42 ఏళ్ల నాటి అమ్మ దుప్పట్టా : కొత్త పెళ్లికూతురు అన్షులా ఎమోషనల్‌ | Anshula Kapoor Mom 42 YearOld Zardozi Dupatta Along With Her lovely Lehenga | Sakshi
Sakshi News home page

42 ఏళ్ల నాటి అమ్మ దుప్పట్టా : కొత్త పెళ్లికూతురు అన్షులా ఎమోషనల్‌

Jul 7 2026 6:18 PM | Updated on Jul 7 2026 6:44 PM

Anshula Kapoor Mom 42 YearOld Zardozi Dupatta Along With Her lovely Lehenga

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, మోనా శౌరిల కుమార్తె ,నటుడు అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్, తన ప్రియుడు రోహన్ థక్కర్‌ను జూలై 6, 2026న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో జరిగిన ఒక సన్నిహిత వివాహ వేడుకలో ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత, అన్షులా తన పెళ్లికూతురి లుక్‌కు సంబంధించిన పలు చిత్రాలను పంచుకుంటూ, తన దివంగత తల్లి మోనా కపూర్‌కు నివాళిగా ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేసింది. తల్లికి గుర్తుగా 42 ఏళ్ల నాటి ఆమె దుపట్టా  ధరించి పెళ్లికూతురి లుక్‌లో  కనిపించడం అందర్నీ ఆకట్టుకుంది.

పెళ్ళిలో తల్లి జ్ఞాపకాలు,
తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో ఆమె ఇలా రాసింది, ‘‘నేను పెళ్లికూతురిని అయినప్పుడు నా వెంట తీసుకెళ్లాలని అనుకున్న ఒకే ఒక్కటి అది నా తల్లి  42 ఏళ్ల నాటి పాత గోల్డ్ టిష్యూ & జర్దోజీ దుపట్టా. నా పెళ్లి రూపం మొత్తం దీన్ని బట్టే రూపుదిద్దుకుంది. కొత్త కుటుంబానికి నాంది పలికే ఈ రోజున, తొలుత నన్ను పెంచి పెద్ద చేసిన కుటుంబ జ్ఞాపకాలతో కూడిన ఆ దుపట్టాలో నన్ను నేను చుట్టుకోవడమే సరైనదిగా అనిపించింది.

అలాగే నాకు ఎంతో విలువైన ఆ వారసత్వ సంపదను ఆధారంగా చేసుకుని, డిజైనర్ తరుణ్ తహిలియాని, మోహిత్ రాయ్, రుచి కృష్ణల అద్భుతమైన ఆలోచనలతో ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధతో రూపొందించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల కళలను ఈ పెళ్లి దుస్తులలో మిళితం చేశారు: సున్నితమైన కాశీదా ఎంబ్రాయిడరీపై రిచ్ జరీ వర్క్, నేను కోడలిగా వెళ్తున్న కుటుంబ ఆచారాలకు గౌరవంగా ఒక బంధిని ఘర్‌చోళా దుపట్టా, వీటన్నింటికీ యాంటిక్ రోజ్, బ్లష్  అండ్‌ మ్యూటెడ్ గోల్డ్ రంగుల కలయికను జోడించి.. నా పంజాబీ మూలాలకు నివాళిగా చివర్లో చక్కని ఫుల్కారీ బోర్డర్లతో దీనిని పూర్తి చేశారు. అంటూ నా ఈ కలని నిజం చేసి.. కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ గుర్తుండిపోయేలా, నా మనసుకు ఎంతో దగ్గరైన ఈ అద్భుతమైన పెళ్లి దుస్తులను రూపొందించినందుకు థాంక్యూ తరుణ్..." డిజైనర్‌పై కూడా ప్రశంసలు కురిపించిందామె.

డిజైనర్ తరుణ్ తహిలియాని రూపొందించిన కోరల్-పీచ్ కలర్ లెహంగాలో పెళ్లికూతురి లుక్‌లో మెరిసి పోయింది.. ఇందులో కాశీదా ఎంబ్రాయిడరీ, జరీ వర్క్ ఉన్నాయి. అలాగే రోహన్ కుటుంబ ఆచారాల ప్రకారం ఒక బంధిని ఘర్‌చోళా దుపట్టాను కూడా ధరించింది. ఈ దుపట్టాకు పంజాబీ మూలాలను ప్రతిబింబించేలా ఫుల్కారీ బోర్డర్లు అందంగా అమిరాయి.

 

హెవీ ఇయర్‌రింగ్స్, అందమైన హారం, కలీరాలు, మాంగ్ టీకా మరియు గులాబీ రంగు గాజులతో అన్షులా మెరిసిపోగా, వరుడు రోహన్ గోల్డెన్ కలర్ షేర్వాణీలో హుందాగా కనిపించాడు. ఇక  పెళ్లి మండపంలో అన్షులా తన తల్లి మోనా ఫోటోను ఒక కుర్చీలో ఉంచడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్షులా సోదరీమణులు,  జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ తోడిపెళ్ళికూతుళ్లుగా తళుక్కున మెరిసారు. 

రోహన్‌కు ప్రేమగా
అలాగే తన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ అన్షులా, "ఎంతమంది ఉన్నా, ఎన్ని మలుపులు ఎదురైనా..నా ఫేవరెట్ సంభాషణ,నా సేఫ్టీ ప్లేస్‌, నా ఈజీ ఛాయిస్ ఎప్పటికీ నువ్వే రోహన్" అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. అటు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య  జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా తమ అభిమానుల కోసం షేర్‌ చేశారు.  

ఇదీ చదవండి: కేతన్‌ హత్యకు నాలుగు నెలలముందే.. సీక్రెట్‌ మ్యారేజ్

అన్షులా - రోహన్ లవ్ స్టోరీ
జూన్ 21న  వీరి వివాహ వేడుకలు ప్రారంభం కాగా, జూలై 6, 2026న ఈ జంట అధికారికంగా వివాహ బంధంతో ఒకటియ్యారు. 2022లో మొదలైన అన్షులా, రోహన్ లవ్ స్టోరీ  ఇలా వివాహ  బంధంగా ముడి పడింది. 2023 మార్చిలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. అనంతరం  2025 జూలైలో నిశ్చితార్థం ఘనంగా  నిర్వహించుకున్నారు.

ఇదీ చదవండి: నీళ్లు ఇవ్వకపోతే..యుద్ధమే : రంకెలేస్తున్న పాకిస్థాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement