రోడ్డుపై టైగర్‌ : సెల్ఫీలకు ఎగబడిన పర్యాటకులు, వీడియో వైరల్‌ | Tiger Video From Maharashtra Highlights Growing Risk Of Wildlife Tourism | Sakshi
Sakshi News home page

రోడ్డుపై టైగర్‌ : సెల్ఫీలకు ఎగబడిన పర్యాటకులు, వీడియో వైరల్‌

Aug 13 2026 5:14 PM | Updated on Aug 13 2026 5:29 PM

Tiger Video From Maharashtra Highlights Growing Risk Of Wildlife Tourism

సాక్షి, ముంబై:  మహారాష్ట్రలోని తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్ (Tadoba-AndhariTiger Reserve) సమీపంలోని రహదారిపై పులి కనిపించినప్పుడు పర్యాటకులు ప్రవర్తించిన తీరు, ప్రమాదకర ప్రవర్తనపై వన్యప్రాణి ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల పట్ల పర్యాటకుల ప్రవర్తనపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో, ప్రజలు తమ వాహనాల నుండి దిగి, ఫోటోలు తీయడానికి, వీడియోలు రికార్డ్ చేయడానికి, సోషల్ మీడియా రీల్స్ (Reels) కోసం పెద్ద పులికి ప్రమాదకరంగా దగ్గరగా వెళ్లడం కనిపిస్తుంది. వన్యప్రాణుల ప్రేమికులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు . జంగిల్ సఫారీల సమయంలో అన్ని భద్రతా మార్గదర్శకాలను పాటించాలని పర్యాటకులను కోరారు. సఫారీ ఉద్దేశం వన్యప్రాణులను సురక్షితమైన దూరం నుంచి పరిశీలించడమే తప్ప, వాటికి అంతరాయం కలిగించడం లేదా వాటిని రెచ్చగొట్టడం కాదని నిపుణులు తెలిపారు.

ఇదీ చదవండి: మాల్యా కేసు : బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు 

అటవీ అధికారుల సూచనలు:

  • పులులు లేదా ఇతర అడవి జంతువులు సోషల్ మీడియా సెల్ఫీల కోసం వస్తువులు కావని అధికారులు స్పష్టం చేశారు.

  • వాహనాలు దిగడం, జంతువులకు అడ్డంగా వెళ్లడం, వాటిని తారసపడటం లేదా గట్టిగా అరిచి శబ్దాలు చేయడం వల్ల అవి ఒత్తిడికి గురై దాడి చేసే ప్రమాదం ఉందన్నారు.

    నిజమైన వన్యప్రాణి అనుభూతికి దగ్గరగా వెళ్లడం అవసరం లేదని, కానీ జంతువు స్వేచ్ఛగా తిరగడానికి తగినంత స్థలం ఇచ్చి, దానిని దాని సహజ స్థితిలో ఉండనివ్వాలని పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులు గుర్తుంచుకోవాలని కోరారు.

  • సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం క్రూర మృగాలను వేధించకుండా, అటవీ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పర్యాటకులకు, సఫారీ గైడ్‌లకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ లేబుల్స్‌ : సుప్రీం సీరియస్‌, కేంద్రానికి అల్టిమేటం

వన్యప్రాణులను దగ్గరగా చూడటం కోసం లేదా వైరల్ వీడియో కోసం పర్యాటకులు వన్యప్రాణులకు దగ్గరగా వెళ్లి,ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్న ఘటన ఇదే తొలిసారికాదు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు చాలానే ఉన్నాయి.

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ (జనవరి 2026): ఉత్తరాఖండ్‌లోని ఫాటో ఎకో-టూరిజం జోన్‌లో ఒక పులిని సఫారీ వాహనాలు వేగంగా తరిమిన వీడియో వైరల్ అవ్వడంతో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు గైడ్‌లపై అటవీశాఖ నిషేధం విధించింది.

ముదుమలై టైగర్ రిజర్వ్ (నవంబర్ 2024): తమిళనాడులోని ఈ రిజర్వ్‌లో వాహనం దిగి జింకల మందను తరిమిన ముగ్గురు పర్యాటకులకు అటవీ అధికారులు రూ. 15,000 జరిమానా విధించారు.

ఇదీ చదవండి: 360 ఎకరాల ‘దెయ్యాల నగరం’ : రూ. 13.3 కోట్లకు వ్యాపారవేత్త డీల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement