శిఖర్‌ ధావన్‌ -సోఫీయా షైన్‌ సంగీత్‌ నైట్‌, ఫోటోలు వైరల్‌ | Shikhar Dhawan Sophie Shine wedding Cricketer Drops A Sneak Peek Into His Sangeet Night | Sakshi
Sakshi News home page

శిఖర్‌ ధావన్‌ -సోఫీయా షైన్‌ సంగీత్‌ నైట్‌, ఫోటోలు వైరల్‌

Feb 19 2026 6:26 PM | Updated on Feb 19 2026 6:50 PM

Shikhar Dhawan Sophie Shine wedding Cricketer Drops A Sneak Peek Into His Sangeet Night

Shikhar&Sophie టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, ప్రియురాలు సోఫీ షైన్ (Sophie Shine) పెళ్లి సందడి మొదలైంది.  అయేషా ముఖర్జీతో విడాకుల తరువాత ధావన్‌ తన జీవితంలో మరో కీలక అడుగు వేయబోత్తున్నాడు. భారత క్రికెట్ జట్టులో తనదైన శైలిలోబ్యాటింగ్ చేస్తూ ‘గబ్బర్’గా పాపులర్‌ శిఖర్ ధావన్, వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. తన  ప్రేయసి సోఫీ షైన్‌ (ఐరిష్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్)తో కలిసి ఏడడుగులు వేసేందుకు ఆయన సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 19 గురువారం ధావన్ తన సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇవి నెట్టింట సందడిగా మారాయి. అభినందనల వెల్లువ కురుస్తోంది. 

తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో శిఖర్ ధావన్‌  సోఫీ షైన్ సంగీత్ నైట్ నుండి ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోల్లో శిఖర్ తెల్లటి షేర్వానీలో అందంగా కనిపించగా, సోఫీ బ్లింగీ గా బంగారు రంగు లెహంగాలో  కళకళలాడింది.  ఈ ఏడాది జనవరి 2న ఈ జంట నిశ్చితార్థం  చేసుకున్నారు. ఫిబ్రవరి 19న  వివాహం చేసుకోవచ్చని ముందుగా ఊహాగానాలు వచ్చాయి.  ప్రస్తుతం వెడ్డింగ్‌డేట్‌పై ధృవీకరణ లేనప్పటికీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా  జరిగిన సంగీత్ నైట్‌ ఫోటోలు మాత్రం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

 

ఎవరీ సోఫీ షైన్‌
సోఫీ షైన్ 1990 లో జన్మించిన ఐరిష్ మహిళ.  సోఫీ ఐర్లాండ్‌లో చదువుకుంది. ప్రఖ్యాత లిమెరిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను పూర్తి చేసింది.ఆమె గ్లామర్ ప్రపంచం నుండి రాలేదు, శిఖర్ లాగా కాకుండా, కార్పొరేట్ ప్రపంచంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికి ఆమె చాలా కష్టపడింది.మమార్కెటింగ్ మరియు మేనేజ్‌మెంట్ విద్యార్థిని అయిన ఆమె తొలుత బహుళజాతి కంపెనీలో  పనిచేసింది. అనంతరం  నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో చేరింది.దుబాయ్‌లోని ఒక రెస్టారెంట్‌లో మొదటి సారి కలిశారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సోఫీ షైన్, శిఖర్ ధావన్‌తో సన్నిహితంగా కనిపించినప్పుడు  వీరి డేటింగ్ బజ్ ప్రారంభమైంది.

కాగా  శిఖర్ 2012లో అయేషాను వివాహం చేసుకున్నాడు.  ఈ జంటకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. 2021లో వారు విడాకులు తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement