యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా నటించిన సినిమా ‘విష్ణు విన్యాసం’. హేమ, షాలిని సమర్పణలో సుమంత్ నాయుడు .జి నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) రిలీజ్ కానుంది.
‘‘నా స్వస్థలం మహారాష్ట్ర. నాకు చిన్నప్పట్నుంచి నటి కావాలని ఉండేది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత యాక్టర్ అయ్యాను. ఒకవేళ నేను యాక్టర్‌ను కాకపోయి ఉంటే లాయర్‌ని అయ్యేదాన్ని.
దర్శకుడు రాజమౌళిగారి సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా చేయాలన్నది నా డ్రీమ్’’ అని చెప్పారు హీరోయిన్ నయన్ సారిక.


