అల్లు అర్జున్‌తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా | Actress Hariteja Reacts On Acting Experience With Allu Arjun In DJ Movie, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

Hariteja: అల్లు అర్జున్ అలా చెప్పేసరికి ఎగిరి గంతేశాను

Mar 1 2026 5:25 PM | Updated on Mar 1 2026 6:34 PM

Actress Hariteja Reacts Acting With Allu Arjun DJ Movie

సాధారణంగా యాంకర్స్, సీరియల్ నటులు.. సినిమాల్లో ఛాన్సులు దక్కించుకునేందుకు చాలానే కష్టపడుతుంటారు. వీళ్లలో కొందరికి అప్పుడప్పుడు ఊహించని అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలాంటి వాళ్లలో హరితేజ ఒకరు. 20కి పైగా సీరియల్స్‌లో నటించిన యాంకర్‌గానూ పలు ఈవెంట్స్ హోస్టింగ్ చేసింది. బిగ్‌బాస్ తొలి సీజన్‌లో పాల్గొని ఫినాలే వరకు వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వరసగా పలు తెలుగు సినిమాల్లో సహాయ పాత్రల్లో కనిపించింది. కొన్నిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. అల్లు అర్జున్ మూవీలో ఛాన్స్ రావడంతో తను ఎలాంటి సాహసం చేశానో బయటపెట్టింది.

(ఇదీ చదవండి: శరత్ కుమార్ రెండో భార్యని తెగ పొగిడేసిన మొదటి భార్య)

'అల్లు అర్జున్ పక్కన స్లిమ్, ఫెర్ఫెక్ట్‌గా కనిపించాలని పెద్ద నిర్ణయం తీసుకున్నాను. 'డీజే'(దువ్వాడ జగన్నాథం)లో అవకాశం వచ్చిన తర్వాత స్లిమ్‌గా కనిపించాలని వరసగా 15 రోజులు ఆహారం తినడం మానేశాను. కేవలం లిక్వ్‌డ్ డైటే తీసుకున్నాను. దాంతో కొంత సన్నబడి సినిమాలో బాగానే కనిపించాను. షూటింగ్ రేపు ఉందనగా ముందురోజు ఉత్సాహంతో నిద్ర కూడా పట్టలేదు. ఇక సెట్‌లో జరిగిన సంఘటన అయితే జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. సెట్‌కి వెళ్లగానే అల్లు అర్జున్,నా దగ్గరకు వచ్చి 'బిగ్‌బాస్'లో నీ ఫెర్ఫార్మెన్స్ చూశాను. నీ వర్క్ చాలా నచ్చింది' అని అన్నారు. ఆ మాట వినగానే ఎగిరి గంతేశాను' అని హరితేజ.. బన్నీతో పనిచేసిన అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

బిగ్‌బాస్ షో నుంచి బయటకొచ్చిన తర్వాత అఆ, రాజా ది గ్రేట్ తదితర సినిమాల్లో కాస్త గుర్తింపు ఉన్న పాత్రలు హరితేజ చేసింది. తర్వాత పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల క్రితమే కూతురు పుట్టడంతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. బిగ్‌బాస్ 8వ సీజన్‪‌లో వైల్డ్ కార్ట్ ఎంట్రీగా మళ్లీ వచ్చింది గానీ పెద్దగా మెప్పించకలేకపోయింది. ఏదేమైనా బన్నీ గురించి చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: చాన్నాళ్లకు టాలీవుడ్ ఫిబ్రవరి సెంటిమెంట్ బ్రేక్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement