ఎన్నో బ్యూటీటిప్స్..వివిధ రకాల ఫేషియల్స్ చూసి ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఫేషియల్ అసలు చూసుండరు.ఓ సెలూన్ షాపులో బార్బర్ చేసిన ఫేషియల్ ఇది. కానీ ఇదేం ఫేషియల్ అనిపిస్తుంది గానీ చివర్లో ముఖంలో వచ్చిన అద్భుతమైన మార్పుకి నోటమాటరాదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ ఉన్న హెయిర్‌డ్రెస్సర్ రషీద్ ఎంకే..షేర్ చేసిన షేషియల్ రొటీన్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదేంట్రా బాబు ఇవేం ఉత్పత్తులు అని విస్తుపోయారు. వాటితో ఫేషియల్ ఏంటి? అని అనిపించినా..రిజల్ట్ మాత్రం మాములుగా లేదు. ఇంతకీ అతడు వేటితో ఫేషియల్ చేశాడంటే..ఈనో, టూత్‌పేస్ట్, గులాబ్‌జల్‌తో ఓ వ్యక్తికి ఫేషియల్ చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
చక్కగా బ్యూటీపార్లర్‌లో చేసినట్లు మసాజ్ చేస్తాడు. కాసేపటి తర్వాత దాన్ని తొలగించగానే ముఖంంలో వచ్చిన గ్లోకి మైండ్‌బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి అంతకు ముందు ఫేస్‌కి ఆ తర్వాత మార్పు అలా ఇలా ఉండదు. నెటిజన్లు కూడా ఈ వీడియోని చూసి, వాటే క్రియేటివిటీ అని కొందరు, బాస్ ఇలాంటివి చర్మంపై రియాక్షన్ చూపించే ప్రమాదం ఉంటుంది అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: అచ్చం నీలాంబరి మూవీ రమ్యకృష్ణలా రక్తంతో ఫేషియల్..! అందం కోసం ఇంత పెయిన్ తప్పదా?)


