మరో దుబాయ్‌ వ్యాపారవేత్త ఔదార్యం, 64 ఫ్లాట్స్‌ ఫ్రీగా | Middle East crisis Indian businessmen in Dubai open 64 unit apartment farmhouse for stranded Indians | Sakshi
Sakshi News home page

మరో దుబాయ్‌ వ్యాపారవేత్త ఔదార్యం, 64 ఫ్లాట్స్‌ ఫ్రీగా

Mar 10 2026 3:58 PM | Updated on Mar 10 2026 4:10 PM

Middle East crisis Indian businessmen in Dubai open 64 unit apartment farmhouse for stranded Indians

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అనిశ్చిత పరిస్థితుల మద్య  దుబాయ్‌లో భారతీయ వ్యాపారవేత్త మానవత్వాన్ని చాటుకున్నారు. ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా మధ్య జరుగుతున్న భీకరపోరులో చిక్కుకున్న భారతీయ పౌరులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. వారికోసం  తన 64-యూనిట్ అపార్ట్‌మెంట్‌ను వసతిని ఆహారంతో సహా ప్రాథమిక సౌకర్యాలతో ఉచితంగా అందించారు.

అల్ మిజాన్ గ్రూప్ చైర్మన్ యోగేష్ దోషి మానవతా దృక్పథంలో స్పందించిన తీరు ప్రశంసలందుకుంది. నగరంలో చిక్కుకున్న భారతీయులకు 64 అపార్ట్‌మెంట్‌లతో కూడిన తన నివాస భవనాన్నివసతిని ఆహారంతో సహా ప్రాథమిక సౌకర్యాలతో ఉచితంగా అందించడం విశేషంగా నిలిచింది.ఈ ప్రక్రియను ఇండియన్ పీపుల్స్ ఫోరం UAE, దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాతో సమన్వయంతో నిర్వహిస్తున్నామని  తెలిపారు. పిల్లలతో ఉన్న కుటుంబాలతో సహా 125 మందికి పైగా భారతీయులకు క్లిష్ట కాలంలో తాత్కాలిక ఆశ్రయం కల్పించడంలో సహాయం చేశామని దోషి చెప్పారు. కీలకమైన సమయంలో ఈ సహాయం లభించడం చాలా ఊరటనిచ్చిందని  బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.

రియా మకాడియా, పరాస్ భలోడియా మరియు గ్రిష్మా భలోడియాతో పాటు మోహిత్ వచ్చానీ, వారి హోటల్ బుకింగ్‌లు ముగియడంతో, పొడిగింపులు సాధ్యం కాక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్పారు. నిరంతరం ఫోన్లో అలర్ట్‌లు  రావడం కూడా ఆందోళనను పెంచిందని వారు చెప్పారు.

UAEలో భారతీయ వ్యాపారవేత్త ఫామ్‌హౌస్‌ను ఆశ్రయం
దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం, యుఎఇకి చెందిన వ్యాపారవేత్త ధీరజ్ జైన్ కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ్మాన్‌లోని  పెద్ద ఫామ్‌హౌస్‌ను వారికోసం తాత్కాలిక వసతిగా మార్చారు. అనేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఉచిత వసతి భోజనం అందించారు. హోటళ్ళు, వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వారిని ఫామ్‌హౌస్‌కు తీసుకొచ్చేందుకు ఆరు రోల్స్ రాయిస్ వాహనాలతో సహా 11 కార్లను కూడా వినియోగించడం విశేషం. 

ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్, రెండు మిత్రదేశాలు ఇరాన్‌పై సంయుక్త దాడులు చేసి, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత మార్చడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుండి, ఇరాన్ గల్ఫ్ దేశాలలోని ఇజ్రాయెల్, యుఎస్ సైనిక స్థావరాలపై దాడి చేస్తోంది. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి.

(International Women's Day ప్రతీ అడుగు కన్నీటి మడుగు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement