అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు' వేడుక.. ఫొటోలు, వీడియో వైరల్ | Allu Sirish Pellikoduku Celebrations And Pics | Sakshi
Sakshi News home page

Allu Sirish: సందడిగా శిరీష్ పెళ్లి కొడుకు సెలబ్రేషన్స్

Mar 1 2026 8:18 PM | Updated on Mar 2 2026 1:07 PM

Allu Sirish Pellikoduku Celebrations And Pics

రీసెంట్‌గానే టాలీవుడ్‌కి చెందిన విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మరో హీరో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ వివాహం.. ఈ శుక్రవారం హైదరాబాద్‪‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుంది. నయనిక అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాడు. గత కొన్నిరోజులుగా బ్యాచిలర్ పార్టీ, కాక్‌టెయిల్ పార్టీలంటూ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇప్పుడు శిరీష్‌ని పెళ్లి కొడుకుగా తయారు చేసిన వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ పెళ్లి వేడుకలో అల్లు ఫ్యామిలీ అంతా సందడి చేశారు. అలానే మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, ఉపాసన, చిరంజీవి భార్య సురేఖ, నిహారిక తదితరులు పాల్గొన్నారు. కొత్తగా పెళ్లయిన విజయ్ దేవరకొండ-రష్మిక కూడా ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు. హీరో బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా ఈ శుభకార్యంలో కనిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement