( ఫైల్ ఫోటో )
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆయన అకాల మరణంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. విమాన ప్రమాదంపై ఆరా తీశారు. అలాగే, పలువురు మంత్రులు, రాజకీయ నేతలు అజిత్ మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ.. నివాళులు అర్పిస్తున్నారు.
ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా అజిత్ పవార్‌కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మోదీ..‘అజిత్ పవార్ ప్రజల నేతగా, కింద స్థాయి వరకు బలమైన అనుబంధం కలిగిన నాయకుడు. మహారాష్ట్ర ప్రజల సేవలో అహర్నిశలు శ్రమించిన కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఆయనకు విశేష గౌరవం ఉంది. పరిపాలనా వ్యవహారాలపై లోతైన అవగాహనతో పాటు, పేదలు-అణగారిన వర్గాల సాధికారతపై ఆయనకు ఉన్న అంకితభావం ప్రశంసనీయం. ఆయన అకాల మరణం అత్యంత తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి అని పోస్టు చేశారు.
Shri Ajit Pawar Ji was a leader of the people, having a strong grassroots level connect. He was widely respected as a hardworking personality at the forefront of serving the people of Maharashtra. His understanding of administrative matters and passion for empowering the poor and… pic.twitter.com/mdgwwGzw4R
— Narendra Modi (@narendramodi) January 28, 2026
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సుదీర్ఘ ప్రజా జీవితం మహారాష్ట్ర అభివృద్ధి, శ్రేయస్సు కొరకు పని చేశారని అన్నారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


