కుర్ర గ్రహం చిక్కింది.. కెమెరాలో బంధించిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ | Sakshi
Sakshi News home page

James Webb Telescope: కుర్ర గ్రహం చిక్కింది.. కెమెరాలో బంధించిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌

Published Mon, Sep 5 2022 5:01 AM

James Webb Telescope captures its first image of planet beyond our solar system - Sakshi

భూమికి కేవలం 385 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ కుర్ర గ్రహాన్ని జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ తన కెమెరా కంటితో బంధించింది. సౌరవ్యవస్థకు ఆవల ఉన్న దీన్ని హెచ్‌ఐపీ 65426గా పిలుస్తున్నారు. ఈ గ్రహం భూమి కంటే చాలా చిన్నది. భూమి వయసు 450 కోట్ల ఏళ్లు కాగా దీని వయసు కేవలం 1.5 నుంచి 2 కోట్ల ఏళ్లేనట. భూమ్మీదున్న పలు టెలిస్కోప్‌లు ఈ గ్రహాన్ని 2017లోనే ఫొటో తీసినా అంతరిక్షం నుంచి తీసిన జేమ్స్‌ వెబ్‌ తాజా చిత్రాలు దాని వివరాలను అద్భుతమైన స్పష్టతతో అందించాయి.

ఇంతకూ హెచ్‌ఐపీ 65426 నేల వంటి గట్టి ఉపరితలం లేని ఓ భారీ వాయు గ్రహమట. కనుక దానిపై జీవముండే ఆస్కారం కూడా లేదని నాసా శాస్త్రవేత్తలు తేల్చారు. సూర్యునికి భూమి మధ్య దూరంతో పోలిస్తే ఈ గ్రహం తాను పరిభ్రమిస్తున్న నక్షత్రానికి కనీసం 100 రెట్లు ఎక్కువ దూరంలో ఉందట. సౌర మండలానికి ఆవలున్న ఇలాంటి మరిన్ని గ్రహాలను జేమ్స్‌ వెబ్‌ మున్ముందు మనకు పట్టిస్తుందని నాసా చెబుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement