ను ప్రభుత్వాన్ని కూల్చేఉద్దేశం తమకు లేదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి హెగ్సెత్ మాట్లాడిన కొన్ని గంటలకే ట్రంప్ ఇలా తన మనసులో మాట బయటపెట్టారు.ఘర్షణ తగ్గేందుకు కృషిచేస్తానన్న పుతిన్అమెరికా జోక్యం చేసుకోవడంతో రష్యా మద్దతు కూడగట్టేందుకు మాస్కోకు వెళ్లి అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రయత్నం కొంతమేర ఫలించింది. పశ్చిమాసియాను రణరంగం నుంచి శాంతిపథంలోకి పయనింపజేసేందుకు తన వంతు కృషిచేస్తానని, ఈ విషయంలో ఇరాన్‌కు సాయపడతానని పుతిన్ సోమవారం ప్రకటించారు. ‘‘ ఇరాన్‌పై దుస్సాహసంతో అమెరికా, ఇజ్రాయెల్ దాడులుచేశాయి. అణుబాంబు తయారీకి ఎలాంటి ఆధారాలు లేకున్నా, సరైన కారణాలు లేకుండా పశ్చిమాసియాను కదనరంగంగా మార్చేసి ఇజ్రాయెల్, అమెరికా అంతర్జాతీయ ఒడంబడికల తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డాయి’’ అని పుతిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ట్రంప్ ఏకధ్రువ ప్రపంచ కలలు
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్ష జోక్యానికి కారణం ఏమై ఉంటుందని విశ్లేషిస్తూ పోతే అంతిమంగా తోస్తున్నది ఒకటే. అది – క్రమంగా బలహీనపడుతున్న ఏకధ్రువ ప్రపంచాన్ని తిరిగి స్థిరపరచుకోవా లన్న అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నం. ఇరాన్ అణ్వస్త్రాల ఉత్పత్తికి సమీపంలో ఉందా దూరంగానా, శాంతి చర్చలకు సిద్ధమా కాదా, అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు అస్తిత్వ ప్రమాదం ఏర్పడిందా లేదా అనేవన్నీ పైకి కనిపించే మిథ్యా సంవాదాలు. ఇంతవరకు దౌత్య చర్చల తెర వెనుక దాగి తన యుద్ధ మంత్రాంగాన్ని సాగించిన ట్రంప్, ఇరాన్‌ను ఇజ్రాయెల్ ఓడించటం తేలిక కాదని అర్థమవుతుండటంతో, నిజ స్వరూపంతో తెర ముందుకు వచ్చారు. తాము, ఇజ్రాయెల్ ‘ఒక టీమ్‌గా పని చేస్తూ వస్తున్నా’మని ఎటువంటి దాపరికం లేకుండా, జూన్ 21 నాటి దాడుల తర్వాత 22న ప్రకటించారు. బిట్వీన్ ద లైన్స్ఎదుటిపక్షంతో చర్చలు జరుగుతుండగానే మధ్యలో వారిపై బాంబు దాడులు జరిపిన ఉదంతాలను ప్రపంచ దౌత్య చరిత్రలోనే ఎపుడైనా విన్నామా? ఇరాన్ అణుశక్తి కార్యక్రమంపై వారికి, అమె రికాకు అయిదు విడతల చర్చలు జరిగి ఆరవది ఈ నెల 15న జరగనుండగా రెండు రోజుల ముందు 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ అమెరికాకు చెప్పి మరీ దాడి చేసింది. ఈసారి నేరుగా అమెరికాయే దాడి జరిపింది. తమ దాడికి సరిగా ఒకరోజు ముందు స్వయంగా ట్రంప్ మాట్లాడుతూ, చర్చల కోసం వచ్చేందుకు ఇరాన్‌కు 15 రోజుల సమయం ఇస్తున్నామన్నారు. అయినా మరునాడే దాడి చేశారు. ఇదే ఒక ద్వంద్వ నీతి కాదా? ఇంతకూ గత అమెరికన్ ప్రభుత్వాలు సాగించిన యుద్ధాలను తీవ్రంగా ఖండించి, తన హయాంలో ఆ పని జరగబోదని తన ఎన్నికల ప్రచార సమయం నుంచే పదేపదే హామీ ఇస్తూ వచ్చిన ట్రంప్, ఇపుడీ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నది అసలు ప్రశ్న. పశ్చిమాసియాలో అమెరికాతో పాటు పాశ్చాత్య సామ్రాజ్య వాదపు ప్రయోజనాల కోసం ఇజ్రాయెల్ అవసరం ఎటువంటిదనే చర్చలు తరచూ జరిగేవే గనుక ఇపుడు తిరిగి చెప్పుకోనక్కర లేదు. కానీ అంతకుమించిన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. అవి స్వయంగా ట్రంప్ మాటలు, చేతల ద్వారా రూపుదిద్దుకుంటున్నవే. తన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదానికి, అమెరికా తన ఏకధ్రువ ప్రపంచాధిపత్య స్థాయిని కోల్పోతుండటానికి, ప్రస్తుతం ఇరాన్‌తో ఘర్షణకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఇది కేవలం ఇజ్రాయెల్, ఇరాన్, అణు పరిశోధనలు, పశ్చిమాసియా, చమురు నిల్వలు, ఆ ప్రాంతపు భౌగోళికతలకు పరిమితమైనది కాదు. 21 నాటి తమ సైనిక శక్తి ప్రద ర్శనతో అమెరికా మొత్తం ప్రపంచానికి హెచ్చరికల సందేశం పంప దలచింది. తన ఏకధ్రువ ఆధిపత్యాన్ని సైనిక బలంతో నిలబెట్టుకో గలమని చెప్పటమే ఆ సందేశం.ఈ మాటపై సందేహం గలవారు 21 నాటి దాడుల తర్వాత మొదట ట్రంప్ చేసిన ప్రసంగాన్ని, తర్వాత అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ కురిల్లాతో కలిసి రక్షణమంత్రి పీట్ హెగ్సెట్ మీడియా సమావేశంలో అన్న మాటలను జాగ్రత్తగా గమనించండి. ఇంగ్లిష్‌లో ‘రీడింగ్ బిట్వీన్ ద లైన్స్’ అనే మాట ఉంది. పైకి చెప్పే మాటల అర్థాన్నే గాక వాటి అంతరార్థాన్ని కూడా చూడటమన్నమాట. వారు ఇరాన్ అణు కేంద్రాల విధ్వంసం, శాంతి చర్చల రూపంలో ఇరాన్ తమకు బేషరతుగా లొంగటం, కాదని దాడులు జరిపితే సర్వనాశనానికి ఇరాన్ సిద్ధపడటం అని చెప్పేందుకే పరిమితం కాలేదు. ఆ తరహా దాడులు ఎంత ఘనమైనవో, తమ వంటి సైనిక శక్తి యావత్ ప్రపంచంలో మరే దేశానికి ఎట్లా లేదో, అటువంటి దాడులు మరెవరు ఎట్లా చేయలేరో ఒకటికి నాలుగుసార్లు కఠిన స్వరంతో, తీక్షణమైన ముఖ కవళికలతో చెప్తూ పోయారు. గత యుద్ధాల చరిత్రను గమనిస్తే సామ్రాజ్యవాదులు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోదలచిన ప్రతిసారీ, లేదా అటువంటి ఆధిపత్యానికి సవాళ్లు ఎదురైన ప్రతిసారీ, అంతర్జాతీయ చట్టాలూ రూల్ ఆఫ్ లా అని తామే సృష్టించి జపించేవాటిని బాహాటంగా ఉల్లంఘిస్తూ, కేవలం సైనిక బలంతో ఆధిపత్యం కోసం సరిగా ఇటువంటి మాటలే చెప్తూ వచ్చారు. గత 10–15 సంవత్సరాలుగా తన ఆధిపత్యాన్ని క్రమంగా కోల్పోతూ మథనపడుతున్న అమెరికాకు, ఆ స్థాయిని తిరిగి చతురోపాయాలతో నిలబెట్టుకోవటం అన్నింటికీ మించిన పరమ లక్ష్యంగా మారింది.సామ్రాజ్యవాద డైనమిక్స్ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదాన్ని ప్రపంచం కేవలం ఆర్థిక సంబంధమైనదిగా చూస్తూ వస్తున్నది. తాను యుద్ధాలు ఆపానని, ఇంకా ఆపుతానని, శాంతి దూతనని చెప్పే మాటలను చాలామంది అమాయకంగా విశ్వసించారు. కానీ అర్థం చేసుకోని విషయాలు రెండున్నాయి. ఒకటి–తాము కోల్పోతున్నట్లు ట్రంప్ సరిగానే భావిస్తున్న గొప్పతనం చాలా వరకు సైనిక బలం ఆధారంగా సంపా దించినదే. రెండు – అట్లా కోల్పోవటం చారిత్రక పరిణామాల వల్ల ఏర్పడుతున్న సహజ స్థితి అని గుర్తించి అందుకు అనుగుణంగా సర్దు బాట్లు చేసుకోవటానికి బదులు, పూర్వ వైభవాన్ని సాధించాలనుకుంటే అందుకు చివరి ఆధారం తిరిగి సైనిక శక్తే అవుతుంది. అంతర్జాతీయ చట్టాలకు, నాగరికమైన ప్రజాస్వామ్య వ్యవహరణకు కట్టుబడే డైనమిక్స్ ఒక విధంగా ఉంటే, అన్నింటినీ ఒకవైపు వల్లిస్తూనే యథేచ్చగా ఉల్లంఘించే సామ్రాజ్యవాదపు డైనమిక్స్ ప్రస్తుతం మనం చూస్తున్న విధంగానే ఉంటాయి. అది ‘సామ్రాజ్య వాదం’ అనే వ్యవస్థలోనే అంతర్నిహితమై భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటా దర్శనమిస్తుంది.ప్రపంచంలోకెల్లా అతిగొప్ప ప్రజాస్వామ్యాలని చెప్పుకునే అమెరికా, బ్రిటన్లు, పశ్చిమాసియాలో ఏకైక ప్రజాస్వామ్యమని చాటుకునే ఇజ్రాయెల్‌ల అప్రజాస్వామిక చర్యల చరిత్ర ఒక ఉద్గ్రంథ మవుతుంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు తమ సామ్రాజ్య వాద ప్రయోజనాల కోసం ఎన్నెన్నో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను సీఐఏ, ఎంఐ–6ల ద్వారా కూలదోసి నియంతలను అధికారానికి తెచ్చాయి. అందుకు ఇరానే ఒక ముఖ్య ఉదాహరణ. అక్కడ ఎన్నికైన ప్రధాని మహమ్మద్ మొసాది చమురు బావులను జాతీయం చేయగా, తనపై 1953లో సైనిక కుట్ర జరిపించి షా పెహ్లవీ నియంతృత్వాన్ని తెచ్చారు. ఇపుడు ‘రెజీమ్ ఛేంజ్’ (ప్రభుత్వ మార్పిడి) పేరిట మరొక పెహ్లవీ వంశ వారసుడిని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.నిజానికి ట్రంప్ ‘మాగా’ నినాదంలోనే, పదవీ బాధ్యతలు స్వీకరించి తొలినాళ్ల నుంచి తీసుకుంటున్న చర్యలలోనే ఇదంతా తార్కికంగా కనిపిస్తుంది. వలసదారుల నిరోధానికి, పంపివేతకు సైన్యాన్ని నియోగించటం వరకు వెళ్లారు. ట్యారిఫ్ల యుద్ధంతో యావత్ ప్రపంచం ఒకేసారి తమకు పాదాక్రాంతం కావాలనుకున్నారు. రష్యా, చైనాల వద్ద అణ్వస్త్రాలతో కూడిన సైనిక బలం లేనట్లయితే గత కాలపు సామ్రాజ్యవాద పద్ధతులలోనే వనరులు, మార్కెట్ల కోసం దాడులు జరిపే వారే! టారిఫ్‌లకు సంబంధించి కాకున్నా, వనరులూ, మార్కెట్ల విషయమై ఆ రెండు దేశాలతో కాకున్నా, ఇతరత్రా సైనిక బలాన్ని ట్రంప్ మార్కు సామ్రాజ్యవాదం వినియోగిస్తూనే ఉంది. ప్రభుత్వాన్ని కూలదోస్తాం, మొత్తం దేశాన్నే రాతియుగపు పరిస్థితికి నిర్ధూమధామం చేస్తాం అనే హెచ్చరికలన్నీ కేవలం అమెరికా సైనిక శక్తిని కేంద్రం చేసుకున్నవి కావా? ఆఫ్రికాలోని అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్‌ను కొనసాగిస్తామనటం అక్కడి అపారమైన వనరుల కోసం కాదా? బహుళ ధ్రువ ప్రపంచం కోసం ఆర్థిక ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్న బ్రిక్స్, డీ–డాల రైజేషన్లను బాహాటంగా బెదిరిస్తూ చిన్న దేశాలపై సైనికమైన ఒత్తిడి తేవటంలో కనిపించేది సైనిక శక్తి కాదా? అందువల్ల ట్రంప్ ‘మాగా’ నినాదాన్ని ప్రపంచం కొత్త దృష్టితో చూడటం అవసరం. ఈ జూన్ 21 నాటి బంకర్ బస్టర్ల సైనిక బల సందేశం, క్రమంగా బలపడు తున్న బహుళ ధ్రువ ప్రపంచానికి సామ్రాజ్యవాదపు ‘బిట్వీన్ ద లైన్స్’ సందేశం!టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మీరు ఇచ్చే సందేశం ఏమిటి? : అమెరికాపై చైనా ధ్వజం
ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడులను చైనా తీవ్ర స్థాయిలో ఖండించింది. ఆపరేషన్ మిడ్నైట్ హమ్మర్ పేరుతో ఇరాన్‌పై యూఎస్ చేస్తున్న దాడులు ఎంతమాత్రం సరికాదని హెచ్చరించింది. అసలు ఈ దాడులతో ప్రపంచానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని చైనా ప్రశ్నించింది. ‘ మీరు చేస్తున్న దాడులతో ప్రపంచానికి తప్పుడు సందేశం పంపించారు. ఇది చెడు సంకేతాన్ని సృష్టించారు’ అంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి పేర్కొన్నారు. ఇప్పటికే యుద్ధం భీకర రూపం దాల్చిన తరుణంలో దాన్ని శాంతింప చేయాల్సింది పోయి.. అగ్నికి ఆజ్యం పోస్తారా? యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వాంగ్ యి ప్రశ్నించారు. ప్రస్తుతం ఇజ్రాయిల్, అమెరికాలు చేస్తున్న యుద్ధంతో భవిష్యత్‌లో పెను ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. సోమవారం బీజింగ్‌లో బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో జరిగిన సమావేశంలో వాంగ్ ఈ వ్యాఖ్యలు చేసిన విషయాన్ని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడులతో టెహ్రాన్‌లో భయానక వాతావరణం ఏర్పడింది. అక్కడ ప్రజలు కూడా తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు. అదే సమయంలో ఇజ్రాయిల్ సైతం.. టెహ్రాన్‌లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఇరాన్ అత్యవసర సమావేశాలు నిర్వహిస్తోంది. అటు రష్యాతో ఇప్పటికే చర్చలు జరిపిన ఇరాన్.. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఇరాన్‌కు సాయం చేస్తాంఇరాన్పై అమెరికా దాడులను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఇరాన్‌పై అమెరికా దాడులను తాము సమర్ధించడం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఇరాన్ ప్రజలకు సాయం చేయడానికి తాము అండగా ఉంటామన్నారు. -
Khamenei: ఈ రక్తపాతం చాలు.. ఇక తప్పుకో..!
టెహ్రాన్ : అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదు.. అనే పదే పదే చెబుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి నిరసన సెగ మొదలైంది. యుద్ధం ఆరంభమైన తర్వాత ఖమేనీ సాధించిందేమీ లేదంటూ ఆ దేశ బహిష్కృత ప్రిన్స్ రెజా పహ్లవి సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్, ఆమెరికా దాడుల తర్వాత ఖమేనీ ఏం సాధించారంటూ ప్రశ్నించారు. ఇరాన్ ప్రతిపక్ష నాయకుడు, ఇరాన్ చివరి షా అయిన మొహమ్మద్ రెజా పహ్లవి కుమారుడు రెజా పహ్లవి ఈరోజు( సోమవారం, జూన్ 23వ తేదీ) పారిస్ నుంచి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ(ఇరాన్) రక్తపాతంతో తడిసి ముద్దవడం తప్పితే ఖమేనీ కారణంగా దేశానికి ఒరిగిందేమీ లేదని దేశ బహిష్కరణకు గురైన ప్రిన్స్ రెజా పహ్లవి పేర్కొన్నారు. ఇక ఖమేనీ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిజాయితీగా విచారణ ఎదుర్కోవడానికి ఖమేనీ సిద్ధంగా ఉండాలి. ఇరాన్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ముగింపు దశకు వచ్చేసింది. ఖమేనీతో పాటు మరికొంతమంది ఆయన మద్దతుదారులు దేశం విడిచి పోవడానికి సిద్ధపడుతున్నారు. నువ్వు(ఖమేనీ) ఇక దిగిపో.. చట్ట ప్రకారం విచారణకు సిద్ధం అవ్వు’ అని హెచ్చ,రించారు.పశ్చిమ దేశాలు అనేవి పలు దేశాలకు జీవితాను ఇచ్చే దేశాలుగా ఉండేవి. ఈ పరిపాలనలో అదేమీ లేదు. అంతా రక్తపాతమే. ఎవరికీ లొంగిపోను అనే నినాదంతో విధ్వంసానికి కారణమయ్యాడు. ఇలా సుదీర్ఘకాలం ఒక దేశాన్ని అట్టిపెట్టుకోవాలని చూడటం మంచిది కాదు. ఇలా ఏ ఒక్కరి చేతుల్లోనూ బందీ అయిన దేశాలు సుఖపడినట్లు చరిత్రలో లేదు’ అని పేర్కొన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత తన వంశం పతనం అయినప్పటికీ ఇరాన్ క్రౌన్ ప్రిన్స్‌గా రెజా ఫహ్లావి పరిగణించబడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇరాన్లో అధికార మార్పుకు సమయం ఆసన్నమైందనే సంకేతాలకు ఆజ్యం పోస్తున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయాలని కూడా రెజా పిలుపునిచ్చారు. ఖమేనీ పీడకలని అంతం చేయాలంటే దేశ వ్యాప్తంగా ప్రజలే తిరగబడాలన్నారు. ప్రజలచే జాతీయ, ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థాపనకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని రెజా వ్యాఖ్యానించారు. -
భారత్‌లో బిందాస్‌గా బతకొచ్చు..! అమెరికా మహిళ ప్రశంసల జల్లు
భారతదేశంపై చాలామంది విదేశీయులు తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటున్నారు. ఇక్కడకు సరదాగా పర్యాటనకు వచ్చి మన భారతావనిపై మనసు పారేసుకోవడం విశేషం. ఇక్కడి భిన్నత్వంలోని ఏకత్వమే మమ్మల్ని కట్టిపడేస్తోందంటూ..నచ్చిన విషయాలను చెబుతున్నారు. అలానే ఒక అమెరికా మహిళ భారత్‌పై మాములుగా పొగడ్తల జల్లు కురిపించడం లేదు. ఆమె ఇలా ప్రశంసించడం మొదటిసారి కాకపోయినా..ఈసారి మాత్రం భారత్‌ని ఆకాశానికి ఎత్తేసేలా ప్రశంసల వర్షం కురిపించింది. ఆమె మాటలు వింటే ప్రతి ఒక్క భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగక మానదు.అమెరికాలో లైఫ్ సౌకర్యవంతంగా ఉన్నా..భారతదేశంలోనే అంతకుమించిన జీవితాన్ని గడపగలమని అంటోంది క్రిస్టెన్ ఫిషర్ అనే అమెరికన్ మహిళ. ఆమె భారత్‌కి నాలుగేళ్ల క్రితం తన కుటుంబంతో సహా వచ్చి ఇక్కడే ఉంటోంది. తానెప్పుడూ ఈ నిర్ణయానికి చింతించలేదని, అమెరికాలో సగటు జీవితం కంటే భారత్‌లోనే జీవితం అద్భుతంగా ఉంటుందని చెబుతోంది. తన జీవితాన్ని ఏవిధంగా తీసుకువెళ్లాలనే దానిపై తనకు పూర్తి నియంత్రణ ఉందని అంటోంది. తాను యూఎస్‌నే ఎంచుకోవచ్చు గానీ, తాను అంతకుమించిన గొప్పగా ఉండే జీవితాన్ని కోరుకున్నా అందుకే భారత్‌ని ఎంచుకున్నానని పేర్కొంది. ఇక్కడ ఇప్పటివరకు చాలా అద్భుతమైన వ్యక్తులను కలుసుకున్నా..పైగా గొప్పగొప్ప ప్రదేశాలను, వెరైటీ వంటకాలను చూశానని అన్నారామె. భారతదేశం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆనందంగా చెబుతోంది. ఎప్పటికీ తాను ఒకేలా ఉండకపోయినప్పటికీ..ఇక్కడి లైఫే నచ్చిందని పోస్ట్‌లో పేర్కొంటూ..మెహందీ పెట్టుకుని చీరకట్టులో ఢిల్లీలో ప్రయాణిస్తున్నవీడియోని కూడా జత చేసింది. అంతేగాదు ఆ వీడియోలో ఫిషర్ హోలీ పండుగను జరుపుకుంటూ..తన పిల్లలతో ఇతర ఉత్సవాల్లో కూడా పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది. ఆమె పోస్ట్‌ని చూసిన నెటిజన్లు ఇలా స్పందించారు. భారతీయురాలిగా నా దేశాన్ని చాలా మిస్ అవుతున్నా..అని యూరప్‌లో నివశిస్తున్న ఒక భారతీయురాలు, మరొకరు..మేము త్వరలో భారత్‌కి వచ్చేస్తున్నాం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: ఆనంద్ మహీంద్రా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! తప్పనిసరిగా ఓ 20 నిమిషాలు..) -
భీకర దాడులతో దద్దరిల్లుతున్న టెహ్రాన్.. దట్టంగా కమ్మేసిన పొగ
అమెరికా జోక్యంతో.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరో మలుపు తిరిగాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం 11వ రోజు కొనసాగుతోంది. తాజాగా సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో నష్టం భారీగానే సంభవించినట్లు తెలుస్తోంది. అక్కడి మీడియా కథనాల ప్రకారం.. భారీ పేలుళ్లతో శబ్దాలు వినిపించాయి. ఆపై పొగ నగరాన్ని దట్టంగా అలుముకుంది. నష్టం వివరాలు తెలియ రావాల్సి ఉంది. నగరంలోని జన రద్దీ ఉండే ప్రాంతం నుంచే ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే.. టెల్ అవీవ్ మాత్రం ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ప్రకటించుకుంది. 🚨#UltimoMinuto | 🇮🇷 #Tehran pic.twitter.com/BWz8bA5NDW— INTERACTIVA NEWS (@interactivanew) June 23, 2025ఇరాన్ మీడియా సంస్థలు కూడా అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రసారం చేస్తున్నాయి. ఐఆర్జీసీ, పోలీస్ నిఘా కేంద్రాలు, విద్యా సంస్థలు, విద్యుత్ కేంద్రాలపై దాడి జరిగినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ ఛానెల్ కథనాలు ఇస్తోంది. ఇవెన్ జైలు పూర్తిగా ధ్వంసమైందని ప్రకటించాయి.జూన్ 13వ తేదీ నుంచి ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఇప్పటిదాకా తీవ్ర ప్రాణనష్టం సంభవించింది. తాజా సమాచారం ప్రకారం.. ఇరాన్లో 585 మంది మరణించారు. వీళ్లలో 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. క్షతగాత్రుల సంఖ్య సుమారు 1326గా ఉంది.👇జూన్ 13, 2025ఇజ్రాయెల్ "ఆపరేషన్ రైజింగ్ లయన్" ప్రారంభించింది.ఇరాన్‌లోని 12కు పైగా సైనిక స్థావరాలు, పౌర మౌలిక సదుపాయాలపై బాంబుల దాడులు.మృతుల సంఖ్య 224కి చేరింది, వీరిలో 90 మందికిపైగా పౌరులు.👇జూన్ 14, 2025ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభం – "టూ ప్రామిస్ 3" ఆపరేషన్దాదాపు 100 బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై దాడి.టెల్ అవీవ్, జెరూసలెం, రమత్‌గాన్ వంటి నగరాల్లో పేలుళ్లు.ఇజ్రాయెల్ 70% క్షిపణులను గాల్లోనే కూల్చివేసినట్టు ప్రకటించింది.👇జూన్ 15, 2025ఇరాన్ 150కు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్టు ప్రకటించింది.ఇజ్రాయెల్ వైమానిక స్థావరాలు, కమాండ్ సెంటర్లు లక్ష్యంగా మారాయి.ఇరాన్ సైనిక జనరల్స్ బ్రిగేడియర్ మెహ్రబి, రబ్బాని మరణించారు.👇జూన్ 16, 2025ఇజ్రాయెల్ టెహ్రాన్‌పై గగనతల దాడులు కొనసాగించిందని నివేదికలు.ఇరాన్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది.ప్రపంచ దేశాలు శాంతి చర్చల కోసం పిలుపునిచ్చాయి.👇జూన్ 17, 2025ఇజ్రాయెల్ దాడుల్లో 585 మంది మృతి, 1326 మంది గాయాలు – మానవ హక్కుల సంఘాల నివేదిక.టెహ్రాన్‌లోని చమురు శుద్ధి కేంద్రాలు, అణు పరిశోధనా కేంద్రాలు ధ్వంసం.👇జూన్ 18, 2025ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణితో ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడి చేసినట్టు ప్రకటించింది.టెల్ అవీవ్, హైఫా ప్రాంతాల్లో పేలుళ్లు.జెరూసలెంలోని అమెరికా ఎంబసీ తాత్కాలికంగా మూసివేత.👇జూన్ 19, 2025ఇజ్రాయెల్ "ఆపరేషన్ సైలెంట్ స్టార్మ్" ప్రారంభించింది.ఇరాన్ కమ్యూనికేషన్ హబ్‌లు, రాడార్ కేంద్రాలపై దాడులు.ఇరాన్ సైనికాధికారి బ్రిగేడియర్ హుస్సేన్ అబ్దోల్లాహీ మరణం.👇జూన్ 20, 2025ఇరాన్ డ్రోన్లతో ఇజ్రాయెల్ నౌకాదళ స్థావరాలపై దాడి.ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ 80% క్షిపణులను అడ్డుకుంది.ఇరాన్ 40 మంది సైనికులు మృతి చెందినట్టు ప్రకటించింది.👇జూన్ 21–22, 2025పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి.ఇరాన్ అణు శాస్త్రవేత్త డాక్టర్ అమీర్ హొసేన్ ఫెక్హీ హత్య.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు: “ఖమేనీ హతమైతేనే యుద్ధం ముగుస్తుంది” అని ప్రకటన.అమెరికా, జూన్ 22, 2025 (భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4:10 గంటలకు) ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడులను "ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్" అనే కోడ్ పేరుతో నిర్వహించారు.📍 దాడి జరిగిన ముఖ్య ప్రాంతాలు:ఫోర్డో అణు కేంద్రం – పర్వతాల లోతులో ఉన్న ఈ కేంద్రంపై B-2 బాంబర్లతో బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించారు.నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం – జలాంతర్గాముల నుంచి ప్రయోగించిన టోమాహాక్ క్షిపణులు ఈ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి.ఇస్ఫహాన్ అణు పరిశోధనా కేంద్రం – ఇదే విధంగా టోమాహాక్ క్షిపణులతో ధ్వంసం చేశారు.✈️ దాడి వివరాలు:7 B-2 స్టెల్త్ బాంబర్లు అమెరికా నుంచి నేరుగా ప్రయాణించి లక్ష్యాలను ఛేదించాయి.30 టోమాహాక్ క్షిపణులు రెండు జలాంతర్గాముల నుంచి ప్రయోగించబడ్డాయి.మొత్తం 125కి పైగా యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.👇జూన్ 23, 2025టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు, ప్రజలు నగరం విడిచి తరలింపు.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ: “యుద్ధం మొదలైంది” అంటూ సోషల్ మీడియాలో ప్రకటన.యుద్ధం మరింత తీవ్రతరమవుతుందన్న అంచనాలు.ఇరాన్ తరఫున మరణించిన ఉన్నతాధికారులు:మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ – ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) చీఫ్.మేజర్ జనరల్ మొహమ్మద్ బాగెరీ – ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్.అలీ షమఖానీ – మాజీ జాతీయ భద్రతా చీఫ్.జనరల్ ఘోలం అలీ రషీద్ – ఖతమ్ అల్-అన్బియా రాష్ట్ర ప్రధాన కార్యాలయ అధిపతి.వీళ్లతో పాటు ఆరుగురు ప్రముఖ అణు శాస్త్రవేత్తలు కూడా ఈ దాడుల్లో హతమయ్యారు. వీరిలో అబ్దొల్‌హమీద్ మినౌచెహ్ర్, అహ్మద్రెజా జోల్ఫాఘరీ, అమీర్‌హొస్సేన్ ఫెక్హీ తదితరులు ఉన్నారు. ఈ స్థాయి నాయకుల మరణం ఇరాన్‌కు వ్యూహపరంగా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఇక.. ఇజ్రాయెల్ వైపు ప్రాణనష్టం వివరాలు స్పష్టంగా తెలియరావడం లేదు. కానీ ఇరాన్ క్షిపణి దాడుల వల్ల రాజధాని టెల్ అవీవ్ సహా చాలా ప్రాంతాల్లోప్రాణ నష్టం సంభవించి ఉంటుందనేది ఒక అంచనా. -
అమెరికా దాడి చేస్తుందని ముందే జాగ్రత్తపడిన ఇరాన్
-
ఇరాన్ జెండాలతో వైట్‌హౌజ్ ఆవరణలో ప్రదర్శనలు
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ.. అమెరికా రణరంగంలోకి దిగడంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. ఈ ఉద్రిక్తతల వేళ.. అమెరికా ప్రధాన నగరాల్లో ఇరాన్ మద్దతు ప్రదర్శనలు జరుగుతుండడం తీవ చర్చనీయాంశంగా మారింది. ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం ఆవరణలోనే ట్రంప్ వ్యతిరేక నినాదాలతో ఓ ప్రదర్శన జరగడం గమనార్హం. ఇరాన్‌పై యుద్ధం వద్దు.. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం ఆపండి.. గాజాలో నరమేధం ఆగిపోవాల్సిందే అంటూ అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశించి పలువురు నినాదాలు చేశారు. మరికొందరు ఇరాన్‌కు మద్దతుగా పాటలు పాడుతూ తమ నిరసన గళం విప్పారు. ప్రస్తుతం యుద్ధ వ్యతిరేకత నినాదాలతో అమెరికా ప్రధాన నగరాలు మారుమ్రోగుతున్నాయి.బోస్టన్, చికాగోతో పాటు న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద హ్యాండ్స్ ఆఫ్ ఇరాన్ స్లోగన్లు ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ కొందరు ఈ ప్రదర్శనలు చేపట్టారు. వైట్‌హౌజ్ వద్ద జరిగిన నిరసనల్లో పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దంటూ నినాదాలు చేశారు.HAPPENING NOW 🚨: Anti-war protest in Boston following US strikes in Iran. pic.twitter.com/LRP6wELFtB— Ron Smith (@Ronxyz00) June 22, 2025ఇరాన్‌పై అమెరికా యుద్ధ విమానాలు దాడులు జరిపి.. తిరిగి ఈ ఉదయం వెనక్కి వచ్చాయి. ఆపరేషన్ మిడ్నైట్ హామర్ పేరుతో కేవలం 25 నిమిషాల్లోనే ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలను (ఫోర్దో, ఇస్ఫాహాన్, నటాంజ్) దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో.. యుద్ధ వ్యతిరేక నిరసనలు తీవ్రతరం అయ్యాయి. మరోవైపు.. నిరసనల నేపథ్యంలో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దౌత్య కార్యాలయాలతో పాటు మతపరమైన కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురు నిరసనకారుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.Happening now: Anti-war protesters have started to rally in front of the White House, calling for no war with Iran and an end to U.S. support to Israel. pic.twitter.com/mmenVH1wOG— BreakThrough News (@BTnewsroom) June 18, 2025అయితే అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఇరాన్‌కు భారీ నష్టమే వాటిల్లిందని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ యుద్ధంలో జోక్యంతో అమెరికా ఘోర తప్పిదం చేసిందంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమనీ మండిపడగా.. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో తాము చేపట్టిన యుద్ధం సుదీర్ఘంగా కొనసాగబోదని.. దాడుల్లో తాము లక్ష్యానికి చేరువైనట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ తాజాగా ఓ ప్రకటన చేశారు. వెల్లడించారు.ఇరాన్‌పై అమెరికా బాంబు దాడుల చేసిన తర్వాత.. యుద్ధాన్ని ఆపేది అప్పుడే: నెతన్యాహుఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఫోర్డో అణుకేంద్రాన్ని అమెరికా (USA) తీవ్రంగా ధ్వంసం చేసింది. అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్‌ను వెనక్కి నెట్టాం. ముప్పును తొలగించుకున్నాం. లక్ష్యాలను సాధించడానికి అవసరానికి మించి మా చర్యలను కొనసాగించబోం. మా టార్గెట్‌ను చేరుకుంటే ఆపరేషన్ పూర్తయినట్లే. అప్పుడు యుద్ధం కూడా ఆగుతుంది. ప్రస్తుత ఇరాన్ పాలకులు మమ్మల్ని తుడిచిపెట్టాలని చూశారు. అందుకే ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. ఇందులో ప్రధానంగా మా అస్థిత్వానికి పొంచి ఉన్న రెండు ముప్పులను తొలగించాలనుకున్నాం. ఒకటి అణ్వాయుధాలు.. రెండు బాలిస్టిక్ క్షిపణులు. ఈ లక్ష్యాలను సాధించే దిశగా మేం ఒక్కో అడుగు వేస్తూ ముందుకుసాగుతున్నాం. వాటికి మేం చేరువయ్యాం. టెహ్రాన్‌తో సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగించబోం. అయితే, అనుకున్న ఫలితం రాకముందే పోరాటం నుంచి నిష్క్రమించేది లేదు. ఐరాస స్పందన.. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. అందులో ఐరాసలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ మాట్లాడుతూ.. ‘‘అమెరికా విదేశాంగ విధానాన్ని హైజాక్ చేసి.. నెతన్యాహు అగ్రరాజ్యాన్ని ఈ యుద్ధంలోకి లాగారు. అమెరికా చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగిలిపోనుంది. దౌత్యాన్ని నాశనం చేయడానికి అగ్రరాజ్యం కంకణం కట్టుకుంది. దీనికి సరైన సమయంలో దీటుగా బదులిస్తాం’’ అని హెచ్చరించారు.ఖమేనీ ఏమన్నారంటే.. యూదు శత్రువులు ఘోర తప్పిదం చేశారు. తీవ్ర నేరానికి పాల్పడ్డారు. దీనికి శిక్ష తప్పదు. తక్షణమే శిక్షించాల్సిన అవసరం ఉంది అని అమెరికా పేరును ప్రస్తావించకుండానే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఏమన్నారంటే.. తాజా దాడులకు అగ్రరాజ్యం మూల్యం చెల్లించుకోవాల్సిందే. అమెరికాకు దీటుగా బదులిస్తాం అని అన్నారు. -
Israel-Iran: అణుయుద్ధం.. నిజమెంత?
ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా మెరుపుదాడులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తాజాగా.. సోమవారం తెల్లవారుజామున ఇరాన్ అర గంట వ్యవధిలోనే ఇజ్రాయెల్‌పై 22 క్షిపణులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలామంది మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? అని!. ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలిక కాదు. చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అవేంటో.. ఒక్కటొక్కటిగా చూద్దాం.1.ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి దౌత్యవర్గాల్లో అణుయుద్ధంపై చర్చ జరుగుతూనే ఉంది. దశాబ్దాల తరువాత మధ్యప్రాచ్య పరిస్థితులు అణుయుద్ధానికి దారితీసేలా ఉన్నాయన్న వ్యాఖ్యలూ వినపిస్తున్నాయి. అయితే ఆ దారుణం జరక్కుండా చూసేందుకు ప్రభుత్వాధినేతలు చాలామంది తమవంతు ప్రయత్నాలూ చేస్తున్నారు. 2.‘‘అణుస్థావరాలపై అమెరికా దాడి యుద్ధం ప్రకటించడమే!’’ అని ఇరాన్ చెప్పడమే కాకుండా.. అణ్వాయుధాలకు సంబంధించిన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగే ఆలోచన కూడా చేస్తోంది. 1970 నుంచి అమల్లో ఉన్న ఈ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగడం అంటే.. ఇరాన్ తనకు నచ్చినట్టుగా అణు ఇంధనాన్ని శుద్ధి చేసుకోగలదు. అణ్వాస్త్రాలూ తయారు చేసుకోగలదు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) వంటి ఐరాస సంస్థల పర్యవేక్షణను అనుమతించదన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇరాన్ మరింత వేగంగా అణ్వాయుధాలను తయారు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.3. ఇదిలా ఉంటే ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఏ దేశం ఎటువైపున ఉన్నదన్నది కూడా అణుదాడులు జరిగే అవకాశాలను నిర్ణయిస్తుంది. ఇరాన్‌పై అమెరికా దాడులను రష్యా, చైనా తీవ్రంగా ఖండించాయి. అయితే ప్రస్తుతానికి ఈ రెండు దేశాలూ ఇరాన్‌కు నేరుగా మిలటరీ సాయం చేసే స్థితికి చేరలేదు. టర్కీ, ఖతార్, సౌదీ అరేబియాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మరోవైపు భారత్‌సహా అనేక ఆసియా దేశాలు ఇరు పక్షాలకూ దూరంగా ఉంటున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇరుదేశాలకు సూచిస్తున్నాయి. 4. అమెరికా నిన్న ఇరాన్ అణు స్థావరాలపై బంకర్ బాంబులతో విరుచుకుపడ్డ నేపథ్యంలో ఐఏఈఏ ఒక హెచ్చరిక చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇరాన్-ఇజ్రాయెల్ ప్రాంతంలో రేడియోధార్మిక ప్రభావం పెరిగిపోవడం ఖాయమని స్పష్టం చేసింది. ఫోర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్లలోని అణుస్థావరాలను తాము ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించినప్పటికీ ఆ ప్రాంతాల్లో రేడియోధార్మిక పదార్థాలేవీ లేవని ఇరాన్ ప్రకటించడం కొంత ఊరటనిచ్చే అంశం. సరిగ్గా దాడులు జరిగే ముందే ఇరాన్ ఫర్డో స్థావరం నుంచి సుమారు 400 కిలోల యురేనియం (60 శాతం శుద్ధత కలిగినది. ఆయుధాల తయారీకి కనీసం 90 శాతం శుద్ధమైన యురేనియం 235 అవసరం.)ను అక్కడి నుంచి తరలించినట్లు వార్తలొచ్చాయి. ఇంకోపక్క ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఇజ్రాయెల్ తన వైఖరిని సమర్థించుకోగా.. వాటిని సార్వభౌమత్వంపై దాడులుగా ఇరాన్ అభివర్ణించింది. మొత్తమ్మీద చూస్తే ప్రపంచం అణుయుద్ధపు అంచుల్లో ఉందని చెప్పలేము. ఇప్పటివరకూ యుద్ధం ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాలకే పరిమితమై ఉంది. మధ్యప్రాచ్య దేశాలు, రష్యా, చైనా వంటి అభివృద్ది చెందిన దేశాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇందులో మార్పు లేనంత వరకూ అణుయుద్ధం జరిగే అవకాశం తక్కువే!. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా! -
అణు కేంద్రంలో ఆరు రంధ్రాలు.. ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి
వాషింగ్టన్ డీసీ: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకున్న అమెరికా.. ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతూ ఇరాన్‌లోని అణుస్థావరాలను ధ్వంసం చేసింది. దీనిని ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తూ, అక్కడ ‘అసాధారణ కార్యాచరణ’ సాగినట్లు వెల్లడించాయి. అమెరికా దాడి జరపకముందు, దాడి జరిపిన తరువాతకు సంబంధించిన చిత్రాలు అక్కడి పరిస్థితిని తెలియజేస్తున్నాయి.ఈ వాణిజ్య ఉపగ్రహ చిత్రాలు ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రం యూఎస్ దాడితో తీవ్రంగా దెబ్బతినడాన్ని చూపిస్తున్నాయి. బంకర్-బంకింగ్ బాంబులు పర్వతంలోకి చొచ్చుకుపోయినట్లున్న ఆరు రంధ్రాలు ఈ చిత్రాలలో కనిపిస్తున్నాయి. అలాగే దుమ్ముతో మూసుకుపోయిన భూమిని కూడా చూపిస్తున్నాయి. అమెరికా ఎంఓపీలతో దాడి చేసిందని ఇన్స్టిట్యూట్ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి నాయకత్వం వహిస్తున్న యూఎన్ మాజీ అణు తనిఖీదారు డేవిడ్ ఆల్బ్రైట్ తెలిపారు. ఉపగ్రహ చిత్రాలలో నైపుణ్యం కలిగిన పరిశోధకుడు డెక్కర్ ఎవెలెత్ మాట్లాడుతూ ఈ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అక్కడ జరిగిన నష్టం స్థాయిని అంచనా వేయడానికి తాము మరింతగా అధ్యయనం చేయాలన్నారు.ఇప్పటికైనా టెహ్రాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేస్తుందని తాము భావిస్తున్నామని యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్‌లు పేర్కొన్నాయి. అయితే ఈ దాడికి ముందే ఇరాన్.. ఫోర్డో నుండి యురేనియం నిల్వలను తరలించి ఉండవచ్చని ఇజ్రాయెల్, అమెరికా, ఐక్యరాజ్యసమితి అణు తనిఖీదారులు అనుమానిస్తున్నారు. ఈ ఉపగ్రహ చిత్రాలు మాక్సర్ టెక్నాలజీస్ నుండి వచ్చాయి. కాగా ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనని గత కొంతకాలంగా చెబుతూవస్తోంది.ఇది కూడా చదవండి: Punjab: కారులో భీతావహ దృశ్యం.. స్థిరాస్థి వ్యాపారి ‘క్షణికావేశం’? -
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా మెరుపుదాడి... ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ న్యూక్లియర్ సైట్లు ధ్వంసం... హోర్ముజ్ జలసంధిని మూసేసేందుకు సిద్ధమైన ఇరాన్
-
భారత్‌కు వెళ్తున్నారా? జాగ్రత్త!
వాషింగ్టన్: భారత్‌లో పర్యటించాలనుకునే తమ పౌరులకు అమెరికా కొత్త అడ్వైజరీ జారీ చేసింది. ఇటీవలి కాలంలో అత్యాచారాలు, హింస, ఉగ్రవాదం పెరిగిపోతున్నాయని, భారత్‌కు వెళ్లాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ ప్రభుత్వం సూచించింది. ప్రత్యేకించి మహిళలు ఒంటరిగా ప్రయాణించొద్దని హెచ్చరిస్తూ అమెరికా విదేశాంగ శాఖ లెవల్ 2 సలహా జారీ చేసింది.జూన్ 16న జారీ చేసిన ఈ అడ్వైజరీలో ‘‘భారత్‌లో మరింత జాగ్రత్తగా ఉండండి. కొన్ని ప్రాంతాల్లో నేరాలు, ఉగ్రవాదం పెరిగాయి. అక్కడ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేరాలలో అత్యాచారం ఒకటి. పర్యాటక ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో లైంగిక వేధింపులతో సహా హింసాత్మక నేరాలు జరుగుతాయి. అలాగే పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు/షాపింగ్ మాల్స్‌లో ఎప్పుడైనా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంది’’ అని హెచ్చరించింది.జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన 2 నెలల తర్వాత అమెరికా ఈ కొత్త అడ్వైజరీ విడుదల చేసింది. ‘‘ఉగ్రవాదం, అశాంతి నెలకొన్న కారణంగా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్లో ప్రయాణించవద్దు. తూర్పు లద్దాఖ్, రాజ«దాని లేహ్ తప్ప పర్యాటక ప్రదేశాలైన శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గాం వంటి ప్రాంతాలకు వెళ్లొద్దు. భారత్–పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి హింస సర్వసాధారణం. భారత్–పాక్ మధ్య సాయుధ ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ప్రాంతాలకు ప్రయాణించవద్దు’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.ముఖ్యంగా మహిళలు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. ఒంటరిగా ప్రయాణించవద్దని హెచ్చరించింది. ఇక ‘‘తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో మావోయిస్టు తీవ్రవాద గ్రూపులు చురుకుగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పౌరులకు అత్యవసర సేవలను అందించే సామర్థ్యం అమెరికా ప్రభుత్వానికి లేదు. ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా ఉంటే మంచిది’’ అని సూచించింది. భారత్‌కు వెళ్లాలనుకునేవారు శాటిలైట్ ఫోన్ తీసుకెళ్లొద్దని సలహా ఇచ్చింది.ఖండించిన కాంగ్రెస్.. భారత్ పట్ల అమెరికా వైఖరిని కాంగ్రెస్ ఖండించింది. ఆ దేశ అడ్వైజరీ షాక్ కలిగించడమే కాదు, ఇబ్బందికి గురి చేసిందని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. యూఎస్ ట్రావెల్ అడ్వైజరీ దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. భారత్‌లో మహిళలు ఒంటరిగా ప్రయాణించొద్దని సూచించడం.. ప్రధాని నరేంద్రమోదీ ‘సురక్షిత భారత్’ పతనమైనట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేసింది. -
రష్యా నుంచి పెరిగిన చమురు దిగుమతులు
న్యూఢిల్లీ: రష్యా, అమెరికా నుంచి చమురు దిగుమతులను భారత్ గణనీయంగా పెంచుకుంది. జూన్ నెలలో మధ్యప్రాచ్యం, గల్ఫ్ దేశాల కంటే రష్యా నుంచే అధిక చమురు దిగుమతి కావడం గమనార్హం. మొత్తం మీద ఈ నెలలో రోజువారీ 2–2.2 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకోవచ్చంటూ అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషణ సంస్థ ‘కెప్లెర్’ వెల్లడించింది. గత రెండేళ్ల కాలంలో రష్యా నుంచి ఈ స్థాయి దిగుమతులు తిరిగి ఈ నెలలోనే అధికమయ్యాయని వివరించింది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌కు మించి రష్యా నుంచి దిగుమతులే అధికంగా ఉన్నట్టు తెలిపింది. మే నెలలో రష్యా నుంచి చమురు దిగుమతులు రోజువారీగా 1.96 మిలియన్ బ్యారెల్స్‌గా ఉన్నాయి. మరోవైపు అమెరికా నుంచి ఈ నెలలో రోజువారీ 4,39,000 బ్యారెళ్ల చమురు దిగుమతి కాగా, గత నెలలో ఇది 2,80,000 బ్యారెల్స్‌గానే ఉండడం గమనార్హం. మధ్యప్రాచ్యం నుంచి భారత్‌కు ఈ నెల మొత్తంమీద చమురు దిగుమతులు సగటున రోజువారీ 2 మిలియన్ బ్యారెళ్లుగా ఉండొచ్చన్నది కెప్లెర్ నివేదిక అంచనా. చమురు దిగుమతుల్లో ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో ఉంది. రోజువారీ 5.1 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. సంప్రదాయంగా మధ్యప్రాచ్యం, గల్ఫ్ దేశాల నుంచే భారత్ అధికంగా చమురు దిగుమతి చేసుకునేది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం మారిన సమీకరణాల నేపథ్యంలో.. రష్యా నుంచి చమురు దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. అంతకుముందు మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతమే ఉండగా, ఆ తర్వాత 40–44 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ ధర కంటే తక్కువ రేటుకే చమురును భారత్‌కు రష్యా ఆఫర్ చేయడం గమనార్హం. సరఫరాపై ప్రభావం పడొచ్చు.. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇప్పటి వరకు మధ్యప్రాచ్యం నుంచి చమురు సరఫరాలపై లేదని కెప్లెర్ నివేదిక స్పష్టం చేసింది. వెసెల్స్ కార్యకలాపాలను గమనిస్తే రానున్న రజుల్లో సరఫరా తగ్గే అవకాశం కనిపిస్తున్నట్టు కెప్లెర్ ముఖ్య పరిశోధన విశ్లేషకుడు సుమిత్ రితోలియా తెలిపారు. షిప్ యజమానులు గల్ఫ్ ప్రాంతానికి ఖాళీ ట్యాంకర్లు పంపేందుకు వెనుకాడుతున్నట్టు, దీంతో వెసెల్స్ సరఫరా 69 నుంచి 40కు తగ్గినట్టు తెలిపారు. దీంతో సమీప కాలంలో సరఫరాలు కఠినంగా మారొచ్చని.. ఇది భారత దిగుమతుల్లో సర్దుబాట్లకు దారితీయొచ్చని అంచనా వేశారు. హర్ముజ్ జలసంధిని మూసివేస్తామంటూ ఇరాన్ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ జలసంధి ద్వారానే వస్తోంది. మన దేశ ముడి చమురు దిగుమతుల్లో 40 శాతం, ఎల్ఎన్జీ దిగుమతుల్లో సగం సరఫరా ఈ ప్రాంతం నుంచే ఉంటోంది. ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి మూసివేసే రిస్క్ ఉందని.. అదే సమయంలో పూర్తిస్థాయి దిగ్బంధనం అవకాశాలు తక్కువే ఉండొచ్చని కెప్లెర్ నివేదిక తెలిపింది. ఎందుకంటే ఇరాన్‌కు చైనా అతిపెద్ద కస్టమర్‌గా ఉందని, చైనా సముద్ర మార్గ చమురు దిగుమతుల్లో 47% ఇరాన్ నుంచే వస్తుండడాన్ని ప్రస్తావించింది. ఇరాన్ 96% చమురు ఎగుమతులు ఈ జలసంధి నుంచే ఉంటున్నందున పూర్తిస్థాయి దగ్బంధనం ఇరాన్‌కే నష్టం కలిగిస్తుందని పేర్కొంది. -
25నిమిషాల్లో ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’
వాషింగ్టన్: ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’ విజయవంతమైందని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డేనియల్ కెయినీ చెప్పారు. ఈ మొత్తం ఆపరేషన్ కేవలం 25 నిమిషాల్లోనే ముగిసిందని తెలిపారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ సైన్యానికి ఇరాన్లో గగన తల రక్షణ వ్యవస్థ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదని, ఆపరేషన్ పూర్తయిన వెంటనే తమ విమానాలు క్షేమంగా తిరిగివచ్చా యని స్పష్టం చేశారు. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామ ర్లో ఏడు స్టెల్త్ బి–2 బాంబర్లు పాల్గొన్నాయని తెలిపా రు. ఈ బాంబర్లు 14 భారీ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబులను(బరువు 13,600 కిలోలు) ఫోర్డో, నతాంజ్ అణు కేంద్రాలపై జారవిడిచాయని పేర్కొన్నారు. అలాగే టోమాహాక్ క్షిపణులు ఇస్ఫహాన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేశాయని వివరించారు. ఏడు బి–2 స్పిరిట్ బాంబర్లు ‘‘2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత బి–2 స్టెల్త్ బాంబర్లు ఈ స్థాయిలో భారీ ఆపరేషన్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. మిస్సోరీ నుచి బాంబర్లు బయలుదేరాయి. అమె రికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6.40 గంటలకు మూడు అణు కేంద్రాలపై దాడులు మొదల య్యాయి. 7.05 గంటలకు మా విమానాలు ఇరాన్ గగనతలం నుంచి బయటకు వచ్చేశాయి. 14 బంకర్– బస్టర్ బాంబులు, 24కుపైగా టోమాహాక్ క్షిపణులు ప్రయో గించాం. పశ్చిమాసి యాలో ఇటీవల ఉద్రిక్తతలు ప్రారంభమైన అనంతరం ఇరాన్‌పై మా అతిపెద్ద దాడి ఇదే. ఏడు బి–2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడ్డాం. ఒక్కోదాంట్లో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. నిశ్శబ్దంగా వెళ్లి పని పూర్తి చేసుకొని వచ్చారు. కొద్దిమందికే తెలుసు ఇరాన్‌పై ఆపరేషన్ గురించి అమెరికా ప్రభుత్వ ముఖ్యుల్లో, సైనిక వ్యూహకర్తల్లో చాలా కొద్దిమందికే తెలుసు. అమెరికా జలాంతర్గామి నుంచి ఇస్ఫహాన్ అణు కేంద్రంపై 24కుపైగా టోమాహాక్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైళ్లు ప్రయోగించాం. ఉపరితలంపైనున్న మౌ లిక సదుపాయాలను నేలమట్టం చేశాం. సాయంత్రం 6.40 గంటలకు బి–2 బాంబర్లు రెండు భారీ బంకర్–బస్టర్ బాంబులను ఫోర్డో న్యూక్లియర్ సైట్‌పై జారవిడిచాయి. మిగిలిన బాంబర్లు వాటి లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. చివరి దాడి ఇస్పహాన్పై టోమాహాక్ క్షిపణితో జరిగింది. రాత్రి 7.05 గంటల కల్లా ఆపరేషన్ ముగిసింది. ఇరాన్‌కు చెందిన సర్ఫేస్–టు–ఎయిర్ క్షిపణి వ్యవస్థ మా యుద్ధ విమానాల రాకను గుర్తించలేదు’’ అని డాన్ కెయినీ వివరించారు.ఆపరేషన్ విజయవంతం: పీట్ హెగ్సెత్ ఇరాన్‌పై ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’ పూర్తిస్థాయిలో విజయవంతమైందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. మూడు ఇరాన్ అణు కేంద్రాలు నాశనమయ్యాయని అన్నారు. ఇరాన్ అణ్వయుధాలు దక్కించుకోవడానికి వీల్లేదని డొనాల్డ్ ట్రంప్ మొదటనుంచీ చెబుతూనే ఉన్నారని గుర్తుచేశారు. ఇరాన్‌తో యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదన్నారు. ఇరాన్ ప్రభుత్వం చర్చలకు ముందుకు వస్తుందని భావిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ చెప్పారు. చర్చలకు ఇరాన్‌ను ఒప్పించాలంటూ డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో ఇప్పటివరకు 430 మంది మరణించారని, 3,500 మంది గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నౌర్న్యూస్ వెల్లడించింది. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 24 మంది మృతిచెందారని, 1,272 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఏమిటీ టోమాహాక్ క్షిపణులు?అమెరికా నావికా దళంలో కీలకమైనవి బీజీఎం–109 టోమాహాక్ ల్యాండ్ అటాక్ లాంగ్రేంజ్ మిస్సైళ్లు. యుద్ధనౌకలు, జలాంతర్గాముల నుంచి వీటిని అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో భూఉపరితలంపైనున్న లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. 1970వ దశకంలో తొలిసారిగా జనరల్ డైనమిక్స్ కంపెనీ తయారుచేసింది. 12కుపై వేరి యంట్లు ఉన్నాయి. టోమాహాక్ క్షిపణి బరువు 1,300 కిలోలు. బూస్టర్‌తో కలిపి రూ.1,600 కిలోలు. పొడవు 5.56 మీటర్లు గంటకు 920 కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణించి 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.మాట వినకపోతే మళ్లీ దాడులు: ట్రంప్వాషింగ్టన్: ఇరాన్లో కీలకమైన అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని, శిథిలా లుగా మార్చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మూడు అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసిన అనంతరం శనివారం రాత్రి ట్రంప్ వైస్హౌస్లో మాట్లాడారు. అమెరికాపై ప్రతీకార దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్‌ను హెచ్చరించారు. శాంతి కావాలో, యుద్ధం కావాలో తేల్చుకోవాలని ఆ దేశానికి సూచించారు. భీకర స్థాయి దాడులతో ఇరాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పే శక్తి అమెరికాకు మాత్రమే ఉందన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ ఒక దుష్టశక్తిగా మారిందని, ఇతర దేశాలకు ప్రమాదకరంగా పరిణమించిందని మండిపడ్డారు. మాట వినకపోతే ఇకపై జరగబోయే దాడులు మరింత భయాన కంగా ఉంటాయని ఇరాన్‌కు తేల్చిచెప్పారు.ట్రంప్ నిర్ణయం అద్భుతం: నెతన్యాహూజెరూసలేం: ఇరాన్ అణు కేంద్రాలపై అమె రికా దాడి చేయడం పట్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెత న్యాహు హర్షం వ్యక్తంచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. శాంతి కోసమే ఇరాన్‌పై బలప్రయోగం చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఈ దాడులతో పశ్చిమాసియాలో రాబోయే రోజుల్లో శాంతి, సౌభాగ్యం, స్థిరత్వం, భద్రత చేకూరుతాయని స్పష్టంచేశారు. నెతన్యాహు ఆదివారం మీడియాతో మాట్లాడారు. చరిత్రను మలుపు తిప్పే నిర్ణయం తీసుకుందని అమెరికాను కొనియాడారు. ప్రపంచంలో ఏ దేశం కూడా చేయలేని సాహసోపేత కార్యాన్ని అమెరికా చేసి చూపించిందని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలతో ప్రాణాంతక శక్తిగా మారిన ఇరాన్‌కు బుద్ధి చెప్పిన గొప్ప నాయకుడిగా డొనాల్డ్ ట్రంప్‌ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఉద్ఘాటించారు.బాధ్యతారాహిత్యంఅమెరికాపై రష్యా ధ్వజంమాస్కో/బీజింగ్: ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై భారీ బాంబులతో అమెరికా జరిపిన దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే అనేక సంక్షోభాలతో అట్టుకుతున్న పశ్చిమాసియాను మరింత ప్రమాదంలోకి నెట్టడమేనని పేర్కొంది. అమెరికా తన బాధ్యతారాహిత్యంతో అంతర్జాతీయ చట్టాలు, ఐరాస పీఠికను, తీర్మానాలను ఉల్లంఘించిందని మండిపడింది. ‘ఒక సార్వభౌమ దేశంపై క్షిపణులు, బాంబులతో దాడులు చేయడం బాధ్యతారహిత చర్య. దీనిని సమర్థించుకునేందుకు ఎన్ని వాదనలు వినిపించినా సరే, ఇది అంతర్జాతీయ చట్టాలకు ఐరాస చార్టర్, భద్రతా మండలి తీర్మానాలను తీవ్రంగా ఉల్లంఘించడమే. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశం ఈ దాడులు చేయడం ఆందోళనకరం’అని అమెరికా పేరును ప్రస్తావించకుండా పేర్కొంది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరి కా బాంబు దాడులను చైనా సైతం తీవ్రంగా ఖండించింది. ఐరాస చార్టర్‌ను ఉల్లంఘించిన అమెరికా పశ్చిమాసియాలో ఉద్రిక్తత లను మరింత రాజేసిందని పేర్కొంది.