చాన్నాళ్లకు టాలీవుడ్ ఫిబ్రవరి సెంటిమెంట్ బ్రేక్ | February 2026 Tollywood Releases Fail To Impress, A Break In The Sentiment, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Feb Movies: ఒక్కటి తప్పితే మిగతా వాటి పరిస్థితి సేమ్

Mar 1 2026 4:42 PM | Updated on Mar 1 2026 6:16 PM

 February 2026 Telugu Movie And Result

సాధారణంగా ఫిబ్రవరి నెలలో టాలీవుడ్‌ పెద్ద సినిమాలేం రిలీజ్ పెట్టుకోవు. ఎందుకంటే అంతకు కొన్నిరోజుల ముందే సంక్రాంతి ఉంటుంది. ఆ టైంలో స్టార్ హీరో తమ మూవీస్ విడుదల చేసి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తుంటారు. దీంతో ఫిబ్రవరిలో దాదాపుగా మిడ్ రేంజ్ లేదా చిన్న చిత్రాలే విడుదల అవుతుంటాయి. ఈసారి కూడా అలానే వచ్చాయి కానీ ఓ సెంటిమెంట్ బ్రేక్ అయింది. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: నచ్చినవాడితో జీవితం పంచుకుంటా.. త్రిష ఓల్డ్‌ కామెంట్స్‌ వైరల్‌)

ఫిబ్రవరి తొలివారంలో చిన్న సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో కాస్తోకూస్తో చెప్పుకదగ్గది అంటే గుణశేఖర్ తీసిన 'యుఫోరియా'నే. చాన్నాళ్ల తర్వాత తన స్టైల్ మార్చి, ట్రెండీ యూత్ సబ్జెక్ట్‌తో మూవీ తీసినప్పటికీ ఫ్లాప్ అయింది. కమ్ బ్యాక్ ఇద్దామనుకున్నా సీనియర్ దర్శకుడికి నిరాశే ఎదురైంది. ఇవి కాకుండా విత్ లవ్, బరాబర్ ప్రేమిస్తా, ఆపరేషన్ పద్మ, బ్లడ్ రోజెస్, లగ్గం టైమ్, ఎర్రచీర తదితర మూవీస్ రిలీజయ్యాయి కానీ ఇవన్నీ కూడా డిజాస్టర్స్ అయ్యాయి.

రెండోవారం విశ్వక్ సేన్-అనుదీప్ కాంబోలో 'ఫంకీ', సంతోష్ శోభన్ 'కపుల్ ఫ్రెండ్లీ' రిలీజ్ కాగా.. వీటిలో హిట్ అవుతుందనుకున్న ఫంకీ ఘోరమైన డిజాస్టర్ అయింది. ఏ మాత్రం అంచనాల్లేని 'కపుల్ ఫ్రెండ్లీ' సక్సెస్ అందుకుంది. హిట్ అనిపించుకుని ఊహించిన దానికంటే కాస్త ఎక్కువగాగనే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సీనియర్ నటుడు అర్జున్ దర్శకుడిగా మారి, కూతురినే హీరోయిన్‌గా పెట్టి తీసిన 'సీతా పయనం' కూడా ఫ్లాప్ అయింది. వీటితో పాటు అమరావతికి ఆహ్వానం, స్కై, నిలవే కూడా ఏ మాత్రం నిలబడలేకపోయాయి.

(ఇదీ చదవండి: హీరో విజయ్‌ను అన్‌ఫాలో కొట్టిన కుమారుడు!)

మూడోవారంలో సుహాస్ 'హే బలవంత్', నవాబ్ కేఫ్ మూవీస్ వచ్చాయి. వీటిలో సుహాస్ సినిమా బాగుందని అన్నారు గానీ జనాలు ఎందుకో దీన్ని లైట్ తీసుకున్నారు. ఇక నవాబ్ కేఫ్ అయితే తొలిరోజుకే ఫ్లాప్ టాక్ ముద్ర వేయించుకుంది. చివరి వారం శ్రీ విష్ణు హీరోగా నటించిన 'విష్ణు విన్యాసం' అనే కామెడీ మూవీ రిలీజైంది. సోలో విడుదల కావడంతో ఏమైనా కలిసొస్తుందేమో అనుకున్నారు. ఇందులో కామెడీ ఏ మాత్రం నవ్వేలా లేకపోవడంతో జనాలు దీన్ని కూడా రిజెక్ట్ చేసినట్లే కనిపిస్తున్నారు. రేపటికల్లా దీని అసలు రిజల్ట్ ఏంటనేది తేలుతుంది.

ఓవరాల్‌గా ఫిబ్రవరి నెలలో 20 సినిమాలు, థియేటర్లలోకి వస్తే ఒక్క 'కపుల్ ఫ్రెండ్లీ' మాత్రమే ఆకట్టుకుంది. కానీ ఇది మరీ అంత సూపర్ హిట్ అయితే కాలేకపోయింది. గత కొన్నాళ్ల నుంచి తీసుకుంటే 2020లో భీష్మ, 2021లో ఉప్పెన, 2022లో డీజే టిల్లు, 2023లో సర్, 2024లో ఊరిపేరు భైరవకోన, 2025లో తండేల్.. సక్సెస్ కావడంతో పాటు మంచి వసూళ్లు కూడా అందుకున్నాయి. ఈసారి మాత్రం అలాంటి మ్యాజిక్ ఏ సినిమా విషయంలోనూ జరగలేదు. తద్వారా కొన్నేళ్ల పాటు సాగిన సెంటిమెంట్ బ్రేక్ అయింది!

(ఇదీ చదవండి: శరత్ కుమార్ రెండో భార్యని తెగ పొగిడేసిన మొదటి భార్య)

Advertisement
 
Advertisement
Advertisement