సెరెనా విలియమ్స్ చేతి ఉంగరం అన్ని కోట్లా..! ఆఖరికి నైల్స్‌కు కూడా.. | Serena Williams 3 Million Dollar Ring And Diamond Manicure Steal The Show During Wimbledon Comeback, Photos Went Viral | Sakshi
Sakshi News home page

Serena Williams: చేతి ఉంగరం అన్ని కోట్లా..! ఆఖరికి నైల్స్‌కు కూడా..

Jul 2 2026 2:02 PM | Updated on Jul 2 2026 2:27 PM

Serena Williams 3 Million Dollar  Ring And Diamond Manicure Steal The Show

అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్. ఆమె ఓపెన్ ఎరాలో అత్యధికంగా (23) గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన మహిళా క్రీడాకారిణి కూడా. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ ఏడాది వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీని అంగీకరించి, ప్రొఫెషనల్ సింగిల్స్ టెన్నిస్‌లోకి పునరాగమనం చేసింది. ఆమె పునరాగమనం మొదటి రౌండ్‌లోనే ఓటమితో ముగిసినప్పటికీ, అందరి దృష్టిని అమితంగా ఆకర్షించడం విశేషం. అందుకు కారణం ఆమె ధరించిన వజ్రపు ఉంగరం తోపాటు చేతికి ఉన్న గోళ్లు.

ఈ మ్యాచ్‌లో విలియమ్స్‌ రెడిట్ సహ-వ్యవస్థాపకుడు, భర్త అలెక్సిస్ ఓహానియన్ ఇచ్చిన ఎంగేజ్‌మెంట్‌ ఉంగరాన్ని ధరించింది. దీని ఖరీదు దాదాపు రూ. 28 కోట్లు పలుకుతుదట. మధ్యలో 17 క్యారెట్లు కట్‌ తెల్లని వజ్రం ఉండగా, దానికి ఇరువైపులా అదనపు రాళ్లు ఉంటాయి. చేతులు అందంగా కనిపించేలా చేసే మానిక్యూర్‌ అత్యంత హైలెట్‌గా కనిపించింది. ఎందుకంటే ఆ ఉంగరానికి అనుగుణంగా చేతి వేళ్ల గోళ్లను తీర్చిదిద్దిన విధం..అలాగే దానికి కూడా ఇచ్చిన డైమండ్‌ ఫినిష్‌ అందరి దృష్టిని ఆకర్షించేలా కట్టిపడేసింది. ఇది ఒకరకంగా ఆమెకు నెయిల్‌ ఆర్ట్‌ పట్ల ఉన్నం ఆసక్తిని చెప్పకనే చెబుతోంది. అలాగే ఆమె చేతికి ధరించిన విలాసవంతమైన వాచ్‌ కూడా అందర్నీ అమితంగా ఆకర్షించింది. 

గులాబీ రంగు ఛాయలున్న ఈ వాచ్‌ను వైట్ గోల్డ్‌తో తయారు చేసి, వజ్రాలతో అలంకరించారు. టెన్నిస్‌ టోర్నెమెంట్‌ డ్రెస్‌కోడుకు అనుగుణంగా లగ్జరీ ఫ్యాషన్‌ స్టైల్‌లో మెరిసింది. ఇక విలియమ్స్‌ చేతి వాచ్‌లో 22-క్యారెట్ల పింక్-గోల్డ్ అసిలేటింగ్ వెయిట్, నీలమణి క్రిస్టల్ కేస్ బ్యాక్‌లో పొదిగిన వజ్రాలు మరింత ప్రత్యేకత. అంతేగాదు ఆ గడియారంలో ఉండే అంకెలు కూడా 18-క్యారెట్ల బంగారంతో రూపొందించారు. అలాగే ఈ వాచ్‌లో మొత్తం 44 రత్నాల తోపాటు, 32 బ్రిలియంట్-కట్ వజ్రాలను పొదిగారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, దాదాపు నాలుగేళ్ల తర్వాత మంగళవారం జరిగిన తన మొదటి ప్రొఫెషనల్ సింగిల్స్ మ్యాచ్‌ రెండు గంటల 22 నిమిషాల పాటు కొనసాగింది. ఈ పోటీలో 87వ ర్యాంకు క్రీడాకారిణి అయిన జాయింట్‌ కీలకమైన క్షణాల్లో నిలకడగా షాట్లు కొడుతూ అమెరికన్ క్రీడాకారిణిని ఓడించి తన కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.

 

(చదవండి: ఆ మహిళ బ్రెయిన్‌లో 38 పరాన్న జీవులు..!కానీ సర్జరీ చేయకుండానే..)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement