దేశంలో ప్రధాన ఆరోగ్య సమస్య అధిక బరువు అందర్నీ వేధిస్తున్న సమస్యగా మారింది. గంటల తరబడి కూర్చొని చేసే డెస్క్ ఉద్యోగాలు, కదలికలు లేకపోవడం, వీటికి తోడు జంక్ ఫుడ్ ఇవన్నీ ఊబకాయానికి దారితీస్తున్నాయి. దీన్ని తగ్గించుకోవాలని ఎంతో ప్రయాసపడి కఠిన డైట్‌లు అనసరించినా ఫలితం శూన్యంగా ఉంటుంది. అలాంటి వాళ్లు తప్పనిసరిగా ఈ మిరాకిల్ పద్ధతిని అనుసరించి త్వరితగతిన బరువు తగ్గొచ్చని చెబుతున్నారు కంటెంట్ క్రియేటర్ జెసికా ఆర్ట్వానీ. అదెలాగో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తాను ఆ పద్ధతిలోనే దాదాపు 26 కిలోలు బరువు తగ్గినట్లు తెలిపారు కూడా. మరి ఆ మిరాకిల్ టెక్నిక్ గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
చాలామంది బరువు తగ్గేందుకు షార్ట్‌కట్‌లు, తీవ్రమైన దినచర్యలు అనుసరిస్తుంంటారు. నిజానికి బరువు తగ్గడం అనేది సాధారణంగా స్థిరంగా చేసే చిన్న అలవాట్ల వల్లే సాధ్యమవుతుందని అంటున్నారు. గతేడాది నుంచి తాను చిన్ని చిన్న సాధారణ అలవాట్లపై దృష్టిపెట్టి 26 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. తనకు ఈ 26 కిలోలు బరువు తగ్గడానికి ఆ ఐదు సాధారణ అలవాట్లు హెల్ప్ అయ్యాయని చెబుతోంంది.
త్వరితగతిన బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఓ అద్భుతమైన పద్ధతని అభివర్ణిస్తోంది. తాను ఎలాంటి స్ట్రిక్ట్ డైట్‌లు, ఖరీదైన ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లు పాటించలేదని చెబుతోంది జెసికా. తన వెయిట్‌లాస్ జర్నీ గురించి మాట్లాడుతూ..తాను బరువు తగ్గడానికి స్థిరంగా ఈ ఐదు పనులు చేశానని తెలిపింది. ఎలాంటి ఫ్యాన్సీ హ్యాక్స్, షార్ట్‌కట్‌లు లేవని అంటోంది.
సహాయపడిన ఆ ఐదు అలవాట్లు..
వీలైనంత ఎక్కువగా నడవడం: నడక తన దినచర్యలో అతిపెద్ద మార్పులలో ఒకటి. సాధ్యమైనప్పుడల్లా తన రోజులో కదలికను ఒక భాగంగా చేసుకున్నానని జెసికా చెప్పింది. ఆమె మార్నింగ్ వాకింగ్, భోజనం తర్వాత రాత్రి తప్పనిసరిగా కొద్దిసేపు నడక చేసినానని వివరించారామె.
ప్రాసెస్ చేసిన చక్కెరను పూర్తిగా తగ్గించడం: ప్రాసెస్ చేసిన చక్కెరను పూర్తిగా తొలగించానని తెలిపింది. అంటే అప్పుడప్పుడూ కనీసం దాని జోలికి పోలేదని, పూర్తిగా దూరం పెట్టానని చెప్పుకొచ్చింది.
ఎక్కువ నీరు త్రాగడం: ఆమె దృష్టి సారించిన మరో అలవాటు హైడ్రేషన్. కానీ తగినంత నీరు త్రాగడం చాలా పెద్ద తేడాను చూపిస్తుంది. ఇది చాలా శక్తిమంతమైన మార్పుకి నాంది అని అంటోంది.
ప్రోటీన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం: ప్రోటీన్ తన భోజనంలో కీలక పాత్ర పోషించిందని చెబుతోంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి పైగా అనవసరమైన చిరుతిండిని తగ్గిస్తాయి. ఇక్కడ ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతినందించి, ఆకలి కోరికలను నియంత్రిస్తుంది.
ఒక సవాలు పెట్టుకోవడం: తాను అనుకున్నట్లుగా అన్ని పాటించానా లేదా అనే సెల్ఫ్ చెకింగ్ లేదా జవాబుదారితనం తనకు బరువు తగ్గాలనే ఆకాంక్షను రెట్టింపు చేసేదట. దాంతో చాలా కేర్‌ఫుల్‌గా ఉండటమే గాక తనను తాను ప్రశ్నించుకునేటప్పడూ..దోషిలా ఉండకూదన్న భయం సదా వెయిట్‌లాస్ అయ్యేందుకు ప్రేరేపించేదట.
ఇక్కడ జెసికా వెయిట్‌లాస్ జర్నీలో ..బరువు తగ్గాలంటే తీవ్రమైన మార్పులు, అతి వర్కౌట్‌లు అవసరం లేదు. కేవలం చిన్న అలవాట్లే స్థిరంగా.. కంటిన్యూటీ మిస్ కాకుండా చేస్తే చాలు బరువు తగ్గడం చాలా సులభమని తెలుస్తోంది కదూ.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం
(చదవండి: చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు)


