అమెరికాలో నివశిస్తున్న ఓ భారత సంతతి వ్యక్తి చేసిన పోస్ట్ నెట్టింట అందర్నీ అమితంగా ఆకర్షించింది. ఓ పక్క అమెరికాను మెచ్చుకుంటూనే.. భారత్‌పై ఉన్న తన ఇష్టాన్ని గురించి కూడా వివరించాడు. అతడి పోస్ట్ అత్యంత ఆలోచనాత్మకంగ..విదేశాల్లో ఉండే సౌకర్యాలు, అక్కడి తీరు తెన్నులు..వలస వచ్చిన భారతీయలుకు ఎలాంటి ఛాలెంజ్‌లు, అవకాశాలు అందిస్తుందో వివరించాడు. ఈ పోస్ట్ ఎన్నారైలందర్నీ బాగా ఆకట్టుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి పోస్ట్‌లో ఏం రాశాడంటే..
యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఇన్వెస్టర్ వేణు తాను అమెరికా వెళ్లడంతో తన జీవిత గమనం ఎలా పూర్తిగా మారిపోయిందో షేర్ చేసుకున్నారు. అమెరికాలో లభించే అవకాశాల గురించి ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాను అమెరికాలో సక్సెస్ అందుకున్నప్పటికీ..తాను పుట్టిన మాతృగడ్డ భారతదేశాన్ని జీవిత కాలం ప్రేమిస్తానంటూ దేశభక్తిని కూడా చాటుకున్నారు.
ఆయన పోస్ట్‌లో తాను అమెరికాకు వెళ్లడాన్ని తన జీవిత గమనాన్ని ఊహించని విధంగా మార్చేసిన అరుదైన అవకాశంగా అభివర్ణించారు. "కృషి, క్రమశిక్షణ, స్థిరత్వానికి ప్రతిఫలమిచ్చే అమెరికన్ వ్యవస్థను ఎంతగానో కొనియాడారు. కష్టపడి పనిచేయడానికి ఇష్టపడే వ్యక్తులు, ముఖ్యంగా రిస్కులు తీసుకోవడానికి సిద్ధపడే వారికి, ఓపికతో ఉండేవారికి తప్పక మంచి ఫలితాలు అందించి లైఫ్‌నే అద్భుతంగా మార్చుకునే అద్భుత అవకాశాన్ని అందిస్తుందని పోస్ట్‌లో వేణు రాసుకొచ్చారు.
అంతేగాదు చాలామంది ఇతర దేశాల్లో జీవితాన్ని అనుభవించకుండానే అమెరికాని విమర్శిస్తుంటారని కూడా అన్నారు. ప్రపంచంలో మరోవైపు నిశిసించిన తర్వాత..ఈ స్థాయి అవకాశం ఎంత అరుదైనదో అర్థమవుతుంది. ఇక్కడ జన్మించడం లేదా ఇక్కడే మంచిగా జీవితాన్ని నిర్మించుకోవడం ఓ అద్భుతమైన ప్రయోజనమని అందుకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటానంటూ తన పోస్ట్‌ని ముగించారు.
ఈ పోస్ట్ భారతీయ ప్రవాసులలో చాలామందిని ఆకట్టుకుంది. అతడి పోస్ట్‌లోని కృతజ్ఞత, అమెరికన్ డ్రీమ్ గురించి అతడు రాసిన విలువైన భావాలు ప్రతి భారతీయుడి మనసుని తాకడమే గాక భారత వలసదారుల నుంచి పెద్ద ఎత్తున మద్దతులో కూడిన స్పందన రావడం విశేషం. సోదరా మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ అంటూ పోస్టులు కూడా పెట్టారు.
Since it’s a long weekend, a small thought.
I’m genuinely grateful to the United States. It was a one-time opportunity that completely changed my life. I love India and always will, but coming here altered my trajectory in ways I couldn’t have imagined.
This country rewards…— Venu (@Venu_7_) January 19, 2026
(చదవండి: కళ్లకు గంతలు...సహా ఆ సిటీలో వెరైటీ డేటింగ్స్ ఎన్నో...)


