దేశంలో వేధిస్తున్న గ్యాస్‌ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం | Govt invokes ECA to ensure LPG supply | Sakshi
Sakshi News home page

దేశంలో వేధిస్తున్న గ్యాస్‌ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం

Mar 10 2026 12:17 PM | Updated on Mar 10 2026 12:54 PM

Govt invokes ECA to ensure LPG supply

ఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గ్యాస్‌, ఆయిల్‌ సరఫరా తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ ప్రభావం దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మేరకు దేశంలో పెరుగుతున్న ఎల్పీజీ గ్యాస్ కొరతను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది.

కేంద్ర పెట్రోలియం శాఖ ఆయిల్ కంపెనీలకు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. వంటగ్యాస్ ఉత్పత్తి కోసం అవసరమైన హైడ్రోకార్బన్‌ను తరలించేందుకు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. అదనంగా, నేచురల్ గ్యాస్ ఉత్పత్తి నియంత్రణకు పలు మార్గదర్శకాలు ప్రకటించింది.

గృహ అవసరాల గ్యాస్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు గ్యాస్ బుకింగ్‌ సమయాన్ని 25 రోజులకు పెంచింది. గృహ వినియోగదారులు, ఆస్పత్రులు, విద్యాసంస్థలకు ఎల్పీజీ సరఫరాలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

హోటల్స్‌, రెస్టారెంట్లు మరియు ఇతర పరిశ్రమలకు ఎల్పీజీ సరఫరా పర్యవేక్షణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని కేంద్ర పెట్రోలియం శాఖ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సరఫరా వ్యవస్థను క్రమబద్ధం చేయడమే కాకుండా, అక్రమ వినియోగాన్ని అరికట్టనుంది.

ఎల్పీజీ ఉత్పత్తి పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని అమలు చేసింది. ఆయిల్ కంపెనీలు ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. గృహ అవసరాలకు ఉపయోగించే పిఎన్జి, రవాణా కోసం ఉపయోగించే సిఎన్జి, అలాగే ఎల్పీజీ ఉత్పత్తి పెంపుకు ప్రాధాన్యత ఇవ్వాలని గెయిల్‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నేచురల్ గ్యాస్ ఉత్పత్తి కొరత రాకుండా సమన్వయం చేయాలని స్పష్టంగా పేర్కొంది.

భారీగా గ్యాస్ కొరత... మూతపడ్డ హోటళ్లు కేంద్రం కీలక నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement