Delhi: భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం | Six dead many trapped as massive fire breaks Delhi | Sakshi
Sakshi News home page

Delhi: భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

Mar 18 2026 11:03 AM | Updated on Mar 18 2026 11:10 AM

Six dead many trapped as massive fire breaks Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నేటి (బుధవారం) ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాలం ప్రాంతంలోని ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

పాలం మెట్రో స్టేషన్ సమీపంలోని లేన్ నంబర్ 2లోని ఒక నాలుగు అంతస్తుల భవనంలో బుధవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని కాస్మెటిక్స్ షాపులో మంటలు మొదలై, నిమిషాల వ్యవధిలోనే పైఅంతస్తులకు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్‌ రంగంలోకి దిగింది. సుమారు 30 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
 

భవనం పైనుంచి దూకి..
ప్రమాద సమయంలో భవనంలో సుమారు 18 మంది ఉన్నట్లు సమాచారం. ప్రాణాలు కాపాడుకోవాలనే ఆరాటంతో కొందరు పైఅంతస్తుల నుండి కిందకు దూకగా, మరికొందరు దట్టమైన పొగ, మంటల మధ్య చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లోపల ఇంకా ఎనిమిది మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
 

స్పందించిన లెఫ్టినెంట్ గవర్నర్
ఈ ఘోర ప్రమాదంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చదవండి: మృత్యుపాశమైన ఈవీ ఛార్జింగ్.. ఆరుగురు సజీవ దహనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement