breaking news
Maharashtra
-
‘మరాఠిని అవమానిస్తే ఉపేక్షించం’
ముంబై: ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠీ భాషకు సంబంధించి రగడ మొదలైంది. ఇప్పటికే త్రి భాషా పాలసీ తీర్మానాన్ని రద్దు చేయించడంలో ముఖ్య భూమిక పోషించిన ప్రతిపక్ష పార్టీలు.. ఇప్పుడు మరాఠి భాషను ఎవరైనా అవమానిస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు పంపుతున్నాయి. . ఓ షాపు కీపర్ మరాఠి భాష మాట్లాడలేదనే కారణంతో అతనిపై ఓ వర్గం దాడికి దిగడంపై శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మాట్లాడారు. ఎవరూ కూడా ఈ తరహా దాడులు చేసి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దంటూనే మరాఠీ భాషను మహారాష్ట్రలో ఉండేవారు ఎవరైనా అవమానిస్తే మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఒకవేళ అలా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఎమ్మెన్నెస్‌కు చెందిన కార్యకర్తలు పలువురి కలిసి ఓ స్టీట్ షాపు కీపర్‌పై దాడి చేశారు. సదరు షాప్ కీపర్ మరాఠీ మాట్లాడనందుకు, ఆ భాషా మాట్లాడటం ఏమైనా తప్పనిసరి చేశారా? అని ప్రశ్నించినందుకు ఎమ్మెన్నెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన జరిగి ఒక రోజు తర్వాత ఆదిత్యా ఠాక్రే మాట్లాడారు. ఎవరైన మరాఠీ భాషను అవమానిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. అదే సమయంలో ఎవరూ భౌతిక దాడులకు దిగవద్దని, మరాఠీ భాషన అవమానించే వారికి చట్టపరంగా బుద్ధి చెబుదామన్నారు.ఇప్పుడు దీనిపై అధికార బీజేపీకి ప్రతిసక్ష పార్టీలకు మహారాష్ట్రలో తీవ్ర రగడ జరుగుతోంది. మరాఠీ భాష మాట్లాడడం అనేది తప్పనిసరిక, కానీ ఇలా భాష మాట్లాడలేదని దాడులకు దిగి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎంతమాత్రం తగదని మహారాష్ట్ర మంత్రి,, శివసేన నాయకుడు యోగేష్ కదమ్ స్పష్టం చేశారు. #WATCH | Mumbai | On a viral video of a shop owner in Thane assaulted for purportedly refusing to speak in Marathi, Maharashtra Minister Yogesh Kadam says, "In Maharashtra, you have to speak Marathi. If you don't know Marathi, your attitude shouldn't be that you won't speak… pic.twitter.com/kSXV1JekAn— ANI (@ANI) July 3, 2025 -
మళ్లీ వస్తా.. యువతిపై డెలివరీ బాయ్ ఘాతుకం.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ దిగి..
పూణే: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి పార్సిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు నిందితుడు అంతటితో ఆగకుండా ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ రాసిపెట్టేసి వెళ్లిపోయాడు. దీంతో, ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.వివరాల ప్రకారం.. పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి బాధితురాలు(22) నివాసం ఉంటోంది. అయితే, ఆమెకు వచ్చిన పార్సిల్‌ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడు. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడు. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లింది. ఆమె లోపలికి వెళ్లగానే డెలివరీ బాయ్ డోర్ క్లోజ్ చేసి.. ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ ఓ పేపర్‌పై రాసిపెట్టే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని హెచ్చరించి పరారయ్యాడు. ఓ గంట తర్వాత బాధితురాలు స్పృహలోకి కన్నీరు పెట్టుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు.. ఆమె ఇంటికి చేరుకుని వివరాలను సేకరించారు. బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజ్ కుమార్ షిండే మాట్లాడుతూ.. ఇంట్లో బాధితురాలి సోదరుడు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి కోసం గాలిస్తున్నాం. సీసీ కెమెరాల ఆధారం అతడి గురంచి అన్వేషిస్తున్నాం. లైంగిక దాడి, మహిళపై దాడి, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. బాధితురాలి మొబైల్ సెల్ఫీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. నిందితుడు ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి ఏదో పదార్థాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఏదైనా స్ప్రే ఉపయోగించారా? అని వివరాలు సేకరిస్తున్నాం అని తెలిపారు. VIDEO | Here's what Pune Deputy Commissioner of Police (Zone 5) Rajkumar Shinde said on the alleged rape of a 22-year-old woman in her apartment by a courier delivery executive:"A case has been registered under Bharatiya Nyaya Sanhita sections 64 (punishment for rape), 77… pic.twitter.com/rbxvN86an9— Press Trust of India (@PTI_News) July 3, 2025 -
‘మహా’ యూ టర్న్ చూసి.. రెండు భాషలకు కర్నాటక
ముంబై: మహారాష్ట్ర పాఠశాలల్లో త్రిభాషా విధానం అమలు చేయాలనుకున్న ప్రభుత్వ నిర్ణయంపై వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ పరిణామాలను గమనించిన కర్నాటక కూడా ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది.జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)దేశవ్యాప్తంగా పాఠశాలల్లో త్రిభాషా సూత్రాన్ని సిఫార్సు చేసినప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా దానిని తిరస్కరించింది. మహారాష్ట్ర సర్కారు ప్రాథమిక పాఠశాలలకు త్రిభాషా విధానాన్ని నిలిపివేసిన దరిమిలా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమ ప్రభుత్వం కూడా పాఠశాల విద్యావిధానంలో ద్విభాషా సూత్రానికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. మైసూరులో విలేకరులతో మాట్లాడిన సిద్ధరామయ్య తాము ద్విభాషా విధానానికి అనుకూలంగా ఉన్నామని, తమ ప్రభుత్వం దీనికే కట్టుబడి ఉంటుందని ప్రకటించారు.వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలల్లో భాషా విధానాలపై చర్చలు జరుగుతున్న సమయంలో సీఎం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక పాఠశాలల్లో ప్రస్తుతమున్న విద్యావిధానంలో.. విద్యార్థులు ఐదవ తరగతి వరకు రెండు భాషలు నేర్చుకోవాలి. ఆరవ తరగతి నుండి హిందీని మూడవ భాషగా ప్రవేశపెడతారు. ఎనిమిదవ తరగతిలో విద్యార్థులకు కన్నడ, ఇంగ్లీష్ లేదా సంస్కృతంలలో ఏదో ఒక దానిని మొదటి భాషగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా విద్యార్థి సంస్కృతాన్ని మొదటి భాషగా ఎంచుకున్న పక్షంలో, వారికి కన్నడ మూడవ భాషగా తప్పనిసరి అవుతుంది.ఇది కూడా చదవండి: ‘భాగస్వామి’పై దారుణం.. మృతదేహంతో రెండు రోజులు సావాసం -
Maharashtra:‘హిందీ’పై గరంగరం.. త్రిభాషా విధానం రద్దు
ముంబై: మహారాష్ట ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై వెనక్కు తగ్గింది. త్రిభాషా విధానంలో భాగంగా హిందీని తప్పనిసరి చేసే ప్రభుత్వ ప్రయత్నాన్ని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శించిన దరిమిలా తాజా నిర్ణయం తీసుకుంది. ఈ విధానం అమలుపై ఒక కమిటీ సమగ్రంగా చర్చించనున్నదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ ‘పాఠశాలల్లో వివిధ భాషలను ఏ ప్రమాణాల ప్రకారం అమలు చేయాలి? విద్యార్థులకు ఏ ఎంపికలు ఇవ్వాలి? అనేది నిర్ణయించేందుకు విద్యావేత్త డాక్టర్ నరేంద్ర జాదవ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా, రాష్ట్ర ప్రభుత్వం త్రిభాషా విధానం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు ఏప్రిల్ 16, జూన్ 17న జారీ చేసిన రెండు ప్రభుత్వ తీర్మానాలను రద్దు చేస్తున్నాం’ అని ప్రకటించారు.ఫడ్నవీస్ ప్రభుత్వం గతంలో ఒక ప్రకటనలో ఇంగ్లీష్, మరాఠీ మీడియం పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుండి ఐదవ తరగతి విద్యార్థులకు హిందీని తప్పనిసరి మూడవ భాషగా వెల్లడించింది. దీనిపై శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన, ఎన్సీపీ (ఎస్పీ)ల ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం మరాఠీపై దృష్టి సారిస్తుందని ప్రకటించారు. అలాగే ఇంగ్లీషును అంగీకరించిన ఉద్ధవ్ థక్రే తీరును ఆయన తప్పుబట్టారు. గతంలో త్రిభాషా విధానం అమలుపై ఒక కమిటీని ఏర్పాటు చేయాన్న డాక్టర్ రఘునాథ్ మషేల్కర్ కమిటీ సిఫార్సులను ఉద్ధవ్ థాక్రే అంగీకరించారని ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ హిందీ భాష నేర్చుకోవాలని కోరుకున్నారని సీఎం ఫడ్నవీస్ అన్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్, నెతన్యాహులపై ఇరాన్ ఫత్వా.. ప్రపంచవ్యాప్త పిలుపు -
దిగొచ్చిన ‘మహా’ సర్కారు.. 'హిందీ తప్పనిసరి' తీర్మానం రద్దు
ముంబై: దేశ వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్న ‘త్రి భాషా విధానం’లో భాగంగా హిందీని తప్పనిసరి చేయాలనే అంశంపై పలు రాష్ట్రాల్లో తీవ్ర నిరసలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో కూడా ఈ సెగ గట్టిగానే ఉండటంతో ఫడ్నవీస్ సర్కార్ వెనక్కి తగ్గింది. ఈ త్రి భాషా విధానం పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో పడింది. గత ఉద్ధవ్ ఠాక్రే సర్కారే దీనికి ఆమోదం తెలిపి, ఇప్పుడు నిరసనలకు పిలుపునివ్వడంపై ఫడ్నవీస్ తప్పుబడుతున్నారు. మహారాష్ట్రలో మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషలు ఒకటో తరగతి నుంచే అమలు చేయాలని ఉద్ధవ్ సర్కార్ అప్పుడు నిర్ణయం తీసుకుని, ఇప్పుడు ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నారని సీఎం ఫడ్నవీస్ ప్రశ్నించారు. త్రి భాషా విధానంపై శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో నిరసన సెగ తీవ్రతరమైంది. హిందీని తప్పనిసరి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తీర్మానాన్ని వ్యతిరేకించాలని, దానికి సంబంధించిన తీర్మానం ప్రతులను చించి వేయాలని శివసేన(యూబీటీ) చీఫ ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించారు. దక్షిణ ముంబైలో జరిగే నిరసన కార్య క్రమానికి నేటి నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే ఆ పాలసీని రద్దు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
అంబేడ్కర్ ఆశయం ‘ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం’
నాగపూర్: దేశాన్ని ఐక్యంగా ఉంచాలంటే ఒక్కటే రాజ్యాంగం అమల్లో ఉండాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ నిర్దేశించారని, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రాజ్యాంగం అనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. ఆయన ఆశయం ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం అని స్పష్టంచేశారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో శనివారం ‘రాజ్యాంగ ప్రవేశిక ఉద్యానవనాన్ని’ జస్టిస్ గవాయ్ ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ఐక్యతకు ఏకైక రాజ్యాంగం అనే అంబేడ్కర్ దార్శనికత నుంచి సుప్రీంకోర్టు స్ఫూర్తి పొందిందని, అందుకే ఆర్టీకల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిందని తెలిపారు. ఈ ఆర్టీకల్ రద్దును సమర్థించిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ సైతం ఉన్న సంగతి తెలిసిందే. ఆర్టీకల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు తమ ముందుకు వచ్చినప్పుడు అంబేడ్కర్ మాటలు గుర్తుచేసుకున్నానని జస్టిస్ గవాయ్ చెప్పారు. దేశానికి ఒక్కటే రాజ్యాంగం ఉండాలన్న అంబేడ్కర్ బాటను అనుసరిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఐక్య భారత్ రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలు అధికంగా ఉన్నట్లు అంబేడ్కర్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయని జస్టిస్ గవాయ్ గుర్తుచేశారు. యుద్ధాలు జరిగితే దేశం ఐక్యంగా ఉండలేదని, ముక్కలవుతుందని చాలామంది అనుమానించారని చెప్పారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడంతోపాటు అన్ని రకాల సవాళ్లు సమర్థంగా ఎదుర్కోగల సత్తా రాజ్యాంగానికి ఉందని అంబేడ్కర్ బదులిచ్చారని పేర్కొన్నారు. పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఏం జరుగుతోందో చూడాలని, ఎన్ని సవాళ్లు ఎదురైనా మన దేశం మాత్రం దృఢంగా, ఐక్యంగానే ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ప్రసంగించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే గొప్ప బహుమతులను రాజ్యాంగం రూపంలో అంబేడ్కర్ మనకు అందించారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలోని నాలుగు మూలస్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా రంగాల బాధ్యతలు, హక్కులను రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిందని వెల్లడించారు. కొలీజియంపై పదవీ విరమణ తర్వాత మాట్లాడుతా.. ముంబై: న్యాయమూర్తులకు పదోన్నతులు, నియామకాలు, కొలీజియం తీసుకుంటున్న నిర్ణయాలపై పదవీ విరమణ (ఈ ఏడాది నవంబర్ 24) చేసిన తర్వాత వివరంగా మాట్లాడతానని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. ఇప్పుడు తనకున్న పరిమితుల దృష్ట్యా ఆయా అంశాలపై ఎక్కువగా స్పందించలేనని పేర్కొన్నారు. మనం కోరుకున్నట్లుగా ఏదీ జరగదని న్యాయమూర్తులు, న్యాయవాద వర్గాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో అడ్వొకేట్స్ అసోసియేషన్ ఆఫ్ బాంబే హైకోర్టు బెంచ్ ఆధ్వర్యంలో జస్టిస్ గవాయ్‌ని తాజాగా సన్మానించారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ సంజయ్ వి.గంగాపూర్వాలాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం దక్కలేదని అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ వి.గంగాపూర్వాలాను ఉద్దేశిస్తూ.. ‘‘సంజయ్ భాయ్.. సుప్రీంకోర్టుకు రాకపోవడం వల్ల మీరు నష్టపోయింది ఏమీ లేదు. సుప్రీంకోర్టే నష్టపోయింది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను’’ అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలీజియంలో సభ్యుడిగా చేరినప్పటి నుంచి ప్రతిభకే పట్టం కట్టేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. ప్రతిభ ఆధారంగా న్యాయమూర్తులను నియమించడానికి తపన పడుతున్నానని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ఉన్న ఉత్తమమైన ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా రావాలన్నదే తన ఉద్దేశమని, అందుకోసం కొలీజియంలోని సహచర సభ్యులను ఒప్పిస్తుంటానని అన్నారు. జడ్జీల నియామకం కోసం పేర్లను ఒకసారి షార్ట్‌లిస్టు చేసే సమయంలో వారి కులం, మతం, ప్రాంతం చూసే అలవాటు లేదని చెప్పారు. వారికి అర్హత ఉందా? లేదా? వారికి చట్టాలు తెలుసా? లేదా? అనేది మాత్రమే చూస్తామని స్పష్టంచేశారు. జస్టిస్ ఏఎస్ చందూర్కర్ ఇటీవల బాంబే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చారని, ఆయన తన పాత మిత్రుడేనని, గతంలో కలిసి పని చేశామని జస్టిస్ గవాయ్ వెల్లడించారు. ఆయనకు పదోన్నతి కలి్పంచే విషయంలో ఆ స్నేహాన్ని పక్కనపెట్టి, అర్హతలు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని స్పష్టంచేశారు. -
20 ఏళ్ల తర్వాత థాక్రే బద్రర్స్ రీయూనియన్.. దేనికి సంకేతం?
మహారాష్ట్ర రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా?. రాజకీయంగా తీవ్ర విభేదాలతో రెండు దశాబ్దాలపాటు దూరంగా ఉన్న సోదరులు ఉద్దవ్ థాక్రే, రాజ్ థాక్రే.. ఒకే వేదికను పంచుకోబోతుండడమే ఇందుక కారణం. ఈ బ్రదర్స్ రీయూనియన్పై ఇప్పుడు మరాఠానాట ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) కింద త్రిభాషా సూత్రం అమలులో భాగంగా.. పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ విపక్షాలు జులై 5వ తేదీన నిరసనకు పిలుపు ఇచ్చాయి. ఈ కార్యక్రమానికి శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేతలు మద్దతు ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ పోస్టులో శివసేన (యూబీటీ)ఎంపీ, ప్రతినిధి సంజయ్ రౌత్ తెలియజేశారు. తొలుత ఈ రెండు పార్టీలు ఈ అంశంపై వేర్వేరుగా నిరసనలను చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ఇద్దరు నేతలు మరాఠీల ప్రయోజనం కోసం వేర్వేరు నిరసనలు నిర్వహించడం సముచితం కాదని గ్రహించి, నిరసన ప్రదర్శనలను సంయుక్తంగా నిర్వహించాలని ప్రతిపాదించారు. మహారాష్ట్ర సర్కారు మరాఠీ , ఇంగ్లీష్-మీడియం పాఠశాలల్లో ఒకటి నుండి ఐదు తరగతుల వరకు హిందీని తప్పనిసరి మూడవ భాషగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనిపై పలు వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే సోదరుడు శ్రీకాంత్ థాక్రే తనయుడే రాజ్ థాక్రే. శ్రీకాంత్ థాక్రే రాజకీయాల్లో క్రియాశీలకంగా లేనప్పటికీ.. ఆయన తనయుడు రాజ్ థాక్రే.. బాల్ థాక్రే వారపత్రిక మార్మిక్లో కార్టూనిస్ట్‌గా పనిచేశాడు. అక్కడి నుంచే ఆయన రాజకీయ ప్రస్థానానికి పునాది పడింది. అయితే..90వ దశకంలో శివసేనలో రాజ్ థాక్రేకు మంచి ప్రజాదరణ ఉండేది. పార్టీ శ్రేణులు, బాల్ థాక్రే అభిమానులు రాజ్‌నే వారసుడిగా భావించేవారు. కానీ 2003లో బాల్ థాక్రే తన కుమారుడు ఉద్ధవ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాడు. దీంతో రాజ్ అసంతృప్తికి లోనయ్యారు. తదనంతర పరిణామాలతో.. 2006లో శివసేనను విడిచిపెట్టి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అనే కొత్త పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ఈ సోదరుల మధ్య రాజకీయంగా తీవ్ర విభేదాలు కొనసాగాయి.దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ ఒకే సమస్యపై రాజకీయ వేదికను పంచుకోవాలనుకోవడం.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇది తాత్కాలిక ఐక్యతా? లేక శివసేన పునఃఏకీకరణకు సంకేతమా?.. బీజేపీ రాజకీయంపై ఇది ఎలాంటి ప్రభావం చూపించబోతోందో?.. అంటూ మహారాష్ట్రలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇది కూడా చదవండి: kerala: స్కూళ్లలో ‘జుంబా’ వార్.. ఆరోగ్యానికే అంటున్న విద్యాశాఖ -
వెండి కంచాల్లో విందు.. వివాదంలో బీజేపీ సర్కార్
ముంబై: మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై కొత్త వివాదం నెలకొంది. ప్రభుత్వం వృథా ఖర్చులపై కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ కార్యక్రమంలో అతిథులకు భారీ ఖర్చుతో వెండి పళ్లెంలో ఆహారం వడ్డించడం వివాదాస్పదంగా మారింది. అంత ఖర్చు చేసి వెండి ప్లేట్లలో వడ్డించాల్సిన అవసరమేంటని హస్తం నేతలు ప్రశ్నిస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబై వేదికగా పార్లమెంట్ అంచనాల కమిటీ ప్లాటినం జూబ్లీ సమావేశం జరిగింది. ముంబైలోని విధాన్ భవన్ కాంప్లెక్స్‌లో రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా దాదాపు 600 మంది అతిథులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అతిథులకు విలాసవంతమైన హోటల్లో వెండి ప్లేట్లలో, భారీ ఖర్చుతో భోజనం వడ్డించారు. దీంతో, ఈ ఘటన వివాదానికి దారి తీసింది. అతిథులు ఒక్కొక్కరికి రూ.550 చొప్పున అద్దెకు తీసుకున్న వెండి డిన్నర్ ప్లేట్లపై రూ.5,000 విలువైన భోజనం వడ్డించారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది.ఈ సందర్బంగా కాంగ్రెస్ శాసనసభా నాయకుడు విజయ్ వాడేట్టివార్స్ స్పందిస్తూ..‘రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో ఇంత ఖర్చు చేసి వెండి ప్లేట్లపై అతిథులకు వడ్డించడం ఎందుకు?. విలాసవంతమైన విందు ఎందుకు ఇచ్చారు. దీని కోసం దాదాపు 27 లక్షలు ఖర్చు చేశారు. ఇదంతా వృథా ఖర్చే కదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయలేదు. బోనస్‌లు చెల్లించడం లేదు. అనేక సంక్షేమ పథకాల్లో కోతలు విధించారు. కానీ, ఇలాంటి ఖర్చులు చేయడానికి మాత్రం బీజేపీ ప్రభుత్వం వెనుకాడదు అంటూ చురకలు అంటించారు.While enjoying ₹4,500 meals served in silver platters with royal Peshwa-style flair, and staying in luxury hotels like Taj and Trident, members of the Estimates Committee proclaimed in the conference that,“Estimates Committees must ensure that every rupee is spent for public… pic.twitter.com/mMwjbCkWGv— Vijay Kumbhar (@VijayKumbhar62) June 25, 2025మరోవైపు.. ఈ సమావేశంపై సామాజిక కార్యకర్త కుంభార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన..‘రాజ పేష్వా శైలి వైభవంతో వెండి ప్లేట్లతో అతిథులకు భోజనం వడ్డించారు. తాజ్, ట్రైడెంట్ వంటి లగ్జరీ హోటళ్లలో అంచనాల కమిటీ సభ్యులు బస చేశారు. అంచనాల కమిటీ అంటే ప్రతీ రూపాయిని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయడం కోసం ఆలోచించాలి. కానీ, ఇలాంటి దుబారా ఖర్చులు చేయడమేంటి?. ఇలాంటి వారు.. ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తారా? అని ప్రశ్నించారు. 5000 ఖర్చు చేసే భోజనం పెట్టి వెండి ప్లేట్ల కోసం 27 లక్షలు ఖర్చు చేశారు’ అని మండిపడ్డారు.అయితే, కాంగ్రెస్ నేతలు, పలువురు ఆరోపిస్తున్నట్టు అవి వెండి ప్లేట్లు కాదని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేవలం వెండి పూత మాత్రమే ప్లేట్లకు పూసి ఉందని అంటున్నారు. అలాగే, భోజనం ఖర్చు కూడా 5000 కాదని తక్కువగా ఉందని వ్యాఖ్యలు చేశారు. -
ఓ తండ్రి దారుణం.. మార్కులే జీవితమా?
సాంగ్లీ: నీట్లో తక్కువ మార్కులు వచ్చాయని ఓ తండ్రి.. కూతురిని కొట్టి చంపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సాంగ్లికి చెందిన 17 ఏళ్ల సాధన వైద్య జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) రాసింది. ఇటీవలే ఫలితాలు వచ్చాయి. సాధనకు తక్కువ మార్కులు రావడంతో ఆగ్రహించిన ధోండి రామ్ భోస్లే శుక్రవారం రాత్రి ఆమెను కర్రతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాలికను ఆమె తల్లి ప్రీతి భోస్లే.. స్థానిక ఆసుపత్రికి తరలించింది. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు.అనంతరం, అక్కడ చికిత్స పొందుతూ సాధన మరణించింది. కూతురికి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత ప్రీతి.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు.. ధోండి రామ్ భోస్లేను ఆదివారం అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. జూన్ 24 వరకు పోలీసు కస్టడీకి విధించారు. -
నాడు పేదరికంతో గాజులమ్మాడు, వైకల్యం వెక్కిరించినా.. నేడు ఐఏఎస్‌గా
పుట్టింది నిరుపేద కుటుంబం. కుటుంబాన్ని పోషించడానికి అతను తన తల్లితో కలిసి వీధుల్లో గాజులు అమ్మాడు. మరోవైపు పోలియోతో వైకల్యం. అయితేనేం కఠిన శ్రమ , దృఢ సంకల్పంతో అనుకున్నది సాధించాడు. సాధించాలన్న పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులను ఎదుర్కొని విజయం సాధించవచ్చు అని నిరూపించాడు రమేష్ ఘోలాప్. ఇంతకీ ఆయన ఏం సాధించారు. పదండి రమేష్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.'కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి' అనే దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల్ని అక్షరాలా నిరూపించారు వికలాంగుడైన రమేష్ ఘోలప్. ఒకప్పుడు పొట్ట కూటి కోసం గాజులు అమ్మిన ఆ కుర్రాడే.. ప్రస్తుతం ఐఏఎస్‌గా సేవలందిస్తున్నాడు. కన్న తల్లికీ, పుట్టిన గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో సైకిల్ మరమ్మతు దుకాణం నడిపే నిరుపేద గోరఖ్ ఘోలాప్‌కు జన్మించాడు రమేష్. చిన్నతనంలోనే ఎడమకాలికి పోలియో సోకింది. అయినా ఏ మాత్రం నిరాశ చెందలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. మద్యం కారణంగా అతని తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో, చిన్న వయసులోనే నలుగురు సభ్యుల కుటుంబ బాధ్యతను తీసుకోవలసి వచ్చింది. కుటుంబ పోషణ కోసం తన తల్లితో కలిసి వీధుల్లో గాజులు అమ్మడం మొదలుపెట్టాడు. కానీ చదువులో రమేష్ ఎప్పుడూ క్లాస్ ఫస్టే. 12వ తరగతిలో ఉన్నప్పుడు తండ్రి చనిపోవడంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. తండ్రి అంత్యక్రియలకు బస్సు ఛార్జీలు చెల్లించడానికి కూడా డబ్బులులేని పరిస్థితి. ఈ తన దయనీయ స్థితి బైట పడాలంటే చదువే మార్గం అని గ్రహించాడు. అతను కష్టపడి పనిచేస్తూనే పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, అతను D.Ed (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) అత్యంత చౌకైన కోర్సు కాబట్టి దానిని అభ్యసించాడు. తరువాత దూరవిద్య ద్వారా ఆర్ట్స్‌లో డిగ్రీ చదివాడు. తరువాత 2009లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.తన కల నిజం చేసుకోవాలని ఆలోచన తొలిచేస్తూ ఉండేది.. స్వయం సహాయక బృందం నుంచి తల్లి తీసుకున్న రుణంతో పుణే వెళ్లి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం కావడం మొదలుపెట్టాడు. 2010లో తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసి తహసీల్దార్ ఉద్యోగం సంపాదించాడు. చివరికి తన ఉద్యోగం నుండి 6 నెలల విరామం తీసుకుని IAS కావాలనే కల సాకారం కోసం నడుం బిగించాడు. చివరికి తన కృషికి ఫలితం దక్కింది, 2012లో అతను 287 ర్యాంకుతో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడు. అదే సంవత్సరం, అతను మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై 1వ ర్యాంకు సాధించాడు. 2012, మే 4న ఐఏఎస్ అధికారిగా తన స్వగ్రామంలో అడుగు పెట్టడంతో గ్రామస్తులంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. -
పృథ్వీ షా ఆడబోయేది ఈ జట్టుకే!.. సీఎస్కే స్టార్ సారథ్యంలో..
భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) తన సొంత జట్టు మంబైని వీడాడు. దేశవాళీ క్రికెట్లో జట్టు మారాలని నిర్ణయించుకోగా.. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అందుకు అంగీకరించింది. అతడు కోరినట్లుగానే నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేసింది.పరస్పరం హుందా ప్రకటనలు‘‘ముంబై క్రికెట్ అసోసియేషన్ నాకు విలువైన అవకాశాలెన్నో ఇచ్చింది. ఎల్లవేళలా నాకు మద్దతుగా నిలిచింది. అందుకు అసోసియేషన్‌కు ధన్యవాదాలు. ఎంసీఏకు చెందిన జట్టులో భాగం కావడం నాకు దక్కిన గొప్ప గౌరవం.ఇక్కడ నేను ఎంతో నేర్చుకున్నాను. అయితే, జట్టు మారాలని నిర్ణయించుకున్నాను’’ అని పృథ్వీ షా ఎంసీఏకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ విషయంపై స్పందించిన ఎంసీఏ.. ‘‘క్రికెటర్ పృథ్వీ షా.. ముంబైకి చెందిన ఈ ప్రొఫెషనల్ ఆటగాడు వచ్చే దేశవాళీ సీజన్లో ఇతర జట్టుకు ఆడేందుకు అనుమతించాలని నిరభ్యంతర పత్రం కోరాడు.అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఎంసీఏ ఎన్ఓసీ జారీ చేసింది’’ అని తమ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పృథ్వీ జట్టు ఆడబోయే కొత్త జట్టు ఇదేనంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం ప్రచురించింది. ఇందులో భాగంగా పృథ్వీ ఇకపై మహారాష్ట్ర జట్టుకు ఆడబోతున్నట్లు తెలిపింది.మహారాష్ట్రకు ఆడేందుకే నిర్ణయం!కాగా 25 ఏళ్ల పృథ్వీ షాకు రెండు- మూడు అసోసియేషన్ల నుంచి పిలుపు వచ్చినప్పటికీ.. మహారాష్ట్రకు ఆడేందుకే అతడు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే.. టీమిండియా ఓపెనర్లలో ఒకడైన రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో పృథ్వీ షా ఆడతాడు. కాగా మహారాష్ట్ర దేశీ జట్టును ముందుండి నడిపిస్తున్న రుతు.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఉన్న విషయం తెలిసిందే.కాగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి.. భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన పృథ్వీ షా 2018లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2020లో వన్డే, 2021లో టీ20లలోనూ అరంగేట్రం చేశాడు.ఓపెనర్‌గా ఆరంభంలో ఆకట్టుకున్నప్పటికీ.. ఆ తర్వాత పృథ్వీ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇవే కారణాలతో ఎంసీఏ కూడా అతడిని కొన్నాళ్లు పక్కనపెట్టింది.ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు మొత్తంగా ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన పృథ్వీ షా.. ఆయా ఫార్మాట్లలో 339, 189, ఒక పరుగు చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 79 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 1892 పరుగులు సాధించాడు. అయితే, ఐపీఎల్-2025 మెగా వేలంలో అతడిని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ.. -
ముంబైని వీడిన పృథ్వీ షా
ముంబై: భారత క్రికెట్లో మెరుపులా వచ్చివెళ్లిన యువ బ్యాటర్ పృథ్వీ షా తాజాగా ముంబై జట్టును వీడాడు. ఈ మేరకు మరో జట్టుతో ఆడేందుకు వీలుగా తనకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వాల్సిందిగా ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ)ను అభ్యర్థించాడు. అతని క్రికెట్ భవిష్యత్తు కోసం పృథ్వీ షా అభ్యర్థనను మన్నించిన ముంబై సంఘం ఎన్ఓసీ జారీ చేసింది. ఇదివరకే మహారాష్ట్ర సంఘంతో సంప్రదింపులు జరిపిన అతను ఈ సీజన్లో మహారాష్ట్ర క్రికెట్ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగనున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో టీమిండియా తరఫున ఐదు టెస్టులు, ఆరు వన్డేలు ఆడాడు. చివరిసారిగా ముంబై తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ మాత్రమే ఆడాడు. అందులోనూ పెద్దగా మెరుపుల్లేకపోవడంతో ఎంసీఏ అతన్ని పూర్తిగా పక్కనబెట్టేసింది. అలా ఓ సీజన్ అంతా తుడిచిపెట్టుకుపోయిన తర్వాత కళ్లు తెరిచిన పృథ్వీ షా ఈ సీజన్లో ముంబై తరఫున అవకాశం రాదని గుర్తించాడు. దీంతో మరో జట్టును సంప్రదించిన మీదట ఎన్ఓసీ కోసం ముంబై సంఘాన్ని కోరాడు. ఈ సందర్భంగా ఎంసీఏ కూడా హుందాగా వ్యవహరించి అతను తమ దేశవాళీ జట్టుకు అందించిన సేవల్ని కొనియాడింది. ఎంసీఏ కార్యదర్శి అభయ్ హదప్ యువ క్రికెటర్ భవిష్యత్తులో రాణించాలని అభిలషించారు. దీనికి ప్రతిగా పృథ్వీ కూడా కృతజ్ఞత చాటుకున్నాడు. తనకెన్నో అవకాశాలచ్చిన ముంబై ద్వారానే నేను క్రికెట్‌కు పరిచయమయ్యానని చెప్పుకొచ్చాడు. ఏడాదిగా... ఖాళీగా... క్రికెట్లోకి వచ్చీరాగానే యువ కెరటంగా మారిన పృథ్వీ షా దిగ్గజాలు సునీల్ గావస్కర్, సచిన్ సహా పలువురి మన్ననలు పొందాడు. ఎంత వేగంగా వెలిగాడో... కానీ ఆటపై కొరవడిన ఆసక్తి, ఫామ్‌పై అలసత్వం, క్రమశిక్షణ రాహిత్యం, ఫిట్నెస్ సమస్యలతో అంతే వేగంగా కుంగాడు. మొదట టీమిండియాకు ఎప్పుడో దూరమయ్యాడు. తర్వాత ఐపీఎల్‌కు భారమయ్యాడు. తాజాగా సొంత జట్టు ముంబైకి అవసరం లేకుండా పోయాడు. క్రమంగా ఏ జట్టు అక్కున చేర్చుకోలేకపోవడంతో పూర్తిగా ఏడాదికిపైగానే ఖాళీగా ఉంటున్నాడు. మితీమీరిన శరీర బరువుతో సతమతమవుతున్న పృథ్వీ షా ముంబై జట్టులో స్థానం కోల్పోయాక... ఇప్పుడు మహారాష్ట్ర పంచన చేరేందుకు సిద్ధమయ్యాడు. -
కుమార్తె ‘నీట్’ స్కోర్ తగ్గిందని.. విచక్షణ మరచి..
సాంగ్లి: మహారాష్ట్రంలో మరో విద్యాకుసుమం నేలరాలింది. సాంగ్లీ జిల్లాలో జరిగిన ఈ ఉదంతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కుమార్తెను డాక్టర్‌గా చూడాలనుకున్న ఒక తండ్రి చేసిన పని అతని కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కుమార్తె మరణానికి ప్రధానోపాధ్యాయుడైన ఆ తండ్రే కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో మంచి మార్కులు సాధించలేదని తన 17 ఏళ్ల కుమార్తెపై తండ్రి దాడి చేసిన ఉదంతం వెలుగు చూసింది. సాంగ్లి జిల్లాలోని నెల్కరంజి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతిచెందిన విద్యార్ధినిని సాధన భోస్లేగా పోలీసులు గుర్తించారు. ఆమె స్థానికంగా ఉన్న ఒక పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. సాధన తండ్రి ధోండిరామ్ భోస్లే కుమార్తె చదువుతున్న పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా ఉన్నారు.కుమార్తె నీట్ మాక్ టెస్ట్‌లో తక్కువ మార్కులు సాధించడంతో ఆమెను తండ్రి మందలించారు. అయితే సాధన తండ్రితో వాగ్వాదానికి దిగింది. కుమార్తె మాటలు ధోండిరామ్ భోస్లేకు ఆగ్రహం తెప్పించాయి. వెంటనే ఆయన ఒక కర్రతో కుమార్తెపై తీవ్రంగా దాడి చేశాడు. గాయపడిన సాధనను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, అలానే వదిలివేశాడు. మర్నాడు కూడా కుమార్తెను పట్టించుకోకుండా, యధావిధిగా తన స్కూలుకు వెళ్లిపోయాడు. ధోండిరామ్ భోస్లే పాఠశాల నుంచి తిరిగి వచ్చేసరికి, ఇంటిలో సాధన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించాడు. అయితే అక్కడ చికిత్స ప్రారంభించేలోపే సాధన మృతిచెందింది. పోలీసులు నిందితుడైన తండ్రిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: రెండేళ్లుగా ‘పహల్గామ్’ ముష్కరులు యాక్టివ్? -
క్లాస్‌రూంలో నిద్రపోయిన టీచర్..
-
క్లాస్‌రూంలో గురకపెట్టి నిద్రపోయిన టీచర్.. వీడియో వైరల్
జాల్నా: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన ఓ టీచర్ తరగతి గదిలోనే విద్యార్థులందరూ ఉండగానే నిద్రపోయిన ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అధికారులు విచారణకు ఆదేశించారు.మహారాష్ట్రలోని జాల్నా జిల్లా గడేగావన్ గ్రామంలో ఉన్న మరాఠీ మీడియం జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వీకే ముండే.. ఇటీవల తరగతి గదిలో సుమారు 15 నుంచి 20 మంది విద్యార్థులు పాఠాలు చదువుకుంటుండగా, ఆయన కుర్చీలో వెనక్కి వాలి.. కాళ్లు బల్లపై పెట్టి గురక పెడుతూ సుమారు 30 నిముషాలు గాఢ నిద్రలో మునిగిపోయారు.ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడంతో సంచలనం సృష్టించింది. "మాస్టారు ఎంతసేపటి నుంచి నిద్రపోతున్నారు? ఓ విద్యార్థిని అడగ్గా.. అర గంట నుంచి అంటూ సమాధానం ఇవ్వడం వీడియోలో వినిపిస్తోంది. కాసేపటికి ఆ ఉపాధ్యాయుడు ఒళ్లు విరుచుకుంటూ నిద్ర లేచాడు. ఈ ఘటనపై జోనల్ విద్యాధికారి సతీష్ షిండేకు ఫిర్యాదు అందగా.. ఆయన స్పందిస్తూ.. సంఘటనపై విచారణ జరిపిస్తామని.. వాస్తవాలు తేలిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అసలు సినిమా ముందుంది.. 2029 ఎన్నికల్లో తన పాత్రపై గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
నాగ్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో 11 ఏళ్ల పాలనలో తన పాత్రపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు జరిగింది న్యూస్‌రీల్ మాత్రమే, అసలు సినిమా ముందుందని పేర్కొన్నారు. అయితే, నాయకులకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలని అంశాన్ని పార్టీయే చూసుకుంటుందని, పార్టీ నిర్ణయాన్ని అనుసరించి పనిచేస్తానని తెలిపారు.‘ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం న్యూస్ రీల్ మాత్రమే. అసలైన సినిమా మొదలు కావాల్సి ఉంది’ అని గడ్కరీ శనివారం నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనపై పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితాన్ని గురించి ఎన్నడూ చెప్పుకోలేదని, విమానాశ్రయాలలో తనకు అట్టహాస స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మద్దతుదారులను ఎప్పుడూ కోరలేదని ఆయన నొక్కి చెప్పారు. విదర్భ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలను ఆపాలన్న వ్యక్తిగత లక్ష్యం మేరకు పనిచేస్తున్నానన్నారు.రహదారుల అభివృద్ధి కంటే వ్యవసాయం, సామాజిక కార్యక్రమాలపైనే ఆసక్తి ఎక్కువని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి అయిన గడ్కరీ వివరించారు. తలసరి ఆదాయం లెక్కన మన దేశం టాప్ 10లో లేకపోవడానికి అధిక జనాభాయే కారణమని అభిప్రాయపడ్డారు. అందుకే, జనాభా నియంత్రణకు బిల్లు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఇది మతానికో, భాషకో సంబంధించిన అంశం కాదు. ఇది ఆర్థిక పరమైన అంశం. అభివృద్ధి ఎంత జరిగినా, ఫలాలు కనిపించడం లేదు. జనాభా అధికంగా పెరగడమే ఇందుకు కారణం’అని వివరించారు. -
పక్షి ఢీ కొట్టడంతో ఎయిరిండియా విమాన సర్వీస్ రద్దు!
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు.. ఆ మాటకొస్తే మిగతా సంస్థల విమానాలు కూడా రకరకాల కారణాలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్నాయి. సాంకేతిక సమస్యలతో ప్రయాణికుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా.. పక్షికి ఢీ కొట్టడంతో ఏకంగా ఎయిరిండియా విమాన సర్వీసును రద్దు చేయాల్సి వచ్చింది.శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి పుణే (మహారాష్ట్ర)కు ఎయిరిండియా AI2470 విమానం చేరుకుంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన తనిఖీల్లో విమానాన్ని పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించారు. దీంతో ఇంజనీరింగ్ టీంను రంగంలోకి దింపి విస్తృత తనిఖీలు జరిపింది. ఆపై ఆ విమాన సర్వీసును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.#AirIndia Pune-bound flight from Delhi suffers a bird hit, forcing the airline to cancel its return journey.Read more ⬇️https://t.co/kzYUgPcSiW— NDTV Profit (@NDTVProfitIndia) June 20, 2025✈️ జరిగింది ఇదే..జూన్ 20వ తేదీ.. ఉదయం 5:31కి ఢిల్లీ నుంచి ఏఐ2470 విమానం బయలుదేరి, 7:14కి పుణేలో ల్యాండ్ అయింది.ల్యాండింగ్ తర్వాత నిర్వహించిన తనిఖీల్లో పక్షి ఢీకొన్నట్లు గుర్తించారు.దీంతో, అదే విమానంతో తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సిన AI-2470 ఫ్లైట్‌ను రద్దు చేశారు.🛠️ తీసుకున్న చర్యలువిమానాన్ని గ్రౌండ్ చేశాక.. ఇంజినీరింగ్ బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది.ప్రయాణికుల కోసం వసతి ఏర్పాట్లు, పూర్తి రీఫండ్లు లేదంటే ఉచిత రీషెడ్యూలింగ్ అందిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటనప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు కూడా అందిస్తామని తెలిపిన ఎయిరిండియా. 🔍 జూన్ 12వ తేదీన లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం.. అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు కింద ఉన్న మరో 38 మంది మరణించారు. ఈ ప్రమాద నేపథ్యంలో.. ఎయిరిండియా బోయింగ్ 787, 777 విమానాలపై విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. -
పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం
-
అత్యంత కాలుష్యరహిత హిల్‌స్టేషన్..! మన తెలుగు రాష్ట్రాలకు దగ్గర్లోనే...
నగర జీవనంలో కోల్పోతున్న ప్రశాంతతను పొందడానికి కాలుష్యరహితమైన స్వచ్ఛమైన వాతావరణంలో కొన్ని రోజులైనా సేదతీరడానికి మనకు ఉన్న ఏకైక మార్గం హిల్ స్టేషన్స్. అందుకే సందు దొరికితే చాలు దగ్గర్లోని హిల్ స్టేషన్స్‌కి ఛలో అంటుంటారు నగరవాసులు. అయితే అందరూ అదే బాట పట్టడం వల్లనే...ఇప్పుడు ఊటీ లాంటి ఎన్నో హిల్ స్టేషన్స్ టూరిస్టుల రద్దీతో వాహనాల రణగొణధ్వనులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఈ వేసవి సీజన్లో ఊటీకి వచ్చే పర్యాటకుల సంఖ్యకు పరిమితి కూడా విధించారంటే... పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో.. హిల్ స్టేషన్స్ కూడా మన మహానగరాల్లా మారిపోతున్న నేపధ్యంలో...ఏం చేయాలి? ఎక్కడకు వెళ్లాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తోంది మన తెలుగు రాష్ట్రాలకు దగ్గర్లోనే ఉన్న ఒక అత్యంత కాలుష్యరహిత హిల్ స్టేషన్.సహ్యాద్రి పర్వాతాల్లో...స్వచ్ఛంగా...మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండలలో కొలువుదీరింది మాథెరాన్ హిల్ స్టేషన్. ఇది ఆసియాలోనే వాహనాలు పూర్తిగా నిషిద్ధం అయిన ఒకే ఒక్క పర్వత నగరం. దీని వల్ల పూర్తి కాలుష్య రహితమైన మంచి గాలీ, నీరు, వాతావరణ పరిసరాలు మనకి నిజమైన సేదతీరిన అనుభూతిని కలిగిస్తాయి. భౌగోళికంగా దీని ఎత్తు సుమారు 800మీటర్లు (2,625 చ.అడుగులు) ఈ హిల్ స్టేషన్ ముంబైకు 90 కి.మీ., పూణేకు 120 కి.మీ.దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని 2003లో కేంద్ర పర్యావరణ శాఖ ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించింది. కాబట్టి మాథెరాన్ లోపల వాహనాలు వినియోగం పూర్తిగా నిషిద్ధం. అయితే అత్యవసరమైన సేవలకు ఈ–రిక్షా , అంబులెన్స్‌లను మాత్రమే అనుమతిస్తారు.తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి?మాథెరాన్ హిల్ స్టేషన్ హైదరాబాద్ కు సుమారు 580 కిలోమీటర్ల దూరంలో ఉంది (రోడ్డు మార్గం ద్వారా). మీరు వెళ్లే మార్గం ప్రయాణ వాహనంపై ఆధారపడి దూరం కొంతమేర మారవచ్చు. రైలుమార్గాన్ని ఎంచుకుంటే.. హైదరాబాద్ నుంచి పుణే లేదా కార్జత్ / నెరల్ వరకు రైలు లో వెళ్లవచ్చు. నెరల్ స్టేషన్ నుంచి టాయ్ ట్రెయిన్ (అమన్ లాడ్జ్ – మాథెరాన్) ఎక్కవచ్చు. లేదా టాక్సీ/జీప్ తీసుకుని మాథెరాన్ ఎంట్రీ పాయింట్ వరకూ వెళ్లొచ్చు. రోడ్డు మార్గం ద్వారా అయితే హైదరాబాద్ నుంచి పుణే – లోనావాలా– నెరల్ వెళ్లవచ్చు. ప్రయాణ సమయం అంటే ఎంచుకున్న వాహనాన్ని బట్టి సుమారు 12 నుంచి 14 గంటలు వరకూ పడుతుంది. వాయు మార్గం ద్వారా అనుకుంటే ముంబైకి విమానం లో ప్రయాణించి అక్కడి నుంచి రైలులో లేదా టాక్సీ ద్వారా నెరల్ చేరుకొని మాథెరాన్ కు వెళ్ళవచ్చు.పర్యాటకుల్ని చివరి పాయింట్ వరకు తీసుకెళ్లి వదిలేస్తారు. అక్కడ నుంచి టాయ్ ట్రైన్, గుర్రపు బగ్గీల ద్వారా హిల్స్టేషన్లోకి ప్రవేశించవచ్చు. వీలున్నంత వరకూ ఈ ప్రాంతంలో నడక ద్వారా మాత్రమే పర్యాటక స్థలాలు చూడడానికి ప్రయత్నిస్తే మరింత ఆరోగ్యకరమైన ఆక్సిజన్‌ను మనం అందుకోవచ్చు. అయితే హెరిటేజ్ టాయ్ ట్రెయిన్‌ను మాత్రం మిస్ అవ్వొద్దు. అమన్ లాడ్జ్ నుంచి మాథెరాన్ స్టేషన్ వరకూ ఈ ట్రైన్ ప్రయాణించడానికి సుమారు 20నిమిషాలు పడుతుంది. ఇది 1907లో నిర్మించబడిన హిల్ రైల్వే, ప్రస్తుతం యునెస్కో వారసత్వ స్టేటస్ పొందిన ప్రసిద్ధ పర్వత రైళ్ళలో ఒకటి. దాదాపు 30కిపైగా అందమైన, వైవిధ్యభరిత అనుభూతిని అందించే వ్యూ పాయింట్లు ఇక్కడ ప్రధాన ఆకర్షణ అలాగే ఈ ఊరిలో ఉండే ఇంగ్లీష్ కాలనీల ఆధునిక నిర్మాణాలు ఆకట్టుకుంటాయి. మంచినీటి చెరువులు, పార్కులు, పచ్చదనం మనసును సేదతీరుస్తుంది.నెరెల్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 2గంటలకు పైగా ప్రయాణించే టాయ్ ట్రైన్ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఇది లోకల్ ట్రైన్ అయిన హెరిటేజ్ టాయ్ ట్రైన్‌కు అదనం. అయితే ఈ ట్రైన్ ఏడాదిలో సగం రోజులు అంటే ముఖ్యంగా వర్షాకాలంలో అందుబాటులో ఉండదు. కాబట్టి. ఈ ట్రైన్‌ను ఆస్వాదించాలనుకుంటే నవంబరు తర్వాత మాత్రమే అది కూడా సమాచారం నిర్ధారించుకుని వెళ్లాలి.(చదవండి: నీట్లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!) -
Maharashtra: ‘ఇకపై హిందీ తప్పనిసరి కాదు’
ముంబై: మహారాష్ట్ర పాఠశాలల్లో హిందీని తప్పనిసరి బోధన నుంచి ఉపసంహరించారు. మరాఠీ, ఇంగ్లీష్ తర్వాత మూడవ భాషగా హిందీని పరిగణిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు హిందీని మూడవ భాషగా తప్పనిసరిగా బోధించడాన్ని రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ నూతన నోటిఫికేషన్ జారీ చేసింది.ఒక తరగతిలో 20కి మించిన విద్యార్థులు హిందీకి బదులుగా మరొక భాష నేర్చుకోవాలనుకుంటే, సంబంధిత ఉపాధ్యాయుణ్ణి అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్ర పాఠశాల విద్యా ప్రణాళిక- 2024 ప్రకారం మరాఠీ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుండి ఐదు తరగతులకు హిందీ ఇకపై మూడవ భాషగా ఉంటుంది. అయితే ఈ విద్యార్థులు హిందీకి బదులుగా ఇతర భారతీయ భాషలలో ఒకదాన్ని మూడవ భాషగా నేర్చుకోవాలనుకుంటే వారికి అందుకు అనుమతి కల్పిస్తారు. మహారాష్ట్ర పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అమలు చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లోనూ మరాఠీ భాషను తప్పనిసరి చేశారు.ఇది కూడా చదవండి: Uttar Pradesh: మూడు రోడ్డు ప్రమాదాలు.. 11 మంది మృతి -
అంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించిన ఆస్పత్రి..
ముంబై: అస్థవ్యస్థమైన ఆరోగ్య వ్యవస్థ అత ని కూతురు ప్రాణాలు తీసింది. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యంతో తల్లి కడుపులోనే బిడ్డ ప్రాణాలు పోయాయి. పసికందు శవాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వడానికి ఆస్ప త్రి వర్గాలు నిరాకరించాయి. కూతురు మృతదేహాన్ని సంచిలో వేసుకుని 90 కిలోమీటర్లు ప్రయాణించాడు మహారాష్ట్రకు చెందిన ఓ గిరిజనుడు. జూన్ 12న నాసిక్ జిల్లాలో జరిగి న అత్యంత అమానవీయ ఘటన సోమవా రం వెలుగులోకి వచ్చింది. పాల్ఘర్ జిల్లాలోని జోగల్వాడి కుగ్రామానికి చెందిన సఖారామ్ కవార్ భార్య అవిత జూన్ 11న ప్రసవ వేదనకు గురైంది. సమీపంలోని ఖోడాలా ప్రాథ మిక ఆరోగ్య కేంద్రానికి తరలించడానికి అంబులెన్స్ దొరకలేదు. 108కు కాల్ చేస్తే స్పందన రాలేదు. ప్రైవేట్ వాహనంలో పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. గంటసేపు ఎదురుచూసినా డాక్టర్లు రాలేదు. సమీపంలోని మోఖడా గ్రా మీణ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యు లు నాసిక్ సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్స్ అందుబాటులో లేక మళ్లీ ఆలస్యమైంది. జూన్11న అర్ధరాత్రి దాటిన తరువాత ఆస్పత్రికి చేరుకుంది. తెల్లవారుజామున ఆమెకు చనిపోయిన ఆడ శిశువును ప్రసవించింది. ఆస్పత్రి జూన్ 12న శిశువు మృతదేహాన్ని సఖారామ్‌కు అప్పగించింది. కానీ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించింది. బిడ్డను బట్టలో చుట్టుకుని, బస్టాండ్‌కు వెళ్లి.. రూ. 20 క్యారీ బ్యాగ్ కొనుక్కుని, అందులో పెట్టుకుని ఎమ్ఎస్ఆర్టీసీ బస్సులో దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఏమి మోసుకెళ్తున్నావని ఆయనను ఎవరూ అడగలేదు. ఆ దుఃఖాన్ని ఆయన కూడా ఎవరితో పంచుకోలేదు. అదే రోజు శిశువును ఖననం చేసి.. జూన్ 13న మళ్లీ ఆస్పత్రిలో ఉన్న భార్యకోసం నాసిక్‌కు తిరిగి వచ్చాడు. ఈసారి కూడా అంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. పచి్చబాలింత అయిన భార్యను.. బస్సులోనే ఇంటికి తీసుకెళ్లాడు. ‘ఆస్పత్రి ఉదాసీనత వల్ల నేను బిడ్డను కోల్పోయాను. ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి బాధ ఎదురు కాకూడదు’అంటూ నిస్సహాయతతో కూడిన బాధతో చెప్పాడు సఖారామ్. -
ఇంద్రాయణి నదిపై కుప్పకూలిన వంతెన.. ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు
-
మొదలు నరికినా మొలకెత్తే చేవ!
పది రోజుల కింద ‘మహారాష్ట్ర అంగన్వాడీ కర్మచారి సంఘటన్ వర్సస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’ కేసులో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గౌరి గాడ్సే, జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్ ఇచ్చిన మధ్యంతర ఆదేశానికి అనేక రకాలుగా ప్రాధాన్యం ఉంది. ఆ ఆదేశం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో పాటించవలసిన కనీస నిబంధనలను గుర్తు చేసింది. అది ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన ఉద్యో గానికి కనీసం పదకొండు సంవత్సరాలుగా నియామకాలు జరగలేదనే వాస్తవాన్ని బయట పెట్టింది. అది ఆ రాష్ట్ర ప్రభు త్వంలో ఉద్యోగులు ఇరవై సంవత్సరాలకు పైగా పదోన్నతి లేకుండా కింది స్థాయి ఉద్యోగంలో కొనసాగుతున్నారని చూపింది. అన్నిటికీ మించి, అంగన్వాడీ కర్మచారి సంఘటన్ తరఫున ఈ కేసు వాదించి గెలిచిన న్యాయవాది ఎన్నో ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొని, తన ప్రజా జీవనాన్నీ, తన న్యాయవాద వృత్తినీ ధ్వంసం చేయడానికి పాలకులు చేసిన ప్రయత్నాలను ధిక్కరించి, ప్రజా ప్రయోజన, కార్మిక సంక్షేమ కృషిలో మొక్కవోని దీక్షతో కొనసాగుతున్నారని చూపింది. మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్’(ఐసీడీఎస్)లో భాగమైన అంగన్వాడీ ముఖ్య సేవిక అనే పర్యవేక్షక ఉద్యోగ నియామకాల కోసం 2021 జూన్ 4న ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. మళ్లీ 2025 ఫిబ్రవరి 4న కూడా ఆ ఉద్యోగాలకు సంబంధించే మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటికే ఆ ఉద్యోగం కన్నా కిందిస్థాయి సేవిక (వర్కర్) ఉద్యోగంలో పది సంవత్సరాలకు పైగా, కొన్ని సందర్భాలలోనైతే ఇరవై, ఇరవై అయిదు సంవత్సరాలకు పైగా పని చేస్తున్న వారికి ఈ ముఖ్య సేవిక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అంగన్వాడి సేవికల సంఘమైన మహారాష్ట్ర అంగన్ వాడీ కర్మచారి సంఘటన్ తమకు జరిగిన ఈ అన్యాయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయదలచుకుంది. వారి తరఫున న్యాయవాది సుధా భరద్వాజ్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో వీరికి కూడా అవకాశం కల్పించేలా మార్పులు చేయాలని, ఈ మార్పులకు తగినట్టుగా గడువు తేదీలు మార్చాలని కోర్టు ఇప్పుడు మధ్యంతర ఆదేశం ఇచ్చింది. ఈ ఆదేశం మహారాష్ట్రలో ఎన్నో సంవత్స రాలుగా సేవికలుగా ఎదుగూ బొదుగూ లేకుండా పని చేస్తున్న వేలాదిమందికి ఒక ఆశాసూచిక. దేశంలో మొత్తంగా కొన సాగుతున్న కార్మిక వ్యతిరేక విధానాలలో ఈ మధ్యంతర తీర్పు ఒక చిన్న ఊరట. సుధా భరద్వాజ్ ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు రెండు దశాబ్దాలు ప్రధానంగా కార్మిక వ్యవహారాల న్యాయ వాదిగా, ఆ తర్వాత ఢిల్లీలో ఒక న్యాయ శాస్త్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేసిన వ్యక్తి. సుధా భరద్వాజ్ ప్రపంచ ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త కృష్ణా భరద్వాజ్ కూతురు. అమెరికాలో పుట్టి, ఆమెరికన్ పౌరురాలిగా అక్కడే పదకొండేళ్ల వయసు దాకా ఉన్నారు. ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రారంభిస్తున్నప్పుడు అక్కడి అర్థశాస్త్ర శాఖను నిర్మించమని కృష్ణా భరద్వాజ్‌కు పిలుపు వెళ్లగా, సుధ కూడా తల్లితో పాటుఢిల్లీ వచ్చారు. పద్దెనిమిదేళ్ల వయసు రాగానే స్వచ్ఛందంగా తన అమెరికన్ పౌరసత్వం వదులుకున్నారు. కాన్పూర్ ఐఐటీలో గణితశాస్త్రంలో ఎంఎస్ చేశారు. విద్యార్థి దశలో ఎన్ఎస్ ఎస్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్,బిహార్, మధ్యప్రదేశ్గ్రామీణ పాంతాలకు, కార్మిక ప్రాంతాలకు వెళ్లి, కుల,వర్గ అసమాన తలను చూసి, ఆ పేద ప్రజల సేవలోనే తన జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. అప్పటి మధ్యప్రదేశ్‌లో గని కార్మికులను సంఘటితం చేస్తున్న శంకర్ గుహ నియోగి ఆలోచనలతో, ఆచరణతో ప్రభావితమై తన ఇరవై ఐదవ ఏట, 1986లో అక్కడ కార్మికుల మధ్య పని చేయడానికి వెళ్లారు. అనేక సంఘాల్లో పని చేయడం ప్రారంభించారు. భిలాయిలో ఎక్కువగా నిరక్షరాస్యులైన కార్మికుల మధ్య, పేదల మధ్య పని చేస్తున్నప్పుడు, అక్కడ చదువు వచ్చిన ఏకైక వ్యక్తిగా ఆమె ఆ కార్మికులకు, పేదలకు జరుగు తున్న అన్యాయాల గురించి మాట్లాడడానికి, న్యాయస్థానా లలో కేసులు వేయడానికి ఎక్కువగా న్యాయవాదులను కలవ వలసి ఉండేది. పిటిషన్లు రాయవలసి ఉండేది. అటు వంటి పనులు చేస్తుండగా, ఆ కార్మికులు ‘మీరే ఎందుకు న్యాయవాది కాకూడదు’ అని ప్రోత్సహించడంతో, 2000 నాటికి తానే న్యాయవాదిగా మారారు. భూకబ్జాలకు, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, కార్మికుల హక్కులనూ, ఆదివాసుల సామూహిక అటవీ హక్కులనూ, పర్యావర ణాన్నీ పరిరక్షించడానికి ఎన్నో కేసులు వాదించారు. ‘జన హిత’ అనే న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’లో పని చేశారు. ఇలా ఛత్తీస్‌గఢ్‌లో, ముఖ్యంగా బిలాస్పూర్ హైకో ర్టులో, ఇతర న్యాయస్థానాల్లో ఆదివాసుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం ఆమె చేస్తున్న విస్తారమైన పని, ప్రభుత్వానికి కంటగింపు అయింది. ఆమె పనిని అడ్డుకోవ డానికి, వేధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి ‘అర్బన్ నక్సల్’ అనే ముద్ర కొట్టి 2018 ఆగస్ట్ 28నఆమెను అరెస్టు చేసి భీమా కోరేగాం కేసులో నిందితురాలిగా చూపారు. మూడేళ్ల జైలు జీవితం తర్వాత 2021 డిసెంబర్లో షరతులతో కూడిన బెయిల్ మీద ఆమె విడుదల య్యారు. ఆ షరతుల్లో ప్రధానమైనది, ‘ముంబయి వదిలి పోకూడదు’ అనేది. అందుకే బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈఅంగన్వాడీ సేవికల కేసులో గణనీయమైన విజయం సాధించారు.వ్యాసకర్త ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ -
లక్షల్లో సంపాదన.. ఇస్మార్ట్ ఆటోవాలాకు బిగ్ షాక్
ఆటో నడపకుండానే.. కత్తిలాంటి ఐడియాతో నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడంటూ ఓ ఆటోవాలా గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. నిజనిర్ధారణలోనూ.. అది వాస్తవమేనని తెలిసేసరికి వహ్ అనుకున్నారంతా. ప్రముఖులు సైతం బ్రిలియంట్ అంటూ మెచ్చుకున్నారు. అయితే ఆ ప్రచారమే ఇప్పుడు అతని పాలిట శాపంగా మారింది. లింక్డిన్లో వెన్యూమోంక్ కో ఫౌండర్ రాహుల్ రుపానీ ఆ ఆటోడ్రైవర్ కథనాన్ని షేర్ చేశారు. బంద్రాకుర్లా కాంప్లెక్స్‌లోని యూఎస్ కన్సులేట్ బయట ఆటోను పార్క్ చేసి.. వచ్చిపోయే సందర్శకుల సామాన్లను క్లాక్ రూమ్ తరహాలో ఆటోలో భద్రపరిచి సంపాదన చేస్తున్నాడతను. అలా ఒక్కో కస్టమర్ దగ్గరి నుంచి రూ.1000 చొప్పున.. నెలకు రూ.ఐదు లక్షల నుంచి 8 లక్షల దాకా సంపాదిస్తున్నాడంటూ ఆయన స్టోరీ షేర్ చేశారు. హర్ష్ గోయెంకాలాంటి ప్రముఖులు సైతం ఆ ఆటోవాలా బుర్రకు ఫిదా అయిపోయారు.అయితే అతని కథనాలకు ముంబై పోలీసులు స్పందించారు. ఆ ఆటో డ్రైవర్ లాగే మరో 12 మంది అక్కడే అదే పనిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. తక్షణమే ఆ జాగా ఖాళీ చేయాలంటూ అందరికీ సమన్లు జారీ చేశారు. ‘‘యూఎస్ కన్సులేట్ బయట భద్రతా కారణాల దృష్ట్యా పార్కింగ్ నిషేధిస్తున్నాం. ఆటో డ్రైవర్లు కేవలం ప్యాసింజర్లను అక్కడ దించి వెళ్లిపోవాలే తప్ప ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు రావడంతో ముంబై పోలీసులు మళ్లీ స్పందించారు. ‘‘ఆ ఆటో డ్రైవర్‌కు లైసెన్స్ ఇచ్చింది ఆటో నడుపుకోవడానికి. అంతేగానీ లాకర్ సేవలు అందించడానికి కాదు. అతను మాత్రమే కాదు.. అతనిలా మరికొందరు డ్రైవర్లు అదే పనిలో ఉన్నారని మా విచారణలో తేలింది. కేవలం డ్రైవర్లకు మాత్రమే కాదు.. సమీపంలోని దుకాణాదారులకు కూడా లాకర్ సర్వీసులు నడిపించేందుకు అనుమతులు లేవు. ఒకవేళ ఎవరైనా అలా నడిపిస్తే కఠిన చర్యలు తప్పవు’’ అని ముంబై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పాపం.. బ్రిలియంట్ ఐడియాతో వైట్ కాలర్ జీతగాళ్లకు కూడా దక్కని సంపాదనతో బిజినెస్ చేస్తున్నాడని పొగిడేలోపే ఆ ఆటో డ్రైవర్‌కు బిగ్ షాక్ తగిలింది. -
బ్యాంకు ఉద్యోగం వదిలేసి, ఆధునిక సేద్యం : కోట్లలో ఆదాయం
చీకూ చింతా లేని మంచి బ్యాంకు ఉద్యోగం వదిలి ఆధునిక వ్యవసాయాన్ని చేపట్టాలంటే చక్కటి ప్రణాళికతో పాటు గుండెలు నిండుగా ధైర్యం, పట్టుదల, లక్ష్యసాధనకు అవసరమైన వనరులను సమకూర్చుకొని గొప్ప ఫలితాలు సాధించే తెలివితేటలు ఉండాలి. మహారాష్ట్రలోని పుణేకు చెందిన సంకేత్ మెహతా (Sanket Mehta)కు అదృష్టవశాత్తూ ఇవన్నీ ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగం వదిలేసి రసాయనిక పురుగుమందుల అవసరం లేని ఆధునిక హైడ్రోపోనిక్ వ్యవసాయం (hydroponic farming) లోకి దిగారు. ఆరోగ్య దాయకమైన ఆహారం కోసం వెదుకుతూ పురుగుమందుల్లేని ఆహారోత్పత్తి వైపు దృష్టి సారించారు. పూర్తి ఆర్గానిక్ కాకపోయినా రసాయనిక పురుగు మందుల్లేకుండా హైడ్రోపోనిక్స్ పద్ధతుల్లో కూరగాయ, ఆకుకూర పంటలు పండించి విక్రయించటం ద్వారా మంచి ఆహారాన్ని అందిస్తున్నామన్న తృప్తితో పాటు మంచి ఆదాయం కూడా వస్తుందని సంకేత్ భావించారు. చాలా కాలం నుంచి తెలిసిన గణేష్ నికం అనే వ్యక్తితో కలిసి న్యూట్రిఫ్రెష్ (Nutrifresh) పేరిట స్టార్టప్‌ను ఆరేళ్ల క్రితం నెలకొల్పి చక్కని ఆదాయం పొందుతున్నారు. View this post on Instagram A post shared by Nutrifresh Hydroponic Farms (@nutrifreshindia) హైడ్రోపోనిక్స్ అంటే పోషకాలతో కూడిన నీటిలో, నియంత్రిత వాతావరణంలో (అంటే పాలీహౌస్‌లలో) పంటలు పండించటం. ఈ పద్ధతిలో కూరగాయలు, సాధారణ ఆకుకూరలతో పాటు సలాడ్లలో నగరవాసులు తినే లెట్యూస్ వంటి విదేశీ జాతుల ఆకుకూరలు మొత్తం 42 రకాలను పెంచి, విక్రయించటం ద్వారా సంకేత్, గణేష్ మంచి ఆదాయం ΄పొందుతున్నారు. పుణే ప్రాంతంలో చల్లని వాతావరణం పాలీహౌస్‌లలో హైడ్రోపోనిక్ సేద్యానికి అనువుగా ఉండటంతో ఈ యువకుల కలల పంట పండుతోంది. కాసులు కురిపిస్తోంది. పురుగుమందులు వాడకుండా పండించటమే కాదు, పంట కోతలో ప్రత్యేక జాగ్రత్త తీసుకోవటం, కోసిన 24 గంటల్లోగా వినియోగదారుల ఇళ్లకు చేర్చటం వీరి విజయరహస్యం. సాధారణ గ్రామీణ మహిళలకు పంటల కోతలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి పనులు చేయిస్తున్నారు. ఆ ఫామ్‌లో పనిచేసేవారిలో 80% వీరే. దేశంలోని అనేక నగరాల్లో పురుగుమందుల్లేని ఆహారం కావాలనుకునే 40 వేల ఇళ్లకు న్యూట్రిఫ్రెష్ హైడ్రోపోనిక్ కూరగాయలు,ఆకుకూరలు, ఔషధ మొక్కల్ని అనుకున్న సమయానికి సరఫరా చేయగలుగుతోంది. నమ్మిన పనిని త్రికరణశుద్ధిగా చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనేదానికి ఈ స్టార్టప్ పనితీరును నిదర్శనంగా చెప్పొచ్చు. శుద్ధిచేసిన నీటిని పంటల సాగుకు వాడటం, మొక్క పెట్టటం, పంట కోత, ప్యాకింగ్ వంటి పనులన్నీ ఖచ్చితత్వంతో నిర్వహిస్తూ నాణ్యమైన ఉత్పత్తుల్ని అందిస్తున్నారు. 2023 నాటి లెక్కల ప్రకారం సంకేత్ మెహతాతో సహా న్యూట్రిఫ్రెష్ వ్యవస్థాపకుల నికర విలువ రూ. 157 కోట్లుగా తెలుస్తోంది. (ఐదేళ్ల శ్రమ.. ఇంగువ పండిందోచ్! అవును నిజమే!) -
థానే లోకల్ ట్రైన్ ప్రమాదం.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
ప్రయాణికులకు నిత్యనరకం అనేది ఎలా ఉంటుందో.. ముంబై లోకల్ ట్రైన్ల రద్దీని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. మరీ ముఖ్యంగా రైలు ప్లాట్‌ఫారమ్ మీదకు రాగానే ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడిపోవడం, ఫుట్‌బోర్డు మీద వేలాడుతూనే ప్రయాణాలు చేయడం తరచూ సోషల్ మీడియాలోనూ చూస్తుంటాం. అయితే థానేలో ఇవాళ జరిగిన ఘోర ప్రమాదంతో(Thane Local Train Accident) రైల్వే అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. లోకల్ ట్రైన్స్‌కు కూడా ఆటోమేటిక్ తలుపులు బిగించాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. థానేలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పాటు కొత్త రైళ్లకూ ఈ తరహా డోర్లు బిగించనున్నట్లు తెలుస్తోంది. ముంబయి సబర్బన్ ప్రాంతంలో నడిచే అన్ని రైళ్లకూ ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిందని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల భద్రతే రైల్వే ప్రథమ ప్రాధాన్యం అని ఆయన పేర్కొన్నారు. థానేలో ఇవాళ ఉదయం కసారా వైపు వెళ్తున్న లోకల్ ట్రైన్ నుంచి పది మంది కింద పడిపోయారు. ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికుల బ్యాగులు పరస్పరం తాకడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరోవైపు.. ఈ ఘటనపై రైల్వే యంత్రాంగం దర్యాప్తు చేస్తోందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెబుతున్నారు. ఇదీ చదవండి: బస్సు ప్రయాణికులకు బిగ్ షాక్ -
పైలట్ పంతంతో నిలిచిన ప్రాణం
థానే: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఆసక్తికర మైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే షెడ్యూల్ కంటే ముందే జల్గావ్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవడం, విమానం టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించడం.. చివరకు ఓ మహిళ ప్రాణాలు కాపాడేందుకు కారణమయ్యాయి. జల్గావ్ జిల్లాలోని ముక్తాయ్‌నగర్‌లో సంత్ ముక్తి పల్లకి యాత్రలో పాల్గొనేందుకు ఏక్నాథ్ షిండే శుక్రవారం తన చార్టెర్డ్ విమానంలో ముంబై నుంచి జల్గావ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3.45 గంటలకు రావాల్సి ఉండగా, దాదాపు మూడు గంటలు ఆలస్యంగా 6.15 గంటలకు విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. ఏక్నాథ్ షిండే ఎయిర్‌పోర్టు నుంచి ముక్తాయ్‌నగర్ వెళ్లి పల్లకి యాత్రలో పాల్గొని ఎయిర్‌పోర్టుకు రాత్రి 9.15 గంటలకు తిరిగివచ్చారు. అయితే, గంట ముందే రావడంలో విమానం టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించాడు. షెడ్యూల్ ప్రకారమే వెళ్లాలని తేల్చిచెప్పాడు. మహారాష్ట్ర మంత్రులు గిరీష్ మహాజన్, గులాబ్‌రావు పాటిల్‌తోపాటు జిల్లా అధికారులు దాదాపు 45 నిమిషాలపాటు ఎయిర్‌పోర్టులో చర్చలు జరిపారు. పైలట్‌ను ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. చివరకు అతడు అంగీకరించాడు. ఇక్కడే కథ అసలు మలుపు తిరిగింది. ఏం జరిగింది? జల్గావ్కు చెందిన శీతల్ పాటిల్‌కు ముంబైలో అత్యవసరంగా మూత్రపిండాల మార్పిడి శస్త్రచి కిత్స జరగాల్సి ఉంది. జల్గావ్ నుంచి విమానంలో వెళ్లాల్సి ఉండగా, ఎయిర్‌పోర్టుకు చేరుకొనేసరికే విమానం వెళ్లిపోయింది. అదే సమయంలో ఏక్నాథ్ షిండే అదే ఎయిర్‌పోర్టులో తన విమానం కోసం వేచి చూస్తున్నారు. పైలట్‌తో చర్చలు జరుగుతున్నాయి. ఇంతలో శీతల్ పాటిల్ గురించి స్థానిక నాయకులు ఏక్నాథ్ షిండే దృష్టికి తీసుకెళ్లారు. పైలట్ టేకాఫ్‌కు అంగీకరించడం, విమానం సిద్ధం కావడం జరిగిపోయాయి. దాంతో ఆయన శీతల్ పాటిల్‌ను, ఆమె భర్తను తనతోపాటు చార్టెర్డ్ విమానంలో ముంబైకి తీసు కెళ్లారు. ముందే సమాచారం ఇచ్చి ముంబై ఎయిర్ పోర్టులో ప్రత్యేక అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వెంటనే శీతల్ బోర్డేను ప్రత్యేక అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మొత్తానికి అనుకున్న సమయానికే శీతల్ బోర్డే ఆసుపత్రికి చేరుకున్నారు. ఏక్నాథ్ షిండే విమానాన్ని టేకాఫ్ చేయడానికి పైలట్ మొండికేయడం ఆమె ప్రాణాలను కాపాడిందని స్థాని కులు పేర్కొన్నారు. సామాన్య ప్రజల బాగు కో సం ఏక్నాథ్ షిండే తపన పడుతుంటారని, వారి సేవ కోసం ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని మంత్రి గిరీష్ మహాజన్ చెప్పారు. -
రాహుల్ గాంధీ ఆరోపణలను తీవ్రస్థాయిలో ఖండించిన బీజేపీ
-
డిప్యూటీ సీఎం షిండేకు షాకిచ్చిన పైలట్
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విచిత్ర పరిస్థితిని ఎదుర్కొన్నారు. రాష్ట్రంలోని జల్గావ్ నుంచి ముంబై వెళ్లేందుకు ఆయన విమానాశ్రయంలో దాదాపు గంటపాటు వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. షిండే వ్యక్తిగత విమానానికి చెందిన పైలట్ తన డ్యూటీ టైమ్ ముగిసిందని పేర్కొంటూ, విమానాన్ని నడిపేందుకు నిరాకరించారు.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ముక్తాయ్ నగర్లో జరిగిన ఒక మతపరమైన ఊరేగింపులో పాల్గొన్న తరువాత జల్గావ్ నుంచి ముంబై బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. షిండేతోపాటు ఆయన ఆయన బృందం రాత్రి 9.15 గంటలకు జల్గావ్ విమానాశ్రయానికి వచ్చారు. అయితే పైలట్ తన డ్యూటీ టైమ్ అయిపోయిందని చెబుతూ, విమానాన్ని నడిపేందుకు నిరాకరించారు. దీంతో కొందరు అధికారులు పైలట్‌ను ఒప్పించడానికి ప్రయత్నించారు. 45 నిముషాల తర్వాత పైలట్ విమానాన్ని నడిపేందుకు ఒప్పుకున్నాడు. దీంతో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే విమానం ముంబైకి బయలుదేరింది.ఇది కూడా చదవండి: ఐదు దశల్లో ‘మహా’ మ్యాచ్ ఫిక్సింగ్: రాహుల్ సంచలన వ్యాసం -
‘మహా’ మ్యాచ్‌ఫిక్సింగ్
న్యూఢిల్లీ/నాగపూర్: మన దేశంలో ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపైనే తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆవేదన వెలిబుచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మోదీ సర్కారు భారీ స్థాయిలో ఎన్నికల అక్రమాలకు పాల్పడుతూ వస్తోందని మండిపడ్డారు. అందుకోసం కీలకమైన జాతీయ స్థాయి సంస్థలను సైతం చెరబడుతోందని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘నేను మాట్లాడుతున్నది చిన్నా చితకా ఎన్నికల అక్రమాల గురించి కాదు. ఒక పరిశ్రమ స్థాయిలో మొత్తం ఎన్నికల ప్రక్రియనే రిగ్గింగ్ చేసేస్తున్నారు. ప్రతిసారీ కాకున్నా ఇది తరచూ జరుగుతోంది. గతంలో పలు ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలైతే అందరినీ విస్మయపరిచాయి. ఆ ఎన్నికల్లో పూర్తిగా ‘మ్యాచ్‌ఫిక్సింగ్’జరిగింది. మోదీ సర్కారు వాటి ఫలితాలను టోటల్‌గా రిగ్గింగ్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని ఎలా చెరబట్టడమెలాగో చెప్పేందుకు ఆ ఎన్నికలు బ్లూప్రింట్‌గా నిలిచిపోయాయి’’అంటూ రాహుల్ తూర్పారబట్టారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌లో పలు పోస్టులు చేశారు. ‘మ్యాచ్‌ఫిక్సింగ్–మహారాష్ట్ర’అంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా పత్రికలో తాను రాసిన ఎడిట్ పేజీ వ్యాసాన్ని షేర్ చేశారు. మ్యాచ్‌ఫిక్సింగ్ ప్రక్రియను ఐదు పాయింట్లలో వివరించారు. ‘‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోతే పరువు పోతుందనే భయంతో బీజేపీ అన్ని అక్రమాలకూ పాల్పడింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో కూడా మహారాష్ట్ర తరహా మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పథకరచన చేస్తోంది’’అంటూ జోస్యం చెప్పా రు. హోరాహోరీ పోరు ఖాయమని అంతా భావించిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను బీజేపీ, దాని ఎన్డీఏ భాగస్వామ్య పక్షా లు కనీవినీ ఎరగని రీతిలో ఏకంగా 235 సీట్లలో నెగ్గడం తెలిసిందే. అంతకు ఐదు నెలల క్రితమే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలోని 48 స్థానాల్లో విపక్ష ఎంవీఏ కూటమికి 31 రాగా ఎన్డీఏ కూటమి 17 సీట్లతో సరిపెట్టుకుంది. వయోజనుల కంటే ఓటర్లే ఎక్కువ! ‘‘2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి మహారాష్ట్ర ఓటర్ల సంఖ్య 8.98 కోట్లు. 2024 మేలో లోక్‌సభ ఎన్నికల నాటికి 9.29 కోట్లకు పెరిగింది. అంటే ఐదేళ్ల వ్యవధిలో కేవలం 31 లక్షలు పెరిగింది. కానీ 2024 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏకంగా 9.7 కోట్లకు పెరిగింది! కేవలం ఐదు నెలల్లోనే ఓటర్లు ఏకంగా 41 లక్షల మేరకు పెరిగారు! ఇదెలా సాధ్యం? పైగా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారమే మహారాష్ట్రలో మొత్తం వయోజనుల సంఖ్య 9.54 కోట్లు. ఓటర్ల సంఖ్య అంతకుమించి ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?’’అని రాహుల్ ప్రశ్నించారు. ‘‘ఇదొక్కటే కాదు. పోలింగ్‌లోనూ తీవ్ర అక్రమాలు జరిగాయి. సాయంత్రం ఐదింటికి 58.22 శాతం పోలింగ్ నమోదైంది. మర్నాడు ఉదయం మాత్రం మొత్తం పోలింగ్ శాతం 66.05 అని ప్రకటించారు. ఏకంగా 7.83 శాతం పెరుగుదల ఎలా సాధ్యం?’’అని ప్రశ్నించారు. How to steal an election?Maharashtra assembly elections in 2024 were a blueprint for rigging democracy.My article shows how this happened, step by step:Step 1: Rig the panel for appointing the Election Commission Step 2: Add fake voters to the rollStep 3: Inflate voter… pic.twitter.com/ntCwtPVXTu— Rahul Gandhi (@RahulGandhi) June 7, 2025మళ్లీ అవే ఆరోపణలు: ఈసీ మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న రాహుల్ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ‘‘పోలింగ్ ప్రక్రియ మొత్తం ఆయా పారీ్టల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే పారదర్శకంగా జరిగింది. రాహుల్ ఆరోపిస్తున్నట్టు అసాధారణ ఓటింగ్ జరిగిందంటూ కాంగ్రెస్, ఆ పార్టీ పోలింగ్ ఏజెంట్లెవరూ ఫిర్యాదు చేయలేదు’’అని ఈసీ వర్గాలు గుర్తు చేశాయి. ఈసీ వర్గాల వాదనపై రాహుల్ స్పందించారు. అనధికారిక స్పందనలతో తప్పించుకోవడం ఈసీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థల విశ్వసనీయతను కాపాడబోదన్నారు. ‘‘లోక్‌సభతో పాటు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలన్నింటికీ సంబంధించిన సమగ్రమైన డిజిటల్ ఓటర్ల జాబితాను ప్రచురించాలి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం ఐదింటి తర్వాత అన్ని బూత్‌ల్లో జరిగిన పోలింగ్‌కు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ విడుదల చేయాలి’’అని డిమాండ్ చేశారు. రిగ్గింగ్‌కు ఐదు సూత్రాలు ఎన్నికలల్లో మోదీ సర్కారు అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించిన రాహుల్‌గాం«దీ, వాటిని పాయింట్లవారీగా వివరించారు... → కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానల్‌ను రిగ్గింగ్ చేయడం → ఎలక్టోరల్ రోల్స్‌లో భారీగా నకిలీ ఓటర్లను పొందుపరచడం → పోలైన ఓట్ల శాతాన్ని అక్రమంగా పెంచేయడం → బీజేపీ గెలిచి తీరాలనుకున్న చోట్ల బోగస్ ఓటింగ్‌కు పాల్పడటం → సాక్ష్యాలను ఎవరికీ చిక్కకుండా దాచేయడం ఇది కూడా చదవండి: బీజేపీ తదుపరి అధ్యక్షుడు.. ఆ ముగ్గురిలో ఎవరు? -
ముందే పలకరించిన వానలు : రెయిన్కోట్లకు, గొడుగులకు భలే బేరం!
దాదర్: వర్షాకాలం సమీపించడంతో గొడుగులు, రెయిన్ కోట్లు, ప్లాస్టిక్ క్యాప్‌లు తదితర సామగ్రి విక్రయించే హోల్‌సేల్ మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ముంబైలో గత పక్షం రోజుల నుంచి వాతావరణంలో అనేక మార్పులు చేసుకుంటున్నాయి. ఒకపక్క వర్షం మరోపక్క ఎండలు కాస్తున్నాయి. దీంతో జనాలు ఇంటి నుంచి బయటపడే సమయంలో గొడుగు తీసుకెళ్లాలా? వద్దా? అంటూ సందిగ్ధంలో పడిపోయారు. ఈ సారి వర్షాలు కొంత తొందరగా కురుస్తాయని ఇదివరకే శాంతాకృజ్, కొలాబా వాతావరణ శాఖలు హెచ్చరించాయి. అనుకున్నట్లు ఈ సారి వర్షాలు గత పక్షం రోజుల నుంచి కురుస్తున్నాయి. ఏటా వర్షాకాలం జూన్ ఏడో తేదీ నుంచి ప్రారంభమవుతుంది. కానీ ఈ సారి వర్షాలు దాదాపు పక్షం రోజుల ముందు నుంచే కురుస్తున్నాయి. దీంతో అనేక మంది ముందస్తు ఏర్పాట్లు చేసుకోలేకపోయారు. దీంతో కొత్త గొడుగులు, రెయిన్ కోట్లు కొనుగోలు చేయడానికి మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. రంగురంగుల గొడుగులు.. డిజైన్లతో కూడిన రెయిన్ కోటుముంబైలో దాదర్, క్రాఫర్డ్ మార్కెట్, చెంబూర్ తదితర ప్రాంతాల్లో వర్షాకాల సామగ్రి విక్రయించే హోల్‌సేల్ మార్కెట్లున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి కోనుగోలుదార్లను ఆకర్షించే రంగురంగుల గొడుగులు, వివిధ డిజైన్లతో కూడిన రెయిన్ కోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునే వివిధ రంగులు, డోరెమాన్, ఛోటా బీం, మోటూ–పాత్‌లు, స్పైడర్ మెన్, బార్బీ డాల్, సిండ్రోలా తదితర కార్టూన్ బొమ్మలతో కూడిన రెయిన్ కోట్లు, గొడుగులు వచ్చాయి. ఇవి పిల్లలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా పెద్దలు వినియోగించే ప్లాస్టిక్ జాకెట్లు, ప్యాంట్లు, క్యాప్‌లు, ఫోన్లు వర్షానికి తడవకుండా భద్రపర్చుకునే మొబైల్ కవర్లు, బైక్‌లు, కార్లపై కప్పడానికి వినియోగించే ప్లాస్టిక్ కవర్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంచారు. అయితే ఈ సారి ధరలు 10–20 శాతం మేర పెరిగినట్లు హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఈ సామగ్రిని రిటైల్ వ్యాపారులు క్వాలిటీని బట్టి 20–30 శాతం ధరలు పెంచి విక్రయిస్తున్నారు. దీంతో ఈ సారి కోనుగోలుదార్ల జేబులకు చిల్లులు పడడం ఖాయమని తెలుస్తోంది. చదవండి: Chitrakoot Facts: చరిత్ర చెక్కిన రామాయణం చిత్రకూటం.. ఎన్ని విశేషాలో!రెయిన్ కోట్ రూ.30 నుంచి రూ.150 లోపే.. ఇదిలా ఉండగా వర్షాకాలంలో వ్యాపారులు, ఉద్యోగులతో పాటు వివిధ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటపడే సామాన్యులు ఇదివరకు వాడిన లేజర్ బూట్లు, సాధారణ పాదరక్షలు పక్కన పెట్టేశారు. వర్షంలో వినియోగించే ప్లాస్టిక్ చెప్పులు, బూట్లు, స్లీపర్లు కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. సందెట్లో సడేమియా అన్నట్లుగా గత సంవత్సరం అమ్మగా మిగిలిపోయిన సామగ్రిని బయటకు తీసి ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సారి అకాల వర్షాలు పక్షం రోజుల ముందే కురవడంతో అనేక మంది వ్యాపారులు వర్షాకాల సామగ్రి ముందుగానే నిల్వచేసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. సాధారణ గొడుగులతోపాటు డబుల్, ట్రిపుల్ ఫోల్డింగ్ గొడుగులు, ట్రాన్స్పరెంట్ రెయిన్ కోట్లు, క్యాప్‌లు, కప్పుకునేందుకు ప్లాస్టిక్ పేపర్లు ఇలా అనేక రకాల వర్షాకాల సామగ్రి మార్కెట్లోకి వచ్చాయి. రూ.100–500 వరకు ధర పలికే హైక్లాస్ ప్లాస్టిక్ బూట్లు, రబ్బర్ చెప్పులు మార్కెట్లో ఉంచారు. వీటిని అధికంగా ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు కొనుగోలు చేస్తున్నారు. చాలామందికి వెంట రెయిన్ కోట్లు, గొడుగులు ఉంచుకోవడం ఇష్టముండదు. దీంతో ఇలాంటి వారికోసం యూజ్ అండ్ త్రో రెయిన్ కోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఒక్కో రెయిన్ కోట్ ధర కేవలం రూ.30–150 వరకు పలుకుతున్నాయి. బరువు కూడా చాలా తక్కువ ఉండడంతో హ్యాండ్ బ్యాగులో సులభంగా ఇమిడిపోతుంది. దీంతో వీటిని కొనుగోలు చేయడానికి ఉద్యోగులు, వ్యాపారులతో పాటు సాధారణ జనాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదీ చదవండి: కొడుకు మృతిపై తల్లడిల్లిన తల్లి : కన్నీటి పర్యంతమైన డిప్యూటీ సీఎం -
మహారాష్ట్ర రాజకీయాల మెలోడ్రామా
మహారాష్ట్రలో గత మూడేళ్ల నుండి వాయిదాపడిన 29 మున్సిపల్ కార్పొరేషన్, 257 నగర పురపాలక, ఇతర స్థానిక పంచాయతీ ఎన్నికలను రాబోయే నాలుగు నెలల్లో పూర్తి చేయాల్సిందిగా 2025 మే 6న సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అంతే, ప్రాంతీయ పార్టీలు... ముఖ్యంగా, ఉభయ శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ (ఎన్సీపీ) పార్టీలు వారి వారి కార్యకర్తలను ఏకతాటిపై తెచ్చే ప్రయత్నంలో ఉన్నాయి. మినీ అసెంబ్లీ ఎన్నికలుగా పేర్కొనే ఈ ఎన్నికల జయాపజయాలు జాతీయ విషయాలపై కాకుండా, స్థానిక సమస్యలపైనే ఆధారపడుతుంటాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఉద్ధవ్ థాకరే శివసేనకు... పుణె మునిసిపల్ కార్పొరేషన్, దగ్గర్లో ఉన్న పింప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీలకు భాలే ఖిల్లా(కంచుకోట)గా చెప్పుకుంటారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ పార్టీలు ఇక్కడ పట్టు కోల్పోవటంతో, తిరిగి వారి ఉనికిని క్రియేట్ చేయటానికి సీనియర్ పవార్, ఉద్ధవ్ థాకరే క్షేత్ర స్థాయి ఎన్నికల విజయం కోసం పావులు కదుపుతున్నారు.227 కార్పొరేటర్లు ఉన్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్, దేశంలోనే అతిపెద్ద, అతి పురాతన (1889) ప్రజా ప్రతినిధుల సంస్థ. డెబ్భై నాలుగు వేల కోట్ల రెవెన్యూ బడ్జెట్‌తో, గత ముప్పై సంవత్సరాల నుండి గ్రేటర్ ముంబై కార్పొరేషన్ శివసేన ఆధీనంలో ఉంది. 2017 ఎన్నికల్లో 84 సీట్లు సాధించింది శివసేన. అప్పట్లో జరిగిన పోటా పోటీ ఎన్నికలో బీజేపీ 82 సీట్లు గెలిచి, కేవలం రెండు సీట్లు మాత్రమే శివసేనకు వెనుకంజలో ఉంది. కానీ, 2022లో పార్టీ చీలికతో 42 మంది సేన కార్పొరేటర్లు ఇప్పుడు ఏక్నాథ్ షిండే వర్గంలోకెళ్ళిపోయారు. కార్పొరేషన్ ఎన్నికలు సమీపించటంతో మాజీ కార్పొరేటర్లు కూడా కొందరు ఉద్ధవ్ పార్టీకి తిలోదకాలు ఇచ్చారు. అయినా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 20 మంది ఉద్ధవ్ శివసేన ఎమ్మెల్యేలలో ముంబై సిటీకి చెందినవారు 10 మంది! రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు ఇది వారికి ఒక విధంగా ఆశా కిరణమే అనొచ్చు.రాజ్ థాకరే ప్రాతినిధ్యం వహిస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఇప్పటివరకూ, ఉద్ధవ్ శివసేనకు ఓట్ కట్టర్ గానే నష్టం చేకూర్చింది. సందర్భోచితంగా స్థానిక బీజేపీ నేతలు, రాజ్ థాకరే పార్టీని తమకు అనుకూలంగా వాడుకుంటారు. ఉద్ధవ్, రాజ్ కలిసి ఎన్నికల బరిలో దిగితే ఇరు పార్టీలకు కలసి వస్తుంది అని రాజకీయ విశ్లేషకులే కాక, పార్టీ కార్యకర్తలు సైతం తరచుగా చెపుతుంటారు. కానీ, అది ఇంత వరకూ జరగ లేదు. 2024 డిసెంబరులో రాష్ట్ర ముఖ్య మంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగానే, ప్రతిపక్షంలో ఉన్న ఉద్ధవ్ థాకరే వెళ్ళి ఆయనను కలవటం, మహాయుతి భాగస్వామి షిండే వర్గంలో కలకలం సృష్టించింది; ‘టిట్ ఫర్ టాట్’ అన్నట్టు శివసేన (షిండే) నేత, ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, రాజ్ సాహెబ్ ఇంటికెళ్ళి ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇదంతా గమనిస్తే, ప్రస్తుతం ఇక్కడి రాజకీయాల్లో ‘దోస్తీ దుష్మనీ’కి నిర్వచనమే తెలియటం లేదు. ఇక, మొన్న జరిగిన మరాఠీ సినీ కార్యక్రమంలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఎం.ఎన్.ఎస్. నేత రాజ్ థాకరే, ‘మహారాష్ట్ర సంక్షేమం కోసం తన పార్టీ ఉద్ధవ్ శివసేనకు మద్దతివ్వటానికి సిద్ధమే’ అని అన్నారు. మరుసటి రోజు ముంబై నగర వీధుల్లో, థాక్రే బ్రదర్స్ ‘మహారాష్ట్ర హిత్’ కోసం ఒక్కటవ్వాలి అని శివసేన పోస్టర్లు వెలిశాయి.ఇక బాబాయి, అబ్బాయిల (ఎన్సీపీ పార్టీల) విషయానికి వస్తే, ‘రాబోయే స్థానిక ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం, మీ పార్టీతో చేతులు కలుపుతుందా?’ అన్న విలేఖరి ప్రశ్నకు శరద్ పవార్, ‘మున్ముందు ఈ రెండు పార్టీలు విలీనం అయినా ఆశ్చర్యం లేదు’ అంటూ తన పార్టీ నేతలను కూడా విస్మయంలో ముంచారు. 2019 నుండి మహారాష్ట్ర రాజకీయాలు చిత్ర విచిత్రంగా మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. భాజపాతో 30 ఏళ్ల సంబంధం తెగతెంపులు చేసుకుని ఉద్ధవ్ థాకరే కాంగ్రెస్ ఎన్సీపీలతో మైత్రి కుదుర్చుకుని ముఖ్యమంత్రి కావటం; తర్వాత, 2022 జూన్‌లో ఏక్నాథ్ షిండే 52 మంది శివసేన ఎమ్మెల్యేలతో ఉద్ధవ్‌ను పదవీచ్యుతుణ్ణి చేసి భాజపా సహాయంతో సీఎం కావటం; మరో సంవత్సరం గడిచాక (2023 జూలై) అజిత్ దాదా, 43 ఎన్సీపీ ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి, భాజపా కనుచలువతో ఉపముఖ్యమంత్రి కావటంతో మహారాష్ట్ర రాజకీయ రంగస్థలంలో మెలోడ్రామా చోటు చేసుకుంది.రాష్ట్ర స్థాయి నేతలకు అతీతంగా, గ్రామ, జిల్లా, నగర స్థాయిలో అధికారం కోసం ఉబలాటపడే నాయకులు మాత్రం ముంబైలోని వారి అగ్ర నాయకుల ఫర్మాన్ పట్టించుకోదలచుకో లేదు. శివసేన, ఎన్సీపీ రెండూ రెండు వర్గాలుగా విడిపోయినప్పటికీ, క్షేత్ర స్థాయిలో ఈ పార్టీల నాయకులు, వాలంటీర్లు వారికి తోచిన రీతిలో సమీకరణలు చేసుకుంటున్నారు. అయితే స్థానిక నాయకులను తమ ‘గ్రిప్’లో ఉంచుకోవాలనే ప్రయత్నమే పవార్, థాకరే పార్టీలు చెప్పే మెర్జర్ ధోరణి రహస్యం.జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబై ‘ 98190 96949 -
Operation Kagar: అభివృద్ధి అంటే అడవుల నరికివేతా?
ఈ వారం అన్ని ప్రధాన స్రవంతి వార్తా పత్రికలూ, ఛానళ్లూ మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఎన్కౌంటర్ వార్తతో, అనుబంధ వార్తలతో, వ్యాఖ్యా, విశ్లేషణా వ్యాసాలతో నిండిపోయాయి. సామాజిక మాధ్యమాలైతే చెప్పనక్కరలేదు. ఒక సుప్రసిద్ధ ప్రధాన స్రవంతి ఇంగ్లిష్ దినపత్రిక ఆ వార్తను మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురిస్తూ, ఉద్దేశపూర్వకంగానో, అనుద్దేశపూర్వకంగానో ఆ మూడు కాలమ్‌ల వార్తకు పక్కనే మరొక రెండు కాలమ్‌ల వార్త కూడా వేసి... చాలా పెద్దవయ్యాయి గనుక రెండు వార్తలనూ రెండో పేజీలో కూడా పక్కపక్కనే కొనసాగించింది. ఆ రెండు వార్తల మధ్య కార్య కారణ సంబంధం ఉండడం ఆ పత్రిక చెప్పకుండానే చెప్పిన రహస్యం. ఆదివాసుల, మావోయిస్టుల వ్యతిరేకత వల్ల పద్దెని మిదేళ్లుగా ఆగిపోతున్న ఆ ‘అభివృద్ధి’ పథకాన్ని కొనసాగించడం గురించి వార్తా, మావోయిస్టు ప్రధాన కార్యదర్శిని చంపి వేసిన వార్తా పక్కపక్కనే కలిసి రావడం ఒక తలకిందుల కవితాన్యాయం.మహారాష్ట్ర లోని మావోయిస్టు ప్రభావిత గడ్చిరోలిజిల్లాలో ఇనుప ఖనిజం శుద్ధి కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖమే 12న అనుమతి ఇచ్చిందనేది ఆ వార్త. ఒకవైపు ‘ఆపరేషన్ కగార్’ పేరిట ఎడాపెడా ఎన్కౌంటర్లు జరుపుతూ ఆది వాసులను భయోత్పాతంలో ముంచుతున్న సందర్భంలోనే ఈ అనుమతి వచ్చిందని ప్రత్యేకంగా గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి ముందు మహారాష్ట్ర మంత్రివర్గం గడ్చిరోలీ జిల్లా గనుల తవ్వకపు ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు కూడా చేసిందని కూడా ఆ వార్తలోనే ఉంది. మావోయిస్టు నిర్మూలన, ఆదివాసుల తరలింపు అనే ప్రణాళిక దండకారణ్యంలోని ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడానికే అనే ఆరోపణను నిజం చేస్తూ, ఈ శుద్ధి కర్మాగారం కోసం భారత ప్రభుత్వం ‘లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్’ అనే బహుళజాతి కార్పొరేట్ సంస్థకు 2,324 ఎకరాల అడవిని ధారాదత్తం చేసింది. ఈ ‘అభివృద్ధి’ కింద ఒక లక్షా ఇరవై మూడు వేల చెట్లను నరికి వేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదీ చదవండి: మెకంజీ షాక్, ప్రియురాలితో రెండో పెళ్లికిముందే జాగ్రత్తపడుతున్న జెఫ్ బెజోస్నిజానికి ఈ కంపెనీకి ఇక్కడ 2007లోనే ఇరవై సంవ త్సరాల లీజు కింద వెయ్యి ఎకరాలు ఇచ్చారు. తర్వాత ఆ లీజు వ్యవధిని మరొక ముప్పై సంవత్సరాలు పెంచారు. అంటే ఆ కంపెనీ ఇక్కడి ఖనిజ వనరులను 2057 వరకూ తవ్వుకుపోవచ్చు. అయితే ఆ ప్రాంతంలో ఆదివాసులు తమ ‘జల్, జంగల్, జమీన్’లను కార్పొరేట్లకు ఇవ్వడానికి అంగీకరించబోమని, అలా ఇవ్వడం రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లో, ‘1996 పంచా యత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం’లో, ‘2006 అటవీ హక్కుల చట్టం’లో ఉన్న నిబంధనలకు వ్యతిరేకమని పోరాటం ప్రారంభించారు. ఆ పోరాటానికి మావోయిస్టులుఅండగా నిలిచారు. ఆ కారణం వల్లనో, మరే కారణం వల్లనో లాయిడ్ స్టీల్ కంపెనీ 2016 దాకా తవ్వకాలు ప్రారంభించలేకపోయింది. 2016లో తవ్వకాలు ప్రారంభించినప్పటికీ, ఆదివాసుల, మావోయిస్టుల వ్యతిరేకత మరింత క్రియాశీలంగా మారి 2016 డిసెంబర్లో సుర్జాఘర్ గనుల దగ్గర లాయిడ్ కంపెనీకి చెందిన ట్రక్కులను, ఎర్త్ మూవర్లను తగులబెట్టడంతో గనుల తవ్వకం ఆగిపోయింది. ఇప్పుడు ఆ ఆగిపోయిన గనుల తవ్వకానికి, అదనంగా అక్కడే ఒక శుద్ధి కర్మాగారం పెట్టుకోవడానికి అనుమతు లిచ్చా రన్నమాట. ఆ వార్త కూడా సరిగ్గా మావోయిస్టు కార్యదర్శి చని పోయిన రోజు ప్రకటించారన్నమాట. ఇప్పుడు ఇస్తున్న అనుమ తులకు కాగితం మీద కొన్ని షరతులు ఉన్నమాట నిజమే. ఇక్కడ ఒక లక్షా ఇరవై మూడు వేల చెట్లను నరికినందుకు, 2,400 ఎకరాల అడవిని నాశనం చేసినందుకు, అక్కడి నుంచి వెయ్యి కి.మీ. అవతల అరేబియా సముద్ర తీరంలో చిప్లున్, రత్నగిరి ప్రాంతాల్లో సమానమైన విస్తీర్ణంలో మొక్కలు నాటాలని ఒక షరతు ఉంది. ఇటువంటి అడవిని నరికే అనుమతులు పొందిన వారందరికీ అటువంటి షరతులు ఉండడమూ, వాటిని తుంగలో తొక్కి, భయంకరమైన ఉల్లంఘనలను ఆమోదించడమూ దశాబ్దాలుగా యథావిధిగా జరిగిపోతూనే ఉన్నాయి.ఇలా అడవిని పందారం చెయ్యడం ఆదివాసుల హక్కులకు మాత్రమే కాదు... దేశ సంపదకు, ప్రజల ఆరోగ్యానికి, భద్రతకు, పర్యావరణానికి, భవిష్యత్తుకు తీవ్ర ప్రమాదకరం. ఈ గడ్చిరోలి అడవి మహారాష్ట్రలోకి విస్తరించిన దండకారణ్యంలో భాగం.చదవండి: అరుదైన ఆపరేషన్.. మెడలోంచి మెదడులోకి 8 సెం.మీ మేకు!దండకారణ్యం దేశానికే ఊపిరితిత్తుల వంటిది. అక్కడ ఆ సువిశా లమైన, దట్టమైన అరణ్యాలు ఉండడం వల్లనే దేశంలో జీవ వైవిధ్యం మిగిలి ఉంది. అక్కడ పుట్టిన అనేక నదులు దేశంలో, కనీసం మధ్య భారతంలో భూగర్భ జలాలను రక్షిస్తున్నాయి. ఆ అడవి సువిశాల ప్రాంతాలకు ప్రాణవాయువును అందిస్తున్నది. పర్యావరణ రీత్యా ఇంత సుసంపన్నమైన ఈ అడవిలో దాదాపు ముప్పై ఖనిజాలు కోట్లాది టన్నులు నిక్షిప్తమై ఉన్నాయి. ఆ ఖనిజ నిలువలు దేశ సంపద. దాన్ని పొదుపుగా వాడుకుని, భవిష్యత్త రాలకు అందించడం ఈ తరం బాధ్యత. ఐదేళ్ల కోసం అధికారం పొందినవారు యాభై ఏళ్ల భవిష్యత్తును కార్పొరేట్ లాభాపేక్షకు, ఆశ్రితులకు రాసి ఇస్తున్నారు. ఆ సంపద కొల్లగొట్టడానికి అక్కడి నుంచి ఆదివాసులను ఖాళీ చేయించదలచారు. ఆదివాసులకు మద్దతుగా ఉన్న ఉద్యమకారులను నిర్మూలించ దలచారు. ఆదివాసుల మీద ప్రభుత్వాలు, కార్పొరేట్లు, మైదాన ప్రాంతవాసులు దాడి చేసి జాతులకు జాతులనే అంతరింపజేసిన చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఉంది గనుకనే, భారత రాజ్యాంగం ఐదవ, ఆరవ షెడ్యూళ్లలో ఆ ప్రాంతాలకు, ఆ ప్రాంతాలలోని ఆదివాసులకు ప్రత్యేక రక్షణలు కల్పించింది. ‘పేసా చట్టం –1996’లో, ‘ఎఫ్ఆర్ ఏ చట్టం –2006’లో ఆ రక్షణలను విస్తరించింది. ఇప్పుడు జరుగుతున్న ఈ అడవుల పందారం ఆ చట్టాలన్నిటి ఉల్లంఘన. ఇది కేవలం మావోయిస్టుల సమస్యో, ఆదివాసుల సమస్యో కాదు. ఇది ఈ దేశంలో ప్రతి ఒక్కరి సమస్య. ఈ దేశాన్ని ప్రేమించేవారందరి సమస్య. -ఎన్ వేణుగోపాల్ ‘వీక్షణం’ ఎడిటర్ -
బాహుబలికి మించిన బండిబలి
-
ఆర్భాటాలకు పోకండి.. వివాహాలు సాదాసీదాగానే జరిపించండి
ఆర్థిక స్తోమత లేకున్నా.. అప్పులు చేసి మరీ పిల్లల వివాహాలను ఘనంగా నిర్వహించే తల్లిదండ్రులను చూస్తున్నాం. అయినా కూడా గొంతెమ్మ కోరికలతో అత్తింటి వాళ్లను ఇబ్బంది పెట్టే అల్లుళ్లను.. ఆ వేధింపులను మౌనంగా భరించే కూతుళ్లను చూస్తున్నాం. మహారాష్ట్రలో ఇలాంటి వేధింపుల ఉదంతం.. సంచలన కేసు.. అక్కడి మరాఠా పెద్దలను చలించిపోయేలా చేసింది. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర మరాఠా కమ్యూనిటీ (Maratha Community) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వివాహాల విషయంలో ఆర్భాటాలు వద్దని, వీలైనంత వరకు సాదాసీదాగానే జరిపించాలని ఒక తీర్మానం చేసింది. ఎన్సీపీ బహిష్కృత నేత రాజేంద్ర హగవానే చిన్న కోడలు వైష్ణవి అదనపు కట్నం వేధింపులకు బలైంది. ఈ ఘటన నేపథ్యంతో సోమవారం మరాఠా కమ్యూనిటీ ఉన్నత కుటుంబాలకు చెందిన కొందరు పెద్దలు, రాజకీయ నాయకులు సమావేశమై పై నిర్ణయం తీసుకున్నారు.వైష్ణవి(Vaishnavi) తల్లిదండ్రులు ఎన్సీపీ నేతలు. అదే పార్టీకి చెందిన నేత రాజేంద్ర హగవానే చిన్నకొడుక్కి 2023లో వైష్ణవిని ఇచ్చి వివాహం జరిపించారు. కోరినంత కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా జరిపించినా.. ఫలితం లేకుండా పోయింది. మరో 2 కోట్ల రూపాయల అదనపు కట్నం తేవాలంటూ అత్తింటివాళ్లు ఆమెను వేధించారు. ఈ క్రమంలో నదిలో దూకి ఒకసారి, ఎలుకల మందు తిని మరోసారి ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.ఇరు కుటుంబాలు రాజకీయాల్లో ఉండడంతో.. మరాఠా పెద్దలు విషయాన్ని పెద్దది కానివ్వకుండా పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించామనుకున్నారు. కానీ ఓ బిడ్డ పుట్టాక కూడా ఆ వేధింపులు అలాగే కొనసాగాయి. ఈ క్రమంలో.. ఆ వేధింపులు తాళలేక ఆమె పుణే పింప్రి-చించ్వాద్‌లోని పుట్టింటికి చేరింది.ఈ నెల 16వ తేదీన ఇంట్లో ఎవరూలేని టైంలో ఆమె ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. నాటకీయ పరిణామాల నడుమ.. రాజేంద్ర హగావానే, అతని కోడుకు అరెస్ట్ కావడం, వైష్ణవి 10 నెలల కొడుకు ఆమె తల్లిదండ్రుల చెంతకు చేరడం పలువురిని కంటతడి పెట్టించింది. ‘‘ఈరోజుల్లో తల్లిదండ్రులకు తగిన ఆర్థిక స్తోమత లేకున్నా.. అంగరంగ వైభవంగా వివాహాలు జరిపిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. అయితే వైష్ణవి ఉదంతం మమ్మల్ని కదిలించింది. ఇక నుంచి ఆర్భాటంగా వివాహాలు జరిపించొద్దని తల్లిదండ్రులను కోరుతున్నాం. వివాహాలను మేం ఏర్పాటు చేసిన నియమావళి ప్రకారమే జరిపించాలని తీర్మానించాం’’ అని మరాఠా పెద్దలు ప్రకటించారు. ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. వివాహాలు సాదాసీదాగానే జరిపించాలి. అత్తవారింట్లో కోడళ్లకు తగిన గౌరవం, సముచిత స్థానం లభించాలి. అత్తలు కోడళ్లను కూతుళ్లలా, కోడళ్లు అత్తలను తల్లులుగా భావిస్తూ వాళ్ల మధ్య బంధం సజావుగా సాగాలి. అలాగే.. వరకట్న వేధింపులు ఎదురైనప్పుడు ఆ తల్లిదండ్రులు ఎలా స్పందించాలి అనే విషయాలపైనా అవగాహన కల్పించే కార్యక్రమాలను రూపొందించాలని మరాఠా పెద్దలు తీర్మానించారు.ఇదీ చదవండి: పెళ్లి కొడుకును ఎత్తుకెళ్లిపోయారు, చివరకు.. -
‘గేట్ వే-మాండ్వా’ లాంచీల నిలిపివేత , జేజే ఆసుపత్రిలోకి నీరు
గేట్ వే ఆఫ్ ఇండియా–మాండ్వాల మధ్య సోమవారం నుంచి లాంచి సేవలను నిలిపివేశారు. మారిటైం బోర్డు ఆదేశాల మేరకు లాంచి యజమానులు సేవలు నిలిపివేశారు. దీంతో నిత్యం ఈ మార్గంలో లాంచీలలో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇకనుంచి ఎక్కువ చార్జీలు చెల్లించి రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. లాంచీ సేవలు మళ్లీ సెప్టెంబరు 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని లాంచీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్దార్ మహాడ్కర్ తెలిపారు. ముంబై పరిసరా ప్రాంతాల్లో గత వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు పక్షం రోజుల ముందే వర్షాలు ప్రారంభం కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 26వ తేదీ నుంచి లాంచి సేవలు నిలిపివేయాలని మారిటైం బోర్డు నిర్ణయించింది. ఏటా వర్షా కాలంలో జూన్ ఒకటో తేదీ నుంచి లాంచీ సేవలు నిలిపివేస్తారు. కానీ ఈసారి వర్షాలు తొందరగా ప్రారంభం కావడంతో వారం రోజుల సర్వీసులను నిలిపివేశారు. రోరో సేవల కొనసాగింపు... ముంబైకి సమీపంలో ఉన్న వివిధ ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో అలీబాగ్ ఒకటి. ఇక్కడికి వెళ్లేందుకు రోడ్డు మార్గం ఉన్నప్పటికీ 90 శాతం పర్యాటకులు లాంచీలను ఆశ్రయిస్తారు. రోడ్డు మార్గం కంటే సముద్ర మార్గం ద్వారా అలీబాగ్‌కు చేరుకోవడం చాలా సులభం. బస్సు చార్జీలతో పోలిస్తే లాంచీ చార్జీలు చాలా తక్కువ. గేట్ వే ఆప్ ఇండియా–మాండ్వా మ«ధ్య ప్రతీరోజు 40–50 లాంచీలు నడుపుతారు. వర్షాకాలంలో సముద్రంలో అలలు ఉవ్వేత్తున ఎగిసిపడతాయి. ముఖ్యంగా హై టైడ్ కారణంగా లాంచీలకు ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే ఈసారి ముందుగానే వర్షాలు మొదలుకావడంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకముందే లాంచీ సర్వీసులను నిలిపివేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే భావుచా ధక్క–మాండ్వా మధ్య రోల్ ఆన్–రోల్ ఆఫ్ (రోరో) సేవలు కొనసాగుతాయని మారిటైం బోర్డు తెలిపింది. ఉపాధి..ఆదాయానికి గండి.... గేట్ వే–మాండ్వా మధ్య పీఎన్పీ, మాల్దార్, అజంత, అపోలే కంపెనీల లాంచీలు సేవలందిస్తున్నాయి. దాదాపు మూడు నెలలకుపైగా లాంచిసేవలు నిలిచిపోనుండటంతో వీటి యజమానులు, అక్కడి హోటళ్లు, లాడ్జింగులు, వాహనాల యజమానుల ఆదాయానికి గండిపడనుంది. ముంబై నుంచి బయలుదేరే పర్యాటకులతోపాటు అలీబాగ్ నుంచి ముంబైకి వచ్చే వ్యాపారులు, ఉడ్యోగుల రాకపోకలు కూడా నిలిచిపోతాయి. ఇకనుంచి వీరంతా రోడ్డు మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. ఇది వ్యయ, ప్రయాసలతో కూడున్నదైనప్పటికీ తప్పదని అధికారులు అంటున్నారు. కేఈఎం, జేజే ఆసుపత్రుల్లోకి వరదనీరు మోకాల్లోతులో నీటిలో ఆసుపత్రుల ప్రధాన భవనాలు, పరిసరాలు వరదనీటిలోనే రోగుల క్యూ ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. వర్షాల కారణంగా కేఈఎం, జె.జె. ఆసుపత్రులు నీట మునిగాయి. పరేల్‌లోని కేఈఎం ఆసుపత్రి ప్రధాన ప్రవేశ ద్వారం , పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ) వద్ద అలాగే కొన్ని రోగుల గదుల వెలుపల భా రీగా నీరు నిలిచిపోయింది. టాటా ఆసుపత్రి, కేఈఎం ఆసుపత్రి, వార్డు 4ఏ వరండాల్లో నీరు చేరింది. నీటి పంపులతో వెంటనే నీటిని తొల గించినట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్ జోషి తెలిపారు. ఇక జె.జె. ఆసుపత్రిలో కూడా పరిస్థితి భయానకంగా ఉంది. ప్రధాన భవనం వెలుపల, అలాగే ఆసుపత్రి నివాస భవనాల పరిసరాలు మోకాలి లోతు నీటిలో మునిగిపోయింది. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కోసం వచ్చిన రోగులు నీటిలోనే నిలబడాల్సి వచ్చింది. అవుట్ పేషెంట్ భవనం నుంచి ప్రధాన భవనానికి వెళ్లే రోగులు పూర్తిగా నీటిలోనే నడవాల్సి వచి్చంది. జె.జె. ఆసుపత్రి సమీ పంలోని పోలీస్ స్టేషన్ ప్రాంతం, ప్రజా పనుల విభాగం ఆవరణలోనూ నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అ యితే గత సంవత్సరం లాగా ఆసుపత్రి భవనం ఈసారి పూర్తిగా నీటమునగలేదని, తగిన ముందు జాగ్రత్తలు తీసుకున్నామని జె.జె. ఆసుపత్రి డీన్ డాక్టర్ అజయ్ భండార్వర్ తెలిపారు. -
ముప్పు తప్పినంతనే మరో ఘోరం.. ఆరుగురు మృతి
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటుచేసుకుంది. గాంధీ వంతెనపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. అత్యంత అనూహ్య రీతిలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే ధూలే-సోలాపూర్ జాతీయ రహదారిపై ఒక ఎస్యూవీ వాహనం డివైడర్‌ను ఢీకొంది. దీంతో అప్రమత్తమైన ఎస్‌యూవీలోని ఆరుగురు ప్రయాణికులు కిందకు దిగారు. ఇంతలో అటుగా వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారిని ఢీకొంది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. బీడ్ పోలీసు సూపరింటెండెంట్ నవనీత్ కన్వత్ ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ గెవ్రాయ్ పట్టణానికి సమీపంలోని ధూలే-సోలాపూర్ జాతీయ రహదారిలోని గాంధీ వంతెనపై ఒక ఎస్యూవీ డివైడర్‌ను ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఆరుగురిలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. అయితే డివైడర్ నుండి తమ వాహనాన్ని పక్కకు తప్పించేందుకు వారు ప్రయత్నిస్తుండగా, అటుగా వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారిని ఢీకొన్నదని తెలిపారు. ఈ ప్రమాదంలో ఆ ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కన్వత్ తెలిపారు.ఇది కూడా చదవండి: Nehru Death Anniversary: చైనాతో ఓటమిని జీర్ణించుకోలేక.. -
అకాల వర్షాలు.. కొండెక్కిన ధరలు.. ఇలాగే ఉంటే...!
దాదర్: గత వారం, పదిరోజులుగా రాష్టవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలవల్ల వివిధ రకాల పంటలతోపాటు కూరగాయల తోటలకు అపార నష్టం వాటిల్లింది. వర్షాలకు అనేక ప్రాంతాల్లో కూరగాయల తోటలు నీటమునిగాయి. కొన్ని చోట్ల ట్రక్కులు, టెంపోలలో రవాణాకు సిద్ధంగా ఉంచిన కూరగాయలు కుళ్లిపోవడంతో అక్కడే రోడ్లపై పారేయాల్సిన పరిస్ధితి వచి్చంది. ఫలితంగా న్యూ ముంబై వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ), అలాగే థానేలోని హోల్‌సేల్ మార్కెట్లలో కూరగాయల లోడుతో వచ్చే వాహనాల సంఖ్య తగ్గిపోయింది. సరుకు కొరత ఏర్పడడంతో కూరగాయల ధరలు మండి పోతున్నాయి. మొన్నటి వరకు స్ధిరంగా ఉన్న కూరగాయల ధరలు ఇప్పుడు అకాల వర్షాల వల్ల చుక్కలను తాకుతున్నాయి. అసలే వర్షాలు, ఆపై కూరగాయల కొరత, ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. 18 ఏళ్ల తరువాత మళ్లీ... రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గత వారం, పదిరోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు కొంత ముందుగానే ఆరంభమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ 20 రోజుల ముందుగానే ఊహించని వర్షాలతో సామాన్య జనాలతో పాటు రైతులు కూడా ఆందోళనకు గురయ్యారు. గత 18 ఏళ్ల కిందట మే నెలలో భారీ వర్షాలు కురిశాయి. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు రికార్డు బ్రేక్ చేశాయని కొలాబా, శాంటాకృజ్ వాతావరణ శాఖలు తెలిపాయి. చదవండి: గంగి గోవు పాలు...గడ్డిపోచ..ఏది ఘనమైనది?!ఇలాగే ఉంటే...మరింత పైపైకి... కొద్ది నెలలుగా స్ధిరంగా కూరగాయలు, ఉల్లి, బంగాళదుంపలు, టమాటాలు, ఆకు కూరల ధరలు కొద్ది నెలలుగా స్థిరంగా ఉంటుండటంతో కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు అకాల వర్షాలు, ధరల పెరుగుదలతో బెంబేలెత్తిపోతున్నారు. కొరత కారణంగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల ధరలు ఇప్పటికే 10–20 శాతం పెరిగాయి.రాష్ట్రంలోని అనేక జిల్లాలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో సరుకులు కుళ్లీపోకే ముందే అక్కడే ఖాళీ చేస్తున్నారు. తక్కువ ధరకు విక్రయించి కనీసం పెట్టుబడి రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్ధితి ఇలాగే ఉంటే రేట్లు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు.ఇదీ చదవండి: స్కూల్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు : అపూర్వ సహోదరులు -
ముంబై: నీట మునిగిన మహా నగరం.. 107 ఏళ్ల రికార్డు బద్దలు
ముంబై: మహారాష్ట్రలోని ముంబైని వానగడం ఇప్పట్లో వీడేలా లేదు. ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా ముంబైని ముంచెత్తిన వర్షం కాస్త తెరిపిచ్చినప్పటికీ, ఇప్పుడు(మంగళవారం ఉదయం) మళ్లీ తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం దక్షిణ ముంబైలో మళ్లీ భారీ వర్షం ప్రారంభమైంది.ఈ నేపధ్యంలో మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు నగరానికి వాతావరణ శాఖ(Meteorological Department) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ సమయంలో భారీ నుండి అతి భారీ వర్షాలు ముంచెత్తుతాయని తెలిపింది. గడచిన 24 గంటల్లో ముంబైకి జారీ చేసిన రెండవ రెడ్ అలర్ట్ ఇది. నారిమన్ పాయింట్, వార్డ్ మున్సిపల్ హెడ్ ఆఫీస్, కొలాబా పంపింగ్ స్టేషన్, కొలాబా ఫైర్ స్టేషన్ తదితర ప్రాంతాలలో ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు 200 మి.మీకి మించిన వర్షం కురిసింది. ఫలితంగా రోడ్లు జలమయం అయ్యాయి. సాధారణ జీవితం స్తంభించిపోయింది.గడచిన 24 గంటల్లో ముంబైలో కురిసిన వర్షపాతం 107 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. గత 75 ఏళ్లలో నగరంలో రుతుపవనాల ప్రభావం ఇంత భారీ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారని వాతావరణ శాఖ పేర్కొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విమాన, లోకల్ రైళ్ల కార్యకలాపాలు నిలిచిపోయాయి. రెండు వారాల క్రితమే ప్రారంభించిన మెట్రోలోని ఒక భూగర్భ స్టేషన్ నీటితో నిండిపోయింది. దీనితో అధికారులు ఈ మార్గంలో కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. కుర్లా, సియోన్, దాదర్, పరేల్‌తో సహా అనేక లోతట్టు ప్రాంతాలు వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున వాహనాలు వరదలతో నిండిన వీధుల గుండా వెళుతున్న దృశ్యాలు కనిపించాయి.థానేలో పరిస్థితిని సమీక్షించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడం, ఫలితంగా కురిసిన భారీ వర్షపాతం ముంబైలోని అనేక ప్రాంతాలలో ముంపునకు కారణంగా నిలిచిందన్నారు. ముంబైలో రుతుపవనాలు షెడ్యూల్ కంటే 16 రోజులు ముందుగానే వచ్చాయి. గత సంవత్సరం రుతుపవనాలు జూన్ 25న మహారాష్ట్ర రాజధానికి చేరుకున్నాయి. కాగా రుతుపవనాలు శనివారం కేరళకు చేరుకున్నాయి. ఇది కూడా చదవండి: పాక్‌లో జ్యోతి మల్హోత్రాకు వీఐపీ సెక్యూరిటీ -
వీడియో: దంచికొట్టిన వర్షం.. వరద నీటిలో బస్సులు, రైల్వే ట్రాక్..
ముంబై: నైరుతి రుతుపవనాల రాకతో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నుంచి మహారాష్ట్రలో భారీ కురుస్తోంది. వర్షం కారణంగా రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. వరద నీటి ప్రవాహం కారణంగా కార్లు కొట్టుకుపోయాయి. రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్ వరకు వరద నీరు చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.మహారాష్ట్రలో కుండపోత వర్షం కారణంగా పూణే-సోలాపూర్ హైవే జలమయమైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల్లో ఇబ్బందులకు గురవుతున్నాయరు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. వరద నీరు కారణంగా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. రాబోయే కొద్ది గంటల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.Heavy rains being reported in parts of South Mumbai now. In a one hour span from 9-10 am the Nariman Point Automatic Weather station has reported 104 mm of rains. Below video of Nepensea Road which is water logged. pic.twitter.com/EcTCjcbttK— Richa Pinto (@richapintoi) May 26, 2025ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడంతో సబర్బన్ రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే ప్రతికూల వాతావరణం కారణంగా పలు విమాన సర్వీసులు సైతం ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు ప్రకటనలో తెలిపారు.Today won’t be the last time we see such rain. Few ideas on how to drive safe. Turn on your lamps (not blinkers) and drive slowly. Don’t change lanes if not required. Water accumulates quickly, so be prepared to navigate pockets of water safely #MumbaiRains pic.twitter.com/iUWEPxOSon— Siddharth Rangnekar (@themrsidey) May 26, 2025మరోవైపు.. మహారాష్ట్రలోని ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాల్లో జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాయ్‌గఢ్, రత్నగిరి, మధుదుర్గ్ జిల్లాల్లో అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు నుండి నాలుగు గంటల్లో మహారాష్ట్ర అంతటా కొన్ని జిల్లాల్లో గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన గాలులతో కూడిన ఉరుములు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.Welcome to May 2025! And parts of South Mumbai are flooded owing to Tripple Digit rains in mere 2 hours! #MumbaiRains pic.twitter.com/pSxW9BSayk— Mumbai Nowcast (@s_r_khandelwal) May 26, 2025ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సోమవారం ఉదయం బారామతిలోని వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా అన్ని భద్రతా సంస్థలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక, భారీ వర్షాల నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. దాదాపు 3,100 మంది నివాసితులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. Situation outside Prabhadevi railway station (Churchgate end). Avoid this lane. Waterlogging till knee length. #MumbaiRains #waterlogging @mybmc pic.twitter.com/GA4HEKAzrW— Sagar Joshi (@sagarjjoshi87) May 26, 2025 Masjid station #mumbai #locals #BMC #monsoon #drowning #floods #rains #mumbairains What is our government doing? Who will answer this failure. First rain in Bombay and this is the situation??? pic.twitter.com/QWVmJeGmiN— **Isha** (@ibarthwal) May 26, 2025మరోవైపు.. ఢిల్లీ, కర్ణాటకలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 49 విమానాలను దారి మళ్లించినట్టు అధికారులు వెల్లడించారు. వీటిలో 32 ప్రాంతీయ సర్వీసులు, 17 అంతర్జాతీయ సర్వీసులు ఉన్నాయి. ఇక, కర్ణాటకలో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. Mumbaikars office jate hue #MumbaiRains pic.twitter.com/2NWPnkkSZ1— Desi Bhayo (@desi_bhayo88) May 26, 2025BJP's double engine is located underwaterBuses and cars submerged in #Delhi Cantt area after overnight rains Severe waterlogging in several parts of the National Capital of India#DelhiRains #BiharElections#Gujarat #Kerala #ByElection#युवा_आक्रोश_महारैली #NITIAayog pic.twitter.com/oD3nWXhPql— Taj INDIA (@taj_india007) May 25, 2025 -
వసతులు కరువు.. చదువులు బరువు
సాక్షి, ముంబై : రాష్ట్ర వ్యాప్తంగా 30,116 మంది పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా ఖాళీగా తిరుగుతున్నట్లు ఇటీవల విద్యా శాఖ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. అందుకు ప్రధాన కారణం అనేక పాఠశాలల్లో విద్యార్థులకు మౌలికసదుపాయాల కొరత ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. పాఠశాలకు స్వస్తి చెప్పిన విద్యార్థుల్లో అధిక శాతం బాలికలే ఉన్నారు. స్వచ్ఛమైన మరుగుదొడ్లు లేకపోవడం ఒక కారణమైతే కొన్ని పాఠశాలల్లో అసలు మరుగుదొడ్లే లేవనే ఆశ్చర్యకరమైన విష యం బయటపడింది. 5,373 పాఠశాలల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు. అదేవిధంగా 530 పాఠశాలల్లో తాగునీటి సదుపాయం లేదు. కొన్ని పాఠశాల ల్లో ఆడ పిల్లల కోసం స్వతంత్రంగా మరుగు దొడ్లు లేవు. అలాగే 5,127 పాఠశాలల్లో అసలు మరు గుదొడ్లు లేవనే విషయం వెలుగులోకి వచి్చంది. దీంతో గత్యంతరం లేక పాఠశాల ప్రహరీ గోడకు అవతల ఆనుకుని ఉన్న దట్టమైన పొదల్లోకి లేదా పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోంది. దీంతో అనేక మంది పేద తల్లిదండ్రులు తమ పిల్లలను ముఖ్యంగా ఆడపిల్లలను పాఠశాలకు పంపేందుకు వెనకడుగు వేస్తున్నారు. ప్రయత్నాలు ఘనం.. ఫలితం శూన్యం ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో ధనవంతులతోపాటు అనేక మంది పేదలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లోంచి డ్రాపౌట్ అవుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోసాగింది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వ పాఠశాలను అందంగా తీర్చిదిద్డడం, మరగుదొడ్లకు మరమ్మతులు చేపట్టడం, తాగు నీరు, విద్యా బోధన మెరుగుపర్చడం ఇలా అనేక సదుపాయాలు కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. అయినప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగలేదు. దీంతో ప్రతీ ఊరు, పల్లెటూర్లలో తిరిగి విద్యార్థులకు కౌన్సెలింగ్, తల్లిదండ్రులకు మార్గదర్శనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు ప్రత్యేక బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ కౌన్సెలింగ్, మార్గదర్శనం చేయడం ప్రారంభించారు. 2023–24 విద్యా సంవత్సరంలో పాఠశాలలకు వెళ్లని విద్యార్థుల సంఖ్య 33,470 ఉండగా అదే 2024–25లో ఈ సంఖ్య 30,116 చేరింది. దీన్ని బట్టి గత విద్యా సంవత్సరంలో 3,354 మంది విద్యార్థుల సంఖ్య మాత్రమే పెరిగిందని స్పష్టమవుతోంది. అంటే ఇంకా 30,116 మంది పిల్లలు పాఠశాలకు దూరంగా ఉంటున్నట్లు తేలింది. విద్యార్థులు ఖాళీగా తిరగడంవల్ల చెడు వ్యసనాలకు అలవాటు పడే ప్రమాదం లేకపోలేదు. నేరాలకు కూడా పాల్పడతారని విద్యా శాఖ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో సాధ్యమైనంత త్వరగా ఈ సంఖ్య తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది వేసవి సెలవుల్లో చేపట్టిన కౌన్సెలింగ్, మార్గదర్శక కార్యక్రమాలవల్ల కొంతమేర సత్ఫలితాలు ఇవ్వవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో పాఠశాలలు ప్రారంభమైన తరువాత 2025–26లో ఎంతమేర విద్యార్థుల సంఖ్య పెరిగిందనేది తెలుస్తోంది. దీన్ని బట్టి పాఠశాలకు ఇంక ఎంతమంది దూరంగా ఉంటున్నారనే దానిపై ఒక స్పష్టత వస్తుందని విద్యా శాఖ పేర్కొంది. -
మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి
-
ఆ ఒక్క రాష్ట్రంలోనే ఐదు లక్షల కార్లు: SIAM డేటా..
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల (SIAM) డేటా ప్రకారం.. 2024-25లో భారతదేశంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో 'మహారాష్ట్ర' మొదటి స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ ద్విచక్ర వాహనాల అమ్మకాలలో ముందుంది.SIAM డేటా ప్రకారం.. 2024-25లో మహారాష్ట్రలో ప్యాసింజర్ వాహనాల (PV) అమ్మకాలు 5,06,254 యూనిట్లు (11.8 శాతం)గా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ 4,55,530 యూనిట్లు (10.6 శాతం), గుజరాత్ 3,54,054 యూనిట్లు (8.2 శాతం) అమ్మకాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆ తరువాత నాల్గవ స్థానంలో కర్ణాటక 3,09,464 యూనిట్లతో (7.2 శాతం), హర్యానా 2,94,331 యూనిట్లతో (6.8 శాతం) ఐదవ స్థానంలో ఉన్నాయి.ద్విచక్ర వాహన విభాగంలో.. ఉత్తరప్రదేశ్ 28,43,410 యూనిట్ల అమ్మకాలతో (14.5 శాతం వాటా) అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర 20,91,250 యూనిట్లతో (10.7 శాతం), తమిళనాడు 14,81,511 యూనిట్లతో (7.6 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగు, ఐదు స్థానాల్లో కర్ణాటక (12,94,582 యూనిట్ల), గుజరాత్ (12,90,588 యూనిట్లు) ఉన్నాయి.ఇదీ చదవండి: ఒక్కసారి చెల్లిస్తే చాలు!.. ఏడాదంతా ఫ్రీ జర్నీత్రిచక్ర వాహనాల విభాగంలో.. ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 93,865 యూనిట్లు (12.7 శాతం) అమ్మకాలు జరపగా, గుజరాత్ 83,947 యూనిట్లు (11.3 శాతం), మహారాష్ట్ర 83,718 యూనిట్లు (11.3 శాతం) అమ్మకాలు జరిపాయని డేటా తెలిపింది. కర్ణాటక 70,417 యూనిట్లతో (9.5 శాతం) నాల్గవ స్థానంలో, బీహార్ 47,786 యూనిట్లతో (6.4 శాతం) ఐదవ స్థానంలో నిలిచాయి. -
బీజేపీ మమ్మల్నిటార్గెట్ చేసింది.. బాల్‌థాక్రే సంచలన వ్యాఖ్యలు
ముంబై: బీజేపీపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్, థాక్రే బ్రాండ్లను అంతం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కానీ, అలాంటివి జరిగే ప్రసక్తే లేదని నొక్కి చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాక్రే తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. థాక్రే బ్రాండ్ అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అది అంత సులభం కాదు. థాక్రే బ్రాండ్ విషయానికి వస్తే నా తాత ప్రభోదంకర్ థాక్రే మహారాష్ట్రపై మొదటి ప్రభావాన్ని చూపారు. ఆయన తర్వాత, బాలాసాహెబ్ థాక్రే, తరువాత నా తండ్రి శ్రీకాంత్ థాక్రే తమదైన ముద్ర వేశారు. అనంతరం, థాక్రే వారుసులమైన నేను, ఉద్దవ్ థాక్రే మా సత్తా ఏంటో చూపించాం అని అన్నారు.ఇదే సమయంలో..‘నేను ఒక ఫోటో చూశాను. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, సునీల్ తత్కరే, అశోక్ చవాన్, నారాయణ్ రాణే, ఛగన్ భుజ్బాల్, ఇతర నాయకుల మధ్యలో కూర్చున్నారు. ఆ ఫోటో చూసినప్పుడు, నేను ఆశ్చర్యపోయాను. బీజేపీ మద్దతుదారులు దానిని ఎలా చూస్తున్నారో ఆలోచించాను?. మేము వారికి అధికారం రాకుండా ఎంతో కష్టపడ్డామని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వారు ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలతో కూర్చున్నారు అని ఆలోచిస్తున్నారు. ఇది వారి మనసులో ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు.అనంతరం, పహల్గాం ఘటనపై స్పందిస్తూ..‘పహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు?. పాకిస్తాన్‌తో యుద్ధం అనేది ఒక ఎంపిక కాదు. మనం చేసింది యుద్ధం కూడా కాదు. యుద్ధం గురించి మీకు ఏం తెలుసు?. గాజాను చూడండి, అప్పుడు యుద్ధం ఎలాంటి విధ్వంసం తెస్తుందో మీకు అర్థమవుతుంది. పాకిస్తాన్‌పై మన దాడులు పర్వాలేదు. కానీ, మన 26 మందిని చంపిన ఆ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు? వారు ఇప్పటికీ పరారీలో ఉన్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
గడ్చిరోలిలో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. భమ్రాగఢ్‌లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.కాగా, రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (71) మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ ఎదురుకాల్పుల్లో పలువురు కీలక నేతలు సహా మొత్తం 27 మంది మావోయిస్టులు కూడా మరణించారు. ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్–బీజాపూర్ జిల్లా సరిహద్దు అబూ జ్‌మఢ్ అడవుల్లో ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ డీఆర్జీ జవాను కూడా మృతి చెందాడు. -
మలబార్‌హిల్ ‘నైసర్గిక ఎలివేటెడ్’.. సూపర్! టూరిస్టుల రద్దీ
మలబార్ హిల్ ప్రాంతంలో నెల రోజుల కిందట ప్రారంభించిన ‘నైసర్గిక ఎలివేటెడ్ మార్గం’కు పర్యాటకులు, ముంబైకర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రారంభించిన వారం రోజుల్లోనే 10 వేలకుపైగా పర్యాటకులు ఈ నైసర్గిక ఎలివేటెడ్ మార్గం అనందాన్ని ఆస్వాదించగా ఇప్పుడా సంఖ్య ఏకంగా లక్షకుపైనే చేరింది. పర్యాటకుల ఎంట్రీ టికెట్ల ద్వారా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి రూ.27 లక్షలకుపైగా ఆదాయం వచ్చింది. కొందరికి టెకెట్లు దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. లేదంటే ఈ ఆదాయం మరింత పెరిగేదనే బీఎంసీ వర్గాలు తెలిపాయి. రూ.30 కోట్ల వ్యయం శివసేన యువనేత, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే 2022లో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సింగపూర్ తరహాలో ‘ట్రీ టాప్ వాక్’ నిర్మించాలని సంకల్పించారు. ఆ మేరకు కమలా నెహ్రూ పార్క్ సమీపంలో ఉన్న మలబార్ హిల్‌లో నైసర్గిక ఎలివేటెడ్ మార్గం పనులు ప్రత్యక్షంగా ప్రారంభమయ్యాయి. అందు కు రూ.30 కోట్లు ఖర్చుచేసిన ఈ నైసర్గిక ఎలివేటెడ్ మార్గం గత నెల నుంచి వినియోగంలోకి వచి్చంది. ప్రారంభం నుంచి ఈ ఎలివేటెడ్ మార్గానికి పర్యాటకుల నుంచి విశేష స్పందన లభించసాగింది. ట్రీ టాప్ వాక్ తరహాలో.. మలబార్ హిల్ ప్రాంతంలో కొండపై కమలా నెహ్రూ పార్క్ ఉంది. దీనికి కూతవేటు దూరంలో బూట్ (షూ) బంగ్లా ఉద్యానవనం ఉంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చిన దేశ, విదేశీ పర్యాటకులు కచ్చితంగా ఈ రెండు ఉద్యాన వనాలను సందర్శిస్తారు. దీంతో ఇక్కడికి వచ్చిన పర్యాటకులను మరింత ఉత్సాహపరిచాలనే ఉద్దేశంతో సింగపూర్‌లో ఉన్న ‘ట్రీ టాప్ వాక్’ తరహాలో నైసర్గిక ఎలివేటెడ్ మార్గాన్ని నిర్మించారు. ఇలాంటి ఎలివేటెడ్ మార్గాన్ని ముంబైలో నిర్మించడం ఇదే ప్రథమం కావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మార్గానికి వందలాది చెట్లు అడ్డువచ్చినప్పటికీ ఒక్క చెట్టుకు కూడా హాని తలపెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎలివేటెడ్ మార్గం తెరిచి ఉంటుంది. 12 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఉద్యానవనంలోని వివిధ రకాల జంతువులు, పక్షులు చూడవచ్చు. అలాగే కొండ కిందున్న అరేబియా సముద్ర తీరం అందాలను, ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలు, చర్నిరోడ్ (గిర్గావ్) చౌపాటి, క్వీన్‌క్లెస్ (మెరైన్ డ్రైవ్) తదితర విహంగం ద్వారా దృశ్యాలను తిలకించవచ్చు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.25 వసూలు చేస్తున్న నైసర్గిక ఎలివేటెడ్ మార్గానికి రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. శని, ఆదివారాలైతే కిక్కిర్సిన జనాలు, పర్యాటకులు ఉంటున్నారు. టికెట్లన్నీ ఆన్లైన్లోనే అమ్ముడు పోవడంతో ఆఫ్‌లైన్‌లో లభించడం లేదు. దీంతో అనేక మంది పర్యాటకులు నైసర్గిక ఎలివేటెడ్ మార్గం ద్వారా ప్రకృతి అందాలను తిలకించకుండానే వెనుదిరుగుతున్నారు. -
రోహిత్ శర్మకు సత్కారం.. ఇంటికి ఆహ్వానించి సన్మానించిన సీఎం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఘన సత్కారం లభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) హిట్‌మ్యాన్‌ను తన ఇంటికి ఆహ్వానించి.. సన్మానించారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.కాగా రోహిత్ శర్మ ఇటీవలే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ (Test Cricket Retirement) ప్రకటించిన విషయం తెలిసిందే. మే 7న ఇందుకు సంబంధించి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అధికారిక ప్రకటన విడుదల చేశాడు. తెలుపు రంగు జెర్సీలో దేశానికి ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమంటూ భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు.అయితే, వన్డేల్లో మాత్రం తాను కొనసాగుతానని రోహిత్ శర్మ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. అతడే వన్డే జట్టు కెప్టెన్‌గా కొనసాగుతాడని పేర్కొంది. అధికారిక నివాసానికి ఆహ్వానించిన సీఎంకాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అతడిని తన అధికారిక నివాసానికి ఆహ్వానించారు. పుష్ఫగుచ్ఛం అందించి.. శాలువాతో రోహిత్‌ను ఫడ్నవిస్ సత్కరించారు. అతడితో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ.. ‘‘భారత క్రికెట్ రోహిత్ శర్మను నా అధికారిక నివాసం ‘వర్ష’కు ఆహ్వానించడం.. ఆయనను కలిసి మాట్లాడటం ఎంతో గొప్పగా అనిపిస్తోంది.టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్కు ప్రకటించిన రోహిత్ శర్మకు శుభాకాంక్షలు. జీవితంలోని తదుపరి అధ్యాయంలోనూ ఆయన ఇలాగే మరింత విజయవంతం కావాలని ఆశిస్తున్నా’’ అని దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు.దిగ్గజ కెప్టెన్గాకాగా టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఇప్పటికే రెండు ఐసీసీ ట్రోఫీలు సాధించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలపడంతో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (వన్డే) కూడా అందించాడు. అయితే, గత కొంతకాలంగా టెస్టుల్లో మాత్రం రోహిత్ శర్మ ప్రదర్శన ఇటు కెప్టెన్‌గా.. అటు బ్యాటర్‌గా బాగాలేదు.రోహిత్ సారథ్యంలో టీమిండియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది సొంతగడ్డపై విదేశీ జట్టు చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా.. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఫలితంగా ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (2025) ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.కోహ్లి కూడా ఇదే బాటలోఆ తర్వాత ముంబై తరఫున రోహిత్ శర్మ రంజీ బరిలో దిగి కూడా విఫలమయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలోనూ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ బీసీసీఐ అతడినే కెప్టెన్‌గా కొనసాగిస్తుందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా బుధవారం రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఆ తర్వాత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు వీడ్కోలు పలికాడు. వీరిద్దరు లేకుండానే జూన్ 20 నుంచి టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తో యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ టీమిండియా కొత్త కెప్టెన్‌గా నియమితుడు కానున్నట్లు తెలుస్తోంది.చదవండి: Ind vs Eng: కుర్రాళ్లతో ఈ సిరీస్ ఆడటం కష్టం.. వాళ్లిద్దరు ఉంటే బెటర్! -
భక్తుల కొంగుబంగారం ముక్తీశ్వరుడు పుష్కరాలు : ఇక్కడి స్పెషల్ ఏంటంటే..?
రాష్ట్రంలోని మహాప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన మహాక్షేత్రం కాళేశ్వరం. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం కాళేశ్వర–ముక్తీశ్వరులు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల భక్తులతో నిత్యం పూజలందుకుంటూ విరాజిల్లుతోంది. ఈ క్రమంలో ఈనెల 15నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్కర శోభను సంతరించుకోనుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టం పై రెండు శివలింగాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈలింగాలలో ఒకటి కాలుడు (యముడు), ముక్తీశ్వరుడు(శివుడు)గా వెలిసినట్లు పురాణాలు పేర్కొంటున్నా యి. ముక్తీశ్వర లింగానికి రెండు నాశికారంధ్రాలు ఉంటాయి. అందులో ఎన్ని బిందెల నీళ్లు పోసి నా బయటకు కనిపించవు. ఆ నీరు సొరంగ మార్గం గుండా గోదావరిలో కలుస్తుందని పూర్వీకులు తెలుపుతున్నారు. గర్భగుడికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలు, నాలుగు నంది విగ్రహాలు, నాలుగు ధ్వజ స్తంభాలు, నాలుగు గోపురాలు ఉండడం కాళేశ్వర క్షేత్రం విశేషం. కాళేశ్వరం క్షేత్రం గోదావరి పరీవాహక ప్రాంతం కావడంతో మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత, ఆదిలాబాద్ నుంచి గోదావరి, అంతర్వాహిణి సరస్వతీ నదులు కలిసిన క్షేత్రం కాళేశ్వరమని ప్రాచుర్యంలో ఉంది. కాళేశ్వరం క్షేత్ర నిర్మాణం..పూర్వం యమ ధర్మరాజు ఓ కార్యం నిమిత్తం స్వర్గలోకంలో ఇంద్రుడి వద్దకు వెళ్లాడు. ఇంద్రలోకంలోని వైభవాలు చూశాడు. ప్రజలు ఇక్కడ సుఖసంతోషంగా ఉంటూ యమ లోకానికి రావడానికి ఇష్టపడడం లేదు. వీరంతా ఆ మహాశివుడిని పూజిస్తున్నట్లు తెలుసుకున్నాడు. మహాశివుడిని పూజిస్తే కోరికలు తీరుతాయని గ్రహించి ముక్తీశ్వర ఆలయం ఎదుట 12 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు. ముక్తీశ్వరుడు ప్రత్యక్షమై యమధర్మరాజును తపస్సు ఎందుకు చేస్తున్నావు..నీ కోరిక ఏంటని ప్రశ్నించాడు.అందుకు యమధర్మరాజు నీవు భక్తులకు సర్వపాపాలు తొలగించి సుఖసంతోషాలను ప్రసాదిస్తూ కైలాసానికి పంపుతున్నావు. యమలోకంలో నాకు పని లేకుండా పోయిందని పేర్కొన్నాడు. అందుకోసం ముక్తీశ్వరాలయంలో నీ లింగం పక్కనే నాకు చోటు కల్పించి భక్తులు నీకంటే ముందు నన్నే పూజించాలని ముక్తీశ్వరుడితో వేడుకున్నాడు. అందుకు ముక్తీశ్వరుడు తన పక్కన ఆలయంలో చోటు కల్పించాడు. అందుకే కాలుడు, ముక్తీశ్వరుడు ఇద్దరు వెలిసిన నేపథ్యంలో ‘కాళేశ్వరం’ అనే పేరు వచ్చినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అదేవిధంగా కాళేశ్వరమనే పట్టణం నిర్మింతమైంది. ఈ ఆలయంలో ఒకే పానవట్టం పై ఓవైపు యముడు, మరోవైపు శివుడు కొలువయ్యారు. ముందు యముడి(కాలుడు)ని కొలిచిన తర్వాతే శివు(ఈశ్వరుడు)డిని భక్తులు ఆరాధిస్తారు. అప్పటి నుంచి ఈ క్షేత్రం భక్తజనులతో ప్రాచుర్యంలోకి వచ్చిందని పురాణాలు తెలుపుతున్నాయి. ప్రధానాలయంతో పాటు మహాసరస్వతి, శ్రీశుభానందాదేవి అమ్మవారి ఆలయాల్లో భక్తులు పూజలు చేస్తారు.శ్రాద్ధ త్రికోటి సరస్వతీనది పుష్కరాలుశ్రాద్ధ త్రికోటి సరస్వతీనది పుష్కరాలు ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. నదిలో స్నానమాచరిస్తే పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా పితృదేవతలకు తీర్థశ్రాద్ధాలు, పిండప్రదానాలు ముఖ్యం. సంకల్ప స్నానాలు చేయాలి. నదీపూజ తప్పని సరి చేయాలి. -పనకంటి ఫణీంద్రశర్మ, ఉపప్రధాన అర్చకుడు, కాళేశ్వరం దేవస్థానంప్రయాగ కన్నా త్రివేణి స్నానం గొప్పనదిలో 12 రోజుల పాటు స్నానాలు ఆచరిస్తే పుణ్యఫలం లభిస్తుంది. 33 కోట్ల దేవతామూర్తులు నది జలాల్లో సంచరిస్తారు. పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది. త్రివేణి సంగమం కలిసే చోట అంతర్వాహిణి సరస్వతీనదిలో పుష్కర స్నానం చేస్తే ప్రయాగ నది కన్నా కోటిరెట్ల పుణ్యమని పురాణాల్లో ఉంది. పుష్కర స్నానంతో సర్వపాపాలు తొలగి ముక్తి లభిస్తుంది. -త్రిపురారి కృష్ణమూర్తిశర్మ, రిటైర్డ్ ఉపప్రధాన అర్చకుడు, కాళేశ్వరం దేవస్థానం -
జూన్ 2న మహారాజు పల్లకీ మహాయాత్ర ప్రారంభం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని పండరీపురంలో జరగనున్న ఆషాడీ ఏకాదశి మహోత్సవం సందర్భంగా శ్రీసంత్ గజానన్ మహారాజ్ పల్లకీ యాత్ర జూన్ 2న ఉదయం 7 గంటలకు షేగావ్ నుంచి వైభవంగా ప్రారంభమవుతుంది. శతాబ్దాలనాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ యాత్ర 56వ సంవత్సరంలోకి ప్రవేశించింది. డప్పులు, మృదంగాల శబ్దాలతో, చేతుల్లో భగవద్ ధర్మ పతాకాలు పట్టుకుని హరినామ జపం చేస్తూ వందలాది మంది వార్కారీలు ఈ పుణ్య యాత్రలో భాగమవుతున్నారు. ఈ పల్లకీ ఊరేగింపు ద్వారా భక్తులు విఠోబా దర్శనం చేసుకునేందుకు పండరీపురం చేరుకుంటారు. ఈ యాత్రలో జెండా మోసే వారు, గాయకులు, ముండాగ్ వాయించే కళాకారులు, సేవకులు కలిపి సుమారు 700 మంది పాల్గొంటున్నారు. యాత్రలో ఒక వినికారి, ఒక తల్కారి, ఒక జెండా మోసేవాడు తదితరులు క్రమశిక్షణతో నడుస్తూ ప్రతి గ్రామంలో భజన, కీర్తన, ఉపన్యాసాల ద్వారా భగవద్ధర్మాన్ని వ్యాప్తి చేస్తారు. వర్షం అయినా, ఎండ అయినా, చలి అయినా వార్కారీలు హరినామ స్మరణతో ముందుకు సాగుతారు. జూన్ 2న నాగజారి శ్రీ క్షేత్రం నుంచి మొదలయ్యే ఈ యాత్ర 33 రోజుల పాటు సాగి జూలై 4న పండరీపురానికి చేరుకుంటుంది. మంగళవేదం వద్ద చివరి బస అనంతరం శ్రీ పల్లకీ పండరీపురం ప్రవేశిస్తుంది. అక్కడ జూలై 4 నుంచి 9 వరకు ఉత్సవాల్లో పాల్గొని, జూలై 10న తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర షేగావ్‌లో జూలై 31న యాత్ర ముగియనుంది. ఈ యాత్రలో పరాస్, గైగావ్, అకోలా, పర్లి, అంబజోగై, షోలాపూర్ వంటి అనేక పట్టణాలు, గ్రామాలు భాగస్వామ్యం అవుతున్నాయి. ప్రతి రోజు ఉదయం హరిపథ్, భజనలు, శ్రీచి ఆరతి వంటి కార్యక్రమాలతో ఈ యాత్ర ప్రత్యేకంగా సాగుతోంది. పండరీభూమి అడుగుపెట్టే ముందు వార్కారీలు అక్కడి మట్టిని నుదుటిపై పెట్టుకొని తమ భక్తిని చాటుకుంటారు. యాత్ర ముగిసే వరకు వారి నడకదారిలో విఠల్ విఠల్ నినాదమే ప్రతిధ్వనిస్తుంది. ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో -
వార్ జోన్.. ఈ నూతన వధూవరుల కథే దేశభక్తికి చిహ్నం
పాకిస్తాన్ తో యుద్ధం వేళ.. పారామిలటరీ బలగాలకు సెలవులు రద్దుకావడంతో అంతా విధుల్లోకి తిరిగి హాజరయ్యే పరిస్థితి అనివార్యమైంది. ఈ క్రమంలోనే పెళ్లైన ఓ జవాన్ విధుల్లోకి హాజరయ్యాడు. మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ మే 5వ తేదీన వివాహం చేసుకున్నాడు. అయితే పారామిలటరీ బలగాలు అంతా విధులకు హాజరు కావాలనే ఆదేశాల నేపథ్యంలో మనోజ్ పాటిల్ తిరిగి విధుల్లో చేరాడు. పెళ్లైన మూడు రోజులకే విధులకు హాజరయ్యాడు. అయితే నవ వధువు తన భర్తను దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోకి పంపి అందరికీ ఆదర్శంగా నిలవగా.. ఈ నూతన వధూవరుణ కథే దేశభక్తికి చిహ్నంగా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. ఆ నవ వధువు దేశ భక్తిని అంతా కొనియాడుతున్నారు. తన సింధూరాన్ని దేశ రక్షణ కోసం పంపిన వనిత అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.सगळ काही भारत मातेसाठी...लग्नाच्या तीन दिवसांनंतर महाराष्ट्राचे सुपूत्र मनोज पाटील देश सेवेसाठी रवाना... #oprationsindoor #IndianNavyAction #IndiaPakistanTensions #jalgaonnews #India #army #manojpatil #देशसेवा pic.twitter.com/1gmbhYcoTD— Ganesh Pokale... (@P_Ganesh_07) May 9, 2025 -
మరాఠా ధీశాలి రాణి 'అహల్యా బాయి' జీవితంపై సినిమా
రాణి అహల్యా బాయి హోల్కర్(Ahilyabai Holkar) జీవితంపై సినిమా నిర్మించబోతున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) అధికారికంగా ప్రకటించారు. చాలాకాలంగా ఆమె జీవితాన్ని నేటి తరం యువతకు పరిచయం చేయాలని తాము అనుకుంటున్నట్లు ఆయన అన్నారు. మరాఠ ధీశాలి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు.రాణి అహల్యా బాయి 300వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపట్టామని సీఎం అన్నారు. గతంలోనే అహ్మద్‌నగర్ (Ahmednagar) జిల్లా పేరును అహల్యానగర్(Ahilya Nagar)గా మార్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అహల్యా బాయి మరాఠాలు పాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశానికి చెందిన రాణి అని సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. గతంలో ఆమె గురించి ఆయన ఇలా చెప్పారు. ' ప్రస్తుత అహ్మద్‌నగర్ జిల్లాలోని చౌంధీ (Chaundhi) అనే గ్రమంలో ఆమె జన్మించారు. మహిళా అభ్యుదయవాదిగా దేశం కోసం ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నో దేవాలయాలతో పాటు ధర్మశాలలను ఆమె నిర్మించారు. ఆమె కారణం వల్లే నేడు కాశీలో మహాశివుడి గుడి ఉంంది.' అని ఒక వేదికపై దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. అందుకే ఆమె జీవితాన్ని సినిమాగా దేశ ప్రజలకు చూపించాలని అనుకున్నట్లు ఆయన అన్నారు. దేశంలోని అన్ని భాషల్లో అహల్యా బాయి జీవిత చరిత్ర విడుదల అవుతుందన్నారు.రీసెంట్గా ఛావా సినిమాతో మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ గురించి దేశం మొత్తం తెలుసుకుంది. ఇప్పుడు అదే ప్రాంతం నుంచి రాణి అహల్యా బాయి గురించి సినిమా ప్రకటన రావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రయుల్లో ఆసక్తి కలుగుతుంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ మూవీ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా నిర్మించేందుకు ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వమే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
బీజేపీ మహిళా మంత్రికి వేధింపులు.. మేసేజ్‌లు.. యువకుడు అరెస్ట్
ముంబై: మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకురాలు పంకజా ముండే (Pankaja Munde)ను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని పూణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే (Pankaja Munde)ను కొద్దిరోజులుగా నిందితుడు వేధిస్తున్నాడు. తరచూ ఆమెకు ఫోన్లు చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అలాగే, అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నాడు. దీంతో, మహారాష్ట బీజేపీ కార్యాలయానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ నిఖిల్ భమ్రే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ట్రాక్ చేసి పట్టుకున్నారు.మహారాష్ట్ర (Maharastra) నోడల్ సైబర్ పోలీసులు (Nodal Cyber Police) అతడిని అరెస్ట్ చేశారు. ఇక, సదరు వ్యక్తిని పూణేకు చెందిన అమోల్ కాలే(25) గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితుడు ఎందుకు పంకజా ముండేను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడ్డాడు?. ఇందులో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Breaking News 🚨A man, Amol Kale (25), was arrested for harassing Maharashtra Minister Pankaja Munde with obscene calls and messages. The accused, from Pune, admitted to the acts, and he was sent to police custody for further investigation under the IT Act: Maharashtra Cyber… pic.twitter.com/slTDkbntOc— The Statesman (@TheStatesmanLtd) May 2, 2025 -
తొమ్మిది గజాల చీరలో మహారాష్ట్ర అమ్మాయిలా స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన సింపుల్, ట్రెడిషనల్ ఫ్యాషన్‌తో అభిమానుల హృదయాలను గెల్చుకుంది. వేవ్స్ సమ్మిట్ 2025 ( WAVES Summit 2025) లో ఉత్సాహభరితమైన మహారాష్ట్ర రాష్ట్రంలో మహిళలు ధరించే ఒక ప్రత్యేకమైన నౌవారీ చీరలో అద్భుతంగా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.అలియా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్‌కు హాజరైంది. ఈ సందర్భంగా తనదైన మినిమలిస్టిక్ ఫ్యాషన్, స్టేట్మెంట్ లుక్‌తో 'వావ్' అనిపించిందిముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మే 1న జరిగిన ఈవెంట్లో మహారాష్ట్ర అమ్మాయిగా మారిపోయింది. తొమ్మిది గజాల నౌవారీ చీరలో ట్రెడిషనల్‌గా చాలా అందంగా కనిపించింది. "నౌ" అంటే తొమ్మిది, తొమ్మిది గజాల నౌవారీ చీర స్టైల్ మహారాష్ట్రలో ప్రసిద్ధి. పీచ్, నారింజ రంగుల కలయితో గులాబీ రంగు అంచుతో వచ్చిన ఈ చీరకు, పూల డిజైన్‌తో హైలైట్ చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరైన అలియా భట్, తన నటనా నైపుణ్యాలు, అందం, ఫ్యాషన్ స్టేట్మెంట్లు, అది సాంప్రదాయమైనా లేదా పాశ్చాత్యమైనా ఫ్యాన్స్‌ను ఫిదా చేయాల్సిందే.కాగా 2024లో మెట్ గాలాలో అరంగేట్రం చేసిన ఆలియా భట్, తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. సబ్యసాచి ముఖర్జీ నుండి అందమైన చీరలో బ్యూటిఫుల్‌గా కనిపించింది. నటిగాస్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బాలీవుడ్లో విలక్షణమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2022 ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రి ఇచ్చింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌ని పెళ్లాడినా అలియా ఒక ఆడబిడ్డకు తల్లి కూడా. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
2025 కేర్ఎడ్జ్ స్టేట్ ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో మహారాష్ట్ర
2025లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలుగా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక మొదటి వరుసలో నిలిచాయి. మంగళవారం విడుదలైన తాజా కేర్ఎడ్జ్ రేటింగ్స్ స్టేట్ ర్యాంకింగ్‌లో పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు ప్రధమ స్థానాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక, మౌలిక సదుపాయాలు, సామాజిక, పాలన, పర్యావరణం ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది.ఆర్ధిక, సామాజిక విషయాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలువగా.. ఆర్థిక పనితీరులో గుజరాత్ ముందుంది. కర్ణాటక పారిశ్రామిక, పర్యావరణ సూచికలలో ముందు వరుసలో ఉంది. పశ్చిమ రాష్ట్రాలు ఆర్థిక పరంగా ముందు స్థానంలో ఉండగా.. దక్షిణాది రాష్ట్రాలు పాలన, పర్యావరణం, సామాజిక రంగాలలో రాణించాయి.ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక సూచికలలో బలమైన ప్రదర్శనలతో.. ఈశాన్య, కొండ ప్రాంతాలు.. చిన్న రాష్ట్రాలలో గోవా అత్యున్నత స్థానంలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలను ఈ విశ్లేషణలో చేర్చలేదు.తలసరి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP), అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI), పరిశ్రమలకు బలమైన స్థూల స్థిర మూలధన నిర్మాణం (GFCF) ద్వారా 'గుజరాత్' ఆర్థిక రంగంలో అగ్రస్థానంలో నిలిచింది. స్థూల విలువ ఆధారిత (GVA)లో పరిశ్రమ, సేవలలో మహారాష్ట్ర, కర్ణాటక అధిక వాటాను పొందాయి.రెవెన్యూ లోటు, వడ్డీ చెల్లింపులు, రుణ స్థాయిలు, ఆర్థిక హామీలపై మంచి స్కోరు సాధించిన 'ఒడిశా' ఆర్థిక రంగంలో మంచి స్కోర్ సాధించింది. బ్యాంకులు, NBFCల బలమైన రుణ పంపిణీ, మ్యూచువల్ ఫండ్స్, ఆరోగ్య బీమా అధిక వ్యాప్తి ద్వారా మహారాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కూడా ముందుంది.తలసరి విద్యుత్ లభ్యత, రైల్వే సాంద్రత, నికర నీటిపారుదల ప్రాంతం పరంగా పంజాబ్ & హర్యానా అధిక స్కోర్లతో మౌలిక సదుపాయాలలో అత్యుత్తమ స్థానాలను పొందాయి. సామాజిక సూచికలలో కేరళ ముందుంది. వ్యాపార వాతావరణం, న్యాయ సామర్థ్యం, పరిపాలనా బలం పరంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.పర్యావరణ పనితీరులో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముందు వరుసలో నిలిచాయి, కర్ణాటక గాలి నాణ్యత, పునరుత్పాదక శక్తిలో ముందంజలో ఉంది. అటవీ విస్తీర్ణం మార్పులు, త్రాగునీటి లభ్యతలో తెలంగాణ మంచి స్కోర్ చేసింది. -
పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌పై ఎంపీ అసదుద్దీన్ ఆగ్రహం
ఢిల్లీ: మీరు మా కంటే (భారత్) అరగంట వెనకబడలేదు.. అర్థ శతాబ్ధం వెనకబడ్డారంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పాకిస్తాన్‌పై సెటైర్లు వేశారు. అదే సమయంలో భారత్‌లో పలు టీవీ ఛానెళ్ల యాంకర్లపై మండిపడ్డారు. కాశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. ఆదివారం మహారాష్ట్ర పర్భానిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌పై దాడి చేసేందుకు తాము అణు ఆయుధాల్ని సిద్ధం చేశామంటూ బాహాటంగా జారీ చేసిన పాక్ నాయకుల హెచ్చరికలపై ఆయన స్పందించారు. ‘తమ వద్ద అణు బాంబులు, అణు బాంబులు ఉన్నాయని పాకిస్తాన్ పదే పదే చెబుతోంది. గుర్తుంచుకోండి. మీరు వేరే దేశంలోకి వెళ్లి అమాయక ప్రజలను చంపితే.. ఏ దేశం ఎందుకు మౌనంగా ఉంటుంది. అందుకు గట్టిగానే బదులిస్తోంది.మీరు మాకంటే అరగంట కాదు.. అర్థశతాబ్ధం వెనకబడ్డారుఅభివృద్ధిలో మా దేశానికి, మీ దేశానికి పోలిక ఎక్కడా? అభివృద్ధిలో మీరు మాకంటే అరగంట కాదు.. అర్థశతాబ్ధం వెనకబడ్డారు. మీ దేశ బడ్జెట్ మా సైనిక బడ్జెట్‌కు కూడా సమానం కాదు’ అని గుర్తు చేశారు. పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలు తీసే ముందు వారి మతాన్ని అడిగారు. మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు? మీరు ఖవారీజ్ (అరబ్ భాషలో తీవ్రవాదులు) కంటే దారుణంగా ఉన్నారు. ఈ చర్య మీరు ఐఎస్ఐఎస్ వారసులని చూపిస్తుంది’ అని ఎద్దేవా చేశారు.Parbhani, Maharashtra: AIMIM Chief Asaduddin Owaisi says, "Pakistan always talks about being a nuclear power; they need to remember if they enter a country and kill innocent people, that country will not sit quietly. No matter the government, by killing our people on our land,… pic.twitter.com/zB80FJcY8G— ANI (@ANI) April 27, 2025 ప్రధాని మోదీకి ఎంపీ అసదుద్దీన్ డిమాండ్అంతేకాదు భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం.. పాకిస్తాన్ వైమానిక దళాన్ని దిగ్బంధించడానికి, హ్యాకర్లను ఉపయోగించి ఆ దేశంలో ఇంటర్నెట్ను హ్యాక్ చేసేందుకు భారత్‌కు అనుమతి ఉందని గుర్తు చేశారు. పాకిస్తాన్‌ను ఆర్థికంగా బలహీన పరిచేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.షేమ్పలు టీవీ ఛానెళ్లలో పనిచేసే యాంకర్లు కశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. షేమ్. కశ్మీర్ మన అంతర్భాగం. కాశ్మీరీలు కూడా మనదేశంలో అంతర్భాగమే. అలాంటి వారిని మనం ఎలా అనుమానించగలం? ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు తన ప్రాణాలను అర్పించింది ఓ కాశ్మీరీనే. గాయపడిన పిల్లవాడిని తన వీపుపై మోసుకుని 40 నిమిషాలు నడిచింది కూడా ఓ కాశ్మీరీనే అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎత్తి చూపారు. -
కుప్పలు తెప్పలు : రెట్టింపైన ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం
అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ముంబైలో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం తగ్గడం లేదు. వాటర్ బాటిళ్లు, ఆయిల్ బాటిళ్లు, ఫినాయిల్, బాత్రూంలు శుభ్రంచేసే యాసిడ్, ఇతర రసాయనాల బాటిళ్ల వినియోగం విచ్చల విడిగా జరుగుతోంది. వివిధ అవసరాలకు వాడి పారేస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లవల్ల పర్యావరణానికీ హాని జరుగుతోంది. 2023తో పోలిస్తే 2024లో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. 2023లో 67 లక్షల కేజీల ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం జరగ్గా అదే 2024లో ఏకంగా 1,42,23,000 కేజీలకు చేరుకుంది. దీన్ని బట్టి రెట్టింపునకుపైగా ప్లాస్టిక్ వినియోగం జరిగినట్లు స్పష్టమవుతోంది. వన్ టైం యూజ్ బాటిళ్లే ఎక్కువ.. ముంబైలోని వివిధ చెత్త కుండీలలో లభించిన ప్లాస్టిక్ బాటిళ్లను బట్టి ఇందులో అధికంగా ఒకసారి వినియోగించే (వన్ టైం యూజ్) బాటళ్లే అధికంగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో వివిధ రకాల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, తినుబండారాల పార్శిల్ ప్యాకింగులు ఉన్నాయి. ఒకప్పుడు గల్లీలలొ, ఫూట్‌పాత్‌లపై, రోడ్ల పక్కన, ఖాళీ మైదానాలలో బీఎంసీ ఏర్పాటుచేసిన కుండీలలో చెత్త అధికంగా కనిపించేది. కానీ ఇప్పడు అదే చెత్త కుండీలలో ప్లాస్టిక్ బాటిళ్లు, క్యారీ బ్యాగులు అధికంగా కనిపిస్తున్నాయి. ఇలా చెత్త కుండీలలో లభించిన ప్లాస్టిక్ బాటిళ్లను నిర్వీర్యంచేసి మళ్లీ కొత్తగా తయారుచేయడానికి వీలున్న బాటిళ్లను బీఎంసీ పారిశుద్ధ్యం విభాగం సిబ్బంది పోగు చేస్తున్నారు. బాటిళ్లతోపాటు భోజనం చేసే ప్లేట్లు, నీటి గ్లాస్లు, స్పూన్లు, పార్శిల్ కంటైనర్లు, స్ట్రాలు, కప్‌లు, సంచులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఏ మాత్రం తగ్గలేదు. 2023లో నిర్వీర్యం చేసి మళ్లీ వినియోగించే వీలున్న 85–90 లక్షల కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించగా అదే 2024లో 96.6 లక్షల కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించింది. అదే 2022లో 67,12,557 కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించింది. రోజూ 7–8 వేల మెట్రిక్ టన్నుల చెత్త ముంబైలో ప్రçస్తుతం చెత్త నిర్వీర్యం చేసే 48 కేంద్రాలు పని చేస్తున్నాయి. ముంబైలో రోజూ 7–8 వేల మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతోంది. పొడి చెత్తలో ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ వస్తువులు, పేపర్లు, కార్డు బోర్డులు, థర్మకోల్, పుట్ట బాక్స్‌లు, గాజు బాటిళ్లు, పాత దుస్తులు, ఈ–చెత్త ఉంటున్నాయి. 2024లో 6,15,513 కేజీల ఈ–చెత్త పోగుచేశారు. ఇందులో థర్మకోల్ కూడా అధికంగా ఉంది. ఇదిలాఉండగా 2005 జూలై 26వ తేదీన ముంబైలో వచి్చన వరదల్లో 200 మందికి పైగా మంది ప్రాణాలు కోల్పోగా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అప్పట్లో వరదలకు ప్రధాన కారణం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగమేనని తేలింది. దీంతో తేరుకున్న బీఎంసీ 50 మైక్రాన్లకంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై నిషేధం విధించింది. ఆ తరువాత 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్టాస్టిక్ క్యారీ బ్యాగులు తయారుచేసే కంపెనీలపై, నిల్వచేసే గోడౌన్లపై, విక్రయించే వ్యాపారులపై వినియోగదారులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఆ సమయంలో 833 మంది విక్రయించే వ్యాపారులు, వినియోగదారుల నుంచి 3,148 కేజీల ప్టాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రూ.41.70 లక్షల జరిమానా వసూలు చేశారు. ప్రస్తుతం ప్లాస్టిక్ తయారు, విక్రయం, వినియోగించే వారిపై అంతగా చర్యలు తీసుకోవడం లేదు. నామమాత్రంగా దాడులు చేసి కంపెనీలకు సీలు వేయడం, విక్రయించే వ్యాపారులు, వినియోగించే సామాన్యులపై చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వినియోగం భారీగానే జరుగుతోంది. -
Rahul Gandhi: ‘సుప్రీం’ మందలింపు.. ఆ వెంటనే చిక్కులు!
ముంబై/న్యూఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చిక్కుల్లో పడ్డారు. పరువు నష్టం కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ పుణే కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. స్వాతంత్ర సమరయోధుడు వీరసావర్కర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.ఏఎన్ఐ కథనం ప్రకారం.. 2023 మార్చి 5వ తేదీన లండన్ పర్యటనలో రాహుల్ గాంధీ వీరసావర్కర్(Veer Savarkar)ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలకు గానూ రాహుల్‌పై సావర్కర్ దగ్గరి బంధువు పుణే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. విచారణ జరిపిన కోర్టు.. మే 9వ తేదీన తమ ఎదుట హాజరు కావాల్సిందిగా రాహుల్‌కు సమన్లు జారీ చేసింది.మరోవైపు.. సావర్కర్‌పై మరో సందర్భంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలనుగానూ కేసు నమోదు అయ్యింది. అయితే.. తాజాగా ఆ కామెంట్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.2022లో.. భారత్ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్ర అకోల్‌లో రాహుల్ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నృపేంద్ర పాండే అనే వ్యక్తి యూపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు.అయితే, దీనిపై అనేకసార్లు విచారణకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని న్యాయస్థానం (ACJM) రాహుల్‌కు రూ.200 జరిమానా కూడా విధించింది. అయితే.. ఈ కేసులో తనకు జారీ చేసిన సమన్లను అలహాబాద్ హైకోర్టు రద్దు చేయడానికి నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. తాజాగా.. విచారణ జరిపిన సుప్రీం కోర్టు రాహుల్‌ను గట్టిగానే మందలించింది.వీర్ సావర్కర్‌కు (Vinayak Damodar Savarkar) మహారాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవం ఇస్తారని పేర్కొన్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం.. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని మందలించింది. స్వాతంత్ర్య సమరయోధులను ఎగతాళి చేయడం తగదని.. మళ్లీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులపై ఎవరూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి అనుమతించమని పేర్కొంది. ఇకనుంచి వాళ్లను అపహాస్యం చేస్తే ఇకపై కోర్టు సుమోటోగా విచారణ చేపడుతుందని తెలిపింది.అదే సమయంలో.. రాహుల్‌పై దాఖలైన కేసులో ఆయనపై క్రిమినల్ చర్యలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. రాహుల్‌పై ఫిర్యాదు చేసిన నృపేంద్ర పాండేకు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. -
సమరయోధులపై అపహాస్యమా?
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించింది. వీర సావర్కర్‌ను మహారాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆరాధిస్తారని గుర్తు చేసింది. ‘‘మీ నానమ్మ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా సావర్కర్‌ను ప్రశంసిస్తూ లేఖ రాశారని మీకు తెలుసా? మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు తెచ్చిపెట్టిన వారిని ఇలా అవమానిస్తారా?’’ అంటూ ఆగ్రహం వెలిబు చ్చింది. ‘‘మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని సుమోటోగా తీసుకుంటాం’’ అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం శుక్రవారం హెచ్చరించింది. ‘‘ఇలాగే వదిలేస్తే మున్ముందు ‘గాంధీ బ్రిటిష్‌వారికి సేవకుడు’ అని కూడా చెబుతారు. ఎందుకంటే వైస్రాయ్ను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు గాంధీ ‘మీ నమ్మ కమైన సేవకుడు’ అంటూ మాట్లాడేవారు. స్వాతంత్య్ర యోధులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని అనుమతించబోం’’ అని స్పష్టం చేసింది. సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలను బాధ్యతారాహిత్యంగా అభివర్ణించింది. యూపీలో దాఖలైన కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై స్టే విధించింది. -
మూగజీవాల పట్ల ఆదరణ చూపండి
వేసవి ఎండలు మనుషులతోపాటు పశువులు, పక్షులపై కూడా తీవ్ర ప్రభావం చూపు తున్నాయి. తాగునీరు లభించక, ఎండ వేడి తాళలేక అనేక పక్షులు నేల రాలుతున్నాయి. వీధి కుక్కలు, పిల్లులు వడదెబ్బ, అనారోగ్యంతో ఎక్కడపడితే అక్కడ పడిపోతున్నాయి. ఇలాంటి మూగజీవాలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు ప్రాణిమిత్రులు. అటవీ శాఖ, స్వయం సేవా సంస్ధల సహకారంతో వాటికి చికిత్స చేసి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. ఇలా మార్చి నుంచి ఇప్పటిదాకా 90పైగా పశువులు, పక్షులకు చికిత్స చేయించారు. అపూర్వ కృషితో..సాధారణ స్థితికి.. ప్రస్తుతం ముంబైసహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో రికార్డు స్ధాయిలో ఎండలు కాస్తున్నాయి. దీని వల్ల పక్షులు, జంతువులు వడదెబ్బ, అనారోగ్యాలతో చెట్లు, రోడ్లు, ఖాళీ మైదానాలు ఇలా ఎక్కడపడితే అక్కడ నేలకూలుతున్నాయి. కొన్నిసార్లు వీటి ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రాణిమిత్రులు చేస్తున్న కృషి అపూర్వం. ఇలా అనారోగ్యంతో కునారిల్లుతూ తమ కంటబడిన ప్రాణులకు సకాలంలో వైద్య చికిత్స అందించి తిరిగి వాటిని సాధారణ స్థితి తీసుకురావడంలో వీరి పాత్ర ఎనలేనిది. ముంబైలో రోడ్లకు ఇరువైపుల, నివాస సొసైటీలు, టవర్ల ఆవరణలు, వాణిజ్య, వాపార సంస్ధల కాంపౌండ్లలో లక్షలాది చెట్లున్నాయి. వాటన్నింటిపై దృష్టిసారించడం ప్రాణి మిత్రులకు సాధ్యం కాని పని. అందుకే కొన్ని సార్లు అటవీ శాఖ, స్వయం సేవా సంస్ధల సాయం తీసుకుని పక్షులు, జంతువులను కాపాడుతున్నారు. ఇలా కొద్దిరోజులుగా అటవీ శాఖ, రెస్క్యూ అసోసియేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్ధలు వందకుపైగా పక్షులను కాపాడాయి. చదవండి : Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది!కోలుకోగానే..యథాస్థానాలకు... కాగా ఇటీవల ముంబై సిటీ, ఉప నగరాల్లోని బోరివలి, అంధేరీ తదితర ప్రాంతాల్లో పావురాలు, రామ చిలుకలు, పిచ్చుకలు, గుడ్లగూబలు, కాకులు, కోతులు, పిల్లులు, కుక్కలు ఇలా రకరకాల పశు, పక్షులు అనారోగ్య స్ధితిలో కనిపించాయి. స్ధానికులు ఈ విషయాన్ని వెంటనే అటవీ శాఖకు, స్వయం సేవా సంస్ధలకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వైద్యుల బృందం వెంటనే ఆయా ప్రాంతాలకు చేరుకుని ఫస్ట్‌ఎయిడ్ చేసి పరేల్‌లోని యానిమల్ క్రూయాల్టీ ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్స అందించారు. ప్రస్తుతం ఇవన్నీ అబ్జర్వేషన్లో ఉన్నట్లు వేల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్ శర్మ తెలిపారు. పూర్తిగా కోలుకోగానే తిరిగి బయట వదిలేస్తామని పేర్కొన్నారు. ఆరోగ్యం కుదుట పడగానే వాటిని నైసర్గిక ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేస్తామని ఆయన అన్నారు. ప్రజలంతా పశు, పక్షుల పట్ల మానవతా ధృక్పదంతో వ్యవహరించాలని ఖాళీ ప్రదేశాలలో, రోడ్ల పక్కన నీటితో నింపిన గిన్నెలు, ప్లేట్లు, ప్లాస్టిక్ మగ్గులు అందుబాటులో ఉంచాలని సూచించారు. వడదెబ్బతో బాధపడుతున్న జంతువులు, ఎండ వేడికి నేలరాలుతున్న పక్షుల గురించి 1926 అనే హెల్ప్ లైన్ నంబరుకు తెలియజేయాలని శర్మ విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’ -
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
‘‘నా కొడుకు ఏం పరీక్షలు రాశాడో? ఏం ఘనత సాధించాడో నాకైతే తెల్వదు. ఆర్మీలో చేరాలని వాడి కల. అది నెరవేరకపోయేసరికి బాధపడేవాడు. కానీ, ఇప్పడు వాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని అంతా అంటుంటే గర్వంగా ఉంది. వాడూ సంతోషంగా ఉన్నాడు.. అది చాలు’’ అంటున్నాడు సివిల్స్ విజేత బీరప్ప సిద్ధప్ప డోని తండ్రి సిద్ధప్ప డోని.మహారాష్ట్ర అమగె గ్రామానికి చెందిన బీరప్ప సిద్ధప్ప డోని.. కర్ణాటక బెలగావి నానవాడి గ్రామంలోకి చుట్టాల ఇంటికి వచ్చాడు. బీరప్పది గొర్రెలు కాచుకునే కుటుంబం. అయినా అతని తండ్రి బిడ్డలను మంచి చదువులే చదివించాడు. ఆ పిల్లలు కూడా తండ్రి కష్టాన్ని గుర్తించి బాగా చదివారు. బీరప్ప పెద్దన్న ఆర్మీలో ఉద్యోగం. అన్నలాగే సైన్యంలో చేరాలని బీరప్ప కలలు కన్నాడు. కానీ, రకరకాల కారణాలతో ఆ కలకు దూరమయ్యాడు. బీటెక్ పూర్తి చేసి.. చివరకు పోస్టల్ జాబ్ కొట్టాడు.ఐపీఎస్ కావాలనే కలతో.. సివిల్స్ వైపు లక్ష్యాన్ని మల్చుకుని పోస్టల్ జాబ్‌ను వదిలి ప్రిపేర్ అయ్యాడు. ఈ ఏడాది మూడో అటెంప్ట్ చేశాడు. మొన్న ఏప్రిల్ 22వ తేదీ విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో బీరప్పకు 551వ ర్యాంకు వచ్చింది. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు సంతోషించాడు. తమకు కూడు పెట్టిన గొర్రెల కొట్టాల మధ్యలోనే బీరప్పకు తమదైన సంప్రదాయంలో ఘనంగా సన్మానం చేశారు.దేశంలోనే పెద్ద పరీక్షలు రాసి తన మేనల్లుడు సర్కారీ కొలువు కొట్టేసరికి యెల్లప్ప గద్ది సంతోషంతో ఉబ్బి తబ్బిబి అయిపోతున్నాడు. ఊరంతా స్వీట్లు పంచి మురిసిపోయాడు. మేనల్లుడు మంచి ఆఫీసర్ అయ్యి తమలాంటి పేదోలకు సాయం చస్తే చాలంటున్నాడు. బీరప్ప స్ఫూర్తితో తమ జాతిలో మరికొందరు ముందుకు వచ్చి సదువుకుంటే చాలని కోరుకుంటున్నాడాయన.Belagavi village erupts in joy as youth from the shepherding community clear UPSC🎥Special Arrangementhttps://t.co/QlwXlz3pWW pic.twitter.com/ISrBQEOoHd— The Hindu (@the_hindu) April 23, 2025 Source: The Hindu -
‘మీ నాన్నను చంపినట్లే నిన్నూ..’
ముంబై: మహారాష్ట్ర దివంగత నేత బాబా సిద్ధిఖీ తనయుడు, ఎన్సీపీ నేత జీషాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. సిద్ధిఖీని చంపినట్లే చంపేస్తామంటూ మెయిల్ చేశారు. రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిందటి ఏడాది అక్టోబరు 12న బాబా సిద్ధిఖీ ముంబయిలోని తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. కొందరు దుండగులు ఆయనపై కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనకు తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే ప్రకటించింది. అయితే.. బెదిరింపు మెయిల్‌పై తన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని జీషాన్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదిలా ఉంటే.. బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు అక్షదీప్ గిల్‌ను పంజాబ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారం వెనుక మాస్టర్ మైండ్ అన్మోల్ బిష్ణోయ్ అని పోలీసులు తేల్చారు. -
ఈసారి ‘మహా’ వంతు!
ఏదేమైనా హిందీని అందరికీ నేర్పించి తీరాలన్న సంకల్పం ఎలాంటి మలుపులు తిరుగుతుందో మహారాష్ట్రలో తాజాగా రాజుకుంటున్న వివాదాన్ని చూసైనా బీజేపీ తెలుసుకోవాలి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కావొచ్చు... దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీని ఇరకాటంలో పెట్టాలని కావొచ్చు హిందీని బలవంతంగా రుద్దే విధానాన్ని అంగీకరించబోమని ప్రకటించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దక్షిణాదిన దుమారం రేపారు. స్థానిక భాషతోపాటు ఇంగ్లిష్, మరేదైనా భాష ప్రాథమిక స్థాయిలో తప్పనిసరి చేసే నూతన విద్యావిధానాన్ని కేంద్రం తీసుకొచ్చిన నేపథ్యంలో స్టాలిన్ దాన్ని తప్పుబట్టారు. అదింకా పూర్తిగా చల్లారక మునుపే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకూ మూడో భాషగా హిందీని తప్పనిసరి చేయటమే ఆ నిర్ణయం సారాంశం. ఇంతవరకూ ప్రాథమిక స్థాయిలో తప్పనిసరి భాషలు మరాఠీ, ఇంగ్లిష్ మాత్రమే. కానీ జాతీయ విద్యావిధానం చెబుతున్నట్టు ‘ఏదైనా మరో భాష’ కూడా తప్పనిసరి గనుక హిందీని ఆ రెండింటితో జత చేశామని ప్రభుత్వం అంటున్నది. సహజంగానే మహారాష్ట్రలో ఇది వివాదాన్ని రేకెత్తించింది. ‘మేం హిందువు లమేగానీ... హిందీ అవసరం లేద’ంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ముంబై నగరంలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టింది. నిజానికి ఎంఎన్ఎస్ అయినా, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) అయినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయంగా అయోమ యంలో పడ్డాయి. ఎంఎన్ఎస్ ఏర్పడి ఇరవయ్యేళ్లు కావొస్తున్నా ఇంతవరకూ ఆ పార్టీ అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోయింది. యూబీటీగా చీలకముందు శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో కూటమి ప్రభుత్వాన్ని నడిపారు. కానీ ఏక్నాథ్ షిండే రూపంలో వచ్చిపడిన విపత్తుతో పార్టీ నిలువునా చీలిపోవటమే కాక, అధికారాన్ని కూడా కోల్పోయింది. జనం సానుభూతి చూపిస్తా రనుకుంటే అదీ జరగలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నిండా ఆర్నెల్లు కాలేదు. కనుక విపక్షాలు ఏం చేయటానికీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర సర్కారు విపక్షాలకు ఆయుధాన్ని అందించింది.తమిళనాడులో స్టాలిన్ హిందీ వివాదాన్ని రేకెత్తించినప్పుడు కేంద్రం తన విధానాన్ని గట్టిగా సమర్థించుకుంటూ ఒక మాట చెప్పింది. మూడో భాషగా హిందీయే నేర్పాలని తాము పట్టుబట్టడం లేదని, దేశ భాషల్లో దేన్నయినా ఎంపిక చేసుకోవచ్చని అన్నది. కానీ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇస్తున్న వివరణ చూస్తే అందుకు భిన్నంగావుంది. నూతన విద్యావిధానంలో భాగంగా స్థానిక భాష, ఇంగ్లిష్‌తోపాటు హిందీని కేంద్రం తప్పనిసరి చేసిందని, దాన్నే తాము అమలు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వివరణ సహజంగానే తమిళనాడులో పాలక డీఎంకేకు అందివచ్చింది. మూడో భాషగా ‘మరేదైనా’ నేర్చుకోవచ్చన్న నిబంధన ఆంతర్యమేమిటో మహా రాష్ట్ర నిర్ణయం బట్టబయలు చేసిందని ఆ పార్టీ అంటున్నది. దేశంలో హిందీని ఏదో విధంగా దొడ్డిదోవన అనుసంధాన భాషగా చేయాలన్నదే కేంద్రంలోని ఎన్డీయే పాలకుల ఉద్దేశమని విమర్శి స్తోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా కేంద్రంనుంచి ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి. వాటిని ఎప్పటికప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా తమిళనాడు వ్యతిరేకిస్తూనే వచ్చాయి.తమిళనాడు మాదిరే మహారాష్ట్రలో కూడా భాషాభిమానం బాగా ఎక్కువ. దాన్ని అన్నివిధాలా ఉపయోగించుకుందామని ఠాక్రే సోదరులు భావిస్తున్నట్టు కనబడుతోంది. సొంత అన్నదమ్ములు కాకపోయినా ఇద్దరూ శివసేనలో కలిసి పనిచేసేవారు. 2005లో వారిమధ్య పొరపొచ్చాలు బయల్దే రాక పార్టీ అధినేత బాల్ ఠాక్రే ఇద్దరి మధ్యా రాజీకి ప్రయత్నించారు. కానీ అది ఫలించలేదు. 2006లో రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ స్థాపించారు. మొదట్లో యూపీ, బిహార్‌లనుంచి వలస వచ్చేవారి వల్ల స్థానికుల ఉపాధి దెబ్బతింటున్నదని, వారు దాదాగిరీ చలాయిస్తున్నారని ఆరోపిస్తూ నడిపిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఆ తర్వాత దుకాణాల బోర్డులన్నీ మరాఠిలో ఉండాలంటూ సాగించిన ఉద్యమం కూడా ఆ తోవలోనే నడిచింది. ఇవిగాక మరాఠీ ఆత్మగౌరవం పేరిట చాలా ఉద్యమాలు నడిపినా రాజ్ ఠాక్రేకు కలిసిరాలేదు. ఇప్పుడు బలవంతంగా హిందీ రుద్దుతున్నారన్న అంశంపై సాగించే ఉద్యమానికి స్పందన ఏమాత్రం వస్తుందన్నది చూడాలి. మహారాష్ట్రకు రావా ల్సిన ప్రాజెక్టులను గుజరాత్‌కు తన్నుకుపోవటాన్ని తప్పుబడుతూ నిరుడు లోక్‌సభ ఎన్నికల సమ యంలో తాను నిలదీసినప్పుడు రాజ్ కలిసిరాలేదని, అదే జరిగుంటే ఇవాళ కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఉండేది కాదని ఉద్ధవ్ వాదన. తమ మధ్య కేవలం చిన్న చిన్న అపోహలు మాత్రమే ఉండే వని ఉద్ధవ్ అంటుంటే... అసలు సోదరులిద్దరూ విడిపోయిందెక్కడని యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఠాక్రే సోదరుల ప్రకటనలు వారిద్దరూ మళ్లీ కలిసి పనిచేయబోతు న్నారన్న సంకేతాలిస్తున్నాయి. అది బీజేపీ మనుగడను దెబ్బతీస్తుందా లేదా అన్నది చూడాలి. అయితే పాలకులు మేల్కొనాల్సిన సమయం వచ్చింది. 1963 నాటి అధికార భాషల చట్టం, దానికి 1967లో తీసుకొచ్చిన సవరణలు గమనించి మసులుకుంటే భాషా వివాదం తలెత్తదు. అధి కార లావాదేవీలన్నిటా ఇంగ్లిష్, హిందీ వినియోగించాలని, హిందీ మాతృభాషగా లేని రాష్ట్రాలతో ఇంగ్లిష్‌లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించాలని చట్టం స్పష్టంగా చెబుతున్నప్పుడు అందరూ హిందీ నేర్చుకు తీరాలని శాసించటం సరికాదు. దేశ సమైక్యత, సమగ్రత పేరిట దాన్ని తలకెత్తుకుంటే అందుకు విరుద్ధమైన ఫలితాలొస్తాయి. మహారాష్ట్ర పరిణామాలు ఆ సంగతిని చాటుతున్నాయి. -
25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీ
పుట్టకముందే విధి చిన్న చూపు చూసింది. పుట్టాక పుట్టుకతోనే అంధురాలైన ఈ బిడ్డ మా కొద్దు అంటూ చెత్త కుప్పలో పడేశారు తల్లిదండ్రులు . కట్ చేస్తే 26 ఏళ్ల వయసులొ నాగ్‌పూర్ కలెక్టరేట్లో రెవెన్యూ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆ సాహసం పేరు మాలా పాపాల్కర్. ఇంతకీ ఆమె సాధించిన ఘనత ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్లో చెత్తబుట్టలో పడేశారు కన్నవాళ్లు. ఆ చిన్నారిని గమనించిన పోలీసులు స్థానిక రిమాండ్ హోంకు తరలించారు. అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరం ఉన్న చెవిటి, అంధుల కోసం మెరుగైన సౌకర్యాలతో ఉండే సామాజిక కార్యకర్త శంకర్‌బాబా పాపల్కర్ అనాథాశ్రమంలో చేర్చారు. ఆ ఆశ్రమంలోనే అమ్మాయి బ్రెయిలీ లిపిలో చదువుకుని సత్తా చాటుకుంది. గత ఏడాది మేలో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) క్లర్క్-కమ్-టైపిస్ట్ పరీక్ష (గ్రూప్ సి)లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా మాలా పాపల్కర్ వార్తల్లో నిలిచింది. తాజాగా అంత్యంత పోటీతత్వ పబ్లిక్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. త్వరలోనే నాగ్‌పూర్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టనుంది.చదవండి: మా కల ఇన్నాళ్లకు తీరింది : అమెరికా దంపతులపై నెటిజన్ల ప్రశంసలుమాలా పాపాల్కర్ ఎలా ఎదిగింది.అనాథాశ్రమంలో చేరిన మాలానుపద్మశ్రీ అవార్డ్ గ్రహిత శంకర్ బాబా పాపల్కర్ శ్రద్ధగా గమనించేవారు. ఆమె పట్టుదల, నైపుణ్యానికి ముచ్చటపడ్డారు. ఆ చిన్నారికి తన ఇంటి పేరు కలిపి మాలా శంకర్ బాబా పాపల్కర్ అని పేరు పెట్టారు. ఆమె ఉన్నత చదువులు చదివేందుకు తన వంతు కృషి చేశారు. అలా మాలా పట్టుదలగా చదివింది ఈ క్రమంలోనే మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) ఫలితాల్లో మాలా ర్యాంక్ సాధించింది. ముంబై సెక్రటేరియట్లో క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగాన్ని దక్కించుకుంది. తాజా మరో మెట్టు అధిగమించింది.‘‘నన్ను రక్షించి, ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకురావడానికి ఆ దేవుడే దేవదూతలను పంపించాడంటూ తన విజయానికి కారణమైన వారికి కృతజ్ఞతలు తెలిపింది. 2018లో అమరావతి యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్, ప్రభుత్వ విదర్భ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ నుండి ఆర్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మాలా. బ్రెయిలీ లీపి, రైటర్ సహాయంతో పరీక్షలుకు హాజరయ్యేది. ఎడ్యుకేషన్‌కు సంబంధించి దర్యాపూర్‌కు చెందిన ప్రొఫెసర్ ప్రకాష్ తోప్లే పాటిల్ దత్తత తీసుకున్నారు.చదవండి: వేధింపులకు భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్! -
వదినమ్మకు చెప్పారా? అసలు ఒప్పుకుంటుందా?
మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న ఓ పరిణామం.. దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. రెండు దశాబ్దాలుగా రాజకీయ విరోధులుగా ఉన్న సోదరులు ఉద్దవ్ థాక్రే, రాజ్ థాక్రేలు కలిసి పోనున్నారనేది ఆ వార్త సారాంశం. అయితే ఈ కలయిక ప్రచారాన్ని బీజేపీ ఇప్పుడు ఎద్దేవా చేస్తోంది.ముంబై: యూబీటీ సేన-ఎంఎన్ఎస్ పొత్తు అవకాశాలపై ఓ హిందీ న్యూస్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ నారాయణ్ రాణే(Nitesh Narayan Rane) ఈ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఎంఎన్ఎస్తో థాక్రే శివసేన చేతులు కలపబోతోందా?. ఈ విషయంలో తన భార్య రష్మీ థాక్రే(Rashmi Thackeray) అనుమతి తీసుకున్నారో లేదో?. ఈ విషయాన్ని ఉద్దవ్ థాక్రేను మీరే(న్యూస్ యాంకర్‌ను ఉద్దేశించి..) అడగాలి. ఇలాంటి నిర్ణయాల్లో ఆమె భాగస్వామ్యమే ఎక్కువ అనే విషయం ఆయన మరిచిపోవొద్దు’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.శివసేన నుంచి రాజ్ థాక్రే(Raj thackeray) నిష్క్రమణకు రష్మీనే కారణమన్న రాణే.. ఆ సమయంలో సోదరుల మధ్య ఎలాంటి విబేధాలు లేవనే విషయాన్ని ప్రస్తావించారు. మహారాష్ట్ర ప్రజలు మయూతీ కూటమికి అఖండ విజయం కట్టబెట్టారని.. కాబట్టి ఎంఎన్ఎస్, యూబీటీ శివసేన పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా.. ఇక్కడి రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించబోదని నితీశ్ రాణే అన్నారు.ఈ క్రమంలో ఏక్నాథ్ షిండే-రాజ్ థాక్రే విందు సమావేశంపైనా రాణేకు ప్రశ్న ఎదురైంది. షిండేకు బాల్ థాక్రే కుటుంబానికి దశాబ్దాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా రాజ్ థాక్రేను బాల్ థాక్రేకు అంశగా షిండే భావిస్తుంటారు. అంతేగానీ వాళ్ల భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నది కాదు అని రాణే అన్నారు. మహారాష్ట్ర ప్రజలు, మరాఠీ భాష ప్రయోజనాల కోసం ఉద్ధవ్ థాక్రేతో కలిసి పని చేసేందుకు సిధ్ధమని ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే ఇటీవల ప్రకటించారు. ఇందుకు ఉద్ధవ్ థాక్రే కూడా సానుకూలంగా స్పందించడంతో ఇరువురు ఏకం కానున్నారనే వార్తలు విస్తృతమయ్యాయి. అయితే దీనిపై తాజాగా యూబీటీ సేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) మాట్లాడుతూ.. రాజకీయ పొత్తుకు సంబంధించి ఎటువంటి సంప్రదింపులు జరగలేదని, కేవలం వీరి మధ్య భావోద్వేగ చర్చలు మాత్రమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: నా బద్ధ శత్రువుకి కూడా ఈరోజు రాకూడదు -
ఉద్ధవ్‌తో రాజ్ ఠాక్రే పొత్తు.. సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో విపక్ష శివసేన(ఉద్ధవ్), మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చేతులు కలుపబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ రెండు పార్టీల అధినేతలు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే వరుసకు సోదరులే. రెండు పార్టీల మధ్య త్వరలో పొత్తు కుదరబోతున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.అయితే, రెండు పార్టీలతో కూటమి ఏర్పాటు అనే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం తెలిపారు. రెండు పార్టీల నడుమ భావోద్వేగపూరిత చర్చలు నడుస్తున్నాయని వెల్లడించారు. కుటుంబ కార్యక్రమాలు, వేడుకల్లో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలుసుకోవడం, మాట్లాడుకోవడం సాధారణమేనని చెప్పారు. ఉమ్మడి శివసేన పార్టీలో పని చేసినప్పుడు ఉద్ధవ్ ఠాక్రేతో ఎలాంటి విభేదాలు తలెత్తలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్ ఠాక్రే చెప్పడం సంచలనాత్మకంగా మారింది.ఇక, ఇరువురు నేతలు చేతులు కలుపబోతున్నట్లు మహారాష్ట్రలో ఊహాగానాలు మొదలయ్యాయి. మహారాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో కలిసికట్టుగా పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు ఇప్పటికే సంకేతాలిచ్చారు. తాజాగా రాజ్ ఠాక్రే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం విభేదాలు పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. మా మధ్య ఉన్నవి చిన్న విభేదాలే. మహారాష్ట్ర ప్రయోజనాల ముందు ఇవి చాలా చిన్నవి. మేం కలవడం కష్టమేమీ కాదు. అందుకు సంకల్పం ఉండాలి అని ఆయన అన్నారు. అయితే, కలయికకు ఉద్ధవ్ థాక్రే ఓ షరతు విధించారు. చిన్నచిన్న గొడవలు పక్కన పెట్టడానికి నేను సిద్ధం. కానీ, ఒకరోజు మద్దతిచ్చి, మరుసటి రోజు వ్యతిరేకించి, ఆపై రాజీ పడే ద్వంద్వ వైఖరి పనికిరాదు. మహారాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా వారితో కలిసేది లేదు అని స్పష్టం చేశారు. రాజ్ థాక్రే ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఉద్ధవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. థాక్రే సోదరుల కలయికను బీజేపీ, కాంగ్రెస్ స్వాగతించాయి. అయితే, వారు కలిసినా రాబోయే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో తమ కూటమిని ఓడించలేరని బీజేపీ నేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేతలు కూడా ఈ కలయికను సానుకూలంగా చూస్తున్నారు. థాక్రే సోదరులు ఏకమైతే బీఎంసీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఉమ్మడి శివసేనలో కీలకంగా వ్యవహరించిన రాజ్ ఠాక్రే 2006లో ఎంఎన్ఎస్ పేరిట సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
నిశ్చితార్థంలో కాబోయే భార్య చేసిన పనికి.. పెళ్లిరోజే వరుడు షాకింగ్ నిర్ణయం
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కాబోయే భార్య వేధింపులకు తాళలేక పెళ్లి రోజే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాసిక్‌కు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారి హరేరామ్(36)కి, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన మోహినికి నిశ్చితార్థం జరిగింది.మోహిని తన లవర్‌ను హగ్ చేసుకోవడం చూసిన హరేరామ్.. నిలదీశాడు. ఈ సంఘటన ఆమె ప్రేమ వ్యవహారాన్ని బట్టబయలు చేయడంతో ఈ విషయం బయటకు చెబితే తనతో పాటు కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెడతానని ఆమె బ్లాక్‌మెయిల్‌కు దిగింది.నిరంతరం తీవ్ర వేధింపులకు గురిచేయడంతో మానసిక ఒత్తిడికి గురై విసిగిపోయిన హరేరామ్.. నాసిక్‌లోని ఉత్తమ్‌నగర్ ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువతితో పాటు ఆమె లవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. -
నగరంలో ఏకైక న్యూరో సర్జన్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య
సోలాపూర్: పట్టణంలోని సుప్రసిద్ధ న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ శిరీష్ వలసంగకర్ (65) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి 8:30 గంటల సమయంలో తన నివాసంలో రెండు సార్లు రివాల్వర్‌తో తల వద్ద కాల్చుకుని మృతి చెందారు. ఆ సమయంలో కూతురు ఉమ ఇంట్లోనే ఉన్నారు. తుపాకీ శబ్దం విన్న కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వెంటనే అక్కడకు వచ్చి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న డాక్టర్ శిరీష్‌ను రామ్వాడి ప్రాంతంలోని ఆయన సొంత ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన కుమారుడు డా.అశ్విన్, కోడలు డా. సోనాలి, ఇతర డాక్టర్లు ఆయనను కాపాడేందుకు రెండు గంటలపాటు తీవరంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు రాత్రి 10:45 నిమిషాలకు ఆయన మరణించినట్లు వారు ధృవీకరించారు. డా. శిరీష్ మరణంపై పలువురు ప్రముఖులు, వైద్య నిపుణులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తీవ్ర సంతాపం వ్యక్తమైంది.శనివారం సాయంత్రం మోదీ స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. డాక్టర్ శిరీష్ అంతిమ సంస్కారాలకు సామాజిక, రాజకీయ, వైద్య రంగ ప్రముఖులు , ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. గత 35 సంవత్సరాలుగా పట్టణంలో ఏకైక న్యూరో సర్జన్ గా, బ్రెయిన్ డిజాస్టర్ డాక్టర్ గా ప్రసిద్ధి చెందిన శిరీష్ వలసంగకర్ కుటుంబం మొత్తం వైద్య నిపుణులే. డాక్టర్ శిరీష్ నాలుగు భాషల్లో( మరాఠీ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు) ప్రావీణ్యుడు. ఆయన ఇటీవలే వరల్డ్ మెడికల్ టూర్ కోసం డబల్ ఇంజన్ డైమండ్ ప్లేన్ కూడా కొనుగోలు చేశారు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే జీవితాన్ని చేతులారా అంతం చేసుకున్నారు. ఖచ్చితమైన కారణంపై స్పష్టత లేనప్పటికీ, గత కొన్ని రోజులుగా ఆయన ఒత్తిడిలో ఉన్నారని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. సదర్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పలువురు సంతాపండాక్టర్ శిరీష్ పద్మాకర్ వల్సంగ్కర్ అత్యంత గౌరవనీయమైన న్యూరాలజిస్ట్ మరియు మహారాష్ట్రలోని సోలాపూర్‌లోని SP ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ (వల్సంగ్కర్ హాస్పిటల్) వ్యవస్థాపకుడు. ఈ ప్రాంతంలో న్యూరాలజీ రంగంలో మార్గదర్శకుడిగా పేరుగాంచారు. మెదడుకు వివిధ , అధునాతన మార్గాల్లో చికిత్స చేయడానికి ఒక అత్యాధునిక ఆసుపత్రిని ప్రారంభించిన ఘనత ఆయన సొంతం. ఆందుకే సోలాపూర్‌లో న్యూరాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు చేసిన డాక్టర్ శిరీష్ వల్సంగ్కర్ అని పిలుస్తారు. ఈ సంఘటనతో యావత్ వైద్యలోకం షాక్‌కు గురైంది. ఇది చాలా దిగ్భ్రాంతికరమైన పరిణామంమని సోలాపూర్‌కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ సచిన్ బల్దావా డా. శిరీష్ మరణంపై సంతాపం వెలిబుచ్చారు. చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి -
మహారాష్ట్రలో దగ్గరవుతున్న ఠాక్రే సోదరులు
-
రెండు దశాబ్దాల తర్వాత ‘బంధం’ కలుస్తోంది..!
ఎన్నో ఏళ్లుగా ‘రాజకీయ కత్తులు’ దూసుకుంటూనే ఉన్నారు.. ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూనే ఉన్నారు. వీరి వైరం సుమారు రెండు దశాబ్దాల నాటిది. ఒకప్పుడు కలుసున్న బంధం.. చాలా ఏళ్ల పాటు దూరంగానే ఉంటూ వచ్చింది. అది రాజకీయ వైరం కావడంతో ప్రజల్నే నమ్ముకుని పోరాటం సాగించారు. వారిలో ఒకరు ఉద్ధవ్ ఠాక్రే అయితే.. ఇంకొకరు రాజ్ ఠాక్రే. వరుసకు సోదర బంధం వారిది. కానీ శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే జీవించి ఉన్న కాలంలోనే రాజ్ ఠాక్రే బయటకు వచ్చేశారు. శివసేనలో విభేదాల కారణంగా రాజ్ ఠాక్రే అక్కడ ఇమడలేక బయటకు వచ్చేశారు. ఎమ్మెన్నెస్ అంటూ పార్టీ స్థాపించి తన ఉనికిని మహారాష్ట్రలో చాటుకునే యత్నం చేశారు. కానీ ఆయన ఆశించిన ఫలితాలు ఏమీ చూడలేకపోయారు. చివరకు ఉద్ధవ్ ఠాక్రేతో కలిసేందుకు సిద్ధమయ్యారు రాజ్ ఠాక్రే.శివసేనతో కలుస్తా..ప్రస్తుతం మహారాష్ట్రలో సైతం హిందీ భాషా యుద్ధం నడుస్తోంది. తమకు థర్ద్ లాంగ్వేజ్ గా హిందీని తప్పనిసరి చేయాలని కేంద్రం చూస్తోంది. కేంద్ర ప్రభుత్వపు త్రి భాషా విధానంలో భాగంగా హిందీ థర్డ్ లాంగ్వేజ్ అంశాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కానీ ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ)తో పాటు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. అందుకే తాము ఒక్కటిగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు రాజ్ ఠాక్రే తెలిపారు.ఫిల్మ్ మేకర్ మహేష్ మంజ్రేకర్ నిర్వహించిన పాడ్ కాస్ట్ లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న విభేదాల్ని పక్కన పెట్టి రాష్ట్రం కోసం ఒక్కటవ్వాలని ఉందని పేర్కొన్నారు. శివసేనతో కలిసి పోరాటం చేయటానికి నిశ్చయించుకున్నానని, అది కూడా వారికి ఇష్టమైతేనే అంటూ రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ఇక్కడ మరాఠీల కమ్యూనిటీని రక్షించడంతో పాటు మరాఠీ భాషను కాపాడుకోవడం ముఖ్యమన్నారాయన.మరి ఉద్ధవ్ ఏమన్నారంటే..తనతో రాజ్ ఠాక్రే కలుస్తానంటే ఏమీ ఇబ్బంది లేదన్నారు. తమ మధ్య భేదాభిప్రాయల కారణంగా ఎవరికి వారు అన్నట్లు ఉంటున్నామని, రాజ్ వస్తానంటే తనకు అభ్యంతరం ఏమీ లేదన్నారు. కాకపోతే మరాఠీ కమ్యూనిటీని వ్యతిరేకించే శక్తులను వెంటబెట్టుకు రావద్దని తన కండిషన్ అంటూ ఉద్ధవ్ పేర్కొన్నారు. ‘ మన శత్రువర్గాన్ని ఇంటికి ఆహ్వానించి.. వారికి భోజన తాంబూలం ఇచ్చే సాంప్రదాయాన్ని రాజ్ ఠాక్రే వదిలేతేనే తనతో కలవచ్చన్నారు. ఇక్కడ ఇద్దరికీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో ఎమ్మెన్నెస్.. ఎన్డీఏకు దగ్గరై వారికి మద్దతిచ్చింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిపై అసహనంతో ఉన్న రాజ్ ఠాక్రే.. శివసేన(యూబీటీ) తో కలవడానికి సిద్ధం కావడం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.20 ఏళ్ల కిందటే.. బయటకుదాదాపు 19 ఏళ్ల కిందట బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి బయటకువచ్చిన రాజ్ ఠాక్రే 2006 మార్చి తొమ్మిదో తేదీన ఎమ్మెన్నెస్ పార్టీని స్ధాపించారు. ఆ తరువాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి తమ పార్టీ తరఫున అభ్యర్ధులను బరిలోకి దింపారు. వీరిలో ఏకంగా 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రశంసలు అందుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెన్నెస్‌కు 5.71 శాతం ఓట్లు పోలయ్యాయి. కానీ తరచూ పరాయిప్రాంతం వారిని ముఖ్యంగా ఉత్తరభారతీయులను లక్ష్యంగా చేసుకుని పదేపదే విమర్శించడంతో పార్టీ ప్రాబల్యం క్రమేపీ తగ్గుతూ వచ్చింది.2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్కరే గెలవగా మొత్తంమీద 3.15 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తరువాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్ధితి పునరావృతమైంది. కేవలం 2.25 శాతం ఓట్లు పోలైనప్పటికీ కల్యాణ్ నియోజక వర్గం నుంచి రాజు పాటిల్ ఒక్కరే గెలిచారు. అక్కడ నుంచి ఎమ్మెన్నెస్ గ్రాఫ్ క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం తన పార్టీ ఉనికే ప్రమాదంలో పడిన సమయంలో ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే.. ఉద్ధవ్ ను కలవడానికి సిద్ధమైనట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. -
Selenium శాపం: అప్పుడు వెంట్రుకలు.. ఇప్పుడు గోళ్లు
ముంబై: బుల్ధానా జిల్లాలోని షెగావ్ తాలూకా గ్రామాల ప్రజలను ‘సెలీనియం’శాపం వేధిస్తోంది. తాలుకాలోని నాలుగు గ్రామాల్లో దాదాపు 30 మంది గోళ్ల సంబంధిత సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారని, వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని బుల్దానా ఆరోగ్య అధికారి డాక్టర్ అనిల్ బంకర్ తెలిపారు. సెలీనియం అధిక వినియోగం వల్లే... కాగా గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో షెగావ్ తాలూకా జాతీయ వార్తల్లో ప్రధానంగా నిలిచింది. తమకు హఠాత్తుగా బట్టతల వచ్చిందని, జుట్టు విపరీతంగా ఊడిపోయిందని పలువురు ఆరోగ్యశాఖ అధికారులను ఆశ్రయించారు. నిజనిజాలపై నిపుణులు ఆరా తీయగా రేషన్ దుకాణాలు పంపిణీ చేసిన గోధుమల్లో అత్యధిక శాతం సెలీనియం ఉండటం, దానిని వినియోగించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని తేలింది. అయితే కొందరు ఈ వాదనను ఖండించారు. ఏది ఏమైనప్పటికీ బాధితులు తీవ్ర ఆవేదన చెందారు. కాగా తాజాగా షేగావ్ తాలూకాలోని నాలుగు గ్రామాల్లో దాదాపు 30 మందికి గోళ్ల సంబంధిత సమస్యలు తలెత్తాయి. కాగా సెలీనియం అధిక వినియోగం వల్లే ఈ సమస్య తలెత్తి ఉండవచ్చునని భావిస్తున్నట్లు అనిల్ బంకర్ తెలిపారు. గతంలో ఈ సమస్యను ఛేదించిన పద్మశ్రీ వైద్యుడు హిమ్మత్రావ్ బవాస్కర్రాత్రికి రాత్రే మహారాష్ట్రలోని బుల్ధానాలో, 4 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల 300 మంది గ్రామస్తుల ప్రజలు జుట్టు రాలిపోవడం, ఇతర సమస్యలతో బాధపడ్డాడు. తొలుతు దీనికి నీటి కాలుష్యం కారణమని అంతా భావించారు. కానీ తేలు కాటు చికిత్సలో తన కృషికి ప్రసిద్ధి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హిమ్మత్రావ్ బవాస్కర్ దీన్ని నమ్మలేదు. 92 వేల రూపాయలకు పైగా సొంత ఖర్చులతో ఒక నెల రోజులపాటు పరిశోధన చేశారు. జుట్టు, రక్తం, మూత్రం, ఆహార నమూనాలను సేకరించి, ఆహారం, ఆహార వనరులు, లక్షణాలను నిశితంగా విశ్లేషించింది. దీనికి అధికమోతాదులో ఉన్న సెలీనియం కారణమని తేల్చారు. సురక్షితమైన పరిమితికి 600 రెట్లు ఎక్కువ ఉంటుంది. కలుషితమైన గోధుమలను,గోధుమ పిండి (అట్టా) పంపిణీతో, గ్రామస్తులు తెలియకుండానే వారి రోజువారీ భోజనం ద్వారా విషపూరిత స్థాయిలలో సెలీనియంను వినియోగించారని వెల్లడించారు.సెలీనియం ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్ లక్షణాలు దీర్ఘకాలంగా సెలీనియం ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధినే సెలెనోసిస్ అంటారు.సెలీనియం అనేది ఒక రసాయన మూలకం. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. సెలీనియం ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఇది చిన్ని మొత్తంలోనే శరీరానికి అవసరం. జీవక్రియ, థైరాయిడ్ పనితీరులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిసుంది. అయితే దీని వినియోగం ఎక్కువైతే కొన్ని దుష్పరిణామాలు తప్పవు.లక్షణాలు : జుట్టు రాలడం, గోర్లు పెళుసుగా మారడం లేదా రాలిపోవడం, నోటిలో లోహ రుచి, శ్వాస వెల్లుల్లి వాసన, చర్మపు దద్దుర్లు, వికారం, విరేచనాలు, అలసట, చిరాకు, నాడీ వ్యవస్థలో లోపాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కీళ్ల నొప్పులు, తలనొప్పి.సెలీనియం విషప్రభావం తొలిలక్షణాలు: శ్వాసలో వెల్లుల్లి వాసన, నోటిలో లోహ రుచి.సెలీనియం అధికంగా ఉండే ఆహారాలు: బ్రెజిల్ నట్స్ చేపలు, షెల్ షిఫ్ ఎర్ర మాంసం, ధాన్యాలు, గుడ్లు, కోడి మాంసం, కాలేయం, వెల్లుల్లి. ఇవీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్కరణ్ జోహార్ షాకింగ్ వెయిట్ లాస్ ఒజెంపిక్ ఇంజెక్షన్లే కారణమా? -
మరో చిక్కొచ్చిపడిందే.. అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోళ్లు.. ఏం జరుగుతోందక్కడ?
షెగావ్: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలకు కొత్త చిక్కొచ్చిపడింది. ఆ జిల్లాలో కొన్ని గ్రామాల ప్రజలు ఆకస్మికంగా జుట్టు కోల్పోయిన వింత పరిస్థితి సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.. అప్పుడు జుట్టు సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడగా, ఇప్పుడు గోళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు.గత కొన్ని రోజులుగా అక్కడ ఉన్న మహిళలు, పురుషులు జుట్టు రాలిపోవడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలా మందికి బట్టతల కూడా వచ్చేసింది. మొదట్లో కొద్దిగా జుట్టు రాలడం మొదలై.. ఒక్క వారంలోనే ఇలా బట్టతలగా మారిపోయింది. జిల్లాలోని షెగావ్ తాలూకాలోని సుమారు 15 గ్రామాల ప్రజలు మూడు నెలలుగా జుట్టు సమస్య కొనసాగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. అయితే, మరో సమస్యతో ఆ గ్రామాలు భయపడుతున్నాయి.ఇప్పుడు నాలుగు గ్రామాల్లోని ప్రజలు గోళ్లు రాలిపోవడం, ముడతలు పడటం వంటి కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం తదుపరి పరీక్షల కోసం షెగావ్ ఆసుపత్రికి పంపిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సమస్యకు కారణం సెలీనియం స్థాయిలు పెరగడమే కారణంగా భావిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.ఇక్కడి గ్రామాల ప్రజలు ఆకస్మికంగా జుట్టు కోల్పోవడం, గోళ్లు రాలిపోవడానికా కారణం.. వారు తింటున్న గోధుములకు సంబంధముందని కొందరు వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఆ గోధుమల్లో సెలీనియం అధిక మోతాదులో ఉండటమే ఇందుకు కారణంగా చెప్పారు. గతంలో విపరీతంగా జుట్టు కోల్పోయిన వారిలో అనేక మంది ఇప్పుడు గోళ్ల సమస్య ఎదుర్కొంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. -
కావు కావు కాదు... హాయ్ హాయ్ : మాటలు నేర్చిన కాకి
సాధారణంగా చిలక పలుకులు అంటూ ఉంటాం కదా. రామచిలక మనిషి మాటలను అనుకరించడం మనకు తెలిసిందే. పెంపుడు పక్షి చిలుకు ముద్దార మాటలు నేర్పిస్తే చక్కగా పలుకుతుంది. తేనెలూరు ఆ మాటలు విని తెగ మురిసిపోతారు యజమానులు. ఇపుడు మాకేం తక్కువ అంటూ ఈ జాబితాలోకి వచ్చేసిందో కాకి. కాకి చేష్టలు, కారు కూతలు కావు... చక్కగా హాయ్.. హల్లో అంటూ పలకరిస్తూ.. అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. సరైన శిక్షణ ఇస్తే.. ముద్దార నేర్పింపన్.. అన్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది. పదండి ఆ విశేషాలేంటో చూద్దాం.అద్భుతమైన సామర్థ్యంతో ఇంటర్నెట్లో తెగ సందడి చేస్తోందీ కాకి. కుటుంబ సభ్యులను పేరు పెట్టి పిలుస్తుంది. మరాఠీలో మాట్లాడేస్తుంది. ఈ కాకి కావు కావు కాదు... హాయ్ హాయ్ అని అరుస్తుంది! అయితే మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఒక కాకి మనిషి మాటలను అనుకరిస్తూ అందరినీ బోలెడు ఆశ్చర్యపరుస్తోంది. వాడా తాలూకాలోని పాల్ఘర్కు చెందిన తనూజ ముక్నే అనే మహిళ తన తోటలో గాయపడిన కాకిని చూసి సపర్యలు చేసింది. కొన్ని రోజులు తరువాత కోలుకున్న కాకి తనూజ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయింది. అంతేకాదు... మనుషులు మాట్లాడే మాటలను అనుకరించడం మొదలు పెట్టింది. ‘పపా’ ‘బాబా’ మమ్మీ’ అంటూ వరుసలు పెట్టి పిలవడం మొదలుపెట్టింది. దీంతో ఈ కాకి లోకల్ సెలబ్రిటీగా మారింది! View this post on Instagram A post shared by PUNE PULSE (@punepulse) -
‘షిండేపై గతంలోనూ దేశద్రోహి వ్యాఖ్యలు చేశారు కదా!’
ముంబై: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టు ఊరట ఇచ్చింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై చేసిన వ్యాఖ్యల కేసులో తాము తుది ఆదేశాలిచ్చేదాకా కమ్రాను అరెస్ట్ చేయొద్దంటూ బుధవారం ఆదేశాలు వెలువరించింది. కునాల్ కమ్రా వేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసింది. ఓ షోలో షిండేను ఉద్దేశించి పేరడీ సాంగ్ పాడే క్రమంలో ‘దేశద్రోహి’ అంటూ కునాల్ కమ్రా వ్యాఖ్యానించిన సంగతి తీవ్ర దుమారం రేపడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకుగానూ ఖర్ పీఎస్‌లో కమ్రాపై కేసు నమోదు అయ్యింది. అయితే.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎస్ కోత్వాల్, ఎస్ మోదాక్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.అయితే.. షిండేను ఉద్దేశించి దేశద్రోహి అనే వ్యాఖ్యలు కేవలం కునాల్ కమ్రా ఒక్కరే చేయలేదని, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్షాలు ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి ‘ద్రోహి’ వ్యాఖ్యలు చేశాయని(అప్పట్లో అజిత్ పవార్, ఉద్దవ్ థాక్రేలు షిండేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు), అయినప్పటికీ ఎలాంటి చర్యలు కనిపించలేదని కమ్రా తరఫు న్యాయవాది నవ్రోజ్ సీర్వై వాదించారు. కానీ, ఈ కేసులో కావాలనే తన క్లయింట్, అతని తల్లిదండ్రుల్ని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. అంతేకాదు.. రాజకీయ పార్టీల నుంచి కునాల్‌కు బెదిరింపులు వస్తున్న విషయాన్ని కూడా తెలియజేశారు. పలు షోలలో కునాల్ కమ్రా ఇదే తరహాలో రాజకీయాలపై, రాజకీయ నేతలపై తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించడమూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.అయితే.. కునాల్ క్వాష్ అభ్యర్థనను తిరస్కరించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హిటెన్ వేణేగావోంకర్ బెంచ్‌ను కోరారు. ఇదేం చతురతతో కూడిన విమర్శ కానేకాదని.. వ్యక్తిగతంగా ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడమేనని వాదించారు. గతంలో ద్రోహి వ్యాఖ్యలపై ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న వాదనతో అంగీకరించిన పీపీ.. అలాగని ఇలాంటి వ్యవహారాలను చూస్తూ ఊరుకోకూడదన్నారు. అలాగే.. తనకు ప్రాణహాని ఉందని కునాల్ ముందుకు వస్తే భద్రత కలిగించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని కోర్టుకు తెలియజేశారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటిచింది. అంతకు ముందు ఇదే పిటిషన్‌పై విచారణ సందర్భంగా కునాల్‌కు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఊరట అందించిన సంగతి తెలిసిందే. -
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
అదృష్టం ఎప్పుడు.. ఎవరిని వరిస్తుందో తెలియదు. నిన్న రోజున బీకరిని.. రేపటి రోజున కోటీశ్వరుడిని చేస్తుంది. ఇదే సమయంలో కోటిశ్వరుడిని.. బీకరిని సైతం చేయగలదు. అలాగని, అదృష్టం కోసం అక్కడే కూర్చుంటే.. అంతకన్నా బిగ్ మిస్టేక్ మరొకటి ఉండదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే.. ఓ రైతు తన వ్యవసాయ భూమిలో ఉన్న ఓ చెట్టుతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. దీంతో, సోషల్ మీడియాలో ఆయన పేరు చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో పుసాద్ తాలూకా ఖుర్షి గ్రామంలో కేశవ్ షిండే అనే రైతు ఉన్నాడు. తన ఐదుగురు కొడుకులతో కలిసి తమకు ఉన్న ఏడు ఎకరాల భూమి సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అనుకోని ఓ ఘటన వీరి జీవితాన్ని మలుపు తిప్పింది.కాగా, కేశవ్ షిండే ఊరి మీదుగా వార్దా-నాందేడ్ మధ్య రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే లైన్ ఏర్పాటు కోసం రైల్వే అధికారులు భూ సేకరణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కేశవ్ షిండే పొలాన్ని కూడా రైల్వే అధికారులు సేకరించారు. షిండే పొలంలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని భావించిన రైల్వే శాఖ.. ఆయన పొలంలో ఎక్కువ భాగాన్ని సేకరించింది. ఈ క్రమంలో షిండే తెలియని కొత్త అంశం బయటకు వచ్చింది.కేశవ్ షిండే పొలంలో ఎర్రచందనం చెట్టు ఉన్న సంగతి అనుకోని విధంగా బయటపడింది. కేశవ్ షిండే పొలంలో మామిడి తోటలు, ఇతర పంటలు ఉండేవి. నిజానికి ఆ చెట్టు వారి పొలంలో ఏళ్ల తరబడిగా ఉన్నా.. వారికి ఆ విషయం తెలియలేదు. రైల్వే లైన్ కోసం భూసేకరణ జరుగుతున్నప్పుడు.. కొంతమంది రైల్వే ఉద్యోగులు సర్వే కోసం కేశవ్ షిండే ఊరికి వచ్చారు. వారిలో ఒక ఉద్యోగి.. ఈ విషయాన్ని గుర్తించి కేశవ్ షిండే కుటుంబానికి చెప్పారు. దీంతో షిండే ఫ్యామిలీ ఆశ్చర్యంతో ఆనందం వ్యక్తం చేసింది. పొలంలో రైల్వే లైన్ వెళ్తుండటంతో కేశవ్ షిండే పొలానికి రైల్వే శాఖ పరిహారం అందించింది. అయితే తమ పొలంతో పాటుగా అందులో ఉన్న ఎర్రచందనం చెట్టు, పంటకు కూడా పరిహారం చెల్లించాలని కేశవ్ షిండే, ఆయన కొడుకులు డిమాండ్ చేశారు. ఎర్రచందనం చెట్టు విలువ లెక్కగట్టాలని అటవీ శాఖకు లేఖ రాశారు. కానీ, అధికారులు ఎర్రచందనం చెట్టుకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. దీంతో కేశవ్ షిండే కుటుంబం.. జిల్లా కలెక్టర్, అటవీ, రైల్వే, నీటి పారుదల శాఖల అధికారులను ఆశ్రయించారు. అయినప్పటికీ, ఎలాంటి పరిహారం అందకపోవటంతో 2024 అక్టోబర్ 7న హైకోర్టులో పిటిషన్ వేశారు.షిండే పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎర్రచందనం చెట్టు పరిహారం కోసం కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని రైల్వే శాఖను బాంబే హైకోర్టు ఆదేశించింది. కోటి రూపాయలను నాగ్‌పూర్ బెంచ్‌లో డిపాజిట్ చేయాలని.. ఇందులో నుంచి రూ.50 లక్షలు కేశవ్ షిండే విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 9న బాంబే హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేయగా.. రైల్వే శాఖ కోటి రూపాయలు డిపాజిట్ చేసింది. దీంతో, ఈ కేసులో కేవలం ఏడాదిలోనే కేశవ్ షిండే కుటుంబం విజయం సాధించింది. కేశవ్ షిండే పొలంలోని ఎర్రచందనం చెట్టు వయసు 100 ఏళ్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ రేటు ప్రకారం కేశవ్ షిండే పొలంలోని ఎర్రచందనం చెట్టు విలువ దాదాపు రూ.5 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. -
ఔరంగజేబ్ ఓటమిపాలై సమాధి అయ్యిందిక్కడే
రాయ్‌గఢ్: జగజ్జేత(అలంగీర్)నని చెప్పుకున్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ జీవితమంతా మహారాష్ట్రలో మరాఠాలతో పోరాటంతోనే గడిపి, ఓటమిపాలై ఈ గడ్డపైనే సమాధి అయ్యాడని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలను ఆయన ప్రశంసించారు. శివాజీ 345 వర్ధంతి సందర్భంగా ఆయన శనివారం రాయ్‌గఢ్ కోటలో ఆయనకు నివాళులరి్పంచారు. 100వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే నాటికి సూపర్ పవర్‌గా ఎదగాలన్న భారతదేశం లక్ష్యానికి శివాజీ మహారాజే స్ఫూర్తి అని అమిత్ షా పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను మహారాష్ట్రకు మాత్రమే పరిమితం చేయవద్దని ప్రజలకు ఆయన విజŠక్షప్తి చేశారు. శివాజీ దీక్ష, పట్టుదల, సాహసం దేశానికే ఆదర్శమని, సమాజంలోని అన్ని వర్గాలను వ్యూహాత్మకంగా ఆయన ఏకం చేశారని చెప్పారు. మారాఠా సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న రాయ్‌గఢ్ కోటలోని శివాజీ సమాధి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. సంభాజీనగర్ జిల్లా ఖుల్టాబాద్‌లో ఉన్న 17వ శతాబ్దం నాటి మొఘల్ చక్రవర్తి సమాధిని మరో చోటుకు తరలించాలన్న డిమాండ్లు ఇటీవల ఎక్కువైన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
విదేశాల్లో ఉద్యోగాలని.. ‘సైబర్’ బానిసలుగా మార్చారు
ముంబై: మయన్మార్‌లో సైబర్ బానిసలుగా బతుకీడుస్తున్న 60 మందికి పైగా భారతీయులను మహారాష్ట్ర పోలీసుల సైబర్ విభాగం రక్షించింది. ఒక విదేశీ పౌరుడు సహా ఐదుగురు ఏజెంట్లను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాల మేరకు... థాయ్‌లాండ్‌లో మంచి ఉద్యోగావకాశాలున్నాయంటూ మొదట సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంల ద్వారా ఓ ముఠా ప్రకటనలిచ్చిందిది. ఈ ప్రకటనలకు ఆకర్షితులైన కొందరు అమాయకులను సదరు ముఠా ఏజెంట్లు పాస్‌పోర్టులు, విమాన టికెట్లు ఏర్పాటుచేసి పర్యాటక వీసాలపై థాయ్‌లాండ్‌కు, అక్కడినుంచి మయన్మార్ సరిహద్దుకు పంపారు. ఆ తరువాత చిన్న పడవల్లో వారిని నది దాటించి సాయుధ తిరుగుబాటు గ్రూపుల నియంత్రణలో ఉన్న ప్రదేశాల్లో దింపారు. అక్కడ వారితో బలవంతంగా చీడిజిటల్ అరెస్ట్’ స్కామ్‌ల నుంచి నకిలీ పెట్టుబడి పథకాల దాకా అనేక సైబర్ మోసాలు చేయించారు. దీనిపై సమాచారమందుకున్న మహారాష్ట్ర సైబర్ పోలీసు విభాగం , ఇతర ఏజెన్సీలతో కలిసి బాధితులను రక్షించింది. త్వరలోనే వీరిని స్వదేశానికి తీసుకురానున్నారు. చదవండి: సింగపూర్ ‘ట్రీ టాప్‌వాక్’ తరహాలో వాక్‌వే, క్యూ కడుతున్న పర్యాటకులుమనీష్ గ్రే సహా నలుగురి అరెస్టు రిక్రూట్మెంట్ ఏజెంట్లుగా వ్యవహరించారనే ఆరోపణలతో మనీష్ గ్రే అలియాస్ మాడీ, తైసన్ అలియాస్ ఆదిత్య రవి చంద్రన్, రూపనారాయణ్ రాంధర్ గుప్తా, జెన్సీ రాణి డి మరియు చైనీస్–కజకిస్తానీ జాతీయుడు తలానిటి నులాక్సీలను అరెస్టు చేసింది. వీరిలో మనీష్ గ్రే పలు వెబ్ సిరీస్‌లు టెలివిజన్ షోలలో నటించిన ప్రొఫెషనల్ నటుడు అని కొంతమంది వ్యక్తులను నియమించుకుని మయన్మార్‌కు మనుషులను అక్రమ రవాణా చేశాడని పోలీసులు తెలిపారు. తలానిటి నులాక్సీ భారతదేశంలో సైబర్ నేరాలకు పాల్పడేలా ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, తదుపరి దర్యాప్తు కొనసా గుతోందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు : ప్రైజ్‌మనీ ఎంతో? -
షిర్డీ సంస్థాన్‌కు 4.26 కోట్ల ‘రామ నవమి’ ఆదాయం
శిర్డీ: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీలో శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 5 నుంచి మొదలైన శ్రీరామ నవమి ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ ఉత్సవాల సమయంలో 2.5లక్షల మంది సాయినాధుని దర్శించుకున్నారని, సంస్థానానికి రూ.4.26 కోట్ల ఆదాయం సమకూరిందని సంస్థాన్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భీమ్రాజ్ దారాడే మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అలాగే భక్తులు 83.3 గ్రాముల బంగారం, 2,030 గ్రాముల వెండి సమర్పించినట్లు పేర్కొన్నారు. షిర్డీ ఇండియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడికి ప్రపంచము నలుమూలల నుండి సాయి భక్తులు వస్తుంటారు. సాయికి భక్తితో వేడుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.ఇదీ చదవండి: ఎక్స్‌క్యూజ్‌మీ’ అన్నందుకు మహిళలపై దారుణంగా దాడి -
‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అన్నందుకు మహిళలపై దారుణంగా దాడి
మరాఠీలో బదులు ఇంగ్లీషులో మాట్లాడినందుకు మహిళలని కూడా చూడకుండా ఇద్దరిపై కొందరు వ్యక్తులు అమానవీయ దాడికి పాల్పడ్డ సంఘటన డోంబివిలీలోని విష్ణునగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల మేరకు..మంగళవారం డోంబివిలీలో ఇద్దరు మహిళలు తొమ్మిదినెలలపాపతో సహా ఓ స్కూటీపై తాము నివసించే హౌసింగ్ సొసైటీ ఆవరణలోకి ప్రవేశిస్తుండగా ప్రవేశ ద్వారానికి అడ్డుగా ఉన్న యువకుడిని తప్పుకోమంటూ ‘ఎక్స్‌క్యూజ్‌మీ’అని అడిగారు. దీనికి కోపోద్రిక్తుడైన ఆ యువకుడు అతను మరాఠీలో మాట్లాడాలని డిమాండ్ చేస్తూ పైపైకి దూసుకువచ్చాడు. అంతటితో ఆగకుండా మహిళల్లో ఒకరి చేయిని మెలితిప్పాడు. అదే సమయంలో అతని కుటుంబానికి చెందిన మరికొంతమంది వారిపై దాడికి పాల్పడ్డారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కేవలం ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అన్నందుకే ఇంతలా ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని బాధిత మహిళలు వాపోయారు. సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు విష్ణునగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ సంజయ్ పవార్ తెలిపారు. -
ఎడబాటు మానసికమా? భౌతికమా?
కాలం మారుతోంది... కాలం మారితే కొత్త ప్రశ్నలు వస్తాయి.భర్త మరణించిన తర్వాత స్త్రీల పట్ల వివక్షాపూరితమైన వ్యవహారశైలిమన దేశంలో అన్ని మతాలలో ఉంది.అయితే ఆ ఎడబాటును మానసికంగా ఉంచుకుంటే చాలదా... భౌతిక ఆనవాళ్లతో వివక్షకు గురవ్వాలా అనే చర్చ ఇప్పుడు మహారాష్ట్రలో నడుస్తోంది. అక్కడి 7000 గ్రామాలు వితంతువులు తాము వితంతువులుగా వెలిబుచ్చే చిహ్నాలతో ఉండాల్సిన పనిలేదని నిర్ణయం తీసుకున్నాయి. ఈ గ్రామాల సంఖ్య ఇంకా పెరగనుంది.నేను చాలా ఇబ్బందులు పడ్డాను. చదువుకుంటుంటే అందరూ అభ్యంతర పెట్టారు... వితంతువుకు చదువు ఏంటని. నా వయసు 42. ఇద్దరు పిల్లలు. భర్త చనిపోయాడు. చదువుకుని టీచర్ అయి నా పిల్లలను చూసుకోవాలని నా ప్రయత్నం. అందుకోసం సల్వార్ కమీజ్ వేసుకుని బయటకు వచ్చినా తప్పే. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది’ అంది సోనాలి పాట్దర్. ఈమెది కొల్హాపూర్‌లోని అంబప్ అనే గ్రామం. ఈమే కాదు పశ్చిమ మహారాష్ట్రలోని సుగర్ బెల్ట్‌గా చెప్పుకునే ప్రాంతంలో ఒక విప్లవంలా ఉద్యమం రేగి వితంతువులు వివక్ష లేకుండా జీవించే మార్పులు జరుగుతున్నాయి.గ్రామాలే మారాలి... మారాయిమన దేశంలో గ్రామాల్లోనే పట్టింపు ఎక్కువ. ముఖ్యంగా వితంతువులకు గ్రామాల్లో ఎక్కడా లేని అనాదరణ ఉంటుంది. వాళ్లు బొట్టు, గాజులు, పూలు పెట్టుకోకూడదు. మంగళసూత్రం వేసుకోకూడదు. శుభకార్యాలకు రాకూడదు. కొన్నిచోట్లయితే గణేశ్ ఉత్సవాలకు వచ్చినా ఊరుకోరు. వీరిని పనిలో కూడా పెట్టుకోరు. కొన్ని ఇళ్లల్లో వీరు రావాల్సిన ఆస్తి రాక అవస్థలు పడుతుంటారు. వితంతువులు కావడం వారి తప్పా? భర్త చన΄పోయిన బాధ ఒకవైపు... బయట సమాజం నుంచి వచ్చే బాధలు మరోవైపు. తమ బాధ మానసికంగా ఉంచుకుని బయట మామూలు జీవితం గడిపే హక్కు తమకు లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.2022లో మొదలైన ఉద్యమంమహారాష్ట్రలో పేరు పొందిన ప్రమోద్ జింజడే అనే సామాజిక కార్యకర్త పల్లెల్లో వితంతు స్త్రీలకు జరిగే అన్యాయాన్ని ఒకరోజు గమనించాడు. ‘భర్త చనిపోయాక ఒక స్త్రీ అతని గుర్తుగా బొట్టూ గాజులు ఉంచుకుంటానని బతిమిలాడుతుంటే సాటి స్త్రీలు వాటిని తొలగించడం చూశాను’ అన్నాడాయన. 2022లో ఒక అర్ధరాత్రి ఆయనకు సుస్తీ చేసింది. ప్రాణంపోపోయే స్థితి. కాని బయటపడ్డాడు. ఆయన ‘కర్మలా’ అనే ఊరిలో ఉంటాడు. వెంటనే ఆయన కర్మలా తాసిల్దార్ దగ్గరకు వెళ్లి ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశాడు. ‘నేను చనిపోతే నా భార్య వొంటి మీద బొట్టు గాజులు మంగళసూత్రం తీసే హక్కు ఎవరికీ ఉండకూడదు. అలా చేసినవారిని చట్టపరంగా శిక్షించాలి’ అని ఆ అఫిడవిట్ సారాంశం. అక్కడున్న వారు ప్రమోద్‌కు పిచ్చెక్కిందనుకున్నా క్రమంగా ఈ సంగతి ప్రచారం పొందింది. మే 2022లో ఈ ఘటన జరిగితే వెంటనే ‘హెర్వాడ్’ అనే పల్లె నుంచి ఈ ఉద్యమం మొదలైంది.ముక్తి పొందిన 7,683 గ్రామాలుమహారాష్ట్రలో ఇప్పటికి 7,683 గ్రామాలు, 1,182 మునిసిపల్ వార్డులు తాము వితంతువుల పట్ల వివక్ష చూపం అని తీర్మానాలు చేశాయి. వితంతువులు తమకు నచ్చిన ఆహార్యంతో ఉండవచ్చని, అన్ని చోట్లకు రాక΄ోకలు సాగించవచ్చని, ఉద్యోగాలు చేసుకోవచ్చని అవి వారిని ్ర΄ోత్సహించడానికి ముందుకొచ్చాయి. కొన్నిచోట్ల ఆగస్టు పదిహేనున వితంతువులతో జెండా వందనం కూడా చేయిస్తూ ఉన్నారు. ‘ఈ ఉద్యమం ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా పాకుతోంది. ముందుగా గోవా అందుకుంది’ అని ఉద్యమకారులు అంటున్నారు. భర్త చనిపోయాక నిరాశ నిస్పృహల్లో ఉన్న స్త్రీలకు సమాజమే బాసట. దాని నుంచి వందల ఏళ్లుగా ఎదుర్కొంటున్న వివక్షతో ఎంత మంది స్త్రీలు కుమిలిపోయి ఉంటారో అర్థం చేసుకుంటే ఈ ఉద్యమం అవసరం తెలిసి వస్తుందని ఈ ఉద్యమకారుల వాదన. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించింది. 78 శాతం గురించి ఆలోచించాలిమన దేశంలో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారి సంఖ్య సుమారు ఐదున్నర కోట్లు ఉంది. వీరిలో 78 శాతం స్త్రీలు. వీరిలో 32 శాతం సగటున 40 ఏళ్ల వయసున్న వారు. ఈ వయసు స్త్రీలు ఇందరు వివక్షను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు వెళ్లలేక΄ోతే ఎలా అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినబడుతోంది. బహుశా ఈ స్త్రీలే తమ ఆకాంక్షలను సమాజానికి మరింత గట్టిగా తెలియ చేస్తారు. -
రాజకీయాల్లోకి టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నాడు. గతేడాదే క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేదార్.. ఇవాళ (ఏప్రిల్ 8) బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నాడు. పలు కథనాల ప్రకారం జాదవ్ ఇవాళ సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నాడు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవన్కులే కేదార్‌ను భాజపాలోకి ఆహ్వానించనున్నాడు. కేదార్ మహా సీఎం ఫడ్నవిస్‌తో కలిసి దిగిన ఫోటో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Former cricketer Kedar Jadhav set to start his political career Details:👉 https://t.co/2tpIz8m7ju pic.twitter.com/ftEYmpgP3u— CricTracker (@Cricketracker) April 8, 202540 ఏళ్ల కేదార్ 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. కుడి చేతి వాటం బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన అతను భారత్ తరఫున 73 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. కేదార్ వన్డేల్లో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీల సాయంతో 1389 పరుగులు చేసి 27 వికెట్లు తీశాడు. 9 టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 122 పరుగులు చేశాడు. కేదార్ చాలా మ్యాచ్‌ల్లో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2017లో పూణేలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో అతను 120 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు.టీమిండియాకు ఆడకముందే కేదార్ ఐపీఎల్లో మెరిశాడు. వాస్తవానికి ఐపీఎల్ ప్రదర్శనల కారణంగానే అతడికి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. కేదార్ 2010లో ఐపీఎల్‌లోకి ప్రవేశించి వివిధ ఫ్రాంచైజీల తరఫున (కొచ్చి టస్కర్స్ కేరళ, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే, సన్‌రైజర్స్) 95 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 123.11 స్ట్రయిక్‌రేట్‌తో, 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు.కేదార్ దేశవాలీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించేవాడు. అతడిని ఫస్ట్ క్లాస్ మరియు లిస్ట్ ఏ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. మహారాష్ట్ర మిడిలార్డర్లో కేదార్ చాన్నాళ్ల పాటు కీలక సభ్యుడిగా ఉన్నాడు. కేదార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14 సెంచరీలు, లిస్ట్-ఏ క్రికెట్లో 9 సెంచరీలు చేశాడు. 2013-14 రంజీ సీజన్ కేదార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ సీజన్లో అతను 1000కి పైగా పరుగులు చేయడమే కాకుండా ఓ ట్రిపుల్ సెంచరీ (327) కూడా చేశాడు. కేదార్ 2024 జూన్ 3న క్రికెట్లోని అన్ని ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. -
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణ తంతును తిలకించడానికి పట్టణంలోని నలుమూలల నుంచి తెలుగు భక్తులు, ఉత్తరాది ప్రజలతో పాటు రాజకీయ నాయకులు వందల సంఖ్యలో విచ్చేసి దర్శన భాగ్యాన్ని పొందారు. పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన పద్మనగర్ ప్రాంతంలో గల శ్రీరామ మందిరంలో సీతారామ కల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. శ్రీరామ మందిర్ ట్రస్ట్ నేతృత్వంలో 36వ వార్షికోత్సవ వేడుకలు గత వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 11.45 గంటలకు సీతారాములకు కల్యాణం వేద పండితులు గాజుల చంద్రశేఖర్, ద్యావణపెల్లి ఆనందం, వడిగొప్పుల శంకర్, గెంట్యాల గంగాధర్, శ్యావు మహారాజ్ పంతులు భద్రాచలంలో జరిపించే విధంగా మందిరం ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణలతో మంగళవాయిద్యాల మధ్య కల్యాణ తంతు ఘనంగా నిర్వహించారు. మాజీ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయక మంత్రి కపిల్ పాటిల్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు హర్శల్ పాటిల్, మాజీ స్థానిక కార్పొరేటర్లు సంతోష్ శెట్టి, సుమిత్ పాటిల్, స్థానిక మీనా బాలకిషన్ కల్యాడపు, పద్మ భూమేశ్ కల్యాడపు, అఖిల పద్మశాలీ సమాజ్ అధ్యక్షుడు పొట్టబత్తిని రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కల్యాడపు బాలకిషన్, కోశాధికారి యెల్లే సాగర్, కార్యాధ్యక్షుడు గాజెంగి రాజు, మాజీ అధ్యక్షుడు యేముల నర్సయ్య, కొంక మల్లేశం, సుంక శశిధర్, నిష్కం భైరి, భీమనాథిని శివప్రసాద్, బాలె శ్రీనివాస్, ట్రస్టీలు ఎస్.మల్లేశం, పాశికంటి లచ్చయ్య, పద్మశాలీ సమాజ్ యువక్ మండలి అధ్యక్షుడు వాసం రాజేందర్, మందిర కార్యవర్గ సభ్యులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల పదాధికారులు, పట్టణ వ్యాప్తంగా కామత్‌ఘర్, బాలాజీనగర్, బండారి కంపౌండ్, కన్నేరి, పాంజలాపూర్, నయీబస్తీ నుంచి తెలుగు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సీతారాముల కల్యాణతంతు అనంతరం భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కానుకలు సమర్పించుకున్నారు. అనంతరం చేపట్టిన అన్నదానం కార్యక్రమంలో సుమారు 12 వేల మంది భక్తులు హాజరయ్యారని శ్రీరామ మందిర ధర్మదాయ విశ్వస్త సంస్థ ట్రస్టీ డాక్టర్ అంకం నర్సయ్య తెలిపారు. పల్లకి ఊరేగింపు..సాయంత్రం 6 గంటలకు స్వామి వారి పల్లకి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో 108 గంగా జలాలతో కూడిన కలశాలను మహిళలు తలపై పెట్టుకొని రామ నామం జపిస్తూ పద్మనగర్ పుర వీధులు రామ మందిరం నుంచి కన్నేరి, పీటీ హైసూ్కల్, పాయల్ టాకీజ్, ధామన్‌కర్ నాక, బాజీ మార్కెట్, బాలాజీ మందిరం, దత్తా మందిరం నుంచి తిరిగి రామ మందిరాన్ని రాత్రి 10 గంటల వరకు జరిగింది. ఊరేగింపులోని ప్రతి పురవీధిలో డీజే సౌండ్ సిస్టమ్‌ల మధ్య నృత్యాలు చేస్తూ స్వామివారి పల్లకికి స్వాగతం పలికారు. అలాగే చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. భజన మండలి వారి శ్రీరామనామ కీర్తలను ఆలకించారు. స్వామివారిని దారి మధ్యలో భక్తులు మంగళ హారతులు పట్టి, టెంకాయలను కానుకలు సమర్పించు కున్నారు. రాత్రి ఊరేగింపులో పాల్గొన్న సుమారు వేయి మందికి నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ మైన సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. హనుమాన్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. ప్రతి సంవత్సరం మాదిరిగానే హనుమాన్ మాలధారణ ధరించిన భక్తులు 56 అడుగుల భక్తాంజనేయ స్వామి మందిరంలో సీతారాముల కల్యాణం గురుస్వామి కోడూరి మల్లేశం, అధ్యక్షుడు గుండేటి నాగేశ్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. 41 రోజుల పాటు మాలధారణ ధరించిన దీక్షాస్వాములు వారం రోజులుగా హోమాలు, అభిõÙకాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వాములకు ప్రత్యేక అలంకరణలతో పాటు అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. చైత్రశుద్ధ నవమి, అభిజిత్ లగ్న ముహూర్తమున సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచి, తంతు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి భక్తులు కానుకలు, ఒడిబియ్యం సమర్పించుకున్నారు. అనంతరం జరిగిన అన్నదానంలో సుమారు 2 వేల మంది పాల్గొన్నారని వడ్లకొండ రాము తెలిపారు. -
Rama Navami 2025: రామాయణం మానవజాతికి దిక్సూచి
‘భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది. రామాయణాది పౌరాణికాలు మానవజాతికి దిక్సూచి లాంటివి. మనిషి సాటి మనిషిని ప్రేమించే తత్వాన్ని అలవర్చుకోవాలని రామాయణం మనకు నేర్పుతుంది. ఇందులో ప్రతి పాత్ర ఆదర్శవంతమే’ అని జస్టిస్ బి.ఎన్.కృష్ణ ఉద్ఘాటించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆంధ్ర మహాసభ, వేంకటేశ్వర పూజా మందిరం ట్రస్ట్ సంయుక్తంగా, శనివారం సాయంత్రం దాదర్ హిందూ కాలనీలోని ఆచార్య బి.ఎన్.వైద్య సభాగహంలో నిర్వహించిన రామాయణం నృత్యరూపక కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలుగులో ప్రదర్శించిన ఈ నృత్యరూపకం కనులపండువగా సాగింది. దర్శకత్వంతో పాటు కళాకారుల అభినయం అద్భుతంగా ఉంది’ అని కొనియాడారు. తొలుత ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ సభకు స్వాగతం పలికారు. ముందుగా పరిచయాత్మకంగా జరిగిన వేదిక కార్యక్రమంలో స్థానిక లోక్‌సభ సభ్యులు అనిల్ దేశాయ్, ఎమ్మెల్సీ సునీల్ శిందే పాల్గొన్నారు. అనిల్ దేశాయ్ మాట్లాడుతూ ఆంధ్ర మహాసభ గత తొమ్మిది దశాబ్దాలుగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో అసామాన్యమైన సేవలందిస్తోందని, తెలుగువారికి, మరాఠీయులకు పురాతన కాలం నుంచి అవినాభావ సంబంధాలున్నాయని, ఆంధ్ర మహాసభ అభివృద్ధి పనుల కోసం ఎంపీ ల్యాడ్స్ నుంచి తప్పకుండా సహాయం అందిస్తానని సభాముఖంగా ప్రకటించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ మంతెన రమేశ్, అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ తదితరులు అనిల్ దేశాయ్‌ని, సునీల్ శిందేని ఘనంగా సన్మానించారు. కనువిందు చేసిన నృత్యరూపకం తర్వాత జగన్నాథాచార్యులు రచించగా, సూర్యారావు సంగీత దర్శకత్వంలో, సూర్యనారాయణ గాత్ర సహకారంతో, భాగవతుల వెంకట రామశర్మ దర్శకత్వంలో ప్రదర్శించిన రామాయణం నృత్యరూపకం సభికుల్ని అక్షరాలా మంత్ర ముగ్ధుల్ని చేసింది. సంగీతం, గానానికి అనుగుణంగా నటీ నటుల అభినయం వీక్షించిన రసికుల్ని అబ్బురపరిచింది. రామాయణంలోని సీతా స్వయంవరం, పరుశరామ గర్వభంగం, మందర కైకేయి సంవాదం, శూర్పణక నాసికా ఖండనం, సీతాపహరణ దశ్యం, వాలి వధ, రామ రావణ యుద్ధం, చివరికి శ్రీరామ పట్టాభిõÙకం తదితర ప్రధాన ఘట్టాల్ని కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శించారు. ఆయా ఘట్టాల్లో సభికులు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆయా సందర్భాల్లో ఎంతో భావోద్వేగాలకు గురయ్యారు. దశాబ్దాల తర్వాత ఇంతటి అద్భుతమైన నృత్యరూపకాన్ని చూశామని ప్రేక్షకులు కొనియాడారు. విజయవాడకు చెందిన శ్రీనత్య అకాడమీ వారు ప్రదర్శించిన ఈ నృత్యరూపకంలో రాముడిగా, బి.ఎన్.ఎన్.సౌమ్య, సీతగా అలకనందాదేవి, రావణుడిగా సీహెచ్ రామకృష్ణ అనితరసాధ్యంగా నటించారు. తతిమ్మ నటీనటులు కూడా తమతమ పాత్రల్లో జీవించారు. ప్రముఖ రచయిత్రి తురగా జయశ్యామల, రవీంద్ర దంపతులు రూపకం తీరుకు ఆనందించి అప్పటికప్పుడే ఆర్థిక సహాయం అందించారు. రూపకం ప్రదర్శనానంతరం అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి మాట్లాడుతూ, చక్కటి కార్యక్రమాలకు ప్రేక్షకాదరణ ఉంటుందని రుజువైందని, భవిష్యత్తులో కూడా వివిధ ప్రక్రియలకు సంబంధించిన నాణ్యమైన కార్యక్రమాల నిర్వహణకు ఆంధ్ర మహాసభ కట్టుబడి ఉందని ప్రకటించారు. తెలుగేతర నేలపై తెలుగు భాషా సంస్కృతుల్ని పరిరక్షించడమే కాకుండా, వాటి వికాసానికి కూడా మహాసభ తప్పకుండా ప్రయతి్నస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మంతెన రమేశ్, కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, ధర్మకర్తలు బోగ సహదేవ్, ద్యావరిశెట్టి గంగాధర్, సంగం ఏక్నాథ్, అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్, పరిపాలన విభాగ ఉపాధ్యక్షుడు తాల్ల నరేశ్, సాహిత్య విభాగ ఉపాధ్యక్షుడు బొమ్మకంటి కైలాశ్, సాంస్కృతిక శాఖ ఉపాధ్యక్షుడు గాజెంగి వేంకటేశ్వర్, సంయుక్త కార్యదర్శి అల్లె శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కొక్కుల రమేశ్, చిలుక వినాయక్, కూచన్ బాలకృష్ణ, శేర్ల ప్రహ్లాద్, మహిళా శాఖ అధ్యక్షురాలు మంచికంటి మేఘమాల, కార్యదర్శి పిల్లమారపు పద్మ, ఉపాధ్యక్షురాలు వి.శ్యామల రామ్మోహన్, సభ్యులు బోగ జ్యోతిలక్షి్మ, వీరబత్తిని రాజశ్రీ, తాళ్ల వనజ, పూజా మందిరం ట్రస్ట్ చైర్మన్ జి.హరికిషన్, కార్యదర్శి నూకల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ ఉపాధ్యక్షుడు గాజెంగి వేంకటేశ్వర్ సభకు వందన సమర్పణ చేశారు. -
విమానంలో వృద్దురాలు మృతి.. అత్యవసర ల్యాండింగ్
ఔరంగాబాద్: విమానంలో ప్రయాణిస్తున్న ఒక వృద్దురాలు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానాన్ని అత్యవసర పరిస్థితుల్లో లాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి ముంబై నుండి వారణాసికి బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్(Indigo Airlines) విమానంలో ఇటువంటి పరిస్థితి తలెత్తింది. విమానంలో ప్రయాణిస్తున్న వృద్దురాలు సుశీలా దేవి(89) అస్వస్థతకు గురయ్యింది. ఈమె ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందినది. కొద్దిసేపటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, విమాన సిబ్బంది వెంటనే స్పందించారు. అక్కడికి సమీపంలోని చత్రపతి సంభాజీనగర్‌లోని చికల్థానా విమానాశ్రయం(ఔరంగాబాద్ విమానాశ్రయం, మహారాష్ట్ర)లో అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించారు. దీంతో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో విమానం ల్యాండ్ అయింది.అక్కడికి చేరుకున్న వైద్య బృందం సుశీలా దేవిని పరీక్షించింది. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వారు నిర్ధారించారు. విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం ఆమె అస్వస్థతకు గురైనప్పుడు విమానం గాలిలో ఉంది. సిబ్బంది ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకపోయింది. అత్యవసర ల్యాండింగ్(Emergency landing) తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు అవసరమైన చట్టపర ప్రక్రియలను పూర్తి చేశారు. అనంతరం ఆ ఇండిగో విమానం వారణాసి వైపు ప్రయాణాన్ని కొనసాగించింది.కాగా సుశీలా దేవి మృతదేహాన్ని చత్రపతి సంభాజీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే సంబంధిత అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. గత నెలలో జైపూర్ నుండి చెన్నైకి వెళుతున్న విమానానికి సంబంధించిన టైర్ పేలిన ఘటన జరిగింది. అయితే ఈ ఉదంతంలో ఎవరూ గాయపడలేదు. ఈ రెండు సంఘటనలు విమాన ప్రయాణంలో భద్రత, అత్యవసర చర్యల ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ఇది కూడా చదవండి: ‘అసమానతలను అర్థం చేసుకోండి’: బిల్‌గేట్స్ -
వీడియో వైరల్: అందరిని నవ్వించి.. చివరికి కన్నీళ్లను మిగిల్చిన విద్యార్థిని
ముంబై: సంతోషంగా, ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో స్మృతులతో సంతోషంగా జరుగుతున్న ఫెర్వెల్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. వేదికపై ప్రసంగిస్తున్న ఓ విద్యార్థిని గుండెపోటుతో మరణించారు. ఈ విషాద ఘటనలో బాధిత విద్యార్థినికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ ప్రాణాలు కోల్పోవడంపై తోటి విద్యార్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె మరణ వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు.మహారాష్ట్రలోని ధారశివ్ జిల్లాలో పరండా పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పరండా ఆరాజి షిండే కాలేజీలో ఫేర్వెల్ పార్టీ విషాదంగా ముగిసింది. వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని వర్ష ఖరత్ (20) వేదికపై ప్రసంగిస్తున్నారు. అప్పటివరకు విద్యార్థులు, లెక్చరర్ల గురించి మాట్లాడారు. మధ్య మధ్యలో తన ప్రసంగంతో అటు విద్యార్థుల్ని, ఇటు లెక్చరర్లను నవ్వించారు.At RG Shinde College in Dharashiv, Maharashtra, a student, Varsha Kharat, collapsed and died during her farewell speech 😢😢https://t.co/O4Rx9pmtnp#suddendeath https://t.co/gPlhM9qaGh pic.twitter.com/fcCdm6PWFX— Dee (@DeeEternalOpt) April 5, 2025 అయితే అప్పటి వరకు అందరిని నవ్వించి వర్ష మాట్లాడుతూ కుప్పకూలారు. ఫెర్వెల్ పార్టీలో పాల్గొన్న విద్యార్థులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విద్యార్థిని కుప్పకూలిపోవడంతో అప్రమత్తమైన తోటి విద్యార్థులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం పరండా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అప్పటికే విద్యార్థిని వర్ష మరణించినట్లు ప్రకటించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, వర్ష ఎనిమిదేళ్ల వయసులో గుండె శస్త్రచికిత్స (హార్ట్ సర్జరీ) చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే గత 12 ఏళ్లుగా ఆమెకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, మందులు కూడా వాడటం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనకు గల కారణంగా ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు (సడెన్ కార్డియాక్ అరెస్ట్) రావడం వల్ల బ్రెయిన్ డెత్ వచ్చి మృతి చెందిందని నిపుణులు అనుమానిస్తున్నారు. వర్ష మరణంపై కాలేజీ యాజమాన్యం తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె స్మృతిగా ఒక్కరోజు సెలవు ప్రకటించారు. -
పచ్చదనం.. పర్యావరణ సమతుల్యతే లక్ష్యం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పార్కుల విభాగం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. మియావాకీ విధానాన్ని అనుసరిస్తూ మొక్కల పెంపకాన్ని చేపడుతోంది. ఈ క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ డిపార్ట్మెంట్ కార్యాలయ సిబ్బంది ఇటీవల పోవై ప్రాంతంలోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పార్క్‌లో 2,000 మొక్కలను నాటారు. పార్క్ సూపరింటెండెంట్ జితేంద్ర పరదేశి, డిప్యూటీ సూపరింటెండెంట్ సాహెబ్రావ్ గవిట్, ఎస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ అధికారి రిషికేశ్ హెండ్రే నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ముంబై నగరంలో నిర్మిస్తున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం వేలాది చెట్లను నరికివేయడం వల్ల వాయుకాలుష్యం గణనీయంగా పెరుగుతోంది. దీనిని నివారించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ నడుంబిగించింది. నరికివేసిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలను నాటేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు మియావాకీ పద్ధతిని కూడా అనుసరించాలని నిర్ణయించింది. ముంబై నగరానికి మరింత పచ్చదనాన్ని తీసుకురావడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న ఈ కార్యక్రమం భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు సహాయపతుతుందని నగరవాసులు కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అధికారులు కోరుతున్నారు. -
నీలి రంగు అద్దాల మేడలు : భగభగ మంటలు
ముంబై, ఉప నగరాల్లో మొన్నటిదాకా 34 డిగ్రీలున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఏకంగా 37, 38 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత పదిహేను రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతను భరించలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల దెబ్బకు వివిధ అనారోగ్య సమస్యల బారిన పడి ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో చిన్న చిన్న క్లినిక్‌లు మొదలుకుని ప్రభుత్వ, ప్రైవేటు, బీఎంసీ తదితర ప్రధాన ఆసుపత్రులకు రోగులు బారులు తీరుతున్నారు. ఎండలు ముదరడంతో విధులకు వెళ్లేందుకు బయలుదేరిన ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ రకాల పనుల కోసం ఇల్లు కదిలే గృహిణులు, సామాన్యులు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది. ప్రతీరోజు రెండు నుంచి మూడు లీటర్లకుపైగా నీరు తాగాలని, అవసరమైతే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లస్సీ, పండ్ల రసాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయాల్లో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కళ్లు తిరగడం, వాంతులు, కాళ్లు, చేతుల నొప్పులు, దురద , మూత్రం సరిగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపం క్లినిక్‌లు లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని జె.జె.ఆసుపత్రి ప్రొఫెసర్ డా.మధుకర్ గైక్వాడ్ సూచించారు. లేదంటే వడదెబ్బతో తీవ్ర అనారోగ్యం బారిన పడే అవకాశముందని హెచ్చరించారు. – డా.మధుకర్ గైక్వాడ్అద్దాల మేడలూ కారణమే ముంబైలో అనేక బహుళ అంతస్తుల భవనాలు రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బేస్మెంట్పై అదనపు భారం పడకుండా , అందంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో 90 శాతం భవనాలకు నీలం రంగు అద్దాలు బిగిస్తున్నారు. నగరంలో వేడిమి పెరుగుదలకు ఇది కూడా ఒక కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. – ఆరోగ్య నిపుణులు చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఅకాల వర్షాలకు అవకాశం వేసవి ఎండలతో సతమతమవుతున్న ముంబైకర్లపై మరో పిడుగు పడనుంది. త్వరలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అకాల వర్షాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని, జాగ్రత్తలు పాటించాలని సూచించింది.– ఐఎండీచదవండి: నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్! -
హైవేపై రెండు బస్సులు, కారు ప్రమాదం.. పలువురు మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బుల్దానాలో బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. షీగాన్-కామ్గాన్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు.. బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో ప్రమాదానికి గురైన రెండు వాహనాలను మరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Buldhana, Maharashtra: A triple accident on Shegaon-Khamgaon Highway involving a Bolero, an ST bus, and a private bus killed five people and injured 24. The injured are receiving treatment at Khamgaon government hospital pic.twitter.com/dIWmrwPEN9— IANS (@ians_india) April 2, 2025 -
భక్తి శ్రద్ధలతో ఈద్–ఉల్–ఫిత్ర్
సోలాపూర్, భివండీ: సోలాపూర్ పట్టణం, జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈద్ ఉల్ ఫిత్ర్(రంజాన్)పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హోటగి రోడ్డు వైపునున్న అలంగీర్ ఈద్గా మైదానం, జూని మిల్ కాంపౌండ్ హాల్లోని అదిల్ శాయి ఈద్గా మైదానం, అసర్ మైదానంలో ముస్లిం సోదరులు రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత అందరూ ఒకరికొకరిని ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!భివండీలో... భివండీలోని పలుప్రాంతాల్లో సోమవారం రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచే ఈద్గా మైదానం సహా పట్టణంలో 113 మసీదులలో వేలాది ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పండుగ సందర్భంగా కోటర్ గేట్ వద్ద డీసీపీ మోహన్ దహికర్, ఏసీపీ దీపక్ దేశ్‌ముఖ్ ముస్లిం సోదరులకు గులాబీలు అందజేసి ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: Ugadi 2025 వైభవంగా ‘విశ్వావసు’ స్వాగతం, వేడుకలు -
Ugadi 2025 వైభవంగా ‘విశ్వావసు’ కి స్వాగతం, వేడుకలు
పన్వేల్ ఆంధ్రా కళా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ క్రోధి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి ఆనందోత్సాహాలతో స్వాగతం చెప్పారు. ఈ వేడుకల్లో సమితి సభ్యులు, పన్వేల్‌లోని తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండవ కృష్ణ పంచాంగ పఠనం, క్రాంతి నాట్య, గానాలు సభికులను అలరించాయి. ఈ సందర్భంగా వేడుకలకు విచ్చేసిన వారికి సమితి సభ్యులు ఉగాది పచ్చడితో పాటు నూతన పంచాంగం పుస్తకాలను పంపిణీ చేశారు. ముంబై ఆంధ్ర ప్రజా సంఘం ఆధ్యర్యంలో... ముంబై ఆంధ్ర ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో మహిళలు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఉగాది పచ్చడి తయారు చేసి ఒకరొకొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జాయింట్ సెక్రటరీ రాజకుమార్ సతీమణి జ్యోతి ఆధ్వర్యంలో ఉగాది ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ మాకె రాంబాబు, భోగి విష్ణు, సాయిబాబా, ఉండు శ్రీనివాస్, ఎల్లమెల్లి శ్రీనివాస్, ధోనిపాటి శ్రీను, జే ఎస్ మూర్తి, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. వాషి తెలుగు కళా సమితిలో.... వాషిలోని తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగుప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ జ్యోతిష పండితుడు పూజ్యం సత్యనారాయణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సమర్పణం గ్రూప్ ఆలపించిన భక్తి గీతాలు, సిద్ధి నాట్య మందిర్ (గురు రష్మి – శ్రద్ధా భిడే పరివార్) కథక్ నాట్య ప్రదర్శన, ఢీ ప్రోగ్రాం సహాయ నృత్య దర్శకుడు సాయి టీం మెంబర్స్ గ్రూప్‌డాన్స్ ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త ఎల్ది సుదర్శన్‌కు తెలుగు కళా సమితి సభ్యులు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. అనంతరం విందు భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో సమితి అధ్యక్షుడు బి. నారాయణరెడ్డి , ప్రధాన కార్యదర్శి జి. సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శులు టి. విజయలక్ష్మి, సంయుక్త కోశాధికారులు వెలుగొండరెడ్డి, కోటిరెడ్డి, వహీదా, ప్రత్యూష, శోభ, రాధిక, జానకి, కృష్ణ, శ్యామల, శ్రీనివాసరెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు. తెలుగు కళావేదిక ఆధ్వర్యంలో... నవీ ముంబై, సిబిడి బేలాపూర్‌లోని సాంస్కృతిక సంస్థ తెలుగు కళావేదిక ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలుగు కళా వేదిక సభ్యులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సామూహిక మహాలక్ష్మీ పూజ , పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మాస్టర్ సాయి హరి భగవద్గీత శ్లోకాల పారాయణ, కుమారి పద్మశ్రీ భరతనాట్య ప్రదర్శన, ప్రముఖ గాయని అనూరాధ శిష్యుల గానం , కవులు అద్దంకి లక్ష్మి రాజశేఖర్ కవితాగానం ప్రేక్షకులను అలరించాయి. అలాగే మహిళా సభ్యులు ప్రదర్శించిన ‘కిట్టీ పార్టీ’హాస్య నాటిక ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ కార్యక్రమానికి రవి చిమట వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తెలుగు సంఘం బోనాలు..అంధేరీ వెస్ట్‌లోని చార్‌బంగ్లా ప్రాంతంలో ఆదివా రం స్థానిక తెలుగు ప్రజలు బోనాల ర్యాలీతో ఉగాదికి స్వాగతం పలికారు. తెలుగు సంఘం ఆధ్వర్యంలో మొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు. భివండీలో ఉగాది సంబరాలు..ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం అఖిల పద్మశాలీ సమాజ్ ఆధ్వర్యంలో మండాయిలోని మార్కండేయ మహాముని మందిరంలో ప్రత్యేక పూజలు, ఉగాది పచ్చడి వితరణ జరిగాయి. ఈ సందర్భంగా సమాజ్ అధ్యక్షుడు పొట్టబత్తిని రామకృష్ణ, న్యాయదాని కమిటీ చైర్మన్ ఎలిగేటి శ్రీనివాస్ పట్టణ వ్యాప్తంగా ఉన్న సమాజ్ పెద్దలను టోపీ, శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో పట్టణంలోని వివిధ ప్రాంతాంలకు చెందిన అఖిల పద్మశాలీ సమాజం న్యాయనిర్ణేతలు, పెద్దలతోపాటు సమాజ్ ప్రధాన కార్యదర్శి కళ్యాడపు బాలకిషన్, కోశాధికారి యెల్లె సాగర్, కార్యాధ్యక్షుడు గాజెంగి రాజు, ఉపాధ్యక్షుడు వల్లాల్ మోహన్, కొంక మల్లేశం, సుంఖ శశిధర్, కోడం లక్ష్మీనారాయణ, ట్రస్టీలు వేముల నర్సయ్య, పాశికంటి లచ్చయ్య, ఎస్. మల్లేశం, వంగ పురుషోత్తం, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పద్మశాలీ సమాజ్ యువక్ మండల్లో... ప్రతి ఏడాది మాదిరిగానే పద్మశాలీ సమాజ్ యువక్ మండల్లో, అధ్యక్షుడు వాసం రాజేందర్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అఖిల పద్మశాలీ సమాజ్ కార్యవర్గం కాల పరిమితి పూర్తి కావస్తున్న సందర్భంగా గౌరవ సత్కార సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంంలో సమాజ్ పెద్దలు, యువక్ మండలి కార్యవర్గ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కపిల్ పాటిల్ ఫౌండేషన్ కార్యాలయంలో... కపిల్ పాటిల్ ఫౌండేషన్ కార్యాలయం, బాలాజీనగర్ సంఘం, కామత్‌ఘర్‌లోని పలు సంఘాల్లో ఉగాది వేడుకలు, ఘనంగా నిర్వహించారు. -
‘అప్పుడు నీకు మామూలు ‘‘వెల్కమ్’’ ఉండదు’
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి శివసేన ఆగ్రహానికి గురైన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు మద్రాసు హైకోర్టు మద్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై కునాల్ కమ్రా షోలు చేసే స్టూడియో కూల్చివేసిన ఘటనలో అరెస్టై బెయిల్ పై విడుదలైన శివసేన పార్టీ యువసేన జనరల్ సెక్రటరీ నేత రాహుల్ కనాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కునాల్ కమ్రా బెయిల్ పై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటూనే.. కునాల్ కమ్రా మహారాష్ట్రకు వచ్చినప్పుడు గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు శివసేన సిద్ధంగా ఉందంటూ ప్రతీకార చర్య వ్యాఖ్యలు చేశారు. జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడిన రాహుల్ కనాల్.. ‘ కునాల్ కమ్రాకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ తీర్పుతో కునాల్ కు ఊరట లభించింది. ఇది కేవల ఏప్రిల్ 7 వరకు మాత్రమే. ఆ తర్వాత కునాల్ చట్టపరమైన సమస్యలు తప్పవు. ఈ క్రమంలో ముంబైకి రాక తప్పదు. అప్పుడు నేను కునాల్ గ్రాండ్ వెల్ కమ్ ఏర్పాటు చేస్తా.. అది కూడా శివ సేన స్టైల్ లోనే ఉంటుంది. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న కునాల్ కు అక్కడ ఎవరు రక్షణ కల్పిస్తున్నారన్నది అనవసరం. షిండే పై చేసిన వ్యాఖ్యలకు గాను ముంబైకు కునాల్ తప్పకుండా రావాల్సి ఉంటుంది. అప్పుడు అతని మామూలు ‘ వెల్ కమ్’ ఉండదు’ అంటూ కామెంట్స్ చేశారు.అంతకుముందు తాను విచారణకు హాజరుకావడానికి కొంత సమయం కావాలని ముంబై పోలీసుల్ని కునాల్ కమ్రా కోరగా దాన్ని వారు నిరాకరించారు. అయితే తనకు ప్రాణ హాని ఉందంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు కునాల్ కమ్రా. ఈ కేసులో కునాల్ కమ్రాకు గత శుక్రవారం మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ముంబైలోని హాబిటాట్ స్టూడియో(ల జరిగిన ఈవెంట్లో కునాల్ కమ్రా ఓ షో చేస్తూ ఏక్నాథ్ షిండేను ద్రోహిగా వర్ణించడంతో షిండే శివసేన యువ విభాగం భగ్గుమంది. కునాల్‌కు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగింది. అదే టైంలో.. హాబిటాట్ స్టూడియోపై దాడికి దిగి విధ్వంసానికి పాల్పడింది. ఈ కేసులో రాహుల్ కనాల్ తో పాటు 11 మందిని అరెస్టు చేయగా, వారికి బెయిల్ కూడా లభించింది. -
మోదీ రిటైర్మెంట్.. మాకు ఆ అవసరమే లేదు!
ముంబై: బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని(RSS Headquarters) సందర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన నేపథ్యంతో.. మోదీ రాజకీయ నిష్క్రమణపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఆరెస్సెస్ మోదీని తప్పించి వారసుడ్ని ఎంపిక చేసే పనిలో ఉందని.. అందుకే ఆయన నాగ్‌పూర్‌కి రావాల్సి వచ్చిందని శివసేన(థాక్రే) నేత సంజయ్ రౌత్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ‘తండ్రి’ వ్యాఖ్యలతో గట్టి కౌంటరే ఇచ్చారు. ఈ ఏడాదిలో మోదీ రాజకీయాల నుంచి నిష్క్రమించబోతున్నారని.. ఆ విషయాన్ని తెలియజేసేందుకే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిశారంటూ ముంబైలో మీడియా ప్రతినిధుల సమావేశంలో రౌత్ అన్నారు. ప్రధాని మోదీ(PM Modi) ఈ ఏడాది సెప్టెంబర్‌లో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ దరఖాస్తును సమర్పించేందుకే ఆయన ఆరెస్సెస్ నాగ్‌పూర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. గత 10 ఏళ్లలో ఆయన ఏనాడూ అక్కడికి వెళ్లలేదు. కేవలం ఆరెస్సెస్ చీఫ్‌కు వీడ్కోలు చెప్పేందుకే ఇప్పుడు వెళ్లారు అంటూ సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రధానిగా మోదీ సమయం ముగిసిపోయింది. ఈ సెప్టెంబర్‌తో ఆయన 75 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. ఆ వయసు, దానిని మించినవాళ్లు పదవుల్లో కొనసాగవద్దని ఆ పార్టీ(BJP)లో అప్రకటిత నిబంధన ఉంది. దేశ నాయకత్వాన్ని మార్చాలని సంఘ్ పరివార్ బలంగా అనుకుంటోందని, బీజేపీ జాతీయ నాయకత్వంలోనూ త్వరలో మార్పులు ఉండబోతున్నాయని అన్నారాయన. ఇదిలా ఉంటే.. 2000 సంవత్సరంలో ప్రధాని హోదాలో అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal bihari Vajpayee) సందర్శించగా.. మళ్లీ ఇప్పుడు మోదీ ఆరెస్సెస్ హెడ్‌క్వార్టర్స్‌లో సందడి చేశారు. అయితే మోదీ వారసుడిని ఆరెస్సెస్ ఈ సెప్టెంబర్‌లో ఎంపిక చేయబోతుందన్న రౌత్ వ్యాఖ్యలకు బీజేపీ నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis) కౌంటర్ ఇచ్చారు. తండ్రి ఉండగా వారసుడు అనేవాడి అవసరమే ఉండదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ నాయకత్వాన్ని మార్చడమా?. మాకు ఆ అవసరమే లేదు. మోదీకి వారసుడిని వెతకాల్సిన అవసరమూ లేదు. మోదీజీనే మా నేత. భవిష్యత్తులోనూ ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగుతాం. 2029 లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా దేశ ప్రధానిగా కొనసాగుతారు. కాబట్టి ఇలాంటి వ్యవహారాన్ని చర్చించడం కూడా తగదు. బీజేపీలో వయసు దాటితే రిటైర్మెంట్లాంటి నిబంధనేదీ బీజేపీలో లేదన్న ఫడ్నవిస్.. 80 ఏళ్ల వయసులో మంతత్రి పదవి చేపట్టిన బీహార్ నేత జితన్ రామ్ మాంజీ పేరును ప్రస్తావించారు. ఈ టర్మ్‌లోనే కాదు.. వచ్చే టర్మ్‌లోనూ ఆయన మా నాయకుడు. మోదీ రాజకీయాలను వీడతారని వ్యాఖ్యానించేవాళ్లది మొఘలుల ఆలోచన ధోరణిగా అనిపిస్తోంది. ఎందుకంటే.. మన సంప్రదాయంలో తండడ్రి బతికి ఉండగా.. వారసత్వం అనే ప్రస్తావనే ఉండదు. ఇలాంటివి మొఘలుల సంప్రదాయంలోనే ఎక్కువగా ఉంటాయి. వన్ షాట్.. టూ బర్డ్స్‌లాగా ఔరంగజేబ్ సమాధి వివాదం నడుస్తున్న వేళ.. ఫడ్నవిస్ తాజా వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే కిందటి ఏడాది స్వార్వత్రిక ఎన్నికల టైంలో మోదీ రాజకీయ రిటైర్మెంట్ గురించి చర్చ నడిచింది. ఆ టైంలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మోదీ స్థానంలో అమిత్ షా ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు. -
Ugadi 2025 అంబరాన్నంటిన ఉగాది సంబరాలు
ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉగాది (Ugadi2025) సంబరాలు (మరాఠీ ప్రజలు జరుపుకునే పండగా గుడిపడ్వా) అంబరాన్ని అంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉగాది వేడుకలను కనులపండువగా నిర్వహించారు. ముఖ్యంగా హిందూ నూతన సంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు, ఇతర కార్యక్రమాల ద్వారా నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. మరాఠీ ప్రజలు ఉగాది పండుగ రోజును గుడిపడ్వాగా జరుపుకుంటారు. మరోవైపు ఈ సందర్భంగా తెలుగు ప్రజలు తమ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఉగాది పచ్చళ్లు తయారు చేయడంతో పాటు పంచాంగ శ్రవణ కార్యక్రమాలను ఏర్పాటు చేయగా మహారాష్ట్ర ప్రజలు తమ సంస్కృతి సంప్రదాయ పద్ధతుల్లో ఉగాది (గుడిపడ్వా)ను జరుపుకున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు గుడిపడ్వా రోజున ఓ కర్రకు రాగిచెంబును బోర్లించి దానిపై నూతన వస్త్రం, మామిడి కొమ్మలు, చక్కెర పాకంతో తయారు చేసే చక్కెర బిల్లల హారాలతో అలంకరిస్తారు. వాటిని ఇంటి ముందు, ఎత్తైన స్థలాల్లో కడతారు. ఇలా ఏర్పాటు చేసిన వాటిని ‘గుడి’లుగా పేర్కొంటారు. ఇలాంటి ‘గుడి’లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అదే విధంగా నూతన సంవత్సరానికి సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికారు. ముఖ్యంగా ముంబైలోని గిర్గావ్, థానే, డోంబివలి, పుణే, నాగ్పూర్లతో పాటు అనేక ప్రాంతాల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు శోభాయాత్రలు ఊరేగింపులు నిర్వహించారు. ఈ శోభాయాత్రలో సంగీత వాయిద్యాలు వాయించడంతోపాటు సంప్రదాయమైన దుస్తులు ధరించిన మహిళలు, పురుషులు నృత్యం చేశారు. అదే విధంగా ఈ యాత్రలలో బైకులు, అశ్వాలు కూడా కని్పంచాయి. మరోవైపు భారీ రంగోళి (ముగ్గులు)లు వేశారు. రథయాత్రల ద్వారా అనేక అంశాలపై సందేశాలిచ్చే ప్రయత్నం చేశారు. ముంబైలో... ముంబైలోని గిర్గావ్, దాదర్, కాందివలి తదితరాలతోపాటు అనేక ప్రాంతాల్లో శోభాయాత్రలు నిర్వహించారు. ముఖ్యంగా గిర్గావ్లో ఉదయం నిర్వహించిన శోభాయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. గిర్గావ్ శోభాయాత్రలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు బైకులు, బుల్ల్ట్లపై సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాలీ నిర్వహించారు. దాదర్‌లో సంప్రదాయ దుస్తులతో మహిళలు కత్తులను తిప్పుతూ చేసిన విన్యాసాలు అందిరినీ ఆకట్టుకున్నాయి. అలాగే ములూండ్‌లో కూడా ఈ సారి శోభాయాత్ర జరిగింది. థానేలో... థానేలో కౌపినేశ్వర్ ఆలయం ఆధ్వర్యంలో మాసుందా జలాశయం (తలావ్పాలి) వద్ద శనివారం రాత్రి దీపోత్సవం జరిగింది. దీన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు థానే, డోంబివలి ఫడ్కేరోడ్డుపై బైకుల ర్యాలీలతోపాటు బ్యాండు మేళాలతో శోభాయాత్ర జరిగింది. ముఖ్యంగా డోంబివలిలో అనేక సందేశాలతో ర్యాలీలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తుల కిటకిట.. ఉగాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పలు ప్రాంతాల్లో టపాసులు కాల్చి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఇదే తరహా ముంబై, థానే, డోంబివలి, పుణే, భివండీలతోపాటు రాష్ట్రంలోని మందిరాల్లో భక్తుల సందడి కని్పంచింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేవుళ్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబైలోని ముంబాదేవి ఆలయంతోపాటు అనేక ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
సాంస్కృతిక వటవృక్షం
నాగ్‌పూర్/బిలాస్పూర్: మహారాష్ట్ర నూతన సంవత్సర వేడుక గుడీ పడ్వా సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాగపూర్‌లో పర్యటించారు. అక్కడి ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. రెషీంబాగ్లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతిమందిర్కు వెళ్లారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరాం హెడ్గేవార్‌కు, సంస్థ రెండో సర్సంఘ్చాలక్ మాధవ్‌రావ్ సదాశివరావ్ గోల్వాల్కర్‌కు నివాళులర్పించారు. ఆరెస్సెస్ గొప్పదనాన్ని, సంస్థ నేతల కృషిని ప్రస్తుతిస్తూ సందర్శకుల పుస్తకంలో హిందీలో భావోద్వేగపూరితంగా నోట్ రాశారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో కలిసి సంస్థ పంచాంగ కార్యక్రమం (ప్రతిపద)లో పాల్గొన్నారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ఈ 11 ఏళ్లలో మోదీ ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సంస్థ సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ‘‘ఆరెస్సెస్ భారతదేశానికి సాంస్కృతిక వటవృక్షం వంటిది. జాతి ప్రయోజనాలే లక్ష్యంగా మన సంస్కృతిని, ఆధునికతను నిత్యం పరిరక్షిస్తోంది. ఇందుకోసం అసంఖ్యాకులైన ఆరెస్సెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిస్వార్థంగా కృషి చేస్తున్నారు. 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యంగా పురోగమిస్తున్న వేళ ఆరెస్సెస్ వందేళ్ల తపస్సు ఇప్పుడు ఫలాలందిస్తోంది. బానిస మనస్తత్వాన్ని, బానిస పాలన చిహ్నాలను, కాలం చెల్లిన చట్టాలను తొలగిస్తూ నూతన న్యాయసంహితతో భారత్ పురోగమిస్తోంది’’ అని మోదీ అన్నారు. మాధవ్ నేత్రాలయకు శంకుస్థాపన నాగపూర్‌లో మాధవ్ నేత్రాలయ ఇన్స్టిట్యూట్, రీసెర్చ్ సెంటర్‌కు అనుబంధంగా నిర్మించబోయే మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు మోదీ శంకుస్థాపన చేశారు. ఆరెస్సెస్ మాజీ చీఫ్ గోల్వాల్కర్‌కు గుర్తుగా ఈ నేత్రాలయను నిర్మించారు. ‘‘గోల్వాల్కర్ స్ఫూర్తితో ఈ నేత్రాలయం లక్షలాది మందికి కంటి బాధలను దూరంచేసింది. కొత్త ఆస్పత్రి కూడా కంటి సమస్యల బాధితులకు వెలుగులను పంచనుంది’’ అన్నారు. దీక్షాభూమిలో అంబేడ్కర్‌కు నివాళి నాగపూర్‌లో అంబేడ్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన చోట నిర్మించిన ‘దీక్షాభూమి’ని కూడా మోదీ సందర్శించారు. రాజ్యంగ నిర్మాతకు నివాళులర్పించారు. అక్కడి సందర్శకుల డైరీలో మోదీ రాశారు. భారత్‌ను సమ్మిళిత, అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకెళ్లడమే అంబేడ్కర్‌కు అసలైన నివాళి అన్నారు. తర్వాత నాగపూర్‌లోని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ ఆయుధాగారాన్ని ప్రధాని సందర్శించారు. అక్కడ మానవరహిత విహంగాల రన్‌వేను ప్రారంభించారు.కాంగ్రెస్ వల్లే నక్సలిజం ప్రబలింది ఛత్తీస్ పర్యటనలో మోదీ ధ్వజం కాంగ్రెస్ ప్రభుత్వాల విఫల విధానాల వల్లే ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల్లో నక్సలిజం ఊపందుకుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ‘‘బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఆయా రాష్ట్రాల్లో పెనుమార్పు మొదలైంది. నక్సల్స్ ప్రభావ ప్రాంతాల్లో శాంతి శకం ఆరంభమైంది’’ అని వ్యాఖ్యానించారు. ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లో రూ.33,700 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బిలాస్పూర్ జిల్లా మోహ్భాత్తా గ్రామంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ‘‘దేశాన్ని 60 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది? అభివృద్ధికి నోచుకోని జిల్లాలను పట్టించుకోవడం మానేసింది. వాటిని ‘వెనుకబడిన జిల్లాలు’గా ప్రకటించి చేతులు దులుపుకుంది. కాంగ్రెస్ విధానాల వల్లే ఛత్తీస్‌గఢ్ వంటి ఎన్నో రాష్ట్రాల్లో నక్సలిజం విజృంభించింది. అభివృద్ధి పడకేసింది. మావోయిస్టు హింసలో ఎంతోమంది తల్లులు కుమారులను కోల్పోయారు. నక్సలైట్ల బెడదతో అటవీ ప్రాంతాల్లో గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందలేదు. కాంగ్రెస్ పాలకులు వారినెప్పుడూ పట్టించుకోలేదు. మేమొచ్చాక స్వచ్్ఛ భారత్ అభియాన్, ఆయుష్మాన్ భారత్‌లతో ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్యసాయం అందిస్తున్నాం’’ అని మోదీ అన్నారు. ‘‘ఎవరికైనా ఆశ్రయం కల్పించడాన్ని భారత సంప్రదాయాల్లో గొప్పగా చెబుతారు. ఛత్తస్‌గఢ్‌లో ‘నవరాత్రి’ సందర్భంగా 3 లక్షల పేద కుటుంబాలు సొంతిళ్లలోకి మారుతున్నాయి. ప్రధాన్‌మంత్రి ఆవాస్యోజనతో లక్షలాది ఇళ్లు నిర్మించాం. ఫలితంగా ఆ ప్రాంతాల్లో ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. వాజ్‌పేయీ శతజయంతి వేడుకలు, ఛత్తీస్‌గఢ్ ఆవిర్భావ రజతోత్సవాలు ఈ ఏడాదే రావడం యాదృచి్ఛకం’’ అని మోదీ అన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల తర్వాత మోదీ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. -
చక్రవర్తులందరూ పన్నులను వడ్డించినవారే!
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ క్రూరుడూ, హిందూ వ్యతిరేకీ కాబట్టి, మహారాష్ట్రలో ఉన్న అతని సమాధిని తవ్వి తీసిపారెయ్యాలని డిమాండ్ చేస్తూ, నాగపూర్‌లో, వారం కిందట, కొన్ని హిందూ సంస్థలు సభలూ, నిరసన ప్రదర్శనలూ జరిపాయి. ఔరంగజేబు సమాధిని తీసెయ్యనక్కరలేదనీ, అతను అంతిమంగా మరాఠా ప్రజల చేతుల్లో ఓడిపోయాడు గనక, అతని సమాధి, మరాఠా ప్రజల వీరత్వానికి గుర్తుగా ఉంటుందని చీలిన శివసేనలోని ఒక పక్షం వాదన. తీసేస్తే తీసెయ్యండి, కానీ మహారాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టండి– అని కూడా ఒక విమర్శ. ఇటీవల వచ్చిన, హిందీ సినిమా ‘ఛావా’లో చూపించినట్టు... ఔరంగజేబు క్రూరుడు కాదనీ, ఎన్నో మంచిపనులు కూడా చేశాడనీ, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఒక ముస్లిం సభ్యుడు అన్నాడు. వివాదం పెరిగి పెద్దదై, నాగపూర్‌లో చిన్న స్థాయి మతకలహాల వంటివి జరిగి షాపులూ, ఇళ్ళూ, వాహనాలూ ధ్వంసం అయ్యాయి. 50మందికి గాయాలయ్యాయట! ఇంగ్లీషూ, హిందీ టీవీ చానళ్ళలో ఈ వివాదంపై చర్చలు చూపించారు. ఇదే సమయంలో ఛత్రపతి శివాజీ ఎంత గొప్ప ప్రజానుకూల చక్రవర్తో వాదించిన వారున్నారు. ఔరంగ జేబ్ సైన్యంలో కీలకమైన పదవుల్లో హిందూ సైనికాధి కారులున్నారని వాళ్ళ జాబితా ఇచ్చిన వారున్నారు. అలాగే, శివాజీ సైన్యంలో కూడా, అతనికి ఎంతో నమ్మకస్తులైన ముస్లిం ఉన్నత సైనికాధికారులున్నారని వాళ్ళ పేర్లు చెప్పారు. ఈ చర్చల్లో ముస్లిం చక్రవర్తుల్ని ప్రజా వ్యతిరేకులుగానూ, హిందూ చక్రవర్తుల్ని ప్రజలకు అనుకూలురుగానూ వాదించు కోవడమే ఎక్కువగా కనిపించింది. పత్రికల్లోగానీ, టీవీ డిబేట్లలో గానీ, అసలు ప్రపంచ చరిత్రలో చక్రవర్తులనేవారు, వాళ్ళు ఏ మతస్థులైనా, పాలకవర్గ ప్రతినిధులనీ, పాలకవర్గం ఎప్పుడూ ప్రజలకు అనుకూలంగా ఉండజాలదనీ వివరించే వర్గ సిద్ధాంత దృష్టితో ఒక్క మాటంటే ఒక్క మాట చెప్పిన వారు లేరు. ఆ దృష్టికోణాన్ని పట్టించుకోకపోతే, సత్యానికి కళ్ళు మూసినట్టవుతుంది. చక్రవర్తులంటే, అనేక చిన్నా పెద్దా భూభాగాల మీద పరిపాలన చేసే వాళ్ళు గదా? ఉదాహరణకి, ఔరంగజేబ్ (1618–1707) అయినా, శివాజీ (1630–1680) అయినా, చక్రవర్తులుగా విశాలమైన భూభాగాలను వారి కాలంలో పాలించారు. వారు ఎవరితో కలిసి ఎవరిని ఓడించారో, ఎన్నెన్ని ప్రాంతాలను ఆక్రమించారో, ‘ఆ ముట్టడికైన ఖర్చులూ, మతలబులూ, కైఫియతులూ’ ఇక్కడ చెప్పు కోలేము. అదంతా రకరకాల చరిత్ర పుస్తకాలలో దొరుకుతుంది. వారి ప్రభుత్వాలలో కూడా ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, సైనిక శాఖ, ఇతర అనేక రకాల శాఖలూ ఉన్నాయి. ఏకాలంలో అయినా, ఏ ప్రభుత్వమైనా పరిపాలన చెయ్యాలంటే, తప్పనిసరిగా కావలిసినవి పన్నులే. చరిత్రనించీ, మార్క్స్ గ్రహించి చెప్పినది ఇదే: ‘అధికార గణానికీ, సైన్యానికీ, మత గురువులకూ, కోర్టులకూ, క్లుప్తంగా చెప్పాలంటే, మొత్తం కార్యనిర్వాహక అధికార యంత్రాంగపు మనుగడకీ ఆధారం... రాజ్యానికి అందే పన్నులే! పన్నులు అంటే, ప్రభుత్వపు యంత్రాంగపు ఆర్థిక పునాది తప్ప, మరేమీ కాదు’. అయితే, పన్నులు ఏ పేర్లతో వచ్చినా, ఏ రూపంలో చెల్లించినా, వాటి మూలం ఎక్కడుంది? ఏ కాలం గురించి మనం మాట్లాడుతున్నామో, ఆ కాలానికి చెందిన శ్రామిక జనాల శ్రమలోనే ఉంది! అదెలాగో చూద్దాం. ఔరంగజేబు ప్రభుత్వమైనా, శివాజీ ప్రభుత్వమైనా ఆ కాలంలో రకరకాల పద్ధతుల్లో పన్నులు వసూలు చేసేవి. వసూళ్ళకు ఒక యంత్రాంగం ఉండడం తప్పనిసరి. మనం మాట్లాడుకుంటున్న ఇద్దరు చక్రవర్తులూ పన్నులు ఎవరి దగ్గర్నించి ప్రధానంగా వసూలు చేశారు? వ్యవసాయ రంగం నించీ. అలాగే, ఆనాటి పరిమితుల్లో ఉండిన పరిశ్రమలనించీ, సరుకులతో వ్యాపారం జరిపే వర్తకుల నించీ! అసలు, ఒక రాజ్యంలో ఉండే భూములు ఎవరి అధీనంలో ఉంటాయి? వ్యవసాయ రంగంలో పనిచేసేది ఎవరు? పంటలు పండించేది ఎవరు? (1) జమీందారులనీ, మిరాసీదారులనీ, రకరకాల పేర్లతో ఉండే పెద్ద భూస్వాములు. వీళ్ళసలు ఒళ్ళు వంచరు. అంతా కౌలు రైతులు ఇచ్చే కౌలు మీదే ఆధారపడతారు. ఏ శ్రమా చెయ్యకుండా, కౌలు రైతులనించి గుంజిన కౌలులో నించే, చక్రవర్తికి శిస్తుగానీ, కప్పం గానీ, రకరకాల పన్నులు గానీ కడతారు. (2) సొంత శ్రమల మీదే, ప్రధానంగా ఇంటిల్లిపాదీ, కష్టపడి జీవించే ‘స్వతంత్ర రైతులు’. వీళ్ళు కట్టే శిస్తులు గానీ, పన్నులు గానీ అన్నీ వీళ్ళ సొంత శ్రమ వల్లనే కడతారు. (3) సొంత శ్రమ మీదే కాక, కొంత ఇతరుల శ్రమల మీద కూడా ఆధార పడి జీవించే రైతులు వీళ్ళు. వీళ్ళు కట్టే పన్నులు కూడా, వీరి సొంత శ్రమలో నించీ కొంతా, ఇతరుల నించీ వచ్చిన అదనపు శ్రమ నించీ కొంతా. (4) వ్యవసాయ శ్రామికులు. వీళ్ళు లేకుండా వ్యవసాయంలో ఏ దశలోనూ, ఏ పనీ జరగదు. వీళ్ళని పనిలో పెట్టుకునే వారు, వారు పేద రైతులైనా, కొంత మెరుగైన స్థితిలో ఉన్న వారైనా, కౌలు రైతులైనా, ఈ కూలీల శ్రమ మీద ఆధారపడే వారే! వీళ్ళకి ‘కూలి’ అనేది డబ్బు రూపంలో ఇచ్చినా, ధాన్యం రూపంలో ఇచ్చినా, వాళ్ళకి అందేది వాళ్ళ శ్రమ శక్తి విలువే. మొత్తం శ్రమ విలువ కాదు. శ్రమ శక్తి విలువ అంటే, మర్నాడు వచ్చి పని చెయ్యడానికి శ్రామికులకి కావలిసిన జీవితావసరాలకు తగ్గ జీతం అన్నమాట. శ్రమ విలువ అంటే, తాము జీతం రూపంలో తీసుకునే విలువా, యజమాని లాభంగా మిగుల్చు కునే అదనపు విలువా కూడా కలిసినదే. వ్యవసాయ రంగం నించీ వచ్చే పన్నులు ఎక్కువ భాగం ఈ అదనపు విలువలో నించీ తీసి ఇచ్చేవే!ఆ కాలపు రెవెన్యూ చరిత్ర ప్రకారం, ఈ ఇద్దరు చక్రవర్తులకీ ప్రధానమైన ఆదాయం వ్యవసాయ రంగం నించే వచ్చేది. వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. ‘శిస్తు’ అనీ, ‘చౌత్’ అనీ, ‘జప్త్’ అనీ, ‘సర్దేశ్ ముఖీ’ అనీ, ఇంకేవో పేర్లు. అవన్నీ మనకి అనవసరం. భూమి వైశాల్యాన్ని బట్టో, సారాన్ని బట్టో, వచ్చిన పంట మొత్తాన్ని బట్టో కొంత భాగం పన్ను కట్టాలి. వీటిని చెల్లించే వారిని రైతులనీ, జమీందారులనీ, మిరాశీ దారులనీ, కౌల్దారులనీ... ఏ పేరుతో మనకి చెప్పినా, అసలు సంగతి కాయకష్టం చేసే రైతుల శ్రమని దోచడమే! ఈ ఆర్థిక సత్యాన్ని పట్టించుకోకుండా, ఈ చక్రవర్తి గొప్పా, ఆ చక్రవర్తి గొప్పా అనే తగువు అర్థం లేనిది. వ్యక్తిగత స్వభావాల్లో కొన్ని తేడాల వల్ల, కొందరు చక్రవర్తులు కొంత గంభీరంగానూ, కొందరు కొంత సాత్వికంగానూ, కొందరు కటువు గానూ, మరికొందరు కర్కశంగానూ, క్రూరంగానూ ఉంటారు. ‘ఏ రాయి అయితేనేమీ పళ్ళూడగొట్టుకోవడానికి?’ అనే నానుడిలో ఉన్న గొప్ప సత్యాన్ని అర్థం చేసుకుంటే... చక్రవర్తులందరూ శ్రమ దోపిడీదారులే! మనం మాట్లాడుకునే చక్రవర్తుల కాలంలో చిన్న స్థాయిలో అయినా రకరకాల పరిశ్రమలు ఉండేవి. వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడిగానీ, ఇతరత్రా గానీ సరుకులు తయారయ్యేవి. ఉప్పూ, దూదీ, దారం, నేతా, నూనెలూ, చర్మంతో తయారు చేసే వస్తువులూ, నివాసాల సామగ్రీ... ఇలా ఎన్నో రకాల పరిశ్రమలూ, వర్తకాలూ ఉండేవి. పరిశ్రమల యజమానులైనా, వర్తకులైనా, కట్టే పన్నులు, వాళ్ళ దగ్గిర పనిచేసే శ్రామికులు ఇచ్చే అదనపు విలువలోనించే తీసి కడతారు. అంటే, మళ్ళీ శ్రమ దోపిడీ ద్వారానే! ఈ విషయాలు ప్రజలు గమనంలో ఉంచుకుంటే మత ఘర్షణలు తలెత్తవు. ప్రజల అనైక్యత నుంచి ఎన్నికల ప్రయో జనం పొందాలని రాజకీయ పార్టీలు ప్రయత్నించడం గమనార్హం.బి.ఆర్. బాపూజీ వ్యాసకర్త హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవిశ్రాంత ఆచార్యులు -
హైకోర్టునే బురిడీ కొట్టించిన మాయగాడు
సొంత ఇంటికే కన్నమేసినట్లు.. తాను పని చేసే చోట దారుణమైన మోసానికి పాల్పడ్డాడు ఆ వ్యక్తి. కాస్త ఆలస్యంగానైనా పాపం పండడంతో కేసు నమోదు అయ్యింది. ఈలోపు హైకోర్టు అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే ఉన్నత న్యాయస్థానాన్ని సైతం బురిడీ కొట్టించిన అతని మోసం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముంబై: ఫోర్జరీ, కాపీ రైట్ ఉల్లంఘన కేసులో నిందితుడు ఏకంగా జడ్జి సంతకాన్నే ఫోర్జరీ చేశాడు. ఆ ఫేక్ కోర్టు ఆదేశాలతో హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ మీద ఎంచక్కా బయటకు వచ్చాడు. చివరకు.. ఆ మోసం బయటపడేలోపు పరారయ్యాడు. ఆ మాయగాడి వ్యవహారంపై బాంబే హైకోర్టు(Bombay High Court) భగ్గుమంది. కోర్టు ఆదేశాలతో పోలీసులు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పుణేకి చెందిన సీటీఆర్ మానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డిజైన్లను చెన్నైకు చెందిన ఓ కంపెనీ ఉపయోగించడంపై 2022లో ఫిర్యాదు దాఖలైంది. దర్యాప్తులో సీటీఆర్‌లో పని చేసే ఉద్యోగులే ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది. సీటీఆర్ ఉద్యోగులు.. మాజీ ఉద్యోగులు కొందరి మీద విమంతల్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. 2016-2017 పని చేసిన హరిబావు చెంటే కూడా నిందితుల జాబితాలో ఉన్నాడు. అతనిపై ఫోర్జరీ, కాపీ రైట్ ఉల్లంఘన అభియోగాలున్నాయి.అయితే.. ముందస్తు బెయిల్ కోసం హరిబావు పుణే జిల్లా కోర్టును ఆశ్రయించగా.. అతనికి చుక్కెదురైంది. దీంతో బాంబే హైకోర్టులో ఓ పిటిషన్ వేశాడు. ఈ క్రమంలో పుణే కోర్టు జడ్జి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ కోర్టు ఆదేశాలను సృష్టించాడు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 169 ప్రకారం.. నిందితుడి మీద అభియోగాలకు సంబంధించి సరైన ఆధారాలు లేకుంటే న్యాయ విచారణ లేకుండా విడుదల చేయొచ్చు. దీన్ని ఆసరాగా చేసుకుని పుణేకు చెందిన ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సంతకాన్ని చెంటే ఫోర్జరీ చేశాడు. ఆ నకిలీ ఆదేశాలకు హైకోర్టుకు సమర్పించి.. ఈ ఏడాది జనవరి 17వ తేదీన బెయిల్ పొందాడు. అయితే..ఈ వ్యవహారంపై అనుమానంతో సీటీఆర్ కంపెనీ విమంతల్ పోలీసులను ఆశ్రయించింది. వాళ్లు ఈ విషయాన్ని ఇటు పుణే కోర్టు.. అటు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హరిబావు సమర్పించిన కోర్టు ఆదేశాలు రాతపూర్వకంగా ఉండడంతో హైకోర్టు పరిశీలన జరిపింది. జడ్జి సంతకం ఫోర్జరీ, నకిలీ ఆదేశాలు బెయిల్ పొందినట్లు తేలడంతో హైకోర్టు తీవ్రంగా భావించింది. అతని బెయిల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. అతనిపై మరో కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న హరిబావు చెంటే కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
30న నాగపూర్‌కు మోదీ
నాగపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 30వ తేదీన మహారాష్ట్రలోని నాగపూర్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవర్ స్మారకాన్ని ఆయన సందర్శిస్తారు. అలాగే మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. హెడ్గేవర్‌తోపాటు ఆర్ఎస్ఎస్ రెండో సర్సంఘ్చాలక్ ఎం.ఎస్.గోల్వాల్కర్ స్మారకాలను నాగపూర్‌లో రేషిమ్‌బాగ్ ప్రాంతంలోని డాక్టర్ హెడ్గేవర్ స్మృతి మందిర్‌లో నిర్మించారు. ఇరువురు నేతల స్మారకాలను ప్రధాని మోదీ సందర్శించి, నివాళులరి్పస్తారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే గురువారం వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1956లో వేలాది మంది దళితులతో కలిసి బౌద్ధ దీక్ష స్వీకరించిన పవిత్ర స్థలమైన దీక్షాభూమిని, సోలార్ ఎక్స్‌ప్లోజివ్స్ ప్లాంట్‌ను కూడా మోదీ సందర్శిస్తారని తెలిపారు. 6న పంబన్ వంతెన జాతికి అంకితం శ్రీరామనవమి సందర్భంగా మోదీ ఏప్రిల్ 6వ తేదీన తమిళనాడులో రామేశ్వరంలోని రామనాథ స్వామి మందిరాన్ని దర్శించుకోనున్నారు. అలాగే నూతనంగా నిర్మించిన పంబన్ రైల్వే వంతెనను లాంఛనంగా ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. ఇది ఆసియా ఖండంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి కావడం విశేషం. 2.5 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం దీవితో అనుసంధానిస్తుంది. గతంలో ఇక్కడున్న పాత వంతెనపై రైలు ప్రయాణానికి 30 నిమిషాల సమయం పట్టేది. కొత్త వంతెనతో కేవలం 5 నిమిషాల్లోనే రామేశ్వరం దీవికి చేరుకోవచ్చు. -
భార్యను ముక్కలు చేసి.. సూట్‌కేసులో కుక్కి..
సాక్షి, బెంగళూరు: జీవిత భాగస్వామిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరకడం వంటి కిరాతక నేరాలు దేశంలో అక్కడక్కడా జరుగుతున్నాయి. అలాంటి ఘోరం బెంగళూరులోనూ చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి ముక్కలుగా ఖండించి సూట్‌కేసులో పెట్టి పారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులోని హుళిమావు పరిధిలోని దొడ్డకమ్మనహళ్లిలో జరిగింది.రెండేళ్ల కిందటే పెళ్లి.. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ (37) అనే వ్యక్తి తన భార్య గౌరి సాంబేకర్ (32)ను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి సూట్‌కేసులో నింపేశాడు. రెండేళ్ల క్రితం రాకేశ్, గౌరికి వివాహం జరిగింది. నెల రోజుల క్రితమే దొడ్డకమ్మనహళ్లిలోని ఇంటికి మారారు. ఇద్దరు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగులు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కింద ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటున్నారు... గురువారం ఏం జరిగిందో కానీ హత్య చేసి, మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన గౌరి తల్లిదండ్రులు తమ ఊళ్లోని సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమాచారమిచ్చారు. ఆ పోలీసులు వెంటనే హుళిమావు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఇంటికి వెళ్లి తాళాలు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బాత్రూంలో సూట్‌కేసులో గౌరి మృతదేహం ముక్కలై కనిపించడంతో కంగుతిన్నారు. ఆమె హత్యకు ఇంకా కారణాలు తెలియరాలేదు. నిందితుడు రాకేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆగ్నేయ డీసీపీ సారా ఫాతిమా, క్లూస్ టీం చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. -
భార్య అలా బెదిరించినా సరే విడాకులు తీసుకోవచ్చు!
విడాకులు తీసుకోవడానికి సంబంధిత చట్టాలు.. అందులోని సెక్షన్లు కారణాలేంటన్నదానిపై స్పష్టత ఇచ్చాయి. అయితే సందర్భం దొరికినప్పుడల్లా ఆ సెక్షన్ల విస్తృత పరిధిపై తమ తీర్పులు.. ఆదేశాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటాయి న్యాయస్థానాలు. ఈ క్రమంలోనే తాజాగా విడాకులకు సంబంధించిన బాంబే హైకోర్టు ఓ సంచలన తీర్పు వెల్లడించింది.ముంబై: జీవిత భాగస్వామి ఇద్దరిలో ఎవరైనా సరే బలవన్మరణానికి పాల్పడతానని బెదిరించినా.. లేదంటే అలాంటి ప్రయత్నం చేసినా.. అది హింస కిందకే వస్తుందని, హిందూ వివాహ చట్టం, 1955 లోని సెక్షన్ 13(1)(ia) ప్రకారం విడాకులు మంజూరు చేయొచ్చని బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది.తన భార్య ఆత్మహత్య చేసుకుంటానంటోందని.. తనను,తన కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని బెదిరిస్తోందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఇక ఆమెతో కలిసి కాపురం చేయలేనని.. తనకు విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టును కోరాడు. అక్కడి అతనికి ఊరట దక్కగా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది.ఆమె కేవలం తాను చనిపోయి భర్త కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని మాత్రమే బెదిరించడం లేదు.. బలవన్మరణానికి పాల్పడతానని చెబుతోంది కూడా. జీవిత భాగస్వాముల్లో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే అది అవతలి వాళ్లను హింసించడమే అవుతుంది. కాబట్టి విడాకులు మంజూరు చేయొచ్చు అని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ న్యాయమూర్తి ఆర్ఎం జోషి తీర్పు వెల్లడించారు.మహారాష్ట్రకు చెందిన సదరు వ్యక్తికి 2009లో వివాహం జరిగింది. ఆ జంటకు ఓ పాప. అయితే భార్య తరఫు బంధువుల రాకతో తమ కాపురం కుప్పకూలిందని విడాకుల పిటిషన్లో పేర్కొన్నాడతను. గర్భంతో ఉన్న భార్య తనను వీడి వెళ్లిపోయిందని.. అప్పటి నుంచి తిరిగి రాలేదు. అయితే కొంతకాలం తర్వాత తప్పుడు కేసులతో ఆమె అతన్ని బెదిరించసాగింది. ఈ క్రమంలోనే సూసైడ్ చేసుకుని.. ఆ నేరాన్ని భర్త కుటుంబంపై నెట్టేస్తానని బెదిరించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలను కోర్టుకు సమర్పించిన భర్త చివరకు ఫ్యామిలీ కోర్టు నుంచి కిందటి నెలలో విడాకులు పొందగలిగాడు. భార్య ఆ తీర్పును సవాల్ చేయగా.. బాంబే హైకోర్టు తాజాగా ఆ తీర్పును సమర్థించింది. -
కునాల్ కమ్రాకు ముంబై పోలీసుల ఝలక్
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే(Eknath Shinde)పై పేరడీ పేరిట కామెంట్లు చేసిన కేసులో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు ముంబై పోలీసులు ఝలక్ ఇచ్చారు. తనకు ప్రాణహాని ఉందని.. విచారణకు హాజరయ్యేందుకు కాస్త గడువు ఇవ్వాలని కునాల్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు.షిండే పరువుకు భంగం కలిగించారనే ప్రధాన అభియోగంతో పాటు మరికొన్నింటిని కమ్రాపై ముంబై పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన మార్చి 31వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే.. ఒకవైపు ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో ఉన్న కునాల్ కమ్రా(Kunal Kamra).. మరోవైపు తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ గడువు పొడిగింపు కోరాడు. ఏప్రిల్ 3వ తేదీన విచారణకు హాజరవుతానని విజ్ఞప్తి చేశాడు. కానీ, పోలీసులు అందుకు అంగీకరించలేదు.ముంబైలోని హాబిటాట్ స్టూడియో(Habitat Studio)లో జరిగిన ఈవెంట్లో కునాల్ కమ్రా ప్రదర్శన ఇచ్చాడు. ఈ క్రమంలో ఏక్నాథ్ షిండేను ద్రోహిగా వర్ణించడంతో షిండే శివసేన యువ విభాగం భగ్గుమంది. కునాల్‌కు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగింది. అదే టైంలో.. హాబిటాట్ స్టూడియోపై దాడికి దిగి విధ్వంసానికి పాల్పడింది. ఈ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వెంటనే బెయిల్ లభించింది.షిండేపై కునాల్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో సహా కూటమి ప్రభుత్వ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. థాక్రే శివసేన, ఎస్పీ పార్టీలు కునాల్‌కు మద్ధతుగా నిలిచాయి. షిండేకు క్షమాపణలు చెప్పాలంటూ సీఎం ఫడ్నవిస్ కోరగా.. అందుకు కునాల్ నిరాకరించాడు. కోర్టు కోరితేనే క్షమాపణలు చెబుతానంటూ తెగేసి చెప్పాడు. మరోవైపు కునాల్ వ్యంగ్యాన్ని తాను అర్థం చేసుకోగలనంటూనే.. దేనికైనా పరిమితి ఉంటుందంటూ షిండే మండిపడ్డారు. అదే టైంలో స్టూడియోపై తన పార్టీ విభాగం జరిపిన దాడిని ఖండిస్తూ.. చర్యకు ప్రతిచర్య ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.ఈలోపు.. శివసేన(షిండే) ఎమ్మెల్యే ముర్జి పటేల్ ఫిర్యాదుతో మంబై పోలీసులు కునాల్ కమ్రాపై కేసు నమోదు చేసి విచారణకు రావాలంటూ నోటీసులు పంపించారు. -
హవా హవాయీ!.. నిర్మలా సీతారామన్ టార్గెట్‌గా కునాల్ కమ్రా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై వ్యంగ్య కామెడీతో వివాదానికి కేంద్ర బిందువుగా మారిన స్టాండప్ కమేడియన్ కునాల్ కమ్రా తాజాగా మరో వివాదానికి తెర తీశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను, ఆమె ఆర్థిక విధానాలను విమర్శిస్తూ సూపర్ హిట్ హిందీ సినిమా ‘మిస్టర్ ఇండియా’లోని ఐకానిక్ పాట ‘హవా హవాయీ’ని పేరడీ చేశారు. ‘ఆప్ కా ట్యాక్స్ కా పైసా హో రహా హవా హవాయీ (జనాలు కట్టే పన్నుల డబ్బులు గోల్మాల్ అవుతున్నాయి)’అంటూ బుధవారం విడుదల చేసిన వీడియోలో చెణుకులు విసిరారు.తాజాగా కునాల్ కమ్రాన్.. ‘ట్రాఫిక్ బఢానే ఏ హై ఆయీ, బ్రిడ్జెస్ గిరానే ఏ హై ఆయీ, కెహతే ఇస్ కో తానాషాహీ (అది ఉన్నదే ట్రాఫిక్ కష్టాలు పెంచేందుకు, బ్రిడ్జిలను కూలగొట్టేందుకు. నియంతృత్వం అంటారు దాన్ని)’ అంటూ అధికార బీజేపీ తీరుపైనా వ్యంగ్యా్రస్తాలు సంధించారు. అయితే తమ పాటను అనుమతి లేకుండా వాడుకోవడం ద్వారా కామ్రా కాపీరైట్‌ను ఉల్లంఘించారని టీ సిరీస్ ఆరోపించింది. ఈ క్రమంలోనే తాజా పేరడీని యూట్యూబ్‌లో బ్లాక్ చేయించింది. దీన్ని కామ్రా తీవ్రంగా తప్పుబట్టారు. మరోవైపు షిండే ఉదంతంలో విచారణకు హాజరయ్యేందుకు వారం గడువు కావాలన్న కామ్రా విజ్ఞప్తిని ముంబై పోలీసులు తిరస్కరించారు. తక్షణం విచారణకు రావాలంటూ రెండోసారి సమన్లు జారీ చేశారు. బుధవారం ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను టార్గెట్ చేసిన కునాల్ కమ్రా.. క్లబ్లో ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. షిండేను దోశద్రోహి అంటూ విమర్శిస్తూ పేరడి పాట పాడారు. దీంతో, శివసేన కార్యకర్తలు ఆగ్రహంతో క్లబ్‌పై దాడిపై చేశారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. The video has been blocked from YouTube by T-Series due to copyright.So before deleting the video from X, watch it yourself and share it with others to see it.#kunalkamra pic.twitter.com/pCZ67v6zmX— Dhruv Rathee (Parody) (@DhruvRatheeIN) March 26, 2025 -
శివసేన టార్గెట్‌గా కునాల్ కమ్రా వీడియో
ముంబై: నగరంలోని హబిటాట్ స్టూడియోను శివసేనకు చెందిన కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా(Kunal Kamra).. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. తన స్టూడియోను శివసేన సేనకు చెందిన కొంతమంది ఎలా ధ్వంసం చేశారో చూపిస్తూ తన యూట్యూబ్ చానల్ లో వీడియోను పోస్ట్ చేశారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యానించిన తర్వాత కునాల్ కమ్రా.. ఈ వీడియోను ప్రజల్లోకి తీసుకొచ్చాడు.కునాల్ కమ్రాకు షోలు చేసే ముంబైలోని హాబిటాట్ స్టూడియోను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి ఒక వర్గానికి చెందిన వ్యక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్టూడియోపై విరుచుకుపడ్డారు.మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై కమ్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జరిగిన పరిణామాల నేపధ్యంలో శివసేన కార్యకర్తలు స్టూడియోపై దాడిచేయడం, ఆ తరువాత ముందస్తు నోటీసు లేకుండా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేతలకు పాల్పడింది. ఇదిలా ఉండగా, షిండేపై చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎమ్మెల్యే ముర్జి పటేల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కునాల్ కమ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
ప్రజాప్రతినిధులు లేని పాలన ఇంకెన్నాళ్లు?
సాక్షి, ముంబై: దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని కలిగిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)కు గత మూడేళ్లుగా ఎన్నికలు జరగలేదు. దీంతో మూడేళ్లుగా ప్రజాప్రతినిధులు లేకుండానే మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిపాలన కార్యకలాపాలు జరుగుతున్నాయి. రాజకీయ పరిణామాల రీత్యా...వాయిదా 2022, మార్చి 7న మున్సిపల్ కార్పొరేటర్ల పదవీకాలం ముగిసింది. వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగా వాయిదాపడుతూ వచ్చాయి. గత మూడేళ్లలో, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలన బాధ్యతలను మొదట ఇక్బాల్ సింగ్ చాహల్ ఆ తరువాత భూషణ్ గగ్రానీ స్వీకరించారు. ఈ మూడేళ్లలో వీరిద్దరూ మున్సిపల్ కమిషనర్లు స్వయంగా మూడు బడ్జెట్లను సమర్పించారు. ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా నగరానికి అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టారు. మున్సిపల్ ఎన్నికలు జరగకపోయినా మూడేళ్ల వ్యవధిలో రూ.6,000 కోట్ల విలువైన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నలిచ్చారు. ముఖ్యంగా రోడ్లు, మురుగునీటి శుద్ధి, డీశాలినేషన్ ప్రాజెక్టులు, దహిసర్–భయందర్ లింక్ రోడ్డులకు అనుమతులు మంజూరుచేశారు. ప్రభుత్వ అప్పుల పెరుగుదల.... 2024–25 ఆరి్థక సంవత్సరానికి మున్సిపల్ కార్పొరేషన్ అప్పులు రూ.1.90 లక్షల కోట్లుగా తేలింది. తాజా లెక్కల ప్రకారం, ఈ సంఖ్య రూ.2,32 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో, బడ్జెట్ వ్యయంపై బహిరంగ చర్చ జరగలేదు. కమిషనర్లు పరిపాలించడమేమిటి? కమిషనర్ల ఆధ్వర్యంలో బీఎంసీ పరిపాలన జరగడమేమిటంటూ విపక్ష పారీ్టలు విమర్శిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు లేని పాలన ప్రజాస్వామిక విధానాలకు విరుద్ధమని, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా కీలక నిర్ణయాలు అమల వుతున్నాయని ఆరోపిస్తున్నాయి. మున్సిపల్ పాలనలో పారదర్శకత లేదని, పెద్ద మొత్తంలో నిధులు ఖర్చవుతున్నాయని మండిపడుతున్నాయి. మరో 6–7 నెలల తర్వాతే! ప్రస్తుత పరిస్థితి దృష్యా ఎన్నికలు మరో 6-7 నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 1984లో అప్పటి కమిషనర్ డి.ఎం.సుక్తాంకర్ కార్యనిర్వాహక పాలన తర్వాత మళ్లీ 38 ఏళ్లకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులు లేకుండా పాలన జరుగుతోంది. అయితే ఈసారి ఇది మరింత ఎక్కువ కాలం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నగర అభివృద్ధి, ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని త్వరలో ఎన్నికలు నిర్వహించాలని పలువురు నాయకులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
E Shinde: ముమ్మాటికీ పొలిటికల్ సుపారీనే!
ముంబై: ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై శివసేన అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. కునాల్ ఆ వ్యాఖ్యలు వ్యంగ్యంగానే చేసినట్లు తాను అర్థం చేసుకోగలనని.. కానీ ప్రతిదానికి ఓ హద్దు ఉంటుందని అన్నారాయన. ఈ క్రమంలో సంచలన ఆరోపణలకు దిగారు.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు స్టాండప్ కమెడియన్ కునాల్. ఈ నేపథ్యంలో ఆ షో జరిగిన హబిటాట్ స్టూడియోపై షిండే వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అయితే అది ఎవరైనా సరే విధ్వంసానికి తన మద్దతు ఎప్పుడూ ఉండబోదని ఏక్నాథ్ షిండే అన్నారు. బీబీసీ మరాఠీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కునాల్ ఎపిసోడ్‌పై స్పందించారు.ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం అందరికీ ఉంటుంది. దీనిని కాదనలేం. నా సంగతి పక్కన పెట్టండి. ప్రధాని మోదీ, భారత మాజీ న్యాయమూర్తి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షా..వీళ్ల గురించే కాదు ప్రముఖ వ్యాపారులు, గొప్ప గొప్పవాళ్ల గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడాడతను. ఇలాంటి వ్యాఖ్యల కోసం అతనికి ఎవరి నుంచి సుపారీ అందింది?. ఇది కచ్చితంగా రాజకీయ ప్రత్యర్థుల కుట్రే అని అన్నారాయన. ఈ వ్యవహారంలో ప్రజలు కూడా ప్రతిపక్షాలనే వేలెత్తి చూపిస్తున్నారని.. అయినా వాళ్ల విధానాలు మారడం లేదన్నారు. ఇక హబిటాట్ స్టూడియోపై జరిగిన దాడిని ఖండించిన షిండే.. అది కార్యకర్తల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ‘‘ఏక్నాథ్ షిండే అనేది చాలా సున్నితమైన అంశం. నాపై ఎన్నో ఆరోపణలు వస్తుంటాయి. కానీ, నేను నా పనితోనే వాటికి బదులిస్తుంటా. విధ్వంసానికి నేను వ్యతిరేకం. కానీ, పార్టీ కార్యకర్తలు ఊరుకోలేరు కదా. చర్యకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
అస్సలు పశ్చాత్తాప పడను.. షిండేపై వ్యాఖ్యల కేసులో కునాల్ కమ్రా
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే(Eknath Shinde)ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యల దుమారం తర్వాత ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా(kunal kamra) తొలిసారి స్పందించారు. షిండేపై వ్యాఖ్యలను సమర్థించుకున్న కునాల్, ఈ వ్యహారంలో తాను క్షమాపణలు చెప్పాల్సి వస్తే.. అంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న కమ్రాను ముంబై పోలీసులు సంప్రదించినట్లు సమాచారం. అయితే.. షిండేపై చేసిన వ్యాఖ్యలకు తానేమీ పశ్చాత్తాపం చెందడం లేదన్న కునాల్ కమ్రా.. తన వెనుక ఎవరో ఉన్నారన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. షిండే రాజకీయ ప్రత్యర్థులు డబ్బులు ఇచ్చి తనతో ఇలా మాట్లాడించారన్నదాంట్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన ముంబై పోలీసులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవసరమైతే తన ఆర్థిక లావాదేవీలను పరిశీలించేందుకు పోలీసులకు ఆయన అనుమతి ఇచ్చినట్లు సమాచారం.ఇక.. కునాల్ కమ్రా తక్షణమే షిండేకు క్షమాపణలు చెప్పాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన హెచ్చరికలపైనా కమ్రా స్పందించారు. తాను కేవలం న్యాయస్థానాలు కోరినప్పుడు మాత్రమే క్షమాపణలు చెబుతానని ముంబై పోలీసులకు తేల్చి చెప్పాడట. ఈ మేరకు ఓ జాతీయ మీడియా ఈ వివరాలతో కథనం ఇచ్చింది.ఇదిలా ఉంటే.. ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వ్యాఖ్యలతో ది యూనికాంటినెంటల్ హోటల్లోని హాబిటాట్ క్లబ్‌కు కష్టాలు మొదలయ్యాయి. అందులో అక్రమ కట్టడాలు ఉంటున్నాయంటూ బీఎంసీ (బృహన్ ముంబయి కార్పొరేషన్) ఉద్యోగులు ఖార్ వద్దకు చేరుకొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నైక్ మాట్లాడుతూ ఖార్లోని ఆ స్టూడియో అక్రమ నిర్మాణమని.. చర్యలు తీసుకోవాలని ముంబయి కమిషనర్‌ను కోరినట్లు వెల్లడించారు. అయితే ఇది రాజకీయ నిర్ణయం కాదంటూ ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. తాజా పరిణామాలపై అసిస్టెంట్ కమిషనర్ వినాయక్ విస్పుటే మాట్లాడుతూ ‘‘స్టూడియో యజమాని కొన్ని అక్రమ షెడ్లను నిర్మించారు. వాటిని ఇప్పుడు మేము తొలగిస్తున్నాం. వీటికి నోటీసులతో పనిలేదు’’ అని వెల్లడించారు. అసలు స్టూడియో ప్లాన్‌ను కూడా పరిశీలించి చర్యలు తీసుకొంటామని తెలిపారు.#WATCH | Mumbai: BMC officials arrive at Unicontinental Studio in Khar area of Mumbai. The officials have arrived here with hammers. Details awaited. pic.twitter.com/dLb1O2z3uT— ANI (@ANI) March 24, 2025ఇటీవల హబిటాట్ స్టూడియో(Habitat Club)లో జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందేపై కునాల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ద్రోహితో పోల్చాడు. ఈ సందర్భంగా ‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు. దీంతో శివసేన షిండే వర్గం కునాల్‌పై భగ్గుమంది. ఆ పార్టీ కార్యకర్తలు ఆ స్టూడియోపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో 12 మందిని అరెస్టు చేశారు. మరోవైపు పోలీసులు సోమవారం కునాల్‌పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని ఇప్పటికే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చిచెప్పారు. ఇంకోవైపు.. థాక్రే శివసేన సహా పలు రాజకీయ పార్టీలు కునాల్‌కు మద్దతుగా నిలుస్తుండడం గమనార్హం.This is full length 45 minutes video of Kunal Kamra which has shaken the roots of right wing 🔥He has spoken facts with wit and satire which BJP can't digest. WATCH & SHARE BEFORE IT GETS BANNED ON YOUTUBE 🧵 pic.twitter.com/GNEs7gef6w— Amock_ (@Amockx2022) March 24, 2025 -
ఏక్నాథ్ షిండేపై అనుచిత వ్యాఖ్యలు.. కమెడియన్ కునాల్‌కు బిగ్ షాక్
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. మరోవైపు.. శివసేన నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కమెడియన్ కమ్రాపై కేసు నమోదు చేశారు. క్రమాపై వ్యాఖ్యలను సీఎం ఫడ్నవీస్, మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తప్పుబట్టారు.ఈ ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ..‘కునాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఏకానాథ్ షిండేపై చేసిన వ్యాఖ్యలకు గాను కునాల్ కమ్రా క్షమాపణలు చెప్పాల్సిందే. నేను కామెడీకి వ్యతిరేకంగా కాదు.. కానీ, కామెడీ పేరుతో ఒకరిని అగౌరవ పరచడం సరికాదు. డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఇలా మాట్లాడాల్సింది కాదు. రాజ్యాంగం మనకు స్వేచ్ఛను ఇస్తుంది. అలా అని మీరు ఇతరుల స్వేచ్చను భంగపరచకూడదు. దానికి పరిమితులు ఉన్నాయి. అలా మాట్లాడి మీ తప్పును మీరు సమర్థించుకోలేరు’ అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ..‘రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించకూడదు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు కట్టుబడి మాట్లాడాలి. చట్టం పరిధి దాటి వ్యవహరించకూడదు అంటూ వ్యాఖ్యలు చేశారు.This part was so hilarious 😂#kunalkamra @kunalkamra88 pic.twitter.com/zJ74DODgoO— ɱąŋʑʂ ☘️🍉 (@TheManzs007) March 23, 2025ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ఉద్దేశిస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఖార్ ప్రాంతంలోని ది యూనికాంటినెంటల్ హోటల్లోని హాబిటాట్ కామెడీ క్లబ్లో కునాల్ కమ్రా (Kunal Kamra) షో జరిగింది. ఇందులో కుమ్రా.. డిప్యూటీ సీఎంను ఉద్దేశిస్తూ ఓ జోక్ వేశారు. ‘శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది. అంతా గందరగోళంగా ఉందన్నారు. ఏక్నాథ్ షిండేను ద్రోహిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు. దీంతో, కమెడియన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేసిన శివసేన కార్యకర్తలు.. ఆదివారం రాత్రి షో జరిగిన హోటల్‌పై దాడి చేశారు. హోటల్లోని ఫర్నీచర్‌ు ధ్వంసం చేశారు. కమ్రా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. కమెడియన్ వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కమ్రాపై కేసు నమోదు చేశారు. Kunal Kamra's Joke On Eknath Shinde । FIR Lodge Against Kamra । #kunalkamra #eknathshinde #gaddar #Trending #Mumbai pic.twitter.com/U8RfKqSwbQ— Magadh Talks (@MagadhTalks) March 24, 2025 -
శ్రీశైలం : కర్ణాటక,మహారాష్ట్రాల నుంచి పాదయాత్రగా వేలాది భక్తులు (ఫొటోలు)
-
డిప్యూటీ సీఎం షిండేపై అనుచిత వ్యాఖ్యలు.. శివసేన కార్యకర్తల దాడి
ముంబై: మహారాష్ట్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై కమెడియన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో, ఆగ్రహానికి లోనైన శివసేన కార్యకర్తలు ఓ క్లబ్‌పై దాడి చేశారు. సదరు కమెడియన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని శివసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్ర ఖార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ‘ది యూనికాంటినెంటల్ క్లబ్’ లో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమెడియన్ కునాల్ కమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం, శివసేన నాయకులు ఏక్నాథ్ షిండేను టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే ఏక్నాథ్ షిండేను దేశద్రోహిగా అభివర్ణించారు. షోలో కునాల్.. ‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటను మార్చి పాడారు. 2022లో ఉద్దవ్ థాక్రేకు వెన్నుపోటుకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. దీంతో, శివసేన కార్యకర్తలు ెద్ద సంఖ్యలో ‘ది యూనికాంటినెంటల్ క్లబ్’ వద్దకు చేరుకున్నారు. అనంతరం, క్లబ్‌పై దాడి చేశారు.అనంతరం, కమెడియన్ కునాల్ కమ్రాను అరెస్ట్ చేయాలని శివసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కునాల్‌పై ఫిర్యాదు చేయడానికి పార్టీ సభ్యులు ఖార్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్బంగా శివసేన నేతలు మాట్లాడుతూ.. ఉద్దవ్ థాక్రే నుంచి డబ్బులు తీసుకుని కునాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.Kunal Kamra's stage where he performed has been vandalised by Eknath Shinde's men. His MP is threatening Kunal Kamra. FIRs will be filed on him soonReason : This Video. Please don't watch & make it viral, Eknath Shinde won't not like it. pic.twitter.com/r6oyuV770C— Roshan Rai (@RoshanKrRaii) March 23, 2025మరోవైపు.. ఈ ఘటనపై మాజీ మంత్రి, ఉద్దవ్‌థాక్రే కుమారుడు ఆధిత్య థాక్రే స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆధిత్య థాక్రే.. కునాల్ కమ్రాపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. ఏక్నాథ్ షిండేపై అతడు చేసిన వ్యాఖ్యలు వంద శాతం నిజం. అభద్రతాభావం ఉన్న వ్యక్తులే, పిరికివాళ్లు మాత్రమే ఇలాంటి దాడులు చేస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో తెలుసా?. ముఖ్యమంత్రి, హోంమంత్రిని అణగదొక్కడానికి ఏక్నాథ్ షిండే చేసిన మరో ప్రయత్నం ఇది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.Mindhe’s coward gang breaks the comedy show stage where comedian @kunalkamra88 put out a song on eknath mindhe which was 100% true.Only an insecure coward would react to a song by someone. Btw law and order in the state? Another attempt to undermine the CM and Home Minister…— Aaditya Thackeray (@AUThackeray) March 23, 2025 -
నాన్నా.. నేనేం నేరం చేశాను..!
నాన్న.. పిల్లలకు కంటి రెప్ప, నాన్న.. పిల్లల భవిష్యత్ కు భరోసా, నాన్న..పిల్లలకు నడత నేర్పించే మార్గదర్శి.. అన్నింటీకి మించి నాన్న అంటే వెనుక ఉండి నడిపించే శక్తి. మరి అటువంటి నాన్న అత్యంత కర్కశంగా తన బిడ్డను చంపేసుకుంటే ఏమనాలి. రాక్షసుడు అనే పదం సరిపోదేమో. నాన్నే తన పాలిట రాక్షసుడై జీవితాన్నే ఛిదిమేస్తే.. ఆ నరక యాతన ఎంతలా ఉంటుంది. ‘నాన్నా.. నేనేం నేరం చేశాను’ అని అసువులు బాసేముందు మూగరోదన తప్ప.ఈ తరహా ఘటనలు ఎన్నో ప్రతీ రోజూ ఏదొకటి మనకు తారసపడుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పుణెలో తన కన్న కొడుకునే పొట్టబెట్టుకున్నాడు తండ్రి.. అభం శుభం తెలియని మూడున్నరేళ్ల చిన్నారి బాలుడిని దారుణంగా చంపేశాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్న ఆ తండ్రి.. ఆ బాలుడి పాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానంతో కొడుకును హత్య చేశాడు. అతి దారుణంగా హత్య..ఆ బాలుడి గొంతును కోసేసి, ఆ తర్వాత అటవీ ప్రాంతంలో పడేశాడు కర్కశ తండ్రి. మాధవ్ తికేతీ, స్వప్నాలకు హిమ్మాత్ మాధవ్ ఒకే ఒక్క కొడుకు. ఎంతో గారంగా పెరగాల్సిన ఆ చిన్నారి.. తల్లి దండ్రుల మనస్పర్థలకు బలయ్యాడు. ఒకవైపు భార్యపై అనుమానం పెంచుకున్నాడు మాధవ్ తికేతి. ఇదే విషయంలో వీరిద్దరికి తీవ్రమైన ఘర్షణ ఈ గురువారం జరిగింది. దాంతో కొడుకును తీసుకుని వెళ్లిపోయాడు మాధవ్ తికేతి. అయితే తిరిగిరాలేదు. కొడుకును హత్య చేసి పుణేలోని చందాన్ నగర్ ఫారెస్ట్ ఏరియాలో పడేశాడు. భర్త, కొడుకును తీసుకుని వెళ్లి ఇంకా తిరిగి రాలేదని భార్య స్వప్ప ఆందోళన చెందింది. పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ పసిబాలుడు హత్యకు గురైనట్లు గుర్తించారు.హత్య చేసిన రోజు’(గురువారం) ఇంటి నుంచి మధ్యాహ్నం గం. 12.30 నిం.లకు కొడుకును తీసుకుని బయటకు వెళ్లిన మాధవ్ తివేతి.. ఆ తరువాత అదే రోజు గం. 2.30ని.లకు ఒక చోట పిల్లాడితో కనిపించినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో నమోదైంది. ఆపై అదే రోజు గం. 5.30 ని.లకు ఒంటరిగా వస్త్ర దుకాణంలో దుస్తులు కొనుగోలు చేసినట్లు సీసీ టీవీల ఫుటేజ్ ల ఆధారంగా గుర్తించారు. అంటే ఆ బాలుడ్ని గం. 2.30ని.ల నుంచి గం. 5.30 ని.ల మధ్యలో హత్య చేసి ఫారెస్ట్ ఏరియాలో పడేశాడు.దీనిపై గత రాత్రి(శుక్రవారం) ఆ బాలుడి తల్లి, మాధవ్ భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త.. కుమారుడిని తీసుకువెళ్లి ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈరోజు(శనివారం) పిల్లాడు హత్య గావించబడిన విషయాన్ని గుర్తించారు. అదే సమయంలో మాధవ్‌ను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు. అయితే కొడుకును తానే చంపినట్లు మాధవ్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా కేసును దర్యాప్తు చేస్తున్నామని, హత్యా అభియోగాలు కింద కేసు కింద నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఒక సీనియర్ పోలీస్ అధికారి స్పష్టం చేశారు. -
ఐక్యతా విగ్రహ శిల్పి రామ్‌సుతార్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం మహారాష్ట్ర భూషణ్ అవార్డుకు ప్రముఖ శిల్పి రామ్ సుతార్‌ను ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం శాసనసభలో ప్రకటించారు. మార్చి 12న ఆయన తన నేతృత్వంలోని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఫడ్నవీస్ తెలియజేశారు. ఈ అవార్డుకింద ఆయనకు రూ.25లక్షల నగదు, మెమెంటో అందజేస్తామని వెల్లడించారు. ‘ఆయనకు ఇప్పుడు వందేళ్ళు. కానీ దాన్ని లెక్కచేయకుండా ముంబైలోని ఇందు మిల్లు స్మారక ప్రాజెక్టులో అంబేద్కర్ విగ్రహం రూపకల్పనలో ఆయన నిమగ్నమై ఉన్నారు.’అని ప్రశంసించారు. పలు భారీప్రాజెక్టుల రూపశిల్పి గత నెలలో 100 ఏళ్లు నిండిన సుతార్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఈ ఏడాదితో వందేళ్లు పూర్తిచేసుకున్న రామ్‌సుతార్ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అయిన స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూపొందించారు. సుతార్ తన కుమారుడు అనిల్‌తో కలిసిస్టాట్యూ ఆఫ్ యూనిటీ, అయోధ్యలో రెండు వందల యాభై ఒక్క మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహం, బెంగళూరులో నూటయాభై మూడు అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం, పూణేలోని మోషిలో వంద అడుగుల ఎత్తైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ విగ్రహం వంటి అనేక ప్రధాన ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. తో సంబంధం కలిగి ఉన్నారు.గతేడాది మాల్వాన్‌లోని రాజ్‌కోట్ కోటలో ముప్పై ఐదు అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోయి రాష్ట్రంలో భారీ రాజకీయ దుమారం చెలరేగింది. ఆ సంఘటన జరిగిన నాలుగునెలల తరువాత ప్రభుత్వం అరవై అడుగుల కొత్త విగ్రహాన్ని నిర్మించే కాంట్రాక్టును రామ్ సుతార్ ఆర్ట్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించింది. గుజరాత్లో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అయిన స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూపొందించారు. గత నెలలో 100 ఏళ్లు నిండిన సుతార్, మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందినవారు. -
‘మీరు సమాధుల్లో దాక్కున్నా తవ్వితీస్తాం’
ముంబై: నాగ్ పూర్ లో జరిగిన హింసకు కారణమైన వారిని ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన దాడిగా ఆయన పేర్కొన్నారు. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా వారికి కఠిన శిక్ష తప్పదన్నారు. అసెంబ్లీలో ఫడ్నీవీస్ నాగ్ పూర్ లో జరిగిన హింసాత్మక ఘటనపై ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదు. వారు ఎక్కడ దాక్కున్నా బయటికి తీసి మరీ శిక్షిస్తాం. ఆఖరికి సమాధుల్లో దాక్కున్నా తప్పించుకోలేరు. ఈ దాడిలో 33 మంది పోలీసులకు తీవ్ర గాయాలు కావడాన్ని ఫడ్నవీస్ ప్రస్తావించారు. ఇదొక అమానుష ఘటన అని, పక్క వ్యూహంతో హింసాత్మ ఘటనలకు పాల్పడ్డారన్నారు.కాగా, ఔరంగజేబు సమాధి తొలగింపు కోసం ఒక మితవాద సంస్థ చేపట్టిన ఆందోళనలో ఒక వర్గానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారనే ఆరోపణల నేపథ్యంలో అల్లర్లు చెలరేగాయి. ఓల్డ్ భండారా రోడ్డు సమీపంలోని హన్సపురి ప్రాంతంలో సోమవారం ఈ ఘర్షణ చెలరేగింది. తొలుత చిన్నపాటి ఘర్షణగా మొదలై, ఆపై తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీన్ని అదుపు చేయడానికి వచ్చిన పోలీసులపై కూడా అల్లరి మూకలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పోలీసులకు గాయాలపాలయ్యారు.ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం.. బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. -
ఔరంగజేబు రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చ: డిప్యూటీ సీఎం వ్యాఖ్యల దుమారం
Aurangzeb Controversy మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి తొలగింపుపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. మంగళవారం ఈ అంశంపై రాష్ట్ర శాసన మండలిలో పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. నాగ్‌పూర్ హింసపై డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందే కౌన్సిల్లో ప్రసంగిస్తూ... ఎవరి సమాధిని తొలగించాలని ఇప్పుడు రైట్‌వింగ్ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయో అటువంటి వ్యక్తిని గురించి పొగడటమేమిటి? ‘ఔరంగజేబు ఎవరు? మన రాష్ట్రంలో ఆయనను కీర్తించడాన్ని మనం ఎందుకు అనుమతించాలి? రాష్ట్ర చరిత్రలో అతను ఒక మాయని మచ్చ‘ అని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాలనను ఔరంగజేబు పాలనతో పోల్చడాన్ని శిందే తీవ్రంగా తప్పుపట్టారు. ఫడ్నవీస్ పాలన, ఔరంగజేబు పాలనా ఒకటేనా? ‘ఔరంగజేబు తన శత్రువులను హింసించిన విధంగా ఫడ్నవీస్ ఎప్పుడైనా ఎవరినైనా హింసించారా?‘ అంటూ శివసేన (యూబీటీ) ఎమ్మెల్సీ అనిల్ పరబ్ వైపు తిరిగి ప్రశ్నించారు.చదవండి: Nagpur issue కొనసాగుతున్న కర్ఫ్యూ, స్థానిక ఎన్నికల కోసమే ఇదంతా?దీనికి పరబ్ కోపంగా తనకు ఈ విషయంపై స్పందించే అవకాశమివ్వాల్సిందిగా చైర్మన్‌ను కోరారు. కానీ చైర్మన్ రామ్‌శిందే పరబ్‌ను అనుమతించలేదు. ఆయన మైక్రోఫోన్‌ను మ్యూట్ చేశారు. అయినప్పటికీ పరబ్, ప్రతిపక్ష నాయకుడు అంబదాస్ దన్వే, సచిన్ పరబ్ ఇతర సభ్యులతో కలిసి తమను మాట్లాడనివ్వవలసిందిగా నిరసన తెలియజేశారు. ఇంత జరుగుతున్నా శిందే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘నేనేంచేసినా బహిరంగంగా చేశా. ఔరంగజేబ్ (కాంగ్రెస్) పట్ల సానుభూతి చూపే వారి నుంచి శివసేనను కాపాడడానికే నేను ఇదంతా చేస్తున్నానని అనిల్ పరబ్ మర్చిపోకూడదు. ఔరంగజేబ్ సమాధికి రక్షణ కల్పించింది కాంగ్రెస్సే.‘ అని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు? -
Nagpur issue కొనసాగుతున్న కర్ఫ్యూ, స్థానిక ఎన్నికల కోసమే ఇదంతా?
నాగ్‌పూర్: మొఘల్ పాలకుడు ఔరంగజేబు ‘సమాధి తొలగింపు’పై చెలరేగిన హింస అనంతరం నాగ్‌పూర్‌లోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కొత్వాలి, గణేష్ పేత్, తహసీల్, లకద్గంజ్, పచ్పావోలి, శాంతి నగర్, సక్కర్దార, నందన్వన్, ఇమామ్‌బాడ, యశోధర నగర్. కపిల్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా అదేరోజు సాయంత్రం మధ్య నాగ్‌పూర్‌లో చెలరేగిన హింసలో ముగ్గురు డీసీపీలు (డిప్యూటీ కమిషనర్లు ఆఫ్ పోలీస్) సహా 12 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. హింసకు సంబంధించి పోలీసులు 15 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలో, అవసరానికి అనుగుణంగా సడలింపులపై సంబంధిత ప్రాంత డీసీపీ నిర్ణయం తీసుకుంటారని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో సెంట్రల్ నాగ్‌పూర్‌లోని చిట్నిస్ పార్క్ ప్రాంతంలోని మహల్లో హింస చెలరేగింది. ఔరంగజేబు సమాధి తొలగింపు కోసం ఒక మితవాద సంస్థ చేపట్టిన ఆందోళనలో ఒక వర్గానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారన్న పుకార్లతో అల్లర్లు చెలరేగాయి. ఓల్డ్ భండారా రోడ్డు సమీపంలోని హన్సపురి ప్రాంతంలో రాత్రి 10.30 నుండి 11.30 గంటల మధ్య మరో ఘర్షణ చెలరేగింది. ఒక అల్లరి మూక అనేక వాహనాలను తగలబెట్టింది. ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లు, ఒక క్లినిక్‌ను ధ్వంసం చేసింది. ఈ సంఘటనలల్లో అనేక మంది గాయపడ్డారు. వరుసగా రెండో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. రాష్ట్రంలో కలహాలకు దారితీసే చిన్న సంఘటనలను కూడా తీవ్రంగా పరిగణించి, వాటిని మొగ్గలోనే తుంచివేయాలని మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా జిల్లా ఎస్పీలను కోరారు.నాగ్‌పూర్ అల్లర్లు ప్రభుత్వ ప్రేరేపితమే– జరంగే ఛత్రపతి సంభాజీనగర్: నాగ్‌పూర్‌లో హింసను ప్రభుత్వ ప్రేరేపితమేనని, పట్టణంలో అశాంతికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసే కారణమని మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జరంగే మంగళవారం ఆరోపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం వారిదే. ఒకవేళ సమాధిని తొలగించాలనుకుంటే అది వారికి నిమిషంలో పని. కాంగ్రెస్ అప్పట్లో తప్పు చేసి ఉంటే ఇప్పుడు దాన్ని సరిదిద్దే అవకాశం వారికి ఉంది . ఒకే సమయంలో రెచ్చగొట్టే ప్రకటనలు అదే సమయంలో సమాధి చుట్టూ పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు దీన్ని అర్థంచేసుకోవాలి. ‘స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. వీటిలో విజయం సాధించేందుకే ఇదంతా అని వ్యాఖ్యానించారు -
ఎదురు లేని వెదురు
వెదురు.. గ్రీన్ గోల్డ్.. అవును! ఈ విషయంలో మీకేమైనా సందేహం ఉందా? అయితే.. శివాజీ రాజ్పుట్ అనే అద్భుత ఆదర్శ వెదురు రైతు విశేష కృషి గురించి తెలుసుకోవాల్సిందే. మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందిన శివాజీ 25 ఎకరాల్లో వెదురును చాలా ఏళ్ల నుంచి సాగు చేస్తూ ప్రతి ఏటా రూ. 25 లక్షలను సునాయాసంగా ఆర్జిస్తున్నారు. తనకున్న 50 ఎకరాల పొలంలో పాతిక ఎకరాల్లో 16 రకాల వెదురు తోటను పెంచుతున్నారు. మిగతా 25 ఎకరాలను ఇతర రైతులకు కౌలుకు ఇచ్చారు.వెదురు సాగులో కొద్దిపాటి యాజమాన్య చర్యలు తప్ప చీకూ చింతల్లేవు, పెద్దగా కష్టపడాల్సిందేమీ ఉండదు. ఏటేటా నిక్కచ్చిగా ఆదాయం తీసుకోవటమే అంటున్నారు శివాజీ. వెదరు సాగు ద్వారా పర్యావరణానికి బోలెడంత మేలు చేస్తున్న ఈ ఆదర్శ రైతు ఉద్యమ స్ఫూర్తితో బంజరు, ప్రభుత్వ భూముల్లో విరివిగా మొక్కలు నాటటం ద్వారా పర్యావరణానికి మరెంతో మేలు చేస్తున్నారు. ఆయన నాటిన 7 లక్షల చెట్లు ఆయన హరిత స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తూ ఆయనకు 30కి పైగా పర్యావరణ పరిరక్షణ పురస్కారాల పంట పండించాయి! ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర, యుఎస్ఎ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వంటి పురస్కారాలు ఆయనకు లభించాయి. పెద్ద కమతాల్లో వెదురు సేద్యానికి సంబంధించి శివాజీ రాజ్పుట్ అనుభవాలు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తాయి.శివాజీ రాజ్పుట్ వయసు 60 ఏళ్లు. వినూత్న రీతిలో వెదరును సాగు చేయటం ద్వారా, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయటం ద్వారా ఆయన తన జీవితాన్ని ఆకుపచ్చగా మార్చుకోవటమే కాదు ఇతరుల జీవితాలను కూడా ఆకుపచ్చగా మార్చుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు పాతికేళ్లుగా విశేష కృషి చేస్తున్న శివాజీ గత ఆరేళ్లుగా వెదురు తోటను సాగు చేస్తున్నారు. వాతావరణ ప్రతికూలతలను తట్టుకొనేలా వ్యవసాయాన్ని కొనసాగించటంలో, పర్యావరణ పరిరక్షణ కృషిలో, గ్రామీణాభివృద్ధి రంగంలో మహారాష్ట్రలో ఇప్పుడాయన ఒక మేరు పర్వతం అంటే అతిశయోక్తి కాదు. ఆయన చేస్తున్న కృషి భూతాపోన్నతిని తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతోంది.వెదురు సాగుకు శ్రీకారం..రాజ్పుట్ గతంలో అందరు రైతుల మాదిరిగానే ఒకటో రెండో సీజనల్ పంటలను రసాయనిక వ్యవసాయ పద్ధతిలో పండించే వారు. అయితే, భారీ వర్షాలు, పెను గాలులు, కరువు వంటి విపరీత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మూలంగా అనిశ్చితిలో కొట్టుమిట్టాడేవారు. ‘భారీ వర్షాలు, పెను గాలులు, కరువు వంటి విపత్తులు వచ్చిపడినప్పుడు సాధారణ పంటలు సాగు చేస్తున్నప్పుడు ఒక్కోసారి పంట పూర్తిగా చేజారిపోయేది. కానీ, వెదురు తోట అలాకాదు. నాటిన ఒక సంవత్సరం తర్వాత నుంచి ఆదాయం వస్తూనే ఉంటుంది. ఏటేటా నిరంతరం పెట్టుబడుల అవసరమే ఉండదు..’అంటారు శివాజీ. సాధారణ పంటల సాగును చుట్టుముట్టిన అనిశ్చితే తనను నిశ్చింతనిచ్చే వెదరు సాగువైపు ఆకర్షించిందంటారాయన. ఆయనకు 50 ఎకరాల భూమి ఉంది. 25 ఎకరాలను కౌలుకు ఇచ్చి, 25 ఎకరాల్లో వెదురు నాటారు. ఈ నిర్ణయమే తన వ్యవసాయాన్ని మేలి మలుపు తిప్పింది. ‘వెదురు సాగులో విపరీత వాతావరణ పరిస్థితుల్లోనూ ఆందోళన చెందాల్సిందేమీ ఉండదు.వెదురు మొక్కలు వేరూనుకొనే వరకు మొదటి ఏడాది కొంచె జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత పెద్ద పని గానీ, పెట్టుబడి గానీ అవసరం ఉండదు. మొదటి ఏడాది తర్వాత నేను పెద్దగా పెట్టిన ఖర్చేమీ లుదు. కానీ, ఏటా ఎకరానికి రూ. లక్ష ఆదాయం వస్తోంది. వెదురు తోట ద్వారా నాకు ఏటేటా రూ. 25 లక్షల ఆదాయం వస్తోంది..’ అంటారు శివాజీ గర్వంగా!వెదురు: ఆకుపచ్చని బంగారంవెదరుకు ఆకుపచ్చని బంగారం అని పేరు. ఈ తోట సాగులో అంత ఆదాయం ఉంది కాబట్టే ఆ పేరొచ్చింది. ‘ఈ భూగోళం మీద అతి త్వరగా పెరిగే చెట్టు వెదురు! పర్యావరణానికి ఇది చేసే మేలు మరేఇతర చెట్టూ చెయ్యలేదు. ఇది 24 గంటల్లో 47.6 అంగుళాల ఎత్తు పెరుగుతుంది. ఇతర చెట్ల కన్నా 35% ఎక్కువ కార్బన్ డయాక్సయిడ్ను పీల్చుకొని 30% అదనంగా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. భూతాపోన్నతిని ఎదుర్కొనే కృషిలో ఇందుకే వెదురు అతికీలకంగా మారింది’ అని వివరించారు శివాజీ. బహుళ ప్రయోజనకారి కావటం అనే మరో కారణం వల్ల కూడా వెదురు సాగు విస్తృతంగా వ్యాపిస్తోంది. రాజ్పుట్ తన తోటలో 19 రకాల వెదురును సాగు చేస్తున్నారు. ఒక్కో రకం వెదురు ఒక్కో పనికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అగరొత్తుల ఉత్పత్తి ఉపయోగపడేది ఒకటైతే, బొగ్గు తయారీకి మరొకటి, బయోమాస్ ఇంధనం ఉత్పత్తికి మరొకటి.. ఇలా ఒక్కో రకం ఒక్కో పనికి ఎక్కువగా పనికొస్తాయి. ‘వెదురు బొంగులు, ఆకులు పెల్లెట్లు తయారు చేస్తారు.పౌడర్లు బయోమాస్ ఇంధన ఉత్పత్తికి వాడుతారు. ఈ ఉత్పత్తులు పర్యావరణ హితమైనవి. సాధారణ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వాడదగినవి అంటారు శివాజీ. వెదురును సాగు చేయటం దగ్గరే ఆయన ఆగిపోవటం లేదు. వెదురు బొంగులతో ఫర్నీచర్‌ను, అగరొత్తులను కూడా తానే తయారు చేయాలన్నది ఆయన సంకల్పం. సుస్థిర జీవనోపాధిని అందించగలిగిన వెదురు సాగు ప్రయోజనాల గురించి ఆయన ఇతర రైతులను చైతన్యవంతం చేస్తున్నారు. ‘136 రకాల వెదురు వంగడాలు ఉన్నాయి. వాటిల్లో 19 రకాలను నేను సాగు చేస్తున్నా. ప్రతి రకానికి ప్రత్యేక లక్షణాలు, ఉపయోగాలు ఉన్నాయి. రకాన్ని బట్టి వెదురు బొంగుల బలం, బరువు ఆధారపడి ఉంటాయి. మన అవసరాన్ని బట్టి ఏ రకాలు కావాలో ఎంపిక చేసుకొని నాటుకోవటం ఉత్తమం’ అనేది ఆయన సూచన.ఆచరణాత్మకంగా ఉండే ఆయన సూచనలు ఇతర రైతులను అనుసరించేలా చేస్తున్నాయి. మహరాష్ట్ర ప్రభుత్వం నుంచ వనశ్రీ పురస్కారంతో పాటు ఇందిరా ప్రియదర్శిన వృక్షమిత్ర అవార్డు వంటి మొత్తం 30 వరకు అవార్డులు ఆయనను వరించాయి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటినిపొదుపుగా వాడుకోవటం వీలుకావటంతో పాటు వెదురు మొక్కలు ఏపుగా పెరగానికి కూడా ఇది ఉపయోగపడిందంటారాయన.వనశ్రీ ఆక్సిజన్ పార్కువనశ్రీ ఆక్సిజన్ పార్క్‌ను రాజ్పుట్ మూడేళ్ల క్రితం నిర్మించారు. చనిపోయిన తమ ప్రియతముల గౌరవార్థం ఇటువంటి వనశ్రీ ఆక్సిజన్ పార్కులు ్రపారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘నా ప్రియతముల పుట్టిన రోజున మొక్కలు నాటుతున్నా. ఇతరులను కూడా ఇదే కోరుతున్నా’ అన్నారాయన. వెదురు సాగు భవిష్యత్తు తరాల బాగు కోసం, బంగారు భవిష్యత్తు కోసం మనం ఇప్పుడు పెట్టే తెలివైన పెట్టుబడే అంటారాయన. ఇతర రైతులకు ప్రేరణరాజ్పుట్ వెదురు తోట విజయగాథతో ప్రేరణ పొందిన రైతులు పలువురు ఆయనను అనుసరిస్తున్నారు. ధులే జిల్లాలోని షిర్పూర్ తాలూకాలో ఆయన సూచనల ప్రకారం 250 ఎకరాలకు వెదురు తోటలు విస్తరించాయి. పేపరు ఉత్పత్తికి వెదురు ఉపయోగపడుతుంది. స్థానికులకు, గ్రామీణ జనసముదాయాలకు వెదరు సాగు చక్కటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదంటారాయన. భూమిని పర్యావరణానికి అనుగుణంగా వినియోగించడాన్ని ్రపోత్సహించదలిస్తే వెదురును విస్తృతంగా సాగు చేయించాలని సూచిస్తున్న రాజ్పుట్ వెదురు భవిష్యత్తు చాలా మెరుగ్గా ఉంటుందన్నారు. ఆయన 7 లక్షలకు పైగా ఇతరత్రా మొక్కలు నాటించటం వల్ల ఆ ప్రాంతంలో జీవవైవిధ్యం పెరిగింది. భూగర్భ జలమట్టం పూర్వస్థితికి పెరిగింది. వర్షానికి మట్టి కొట్టుకుపోవటం తగ్గింది. వన్య్రపాణులకు ఆవాసాలు పెరిగాయి. -
‘అంత మాట అంటారా?.. పిల్ల చేష్టలు వద్దు’
ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను ఔరంగజేబుతో పోలుస్తూ ఇటీవల ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆ రాష్ట్ర బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా మహారాష్ట్ర ప్రెసిడెంట్ హర్షవర్థన్ సప్కాల్.. ఫడ్నవీస్ ను ఔరంగజేబుతో పోల్చారు. దీనిపై మహారాష్ట్ర శాసనమండలిలో బీజేపీ మండిపడింది. సప్కాల్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ శాసనమండలిలో డిమాండ్ చేసింది.ఆదివారం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో సప్కాల్ మాట్లాడుతూ.. ‘ ఔరంగజేబు ఒక క్రూరమైన పాలకుడిగా మనకు తెలుసు. ప్రస్తుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు కూడా ఔరంగజేబు లక్షణాలే ఉన్నాయి. ఎప్పుడూ మతపరమైన అంశాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు తప్ప.. రాష్ట్రానికి చేసేందేమీ లేదు. రాష్ట్రంలోని హత్యకు గురైన సర్పంచ్ సంతోష్ దేశ్ ముఖ్ తరహా అంశాలకే ఆయన ప్రాధాన్యం ఉంటుంది. మరి ఆయన్ను ఔరంగజేబు పాలనతో పోల్చడంతో తప్పేంటి’ అని ఆరోపించారు.పిల్ల చేష్టలు వద్దు.. : బీజేపీ స్ట్రాంగ్ రియాక్షన్పబ్లిక్ లో ఏది పడితే అది మాట్లాడాతానంటే ఇక్కడ కుదరంటూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సప్కాల్ ను హెచ్చరించింది బీజేపీ. దీనిపై బీజేపీ నాయకుడు ప్రవీణ్ దరేకర్ మాట్లాడుతూ.. ‘ చీఫ్ మినిష్టర్ రాష్ట్రంలో అత్యద్భుతంగా పరిపాలన సాగిస్తున్నారు. అటువంటి నాయకుడ్ని ఔరంగజేబుతో పోలుస్తారా?, ఇది కచ్చితంగా ఖండించాల్సిన అంశమే. ఇది మహారాష్ట్రకే అవమానం. సప్కాల్ పై కేసు ఫైల్ చేయాల్సిందే. ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటే వేరే వాళ్లు ఈ తరహా వ్యాఖ్యలు చేయరు. సప్కాల్ పై చర్యలు ఒక ఉదాహరణ కావాలి’ అని ప్రవీణ్ దరేకర్ డిమాండ్ చేశారు. -
ఎండుద్రాక్ష రికార్డు అమ్మకాలు: ఒకేరోజు 17 టన్నులు
సోలాపూర్: పండరీపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో శనివారం రికార్డుస్థాయిలో 17 టన్నుల ఎండుద్రాక్ష విక్రయం జరిగింది. పండరీపురం తాలూకా నాణ్యమైన ఎండుద్రాక్ష ఉత్పత్తికి ప్రస్ధిద్ధి. అందుకే ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పుణే తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడి ఎండు ద్రాక్షను కొనేందుకు ఆసక్తిని చూపుతారు. ఈ నేపథ్యంలో పండరీపురం మార్కెట్లోని స్వప్నిల్ కొటాడియా దుకాణంలో పండరీపురం తాలూకా, భారడీ గ్రామానికి చెందిన రైతు ఆకాష్ వసెకర్కు చెందిన ఎండుద్రాక్ష పంటను కిలోకు రూ. 511 చొప్పున 17 టన్నుల మేర కొనుగోలు చేశారు. సాధారణంగా కిలోకు 200–500 మాత్రమే పలికే ఎండుద్రాక్షను అధిక ధరకు, పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు రైతు ఆకాష్ వసెకర్ను యూటోపియన్ కార్ఖానా చైర్మన్ ఉమేష్ పరిచారక్ మార్కెట్ కమిటీ చైర్మన్ హరీష్ గైక్వాడ్ సన్మానించారు. ఎండు ద్రాక్షతోఉపయోగాలు : ఎండుద్రాక్షల వలన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, శక్తిని అందిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఎండుద్రాక్షలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ పుష్కలంగా ఉంటాయి కనుక తక్షణ శక్తిని అందిస్తాయి. ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలుపుష్కలంగా లభిస్తాయి.ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.ఎండుద్రాక్షలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది , మలబద్ధకాన్ని నివారిస్తుంది.ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. చర్మంపై మొటిమలు, ముడతలు, వృద్ధాప్యం వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇనుము రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. వీటిని నీటిలో నానబెట్టి తాగడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది.ఎండుద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్లు నిద్రలేమికి ఉపశమనం కలిగిస్తుందిఎండుద్రాక్షలో ఇనుము ఉంటుంది, ఇదిచేయడానికి సహాయపడుతుంది.ఎలా ఉపయోగించాలి?మీరు ఎండుద్రాక్షను నేరుగా తినవచ్చు, ఎండుద్రాక్షను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తాగవచ్చు, ఎండుద్రాక్షను పాలలో కలిపి తాగవచ్చు, ఎండుద్రాక్షను వివిధ వంటకాలలో కూడా ఉపయోగించవచ్చు.చదవండి: వైష్ణో దేవి ఆలయం వద్ద వెర్రి వేషాలా? అడ్డంగా బుక్కైన ‘ఓర్రీ’60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్గమనిక: ఎండుద్రాక్షను మితంగా మాత్రమే తినాలి. గర్భవతి అయితే, లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ఎండుద్రాక్షను తినే ముందు మీ డాక్టర్ని సంప్రదించాలని చెబుతారు. -
‘ఏక్నాథ్ షిండే కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు’
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఒకానొక సమయంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేందకు మొగ్గు చూపారన్నారు శివసేన(యూబీటీ) నేత, ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు సంజయ్ రౌత్. ఆ విషయం తనతో పాటు కాంగ్రెస్‌లో కొంతమంది నేతలకు సైతం తెలుసంటూ ఎంపీ సంజయ్ రౌత్ నొక్కి మరీ చెప్పారు.ఈ క్రమంలోనే దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తో ఏక్నాథ్ షిండే బేరసారాలు జరపారన్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి అహ్మద్ పటేల్ మన మధ్య లేరని, ఇంకో సీనియర్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ కు ఈ విషయం తెలుసన్నారు. దీనిపై ఇంతకు మించి తాను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని స్పష్టం చేశారు సంజయ్ రౌత్.అయితే సంజయ్ రౌత్ కామెంట్లపై పృథ్వీరాజ్ చౌహాన్ ను మీడియా సంప్రదించగా, ఆయన మాట్లాడటానికి నిరాకరించారు. మరొకవైపు ఏక్నాథ్ షిండే కూడా అందుబాటులో లేరు. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే ఏక్ నాథ్ షిండ్, పృథ్వీరాజ్ చౌహాన్ లు స్పందిస్తే గానీ క్లారిటీ రాదు.2౦22లో శివసేన(యూబీటీ) నుంచి ఏక్నాథ్ షిండే దూరం కావడంతో పాటు ప్రత్యేక వర్గంతో మహాయుతి కూటమిలో జాయిన్ అయ్యారు. దాంతో శివసేన రెండు ముక్కలైంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు ఏక్నాథ్ షిండే సీఎం అయ్యారు. ఆపై 2024లో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో పాటు అందులో బీజేపీకి అత్యధిక సీట్లు రావడంతో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయ్యారు. ప్రస్తుతం ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు.కొన్ని రోజుల క్రితం ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేల మధ్య విభేదాలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూరుస్తూ ఏక్నాథ్ షిండే మీడియా ముఖంగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు సైతం చేశారు. తన బలమేమిటో కొంతమంది తెలుసుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. తన చరిత్ర ఏమిటో గతాన్ని అడిగితే చెబుతుందంటూ కూటా శివసేనను ముక్కలు చేసిన చరిత్రను చెప్పుకొచ్చారు. ఇదే వార్నింగ్ మహారాష్ట్ర బీజేపీకి కూడా పరోక్షంగా ఇస్తున్నారా? అని ఏక్నాథ్ షిండే వ్యాఖ్యల ద్వారా అనుమానం కల్గింది. -
Holi 2025, బోసిపోయిన రహదారులు.. కిటకిటలాడిన వైన్ షాపులు
ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా హోలీ పండుగ ఘనంగా జరిగింది. చిన్నపెద్ద వయసుతో తేడా లేకుండా అందరూ ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ జరుపుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. గతేడాది కంటే ఈసారి హడావుడి కొంత తగ్గినప్పటికీ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా అనేక మంది రాజకీయ నాయకులు తమతమ ప్రాంతాల్లో జరిగిన హోలీ ఉత్సవాలలో పాల్గొన్నారు. ముంబై, నవీముంబై, థానే పుణే, సోలాపూర్‌లో వీధివీధినా సంబరాలు అంబరాన్ని తాకాయి. కొన్ని ప్రాంతాల్లో లౌడ్స్పీకర్లు, బ్యాండు మేళాలతో నృత్యాలు చేస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ జరుపుకున్నారు. పలుచోట్ల గురువారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిపి, పూరన్ పోలీ (పూర్ణంతో తయారుచేసిన తీపి రొట్టెలు, బూరెలు) నైవేద్యంగా సమరి్పంచి, కాముని దహనం చేశారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రంగుపంచమి (రంగులు చల్లుకునే) ఉత్సవాలను జరుపుకున్నారు. ముఖ్యంగా కోళీ ప్రజలు తమ సాంప్రదాయ పద్దతిలో హోళీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా శుక్రవారం కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో గురువారం సాయంత్రం నుంచే యువతీ యువకులు, పిల్లలు, అందరు వేడుకలను ప్రారంభించారు. కొందరు ఫోన్లలో, మరికొందరు ప్రత్యక్షంగా కలుసుకుని ఒకరికొకరు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గట్టి పోలీసు బందోబస్తు..... హోలీ ఉత్సవాల్లో ఎటువంటి అనుచిత సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహించింది. బహిరంగ ప్రదేశాల్లో , బాటసారులపై రంగులు చల్లి ఇబ్బందులు పెట్టకుండా నగర రహదారులపై గస్తీ నిర్వహించారు. పండగ నేపథ్యంలో అనేక మంది పోలీసుల వారంతపు సెలవులు రద్దు చేశారు. హోలీ రోజున మద్యం సేవించేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో ప్రధాన కూడళ్ల వద్ద బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినవారిపై చర్యలు తీసుకున్నారు. కిటకిటలాడిన బీచ్‌లు.. హోలీ పండుగ సందర్భంగా ముంబైలోని బీచ్‌లన్నీ కిటకిటలాడాయి. పండుగ అనంతరం సముద్ర స్నానాలు చేసేందుకు యువతీ, యువకులు పెద్దసంఖ్య లో బీచ్‌లకు చేరుకున్నారు. ముఖ్యంగా చరి్నరోడ్, లో టస్, వర్లీ సీ ఫేస్, శివాజీపార్క్, మాహిం, బాంద్రా, అక్సాబీచ్ తదితర బీచ్‌లు సందర్శకులతో నిండిపోయాయి. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జలాశయాలు, చెరువుల పరిసరాల్లో కూడా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మద్యం సేవించి ఇతరుల ను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకున్నారు. బోసిపోయిన రహదారులు.. నిత్యం వాహనాలతో రాకపోకలతో రద్దీగా కనిపించే ముంబై రహదారులన్నీ శుక్రవారం బోసిపోయి కనిపించాయి. శుక్ర, శని, ఆదివారం...ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అధిక శాతం ప్రజలు గురువారం రాత్రి నుంచే పర్యాటక ప్రాంతాలకు, రిసార్టులకు, పిక్నిక్ పాయింట్లకు తరలిపోయారు. దీంతో హోలీ పండుగనాడు ప్రధాన రహదారులు సైతం బోసిపోయి కనిపించాయి. అయితే విహారప్రాంతాలకు వెళ్లే రోడ్లపై ముఖ్యంగా పుణే ఎక్స్‌ప్రెస్ హైవే, గోవా మార్గంతోపాటు పలు మార్గాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ కొంత పెరిగింది. శుక్రవారం ‘బెస్ట్’బస్సులు కూడా పూర్తిస్థాయిలో రోడ్లపైకి రాలేదు. అదే విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికులతో కిక్కిరిసి తిరిగే లోకల్ రైళ్లు కూడా ఖాళీగానే కనిపించాయి. నగరంలో ట్యాక్సీలు, తూర్పు, పశి్చమ ఉపనగరాలలో ఆటోలు కూడా అనుకున్నంత మేర తిరగకపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. వైన్ షాపుల వద్ద రద్దీ.. హోళి పండుగ నేపథ్యంలో శుక్రవారం ముంబైతోపాటు థాణే జిల్లాలోని వైన్ షాపుల వద్ద మద్యం కొనుగోలు కోసం మందుబాబులు పెద్దఎత్తున బారులు తీరారు. చేసేందుకు పెద్ద ఎత్తున బారులు తీరి కనిపించారు. మటన్, చికెన్ కొనుగోళ్లకు కూడా జనం పోటెత్తారు. గురువారంతోపాటు శుక్రవారం మధ్యాహ్నం దాకా ఈ రద్దీ కొనసాగింది. -
‘నాటి వారి పాలన కంటే మీ పాలనే అధ్వానంగా ఉంది’
ముంబై: మహారాష్ట్రలో ప్రస్తుత పాలన అధ్వానంగా ఉందని శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ విమర్శించారు. ఔరంగజేబు పరిపాలన ఆనాటి పాలన కంటే నేటి రాష్ట్రంలోని బీజేపీ పాలనే అధ్వానమన్నారు. కేవలం బీజేపీ వల్లే ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు సంభవిస్తున్నాయని సంజయ్ రౌత్ విమర్శించారు. ఒక్క రైతులే కాదని, నిరుద్యోగులు, మహిళలు ఆత్మహత్యలకు పాల్పుడుతన్నారన్నారు. ఔరంగజేబు ఇక్కడ 400 ఏళ్ల చరిత్ర ఉంది. మనం దాదాపు ఆయన్ని మరిచిపోయాం. మరి ఇప్పుడు రైతుల ఆత్మహత్యలకు అప్పటి ఔరంగజేబు కారణమా?, మీ వల్లే(బీజేపీ) రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మహాయుతి కూటమి వల్లే ఈ దారుణాలు జరుగుతున్నాయి. ఆనాటి మొఘల్ చక్రవర్తి దౌర్జన్యాలు చేస్తే, మరి నేటి ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. -
రైల్వే గేటును ఢీకొని పట్టాలపైకి ట్రక్కు.. ఇంతలో వేగంగా రైలు రావడంతో..
జల్గావ్: మహారాష్ట్రలోని జల్గావ్లో రైలు ప్రమాదం(Train accident) చోటుచేసుకుంది. జల్గావ్ జిల్లాలోని బోద్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గోధుమల బస్తాలతో నిండిన ఒక ట్రక్కు కాపలా లేని రైల్వే గేటును ఢీకొని, పట్టాలపైకి చేరుకుంది. ఇంతలో అదే ట్రక్‌పైకి అంబా ఎక్స్‌ప్రెస్ వేగంగా వచ్చింది. అది ట్రక్కును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో టక్కు తునాతునకలయ్యింది. ఆ ట్రక్కులోని కొంతభాగం రైలు ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. అయితే రైల్వేకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో మధ్య రైల్వేకు చెందిన ముంబై-కోల్‌కతా మార్గం(Mumbai-Kolkata route)లోని ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ వైరు తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ప్రస్తుతం ఈ మార్గంలో మరమ్మతు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ట్రక్కు డ్రైవర్ రైల్వే నిబంధనలను పట్టించుకోకుండా రైల్వే క్రాసింగ్‌ను దాటే ప్రయత్నం చేశాడు. ఫలితంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వేశాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోనుంది.ఇది కూడా చదవండి: Vadodara: కారుతో నలుగురిని ఢీకొని.. ‘అనెదర్ రౌండ్’ అంటూ.. -
‘స్వార్గేట్’ కేసు : నిందితుడి పోలీసు కస్టడీ పొడిగింపు
‘స్వార్గేట్’అత్యాచారం కేసు నిందితుడికి కోర్టు మార్చి 26 వరకు పోలీసు కస్టడీ విధించింది. 12 రోజుల పోలీసు కస్టడీ అనంతరం గడేను బుధవారం కోర్టులో హాజరు పరిచాం. కస్టడీని పొడిగించాలని కోర్టుకు విన్నవించాం. ఈమేరకు మార్చి 26 వరకూ నిందితుడికి జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ’అని క్రైంబ్రాంచ్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ముందే క్రిమినల్ నేపథ్యం ఫిబ్రవరి 25 తెల్లవారుజామున స్వార్గేట్ టెర్మినస్ వద్ద ఎమ్మెస్సార్టీసీ బస్సులో 26 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ దత్తాత్రాయ్ గడే అనే వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. బాధితురాలు ఫిబ్రవరి 25 తెల్లవారుజామున సతారా జిల్లాలోని తన స్వస్థలానికి వెళ్లేందుకు స్వార్గేట్ బస్టాండ్‌లో వేచి ఉండగా బస్కండక్టర్నని చెప్పి గాడే ఆమెను అప్పటికే అక్కడ ఉన్న బస్సులో ఎక్కాల్సిందిగా కోరాడు. ఈమేరకు బాధితురాలు బస్సులోపలికి వెళ్లగా గాడే రెండు తలుపులూ మూసివేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం డ్రోన్లు స్నిఫర్ డాగ్‌ల సహాయంతో శిరూర్ తహసీల్ పరిధిలో తన స్వస్థలం గుణత్ గ్రామానికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గడేను పట్టుకున్నారు. అతడిపై ఇప్పటికే అరడజను క్రిమినల్ కేసులున్నాయని పోలీసులు తెలిపారు. -
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో పిడిగుద్దులాటకు బ్రేక్
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో పిడిగుద్దులాటకు బ్రేక్ పడింది. హోళీ పండుగ రోజు ఆనవాయితీగా మధ్యలో తాడు కట్టి ఇరువైపులా నిలబడి కొట్టుకునే సంప్రదాయంతో కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. అయితే, శాంతి భద్రతల ఇబ్బందుల దృష్ట్యా ఈసారి అనుమతి నిరాకరించారు. గ్రామస్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఐదుగురు కంటే ఎక్కువగా గుమిగూడవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హోళీ రోజూ కొట్టుకుంటే గ్రామానికి కీడు జరగదని ఐదు నిమిషాలు అయినా అవకాశం ఇవ్వాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. కొట్టుకుంటే కక్షలు పెరిగి.. గొడవలు జరుగుతాయంటున్న పోలీసులు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని మంజీర తీరంలో ఉన్న హున్సా గ్రామం పిడిగుద్దులాటతో ప్రత్యేక గుర్తింపు పొందింది.దేశంలో ఎక్కడాలేని విధంగా హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ కులమత, వయోబేధం లేకుండా దశాబ్దాలుగా ఐక్యతతో పిడిగుద్దులాటను నిర్వహిస్తుంటారు. వసంత రుతువు రాకకు గుర్తుగా సంబురంగా నిర్వహించే హోలీ.. ఆ గ్రామంలో పిడిగుద్దులకు వేదిక అవుతుంది. గ్రామ శ్రేయస్సు కోసం యువత, పెద్దలు రెండుగా విడిపోయి ఒకరిపైఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటారు. -
మహిళల కోసం మహిళలే...సిస్టర్ లైబ్రరీ
మహిళా రచయితల పుస్తకాలతో మహిళల కోసం మహిళలే నడుపుతున్న గ్రంథాలయం ఒకటి ఉంది తెలుసా? ఇది ముంబైలోని వెస్ట్ బాంద్రాలో ఉంది. అదే సిస్టర్ లైబ్రరీ. దీన్ని దేశంలోనే తొలి ఫెమినిస్ట్ లైబ్రరీగా చెప్పుకోవచ్చు. 2019ల ప్రారంభమైంది ఇది.ఎలా?ముంబైలో ‘బాంబే అండర్‌గ్రౌండ్’ పేరుతో ఆర్టిస్ట్ కలెక్టివ్ గ్రూప్ ఒకటుంది. నగరంలోని పలుచోట్ల తాత్కాలిక రీడింగ్ స్పెస్ని ఏర్పాటు చేసి.. పుస్తకాలతోపాటు తోటివాళ్లతో జనాలు సమయం వెచ్చించేలా చూడ్డం ఈ గ్రూప్ విధుల్లో ఒకటి. ఆ పనిలోనే ఉన్నప్పుడు ఈ గ్రూప్ సభ్యురాలైన ఎక్వీ థామీకి రీడింగ్ స్పేస్‌లో సమావేశమైన వారెవ్వరూ మహిళా రచయితల పుస్తకాలు చదువుతున్నట్టు కనిపించలేదు. అసలు తానెన్ని చదువుతుందో తేల్చుకోవాలనుకుంది ముందు. ఇంటికెళ్లి తన బుక్ ర్యాక్‌లో చూసుకుంటే మహిళా రచయితల పుస్తకాలు కనీసం 20 శాతం కూడా లేవు. అప్పుడు డిసైడ్ చేసుకుంది ఎక్వీ మహిళా రచయితల పుస్తకాలు చదవాలని. దేశంలోనే కాదు ప్రపంచ సాహిత్యంలో మహిళా రచయితల రాసిన పుస్తకాలన్నిటినీ సేకరించడం మొదలుపెట్టింది. అలా కేవలం మహిళా రచయితల పుస్తకాలతోనే నిండిపోయిన తన పర్సనల్ లైబ్రరీలోంచి స్నేహితులూ పుస్తకాలు అరువు తీసుకోసాగారు. ఆ డిమాండ్ చూసి నిశ్చయించుకుంది ఫెమినిస్ట్ లైబ్రరీ స్టార్ట్ చేయాలని. ఆ ప్రయత్నాల్లో ఉండగా.. 2018లో ఆమెకు ఫైన్ ఆర్ట్ అవార్డ్ వచ్చింది. దానికింద అందిన రొక్కంతో దేశంలోని ప్రముఖ నగరాలను పర్యటించి మహిళా రచయితలు రాసిన నవలలు, వ్యాస సంపుటాలు, ఉద్యమ రచనలు, ఆర్ట్ పుస్తకాలు, మహిళాపత్రికలు వంటి వెయ్యి పుస్తకాలను సేకరించింది. వాటితోనే ‘సిస్టర్ లైబ్రరీ’ని ప్రారంభించింది. ‘సాహిత్య, కళా రంగాల్లో మహిళల కృషిని తెలియజేయడానికే ఈ లైబ్రరీని స్థాపించినా.. ఈ ప్రయాణ క్రమంలో అనిపించింది అసలు సృజన రంగంలో మహిళలు పంచిన జ్ఞానాన్ని, వాళ్లు సాధించిన స్థానాన్నీ ప్రపంచం గ్రహించేలా చేయాలని! ఇప్పుడా లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాను’ అని చెబుతుంది ఎక్వీ. ఈ లైబ్రరీకి దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లోని మహిళలంతా తమ వంతు సాయం చేస్తున్నారు. విరాళాల నుంచి క్రౌడ్‌ఫండింగ్ దాకా ఇందులో పుస్తకాల కోసం ధన సహాయమూ అందుతోంది. ఫెమినిస్ట్ లైబ్రరీ ఆవశ్యకతను చాటడానికి, స్ఫూర్తి పంచడానికి సిస్టర్ లైబ్రరీ సభ్యులు దేశ, విదేశీ పర్యటనలూ చేస్తున్నారు. దీంతోపాటు దేశంలో మహిళలే నిర్వహిస్తున్న చంపక బుక్‌స్టోర్ (బెంగళూరు), వాకింగ్ బుక్ ఫెయిర్స్ బుక్‌స్టోర్ అండ్ మొబైల్ లైబ్రరీ (భువనేశ్వర్), ట్రైలాజీ క్యురేటెడ్ బుక్ షాప్ అండ్ లైబ్రరీ (ముంబై) స్టోరీటెల్లర్ బుక్‌స్టోర్ (కోల్కత్తా), వన్ అప్ లైబ్రరీ, బుక్‌స్టోర్ స్టూడియో అండ్ లర్నింగ్ ల్యాబ్( ఢిల్లీ), సిస్టర్స్ ఆఫ్ ద పిపుల్ (ఢిల్లీలోని చారిటీ బుక్ స్టోర్) లాంటి బుక్ స్టోర్స్, లైబ్రరీలు ఉన్నాయి. -
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆర్టీఐ సమాచారంలో షాకింగ్ లెక్కలు
సాక్షి ముంబై: రాష్ట్రంలో తొమ్మిదేళ్లలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో 1.22 లక్షల మంది మృత్యువాత పడగా 2.58 లక్షల మంది తీవ్రంగా గాయపడినట్లు ఆయా పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను బట్టి తెలుస్తోంది. ఇటు ట్రాఫిక్ పోలీసులు అటు ప్రాంతీయ రవాణా కార్యాలయాల (ఆర్టీఓ) అధికారులు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే డ్రైవర్లపై క్రమశిక్షణ పేరట ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఓ అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. కానీ ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్ల దుస్ధితిని ఎవరూ పట్టించుకోవడం లేదని, తప్పంతా తమమీదే మోపడం అన్యాయ మని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా వెళుతున్న వాహనం ముందు ఆకస్మాత్తుగా గుంతలు ప్రత్యక్షం కావడం, రిపేరు వచ్చి రోడ్డుపై లేదా పక్కన నిలిపి ఉంచిన వాహనాల వల్ల అత్యవసరంగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితి వస్తోందని చెబుతున్నారు. దీని వల్ల వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. పోలీసులదాకా వచ్చేవి కొన్నే... కాగా పెద్ద ప్రమాదాలకు సంబంధించిన కేసులే పోలీసు స్టేషన్లలో నమోదవుతున్నాయి. వాటి వల్లే ప్రమాదాల సంఖ్య తెలుసుకునే అవకాశముంటుంది. చిన్నచిన్న ప్రమాదాల విషయంలో బాధితుడు, కారకుల మద్య సయోధ్య కుదిరి కేసు పోలీసులదాకా వెళ్లని సందర్భాలు లక్షల్లో ఉంటాయి. ఇలా 2016 నుంచి 2024 డిసెంబరు వరకు గడచిన తొమ్మిదేళ్లలో 3,03,531 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 1,22,270 మంది మృతి చెందగా 2,58,723 మంది గాయపడినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను బట్టి తెలిసింది. ముంబైదే మొదటిస్థానం... రోడ్డు ప్రమాదాల్లో దేశ ఆరి్ధక రాజధాని ముంబై నగరం మొదటి స్ధానంలో ఉండగా మృతుల సంఖ్యకు సంబంధించి పుణే జిల్లా అగ్రస్ధానంలో ఉంది. ముంబైలో 23,519 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 3,802 మృత్యువాత పడ్డారు. ఇక అతి తక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన జిల్లాగా సోలాపూర్ నిలిచింది. ఈ జిల్లాలో 1,925 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 694 మంది మరణించారు. అలాగే సింధుదుర్గ్ జిల్లాలో 1,982 ప్రమాదాలు జరగ్గా 652 మంది బలయ్యారు. ఎన్ని చర్యలు చేపట్టినా... స్టేట్, నేషనల్ హై వే లపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఓ అధికారుల అనేక విధాలుగా ప్రయతి్నస్తున్నారు. ప్రమాదకర మలుపులవద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు, ఏదైనా పల్లె, గ్రామం మొదట్లో స్పీడ్‌బ్రేకర్ల ఏర్పాటుతోపాటు . జాతీయ, రాష్ట్ర రహదారులతోపై వేగ నియంత్రణ కోసం అక్కడక్కడా స్పీడ్‌గన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై జరిమానా విధిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినాసరే రోడ్డు ప్రమాదాలు తగ్గకపోగా మరింతగా పెరుగుతుండటం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. -
రాహుల్ గాంధీ ధారావి పర్యటపై సెటైర్లు
ముంబై: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత తాజాగా ముంబైలోని ధారావి ప్రాంతంలో పర్యటించారు(Dharavi Visit). అయితే ఈ పర్యటనలో కాంగ్రెస్ నేతలెవరూ కనిపించకపోవడంపై శివసేన నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్(Sanjay Nirupam) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.గురువారం ధారావిలోని ఛామర్ స్టూడియోను సందర్శించిన రాహుల్ గాంధీ(Rahul Gandhi).. డిజైనర్ సుధీర్ రాజ్బర్ & టీంను కలిశారు. ఆపై సోషల్ మీడియాలో రాజ్బర్ బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు కూడా.Sudheer Rajbhar of Chamar Studio encapsulates the life and journey of lakhs of Dalit youth in India. Extremely talented, brimming with ideas and hungry to succeed but lacking the access and opportunity to connect with the elite in his field. However, unlike many others from his… pic.twitter.com/VOtnA9yqSD— Rahul Gandhi (@RahulGandhi) March 6, 2025 అయితే ఒక కాంగ్రెస్ నేతగా కాకుండా.. యూట్యూబర్‌లాగా రాహుల్ ధారావిలో పర్యటించారంటూ సంజయ్ నిరుపమ్ ఎద్దేవా చేశారు. అంతేకాదు.. ముంబై కాంగ్రెస్ యూనిట్ డబ్బుల్లేక దివాళా తీసిందని సెటైర్లు కూడా వేశారు. ముంబైలో కాంగ్రెస్‌కు ఓట్లు మాత్రమే కాదు.. డబ్బులు కూడా లేకుండా పోయాయి. చాలాకాలంగా ముంబై కాంగ్రెస్ కార్యాలయం కరెంట్ బిల్లులు చెల్లించడం లేదు. ఆ బకాయిలు రూ. 5 లక్షల దాకా పేరుకుపోయాయి. అందుకే.. కావాలనే రాహుల్ కాంగ్రెస్ నేతలను కలవకుండా వెళ్లిపోయారు. ఒక కాంగ్రెస్ నేతలా కాకుండా.. యూట్యూబర్‌లాగా ఆయన పర్యటన సాగింది. గతంలో నేను ముంబై కాంగ్రెస్ యూనిట్ చీఫ్‌గా నాలుగేళ్లపాటు పని చేశా. కానీ, ఏనాడూ ఇంత ఘోరమైన పరిస్థితులు మాత్రం లేవు’’ అని సంజయ్ నిరుపమ్ అన్నారు.బాల్‌థాక్రే పిలుపుతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంజయ్ నిరుపమ్.. ఆ తర్వాత కాంగ్రెస్‌తోనూ అనుబంధం కొనసాగించారు. ఒకసారి శివసేన నుంచి, ఒకసారి కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. 2009-14 మధ్య కాంగ్రెస్ నుంచి లోక్‌సభ ఎంపీగా పని చేశారు. అయితే కిందటి ఏడాది ఏప్రిల్‌లో క్రమశిక్షణ చర్యల కింద కాంగ్రెస్ ఆయనపై ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. షిండే శివసేన వర్గంలో చేరారు. -
నేనేమీ ఆ మాజీ సీఎం మాదిరి కాను: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేల మధ్య ‘వర్గపోరు’కు దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లే కనబడుతోంది. ఇటీవల ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ.. తనను తేలిగ్గా తీసుకోవద్దని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చిన విషయాన్ని మర్చిపోవద్దనే విషయాన్ని మరిచిపోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం ఎవరికి అర్థం కావాలో వారికి అర్ధమైతే బాగుంటుందనే కూడా ఏక్ నాథ్ షిండ్ చెప్పుకొచ్చారు. తాను సీఎం ఉండగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ఫడ్నవీస్ ఆపేసారనే ఆరోపణల నేపథ్యంలో ఏక్ నాథ్ షిండే కాస్త ఘాటుగా స్పందించారు.అయితే దీనికి ఫడ్నవీస్ ఇంచుమించు తెరదించినట్లే కనబుడుతున్నారు. తనకెందుకు వచ్చిన గొడవో ఏమిటో అనుకున్నారో కానీ శంకుస్థాపనుల, ఆరంభించిన ఏ ప్రాజెక్టును ఆపడం లేదన్నారు ఫడ్నవీస్. గవర్నర్ కు ధన్యవాదాలు తీర్మానంలో భాగంగా మహారాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన ఫడ్నవీస్.. ‘ నేనేమీ మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కాను. తలపెట్టిన ప్రాజెక్టులను ఆపిన ఘనత ఉద్ధవ్ ది. నేను అటువంటి సీఎం ను కాను అన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. షిండే హయాంలో ఉండగా కొన్ని ప్రాజెక్టులు చేపట్టాం. అది మేమంతా(షిండే, అజిత్ పవార్) కలిసి తీసుకున్న నిర్ణయం. ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా అందరిపైనా ఉంది’ అంటూ పేర్కొన్నారు.మాపై ప్రజలు పెద్ద బాధ్యత ఉంచారుగతేడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ మహాయుతి కూటమికి భారీ సీట్లు ఇచ్చి అధికారాన్ని ఇచ్చారన్నారు. అందుచేతు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళతామని, భవిష్యత్ తరాలకు మంచి చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు ఫడ్నవీస్. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు.. ఏక్నాథ్ షిండే స్ట్రాంగ్ వార్నింగ్ -
మరాఠీయే ముంబై భాష
ముంబై: ముంబైలో మరాఠీ భాష తప్పనిసరేం కాదన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నాయకుడు సురేష్ భయ్యాజీ జోషి వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఎంవీయే కూటమి మండిపడింది. మరాఠీ ముంబై భాష అంటూ గురువారం దక్షిణ ముంబైలోని హుతాత్మ చౌక్ వద్ద నిరసన నిర్వహించింది. ఈ నిరసనలో శివసేన (యూఈటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ నాయకులు విజయ్ వడేట్టివార్, భాయ్ జగ్తాప్, నితిన్ రౌత్ మరియు ఎన్సీపీ(ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సహా పలువురు ఎంవీయే కూటమి నాయకులు పాల్గొన్నారు. అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, మరాఠీ ముంబై భాష అని నొక్కి చెబుతూ నినాదాలు చేశారు. బుధవారం ఘట్కోపర్లో జరిగిన ఒక కార్యక్రమంలో జోషి మాట్లాడుతూ.... ‘ముంబైకి ఒకే భాష అంటూ ఏమీ లేదు. ముంబైలోని ప్రతి ప్రాంతానికి భాష మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఘట్కోపర్లో గుజరాతీ ఎక్కువగా మాట్లాడతారు. కాబట్టి మీరు ముంబైలో నివసిస్తున్నంత మాత్రాన మరాఠీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు‘ అన్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు కూటమి అగ్రనేతలతో కలిసి నిరసన చేపట్టారు నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు...జోషి తన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల విమర్శలకు బదులుగా జోషి‘వారు నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారు. మరాఠీ మహారాష్ట్ర భాష, ముంబై భాష కూడా. ఈ విషయంలో ద్వంద అభిప్రాయాలేమీ లేవు. అనేక భాషలు మాట్లాడే ప్రజలు ముంబైలో సామరస్యంగా జీవిస్తారు.మరాఠీ నా మాతృభాష. అందుకు నేను గర్విస్తున్నాను. బయటిప్రాంతాల ప్రజలు కూడా మరాఠీని అర్థంచేసుకోవాలన్నదే నా అభిప్రాయం.’అని ముక్తాయించారు. ఎంవీయే అగ్రనేతలు -
చెట్లను నరుకుతూ హరితహారాలెందుకు?
సోలాపూర్–ధూళే నేషనల్ హైవేపై సర్వీసు రోడ్డును నిర్మిస్తున్న ఎన్హెచ్ఏ ఓవైపు ‘హరితహారం’ఏర్పాట్లు ..మరోవైపు చెట్ల నరికివేత పనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తుల్జాపూర్ నాక వాసులు సోలాపూర్: ఒకవైపు పట్టణవ్యాప్తంగా ‘హరితహారం’కోసం ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు తుల్జాపూర్లో అందుకు భిన్నంగా చెట్ల నరికివేత జరుగుతోంది. దీంతో ఎస్ఎంసీ వైఖరి ఏమిటో అంతుబట్టడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సోలాపూర్ – ధూళే నేషనల్ హైవేపై సోలాపూర్– తలే ఇప్పర్గా మార్గంలో నేషనల్ హైవే అథారిటీ సర్వీసు రోడ్డును నిర్మిస్తోంది. ప్రతి ఏడాది తుల్జాపూర్లో జరిగే కోజగిరి పూర్ణిమ వేడుకల కోసం వేలాది భక్తులు ఈ మార్గం గుండానే కాలినడకన ప్రయాణిస్తారు. అలాగే పండరీపూర్‌లో జరిగే ఆషాఢ ఏకాదశి ఉత్సవాల కోసం వేలాది మంది వార్కారీలు, భక్తులు సాధుసంతుల పల్లకీలతో ఇదే మార్గంలో పాదయాత్రగా వెళుతుంటారు. వీరంతా మార్గమధ్యంలో ఈ చెట్లనీడనే సేదతీరతారు. ఇప్పుడా సౌకర్యం ఉండబోదంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కాగా సర్వీసు రోడ్డు పనుల కోసమే చెట్లను నరికివేస్తున్నామని, పూర్తైన అనంతరం తిరిగి మొక్కలు నాటుతామని సోలాపూర్ జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ రాకేష్ జవాడే తెలిపారు. -
మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే రాజీనామా
-
మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా
ముంబై: మహా రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆహార, పౌరసరఫరా శాఖల మంత్రి ధనంజయ్ ముండే(Dhananjay Munde) తన పదవులకు రాజీనామా చేశారు. ఓ సర్పంచ్ హత్య కేసులో ఆయన అనుచరుడు అరెస్ట్ కాగా.. తీవ్రమైన ఆరోపణలు రావడంతో ధనంజయ్ రాజీనామా చేయాల్సి వచ్చింది.గత డిసెంబర్లో బీడ్ జిల్లా మస్సాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి.. మంత్రి ధనంజయ్ ముండే అనుచరుడు వాల్మీక్ కరాద్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ధనంజయ్ పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి.రాజకీయ విమర్శలు తీవ్రతరం కావడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis), ఎన్సీపీ చీఫ్.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో భేటీ అయి చర్చించారు. సీఎం ఫడ్నవిస్ సూచన మేరకు ధనంజయ్ రాజీనామా చేసినట్లు సమాచారం. ఆపై ఆ లేఖను ఆమోదించిన ఫడ్నవిస్.. గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించారు.ధనంజయ్ ఎవరంటే..ధనంజయ్ పండిత్రావ్ ముండే.. కేంద్ర మాజీ మంత్రి, దివంగత గోపినాథ్ ముండేకు దగ్గరి బంధువు. గతంలో ఈయన బీజేపీలో పని చేశారు. బీజేవైఎం యువ విభాగానికి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత హోదా కూడా చేపట్టారు. ఆపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP)లో చేరారు. ధనంజయ్ 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కూటమి ప్రభుత్వంలోని ఫడ్నవిస్ కేబినెట్లో కీలక మంత్రిత్వ శాఖలతో పాటు బీడ్ జిల్లాకు సంరక్షణ మంత్రిగా ఉన్నారు.గతంలో ఈయన ఓ వివాదంలోనూ చిక్కుకున్నారు. ప్రముఖ గాయని రేణు శర్మ 2021జనవరిలో ఆయనపై అత్యాచార కేసు పెట్టారు. దీంతో ప్రతిపక్షాలు ఆయన రాజీనామాకు పట్టుబట్టాయి. అయితే ఆ ఆరోపణలు తోసిపుచ్చిన ఆయన.. సంచలన ప్రకటన చేశారు. రేణు శర్మ సోదరి కరుణా శర్మతో తాను సహజీవనంలో ఉన్నానని, తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఈ విషయం తన భార్య, కుటుంబ సభ్యులకూ తెలుసని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత రేణు శర్మ ఆయనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకున్నారు. -
నీటి కష్టాలు : పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న నీటి మట్టాలు
సాక్షి, ముంబై: ముంబైకి నీటి సరఫరా చేసే జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. ముంబైలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. దీంతో ముంబైకి నీటి సరఫరా చేసే ఏడు జలాశయాల్లో నీటిమట్టాలు వేగంగా అడుగంటుతున్నాయి. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు అందించిన వివరాల మేరకు ముంబైకి సరఫరా అయ్యే నీటి జలాశయాల్లో నీటి నిల్వలు 50.06 శాతానికి పడిపోయాయి. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో నీటి ఇక్కట్టు తప్పేటట్టు లేదని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో బీఎంసీ అ«ధికారులతోపాటు ముంబైకర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రస్తుత నీటి నిల్వల ప్రకారం నాలుగైదు నెలలపాటు నీటి సరఫరా చేయాల్సిరానుంది. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న నీటి మట్టాల కారణంగా ఇబ్బంది పడాల్సిరానుందని చెబుతున్నారు. జూన్‌లో వర్షాలు కురవకపోతే నీటి సమస్య మరింత జఠిలమయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ముంబైకి నీటి సరఫరా చేసే జలాశయాల్లో కేవలం 50.06 శాతం మాత్రమే నీటి నిల్వలున్నాయి. వైతర్ణా, మోడక్‌సాగర్, తాన్సా, మధ్య వైతర్ణా, భాత్సా, విహార్, తులశీ మొదలగు ఏడు జలాశయాల నుంచి ముంబైకి నీటి సరఫరా జరుగుతోంది. ముంబైలో సుమారు 1.30 కోట్ల జనాభా ఉంది. వీరికోసం ప్రతీరోజు 4,450 మిలియన్ లీటర్ల నీరు డిమాండ్ ఉండగా 3,850 మిలియన్ లీటర్ల నీరు సరఫరా చేస్తున్నారు. వివిధ కారణాలవల్ల 25 శాతం నీటి లెక్కలు తేలడంలేదు. కాగా, ప్రతీ వ్యక్తికి వివిధ అవసరాల కోసం సుమారు 150 లీటర్ల నీరు అవసరముంటుంది. కానీ లీకేజీ వల్ల పూర్తిగా సరఫరా చేయలేకపోతోంది. అయినప్పటికీ నగరంలో ఇప్పటికీ 20 లక్షల మందికి నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వీరంతా మురికి కాల్వలు శుభ్రం చేయడం, ఆటో, ట్యాక్సీలు నడుపుకొంటూ, ఇళ్లలో పాచి పనులు చేస్తూ జీవనం సాగించేవారున్నారు. ఇలాంటి వారికే నీటి సరఫరా సరిగా అందడంలేదు. చదవండి: ఏసీలు కూడా పేలే అవకాశం : ఎలా గుర్తించాలి? ముఖ్యమైన జాగ్రత్తలుమోడక్సాగర్లో అత్యల్పం ముంబైకి నీటి సరఫరా చేసే ఏడు జలాశయాల్లో మోడక్‌సాగర్ జలాశయంలో అత్యల్పంగా నీటి మట్టాలున్నాయి. మోడక్‌సాగర్ జలాశయం సామర్థ్యం 1,28,925 ఎమ్మెల్డీలుండగా ప్రస్తుతం 25,972 ఎమ్మెల్డీలు అంటే కేవలం 20.1 శాతానికి నీటి నిల్వలు చేరుకున్నాయి. ఇక తాన్సా జలాశయం సామర్థ్యం 1,45,080 ఉండగా ప్రస్తుత నీటి నిల్వలు 62,161 ఎమ్మెల్డీలకు అంటే 42.8 శాతానికి చేరుకున్నాయి. మరోవైపు ముంబైకి నీటి సరఫరా జలాశయాల్లో అతిపెద్ద జలాశయమైన అప్పర్ వైతర్ణాలో అత్యధికంగా 69.4 శాతం నీటి నిల్వలున్నాయి. అప్పర్వైతర్ణా జలాశయం సామర్థ్యం 2,27,07 ఎమ్మెల్డీలు ఉండగా ఈ జలాశయంలో నీటి నిల్వలు 1,57,50 ఎమ్మెల్డీల అంటే 69.4 శాతానికి చేరుకున్నాయి. ఇది సంతృప్తికరమైన విషయమని చెప్పవచ్చు. మరోవైపు గత సంవత్సరం వర్షాలు కురిసినప్పటికీ జలాశయాల్లో నీరు అనుకున్నంతగా చేరలేదు. దీంతో నీటి నిల్వలు పడిపోయాయి. ప్రస్తుతం అందిన వివరాల మేరకు ముంబైకి నీటి సరఫరా అయ్యే జలాశయాల్లో కేవలం 50.06 శాతం ఉండటంతో కోత విధించే అవకాశాలుండవని కానీ ఉష్ణోగ్రతలు ఇతర పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో పరిస్థితి మారకపోతే నీటి కోత విధించే అవకాశాలున్నాయని బీంఎసీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా బీఎంసీ అందించిన వివరాల మేరకు ఒక శాతం నీటిని సుమారు రెండు నుంచి మూడు రోజులపాటు సరఫరా చేసేందుకు అవకాశం ఉంది. ఈ ప్రకారం నెలకి సుమారు 10 నుంచి 15 శాతం నీరు సరఫరా చేస్తారు. ఈ లెక్కన 50 శాతం నీటిని సుమారు నాలుగు నుంచి ఐదు నెలలపాటు చేయవచ్చని భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో నీటి నిల్వలు ఆవిరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో రాబోయే రెండు నెలల్లో నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని నీటి విధించాలా లేదా అనేది నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత జూన్‌లో వర్షాలు కురవనట్టయితే ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
థానే తెలుగు మహాసభ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు
థానే: థానే తెలుగు మహాసభ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన పత్రాలు, ఆహ్వాన పత్రికలను ఆదివారం ఆవిష్కరించారు. థానే తెలుగు మహాసభ స్వర్ణోత్సవాలు (50 సంవత్సరాలు) జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి ఏర్పాట్లతోపాటు ఇటీవలే నిర్వహించిన శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాలకు సంబంధించి థానే లోకపురంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో పలు విషయాలపై చర్చించారు. ఏప్రిల్ 6వ తేదీ వాగ్లే ఇస్టేట్ డిసూజా వాడిలోని సెయింట్ లారెన్స్ స్కూల్ హాల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. మొదటిసారిగా థానే తెలుగు మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీసీతారామ కల్యాణోత్సవాల కోసం పంచలోహాల ఉత్సవ విగ్రహాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే ఉత్సవ విగ్రహాలను థానే తెలుగు మహాసభకు అందించేందుకు కేవీ రమణ దంపతులు ముందుకు రావడం విశేషం. మరోవైపు సీతమ్మవారికి బంగారు మంగళసూత్రం తయారుచేసి ఇచ్చేందుకు గుండా మాధురి శ్రీనివాస్ దంపతులు ముందుకురాగా పట్టువ్రస్తాలను జయశ్రీ రమేశ్ తూము దంపతులు అందించేందుకు ముందుకొచ్చారు. పానకం వడపప్పు ప్రసాదాన్ని విజయ బులుసు దంపతులు అందిచేందుకు ముందుకు వచ్చారు. తెలుగు బ్రాహ్మణ సంఘం శ్రీసీతారామ కల్యాణోత్సవాలలో వచ్చే వారందరికీ భోజనాలు అందించేందుకు ముందుకు వచ్చింది. దీనిపై సభ్యులందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇటీవలే శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాలు నిర్వహించడంలో కృషి చేసిన వారందరినీ అభినందించారు. 1974లో ఏర్పాటైన థానే తెలుగు మహాసభ గత కొన్ని సంవత్సరాలపాటు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. అయితే ఇటీవలే జరిగిన ఎన్నికల అనంతరం నూతనంగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఏవీ గుప్తా, కార్యదర్శి శివకుమార్‌ల టీమ్ నేతృత్వంలో మరోసారి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఇందులో బాగంగా ఇప్పటికే అత్యంత ఘనంగా శ్రీనివాస కల్యాణోత్సవాలు జరిపిన అనంతరం మరింత ఉత్సాహంగా శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం నిర్వహించిన సమావేశాల్లో థానే తెలుగు మహాసభ అధ్యక్షుడు ఏవీ గుప్తా, గౌరవ అధ్యక్షుడు బీవీహెచ్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు ఎన్.జగదీశ్ రావు, కార్యదర్శి శివకుమార్, కోశాధికారి పద్మజ, మంజుల, ఎంఎస్ కిశోర్, జగన్నాథరావు, జయశ్రీ తూము, రమణి, తదితరులు పాల్గొన్నారు. -
జీనియస్ : 14 ఏళ్ల మానవ కాలిక్యులేటర్
పందొమ్మిదో ఎక్కం చెప్పమంటే తల గీరుకునే పిల్లలు ఉంటారు. చిన్న చిన్న కూడికలకు కాలిక్యులేటర్ వైపు చూసే వారూ ఉంటారు. ఇక పెద్ద లెక్కలంటే కాలిక్యులేటర్ కావాల్సిందే. కాని ఆర్యన్ నితిన్‌కు అది అక్కర్లేదు. ఎందుకంటే అతడే ఒక కాలిక్యులేటర్. అతని వయసు 14 ఏళ్లు. ఎంత పెద్ద నెంబర్లతో లెక్కలు ఇచ్చినా సరే అవలీలగా చేసేస్తాడు.ఆర్యన్ ది మహారాష్ట్ర. ఆరేళ్ల వయసు నుంచే మనసులో లెక్కలు వేయడం, సమాధానాలు కనుక్కోవడం చేసేవాడు. అతని ఉత్సాహం చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆర్యన్ రోజూ ఐదారు గంటల΄ాటు కష్టమైన లెక్కలు సాధన చేసేవాడు. ఎవరు ఎంత పెద్ద లెక్క చెప్పినా మనసులోనే చేసి, టక్కున సమాధానం చెప్పేవాడు. దీంతో అతని ప్రతిభ గురించి అందరికీ తెలిసింది. 2021లో ‘మైండ్ స్పోర్ట్ ఒలింపియాడ్ మెంటల్ కాలిక్యులేషన్’ వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించి, ఆ ఘనత పొందిన అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు. 2022లో జర్మనీలో జరిగిన మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్‌లో పాల్గొని మొదటిస్థానంలో నిలిచాడు. అంత చిన్నవయసులో ఆ ఘనత సాధించిన వ్యక్తిగా నిలిచిపోయాడు. దీంతో గ్లోబల్ మెంటల్ కాలిక్యులేటర్స్ అసోసియేషన్(జీఎంసీఏ)లో అతణ్ని ఫౌండింగ్ బోర్డు సభ్యుడిగా చేర్చుకున్నారు. ఆ తర్వాత అనేక ప్రపంచ వేదికలపై తన సత్తా చాటాడు. 14 saal ke Aryan Shukla ne sirf 1 din mein banaye 6 Guinness World Record.Bharat ke Aryan Shukla ne apni kamaal ki pratibha dikhate hue ek hi din mein 6 Guinness World Record tod diye! Itni kam umar mein itni badi uplabdhi desh ke liye garv ki baat hai. Unki safalta naye yuvaon… pic.twitter.com/pA8dnoGj1O— Kashmir Watcher (@KashmirWatcher) February 19, 2025 గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించాలన్న ఆకాంక్షతో దుబాయ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఒకటి, రెండు కాదు.. ఒకేరోజు ఆరు ప్రపంచ రికార్డులను అతను సాధించాడు. 30.9 సెకండ్లలో 100 నాలుగు అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం, ఒక నిమిషం 9.68 సెకండ్లలో 200 నాలుగు అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం, 18.71 సెకండ్లలో 50 ఐదు అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం.. ఇలా అతను చేసిన మేధోవిన్యాసాలు చూసి గిన్నిస్ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. 2024లో మరోసారి మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్‌లో మొదటిస్థానంలో నిలిచాడు. క్రమం తప్పకుండా రోజూ సాధన చేస్తే ఎలాంటి కష్టమైన విషయమైనా మన సాధించగలమని, మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వదలకూడదని అంటున్నాడు ఆర్యన్. -
హరహర మహాదేవ! ఘనంగా శివరాత్రి వేడుకలు
సాక్షి, ముంబై: ముంబైలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పశ్చిమ అంధేరితోపాటు నగరంలోని పలుప్రాంతాల్లో శివాలయాలన్నీ మహాదేవుడి నామస్మరణతో మార్మోగిపోయాయి. అంధేరి వెస్ట్‌లోని ఆరంనగర్, వర్సోవా, ఇతర ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అభిషేకాలు, విశేష పూజలతో ఆధ్యత్మిక సౌరభాన్ని వెదజల్లాయి. భక్తులు శివ భజనలు, శివ తాండవ స్తోత్రాలు, ఇతర భక్తి గీతాలతో ఆది దేవుణ్ణి స్మరిస్తూ రాత్రంతా జాగరణ చేశారు. గురు వారం తెల్లవారుజామున ప్రత్యేకపూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వివి ధ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు మహాప్రసాదాలను అందించారు. వర్లీ, శివకృప క్రీడా మండల్ ఆధ్వర్యంలో... వర్లీ, నెహ్రూనగర్‌లో బుధవారం మహాశివరాత్రి సందర్భంగా శివ మహాపూజ, సత్యనారాయణ మహాపూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండల్ ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాలుగా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఇకపై ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని మండల్ నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మకుమారీ సంస్థ ఆధ్వర్యంలో... ప్రముఖ ఆధ్యాత్మిక సంస్ధ ‘ప్రజాపితా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయ్’ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. లోయర్‌పరేల్, దీపక్ టాకీస్ సమీపంలో ఉన్న పద్మావతి భవనం ఆవరణలో బుధవారం ఉదయం, సాయంత్రం వివిధ భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పలు ఆధ్యాత్మిక సేవా సంస్ధలు, తెలుగు సంఘాల ప్రముఖులు, పదాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాల ముఖ్య అతిథి, ఆంధ్ర మహాసభ సాంస్కృతిక శాఖ మాజీ ఉపాధ్యక్షురాలు రాధా మోహన్ శివరాత్రి ఉత్సవ పతాకాన్ని ఆవిష్కరించారు. అనేక సంవత్సరాలుగా బ్రహ్మకుమారి సంస్ధ చేపడుతున్న వివిధ సేవా కార్యాక్రమాలను గురించి రాధా మోహన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన భక్తులందరినీ ఆధ్యాత్మిక గురువులు, మాతాజీలు బి.కే.శీతల్ బేన్, బి.కే.పుష్పబేన్, బి.కే.అరుణబేన్ ఆశీర్వదించారు. వారికి ప్రసాదాలు పంపిణీ చేసి కానుకలు అందజేశారు. అనంతరం సాయంత్రం జరిగిన ప్రవచన కార్యక్రమంలో యూబీటీ శివసేన ఎమ్మెల్సీ, రాష్ట్రపతి అవార్డు గ్రహిత సునీల్ శిందే, ప్రభాదేవి–దాదర్ నియోజక వర్గం ఎమ్మెల్యే మహేశ్ సావంత్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో సంస్ధ ఆర్గనైజింగ్ ఇన్చార్జ్ డా.నాయిని రవి, తెలుగు డాక్టర్స్ అసోసియేషన్ (టీడీఎస్) అధ్యక్షుడు డా.ఎన్.ఎం.తాటి, మాజీ అధ్యక్షుడు డా.కే.ఆర్.దుస్సా, పదాధికారులు, సభ్యులు డా.స్వాతి, డా.వేముల గోదావరి, డా.పల్లాటి రాజు, డా. ఆడెపు, డా.ఎల్.ఎన్.గుడ్డేటి, డా.వేముల సుదర్శన్, డా.ఆర్.ఆర్.అల్లే, డా.శ్రీనివాస్, డా.వెంకటేశ్, ఆంధ్ర మహాసభ ట్రస్టీలు, కార్యవర్గ పదాధికారులు ఏక్నాథ్ సంగం, వాసాల శ్రీహరి (వంశీ), నడిమెట్ల ఎల్లప్ప, వేముల మనోహర్, యాపురం వెంకటేశ్, షేర్ల ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఘోర ప్రమాదం.. జాలర్లను రక్షించిన సైన్యం
ముంబై: అరేబియా సముద్రంలో ఘోర ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం జాలర్లతో వెళ్లిన ఓ బోటు మంటల్లో చిక్కుకుంది. అయితే భారత సైన్యం సకాలంలో స్పందించడంతో అందులో ఉన్నవాళ్లంతా ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.శుక్రవారం వేకువజామున రాయ్‌గఢ్ జిల్లా అక్షి అలీబాగ్ వద్ద సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు చెలరేగి బోటు నుంచి పొగ వస్తుండడం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. బోటులో చిక్కుకున్న జాలర్లను క్షేమంగా బయటకు తెచ్చాయి.బోటు 80 శాతం కాలిపోగా.. 20 మంది జాలర్లు ప్రమాదం నుంచి బయటపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన బోటు సాాకరక్షి గ్రామానికి చెందిన రాకేష్ మూర్తికి చెందిందిగా నిర్ధారించారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రానప్పటికీ. . షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.#WATCH | Maharashtra: The fishing boat of one Rakesh Gan caught fire 6-7 nautical miles from the coast in Raigad district in In Akshi Alibaug, around 3-4 am. Indian Coast Guard and Indian Navy rescued all 18 crew members from the boat safely: Raigad SP(Video: Raigad Police) pic.twitter.com/6f4MFm0aQn— ANI (@ANI) February 28, 2025अलीबाग में मछली पकड़ने वाली नाव में लगी आग...20 नाविकों को बचाने की कोशिश जारी... @lokmattimeseng @DGPMaharashtra #alibaug @RaigadPolice pic.twitter.com/1oEwgCFGSU— Visshal Singh (@VishooSingh) February 28, 2025 -
నిందితుడి అరెస్ట్.. ఎలా చిక్కాడంటే!
-
పూణే అత్యాచార కేసు.. నిందితుడు రామ్‌దాస్ అరెస్ట్
పూణే: మహారాష్ట్రలోని పూణే అత్యాచార కేసులో నిందితుడు దత్తాత్రేయ్ రామ్‌దాస్ గాదేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దారుణ ఘటన తర్వాత 75 గంటల గాలింపు అనంతరం నిందితుడు పోలీసులకు చిక్కాడు. నిందితుడి కోసం పోలీసులు 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.వివరాల ప్రకారం.. పూణేలోని స్వర్గేటు బస్టాండ్ వద్ద 26 ఏళ్ల యువతిపై బస్సులో అత్యాచారానికి పాల్పడిన దత్తాత్రేయ్ రామ్‌దాస్ పోలీసులకు చిక్కాడు. 75 గంటల గాలింపు చర్యల అనంతరం నిందితుడు రామ్‌దాస్‌ను శుక్రవారం తెల్లవారుజామున శ్రీరూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, పోలీసు స్టేషన్‌కు తరలించారు. అత్యాచార ఘటన తర్వాత నిందితుడు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డు అందజేస్తామని పోలీసుశాఖ సైతం తెలిపింది.Pune rape case -; Accused, Dattatray Ramdas Gade, has been arrested by Pune Crime Branch from a village in Shirur Tehsil of Pune district#punecrime #Rape #maharshtra @PuneCityPolice pic.twitter.com/G8PdSUGHO8— Indrajeet chaubey (@indrajeet8080) February 28, 2025 జరిగింది ఇదీ..పూణేలో అత్యంత రద్దీగా ఉండే బస్ స్టేషన్లలో ఒకటైన స్వర్గేట్లో మంగళవారం ఉదయం అత్యాచార చోటు చేసుకుంది. తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్‌స్టేషన్‌కు చేరుకున్న యువతితో నిందితుడు మాటలు కలిపాడు. అక్క అని సంబోధిస్తూ నమ్మించాడు. గ్రామానికి వెళ్లే బస్సు మరో చోట ఉందని చెప్పి బస్ స్టేషన్లోనే దూరంగా ఎవరూ లేని చోట ఆగి ఉన్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్ దగ్గరకు ఆమెను తీసుకెళ్లాడు.బస్సులోకి వెళ్లేందుకు యువతి తటపటాయించడంతో లోపల ప్రయాణికులు ఉన్నారని.. నిద్రలో ఉండటంతో వాళ్లు లైట్లు వేసుకోలేదని నమ్మించాడు. బస్సులోకి యువతి ప్రవేశించగానే తలుపు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్ (36)గా పోలీసులు గుర్తించారు. అతడిపై అనేక కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిల్ మీద ఉన్నాడని తెలిపారు. రామదాస్‌ను పట్టుకొనేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అత్యాచారం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం. -
అత్యాచార ఘటనపై మాజీ సీజేఐ చంద్రచూడ్ ఏమన్నారంటే..
ఢిల్లీ: మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఉదయం స్వార్గేట్ జంక్షన్ బస్టాండ్‌లో ఆగిఉన్న ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళను ఒక పాత నేరస్తుడు రేప్ చేసి పారిపోయాడు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌కు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్‌జంక్షన్‌లలో ఒకటైన స్వార్గేట్ బస్టాండ్‌లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ గాడేగా గుర్తించారు.చంద్రబూడ్ ఏమన్నారంటే..ఈ అత్యాచార ఘటనపై మాజీ సీజేఐ చంద్రచూడ్ స్పందించారు. ‘గతంలో ‘నిర్భయ’ ఉదంతం చోటు చేసుకున్న తర్వాత చట్టంలో అనేక మార్పులు వచ్చాయి. కేవలం చట్టాల వల్లే మహిళలకు రక్షిణ కల్పించలేం. దీన్ని సొసైటీ ఒక పెద్ద బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో చట్టాలు అమలు తీరు కూడా కచ్చితంగా ఉండాలి. మహిళల రక్షణ కోసం చట్టాలను సరైన విధానంలో అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. తాము బయటకు వెళితే రక్షణ ఉంది అనే భావన మహిళలకు రావాలి. ఈ తరహా కేసుల్లో ఇది చాలా ముఖ్యమైన అంశం. విచారణ న్యాయబద్ధంగా జరగాలి.. అలాగే కఠినమైన శిక్షలను అమలు చేయాలి. తొందరగా విచారణ పూర్తి చేసి శిక్షలను కూడా అంతే త్వరగా అమలు చేయాలి. ఇందులో న్యాయ వ్యవస్థతో పాటు పోలీసులది కూడా పెద్ద బాధ్యతే’ అని చంద్రచూడ్ స్పష్టం చేశారు. నిందితుడి కోసం జల్లెడ పడుతున్న పోలీసులుఈ అత్యాచార ఘటనలో నిందితుడిగా చెప్పబడుతున్న 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన అనంతరం తిరిగి తన ప్రాంతానికి వెళ్లే క్రమంలో అతను చెరుకు తోటల్లో ఉన్నాడనే అనుమానంతో అక్కడ పోలీసులు సోదాలు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అత్యాచార ఘటన తర్వాత ఆ నిందితుడు తన డ్రెస్ మార్చుకోవడంతో పాటు షూస్ కూడా మార్చినట్లు తెలుస్తోంది. తొలుత కూరగాయాలు తీసుకెళ్లే వ్యాన్ లో అతను తిరిగి పయనమైనట్లు గుర్తించిన పోలీసులు.. అటు తర్వాత అతని ఇంటికి సమీపంగా ఉన్న చెరుకు తోటల్లో ఉన్నట్లు అనుమానిస్తన్నారు. దాంతో ప్రత్యేకమైన డాగ్ స్క్వాడ్స్‌తో పాటు డ్రోన్లను కూడా ఉపయోగించి నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు. పుణె బస్టాండ్‌లో దారుణం.. ఒంటరిగా ఉన్న మహిళకు మాయమాటలు చెప్పి -
పుణె బస్టాండ్‌లో దారుణం
పుణె: మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఉదయం స్వార్గేట్ జంక్షన్ బస్టాండ్‌లో ఆగిఉన్న ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళను ఒక పాత నేరస్తుడు రేప్ చేసి పారిపోయాడు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌కు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్‌జంక్షన్‌లలో ఒకటైన స్వార్గేట్ బస్టాండ్‌లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ గాడేగా గుర్తించారు. గతంలో ఇతనిపై దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు సతారా జిల్లాలోని ఫల్టణ్ పట్టణానికి వెళ్లే బస్సు ఎక్కేందుకు బాధిత మహిళ ఈ బస్టాండ్‌లోని ఒక ప్లాట్‌ఫామ్ వద్ద వేచిచూస్తోంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన నిందితుడు ‘సోదరీ’ అంటూ ఆమెతో మాటలు కలిపాడు. తాను బస్ కండక్టర్‌ను అని, మీరు ఎక్సాలిన బస్సు సమీపంలో ఆగి ఉందని చెప్పి, సమీపంలో ఆగి ఉన్న ‘శివ్ షాహీ’ ఏసీ బస్సును చూపించాడు. అది మీరు వెళ్లాల్సిన రూట్లో వెళ్తుందని చెప్పి ఆ బస్సు ఎక్కాలని ఆమెకు సలహా ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన ఆమె ఎవరూ లేని ఆ బస్సు ఎక్కింది. లైట్లు ఆఫ్ చేసి, చిమ్మచీకటిగా ఉన్న బస్సును ఎక్కేందుకు తొలుత ఆమె తటపటాయించింది. బస్సులో ప్రయాణికులు నిద్రిస్తుండటంతో లైట్లు ఆర్పివేశారని, నచ్చజెప్పి బస్సులో లోపలిదాకా వెళ్లేలా చేశాడు. వెంటనే వెనకాలే వచ్చిన అతను బస్సు తలుపు మూసేసి, ఆమెను రేప్‌చేసి పారిపోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్మార్థనా పాటిల్ చెప్పారు. ఘటన జరిగినప్పుడు బస్టాండ్‌లో ఎన్నో బస్సులు, ఎంతో మంది ప్రయాణికులు ఉన్నారు. మహిళ తనకు జరిగిన అన్యాయంపై వెంటనే ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఫల్టణ్కు వెళ్లే బస్సు ఎక్కి మార్గమధ్యంలో తన స్నేహితురాలికి ఫోన్‌చేసి ఘోరాన్ని వివరించింది. ఆమె సలహామేరకు బాధితురాలు వెంటనే బస్సు దిగి సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదుచేశారు. నిందితుడిని అరెస్ట్చేసేందుకు పోలీసులు ఎనిమిది బృందాలను ఏర్పాటుచేసి వేట మొదలెట్టారు. పోలీస్‌స్టేషన్‌కు ఈ బస్టాండ్ కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. నిందితుడు గతంలో ఒక కేసులో బెయిల్ సంపాదించి 2019 ఏడాది నుంచి బయటే ఉన్నాడు.విపక్షాల విమర్శలు‘‘ఏమాత్రం భయం లేకుండా అసాంఘిక శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. పుణెలో నేరాలను అరికట్టడంలో హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం విఫలమయ్యారు’’ అని ఎన్సీపీ(ఎస్పీ) నాయ కురాలు, ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు. -
మెట్రో–3 భూగర్భ రైళ్లకు తగ్గిన ఆదరణ
దాదర్: ముంబైలోని పశ్చిమ ఉప నగరాలతో ఉత్తర–దక్షిణ ప్రాంతాలను కలిపే మెట్రో–3 భూగర్భ రైళ్లకు ప్రయాణికుల ఆదరణ కరువైంది. ప్రయాణికులు రాక ఆదాయం లేకపోవడంతో మంబై మెట్రో రైలు వికాస్ కార్పొరేషన్ (ఎంఎంఆర్‌వీసీ) అందోళనలో పడింది. మెట్రో– 3 మార్గానికి ప్రారంభంలో ప్రయాణికులు నుంచి మంచి స్పందన వ్యక్తమైంది. అయితే క్రమ క్రమంగా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతున్నట్లు అధికారుల దృష్టికి వచి్చంది. మెట్రో అధికారులు ఈ పరిస్థితికి కారణాలను అన్వేషిస్తున్నారు. రెండు, మూడు దశలు పూర్తైతే! రాష్ట్రంలోనే అత్యధిక పొడవైన భూగర్భ మెట్రో రైలు మార్గమైన మెట్రో–3 ప్రాజెక్టు మొదటి దశ మార్గాన్ని గతేడాది అక్టోబరులో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మెట్రోరైళ్లు రోజుకు 162 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రారంభం నుంచి నవంబరు ఆరో తేదీ దాకా ఈ మార్గం మీదుగా ఏకంగా 6.33 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఇక రెండో నెల గడిచిన తరువాత ఈ సంఖ్య 5.64 లక్షలకు పడిపోయింది. దీన్ని బట్టి మొదటి రెండు నెలల్లో మొత్తం 11.97 లక్షలమంది ఈ రైళ్లలో రాకపోకలు సాగించారు. రోజువారీగా చూస్తే మొదటినెలలో రోజుకు సగటున 20, 426 మంది ప్రయాణికులు, ఆ తరువాతి నెలలో రోజుకు 18,810 మంది మాత్రమే రాకపోకలు సాగించారు. ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా ఈ సంఖ్య మరింత తగ్గడం మొదలైంది. రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతుండటంతో ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో మొదట్లో ఎంతో ఆసక్తి కనబర్చిన ప్రయాణికులు ఇప్పుడెందుకు ముఖం చాటేస్తున్నారో అర్ధం కావడం లేదని అధికారులు అంటున్నారు. మెట్రో రైలు దిగిన ప్రయాణికులకు బయట బెస్ట్ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు సరిగా అందుబాటులో ఉండడం లేదని ప్రయాణికుల సంఖ్యలో తగ్గుదలకు ఇది కూడా ఒక కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు. రెండో, మూడో దశ రైలు మార్గం పనులు పూర్తయితే ప్రయాణికుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు. మేలోగా మూడు దశల ముగింపు! రూ.37,275 కోట్ల వ్యయంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మెట్రో–3 భూగర్భ రైలు మార్గం నిర్మాణాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా జేవీఎల్ఆర్ నుంచి బాంద్రా–కుర్లా–కాంప్లెక్స్ (బీకేసీ) వరకు రూ.14,200 కోట్లతో నిర్మించిన మొదటి దశ భూగర్భ రైలు మార్గాన్ని గతేడాది అక్టోబరు ఏడున ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 12.69 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో పది రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రెండో దశ మార్గాన్ని మార్చి చివరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆఖరుదైన మూడో దశ మార్గాన్ని మే నెలాఖరులోగా పూర్తిచేసి ప్రజలకు అంకితం చేయాలని ఎంఎంఆర్‌వీసీ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గడువు దగ్గరపడుతుండటంతో వందలాది అధికారులు, ఇంజనీర్లు, కారి్మకులు, కూలీలు రోజుకు మూడు షిప్టుల్లో విశ్రాంతి లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. -
‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’
ముంబై: ఆ ప్రాంతంలోని ప్రజల్లో అకస్మాత్తుగా జట్టు రాలే సమస్య(Hair Loss) మొదలయ్యింది. పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు.. ఇలా అందరూ దీని బారిన పడ్డారు. జుట్టూడుతున్న యువతీయువకులకు పెళ్లి సంబంధాలు తప్పిపోయాయి. దీంతో కొందరిలో వైరాగ్యం ప్రవేశించింది. గత డిసెంబరు నుంచి ఈ జనవరి వరకూ ఈ సమస్య ఇక్కడివారిని పట్టిపీడించింది. అయితే ఇప్పుడు వైద్య నిపుణులు దీనికి కారణాన్ని కనుగొనడంతో పాటు పరిష్కారాన్ని సూచించడంతో అక్కడివారింతా హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.జాతీయ సమస్యగా..మహారాష్ట్ర(Maharashtra)లోని బుల్ధానా జిల్లాలో అకస్మాత్తుగా జుట్టు రాలడం అనే సమస్య గత డిసెంబరులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు దీనికి కారణమేమిటన్నది వైద్య నిపుణుల నివేదికలో వెల్లడయ్యింది. పంజాబ్, హర్యానాలలోని రేషన్ దుకాణాలు సరఫరా చేస్తున్న గోధుమలలో అధిక సెలీనియం ఉండటం, ఆ గోధుమలను స్థానికులు విరివిగా వినియోగించడమే దీనికి కారణమని వైద్య నిపుణుల నివేదిక పేర్కొంది. సెలీనియం అనేది నేలలో లభించే ఖనిజం. ఇది సహజంగా నీటితో పాటు కొన్ని ఆహార పదార్థాల లభిస్తుంది. జీవక్రియలో కీలక పాత్ర పోషించే ఈ సెలీనియం మనిషికి తక్కువ మొతాదులో అందితే సరిపోతుంది.గుండు కొట్టించుకుని..గత ఏడాది డిసెంబర్, ఈ జనవరి మధ్య కాలంలో బుల్ధానాలోని 18 గ్రామాల్లోని 279 మంది అకస్మాత్తుగా జుట్టు రాలడం అంటే ‘అక్యూట్ ఆన్సెట్ అలోపేసియా టోటాలిస్’(Acute onset alopecia totalis) సమస్యబారిన పడి, ఆస్పత్రులను ఆశ్రయించారు. కళాశాల విద్యార్థులు, యువతీ యువకులు ఈ సమస్యతో సతమతమయ్యారు. కొందరు వివాహాలు కుదరక ఇబ్బందులు పడ్డారు. కొందరైతే జట్టురాలే సమస్యకు పరిష్కారం లభించక గుండు చేయించుని, తమ ఇళ్లకే పరిమితమైపోయారు.వాంతులు, విరేచనాలు కూడా..ఈ సమస్యపై పలు ఫిర్యాదుల అనంతరం వైద్యాధికారులు బాధితుల నుంచి నమూనాలను సేకరించారు. వారు జుట్టురాలే సమస్యతో పాటు తలనొప్పి, జ్వరం, తల దురద, కొన్ని సందర్భాల్లో వాంతులు, విరేచనాల(Vomiting and diarrhea)తో కూడా ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. రాయ్‌గడ్‌లోని బవాస్కర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ ఎండీ డాక్టర్ హిమ్మత్రావ్ బవాస్కర్ మీడియాతో మాట్లాడుతూ స్థానికులు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు పంజాబ్, హర్యానాల నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలే కారణమన్నారు.గోధుమలు మార్చడంతో..ఈ గోధుమల్లో సెలీనియం కంటెంట్ అత్యధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. సాధారణంకంటే 600 రెట్లు ఎక్కువ సెలీనియం తీసుకోవడమే అలోపేసియా కేసులకు కారణమని ఆయన అన్నారు. ఈ నివేదిక దరిమిలా వైద్య నిపుణులు ఈ తరహా గోధుమల వినియగానికి స్వస్తి చెప్పాలని బాధితులకు సూచించారు. దీంతో కొంతమందిలో జుట్టురాలే సమస్య తగ్గి, ఐదారువారాల్లో తిరిగి జట్టు పెరగడం ప్రారంభమయినట్లు వైద్యులు గుర్తించారు. ఇది కూడా చదవండి: Mahashivratri: నేపాల్‌కు 10 లక్షలమంది భారతీయులు -
అక్రమ వలసదార్లను ఎప్పుడు తరిమేస్తారు?
ఛత్రపతి శంభాజీ నగర్: దేశంలో ఎన్నికల ప్రక్రియలో అక్రమ వలసదార్లు జోక్యం చేసుకుంటున్నారని, నిర్ణయాత్మక శక్తులుగా మారుతున్నారని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమెరికా నుంచి అక్రమ వలసదార్లను అక్కడి ప్రభుత్వం బలవంతంగా బయటకు పంపిస్తోందని పరోక్షంగా ప్రస్తావించారు. మన దేశంలో అలాంటి ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పాలంటూ ప్రజలంతా ప్రశ్నించాలని సూచించారు. శనివారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరఠ్వాడా యూనివర్సిటీ 65వ స్నాతకోత్సవంలో జగదీప్ ధన్‌ఖడ్ ప్రసంగించారు. అక్రమ వలసదార్ల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘మన దేశంలో నివసించే హక్కు లేని కోట్లాది మంది ఇక్కడే చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారు. ఇక్కడే బతుకుతున్నారు. మన వనరులపై కన్నేశారు. వాటి కోసం డిమాండ్ చేస్తున్నారు. మన విద్య, ఆరోగ్యం, గృహం.. ఇలా అన్నింటిపైనా వారి దృష్టి పడింది. వారు మరింత ముందుకెళ్తున్నారు. మన ఎన్నికల ప్రక్రియలో సైతం జోక్యం చేసుకుంటున్నారు. అక్రమ వలసదార్ల సమస్యపై అందరికీ అవగాహన కలి్పంచాలి. ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలి’’అని పేర్కొన్నారు. జాతీయవాదమే మన మతమని ఉద్ఘాటించారు. జాతీయవాదానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దేశంలో బలవంతపు మత మారి్పళ్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ధన్‌ఖడ్ ఆరోపించారు. నచి్చన మతాన్ని స్వీకరించే హక్కు పౌరులందరికీ ఉందని చెప్పారు. అయితే, ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి మతం మార్చడం దారుణమని విమర్శించారు. మత మారి్పళ్ల ద్వారా భారతదేశ జనాభా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసి, దేశంపై ఆధిపత్యం చెలాయించడానికి కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. కొన్ని దేశాల్లో మతమారి్పళ్ల వల్ల మెజార్టీ సమూహాలు మైనారీ్టలుగా మారిపోయాయని గుర్తుచేశారు. దేశం అభివృద్ధి చెందాంటే సామాజిక సామరస్యం అవసరమని ఉద్ఘాటించారు. రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలి మన రాజ్యాంగాన్ని విస్తృతంగా అధ్యయనం చేసి, పూర్తిగా అర్థం చేసుకోవాలని జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. రాజ్యాంగం మనకు ఎంతగా అర్థమైతే మనం జాతీయవాదం వైపు అంతగా మొగ్గుచూపుతామని తెలిపారు. మనకు జాతీయవాదమే అతిపెద్దగా మతంగా భావించాలన్నారు. కొందరు దుషు్టలు విదేశాల నుంచి వస్తున్న నిధులతో మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
నిద్రిస్తున్న కూలీలపై ఇసుక అన్లోడ్.. ఐదుగురు మృతి
మహారాష్ట్ర: జల్నాలో విషాదం జరిగింది. నిద్రిస్తున్న తీసుకుంటున్న కూలీలపై టిప్పర్ ట్రక్కు డ్రైవర్ ఇసుక లోడ్ వేయడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. నిద్రిస్తున్న కూలీలను గమనించకుండా ట్రక్కు డ్రైవర్.. ఇసుకను అన్లోడ్ చేశాడు.ఇసుక అన్లోడ్ చేసే సమయంలో షెడ్డు కూలడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, శిథిలాల నుంచి మహిళ, బాలికను రక్షించారు. శనివారం తెల్లవారుజామున జాఫ్రాబాద్ తహసీల్‌లోని పసోడి-చందోల్‌లోని వంతెన నిర్మాణ స్థలంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ పరారీలో ఉండగా, అతని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
డిస్నీని తలపించేలా... సరికొత్త థీమ్ పార్క్
సాక్షి, ముంబై: ముంబై, నవీ ముంబై నగరాల్లోని చిన్నారులకు త్వరలోనే ఒక గొప్ప వినోద అనుభవం లభించనుంది. మిక్కీ మౌస్, మిన్నీ మౌస్, డోనాల్డ్ డక్, గూఫీ వంటి ప్రసిద్ధ కార్టూన్ పాత్రలను ప్రత్యక్షంగా చూసే అవకాశంతో పాటు, థ్రిల్లింగ్ రైడ్లను ఆస్వాదించే అవకాశం కల్పించేందుకు కొత్త థీమ్ పార్క్ ఏర్పాటు కానుంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) గ్రోత్ హబ్’ప్రాజెక్టులో భాగంగా నవీ ముంబైలో 200 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక భారీ థీమ్ పార్క్ నిర్మాణం కోసం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీఏ) ప్రణాళికలు రూపొందించింది. ఎంఎంఆర్‌లో పర్యాటక వృద్ధి కోసం... పరిశ్రమ, పర్యాటకం, విద్య, మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణం, ఆరోగ్యం, ఓడరేవుల అభివృద్ధికి సంబంధించి ఎంఎంఆర్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెమ్మార్డీయే గ్రోత్ హబ్ ప్రాజెక్టుకింద పలు ప్రణాళికలను రూపొందించింది.ఇందులో భాగంగా పర్యాటక కేంద్రంగా అలీబాగ్ అభివృద్ధి, ముంబైలోని చారిత్రక కోటల పరిరక్షణతో పాటు దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు నవీ ముంబైలో డిస్నీల్యాండ్ తరహాలో భారీ థీమ్ పార్క్‌ను నిరి్మంచాలని ప్రతిపాదించింది.ఇదీ చదవండి: వరుడి ముద్దు : రెడ్ లెహెంగాలో సిగ్గుల మొగ్గైన పెళ్లికూతురుమొదటిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో... ప్రస్తుతం ముంబై, నవీ ముంబై, థానేలతో పాటు ఎంఎంఆర్ పరిధిలో అనేక రిసార్టులు, థీమ్ పార్కులు, వాటర్ పార్కులు ఉన్నాయి. అయితే మొట్టమొదటి సారిగా ప్రభుత్వం, ఎమ్మెమ్మార్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన రిసార్టులు, యానిమేషన్ స్టూడియోలు, రైడ్ జోన్లు, వాటర్ పార్క్, ఇతర ఆధు నిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఈ థీమ్ పార్కు రాష్ట్ర పర్యాటక రంగంలో పెద్ద మైలురాయి కాగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. (BirdFlu భయమేల చికెన్‌ను తలదన్నే గింజలు గుప్పెడు చాలు) -
నన్ను తేలిగ్గా తీసుకోవద్దు.. ఏక్నాథ్ షిండే స్ట్రాంగ్ వార్నింగ్
ముంబై: తనకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) తో ఎటువంటి విభేదాలు లేవని గతవారం వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం ఏక్‌నాత్ షిండే(Eknath Shinde). తాజాగా తనను తేలిగ్గా తీసుకోవద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరిక నేరుగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు కాకపోయినా, షిండే ఇలా వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యం ఏమిటో అనేది రాజకీయ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.ఈరోజు(శుక్రవారం) ఏక్ నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ.. ‘ నా గురించి తెలుసు. నేను పార్టీలో సామాన్య కార్తకర్తని. నేను అలాగే భావిస్తాను. అదే సమయంలో బాలా సాహెబ్ కు కూడా కార్యకర్తనే. నన్ను గతంలో తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం ఏమైందో మీకు తెలుసు.’ అంలూ హెచ్చరించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే నేతృత్వంలోని శివసేనకు 57 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఫడ్నవీస్ ప్రభుత్వానికి సూచాయాగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనను తేలిగ్గా తీసుకోవద్దంటూనే గత ప్రభుత్వాన్ని కూల్చిన సందర్భాన్ని షిండే తాజాగా గుర్తు చేసుకోవడమే రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇది ఫడ్నవీస్ ను పరోక్షంగా హెచ్చరించినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాను తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం లేకపోలేదనే సంకేతాలు పంపినట్లు అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఫడ్నవీస్ సమావేశాలకు షిండే డుమ్మా..మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలో జరిగే పలు సమావేశాలకు షిండే తరుచు గైర్హాజరు కావడంతో వారి మధ్య విభేదాలున్నాయనే దానికి అద్దం పడుతోంది. షిండే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమోదించిన రూ. 900 కోట్ల ప్రాజెక్టును ప్రస్తుత సీఎం ఫడ్నవీస్ నిలిపివేయడంతో వీరి మధ్య అగ్నికి ఆజ్యం పోసిందనే వాదన తెరపైకి వచ్చింది. జల్నాలో తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆమోదించిన ప్రాజెక్టును సీఎం హోదాలో ఉన్న ఫడ్నవీస్ ఆపడమే షిండేకు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఫడ్నవీస్ క్యాబినెట్ సమావేశాలకు షిండే దూరంగా ఉన్నట్లు సమాచారం.2022లో ఇలా..మూడేళ్ల క్రితం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు షిండే. 40 మంది ఎమ్మెల్యేలతో బయటకొచ్చేశారు. ఫలితంగా మహా వికాస్ అగాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తరుణంలో బీజేపీకి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారు షిండే.ఇక 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే నేతృత్వంలోని మహాయుతి 232 మంది ఎమ్మెల్యేలను సొంతం చేసుకుంది. బీజేపీ(BJP) 132 సీట్లు గెలవగా, శివసేన 57 మంంది ఎమ్మెల్యేలను, ఎన్సీపీ 41 మంది శాసనసభ స్థానాలను కైవసం చేసుకుంది. దాంతో సీఎం పదవి అనేది ఫడ్నవీస్ ను వరించింది. ఆ సమయంలో తనుకు ఇవ్వబోయే డిప్యూటీ సీఎం పదవిని షిండే తిరస్కరించారు. కొన్ని బుజ్జగింపుల తర్వాత దానికి కట్టుబడ్డారు షిండే.గతవారం అలా.. ఇప్పుడు ఇలాతనకు ఫడ్నవీస్ తో ఎటువంటి విభేదాలు లేవని షిండే గతవారం వ్యాఖ్యానించారు. మా మధ్య ఎటువంటి కోల్డ్ వార్ నడవడం లేదన్నారు షిండే. తాము కలిసి కట్టుగానే అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిపై యుద్ధం చేస్తామన్నారు.అయితే తాజాగా షిండే స్వరంలో కాస్త మార్పు కనిపించింది. ‘నేను విధాన సభలో తొలి ప్రసంగం ఇచ్చినప్పుడు రెండొందలపైగా సీట్లు వస్తాయని ఫడ్నవీస్ అన్నాను. మాకు 232 సీట్లు వచ్చాయి. నన్ను తేలిగ్గా తీసుకోవద్దనే విషయం ఎవరిని ఉద్దేశించి చెప్పానో వారికి అర్ధమైతే చాలు’ అంటూ ముక్తాయించారు ఏక్‌నాత్ షిండే -
అర్ధరాత్రిళ్లు మేసేజ్‌లు.. అశ్లీలతే అవుతుంది!
పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రిళ్లు మెసేజ్‌లు పంపడం.. అశ్లీలత కిందకే వస్తుందని ముంబై సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ మాజీ కార్పొరేటర్‌కు అశ్లీల సందేశాలు పంపాడనే కేసులో ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది.‘‘మీరంటే ఇష్టం, మీరు చూడడానికి బాగున్నారు, అందంగా ఉన్నారు, మీకు వివాహం అయ్యిందా? లేదా?, మీరు సన్నగా ఉన్నారు!!..’’ అంటూ.. తెలియని మహిళలకు అర్ధరాత్రిళ్లు సందేశాలు పంపడం సరికాదు. ఈ చర్య అశ్లీలత(Obscene) కిందకే వస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్లు, వాళ్ల భాగస్వాములు ఇలాంటి వాటిని తట్టుకోలేరు. ప్రత్యేకించి.. ఒకరికొరు పరిచయం లేని సమయంలో అస్సలు భరించలేరు’’ అని అడిషనల్ సెషన్స్ జడ్జి డీజీ ధోబ్లే వ్యాఖ్యానించారు.అయితే రాజకీయ వైరంతోనే ఆమె తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆ వ్యక్తి వాదించగా.. కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. ఏ మహిళ తెలిసి తెలిసి తప్పుడు కేసుతో తన పరువును పణంగా పెట్టాలనుకోదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడు బాధిత మహిళకు వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ప్రాసిక్యూషన్ రుజువు చేసిందని, కాబట్టి నిందితుడు ట్రయల్ కోర్టు విధించిన శిక్షకు అర్హుడు అని సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది.ముంబై బోరివాలీ ఏరియాకు చెందిన మాజీ కార్పొరేటర్‌కు.. 2016 జనవరిలో నార్సింగ్ గుడే అనే వ్యక్తి వాట్సాప్ సందేశాలు పంపాడు. ‘‘మీరు చూడడానికి బాగుంటారు.. మీరంటే ఇష్టం. మీకు పెళ్లైందా?’’ అంటూ అర్ధరాత్రిళ్లు మెసేజ్‌లు పంపాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేసు నమోదు చేసుకుని నార్సింగ్‌ను అరెస్ట్ చేశారు ఆరేళ్ల తర్వాత.. మేజిస్ట్రేట్ కోర్టు నార్సింగ్‌ను దోషిగా నిర్ధారించి.. మూడు నెలల శిక్షను విధించింది. అయితే ఈ శిక్షను అతను సవాల్ చేయగా.. తాజాగా ట్రయల్ కోర్టు తీర్పును సెషన్స్ కోర్టు సమర్థించింది. -
చీటింగ్ కేసులోమంత్రికి రెండేళ్ల జైలు శిక్ష
నాసిక్: 30 ఏళ్ల నాటి చీటింగ్, ఫోర్జరీ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావు కొకాటేకు నాసిక్ జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, యాభైవేల జరిమానా విధించింది. ఈ కేసులో మంత్రి సోదరుడు సునీల్ కోకాటేను కూడా దోషిగా పేర్కొంటూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కోకాటే సోదరులు 1995లో తాము తక్కువ ఆదాయ వర్గానికి (ఎల్ఐజీ) చెందినవారమని పేర్కొంటూ ముఖ్యమంత్రి విచక్షణ కోటా కింద ఇక్కడి యోలకర్ మాలలోని కాలేజీ రోడ్డులో రెండు ఫ్లాట్లను పొందారు. దీనిపై మాజీ మంత్రి, దివంగత టీఎస్ ఢిఘోల్ ఫిర్యాదు మేరకు అప్పట్లో సర్కార్వాడ పోలీస్ స్టేషన్లో కోకాటే సోదరులు, మరో ఇద్దరిపై చీటింగ్, ఫోర్జరీ కే సు నమోదైంది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం కొకాటే సోదరులకు శిక్ష, జరిమానా విధించిన కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. కాగా ఈ కేసులో తనకు బెయిల్ లభించిందని, ఉత్తర్వులపై పైకోర్టులో అప్పీలు చేస్తానని మంత్రి కొకాటే తెలిపారు. -
అన్ని అంశాలను ఇక్కడ విచారించలేం
న్యూఢిల్లీ: స్థిరాస్తుల కూల్చివేత విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించారంటూ మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్ గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసీ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. దీనిపై తాము విచారణ చేపట్టలేమని, హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. అన్ని అంశాలనూ తాము ఇక్కడ విచారించలేమని స్పష్టంచేసింది. ముందస్తుగా నోటీసు ఇవ్వకుండా ఆస్తులను కూల్చడానికి వీల్లేదని, కనీసం 15 రోజుల సమయం ఇవ్వాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు 2024 నవంబర్ 13న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో అధికారులు తగిన సమయం ఇవ్వకుండానే ఆస్తులు కూల్చేశారని ఆరోపిస్తూ బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టుకు వెళ్లాలని -
అంగరంగ వైభవంగా శివాజీ జయంతి, ఊయల వేడుకలు
సోలాపూర్: హైందవ స్వరాజ్య స్థాపకుడు, బహుజనుల పాలకుడు, జనతా రాజా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శ్రీ శివ జన్మోత్సవ మధ్యవర్తి మహా మండల్ ఆధ్వర్యంలో ఊయల వేడుకను ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్థరాత్రి సోలాపూర్ బస్టాండ్ సమీపంలోని శివాజీ మహారాజ్ చౌక్ వద్ద జరిగిన ఈ వేడుకలకు సోలాపూర్ పట్టణం, జిల్లా వ్యాప్తంగా 25 వేల మందికి పైగా మహిళలు హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించి ఊయల గేయాలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపూ బాణాసంచా వెలుగులతో , ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై అనే నినాదాలతో శివాజీచౌక్ పరిసరాలు మార్మోగాయి. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు. శివాజీ మహారాజ్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు బుధవారం దత్తనగర్ లోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీపీఎం మాజీ కార్పొరేటర్ వెంకటేశ్ కొంగారి మాట్లాడుతూ... ప్రజాస్వామ్య బద్దంగా అన్ని కులాలు, వృత్తుల వారికి ఆత్మగౌరవాన్ని అందించే లౌకిక వ్యవస్థతో పాటు హైందవ స్వరాజ్యం ఏర్పాటు కోసం అహరి్నశలు కృషిచేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ అన్నారు. దౌర్జన్యం, బానిసత్వాన్ని పారద్రోలేందుకు విదేశీయులపై దండయాత్ర చేసి స్వయం ప్రతిపత్తి గల రాజ్యాన్ని స్థాపించిన శివాజీ మహారాజ్ మహారాష్ట్రతో పాటు యావత్ భారతదేశానికి ప్రేరణగా నిలిచారని కొనియాడారు. శివాజీ మహారాజ్ వ్యక్తిత్వం ,ఆయన భావజాలాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవలసిన అవసరముందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కామిని ఆడం, శేవంత దేశముఖ్, శకుంతల పానీబాతే, రంగప్ప మారెడ్డి, మురళీధర్ సుంచు, బాలకృష్ణ మల్యాల, వీరేంద్ర పద్మ, అభిజిత్ నీకంబే, అనిల్ వాసం, విజయ్ హర్సూర్ తదితరులు పాల్గొన్నారు.ఛత్రపతి స్ఫూర్తితోసమాజ ఐక్యత కోసం కృషిచేయాలి ఛత్రపతి శివాజీ మహరాజ్ ధైర్యసాహసాలు, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసు కుని సమాజంలో ఐక్యతను నెలకొల్పేందుకు ప్రయతి్నంచాలని కలెక్టర్ కుమార్ ఆశీర్వాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కలెక్టరేట్ నుంచి రంగుభవన్ చౌక్‌లోని చత్రపతి శివాజీ మహారాజ్ ఉద్యానవనం వరకు ‘జై శివాజీ జై భారత్’పేరిట పాదయాత్ర నిర్వహించారు. శివాజీ మహారాజ్ 395 వ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని మొత్తం 36 జిల్లాలలో జై శివాజీ జై భారత్ పాదయాత్ర నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కలెక్టర్ కుమార్ ఆశీ ర్వాద్ జ్యోతి ప్రజ్వలన చేసి, శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. జై శివాజీ,జై భారత్ పాదయాత్ర మరాఠా సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పే ర్కొన్నారు. ఈ యాత్ర ద్వారా శివాజీ భావాజాలాన్ని రాష్ట్రమంతటా వ్యాప్తిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కులదీ ప్ జంగం, పట్టణ పోలీస్ కమిషనర్ ఎం రాజ్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ మౌనిక సింగ్ ఠాకూర్, మనీషా కుంబార్ జిల్లా పరిపాలన విభాగానికి చెందిన అధికారులు, ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
రవీంద్ర నాట్య మందిర్ పునఃప్రారంభం
ముంబై: కళాకారులు, రంగస్థలనటులకు ప్రీతిపాత్రమైన రవీంద్ర నాట్య మందిర్ ఆడిటోరియం, పీఎల్ దేశ్‌పాండే మహారాష్ట్ర కళా అకాడమీ తిరిగి ప్రారంభం కానున్నాయి. పునరుద్ధరణ పనులు పూర్తైన నేపథ్యంలో ఫిబ్రవరి 28న జరిగే పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్లు హాజరుకానున్నారని ఈ సందర్భంగా అకాడమీ కొత్త చిహ్నం ఆవిష్కరణ కూడా జరుగుతుందని ఓ అధికారి తెలిపారు. ‘రీఓపెన్’ఆర్ట్స్’ కమ్యూనిటీకి కొత్త ఉదయం– మంత్రి ఆశిష్ షెలార్ ఈ సందర్భంగా సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఆశిష్ షెలార్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో అభివృద్ధి చెందుతున్న థియేటర్, ఆర్ట్స్ కమ్యూనిటీకి ఈ కార్యక్రమం ‘కొత్త ఉదయాన్ని‘ తెస్తుందని అన్నారు. అకాడమీతో తరతరాలుగా కళాకారులను, వారిలోని ప్రతిభకు మెరుగులద్దుతూనే ఉన్నామని , దీన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తామని స్పష్టంచేశారు. పునరుద్ధరించిన రవీంద్ర నాట్య మందిర్‌లో అధునాతన సౌండ్ సిస్టమ్స్, రిఫైన్డ్ ఇంటీరియర్స్, రెండు చిన్న థియేటర్లు, ఐదు ఎగ్జిబిషన్ హాళ్లు, ఆరి్టస్టుల కోసం 15 రిహార్సల్ రూమ్‌లు, గ్రాండ్ ఓపెన్–ఎయిర్ స్టేజ్, వర్చువల్ చిత్రీకరణ, సౌండ్ రికార్డింగ్, డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్ కోసం స్టూడియోలు ఏర్పాటు చేశామని ఉన్నాయని మంత్రి తెలిపారు. అకాడమీలో త్వరలో వివిధ కళారూపాలకు సంబంధించి 20 సరి్టఫికెట్, డిప్లొమా కోర్సులను కూడా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. -
ప్రకటన కంపెనీల ఆగడాలకు ‘మాడా’ చెక్
దాదర్: ముంబైవ్యాప్తంగా ఖాళీస్థలాల్లో హోర్డింగులు నిర్మించి వాటిని అద్దెకివ్వాలని మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలఫ్‌మెంట్ అథారిటీ (మాడా) నిర్ణయించింది. త్వరలోనే ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేయనుంది. ముంబైసహా ఉప నగరాలలో అనేక చోట్ల మాడాకు సొంత స్ధలాలున్నాయి. వీటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్ధలాల్లో హోర్డింగులు నిర్మించి వాటిని ప్రకటనల కంపెనీలకు అద్దెకు ఇవ్వనుంది. ఇప్పటికే బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తమ సొంత స్ధలాల్లో హోర్డింగులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రకటనల కంపెనీలకు అనుమతినిచ్చింది. వీటి ద్వారా ఏటా కొన్ని కోట్ల రూపాయలు అదనంగా అర్జిస్తోంది. ఇదే తరహాలో మాడా హోర్డింగులు నిర్మించి అద్దెకు ఇవ్వాలని భావిస్తోంది. హోర్డింగులపై ప్రత్యేక సర్వే... గతేడాది వర్షా కాలంలో ఘాట్కోపర్లోని చడ్డా నగర్లో 80/80 అడుగుల భారీ హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై కూలింది. ఈ ఘటనలో సుమారు 14 మంది చనిపోగా 60పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన మాడా తమ సొంత స్ధలాల్లో ఏర్పాటుచేసిన హోర్డింగులపై సర్వే చేపట్టి వాటి స్ధితి గతులను పరిశీలించింది. ఈ సర్వేలో మొత్తం 62 భారీ హోర్డింగులకు గానూ 50 హోర్డింగులకు మాత్రమే నో అబ్జక్షన్ సరి్టఫికెట్ ఉందని తేలింది. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన మిగిలిన 12 హోర్డింగులను నేలమట్టం చేసింది.నిబంధనల ప్రకారం కంపెనీలు హోర్డింగులు ఏర్పాటు చేసే ముందు బీఎంసీ నుంచి కచి్చతంగా అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత స్ధలం యజమానిగా మాడా నుంచి ఎన్ఓసీ తీసుకోవల్సి ఉంటుంది. కానీ హోర్డింగుల ఏర్పాటుపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. భారీ హోర్డింగుల ఏర్పాటుకు పటిష్టమైన పునాది, బేస్మెంట్, ఇనుప చానెళ్లు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే అవి గాలివేగాన్ని తట్టుకుని నిలబడగలుగుతాయి. అయితే కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీలు ఖర్చుల తగ్గింపుకోసం నామమాత్రంగా పునాదులు తవ్వి హోర్డింగులు నిర్మించి ప్రకటనల కంపెనీలకు లీజుకు ఇస్తున్నారు. ఇలాంటి హోర్డింగులు వర్షాకాలంలో వేగంగా వీచే గాలుల తాకిడికి తట్టుకోలేక నేల కూలుతున్నాయి. ఫలితంగా భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నçష్టం చోటుచేసుకుంటోంది. ఘాట్కోపర్లో గతేడాది జరిగిన హోర్డింగ్ ప్రమాదానికి ఇదే ప్రధాన కారణమని తేలింది. అనుమతి 40/40 అడుగులకు తీసుకుని రెట్టింపు సైజ్( 80/80)హోర్డింగును ఏర్పాటుచేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమ సొంత స్ధలాల్లో స్వయంగా పటిష్టమైన పునాదులతో, బేస్‌మెంట్‌తో హోర్డింగుల ఇనుప చానెళ్లు నిర్మించి అద్దెకివ్వాలని మాడా భావించింది. ఇదీ చదవండి: కంటెంట్ క్వీన్స్ మ్యాజిక్ : ‘యూట్యూబ్ విలేజ్’ వైరల్ స్టోరీ