gas
-
ప్రజలకు చుక్కలు చూపిస్తున్న గ్యాస్ ధరలు
-
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట!
సాక్షి,విశాఖ: పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంలో భారత్‌లో పెట్రోల్, డీజిల్‌తో పాటు ఇతర సహజ వనరుల కొరత ఏర్పడింది. ఆ కొరతను తగ్గించేలా కేంద్రం వడివడిగా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో రష్యా నుంచి ఎల్పీజీ గ్యాస్‌ను భారీ ఎత్తున కొనుగోలు చేసింది. గ్యాస్ నౌకలు రష్యా నుంచి విశాఖ పోర్టుకు వస్తున్నాయి.ఇటీవలే రష్యా నుంచి బయలుదేరిన భారీ క్రూడాయిల్ నౌక ‘ఎంటీ జంబో’ విశాఖ పోర్టుకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నౌకలో మొత్తం 1,36,728 మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ ఉంది. పోర్టు అధికారులు నౌకను బెర్త్‌కు చేర్చి, నేటి నుంచే అన్లోడింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సరుకు రాకతో తూర్పు తీరంలోని రిఫైనరీలకు అవసరమైన ముడి చమురు సరఫరా స్థిరంగా ఉంటుంది.ఎంటీ జంబో రాకతో విశాఖపట్నం తీరంలో ఇంధన సరఫరా సమస్యలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు నడుమ విశాఖ పోర్టుకు వరుసగా ముడిచమురు, ఎల్పీజీ నౌకలు చేరుకోవడం ఊరట కలిగినట్లైంది. ఇటీవల వైజాగ్ పోర్టుకు BW Birch అనే ఎల్పీజీ నౌక చేరుకుంది. ఈ నౌకలో 24వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. నౌక నుంచి గ్యాస్ ట్రాన్స్షిప్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. గ్యాస్ కొరతతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో వరుసగా గ్యాస్,ముడిచమురు నౌకలు రావడం ఊరట కలిగించినట్లైంది.పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా సమస్యలు తలెత్తుతాయన్న భయాలు నెలకొన్నాయి. అయితే విశాఖ పోర్టుకు వరుసగా ముడి చమురు, ఎల్పీజీ నౌకలు చేరుకోవడం వల్ల ఆందోళనలు తగ్గుతున్నాయి. పోర్టు అధికారులు కూడా రాబోయే వారాల్లో మరిన్ని క్రూడ్ ఆయిల్ నౌకలు రానున్నాయని వెల్లడించారు. -
ఫుడ్ బిల్లులో గ్యాస్ చార్జీలు చట్టవిరుద్ధం
న్యూఢిల్లీ: ఎల్పీజీ కొరతను సాకుగా చూపించి హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులపై అధిక చార్జీలు విధిస్తున్నారు. ఫుడ్ బిల్లులో ఎల్పీజీ రుసుము, గ్యాస్ సర్‌చార్జి, ఇతర చార్జీలు జోడిస్తున్నారు. అసలు బిల్లుపై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) ఆగ్రహం వ్యక్తంచేసింది. అలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వు జారీ చేసింది. వినయోగదారుల పరిరక్షణ చట్టం–2019 ప్రకారం నిర్దేశిత రుసుములు మాత్రమే వసూలు చేయాలని స్పష్టంచేసింది. అధిక చార్జీలపై ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు అందినట్లు సీసీపీఏ వెల్లడించింది. మీడియాలోనూ దీనిపై వార్తలు వచ్చినట్లు తెలిపింది. ఆహార పదార్థాలపై మెనూలో ప్రదర్శించిన రుసుములే ఫైనల్ అని పేర్కొంది. వాటిపై వర్తించే పన్నులు మినహా అదనంగా వసూలు చేయకూడదని హోటళ్లు, రెస్టారెంట్లను ఆదేశించింది. -
పెట్రోల్ కోసం పరుగులు.. కొరత ఉందా.. అపోహా..?
-
పెళ్లిలో ఎలాంటి మార్పు లేదు.. భోజనాల్లేవంతే!
పార్వతీపురం మన్యం జిల్లా: అమెరికా–ఇరాన్ మధ్య కొద్ది రోజులు గా జరుగుతున్న యుద్ధం వల్ల ఎల్పీజీ కొరత వల్ల చాలా ప్రాంతాల్లో హోటళ్లు మూతబడుతున్నాయి. హాస్టళ్లలో భోజనానికి ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులను గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివాహం జరిగితే ఇలా ఉంటుందోనని తెలియజేస్తూ ముద్రించిన వివాహ ఆహ్వాన పత్రిక వెరైటీ ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం జరుగుతన్న యుద్ధం వల్ల వివాహ కార్యక్రమాల్లో ఎటువంటి మార్పు లేదని, కావున బంధు, మిత్రులు అందరూ వివాహ కార్యక్రమానికి సకాలంలో హాజరు కావాలని కోరుతున్నాం. గ్యాస్ సిలిండర్లు కొరత వల్ల కేవలం భోజనం ఏర్పాట్లు మాత్రమే రద్దు చేయబడ్డాయి. మిగిలిన కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. కానుకలు ఇచ్చేవారు నిరభ్యంతరంగా ఇవ్వొచ్చు.. వాటిపై ఎటువంటి ఆంక్షలు లేవు.. మీరంతా కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను దీవించవలసినదిగా కోరుతున్నాము. మీ కోసం మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశాం.. గమనించగలరు ధన్యవాదాలు అంటూ.. ఆహ్వానించగా దానికి బదులుగా బందువులు ఈ విధంగా బదులిచ్చారు.. ఆహ్వానించినందుకు ధన్యవాదాలు... మా కారు గ్యాస్‌తో నడుస్తుంది.. ప్రస్తుతం గ్యాస్ కొరత వల్ల కారు కదిలేలా లేదు. కాబట్టి మేము పెళ్లికి రాలేకపోతున్నాం.. మీ కార్యక్రమాన్ని యథా విధిగా కానివ్వండి.. వధూవరులకు మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కెర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆహ్వాన పత్రిక చూసిన వారంతా ట్రెండ్‌కు తగ్గుట్టుందని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. -
గ్యాస్ చార్జీలు వసూలు చేస్తే.. ప్రభుత్వం వార్నింగ్
న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారులపై ఎల్పీజీ ఛార్జీలు, గ్యాస్ సర్‌చార్జ్, ఫ్యూయల్ కాస్ట్ రికవరీ పేరుతో ఎలాంటి అదనపు చార్జీలు విధించవద్దని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ విభాగం (సీసీపీఏ) ఆదేశించింది. ఈ తరహా అనుచిత వాణిజ్య విధానాలను అనుసరిస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం, 2019 కింద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. హోటళ్లు, రెస్టారెంట్ల మెనూల్లో పేర్కొన్న చార్జీలకు అదనంగా పన్నుల వరకే విధించగలరని స్పష్టం చేసింది.అన్ని రకాల తయారీ వ్యయాలు (ముడి సరుకులు, ఎల్పీజీ, విద్యుత్ సహా) మెనూ చార్జీల్లో భాగంగానే ఉండాలని, విడిగా ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని పేర్కొంది. తాము ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఉల్లంఘనలను గుర్తిస్తే వినియోగారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. దేవవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ పేరుతో అదనపు చార్జీలు తీసుకుంటున్నట్టు తన దృష్టికి రావడంతో సీసీపీఏ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ తరహా చార్జీలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. చార్జీల బాదుడుపై ఫిర్యాదు అదనపు చార్జీలు వసూలుపై వినియోగదారులు ముందుగా హోటల్‌ను సంప్రదించి వాటిని తొలగించాలని కోరొచ్చని సీసీపీఏ సూచించింది. ఫలితం లేకపోతే 1915కు కాల్ చేసి లేదా ఎన్సీహెచ్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. అలాగే ఈ–జాగృతి పోర్టల్ ద్వారా వినియోగదారుల కమిషన్ ముందు ఫిర్యాదు దాఖలు చేయొచ్చని లేదా జిల్లా కలెక్టర్, సీసీపీఏకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. -
గ్యాస్ బుకింగ్స్ పై కేంద్రం కీలక ప్రకటన
-
ఏపీలో వంట గ్యాస్ సంక్షోభం
ఉత్తరాంధ్రలోని ఓ గ్యాస్ ఏజెన్సీ నెలకు 17 వేలకుపైగా సిలిండర్లు డెలివరీ చేసేది. నిత్యం 650కిపైగా బుకింగ్‌లు వచ్చేవి. ఈ నెలలో ఇప్పటి వరకు 10 వేల సిలిండర్లు మాత్రమే డెలివరీ చేసింది. పెండింగ్‌లో ఇంకా 7 వేల బుకింగ్‌లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో కంపెనీ నుంచి వచ్చే స్టాక్ ఇప్పుడు తగ్గిపోయింది. మరోవైపు ఆందోళనతో బుకింగ్‌లు డబుల్ అవుతున్నాయి.దీంతో గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. సిలిండర్ బుక్ చేసి 10–15 రోజులవుతున్నా డెలివరీ ఇవ్వలేదని, ఎప్పుడిస్తారని వినియోగదారులు ఫోన్లు చేసి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నామని సదరు ఏజెన్సీ డీలర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాష్ట్రంలో గ్యాస్ ఏజెన్సీ డీలర్లందరిదీ ఇదే పరిస్థితి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంట గ్యాస్ సంక్షోభం ముదురుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కొంగ జపం చేస్తోంది. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు పది రోజులైనా సిలిండర్లు డెలివరీ చేయలేక ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నా, ప్రభుత్వం మాత్రం అబ్బే.. అంత సమస్య లేదంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. గ్యాస్ కొరతతో హోటళ్లు, హాస్టళ్లు మూతపడేలా చేసింది. ముఖ్యంగా వాణిజ్య గ్యాస్ బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టడంలో ఘోరంగా విఫలమైన సర్కార్.. ప్రత్యామ్నాయం చూపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.వాస్తవానికి గృహ వినియోగ గ్యాస్ బుకింగ్‌లకు తగ్గట్టు సరఫరా జరగడం లేదు. ఏపీలో 1.61 కోట్ల గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు ఉండగా, గతంలో నెలకు సగటున 70 లక్షలకుపైగా సిలిండర్లు డెలివరీ అయ్యేవి. అంటే రోజుకు 2.5 లక్షలకుపైగా సిలిండర్లు డెలివరీ ఇస్తుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1.80 లక్షలకు పడిపోయింది. మొత్తంగా 60 శాతం కొరత! ఏపీలో గృహ వినియోగ అవసరాల కోసం రోజుకు 4 వేల టన్నుల గ్యాస్ నిల్వలు అవసరం. ప్రస్తుతం ఏపీలో 14 వేల టన్నుల నిల్వ ఉందని, నాలుగు రోజులకు సరిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ, సాధారణ రోజులతో పోలిస్తే ఇప్పుడు ఏజెన్సీలకు సరఫరా చేసే గ్యాస్‌లో 15–20 శాతం తగ్గుదల ఉంటోంది. ఫలితంగా 40 శాతం వరకు డెలివరీలు పెండింగ్‌లో ఉంటున్నాయి. మొత్తంగా క్షేత్ర స్థాయిలో 60 శాతం గ్యాస్ కొరత ఉంటే, ప్రభుత్వం మాత్రం కాకి లెక్కలు చూపిస్తూ ప్రజలను మభ్య పెడుతోంది.2025 మార్చిలో ఏజెన్సీలకు సరఫరా చేసిన గ్యాస్‌కు.. ఈ నెలలో గ్యాస్ స్టాక్‌లో తీవ్రమైన తగ్గుదల ఉందని డీలర్లు వాపోతున్నారు. పైగా ఉగాది, రంజాన్ సెలవులు రావడంతోపాటు ఆదివారం సెలవును సాకుగా చూపించి, రాష్ట్రంలోని ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేశారు. ఈ కారణంగా వారం రోజుల డెలివరీలను 10 రోజులైనా చేయలేకపోతోంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ ఆదివారం సెలవు తీసుకోని ప్లాంట్లు ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదన్నది అతిపెద్ద ప్రశ్న. ఇంకో వైపు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా తగ్గించి, వాటిని పట్టణ ప్రాంతాలకు మళ్లిస్తోంది. అయినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లోనూ సమయానికి వినియోగదారులకు గ్యాస్ అందట్లేదు. ప్రజలే భారం మోయాలా? సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడం చంద్రబాబుకు అలవాటేనని, తాజాగా గ్యాస్ సమస్యలోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని ఆ రంగం నిపుణులు చెబుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా గ్యాస్ కొరత లేదు. అక్కడి హోటళ్లు మూత పడలేదు. వినియోగదారులు ఏజెన్సీల ఎదుట క్యూ కట్టలేదు. కానీ, బీజేపీతో పొత్తులో కొనసాగుతున్న చంద్రబాబు సర్కార్‌లో మాత్రం గ్యాస్ కోసం ప్రజానీకం అల్లాడుతోంది. ఆహార, వాణిజ్య రంగం కుదేలయ్యే పరిస్థితికి వచ్చింది.ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఉచిత సలహాలు మినహా పేదలకు ఒరగబెట్టింది ఏదీ కనిపించట్లేదని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గ్యాస్ కొరత లేదంటూనే రాష్ట్ర వ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ కుక్కర్ల వినియోగాన్ని పెంచాలని ఆదేశాలు జారీ చేస్తుండటం చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. పైగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగాన్ని ప్రోత్సహించాలంటూ పేదల నెత్తిపై భారం మోపే ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి ఒక మధ్య తరగతి కుటుంబం సగటున 14.2 కిలోల సిలిండర్‌ను నెలన్నరకుపైగా వినియోగిస్తుంది.అంటే, రూ.937 వెచ్చిస్తే దాదాపు 45 రోజులకుపైగా గ్యాస్‌పై వంట చేసుకోవచ్చు. కానీ, పీఎన్జీ తీసుకుంటే రూ.వేలల్లో కనెక్షన్ ఫీజు ముందుగా కట్టడంతోపాటు నెలకు రూ.1000కిపైగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే, సాధారణ సిలిండర్ కంటే పీఎన్జీ కోసం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఉచిత సలహా ఇస్తుండటం ఆరి్థక వేత్తలను కలవరపెడుతోంది. ‘కిరోసిన్’ లీకులతో కాలక్షేపం చంద్రబాబు సర్కార్ గ్యాస్ కొరత లేదంటూనే పేదలకు ప్రత్యామ్నాయంగా కిరోసిన్ పంపిణీ చేస్తామని లీకులు ఇచ్చింది. తొలుత ఏజెన్సీ ఏరియాల్లో రేషన్ డీలర్ల ద్వారా కిరోసిన్ పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. తీరా చూస్తే ఏపీలో అందుబాటులో ఉన్న కిరోసిన్ నిల్వ కేవలం 2,700 కిలో లీటర్లు మాత్రమే. వాస్తవానికి 1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి లీటరు చొప్పున కిరోసిన్ ఇవ్వాలంటే సుమారు 14,800 కిలో లీటర్లు అవసరం.కానీ, 18 శాతం కూడా పంపిణీకి సిద్ధంగా లేకపోయినా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రకటనలు గుప్పించింది. కిరోసిన్ ఫ్రీ స్టేట్‌గా మారిన ఏపీని చంద్రబాబు మళ్లీ కిరోసిన్ ఆధారిత రాష్ట్రంగా మార్చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో 20కి పైగా కిరోసిన్ ఫ్రీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. గ్యాస్ కొరతతో ఏ రాష్ట్రం కూడా కిరోసిన్ వినియోగంపై ఆలోచన చేయట్లేదు. కానీ, ఒక్క ఏపీలో మాత్రమే కిరోసిన్ పంపిణీ మళ్లీ పునఃప్రారంభించాలని చూడటం స్థానికంగా దిగజారిన జీవన ప్రమాణాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఒకవేళ సర్కారు కిరోసిన్ పంపిణీ చేసినా ప్రజలు కిరోసిన్ స్టవ్‌ల కోసం దుకాణాలకు పరుగుపెట్టాలి. ఆ మేరకు కిరోసిన్ స్టవ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయా? రాష్ట్రంలో ఇదీ పరిస్థితి ⇒ సింగిల్ సిలిండర్ ఉన్న వారు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ⇒ వాణిజ్య గ్యాస్ సరఫరాను పూర్తిగా నిలిపి వేయడంతో పది రోజులుగా వ్యాపారాలు చతికిలపడ్డాయి. ⇒ బ్లాక్ మార్కెట్ దందాకు గేట్లు తెరుచుకున్నాయి. రూ.2 వేలు ఉండే ఒక్కో సిలిండర్‌ను రూ.4 వేల నుంచి రూ.4500 వెచ్చించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ⇒ చిరు హోటల్ వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడింది. రూ.వేలు పెట్టి సిలిండర్లు కొనలేక, హోటళ్లను మూసేస్తున్నారు. టీ దుకాణాల్లో ‘స్పెషల్ టీ’ల అమ్మకాలు ఆపేశారు. ⇒ ప్రభుత్వం చాలా చోట్ల హాస్టళ్లకు కూడా సిలిండర్లను సరఫరా చేయించలేకపోతోంది. ⇒ స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లకు బ్లాక్ మార్కెట్లో గ్యాస్ కొనగలిగే స్తోమత ఉంటుంది. కానీ, 25 వేల మంది చిరు వ్యాపారులు ఆ భారాన్ని మోయలేక కొందరు దుకాణాలు మూసేయగా, మరికొందరు ప్రత్యామ్నాయ పొయ్యిలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రైవేటు హాస్టళ్లు, స్కూళ్లు ఉగాది, రంజాన్ సెలవులను సాకుగా చూపించి విద్యార్థులను ఇళ్లకు పంపించేశాయి.స్టాక్ మేరకు పంపిణీ చేస్తున్నాంమా ఏజెన్సీల్లో స్టాక్ ఉన్నంత మేరకు వినియోగదారులకు సిలిండర్లు పంపిణీ చేస్తున్నాం. ఫస్ట్ బుకింగ్.. ఫస్ట్ ప్రయార్టీ ప్రకారం చేస్తున్నాం. గృహ వినియోగదారులు ఎవరి సిలిండర్లను వారే వాడుకోవాలి. వాణిజ్య సిలిండర్లు తొలుత పట్టణాల్లో 30 శాతం మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తాయి. – కె.శ్రీనాథ్‌రెడ్డి, ఏపీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
ఇంటికొచ్చే గ్యాస్ ఇన్ని రకాలా..?
సామాన్యుడి వంటగదిలో ఎర్రటి గ్యాస్ సిలిండర్ (LPG) కనిపించడం సర్వసాధారణం. కానీ, మారుతున్న కాలంతో పాటు గ్యాస్ వినియోగం తీరు కూడా మారుతోంది. నగరాల్లో వాహనాల కోసం సీఎన్జీ (CNG), ఇళ్లలో పైప్‌లైన్ ద్వారా వచ్చే పీఎన్జీ (PNG).. ఇలా గ్యాస్ రకాలు వినడానికి ఒకేలా ఉన్నా, వాటి ఉపయోగాలు మాత్రం వేరు. భారతదేశ ఇంధన వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ నాలుగు రకాల గ్యాస్‌ల గురించి క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం.వంటగదిలో రారాజు.. ఎల్పీజీకోట్లాది భారతీయ కుటుంబాలకు వంటగదిలో గ్యాస్ అంటే మొదట గుర్తొచ్చేది ఎల్పీజీ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ముడి చమురు శుద్ధి ప్రక్రియలో లభించే ప్రోపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమమే ఇది. గ్యాస్‌ను ద్రవ రూపంలోకి మార్చి సిలిండర్లలో నింపుతారు. దీనిని రవాణా చేయడం సులభం కాబట్టి, మారుమూల గ్రామాల్లో కూడా ఇది అందుబాటులో ఉంది. 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన' వంటి పథకాలతో ఇది ఇప్పుడు ప్రతి ఇంటికీ చేరువైంది.సీఎన్జీ.. వాహనాలకు ‘గ్రీన్’ సిగ్నల్కాలుష్యాన్ని తగ్గించడంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) కీలక పాత్ర పోషిస్తోంది. పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా దీనిని వాహనాల్లో వాడుతున్నారు. ఇది ఇతర ఇంధనాల కంటే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. ప్రస్తుతం నగరాల్లో ఆటోలు, బస్సులు, కార్ల కోసం సీఎన్జీ వాడకం విపరీతంగా పెరిగింది. ఇది సహజ వాయువును అధిక పీడనం వద్ద కంప్రెస్ చేయడం ద్వారా తయారవుతుంది.పీఎన్జీ.. సిలిండర్ల గోల లేని వంట గ్యాస్నగరాల్లో ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండ్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG). ఇంటికి వాటర్ కనెక్షన్ ఉన్నట్టే, భూగర్భ పైప్లైన్ల ద్వారా నేరుగా వంటగదికి గ్యాస్ వస్తుంది. దీని వల్ల సిలిండర్ అయిపోతుందనే భయం ఉండదు. మీరు ఎంత వాడుకుంటే అంతకే మీటర్ రీడింగ్ ప్రకారం బిల్లు చెల్లించవచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా దీనిని ఎక్కువగా వాడుతున్నారు.ఎల్ఎన్జీ.. భారీ పరిశ్రమల ఇంధనంలిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) సాధారణంగా మనం నేరుగా వాడేది కాదు. కానీ ఇది దేశీయ ఇంధన సరఫరా గొలుసులో అత్యంత కీలకమైనది. సహజ వాయువును మైనస్ 162°C వద్ద చల్లబరిచి ద్రవంగా మారుస్తారు. ఇలా చేయడం వల్ల దాని పరిమాణం తగ్గి, ఓడల ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం సులభం అవుతుంది. తీర ప్రాంతాలకు చేరుకున్న ఎల్ఎన్జీని తిరిగి గ్యాస్‌గా మార్చి విద్యుత్ ప్లాంట్లు, భారీ పరిశ్రమలకు పంపిస్తారు. -
సిలిండర్ అందుబాటు గ్యాసే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో గ్యాస్ ఇక్కట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని నగరవాసులు వాపోతున్నారు. షేక్‌పేట్‌లోని మాధవి గ్యాస్ ఏజెన్సీ వద్ద శనివారం వినియోగదారులు గంటలతరబడి వేచి చూడడం కన్పించింది. సిలిండర్ కోసం 8 రోజుల నుంచి ఎదురు చూస్తున్నానని, గత రెండు రోజులుగా ఏకంగా ఏజెన్సీ వద్దకు వచ్చి లైన్లో నిలబడినా లభించలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మరికొందరూ ఈ విధంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు దీనిపై స్పందించడం లేదని, సిలిండర్ల పంపిణీలో పారదర్శకత లేదని కొందరు వినియోగదారులు మండిపడ్డారు. ఎవరికి సిలిండర్లు అందిస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. -
గుడ్‌న్యూస్.. రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత నెలకొన్న వేళ రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు. రాష్ట్రాలకు అదనంగా మరో 20 శాతం కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు తెలిపారు.కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి అదనంగా 20 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల 10 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరాను పెంచింది కేంద్రం. తాజాగా మరోసారి 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార ప్రాసెసింగ్/పాడి పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలతో నడిపే రాయితీ క్యాంటీన్లు/అవుట్లెట్లు, కమ్యూనిటీ కిచెన్లకు సరఫరా చూడాలని లేఖలో పేర్కొంది.మరోవైపు.. పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ నౌకల కదలికలు, పోర్టు కార్యకలాపాలు, భారతీయ సముద్ర కార్మికుల భద్రత, సముద్ర వాణిజ్య కొనసాగింపును నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో ఉన్న భారతీయ సముద్ర కార్మికులు అందరూ సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదని తెలిపింది. మొత్తం 22 భారత నౌకలు, 611 భారతీయ సముద్ర కార్మికులు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నారని, డీజీ షిప్పింగ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. -
సిలిండర్ దొరికినోళ్లే ధురంధర్
హైదరాబాద్: నగరంలో గ్యాస్ కష్టాలు సాధారణంగా మారాయి. హోటళ్లు, పీజీలు ఇప్పటికే మూతపడుతుండగా.. మరోవైపు సాధారణ ప్రజలకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఆన్లైన్ బుకింగ్‌లు కాకపోవడంతో చాలామంది గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి. గృహిణులు అయితే చంటి పిల్లలతోనూ ఏజెన్సీల వద్దకు వస్తున్నారు. కాగా, హోటల్ నిర్వాహకులు కొందరు ఓపెన్ కిచెన్ లో వంట చేస్తున్నారు. సీఎన్జీతో నడిచే ఆటోలకూ కటకట ఏర్పడింది. దీంతో గ్యాస్ బంకుల వద్ద వాహనాలతో డ్రైవర్లు బారులు తీరుతున్నారు. -
Hyderabad: 2 వేల హోటళ్లు మూత!
సాక్షి,హైదరాబాద్: నగర హోటళ్లకు గడ్డుకాలం దాపురించింది. టిఫిన్ సెంటర్లు, తోపుడుబండ్ల పరిస్థితి మరీ దారుణం. వాణిజ్య సిలిండర్ సరఫరాలో కోత విధించడమే దీనికి కారణం. హోటల్ పరిశ్రమకు అందాల్సిన గ్యాస్‌లో మెజారిటీ వాటాను ఆసుపత్రులు, పాఠశాలలు వంటి అత్యవసర విభాగాలకు అధికారులు మళ్లిస్తున్నారు. దీంతో వాణిజ్య సిలిండర్ల డిమాండ్‌కు, సరఫరాకు మధ్య భారీ అగాధం ఏర్పడింది. నగరంలో 70 వేల నుంచి 80 వేల వరకు రెస్టారెంట్లు, టిఫిన్స్ సెంటర్లు ఉండగా, వారం రోజుల్లో 1,500 నుంచి 2 వేల వరకు మధ్య, చిన్న తరహా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు మూతపడ్డాయి. చాలా హోటళ్లలో మెనూ కుదించారు. ఎక్కువ సమయం ఉడికించాల్సిన వంటకాలను మెనూ నుంచి తొలగిస్తున్నారు. చాలా హోటళ్లు ఇండక్షన్ స్టౌలు, కట్టెల పొయ్యిల వైపు మళ్లుతున్నాయి. భారీ వంటకాలకు విద్యుత్ స్టౌలు సరిపోక సమస్య తలెత్తుతోంది. గృహ, రవాణాకు పూర్తిగా..కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యతలు మారాయి. వాణిజ్య అవసరాలకు (హోటళ్లు, రెస్టారెంట్లు) గ్యాస్ సరఫరాను కనిష్ట స్థాయికి తగ్గించారు. ప్రథమ ప్రాధాన్యం కింద సరఫరా గృహ అవసరాలకు, రవాణా రంగానికి పూర్తిస్థాయిలో గ్యాస్ కేటాయిస్తున్నారు. రెండో ప్రాధాన్యత కింద ఆసుపత్రులు, పాఠశాలలు (మిడ్ డే మీల్స్), అనాథ శరణాలయాలు, విద్యాసంస్థల హాస్టళ్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. పెట్రో కెమికల్ పరిశ్రమలకు సరఫరాను పూర్తిగా నిలిపివేసి, గృహ అవసరాలకు మళ్లిస్తున్నారు. దీని ప్రభావం హోటల్ రంగంపై పడింది. హోటల్ రంగానికి రోజుకు సుమారు 18 వేల నుంచి 23 వేల వాణిజ్య సిలిండర్ల అవసరం ఉండగా, 6,200 సిలిండర్లకు మించి సరఫరా కావడంలేదు. వచ్చే 15 రోజులు అత్యంత కీలకం మారాయి. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే హైదరాబాద్ హోటల్ రంగం భారీగానే నష్టపోయే ప్రమాదముందని హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. సామాన్యుడికి బయట భోజనం భారం కావడమే కాకుండా, హోటల్ రంగంపై ఆధారపడిన సుమారు 5 లక్షల మంది కారి్మకుల ఉపాధి ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యకం చేస్తున్నారు. -
Hyderabad: టిఫిన్ బిల్లులో 5 శాతం గ్యాస్ చార్జీలు
సికింద్రాబాద్‌లోని ఓ ఉడిపి హోటల్ నోటీసు ఇలా.. ‘‘ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ ధరలు, ముడి పదార్థాల ఖర్చులు పెరిగిన కారణంగా మా ధరలను 5 శాతం పెంచాల్సి వచ్చినట్లు తెలియజేస్తున్నాం. మీ సహకారానికి నిరంతర, హృదయపూర్వక కృతజ్ఞతలు. మద్దతుకు మా ధన్యవాదాలు’’.సాక్షి, హైదరాబాద్: అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం సెగ భాగ్యనగరంలోని హోటల్ కంచానికి తాకింది. గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని హోటళ్లు ’గ్యాస్ చార్జీల’పేరిట అదనపు బాదుడు మొదలుపెట్టాయి. బెంగళూరు, చెన్నై బాటలోనే ఇక్కడ కూడా బిల్లులపై అదనపు చార్జీలు వసూలు చేస్తూ వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పటికే హోటల్ ఫుడ్ బిల్లులో జీఎస్టీ, సీజీఎస్టీ 2.5 శాతం చొప్పున మొత్తం 5 శాతం పన్ను చెల్లిస్తున్న వినియోగదారులపై ‘గ్యాస్ సర్‌చార్జీల రూపంలో మరో 5 శాతం అదనపు భారం పడుతోంది. ఆహార పదార్థాలకు రూ.500 బిల్లు అయ్యే చోట, పన్నులన్నీ కలిపి ఇప్పుడు కస్టమర్ దాదాపు రూ.50 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వారం రోజుల్లోనే టిఫిన్లు నుంచి భోజనం వరకు ప్రతి ఆహార పదార్థంపై రూ.10 నుంచి రూ.30 వరకు ధరలు పెరిగాయి. ముఖ్యంగా ఎక్కువ గ్యాస్ వినియోగించే వంటకాల ధరలు ఎగబాగాయి. తగ్గిన వాణిజ్య సిలిండర్ల లభ్యత కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాల మేరకు గ్యాస్ ఏజెన్సీలు గృహ వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాపై గణనీయంగా కోత విధించాయి. దీంతో హోటళ్లకు సిలిండర్ల లభ్యత పడిపోయింది. ఇది కూడా అధికారిక కనెక్షన్లు ఉన్న వాటి సంగతి. మరోవైపు రూ.2,105 ఉండాల్సిన వాణిజ్య సిలిండర్ ధర బ్లాక్‌లో రూ.4,500 నుంచి రూ.5,500 వరకు పలుకుతోంది. గ్యాస్ కోతకు తోడు బొగ్గు, కట్టెల ధరలు కూడా పెరగడంతో బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు కొనాల్సి వస్తోందని, ఆ భారాన్ని భరించలేక బిల్లుపై డైరెక్ట్‌గా 5 శాతం ‘గ్యాస్ చార్జీ’వేస్తున్నామని హోటల్ యజమానులు సమరి్థంచుకుంటున్నారు. -
టిఫిన్ చేయడానికి వెళితే హోటల్స్ లో గ్యాస్ ఛార్జ్
-
గ్యాస్ కొన్ని జ్ఞాపకాలు
‘ఇంట్లో బోర్ కొడితేబయట తినొచ్చు’ అనేవారు. ఇప్పుడు బయట తినడానికి దొరికేలా లేదు. కొన్నాళ్ల తర్వాత ఇంటి పరిస్థితీ తెలియదు. ఏమంటే యుద్ధం వల్ల గ్యాస్ లేదు. కట్టెల పొయ్యి, కిరోసిన్ స్టవ్ దాటి గ్యాస్ వచ్చాక అది ఇంటి ఊపిరిగా మారింది. ఇప్పటి తరానికి తెలియదు గాని గ్యాస్ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి స్త్రీలకు.‘వాళ్లు గ్యాస్ కొనుక్కున్నారట’... 1980లలో ఇది చిన్న ఊళ్లలో పెద్ద వార్త. గ్యాస్ కొనుక్కోవడం అంటే ఆడవాళ్లకు అతి పెద్ద రిలీఫ్ ఏమిటంటే– అది ఎప్పుడు పడితే అప్పుడు వెలుగుతుంది. వాన వచ్చినా, చలి ఉన్నా, అర్ధరాత్రయినా, తెల్లవారుజామున కానీ... ఎప్పుడైనా సరే... టప్.. వెలుగుతుంది. ఆడవాళ్లు ఈ వింతను చూడటానికి ఆ గ్యాస్ కొనుక్కున్న వారి ఇంటికి వెళ్లేవారు. అప్పటివరకూ వాళ్లకు కట్టెల పొయ్యి తెలుసు. కట్టెలు తెచ్చుకుని, పొయ్యిలో పెట్టుకుని, వాటిని కిరోసిన్ వేసి ముట్టించి, బాగా మండే వరకు ఆగి... ఆ తర్వాత ఊదుడు గొట్టంతో ఊది ఊది... ఇన్ని చేస్తే గాని వంట పూర్తి కాదు.ఇక కిరోసిన్ స్టవ్ ఉంటుంది గానీ అందుకు కిరోసిన్ కావొద్దూ! వొత్తులు ఉండే స్టవ్‌ను వొత్తులు సరి చేసుకుని వెలిగించి మెల్లగా వంట మొదలెడితే ఎప్పటికో అవుతుంది. పంప్ స్టవ్ కొంచెం డేంజర్. ఇది మగవారికి సౌకర్యంగాని ఆడవాళ్లకు బెరుకే. బుజ్‌మని నీలిరంగు మంట వచ్చే ఈ స్టవ్‌లు ఆ రోజుల్లో పేలేవి. ఈ స్టవ్‌లు వాడాలంటే తరచు పిన్‌తో నొక్కి బర్నర్‌ను యాక్టివేట్ చేయాలి. అది మరో తలనొప్పి. అయినా సరే. పెద్ద టెన్షన్ ఉండేది కాదు. కట్టెలు దొరుకుతాయి. కిరోసిన్ కూడా బ్లాక్‌లో బాగానే దొరికేది. వంట చేయాలనుకోవాలేగాని చేయొచ్చు. ఆ సమయంలో ఇదిగో ఇలా గ్యాస్ ఊడిపడింది.ఎన్నో అనుమానాలుమొదట గ్యాస్ స్టవ్‌ను ఎవరూ నమ్మలేదు. సిలిండర్ పేలి చచ్చిపోతారని భయపడుతూ స్తోమత ఉన్నవారు కూడా కొనలేదు. గ్యాస్ మంట మీద వొండేది రుచిగా ఉండదని మరో అభి్ర పాయం. గ్యాస్ స్టవ్‌ను ఎలా తుడవాలి, ఎలా శుభ్రం చేయాలి తెలియదు. ఇక రెగ్యులేటర్ది పెద్ద అవస్థ. అది బిగించడం తీయడం తెలియదు. రెగ్యులేటర్ ఆన్ ఆఫ్ బటన్‌తో కూడా భయం ఉండేది. ఇక గ్యాస్ లీక్ కావడం గురించి గగ్గోలు ఉండేది. గ్యాస్ వాసన వస్తే భయపడిపోయేవారు. ఇవన్నీ ఇలా ఉండగా గ్యాస్ డీలర్లు గ్యాస్ కొనమని ప్రచారం చేసేవారు. ఆ ఎర్రరంగు సిలిండర్ ఇంటిలోకి అడుగుపెట్టింది.సిలిండర్ వొచ్చిందాసింగిల్ సిలిండర్లే చాలా ఇళ్లలో. డబుల్ సిలిండర్ ఏ కొద్దిమంది దగ్గరో ఉండేది. సిలిండర్ అవుతూ ఉండగా గ్యాస్ బుక్ చేస్తే అయిపోయిన ఎన్నో రోజులకు అది వచ్చేది. అంతవరకు మళ్లీ రకరకాల పద్ధతుల్లో వంట సాగేది. ‘గ్యాస్ దొరకడం లేదట’ అనే వార్త అప్పటినుంచి ఇప్పటి వరకూ స్త్రీలను హైరానా పెడుతూనే ఉంది. గ్యాస్ అయిపోవడం కూడా గమ్మత్తుగా జరుగుతుంది. అదెప్పుడూ తీరుబడిగా ఉన్నప్పుడు అయిపోదు. ఉదయాన్నే అందరూ హడావిడిగా బయలుదేరుతూ వంట చేసుకుని టిఫిన్లు కట్టుకుంటూ ఉండగా అయిపోతుంది. ఆ క్షణంలో ఇంట్లో రేగే కలకలం శత్రుదేశాల సరిహద్దుల వద్ద కూడా ఉండదు.కాస్త సిలిండర్ ఇస్తారాసిలిండర్ చేతుల్లోకి కుటుంబాలు వెళ్లాక ఇరుగు పొరుగు మధ్య గ్యాస్ స్నేహం ఏర్పడింది. వీరు ‘సిలిండర్ ఇచ్చేవారు’ ‘సిలిండర్ ఇవ్వనివారు’గా విభజితం అయ్యాయి. మనకు సిలిండర్ ఇచ్చేవారే క్లోజ్ఫ్రెండ్సు. గ్యాస్ ఎప్పుడైపోతుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఇలాంటి స్నేహం ఒక్కటైనా లేకపోతే మనుగడ కష్టమైపోతుంది. గతంలో పోస్టుమ్యాన్ వస్తే జనానికి ఆనందం ఉండేది. ఇప్పుడు గ్యాసు బండి వీధిలోకి వస్తే సంతోషం కలుగుతోంది. బంగారం ధర, గ్యాస్ ధర... ఇవే సగటు మధ్యతరగతి మహిళకు మోదం ఖేదం కలిగించే విషయాలుగా మారాయి. 1980లలో 40 రూ పాయలున్న సిలిండర్ నేడు 930కి చేరింది. -
గుడ్ న్యూస్.. భారత్‌కు LPG గ్యాస్ నౌక.. గ్యాస్ కొరత ఉండదు..
-
భారత్‌లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయ్!
న్యూఢిల్లీ: భారత్‌లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. ఖతార్ నుంచి శివాలిక్ నౌక భారత్ చేరుకుంది. ఇరాన్ హర్మూజ్ జలసంధి దాటి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు శివాలిక్ నౌక చేరుకుంది. ఐఎన్ఎస్ శివాలిక్ నౌకలో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. ఐఎన్ఎస్ శివాలిక్‌కు రక్షణగా భారత నావికా దళం వచ్చింది.షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలోని ఎల్పీజీ ట్యాంకర్ నౌక శివాలిక్ సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుజరాత్‌కు చేరింది. ఖతార్‌లోని రాస్ లఫాన్ ఓడరేవు నుండి బయలుదేరిన శివాలిక్ హర్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించింది. ఇవాళ గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని ముంద్రా ఓడరేవుకు చేరుకుంది. ఈ నౌక సుమారు 40వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువచ్చింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాలో అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఎల్పీజీ గ్యాస్ నౌక భారత్‌కు సురక్షితంగా రావడం శుభపరిణామ. దేశీయ వంట గ్యాస్ కొరతను తగ్గించడంలో సహాయపడుతోంది. రాస్ లఫాన్ నుండి బయలుదేరిన మరో నౌక నందా దేవి ఇప్పటికే గుజరాత్ తీరానికి దూరంగా ఉంది. రేపు (మార్చి 17న) ఉదయం 6:30 గంటలకు గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నౌక దాదాపు 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని రవాణా చేస్తోంది. ఈ రెండు నౌకలు కలిపి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువస్తున్నాయి. #Fujairah #IranIsraelWar #GlobalEnergy #PMModi #IndianShips #NandaDevi #Shivalik #Delhi $BJP 54 हजार टन LPG लेकर जहाज ‘शिवालिक’ आज मुद्रा पोर्ट पहुंचेगा,नई दिल्ली. मोदी सरकार की कुशल रणनीति और ईरान–इजराइल तनाव के बीच भारत के लिए राहत की खबर है, करीब 54 हजार टन एलपीजी गैस लेकर… pic.twitter.com/YbqSa3dnBM— सिरोही की आवाज (@Sirohikiaawaz) March 16, 2026 -
నమ్మండి.. సిలిండర్ హోమ్ డెలివరీ చేస్తాం
ప్రియమైన కస్టమర్, అధిక/పదేపదే రీఫిల్ బుకింగ్ కాల్స్ కారణంగా స్పందించడంలో తాత్కాలిక ఆలస్యం జరగవచ్చు. వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. భయపడవద్దు. దశాబ్దాలుగా కస్టమర్లకు సేవలందిస్తున్న ఆయిల్ కంపెనీని నమ్మండి. హోమ్ డెలివరీ చేస్తాం. ఏజెన్సీల వద్దకు పరుగు తీయవద్దు. ఇంధనాన్ని ఆదా చేయండి. –వినియోగదారుల ఫోన్‌కు ఐవోసీ పంపుతున్న సందేశం.సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్ సిలిండర్ కొరత వస్తుందనే భయం నగర వాసిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సరఫరాపై ఆంక్షలు విధించి.. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. వినియోగదారులు ఒక్కసారిగా బుకింగ్‌లకు ఎగబడడంతో ‘డొమెస్టిక్ గ్యాస్’ సంక్షోభం తారస్థాయికి చేరింది. కమర్షియల్ గ్యాస్ వాడకంపై కేంద్రం ఆంక్షలు విధించడాన్ని ‘ముంచుకొస్తున్న ముప్పు’నకు సంకేతంగా సామాన్యులు భావిస్తున్నారు. అందుకే సిలిండర్ అయిపోకముందే అడ్వాన్స్ బుకింగ్‌లకు పోటీ పడుతున్నారు. లక్షలాది బుకింగ్‌లతో ఆయిల్ కంపెనీల టెక్నికల్ సర్వర్లు జామ్ అవుతూ యాప్‌లు, వెబ్సైట్లు మొరాయిస్తున్నాయి.వారం దాటినా... నగరంలో హోమ్ డెలివరీ వెయిటింగ్ పిరియడ్ పెరగడం ఆందోళకు గురిచేస్తోంది. సాధారణంగా 24 నుంచి 48 గంటల్లో వచ్చే సిలిండర్, ప్రస్తుతం వారం దాటినా చేరడం లేదు. ఫోన్లలో బుక్ కాకపోవడం, డెలివరీలో జాప్యంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. పౌర సరఫరాల శాఖ, ఆయిల్ కంపెనీల లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో బఫర్ స్టాక్ కనీసం 15 నుంచి 20 రోజులకు సరిపడా ఉంది. అయితే, కేంద్రం ఆంక్షలు విధించడంతో 30 శాతం వరకు అదనపు గ్యాస్ గృహ అవసరాలకు మళ్లుతోంది. ఈ నేపథ్యంలో ఆందోళనకర సందేశాలు, వదంతులు నమ్మొద్దని చమురు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. సరఫరా గొలుసు నిరంతరాయంగా కొనసాగుతోంది. ‘‘హోం డెలివరీలో స్వల్ప జాప్యం వాస్తవమే. అది బుకింగ్‌ల రద్దీ వల్ల మాత్రమే. ఏజెన్సీల వద్దకు రావాల్సిన అవసరం లేదు’’ అని చమురు సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు.కార్గో కంగారు సికింద్రాబాద్‌కు చెందిన వెంకటయ్య కుమారుడు దినేష్ భార్య పిల్లలతో ఖతర్‌లో ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 17న కుమారుడి బర్త్‌డే పారీ్టకి అవసరమైన వస్తువులను నగరం నుంచి తెప్పించాలని భావించి తండ్రికి లిస్టు పంపించాడు. అయితే పశ్చిమాసియా యుద్ధంతో చాలా కార్గో కంపెనీలు పార్సిళ్లు పంపలేమన్నాయని ఆయన ‘సాక్షి’కి చెప్పారు. ఒకటి, అరా ముందుకు వచ్చిన చార్జీలను మాత్రం 3–4 రెట్లు ఎక్కువగా పెంచడంతో పార్సిల్ పంపడం మానుకున్నారు.టౌలిచౌకీకి చెందిన ఓ కుటుంబం సౌదీ అరేబియాలో ఉంటోంది. ఏటా రంజాన్ పండుగకు నగరం నుంచే సామగ్రితోపాటు ఈద్ నమాజ్ కోసం దుస్తులను తెప్పించుకుంటుంది. యుద్ధ ప్రభావంతో కార్గో సర్వీస్ సక్రమంగా లేక ఈసారి అలా కుదరడం లేదు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. పండుగలు, జన్మదినం, మ్యారేజ్ డే.. ఇలా ఏ ఫంక్షన్ ఉన్నా నగరంలోని తమ వారి ద్వారా వస్తువులు, దుస్తులు, పిండి వంటలు, పూజ సామగ్రిని కార్గో సరీ్వసుల ద్వారా తెప్పించుకునేవారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల కార్గో సరీ్వస్‌లు పూర్తి స్థాయిలో కొనసాగకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వేళ ఇక్కడి నుంచి ఎవరైనా పార్సిల్స్ పంపించాలన్నా చార్జీలు విపరీతంగా పెరిగాయి. ఇదివరకు ప్రతిరోజూ వేల సంఖ్యలో నగరం నుంచి అక్కడికి పార్సిల్స్ వెళ్లేవి. ఇతర దేశాలకు ఓకే.. అమెరికా, లండన్, యూరప్, ఆ్రస్టేలియా, ఇతర దేశాలకు నగరం నుంచి కార్గో సరీ్వసులు నిరాంటకంగా కొనసాగుతున్నా చార్జీలు మాత్రం పెరిగాయి. డెలివరీ టైమ్ కూడా ఎక్కువ పడుతోంది. గతంలో ఉన్న రేట్ల కంటే ప్రతి కేజీపై రూ 200–250 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. అమెరికాకు 5 రోజుల్లో వెళ్లే పార్సిల్ ప్రస్తుతం 10–12 రోజులు పడుతోంది. యూకేకు కూడా ఇదే పరిస్థితి. ఆస్ట్రేలియా పార్సిల్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. పౌర సరఫరాల శాఖ కన్నెర్ర పౌర సరఫరాల శాఖ బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి తనిఖీ బృందాలను రంగంలోకి దించింది. గ్యాస్ ఏజెన్సీలు కావాలని ‘నో స్టాక్’ బోర్డులు పెడితే లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. బుక్ అయిన 48 గంటల్లో డెలివరీ అయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. -
ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు కేంద్రం అనుమతి
న్యూఢిల్లీ: గ్యాస్ కొరత వేళ కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలు వాడుకోవచ్చని ప్రకటించింది. ఢిల్లీలో కాలుష్యం ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం మరింత పెరగకుండా ప్రభుత్వం ఎన్నో నిబంధనలను తీసుకొచ్చింది. అయినప్పటికీ, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్‌లో గ్యాస్ కొరత నెలకొనడంతో ఇప్పుడు కట్టెల పొయ్యి వాడక తప్పడం లేదు. దీంతో దానిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. కమర్షియల్ సిలిండర్ల కొరత నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కొన్ని రెస్టారెంట్లలో కట్టెల పొయ్యిపై వంటలు మొదలయ్యాయి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో జిల్లాలోనూ గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని గ్యాస్ ఏజెన్సీలు హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలుపుదల చేశాయి. కొందరికి మాత్రం పాత స్టాక్ ఉండడంతో ఎలాగోలా రెండు రోజులు నెట్టుకొచ్చారు. స్టాక్ లేని వారు కట్టెల పొయ్యిపై వంటలు చేయడం ప్రారంభించారు. ఇంకొందరు సుదూర ప్రాంతాల నుంచి గ్యాస్ తెచ్చుకొని రెస్టారెంట్లను నడుపుతున్నారు.మరోవైపు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, హాస్టళ్ల వంటివి మూడపడకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎల్పీజీలను వాడకుండా విద్యుత్ స్టౌలను వాడుకోవాలని.. ఇలా చేసే హోటళ్లు, టీ స్టాళ్ల వంటివాటికి విద్యుత్ బిల్లులో యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇవాళ ప్రకటన చేశారు.తమిళనాడులో ఏర్పడిన ఎల్పీజీ కొరత వల్ల పరిశ్రమలు, ఫుడ్ సెక్టార్ సహా అనేక రంగాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు శనివారం తమిళనాడు సచివాలయంలో స్టాలిన్ నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది. ‘గ్యాస్ కొరత సమయంలో ఎల్పీజీలు వాడకుండా విద్యుత్ స్టౌలను వాడడం ప్రారంభించే హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు, క్లౌడ్ కిచెన్లు, ఇతర ఆహార తయారీ యూనిట్లు.. అదనంగా వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ వినియోగంపై విధించిన పరిమితులు అమల్లో ఉన్నంత కాలం ఈ సబ్సిడీ కొనసాగుతుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు. -
పశ్చిమాసియా యుద్ధం కారణంగా కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత
-
గ్యాస్ కొరత వేళ హోటళ్లు, టీ స్టాళ్లు మూత పడకుండా..
చెన్నై: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్‌లో గ్యాస్ కొరత నెలకొనడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, హాస్టళ్ల వంటి వాటిని నడపలేని పరిస్థితి వస్తోంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీలను వాడకుండా విద్యుత్ స్టౌలను వాడుకోవాలని.. ఇలా చేసే హోటళ్లు, టీ స్టాళ్ల వంటివాటికి విద్యుత్ బిల్లులో యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.తమిళనాడులో ఏర్పడిన ఎల్పీజీ కొరత వల్ల పరిశ్రమలు, ఫుడ్ సెక్టార్ సహా అనేక రంగాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు శనివారం తమిళనాడు సచివాలయంలో స్టాలిన్ నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది. హోటళ్ల వంటివాటిలో కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జె.రాధాకృష్ణన్ వివరాలు తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో తమిళనాడు ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.‘గ్యాస్ కొరత సమయంలో ఎల్పీజీలు వాడకుండా విద్యుత్ స్టౌలను వాడడం ప్రారంభించే హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు, క్లౌడ్ కిచెన్లు, ఇతర ఆహార తయారీ యూనిట్లు.. అదనంగా వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ వినియోగంపై విధించిన పరిమితులు అమల్లో ఉన్నంత కాలం ఈ సబ్సిడీ కొనసాగుతుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు.ప్రస్తుతం ఉన్న ఎల్పీజీ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమిళనాడులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో విద్యుత్ పరికరాలు కొనుగోలు చేయించేందుకు సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. అర్హత ఉన్న వ్యాపారులు రూ.3.75 లక్షల వరకు రుణాలకు 25 శాతం సబ్సిడీ పొందవచ్చు. మహిళా వ్యాపార అభివృద్ధి పథకం కింద మహిళలు నడిపే వ్యాపారాలకు రూ.10 లక్షల వరకు రుణంపై గరిష్ఠంగా రూ.2 లక్షలపై 25 శాతం సబ్సిడీ ఇస్తారు.అదనంగా ఎస్సీ, ఎస్టీ వ్యాపారులను ప్రోత్సహించేందుకు అన్నై అంబేడ్కర్ బిజినెస్ ఛాంపియన్స్ పథకం కింద గరిష్ఠంగా రూ.కోటి వరకు 35 శాతం మూలధన సబ్సిడీ ఇస్తారు. అధిక సామర్థ్య విద్యుత్ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం. తమిళనాడులో తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి అనుమతితో 60,698 కర్మాగారాలు ఎల్పీజీ, సీఎన్జీ, డీజిల్, ఫర్నేస్ ఆయిల్, కట్టెలు వంటి వాటిని ఉపయోగిస్తూ పనిచేస్తున్నాయి. -
జాతీయ జెండాతో హార్మోజ్ దాటిన మరో భారత్ గ్యాస్ షిప్..
-
హైదరాబాద్‌లో ఒక్కొక్కటిగా మూతపడుతున్న హోటళ్లు..!
సాక్షి,రంగారెడ్డి జిల్లా: బంజారాహిల్స్ పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం నగరంలోని సామాన్యుడిని ఆకలి సెగల్లోకి నెడుతోంది. కమర్షియల్ గ్యాస్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సిలిండర్ల సరఫరా స్తంభించడాన్ని ఆసరాగా చేసుకుని ఉన్న కొద్దిపాటి నిల్వలను దళారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో హోటళ్లు, హాస్టళ్లు, చిన్న టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు మూతపడుతున్నాయి. తద్వారా రోజువారీ కూలీలు, చిరుద్యోగుల ఆహార అవసరాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. విద్య, ఉద్యోగాలకు వచ్చి హాస్టళ్లు, మెస్‌లపై ఆధారపడుతున్న లక్షలమంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఐటీ కారిడార్ (గచ్చిబౌలి, మాదాపూర్), అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, దిల్సుఖ్నగర్ వంటి ప్రాంతాల్లో 11 వేల హాస్టళ్లున్నాయి. వీటిలో 10 లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉంటున్నారని అంచనా. అయితే, నిర్వాహకులు గ్యాస్ వాడకం తగ్గించేందుకు మెనూలో కోత విధిస్తున్నారు. దోశ, పూరీ, చపాతీ వంటివి తొలగించి.. కేవలం ఉప్మా, పొంగల్ వంటి తేలికైన బ్రేక్‌ఫాస్ట్, అన్నం–పప్పుతో సరిపెడుతున్నారు. ⇒ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మధురానగర్, ఫిలింనగర్ ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. వందలాది టీ స్టాల్స్ బంద్ చేశారు. అమీర్‌పేట్, ఎస్ఆర్నగర్, ఫిలింనగర్‌లలో ‘సాక్షి’ పరిశీలించగా.. శనివారం నుంచి హోటళ్లు బంద్ చేస్తామని ఇంకొందరు వ్యాపారులు చెప్పారు. చాలా హాస్టళ్లలో రెండ్రోజుల కిందటే మెనూ కోత పెట్టగా, తాజాగా ఒకపూట భోజనం లేదని చెప్పేస్తున్నారు. డొమెస్టిక్ గ్యాస్ వినియోగంపై నిఘా కమర్షియల్ సిలిండర్లు దొరక్కపోవడంతో చాలామంది హోటల్ యజమానులు గృహావసరాల సిలిండర్లను వాడుతున్నారు. దీనిపై పౌర సరఫరాల శాఖ మెరుపుదాడులకు దిగింది. మూడు రోజులుగా వందల సిలిండర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేసింది. కాగా, చిరు వ్యాపారులకు బ్లాక్‌లో కమర్షియల్ సిలిండర్ల ధరలు షాక్ కొడుతున్నాయి. ‘‘మాకు ఎప్పుడూ రూ.1,800కు సిలిండర్ ఇచ్చేవారు. ఇప్పుడు రూ.3,100 తీసుకుంటున్నారు’’ అని ఫిలింనగర్‌కు చెందిన రంజిత్ చెప్పారు. రూ.4 వేలు, ఇంకొన్నిచోట్ల రూ.5 వేలకూ విక్రయిస్తున్నారన్నారు.ఈ–కుక్కర్లు, ఇండక్షన్ స్టౌలు దొరకట్లేగ్యాస్ సిలిండర్ల కొరత ఆందోళనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్‌లకు డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో ఇలా ఆర్డర్ చేస్తే అలా వచ్చేవి. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్లలో కనిపించడం లేదు. ఉత్పత్తి కంపెనీలు సహా వెబ్సైట్లలో ఇండక్షన్ స్టవ్‌ల ఫొటోలు, ధరలు పేర్కొంటున్నా, ఆర్డర్‌పై క్లిక్ చేస్తే సారీ చెప్పేస్తున్నాయి. మార్కెట్లో వీటి ధరలను అమాంతం పెంచారు. ఎలక్ట్రికల్ కుక్కర్ల వినియోగంతో నగరంలో విద్యుత్ వినియోగం మరింత పెరుగుతోంది. నిన్నటివరకు గ్రేటర్లో 3300 మెగావాట్లకు మించని వాడకం.. తాజాగా 3500 మెగావాట్లు దాటడం గమనార్హం.కమర్షియల్‌గా వినియోగిస్తే చర్యలు గృహపయోగ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ రాజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇప్పటికే గృహ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నందుకు 233 కేసులు నమోదు చేసి 381 గృహ ఎల్పీజీ సిలిండర్లు స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. తగిన నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు. సర్వర్ డౌన్.. నో స్టాక్..! బంజారాహిల్స్: గృహావసర వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో కావొచ్చు, స్టాక్‌లో కావొచ్చు సమస్యలు లేవని ఒకవైపు కేంద్రం ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం వందలాది విని యోగదారులు బుకింగ్ కోసం యూసుఫ్‌గూడ గణ పతి కాంప్లెక్స్ దగ్గర ఉన్న బంజారా గ్యాస్ ఏజెన్సీకి వచ్చారు. ఆన్లైన్ చేద్దామంటే రావడం లేదని, వాట్సాప్‌లో కూడా బుక్ కావడం లేదని, పేటీఎం, ఫోన్ పే ద్వారా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వినియోగదారులు వాపోయారు. ఏజెన్సీ వద్దకు రాగా.. సర్వర్ బిజీ అంటూ పోస్టర్లు కనిపించాయని చెప్పారు. ఏజెన్సీ ఆఫీస్ మూసి ఉండటంతో ఉసూరుమంటూ వెళ్లిపోయారు. -
ఆకలి తీరుస్తున్న ‘గ్యాస్ అన్డూ’.. టెక్కీల క్రేజీ ఆవిష్కరణ
కొచ్చి: పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంక్షోభపు సెగ వంటగదులనూ తాకింది. కేరళలోని కొచ్చి నగరంలో ఎల్పీజీ (LPG) కొరత తీవ్రం కావడంతో సామాన్యులు, హోటల్ నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ మేధస్సుకు పదును పెట్టారు. గ్యాస్ కొరతతో ఏయే హోటళ్లు మూతపడ్డాయి? ఎక్కడ భోజనం దొరుకుతుంది? అనే వివరాలను ఇట్టే చెప్పేసే ఒక వినూత్న వెబ్‌సైట్‌ను వారు అందుబాటులోకి తెచ్చారు.చేదు అనుభవం.. సరి కొత్త ఆలోచనవైశాఖ్ సురేష్, వి. విశ్వనాథ్ కర్త అనే ఇద్దరు టెక్కీలు ఇటీవల తమ టీమ్ సభ్యులతో కలిసి డిన్నర్‌కు వెళ్లారు. 30 మంది ఉన్న ఆ బృందానికి నగరంలోని ప్రధాన హోటళ్లలో ఆహారం లభ్యం కాలేదు. గ్యాస్ కొరత కారణంగా హోటళ్లలో వంటలు నిలిచిపోయాయని తెలుసుకున్నారు. కావాల్సిన ఆహారం దొరకక, నగరం అంతా తిరగాల్సి రావడంతో వారికి గంటల కొద్దీ సమయం, ఇంధనం వృథా అయ్యాయి. ఈ ఇబ్బంది మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో ‘గ్యాస్ అన్డూ’ ‘Gas Undo’ (https://www.gasundo.live/) పేరుతో ఒక వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు.లైవ్ మ్యాప్‌తో ఆహారం వేట సులభంఈ వెబ్సైట్ ఒక డిజిటల్ మ్యాప్ మాదిరిగా పనిచేస్తుంది. కొచ్చి నగరంలోని దాదాపు 2,488 రెస్టారెంట్ల వివరాలను ఇందులో పొందుపరిచారు. ఏ హోటల్ ప్రస్తుతం ఏమి ఆహారం దొరుకుతుంది? ఎక్కడ పరిమితమైన మెనూ మాత్రమే అందుబాటులో ఉంది? తదితర వివరాలను రియల్ టైమ్‌లో ఈ వెబ్పసైట్ ద్వారా తెneighboursలుసుకోవచ్చు. గ్యాస్ కొరత కారణంగా ఇండక్షన్ స్టౌవ్‌లు లేదా కట్టెల పొయ్యిలకు మారిన హోటళ్ల సమాచారాన్ని కూడా ఇందులో చూడవచ్చు.ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యంఈ ప్లాట్‌ఫారమ్ విశేషమేమిటంటే ఇది పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతో నడుస్తుంది. ఏదైనా హోటల్‌కు వెళ్లిన కస్టమర్లు అక్కడ ఆహారం అందుబాటులో ఉందో లేదో వెంటనే మ్యాప్‌లో అప్డేట్ చేయవచ్చు. దీనివల్ల వేరే వాళ్లు ఆ హోటల్‌కు వెళ్లి, నిరాశ చెందాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. సాంకేతికతను సామాన్యుల కష్టాలను తీర్చడానికి ఎలా ఉపయోగించవచ్చో ఈ కేరళ టెక్కీలు చక్కగా నిరూపించారు.ఇది కూడా చదవండి: అంతులేని ప్రేమతో.. మహిళ లోదుస్తులు చోరీ! -
వంటింటి వార్‌కు చెక్..
సాక్షి, స్పెషల్ డెస్క్: ప్రతి ఇంటా ఇప్పుడు ఒకటే చర్చ. వంటింట్లో గ్యాస్ అయిపోతే? సిలిండర్ సమయానికి రాకపోతే? ప్రత్యామ్నాయం ఏంటి? వంటలు ఎలా? ఇదంతా ఎందుకంటే యూఎస్–ఇరాన్ యుద్ధం ప్రభావం ఇప్పుడు మన వంటింటి వరకూ వచ్చింది. ఎక్కడో జరుగుతున్న యుద్ధమే కావొచ్చు. కానీ ఆ వార్ కాస్తా ఎల్పీజీ సరఫరాను దెబ్బతీయడంతో ప్రతి ఇంటి సమస్యగా మారింది. ఈ సమస్య రోజురోజుకూ ముదురుతోంది. ఎన్ని రోజులు ఇది కొనసాగుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వంట గ్యాస్‌కు, వంటలకూ ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం తక్షణ పరిష్కారం. గ్యాస్ లేదంటే ముందుగా గుర్తొచ్చేది ఎలక్ట్రిక్ స్టవ్ (ఇండక్షన్ కుక్‌టాప్స్), ఎలక్ట్రిక్ కుక్కర్, సోలార్ కుక్కర్, ఇతర అప్లయెన్సెస్. ఇవి మార్కెట్లో విరివిగా దొరుకుతున్నా అందరికీ కొనే స్తోమత ఉండకపోవచ్చు. పల్లెల్లో కట్టెలు, బొగ్గు వంటివి ఇంధనంగా వాడుతున్నారు. పట్టణాల్లో వీటిని వాడటం సాధ్యం కాదు. ఉపకరణాలను కొనలేనివారు, సహజ ఇంధనాలను వాడలేనివారు, ఇంకా చెప్పాలంటే అందరూ.. ఇవేవీ అవసరం లేకుండానే సహజ పదార్థాలతో వంటలు ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందామా.. వంటింటి శ్రమను తగ్గించేలా.. స్టవ్‌తో పనిలేకుండా సహజ ఆహారంతో విభిన్న వంటకాలను నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. కొన్ని పచ్చళ్లు, పొడులు రోట్లో లేదా రాయిపై నూరుకోవచ్చు. మిక్సీ ఉంటే మిక్సీలోనూ కొన్ని వేసుకోవచ్చు. నూనెల వాడకం, వేపుళ్లు తగ్గించవచ్చు. వండటం, పాత్రలు శుభ్రం చేసుకోవడంలో మహిళలు ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు. ఖర్చూ తగ్గుతుంది. ఇక రుచి అంటారా.. వేరుశనగ, నువ్వుల వంటి నూనె గింజల పొడులు వాడతాం కాబట్టి రుచి అద్భుతంగా ఉంటుంది. పూర్వకాలపు నిల్వ రోటి పచ్చళ్లుఒకప్పుడు స్టవ్ అవసరం లేకుండానే రోటి పచ్చళ్లు తయారుచేసుకునేవాళ్లు. నూనె తాలింపు కూడా చాలా వాటికి అవసరం లేదు. వేడి వేడి అన్నంలో వీటిని కలుపుకొని తింటే.. ఆ రుచిని మాటల్లో చెప్పలేం. పండు మిర్చి పచ్చడి, టమాటా పచ్చడి, కరివేపాకు పచ్చడి, క్యారెట్ పచ్చడి, మామిడికాయ కొబ్బరి పచ్చడి, దోసకాయ రోటి పచ్చడి, కరివేపాకు క్యారెట్ పచ్చి కొబ్బరి పచ్చడి, ఉల్లిపాయ కారం, దోసకాయ–మామిడి కాయ పచ్చడి, కొత్తిమీర పచ్చడి వంటివి ఇలా తయారుచేసుకోవచ్చు. మామిడి పిందెలతో కూడా నిల్వ రోటి పచ్చడి పెట్టుకోవచ్చు. పుటా్నల పప్పు, చింతపండు, ఎండుమిర్చి వంటి వాటితో పచ్చడి చేయవచ్చు. పాలకూర, పుదీనా, కొత్తిమీర, ఉసిరి, పచి్చమిర్చి, ఉప్పు కలిపి నూరి గ్రీన్ చట్నీ చేసుకుంటే రుచిగా ఉంటుంది. పచ్చి పెసరపప్పు లేదా పెసర్లు, మొలకెత్తిన పెసర్లు, పొట్టు పెసరపప్పుతో పచ్చడి చేసుకోవచ్చు.మంచి ప్రత్యామ్నాయం తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచయిత, మిద్దెతోట ప్రచారకులుకూరగాయలు, నూనె గింజల వంటి సహజ పదార్థాలు వాడతాం కాబట్టి వంటకాలు రుచికరంగా ఉంటాయి. సూక్ష్మ పోషకాలు అలాగే ఉంటాయి. సహజ ఆహార పదార్థాల్లో ప్రాణశక్తి ఉంటుంది. వాడే పదార్థాలు ఎవరి స్తోమతను బట్టి వారు ఎంచుకొనే వెసులుబాటు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి మంచి ప్రత్యామ్నాయం. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఖర్చూ తక్కువ. పొడులు ఎన్ని కూరలు ఉన్నా.. పొడులను వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ మజాయే వేరు. వెల్లుల్లి కారం, పెసరపప్పు పొడి, కంది పొడి, కారప్పొడి, నువ్వుల కారం మొదలైనవి త్వరగా చేసుకోవచ్చు. రెడీమేడ్ ఆవకాయ మామిడి కాయ ఆవబద్దలు మన ఇళ్లలో ఉండే పెద్దలందరికీ తెలుసు. అప్పటికప్పుడు తయారుచేసుకుని అన్నంలో కలుపుకొని తినేయొచ్చు. క్యాలీఫ్లవర్ పచ్చడి, దోస ఆవకాయ, సొరకాయ వంటివి కూడా ముక్కలతో రెడీమేడ్‌గా చేసుకుని ఫ్రిజ్‌లో ఓ 10 రోజుల వరకు నిల్వ ఉంచుకుని వాడుకోవచ్చు. చాలా సులభంగా బ్యాచిలర్లు చాలా సులభంగా, గ్యాస్ అవసరం లేకుండానే తయారుచేసుకునే పచ్చళ్లు చాలా ఉన్నాయి. ఉల్లి–నిమ్మ పచ్చడి, మామిడల్లం పచ్చడి (వేసవిలో వచ్చే మామిడి అల్లంతో), అల్లం కారం, ఉల్లిగడ్డ పచ్చడి, పచి్చమిర్చి పచ్చడి, పచ్చి టమాటా పండ్లతో నిల్వ పచ్చడి వంటివి ఈ కోవలోకి వస్తాయి.మిక్స్డ్ సలాడ్లు మొలకలు (పెసలు, శనగలు మొదలైనవి), నానబెట్టిన పల్లీలు, క్యారెట్, బీట్ రూట్ తురుము, కీరదోస ముక్కలు, జామకాయ ముక్కలు, కాస్త నిమ్మరసం చల్లిబ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్లు (వీటిలో డ్రై ఫ్రూట్స్ కావాలంటే కలుపుకోవచ్చు)పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి చాలా సులభంగా చేసుకోగలిగేది. తాలింపు లేకపోయినా ఫర్వాలేదు. ముల్లంగి పెరుగు పచ్చడి, పచ్చి పులుసు వంటివి అప్పటికప్పుడు తయారుచేసుకోవచ్చు.కొబ్బరి తురుముతో పచ్చి కొబ్బరి తురుము, దంచిన పచ్చి మిర్చి కలిపి అందులో నిమ్మరసం వేసుకోవచ్చు. లేదంటే మామిడికాయ తురుము కలిపినా బాగుంటుంది. పచ్చి పెసరపప్పు,పచ్చి కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, కీరా ముక్కలు, నిమ్మరసం, ఉప్పు కలుపుకొంటే కోసంబరి సిద్ధం.ఈ రెడీమేడ్ లడ్డూలు–తీపి పొడులు కేవలం వంటలే కాదు టైమ్ పాస్‌కి, స్నాక్స్‌లా తినడానికి రెడీమేడ్‌గా లడ్డూలు, తీపి పొడులు తయారుచేసుకోవచ్చు. ఇవి పిల్లలకు చాలా బలమైన ఆహారం. మొక్కజొన్న పిండికి, బెల్లం కలిపి సత్తు పిండి తయారుచేసుకోవచ్చు. దానిపై బాదం, కిస్మిస్ వంటి డ్రైఫ్రూట్లు అలంకరణ చేసుకుని తినొచ్చు. వేరు శనగ పొడి, బెల్లం కలిపి పొడి చేసుకోవచ్చు. అటుకులు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుముతోనూ లడ్డూ చేసుకోవచ్చు. -
గ్యాస్ కొరత.. సిలిండర్‌ను ఇలా కూడా వాడొచ్చా..!
ఇప్పుడు ఎక్కడ చూసినా గ్యాస్ కొరత భయాందోళనలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నా గ్యాస్ సిలిండర్ల ప్యానిక్ బుకింగ్స్ మాత్రం అధికంగానే కనిపిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌ల యుద్ధం కారణంగా అనిశ్చిత పరిస్థితి రావొచ్చేమోనని భయంతో ప్రజలు ముందుగానే అప్రమత్తమవుతున్నారు. ఇందులో గ్యాస్ సిలిండర్ అంశం ఒకటి.అయితే ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడీయో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూస్తే గ్యాస్ సిలిండర్‌ను ఇలా కూడా వాడొచ్చా అనిపించకమానదు. నెట్టింటిలో వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఓ వ్యక్తి.. ఖాళీ సిలిండర్ తీసుకుంటాడు. దాన్ని వెల్డింగ్ పనిముట్ల సాయంతో కట్ చేసి.. దాన్ని కట్టెల పొయ్యి మాదిరిగా మార్చేశాడు. ఇలా ఫుల్ గ్యాస్ సిలిండర్ లేదనే చింతను తీర్చుకున్నాడు. ఈ వ్యక్తి తెలివి తేటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. వీడు మాములోడు కాదురా నాయనా అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాలి. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ భయాందోళనలు నడుస్తున్న నేపథ్యాన్ని ఆసరగా చేసుకుని ఇలా వైరల్ కావడానికి కూడా చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మన భారతీయుల టాలెంట్ మామూలు టాలెంట్ కాదుగా 👍pic.twitter.com/AVN1cCRPTS— UttarandhraNow (@UttarandhraNow) March 13, 2026 -
ఇక సిలిండర్లతో పరేషాన్ వద్దు... 5 బెస్ట్ ఇండక్షన్ స్టౌవ్ లు
-
నో గ్యాస్.. నో బుకింగ్స్ రాజమండ్రిలో ప్రజల ఆవేదన
-
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గ్యాస్ మంటలు
-
సంక్షేమ విద్యా సంస్థలపై గ్యాస్ బండ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట గురుకులంలో గ్యాస్ నిండుకోవడంతో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. దమ్మపేట పాఠశాలకు రెండు, మూడు రోజులుగా గ్యాస్ సరఫరా కావడం లేదు. సంక్షేమ పాఠశాలల్లో గ్యాస్ కొరత విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, గురుకులాలకు సరిపడా గ్యాస్ సరఫరా చేయాలని ఆయన ఏజెన్సీలను ఆదేశించారని ఆర్సీఓ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. – పాల్వంచ రూరల్ సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, వసతిగృహాలపై గ్యాస్ బండ పడింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల సరఫరాలో నెలకొన్న సమస్యతో విద్యార్థులకు భోజనాన్ని అందించడంలో సిబ్బందికి కష్టాలు నెలకొన్నాయి. గురుకుల విద్యా సంస్థల్లో రోజుకు మూడు పూటలా ఆహారాన్ని అందించాల్సి ఉండగా...వసతి గృహాల్లో మాత్రం రెండు పూటలా ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతిగృహాలు, సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఆహారాన్ని గ్యాస్ పొయ్యిల ద్వారానే వండి వడ్డిస్తున్నారు. తాజాగా నెలకొన్న పరిస్థితితో వంట సంకటంలో పడింది. సకాలంలో వారికి వండివార్చడం ఇబ్బందికరంగా మారడంతో ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి ఏర్పాటు చేస్తూ నెట్టుకొస్తున్నారు. కాగా, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలో గురుకుల పాఠశాలలు, కళాశాలలు వెయ్యికిపైగా ఉన్నాయి. ఇవికాకుండా సంక్షేమ శాఖల పరిధిలో వసతిగృహాలు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో రెండు వేల ఆశ్రమ పాఠశాలలు, పాఠశాల విద్యా శాఖ పరిధిలో మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు దాదాపు వెయ్యి వరకు ఉన్నాయి. వీటి పరిధిలో 12లక్షల మంది విద్యార్థులున్నారు. ఈ విద్యా సంస్థలకు సగటున 4,500 వేల గ్యాస్ సిలిండర్లు అవసరం. దీంతో ఒక్కో గురుకుల పాఠశాలకు సగటున 3 సిలిండర్లు అవసరమని సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం సరఫరాలో నెలకొన్న సమస్యతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఒకేసారి నాలుగైదు సిలిండర్లు స్టాక్ ఉండే చోట ప్రస్తుతం ఒక్కటి కూడా అందుబాటులో లేదని వాపోతున్నారు. మూడు రోజులుగా సంక్షేమ వసతిగృహాల్లో కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తుంగా గురువారం నుంచి గురుకుల విద్యా సంస్థల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండడం, పొయ్యిపై చేసే వంటకు ఎక్కువ సెగ తగలడంతో అన్నం, సాంబార్, ఒక రకం కర్రీతో సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. -
‘గ్యాస్ బ్లాక్ మార్కెట్‌పై చర్యలు తీసుకోండి’
హైదరబాద్: గ్యాస్ కొరత కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 90 శాతం హోటళ్లు మూతపడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏర్పడిన గ్యాస్ కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. గ్యాస్ కొరత కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధానంగా గ్యాస్ బ్లాక్ మార్కెట్ కారణంగానే ఈ పరిస్థితి వచ్చినట్లు కనబడుతోందని, ఈ బ్లాక్ మార్కెట్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కేటీఆర్. ఈ మేరకు సిలిండర్ల తీవ్ర కొరతను పరిష్కరించడానికి వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు. ఎల్పీజీ సిలిండర్ లభ్యతపై పారదర్శక సమాచారాన్ని అందించడానికి రియల్-టైమ్ పబ్లిక్ డాష్‌బోర్డ్‌ను రూపొందించాలని ఆయన సిఫార్సు చేశారు చిన్న వ్యాపారాలపై అదనపు ఆర్థిక భారాన్ని నివారించడానికి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లపై తాత్కాలిక ధరను నిర్ణయించి దానిని అమలు చేయాలన్నారు. -
రోడ్లు గుంతలపై చంద్రబాబు కామెంట్స్ సునీల్ డైలాగ్ తో కేతిరెడ్డి సెటైర్లు
-
రెస్టారెంట్లలో కట్టెల వంట
శ్రీకాకుళం: కమర్షియల్ సిలిండర్ల కొరత నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని కొన్ని రెస్టారెంట్లలో కట్టెల పొయ్యిపై వంటలు మొదలయ్యాయి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో జిల్లాలోనూ గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని గ్యాస్ ఏజెన్సీలు హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలుపుదల చేశాయి. కొందరికి మాత్రం పాత స్టాక్ ఉండడంతో ఎలాగోలా రెండు రోజులు నెట్టుకొచ్చారు. స్టాక్ లేని వారు కట్టెల పొయ్యిపై వంటలు చేయడం ప్రారంభించారు. ఇంకొందరు సుదూర ప్రాంతాల నుంచి గ్యాస్ తెచ్చుకొని రెస్టారెంట్లను నడుపుతున్నారు. -
యుద్ధం ఎఫెక్ట్: హైదరాబాద్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు
సాక్షి, హైదరాబాద్: అక్కడెక్కడో పశ్చిమాసియాలో యుద్ధం ఇక్కడి జన జీవన ఛిన్నాభిన్నం చేస్తోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో చమురు సరఫరా గొలుసు తెగిపోవడంతో మహా నగరంలో పెట్రోల్, సీఎన్జీ, వంటగ్యాస్ కొరత తీవ్రరూపం దాల్చింది. ఇంధన సెగలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి నిన్నటి వరకు సాఫీగా సాగిన నగర జీవనం.. ఇప్పుడు బంకుల ముందు పడిగాపులతో నరకప్రాయంగా మారింది. కిలోమీటర్ల మేర క్యూలైన్లు చమురు కంపెనీల నుంచి డీలర్లకు స్టాక్ సరఫరా గణనీయంగా తగ్గడంతో నగరంలోని మెజారిటీ పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులను దర్శనమిస్తున్నాయి. తెరిచి ఉన్న కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర ఆటోలు, కార్లు క్యూ కడుతున్నాయి. గంటల తరబడి వేచి చూసినా ఇంధనం దొరుకుతుందన్న గ్యారంటీ లేకపోవడంతో వాహనదారులు విలవిలలాడుతున్నారు. గ్యాస్ ఆటోలు కలిగిన డ్రైవర్లు ఎల్పీజీ, సీఎన్జీ నింపుకొనేందుకు రాత్రింబవళ్లూ ఆయా బంకుల వద్ద గంటలతరబడి వేచి ఉన్నారు. ముఖ్యంగా సీఎన్జీపై ఆధారపడే ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. వాణిజ్య గ్యాస్‌కు ‘గండం’.. ఇంధన కొరత కేవలం వాహనాలకే పరిమితం కాకుండా వంటగది వరకు పాకింది. వంట–గ్యాస్ కష్టాలు తీవ్రంగా మారాయి. కర్రీ పాయింట్లు, హోటళ్లు, చిన్న చిన్న టిఫిన్ బండ్లపై ఎఫెక్ట్ బాగా కని్పస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్యాస్ నిల్వలను కేవలం గహ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ మళ్లించడంతో, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. గ్యాస్ కొరతతో నగరం పొడవునా చిన్న, మధ్యతరహా హోటళ్లు మూతపడుతున్నాయి. గ్యాస్ పొదుపు చర్యల్లో భాగంగా హాస్టల్ నిర్వాహకులు మెనూలో కోత విధిస్తున్నారు. వంటల సంఖ్యను తగ్గించడంతో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతులెత్తేస్తున్న డీలర్లు ముందస్తు సమాచారం లేకుండానే చమురు సంస్థల్లో లోడింగ్ పాయింట్ల వద్ద స్టాక్ నిలిపివేయడంతో సరఫరా లేక డీలర్లు చేతులెత్తేస్తున్నారు. ఇలాగే కొనసాగితే రవాణా రంగం పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
వంటింటి వార్‌కు 'చెక్'..
సాక్షి, స్పెషల్ డెస్క్: ప్రతి ఇంటా ఇప్పుడు ఒకటే చర్చ. వంటింట్లో గ్యాస్ అయిపోతే? సిలిండర్ సమయానికి రాకపోతే? ప్రత్యామ్నాయం ఏంటి? వంటలు ఎలా? ఇదంతా ఎందుకంటే యూఎస్–ఇరాన్ యుద్ధం ప్రభావం ఇప్పుడు మన వంటింటి వరకూ వచ్చింది. ఎక్కడో జరుగుతున్న యుద్ధమే కావొచ్చు. కానీ ఆ వార్ కాస్తా ఎల్పీజీ సరఫరాను దెబ్బతీయడంతో ప్రతి ఇంటి సమస్యగా మారింది. ఈ సమస్య రోజురోజుకూ ముదురుతోంది. ఎన్ని రోజులు ఇది కొనసాగుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వంట గ్యాస్‌కు, వంటలకూ ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం తక్షణ పరిష్కారం. గ్యాస్ లేదంటే ముందుగా గుర్తొచ్చేది ఎలక్ట్రిక్ స్టవ్ (ఇండక్షన్ కుక్‌టాప్స్), ఎలక్ట్రిక్ కుక్కర్, సోలార్ కుక్కర్, ఇతర అప్లయెన్సెస్. ఇవి మార్కెట్లో విరివిగా దొరుకుతున్నా అందరికీ కొనే స్తోమత ఉండకపోవచ్చు. పల్లెల్లో కట్టెలు, బొగ్గు వంటివి ఇంధనంగా వాడుతున్నారు. పట్టణాల్లో వీటిని వాడటం సాధ్యం కాదు. ఉపకరణాలను కొనలేనివారు, సహజ ఇంధనాలను వాడలేనివారు, ఇంకా చెప్పాలంటే అందరూ.. ఇవేవీ అవసరం లేకుండానే సహజ పదార్థాలతో వంటలు ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందామా.. వంటింటి శ్రమను తగ్గించేలా.. స్టవ్‌తో పనిలేకుండా సహజ ఆహారంతో విభిన్న వంటకాలను నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. కొన్ని పచ్చళ్లు, పొడులు రోట్లో లేదా రాయిపై నూరుకోవచ్చు. మిక్సీ ఉంటే మిక్సీలోనూ కొన్ని వేసుకోవచ్చు. నూనెల వాడకం, వేపుళ్లు తగ్గించవచ్చు. వండటం, పాత్రలు శుభ్రం చేసుకోవడంలో మహిళలు ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు. ఖర్చూ తగ్గుతుంది. ఇక రుచి అంటారా.. వేరుశనగ, నువ్వుల వంటి నూనె గింజల పొడులు వాడతాం కాబట్టి రుచి అద్భుతంగా ఉంటుంది. పూర్వకాలపు నిల్వ రోటి పచ్చళ్లు ఒకప్పుడు స్టవ్ అవసరం లేకుండానే రోటి పచ్చళ్లు తయారుచేసుకునేవాళ్లు. నూనె తాలింపు కూడా చాలా వాటికి అవసరం లేదు. వేడి వేడి అన్నంలో వీటిని కలుపుకొని తింటే.. ఆ రుచిని మాటల్లో చెప్పలేం. పండు మిర్చి పచ్చడి, టమాటా పచ్చడి, కరివేపాకు పచ్చడి, క్యారెట్ పచ్చడి, మామిడికాయ కొబ్బరి పచ్చడి, దోసకాయ రోటి పచ్చడి, కరివేపాకు క్యారెట్ పచ్చి కొబ్బరి పచ్చడి, ఉల్లిపాయ కారం, దోసకాయ–మామిడి కాయ పచ్చడి, కొత్తిమీర పచ్చడి వంటివి ఇలా తయారుచేసుకోవచ్చు. మామిడి పిందెలతో కూడా నిల్వ రోటి పచ్చడి పెట్టుకోవచ్చు. పుటా్నల పప్పు, చింతపండు, ఎండుమిర్చి వంటి వాటితో పచ్చడి చేయవచ్చు. పాలకూర, పుదీనా, కొత్తిమీర, ఉసిరి, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి నూరి గ్రీన్ చట్నీ చేసుకుంటే రుచిగా ఉంటుంది. పచ్చి పెసరపప్పు లేదా పెసర్లు, మొలకెత్తిన పెసర్లు, పొట్టు పెసరపప్పుతో పచ్చడి చేసుకోవచ్చు. పొడులు ఎన్ని కూరలు ఉన్నా.. పొడులను వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ మజాయే వేరు. వెల్లుల్లి కారం, పెసరపప్పు పొడి, కంది పొడి, కారప్పొడి, నువ్వుల కారం మొదలైనవి త్వరగా చేసుకోవచ్చు. రెడీమేడ్ ఆవకాయ మామిడి కాయ ఆవబద్దలు మన ఇళ్లలో ఉండే పెద్దలందరికీ తెలుసు. అప్పటికప్పుడు తయారుచేసుకుని అన్నంలో కలుపుకొని తినేయొచ్చు. క్యాలీఫ్లవర్ పచ్చడి, దోస ఆవకాయ, సొరకాయ వంటివి కూడా ముక్కలతో రెడీమేడ్‌గా చేసుకుని ఫ్రిజ్‌లో ఓ 10 రోజుల వరకు నిల్వ ఉంచుకుని వాడుకోవచ్చు. చాలా సులభంగా బ్యాచిలర్లు చాలా సులభంగా, గ్యాస్ అవసరం లేకుండానే తయారుచేసుకునే పచ్చళ్లు చాలా ఉన్నాయి. ఉల్లి–నిమ్మ పచ్చడి, మామిడల్లం పచ్చడి (వేసవిలో వచ్చే మామిడి అల్లంతో), అల్లం కారం, ఉల్లిగడ్డ పచ్చడి, పచ్చిమిర్చి పచ్చడి, పచ్చి టమాటా పండ్లతో నిల్వ పచ్చడి వంటివి ఈ కోవలోకి వస్తాయి. మంచి ప్రత్యామ్నాయం తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచయిత, మిద్దెతోట ప్రచారకులు కూరగాయలు, నూనె గింజల వంటి సహజ పదార్థాలు వాడతాం కాబట్టి వంటకాలు రుచికరంగా ఉంటాయి. సూక్ష్మ పోషకాలు అలాగే ఉంటాయి. సహజ ఆహార పదార్థాల్లో ప్రాణశక్తి ఉంటుంది. వాడే పదార్థాలు ఎవరి స్తోమతను బట్టి వారు ఎంచుకొనేవెసులుబాటు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి మంచిప్రత్యామ్నాయం. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఖర్చూ తక్కువ. మిక్స్డ్ సలాడ్లు మొలకలు (పెసలు, శనగలుమొదలైనవి), నానబెట్టిన పల్లీలు, క్యారెట్, బీట్ రూట్ తురుము, కీరదోస ముక్కలు, జామకాయ ముక్కలు, కాస్త నిమ్మరసం చల్లిబ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్లు (వీటిలో డ్రై ఫ్రూట్స్ కావాలంటే కలుపుకోవచ్చు) పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి చాలాసులభంగా చేసుకోగలిగేది. తాలింపు లేకపోయినాఫర్వాలేదు. ముల్లంగిపెరుగు పచ్చడి, పచ్చిపులుసు వంటివి అప్పటికప్పుడుతయారుచేసుకోవచ్చు. కొబ్బరి తురుముతో పచ్చి కొబ్బరి తురుము, దంచిన పచ్చి మిర్చి కలిపి అందులో నిమ్మరసం వేసుకోవచ్చు. లేదంటే మామిడికాయ తురుము కలిపినా బాగుంటుంది. పచ్చి పెసరపప్పు,పచ్చి కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, కీరా ముక్కలు, నిమ్మరసం, ఉప్పు కలుపుకొంటే కోసంబరి సిద్ధం. ఈ రెడీమేడ్ లడ్డూలు–తీపి పొడులు కేవలం వంటలే కాదు టైమ్ పాస్‌కి, స్నాక్స్‌లా తినడానికి రెడీమేడ్‌గా లడ్డూలు, తీపి పొడులు తయారుచేసుకోవచ్చు. ఇవి పిల్లలకు చాలా బలమైన ఆహారం. మొక్కజొన్న పిండికి, బెల్లం కలిపి సత్తు పిండి తయారుచేసుకోవచ్చు. దానిపై బాదం, కిస్మిస్ వంటి డ్రైఫ్రూట్లు అలంకరణ చేసుకుని తినొచ్చు. వేరు శనగ పొడి, బెల్లం కలిపి పొడి చేసుకోవచ్చు. అటుకులు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుముతోనూ లడ్డూ చేసుకోవచ్చు. -
రాష్ట్రానికి గ్యాస్ దడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం పతాక స్థాయికి చేరింది. పది రోజులుగా సరఫరాలో నెలకొన్న అంతరాయం ఇప్పుడు సామాన్యుడి కడుపు కొడుతోంది. అటు గృహ వినియోగదారులు, ఇటు వ్యాపార వర్గాలు గ్యాస్ కోసం అల్లాడిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి మొదలుకొని మారుమూల జిల్లాల వరకు పరిస్థితి అదుపు తప్పుతోంది. వంటింటి గ్యాస్ బుకింగ్‌ల సంఖ్య రెండు మూడు రోజులుగా భారీగా పెరిగినట్టు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. బుక్ చేసిన వారికి గ్యాస్ సిలిండర్లు పంపించేందుకు ఎప్పటికప్పుడు స్టాక్‌లతో ఏజెన్సీలు కసరత్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్‌ను ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అదనుగా గ్యాస్ బుకింగ్, సరఫరా పేరుతో సైబర్ నేరగాళ్లు కూడా రంగంలోకి దిగారని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ ప్రజలకు సూచించారు. చాయ్ డబ్బా నుంచి స్టార్ హోటల్ వరకు.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మందికి పైగా ఆధారపడిన హోటల్, దాని అనుబంధ రంగాలు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల కొరతతో మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌ను కంపెనీలు తాత్కాలికంగా నిలిపివేయడంతో హోటల్ యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రతీరోజు ఐదు నుంచి పది సిలిండర్లు వాడే హోటళ్లకు ఏజెన్సీలు తమ వద్ద స్టాక్ ఉంటే ఒకటీ అరా పంపిస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌లోని క్లబ్‌లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లలో ఆంక్షలు మొదలయ్యాయి. నగరంలోని దాదాపు అన్ని క్లబ్‌లు సభ్యులకు ఆంక్షలు విధిస్తూ సమాచారం ఇస్తున్నాయి. లిమిటెడ్ మెనూతో పాటు విజిటర్స్‌ను తీసుకురావొద్దని సమాచారం ఇచ్చాయి. బార్ అండ్ రెస్టారెంట్లు, క్యాంటీన్లలో కూడా గ్యాస్ తక్కువగా వినియోగించేలా మెనూను రూపొందించారు. మధ్యతరగతి హోటళ్లు, రెస్టారెంట్లలో కేవలం రైస్ ఐటమ్స్, కూరలు మాత్రమే వండుతున్నారు. గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే స్వీట్లు, బేకరీ ఐటమ్స్ తయారీని పూర్తిగా నిలిపివేశారు. హైదరాబాద్ సహా జిల్లాల్లోని చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు గ్యాస్ దొరక్క కొన్ని మూతపడ్డాయి. దీనివల్ల రోజువారీ కూలీలు, బ్యాచిలర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహాల్లో ’డ్రై’ డేస్... ఐటీ కారిడార్‌లో ఆందోళనహైదరాబాద్లోని ఐటీ కారిడార్ (మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి)లో పరిస్థితి దయనీయంగా మారే అవకాశముంది. వేలాదిగా ఉన్న పీజీలు, హాస్టళ్లలో గ్యాస్ నిల్వలు అయిపోతాయనే భయంతో యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. కష్టంగా ఒకే పూట వండి పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఓ హాస్టల్ యజమాని వ్యాఖ్యానించాడు. దిల్సుఖ్నగర్, అమీర్‌పేట, ఫిల్మ్‌నగర్, విద్యానగర్, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, పంజగుట్ట ప్రాంతాల్లో హాస్టళ్లు, రూముల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు, యువకులు, ఉద్యోగినులు కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటర్ పరీక్షలు ముగుస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఊరట లభించినట్టయింది. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు కూడా త్వరలోనే సెలవులు వచ్చే అవకాశం ఉండడంతో కొద్దిరోజుల పాటు కాలం వెళ్లదీసేందుకు ప్రిన్సిపాల్స్ తగిన ఆదేశాలు జారీ చేశారు. రంజాన్ వేళ... బిర్యానికే పరిమితం రంజాన్ నెల కావడంతో హైదరాబాద్‌తోపాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ వంటి నగరాల్లో ఉపవాస దీక్షల్లో ఉండే ముస్లింల కోసం సాయంత్రం నుంచి రాత్రి వేళ్లలో పెద్ద ఎత్తున హోటళ్లు పనిచేస్తాయి. సిలిండర్ల సమస్యతో హైదరాబాద్‌లోని ఇరానీ హోటళ్లలో కట్టెల పొయ్యిలనే వినియోగిస్తున్నారు. వీటిల్లో బిర్యానీ, హలీమ్‌లకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. తందూరీ రొట్టెల కోసం వాడే బట్టీలనే కూరల కోసం కూడా వినియోగిస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు పాతబస్తీ, నాంపల్లి, మెహిదీపట్నం, టోలిచౌకీ, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, దాబాలు బట్టీలు, కట్టెల పొయ్యిలతోనే ఆహార సేవలు అందిస్తున్నాయి. కాగా ఇరానీ హోటళ్లలో చాయ్, ఇతర తినుబండారాల విషయంలో కోతలు పెడుతున్నట్టు తెలుస్తోంది. బ్లాక్ మార్కెట్ హల్చల్..ధరల మోత వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తలెత్తిన సమస్యల నేపథ్యంలో ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్ దందాకు తెర లేపినట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. రూ.965కు లభించే డొమెస్టిక్ సిలిండర్‌ను రూ.1200 వరకు విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రూ.2,050 వరకు ఉన్న కమర్షియల్ గ్యాస్‌ను కూడా కొన్ని ఏజెన్సీలు దాదాపు రూ.2,800 వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఎల్పీజీ, సీఎన్‌జీలతో నడిచే ఆటోలు, కార్లు ఆయా గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఐదు రోజుల్లో ఎల్పీజీ ధరను 50 రూపాయలు పెంచినట్టు ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో కూడా ఎల్పీజీ, సీఎన్జీ లభించే పరిస్థితి లేక ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని సమస్యలు ఎదురవుతున్నా పౌరసరఫరాల శాఖ కనీసం స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. -
'గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ వల'
సాక్షి హైదరాబాద్: గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారు.తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.ముఖ్యంగా ఆన్లైన్లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారెంటీగా, అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే సందేశాలు వస్తే అవి కచ్చితంగా సైబర్ మోసాలేనని ప్రజలు గ్రహించాలన్నారు. ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని సిలిండర్ బుకింగ్ లేదా ఆన్లైన్ చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లను లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలని తెలిపారు.వీరు ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తుతెలియని వ్యక్తులకు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని నకిలీ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేయడం ద్వారా మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930 కి కాల్ చేయాలని లేదా http://cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు.. జాగ్రత్త!వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు…— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 11, 2026 -
సామాన్యుడికి షాక్.. పెళ్లిళ్లు వాయిదాపడే పరిస్థితి?
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ భారత్‌లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై తీవ్రంగా పడింది. నిన్న బెంగళూరు, విశాఖ, ముంబై నగరాల్లో గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు మూతపడగా.. ఈ రోజు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు సిలిండర్ బండలతో రోడ్డెక్కారు. కొన్ని రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో పెళ్లిళ్లు వాయిదాపడే పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాస్ సరఫరా కష్టాలు మొదలయ్యాయి. అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌తో పాటు.. బిహార్‌లో పోలీసుల బందోబస్తు నడుమ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా జరుగుతోంది. ఈ రాష్ట్రాల్లోని కీలక నగరాల్లో ఒకట్రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక రాజస్థాన్‌లో ఎల్పీజీ బ్లాక్ మార్కెటింగ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాలు డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాపై దృష్టి సారించాయి.రోజురోజుకీ పరిస్థితి తీవ్రంఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో మధ్యప్రదేశ్‌లో ఆ వాతావరణం కనిపిస్తోంది. రాబోయే వారం రోజుల్లో ఒక్క భోపాల్‌లోనే వెయ్యికి పైగా పెళ్లిళ్లు షెడ్యూల్ అయినట్లుగా తెలుస్తోంది. గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం ఉండడంతో.. పెళ్లింట భోజనాలు ఉంటాయా? అనే ఆందోళనలు వధువు, వరుడి తరఫు వారిలో నెలకొంటున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేయడంతో క్యాటరింగ్ నిర్వాహకులు, హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు పెళ్లిళ్ల సీజన్ దాటిపోతోందని, అడ్వాన్సులు తీసుకున్న తమకు నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవిధంగా ఇది అత్యయిక స్థితిని తలపిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.యూపీలో పోలీసుల బందోబస్తు నడుమ..యూపీలో గడిచిన నాలుగైదు రోజులుగా ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌లు పెరిగాయి. బుకింగ్‌ల మధ్య 25 రోజుల గ్యాప్ అనే నిబంధన కొనసాగుతున్నప్పటికీ.. అసాధారణంగా బుకింగ్‌లు పెరుగుతున్నాయని ఎల్పీజీ డీలర్లు చెబుతున్నారు. గోరఖ్‌పూర్, సిద్ధార్థనగర్ ప్రాంతాల్లో పౌరులు ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీల ముందు క్యూకట్టారు. సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల కోసం రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరినట్లు ఇప్పుడు యూపీలో ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం తెల్లవారుజాము 3 గంటల నుంచి ఏజెన్సీల వద్ద క్యూకట్టారు. అయితే.. వారందరికీ సిలిండర్లు సర్దుబాటు అయ్యే పరిస్థితులు కనిపించడం లేదని, టోకెన్లు ఇచ్చి, రాబోయే రోజుల్లో పంపిణీ చేస్తామని డీలర్లు చెబుతున్నారు దుర్గా..బిహార్‌లో బుకింగ్‌ల నిలిపివేత?రెండ్రోజులుగా బిహార్‌లో కమర్షియల్ సిలిండర్ల బుకింగ్‌లను చమురు సంస్థలు నిలిపివేశాయి. దీంతో.. బెంగళూరు మాదిరిగానే హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు బంద్‌కు సిద్ధమవుతున్నారు. డొమెస్టిక్ బుకింగ్‌లు కొనసాగుతున్నప్పటికీ.. బ్లాక్‌మార్కెటింగ్ భయాలు ఉండడంతో ప్రజలే ఏజెన్సీల వద్దకు ఖాళీ సిలిండర్లతో చేరుకుంటున్నారు. దీంతో.. అక్కడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా గోపాల్ గంజ్, ఖగారియా, ఔరంగాబాద్, పట్నా నగరాల్లో తెల్లవారుజాము నుంచే ప్రజలు సిలిండర్ బండ కోసం క్యూలైన్లలో నిలబడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే.. డీలర్లు తమపై దాడులు జరిగే ప్రమాదాలున్నాయనే భావనతో ఏజెన్సీలను తెరవడం లేదు.రాజస్థాన్‌లో బ్లాక్ మార్కెటింగ్?కమర్షియల్ సిలిండర్ ధర 19 వందల రూపాయలదాకా ఉండగా.. ఇప్పుడు రాజస్థాన్‌లో బ్లాక్ మార్కెటర్లు దాన్ని 2,500 నుంచి మూడువేల రూపాయలకు విక్రయిస్తున్నారు. దీనిపై ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ ఓ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, అక్రమార్కుల దందాను వెలుగులోకి తెచ్చింది. పోలీసులు ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించారు. లూథియానా, ఫరీద్కోట్, హోషియార్పూర్, పటియాలా ప్రాంతాల్లో చమురు సంస్థల వెబ్సైట్లు డౌన్ కావడంతో.. కొత్త బుకింగ్‌లు జరగడం లేదని తెలుస్తోంది దుర్గా..కేంద్ర ప్రభుత్వం చర్యలు పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిన్ననే ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో చమురు కంపెనీల తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సరఫరాను ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ మధ్య 25 రోజుల గ్యాప్ ఉండాలనే నిబంధనను నిక్కచ్చిగా అమలు చేస్తోంది. గ్యాస్ డెలివరీ బాయ్స్ దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండేందుకు ఓటీపీ ఆధారిత డెలివరీని అమలు చేస్తోంది. మరోవైపు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. - సాక్షి వెబ్‌డెస్క్ -
పప్పన్నం పెట్టకుండా 10 వేల పెళ్లిళ్లు?
చండీగఢ్: చమురు సంక్షోభం సెగ ఇప్పుడు పెళ్లిళ్ల వరకూ పాకింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం గ్యాస్ సరఫరాపై పడటంతో పెళ్లిళ్ల సీజన్ కాస్తా కళా విహీనంగా మారింది. పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో సుమారు 10 వేల వివాహాలు జరగనున్న తరుణంలో కమర్షియల్ ఎల్పీజీ (LPG) సరఫరా నిలిచిపోవడం గందరగోళానికి దారితీసింది. గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.పంజాబ్‌లో ప్రస్తుతం వివాహ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఇంటి నిండా చుట్టాలు, భాజాభజంత్రీల సందడి మధ్య గ్యాస్ కొరత అందరినీ కలవరానికి గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం అర్ధరాత్రి నుంచి వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో క్యాటరింగ్ నిర్వాహకులు, మ్యారేజ్ ప్యాలెస్ యజమానులు చేతులెత్తేస్తున్నారు. విందు భోజనాల మెనూలో కోతలు విధించక తప్పని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పంజాబ్ మ్యారేజ్ ప్యాలెస్ అండ్ రిసార్ట్ అసోసియేషన్ ప్రతినిధి సుఖ్‌దేవ్ సింగ్ సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గ్యాస్ లేకపోతే పెద్ద ఎత్తున వంటకాలు చేయడం అసాధ్యం. ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించేందుకు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే కట్టెల పొయ్యిలకు మారాయి. ఈ పరిస్థితిపై కేంద్ర పెట్రోలియం శాఖ స్పందిస్తూ.. గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నల్లబజారును అరికట్టడానికే కఠిన నిబంధనలు తెచ్చామని స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి: ఏఐ పిటిషన్.. వ్యాపారికి సీజేఐ స్ట్రాంగ్ వార్నింగ్ -
హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లకు భారీ షాక్..!
సాక్షి, హైదరాబాద్: కమర్షియల్ (వాణిజ్య) సిలిండర్ల కొరతతో ముంబైలో 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్ల మూసివేత! ఇబ్బందులు కొనసాగితే సగం హోటళ్లు బంద్ తప్పదనే అంచనాలు వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరు, పలు ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. మరి మన హైదరాబాద్ పరిస్థితి...? ఇతర నగరాల తరహాలోనే భాగ్య నగరంపైనా పశ్చిమాసియా యుద్ధ మేఘాలు గట్టి ప్రభావమే చూపుతున్నాయి. ఆయిల్ కంపెనీలు ఇండెంట్ తీసుకోవడం లేదని చెబుతున్న వెండర్లు... సోమవారం నుంచి కమర్షియల్ సిలిండర్ల పంపిణీని పూర్తిగా ఆపేశారు. దీంతో వాణిజ్య సిలిండర్ల లభ్యత కష్టమనే ఆందోళన కలుగుతోంది. మరీ ముఖ్యంగా హాస్టళ్లు, హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ క్లిష్టంగా మారనుంది. ఇదే పరిస్థి్థతి మరో రెండు రోజులు కొనసాగితే వంట కష్టమేనని హాస్టళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. ఇప్పటికే మెనూలో కోత పెట్టారు. సహజంగా పేయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టళ్లలో రోజూ టిఫిన్‌లో ఇడ్లీ, దోశ, పూరీ, బోండా, మధ్యాహ్నం లంచ్‌లో చపాతీ, అన్నం, పప్పు, కర్రీ, రాత్రి భోజనంలో కర్రీతో పాటు ఒక ఫ్రై ఇస్తుంటారు. కానీ, ప్రస్తుతం టిఫిన్‌లో, డిన్నర్లో పలు పదార్థాలను తొలగించారు. ఐటీ కారిడార్‌లో తీవ్ర చర్చ పీజీ హాస్టళ్లలో వంటపై ఐటీ కారిడార్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. నగరంలో దాదాపు 11 వేల హాస్టళ్లు, 3 వేలకు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయని అంచనా. ఐటీ ఉద్యోగులతో పాటు ఉన్నత ఆదాయ (బ్లూ కాలర్) ఉద్యోగులు, వివిధ కోర్సులు అభ్యసించే విద్యార్థులు దాదాపు 10 లక్షల మంది హాస్టళ్లలో ఉంటున్నారు. గచి్చబౌలి, మాదాపూర్, కొండాపూర్, శేరిలింగంపల్లి, గోపన్‌పల్లి, మియాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, మణికొండ, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వందల పీజీ హస్టళ్లు, గెస్ట్ హౌస్‌లు నిర్వహిస్తున్నారు. ఐటీ కారిడార్‌లోని గచి్చ»ౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లోనే వెయ్యి హోటళ్లు కొనసాగుతున్నాయి. వీటన్నిటిలో గ్యాస్‌తోనే కిచెన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కొరత తీవ్ర ప్రభావం చూపనుంది. ఇదే అదనుగా కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ విక్రయాలు ఊపందుకుంటున్నాయి. ఒక్కో వాణిజ్య సిలిండర్‌ను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. సామాన్యులపై ప్రభావం హోటళ్ల వద్ద సాధారణంగా 2 నుంచి 3 రోజులకు సరిపడా నిల్వలు ఉంటాయి. అవి అయిపోతే వంట గదులు మూతపడాల్సిందే. ఇలాగైతే హోటళ్లను నడపడం అసాధ్యమని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని హోటల్స్ అసోసియేషన్ నేతలు కోరుతున్నారు. రంజాన్ మాసం కావడంతో హైదరాబాద్‌లో హోటళ్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. హలీం తయారీకి కట్టెల పొయ్యి వాడడం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది. కానీ, మిగతా హోటళ్లకు గ్యాస్ కొరత ఏర్పడుతోంది. వ్యాపారులు, వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. చాలా హోటళ్లు మెనూలో ఐటమ్స్ తగ్గించడం లేదా పనివేళలను కుదించే ఆలోచన చేస్తున్నాయి. కమర్షియల్ సిలిండర్ల పంపిణీపై చర్యలు తీసుకోవాలి కమర్షియల్ సిలిండర్ల సప్లయ్ నిలిచిపోవడంతో పీజీ హాస్టళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఐటీ కారిడార్ హాస్టళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి తెలిపారు. కట్టెల పొయ్యిపై వంటలు చేసి సమయానికి అందించడం కుదరదన్నారు. కమర్షియల్ సిలిండర్ల సప్లయ్ పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. కాగా, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సప్లయ్ నిలిచిపోయిన నేపథ్యంలో బుధవారం ఉయదం 10.30 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు అమర్నాథ్రెడ్డి, ఐటీ కారిడార్ హాస్టళ్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కరుణాకర్, ట్రెజరర్ మహీధర్ తెలిపారు. రాయదుర్గంలోని ప్రశాంతిహిల్స్‌లో జరిగే ఈ సమావేశంలో గ్యాస్ కొరతతో హాస్టళ్లపై పడుతున్న ప్రభావాన్ని వివరించనున్నారు.20 శాతం పెరిగిన బుకింగ్ పశి్చమాసియా యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంతో సాధారణ రోజుల కంటే బుకింగ్‌ల సంఖ్య 15 శాతం నుంచి 20 శాతం పెరిగింది. అవసరం లేకున్నా ఇలా చేస్తుండడంతో సరఫరా గొలుసుపై ఒత్తిడి పడుతోంది. ఈ నేపథ్యంలోనే రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య కనీస కాలాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచారని, సిలిండర్ల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వినియోగదారులు అనవసరంగా ఆందోళన చెందవద్దని అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైతేనే గ్యాస్ బుక్ చేయాలని, వంటింట్లో గ్యాస్ ఆదా పద్ధతులను పాటించాలని సూచిస్తున్నారు. -
వంటగ్యాసే ఫస్టు!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు, సహజ వాయువు దిగుమతుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. దేశంలో వంట గ్యాస్ సరఫరా తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గృహ వినియోగానికి ప్రస్తుతం ఇబ్బందులు లేకపోయినా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా తగినంత లేకపోవడంతో ప్రధాన నగరాల్లో హోటళ్లు మూతపడుతున్నాయి. రవాణా రంగానికి అవసరమైన గ్యాస్ సరఫరా నిలిచిపోతోంది.సమస్య పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయువును ప్రాధాన్యతా క్రమంలో సరఫరా చేయాలని ఆదేశించింది. మొదట ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ తయారీకి, తర్వాత ఎరువుల ఉత్పత్తికి, అనంతరం తేయాకు పరిశ్రమ, పారిశ్రామిక వినియోగదారులకు, ఆ తర్వాత సిటీ గ్యాస్ సరఫరాదారులకు సహజ వాయువును సరఫరా చేయాలని పేర్కొంది. ఈ మేరకు సోమవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గ్యాస్‌ను మొదట ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎలీ్పజీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) తయారీకి అందజేయాలని తేలి్చచెప్పింది. పారిశ్రామిక వినియోగదారులకు 80%ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ ఉత్పత్తిలో సహజ వాయువును ముడి సరుకుగా ఉపయోగిస్తారు. ముడి చమురు శుద్ధి ప్రక్రియలో ఒక ఉపఉత్పత్తి ఎల్పీజీ. అలాగే సహజ వాయువును ప్రాసెస్ చేయడం ద్వారా ఎల్పీజీని తయారు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. మొదట ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ తయారీకి ప్రాధాన్యం ఇస్తూ సహజ వాయువును సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆయా రంగాల్లో గత ఆరునెలల సగటు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని అందులో 100 శాతం సరఫరా చేయాలి. ఈ మూడు రంగాల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఎరువుల తయారీ, తేయాకు పరిశ్రమతోపాటు ఇతర పారిశ్రామిక వినియోగానికి గ్యాస్ అందజేయాలి.ఎరువుల తయారీ రంగానికి గత ఆరు నెలల సగటు డిమాండ్‌లో కనీసం 70 శాతం సరఫరా చేయాలి. ఇక తేయాకు పరిశ్రమ, ఉత్పత్తి, పారిశ్రామిక వినియోగదారులకు గత ఆరు నెలల సగటు డిమాండ్‌లో 80 శాతం సహజ వాయువు అందజేయాలి. పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసే సిటీ గ్యాస్ సరఫరాదారులకు(సీజీడీ) ఆరు నెలల సగటు డిమాండ్‌లో 80 శాతం ఇవ్వొచ్చు. దేశీయంగా నిత్యం 191 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు అవసరం. దేశంలో రోజువారీ మొత్తం అవసరాల్లో సగం దేశీయ సహజ వాయువే తీరుస్తోంది. పెట్రోకెమికల్ ప్లాంట్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఈ గ్యాస్‌ను సరఫరా చేయకుండా నియంత్రణ విధించారు. మూసివేత దిశగా హోటళ్లువాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత హోటళ్లు, రెస్టారెంట్లపై పెను ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఆహారశాలలు మూతపడుతున్నాయి. ముంబై, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, ఔరంగాబాద్, నాగపూర్, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే వందలాది హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. రానున్న రెండు రోజుల్లో పరిస్థితి ఇంకా తీవ్రమయ్యే అవకాశాలున్నాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు సాగర్ దర్యానీ మంగళవారం చెప్పారు. పశ్చి మాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోయినట్లు తెలియజేశారు.ఎల్పీజీ ఉత్పత్తి 10% పెంపు దేశంలో ఎల్పీజీ సంక్షోభం లేదని, ఎవరూ ఆందోళన చెందొద్దని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టంచేసింది. తమ ఆదేశాల మేరకు చమురు శుద్ధి కంపెనీలు ఎల్పీజీ ఉత్పత్తిని 10 శాతం పెంచాయని వెల్లడించింది. రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపింది. వంట గ్యాస్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ప్రజలెవరూ నమ్మొద్దని కోరింది. ఎల్పీజీ సరఫరా స్థిరంగా కొనసాగుతున్నట్లు వెల్లడించింది. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా, అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని(ఎస్మా) అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. మన ప్రజలు ఇబ్బంది పడొద్దు⇒ చమురు, గ్యాస్ సరఫరా, ధరల విషయంలో సమన్వయంతో పనిచేయండి ⇒ కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ ఆదేశం న్యూఢిల్లీ: పశ్చి మాసియా సంక్షోభం, తద్వారా దేశంలో చమురు, వంట గ్యాస్ సరఫరాలో ఆటంకాలు ఎదురవుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. పశ్చి మాసియా యుద్దం వల్ల పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, ధరల విషయంలో మన దేశ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులు, హొర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మన వినియోగదారులపై పడకుండా చూడాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అంతేకాకుండా చమురు, వంట గ్యాస్ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ధరలు పెరుగుతున్న తీరుపైనా ప్రధానమంత్రి సమీక్షించారు. పశ్చి మాసియా నుంచి చమురు సరఫరా తగ్గడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రష్యా, అమెరికా, వెనెజువెలా, ఆ్రస్టేలియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపాయి. -
యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్కొరతతో హెటళ్లు బంద్
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తే అవకాశం ఉండడంతో భారత్‌తో పాటు ఇతర దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎల్పీజీ సిలిండర్ల కొరత నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు బంద్‌ను సైతం ప్రకటించాయి. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ పరిస్థితి ఏలా ఉంది అనే వివరాలు తెలుసుకోవాలనుందా అయితే మరెందుకు ఆలస్యం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.ఇరాన్ యుద్దం ఎఫెక్ట్ భారత్‌పై ఇప్పుడిప్పుడే మొదలైంది. ప్రెట్రోల్, డీజీల్ ధరలపై ఈ ప్రభావం ఇప్పటికే పెద్దగా లేకపోయినా ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రారంభమైంది. గ్యాస్ కొరతతో బెంగళూరులో వ్యాపారులు ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్ల బంద్‌ను పాటిస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా 25 శాతానికి పైగా హోటళ్లు మూతపడ్డాయి. రేపటి నుంచి ఈ సంఖ్య 50 శాతానికి పెరిగినా ఆశ్చర్యం లేదని ముంబై హోటల్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలోని విశాఖలో కూడా హోటళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. హైదరాబాద్ నగరంలో సాధారణంగానే రద్దీ ఉండగా ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతుంది. దీంతో గ్యాస్ కొరత ప్రభావం హోటళ్లు, బేకరీలపై పడుతుందనే ఆందోళన వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది.గ్యాస్ కొరతపై కేంద్రం స్పందన యుద్ధం ప్రారంభమైన ఒకట్రెండు రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని, మన వద్ద 21 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రకటన చేసింది. అయితే.. తాజాగా హోటళ్లు, రెస్టారెంట్ల బంద్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమైంది. ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించింది. అత్యవసర సేవల చట్టం.. ఎస్మా పరిధిలోకి గ్యాస్ సరఫరాను తీసుకువచ్చింది. బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ మేరకు జిల్లాల వారీగా కలెక్టర్లు ఇప్పటికే రంగంలోకి దిగారు. తమ పరిధిలోని ఎల్పీజీ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సిలిండర్ల పంపిణీని రేషనలైజేషన్ చేస్తున్నట్లు సమాచారం. దీని ప్రభావం ఇతర రంగాలపై ఎలా ఉంటుంది?హోటళ్లు, రెస్టారెంట్లకు, పర్యాటక రంగానికి ముడిపడి ఉంటుందనేది నిర్వివాదాంశం. పర్యాటక ప్రదేశాల్లో హోటళ్లు మూతపడితే.. ఆ ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. పట్టణ, నగర ప్రాంత పర్యాటక ప్రదేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఆటో ఎల్పీజీమహానగరాల్లో ఇప్పుడు ఆటో ఎల్పీజీ స్థానాన్ని అధికస్థాయిలో సీఎన్జీ ఆక్రమించింది. అయినప్పటికీ వేల సంఖ్యలో ఆటోరిక్షాలు ఇప్పటికీ ఆటో ఎల్పీజీపైనే ఆధారపడ్డాయి. గత నెలలో ఆటో ఎల్పీజీ ధర లీటరుకు 55 రూపాయల వరకు ఉంది. మూడ్రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరను పెంచడంతో ఇప్పుడు ఆటో ఎల్పీజీ ధర 63 రూపాయలకు చేరుకుంది. ఎల్పీజీ బంకుల్లో కూడా షార్టేజీ భయంతో ఆటోరిక్షాలు, కార్లు క్యూకడుతున్న పరిస్థితులు ఎల్పీజీ బంకుల వద్ద కనిపిస్తోంది. మరెంత కాలం సంక్షోభం?పశ్చిమాసియాలో పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ ఇంధన సరఫరా చైన్‌కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద నౌకలు స్తంభించిపోయాయి. అటుగా వచ్చే నౌకలను ఇరాన్ టార్గెట్‌గా చేసుకుంటోంది. అయితే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం రేషనలైజేషన్ ద్వారా పంపిణీపై దృష్టి సారించేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్ ఎల్పీజీ విషయాన్ని పక్కనపెడితే.. డొమెస్టిక్‌తోపాటు.. ఆస్పత్రులు, స్కూళ్లు, హాస్టళ్ల విషయంలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పరిశ్రమలకు అవసరమయ్యే ఎల్పీజీ సరఫరాకు సంబంధించి ఆయిల్ కంపెనీలకు సంబంధించిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ ఇదివరకే ఎక్స్‌లో ట్వీట్ చేసింది.భారత్‌లో ఎల్పీజీ డిమాండ్ఒకప్పటితో పోలిస్తే.. భారత్‌లో ఎల్పీజీ డిమాండ్ చాలా పెరిగిందని చెప్పవచ్చు. ఉజ్వల వంటి పథకాలతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై పేదలకు సిలిండర్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.. అంతకు ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దీపం పేరుతో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేలా పథకాలు కొనసాగాయి. మొత్తానికి కమర్షియల్, డొమెస్టిక్ కలిపి దేశంలో ఏటా 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీ వినియోగం జరుగుతోంది. ఇందులో 87 శాతం డొమెస్టిక్ వినియోగమే కావడం గమనార్హం. మిగతా 13 శాతంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆటో ఎల్పీజీ వినియోగం ఉంటుంది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి ద్వారా కొరతను అధిగమించలేమా?భారతదేశ ఎల్పీజీ అవసరాలు తీరాలంటే 62 శాతం మేర దిగుమతులు తప్పనిసరి. మిగతా 38 శాతం మాత్రమే ప్రస్తుతం మన వద్ద ఉత్పత్తి అవుతుంది. హోర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు తగ్గితే.. వెను వెంటనే మన దేశానికి దిగుమతి కావాల్సిన ఎల్పీజీ అందుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ చెబుతోంది. మన దిగుమతుల్లో 90 శాతం వరకు సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నుంచి వస్తున్నాయి. అయితే.. భారత్‌లో ఇంధన నిల్వలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. -
దేశంలో వేధిస్తున్న గ్యాస్ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, ఆయిల్ సరఫరా తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ ప్రభావం దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మేరకు దేశంలో పెరుగుతున్న ఎల్పీజీ గ్యాస్ కొరతను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది.కేంద్ర పెట్రోలియం శాఖ ఆయిల్ కంపెనీలకు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. వంటగ్యాస్ ఉత్పత్తి కోసం అవసరమైన హైడ్రోకార్బన్‌ను తరలించేందుకు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. అదనంగా, నేచురల్ గ్యాస్ ఉత్పత్తి నియంత్రణకు పలు మార్గదర్శకాలు ప్రకటించింది.గృహ అవసరాల గ్యాస్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు గ్యాస్ బుకింగ్ సమయాన్ని 25 రోజులకు పెంచింది. గృహ వినియోగదారులు, ఆస్పత్రులు, విద్యాసంస్థలకు ఎల్పీజీ సరఫరాలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.హోటల్స్, రెస్టారెంట్లు మరియు ఇతర పరిశ్రమలకు ఎల్పీజీ సరఫరా పర్యవేక్షణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని కేంద్ర పెట్రోలియం శాఖ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సరఫరా వ్యవస్థను క్రమబద్ధం చేయడమే కాకుండా, అక్రమ వినియోగాన్ని అరికట్టనుంది.ఎల్పీజీ ఉత్పత్తి పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని అమలు చేసింది. ఆయిల్ కంపెనీలు ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. గృహ అవసరాలకు ఉపయోగించే పిఎన్జి, రవాణా కోసం ఉపయోగించే సిఎన్జి, అలాగే ఎల్పీజీ ఉత్పత్తి పెంపుకు ప్రాధాన్యత ఇవ్వాలని గెయిల్‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నేచురల్ గ్యాస్ ఉత్పత్తి కొరత రాకుండా సమన్వయం చేయాలని స్పష్టంగా పేర్కొంది. -
పెరిగిన గ్యాస్ ధరలు.. డొమెస్టిక్ సిలిండర్ ఎంతంటే?
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భారత్‌పై పడింది. దీంతో వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.60 పెంపు జరగగా వాణిజ్య సిలిండర్‌పై రూ. 115 పెరిగింది. ఈ ధరలు తక్షణమే అమలులోకి వస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వ పథకం ఉజ్వల ద్వారా అందించే సిలిండర్ ధరలు మాత్రం యథాతథంగా ఉండనున్నట్లు తెలిపింది.ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో చమురు రవాణా చేసే నౌకలు నిలిచిపోయాయి. ఈ ప్రభావంతో చమురు ధరలు పెరిగాయి. ఈ ధరలతో హైదరాబాద్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 965కు చేరుకుంది. ఢిల్లీలో డొమెస్టిక్ ధర ప్రస్తుతం రూ. 913 ఉండగా, ముంబైలో రూ. 852 చెన్నైలో రూ.928 కి చేరుకుంది. అయితే యుద్ధప్రభావంతో భవిష్యత్తులో కొరత ఏర్పడకుండా ఉండేందుకు చమురు ఉత్పత్తులను భారీగా పెంచాలని కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే భారత్ వద్ద తాత్కాలికంగా చమురు నిల్వలు ఉన్నాయని పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇది వరకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
న్యూయార్క్‌లో ఘోర ప్రమాదం.. గ్యాస్ లీకై చర్చిలో పేలుడు
న్యూయార్క్‌లో బూన్విల్లే పట్టణంలోని ఓ చర్చిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక ఫైర్ ఫైటర్ సహా ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బూన్విల్లేలోని 'అబండెంట్ లైఫ్ ఫెలోషిప్' చర్చిలో గ్యాస్ లీక్ అవుతుందన్న ఫిర్యాదు అగ్ని మాపక సిబ్బందికి అందింది.దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపడుతుండగానే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చర్చి భవనం దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన ఐదుగురిని వెంటనే యూటికాలోని విన్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఫైర్ ఫైటర్‌తో పాటు మరొక పౌరుడి పరిస్థితి విషమంగా ఉంది.చర్చి పాస్టర్ కూడా ఈ ప్రమాదంలో గాయపడినట్లు తెలుస్తోంది. చర్చిలో వేడిని పుట్టించడానికి ఉపయోగించే ప్రొపేన్ సిలిండర్ల నుండి గ్యాస్ లీక్ అవ్వడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లో నల్లటి పొగ అలుముకుంది. ఈ ఘటనలో ఎటువంటి కుట్ర కోణం లేదని, ఇది ప్రమాదవశాత్తు జరిగినదేనని న్యూయార్క్ స్టేట్ పోలీసులు స్పష్టం చేశారు. -
ఓఎన్జీసీ బావిలో మళ్లీ ఎగసిపడ్డ మంటలు
డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని ఓఎన్జీసీ మోరి బావి నంబరు 5లో జరిగిన బ్లో అవుట్ ఇంకా కొనసాగుతోంది. భూగర్భం నుంచి వచ్చే గ్యాస్ ఒత్తిడి తగ్గడంతో మంగళవారం మధ్యాహ్నానికి మంటల తీవ్రత తగ్గింది. అయితే గ్యాస్ ఒత్తిడి పెరిగినప్పుడు మళ్లీ మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ మార్పుల కారణంగా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. బావిని పూర్తిగా మూసివేయడానికి అవసరమైన వెల్ క్యాపింగ్ ప్రక్రియపై అధికారులు ఇంకా స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నారు. గ్యాస్ ఒత్తిడి స్థిరంగా లేకపోవడం వల్ల చర్యలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఘటనతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నప్పటికీ, మంటలు మళ్లీ ఎగసిపడటం ఆందోళన కలిగిస్తోంది. -
కృష్ణా డెల్టాకు పెనుముప్పు
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా కాజా, తరకటూరుతో పాటు 14 గ్రామాల పరిధిలో బావులు తవ్వి (షెల్) చమురు (ఆయిల్), గ్యాస్ (సహజ వాయువు) వెలికితీస్తే డెల్టాకు పెనుముప్పు తప్పదని, సాగు నీరే కాదు, తాగడానికి గుక్కెడు మంచి నీళ్లూ దొరకవని ‘సైంటిస్ట్స్ ఫర్ పీపుల్’ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘చమురు, గ్యాస్‌ను వెలికితీసేందుకు బావులను అత్యంత లోతుకు తవ్వుతారు. భారీఎత్తున నీటిని తోడడంతో భూగర్భ జలాలు అడుగంటుతాయి. గ్యాస్, చమురు వెలికితీత (ఫ్రాకింగ్) సమయంలో వెలువడే వ్యర్థ జలాల్లో అణుధార్మిక పదార్థాలు ఉంటాయి’’ అని పేర్కొన్నారు. భారీగా వెలువడే వ్యర్థ జలాలను తరలించడం అసాధ్యమని... వాటిని వదిలేయడం వల్ల భూమి, నీరు, గాలి కలుషితం అవుతాయన్నారు. ఫ్రాకింగ్ వ్యర్థాలపై విస్తృతంగా అధ్యయనం చేసి నోబెల్ శాంతి బహుమతి పొందిన డాక్టర్ల సంస్థ ఫిజీషియన్స్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (పీఎస్సార్) నివేదికను వారు ఉటంకించారు. అణు ధార్మిక పదార్థాలు ఉండే ఫ్రాకింగ్ జలాల ప్రభావం ప్రజారోగ్యంపై తీవ్రంగా ఉంటుందని ఎత్తిచూపారు. షెల్ గ్యాస్, చమురు వెలికితీత వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగిన నష్టాలపై వందలాది పరిశోధనలు ఉన్నాయని గుర్తుచేశారు. శాస్త్రీయ ఆధారాలను విస్మరించి... సమగ్ర పరిశీలన లేకుండా వేదాంత సంస్థకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇవ్వడం బాధ్యతారాహిత్యంగా అభివర్ణించారు. తక్షణమే ఈ ఎన్వోసీ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పీఎస్సార్ సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ కె.బాబూరావు, డాక్టర్ కె.వెంకటరెడ్డి, డాక్టర్ డి.రాంబాబు, డాక్టర్ అహ్మద్‌ఖాన్, డాక్టర్ పీజీ రావు, డాక్టర్ ఎం.బాపూజీతో పాటు, మరో 24 మంది శాస్త్రవేత్తలు బుధవారం ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపారు.లేఖలోని ముఖ్యాంశాలు..1. వేదాంత కంపెనీకి షెల్ గ్యాస్, ఆయిల్ వెలికితీతకు కేంద్రం లీజు ఇచ్చింది. ఆ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతంలో పుట్టి పెరిగిన మేము... ప్రపంచవ్యాప్తంగా షెల్ బావులు సృష్టించిన పర్యావరణ విధ్వంసం, ఆరోగ్య నష్టాల గురించి తెలిసి, ఆందోళన చెందాం. స్థానిక ప్రజలకు ఎదురయ్యే ముప్పును వివరించే ప్రయత్నం చేశాం. మీడియా సంస్థలు మా వాదనలకు వేదిక కల్పించినా, రాష్ట్ర పీసీబీ సహకరించలేదు. పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నివేదికపై మేం లేవనెత్తిన ప్రశ్నలకు వేదాంతతో సమాధానాలు ఇప్పించలేదు. నిజానికి వేదాంతకు షెల్ ఆయిల్, గ్యాస్ వెలికితీతలో అనుభవం లేదు. అంతేకాదు, భారత ప్రభుత్వానికి షెల్ గ్యాస్, ఆయిల్ ఫ్రాకింగ్పై స్పష్టమైన పర్యావరణ, భద్రతా నియమ నిబంధనలు కూడా లేవు. 2. ఫ్రాకింగ్ చేయడానికి కోట్ల లీటర్ల నీరు అవసరం. అందులో వందల సంఖ్యలో హానికర రసాయనాలు కలుపుతారు. వ్యాపార రహస్యాల పేరుతో వాటిని ప్రజలకు వెల్లడించరు. బావుల నుంచి వచ్చే వ్యర్థ జలాల్లో అణుధార్మికత (రేడియో యాక్టివిటీ) ఉంటుంది. అంత నీరు ఈ ప్రాంతంలో దొరకదు. భూగర్భ జలాలను తోడేస్తే వ్యవసాయం కుప్పకూలుతుంది. తాగునీరు కూడా లభించదు. ఫ్రాకింగ్ వ్యర్థ జలాలను శుద్ధి చేయలేం. మరి ఎక్కడకు వదులుతారు? 3. ఫ్రాకింగ్ వల్ల కలిగే ఆరోగ్య నష్టాలపై పీఎస్సార్ అనేక నివేదికలు విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన నష్టాలపై వందలాది పరిశోధనలున్నా అన్నీ పక్కనపెట్టి, శాస్త్రీయ ఆధారాలను విస్మరించి, సమగ్ర పరిశీలన లేకుండా ఎన్వోసీ ఇవ్వడం ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇంత అధిక జనాభా సాంద్రత ఉన్న, తాగునీటి కొరత ఉన్న ప్రాంతంలో ఫ్రాకింగ్‌కు అనుమతించడం ప్రాణాంతకం.4. భారత ప్రభుత్వం గతంలో ఓఎన్జీసీ సంస్థకు ఫ్రాకింగ్‌కు అనుమతులు ఇచి్చంది. కొన్నేళ్ల పరిశోధన, ప్రయోగాల తర్వాత దేశంలో షెల్ నిర్మాణాలు వాణిజ్యపరంగా అనుకూలం కావని తేల్చి ఓఎన్జీసీ స్వయంగా వదిలేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు సంస్థ లాభాల కోసం ప్రజల ప్రాణాలు, నీరు, భూమిని తాకట్టు పెట్టే ప్రయత్నాన్ని తక్షణమే నిలిపివేయాలి. శతాబ్ద కాలంగా వ్యవసాయం, తాగు నీటి మీద ఆధారపడిన ఈ ప్రాంతాన్ని ఫ్రాకింగ్ నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులు, న్యాయ వ్యవస్థను కోరుతున్నాం. -
సాగర గర్భంలో అపార ఖనిజ సంపద.. వెలికితీత సాధ్యమేనా?
భారతదేశం అనేక ఖనిజాలకు (ఇంధన, లోహ, అలోహ ఖనిజాలు) నిలయం. వీటిని సరైన విధంగా గుర్తించి.. వినియోగించుకుంటే.. దిగుమతి కోసం దాదాపు ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. భూమిపైన మాత్రమే కాకుండా.. సముద్ర గర్భంలో కూడా విరివిగా లభిస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియా.. నేషనల్ గ్యాస్ హైడ్రేట్ ప్రోగ్రామ్ (NGHP) ద్వారా.. సముద్రంలో మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలను గుర్తించింది. ఇంతకీ ఇదెందుకు ఉపయోగపడుతుంది?, ఎలా బయటకు తీయాలి?, బయటకు తీయడం వల్ల లాభం ఏమిటనే.. ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.భారతదేశం.. బంగాళాఖాతంలో మాత్రమే కాకుండా, దాని తూర్పు ఖండాంతర అంచున దగ్గర కూడా భారీగా మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలను గుర్తించింది. ఈ నిక్షేపాల విలువ ట్రిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా. కానీ దీనిని (మీథేన్ హైడ్రేట్) సముద్రం నుంచి బయటకు తీయగల సరైన టెక్నాలజీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అంతే కాకుండా దీనిని బయటకు తీయడానికి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (UNCLOS) ద్వారా కొన్ని హక్కులను పొందాల్సి ఉంటుంది.మీథేన్ హైడ్రేట్‌ను బయటకు తీయడం కష్టమా?, ఎందుకు?సముద్రం అడుగున ఉన్న భూభాగం చల్లగా (0-4 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్) ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీథేన్ హైడ్రేట్ గడ్డ కట్టుకుని ఉంటుంది. అయితే దీనిని బయటకు తీయాలని ప్రయత్నించినప్పుడు.. కొంత ఉష్ణోగ్రత వల్ల కరిగిపోవచ్చు. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ మీథేన్ హైడ్రేట్ ఆవిరయ్యే అవకాశం ఉంటుంది.డీ–ప్రెషరైజేషన్, థర్మల్ స్టిమ్యులేషన్, వంటి టెక్నాలజీలను ఉపయోగించి లేదా కొన్ని రసాయన పద్దతుల ద్వారా మీథేన్ హైడ్రేట్ బయటకు తీయవచ్చు. కానీ సముద్ర గర్భంలో ఎక్కువ సేపు పని చేయడం అనేది చాలా కష్టమైన పని. అంతే కాకుండా పనిచేస్తున్నప్పుడు మీథేన్ విడుదలైతే చాలా ప్రమాదం. దీనికోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.మీథేన్ హైడ్రేట్ వల్ల ఉపయోగాలుసముద్రంలోని భారీ మీథేన్ హైడ్రేట్‌ను బయటకు తీస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రధానంగా గ్యాస్ దిగుమతులు తగ్గించవచ్చు. విద్యుత్ ఉత్పత్తి, వంట గ్యాస్, పరిశ్రమల్లో ఉపయోగించవచ్చు. భవిష్యత్ తరాలు ఉపయోగించుకోవడానికి నిల్వ చేసుకుపోవచ్చు. బొగ్గు, పెట్రోలియంతో పోలిస్తే.. మీథేన్ హైడ్రేట్ ఉపయోగం వల్ల కాలుష్యం తగ్గుతుంది. గ్యాస్ ధరలు కూడా తగ్గుతాయి.పరిధి దాటితే పరిస్థితులు తీవ్రం!సముద్రం అనేది ఏ ఒక్క దేశం అధీనంలో ఉండదు. ఇది మొత్తం అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉంటుంది. కేవలం తీరరేఖ నుంచి 12 నాటికల్ మైళ్ల దూరం మాత్రమే ఆ దేశం ఆధీనంలో ఉంటుంది. అయితే తీరరేఖ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న సముద్రంలో లభించే వనరులను దేశం ఉపయోగించుకునే అధికారం ఉంటుంది. ఈ పరిధి ఏ దేశం దాటినా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సముద్రంలోని నిక్షేపాలను ఏ ఒక్క దేశం స్వాధీనం చేసుకోవడం అనేది సాధ్యం కాదు.ఇదీ చదవండి: 'ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు'.. కియోసాకి పదో పాఠం -
బుధునికి ఓ ‘తోక’
బుధుడు. సౌర వ్యవస్థలో అత్యంత బుల్లి గ్రహం. అంతేగాక సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే గ్రహం కూడా. అయితే అది క్రమంగా చెదిరిపోతోందా? కొద్దికాలానికి గ్రహ లక్షణాలను కోల్పోయేలా ఉందా? ఆ అవకాశం లేకపోలేదు అన్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే బుధ గ్రహం ఉన్నట్టుండి తోకచుక్క లక్షణాలు ప్రదర్శిస్తోంది. అవును! దానికి ఏకంగా 2.4 కోట్ల కిలోమీటర్ల పొడవున సాగిన తోక ఇప్పుడు సైంటిస్టు లోకాన్ని అబ్బురపరుస్తోంది. సోడియం వాయువులతో కూడిన అది దూరదూరాల దాకా తన వెలుగులను విరజిమ్ముతోంది. అమెరికాలోని వర్జీనియకు చెందిన స్టీవెన్ బెలావియా అనే సైంటిస్టు ఈ తోక తాలూకు ఫోటోను తొలిసారిగా తీసి ప్రపంచానికి చూపాడు. అది జరిగింది కూడా బుధవారమే (డిసెంబర్ 3న) కావడం.మరో విశేషం.సూర్యునితో సాన్నిహిత్యం వల్లే...బుధ గ్రహానికి ఇలా ఒక తోక పుట్టుకు రావచ్చని అప్పుడెప్పుడో 1980లోనే సైంటిస్టులు అత్యంత కచితత్వంతో కూడిన అంచనా వేయడం విశేషం. సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండటమే తోక పుట్టుకకు కారణమని సైంటిస్టులు వివరిస్తున్నారు. బుధుని తాలూకు అత్యంత పలుచనైన వాతావరణంపై సూర్యుని రేడియో ధార్మికత నురగ ప్రభావం చూపుతూ ఉంటుంది. ఫలితంగా బుధాణువులు దాన్నుంచి విడివడుతూ తీవ్ర వేగంతో. అంతరిక్షంకేసి దూసుకు పోతుంటాయి. కొన్నేళ్లుగా ఇవి అతి పొడవున తోక ఆకృతి దాలుస్తున్నాయి. ఈ తోక ఉనికి నిజానికి 2001లోనే నిర్ధారణ అయింది. కాకుంటే దాన్ని చూడటం మాత్రం నేటిదాకా సాధ్యపడలేదు.అత్యంత ప్రకాశవంతంగా...ప్రస్తుతం బుధుడు పరిహేళి క్రమంలో ఉన్నాడు. ఈ దశలో ప్రతి గ్రహమూ తన పరిభ్రమణ క్రమంలో సూర్యునికి అతి సమీపానికి వెళ్తుంది. దాంతో ఈ 2.4 కోట్ల కి.మీ. పొడవైన తోకచుక్క అతి స్పష్టంగా, ప్రకాశవంతంగా కనిపిస్తోందిప్పుడు. దాని ప్రకాశంలో మార్పుచేర్పులను నాసా మెసెంజర్ ఉపగ్రహ కొన్నేళ్లుగా స్పష్టంగా గమనిస్తూ వస్తోంది. అంతేగాక దానికి సంబంధించిన కీలక వివరాలను కూడా అందించింది. డిసెంబర్ 9న ఈ తోక మరింత ప్రకాశవంతంగా కనిపించనుందని సైంటిస్టులు తెలిపారు. ఎంతగా అంటే, ప్రస్తుతం కనిపిస్తున్న దానికంటే ఏకంగా పదింతల వెలుగుతో మెరిసిపోనుందట! సైంటిస్టులు సిద్ధంఆ సమయంలో, అంటే డిసెంబర్ 9న బుధునిపై, దాని తోకపై ఇంకొన్ని పరిశోధనలు చేసి, మరిన్ని కీలక వివరాలు, విశేషాలు వెలుగులోకి తెచ్చేందుకు సైంటిస్టులు ఇప్పటి నుంచే అన్ని పరికరాలతో సిద్ధమవుతున్నారు! ఎందుకంటే గ్రహానికి, తోక చుక్కకు ఉన్న మౌలిక భేదాలనే బుధుని తాలూకు ఈ పొడవాటి తోక సవాలు చేస్తోంది. బహుశా బుధుడు ముక్కలు చుక్కలుగా విడిపోయి ఒక పెద్ద తోక చక్కగా మారే ఆస్కారం కూడా లేకపోలేదన్నది కొందరి సైంటిస్టుల జోస్యం. అదేంతవరకూ ఫలిస్తుందో చూడాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యా గ్యాస్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి
కీవ్: కజఖ్‌స్తాన్ సరిహద్దుల్లో ఉన్న రష్యాకు చెందిన గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌పై శనివారం రాత్రి ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది. భారీ పేలుళ్లు సంభవించడంతోపాటు పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో, ప్లాంట్‌ను మూసివేసినట్లు రష్యా, కజకిస్తాన్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని గాజ్ప్రోమ్ సంస్థకు చెందిన ఒరెన్‌బర్గ్ ప్లాంట్‌లో కజఖ్‌స్తాన్ నుంచి వచ్చే గ్యాస్‌ను ప్రాసెసింగ్ చేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఒరెన్‌బర్గ్ ప్లాంట్ వార్షిక సామర్థ్యం 45 బిలియన్ క్యూబిక్ మీటర్లు. డ్రోన్ దాడి కారణంగా ఈ ప్లాంట్‌లోని వర్క్‌షాప్ తీవ్రంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు. ప్లాంట్‌లో తాత్కాలికంగా గ్యాస్ ప్రాసెసింగ్‌ను నిలిపివేశామన్నారు. రష్యా తమపై సాగిస్తున్న యుద్ధానికి ఇంధన వనరులే కీలకమని భావిస్తున్న ఉక్రెయిన్ తరచూ ఆయిల్, గ్యాస్ రిఫైనరీలపై డ్రోన్ దాడులకు తెగబడుతోంది. మరో డ్రోన్ దాడితో ఒరెన్‌బర్గ్ సమీపంలో నొవొకుయి బషెవ్స్క్ ఆయిల్ రిఫైనరీ ప్రధాన శుద్ధి విభాగం దెబ్బతిందని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇలా ఉండగా, రష్యా ఆధునీకరించిన గ్లైడ్ బాంబును ఖర్కీవ్‌లోని లొజావా నగరంపై శనివారం మధ్యాహ్నం ప్రయోగించిందని వెల్లడించింది. యూఎంపీబీ–5 ఆర్ అని పిలిచే రాకెట్ అమర్చిన ఈ రకం బాంబులు 130 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించిన తర్వాత సంభవించే పేలుడుతో తీవ్ర విధ్వంసం సంభవిస్తుంది. -
తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర.. ఏ ప్రాంతంలో ఎంతంటే..
దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.51.50 తగ్గించాయి. కొత్త ధరలు రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగిస్తాయి. ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచే ఈ ధరలు అమల్లోకి వస్తాయి. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రాంతాల వారీగా కింది విధంగా ఉన్నాయి.ఢిల్లీ: రూ.1,580కోల్‌కతా: రూ.1,683ముంబై: రూ.1,531చెన్నై: రూ.1,737.52025 ఏప్రిల్-జులై మధ్య 19 కిలోల ఎల్పీజీ ధరలు ఢిల్లీలో రూ.138, కోల్‌కతాలో రూ.144, ముంబైలో రూ.139, చెన్నైలో రూ.141.5 తగ్గాయి. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర ఏప్రిల్ 8, 2025న రూ.50 పెరిగినప్పటి నుంచి మార్పు చేయలేదు. ప్రస్తుత ధరలు ఢిల్లీలో రూ.853, కోల్‌కతాలో రూ.879, ముంబైలో రూ.852.50, చెన్నైలో రూ.868.50గా ఉంది.ఇదీ చదవండి: మరో బీమా సంస్థ సూపర్ టాపప్ ప్లాన్.. తీసుకోవచ్చా? -
భారత్‌లో యూఎస్ టార్గెట్ అదే..
పెరుగుతున్న ప్రపంచ ఇంధన అనిశ్చితి, మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో భారత్‌దేశానికి అతిపెద్ద ముడి చమురు, సహజ వాయువు సరఫరాదారుగా మారడానికి ప్రయత్నిస్తున్నట్లు యునైటెడ్ స్టేట్స్ తెలిపింది. భారత్ రష్యా ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని అమెరికా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) ఇంధన సదస్సులో భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రిన్సిపల్ కమర్షియల్ ఆఫీసర్ జియాబింగ్ ఫెంగ్ ఈమేరకు వివరాలు వెల్లడించారు.ప్రధాన సరఫరాదారుగా మారేందుకు..ఈ సదస్సులో ఫెంగ్ మాట్లాడుతూ..‘ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధి లక్ష్యాలకు మద్దతుగా భారత్‌తో కలిసి పనిచేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. నాణ్యమైన ప్రపంచ స్థాయి ఉత్పత్తులు, సేవల ఎగుమతి ద్వారా మద్దతు ఇచ్చేందుకు అమెరికా కట్టుబడి ఉంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారు అయిన భారతదేశానికి ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ) ప్రధాన సరఫరాదారుగా మారడానికి యూఎస్ ఎంతో ఆసక్తి చూపుతోంది’ అన్నారు.దౌత్యపరమైన ఒత్తిడిప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య రష్యా చమురు దిగుమతులను తగ్గించాలని భారతదేశాన్ని కోరుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఇటీవల దౌత్యపరమైన ఒత్తిళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సదస్సులోని ప్రకటన మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. చమురు, గ్యాస్, అణుశక్తిపై సహకారంతో బలమైన ద్వైపాక్షిక ఇంధన భద్రతా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి కలిసి రావాలని ఫెంగ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గతంలో అమెరికా పర్యటనను హైలైట్ చేశారు. శిలాజ ఇంధనాలతో పాటు గ్రిడ్ ఆధునీకరణ, అణు ఇంధనం, అభివృద్ధి చెందుతున్న క్లీన్ టెక్నాలజీ రంగాల్లో కూడా భారత్‌తో భాగస్వామ్యం కావడానికి అమెరికా ఆసక్తిగా ఉంది. వీటిలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు (ఎస్ఎంఆర్లు), అధునాతన సహజ వాయువు మౌలిక సదుపాయాలు ఉన్నాయి.ఇంధన భాగస్వామ్యాలు..కీలకమైన ఖనిజాలను ఇరు దేశాలు సంయుక్తంగా భద్రపరచాలని, సోలార్ మాడ్యూల్ ఉత్పత్తిని పెంచాలని, అణువిద్యుత్, స్మార్ట్ గ్రిడ్లపై భారీగా పెట్టుబడులు పెట్టాలని ఐఏసీసీ రీజినల్ ప్రెసిడెంట్ అతుల్ చౌహాన్ సూచించారు. ఐఏసీసీలో క్లైమేట్ ఛేంజ్ అండ్ ఈఎస్జీ ఛైర్మన్ సునీల్ జైన్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య సమీకృత ఎనర్జీ భాగస్వామ్యాలు అవసరమని అన్నారు. భవిష్యత్తులో భారతదేశ ఇంధన మౌలిక సదుపాయాలకు అణు, ఎస్ఎంఆర్లతో సహా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సంప్రదాయ వనరులు కీలకంగా మారుతాయన్నారు.ఇదీ చదవండి: పిల్లల ఆధార్ అప్డేట్.. యూఐడీఏఐ లేఖఅమెరికా భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. టారిఫ్‌లకు భయపడి భారత్ డిమాండ్లకు ఒప్పుకుంటుందని భావించిన ట్రంప్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. భారత్ చౌకగా దిగుమతి చేసుకుంటున్న రష్యా చమురు స్థానంలో యూఎస్ క్రూడ్ దిగుమతులు పెంచాలని ఇటీవల ఒత్తిడి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. -
గ్యాస్ తాగుతూ బతుకుతున్న ఓ వింత మనిషి
-
చమురుపై ఇక విండ్‌ఫాల్ ట్యాక్స్‌లు ఉండవు
న్యూఢిల్లీ: ఆయిల్‌ఫీల్డ్స్ (నియంత్రణ, అభివృద్ధి) బిల్లు అమల్లోకి వచ్చాక చమురు, గ్యాస్ కంపెనీల అసాధారణ లాభాలపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ల్లాంటి కొత్త పన్ను ల విధింపు బాదరబందీ ఉండదని కేంద్ర పెట్రోలి యం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేయడాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయం చెప్పారు. ఇన్వెస్టర్లకు ఆర్థిక విధానాల స్థిరత్వంపై కొత్త చట్టం భరోసా కల్పిస్తుందని పురి వివరించారు.అంతర్జాతీయంగా పలు ఆయిల్ దిగ్గజాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ ఆయిల్ ఇండియాతో బ్రెజిల్‌కి చెందిన పెట్రోబ్రస్, ఓఎన్జీసీతో ఎక్సాన్‌మొబిల్, ఈక్వినార్ వంటి సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు మంత్రి వివరించారు. ఇతర దేశాల తరహాలోనే, ఇంధన కంపెనీలకు వచ్చే అసాధా రణ లాభాలపై 2022 జూలై 1 నుంచి భారత్ విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యా క్స్లు విధించడం మొదలుపెట్టింది.పెట్రోల్.. ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 6 చొప్పున, డీజిల్‌పై లీటరుకు రూ. 13 చొప్పున ఎగుమతి సుంకాలు విధించింది. దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తిపైనా టన్నుకు రూ. 23,250 చొప్పున విధించింది. పలుమార్లు సవరించిన ఈ ట్యాక్స్‌లను 30 నెలల తర్వాత గతేడాది డిసెంబర్లో నిలిపివేసింది. -
వంట చేస్తుండగా పేలిన సిలిండర్
-
జార్జియాలోని రిసార్టులో 11 మంది భారతీయుల మృతి
టిబిలిసి: జార్జియాలో పర్వతశ్రేణుల్లో ఒక రిసార్టులో 11 మంది భారతీయులు మృతి చెందారని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది. మృతుల శరీరాలపై గాయాలేమీ లేవని, హింస జరిగిన అనవాళ్లు కూడా కన్పించలేదని జార్జియా విదేశాంగ శాఖ తెలిపింది. విషవాయువు కార్బన్ మోనాక్సైడ్ కారణంగా 12 మంది మరణించగా.. ఇందులో 11 మంది భారతీయులని తెలిపింది. పర్వత ప్రాంతమైన గదౌరీలో ఈ 11 మంది హవేలీ అనే భారతీయ రెస్టారెంట్లో పనిచేస్తున్నారని వివరించింది. మృతుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాలను భారత్‌కు పంపేందుకు ప్రయత్నిస్తున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అవసరమైన సహాయసహకారాలను అందిస్తున్నామని పేర్కొంది. మృతికి కారణాలను తెలుసుకునేందుకు జార్జియా ప్రభుత్వం ఒక ఫోరెన్సిక్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. -
పాపాల భోపాల్‌లో పారా తారలు.. విషం కాటేసినా ఆటై మెరిశారు
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 40 ఏళ్లు. డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి మొదలై డిసెంబర్ 3 వరకూ కొనసాగిన విష వాయువులు ఆ ఒక్క రాత్రితో తమ ప్రభావాన్ని ఆపేయలేదు. అవి జన్యువుల్లో దూరి నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దుర్ఘటన నుంచి బయటపడిన వారికి నేటికీ అవకరాలతో పిల్లలు పుడుతున్నారు. ఏనాటి ఎవరి పాపమో ఇప్పటికీ వీళ్లు అనుభవిస్తున్నారు. అయితే వీరిలో కొందరు పిల్లలు పారా స్పోర్ట్స్‌లో ప్రతిభ చూపుతుండటం ఒక ఆశ. కాని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పడమే వీరు మనకు కలిగిస్తున్న చైతన్యం.పదిహేడేళ్ల దీక్షా తివారి ‘ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ డిజార్డర్’ (ఐడిడి) రుగ్మతతో బాధ పడుతోంది. ఆ అమ్మాయిని బాల్యంలో గమనించిన తల్లిదండ్రులు మహేష్ తివారి, ఆర్తి తివారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ఆయన ‘ఇది భోపాల్ గ్యాస్ విష ఫలితం’ అనంటే ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. ‘అదెప్పటి సంగతో కదా’ అన్నారు. ‘అవును... ఇప్పటికీ వెంటాడుతోంది’ అన్నాడు డాక్టర్. దానికి కారణం భోపాల్ ఘటన జరిగినప్పుడు మహేష్ వయసు 5 ఏళ్లు, ఆర్తి వయసు 3 సంవత్సరాలు. వారు భోపాల్‌లో ఆ గ్యాస్‌ని పీల్చారు. కాని అది జన్యువుల్లో దూరి సంతానానికి సంక్రమిస్తుందని నాడు వాళ్లు ఊహించలేదు.అదృష్టం ఏమిటంటే దీక్షా తివారి 2023 స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బాస్కెట్ బాల్లో రజత పతకం తేవడం. ఈ అమ్మాయే కాదు భోపాల్ విష వాయువు వెంటాడుతున్న చాలా మంది బాలలు భోపాల్‌లోని జేపీ నగర్ప్రాంతంలో అత్యధికం ఉన్నారు. వీరంతా తమ శారీరక, మానసిక లోపాలను, రుగ్మతలను జయించడానికి స్పోర్ట్స్‌ను ఎంచుకున్నారు. అథ్లెటిక్స్, సైక్లింగ్, ఫుట్‌బాల్ తదితర ఆటల్లో ప్రతిభ చూపుతున్నారు. బతుకు జీవచ్ఛవం కాకుండా ఉండేందుకు క్రీడలు వారిని కాపాడుతున్నాయి. కాని ప్రభుత్వం వీరికి చేయవలసింది చేసిందా?40 టన్నుల గ్యాస్డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి అత్యంత ప్రాణాంతకమైన ‘మిథైల్ ఐసొసైనెట్’ విడుదలవడం మొదలయ్యి మరుసటి రోజు సాయంత్రం వరకూ వ్యాపించింది. దాదాపు 40 టన్నుల విషవాయువు విడుదలైంది. దీని వల్ల చనిపోయిన వారు అధికారికంగా 2,259 కాని 20 వేల నుంచి 40 వేల వరకు మరణించి ఉంటారని సామాజిక కార్యకర్తల అంచనా. ఆ సమయంలో బతికున్నవారు జీవచ్ఛవాలుగా మారితే కొద్దిపాటి అస్వస్థతతో బయటపడిన వారూ ఉన్నారు. విషాదం ఏమంటే ఈ ఘటన జరిగినప్పుడు చంటిపాపలు, చిన్న పిల్లలుగా ఉన్నవారు ఆ ఘటన నుంచి బయట పడి అదృష్టవంతులం అనుకున్నారు కానీ వారికి యుక్తవయసు వచ్చి పిల్లలు పుట్టాక వారిలో అధిక శాతం దివ్యాంగులుగా, మానసిక దుర్బలురుగా మిగిలారు.1300 మంది దివ్యాంగులు‘‘భోపాల్ విషవాయువులు భోపాల్‌లోని 42 వార్డుల మీద ప్రభావాన్ని చూపాయి. ఆ 42 వార్డుల్లో దివ్యాంగ శిశువులు జన్మిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య అధికారికంగా 1300. వీరిలో అత్యధికులు అంధత్వం, సెరిబ్రల్ పాల్సీ, డౌన్ సిండ్రోమ్, మస్క్యులర్ డిస్ట్రఫీ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వంటి సమస్యలతో బాధ పడుతున్నారు.వీరికి రెగ్యులర్‌గా థెరపీ అవసరం. కాని మా వద్ద వున్న వనరులతో కేవలం 300 మందికే సేవలు అందించగలుగుతున్నాం. మిగిలినవారికీ ఏ థెరపీ అందడం లేదు. వీరిలో చాలామంది పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు. ఈనాటికీ వీరికి నష్టపరిహారం అందలేదు’’ అని ‘చింగారి’ ట్రస్ట్ బాధ్యుడొకరు తెలిపారు. భోపాల్ విషవాయువు బాధిత దివ్యాంగ శిశువులకు ఈ సంస్థ వైద్య సహాయం అందిస్తుంది.కల్లాకపటం లేని పిల్లలుభోపాల్లోని జేపీనగర్‌లో కల్లాకపటం లేని అమాయక బాలలు చాలామంది కనిపిస్తారు. ముద్దొచ్చే మాటలు మాట్లాడుతూ అందరిలాగా ఆటలాడాలని, స్కూలుకు వెళ్లాలని, కబుర్లు చెప్పే వీరంతా చాలామటుకు బుద్ధిమాంద్యంతో బాధపడే పిల్లలే. కొందరు శరీరం చచ్చుబడ్డ వారే. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన వీరంతా నిరసన కార్యక్రమం జరుపుతుంటారు. న్యాయం కోరుతుంటారు. కానీ దుర్ఘటన జరిగి 40 ఏళ్లు అవుతున్నా వీరు రోడ్ల మీదకు వస్తూనే ఉండాల్సి రావడం బాధాకరం.నీరు తాగిభోపాల్ విషవాయులు భూమిలోకి ఇంకడం వల్ల కొన్ని చోట్ల ఇప్పటికీ ఆ నీరు విషతుల్యం అయి ఉంది. వేరే దిక్కు లేక పేదలు ఆ నీరే చాలాకాలం తాగి ఇప్పుడు దివ్యాంగ శిశువులకు జన్మనిస్తున్నారు. ‘ఆటలాడే ఉత్సాహం ఉన్నా వీరికి ఆటవస్తువులు లేవు. హెల్త్ కార్డులు లేవు’ అని తల్లిదండ్రులు భోరున విలపిస్తుంటే ఏ పాపానికి ఈ శిక్ష అనిపిస్తుంది. -
36.6 శాతం గృహాలు... స్వచ్ఛ ఇంధనానికి దూరం
సాక్షి, అమరావతి: దేశంలో ఇంకా 36.6 శాతం గృహాలు వంట కోసం స్వచ్ఛ ఇంధనానికి (గ్యాస్) దూరంగా ఉన్నాయి. పట్టణాల్లో 92.9 శాతం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సగానికిపైగా కుటుంబాలు స్వచ్ఛ ఇంధనానికి నోచుకోలేదని సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే 2022–23 వెల్లడించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 49.3 శాతం గృహాలు మాత్రమే వంట కోసం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయి.మిగతా 50.7 శాతం కుటుంబాలు కట్టెలు, బొగ్గులనే వాడుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో కలిపి దేశంలో 63.4శాతం గృహాలు మాత్రమే వంట కోసం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయి. మిగతా 36.6 శాతం కట్టెలు, బొగ్గు వంటి వాటిపైనే ఆధారపడుతున్నాయి. అయితే ఏపీలో జాతీయ స్థాయికి మించి గ్రామీణ, పట్టణాల్లో కలిపి 88.0 శాతం గృహాలు వంట కోసం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయని సర్వే వెల్లడించింది.రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 84.1 శాతం గృహాలు స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తుండగా, పట్టణాల్లో 96.7 శాతం గృహాలు స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సగం గృహాలు కూడా వంట కోసం స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించడం లేదని సర్వే వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్, అసోం, బిహార్, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సగం గృహాలు వంట కోసం స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించడం లేదని సర్వే తెలిపింది. స్వచ్ఛ ఇంధనం అంటే.. వంట కోసం ఎల్పీజీ, ఇతర సహజ వాయువులు, గోబర్ గ్యాస్, ఇతర బయోగ్యాస్ విద్యుత్, సోలార్ కుక్కర్ వంటివి వినియోగించడం -
స్కూల్లో గ్యాస్ లీక్.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత
చెన్నై: తమిళనాడులోని చెన్నై నగరంలో గల ఓ పాఠశాలలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనతో పలువురు విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. గ్యాస్ లీకేజీ కారణంగా పిల్లలతో పాటు కొందరు ఉపాధ్యాయులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరువొత్తియూర్‌లోని మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 30 మందికి పైగా విద్యార్థులు గ్యాస్ లీక్ కారణంగా అస్వస్థత బారిన పడ్డారు. బాధితులను స్కూలు సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, వారికి చికిత్స జరుగుతున్నదని విద్యాశాఖ అధికారులు తెలిపారు.విద్యార్థులకు సాయం అందించేందుకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఏకే చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ గ్యాస్ లీకేజీకి ఖచ్చితమైన కారణం తెలియరాలేదన్నారు. తమ బృందం బాధితులకు సహాయం అందిస్తున్నదన్నారు. బాధిత విద్యార్థి ఒకరు మాట్లాడుతూ గ్యాస్ లీకేజీతో ఇబ్బంది ఎదుర్కొన్న మేము తరగతి గది నుండి బయటికి పరుగుపరుగున వచ్చేశామన్నారు. ఉపాధ్యాయులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారని, కొంతమంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారని తెలిపారు. వెంటనే బాధిత విద్యార్థులకు ఉపాధ్యాయులు సాయమందించాన్నారు.పాఠశాలలో నుంచే గ్యాస్ లీకేజీ జరిగిందా లేదా రసాయన కర్మాగారం నుంచి వచ్చిందా అనేది స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సమాచారం తెలియగానే విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూలుకు చేరుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పాఠశాల సిబ్బంది స్పష్టమైన సమాచారం అందించడం లేదని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఇది కూడా చదవండి: డెడ్ డ్రాప్ పంథాలో సింథటిక్ డ్రగ్స్ దందా! -
Gastric Problem: పొట్టలో గ్యాస్ బండ
పొట్టంతా టైట్‌గా ఉండి... కడుపంతా ఉబ్బరం’’ ఒకరి ఆవేదన. ‘‘అబ్బా... గొంతులోంచి పైకి వస్తున్న మంటలా ఏదో బర్నింగ్ సెన్సేషన్’’ ఇంకొకరి ఆక్రందన. ‘‘తిన్నవెంటనే రొమ్ముమీదే అతుక్కున్నట్టుగా ఉంటోంది. యాంటాసిడ్ ఏదైనా ఉందా’’ మరొకరి అభ్యర్థన. ఇలాంటి మాటలన్నీ ఏ కుటుంబంలోనైనా ఎవరో ఒకరి నుంచి తరచూ వినిపిస్తుండేవే. గతంలో కాస్తంత పెద్దవాళ్లు మాత్రమే అనే ఈ మాటల్ని ఇటీవలి లైఫ్‌స్టైల్‌తో మరీ కొందరు చిన్నపిల్లల్ని మినహాయిస్తే... యువతా, మధ్యవయస్కులూ, పెద్దలూ ఇలా వయసు తేడాల్లేకుండా అందరూ మాట్లాడేస్తున్నారు. కారణం గ్యాస్ చేరి కడపంతా ఉబ్బరంగా ఉంటూ, పొట్ట టైట్‌గా అనిపిస్తూ ఏమాత్రం స్థిమితం లేకుండా చేయడం. కడుపులో ‘గ్యాస్’ చేరుతుందనే ఈ గ్యాస్ట్రిక్ సమస్య గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం ఆహారంతోపాటు గాలినీ మింగేస్తుంటాం. దాంతో అది పెరిస్టాలిటిక్ చలనంతో జీర్ణవ్యవస్థలోకి వెళ్తుంది. చాలా సందర్భాల్లో తేన్పు రూపంలో బయటికొస్తుంది. మరీ కాస్త కిందికి వెళ్లి ఉంటే పెద్ద పేగుల ద్వారా మలద్వారం గుండా కింది నుంచి వెళ్లే గ్యాస్ రూపంలో బయటకు పోతుంటుంది. అయితే కొంతమందిలో ఆ గ్యాస్ కడుపులో చిక్కుకుపోయినట్టుగా మారి పోట్టఉబ్బరంగా, ఇబ్బందికరంగా మారుతుంది. మొదట్లోనే ఈ సమస్యను పట్టించుకోకపోతే అది దీర్ఘకాలంలో మలబద్ధకం, పొట్టనొప్పి, హైపర్ అసిడిటీలకు దారితీయవచ్చు.ఈ సమస్య ఎవరెవరిలో... ఆహారాన్ని బాగా వేగంగా తినేసేవారు వదులుగా ఉండే కట్టుడుపళ్లు ఉన్నవారు... (వీళ్లు గ్యాస్ ఎక్కువగా మింగుతుంటారు) ∙పోగతాగే అలవాటున్నవారు చ్యూయింగ్‌గమ్ నమిలేవారు ఏవైనా పదార్థాలను చప్పరిస్తూ ఉండేవారు ∙కార్బొనేటెడ్ డ్రింక్స్ / కూల్‌డ్రింక్స్ (గ్యాస్ కలిగి ఉండేవి) ఎక్కువగా తాగేవారిలో.ఛాతీలో/కడుపులో మంట ఎందుకంటే...?ఆహారం తిన్న తర్వాత సరిగా అరగకపోవడం; కొన్ని తిన్న తర్వాత అవి ఛాతీలోపల అంటుకున్నట్టుగా ఉండటం; ఛాతీలో / గుండెలో మంటగా అనిపించడం అనే సమస్య నిత్యం చాలామంది ఎదుర్కొనేదే. ఎందుకిలా జరుగుతుంటుందంటే... ఆహారం తీసుకున్న వెంటనే దాన్ని జీర్ణం చేసేందుకు కడుపులో కొన్ని ఆమ్లాలు (యాసిడ్స్) స్రవిస్తాయి. ఈ యాసిడ్స్ కొందరిలో కడుపునకు పై భాగంలో ఉండే బిరడా వంటి స్ఫింక్టర్ కండరం కాస్తంత వదులైనందువల్ల పైకి వచ్చేస్తుంటాయి. ఇలా గొంతులోకి పుల్లటి పదార్థాలు రావడం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. సదరు యాసిడ్ గ్యాస్ కారణంగా అన్నవాహిక నుంచి పైకి పయనించడాన్ని యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. ఈ యాసిడ్ వల్లనే ఛాతీలో / కడుపులో మంట వస్తుంటుంది. గ్యాస్‌కు కారణమయ్యే ఆహారాలు ఏమిటంటే... కొన్ని రకాల ఆహారాలు తీసుకునేవారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అవి... పోట్టు ఉండే ఆహారధాన్యాల్లో గోధుమలు, ∙కూరగాయల్లో బ్రాకొలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉల్లిగడ్డలు, బీన్స్ ∙పండ్లలో పియర్స్, ఆపిల్స్, పానీయాల్లో గ్యాస్ ఎక్కువగా ఉండే సోడాలు, కూల్‌డ్రింక్స్, ∙పాలు, పాల ఉత్సాదనల్లో పెరుగు, ఐస్‌క్రీమ్స్, చీజ్, ∙ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో బ్రెడ్స్ వంటివి తినే వారిలో కడుపు ఉబ్బరం, గ్యాస్ పోవడం ఎక్కువ. అయితే వీటిలో సోడా, కూల్‌డ్రింక్స్ మినహాయిస్తే మిగతావి ఆరోగ్యకరం. కాబట్టి సమస్య రానంత మేరకు వాటిని తగు మోతాదులో తీసుకోవాలి. గ్యాస్ సమస్య తగ్గాలంటే... ఆహారం తీసుకునే సమయంలో గాలి ఎక్కువగా నోట్లో పోకుండా చేయడం వల్ల చాలావరకు గ్యాస్ సమస్యను అధిగమించవచ్చు. దీనికోసం తీసుకోవాల్సి జాగ్రత్తలు.. తినే సమయంలో మెల్లగా, నింపాదిగా తినాలి ∙పెదవులు మూసి తినడం మేలు ∙పోగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయాలి కట్టుడు పళ్లు ఉన్నవారు డెంటిస్ట్ సహాయంతో అవి సరిగా అమరేలా చూసుకోవాలి ∙సోడాలు, కూల్‌డ్రింక్స్, బీర్ వంటి వాటికి దూరంగా ఉండాలి జ్యూస్ రూపంలో కాకుండా పండ్లను కొరికి, నమిలి తినాలి గ్యాస్ ఉండే ఆహారాలను పరిమితంగా తీసుకోవడం ∙కొవ్వులు ఉండే పదార్థాలను చాలా పరిమితంగా తీసుకోవడం ∙వేళకు తినడం (చాలా మంది వేళకు తినకుండా చాలా ఆలస్యంగా తింటుంటారు. వారిలో గ్యాస్‌తో కడుపు ఉబ్బరం రావడం చాలా ఎక్కువ) ∙ఏం తింటున్నామో గమనిస్తూ, వాటిలో దేనివల్ల గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువవుతోందో గుర్తించి, ఆ ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో చాలావరకు ఈ సమస్యను అధిగమించవచ్చు. మరో సూచన : పాలు, పాల ఉత్పాదనలు తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరంగా మారిపోయి, గ్యాస్ సమస్య పెరుగుతుంటే... మార్కెట్లో ఇటీవల ల్యాక్టోజ్ రహిత పాలు, పాల ఉత్పాదనలు దొరుకుతున్నాయి. వీటితో గ్యాస్, పోట్ట ఉబ్బరం సమస్యను దూరం చేసుకోవచ్చు. కడుపు ఉబ్బరం సమస్యకు సాధారణ పరిష్కారాలు... ∙తక్కువ తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. రోజుకు రెండు మూడు సార్లు ఎక్కువగా తినడం కంటే... తక్కువ మోతాదుల్లో 4 నుంచి 6 సార్లు తినడం మేలు ∙ఆహారం పీచు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఇందుకు... పోట్టుతో ఉండే ధాన్యాలతో చేసిన ఆహారం, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తినాలి ∙చేపలు తినేవారు తమ ఆహారంలో చేపలను వారంలో కనీసం రెండు–మూడు సార్లకంటే ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది ∙ఎక్కువ కొవ్వుతో ఉండేవి, బాగా వేయించిన ఆహారపదార్థాలను వీలైనంత పరిమితంగా తీసుకోవాలి తినకముందే పాక్షికంగా పులిసే పదార్థాలైన ఇడ్లీ, దోసెల వంటివాటిని (పూరీ, చపాతీల కంటే) మీ బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఎక్కువగా తీసుకోండి. అలాగే ఇలా పులిసేందుకు అవకాశం ఉన్న మజ్జిగ వంటి ఆహారాల్లో జీర్ణవ్యవస్థకు మేలు చేసే ‘్రపో–బయాటిక్’ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అయితే అది పూర్తిగా పులియకముందే తాజాగా ఉన్నప్పుడు తినడం మంచిదని గుర్తుంచుకోవాలి ∙మాంసాహారం తినాలనుకునేవారు వేటమాంసం, రెడ్‌మీట్ కంటే కొవ్వు తక్కువగా ఉంటే చికెన్‌ను ఎంచుకోవడం అన్నివిధాలా మంచిది. రోజూ కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగాలి. ఇక కాఫీలు, ఆల్కహాలిక్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. కాఫీలు పరిమితంగా తీసుకున్నప్పటికీ, పోగతాగే అలవాటుకు దూరంగా ఉండాలి. ఆల్కహాలిక్ డ్రింక్స్ పూర్తిగా మానేయాలి ∙రోజూ చురుగ్గా ఉండండి. వ్యాయామం చేయండి .బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ పేర్కొన్న ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నంత కాలం మన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ సమస్యను పెంచేవి ఇవే...ఎక్కువగా నమలకుండానే గబగబా ఆహారాన్ని మింగేయడం ∙సాధారణం కంటే ఎక్కువగా ఆహారం తీసుకోవడం తీసుకున్న ఆహారంలో కొవ్వులు ఎక్కువగా ఉండటం ∙కొందరిలో పుల్లటి ఆహారాలైన టొమాటో, పులుపు ఎక్కువగా ఉండే నిమ్మ జాతి పండ్లు, కూల్‌డ్రింక్స్‌లో కోలా డ్రింక్స్ ఎక్కువగా తాగడం, కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీతో పాటు కొన్నిసార్లు టీ ఎక్కువగా తాగడం వంటి అంశాలన్నీ ఛాతీలో మంటకు కారణమవుతాయి. ఈ పదార్థాలను చాలా పరిమితంగా తీసుకోవడం లేదా వీలైతే తీసుకోకుండా ఉండటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. -
క్లోరిన్ గ్యాస్ లీక్.. 60 మందికి అస్వస్థత
షాడోల్: మధ్యప్రదేశ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. షాడోల్-అనుప్పూర్ సరిహద్దులో ఉన్న సోడా ఫ్యాక్టరీలో క్లోరిన్ గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా ఆ ప్రాంతంలో విషవాయువు వ్యాపించింది. జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అనుపూర్ పరిపాలన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆస్పత్రికి తరలించారు.ఈ గ్యాస్ లీకేజీ కారణంగా పలువురు కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. 60 మందికి పైగా బాధితులను చికిత్స కోసం సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో పెద్దలు, వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారు. బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.శనివారం రాత్రి 8.30 గంటల తర్వాత సోడా ఫ్యాక్టరీ సమీపంలో నివాసం ఉంటున్న కొందరికి ఒక్కసారిగా ఊపిరాడక, కళ్లు తిరగడం మొదలైంది. అకస్మాత్తుగా ఇలా ఎందుకు జరుగుతోంతో ముందుగా ఎవరూ గ్రహించలేకపోయారు. కొద్దిసేపటి తరువాత ఫ్యాక్టరీలోని క్లోరిన్ గ్యాస్ పైపు లీకేజీ అయిందన్న వార్త వ్యాపించింది. నిముషాల వ్యవధిలోనే స్థానికులు ఈ విష వాయువు బారిన పడ్డారు. బాధితులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. వైద్య సిబ్బంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: పట్టాలు తప్పిన ముజఫర్‌పూర్- పూణె స్పెషల్ రైలు -
పెరిగిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు.. కారణం..
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో గతేడాది జులై నెలతో పోలిస్తే ఈసారి పెట్రోల్ అమ్మకాలు 10%, డీజిల్ అమ్మకాలు 4.3% పెరిగాయని చమురు మంత్రిత్వ శాఖ డేటా విడుదల చేసింది. జులైలో వంటగ్యాస్ అమ్మకాలు 11%, జెట్ ఇంధన వినియోగం 9% పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది.గత త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పెట్రోల్ డిమాండ్ 7.1%, డీజిల్ డిమాండ్ 1.6 శాతం పెరిగింది. మొదటి త్రైమాసికంలో జెట్ ఇంధన విక్రయాలు 11.4%, వంట గ్యాస్ విక్రయాలు 5% పెరిగాయి. వేసవి సెలవులు ముగియడం, పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడం ఇంధన వినియోగం పెరిగడానికి కారణమైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ర్యాన్సమ్వేర్ దాడి.. బ్యాంకింగ్ సేవల పునరుద్ధరణదేశీయంగా దిగుమతి చేసుకుంటున్న చమురును శుద్ధి చేసే పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో డీజిల్ 40% వాటా కలిగి ఉంది. సుదూర రవాణా, మైనింగ్, వ్యవసాయం..వంటి అవసరాలకు దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగం పెరగడం పుంజుకుంటున్న ఆర్థిక కార్యకలాపాలకు సూచిక. విమాన ట్రాఫిక్ అధికమవడంతో జులైలో జెట్ ఇంధన డిమాండ్ పెరిగింది. కస్టమర్ల సంఖ్య విస్తరించడం వల్ల వంట గ్యాస్ వినియోగం అధికమైంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలోని కంపెనీలు రాన్నున్న త్రైమాసిక ఫలితాల్లో మంచి ఫలితాలు పోస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. -
బోర్లతో బ్లో అవుట్లు
సాక్షి అమలాపురం : గ్యాస్ పైప్లైన్ల లీకేజీలు.. తద్వారా వెదజల్లే చమురు.. అప్పుడప్పుడూ బ్లో అవుట్లు.. పచ్చని కోనసీమలో ఇవి సర్వసాధారణం. కృష్ణా–గోదావరి బేసిన్ (కేజీ బేసిన్)లో గ్యాస్, చమురు వెలికితీత కార్యకలాపాలు మొదలైన తరువాత ఈ ప్రాంత వాసులకు ఇది నిత్యకృత్యంగా మారిపోయింది. వీటికి ఇప్పుడు ఆక్వాసాగు తోడైంది.చప్పనీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఉప్పునీటి కోసం వందల అడుగుల లోతున బోర్లు వేస్తుండడం.. వాటి నుంచి గ్యాస్, చమురు వచ్చి మినీ బ్లో అవుట్లుగా మారడం కోనసీమ వాసుల కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా.. రాజోలు మండలం చింతపల్లిలో బోరుబావి నుంచి భారీగా గ్యాస్ ఎగదన్నిన విషయం తెలిసిందే. అసలు కేజీ బేసిన్లో చమురు, గ్యాస్ వెలికితీతల సమయంలో పలు దుర్ఘటనలు చోటుచేసుకోవడం.. కొన్ని విషాదకరమైన చేదు జ్ఞాపకాలను కూడా మిగిల్చిన విషయం తెలిసిందే. జిల్లాలో అల్లవరం గ్రామాన్ని ఆనుకుని దేవర్లంక, అమలాపురం మండలం తాండవపల్లి వద్ద భారీ బ్లో అవుట్ చోటుచేసుకున్నాయి. నగరం గ్యాస్ పైప్‌లైన్ లీకవ్వడంవల్ల 19 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఇవికాకుండా.. ఏదోక ప్రాంతంలో తరచూ గ్యాస్ పైప్లైన్ల లీకులు, చమురు లీకేజీలు జరుగుతూనే ఉన్నాయి. మినీ బ్లో అవుట్లుగా మారిన ఆక్వా బోర్లు..ఆక్వా చెరువుల కోసం తవ్వుతున్న బోర్లు ఇప్పుడు మినీ బ్లో అవుట్లుగా మారిపోయాయి. అధిక ఉప్పు సాంద్రత (సెలైనిటీ) ఉన్న నీటికోసం వందల అడుగుల లోతున బోర్లు వేస్తున్నారు. వీటి ద్వారా గ్యాస్, చమురు ఎగదన్నుకు వస్తున్నాయి. ఇక్కడ భూమిలోని మట్టి పొరల్లో గ్యాస్ నిక్షిప్తమై ఉంది. రైతులు చప్పనీటి సాగు పేరుతో గ్రామీణ నీటి సరఫరా శాఖ నుంచి అనుమతి పొందుతున్నారు. 30–40 అడుగులు లోతున బోరు బావి తవ్వకాలు చేస్తే సరిపోతుంది. కానీ, ఆక్వా రైతులు అధిక ఉప్పు శాతం ఉన్న నీటి కోసం ఏకంగా 250 నుంచి 300 అడుగుల లోతున తవ్వేస్తున్నారు. దీంతో చాలాచోట్ల దిగువనున్న గ్యాస్, చమురు ఎగదన్నుకు వస్తోంది. బోరు అనుమతిచ్చే సమయంలోనే ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు బోరు తవ్వకాలపై పక్కాగా నిఘా పెట్టాల్సి ఉంది. ఇటీవల రాజోలు మండలం శివకోడు వద్ద ఓ ఆక్వా రైతు ఏకంగా 270 అడుగుల లోతున ఉప్పునీటి తవ్వకాలు చేయడంతో గ్యాస్ ఎగదన్ని ప్రమాదానికి కారణమైంది. అక్కడున్న గ్యాస్ లభ్యతను బట్టి ఒకట్రెండు రోజులు గ్యాస్ ఎగిసిపడుతుంది. ఒకప్పుడు సముద్ర తీర ప్రాంతాలు.. గ్రామ శివారుల్లో ఉండే ఆక్వా చెరువులు ఇప్పుడు జనావాసాల మధ్యకు వస్తున్నాయి. ఇటువంటి చోట గనుక బోరుబావుల నుంచి గ్యాస్ ఎగదన్ని మంటలు వ్యాపిస్తే ప్రమాదం తీవ్రత అధికంగా ఉంటుంది. ఆక్వాసాగుతో పైపులైన్లకు దెబ్బ..నిజానికి.. ఆక్వాసాగు పెరగడంవల్ల ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలకు చెందిన పైప్లైన్లు తుప్పుపడుతున్నాయి. ఈ సాగువల్ల భూమిలో ఉప్పుశాతం పెరిగి 25 ఏళ్లు బలంగా ఉండాల్సిన ఈ గ్యాస్ పైప్లైన్లు 15 ఏళ్లకే దెబ్బతింటున్నాయి. అలాగే, సిస్మిక్ సర్వేల పేరుతో జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) వేలాదిచోట్ల భూమి పొరల్లో బాంబింగ్ చేస్తోంది. వీటిని నిబంధనల మేరకు పూడ్చకుండా వదిలేస్తున్నారు. ఇటువంటి చోట నిల్వ ఉన్న గ్యాస్ అప్పుడప్పుడు ఎగదన్నుకు వచ్చి మంటలు చెలరేగుతున్నాయి. -
ఆక్వా చెరువు బోరు నుంచి గ్యాస్
రాజోలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఓ ఆక్వా చెరువు వద్ద బోరు బావి నుంచి నీటితో కలిసి 15 అడుగుల మేర గ్యాస్ పైకి ఎగజిమ్మింది. అయితే, మంటలు వ్యాపించకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... రాజోలు మండలంలోని చింతలపల్లి–అరవపాలెం రోడ్డులో కె.విజయేంద్రవర్మ అనే వ్యక్తికి చెందిన ఆక్వా చెరువు వద్ద ఉన్న బోరు బావి నుంచి శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆకస్మికంగా నీరు ఎగసిపడింది. విద్యుత్ మోటారు, ఆయిల్ ఇంజన్ వంటివి ఏమీ లేకుండానే బోరు బావి నుంచి నీరు 15 అడుగుల మేర ఎగసిపడుతుండటంతో సమీపంలోని కూలీలు వెళ్లి చూశారు. అయితే, గ్యాస్ వాసన రావడంతో భయాందోళనలకు గురైన కూలీలు వెంటనే రాజోలు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక అధికారి సీహెచ్ అనిల్‌కుమార్, సిబ్బంది గ్యాస్ లీక్ అవుతున్న బోరు బావి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బోరు బావి లోపల తీవ్రమైన ఒత్తిడి పెరిగి, నీటితో కలసి గ్యాస్ ఉధృతంగా పైకి వస్తోందని గుర్తించారు. నీటిలో సుమారు ఆరు శాతం గ్యాస్ ఉందని నిర్ధారించారు. బోరు బావిని ఇసుకతో పూడ్చివేసి గ్యాస్ పైకి రాకుండా చేశారు. కొత్తగా బోర్లు వేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉప్పు నీటి కోసం 200 మీటర్ల మేర భూమి లోపలకు బోర్లు వేయడం వల్ల గ్యాస్ పైకి వస్తుందని అనిల్‌కుమార్ చెప్పారు. కొన్నిసార్లు గ్యాస్ శాతం ఎక్కువగా ఉండడంతో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. -
కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ కలకలం
సాక్షి,అంబేద్కర్ కోనసీమ జిల్లా : కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లిలో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టిస్తోంది. ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు బావి నుంచి గ్యాస్ ఎగిసిపడుతోంది.బోర్ బావి నుంచి 15 మీటర్ల మేర పైకి ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్యాస్‌ను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. -
తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు!
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. హోటల్స్, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.69 మేర తగ్గిస్తూ కీలక ప్రకటన చేశాయి. నేటి నుంచే (జూన్ 1వ తేదీ) ఈ ధరలు అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి. -
ఆ మహిళ గ్యాస్ సేవింగ్ టెక్నిక్‌కి ఫిదా అవ్వాల్సిందే! ఒకేసారి..
ప్రస్తుతం గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. అందుకోసం అని మధ్యతరగతి మహిళలు ఎన్నో పాట్లు పడుతుంటారు. గ్యాస్ ఆదా చేసే ఒక్క చిన్న అవకాశాన్ని కూడా మిస్ చెయ్యరు. అయినా ఇంట్లో అందరికీ కావాల్సినవి అమర్చి పెట్టే క్రమంలో గ్యాస్ ఆదా చేయలేక సతమతమవుతుంటారు మహిళలు. పోనీ కట్టెల పొయ్యి వంటివి ఏమైనా ట్రై చేద్దామా అంటే..అంతా అపార్ట్మెంట్లో నివాసం ఉండే పరిస్థితి. అలాంటప్పుడూ ఇది అస్సలు కుదరదు. కానీ ఇక్కడొక మహిళ గ్యాస్‌ని ఆదా చేస్తూ ఒకేసారి రెండు వంటకాలు చేసి శభాష్ అనిపించుకుంది. ఆమె ఎలా చేసిందో చూస్తే మాత్రం తప్పక ఆశ్చర్యపోతారు. అబ్బా..! ఇలా కూడా గ్యాస్ ఆదా చేసుకోవచ్చా అనుకుంటారు. ఏం జరిగిందంటే..ఓ మహిళ గ్యాస్ ఆదా చేసేలా వండిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో ఆ మహిళ పూరీలు, అందులోకి బంగాళదుంప కూర చేయాలనుకుంది. అందుకని ముందుగా ఓ గిన్నేలో బంగాళ దుంపలను ఉడకబెట్టింది. ఆ ఆవిరిపైనే వేడితోనే పూరీలను కూడా చక్కగా ప్రీపేర్ చేసేంది. ఈ ఐడియాని చూసి నెటిజన్లు ఆమెది ఏం తెలివి అంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. అలా ఎలా అనుకుంటున్నారా..?. ఏం లేదండి ఓ స్టీల్ గిన్నేలో బంగాళ దుంపలు పెట్టింది. దానిపై ఓ మూకిడి పెట్టి నూనె పోసి చక్కగా పూరీలను వేయించింది. ఆ బంగాళ దుంపల ఆవిరిపైనే పూరీలను ప్రీపేర్ చేసేసింది అంతే. ఓహో ఇలా కూడా గ్యాస్ ఆదా చేయొచ్చా..!. ఇంతవరకు మాకు ఇలాంటి ఐడియా రాలేదబ్బా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి. View this post on Instagram A post shared by Rekha Sharma (@rekha_sharma.001) (చదవండి: అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా పైలట్!) -
భారీ పెట్టుబడులకు వేదాంతా సై
న్యూఢిల్లీ: మైనింగ్ రంగ ప్రయివేట్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ వివిధ బిజినెస్‌లలో 6 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. అల్యూమినియం, జింక్, ముడిఇనుము, స్టీల్, చమురు, గ్యాస్ తదితర విభిన్న విభాగాలపై పెట్టుబడులు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసింది. తద్వారా వార్షికంగా కనీసం 2.5 బిలియన్ డాలర్ల నిర్వహణ లాభాన్ని(ఇబిటా) జత చేసుకోవాలని చూస్తున్నట్లు ఇన్వెస్టర్ల సమావేశంలో కంపెనీ అత్యున్నత అధికారులు వెల్లడించారు. పైప్‌లైన్‌లో 50 యాక్టివ్ ప్రాజెక్టులుసహా విస్తరణ ప్రణాళికలున్నట్లు తెలియజేశారు. ఇవి కంపెనీ వృద్ధికి దోహదం చేస్తాయని, తద్వారా 6 బిలియన్ డాలర్ల ఆదాయానికి వీలున్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24)లో సాధించే వీలున్న 5 బిలియన్ డాలర్ల ఇబిటాను వచ్చే ఏడాది(2024–25) 6 బిలియన్ డాలర్లకు పెంచనున్నట్లు అంచనా వేశారు. ఈ బాటలో 2027కల్లా 7.5 బిలియన్ డాలర్ల ఇబిటాను సాధించవచ్చని ఆశిస్తున్నారు. రానున్న 25ఏళ్లలో విభిన్న స్థాయికి కంపెనీ చేరనున్నట్లు వేదాంతా చైర్మన్ అనిల్ అగర్వాల్ ఇన్వెస్టర్లకు తెలియజేశారు. విభిన్న ప్రాజెక్టులపై 6 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అనిల్ సోదరుడు, కంపెనీ వైస్‌చైర్మన్ నవీన్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇది 6 బిలియన్ డాలర్ల అదనపు టర్నోవర్‌కు దారిచూపనున్నట్లు, వార్షికప్రాతిపదికన ఇబిటా 2.5–3 బిలియన్ డాలర్లవరకూ అదనంగా బలపడనున్నట్లు వివరించారు. -
చైనాలో భారీ పేలుడు
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని యాంజియావోలో బుధవారం ఉదయం 7.55 గంటలకు(చైనా కాలమానం ప్రకారం)భారీ పేలుడు సంభవించింది. ఓ పాత నివాసభవనంలోని కింది అంతస్తులో ఉన్న రెస్టారెంట్లో గ్యాస్ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. 🚨🇨🇳 BREAKING: HUGE EXPLOSION IS REPORTED IN YANJIAO, CHINA The explosion happened in a building. There's no immediate report on casualties.pic.twitter.com/XylJsBuLUW — Mario Nawfal (@MarioNawfal) March 13, 2024 భవనాల శిధిలాలు ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు తర్వాత భారీ నీలి మంటలు ఎగిసిపడినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ పేలుడులో ఎంత మంది చనిపోయారో వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. రెస్క్యూటీమ్ సహాయక చర్యలు మొదలు పెట్టింది. #BREAKING- Large explosion damages multiple buildings in Yanjiao, China. No word on injuries at this time.#explosion #China #Yanjiaopic.twitter.com/lQ6UMCTv30 — Chaudhary Parvez (@ChaudharyParvez) March 13, 2024 ఇదీ చదవండి.. అట్లాంటా గ్యాస్ స్టేషన్లో దోపిడీ -
సిలిండర్ నుంచి మంటలు.. ఆపద్బాంధవుడు వచ్చి..
‘జ్ఞానం ఉంటే సరిపోదు.. అనుభవం ఉండాలి’ అని చాలామంది అంటుంటారు. ఇది నూటికి నూరుపాళ్లు నిజమనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన సైకిల్‌పై గ్యాస్ సిలిండర్‌ను తీసుకువెళుతుండటాన్ని చూడవచ్చు. మరి ఆ తరువాత ఏం జరిగిందంటే.. అకస్మాత్తుగా ఆ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో ఆ వ్యక్తి మంటలను ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాడు. అయినా ఆ మంటలు చల్లారవు. దారినపోయేవారు కూడా ఆ సిలిండర్ నుంచి వస్తున్న మంటలను ఆపేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. అయితే ఎట్టకేలకు ఒక వ్యక్తి తన తెలివితేటలను ఉపయోగించి, మంటలను అదుపులోకి తీసుకువస్తాడు. వీడియోలో ఉన్న కంటెంట్ గమనిస్తే.. ఒక వ్యక్తి సిలిండర్ నుంచి మంటలు రాగానే సైకిల్‌ను పక్కన పడేసి, ఆపై మంటలను నీటితో ఆర్పడానికి ప్రయత్నిస్తాడు. మరో నలుగురు కూడా అక్కడికి వచ్చి, సిలిండర్‌పై నీళ్లు చల్లడం మొదలుపెడతారు. అయితే మంటలు అంతకంతకూ పెరుగుతుంటాయి తప్ప చల్లారవు. దీంతో ఆ సిలిండర్‌ను పక్కనే ఉన్న చెరువులో ముంచుతారు. అయినా ఆ మంటలు చల్లారవు. దీంతో ఆకుల సాయంతో ఆ మంటలను ఆర్పేందుకు వారంతా ప్రయత్నిస్తారు. అయినా మంటలు ఆరిపోకపోవడంతో వారంతా కూలబడతారు. అప్పుడు అక్కడికి ఆపద్బాంధవునిలా వచ్చిన ఒక వ్యక్తి తన తెలివితేటలను ప్రదర్శిస్తాడు. చేతిలో తడి సంచితో వచ్చిన అతను దానిని సిలిండర్‌పైన కప్పుతాడు. దీంతో నిప్పుకు ఆక్సిజన్ మధ్య సంబంధం తెగిపోతుంది. అంతే ఆ సిలిండర్లోని మంటలు ఆరిపోతాయి. @ScienceGuys_ అనే పేరు గల ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో ఈ వీడియోను షేర్ చేశారు. Experience is stronger than knowledge. 👍pic.twitter.com/OtXvLhjvYQ — Science (@ScienceGuys_) March 1, 2024 -
Alabama: తొలిసారి నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష అమలు
అలబామా: మరణ శిక్షల్లో అమెరికా కొత్త రికార్డు సృష్టించింది. అమెరికా చరిత్రలోనే అలబామా రాష్ట్రంలో తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ వాడి ఊపిరాడకుండా చేసి ఒక వ్యక్తికి మరణ శిక్ష అమలు చేశారు. హత్య కేసులో దోషి అయిన కెన్నెత్ యూజెన్ స్మిత్(58) ఊపిరితిత్తుల్లోకి ఫేస్ మాస్క్ ద్వారా స్వచ్ఛమైన నైట్రోజన్‌ను పంపి శిక్ష అమలు చేశారు. గురువారం రాత్రి 8.25 గంటలకు అలబామా జైలులో స్మిత్ చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష అమలు చేసే విధానంపై అమెరికాలో వివాదం నడుస్తోంది. ఇది పూర్తి మానవీయతతో కూడిన శిక్ష అని ప్రభుత్వం చెబుతుండగా విమర్శకులు మాత్రం నైట్రోజన్ గ్యాస్‌తో మనిషిని చంపడం క్రూరమైన ప్రయోగం అని మండిపడుతున్నారు. అమెరికాలో సాధారణ మరణశిక్ష అమలు విధానం అయిన విషపు ఇంజెక్షన్‌తో స్మిత్‌కు ఇంతకుముందే శిక్ష అమలు చేయడానికి ప్రయత్నించారు. అయితే అతడి ఐవీ లైన్ కనెక్ట్ కాకపోవడంతో శిక్ష అమలును చివరి నిమిషంలో నిలిపివేశారు. నైట్రోజన్ గ్యాస్‌తో తనను చంపడంపై స్మిత్ వేసిన అప్పీల్‌పై యూఎస్ అప్పీల్ సుప్రీం కోర్టు జోక్యం చేసుకోకపోవడంతో శిక్ష అమలు ఖాయమైంది. ఇదీచదవండి.. విక్టోరియా బీచ్‌లో ప్రమాదం... నలుగురు భారతీయులు మృతి -
ఓఎన్జీసీ చేతికి 7 బ్లాకులు.. చమురు నిక్షేపాల తవ్వకాల్లో రిలయన్స్
న్యూఢిల్లీ: ఓపెన్ ఏకరేజ్ లైసెన్స్ పాలసీ(ఓఏఎల్‌పీ)లో భాగంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) 7 బ్లాకులను గెలుచుకుంది. ప్రయివేట్ రంగ కన్సార్షియం రిలయన్స్–బీపీ, ఇంధన రంగ పీఎస్‌యూ ఆయిల్ ఇండియా, సన్పెట్రోకెమికల్స్ ఒక్కో క్షేత్రం చొప్పున సాధించాయి. చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించి 8వ రౌండ్లో భాగంగా 10 బ్లాకులను ఆఫర్ చేసినట్లు చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. వెరసి ఓఏఎల్‌పీ–8లో తాజాగా 10 బ్లాకులకు సంతకాలు జరిగినట్లు వెల్లడించారు. ఇదేసమయంలో మూడు కోల్బెడ్ మిథేన్(సీబీఎం) బ్లాకులను సైతం కేటాయించినట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఓఏఎల్‌పీ–9వ రౌండ్ బిడ్డింగ్‌కు తెరతీసినట్లు తెలియజేశారు. తాజాగా ఆఫర్ చేసిన బ్లాకుల అన్వేషణ కార్యకలాపాలకు 23.3 కోట్ల డాలర్ల పెట్టుబడులు వెచ్చించవచ్చని భావిస్తున్నట్లు అధికారిక నోట్లో చమురు శాఖ పేర్కొంది. 2022 జులైలో ఓఎల్‌ఏపీ–8వ రౌండ్‌కు బిడ్డింగ్‌ను తెరిచిన సంగతి తెలిసిందే. చమురు శాఖ మొత్తం 10 బ్లాకులను ఆఫర్ చేసింది. పలు దఫాలు గడువు తేదీని సవరించాక 2023 జులైలో బిడ్డింగ్‌ను ముగించింది. హైడ్రోకార్బన్స్ డైరెక్టరేట్ జనరల్(డీజీహెచ్) వివరాల ప్రకారం ఓఎన్జీసీసహా వేదాంతా లిమిటెడ్, ఆయిల్ ఇండియా, సన్ పెట్రోకెమికల్స్, రిలయన్స్–బీపీ ఎక్స్‌ప్లొరేషన్(అల్ఫా) ఉమ్మడిగా 13 బిడ్స్ దాఖలు చేశాయి. బిడ్స్ తీరిలా కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేసిన 10 బ్లాకులలో ఏడింటికి ఒక్కొక్క బిడ్ దాఖలుకాగా.. మిగిలిన మూడు క్షేత్రాలకు రెండేసి బిడ్స్ లభించాయి. గ్లోబల్ ఇంధన దిగ్గజాలు ఎక్సాన్‌మొబిల్, షెవ్రాన్, టోటల్ఎనర్జీస్ బిడ్ చేయలేదు. మొత్తం 9 బ్లాకులకు బిడ్ చేసినఓఎన్జీసీ 6 బ్లాకులకు ఒంటరిగా రేసులో నిలిచింది. రిలయన్స్–బీపీ కేజీ బేసిన్‌లోని లోతైన సముద్రగర్భ బ్లాక్‌కు బిడ్ వేసింది. దశాబ్ద కాలంగా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న రిలయన్స్–బీపీ గత ఓఏఎల్‌పీ రౌండ్లలోనూ ఒక బ్లాకును గెలుచుకున్నాయి. చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకునే లక్ష్యంతో ప్రభుత్వం 2016లో ఓఏఎల్పీకి తెరతీసింది. తద్వారా చమురు సంస్థలు ఇంధన అన్వేషణకు గుర్తించిన ప్రాంత పరిధిని దాటి ఏ ఇతర ప్రాంతాన్నయినా ఎంపిక చేసుకునేందుకు వీలు కల్పించింది. ప్రత్యేక సీబీఎం బిడ్ రౌండ్–2022లో భాగంగా 3 బ్లాకుల కేటాయింపునకు సంతకాలు పూర్తయినట్లు మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. -
గోబర్.. గాభరా !
ఇప్పుడంటే ప్రతి ఇంట్లోనూ గ్యాస్ స్టవ్లొచ్చాయిగానీ కొన్నాళ్లు ‘గోబర్ గ్యాస్’ (పశువుల పేడతో తయారైంది) కూడా ఓ వెలుగు వెలిగింది! గ్రామాల్లో పశు సంపద అధికంగా ఉండే ఇళ్లలో వీటిని బాగానే ఆదరించారు. చిన్నపాటి బావి లాంటి గుండ్రటి ఇనుప డ్రమ్ముల్లో నిల్వ చేసిన పేడ కరగడం ద్వారా నెమ్మదిగా మీథేన్ విడుదలవుతుంది. దీన్ని పైపు ద్వారా తరలించి వంటకు వినియోగించడం తెలిసిందే. అంత చాకిరీ చేసే ఓపిక లేకపోవడంతో కాల క్రమంలో గోబర్ గ్యాస్ కనుమరుగైంది. అలా వంటకు ఉపయోగపడ్డ మీథేన్ ఇప్పుడు వాతావరణంలో మంటకు కూడా కారణమవుతోంది!! – పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్ డెస్క్ వాహనాల పొగ, ఏసీలు, ఫ్రిడ్జ్‌ల నుంచి విడుదలయ్యే క్లోరో ఫ్లోరో కార్బన్లకు మించి పశువుల నుంచి వెలువడే గ్యాస్ భూతాపానికి దారి తీస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పశువులు ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో, వాటి వ్యర్థాల నుంచి వెలువడే మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వాయువులు భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. వాతావరణంలో ప్రతికూల మార్పులకు కారణమవుతున్నాయి. ఎంత ఆలస్యంగా జీర్ణం అయితే అంత ఎక్కువగా గ్యాస్ విడుదల అవుతుంది. కాబట్టి వాటికి తేలిగ్గా జీర్ణమయ్యే, సహజ సిద్ధమైన ఆహారాన్ని అందించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నైట్రస్ఆక్సైడ్.. నిప్పుల కొలిమి కార్బన్డయాక్సైడ్ కంటే మీథేన్ గ్యాస్ 28 రెట్లు అధికంగా భూ తాపానికి కారణమవుతోంది. నిల్వ చేసిన పశువుల పేడ నుంచి అధిక మోతాదులో వెలువడే నైట్రస్ ఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు కంటే దాదాపు 265 రెట్లు అధికంగా వాతావరణం వేడెక్కటానికి దారి తీస్తోంది. పశువులు తీసుకునే ఆహారంలో చోటు చేసుకుంటున్న మార్పులు దీనికి కొంతవరకూ కారణం. ప్రస్తుతానికి ఈ సమస్యను పూర్తి స్థాయిలో అరికట్టలేకున్నా మెరుగైన యాజమాన్య పద్ధతులు, పాల దిగుబడిని పెంచుకోవడం, దాణాలో కొన్ని రకాల మందులను చేర్చడం ద్వారా కొంతవరకు నియంత్రించవచ్చు. 2070 నాటికి జీరో కర్బన ఉద్గారాల లక్ష్యంగా మన దేశం వేగంగా అడుగులు వేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం క్రమంగా ఊపందుకుంటోంది. సౌర విద్యుత్తు, గ్రీన్ హైడ్రోజన్, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ తరుణంలో గ్రీన్హౌస్ వాయువులను నియంత్రించడంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత నెలకొంది. సమతుల్య ఆహారంతో.. అమెరికాలోని హోల్స్టీన్ ఆవులతో పోలిస్తే మన దేశంలో సంకర జాతికి చెందిన పశువులు 4.8 శాతం అధికంగా గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తున్నాయి. ఇక దేశవాళీ ఆవులు 11.8 శాతం అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. భూతాపాన్ని అరికట్టేందుకు 2030 నాటికి మీథేన్ఉద్గారాలను 11–30 శాతం వరకు నియంత్రించాలని, 2050 నాటికి 24–47 శాతం వరకు కట్టడి చేయాలని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సూచించింది. 3 ఎన్వోపీ (నైట్రాక్సీ ప్రొఫెనాల్)ను పశువులకు అందించే దాణాలో కలపడం ద్వారా మీథేన్ ఉద్గారాలు 30 శాతం వరకు తగ్గుతున్నట్లు కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్(సీజీఐఏఆర్) తాజా నివేదిక వెల్లడించింది. పశువుల ఆరోగ్యానికి ఇది సురక్షితమేనని సూచించింది. సంతులిత (సమతుల్య) ఆహారాన్ని ఇవ్వడం ద్వారా కూడా 15 శాతం దాకా ఉద్గారాలు తగ్గే అవకాశం ఉందని మరో సర్వే తెలిపింది. 98 శాతం మీథేన్ వీటి నుంచే 1. వ్యవసాయం 2. ఆయిల్ అండ్ గ్యాస్ 3. బొగ్గు తవ్వకాలు 4. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఘన వ్యర్థాల నిర్వహణ) 5. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ (వ్యర్థ జలాల నిర్వహణ) స్వల్పంగా పెరిగినా మంటలే! ♦ మీథేన్ ఎంత ఎక్కువగా విడుదలైతే పుడమి అంత అధికంగా వేడెక్కుతుంది. ♦ ఉష్ణాన్ని బంధించి ఉంచే శక్తి కారణంగా మీథేన్ శాతం స్వల్పంగా పెరిగినావాతావరణంలో భారీ మార్పులకుదారి తీస్తుంది. ♦ పశువులు తీసుకునే ఆహారం మీథేన్ విడుదలను ప్రభావితం చేస్తుంది.ఎక్కువ మొత్తంలో తీసుకోవడం, నాసిరకం మేతను ఇవ్వడం మీథేన్ విడుదలను పెంచుతుంది. ♦ పశువుల ఆరోగ్యానికి చేటు చేయకుండా మీథేన్ విడుదలను నియంత్రించే టీకాపై న్యూజిలాండ్ పరిశోధన చేస్తోంది. ♦ బ్రోమోఫార్మ్ లాంటివి పశువుల శరీరంలోని బ్యాక్టీరియా మీథేన్ ఉత్పత్తి చేయటాన్ని 65 శాతం వరకు తగ్గించినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నా దీని వాడకానికి సంబంధించి పలు సందేహాలున్నాయి. పశువుల శరీరంలోకి చేరిన శైవలాలు (ఆల్గే) వాటి పాలు, మాంసం ద్వారా మనుషుల దేహంలోకి ప్రవేశించి థైరాయిడ్ గ్రంథి పనితీరును అస్తవ్యస్థం చేసే ప్రమాదం ఉందనే వాదనలున్నాయి. అందువల్లే అన్ని రకాల ఔషధాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేయడం లేదు. సంక్లిష్ట జీర్ణ ప్రక్రియ.. పశువులు ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో మీథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. వాటిలో జీర్ణ ప్రక్రియ కొంత సంక్లిష్టంగా పొట్ట నాలుగు అరలుగా (రూమినెంట్స్) ఉంటుంది. పీచు పదార్థాలు త్వరగా జీర్ణం కావు. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని మళ్లీ నోటిలోకి తీసుకొచ్చి నెమరు వేస్తాయి. తిన్న ఆహా రం కిణ్వ ప్రక్రియకు (పులవడం) గురైనప్పుడు మీథేన్ విడుదలవుతుంది. ఇది నోటి ద్వారా త్రేన్పులు రూపంలో, అపాన వాయువు రూపంలో వెలువడుతుంది. ఎంత తక్కువ సమయంలో ఆహారం జీర్ణం అయితే మీథేన్ ఉత్పత్తి అంత తగ్గిపోతుంది. బోవర్, రెడ్సీ వీడ్, అగోలిన్, ఒరిగానో లాంటి వాటిని పశువుల మేత, దాణాలో కలిపి ఇవ్వడం ద్వారా త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఎఫ్‌డీఏ ఆమోదించిన నైట్రాక్సీ ప్రొఫనాల్ను దాణాలో కలపడం వల్ల మీథేన్ శాతం బాగా తగ్గుతుంది. జొన్నలు, సజ్జలు తగినంత మోతాదులో అందిస్తే పీచు పదార్థాలు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఖనిజ లవణాల మిశ్రమాన్ని తగిన మోతాదులో ఇవ్వాలి. ఇక పశువుల ఎరువును సరైన విధంగా నిల్వ చేయనప్పుడు నైట్రస్ ఆక్సైడ్ పెద్ద మొత్తంలో విడుదలవుతుంది. యాసిడ్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాలు పేడను ఆర్గానిక్ ఆమ్లాలుగా మారుస్తాయి. మీథేన్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాలు దీన్ని మీథేన్, కార్బన్‌డయాక్సైడ్‌గా మారుస్తాయి. గ్రీన్హౌస్ వాయువుల్లో మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వాతావరణం వేడెక్కడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. పశువులకు సహజ సిద్ధమైన మేత, దాణా అందిస్తూ పాల దిగుబడి పెరిగేలా నాణ్యమైన జాతులను సాకాలి. -
Parliament: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా?
ఢిల్లీ: లోక్‌సభ లోపలికి ఆగంతకులు ప్రవేశించి బుధవారం గందరగోళం సృష్టించారు. సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకి టియర్ గ్యాస్ వదిలారు. దీంతో ఎంపీలంతా భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిందితులను పట్టుకుని సిబ్బందికి అప్పగించారు. పార్లమెంట్‌పై దాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన వేళ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. నిందితులు బూట్లలో గ్యాస్ క్యానిస్టర్లను దాచుకుని వెంట తెచ్చుకున్నారు. అసలు ఏంటి ఈ గ్యాస్ క్యానిస్టర్లు? ఎక్కడ ఉపయోగిస్తారు? Sansad breaking. Two people with tear gas canisters jumped into Lok Sabha well and opened it. House adjourned. #LokSabha pic.twitter.com/UrFZ7xE8pB — sansadflix (@sansadflix) December 13, 2023 గ్యాస్ క్యానిస్టర్ల అంటే..? గ్యాస్ క్యానిస్టర్లను స్మోక్ బాంబులు, పొగ డబ్బాలు అని కూడా పిలుస్తుంటారు. వీటిని బహిరంగంగా ఉపయోగించేందుకు చట్టబద్ధత ఉంది. సినిమాలు, ఫొటోషూట్లలో పొగ తెరలను సృష్టించడానికి, మిలిటరీ విభాగాల్లోనూ వీటిని ఉపయోగిస్తుంటారు. శత్రువుల కళ్లను పొగతో ఏమార్చడానికి వాడుతారు. క్రీడలలో ముఖ్యంగా ఫుట్‌బాల్‌లో అభిమానులు తమ క్లబ్‌ల రంగులను ప్రదర్శించడానికి పొగ డబ్బాలను ఉపయోగిస్తారు. గ్రనైడ్లతో కూడిన క్యానిస్టర్లను సైనిక ఆపరేషన్లలో వాడతారు. దట్టమైన పొగ తెరలను సృష్టించడం ద్వారా దళాల కదలికలు అస్పష్టంగా మారుతాయి. తద్వారా శత్రువుల కంటపడకుండా కీలక ఆపరేషన్లను కొనసాగించడంలో దోహదం చేస్తాయి. గగనతల దాడులు, భద్రతా దళాలు దిగడం, తరలింపు కేంద్రాలను లక్ష్యంగా చేసుకునేందుకు వీటిని ఉపయోగిస్తుంటారు. నిందితుల వివరాలు.. లోక్‌సభలో టియర్ గ్యాస్ ప్రయోగానికి సంబంధించి నిందితులను సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి కౌర్, లలిత్ ఝా, విక్కీ శర్మలుగా గుర్తించారు. కాగా, దర్యాప్తులో భాగంగా సాగర్ శర్మ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో కాగా.. మనో రంజన్ కర్ణాటకలోని మైసూర్. అమోల్ షిండే స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ కాగా.. నీలం దేవి కౌర్ స్వస్థలం హర్యాణాలోని హిస్సార్. ఈ కుట్ర వెనుక మరో కీలక సూత్రదారి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు చేపట్టారు. "Main conspirator someone else" in Parliament security breach: Police sources Read @ANI Story | https://t.co/A1Tn7NerpO#ParliamentSecurityBreach #India #Delhi pic.twitter.com/qSRwgdGVPB — ANI Digital (@ani_digital) December 14, 2023 ఇదీ చదవండి: Parliament Issue: నా కొడుకు చేసింది తప్పే.. ఉరి తీయండి -
భోపాల్ విషాదానికి 39 ఏళ్లు.. ఆ రోజు ఏం జరిగింది?
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 39 ఏళ్లు. 1984, డిసెంబర్ 2,3 తేదీల మధ్య రాత్రి జరిగిన ఈ గ్యాస్ లీక్ ఘటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నేటికీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ప్రజలు నాటి ఘటన మిగిల్చిన విషాదాన్ని దిగమింగుతూనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రపంచంలోనే భారీ పారిశ్రామిక దుర్ఘటనగా పేరొందిన భోపాల్ ఉదంతపు గాయాలు 39 ఏళ్లు గడిచినా మానలేదు. ఈ గ్యాస్ దుర్ఘటనలో వేలాది మంది మృతిచెందారు. వారి పిల్లలు, మనుమలు ఇప్పటికీ ఈ విష వాయువు ప్రభావాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రభుత్వాలు అందించిన సాయం ఎందుకూ సరిపోలేదు. నాడు గ్యాస్ దుర్ఘటన జరిగిన ప్రదేశంలో విషపూరిత వ్యర్థాలు నేటికీ కనిపిస్తాయి. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ విషపూరిత వ్యర్థాలను కాల్చడం సాధ్యం కావడం లేదు. ఈ దుర్ఘటనకు బలై, న్యాయ పోరాటానికి దిగిన చాలామంది ఈ లోకం నుండి నిష్క్రమించారు. ఈ ఉదంతంలో బాధ్యులను శిక్షించాలనే అంశం ఇంకా కోర్టుల్లో పెండింగ్‌లోనే ఉంది. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో 15 వేల మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం దరిమిలా నగరం మృతదేహాలతో నిండిపోయింది. 1979లో మిథైల్ ఐసోసైనైడ్ ఉత్పత్తి కోసం ఇక్కడ ఒక కర్మాగారం ఏర్పాటయ్యింది. అయితే ఈ పరిశ్రమ యాజమాన్యం తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదు. డిసెంబర్ 2, 3వ తేదీ రాత్రి ఫ్యాక్టరీలోని ఏ 610 నంబర్ ట్యాంక్‌లో నీరు లీకైంది. మిథైల్ ఐసోసైనేట్లో నీరు కలవడంతో ట్యాంకులోపల ఉష్ణోగ్రత పెరిగింది. ఆ తర్వాత విషవాయువు వాతావరణంలోకి వ్యాపించించింది. 45 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 30 మెట్రిక్ టన్నుల గ్యాస్ లీకైనట్లు సమాచారం. ఈ వాయువు నగరమంతటా వ్యాపించింది. ఈ విషవాయువుల బారినపడి 15 వేల మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు కూడా విష వాయువు ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. వైకల్యం రూపంలో వారిని, వారి తరాలను వెంటాడుతోంది. ఈ విష వాయువు ప్రభావంతో మరణించిన వారి అధికారిక సంఖ్య ఇంకా అందుబాటులో లేదు. అధికారిక మరణాల సంఖ్య మొదట్లో 2259గా నివేదించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 3,787 మంది గ్యాస్ బారిన పడినట్లు నిర్ధారించింది. ఇతర అంచనాల ప్రకారం ఎనిమిది వేల మంది మరణించారు. మరో ఎనిమిది వేల మంది గ్యాస్ సంబంధిత వ్యాధులతో కన్నుమూశారని వివిధ నివేదికలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: రెబల్స్, స్వతంత్రుల టచ్‌లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు? -
ఎన్నికలు ముగియగానే పెరిగిన వంటగ్యాస్ ధర!
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే వంట గ్యాస్ ధరలు పెరిగాయి. నేటి నుంచి అంటే డిసెంబర్ ఒకటి నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.21 పెంచాయి. నేటి నుండి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1796.50గా ఉంది. నవంబర్ 16న దీని ధర తగ్గించడంతో రూ.1775.50గా ఉండేది. నేటి నుంచి ముంబైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1749, కోల్‌కతాలో రూ.1885.50, చెన్నైలో రూ.1968.50గా ఉంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల రెస్టారెంట్ల ఆహార విక్రయాలపై ప్రభావం చూపనుంది. అయితే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో ఆయా కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. ఇంతకుముందు ప్రభుత్వం ఈ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ సిలిండర్ ఢిల్లీలో రూ.903కి అందుబాటులో ఉంది. కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50 ధరలకు లభిస్తోంది. ఇది కూడా చదవండి: అక్కడ మహిళల ఓట్లే అధికం.. లెక్కింపు బాధ్యతలూ వారికే! -
గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. కేంద్రం తీపికబురు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధి దారులకు సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచింది. ఎల్పీజీ సిలిండర్‌పై సబ్సిడీని పెంచేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. The government has raised subsidy amount for Pradhan Mantri Ujjwala Yojana beneficiaries from Rs 200 to Rs 300 per LPG cylinder: Union minister Anurag Thakur during a briefing on Cabinet decisions pic.twitter.com/Dvf7wXtXQT — ANI (@ANI) October 4, 2023 గతంలో రూ.200 ఇప్పుడు.. గతంలో కేంద్రం పీఎంయూవై పథంలోని లబ్ధి దారులు గ్యాస్ సిలిండర్‌పై రూ.200 రాయితీ అందించేది. ఇప్పుడు మరో రూ.100 పెంచింది. దీంతో ఇంతకు ముందు ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.703 ఉండగా, తాజాగా, కేంద్రం నిర్ణయంతో పీఎంయూవై పథకం కింద సిలిండర్ ధర రూ.603కే లభ్యమవుతుంది. రూ.1650 కోట్లు విడుదల గత నెలలో కేంద్రం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లను అందించేలా చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.1,650 కోట్లను విడుదల చేసింది. ఉజ్వల కనెక్షన్ పెంపుతో పీఎంయూవై పథకం కింద మొత్తం లబ్ధిదారుల సంఖ్య ఇప్పుడు 10.35 కోట్లకు పెరిగింది. -
మనుషులు ఇలా కూడా ఉంటారా? గ్యాస్ లైటర్ సాయంతో రింగురింగుల జుట్టు..
పార్లర్‌కు వెళ్లడం ఖర్చుతో కూడిన పని. అందుకే అమ్మాయిలు/మహిళలు కొన్నిసార్లు ఇంట్లోనే హెయిర్ స్టైలింగ్, ఫేషియల్, ఫేస్ మసాజ్ లాంటి అందాలను ఇనుమడింపజేసే ప్రక్రియలను చేసుకుంటుంటారు. అయితే తాజాగా ఒక భర్త తన భార్యకు రింగురింగుల జుట్టును తీర్చిదిద్దేందుకు ఒక విచిత్రమైన విధానాన్ని అనుసరించాడు. దీనిని చూసిన చాలామంది తెగ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో @Madan_Chikna హ్యాండిల్లో పోస్ట్ చేశారు. వీడియోకు ఇప్పటివరకూ 6 వేలకు పైగా వ్యూస్, లెక్కకుమించిన లైక్స్ వచ్చాయి. పలువురు యూజర్స్ ఈ వీడియోపై రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ప్రమాదకరమని కొందరు అంటున్నారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి గ్యాస్ స్టవ్‌పై ‘గ్యాస్ లైటర్’లోని మెటల్ భాగాన్ని వేడి చేయడం చూడవచ్చు. తరువాత ఆ వేడిచేసిన లైటర్ సాయంతో భార్య కురులను రోల్ చేయడాన్ని గమనించవచ్చు. కొన్ని సెకెన్ల అనంతరం అతను ఆమె జుట్టును లైటర్ నుంచి వేరు చేసినప్పుడు, ఆ జుట్టు రింగురింగులుగా మారాడాన్ని గమనించవచ్చు. దీనిని చూసిన నెటిజన్లు ఈ విధానం చాలా ప్రమాదకరమని, డబ్బు ఆదా చేయడమనే పేరుతో జుట్టుతో ఆడుకోవడం సరైదని కాదని సూచిస్తున్నారు. సరదాకి కూడా ఇలాంటివి చేయవద్దని సలహా ఇస్తున్నారు. ఇది కూడా చదవండి: భయపడొద్దు.. కుక్కలను కంట్రోల్ చేస్తున్నాం: బ్రిటన్ ప్రధాని Showed this reel to my wife and she said yeh toh kuch bhi nahi hai and gave five similar examples how more precisely we used to do this 😲 pic.twitter.com/2h0PaZW4UA — Godman Chikna (@Madan_Chikna) September 15, 2023 -
విష వాయువు పీల్చి.. అయిదుగురు కార్మికులు మృతి
మొరెనా: ఫ్యాక్టరీలోని ట్యాంక్ నుంచి వెలువడిన విష వాయువు పీల్చిన ముగ్గురు సోదరులు సహా మొత్తం అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. ధనేలలో ఉన్న సాక్షి ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలోని ట్యాంకు నుంచి ఉదయం 11 గంటల సమయంలో విష వాయువు లీకేజీ మొదలయింది. ట్యాంకు లీకేజీని పరిశీలిస్తుండగా మొదట ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత మరో ముగ్గురు అస్వస్థత పాలయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ అయిదుగురూ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. మృతులంతా అక్కడికి సమీపంలోని టిక్టోలి గ్రామస్తులని చెప్పారు. ఘటన అనంతరం ఫ్యాక్టరీ నుంచి కార్మికులందరినీ ఇళ్లకు పంపించివేశారు. -
రాఖీ పౌర్ణమికి కేంద్రం అతిపెద్ద కానుక!
రాఖీ పౌర్ణమికి కేంద్రం అతిపెద్ద కానుక! గ్యాస్‌పై రూ.200 తగ్గించిన కేంద్రం -
మూడేళ్లలో రూ. 30 వేల కోట్లు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్ దిగ్గజం గెయిల్ (ఇండియా) భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించనుంది. వచ్చే మూడేళ్లలో రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. గెయిల్ (ఇండియా) వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చైర్మన్ సందీప్ కుమార్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 10,000 కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు చేసినట్లు వివరించారు. (ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు) రాబోయే మూడేళ్లలో పైప్లైన్ల ఏర్పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న పెట్రోకెమికల్ ప్రాజెక్టులు, నిర్వహణపరమైన పెట్టుబడులు, గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు మొదలైన వాటి కోసం రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు గుప్తా చెప్పారు. ఇటీవలే కొనుగోలు చేసిన ప్రైవేట్ రంగ జేబీఎఫ్ పెట్రోకెమికల్స్‌తో తమ పోర్ట్‌ఫోలియోలో మరో కొత్త రసాయన ఉత్పత్తి (ప్యూరిఫైడ్ టెరిఫ్తాలిక్ యాసిడ్ – పీటీఏ) చేరినట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రలోని ఉసార్‌లో తాము తొలిసారిగా 50,000 టన్నుల ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (ఐపీఏ) ఉత్పత్తి సామర్థ్యంతో స్పెషాలిటీ కెమికల్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. ఇలాంటి వాటి తోడ్పాటుతో తమ పెట్రోకెమికల్స్ / కెమికల్స్ పోర్ట్‌ఫోలియో సామర్థ్యం వార్షికంగా 3 మిలియన్ టన్నులకు చేరగలదని వివరించారు. అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు) దిగ్గజాల నుంచి దీర్ఘకాలికంగా కొనుగోళ్లు జరిపే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటు సహజ వాయువులో హైడ్రోజన్‌ను ఏయే స్థాయిలో కలిపితే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అధ్యయనం చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. -
వంటగ్యాస్ సిలిండర్ లీక్...ఆరుగురి పరిస్థితి విషమం
హైదరాబాద్: వంట గ్యాస్ సిలిండర్ లీకేజీతో మంటలు చెలరేగి ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంగళవారం దోమలగూడలోని రోజ్ కాలనీలో విషాదాన్ని నింపింది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన పద్మ వచ్చే ఆదివారం బోనాల పండగ కోసం పద్మారావు నగర్లో నివసించే కూతురు ధనలక్ష్మి, అల్లుడు శ్యామ్, మనవరాలు శరణ్య, మనవళ్లు అభినవ్, విహాన్లను ఇంటికి తీసుకువచ్చింది. ఎల్బీనగర్కు చెందిన సొంత చెల్లెలు నాగమణి, మరిది ఆనంద్‌ను కూడా పండగకు ఆహ్వానించింది. వీరిలో అల్లుడు శ్యామ్ మినహా మిగతా వారంతా ఒకే ఒక చిన్న గదిలో ఉన్నారు. మంగళవారం పిండి వంటలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో స్టవ్‌ను వెలిగించడంతో గ్యాస్ లీకై ంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి గది అంతటా వ్యాపించాయి. పొగ వ్యాపించింది. గదిలోని ఏడుగురు మంటల్లో చిక్కుకుపోయి హాహాకారాలు చేశారు. సాహసం చేసిన స్థానికులు.. గదిలోంచి అరుపులు రావడంతో సమీపంలో నివసించే గోవిందరావు అనే వ్యక్తి మరో ఇద్దరు యువకులతో కలిసి లీకవుతున్న గ్యాస్ సిలిండర్‌ను చాకచక్యంతో బయటకు తీసుకువచ్చారు. లేనిపక్షంలో ఏడుగురూ మంటల్లో మసైపోయేవారని స్థానికులు చెప్పారు. అప్పటికే గదిలోని దుస్తులు, పరుపులు చాలా వరకు కాలిపోయాయి. అపస్మారక స్థితిలో ఉన్న ఏడుగురిని స్థానికులు గదిలోంచి బయటకు తీసుకువచ్చి ప్రథమ చికిత్స అందించారు. దోమలగూడ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని బాధితులను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్, కాంగ్రెస్ ఇన్చార్జి అనిల్‌కుమార్ యాదవ్, నగేష్ ముదిరాజ్, కార్పొరేటర్ రచనశ్రీ, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, దోమలగూడ ఇన్స్పెక్టర్ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిలు సందర్శించారు. గాయాలతో గాంధీ ఆస్పత్రిలో.. వంట గ్యాస్ లీకేజీ ప్రమాదంలో గాయపడిన ఏడుగురిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్రమైన వేడి గాలులను పీల్చడంతో శ్వాసకోశ నాళాలు, గుండె, ఇతర అంతర్గత అవయవాలు దెబ్బ తిన్నాయని చెప్పారు. పద్మ 40 శాతం, ధనలక్ష్మి 60, అభినవ్ 50, శరణ్య 30, విహాన్ 40, ఆనంద్ 36, నాగమణి 60 శాతం కాలిన గాయాలతో పీఐసీయూ, టీఎంటీ, బర్న్స్ వార్డుల్లో వైద్యం అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. గాయపడిన చిన్నారులకు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించామన్నారు. టీఎంటీలో నలుగురు క్షతగాత్రులకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వివరించారు. -
రిలయన్స్ ఎంజే క్షేత్రం నుంచి గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం
న్యూఢిల్లీ: కేజీ–డీ6 బ్లాక్‌లోని ఎంజే చమురు, గ్యాస్ క్షేత్రం నుంచి ఉత్పత్తి ప్రారంభించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థ బీపీ వెల్లడించాయి. ఈ బ్లాక్‌లోని మరో రెండు క్షేత్రాలైన ఆర్–క్లస్టర్ నుంచి 2020 డిసెంబర్లో, శాటిలైట్ క్లస్టర్ నుంచి 2021 ఏప్రిల్ నుంచి గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. ఎంజే క్షేత్రం గరిష్ట స్థాయికి చేరినప్పుడు కేజీ–డీ6 బ్లాక్‌లోని మొత్తం మూడు క్షేత్రాల నుంచి రోజుకు 30 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తి కాగలదని రిలయన్స్–బీపీ తెలిపాయి. ఇది దేశీయంగా ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌లో సుమారు మూడో వంతు ఉంటుందని, డిమాండ్‌లో 15 శాతానికి సరిపోవచ్చని పేర్కొన్నాయి. ఎంజే క్షేత్రంలో కనీసం 0.988 టీసీఎఫ్ గ్యాస్ ఉంటుంది. -
అంగన్వాడీ కేంద్రాలకు బిల్లులు ఎప్పుడిస్తారో..?
కొత్తగూడెంటౌన్: అంగన్వాడీ కేంద్రాలకు బిల్లులు చెల్లించకపోవడంతో టీచర్లపై ఆర్థికభారం పడుతోంది. బిల్లుల మంజూరు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సివస్తోంది. ప్రతి నెలా వచ్చిన వేతనంలో సగానికి పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని అంగన్వాడీ టీచర్లు వాపోతున్నారు. కేంద్రాల నిర్వహణకు అద్దె చెల్లింపులు, గ్యాస్, ఈవెంట్, కూరగాయలు, పోషణ్ అభియాన్, స్టేషనరీ తదితర ఖర్చులు నెలకు సుమారు రూ. 6 వేలకు పైగా వస్తున్నాయని పేర్కొంటున్నారు. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 1,434, మినీ కేంద్రాలు 626.. మొత్తం 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి గ్యాస్ బిల్లు రూ.1200, ప్రతి నెలా 15 రోజులకు ఒక ఈవెంట్ చొప్పున రెండు ఈవెంట్లకు రూ.500, నెలకు సరిపడా కూరగాయలు రూ.600, మీటింగ్‌కు రూ.300, స్టేషనరీ ఖర్చులు ఏడాదికి రూ.1000తో పాటు పోషణ్ అభియాన్‌కు రూ.100ల చొప్పున నెలకు మొత్తం రూ.6,200 ఖర్చవుతోందని అంగన్వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. అద్దె భవనాల్లో 785 కేంద్రాలు కొనసాగుతుండగా అద్దె బకాయి విడుదల చేయడం లేదు. ప్రతి అంగన్వాడీ కేంద్రం నిర్వహణకు అద్దె నెలకు ప్రాంతాన్ని బట్టి రూ. 600, రూ.1500, రూ.2 వేలు. రూ.3 వేల వరకు చెల్లించాల్సి ఉంది. కేంద్రాల నిర్వహణపై ప్రభావం అంగన్వాడీ కేంద్రాల్లో గ్యాస్‌కు సంబంధించి రూ.1,200 చొప్పున మూడు నెలల బిల్లు పెండింగ్‌లో ఉంది. ఈవెంట్ బిల్లులు 5 నెలకు రూ.2,500 చెల్లించాల్స ఉంది. ఆరోగ్యలక్ష్మి బిల్లు 3 నెలలుగా చెల్లించడంలేదు. కూరగాయల బిల్లు నెలకు రూ.600 చొప్పున ఏడాది నుంచి చెల్లించడంలేదు. జిల్లాలో 785 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఒక్కో సెంటర్‌కు ఏరియాను బట్టి రూ.600 నుంచి రూ.3 వేల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం 8 నెలలుగా అద్దె బకాయి చెల్లించడంలేదు. మీటింగ్ ఖర్చులు కూడా ఏడాది నుంచి ఇవ్వడం లేదని టీచర్లు వాపోతున్నారు. ఏడాదికాలంగా బకాయిలు చెల్లించకుండా ఉంటే తాము కేంద్రాలను ఎలా నడపాలని అంగన్వాడీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణపై ప్రభావం పడుతోందని చెబుతున్నారు. -
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పైప్‌లైన్ గ్యాస్ లీక్
-
కాబోయే జంటపై గ్యాస్ గీజర్ పంజా.. బాత్రూమ్లో స్నానం చేస్తూ..
కర్ణాటక: కొద్దిరోజుల్లో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువతీ యువకుని పాలిట బాత్రూంలోని గ్యాస్ గీజర్ మృత్యువులా విరుచుకు పడింది. గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక మృతిచెందారు. ఈ ఘటన బెంగళూరులోని చిక్కజాల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. ఉద్యోగం, సహజీవనం చేస్తూ.. వివరాలు.. చామరాజనగర జిల్లా గుండ్లుపేటే కు చెందిన చంద్రశేఖర్ (30), బెళగావి జిల్లా గోకాక్ నివాసి సుధా రాణి (22) మృతులు. వీరిద్దరూ నగరంలోని గోల్ఫ్ హోటల్లో పనిచేసేవారు. చిక్కజాల పరిధిలోని తరబనహళ్లిలో అద్దె ఇంట్లో ఉంటూ సహ జీవనం చేస్తున్నారు. త్వరలో వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించారు. ఈ నెల 10 తేదీ శనివారం ఉదయం ఇద్దరూ విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. రాత్రి గ్యాస్ గీజర్ ఆన్‌చేసి ఇద్దరూ బాత్రూమ్లో స్నానం చేయడానికి వెళ్లి బాత్రూమ్ కిటికీ మూశారు. స్నానం చేస్తున్న సమయంలో గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు లీక్ కావడంతో ఇద్దరూ స్పహతప్పి పడిపోయారు. కొంతసేపటికి మృతి చెందారు. డ్యూటీకి రాకపోవడంతో ఆదివారం ఇద్దరూ డ్యూటీకి రాకపోవడంతో స్నేహితులు వీరి మొబైల్‌కు ఫోన్ చేయగా స్పందన లేదు. అనుమానం వచ్చి ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. అనుమానం వచ్చి చిక్కజాలపోలీసులకు సమాచారమిచ్చారు. వారు చేరుకుని ఇంటి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ బాత్రూంలో శవాలై ఉన్నారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం అంబేడ్కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి తరువాత వారి కుటుంబాలకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
లాభాలు అదుర్స్! అదానీ కంపెనీల ఆదాయాలు వృద్ధి
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 4 రెట్లుపైగా ఎగసి రూ. 507 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 121 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం దాదాపు రెట్టింపై రూ. 2988 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 1,587 కోట్ల ఆదాయం ప్రకటించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 973 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 100 శాతం వృద్ధికాగా.. 2021–22లో రూ. 489 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు మొత్తం ఆదాయం రూ. 5,548 కోట్ల నుంచి రూ. 8,633 కోట్లకు జంప్ చేసింది. ఇంధన విక్రయాలు 58 శాతం పుంజుకుని 14,880 మిలియ న్ యూనిట్లకు చేరాయి. సామర్థ్య విస్తరణ ఇందుకు సహకరించింది. గతేడాది 2,676 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జత చేసుకుంది. వినీత్ ఎస్.జైన్ 2023 మే 11 నుంచి ఎండీగా కొనసాగనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటివరకూ సీఈవో, ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫలితాల నేపథ్యంలో అదానీ గ్రీన్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం బలపడి రూ. 977 వద్ద ముగిసింది. అదానీ గ్యాస్ లాభంలో వృద్ధి పట్టణాల్లో సీఎన్జీ, పైప్డ్ గ్యాస్ సేవలు అందించే అదానీ టోటల్ గ్యాస్, మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.98 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన రూ.81 కోట్లతో పోలిస్తే 21 శాతం వృద్ధి చెందింది. విక్రయాల పరిమాణం 2 శాతం పెరిగి 193 మిలియన్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్లుగా ఉంది. కొత్తగా 126 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో మొత్తం సీఎన్జీ స్టేషన్ల సంఖ్య 460కు చేరుకుంది. పైపుల ద్వారా గ్యాస్ అందించే కనెక్షన్ల సంఖ్య 1.24 లక్షలు పెరిగింది. దీంతో మొత్తం పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు 7.04 లక్షలకు చేరాయి. పారిశ్రామిక, వాణిజ్య కనెక్షన్లు 7,435కు పెరిగాయి. 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ రూ.4,683 కోట్ల ఆదాయంపై రూ.546 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమింగ్‌పై పన్నులు.. ఖరారైతే మరిన్ని పెట్టుబడులు -
గ్యాస్ వినియోగదారులకు ఊరట..
సీఎన్జీ, వంట గ్యాస్ వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం కేంద్రమంత్రి వర్గం తీసుకోబోతోంది. దేశంలో ఉత్పత్తి చేసిన సహజ వాయువు ధరలపై పరిమితిని విధించడాన్ని కేంద్ర మంత్రివర్గం త్వరలో పరిశీలించే అవకాశం ఉందని తెలిసింది. స్థానికంగా ఉత్పత్తి చేసిన సహజ వాయువు ధరలను ప్రభుత్వం ద్వైవార్షికంగా అంటే ఏటా రెండు సార్లు నిర్ణయిస్తుంది. ఈ సహజవాయువును వాహనాల్లో ఉపయోగించే సీఎన్జీగా, వంట గ్యాస్‌గా, విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు, ఎరువుల తయారీకి వినియోగిస్తారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయి. దేశంలో ఉత్పత్తి చేసిన గ్యాస్ ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇదివరకే అందుబాటులో ఉన్న క్షేత్రాల నుంచి వెలికితీసిన గ్యాస్ ధర అయితే ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంఎంబీటీయూ)కు 8.57 డాలర్లు (రూ.705), సముద్ర గర్భంలో కొత్తగా కనుగొన్న కష్టతరమైన క్షేత్రాల నుంచి తీసే గ్యాస్ అయితే 12.46 డాలర్లు (రూ.1,026)కు చేరింది. ఈ ధరలను వచ్చే నెల ఏప్రిల్ 1న సవరించాల్సి ఉంది. ప్రస్తుత ఫార్ములా ప్రకారం లెగసీ ఫీల్డ్‌ల నుంచి వెలికితీసే గ్యాస్ ధరలు ప్రతి ఎంఎంబీటీయూకు 10.7 డాలర్లు (రూ.881)కు పెరుగుతాయని, కష్టతరమైన ఫీల్డ్‌ల నుంచి వచ్చే గ్యాస్ ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల ఉండొచ్చని భావిస్తున్నారు. సీఎన్జీ, వంట కోసం వినియోగించే పైప్డ్ గ్యాస్ రేట్లు ఇప్పటికే 70 శాతం పెరిగాయి. ఏప్రిల్ 1న సవరణ జరిగితే మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటు వినియోగదారులు, అటు ఉత్పత్తిదారులు ఇద్దరి ప్రయోజనాలను సమతుల్యం చేస్తూ గ్యాస్ ధరల సవరణను పరిశీలించడానికి కిరిట్ పారిఖ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం గత సంవత్సరం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మిగులు దేశాలలో గ్యాస్ ధరలను వాటి సహజవాయువు ధరను నిర్ణయించే ప్రస్తుత పద్ధతికి బదులుగా లెగసీ ఫీల్డ్‌ల నుంచి గ్యాస్ ఇండెక్సేషన్‌ను బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలలో 10 శాతానికి మార్చాలని కమిటీ సిఫార్సు చేసింది. ఒక ఎంఎంబీటీయూకు కనిష్ట ధర 4 డాలర్లు (రూ.329), గరిష్ట ధర 6.50 డాలర్లు (రూ.535) ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 75 డాలర్లు ఉంది. దాని ప్రకారం గ్యాస్ ధర ఎంఎంబీటీయూకు 7.5 డాలర్లు (రూ.617) ఉండాలి. కానీ పరిమితి అమలైతే గ్యాస్ ధర 6.5 డాలర్లు (రూ.535) మాత్రమే ఉంటుంది. కమిటీ సిఫార్సులపై మంత్రిత్వ శాఖల అంతర్గత సంప్రదింపులు ముగిశాయి. ఈ సిఫార్సులను కేబినెట్ పరిశీలనకు పంపినట్లు తెలిసింది. త్వరలోనే మంత్రివర్గం దీనిని పరిశీలించే అవకాశం ఉంది. -
ఇరాన్లో ‘బాలికలకు విషం’...
దుబాయ్: ఇరాన్లో ను విద్యకు దూరం చేసేందుకు వారి స్కూళ్లపైకి విష వాయువులు వదులుతున్న ఉదంతాలపై యునెస్కో ఆందోళన వెలిబుచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరింది. స్కూళ్లలో బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని సూచించింది. ఇరాన్లో జరుగుతున్న పరిణామాలను తన మనసును తీవ్రంగా కలచివేస్తున్నాయని యునెస్కో సారథి ఆద్రే అజౌలే అన్నారు. -
వందల ఏళ్లుగా భూగర్భంలో ‘సేఫ్టీ ల్యాంప్’.. అసలు దీని కథేంటి?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూగర్భంలో పనిచేసే గని కార్మికులకు ప్రాణదీపంగా వందల ఏళ్ల నుంచి సేప్టీల్యాంప్ రక్షణ వెలుగులను పంచుతోంది. బొగ్గు గనుల్లో కాలక్రమేణా అనేక ఆధునిక యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చినా ఈ బత్తిదీపం ప్రాధాన్యత నేటికీ తగ్గడం లేదు. ఈ దీపం ఆవిష్కరణకు ముందు పలువురు భూగర్భంలోనే విషవాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు. ఈ దీపం రాకతో గనుల్లో రక్షణ ప్రమాణాలు మెరుగయ్యాయని సింగరేణి అధికారులు చెబుతున్నారు. బొగ్గు గాలితో నిత్యం ఆక్సిడేషన్ జరిపి స్వయంగా నిప్పు రాజేస్తుంది. అలా బొగ్గు మండినప్పుడు మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, ఇతర విషవాయువులు వెలువడుతాయి. ఆ సమయంలో కార్మి కులు పనిచేస్తే శ్వాస సమస్య ఏర్పడి నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారు. అలాంటి ప్రమాద పరిస్థితులను ముందే గుర్తించేందుకు పూర్వం కెనరీ పక్షులను పంజరాల్లో భూగర్భంలోకి తీసుకెళ్లేవారు. పక్షిరెక్కలు కొట్టుకోవడం, కదలికల ఆధారంగా వాయువులను గుర్తించేవారు. ప్రతిసారీ పక్షులను బంధించి గనిలోకి తీసుకెళ్లడం, రావడంతో అవి అస్వస్థతకు గురై అనారోగ్యంతో చనిపోయేవి. బ్రిటన్ కు చెందిన హంప్రి డేవీ 1815లో బొగ్గు గనుల్లో రక్షణ కోసం సేఫ్టీ ల్యాంప్‌ను కనుగొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు గనుల్లో విషవాయువులను గుర్తించడంలో సమర్థంగా పనిచేయడంతో ఈ ల్యాంప్ ప్రామాణికంగా మారింది. ఎలా పని చేస్తుందంటే.. ‘వైర్ గాజేస్’సూత్రంతో పనిచేసే ఈ సేప్టీ ల్యాంప్ 2.5 కిలోల బరువు, 10 సెం.మీ. పొడవు ఉంటుంది. మంట వెలిగేందుకు కిరోసిన్/పెట్రోల్‌ను వాడతారు. ఇది బానేట్, ఇనుప జాలీలు, వాషర్, గ్లాసు, చెక్నట్, నూనె బుడ్డితో నిర్మితమై ఉంటుంది. ఈ ల్యాంప్‌ను గనిలోకి ఓవర్‌మెన్, మైనింగ్ సర్దార్లు తీసుకెళ్లి బొగ్గు తీసే ముందు అక్కడి వాయువుల శాతాన్ని పరీక్షిస్తారు. మీ«థేన్, ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్ తదితర వాయువుల శాతాన్ని తెలుసుకుంటారు. పనిచేసేందుకు అనువుగా ఉంటే ఉత్పత్తి మొదలుపెడతారు. మొదట గనుల్లోకి సాధారణ స్థాయిలో మంట వెలుగుతూ ఉంటుంది. వెలుగుతున్న దీపాన్ని వాయువులు తాకగానే మంటలో మార్పు మొదలవుతుంది. ఉదాహరణకు మీథేన్ ఒక శాతం ఉంటే 0.10 అంగుళాల ఎత్తుతో మంట పక్కవైపులకు వెలుగుతూ కనిపిస్తుంది. 1.5 శాతం ఉంటే 0.15 ఇంచు ఎత్తులో మంట టోపీ ఆకారంలో కనిపిస్తుంది. ఇలా ఎరుపు, నీలిరంగు మంటల కదలికలు, కనిపించే ఆకారాలను బట్టి అక్కడ మీథేన్ గ్యాస్ ఏ మోతాదులో ఉందో గుర్తిస్తారు. ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే మంట ఆరిపోతుంది. ఇలా ఆ వాతావరణంలో పైన, కింద, వివిధ ఎత్తుల్లో దీపంతో పరిశీలిస్తారు. ప్రస్తుతం గనుల్లో 1.25 శాతం మీథేన్ ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే కార్మి కులను అలర్ట్ చేసి బయటకు పంపుతున్నారు. సింగరేణివ్యాప్తంగా జీఎల్–50, జీఎల్–60 రకం ల్యాంప్‌లను వాడుతున్నారు. జీఎల్–60లో ఒకవేళ మంట ఆరిపోతే తనంతట తానే వెలుగించుకొనే సాంకేతికత ఉంది. వాయువులను గుర్తించేందుకు డిజిటల్ పరికరాలైన మీౖథెనోమీటర్, ఆక్సీమీటర్, మల్టీడిటెక్టర్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఒక్కోసారి ఈ పరికరాలు భూగర్భంలో సాంకేతిక సమస్యలతో పని చేయకపోవచ్చు. కానీ సేఫ్టీ ల్యాంప్ మాత్రం 100 శాతం కచ్చితత్వంతో పనిచేస్తోంది. దీంతో నేటికీ ఈ దీపం వాడకాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం అధికారులు, కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ల్యాంప్ నిర్వహణ, మరమ్మతులకు ఓ ఇన్చార్జి ఉంటారు. రక్షణలో ఇప్పటికీ ఇదే కీలకం.. బొగ్గుగనుల్లో రక్షణ విషయంలో సేఫ్టీల్యాంప్ కీలకంగా పనిచేస్తోంది. ప్రాణనష్టం జరగకుండా విషవాయువులను గుర్తించేందుకు బాగా ఉపయోగపడుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా పలు డిజిటల్ పరికాలు వచ్చినా, సేఫ్టీల్యాంప్ వాడకం మాత్రం కొనసాగుతోంది. –సీహెచ్.సమ్మయ్య, హెడ్ ఓవర్‌మెన్, వీటీసీ, శిక్షకుడు ఇలా మంటలో మార్పుని బట్టి గ్యాస్ మోతాదును గుర్తిస్తారు. సింగరేణిలో ఒక్కో భూగర్భ గనిలో సగటున 12 నుంచి 14 వరకు దీపాలు అవసరమవుతాయి. -
ఛాతీలో మంట... కడుపులో యాసిడ్ పైకి తంతుంటే!
ఎంత ఆరోగ్యవంతులకైనా జీవితంలో ఎప్పుడో ఒకసారైనా కడుపులోని గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ... ఇబ్బంది పెట్టడం ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వస్తుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్’ (జీఈఆర్డీ) అంటారు. కడుపులో యాసిడ్ ఆహారంపైన పనిచేసే సమయంలో దాని వాయువులు (ఫ్యూమ్స్) పైకి ఎగజిమ్మడంతో గొంతు, ఛాతీలో మంట అనిపిస్తుంది. జీఈఆర్‌డీని నివారించాలంటే... ► ఈ సమస్య నివారణకు మంచి జీవనశైలిని అలవరచుకోవడం మేలు. ► రాత్రి భోజనం ఆలస్యం చేయకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిదూరమైనా నడవాలి. ► పక్కమీదకు చేరగానే సాధ్యమైనంత వరకు ఎడమవైపునకు ఒరిగి పడుకోవాలి. ఒకవేళ కుడివైపు తిరిగి పడుకుంటే గొంతు చివర అన్నకోశం దగ్గర ఉండే స్ఫింక్టర్ మీద ఒత్తిడి పడి తెరుచుకుని, ఆహారం వెనక్కు రావచ్చు. అప్పుడు యాసిడ్ కూడా వెనక్కు వచ్చే అవకాశముంటుంది. ► తల వైపు భాగం ఒంటి కంటే కాస్త ఎత్తుగా ఉండేలా పక్కను సర్దుకోవాలి. రిఫ్లక్స్ సమస్యతో బాధపడేవారు వీలైతే తల కింద మరో దిండును ఎక్కువగా పెట్టుకోవడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. ► మందుల విషయానికి వస్తే... హెచ్2 బీటా బ్లాకర్స్, ప్రోటాప్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) అనే మందులతోనూ చికిత్స చేస్తారు. -
దేశ ఇంధన చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) దేశ ఇంధన చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. తాజాగా ఏవియేషన్ గ్యాస్ (ఏవీ గ్యాస్) ఎగుమతులు ప్రారంభించింది. 80 బ్యారెళ్ల తొలి కన్సైన్మెంట్ను (ఒక్కో బ్యారెల్ 16 కిలోలీటర్లు) జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి పపువా న్యూ గినియాకు పంపినట్లు సంస్థ తెలిపింది. నికరంగా ఇంధనాలను దిగుమతి చేసుకునే భారత్ .. ఇలా ఏవీ గ్యాస్‌ను ఎగుమతి చేయడం ఇదే ప్రథమం. దీనితో అంతర్జాతీయంగా 2.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న ఏవీ గ్యాస్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు సంస్థ తెలిపింది. మానవరహిత ఏరియల్ వాహనాలు (యూఏవీ), ఫ్లయింగ్ స్కూల్స్ నడిపే చిన్న విమానాలు మొదలైన వాటిల్లో ఏవీ గ్యాస్‌ను ఉపయోగిస్తారు. పెద్ద వాణిజ్య విమానాల్లో ఉపయోగించే ఇంధనాన్ని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)గా వ్యవహరిస్తారు. ఏవీ గ్యాస్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయడం వల్ల విదేశీ మారకం ఆదా కావడంతో పాటు ఔత్సాహిక పైలట్లకు ఫ్లయింగ్ స్కూల్స్‌లో శిక్షణ వ్యయభారం కూడా తగ్గుతుందని ఐవోసీ చైర్మన్ ఎస్ఎం వైద్య చెప్పారు. అలాగే రక్షణ బలగాలు ఉపయోగించే యూఏవీల నిర్వహణ వ్యయాలు కూడా భారీగా తగ్గగలవని పేర్కొన్నారు. దీన్ని దేశీయంగా ఐవోసీ మాత్రమే తయారు చేస్తోంది. గుజరాత్‌లోని వడోదరలో గత సెప్టెంబర్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. ఈ ప్లాంటు సామర్థ్యం 5,000 టన్నులుగా ఉంది. చదవండి: ఆ జాబ్ పోతేనేం, మూడు రోజుల్లో..భారీ ఆఫర్: 7.1 మిలియన్ల వ్యూస్‌తో మహిళ వైరల్ స్టోరీ -
కొత్త ఏడాది తొలిరోజే షాక్..పెరిగిన గ్యాస్ ధర.. ఎంతంటే?
న్యూ ఇయర్ తొలిరోజే గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. ఆయిల్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇంట్లో వాడే డొమెస్టిక్ గ్యాస్ ధరల్ని మాత్రం పెంచలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు దేశంలోని వివిధ ప్రాంతాల వారీగా చూసుకుంటే ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 25 రూపాయలు ఉండగా ముంబై, హైదరాబాద్,బెంగుళూరు సహా అన్ని నగరాల్లో ఇలాగే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.1769, ముంబైలో రూ.1721, కోల్‌కతాలో రూ.1870, చెన్నైలో రూ.1917, హైదరాబాద్‌లో రూ.1973గా ఉన్నాయి. దేశంలో స్థిరంగా డొమెస్టిక్ గ్యాస్ ధరలు దేశంలో డొమెస్టిక్ గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా గతేడాది ఏడాది జులై 6న రూ.50 పెరగ్గా.. మొత్తంగా గతేడాది కాలంలో గృహావసర గ్యాస్ సిలిండర్ల ధరలు రూ.153.5 పెరిగాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో డొమెస్టిక్ గ్యాస్ ధరలు.. ఢిల్లో రూ.1053, ముంబైలో రూ.1052, కోల్‌కతాలో రూ.1079, చెన్నై రూ.1068, హైదరాబాద్‌లో రూ.1105 కొనసాగుతున్నాయి. -
వాహనాలకు స్పీడ్ బ్రేకర్లుగా సీఎన్జీ ధర
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర వాణిజ్య వాహన పరిశ్రమ వేగానికి కళ్లెం వేస్తోందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఇక్రా ప్రకారం.. గ్యాస్ ధర దూసుకెళ్తుండడంతో వాణిజ్య వాహనాల్లో సీఎన్జీ విస్తృతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16 నుంచి 9–10 శాతానికి పరిమితం చేసింది. మధ్యస్థాయి వాణిజ్య వాహన విభాగంలో ఇది సుస్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ ఇంధన ధరల పెరుగుదల కారణంగా గత ఏడాదిలో సీఎన్జీ ధర 70 శాతం అధికమైంది. ఇది సీఎన్జీ, డీజిల్ మధ్య అంతరాన్ని తగ్గించింది. దీంతో పర్యావరణ అనుకూల ఇంధనానికి మారడానికి అడ్డుగా పరిణమించింది. కొన్ని నగరాల్లో సీఎన్జీ ధర కేజీ రూ.59 ఉంటే మరికొన్ని నగరాల్లో రూ.90 ఉంది. ధరల వ్యత్యాసం సీఎన్జీ విస్తృతికి అడ్డంకిగా ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ప్రత్యామ్నాయ ఇంధనం/సాంకేతిక వాహనాలను అభివృద్ధి చేయడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఎంపిక చేసిన విభాగాలలో ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడంతోపాటు, సీఎన్జీ మోడళ్ల ప్రవేశ వేగాన్ని తగ్గించాయి. హైడ్రోజన్ ఇంధనంపైనా ఫోకస్ చేస్తున్నాయి. సీఎన్జీ వ్యాప్తిలో ఇటీవలి క్షీణత కనిపించినప్పటికీ.. సీఎన్జీ ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పర్యావరణ అనుకూల వాహనాలను పెంచడం ద్వారా మధ్యకాలిక అవకాశాలు అనుకూలంగానే ఉన్నాయి. పెరిగిన నిర్వహణ ఖర్చులు.. సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల వాటా 2021–22లో 38 శాతం ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 27 శాతానికి వచ్చింది. సీఎన్జీ వాహనాల నిర్వహణ ఖర్చులు గత ఏడాది కంటే దాదాపు 20 శాతం పెరిగాయి. ఢిల్లీ, ముంబై వంటి కొన్ని నగరాల్లో పోల్చదగిన డీజిల్ వేరియంట్లతో చూస్తే ఇప్పుడు వ్యయాలు 5–20 శాతం అధికం అయ్యాయి. వాహనం ధర అధికం కావడం, సీఎన్జీ ట్రక్కులు తక్కువ బరువు మోసే సామర్థ్యం ఉండడం.. వెరశి ఈ వాహనాలను స్వీకరించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల అమ్మకాలు ఒకానొక స్థాయిలో నెలకు 12,000 యూనిట్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇది 7,000 యూనిట్లకు వచ్చి చేరింది. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లు, ముఖ్యంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధ ప్రభావం కారణంగా ప్రస్తుత పరిస్థితి దాదాపు మధ్యస్థ కాలానికి కొనసాగుతుంది. కాగా, సీఎన్జీ ఆధారిత ప్యాసింజర్ వాహనాలు, బస్సులకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. పర్యావరణ అనుకూల వాహనాల వినియోగం పెరిగేందుకు ప్రభుత్వ చొరవ కొంత వరకు తోడ్పడింది. -
గ్యాస్ ధరపై సామాన్యులకు గుడ్ న్యూస్
-
సిలిండర్ లో నీళ్లు.. ఆందోళనకు దిగిన బాధితులు
-
క్యూ2లో అదానీ గ్యాస్‌కు షాక్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ టోటల్ గ్యాస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 139 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 159 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 73 శాతం జంప్‌చేసి రూ. 1,190 కోట్లను తాకింది. సీఎన్జీకి డిమాండ్ పుంజుకోవడంతో గ్యాస్ విక్రయాలు 9 శాతం వృద్ధితో 19.1 కోట్ల ఘనపు మీటర్లను తాకాయి. ఈ కాలంలో నేచురల్ గ్యాస్ వ్యయాలు రెట్టింపై రూ. 860 కోట్లకు చేరినట్లు కంపెనీ సీఈవో సురేష్ పి.మంగ్లానీ పేర్కొన్నారు. సహజవాయువు సీఎన్జీగా మార్పిడి ద్వారా ఆటో మొబైల్స్‌కు, పైప్డ్ నేచురల్ గ్యాస్‌గా మార్చి వంటలు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసే సంగతి తెలిసిందే. సెప్టెంబర్ చివరికల్లా 33 కొత్త సీఎన్జీ స్టేషన్లను జత చేసుకుంది. వీటి సంఖ్య 367కు చేరింది. ఇదే విధంగా 61,000 గృహాలకు కొత్త కనెక్షన్ల ద్వారా పీఎన్జీ నెట్‌వర్క్‌ను 6.25 లక్షలకు పెంచుకుంది. కొత్తగా 412 బిజినెస్ కస్టమర్లను కలుపుకుని వాణిజ్య కనెక్షన్ల సంఖ్యను 6,088కు చేర్చుకుంది. ఫలితాల నేపథ్యంలో అదానీ టోటల్ షేరు ఎన్ఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 3,647 వద్ద ముగిసింది. -
రూ. 10 ప్యాకెట్లో 5 చిప్స్! ఇక రూ.2 చేంజ్‌కి ఒక చిప్ ఇస్తారా?!
సాక్షి, ముంబై: చిరుతిండి, కాలక్షేపం అనగానే దాదాపు అందరి దృష్టి చిప్స్ వైపే మళ్లుతుంది. ఎంత పెద్ద చిప్స్ ప్యాకెట్ కొన్నా.. అందులో గ్యాస్ ఎక్కువ.. చిప్స్ తక్కువ ఇది అందరికి తెలిసిన సంగతే. తాజాగా మరో వింత సంగతి ఒకటి వెలుగులోకి వచ్చింది. 10రూపాయల చిప్స్ ప్యాకెట్ కొన్న వినియోగదారుడు అందులో కేవలం చిప్స్ ఉండటంతో తెల్లబోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు సెటైర్లతో సందడి చేస్తున్నారు. ఒక విద్యార్థి కాలేజీకి వెడుతూ పది రూపాయల చిప్స్ ప్యాకెట్ కొన్నాడు. కట్ చేస్తే.. అక్షరాలా ఐదు చిప్స్ మాత్రమే ఉన్నాయి. దీన్ని సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం రెడిట్‌లో షేర్ చేయగానే.. చిప్‌కు రెండు రూపాయలు భయ్యా.. ఇకపై రెండు రూపాయల చేంజ్ లేకపోతే ఒక చిప్ చేతిలో పెడతారేమో అని ఒక యూజర్ కమెంట్ చేశాడు. గత 27 ఏళ్లుగా టాప్ క్వాలీటీ మసాలా ఎయిర్ అమ్ముతూనే ఉన్నారు.. అది కాస్ట్లీ గ్యాస్... మనం తినే చిప్స్ జస్ట్ కాంప్లిమెంట్.. ఇలా రకరకాల కామెంట్లతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. -
బాబోయ్ షాక్: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు
న్యూఢిల్లీ: సహజ వాయువు రేట్లను ఏకంగా 40 శాతం పెంచుతూ చమురు శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో యూనిట్ (ఎంబీటీయూ) రేటు రికార్డు స్థాయిలో 6.1 డాలర్ల నుంచి 8.57 డాలర్లకు చేరింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటు 9.92 డాలర్ల నుంచి 12.6 డాలర్లకు పెంచుతూ చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా వాహనాల్లో ఉపయోగించే సీఎన్జీ, వంట అవసరాల కోసం పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే పీఎన్జీ రేట్లకు రెక్కలు రానున్నాయి. ధరల పెంపు సామాన్యుడిపై ప్రభావం చూపనుంది. గ్యాస్‌ను ఉపయోగించి ఉత్పత్తి చేసే ఎరువులు, విద్యుత్ తయారీ వ్యయాల భారం కూడా పెరగనున్నాయి. సాధారణంగా గ్యాస్ రేట్లను ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి (ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న) సమీక్షిస్తుంది. అమెరికా, కెనడా, రష్యా వంటి గ్యాస్ మిగులు దేశాల రేట్లకు అనుగుణంగా నిర్దిష్ట ఫార్ములా ప్రకారం సవరిస్తుంది. మరోవైపు, ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం ఎగిసే అవకాశాలు ఉన్నందున రేట్ల ఫార్ములాను సమీక్షించి, తగు సిఫార్సులు చేసేందుకు ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు కిరీట్ పారిఖ్ సారథ్యంలో కేంద్రం కమిటీ వేసింది. ఇది సెప్టెంబర్ ఆఖరు నాటికే నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
Be Alert: నిర్లక్ష్యం చేస్తే గ్యాస్..‘బాంబే’.. 12 వేల రెట్లు ఎక్కువ వ్యాపిస్తుంది
సాక్షి, హైదరాబాద్: చందానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే విహార్ కాలనీలో గురువారం జరిగిన దుర్ఘటనలో ఒకరు చనిపోగా ఇద్దరు క్షతగాత్రులయ్యారు.రాంగోపాల్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని నల్లగుట్ట జే లైన్లో చోటు చేసుకున్న ఉదంతంలో భార్యభర్తలకు గాయపడ్డారు. .ప్రతి వంటింట్లోనూ ఉండే ఎల్పీజీ గ్యాస్ లీకేజ్ వల్ల జరిగిన పేలుడు ప్రభావాలివి. గత వారం జరిగిన రెండే కాదు.. నగరంలో తరచుగా ఇలాంటి ‘గ్యాస్’ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏటా పదుల సంఖ్యలో ఉంటున్న వీటి వల్ల ప్రాణనష్టం తక్కువగా ఉంటున్నా..ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉంటోంది. అవగాహన లేమి, నిర్లక్ష్యం వల్లే ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఇలా జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్‌లో దాదాపు 14.5 కేజీల బ్యూటేన్, ప్రొఫైన్ వాయువులను అత్యధిక ఒత్తిడితో ద్రవ రూపంలో నిక్షిప్తం చేస్తారు. ఈ బండ వినియోగంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, అవగాహన కొరవడిగా సంభవించే ప్రమాదం బాంబు పేలుడుతో సమానం. సాధారణంగా స్టౌవ్ ఆఫ్ చేసి ఉన్నప్పటికీ..గ్యాస్ లీకేజ్ అనేది సున్నిత ప్రాంతాల నుంచి జరిగే అవకాశం ఉంది. ►సిలిండర్, స్టవ్‌లను కలుపుతూ రబ్బర్ ట్యూబ్ ఉంటుంది. ఇది అటు సిలిండర్‌కు, ఇటు స్టవ్‌కు అతికే ప్రాంతాల్లో ఏదో ఒక చోట నుంచి లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ►సాధారణంగా స్టవ్‌కు అనుసంధానిచే చోటే వేడి వల్ల ఈ ట్యూబ్ సాగే గుణం కోల్పోతుంది. ఫలితంగా పెళుసుదనం సంతరించుకుని పగుళ్లు ఏర్పడతాయి. కేవలం గుండు సూది మొనంత రంధ్రం ఏర్పడితే చాలు. దీని లోంచి గంటకు ముప్పావు నుంచి కేజీన్నర వరకు గ్యాస్ లీక్ అవుతుంది. చదవండి: సికింద్రాబాద్‌లోని అపార్ట్మెంట్లో పేలుడు.. ►స్టవ్‌కు ఉండే నాబ్స్, రెండు నాబ్స్‌నూ కలిపే పైప్, కొత్త సిలిండర్ బిగించే సమయంలో రెగ్యులేటర్, సిలిండర్ నాబ్‌ల నుంచీ లీక్ అయ్యే అవకాశం ఉంది. నానక్‌రామ్‌గూడ ఉదంతంలో మాత్రం కమర్షియల్ సిలిండర్ నుంచి అనేక కనెక్షన్లు ఇచ్చిన వాల్వ్ లీకేజ్‌కి కారణమైంది. ►వంటింటికి కిటికీలు, వెంటిలేటర్లు ఉంటే లీకైన గ్యాస్ వాటి నుంచి బయటకు వెళ్లిపోతుందనే భావన చాలా మందికి ఉంటుంది. వంట గ్యాస్‌లో ఉండే వాయువులు గాలి కన్నా చాలా బరువైనవి. అందుకే లీకైన తరవాత నేలపైకి చేరతాయి. నాలుగడుగుల కంటే తక్కువ ఎత్తులోనే వ్యాపిస్తాయి. దీంతో కిటికీలు తెరిచి ఉన్నా... వెంటిలేటర్లు ఉన్నా వాటి ద్వారా బయటకు పోయే అవకాశం ఉండదు. ►ఇంట్లో వ్యాపించి ఉన్న గ్యాస్‌కు ప్రేరణ లభించగానే ఒక్కసారిగా అంటుకుటుంది. ఇలా అంటుకున్న సందర్భంలో విస్తరించి ఉన్న గ్యాస్ 12 వేల రెట్లు వ్యాకోచిస్తుంది. అంటే కేజీ గ్యాస్ లీకై ఉంటే... మంట అంటుకున్న వెంటనే అది 12 వేల కేజీల వరకు వ్యాకోచిస్తుంది. ఫలితంగానే గ్యాస్ ప్రమాదం చోటు చేసుకున్న చోట భారీ ఆస్తి నష్టం ఏర్పడుతుంది. ►సమీపంలో ఉన్న వ్యక్తులు మాత్రం ప్రాణాలు కోల్పోవడమో, 60 శాతం వరకు కాలిపోవడమో జరుగుతుంది. అనేక ప్రమాదాల్లో గ్యాస్ సిలిండర్ ఏమాత్రం చెక్కు చెదరదు. దీన్ని చూసి అనేక మంది గ్యాస్ వల్ల జరిగిన పేలుడు కాదని భావిస్తారు. ఇలాంటి బ్లాస్ట్ల్ని కెమికల్ ఎక్స్ప్లోజన్ అని, సిలిండర్ కూడా ఛిద్రం అయిపోతే దాన్ని మెకానికల్ ఎక్స్ప్లోజన్ అని అంటారు. ►గత వారం జరిగిన వాటిలో చందానగర్ పరిధిలోని మొదటి ప్రమాదానికి గ్యాస్ లీకైన గదిలో లైట్ వేయడం కారణమైతే, రామ్‌గోపాల్‌పేట పరిధిలో జరిగిన రెండో దానికి స్టవ్ వెలిగించే ప్రయత్నం చేయడం కారణమైంది. చదవండి: ఆ ఆశతో గణేష్ లడ్డూను దొంగిలించిన పిల్లలు ఇద్దరి పరిస్థితి విషమం రాంగోపాల్‌పేట్: రాంగోపాల్‌పేట్ డివిజన్లోని నల్లగుట్ట జే లైన్లో శనివారం గ్యాస్ లీకై జరిగిన పేలుడులో గాయపడిన దంపతులు సందీప్, అనుల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వీరిని పోలీసులు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స ప్రారంభించారు. 55 శాతం కాలిన గాయాలతో ఇద్దరు చికిత్స పొందుతుండగా పరిస్థితి మాత్రం విషమంగానే ఉందని గాం«ధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. -
కుర్ర గ్రహం చిక్కింది.. కెమెరాలో బంధించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్
భూమికి కేవలం 385 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ కుర్ర గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన కెమెరా కంటితో బంధించింది. సౌరవ్యవస్థకు ఆవల ఉన్న దీన్ని హెచ్ఐపీ 65426గా పిలుస్తున్నారు. ఈ గ్రహం భూమి కంటే చాలా చిన్నది. భూమి వయసు 450 కోట్ల ఏళ్లు కాగా దీని వయసు కేవలం 1.5 నుంచి 2 కోట్ల ఏళ్లేనట. భూమ్మీదున్న పలు టెలిస్కోప్‌లు ఈ గ్రహాన్ని 2017లోనే ఫొటో తీసినా అంతరిక్షం నుంచి తీసిన జేమ్స్ వెబ్ తాజా చిత్రాలు దాని వివరాలను అద్భుతమైన స్పష్టతతో అందించాయి. ఇంతకూ హెచ్ఐపీ 65426 నేల వంటి గట్టి ఉపరితలం లేని ఓ భారీ వాయు గ్రహమట. కనుక దానిపై జీవముండే ఆస్కారం కూడా లేదని నాసా శాస్త్రవేత్తలు తేల్చారు. సూర్యునికి భూమి మధ్య దూరంతో పోలిస్తే ఈ గ్రహం తాను పరిభ్రమిస్తున్న నక్షత్రానికి కనీసం 100 రెట్లు ఎక్కువ దూరంలో ఉందట. సౌర మండలానికి ఆవలున్న ఇలాంటి మరిన్ని గ్రహాలను జేమ్స్ వెబ్ మున్ముందు మనకు పట్టిస్తుందని నాసా చెబుతోంది. -
అదానీ టోటల్: ఆసక్తికర ఫలితాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ టోటల్ గ్యాస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్-జూన్(క్యూ1)లో నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 138 కోట్లకు చేరింది. ఆటోమొబైల్స్‌కు సీఎన్జీ విక్రయాలు 61 శాతం జంప్‌చేసి 109 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లను తాకాయి. పైప్డ్ వంట గ్యాస్ అమ్మకాలు 3 శాతం పుంజుకుని 74 ఎంఎంఎస్సీఎంకు చేరాయి. అయితే సీఎన్జీ, వంటగ్యాస్ తయారీకి కొనుగోలు చేసిన సహజవాయు ధరలు మూడు రెట్లు ఎగసి రూ. 785 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. ఈ కాలంలో మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 1,110 కోట్లను తాకింది. నిర్వహణా లాభం 6 శాతం బలపడి రూ. 228 కోట్లుగా నమోదైంది. చదవండి : OnePlus10T 5G: వన్‌ప్లస్ 10 టీ వచ్చేసింది..ఆఫర్ అదిరింది! -
మూణ్నెళ్లలో ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్ సరఫరా: ఏజీ అండ్ పీ ప్రథాన్
వచ్చే సెప్టెంబరు నెల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తరూ జిల్లా సమీప ప్రాంతాల్లో ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్ సరఫరా ప్రారంభించడానికి కృషి చేస్తున్నామని ప్రముఖ ఇంథన సరఫరా సంస్థ ఏజీ అండ్ పీ ప్రథాన్ రీజనల్ హెడ్ చిరాగ్ ‘సాక్షి’కి తెలిపారు. సింగపూర్ కు చెందిన ఈ కంపెనీ ఇటీవలే కేంద్ర పెట్రోలియం బోర్డ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు పొంది ఇంధన సరఫరా ప్రారంభించనుంది. భవిష్యత్తులో పోర్టబుల్ జనరేటర్స్, ఎయిర్ కంటిషనర్స్ కూడా గ్యాస్‌తో వినియోగించుకునే పరిస్థితి రానుందంటున్న ఆయన సాక్షితో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే... ‘ఆదా’కు ఆదా... భధ్రతకు భరోసా ఈ పైప్‌లైన్ గ్యాస్ ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుత సిలిండర్‌కి సరిపడా గ్యాస్ దీని ద్వారా రూ.750 నుంచి రూ 800 వరకూ ధరలోనే వస్తుంది. అంటే ప్రస్తుతం అవుతున్న ఖర్చులో 10 నుంచి 15శాతం ఆదా అవుతుంది. ఈ పైప్డ్ నేచురల్ గ్యాస్ సంప్రదాయ సిలిండర్ గ్యాస్‌తో పోలిస్తే చవక మాత్రమే కాదు అత్యంత సురక్షితం కూడా. సరఫరా మొత్తం పైప్‌లైన్ సిస్టమ్‌లోనే సాగుతుంది. కాబట్టి ప్రత్యేకించి స్టోరేజ్ అవసరం లేదు. పైప్‌లైన్ ద్వారా ఒక కిచెన్ పాయింట్ అందిస్తాం. అవసరాన్ని బట్టి ఓ అడిషనల్ పాయింట్ కూడా అదే కిచెన్‌లో తీసుకోవచ్చు. బాత్ రూమ్ కోసం కావాలంటే మరో అదనపు పాయింట్ ఇస్తాం. మునిసిపల్ వాటర్ నీటి పంపు తిప్పితే నీళ్లొచ్చినట్టే ఈ గ్యాస్ కూడా వస్తుంది. వినియోగించిన ఇంధనాన్ని లెక్కించేందుకు మీటర్ ఏర్పాటు ఉంటుంది. మీటర్‌ను బట్టి వాడుకున్న ఇంధనానికి బిల్ చెల్లించాల్సి ఉంటుంది. కరెంట్ బిల్లుల్లానే కాకపోతే అందులోలా ఇందులో స్లాబ్స్ ఉండవు. ఇక గ్యాస్ వినియోగదారులకు నిరంతర సేవలు అందించేందుకు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24/7 ఇన్స్టాలేషన్ తర్వాత సర్వీస్ అందిస్తున్నాం. దీని కోసం ఒక పూర్తిస్థాయి టీమ్ పనిచేస్తుంది. రెస్టారెంట్స్‌కు మరింత మేలు... నివాస గృహాలతో పోలిస్తే రెస్టారెంట్స్ లాంటి వ్యాపార సంస్థలకు పైప్‌లైన్ గ్యాస్ ద్వారా ఆదా అయ్యే 10శాతం అంటే చాలా పెద్ద మొత్తం అనే చెప్పాలి. ఇది వారి లాభాలను బాగా పెంచుతుంది. వారాంతాల్లో హోటల్స్ దాబాలు వంటి చోట్ల డిమాండ్ కారణంగా అధిక ఇంధనం కోసం అదనపు సిలిండర్లు మీద ఆధారపడతారు. అయితే ఇక్కడ ఆ కొరత ఉండదు. ఎంత కావాలంటే అంత గ్యాస్ సిద్ధంగా ఉంటుంది. ఈ ఆకర్షణీయమైన ప్రయోజనం కారణంగా భవిష్యత్తులో తిరుపతిలో అన్ని రెస్టారెంట్స్ పైప్డ్ గ్యాస్‌కి కనెక్ట్ అవుతాయి. రాబోయే రోజుల్లో తిరుమలకు కూడా అందించడానికి తితిదేతో చర్చలు నడుస్తున్నాయి. అయితే దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. స్పందన బాగుంది... ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా కోరుతూ ప్రజల నుంచి ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు అందుకున్నాం. కేవలం 4 నెలల్లోనే 2వేల 500 కంటే పైగా అప్లికేషన్స్ వచ్చాయి. స్థానిక సంస్థలు మాకు అవసరమైన విధంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో జారి చేసింది గూడూరు మునిసిపల్ కార్పొరేషన్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్, నాయుడు పేట మునిసిపల్ కార్పొరేషన్.. ల నుంచి పైప్‌లైన్ నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేశాం. ఇన్స్టలేషన్ ప్రారంభించాం... తిరుపతి టౌన్లో కూడా శ్రీనివాసపురం, రోడ్‌నెం 15, 16లలో డొమెస్టిక్ సర్వీసెస్ స్టార్ట్ చేశాం. 300 నివాస గృహాల్లో ఇన్స్టలేషన్ పూర్తయింది. నెల్లూరులో కూడా 450 ఇళ్లకి డొమెస్టిక్ ఇన్స్టలేషన్ పూర్తయింది. పైప్‌లైన్ ప్రోగ్రెస్‌లో ఉంది. వచ్చే 2నెలల్లో పూర్తి అవుతుంది. స్థానిక సరఫరా పైప్‌లైన్ నెట్వర్క్ని నాయుడపేట టౌన్, ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ప్రారంభించాం. ప్రభుత్వం చెప్పినట్టుగా రిఫండబుల్ డిపాజిట్ రూ.6వేలు తీసుకోవచ్చు కానీ మేం అది తీసుకోకుండానే ప్రస్తుతం కనెక్షన్ వర్క్ పూర్తి చేస్తున్నాం. వాహనాల కోసం సీఎన్జీ పెట్రోల్, డీజిల్ వాహనాలను పిఎన్జి వాహనాలుగా మార్చే రెట్రో ఫిట్మెంట్ సెంటర్స్ ద్వారా సేవలు కూడా అందిస్తున్నాం. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం కడప లాంటి చోట్ల డీజిల్ ఆటోలు బాగా ఎక్కువ వాటిని సీఎన్జీ ఆటోలుగా మార్చవచ్చు. దీని వల్ల పర్యావరణానికి ఎంతో ఉపయక్తం. అంతేకాక ఈ మార్పిడి కోసం అయ్యే ఖర్చు వాహన యజమానులకు కేవలం 6 నెలల్లో రికవరీ చేసుకోవచ్చు. డీజిల్‌తో పోలిస్తే సిఎన్జి వల్ల 30 నుంచి 50శాతం ఇంధన ఖర్చు అంటే కనీసం నెలకు రూ.5వేలు ఆదా అవుతుంది. ఇక భారీ వాహనాలు, ఎక్కువ దూరాలు నడిపేవారికి ఒక్క రోజులోనే భారీ మొత్తంలో ప్రయోజనం కలుగుతుంది. ఇంధనాన్ని నింపుకోవడంలో ఇబ్బందులు రాకుండా ప్రతీ 60 నుంచి 100 కి.మీ లోపు సిఎన్జి స్టేషన్స్ ఉండేలా చూస్తున్నాం. -
భారత్‌కు ఎల్ఎన్జీ సరఫరాలో రష్యా డిఫాల్ట్!
న్యూఢిల్లీ: భారత్‌కు 5 కార్గోల ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ)ను సరఫరా చేయడంలో రష్యా డిఫాల్ట్ అయ్యింది.రష్యన్ గ్యాస్ సరఫరా చేసే కంపెనీల్లో ఒకదానిపై ఆంక్షలు అమలవుతుండటమే ఇందుకు కారణం. వివరాల్లోకి వెడితే దేశీ దిగ్గజం గెయిల్‌కి ఏటా 2.85 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ దిగుమతి కోసం రష్యన్ సంస్థ గాజ్ప్రోమ్కి చెందిన సింగపూర్ విభాగంతో దీర్ఘకాలిక ఒప్పందం ఉంది. ఈ సింగపూర్ విభాగం ప్రస్తుతం జర్మనీకి చెందిన అనుబంధ సంస్థ కింద పనిచేస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలపై రష్యా ప్రతీకార ఆంక్షలు విధించిన దేశాల్లో జర్మనీ కూడా ఉంది. ఫలితంగా సింగపూర్ విభాగానికి రష్యా గ్యాస్ అందుబాటులో లేకుండా పోయింది. దీంతో ఎల్ఎన్జీ సరఫరాకు ఆటంకం కలిగింది. గెయిల్ ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గ్యాస్ సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. -
సీఎన్జీ ధరలు తగ్గించాలి, కేంద్రానికి సియామ్ విజ్ఞప్తి!
న్యూఢిల్లీ: సీఎన్జీ ధరలను తగ్గించాలని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పర్యావరణ సుస్థిర లక్ష్యాల సాధనకు ఇది అవసరమని పేర్కొంది. గడిచిన కొన్ని నెలల్లో సీఎన్జీ ధరలు అసాధారణంగా పెరిగినట్టు గుర్తు చేసింది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అనుకూల లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం నుంచి సరైన మద్దతును, సరైన సమయంలో కోరుకుంటున్నట్టు సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. జాతి లక్ష్యాలైన చమురు దిగుమతులను తగ్గించుకోవడం, స్వచ్ఛమైన పర్యావరణం సాకారానికి.. పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సహకార ధోరణి ఉండడం అభినందనీయమన్నారు. ‘‘సీఎన్జీని ప్రోత్సహించడం, నెట్వర్క్ విస్తరణ విషయంలో ప్రభుత్వ కృషికి మద్దతుగా.. సీఎన్జీ వాహన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు ఆటోమొబైల్ పరిశ్రమ కట్టుబడి ఉంది’’అని రాజేష్ మీనన్ ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం కేంద్ర పెట్రోలియం,సహజవాయువుల మంత్రి హర్దీప్సింగ్ పూరి 166 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,332 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు కావడం గమనార్హం. -
నెల్లూరులో గ్యాస్ పరిశ్రమ ఏర్పాటు పనులు షురూ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్ అందించేందుకు అనుమతులు పొందిన ఏజీ అండ్ పీ గ్యాస్ పరిశ్రమ పనులు షురూ చేసింది. రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి పట్టణాల్లో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పనుల పరిశీలన... వెంకటరెడ్డి పాళెం పంచాయితీ పరిధిలోని ఓజ్లీలో ఏజీ అండ్ పీ గ్యాస్ పరిశ్రమ పనులను సూళ్లూరు పేట ఆర్డీఓ పరిశీలించారు. పరిశ్రమ నిర్మాణంలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది ఆయన సర్వే సిబ్బందితో కలిసి నిశితంగా సమీక్షించారు. చెరువులో గానీ, గురుకుల పాఠశాల, వాకాటి వారి కండ్రిగ, రాజు పాలెం ఎస్టీకాలనీలకు సమీపంలో నిర్మాణాలు ఏమైనా చేపట్టారా అనే అనుమానాల నేపధ్యంలో ఈ పరిశీలన జరిపినట్టు ఆయన వెల్లడించారు. సందేహాల నివృత్తి కోసం పరిశ్రమ ప్రతినిధులు, గ్రామస్తులతో అధికారుల బృందం మాట్లాడింది. ఈ సందర్భంగా పరిశ్రమ ప్రతినిధులు తమ పరిశ్రమ ఏర్పాటు సంబంధిత వివరాలు అందించారు. ఓజ్లిలో ఎల్‌సీఎన్‌జీ స్టేషన్సన్నాహాలు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) కంపెనీగా ఏజీ అండ్ పీ ప్రథమ్‌కు 12 సీజీడీ లైసెన్లనుపెట్రోలియం– సహజవాయు నియంత్రణ మండలి (పీఎన్ జీఆర్బీ) మంజూరు చేసింది. వీటి ద్వారా దేశవ్యాప్తంగా 34 జిల్లాల్లో ప్రతి రోజూ వినియోగం కోసం గ్యాస్‌ను ఏజీ అండ్ పీ అందిస్తుంది. అలా సంస్థ సరఫరా చేస్తోన్న ఓ గ్రామమే నెల్లూరు జిల్లాలోని ఓజ్లి గ్రామం.జ్లీ వద్ద ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌ను ఏర్పాటుచేయడం కోసం పెట్రోలియం ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ; డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ హెల్త్, బాయిలర్స్, ఫ్యాక్టరీస్ (డిష్); ద ఫైర్– స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ (ఫైర్ ఎన్ ఓసీ), నెల్లూరు నగరాభివృద్ధి సంస్ధ (నుడా), అపెక్స్ సేఫ్టీ స్టాట్యూటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కంపెనీ అవసరమైన అన్ని అనుమతులను తీసుకుంది. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అంగీకారం (సీటీఈ) సైతం పొందింది. పరిశ్రమ ఏర్పాటులో వర్తించేటటువంటి అన్ని చట్టాలకూ, అదే విధంగా స్టెయినబల్ గ్యాస్ ఆర్ధిక వ్యవస్ధ సృష్టికి తాము కట్టుబడి ఉన్నామని సంస్థ ప్రతినిధులు వివరించారు. -
సామాన్యులకు షాక్, భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారునికి మరో షాక్. ఇళ్లలో వినియోగించే 14.2కేజీల సిలిండర్‌పై రూ.50 ధరని పెంచుతూ చమురు కంపెనీలు ప్రకటించాయి.దీంతో రూ.1055 నుంచి రూ.1105కు చేరిన సిలిండర్ ధరకు చేరింది. ఇక పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, 5కేజీల డొమెస్టిక్ గ్యాస్ ధరను చమురు కంపెనీలు రూ.188కి పెంచాయి. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం రూ.8.50కి తగ్గించాయి. సామాన్యులకు ధరాఘాతం ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉండగా..మరోవైపు పెరిగిపోతున్న ఎల్పీజీ గ్యాస్ ధరలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బుధవారం చమురు కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ ధరను రూ.50కి పెంచాయి. దీంతో జులై 2021 నుంచి ఇవాళ్టితో మొత్తం 8సార్లు గ్యాస్ ధరల్ని పెంచినట్లైంది. ఇదిలా ఉండగా, జూలైలో కమర్షియల్ సిలిండర్ల ధరల్ని రెండోసారి తగ్గించింది. అంతకుముందు జూలై 1న 19 కిలోల ఎల్పిజి సిలిండర్‌ను రూ.198 తగ్గించారు. సెక్యూరిటీ డిపాజిట్‌ను పెంచేసింది ఈ జూన్ నెలలో కేంద్ర పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ గ్యాస్ వినియోగం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జులై 16 నుంచి గ్యాస్ కొత్త కనెక్షన్లు తీసుకునే వారు చెల్లించాల్సిన వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్‌ను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అంటే గ్యాస్ కొత్త కనెక్షన్లు తీసుకునే వారు చెల్లించాల్సిన వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్‌ను 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్‌పై సెక్యూరిటీ డిపాజిట్ రూ.1450 ఉండగా.. దాని పెంపుతో కొత్తసింగిల్ సిలిండర్ ఇండేన్ కనెక్షన్ కోరుకునే వారు రూ.2,500కు పైనే చెల్లించాలని స్పష్టం చేసింది. ఇక రూ. 800గా ఉన్న 5 కేజీల సిలిండర్ డిపాజిట్ మొత్తం రూ. 1150కు చేరింది. దీంతోపాటు రెగ్యులేటర్‌కు గతంలోని 150 రూపాయలతో పోలిస్తే ఇపుడు రూ. 250 చెల్లించాలి. కాగా, సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న కసరత్తుతోపాటు, ఏ వంటగదిలోనూ ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు (గరిష్టంగా రెండు సిలిండర్లు) ఉండకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. -
ఆర్ధిక పాఠాలు నేర్చుకుంటున్న శ్రీలంక... పొదుపు దిశగా అడుగులు
Sri Lanka Crisis: గత కొన్ని రోజులుగా శ్రీలంక తీవ్ర రాజకీయ, ఆర్థిక సంకోభాలతో కొట్టుమిట్టాడుతూ.. తీవ్ర ఉద్రిక్తలతో మగ్గిపోయింది. ఇప్పడిప్పుడే కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. కానీ అక్కడ తీవ్ర ఆర్థిక సంక్షోభం కొత్త ప్రభుత్వానికి ఒక సవాలుగా మారిందనే చెప్పాలి. ఆ దేశా ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టడానికి ప్రధాని రణిల్ విక్రమసింఘే చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తమ దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ.... ఆర్థిక సంక్షోభం నుంచి మనం బయటపడాలంటే ఇంధన వనరులను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఇంధనానికి సంబంధించి రాబోయే మూడు వారాలు మనం గడ్డు పరిస్థితులను ఎదుర్కోవల్సి ఉంటుంది. అందువల్ల మనం ఇప్పటి నుంచే ఇంధనం, గ్యాస్‌లను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అనవసరమైన ప్రయాణాన్ని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత. సంక్షోభాన్ని అధిగమించడానికి దేశం ఇంధనం కోసం నెలకు సుమారు 500 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది" అని చెప్పారు. అదీగాక అంతర్జాతీయ పరంగా మనం అనుసరిస్తున్న నాసిరకం విధానాల వల్లే దేశం మరింతగా అణగారిపోతుందని విక్రమసింఘే అన్నారు. అందువల్ల ప్రస్తుతం దేశం తన విదేశీ సంబంధాలపై పూర్తిగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. (చదవండి: అతి పెద్ద శక్తిగా అవతరించనున్న చైనా... టెన్షన్లో యూఎస్!) -
ఓఎన్జీసీకి చమురు లాభాలు
న్యూఢిల్లీ: ఆయిల్, గ్యాస్ అన్వేషణ ఉత్పత్తి సంస్థ ఓఎన్జీసీ మార్చి త్రైమాసికానికి రూ.8,859 కోట్ల స్టాండలోన్ లాభాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరలు కంపెనీ లాభాల వృద్ధికి అనుకూలించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలం లో లాభం రూ.6,734 కోట్లతో పోల్చి చూస్తే 30 శాతానికి పైగా వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. షేరు వారీ ఆర్జన మార్చి క్వార్టర్‌కు రూ.7.04గా ఉంది. ఆదాయం రూ.34,497 కోట్లకు దూసుకుపోయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.21,189 కోట్లతో పోలిస్తే 50 శాతానికి పైగా పెరిగింది. ఇక 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఓఎన్జీసీ లాభం రికార్డు స్థాయిలో రూ.40,306 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.11,246 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు వృద్ధి చెందింది. 2021 చివర్లో చమురు ధరలు పెరగడం మొదలు కాగా.. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత ధరలు మరింత ఎగిశాయి. చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే ఓఎన్జీసీకి ఇది అనుకూలించింది. అనుబంధ సంస్థలైన హెచ్‌పీసీఎల్, ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ఫలితాలను కూడా కలిపి చూస్తే.. కన్సాలిడేటెడ్ లాభం మార్చి త్రైమాసికంలో రూ.12,061 కోట్లు, 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.49,294 కోట్లుగా ఉన్నాయి. -
మోకాళ్లతో తొక్కిపెట్టి హింసించి, ఊపిరాడకుండా చేసి...
Asphyxiation death of Black man: బ్రెజిల్లో జ్యాత్యాహంకారం కోరలు చాచింది. అక్కడి పోలీసులు.. ఒక నల్లజాతీయుడిని దారుణంగా హింసించడంతో పాటు ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దేశమంతటా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. సెర్గిప్‌లోని యుంబౌబలో హైవేపై మోటర్ సైకిల్ మీద వెళ్తున్న డి జీసస్ శాంటోస్ అనే వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అతని నేలపై కూర్చొబెట్టి మోకాళ్లతో తొక్కిపెట్టి హింసించారు. అంతటితో ఆపకుండా కారు డిక్కిలో పడేసి బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో శాంటోస్ కన్నుమూశాడు. అయితే పోలీసులు మాత్రం శాంటోస్ దురుసుగాగా ప్రవర్తించాడని, అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రతిఘటించాడని చెబుతున్నారు. అతనిని నియంత్రించే క్రమంలోనే బాష్పవాయువును ఉపయోగించామని చెప్పారు. కానీ బాధిత కుటుంబం మాత్రం శాంటోస్‌ని హైవేపై బలవంతంగా ఆపి చొక్కా పైకెత్తమనడంతో.. భయపడ్డాడని అంటున్నారు. పైగా మానసికంగా అతను స్థిమితంగా లేడని, అతని దగ్గర మందుల చీటి చూసి కూడా కనికరించకుండా హింసించారని అంటున్నారు. శాంటోస్ ఎంతగా వదిలేయమని ప్రాధేయపడ్డా వదలకుండా ఊపిరాడకుండా చేసి చంపేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. శాంటోస్‌ని పోలీస్‌స్టేషన్‌కి తరలించే క్రమంలోనే తీవ్ర ఆవస్థతకు గురై చనిపోయాడని పోలీసులు అంటున్నారు. ఊపిరాడకపోవం వల్లే మృతిచెందినట్లు పోస్ట్‌మార్టం నివేదిక చెబుతోంది. దీంతో.. శాంటోస్ హత్యకు పోలీసులే కారణమంటూ.. జనాలు రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ ఘటన కార్చిచ్చు రాజేయడంతో.. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఉన్నత దర్యాప్తునకు ఆదేశించారు. (చదవండి: మిస్టర్ బైడెన్.. ముందు అమెరికన్లను కాపాడండి: ట్రంప్ ఫైర్) -
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, సోషల్ మీడియాలో మీమ్స్ మంట!
ఉప్పు నుంచి పప్పు దాకా..పెట్రోల్ నుంచి నిత్యవసర సరుకుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని బూచీగా చూపిస్తూ ఉత్పత్తి దారులు అన్నీ రకాల వస్తుల ధరల్ని పెంచడంతో..ఆకాశాన్నంటుతున్న ధరలతో సామాన్యులు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. తాజాగా ఇవేం సరిపోవన్నట్లు గ్యాస్ కంపెనీలు సైతం గ్యాస్ ధరల్ని పెంచి సామాన్యులపై తమ ప్రతాపాన్ని చూపించాయి. దీంతో పెరిగిన ధరలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమదైన స్టైల్లో మీమ్స్ వేస్తున్నారు. ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. గురువారం 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.3.50పైసలు పెరగ్గా..కమర్షియల్ గ్యాస్ ధర రూ.8 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..పెరిగిన సిలిండర్ ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇవ్వాళ పెరిగిన ధరలతో ఢిల్లీలో 14.2కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,003, కోల్ కతాలో 1,029.50, ముంబైలో రూ.1,003, చెన్నైలో రూ.1,019 ఉంది 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.2,254, కోల్‌కతాలో రూ.2,453, ముంబైలో రూ.2,305, చెన్నైలో రూ.2,507గా ఉంది. విమర్శల వెల్లువ పెరిగిన గ్యాస్ ధరలపై నెటిజన్లు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.రోజురోజుకీ పెరిగిపోతున్న గ్యాస్ ధరలు మధ్య తరగతి ప్రజల ఆదాయంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? అంటూ ప్రశ్నిస్తున్నారు. The price of domestic LPG cylinders is hiked by Rs. 3.50 & commercial cylinders by Rs 8. In Delhi, LPG used to cost Rs 414/cylinder in May 2014 under UPA & it now costs Rs 1003. Even when inflation is at its highest in decades, the BJP govt has no mercy on the people of India! — Dr. Shama Mohamed (@drshamamohd) May 19, 2022 అప్పుడు రూ.414..ఇప్పుడు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.3.50, కమర్షియల్ సిలిండర్ రూ.8 పెరగడంపై కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రతినిధి శర్మ డాక్టర్ షామా మొహమ్మద్ కేంద్రంపై మండిపడ్డారు. మే 2014 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇదే గ్యాస్ ధర రూ.414 ఉంటే.. ఇప్పుడు రూ.1,003 ఉందని ట్వీట్ చేశారు. Domestic LPG cylinder is 1003rs today. Petrol Price is 113rs / ltr ACHE DIN Dear Indians, Open your eyes before it's too late.#LPGPriceHike#PetrolDieselPrice #GasCylinder pic.twitter.com/UeF4xYkVEd — Taj (@Taj_Taju1) May 19, 2022 LPG gas cylinder is the Mahesh Babu of commodities, hence proved🤭#LPG #lpgpricehike #MaheshBabu pic.twitter.com/JKFK7Sc1Lw — TejalTweets (@TweetsTejal) May 11, 2022 -
రష్యా మెలిక.. ‘ఇది దారుణం.. అస్సలు బాలేదు’
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులని పశ్చిమ దేశాలు తప్పుబట్టింది. ఈ దాడులను ఆపాలని ఎంత చెప్పినా ఫలితం లేకపోడంతో పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే తానేమి తక్కువ కాదని రష్యా కూడా కొన్ని దేశాలపై ఆంక్షలు విధించింది. అందులో భాగంగానే పశ్చిమ దేశాల ఆంక్షల నుంచి తమ దేశ ఆర్ధిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఓ నిర్ణయం తీసుకుంది. ఇకపై రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయాలనుకునే దేశాలు.. ముఖ్యంగా అవి తమ మిత్రదేశాలు కాకపోతే రష్యా కరెన్సీ (రూబెల్స్)లోనే చెల్లింపులు ఉండాలని లేదంటే సరఫరా చేయబోమని రష్యా మెలికపెట్టింది. తాజాగా ఈ నిబంధనల ప్రకారం.. రూబెల్స్లో చెల్లింపులు చేయడంలో విఫలమైన పోలాండ్, బల్గేరియాకు గ్యాస్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. కాగా యూరోపియన్ దేశాలకు అత్యధికంగా గ్యాస్, చమురు సరఫరా చేసేది రష్యానే. ప్రస్తుతం ఈ నిర్ణయంతో ఆ దేశాల మార్కెట్లో హోల్‌సేల్ గ్యాస్ ధర 20% పెరిగింది. ఇది గత సంవత్సరం క్రితం కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ చర్యను ఖండించారు. ఆమె దీనిపై స్పందిస్తూ.. యూరోప్‌లోని వినియోగదారులకు గ్యాస్ డెలివరీని నిలిపివేస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. రష్యా చేస్తోంది బ్లాక్‌మెయిలింగ్ అని దుయ్యబట్టారు. తాము అన్ని సభ్య దేశాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నామని, గ్యాస్ సమస్యను తీర్చేందుకు ఓ కమిషన్ ఏర్పాటు చేశామని అది యూరప్ వెలుపల ఉన్న దేశాలతో చర్చలు జరుపుతోందని ఆమె తెలిపారు. చదవండి: Karachi University Blast: ఇద్దరు పిల్లల తల్లి, సైన్స్ టీచర్.. మహిళా సుసైడ్ బాంబర్ గురించి షాకింగ్ విషయాలు -
ఏడాది కాలంలో రికార్డ్ స్థాయిలో పెరిగిన సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ ధరలు..ఎందుకంటే!
న్యూఢిల్లీ: గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ గ్యాస్ వినియోగ ధోరణులపై సిటీ గ్యాస్ పంపిణీదారుల (సీజీడీ) నుంచి డేటా కోసం ఎదురుచూస్తున్నామని, అది వచ్చాక కేటాయింపులు జరుపుతామని కేంద్ర చమురు శాఖ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా డిమాండ్‌ను బట్టి ప్రతి ఆరు నెలలకోసారి (ఏటా ఏప్రిల్, అక్టోబర్‌లో) కేంద్రం గ్యాస్ కేటాయింపులు చేస్తుంది. కానీ 2021 మార్చి నుంచి ఇప్పటివరకూ కేటాయించలేదు. దీనితో కొరతను అధిగమించేందుకు సిటీ గ్యాస్ ఆఫరేటర్లు ..దిగుమతి చేసుకున్న ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ)ను అధిక రేట్లు పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. దీంతో ఏడాది వ్యవధిలో దేశీయంగా సీఎన్జీ రేటు కేజీకి రూ. 28 పైగా, పీఎన్జీ ధర మూడో వంతు మేర పెరిగిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, సీజీడీ సంస్థలు తమకు త్రైమాసికాలవారీగా కేటాయించాలంటూ అభ్యర్ధించాయని, ఆ అంశాన్ని పరిశీలిస్తున్నామని చమురు శాఖ ప్రతినిధి తెలిపారు. సీజీడీ అదనపు కేటాయింపులు జరపాలంటే .. ఎరువులు, విద్యుత్, ఎల్పీజీ ప్లాంట్లు మొదలైన వాటికి సరఫరాలో కోత పెట్టాల్సి వస్తుందని వివరించారు. -
కేజీ బేసిన్‌కు నాలుగు కొత్త రిగ్గులు..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని చమురు నిక్షేపాల వెలికితీతకు ప్రభుత్వ ఆయిల్ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) లిమిటెడ్ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా గుర్తించిన బావుల నుంచి గ్యాస్, చమురు వెలికితీయడానికి ఇటలీ టెక్నాలజీ రిగ్గులను వినియోగిస్తోంది. దేశం వ్యాప్తంగా ఉపయోగించడానికి 47 రిగ్గులను ఇటలీ నుంచి కొనుగోలు చేసిన ఓఎన్జీసీ అందులో నాలుగింటిని నరసాపురం, రాజమహేంద్రవరం కేంద్రాలుగా కార్యకలాపాలు సాగుతున్న కేజీ బేసిన్‌కు కేటాయించింది. తొలివిడతగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దెయ్యాలతిప్ప వద్ద ఇటలీ టెక్నాలజీ రిగ్గును ఇటీవల ప్రవేశపెట్టారు. మరో రిగ్గును కొద్ది రోజుల్లో భీమవరం సమీపంలోని వేండ్రలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా కేజీ బేసిన్లో ఓఎన్జీసీ చమురు నిక్షేపాల కోసం తవ్వకాలను పాత యంత్రాలతోనే కొనసాగిస్తోంది. డ్రిల్లింగ్ సమయంలో బాంబింగ్ కూడా చేస్తారు. దీంతో ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. పైప్లైన్లలో లీకేజీలతో బ్లోఅవుట్లు సంభవిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికి ఓఎన్జీసీ ఇటలీ టెక్నాలజీ రిగ్గులను వినియోగంలోకి తెచ్చింది. నాలుగు దశాబ్దాలుగా కార్యకలాపాలు.. నాలుగు దశాబ్దాలుగా నరసాపురం టెంపుల్ ల్యాండ్ కేంద్రంగా ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగుతున్నాయి. తరువాత కాలంలో రాజమహేంద్రవరంలో ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. చమురు నిక్షేపాల వెలికితీతకు సంబంధించిన యంత్రసామగ్రి మొత్తం నరసాపురం టెంపుల్ ల్యాండ్‌లోనే ఉంటుంది. నరసాపురం ప్రాంతంలో 40 ఏళ్లుగా అపారంగా గ్యాస్ నిక్షేపాలు ఇస్తున్న బావులు ఖాళీ అవ్వడంతో ఓఎన్జీసీ రెండేళ్ల నుంచి జిల్లాలో గ్యాస్ నిక్షేపాల కోసం పలు ప్రాంతాల్లో విస్తృతంగా సర్వే చేసింది. మార్టేరు, పెనుగొండ, మొగల్తూరు మండలం ఆకెనవారితోట, భీమవరం సమీపంలోని దెయ్యాలతిప్ప, మహదేవపట్నం, వేండ్ర ప్రాంతాల్లో కొత్త బావులను గుర్తించింది. కొత్తగా గుర్తించిన బావుల్లో వినియోగించేందుకు ఇటలీ టెక్నాలజీ రిగ్గులు కొనుగోలు చేసింది. చమురు, గ్యాస్ ఉత్పత్తిలో పశ్చిమదే అగ్రస్థానం కేజీ బేసిన్లో ఓఎన్జీసీ రోజుకు 33 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 900 టన్నుల ఆయిల్‌ను వెలికితీస్తోంది. ఇందులో పశ్చిమగోదావరి జిల్లా నుంచే 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 600 టన్నుల ఆయిల్ వస్తోంది. సంస్థ ఉత్పత్తిలో ఇప్పటివరకు జిల్లాదే అగ్రస్థానం. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని కవిటం, నాగిడిపాలెం, ఎస్–1 విశిష్ట బ్లాక్, 98–2 ప్రాజెక్ట్‌లోను, తూర్పుగోదావరి జిల్లా కేసనపల్లి, కృష్ణాజిల్లా బంటుమిల్లి, నాగాయలంక ప్రాంతాల్లోను కొత్తగా చేపట్టిన అన్వేషణ పూర్తయింది. ఈ కొత్త బావుల నుంచి త్వరలో ఉత్పత్తి ప్రారంభించనుంది. కొత్త బావుల్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ఎక్కువ ఉత్పత్తి రాబోతోంది. వచ్చే ఏడాది నుంచి కేజీ బేసిన్లో రోజుకు 40 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 1,400 టన్నుల ఆయిల్ ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే దాదాపు 25 శాతం ఉత్పత్తి పెంచాలన్నది లక్ష్యం. సముద్రగర్భం నుంచి గ్యాస్.. 1974లో మొదటిసారిగా నరసాపురంలో ఓఎన్జీసీ చమురు నిక్షేపాలను గుర్తించింది. అప్పటి నుంచి కేవలం ఆన్ షోర్పైనే సంస్థ దృష్టి పెట్టింది. 10 ఏళ్ల కిందట నుంచి రిలయన్స్, గెయిల్ వంటి సంస్థలు రంగప్రవేశం చేసి ఆఫ్ షోర్ (సముద్రగర్భం)లో డ్రిల్లింగ్ ముమ్మరం చేయడంతో ఆ దిశగా కూడా ఓఎన్జీసీ దూకుడు పెంచింది. 2006 నుంచి సముద్రగర్భంలో అన్వేషణ ప్రారంభించింది. ప్రస్తుతం నరసాపురం నుంచి కాకినాడ వరకు సముద్రగర్భంలో అన్వేషిస్తోంది. నరసాపురం మండలం చినమైనవానిలంక తీరానికి సమీపంలో ఆఫ్ షోర్లో గ్యాస్ వెలికితీత ఇప్పటికే ప్రారంభమైంది. గ్యాస్ వెలికితీతలో మూడేళ్ల నుంచి ఓఎన్జీసీ దేశంలో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. -
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆందోళనలు
-
ఫ్లీజ్ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్‌కు రష్యా బంపరాఫర్!
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆ దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. యుద్ధంతో ప్రపంచ దేశాల నుంచి ఎదరవుతున్న ఇబ్బందుల నుంచి ఆర్ధికంగా తమను ఆదుకోవాలంటూ రష్యా భారత్‌ను అర్జిస్తుంది. ఇందులో భాగంగా భారత్.. తమ దేశ దేశంలోని ఆయిల్, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికాతో పాటు ఇతర నాటో దేశాలు గుర్రుగా ఉన్నాయి. అందుకే రష్యా నుంచి దిగుమతులపై పూర్తి స్థాయిలో నిషేధం విధించాయి. దీంతో గత రెండు వారాలుగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. శనివారం ఈ ఏడాది చివరి నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేస్తామని జర్మనీ కీలక ప్రకటన చేసింది. ప్రతి రోజు, ప్రతి గంటకు మేము రష్యన్ దిగుమతులకు వీడ్కోలు పలుకుతున్నాంటూ జర్మన్ ఆర్థిక శాఖ మంత్రి రాబర్ట్ హబెక్ ప్రముఖ మీడియా 'ఫ్రాంక్‌ఫర్టర్ ఆల్జెమీన్ జైటుంగ్' కు తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం..జర్మనీ ప్రస్తుతం చమురులో 3వ వంతు, బొగ్గులో 45శాతం రష్యా నుండి దిగుమతి చేసుకుంటోంది. అయినా సరే ఈ నెల ముగిసే సమయానికి బొగ్గు కొనుగోళ్లను, సంవత్సరం చివరి నాటికి చమురు కొనుగోళ్ల నిలిపివేస్తామని మీడియా కు వెల్లడించారు. అదే సమయంలో క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పాటు రష్యా వద్ద చమురు ధరలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రష్యా అమెరికాకు ప్రతిరోజు 7లక్షల బ్యారల్ల చమురును ఎగుమతి చేసేది. అంతేకాకుండా, ప్రపంచ చమురు అవసరాల్లో 12శాతం, సహజవాయివుల్లో 16శాతం అవసరాల్ని రష్యా తీరుస్తుంది. ఇప్పుడు ఆ చమురును కొనేవారు లేకపోవడంతో ఆ చమరును భారత్‌కు అతి తక్కువ ధరకే అమ్ముతామంటూ రష్యా..,భారత్‌కు ఆఫర్ చేసింది. ఇప్పటికే రష్యా నుంచి భారత్‌కు చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 1బిలియన్లకు చేరుకున్నాయి. ఇతర దేశాల నిషేదంతో రష్యాలో..భారత్ ఆయిల్, గ్యాస్ పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీతో మంతనాలు జరుపుతుంది. భారత్ అందుకు అంగీకరిస్తే తాము భారత్‌లో కంపెనీల ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామంటూ రష్యా ఉప ప్రధాని నోవాక్ భారత్‌ను సంప్రదించారంటూ భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఒకవేళ రష్యా ఇస్తున్న ఈ ఆఫర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. కానీ రష్యాతో స్నేహం కారణంగా అమెరికాతో పాటు నాటో దేశాలకు దూరం కావాల్సి ఉంది. ఇదే అంశంపై ప్రధాని మోదీ వేచి చూసే ధోరణిలో ఉన్నారని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: 'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!! -
5ఏళ్లు, రూ.40వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ద్రవ రూపంలోని సహజ వాయువు (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్/ఎల్ఎన్జీ) తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన పెట్రోనెట్ ఎల్ఎన్జీ వచ్చే 4–5 ఏళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. విదేశాల్లోని ప్లాంట్లపై కలిపి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్టు సంస్థ సీఈవో ఏకే సింగ్ వెల్లడించారు. ’’పెట్రోనెట్ ఎల్ఎన్జీ రూ.12,500 కోట్లతో ప్రొపేన్ డీహైడ్రోజెనరేషన్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి ప్రవేశించనుంది. దిగుమతి చేసుకున్న ముడి సరుకు నుంచి ప్రాపీలేన్‌ను ఈ ప్లాంట్ తయారు చేస్తుంది. అలాగే, ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద రూ.1,600 కోట్లతో ఎల్ఎన్జీ దిగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం’’ అని సింగ్ తెలిపారు. తాము ఎప్పటికప్పుడు విదేశీ పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తుంటామని, దేశానికి ప్రయోజనకరం, మెరుగైనది అనిపిస్తే తప్పకుండా ముందుకు వెళతామని చెప్పారు. విద్యుత్, ఫెర్టిలైజర్, సీఎన్జీ అవసరాలను దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు సగం మేరే తీరుస్తోంది. మిగిలినది దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ‘‘రూ.600 కోట్లతో గుజరాత్‌లోని దహేజ్ ఎల్ఎన్జీ దిగుమతి టర్మినల్ సామర్థ్యాన్ని ప్రస్తుత 17.5 మిలియన్ టన్నుల (వార్షిక) నుంచి 22.5 మిలియన్ టన్నులకు పెంచుకుంటాం. రూ.1,245 కోట్లతో అదనపు స్టోరేజీ ట్యాంకు సమకూర్చుకుంటాం’’ అని సింగ్ తెలిపారు. దేశీయంగా ఎల్ఎన్జీ దిగుమతి సామర్థ్యం, పెట్రోకెమికల్ వ్యాపారం కోసం ∙రూ.17,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామన్నారు. -
జీఎస్టీలోకి గ్యాస్..
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ లక్ష్యమైన గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ సాకారానికి.. సహజ వాయువును జీఎస్టీ కిందకు తీసుకురావాలని పరిశ్రమ డిమాండ్ చేసింది. దేశ ఇంధన బాస్కెట్లో సహజవాయవు వాటాను పెంచాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ (ఎఫ్‌ఐపీఐ) కోరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఈ సమాఖ్యలో భాగంగా ఉన్నాయి. పైపులైన్ల ద్వారా సరఫరా చేసే సహజవాయువు, దిగుమతి చేసుకునే ఎల్ఎన్జీ ఆధారిత రీగ్యాసిఫికేషన్పై జీఎస్టీని తగ్గించాలని కోరింది. అప్పుడు పర్యావరణ అనుకూల ఇంధన ధరలు తగ్గుతాయని బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించిన వినతిపత్రంలో కోరింది. 2030 నాటికి దేశ ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటా ప్రస్తుతం ఉన్న 6.2 శాతం నుంచి 15 శాతానికి చేర్చాలన్నది ప్రధాని లక్ష్యంగా ఉంది. -
40 ఏళ్లుగా ప్రపంచానికి దూరంగా.. సన్యాసిలా బతుకుతున్నాడు
సాక్షి, వెబ్‌డెస్క్: కరోనా కట్టడి కోసం మూడు నెలల పాటు లాక్డౌన్ విధిస్తేనే జనాలకు పిచ్చిపట్టింది. మనుషుల్లో తిరగక.. బయటకు వెళ్లక ఇంటికే పరిమితం కావడం అంటే పెద్ద పనిష్మెంట్గా భావించారు. చుట్టూ నలుగురు మనుషులు, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా.. భారంగా గడిపారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వ్యక్తి మాత్రం మనకు చాలా భిన్నం. ఆయన గత 40 ఏళ్లుగా మనుషులకు చాలా దూరంగా.. ప్రకృతి ఒడిలో నివసిస్తున్నారు. గ్యాస్, కరెంట్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు లేకపోయినా సంతోషంగా జీవిస్తున్నారు. భౌతిక సుఖాలు పరిత్యజించి ఇలా సన్యాసిగా జీవించడం చాలా బాగుంది అంటున్న ఈ వ్యక్తి వివరాలు.. (photo cridit BBC) 40 ఏళ్లుగా అడవిలో నివసిస్తున్న ఈ వ్యక్తి పేరు కెన్ స్మిత్(74). ప్రస్తుతం అతడు స్కాట్లాండ్ రాన్నోచ్ మూర్ అంచున ఉన్న సమీప రహదారి నుంచి రెండు గంటలు లోపలకి ప్రయాణిస్తే కనిపించే లోచ్ ట్రీగ్‌లో ఓ చెక్క గదిలో నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాంతాన్ని లోన్లీ లోచ్ అని పిలుస్తారు. మనుషులకు దూరంగా ఉంటున్న కెన్ గురించి తొలుత 9 సంవత్సరాల క్రితం ఫిల్మ్ మేకర్ లిజ్జీ మెక్కెంజీకి తెలిసింది. ఆమె గత రెండెళ్ల క్రితం ఇతని గురించి బీబీసీ స్కాంట్లాండ్లో ‘ట్రైగ్ సన్యాసి’ పేరుతో డాక్యూమెంటరీ ప్రచురించింది. ఆ ప్రమాదంతో జీవితంలో మార్పు.. డెర్బీషైర్‌కు చెందిన కెన్ 15వ ఏట నుంచే పని చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో 26వ ఏట ఉండగా దారి దోపిడి దొంగలు కెన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ సమయంలో 23 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాడు. అతడి స్థితి చూసిన వారు.. కెన్ కోలుకోవచ్చు.. కానీ మాట్లాడలేడు.. నడవలేడు అన్నారు. అయితే వారి మాటలు అబద్ధం చేస్తూ కెన్ చాలా త్వరగా పూర్వపు జీవితాన్ని ప్రారంభించాడు. (photo cridit BBC) 22 వేల మైళ్లు ప్రయాణం... ప్రమాదం కెన్ జీవితాన్ని మార్చింది. ఎవరి మాటలు వినకూడదని నిర్ణయంచుకున్నాడు. ఆ సమయంలో అతడికి అడవిపై ఆసక్తి కలిగింది. ఇక నడక ప్రారంభించాడు. దాదాపు 22 వైల మైళ్లు నడిచి అలాస్కా సరిహద్దలో ఉన్న కెనడియన్ భూభాగమైన యుకాన్ చేరుకున్నాడు. కెన్ ఈ ప్రయాణంలో ఉండగానే అతడి తల్లిదండ్రులు మరణించారు. ఇంటికి వచ్చాక విషయం తెలుసుకున్న కెన్ గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి అతడి చాలా సమయం పట్టింది. తల్లిదండ్రుల మరణం తర్వాత పూర్తి ఒంటరిగా.. తల్లిదండ్రులు చనిపోయారు.. నా అన్న వాళ్లు ఎవరు లేరు. దాంతో ఇక జనవాసాలకు దూరంగా.. అడవిలోనే జీవించాలనుకున్నాడు కెన్. ఏకాంత ప్రదేశం కోసం వేల కొద్ది మైళ్లు ప్రయాణం చేసి చివరకు లోచ్ ప్రాంతాన్ని చేరుకున్నాడు. అదే తనకు అనువైన స్థావరంగా భావించాడు. అక్కడే దుంగలతో ఓ చిన్నపాటి గదిని నిర్మించుకున్నాడు. (photo cridit BBC) నో గ్యాస్, నో కరెంట్... గత 40 ఏళ్లుగా ఒక్కడే.. ఆ చిన్న గదిలో నివసిస్తున్నాడు కెన్. గ్యాస్, కరెంట్ వంటి సదుపాయాలు లేవు. చేపలు పట్టడం, కూరగాయలు, బెర్రీస్ పండిచి వాటిని ఆహారంగా తీసుకునేవాడు. అతడి దగ్గర ఓ జీపీఎస్ పర్సనల్ లోకేటర్ బీకాన్ ఉంది. ఇక ఒంటిరిగా బతకాలంటే.. కచ్చితంగా చేపలు పట్టడం రావాలంటాడు కెన్. కాపాడిన జీపీఎస్ పర్సనల్ లోకేటర్.. అయితే 2019లో తొలిసారి కెన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఫిల్మ్‌మేకర్ లిజ్జీ కెన్ వద్ద నుంచి వెళ్లిన పది రోజుల తర్వాత, ఫిబ్రవరి 2019లో, కెన్ బయట మంచులో ఉన్నప్పుడు స్ట్రోక్‌కు గురయ్యాడు. అయితే అతడి ఉన్న జీపీఎస్ లోకేటర్ టెక్సాస్, హస్టన్‌లో ఉన్న రెస్పాన్స్ కేంద్రానికి ఎస్ఓఎస్ పంపడంతో కెన్ పరిస్థితి గురించి వారికి తెలిసింది. (photo cridit BBC) వారు ఈ విషయాన్ని వెంటనే యూకేలోని కోస్ట్‌గార్డ్‌కు తెలియజేశారు. వారు వెంటనే కెన్ను ఫోర్ట్ విలియమ్‌లోని ఆసుపత్రికి విమానంలో తరలించారు. అక్కడ అతను కోలుకోవడానికి ఏడు వారాలు పట్టింది. వైద్యులు అతనికి జనవాసంలో ఉండాలని కోరారు. కానీ కెన్ తన క్యాబిన్‌కు తిరిగి వచ్చాడు. నాకు ఏం కాదు 102 ఏళ్లు బతుకుతాను అంటున్నాడు కెన్. చదవండి: అవును నా ఇంట్లో దెయ్యాలున్నాయి.. తరిమేశాను: నటి పొరపాటున వేరే వారి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..! చేతి సైగతో మృగాడి చెర నుంచి తప్పించుకుంది... -
సామాన్యుడిని భయపెడుతున్న చమురు, గ్యాస్ ధరలు
-
చెత్త తో గ్యాస్
-
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధరలు
-
రష్యాలో ప్రాజెక్టులు,15 బిలియన్ డాలర్లు దాటిన భారత్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్, రష్యా ద్వైపాక్షిక ఇంధన సహకార బలోపేతంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి, రష్యా ఇంధన మంత్రి నికోలయ్ షుల్గినోవ్‌తో శుక్రవారం వీడియో సమావేశం నిర్వహించారు. రష్యాలోని ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులపై భారత్ పెట్టుబడులు 15 బిలియన్ డాలర్లను మించడం గమనార్హం. అలాగే రష్యాకు చెందిన రోజ్‌నెఫ్ట్ భారత్‌కు చెందిన ఎస్సార్ ఆయిల్‌ను 2017లో 12.9 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయడం తెలిసిందే. ఇంధన సహకార విస్తృతిపై నికోలయ్‌తో చర్చలు నిర్వహించినట్టు కేంద్ర మంత్రి పురి ట్వీట్ చేశారు. రష్యాలోని ప్రాజెక్టులపై భారత చమురు సంస్థల పెట్టుబడులను, ఎల్ఎన్జీ, ముడి చమురు సరఫరాను సమీక్షించినట్టు ప్రకటించారు. భారత ఇంధన రంగంలో రష్యా అతిపెద్ద పెట్టుబడిగా ఉన్నట్టు పేర్కొన్నారు. చదవండి : ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు -
బతికేదెట్టా...?
-
తెలంగాణ: చౌకగా ఇంటి, వాహన గ్యాస్..
హైదరాబాద్: టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆ టెక్నాలజీని అభివృద్ధి చేసి కొత్త పుంతలు తొక్కిస్తోంది. పటిష్టమైన ప్రణాళికతో ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా నేరుగా పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు మేఘా గ్యాస్‌ను సరఫరా చేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి నేరుగా గ్యాస్‌ను సరఫరా చేయడంతో పాటు వాహన అవసరాలకు ఇంధనాన్ని అందిస్తోంది. ఈ మేఘా టెక్నాలజీతో సమయం ఆదాతో పాటు వినియోగదారులకు సులభంగా, సురక్షితంగా గ్యాస్ అందిస్తోంది. ఒక వైపు ఆకాశాన్నంటిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. మరో వైపు పరుగులు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లతో పేద, మధ్యతరగతి గృహ వినియోగదారులు భారం మోయలేకపోతున్నారు. ఆ భారాన్ని తగ్గించి వారికి ఊరటనివ్వడానికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ కృషి చేస్తోంది. పక్కా ప్రణాళికతో శరవేగంగా సీజీడీ, సీఎన్జీ గ్యాస్ స్టేషన్లను నిర్మించి మధ్యతరగతి ప్రజలకు భారం తగ్గిస్తోంది. ఎల్పీజీ సిలిండర్ ధరలతో పోలిస్తే 40 శాతం తక్కువ రేటుకు మేఘా గ్యాస్‌ను ఎంఈఐఎల్ అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ర్టాల్లో ఇప్పటికే గ్యాస్ ను సరఫరా చేస్తున్న ఎంఈఐఎల్ సంస్థ ఇప్పుడు తెలంగాణాలో తన సేవలను విస్తరిస్తోంది. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో సేవలను ఇటీవలనే ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంటికి వాణిజ్య పరంగా వంటగ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చిన సీజీడీ (City Gas Distribution) ప్రాజెక్ట్‌లో భాగంగా మేఘా ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక ప్రాంతాల్లో పనులను పూర్తి చేసి మేఘా గ్యాస్ కింద గ్యాస్ సరఫరా సేవలను చౌకదరలకు అందిస్తోంది. 5000 కోట్లతో ఈ మూడు రాష్ర్టాలలో కలిపి మొత్తం 11 లక్షల గ్రహాలకు గ్యాస్ సరఫరా కనెక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ సిజిడి వ్యవస్థ ద్వారా దాదాపు 4 వేల మంది ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నారు. నల్గొండ జిల్లాలో తొలిసారిగా గ్యాస్ పైప్ లైన్, సిటీ గేట్ స్టేషన్, పనులను గడువులోగా పూర్తి చేసి నల్గొండ ప్రజలకు 'మేఘా గ్యాస్' కింద చౌక ధరలకు గ్యాస్ సరఫరా చేస్తోంది. సీజీడీ - నల్గొండ ప్రాజెక్ట్ లో భాగంగా నల్గొండ జిల్లాలోని వెలిగొండ మండలం, సుంకిషాల గ్రామంలో సహజవాయువు సరఫరా లో కీలకమైన సిటీ గేట్ స్టేషన్ (CGS), మదర్ స్టేషన్ ను ప్రారంభించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్యాస్ సరఫరా సేవలను అందిస్తోంది మేఘా సంస్థ. వ్యయ ప్రయాసలు తగ్గించి సులభంగా ఇంటింటికి గ్యాస్ అందే విధంగా ‘మేఘా గ్యాస్’ పటిష్టమైన ప్రణాళికతో మౌళిక వసతులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ర్టాల్లోని వివిధ జిల్లాలో అమలు చేస్తున్నట్లు మేఘా గ్యాస్ బిజినెస్ హెడ్ పలింపాటి వెంకటేశ్ తెలిపారు. ప్రజల అవసరాల దృష్ట్యా గ్యాస్ సిటీ గేట్ స్టేషన్ ద్వారా PNG ( piped natural gas) గృహ, పారిశ్రామిక అవసరాలకు, అలాగే మదర్ స్టేషన్ ద్వారా సీఎన్జీ (compressed Natural Gas) ని వాహన అవసరాల కోసం అందుబాటులోకి తీసుకురావడం ఎంతో గర్వకారణమన్నారు. దీనితో నల్గొండ జిల్లాలో మరో 10 స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పటికే 32 km స్టీల్ పైప్ లైన్ వేయగా, మరో 80 కి.మీ పైప్ లైన్ పనులు కొనసాగుతున్నాయి. 40,000 కుటుంబాలకు, పరిశ్రమలకు గ్యాస్ సరఫరా చేసే ఉద్దేశ్యం తో ఇంకా 500 కి.మీ పొడవు గల ఎండీపీఈ పైప్ లైన్ నిర్మాణము చేపడుతోంది. అంతే కాకుండా మేఘా సంస్థ నల్గొండ జిల్లాలో బిబినగర్, భువనగిరి, చౌటుప్పల్, చిట్యాల, నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ, మల్లేపల్లి, సూర్యాపేట మరియు కోదాడ లలో 10 సీఎన్జీ స్టేషన్లు నిర్మిస్తున్నారు. సిజిడి ప్రాజెక్ట్‌లో భాగంగా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేయడానికి ఉమ్మడి నల్గొండతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పైప్ లైన్ నిర్మాణంతో పాటు 20 సిఎన్జి స్టేషన్లను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు. ఎంఈఐఎల్ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, కర్నాటకలోని తూంకూరు - బెల్గాం జిల్లాలలో గ్యాస్ సరఫరాను ఇప్పటికే ప్రారంభించింది. కృష్ణా జిల్లాలోని నున్న సమీపంలో సిటి గ్యేట్ స్టేషన్ ద్వారా, అలాగే తూంకూరు - బెల్గాం జిల్లాల్లోనూ గ్యాస్ ప్రాజెక్ట్ ను ప్రారంభించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ - వాణిజ్య అవసరాలకు నేరుగా గ్యాస్ సరఫరా చేయటం ద్వారా ఏకో ఫ్రెండ్లీ పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు అవసరమైన గ్యాస్‌ను ఓఎన్జీసీ - గెయిల్ నుంచి పొందనుంది. మేఘా గ్యాస్ ‘ఇట్స్ స్మార్ట్ - ఇట్స్ గుడ్’ అనే ట్యాగ్ లైన్ తో తన సేవలను విస్తరిస్తున్న మేఘా గ్యాస్ గృహాలు - వాణిజ్య సంస్థలు - పారిశ్రామిక సంస్థలతో పాటు రవాణా వాహనాలకు సహజ వాయువును సరసమైన ధరకు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసిన మదర్ స్టేషన్ నుంచి గ్యాస్‌ను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు స్టీల్ - ఎండిపీ ఈ పైప్‌లను 722 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసారు కర్ణాటకలోని తూంకూరు జిల్లాలో కూడా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేస్తోంది. వక్కోడి - హెగ్గేరి - గోళ్లహళ్లి - గొల్లరహతి - కుప్పూరు - దసముద్దేప్యా - సిరగతే - దిబ్బుర్ - గుళురు - సంతపేట - మరురూర్ దీన్నే - శేట్టిహళ్లి - జయనగర్ - గోకుల్ ఎక్స్ టెన్షన్ - ఖ్యాతిసాండ్రా - హీరేహళ్లి ఏరియా - మంచికల్ కుప్పె - బట్వాడీ - హనుమంతపురలో 595 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేసింది. అలాగే బెల్గామ్ జిల్లాలో బసవన్న కోళ్ల - ఆటోనగర్ - రాంతీర్థనగర్ - అశోక సర్కిల్ - ఆజాద్ నగర్ - చెన్నమ్మ సర్కిల్ - మారుతీ నగర్ - సదాశివ నగర్ తదితర ప్రాంతాల్లో 460 కిలోమీటర్ల మేర స్టీల్ - ఎండిపీ ఈ పైప్ లైన్ వేశారు. చదవండి: వీధి కుక్కలంటే అందరికి భయం.. కానీ ఆమెకు కాదు! ప్రముఖ హిప్నాటిస్ట్ కమలాకర్ కన్నుమూత -
గ్యాస్ షేర్లు గెలాప్!
దేశీయంగా పెరగనున్న గ్యాస్ లభ్యత, పర్యావరణానుకూల శుద్ధ ఇంధనాలకు కనిపిస్తున్న డిమాండ్ తదితర అంశాలు ఎల్ఎన్జీ, సీఎన్జీ, ఎల్పీజీ సంస్థలకు లబ్ధి చేకూర్చనున్నాయి. దేశవ్యాప్తంగా గ్యాస్ రవాణాకు అనువుగా ఏర్పాటవుతున్న మరిన్ని పైప్‌లైన్ నిర్మాణాలు ఇందుకు మద్దతివ్వనున్నాయి. వెరసి భవిష్యత్‌లో గ్యాస్ సంబంధ కంపెనీల షేర్లకు గిరాకీ పెరిగే వీలున్నట్లు స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముంబై: రానున్న కొన్నేళ్లలో పలు పట్టణాలను కలుపుతూ గ్యాస్ రవాణాకు అనువుగా పైప్లైన్లు ఏర్పాటవుతున్నాయి. దీనికితోడు దేశ, విదేశీ మార్కెట్లలో గ్యాస్ లభ్యత పెరగనుంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వాలు పర్యావరణహిత ఇంధనాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. వెరసి ఇకపై అటు గ్యాస్, ఇటు ఇంధన రవాణా కంపెనీలకు డిమాండ్ ఊపందుకోనున్నట్లు విశ్లేషకులు ఊహిస్తున్నారు. రానున్న రెండేళ్లలో అంటే 2023–24కల్లా దేశీయంగా అదనపు గ్యాస్ ఉత్పత్తి గరిష్టంగా రోజుకి 40 మిలియన్ మెట్రిక్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ)కు చేరే వీలున్నట్లు మోతీలా ల్ ఓస్వాల్ రీసెర్చ్ నివేదిక అభిప్రాయపడింది. ఇందుకు కేజీ బేసిన్లో బావుల నుంచి గ్యాస్ ఉత్పాదకత పెరిగే అంచనాలు జత కలిసినట్లు పేర్కొంది. ఆర్ఐఎల్ రెడీ రెండేళ్లలో ప్రైవేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ 28 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే వీలున్నట్లు మోతీలాల్ నివేదిక పేర్కొంది. దీనిలో 12.5 ఎంఎంఎస్‌సీఎండీని వేలం వేయనున్నట్లు తెలియజేసింది. దీనిలో 4.8 ఎంఎంఎస్‌సీఎండీని జామ్‌నగర్ రిఫైనరీలకోసం వినియోగించనున్నట్లు వివరించింది. ఇక మిగిలిన 12 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ ఉత్పత్తి చేసే అవకాశమున్నట్లు నివేదిక పేర్కొంది. రానున్న కాలంలో ప్రధానంగా ఎరువులు, రిఫైనింగ్–పెట్రోకెమికల్స్, సిటీగ్యాస్ పంపిణీ రంగాల నుంచి ఇంధనానికి అధిక డిమాండ్ కనిపించనున్నట్లు అంచనా వేసింది. తాజాగా పెరిగిన జోరు... రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ నివేదిక ప్రకారం దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి గత రెండు నెలల్లో 6 శాతం అంటే 4.6 ఎంఎంఎస్‌సీఎండీ పుంజుకుని ఈ జనవరికల్లా 82.3 ఎంఎంఎస్‌సీఎండీకి చేరింది. ఇందుకు తూర్పుతీర సముద్ర క్షేత్రాల నుంచి 4.4 ఎంఎంఎస్‌సీఎండీ ఉత్పత్తి పెరగడంతో 5.9 ఎంఎంఎస్‌సీఎండీకి గ్యాస్ లభ్యత చేరింది. ఆర్ఐఎల్–బీపీ క్షేత్రాలు ఇందుకు దోహదపడ్డాయి. ఎల్ఎన్జీ ట్రక్కులు పెరగడం ద్వారా రానున్న దశాబ్ద కాలంలో వార్షికంగా మరో 8–10 మిలియన్ మెట్రిక్ టన్నులకు డిమాండ్ జత కలిసే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. గ్యాస్ లభ్యత, వినియోగం పుంజుకోవడం ద్వారా గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ (జీఎస్పీఎల్), గెయిల్ వంటి ఇంధన రవాణా కంపెనీలకు మేలు చేకూరనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. సామర్థ్యం ఇలా... ప్రస్తుతం వార్షికంగా దేశీ ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ సామర్థ్యం 42.5 ఎంఎంటీపీఏగా నమోదైంది. అయితే 2020లో 30 ఎంఎంటీపీఏ మాత్రమే రీగ్యాసిఫికేషన్ జరిగింది. ఇందుకు కొన్ని తాత్కాలిక అవాంతరాలు ఎదురైనట్లు నిపుణులు వెల్లడించారు. కాగా.. మరోవైపు దహేజ్, ధమ్రా, జైగఢ్ తదితర ప్రాంతాలలో ఏర్పాటవుతున్న టెర్మినళ్ల ద్వారా 24 ఎంఎంటీపీఏ అందుబాటులోకి రానుంది. ఇది పెట్రోనెట్ ఎల్ఎన్జీకి దన్నునివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే అంతిమ వినియోగదారులకు గ్యాస్‌ను అందించవలసి ఉన్నట్లు చె ప్పారు. ఇందుకు అనుగుణంగా జీఎస్పీఎల్ కొన్ని కీలక పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రస్తావించారు. వీటిలో దహేజ్–భాధుట్, అంజార్–చోటిల్లా, అంజార్–పలన్‌పూర్‌ను పేర్కొన్నారు. ఈ బాటలో 2021 జూలైకల్లా సిద్ధంకానున్న మెహశానా –భటిండా పైప్‌లైన్ వల్ల గుజరాత్ వెలుపలి గ్యాస్‌ను రవాణా చేసేందుకు వీలుంటుందని చెప్పారు. -
గ్యాస్‌తో పంటకు నీరంట..!
రాజాం: రైతులు కొత్త కొత్త పద్ధతులు అన్వేషిస్తున్నారు. రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన ఎందువ మోహనరావు తన పంటపొలంలో మొక్కజొన్న పంటకు సాగునీరు అందించేందుకు వినూత్న విధానాన్ని అవలంబించారు. తన వద్ద ఉన్న ఆయిల్ ఇంజిన్‌కు వంట గ్యాస్ సిలిండర్ జతచేసి ఎంచక్కా ఇంజిన్ సాయంతో మడ్డువలస కాలువలో నీటిని పంటపొలానికి తరలించారు. ఎకరా మొక్కజొన్న పంటకు 4 కిలోల గ్యాస్ సాయంతో నీరు పెట్టుకోవచ్చని రైతు ‘సాక్షి’కి తెలిపారు. తన స్నేహితుల వద్ద ఈ విధానాన్ని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: రసవత్తర పోరు: మామా అల్లుళ్ల సవాల్) వినూత్నం: బాయిలర్ కోడి, పెరుగు ప్యాకెట్లు -
గ్యాస్ ఇన్ఫ్రాపై 60 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీయంగా గ్యాస్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు 2024 నాటికి 60 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 2030 నాటికి మొత్తం ఇంధనాల వినియోగంలో గ్యాస్ వాటాను 15 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇది 6 శాతంగా ఉంది. ‘పైప్లైన్లు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) టెర్మినల్స్, సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) నెట్‌వర్క్‌లు మొదలైన గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 2024 నాటికి 60 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయాలని నిర్దేశించుకున్నాం. గ్యాస్ ఆధారిత ఎకానమీగా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా లక్ష్యాలు పెట్టుకున్నాం‘ అని అసోచాం ఫౌండేషన్ డే వీక్ 2020 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. సీజీడీ ప్రాజెక్టులను 400 జిల్లాల్లోని 232 ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు ఆయన వివరించారు. దీంతో భౌగోళికంగా 53 శాతం ప్రాంతాల్లో, దేశ జనాభాలో 70 శాతం మందికి సీజీడీ అందుబాటులోకి రాగలదని ప్రధాన్ పేర్కొన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా 1,000 ఎల్ఎన్జీ ఫ్యూయల్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గత నెలలలోనే తొలిసారిగా 50 ఎల్ఎన్జీ ఇంధన స్టేషన్లకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో చండికోల్, పాదూర్‌లలో మరో 6.5 మిలియన్ టన్నుల వాణిజ్య–వ్యూహాత్మక పెట్రోలియం స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. -
జనవరి 1 నుండి మారబోయే అతి ముఖ్యమైనవి..
న్యూఢిల్లీ: చెక్ పేమెంట్ సంబంధించి మోసాలను అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2021 జనవరి 21 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురాబోతుంది. అలాగే ఎల్పీజీ సిలిండర్ ధరలు, జీఎస్టీ, యుపీఐ లావాదేవీల చెల్లింపు, వాట్సాప్ వంటి ఇలా సామాన్యుల జీవితాల్లో బాగా ప్రభావం చూపే చాలా నిబంధనలు జనవరి 1 నుంచి మారబోతున్నాయి. 2021 జనవరి 1 నుంచి రాబోయే కొత్త నిబంధనలు సామాన్యుని జీవితాన్ని బాగా ప్రభావితం చేయబోతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు ఈ మార్పుల గురుంచి తెలుసుకోవడం చాలా ముఖ్యం. జనవరి 1 నుండి మారబోయే అతి ముఖ్యమైన కొన్ని నియమాలు ఇక్కడ ఉన్నాయి. చెక్ పేమెంట్ సంబంధించి మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021 జనవరి 21 నుండి 'పాజిటివ్ పే సిస్టం' పేరిట కొత్త నిబంధనలు తీసుకురాబోతుంది. ఈ నూతన నిబంధన ద్వారా రూ.50 వేలకు పైబడిన చెక్ ఇచ్చినప్పుడు రీ కన్ఫర్మేషన్ చేసుకోవడం తప్పనిసరి చేసింది. ఇది వినియోగదారుడి అభీష్టానుసారం ఉంటుంది. అలాగే రూ.5 లక్షలకు మించి అంతకంటే ఎక్కువ మొత్తానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో చెక్కులను తప్పనిసరి చేయాలని బ్యాంకులకు సూచించింది. కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఆర్బిఐ వాటి చెల్లింపుల పరిమితిని పెంచనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనలు 2021 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న లావాదేవీల పరిమితిని రూ.2,000 నుంచి రూ.5 వేలకు పెంచనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో ఈ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వాట్సాప్ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్స్‌ని ఉపయోగించుకునేందుకు వినియోగదారులు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించాలని పేర్కొంది. ఇందుకోసం ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9 కన్న పాత ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తున్న మొబైల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిపివేయనున్నట్లు సంస్థ పేర్కొంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల నేపథ్యంలో ప్రతికూల ప్రభావాన్ని అధిగమించడానికి కారు కంపెనీలైన మహీంద్రా, మారుతి సుజుకి ఇండియా కంపెనీలు తమ వాహనాల ధరలను జనవరి 1 నుండి పెంచనున్నట్లు తెలిపాయి. దేశంలో ల్యాండ్లైన్ల నుండి మొబైల్ ఫోన్లకు కాల్ చేయడానికి త్వరలో '0' నెంబర్ ను జోడించాల్సి ఉంటుంది అని ట్రాయ్ తెలిపింది. కొత్త వ్యవస్థను అమలు చేయడానికి జనవరి 1లోగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని టెల్కోస్‌ను టెలికాం విభాగం కోరింది. జనవరి 1, 2021 నుండి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 1, 2017లోపు అమ్మిన ఎం, ఎన్ క్లాస్ నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది. దీని కోసం 1989 సెంట్రల్ మోటారు వాహనాల నియమాలు సవరించారు. దీనికి సంబంధించి నవంబర్ 6న మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే నుండి లావాదేవీలపై వినియోగదారులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 1 నుండి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు నిర్వహిస్తున్న యుపీఐ చెల్లింపు సేవ (యుపీఐ చెల్లింపు) పై అదనపు ఛార్జీ విధించాలని ఎన్పీసీఐ నిర్ణయించినట్లు తెలిసింది. కొత్త సంవత్సరం నుంచి థర్డ్ పార్టీ యాప్‌లపై ఎన్పీసీఐ 30 శాతం పరిమితిని విధించింది. ఈ ఛార్జీని చెల్లించడానికి పేటీమ్ అవసరం. గూగుల్ తన పేమెంట్ అప్లికేషన్ గూగుల్ పే వెబ్ యాప్‌ని 2021 జనవరి1 నుంచి నిలిపివేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే గూగుల్ పే ఇన్స్టంట్ మనీ ట్రాన్స్ఫర్ పేమెంట్ సిస్టమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీని వల్ల చెల్లింపులు చేసినప్పుడు మనీ ట్రాన్స్ఫర్ కోసం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మరీ ఈ విషయంపై గూగుల్ స్పందించలేదు. చమురు మార్కెటింగ్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి రేట్లను బట్టి ప్రతి నెల మొదటి రోజు ఎల్పీజీ ధరలను సవరించనున్నారు. ఈ కొత్త నిబంధన 2021 జనవరి 1 నుంచి అమలులకి రానుంది. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారాలు ప్రస్తుతం ట్రేడర్లు ఏడాదికి 12 రిటర్న్స్ దాఖలు చేసే బదులుగా జనవరి1 నుంచి నాలుగు జీఎస్టీ సేల్స్ రిటర్న్స్ దాఖలు చేస్తే సరిపోతుంది. కొత్త రూల్స్ అమలులోకి వచ్చినప్పటి నుండి పన్ను చెల్లింపుదారులు కేవలం 8 రిటర్న్స్ మాత్రమే దాఖలు చేయొచ్చు. ఇందులో 4 జీఎస్టీఆర్ 3జీ, 4 జీఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఉంటాయి. దీంతో 94 లక్షల జీఎస్టీ చెల్లింపుదారులకు ఊరట కలుగనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎక్కువ మంది చిన్న వ్యాపారులకి ఊరట కలగడం విశేషం. -
గ్యాస్ ఇన్‌ఫ్రాలోకి పెట్టుబడులు..
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల స్వచ్ఛ ఇంధనాల వినియోగాన్ని పెంచడంపై కేంద్రం మరింతగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో 66 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో గ్యాస్ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. జాతీయ గ్రిడ్ ఏర్పాటు కోసం ప్రస్తుతమున్న 16,800 కి.మీ. నెట్‌వర్క్‌కు అదనంగా మరో 14,700 కి.మీ. మేర గ్యాస్ పైప్లైన్లను నిర్మించే ప్రక్రియ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటాను 2030 కల్లా 15 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు కేపీఎంజీ ఇండియా నిర్వహించిన ఎన్రిచ్ 2020లో వార్షిక ఇంధన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి వివరించారు. ప్రస్తుతం ఇది 6.3 శాతంగా ఉంది. పశ్చిమ, తూర్పు తీరాల్లో ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతికి టెర్మినల్స్‌ను పెంచుకోవడంపైనా కసరత్తు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ట్రక్కులు, బస్సులకు కూడా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)తో పాటు ఎల్ఎన్జీని కూడా ఇంధనంగా వినియోగించడాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఇక పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని 2022 నాటికి 175 గిగావాట్లు, 2030 నాటికి 450 గిగావాట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఇరాన్ చమురుకు అవకాశం లభించాలి ఇరాన్, వెనెజులా నుంచి చమురు దిగుమతులను పునరుద్ధరించే దిశగా అమెరికా కొత్త ప్రభుత్వం తగు నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రధాన్ చెప్పారు. దీనివల్ల మరిన్ని ప్రాంతాల నుంచి కొనుగోళ్లు జరిపేందుకు భారత్‌కు అవకాశం లభించగలదని తెలిపారు. చమురు క్షేత్రాలపై ఎక్సాన్ ఆసక్తి భారత్‌లోని చమురు, గ్యాస్ క్షేత్రాల్లో వాటాల కొనుగోలుకు ఎక్సాన్ మొబిల్ చర్చలు జరుపుతోందని ప్రధాన్ చెప్పారు. ఆఫ్‌షోర్ బ్లాక్‌ల అభివృద్ధిలో సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు ప్రభుత్వ రంగ ఓఎన్జీసీతో ఎక్సాన్ మొబిల్ గతేడాదే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
టారిఫ్‌ల సవరణ: గ్యాస్ షేర్లు రయ్రయ్
ముంబై, సాక్షి: గ్యాస్ రవాణా టారిఫ్‌లకు సంబంధించి పెట్రోలియం, సహజవాయు నియంత్రణ సంస్థ(పీఎన్జీఆర్బీ) తాజాగా సవరణలు ప్రకటించింది. యూనిఫైడ్ గ్యాస్ ప్రసార టారిఫ్‌లను సరళీకరిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. రెండు జోన్ల స్ట్రక్చర్ ఆధారంగా గ్యాస్ లభ్యత, దూరాలకు అనుగుణంగా సవరణలు చేపట్టింది. తద్వారా దూరప్రాంత వినియోగదారులకు ఇంధన ధరలు తగ్గే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. గ్యాస్ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడులు పెరుగుతాయని తెలియజేశాయి. జాతీయ గ్రిడ్‌కు అనుసంధానమైన సుమారు 12 పైప్లైన్లకు సంబంధించి యూనిఫైడ్ టారిఫ్‌ల సరళీకరణకు పీఎన్జీఆర్బీ తెరతీసినట్లు వివరించాయి. దీంతో గ్యాస్ పంపిణీ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ కంపెనీల షేర్లన్నీ భారీ లాభాలతో దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం.. చదవండి: (మార్కెట్లు వీక్- షుగర్ షేర్లు స్వీట్) యమస్పీడ్.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో గుజరాత్ స్టేట్ పెట్రోనెట్(జీఎస్పీఎల్), అదానీ గ్యాస్, మహానగర్ గ్యాస్, గుజరాత్ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్ కౌంటర్లు ఆటుపోట్ల మార్కెట్లోనూ సందడి చేస్తున్నాయి. తొలుత రూ. 228ను అధిగమించిన జీఎస్పీఎల్ షేరు ప్రస్తుతం 9.25 శాతం ఎగసి రూ. 225 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో ఇంద్రప్రస్థ గ్యాస్ 13 శాతం దూసుకెళ్లి రూ. 505 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 515కు చేరింది. ఇక తొలుత రూ. 1,058కు చేరిన మహానగర్ గ్యాస్ 12.4 శాతం జంప్‌చేసి రూ. 1,044 వద్ద కదులుతోంది. అదానీ గ్యాస్ తొలుత 9 శాతం వృద్ధితో రూ. 345కు చేరింది. ప్రస్తుతం 4.3 శాతం లాభంతో రూ. 330 వద్ద ట్రేడవుతోంది. ఇదేవిధంగా గుజరాత్ గ్యాస్ 5 శాతం బలపడి రూ. 360 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో దాదాపు 20 శాతం పురోగమించి రూ. 412ను దాటేసింది. కాగా.. గెయిల్ షేరు 1 శాతం లాభంతో రూ. 104 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 107కు చేరింది. -
‘ఏఎల్పీ’లో విష వాయువు!
సింగరేణికే ప్రతిష్టాత్మకంగా నిలిచిన అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో మూడోప్యానెల్ ఏర్పాటుకు బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. గనిలో బొగ్గు నిల్వలు పూర్తయిన రెండో ప్యానెల్లో విషవాయువుల తీవ్రత అదుపులోకి రాలేదు. ప్యానెల్లో బొగ్గుకు మంటలంటుకోవడంతో కార్బన్‌మోనాక్సైడ్(సీఓ) విషవాయువులు పెరిగిపోయాయి. మే 4న రెస్క్యూ సిబ్బంది సహాయంతో ప్యానెల్‌కు గోడలు కట్టి మూసివేశారు. అదే ప్యానెల్లో ఉన్న బొగ్గుకు ఆక్సిజన్ తగలకుండా ప్యానెల్‌కు సమాంతరంగా బోర్వెల్స్వేసి సీఓటూ, నైట్రోజన్ పంపించారు. ఈ క్రమంలో ఈనెల 2న ప్యానెల్‌ను తిరిగి ఓపెన్ చేశారు. గోదావరిఖని(రామగుండం): రెండు నెలల అనంతరం గనిలోని రెండో ప్యానెల్‌ను రెస్క్యూ సిబ్బంది సాయంతో ఈనెల 2న తెరిచారు. మొదటి రెండు రోజుల్లో ప్యానెల్లో విషయవావుల ప్రభావం కన్పించలేదు. మూడో రోజు ఆదివారం నుంచి విషయవావులు పెరగడంతో బొగ్గు చల్లారనట్లుగా భావిస్తున్నారు. ఈక్రమంలో మండుతున్న బొగ్గు పొరలపై నీటిని చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. రూ. 145కోట్ల విలువైన చాక్స్ సింగరేణి సంస్థ రామగుండం రీజియన్‌లో అడ్య్రాల లాంగ్వాల్ ప్రాజెక్టులో రెండు ప్యానెళ్లలో బొగ్గును విజయవంతంగా వెలికితీశారు. మూడో ప్యానెల్ ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్న క్రమంలో రెండో ప్యానెల్లో ఉన్న యంత్రాలను మూడో ప్యానెల్లోకి తరలించేందుకు నిర్ణయించారు. ఈక్రమంలో లాంగ్వాల్ యంత్రానికి సంబంధించి మిగితా భాగాలు తరలించారు. హైడ్రాలిక్ చాక్స్ మాత్రం అందులోనే ఉండిపోయాయి. అందులో ఉన్న విషవాయులను అరికట్టేందుకు మే 4న ప్యానెల్‌కు గోడ పెట్టి మూసివేశారు. దీంతో రూ.145కోట్ల విలువచేసే 145హైడ్రాలిక్ చాక్స్ అందులోనే ఉండిపోయింది. విషవాయుల తీవ్రత పూర్తిగా తగ్గిన తర్వాత తిరిగి ప్రాపర్టీని వెలికితీయాలనే ఆలోచనతో యాజమాన్యం వేచి చూసింది. ఈనెల 2న రెస్క్యూ సిబ్బంది సాయంతో మూసివేసిన గోడలను తిరిగి ఓపెన్ చేశారు. ప్యానెల్లో మళ్లీ మొదలైన మంటలు.. అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో మూసివేసిన రెండో ప్యానెల్‌ను ఈనెల 2న రెస్క్యూ సిబ్బంది సాయంతో తెరిచారు. మొదటి రెండు రోజులు బాగానే ఉన్నప్పటికి మూడో రోజునుంచి అందులోంచి మళ్లీ వేడి రావడంతో పాటు విషయవాయువుల తీవ్రతను గుర్తించారు. దీంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. అందులో ఉన్న చాక్స్‌ను తొలగిస్తూ మంటలను అరికట్టే పనిలో నిమగ్నమైయ్యారు. అయితే తొందరపడి ప్యానెల్ గోడలు తొలగించారని దీంతో పాత పరిస్థితి పునరావృతం అయ్యిందని నిపుణులు అంటున్నారు. మరికొన్ని రోజులు ప్యానెల్ మూసివేసి ఉంటే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ కంట్రోల్ చేస్తూ చాక్స్ వెలికితీస్తాం: అధికారులు మూసివేసిన ప్యానెల్ తెరిచిన మాట వాస్తవమేనని, అందులో 145 హైడ్రాలిక్ చాక్స్ ఉన్నాయని, ప్యానెల్లో ఉన్న వేడిని తగ్గిస్తూ చాక్స్‌ను బయటకు తీసే ప్రయత్నంలో ఉన్నామని అధికారులు తెలిపారు. గనిలోని ప్యానెల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామన్నారు. ఒకవైపు మంటల తీవ్రతను తగ్గిసూ్తనే రోజుకు నాలుగుచొప్పున హైడ్రాలిక్ చాక్స్కు బయటకు తీస్తామని తెలిపారు. మరీ అదుపులోకి రాకుంటే తిరిగి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన అధికారులు రెస్క్యూ, వైద్య సిబ్బంది గనిపై నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వెల్లడించారు. -
గడువు దాటిన సిలిండర్లతో పొంచి ఉన్న ముప్పు
నిడమర్రు: వంట గ్యాస్ (ఎల్పీజీ)తో వంట చేసుకోవడం ఎంత సులువో సరైన జాగ్రత్తలు పాటించకపోతే అంతే ప్రమాదం పొంచి ఉంటుంది. మీ డీలర్ çసరఫరా చేసిన వంటగ్యాస్ సిలిండర్‌కు ఎక్స్‌పయిరీ తేదీ ఉంటుంది. ఎక్స్‌పయిరీ తేదీ అంటే ఆ సిలిండర్ వినియోగించడానికి గడువు పూర్తయిందని సూచన. గడువు దాటిన తర్వాత మీ ఇంటికి చేరే సిలిండర్లలో లీకేజీలు ఏర్పడవచ్చు, ప్రమాదం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వంట గ్యాస్ సిలిండర్‌ను ఫిల్లింగ్ చేసే మయంలో నిబంధనలు ఏమిటి..?, సిలిండర్ గడువు తీరిందని ఎలా గుర్తించాలి.. తదితర సమాచారం తెలుసుకుందాం.. సిలిండర్‌కు 10 ఏళ్ల గడువు చట్టప్రకారం వంట గ్యాస్ (ఎల్పీజీ )సిలిండర్ అన్ని భద్రతా ప్రమాణాల పరీక్షలు పూర్తి చేసుకున్న కొత్త సిలిండర్ గడువు 10 ఏళ్ల వరకూ ఉంటుంది. సిలిండర్ తయారీలో ప్రత్యేకమైన ఉక్కుతోనూ, సిలిండర్ లోపల సురక్షితమైన కోటింగ్‌తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాన్డర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాల మేరకు తయారు చేస్తుంటారు. చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ ప్లోజిన్స్, బీఐఎస్ అనుమతులు తప్పని సరిగా తీసుకున్నాకే సిలిండర్ అందుబాటులోకి వస్తుంది. ఒకసారి లోపాలు కనిపించిన వాటిని సరిచేసి బీఐఎస్ ధ్రువీకరణ తీసుకున్న సిలిండర్‌లో మరోసారి పరీక్షల సమయంలో లోపాలు కనిపిస్తే తక్షణం దాన్ని తుక్కు కింద పక్కన పెట్టాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ దానిలో గ్యాస్ నింపకూడదు. గడువు తేదీఎలా తెలుసుకోవాలి..? ఫలానా సంవత్సరం, ఫలానా నెలలో సిలిండర్ పరీక్షలకు వెళ్లాల్సి ఉందన్న సంకేతాన్ని సిలిండర్‌పై గుర్తించడం చాలా సులభం. సిలిండర్‌పై ఉన్న మెటల్ ప్లేట్లలో ఒకదానిపై లోపలివైపు ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు మీ ఇంట్లో సిలిండర్‌పై ఏ17 అని ఉందనుకోండి అదే ఎక్స్‌పయిరీ తేదీ అని గుర్తించాలి. 19 అంకె 2019 సంవత్సరాన్ని, అంగ్ల అక్షరం –ఎ మొదటి త్రైమాసికం అని అర్థం. అంటే 2019 మార్చిలోపు ఈ సిలిండర్ గడువు తేదీ ముగుస్తుంది. నెలను ఇలా గుర్తించాలి. ఎ– ( జనవరి నుంచి మార్చి) బి– (ఏప్రిల్ నుంచి జూన్) సి– (జులై నుంచి డిసెంబర్) మూడు నెలల గ్రేస్ పిరియడ్ ప్రతీ సిలిండర్‌పై ఉన్న గడువు తర్వాత మరో మూడు నెలలు గ్రేస్ పిరియడ్ ఉంటుంది. అంటే వినియోగదారుని దగ్గరకు వెళ్లిన సిలిండర్ తిరిగి డీలర్ వద్దకు చేరి అక్కడి నుంచి గ్యాస్ రీఫిల్లింగ్ స్టేషన్‌కు చేరుకునేందుకు వీలుగా ఈ గ్రేస్ పీరియడ్. అంతేగానీ కస్టమర్ వాడుకునేందుకుకాదు. అంటే ఏ–2019 గడువుతో ఉన్న సిలిండర్‌ను మార్చి నెల తర్వాత గ్యాస్ డీలర్ మీకు పంపిస్తే ఎట్టి పరిస్థితిల్లోనూ దీన్ని తీసుకోవద్దు. మరో సిలిండర్ కోరే హక్కు వినియోగదారుడికి ఉంది. కొంత మంది డీలర్లు గడువు తేదీని పెయింట్‌తో మార్చుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. వాటిని గమనించాలి. వినియోగదారుడి హక్కులు ♦ గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యుల పేరిట ఆకనెక్షన్‌ను మార్చుకోవచ్చు. ♦ బుక్ చేసిన ఏడు పనిదినాల్లోపు సిలిండర్‌ను కస్టమర్‌కు అందివ్వాలి ♦ కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే అదే రోజు కనెక్షన్ జారీ చేయాలి. ♦ కొత్తగా కనెక్షన్ తీసుకునే సమయంలో డీలర్ స్టవ్‌ను కూడా తీసుకోవమని అడుగుతుంటాడు. కానీ నిబంధనల ప్రకారం డీలర్ దగ్గరే స్టవ్ తీసుకోవాల్సిన అవసరంలేదు. ♦ వంటగ్యాస్‌ను వాహనాల కోసం వినియోగించడం చట్టరీత్యానేరం. దీనికి బదులు ఆటోగ్యాస్ కోనుగోలు చేసి వాడుకోవాలి. -
బ్రహ్మం..బ్రహ్మాండం
యాప్రాల్ : కృషి, పట్టుదల ఉంటే సామాన్యుడు సైతం అద్భుతాలు సృష్టిస్తాడు. అందుకు ఉదహరణే బాలాజి నగర్ నివాసి కొదురుపాక లింగబ్రహ్మం. ఇతను ఓ ఇంజనీరు అనుకుంటే పొరపాటే. చదివింది మూడో తరగతే. వరంగల్ జిల్లాలో ఓ మారుమూల గ్రామం ఎల్లాయిగూడెంలోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించి కంసాలి పని చేసుకుంటూ ఉండేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి బాలాజినగర్లో నివాసముంటున్నాడు. ఏదో ఒకటి చేయాలనే తపన ఎప్పటి నుంచో బ్రహ్మం మనసులో పడింది. బొగ్గు, విద్యుత్‌తో పని చేసే ఇస్త్రీ పెట్టెల వల్ల ఖర్చు ఎక్కువగా అవుతుందని భావించి గ్యాస్‌తో పని చేసే ఇస్త్రీ పెట్టెను తయారు చేయాలనుకున్నాడు. స్నేహితులు, బంధువులు నిరుత్సాహపరిచినా పట్టు వీడలేదు. కుల వృత్తిని నిర్లక్ష్యం చేయడంతో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. అయినా అదే పనిగా 2004 సంవత్సరం నుండి 2005 సంవత్సరం వరకు సంవత్సరం పాటు కష్టపడి గ్యాస్‌తో పని చేసే ఇస్త్రీ పెట్టెను తయారు చేసి తన లక్ష్యాన్ని సాధించాడు. ఇతను రూపొందించిన ఇస్త్రీ పెట్టె ఎల్పీజీ గ్యాస్‌తో పని చేస్తూ రెండు నిమిషాలలోనే వేడెక్కుతుంది. గ్యాస్ ఖర్చు రోజంతా ఇస్త్రీ చేస్తే 8 నుండి 10 రూపాయల వరకు అవుతుందని బ్రహ్మం తెలిపారు. ఇతని ప్రతిభను గుర్తించి అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్నోవేషంట్ ఫౌండేషన్ వారు గుర్తింపు పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ప్రొత్సహిస్తే బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పిస్తే గ్యాస్‌తో కూడిన ఇస్త్రీ పెట్టెల తయారి కర్మాగారాన్ని నిర్మిస్తానని బ్రహ్మం తెలిపారు. -
గ్యాస్ ట్రబుల్ మందులతో కిడ్నీకి చేటు..
కడుపు ఉబ్బరంగా ఉందనిపిస్తే చాలు.. చాలామంది ఒమీప్రొజోల్, మెటాప్రొలోల్ వంటి మందులు ఎడాపెడా వాడేస్తూంటారు. ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్లు అని పిలిచే ఈ మందుల వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సైంటిఫిక్ రిపోర్ట్స్ మ్యాగజైన్ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం.. పీపీఐ మందులతో పోలిస్తే హిస్టమైన్ –2 రకం మందులు తీసుకునే వారికి కిడ్నీ సమస్యలు తక్కువ. అమెరికాలో అందుబాటులో ఉన్న కోటి మంది రోగుల వివరాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు రూబెన్ అబగ్యాన్ అనే శాస్త్రవేత్త చెప్పారు. పీపీఐ మందులు మాత్రమే తీసుకున్న వారి వివరాలను పరిశీలిస్తే ఇతరులతో పోలిస్తే కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని చెప్పారు. కొంచెం స్పష్టంగా చెప్పాలంటే ఈ మందులు తీసుకునే ప్రతి ముగ్గురిలో ఒకరు తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడే అవకాశం ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. పీపీఐ మందులు అత్యవసరమైనప్పటికీ వాటితో ఈ సమస్యలున్నాయని స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని.. పైగా పీపీఐ పద్ధతిపై ఆధారపడని యాంటాసిడ్లు, హిస్టమైన్ –2 రకం మందులతో దుష్ఫలితాలు తక్కువన్న విషయాన్ని గుర్తించాలని వివరించారు. -
40వేల కోట్ల పెట్టుబడులు!!
న్యూఢిల్లీ: ఓపెన్ ఏకరేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ) కింద తలపెట్టిన రెండో విడత చమురు, గ్యాస్ బ్లాక్‌ల వేలం ద్వారా రూ. 40,000 కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా వేస్తున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. గతేడాది నిర్వహించిన తొలి విడతలో 55 బ్లాక్‌లు వేలం వేయగా రూ. 60,000 కోట్ల మేర పెట్టుబడులకు కమిట్మెంట్ లభించినట్లు ఆయన తెలియజేశారు. రెండో విడతలో 14 బ్లాక్‌లు ఉన్నట్లు సోమవారం వేలం ప్రక్రియ ప్రారంభించిన > మంత్రి చెప్పారు. మూడో విడత కింద 12 చమురు, గ్యాస్ బ్లాక్‌లు, అయిదు కోల్ బెడ్ మీథేన్ బ్లాక్‌ల వేలం వేయనున్నామని, ఈ ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభం కాగలదని ఆయన చెప్పారు. ఓఏఎల్‌పీ–2 కింద వేలం వేసే 14 బ్లాక్‌ల విస్తీర్ణం 29,333 చ.కి.మీ. ఉంటుందని, బిడ్ల దాఖలుకు మార్చి 12 తుది గడువుగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. 12,600 మిలియన్ టన్నుల నిక్షేపాలు.. కేజీ బేసిన్లో ఒక డీప్ వాటర్ బ్లాక్‌తో పాటు అండమాన్, కచ్ బేసిన్లో చెరి రెండు, మహానది బేసిన్లో ఒక బ్లాక్ వేలం వేస్తున్న వాటిలో ఉన్నాయి. ఈ 14 బ్లాక్‌లలో దాదాపు 12,609 మిలియన్ టన్నుల చమురు, తత్సమాన గ్యాస్ నిక్షేపాలు ఉండొచ్చని అంచనా. ఓఏఎల్‌పీ –1 లో మొత్తం 55 బ్లాకులు వేలం వేయగా వేదాంత సంస్థ 41 బ్లాకులు దక్కించుకుంది. మిగతావాటిలో ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ ఇండియా తొమ్మిది, ఓఎన్జీసీ కేవలం రెండు మాత్రమే దక్కించుకున్నాయి. ఈ 55 బ్లాక్‌ల విస్తీర్ణం 59,282 చ.కి.మీ. ఉంటుంది. ప్రస్తుతం ఉత్పత్తి, అన్వేషణ లైసెన్సు పరిధిలో లేని చిన్న స్థాయి చమురు, గ్యాస్ బ్లాక్‌లను తీసుకునేందుకు కంపెనీలు ఓఏఎల్‌పీ కింద తమ ఆసక్తిని (ఈవోఐ) వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఈ ఈవోఐల ఆధారంగా కేంద్రం ఏటా రెండు విడతలుగా వేలం నిర్వహిస్తుంది. ఉత్పత్తయ్యే చమురు, గ్యాస్‌లో ప్రభుత్వానికి అత్యధిక వాటా ఇచ్చే సంస్థకు బ్లాక్‌లు దక్కుతాయి. విదేశీ భాగస్వాములకు ఓకే.. సంక్లిష్ట క్షేత్రాల్లో ఇంధన ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా సంస్థలు ప్రైవేట్, విదేశీ సంస్థలను భాగస్వాములుగా చేసుకునేందుకు అనుమతించనున్నట్లు ప్రధాన్ వివరించారు. -
కాస్త తగ్గిన గ్యాస్‌భారం
విజయనగరం గంటస్తంభం: వంట గ్యాస్ విని యోగదారులకు కాస్తంత ఊరట కలిగింది. రాయితీ, రాయితీయేతర సిలిండర్ల ధర తగ్గిస్తూ చమురుసంస్థలు తీసుకున్న నిర్ణయం జిల్లావాసులను కాస్తంత ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఆరు నెలలుగా వరుసగా ధరలు పెరుగుతుండటంతో ఈ నెలలో తగ్గడం వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందనడంలో సం దేహం లేదు. జిల్లాలో ఏకంగా ప్రజలపై రూ. 22.40లక్షలు భారం తగ్గుతుండడం విశేషం. చమురుధరలు ప్రతి నెలా సమీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా చమురు సంస్థలు నెలాఖరున పెంచడంగానీ, తగ్గించడంగానీ చేస్తుంటాయి. ఇందులో భాగంగా డిసెంబర్ నెలకు సంబంధించి శుక్రవారం సమీక్షించిన చమురుసంస్థలు రూపా యి విలువ బలపడ్డంతో ధరలు తగ్గించాయి. తగ్గించిన ధరలుశుక్రవారం ఆర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. తగ్గింపు ఇలా... వంట గ్యాస్ సిలిండరు ధర విజయనగరంలో రూ.948లు ఉంది. 12 సిలిండర్ల వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తున్న విషయం విదితమే. ఈ మేరకు రాయితీ ధర సుమారు రూ.507లు పడుతోంది. రూ.441లు వరకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వడంతో గ్యాస్ విడుదల చేసిన తర్వాత వినియోగదారుల ఖాతాల్లో రాయితీ సొమ్ము జమవుతుంది. తాజాగా రాయితీ సిలిండర్‌పై రూ.6.52 తగ్గించడంతో జీఎస్టీతో కలిపి రూ.7 వరకు తగ్గనుంది. అంటే ఇకపై రూ.500లకే వస్తుందన్నమాట. అంటే గ్యాస్ విడుదల చేసిన తర్వాత రూ.448 వరకు ఖాతాల్లో పడనుంది. ఈ విధంగా జిల్లా వాసులపై రూ. 22.40వేల వరకూ భారం తగ్గనుంది. ఇదిలాఉండగా సబ్సడీ లేని సిలిండర్ ధర కూడా భారీగా తగ్గనుంది. ఒక్కో సిలిండర్‌పై రూ.133 తగ్గించారు. జీఎస్టీ 5శాతంతో కలిపితే రూ.138ల వరకు తగ్గుతుంది. సబ్సిడీ లేని సిలిండర్ల వినియోగం నామమాత్రంగా ఉండటంవల్ల వినియోగదారులకు పెద్దగా ఉపయోగం లేదు. ఎవరైనా విడుదల చేస్తే మాత్రం సుమారు రూ.148ల తగ్గుతుంది. రాయితీయేతర సిలిండర్ ధర తగ్గడంతో ప్రభుత్వానికి మాత్రం వినియోగదారులకు వేసే రాయితీ భారం తగ్గనుంది. ప్రస్తుతం ఇస్తున్న రాయితీ రూ.441లో రూ.148 తగ్గించి వినియోగదారులకు వేస్తారు. రాయితీ, రాయితీయేతర ధరల తగ్గింపు విషయం జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ, కంపెనీలను బట్టి కూడా «తేడా ఉంటుంది. జిల్లావాసులకుఉపశమనమే జిల్లాలో 6.15లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీరంతా నెలకు దాదాపు 3.20లక్షల గ్యాస్ బండలు వినియోగిస్తున్నారు. రాయితీ ధర రూ.7 వరకు తగ్గడంతో సుమారు రూ.22.40లక్షల వరకూ వినియోగదారులకు మిగులుతుంది. రాయితీయేతర సిలిండర్లు నెలకు 10వేల వరకు వినియోగించినా రూ.14.80లక్షలు ఆదా అవుతుంది. -
ముఖేష్ అంబానీని అరెస్టు చేయాలి
తాడితోట (రాజమహేంద్రవరం): జిల్లా నుంచి రూ. 19వేల కోట్ల విలువైన గ్యాస్‌ను చోరీ చేసిన ముఖేష్ అంబానీపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. అమలాపురం అయిల్ స్కాంలో నిందితులపై చర్యలు తీసుకునే హక్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని ఆయన పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను గతంలో ముఖేష్ అంబానీ దోపిడీపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానని, సుప్రీం కోర్టులో కేసు వేశానని తెలిపారు. ఈ ఆయిల్ స్కాం వాస్తమేనని కెనడాకు చెందిన సంస్థ నివేదిక ఇచ్చినా, కేంద్రం నియమించిన షా కమిటీ నిర్థారించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం స్పందించలేదని ఆరోపించారు. అమలాపురంలో ఆడుకుంటున్న పిల్లలపైకి హోం మంత్రి సోదరుడు సిద్ధప్ప నాయుడు కుక్కను ఉసిగొల్పడంతో 9వ తరగతి చదువుతున్న అరుణ్ కుమార్ మరణించాడన్నారు. అరుణ్ కుమార్ శరీరంపై 78 చోట్ల గాయాలు ఉన్నాయని పోస్టు మార్టం రిపోర్టులో వచ్చిందని తెలిపారు. అరుణ్ కుమార్ మృతికి కారకులైన వారికి పదేళ్ల జైలు శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. కాట్రావుల పల్లిలో దళిత యువకుడిపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయకపోతే ఈ నెల 16న కాట్రావులపల్లి నుంచి పాదయాత్ర నిర్వహించి జిల్లా జడ్జికి వినతి పత్రం అందిస్తామని తెలిపారు. కాకినాడలో వంశీధర్ అనే విలేకరికి జర్నలిస్ట్ హెల్త్ స్కీం కార్డు ఏమాత్రం పనికిరాకుండా పోయిందన్నారు. ఆ విలేకరి సొంత డబ్బుతో అత్యవసర వైద్యం చేయించుకున్నప్పటికీ ప్రాణాలు కోల్పోయాడన్నారు. దండోరా నాయకులు తుత్తరపూడి రమణ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ డెలివరీ చేయకుండానే చేసినట్లు ఎస్ఎంఎస్లు
అత్తాపూర్‌కు చెందిన సుభాషిణీ రెడ్డి ఈ నెల 4న తన మొబైల్ ద్వారా సిలిండర్‌ను బుక్ చేసింది. నాలుగు రోజులు తరువాత క్యాష్ మెమో కూడా జనరేట్ అయింది. అయితే సిలిండర్ ఇంటికి డెలివరి కాలేదు. విచిత్రమేమంటే 10వ తేదీన సిలిండర్ డెలివరీ అయినట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. దీంతో అవాక్కైన ఆమె డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించగా మరో సారి బుక్ చేయాలని ఉచిత సలహా ఇచ్చారు. సిలిండర్ రాకపోవడానికి కారణం మాత్రం సమాధానం చెప్పలేదు. దీంతో చేసేదిలేక ఆమె మరోసారి బుక్ చేయక తప్పలేదు. మూడు రోజుల్లో క్యాష్ మెమో జారీ అయింది.. కానీ. వారం గడుస్తున్నా సిలిండర్ మాత్రం ఇంటికి చేరలేదు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన గోపాల్ ఈనెల 15న గ్యాస్ బుక్ చేశారు. రెండు రోజుల్లో క్యాష్ మెమో జారీ అయింది. మూడు రోజుల తర్వాత బాయ్ సిలిండర్ ఇంటికి తీసుకొచ్చారు. మీ బుకింగ్ క్యాన్సిల్ అయింది. తిరిగి బుక్ చేస్తే తెచ్చిన సిలిండర్ డెలివరి చేసి వెళ్తానన్నాడు. చేసేది లేక బాయ్ ముందే మరోసారి మొబైల్ ద్వారా బుక్ చేయక తప్పలేదు. బుకింగ్ ఎస్ఎంఎస్ చూసి సిలిండర్ డెలవరీ చేసి వెళ్లాడు బాయ్. ఆ తరువాత సిలిండర్ డెలివరీ అయినట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. రెండో సారి బుకింగ్‌కు మరుసటిరోజు క్యాష్ మెమో జారీ అయింది. అ తర్వాత సిలిండర్ డెలవరీ ఎస్ఎంఎస్ వచ్చింది. అయితే సిలిండర్ మాత్రం రెండో సారి రాలేదు. సాక్షి, సిటి బ్యూరో : మహా నగరంలో ఇదీ గ్యాస్ వినియోగదారుల పరిస్థితి. ఏజెన్సీలు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపిస్తున్నారు. వంట గ్యాస్ ధర పెరిగే కొద్దీ డిస్ట్రిబ్యూటర్లు తెలివిమీరుతున్నారు. సబ్సిడీ పై వంట గ్యాస్ ఏడాదికి 12 సిలిండర్ల పరిమితి కారణంగా గ్యాస్ బుకింగ్‌కు బుకింగ్‌కు మధ్య ఒక గడువు అంటూ లేకుండా పోయింది. ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని తెప్పించుకునే వెసులు బాటు ఉంది. ఇక్కడే డీలర్లు చేతివాటం ప్రదర్శించి వినియోగదారుల సబ్సిడీ సిలిండర్ ఎత్తుకెళుతున్నారు. ఫలితంగా వాణిజ్య అవసరాల్లో గృహోపయోగ (డొమెస్టిక్) వంట గ్యాస్ రాజ్యమేలుతోంది. వాణిజ్య అవసరాలకూడొమెస్టిక్ సిలిండర్లు... ఇంటీవసరాలకు ఉపయోగపడాల్సిన వంట గ్యాస్ హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్ధల అవసరాలను తీరుస్తోంది. మహానగరంలో పెద్ద హోటల్స్ ఐదువేలకు పైగా ఉండగా, చిన్న చితక హోటల్స్, టీ, టిఫిన్, గరం మర్చి సెంటర్లు, బండీలు సుమారు లక్షల వరకు ఉంటాయన్నది అంచనా. పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్‌లో వాణిజ్య పరమైన సిలిండర్లు వినియోగమవుతుండగా, మిగిలినా చిన్నాచితకా హోటల్స్, బండీల్లో డొమెస్టిక్ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి...దీంతో ప్రతిరోజు లక్షకుపైగా డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్లు దారిమళ్లుతున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య కనెక్షన్లు అంతంతే.. మహా నగరంలోని హైదరాబాద్–రంగారెడ్డి –మేడ్చల్ జిల్లాలో కలిపి మూడు చమురు సంస్ధలకు చెందిన వాణిజ్య కనెక్షన్లు 50 వేలకు మించిలేవు. డొమెస్టిక్ మాత్రం 26.21 లక్షల వరకు ఉన్నాయి. నగరంలో మొత్తం 135 ఎల్పీజీ ఏజెన్సీలుండగా ప్రతిరోజు 1.20 లక్షవరకు డొమెస్టిక్ సిలిండర్ల డిమండ్ ఉంటుంది. కానీ, ప్రస్తుతం 60 వేలకు మించి డోర్ డెలివరి కావడం లేదు. వాణిజ్యఅవసరాలకు కొరత లేకుండా పోయింది. -
ఇంటింటికీ ‘మేఘా గ్యాస్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇన్ఫ్రా దిగ్గజం ‘మేఘా ఇంజనీరింగ్’ (ఎంఈఐఎల్)... గ్యాస్ సరఫరాలోకి ప్రవేశిస్తోంది. గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ను సరఫరా చేసే ప్రాజెక్ట్‌ను ఆంధప్రదేశ్‌లోని కృష్ణా, కర్ణాటకలోని తుముకూరు, బెల్గాం జిల్లాల్లో ఆరంభిస్తోంది. ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించామని, త్వరలో పూర్తిస్థాయి సరఫరా ఆరంభిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో సంస్థ తెలియజేసింది. గ్రామీణ ప్రాంతంలో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాలోకి అడుగుపెడుతున్న తొలి కంపెనీ ఇదే. ‘‘కృష్ణా జిల్లాలోని నున్న సమీపంలో ఆగిరిపల్లి, కానూరుల్లో ఫిల్లింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీనికి అవసరమైన భూగర్భ సరఫరా వ్యవస్థ కూడా సిద్ధమయింది. కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 571 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఇప్పటికే పూర్తయింది. తుముకూరు జిల్లాలో 300 కి.మీ., బెల్గాం జిల్లాలో 350 కిలోమీటర్ల భూగర్భ పైప్‌లైన్ కూడా గ్యాస్ సరఫరాకు సిద్ధమయింది. దీనికి అవసరమైన గ్యాస్‌ను ఓఎన్జీసీ–గెయిల్ నుంచి పొందేలా ఒప్పందం చేసుకుంటున్నాం’’ అని ఎంఈఐఎల్ హైడ్రోకార్బన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాజేశ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అందుబాటు ధరల్లో ఉండే ‘మేఘా గ్యాస్’ వాణిజ్య కార్యకలాపాలు... త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారాయన. రోజుకు 1.4 లక్షల ఘనపుటడుగుల గ్యాస్! గ్యాస్‌కోసం ఓఎన్జీసీ–గెయిల్‌తో ఒప్పందం చేసుకుంటున్నట్లు చెప్పిన రాజేశ్‌రెడ్డి... కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో ఓఎన్జీసీ ఇటీవలే వాణిజ్యపరమైన ఉత్పత్తి ఆరంభించినట్లు తెలియజేశారు. దీన్నుంచి స్థానిక సరఫరా కోసం రోజుకు 90వేల ఘనపుటడుగుల గ్యాస్‌ను సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. ఇక కర్ణాటకలోని రెండు జిల్లాలకూ రోజుకు 50వేల ఘనపుటడుగుల గ్యాస్‌ను సరఫరా చేస్తారు. ఇప్పటికే కొందరికి గ్యాస్ కనెక్షన్లు కూడా ఇచ్చామని, త్వరలో పూర్తిస్థాయి సరఫరా మొదలవుతుందని కంపెనీ తెలియజేసింది. వినియోగదారుల ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ను కూడా కంపెనీ రూపొందించింది. -
భారత్‌కు పెట్రోల్, గ్యాస్ అమ్మేందుకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: భారతదేశానికి పెట్రోల్, గ్యాస్ విక్రయించడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహనీ ప్రకటించారు. తమ దేశంలో చబహార్ ఓడరేవు ప్రారంభమైందని, దీని వల్ల భారత్‌కు రవాణా మార్గం దగ్గర అవుతుందని పేర్కొన్నారు. భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన రౌహనీ శుక్రవారం చారిత్రక మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు. అనంతరం ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇరాన్ ప్రజల తరఫున హైదరాబాద్ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నా నంటూ రౌహనీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఐక్యత లేకపోవడం వల్లే.. ఇస్లామిక్ దేశాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను అమెరికా ప్రకటించే సాహసం చేసిందని రౌహనీ విమర్శించారు. ముస్లింల మొదటి కిబ్లా(నమాజ్ చేసే వైపు) ఇప్పుడు ఇజ్రాయెల్ అధీనంలో ఉండటానికి ఇస్లామిక్ దేశాల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమన్నారు. ఇస్లామిక్ దేశాల మధ్య ఐక్యత లేనందున అమాయక పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంద న్నారు. పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికాలో మానవత్వం మంటగలుస్తోందని, అమెరికాలోని విద్యాలయాలు, వ్యాపార సంస్థల్లో అమాయకులపై దాడులు సర్వసాధారణం అయ్యాయన్నారు. ఇస్లామిక్ దేశాలు తమ వ్యక్తిగత విశ్వాసాలు, నమ్మకాలను పక్కన పెట్టి ఇస్లాం ఔన్నత్యాన్ని కాపాడేందుకు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. పాశ్చాత్య దేశాలు ముస్లింలను ఉగ్రవాదులుగా చూస్తున్నాయని ఇది సరికాదన్నారు. ముస్లింలు ఇస్లాం ధర్మాన్ని పాటించే వారని, ఇస్లాం వైషమ్యాలను, భయాందోళలను సృష్టించే మతం కాదని చెప్పారు. ఇరు దేశాల మధ్య కొత్త శకం.. భారత్–ఇరాన్ మధ్య వ్యాపార, ఆర్థిక సంబంధాల్లో కొత్త శకం ప్రారంభమవుతోందని రౌహనీ చెప్పారు. భారత్–ఇరాన్ మధ్య దశాబ్దాలుగా దౌత్య సంబంధాలు ఉన్నాయని, భారత్‌తో వ్యాపార, దౌత్య సంబంధాలను మరింత మెరుగు పరచుకోవడానికే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్యా సంబంధాలు వెస్ట్రన్ ఆసియా దేశాల మధ్య వ్యాపార, ఆర్థిక సంబంధాల ఎదుగు దలకు దోహదం చేస్తాయన్నారు. భారతదేశం ఓ పుష్పగుచ్ఛం లాంటి దని, ఓ పుష్పగుచ్ఛంలో అన్ని రకాల పువ్వులూ ఉంటాయని, అలాగే భారత్‌లో ఎన్నో మతాలు, కులాలు, తెగలు ఐకమత్యంతో ఉంటున్నా యని పేర్కొన్నారు. ఇరు దేశాలు టెక్నాలజీ, వైజ్ఞానిక రంగాల్లో సహాయ, సహకారాలు అందించుకోవాలని రౌహనీ సూచించారు. భారత్‌లో అన్ని వర్గాల మధ్య శాంతి, సామరస్యం ఎప్పటికీ కొన సాగాలని ఆకాంక్షించారు. పలు దేశాలు ఇరాన్ ప్రజలకు వీసాల జారీలో జాప్యం చేస్తున్నాయని, ఇరాన్ మాత్రం అన్ని దేశాలు ప్రత్యే కించి భారత ప్రజలకు వీసాల జారీని సులభతరం చేసిందన్నారు. -
నడిరోడ్డుపై బోల్తాపడ్డ గ్యాస్ ట్రక్కు.. భగ్గుమన్న మంటలు!
చైనాలో నడిరోడ్డు మీద పెనుప్రమాదం సంభవించింది. సహజ వాయువు (గ్యాస్)ను తరలిస్తున్న ట్రక్కు ఎక్స్‌ప్రెస్ హైవే మీద బోల్తా కొట్టడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఆ ట్రక్కు సమీపంలో ఉన్న వాహనాలకు మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
నడిరోడ్డు బోల్తాపడ్డ గ్యాస్ ట్రక్కు.. భగ్గుమన్న మంటలు!
-
గ్యాస్ బుకింగ్ వయా ఫేస్బుక్, ట్విటర్
న్యూఢిల్లీ : ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందా?. అయితే, మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ విధానంలో సిలిండర్‌ను బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు!. డిజిటలైజేషన్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫేస్బుక్, ట్విటర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే సదుపాయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) కల్పించింది. ఫేస్‘బుక్’లో ఇలా.. ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయిన అనంతరం ఐఓసీఎల్ అధికారిక పేజీ (@indianoilcorplimited)కి వెళ్లి, అక్కడ కనిపిస్తున్న బుక్ నౌ (Book Now) అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. తర్వాత మీ వివరాలను నింపితే సరి. ట్విటర్లో ఇలా.. ట్విటర్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ విషయానికొస్తే, లాగిన్ అయిన అనంతరం refill @indanerefill అని ట్వీట్ చేయాల్సి వుంటుంది. అయితే, ట్విటర్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకోవడం తొలిసారైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సివుంటుంది. ఇందుకోసం register LPGID అని ట్వీట్ చేయాలి. సామాజిక మాధ్యమాల వినియోగం విస్తృతమవుతున్న తరుణంలో ప్రజలకు సేవలను సునాయాసంగా అందజేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. -
అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్
బనశంకరి: అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్న కేంద్రంపై సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.వారి నుంచి 116 గ్యాస్ సిలిండర్లు, రీఫిల్లింగ్ రాడ్లు, గ్యాస్ తూకం యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరహళ్లి ప్రధాన రహదారిలోని కోడిపాళ్య గోదాములో వంట గ్యాస్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లలోకి గ్యాస్‌ను రీ ఫిల్లింగ్ చేస్తున్నట్లు సీసీబీ పోలీసులకు పక్కాసమాచారం అందింది. దీని ఆధారంగా బుధవారం దాడిచేసి నిర్వాహకులైన బాగేపల్లి తాలూకా చేలూరుకు చెందిన సునీల్‌కుమార్, కనకపుర పైప్‌లైన్ రోడ్డు నివాసి శివరాజు, గవిపురం గుట్టహళ్లికి చెందిన లక్ష్మణ్గౌడను అరెస్ట్ చేశారు. సిలిండర్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకొని నిందితులపై కెంగేరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రత్నగిరిపై బయో గ్యాస్‌ప్లాంట్
35.49 లక్షలతో ఏర్పాటుకు చర్యలు కొండదిగువన గోశాలలో రెండు షెడ్ల నిర్మాణం దేవస్థానం కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ పాలకమండలి సమావేశంలో తీర్మానాలు అన్నవరం (ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలోని నిత్యాన్న దాన పథకంలోని ఆహార వ్యర్థాలు, వ్రతాల విభాగంలో వచ్చే వ్యర్థాలను వినియోగిస్తూ రత్నగిరి కొండమీద బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని దేవస్థానం పాలకమండలి నిర్ణయించింది. పాలక మండలి సమావేశం ఆదివారం దేవస్థానంలోని ప్రకాష్‌సదన్‌లో గల సమావేశ మందిరంలో చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగింది. సమావేశపు అజెండాలో పొందుపరచిన 41 అంశాలపై సభ్యులు చర్చించి తీర్మానాలు చేశారు. సమావేశంలో సభ్యులు చిర్ల శేషుకుమారి, కొత్త వేంకటేశ్వరరావు, సత్తి వీరదానరెడ్డి, రొబ్బి విజయశేఖర్, మారెడ్డి శింగారెడ్డి, రావిపాటి సత్యనారాయణ, యనమల రాజేశ్వరరావు, యడ్ల భేతాళుడు, అవసరాల వీర్రాజు, కందుల విశ్వేశ్వరరావు, నున్న రామచంద్రరావు, మట్టే సత్యప్రసాద్, సింగిలిదేవి సత్తిరాజు, పర్వత రాజబాబు, ఎక్స్ అఫీషియో సభ్యుడు ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాధరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వివరాలను అధికారులు తెలియజేశారు. ముఖ్యమైన తీర్మానాలు దేవస్థానంలోని శ్రీవనదుర్గ, శ్రీకనకదుర్గ ఆలయాలు, తొలిపాంచా, ప్రసాదం కౌంటర్ కు రంగులు వేయడానికి తీర్మానించారు. దేవస్థానంలో గత నెలలో ఈ–ప్రోక్యూర్మెంట్ కం బహిరంగవేలం ద్వారా 14 టీ, కాఫీ మిషన్ల నిర్వహణకు గాను హెచ్చు పాటను ఖరారు చేశారు. కొండదిగువన గోశాలలో రూ.19.95 లక్షలతో ఏసీ షీటుతో రెండు షెడ్లు నిర్మించేందుకు తీర్మానించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చెందుర్తిలో నిర్మించిన గోశాలలో గోవుల పరరక్షణ, మేత, దాణా సరఫరా అన్నవరంలోని గోశాల ద్వారా చేసేందుకు పాలకమండలి తీర్మానించింది. రూ.30 లక్షలతో దేవస్థానంలోని ప్రకాష్ సదన్ సత్రం వెనుక గల పవర్ హౌస్‌లో, కొండదిగువన గల పంపా తీరంలో గల పవర్‌హౌస్‌లో అధునాతన పేనల్ బోర్డులు ఏర్పాటు చేయడానికి తీర్మానించారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం శివారు బలిఘట్టంలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దత్తత తీసుకోవడానికి కమిషనర్ అనుమతి కోసం రాయాలని తీర్మానించారు. సత్యదేవుని ఆలయం వద్ద గల శయన మందిరం వద్ద రూ.2.75 లక్షలతో వ్యయంతో జియో షీట్‌తో షెడ్డు నిర్మాణం ప్రతిపాదనకు అంగీకరిస్తూ తీర్మానించారు. ప్రకాష్‌సదన్ వద్ద రూ.7.75 లక్షలతో టాయ్‌లెట్స్ మరమ్మతులకు తీర్మానించారు. శ్రీసత్యదేవ జూనియర్ కళాశాల మైదానంలో ఉపాధి హామీ నిధులతో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి అనుమతి మంజూరు చేస్తూ తీర్మానించారు. -
గ్యాస్ మంట
కొవ్వూరు : ఇకపై జనం నెత్తినే వంట గ్యాస్ సబ్సిడీ పడనుంది. దీనికి కేంద్రం సుముఖంగా ఉన్నట్టు లోక్‌సభలో కేంద్రమంత్రి దర్మేంద్రప్రధాన్ లిఖితపూర్వకంగా వెల్లడించడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జూలై నుంచి గ్యాస్ సిలిండర్‌పై రూ.4 పెంచనున్నట్టు ఆయన ప్రకటించడంపైనా ఆందోళన రేగుతోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 15,72,415 గృహావసర వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి ప్రతి వినియోగదారునికీ మొత్తం 12 సిలిండర్లు సబ్సిడీపై లభిస్తున్నాయి. అంత కంటే ఎక్కువ వినియోగిస్తే సబ్సిడీ లేకుండా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ సబ్సిడీని పూర్తిగా తొలగించే వరకు లేదా మార్చి 2018 వరకు, లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రతినెలా రూ.4 చొప్పున సిలిండర్ ధరను పెంచుతున్నట్టు కేంద్రమంత్రి ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. 2014 నుంచి సబ్సిడీ 2014 నవంబర్ నుంచి వంటగ్యాస్‌పై కేంద్రం రాయితీ ఇస్తోంది. దీనిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమచేస్తోంది. ముందుగా లబ్ధిదారుడు ప్రభుత్వం అందించే సబ్సిడీ సోమ్ముతో కలిపి సిలిండర్ ధర చెల్లించి కొనుగోలు చేస్తే తర్వాత సబ్సిడీ సొమ్ము జమ చేస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో ఈ సబ్సిడీ సోమ్ము రూ.200లకు పైబడి ఉండేది. ఈనెల రూ.41కి తగ్గిపోయింది. గ్యాస్ ధర ఆధారంగా సబ్సిడీ నిర్ధారణ కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పుడు కేంద్రం యత్నిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.ఐదు కోట్ల భారం: తాజాగా సిలిండర్ ధర రూ.4 చొప్పున పెంచడం వల్ల జిల్లాలో వినియోగదారులపై నెలకు రూ.63 లక్షలకుపైగా భారం పడుతున్నట్టు అంచనా. ఈ లెక్కన ఏడాదికి రూ.7కోట్లకుపైగా భారం పడుతుందని తెలుస్తోంది. సబ్సిడీ పూర్తిగా ఎత్తేస్తే..! అదే సబ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తే భారం పదిరెట్లు పెరగనుంది. ఉదాహరణకు ఆగస్టులో ఒక్కో సిలిండర్‌పై రూ.41 చొప్పున సబ్సిడీ అందించాలని చరుము కంపెనీలు నిర్ణయించాయి. ఈ లెక్కన లెక్కిస్తే జిల్లాలో మొత్తం లబ్ధిదారులపై నెలకు రూ.6,44,69,015 చొప్పున సబ్సిడీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఈ లెక్కన ఈ భారం ఏడాదికి సుమారు రూ.77.33కోట్లు ఉంటుందని అంచనా. క్రూడ్ ఆయిల్ ధరలు హెచ్చుతగ్గుల వల్ల గ్యాస్ ధరలల్లో స్వల్ప మార్పులున్నా.. సబ్సిడీ ఎత్తివేస్తే వినియోగదారులపై రెట్టింపు భారం పడుతుందనడంలో సందేహం లేదు. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో మళ్లీ పేదలు వంటగ్యాస్ భారం తగ్గించుకోవడం కోసం కట్టెల పొయ్యిల వైపు అడుగులు వేయక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. సమజసం కాదు మార్చి నుంచి అన్ని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ తొలగిస్తామని ప్రకటించడం సమజసం కాదు. ఇప్పటికే సిలిండర్ పొందాలంటే సబ్సిడీ సోమ్ము కలిపి చెల్లించాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సిలిండర్‌పై నెలకు రూ.4ల చొప్పున ధర పెంచడం పేదలపై మరింత భారం పడుతుంది. ప్రభుత్వం పేదలకు ఇచ్చే గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రకటనపై స్పదించకపోవడం బాధాకరం. తానేటి వనిత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, కొవ్వూరు ఇబ్బందే గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీని ఇక నుంచి పూర్తిగా ఎత్తి వేస్తామని చెప్పడం సరికాదు. మహిళలు చాలా బ్బంది పడాల్సి వస్తోంది. సిలిండర్‌కు రూ.4 చొప్పున పెంచుతామని చెప్పడం కూడా తగదు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. కావూరి కుమారి, మహిళా సర్పంచ్ వేగేశ్వరపురం -
కడుపులో గ్యాస్... మిరియాల పొడితో చెక్!
హెల్త్ టిప్స్ గ్యాస్ సమస్య ఏర్పడినప్పుడు అందరూ చేసే పని యాంటాసిడ్ వేసుకోవడం. అలా కాకుండా టీ స్పూను మిరియాలను వేయించి పొడి చేసి, చిటికెలు లవంగాల పొడి, పావుచెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి, తేనెతో కలిపి రోజూ రెండు మూడుసార్లు చొప్పున తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల కడుపులో గ్యాస్ సమస్యతోబాటు జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు కూడా నయం అవుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కప్పు మజ్జిగలో పావు చెంచా మిరియాల పొడిని కలిపి తీసుకోవచ్చు లేదా పసుపు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిటికెడు చొప్పున తీసుకుని నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగితే జలుబు, తుమ్ములు తగ్గుతాయి. పళ్లనొప్పులకు... అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, కొద్దిగా లవంగం నూనెలను తీసుకుని మిశ్రమంగా తయారు చేయాలి. దాన్ని నొప్పి పెడుతున్న పన్నుపై అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే పంటినొప్పి తగ్గడంతోపాటు పళ్లు దృఢంగా తయారవుతాయి. గొంతునొప్పి, మంట, దగ్గులకు... టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం, అర స్పూన్ నల్ల మిరియాల పొడి, టీస్పూన్ ఉప్పులను ఒక గ్లాస్ వేడినీటిలో కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని నోటిలో పోసుకుని పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి, మంట, దగ్గు తగ్గుతాయి. తలనొప్పి నివారణకు యాస్ప్రిన్ వేసుకోవడం అందరూ చేసే పనే. అలా కాకుండా దాల్చిన చెక్కను నీటితో తడిపి అరగదీసి కణతలకు పూస్తూ ఉంటే తలనొప్పి ముఖ్యంగా జలుబు వల్ల వచ్చే తలనొప్పి సులువుగా తగ్గిపోతుంది. -
పైపులు వీక్.. గ్యాస్ లీక్
ఒకే చోట ఏడు బావులు ధర్నాకు దిగిన గ్రామస్తులు అంతర్వేదికర (సఖినేటిపల్లి) : గ్రామంలోని రక్షణలేని ఓఎన్జీసీ బావులతోను, తుప్పుపట్టిన పైపులైన్లు, పైపుల జాయింట్‌లతోను ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బావులు వద్ద శాశ్వత రక్షణ చర్యలు చేపట్టకపోవడం, తుప్పు పట్టిన జాయింట్లను తొలగించకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాల్లో సంస్థ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, అటుపై వీటి గురించి పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా గ్యాస్ లీకేజీ .. గ్రామంలోని దిండమెరక, బెల్లంకొండ గ్రూపులకు సమీపంలో మంగళవారం ఉదయం కేవీ 10 బావి నుంచి లీకయిన గ్యాస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇక్కడ ఈ బావితో పాటు మరో ఆరు బావుల్లో ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగిస్తోంది. బావి ముఖ ద్వారం పైపు జాయింట్ నట్లు తుప్పు పట్టి ఊడిపోయి, గ్యాస్ బావి వద్ద నుంచి లీకవ్వడం గ్రామస్తులు బెంబేలెత్తి పోయారు. సుమారు 45 నిమిషాల పాటు లీకయిన ఈ గ్యాస్ బావులన్నింటినీ కమ్మేసింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో మోరి గ్యాస్ కలెక్షన్ స్టేషన్ సిబ్బంది బావి వద్దకు వచ్చి గ్యాస్ లీకేజీని అరికట్టారు. బావి వద్ద, మోరి జీసీఎస్ వద్ద గొట్టాలను మూసివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ధర్నాకు దిగిన గ్రామస్తులు.. తరుచూ గ్రామంలోని బావులు వద్ద, పొలాల్లోని వెళ్లిన పైపుల నుంచి లీకవుతున్న గ్యాస్ వల్ల తమకు భద్రత లేకుండా పోయిందని గ్రామస్తులు ఏడు బావులున్న ఓఎన్జీసీ సైటులో ధర్నాకు దిగారు. గ్యాస్ లీకేజీలను ముందుగా పసిగట్టే ఆధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని, గ్యాస్ లీకేజీల వల్ల దెబ్బతింటున్న పంటలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. బెల్లంకొండ నాని, రావి ఆంజనేయులు, చొప్పల బాబూరావు, చెన్నంశెట్టి సుబ్బారావు, బీ వెంకటేశ్వరరావు, బి.రాజు, తోట వెంకటేశ్వర్లు, రావి వాసు, శ్రీను, విష్ణు, బి. పద్మాజీరావు పాల్గొన్నారు.


