అచ్చం నీలాంబరి మూవీ రమ్యకృష్ణలా.. అలాంటి ఫేషియల్‌..! | Shehnaz Treasury's Honest Take on Viral Vampire Facial: How It Works | Sakshi
Sakshi News home page

అచ్చం నీలాంబరి మూవీ రమ్యకృష్ణలా రక్తంతో ఫేషియల్‌..! అందం కోసం ఇంత పెయిన్‌ తప్పదా?

Aug 14 2026 1:56 PM | Updated on Aug 14 2026 2:18 PM

Viral Video: Shehnaz Treasurys Honest Take On Viral Vampire Facial

అందం అంటే శుభ్రంగా తినడం, ఖరీదైన చర్మ సంరక్షణ, వేలకు వేలు బ్యూటీపార్లర్‌ ఖర్చులు మాత్రమే కాదండోయ్‌. ప్రముఖ డెర్మటాలజీ చికిత్సలు కూడా ఉంటాయి. అదే సెలబ్రిటీల నవయవ్వన రహస్యం. అయితే దాని వెనుక నొప్పి కూడా భరించాల్సిందే. కేవలం మొటిమలు, లేజర్‌ ట్రీట్‌మెంట్, వంటి కాస్మెటిక్‌ చికిత్సలు గురించి విన్నాం. ఇంకాస్తా ముందడుగు వేస్తే..చిన్న చిన్న సూదుల చికిత్సతో వృద్ధాప్యాన్ని నివారించే వాటి గురించి విన్నాం, చూశాం కూడా. అయితే ఇదే ఏకంగా వాటిన్నిటిని మించిన షేషియల్‌ చికిత్స. సింపుల్‌గా చెప్పాలంటే మీ రక్తంతోటే మిరుమిట్లు గొలిపే అందం. వాట్‌ ఇందేంటి. అనుకోకండి. అదెలా చేస్తారు, ఎలా ఉంటుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

సౌందర్యానికి సంబంధించి..వైద్య క్లినిక్స్‌లో హైడ్రా ఫేషియల్స్, ఆక్సిజన్ ఫేషియల్స్, కెమికల్ పీల్స్, LED థెరపీ ఫేషియల్స్, వైరల్ వాంపైర్ ఫేషియల్ వంటివి ఎంచుకుంటారు. ఇవే కాకుండా రక్తపిశాచి లాంటి ఒక చికిత్స ఉంది. అది అచ్చం నీలాంబరి మూవీలో అందంకోసం రమ్మకృష్ణ అందమైన యువకుల రక్తం ఎక్కించుకుంటే..అత్యంత అందంగా మారిపోతుందే అలాంటి చికిత్స ఇది. అయితే ఇందులో వేరేవాళ్ల రక్తం కాకుండా మన నుంచి తీసుకున్న బ్లడ్‌తోనే చేస్తారట.

ఎలాగంటే..
ఒక ప్రొఫెషనల్ వైద్యుడు సాధారణ రక్త పరీక్ష వలె చేయి నుంచి కొంత రక్తాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత రక్తం నుంచి ప్లేట్‌లెట్‌లను వేరు చేసే యంత్రంలో సీనాని పెడతారు. ఆ తర్వత ముఖం అంతట చిన్న సూదులు అమర్చిన పరికరంతో ముఖంపై ఒకవైపు అంతా అప్లై చేస్తారు. చూడటానికి ఇది చాలా నొప్పిగా ఉంటుంది. కానీ అంత నొప్పి ఏ మాత్రం ఉండదట. లాస్ట్‌లో ఆ రక్తంలోని ప్లాస్మానికి ముఖానికి అంతటా అప్లై చేస్తాడు. చిన్న సూదుల గుండా ముఖంలోకి చొప్పిస్తాడు. ఆ తర్వాత ముఖం చూస్తే నిజంగా రక్తపిశాచి మాదిరిగా భయానకంగా కనిపిస్తుంది. 

ఎందుకంటే ఒక వైపు అంత ఎర్రగా కందిపోయి ఉంటుంది. అయితే ఎరుపు రంగు సాయంత్రం కల్లా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ చికిత్స చేసిన ముఖం వైపు కన్ను చాలా మెరుగ్గా కనిపిస్తుందట. ఇది ఎలాంటిదంటే మన నుంచి రక్తం తీసుకుని వెయ్యిసార్లు ముఖంపై పొడిచి సౌందర్య చికిత్స అట. దీని గురించి సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు నటి షెహ్నాజ్ ట్రెజరీ. ఆమె ఎంటీవీ వీజేగా కెరీర్‌ ప్రారంభించి తెలుగు, హిందీ తోపాటు కొన్ని హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించిందామె.  

 

(చదవండి: 51 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్‌ సీటు..!1992లోనే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement