10 ఏళ్లకు స్లైల్‌ మార్చిన ఇన్‌స్టా, నెటిజన్ల స్పందన వైరల్‌ | Instagram new logo sparks buzz as platform changes wordmark after 10 years | Sakshi
Sakshi News home page

10 ఏళ్లకు స్లైల్‌ మార్చిన ఇన్‌స్టా, నెటిజన్ల స్పందన వైరల్‌

Aug 14 2026 12:14 PM | Updated on Aug 14 2026 12:26 PM

Instagram new logo sparks buzz as platform changes wordmark after 10 years

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ (Instagram) తన స్టైల్‌ మార్చుకుంది.  దాదాపు పదేళ్ల  తర్వాత తన వర్డ్‌మార్క్ లోగో (అక్షరాల శైలి)ను రీఫ్రెష్ చేసింది. ఈ విషయాన్ని మెటా ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆదమ్ మోస్సేరి ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్ వేదికగా వెల్లడించారు.  దీంతో నెటిజన్ల ఫన్నీ కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. 

గత 10 ఏళ్లుగా యాప్ పైన ఉండే వర్డ్‌మార్క్ మారలేదు. అందుకే ఈ మార్పు చేశాం. ఇది మరింత క్లీన్‌గా, మోడరన్‌గా ఉంటూనే ఇన్‌స్టాగ్రామ్ ఒరిజినల్ శైలిని ప్రతిబింబిస్తుంది అంటూ ఆదమ్ మోస్సేరి  ఈ మార్పుపై వివరణ ఇచ్చారు.

 ఇన్‌స్టాగ్రామ్ పేరులోని అక్షరాల రూపాన్ని (Typography) పునఃరూపకల్పన చేశారు. పాత స్క్రిప్ట్ శైలినే కొనసాగిస్తూనే, అక్షరాలను మరింత స్పష్టంగా, ఆధునికంగా తీర్చిదిద్దారు. అయితే  అందరికీ సుపరిచితమైన రంగుల గ్రాడియంట్ కెమెరా ఐకాన్ (Camera Icon)లో ఎలాంటి మార్పు లేదు. 2016లో క్లాసిక్ బ్రౌన్ కెమెరా స్థానంలో ఈ గ్రాడియంట్ ఐకాన్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

 


సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన
ఈ కొత్త డిజైన్‌పై నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రాండ్ అసలుగుర్తింపు దెబ్బతినకుండా చక్కగా మోడరనైజ్ చేశారని కొందరు యూజర్లు మెచ్చు కుంటున్నారు. మరికొందరు ఈ డిజైన్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రూపొందించినట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. వర్డ్‌మార్క్‌లోని 'r' అక్షరం చూడటానికి 'z' లాగా కనిపిస్తోందని, ఇన్‌స్టాగ్రామ్‌ కాస్త "Instagzam" లా మారింది అంటూ  మరికొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement