Sophie Shine
-
శిఖర్ ధావన్ మాజీ భార్యకు షాకిచ్చిన కోర్టు.. గబ్బర్‌కు రిలీఫ్
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఊరట లభించింది. పాటియాలా హౌజ్ కోర్టు అతడికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియా నివాసి ఆయేషా ముఖర్జీతో ధావన్‌కు సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమ, పెళ్లికి దారితీశాయి.ఆయేషాతో విడాకులుడివోర్సీ, ఇద్దరు ఆడపిల్లల తల్లి అయిన ఆయేషా (Ayesha)ను ధావన్ 2012లో వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమారుడు జొరావర్ జన్మించాడు. అయితే, కొంతకాలం తర్వాత ధావన్- ఆయేషా మధ్య తలెత్తిన విభేదాలు విడాకులకు దారితీశాయి. ఢిల్లీ కోర్టు 2023లో వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది.సోఫీతో ఇటీవలే వివాహం ఈ క్రమంలో చాన్నాళ్లు ఒంటరిగా ఉన్న శిఖర్ ధావన్.. ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో ప్రేమలో పడ్డాడు. ఇటీవలే (ఫిబ్రవరి 22) అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇలా శిఖర్ ధావన్ కొత్త జీవితం ఆరంభించిన సమయంలో.. మాజీ భార్య విషయంలో న్యాయస్థానం నుంచి అతడికి గొప్ప ఊరట లభించింది.రూ. 5.7 కోట్లు తిరిగి చెల్లించాలిశిఖర్ ధావన్ నుంచి ఆయేషా తీసుకున్న రూ. 5.7 కోట్లను అతడికి తిరిగి చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కాగా ఆయేషా- ధావన్‌ల ఆస్తులకు సంబంధించి ఆస్ట్రేలియా కోర్టు ఆయేషాకు 15 శాతం కేటాయించింది. దీని ప్రకారం.. రూ. 7.46 కోట్లతో పాటు ధావన్ నుంచి అదనంగా రూ. 15.95 కోట్లు, దీనితో పాటు కొంత ఆస్తి ఆయేషా పేరిట రాయాలని ఆదేశించింది.ఈ మేరకు ఆస్తులకు సంబంధించి 2021-2024 మధ్య ఆస్ట్రేలియా కోర్టు ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేసింది. అయితే, భారత వివాహ చట్టాల ప్రకారం తాను ఆస్ట్రేలియా కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన పనిలేదని ధావన్ వాదించాడు. ఇందుకు సంబంధించి పాటియాలా హౌజ్ కోర్టులో వివరాలు సమర్పించాడు.కట్టుకథలు అల్లిపెళ్తైన కొన్ని నెలల తర్వాత నుంచే ఆయేషా.. కట్టుకథలు అల్లి తన కెరీర్‌ను దెబ్బతీస్తానని బెదిరించిందని ధావన్ కోర్టుకు చెప్పాడు. అంతేకాదు.. తన కష్టార్జితంతో కొనుగోలు చేసే ప్రతి ఆస్తిని ఇద్దరి పేరిట లేదంటే.. ఆయేషా ఒక్కదాని పేరిటే కొనాలని ఆమె ఒత్తిడి చేసేదని వాపోయాడు.ఇందుకు తగ్గట్లుగానే ఒకానొక సమయంలో ధావన్ కొన్న ఆస్తులలో దాదాపు 99 శాతం ఆయేషా పేరిటే ఉన్నట్లుగా కోర్టుకు ఆధారాలు సమర్పించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో పాటియాలా హౌజ్ కోర్టు జడ్జి జస్టిస్ దేవేందర్ కుమార్ గార్గ్.. ఆస్ట్రేలియా కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ధావన్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.బెదిరించి డబ్బు గుంజాలనే యత్నంసెటిల్మెంట్ సమయంలో ధావన్‌ను బెదిరింపులకు గురిచేసి డబ్బు గుంజాలనే ప్రయత్నం జరిగినట్లు గుర్తించామన్నారు. కాబట్టి ఆయేషా ధావన్ నుంచి పొందిన రూ. 5.7 కోట్లను తిరిగి ఇచ్చేయాలని గార్గ్ ఆదేశించారు.అంతేకాదు.. ధావన్ ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన నాటి నుంచి ఏడాదికి 9 శాతం చొప్పున వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆయేషాను న్యాయస్థానం ఆదేశించింది. మాజీ దంపతుల వివాదంలో ఆస్ట్రేలియా కోర్టుకు ఎలాంటి అధికారం లేదని.. ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఇక్కడ విలువలేదని కొట్టిపారేసింది. దీంతో ధావన్‌కు ఉపశమనం దక్కింది.కుమారుడికి దూరంకాగా కుమారుడు జొరావర్ కస్టడీ తనకు కావాలని ధావన్ కోరగా.. న్యాయస్థానం అతడికి శాశ్వత ప్రాతిపదికన కుమారుడిని అప్పగించలేమని తెలిపింది. అయితే, ఇండియా, ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో వీడియో కాల్స్ ద్వారా కుమారుడిని చూడవచ్చని పేర్కొంది. అయితే, ఆయేషా మాత్రం కుమారుడితో తనకు ఎలాంటి సంబంధం లేకుండా చేసేందుకు సోషల్ మీడియాతో సహా అన్ని కనెక్షన్లను కట్ చేసిందని ధావన్ వాపోయాడు. కుమారుడిని ఎంతగానో మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా ధావన్ తరచూ వెల్లడిస్తూ ఉంటాడు.చదవండి: T20 WC 2026: రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్ అప్డేట్ -
మాజీ భార్య అన్నట్లుగా చెబుతున్న మాటలపై స్పందించిన శిఖర్ ధవన్
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ తన రెండో వివాహం అనంతరం సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన కథనాలపై తీవ్రంగా స్పందించాడు. కొద్ది రోజుల కిందట ధవన్ అమెరికా ఆధారిత ఫైనాన్షియల్ కన్సల్టెంట్ సోఫీ షైన్‌ను ఢిల్లీ-ఎన్సీఆర్లో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక తర్వాత ధవన్, అతని మాజీ భార్య అయేషా ముఖర్జీకి సంబంధించిన పలు పోస్ట్‌లు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విడాకుల సమయంలో అయేషా ధవన్‌ను "నిన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు" అన్నట్లు.. సోఫీతో వివాహం తర్వాత "నన్ను అభినందించవా..?" అని ధవన్ అయేషాకు కౌంటరిచ్చినట్లు పలు స్క్రిప్ట్‌లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.STATEMENTI have come across some posts on social media attributing a disappointing statement about my personal life. I have never carried baggage from the past be it on the pitch or outside. I firmly believe in the power of positivity while respecting my past.This is a new…— Shikhar Dhawan (@SDhawan25) February 23, 2026వీటిపై ధవన్ అదే సోషల్‌మీడియా వేదికగా స్పందించాడు. ఆ స్క్రిప్ట్‌ను పూర్తిగా ఖండిస్తూ.. అందులో ఎంతమాత్రం నిజం లేదని కొట్టిపారేశాడు. "నేను ఎప్పుడూ గతాన్ని మోసుకెళ్లలేదు. పాజిటివిటీని నమ్ముతాను. నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అభిమానులు, కుటుంబం, మిత్రులు ఇచ్చిన ప్రేమకు కృతజ్ఞతలు. దయచేసి నా పేరుతో తప్పుడు కథనాలు సృష్టించవద్దు" అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. కాగా, ధవన్.. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయ మహిళల అయేషా ముఖర్జీని 2011లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడి, ఆతర్వాత ప్రేమ వివాహానికి దారి తీసింది. అయేషా ఓ మాజీ కిక్ బాక్సర్. ఆమెకు ధవన్‌కు ముందే వేరే వ్యక్తితో పెళ్లైంది. తొలి భర్తతో అయేషాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయేషా-ధవన్‌కు జోరావర్ అనే పేరు గల కుమారుడు ఉన్నాడు.అయేషా.. ఆమె మొదటి భర్తతో కలిగిన సంతానం, జోరావర్‌తో కలిసి ధవన్‌తోనే ఉండేది. అయితే మనస్పర్దల కారణంగా అయేషా-ధవన్ 2023లో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత అయేషా జోరావర్‌ను తీసుకొని ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. ఆ సమయంలో అయేషా తండ్రి-కొడుకులను కలవనివ్వలేదనే వార్తలు వచ్చాయి. జోరావర్‌ను మిస్ అవుతున్నట్లు ధవన్ చాలా సందర్భాల్లో సోషల్‌మీడియా వేదికగా తన ఆవేదనను వెళ్లగక్కాడు. అయితే ధవన్ ఏనాడూ అయేషా గురించి చెడుగా మాట్లాడలేదు. తాజాగా వస్తున్న వదంతులు ధవన్ ఎంత జెంటిల్మెనో మరోసారి రుజువు చేశాయి.అయేషాతో విడాకులైన చాన్నాళ్లకు ధవన్-సోఫీ మధ్య ప్రేమ మొదలైంది. 2025లో వీరిద్దరూ తమ సంబంధాన్ని బహిరంగం చేశారు. ఈ ఏడాది జనవరి 12న వీరి నిశ్చితార్థం జరిగింది. తాజాగా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సోఫీ షైన్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటూ, Northern Trust Corporationలో ప్రొడక్ట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. వీరి వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, క్రికెట్ సహచరులు పాల్గొన్నారు. -
సోఫీ షైన్‌ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)
-
ప్రియురాలు సోఫీ షైన్‌తో గబ్బర్ శిఖర్ పెళ్లి.. సంగీత్ నైట్ ఫోటోలు
-
శిఖర్ ధావన్ -సోఫీ షైన్ సంగీత్ నైట్, ఫోటోలు వైరల్
Shikhar&Sophie టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, ప్రియురాలు సోఫీ షైన్ (Sophie Shine) పెళ్లి సందడి మొదలైంది. అయేషా ముఖర్జీతో విడాకుల తరువాత ధావన్ తన జీవితంలో మరో కీలక అడుగు వేయబోత్తున్నాడు. భారత క్రికెట్ జట్టులో తనదైన శైలిలోబ్యాటింగ్ చేస్తూ ‘గబ్బర్’గా పాపులర్ అయిన శిఖర్ ధావన్, వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్నిప్రారంభించబోతున్నాడు. తన ప్రేయసి సోఫీ షైన్ (ఐరిష్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్) తో కలిసి ఏడడుగులు వేసేందుకు ఆయన సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 19 గురువారం ధావన్ తన సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇవి నెట్టింట సందడిగా మారాయి. అభినందనల వెల్లువ కురుస్తోంది. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial)తన ఇన్‌స్టా హ్యాండిల్లో శిఖర్ ధావన్ సోఫీ షైన్ సంగీత్ నైట్ నుండి ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోల్లో శిఖర్ తెల్లటి షేర్వానీలో అందంగా కనిపించగా, సోఫీ బ్లింగీ గా బంగారు రంగు లెహంగాలో కళకళలాడింది. ఈ ఏడాది జనవరి 2న ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. ఫిబ్రవరి 19న వివాహం చేసుకోవచ్చని ముందుగా ఊహాగానాలు వచ్చాయి. ప్రస్తుతం వెడ్డింగ్‌డేట్‌పై ధృవీకరణ లేనప్పటికీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా జరిగిన సంగీత్ నైట్ ఫోటోలు మాత్రం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఎవరీ సోఫీ షైన్సోఫీ షైన్ 1990 లో జన్మించిన ఐరిష్ మహిళ. సోఫీ ఐర్లాండ్‌లో చదువుకుంది. ప్రఖ్యాత లిమెరిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను పూర్తి చేసింది.ఆమె గ్లామర్ ప్రపంచం నుండి రాలేదు, శిఖర్ లాగా కాకుండా, కార్పొరేట్ ప్రపంచంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికి ఆమె చాలా కష్టపడింది.మమార్కెటింగ్ మరియు మేనేజ్మెంట్ విద్యార్థిని అయిన ఆమె తొలుత బహుళజాతి కంపెనీలో పనిచేసింది. అనంతరం నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్లో చేరింది.దుబాయ్‌లోని ఒక రెస్టారెంట్లో మొదటి సారి కలిశారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సోఫీ షైన్, శిఖర్ ధావన్‌తో సన్నిహితంగా కనిపించినప్పుడు వీరి డేటింగ్ బజ్ ప్రారంభమైంది.కాగా శిఖర్ 2012లో అయేషాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. 2021లో వారు విడాకులు తీసుకున్నారు. -
‘నిశ్చితార్థం చేసుకున్నాం’
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ శుభవార్త చెప్పాడు. ప్రియురాలు సోఫీ షైన్‌తో వివాహ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపాడు. ‘‘చిరునవ్వుల నుంచి కలల దాకా అన్నీ పంచుకున్నాం. ప్రేమ మమ్మల్ని దీవించింది.చిరకాల ప్రయాణానికి నాందిగా మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాము’’ అని శిఖర్- సోఫీ పేరిట సోషల్ మీడియా వేదికగా నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాల్కనీలో ఎర్ర గులాబీలతో అందంగా అలంకరించిన హృదయాకారం ముందుకు శిఖర్ చేయి చాచగా.. సోఫీ తన వజ్రపు ఉంగరాన్ని చూపిస్తూ అతడి చేతి మీద చేయి వేసిన ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.శుభాకాంక్షల వెల్లువకాబోయే వధూవరులు శిఖర్ ధావన్- సోఫీ షైన్‌లకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఫిబ్రవరి మూడోవారంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా టీమిండియా ఓపెనర్‌గా సత్తా చాటిన శిఖర్ ధావన్ గతంలో.. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీ అనే డివోర్సీని 2011లో పెళ్లి చేసుకున్నాడు.కుమారుడికీ దూరంఅన్యోన్యంగా కనిపించిన ఈ జంటకు కుమారుడు జొరావర్ ధావన్ సంతానం. అంతకుముందు పెళ్లి ద్వారా ఆయేషాకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ధావన్ వాళ్లు కూడా తన సొంత కూతుళ్లలాంటి వారే అని పలు సందర్భాల్లో చెప్పాడు. అయితే, కొన్నాళ్లకు శిఖర్- ఆయేషా మధ్య విభేదాలు తలెత్తి తీవ్రరూపం దాల్చాయి.ఈ క్రమంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా 2023లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. కొడుకు కూడా ధావన్‌కు దూరమయ్యాడు. దీంతో కొన్నాళ్లపాటు ఒంటరిగానే ఉన్న ధావన్.. కొంతకాలం క్రితం ఐర్లాండ్ భామ సోఫీ షైన్‌తో ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు తమ ప్రేమను పెళ్లిదాకా తీసుకువచ్చేందుకు సిద్ధపడ్డారు ఈ జంట. కాగా సోఫీ మార్కెటింగ్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ అని సమాచారం. అబుదాబిలోని ఓ కంపెనీకి ఆమె వైస్ ప్రెసిడెంట్ అని తెలుస్తోంది.చదవండి: బంగ్లాదేశ్ మ్యాచ్‌ల వేదికలు మార్చండి!.. స్పందించిన బీసీసీఐ -
రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ స్టార్ శిఖర్ ధావన్
-
రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ స్టార్
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ త్వరలోనే వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నాడు. తన ప్రేయసి సోఫీ షైన్‌ను మనువాడబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా శిఖర్- సోఫీల పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది.భారత క్రికెట్ వర్గాలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ వివాహానికి హాజరుకానున్నట్లు హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ వేడుకకు ఇప్పటికే సన్నాహకాలు మొదలయ్యాయని పేర్కొంది. ‘‘శిఖర్ ధావన్ జీవితంలో ఇదొక కొత్త అధ్యాయం.ఈ వేడుకను సానుకూల వాతావరణంలో జరుపుకోవాలని వారిద్దరు భావిస్తున్నారు’’ అని ధావన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. శిఖర్ ధావన్ స్వయంగా పెళ్లి పనులను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని గతంలో వివాహం చేసుకున్నాడు.పదకొండేళ్ల కుమారుడుడివోర్సి, ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆయేషాను ప్రేమించిన ధావన్ 2011లో ఆమెను పెళ్లాడాడు. ఆమెతో కుమారుడు జొరావర్ ధావన్ సంతానం. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట 2023లో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో పదకొండేళ్ల జొరావర్‌ను తల్లి ఆయేషా తనతో పాటు ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లింది.తన కుమారుడిని నేరుగా కలుసుకునే వీలు కూడా లేకుండా పోయిందంటూ ధావన్ ఎన్నోసార్లు ఇన్‌స్టా వేదికగా పోస్టులు పెట్టాడు. ఒంటరిగా మిగిలిపోయిన అతడి జీవితంలోకి ఐరిష్ అమ్మాయి సోఫీ షైన్ వచ్చింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మ్యాచ్ సందర్భంగా దుబాయ్‌లో వీరిద్దరు తొలిసారి జంటగా కనిపించారు.రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంతద్వారా తన ప్రేమ బంధాన్ని బహిర్గతం చేసిన ధావన్.. అప్పటి నుంచి సోఫీతో చెట్టాపట్టాలేసుకుని విహరిస్తున్నాడు. మార్కెటింగ్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసిన సోఫీ.. ఓ ప్రముఖ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నట్లు సమాచారం. జీవితంలో మరోసారి ప్రేమను వెదుక్కున్న శిఖర్ ధావన్.. రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.ఇకపై గబ్బర్‌కు అంతా మంచే జరగాలని.. శిఖర్- సోఫీల వివాహ బంధం కలకాలం నిలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కాగా 2010- 2022 మధ్య భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన శిఖర్ ధావన్.. 34 టెస్టుల్లో 2315, 167 వన్డేల్లో 6793, 68 టీ20లలో 1759 పరుగులు సాధించాడు. ఓపెనర్‌గా సత్తా చాటిన గబ్బర్ ఖాతాలో టెస్టుల్లో ఏడు. వన్డేల్లో 17 సెంచరీలు ఉన్నాయి. జట్టులో చోటు కరువు కావడంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధావన్.. ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు. -
అవును.. ప్రేమలో ఉన్నాం!.. ఇంతకీ ఎవరీమె?
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఎట్టకేలకు తన ప్రేమ బంధాన్ని బహిర్గతం చేశాడు. సోఫీ షైన్ (Sophie Shine)తో కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టు ద్వారా ధ్రువీకరించాడు. కాగా భారత జట్టు ఓపెనర్‌గా ఎన్నో ఘనతలు సాధించిన శిఖర్.. ఆ తర్వాత జట్టులో చోటే కరువు కావడంతో ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు శిఖర్ ధావన్. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీ (Aesha Mukherjee)అనే డివోర్సీని 2011లో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా వారిని తన సొంత కూతుళ్లలా చూసుకుంటానని గబ్బర్ పలు సందర్భాల్లో వెల్లడించాడు.భార్యతో విడాకులుఇక శిఖర్- ఆయేషాలకు జొరావర్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట మధ్య విభేదాలు తలెత్తి విడాకులకు దారితీసింది. 2023లో శిఖర్- ఆయేషాలకు విడాకులు మంజూరయ్యాయి.అప్పటి నుంచి నుంచి ఒంటరిగా ఉంటున్న శిఖర్ ధావన్.. కనీసం తన కుమారుడిని కలిసేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా లేవంటూ పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు. ఇక ఇప్పుడు అతడు సోఫీ రూపంలో మరోసారి ప్రేమను వెదుక్కున్నాడు.ఇంతకీ ఎవరీ సోఫీ షైన్?సోఫీ షైన్ ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఐర్లాండ్‌లోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె.. మార్కెటింగ్- మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసింది.ఇక ప్రస్తుతం నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్ అనే కంపెనీలో సెకండ్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో సోఫీ పనిచేస్తున్నట్లు సమాచారం. ఇది అమెరికన్ ఫైనాన్షియల్ కంపెనీ అని తెలుస్తోంది.ఇక వృత్తిరీత్యా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్న సోఫీకి అక్కడే శిఖర్‌తో పరిచయమైనట్లు సమాచారం. ఈ క్రమంలో స్నేహం ప్రేమగా మారి ఇద్దరూ సహజీవం చేస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది.అందమైన మహిళే నా గర్ల్ఫ్రెండ్కొన్నిరోజుల క్రితం శిఖర్ ధావన్ ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. అతడి రిలేషన్షిప్ గురించి ప్రశ్న ఎదురైంది. ప్రేయసి పేరు చెప్పాలంటూ గబ్బర్ను యాంకర్ ప్రశ్నించగా.. ‘‘నేను పేరు మాత్రం చెప్పను.. అయితే, ఇక్కడే ఉన్న అమ్మాయిల్లోకెల్లా అందమైన మహిళే నా గర్ల్‌ఫ్రెండ్’’ అని చెప్పాడు. అంతలో లైట్ సోఫీ ముఖంపై పడింది.ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో.. సోఫీతో దిగిన ఫొటోను షేర్ చేసిన ధావన్.. ‘‘మై లవ్’’ అంటూ అధికారికంగా తమ బంధం గురించి అభిమానులతో పంచుకున్నాడు. అయితే, పెళ్లి గురించి మాత్రం ఇంకా కన్ఫామ్ చేయలేదు.కాగా 2010 నుంచి 2022 మధ్య శిఖర్ ధావన్ టీమిండియా తరఫున అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాడు. తన కెరీర్లో 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 2315, 6793, 1759 పరుగులు సాధించాడు.భారత జట్టు మేటి ఓపెనర్‌గా పేరొందిన శిఖర్ ధావన్ ఖాతాలో ఏడు టెస్టు, 17 వన్డే శతకాలు ఉన్నాయి. ఇక ఐపీఎల్లో ఏకంగా 222 మ్యాచ్‌లు ఆడిన ఈ ఢిల్లీ స్టార్.. రెండు సెంచరీలు, 51 అర్ధ శతకాల సాయంతో 6768 పరుగులు సాధించాడు. చదవండి: పిల్లలంతా హ్యాపీ అంటూ ట్రోలింగ్!.. వైభవ్‌ను ఓదార్చిన రోహిత్.. ఆటలో ఇవి మూమూలే


