Vishnu Vinyasam Movie
-
వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2' హవా కొనసాగుతోంది. దీని దెబ్బకు పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్'ని అభిమానులు తప్పితే మరెవరు పట్టించుకోవట్లేదు. మరోవైపు ఓటీటీల్లోనూ చూసేందుకు ఏకంగా 26 సినిమాలు/వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి. వీటిలో తెలుగు, డబ్బింగ్ మూవీస్ చాలానే ఉన్నాయి.(ఇదీ చదవండి: ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..)ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే విష్ణు విన్యాసం, అమరావతికి ఆహ్వానం, బోర్డర్ 2, సీతా పయనం చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చిందంటే?ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు-వెబ్ సిరీస్‌లు (మార్చి 20)అమెజాన్ ప్రైమ్విష్ణు విన్యాసం - తెలుగు సినిమాడెడ్లోచ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్లగ్నచ షాట్ - మరాఠీ సినిమా (రెంట్)లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ డెన్మార్క్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ఆంఖోంఖి గుస్తాకియాన్ - హిందీ మూవీమై లార్డ్ - తమిళ సినిమాద హౌస్ మెయిడ్ - ఇంగ్లీష్ మూవీఅమోర్ యానిమల్ సీజన్ 1 - స్పానిష్ సిరీస్కంపెనీ రిట్రీట్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్వైల్డ్ క్యాట్ - ఇంగ్లీష్ సినిమాస్ట్రే కిడ్స్ - ఇంగ్లీష్ కన్సర్ట్ మూవీనెట్ఫ్లిక్స్బోర్డర్ 2 - హిందీ సినిమాపీకీ బ్లండర్స్: ద ఇమ్మొర్టల్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీద రైజ్ ఆఫ్ ద రెడ్ హాట్ చిల్లీ పెప్పర్స్ - ఇంగ్లీష్ సినిమాఏ డిఫరెంట్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీహాట్స్టార్చిరైయా - తెలుగు డబ్బింగ్ సిరీస్జీ5కాసర్గోడ్ ఎంబసీ సీజన్ 1 - మలయాళ సిరీస్ల్యాండ్ లార్డ్ - కన్నడఅగ అగ సునాబై! కాయ్ మహంతాయ్ ససుబాయ్ - మరాఠీ సినిమాసన్ నెక్స్ట్వలవార - కన్నడ చిత్రంసీతాపయనం - తెలుగు మూవీఫోర్త్ ఫ్లోర్ - తమిళ సినిమాఆపిల్ టీవీ ప్లస్వండర్ పెట్స్ - ఇంగ్లీష్ సిరీస్ఆహాఅమరావతికి ఆహ్వానం - తెలుగు సినిమామనోరమ మ్యాక్స్రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్ - మలయాళ మూవీసోనీ లివ్ద జాజ్ సిటీ - తెలుగు సిరీస్(ఇదీ చదవండి: పక్క రాష్ట్రం వెనుకంజలో ఉంది: చిరంజీవి) -
సర్ఫ్రైజ్.. మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా
టాలీవుడ్లో విభిన్న కథలను ఎంచుకుంటూ వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ఏకైక హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీ విష్ణు.. ఆయన నటించిన తాజా చిత్రం ‘ విష్ణు విన్యాసం సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఫిబ్రవరి 27, 2026న విడుదలైన ఈ సినిమాకు థియేటర్స్‌లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో శ్రీవిష్ణుకు జోడిగా నయన్ సారిక నటించగా.. సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేశ్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రలలో మెప్పించారు.థియేటర్లలో విడుదలైన కేవలం మూడు వారాలకే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో విష్ణు విన్యాసం మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి బహుళ భాషల్లో అందుబాటులో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ మూవీకి పాన్-ఇండియన్ ఓటీటీ విడుదల లభించడంతో శ్రీ విష్ణు పేరు ఎక్కువమంది ప్రేక్షకులకు చేరడానికి సహాయపడుతుంది.కథేంటంటే..విష్ణు(శ్రీవిష్ణు) ఓ జూనియర్ లెక్చరర్. జాతకాల పిచ్చి. ఎంతలా అంటే.. వాస్తు బాగోలేదని పక్కింటి వాళ్ల ఇంట్లోని వాష్‌రూమ్‌ని వాడుకునేంత. తనకున్న మూఢనమ్మకాల పిచ్చితో 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోడు. అతన్ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది మరో లెక్చరర్ మనీషా(నయనసారిక). ఆమె అలవాటు, ప్రవర్తన చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ.. విష్ణు కూడా ఆమెను ఇష్టపడతాడు. పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యే ముందు మనీషా ఓ నిజాన్ని రివీల్ చేస్తుంది. అదేంటి? ఆ నిజం తెలిసిన తర్వాత వీరిద్దరి లవ్‌స్టోరీలో వచ్చిన మలుపులు ఏంటి? చివరికి విష్ణు, మనీషాలు పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
చాన్నాళ్లకు టాలీవుడ్ ఫిబ్రవరి సెంటిమెంట్ బ్రేక్
సాధారణంగా ఫిబ్రవరి నెలలో టాలీవుడ్ పెద్ద సినిమాలేం రిలీజ్ పెట్టుకోవు. ఎందుకంటే అంతకు కొన్నిరోజుల ముందే సంక్రాంతి ఉంటుంది. ఆ టైంలో స్టార్ హీరో తమ మూవీస్ విడుదల చేసి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంటారు. దీంతో ఫిబ్రవరిలో దాదాపుగా మిడ్ రేంజ్ లేదా చిన్న చిత్రాలే విడుదల అవుతుంటాయి. ఈసారి కూడా అలానే వచ్చాయి కానీ ఓ సెంటిమెంట్ బ్రేక్ అయింది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: నచ్చినవాడితో జీవితం పంచుకుంటా.. త్రిష ఓల్డ్ కామెంట్స్ వైరల్)ఫిబ్రవరి తొలివారంలో చిన్న సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో కాస్తోకూస్తో చెప్పుకదగ్గది అంటే గుణశేఖర్ తీసిన 'యుఫోరియా'నే. చాన్నాళ్ల తర్వాత తన స్టైల్ మార్చి, ట్రెండీ యూత్ సబ్జెక్ట్‌తో మూవీ తీసినప్పటికీ ఫ్లాప్ అయింది. కమ్ బ్యాక్ ఇద్దామనుకున్నా సీనియర్ దర్శకుడికి నిరాశే ఎదురైంది. ఇవి కాకుండా విత్ లవ్, బరాబర్ ప్రేమిస్తా, ఆపరేషన్ పద్మ, బ్లడ్ రోజెస్, లగ్గం టైమ్, ఎర్రచీర తదితర మూవీస్ రిలీజయ్యాయి కానీ ఇవన్నీ కూడా డిజాస్టర్స్ అయ్యాయి.రెండోవారం విశ్వక్ సేన్-అనుదీప్ కాంబోలో 'ఫంకీ', సంతోష్ శోభన్ 'కపుల్ ఫ్రెండ్లీ' రిలీజ్ కాగా.. వీటిలో హిట్ అవుతుందనుకున్న ఫంకీ ఘోరమైన డిజాస్టర్ అయింది. ఏ మాత్రం అంచనాల్లేని 'కపుల్ ఫ్రెండ్లీ' సక్సెస్ అందుకుంది. హిట్ అనిపించుకుని ఊహించిన దానికంటే కాస్త ఎక్కువగాగనే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సీనియర్ నటుడు అర్జున్ దర్శకుడిగా మారి, కూతురినే హీరోయిన్గా పెట్టి తీసిన 'సీతా పయనం' కూడా ఫ్లాప్ అయింది. వీటితో పాటు అమరావతికి ఆహ్వానం, స్కై, నిలవే కూడా ఏ మాత్రం నిలబడలేకపోయాయి.(ఇదీ చదవండి: హీరో విజయ్ను అన్‌ఫాలో కొట్టిన కుమారుడు!)మూడోవారంలో సుహాస్ 'హే బలవంత్', నవాబ్ కేఫ్ మూవీస్ వచ్చాయి. వీటిలో సుహాస్ సినిమా బాగుందని అన్నారు గానీ జనాలు ఎందుకో దీన్ని లైట్ తీసుకున్నారు. ఇక నవాబ్ కేఫ్ అయితే తొలిరోజుకే ఫ్లాప్ టాక్ ముద్ర వేయించుకుంది. చివరి వారం శ్రీ విష్ణు హీరోగా నటించిన 'విష్ణు విన్యాసం' అనే కామెడీ మూవీ రిలీజైంది. సోలో విడుదల కావడంతో ఏమైనా కలిసొస్తుందేమో అనుకున్నారు. ఇందులో కామెడీ ఏ మాత్రం నవ్వేలా లేకపోవడంతో జనాలు దీన్ని కూడా రిజెక్ట్ చేసినట్లే కనిపిస్తున్నారు. రేపటికల్లా దీని అసలు రిజల్ట్ ఏంటనేది తేలుతుంది.ఓవరాల్‌గా ఫిబ్రవరి నెలలో 20 సినిమాలు, థియేటర్లలోకి వస్తే ఒక్క 'కపుల్ ఫ్రెండ్లీ' మాత్రమే ఆకట్టుకుంది. కానీ ఇది మరీ అంత సూపర్ హిట్ అయితే కాలేకపోయింది. గత కొన్నాళ్ల నుంచి తీసుకుంటే 2020లో భీష్మ, 2021లో ఉప్పెన, 2022లో డీజే టిల్లు, 2023లో సర్, 2024లో ఊరిపేరు భైరవకోన, 2025లో తండేల్.. సక్సెస్ కావడంతో పాటు మంచి వసూళ్లు కూడా అందుకున్నాయి. ఈసారి మాత్రం అలాంటి మ్యాజిక్ ఏ సినిమా విషయంలోనూ జరగలేదు. తద్వారా కొన్నేళ్ల పాటు సాగిన సెంటిమెంట్ బ్రేక్ అయింది!(ఇదీ చదవండి: శరత్ కుమార్ రెండో భార్యని తెగ పొగిడేసిన మొదటి భార్య) -
‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్: రెండో రోజు పెరిగిన వసూళ్లు, ఎంతంటే?
హీరో శ్రీవిష్ణు మంచి ఫామ్‌లో ఉన్నాడు. వరుస కామెడీ చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఆయన తాజాగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘విష్ణు విన్యాసం’. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్గా నటించింది. మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఓ మెస్తరు అంచనాల మధ్య ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కూడా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ 3.95 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, రెండో రోజు అంతకు మించిన జోరును ప్రదర్శించింది. మొదటి రోజుతో పోలిస్తే..రెండో రోజు ఏకంగా 54 శాతం పైగా బుకింగ్స్‌ని నమోదు చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొత్తంగా రెండు రోజుల్లో రూ. 9.1 గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.వీకెండ్లో పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా ఈ మూవీకి బాగా కలిసి వస్తోంది. సినిమాకు వచ్చిన టాక్ని బట్టి చూస్తే..వీకెండ్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండుతులు అంచనా వేస్తున్నారు. -
విష్ణు విన్యాసం మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
'విష్ణు విన్యాసం' తొలిరోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
సామజవరగమన, సింగిల్ లాంటి కామెడీ సినిమాలతో ఆకట్టుకున్న హీరో శ్రీ విష్ణు నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా 'విష్ణు విన్యాసం'. పెద్దగా బజ్ లేకుండానే శుక్రవారం(ఫిబ్రవరి 27) థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆట నుంచి దీనికి గొప్ప టాక్ అయితే రాలేదు. చూసినవాళ్లు కూడా పెదవి విరుస్తున్నారు. అయితేనేం తొలిరోజు కళ్లుచెదిరే కలెక్షన్స్ వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. మొదటిరోజు వసూళ్ల పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: అపచారం.. తిరుమల గుడి ముందే 'బిగ్‌బాస్' భామ డ్యాన్సులు)శ్రీ విష్ణు, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని కామెడీ కథతో తీశారు గానీ పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించట్లేదు. కానీ తొలిరోజు రూ.3.95 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు పోస్టర్ వదిలారు. వీకెండ్ అయ్యేసరికి ఈ మూవీ టాక్‌తో పాటు కలెక్షన్‌పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రస్తుతానికైతే థియేటర్లలో వేరే మూవీస్ ఏం లేకపోవడం దీనికి కలిసి రావొచ్చు.'విష్ణు విన్యాసం' విషయానికొస్తే.. విష్ణు(శ్రీవిష్ణు) ఓ జూనియర్ లెక్చరర్. జాతకాల పిచ్చి ఎక్కువే. వాస్తు బాలేదని పక్కింటి ఇంట్లోని వాష్‌రూమ్‌ని వాడుకునేంత. తనకున్న మూఢనమ్మకాల పిచ్చితో 30 ఏళ్లు దాటేసినా పెళ్లి చేసుకోడు. ఇతడిని చూసిన తొలిచూపులోనే మరో లెక్చరర్ మనీషా(నయన్ సారిక) ప్రేమలో పడుతుంది. ఆమె అలవాటు, ప్రవర్తన చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ.. విష్ణు ఆమెను ఇష్టపడతాడు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యే ముందు మనీషా.. ఓ నిజం చెబుతుంది. అదేంటి? ఆ నిజం తెలిసిన తర్వాత వీరిద్దరి లవ్‌స్టోరీలో వచ్చిన మలుపులు ఏంటి? చివరికి విష్ణు, మనీషా పెళ్లి చేసుకున్నారా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్) -
రిలీజ్‌కి ముందే సినిమా లీక్.. నిర్మాతకు బ్లాక్మెయిల్!
సినిమా పరిశ్రమలో పైరసీ అనేది దశాబ్దాలుగా పరిష్కారం కాని కీలక సమస్య. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో రకంగా సినిమా బయటకు వచ్చేస్తుంది. ఇలా థియేటర్లో బొమ్మ పడుతుందో లేదో అలా పైరసీ కాపీ నెట్టింట్లోకి వచ్చేస్తూ.. నిర్మాతలకు కోట్ల నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఇప్పుడిప్పుడే పైరసీ కాస్త తగ్గుతుందని భావిస్తున్న తరుణంలో టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. నిన్న రిలీజ్ అయిన తన కొత్త సినిమా డిసెంబర్లోనే లీక్ అయిందని చెప్పి పెద్ద బాంబు పేల్చాడు. షూటింగ్ పూర్తి కాకముందే సినిమా లీక్ అయిందట. అందుకే హడావుడిగా షూటింగ్ పూర్తి చేసి..త్వరగా రిలీజ్ చేయాల్సిన వచ్చిందని శ్రీవిష్ణు చెప్పాడు.ఆయన హీరోగా యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం(ఫిబ్రవరి 27) రిలీజ్ అయింది. ఈ సినిమా సక్సెస్ మీట్‌ని ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడు పైరసీ విషయాన్ని వెల్లడించాడు.ఎలా జరిగిందో తెలియదు‘మా సినిమాను సడెన్‌గా రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటంటే.. డిసెంబర్లో ఈ సినిమాను లీక్ చేశారు. ఎలా జరిగిందో తెలియదు. ఓ రోజు ఉదయం నిర్మాత ఫోన్ చేసి చెప్పడంతో షాక్ అయ్యాడు. దానిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. అయినా టీమ్ అంతా షాక్‌లో ఉండిపోయాం. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది బయటకు చెబితే వేరే విధంగా వెళ్తుంది. రీల్ రీల్ కోసం కూడా మా నిర్మాతని బ్లాక్ మెయిల్ చేశారు. రిలీజ్‌కి ముందు రోజు వరకు బ్లాక్ మెయిల్ చేశారు. అయినా కూడా నిర్మాత ధైర్యంగా నిలబడి ఈ సినిమాను విడుదల చేశాడు. సినిమా ప్రమోషన్‌కి మాకు కేవలం 10 రోజులు మాత్రమే దొరికింది. మొత్తానికి పైరసీ బయటకు రాకుండా చేసి ఈ సినిమాను రిలీజ్ చేశాం’ అని శ్రీవిష్ణు చెప్పుకొచ్చాడు.వాట్సాప్ చూసి షాకయ్యా : నిర్మాత నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఓ రోజు నాకు తెలిసిన పర్సన్ నాన్ స్టాఫ్‌గా కాల్ చేస్తున్నాడు. ఆ రోజు ఆదివారం. ఉదయం 9 గంటలకు నేను ఫోన్ లిఫ్ట్ చేశా. వాట్సాప్ చూస్కో అని చెప్పాడు. చూస్తే.. సినిమా పస్టాఫ్ అంతా వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు.చాలా టెన్షన్ పడ్డా. నా కూతురు పెళ్లి చేయాలి. కొడుకుని సెట్ చేయాలి. ఇదంతా నా కళ్లముందు గిర్రున తిరిగింది. కాసేపటికి గుండె నిబ్బరం చేసుకొని హైదరాబాద్‌లో ఉన్న నా కొడుకుకి ఫోన్ చేసి చెప్పా. ఎలా జరిగిందో ఆరా తీస్తే.. మా యూనిట్ నుంచే వెళ్లినట్లు తెలిసింది. లాక్ వేసుకోకపోవడంతో ఈ లీకేజీ జరిగింది. ఎవరు పంపారో తెలియదు కానీ.. పెద్ద డ్యామేజ్ జరిగింది. ఫోన్ నెంబర్ల ద్వారా ఎక్కడెక్కడ నుంచి వచ్చిందో తెలుసుకొని.. డిలీట్ చేయించాం. ఈలోపు ఛాంబర్లో కూడా ఫిర్యాదు చేశాం. చెన్నై నుంచి లీక్ అయిన విషయం తెలిసి.. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాం. విచారణ జరుగుతుంది. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి’ అని అన్నారు. -
‘విష్ణు విన్యాసం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: విష్ణు విన్యాసంనటీనటులు: శ్రీ విష్ణు, నయన సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులునిర్మాత: సుమంత్ నాయుడు జిరచన, దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావుసంగీతం: రధన్సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్విడుదల తేది: ఫిబ్రవరి 27, 2026వరస కామెడీ చిత్రాలతో దూసుకెళ్తున్నాడు శ్రీవిష్ణు. ఆ మధ్య సీరియస్ కంటెంట్ చిత్రాలు చేసినప్పటికీ..అవి బెడిసి కొట్టాయి. దీంతో తనకు అచ్చొచ్చి కామెడీ జానర్లోనే సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. అదే జోష్‌లో ఇప్పుడు విష్ణు విన్యాసం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. గత సినిమాల మాదిరే విష్ణు విన్యాసం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందా? శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..విష్ణు(శ్రీవిష్ణు) ఓ జూనియర్ లెక్చరర్. జాతకాల పిచ్చి. ఎంతలా అంటే.. వాస్తు బాగోలేదని పక్కింటి వాళ్ల ఇంట్లోని వాష్‌రూమ్‌ని వాడుకునేంత. తనకున్న మూఢనమ్మకాల పిచ్చితో 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోడు. అతన్ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది మరో లెక్చరర్ మనీషా(నయనసారిక). ఆమె అలవాటు, ప్రవర్తన చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ.. విష్ణు కూడా ఆమెను ఇష్టపడతాడు. పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యే ముందు మనీషా ఓ నిజాన్ని రివీల్ చేస్తుంది. అదేంటి? ఆ నిజం తెలిసిన తర్వాత వీరిద్దరి లవ్‌స్టోరీలో వచ్చిన మలుపులు ఏంటి? చివరికి విష్ణు, మనీషాలు పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తదేమి కాదు. రాజేంద్ర ప్రసాద్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మొదలు మొన్నటి ప్రియదర్శి ‘సారంగపాణి’ వరకు జాతకం కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే ఇందులో ఉన్న హీరోయిన్ సమస్య కూడా పాతదే. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ సినిమాలో ఆ పాయింట్ టచ్ చేశారు. ఇలా పాత కాన్సెప్ట్‌ని ఎంచుకొని.. శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా సీన్లను రాసుకొని జెంజీ బ్యాచ్‌ని ఆకట్టుకునేలా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు యధునాథ్ మారుతీ రావు. కథ, కథనం కంటే శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. అతనితో పలికించిన వన్ లైన్ పంచులు సినిమాకు ప్లస్ అయ్యాయి. కానీ కథకి ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోవడంతో ఆ కామెడీని కూడా పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయారు. హీరోయిన్‌కి ఏదో పెద్ద సమస్య ఉన్నట్లుగా చూపిస్తూ సినిమాను ప్రారంభించారు. ఆ తర్వాత పెళ్లి చూపుల సీన్‌తో హీరోని పరిచయం చేశారు. హీరోకి జాతకాల పిచ్చి ఉండడం.. ప్రతి పనికి గురువు(శ్రినివాస్ రెడ్డి)గారి అనుమతి తీసుకోవడం..ఇందంతా కొంతవరకు నవ్విస్తుంది. ఇక కాలేజీలో హీరోహీరోయిన్లు కలిసినప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరోయిన్ వింతగా ప్రవర్తించడం.. దానికి తోడు శ్రీవిష్ణు వేసే వన్‌లైనర్ పంచ్‌లు.. కొంతమేర ఎంటర్టైన్ చేస్తాయి. హీరోయిన్ సమస్య ఏంటనేది ఇంటర్వెల్ వరకు చెప్పకపోవడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆ సమస్య తెలిసిన తర్వాత మాత్రం ఉన్న కాస్త ఆసక్తి కూడా తగ్గిపోతుంది. సోషల్ మీడియాలోని మీమ్స్ వాడుకొని విష్ణు కొంత కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. కానీ సరైన కంటెంట్ లేకపోవడంతో అది కూడా పూర్తిగా వర్కౌట్ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్‌తో పాటు శ్రీవిష్ణు చేసే కామెడీ అంతా కూడా ఆర్గానిక్‌గా అనిపిస్తుంది. కథలో నుంచి కామెడీ పుట్టించే ప్రయత్నం చేయకుండా..కేవలం సంభాషణలతోనే నవ్వించే ప్రయత్నం చేశారు. అవి జెంజీ బ్యాచ్‌ని ఎంటర్టైన్ చేస్తాయి. ఎవరెలా చేశారంటే..ఎప్పటిమాదిరే శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. ఆయన హవాభావాలు, సంభాషణలు అన్నీ కొంతవరకు నవ్విస్తాయి. మనీషా పాత్రకి నయన సారిక న్యాయం చేసింది. కమెడియన్ సత్య కొంతవరకు నవ్వించే ప్రయత్నం చేశాడు కానీ ఆయనను సరిగా వాడుకోలేకపోయారనిపించింది. మురళీ శర్మ, గోపరాజు రమణ రెగ్యులర్ పాత్రల్లో కనిపించారు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, శ్రీనివాసరెడ్డితో పాటు మిగిలినవారంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రధన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. టైటిల్ సాంగ్ మిగతా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. సినిమా నిడివి తక్కువగా ఉండడం(2:07 గంటలు) ప్లస్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ఈ అమ్మడి అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే (ఫొటోలు)
-
హాయిగా నవ్వుకోవచ్చు: శ్రీ విష్ణు
‘‘విష్ణు విన్యాసం’ చిత్రంలో నేను చేసిన విష్ణుపాత్ర ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్ చేయడం నాకు కొత్త. విష్ణు చాలా నమ్మకాల్ని ఫాలో అవుతుంటాడు. ఈపాత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది. మా సినిమాని ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ప్రేక్షకులు రెండు గంటలపాటు హాయిగా నవ్వుకోవచ్చు. ఈ వీకెండ్‌కి థియేటర్‌కి వెళ్లి, హ్యాపీగా టైమ్‌పాస్ చేసి రావొచ్చు’’ అని హీరో శ్రీ విష్ణు చెప్పారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా నటించిన సినిమా ‘విష్ణు విన్యాసం’. హేమ, షాలిని సమర్పణలో సుమంత్ నాయుడు .జి నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం శ్రీ విష్ణు విలేకరులతో పంచుకున్న విశేషాలు... ⇒ యదునాథ్ మారుతి ‘విష్ణు విన్యాసం’ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. డైరెక్టర్ కొత్తయినప్పటికీ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఈ చిత్రంలో నేను లెక్చరర్‌గా కనిపిస్తాను. నా సహ లెక్చరర్‌గా సత్య కనిపిస్తాడు. మా మధ్య సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి. ఇందులో వీరి వీరి గుమ్మడి పండు అనే ఒక సీక్వెన్స్ ఉంది. ఆ ఎపిసోడ్‌కి థియేటర్ మొత్తం నవ్వులతో బ్లాస్ట్ అవుతుంది. ఈ మూవీలో నేను చేసిన విష్ణు క్యారెక్టర్‌కి కొన్ని రూల్స్ ఉంటాయి. చాలా నమ్మకాలని ఫాలో అవుతుంటాడు. వ్యక్తిగతంగా నేను జాతకాలను, గ్రహాలను పూర్తి స్థాయిలో ఫాలో కాను. కానీ, చిన్నప్పటి నుంచి అందరితోపాటు అలవాటు చేసుకున్న కొన్నింటిని మాత్రం ఫాలో అవుతాను.⇒ నయన్ సారికపాత్రని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. రెండు మూడు పేజీల సీన్‌ని తను సింగిల్ టేక్‌లో చేసింది. రథన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేపథ్య సంగీతం సురేష్ బొబ్బిలిగారితో చేయించాం. అది కూడా అద్భుతంగా వచ్చింది. నా సినిమాలన్నీ ఓటీటీ డీల్స్ పూర్తవడం... నిర్మాతలు హ్యాపీగా ఉండడం చాలా ఆనందాన్నిస్తోంది. నిర్మాతలు పెట్టే డబ్బులు వెనక్కి వస్తే చాలనుకుంటాను. ఈ చిత్ర నిర్మాతలు సుబ్రమణ్యం, సుమంత్గార్లు ఔట్పుట్ విషయంలో హ్యాపీగా ఉన్నారు. మేం అనుకున్న బడ్జెట్లో ఓ పదిహేను శాతం తక్కువలోనే సినిమాని పూర్తి చేశాం. ⇒ కామెడీ చేయడం, నవ్వించడం కష్టం. అయితే దాదాపు సిచ్యువేషనల్ కామెడీస్ చేస్తున్నాం కాబట్టి వర్కౌట్ అవుతున్నాయి. నేను చేసేవన్నీ దాదాపు మన చుట్టూ ఉండే కథలే... మనకు తెలిసినపాత్రలే. మిడిల్ క్లాస్ స్టోరీ సెటప్. ఇలాంటి సినిమాలను 60, 70 రోజుల్లో చేసుకోవచ్చు. అందుకే నా సినిమాలు ఫాస్ట్‌గా అవుతున్నాయని భావిస్తున్నా. నేను నటించిన ‘మృత్యుంజయ్’ మార్చి 6న రిలీజ్ కానుంది. ‘కామ్రేడ్ కళ్యాణ్’ 80 శాతం పూర్తయింది. రామ్ అబ్బరాజుతో చేయనున్న సినిమా త్వరలో స్టార్ట్ కానుంది. సితార బ్యానర్లో సన్నీ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా ఉంది. -
’విష్ణు విన్యాసం‘ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
రాజమౌళిగారి సినిమాలో చేయడం నా కల: నయన్ సారిక
‘‘నటనకు స్కోప్ ఉన్నపాత్రలే చేయాలనుకుంటున్నాను. ‘గం గం గణేశా, ఆయ్, క’ వంటి చిత్రాల్లో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ చేశాను. నయన్... నటించిందంటే ఆ సినిమా బాగుంటుందని ప్రేక్షకులు అనుకోవాలన్నదే నా లక్ష్యం. దర్శకుడు రాజమౌళిగారి సినిమాలో మెయిన్ హీరోయిన్గా చేయాలన్నది నా డ్రీమ్’’ అని చెప్పారు హీరోయిన్ నయన్ సారిక. శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా నటించిన సినిమా ‘విష్ణు విన్యాసం’. యధునాథ్ మారుతీరావు దర్శకత్వంలో సుమంత్ నాయుడు .జి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నయన్ సారిక మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం మహారాష్ట్ర. నాకు చిన్నప్పట్నుంచి నటి కావాలని ఉండేది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత యాక్టర్ అయ్యాను. ఒకవేళ నేను యాక్టర్‌ను కాకపోయి ఉంటే లాయర్ని అయ్యేదాన్ని. ఇక ‘విష్ణు విన్యాసం’ సినిమా విషయానికొస్తే... ఇందులో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న మనీషా క్యారెక్టర్లో నటించాను.ఇద్దరు లెక్చరర్స్ మధ్య జరిగే ప్రేమకథతో ఈ సినిమా మొదలవుతుంది. మనీషా తన జీవితంలో ఎన్నో బాధలు ఎదుర్కొన్న అమ్మాయి.. హాయిగా బతకాలని ఆశపడే అమ్మాయి. మరి... మనీషా సమస్యలు ఏంటి? ఆమె కోరుకున్నది ఆమెకు లభించిందా? లేదా అనేది మాత్రం థియేటర్స్‌లో చూడాల్సిందే. రెయిన్ సీక్వెన్స్‌లో నటించడం సవాలుగా అనిపించింది. ఈ చిత్రదర్శకుడు మంచి క్లారిటీ ఉన్న ఫిల్మ్‌మేకర్. సినిమాకు కావాల్సిన ప్రతిదీ నిర్మాత సమకూర్చారు. నేను నటించిన ‘రాకాస’ చిత్రం ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. కన్నడ యాక్టర్ గణేష్‌తో ఓ సినిమా చేస్తున్నాను’’ అని తెలిపారు. -
శ్రీ విష్ణు కన్ఫ్యూజన్ సాంగ్ విడుదల
శ్రీ విష్ణు, నయన సారిక హీరో హీరోయిన్లుగా నటించిన కొత్త సినిమా ‘విష్ణు విన్యాసం’. తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్‌ను విడుదల చేశారు. దర్శకుడు యదునాథ్ మారుతీ రావు తెరకెక్కించిన ఈ మూవీని హేమ, షాలిని సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 27న రిలీజ్ కానుంది. ఇందులో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ‘సత్యం’ రాజేష్ వంటి నటీనటులు నటించారు. ఈ సినిమాకు రథన్ సంగీతం అందించారు. -
హీరోయిన్ నయన్ సారిక బ్యూటిఫుల్ (ఫొటోలు)
-
‘విష్ణు విన్యాసం’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మంచి వేడుకలాంటి సినిమా
‘‘విష్ణు విన్యాసం’ మూవీ ఫస్ట్ హాఫ్‌కి యువత పిచ్చిపిచ్చిగా కనెక్ట్ అవుతారు. సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్‌కి విపరీతంగా నచ్చుతుంది. చివరి 15 నిమిషాలు కుర్రాళ్లకి, కుటుంబ సభ్యులకూ నచ్చుతుంది. మంచి వేడుకలాంటి సినిమా ఇది. తప్పకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని హీరో శ్రీ విష్ణు తెలిపారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో శ్రీ విష్ణు, నయన సారిక హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘విష్ణు విన్యాసం’. హేమ, షాలిని సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు .జి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. బుధవారం నిర్వహించిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో శ్రీ విష్ణు మాట్లాడుతూ– ‘‘ఒంగోలు నేపథ్యంలో మారుతీ రావుగారు ఈ మూవీ తీశారు. 28న అందరూ ఫ్యామిలీతో థియేటర్స్‌కి వెళ్లండి. మీ అందరికీ నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఇది మామూలుగా ఉండే ప్రేమకథ కాదు. చాలా మలుపులు ఉన్నాయి. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు నయన సారిక. ‘‘విష్ణుగారి నుంచి ఎలాంటి అంశాలు కోరుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి’’ అని యదునాథ్ మారుతీ రావు చె΄్పారు. ‘‘ఫ్యామిలీతో వచ్చి మా విష్ణు చేసే విన్యాసాన్ని థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సుమంత్ నాయుడు .జి. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ రధన్ మాట్లాడారు. -
ఎవరైనా అబ్బాయితో నాకు పెళ్లి చేస్తావా?.. విష్ణు విన్యాసం టీజర్ చూశారా?
శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న లేటేస్ మూవీ విష్ణు విన్యాసం. ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో జి సుమంత్ నాయుడు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా విష్ణు విన్యాసం మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. విష్ణు.. నీకు తెలిసిన అబ్బాయిల్లో ఎవరినైనా ఇచ్చి నాకు పెళ్లి చేస్తావా? అనే డైలాగ్ ఈ మూవీపై ఆసక్తిని మరింత పెంచింది. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రాధన్ సంగీతమందించారు. -
శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
శ్రీవిష్ణు హీరోగా వస్తోన్న తాజా చిత్రం విష్ణు విన్యాసం. ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో జి సుమంత్ నాయుడు నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజైంది. మొదలే మొదలే అంటూ సెకండ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ క్రేజీ సాంగ్ లవర్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్ అందించగా..నరేశ్ అయ్యర్, మధుశ్రీ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు.


