పెరుగన్నం, మామిడి పండు కలిపి తింటే ఇన్ని కష్టాలా? | Mixing Mango And Curd, Delicious But Potentially Harmful To Digestion, Here’s What Ayurveda Says | Sakshi
Sakshi News home page

పెరుగన్నం, మామిడి పండు కలిపి తింటే ఇన్ని కష్టాలా?

May 2 2026 11:44 AM | Updated on May 2 2026 12:54 PM

Combining curd rice and mango check these side effects

ఇది వేసవి కాలం. మామిడి పండ్లు విరివిగా వచ్చే కాలం. మామిడి ప్రియులకు పెరుగన్నంలో మామిడి పండు ముక్కలను నంచుకు తినడం లేదా పెరుగన్నంలో మామిడి రసాన్ని కలుపుకుని తినడం అలవాటు. పిల్లలు, పెద్దలు చాలా ఎంతో ఇష్టంగా తినే ఈ కాంబినేషన్‌ వల్ల కొన్ని అనర్థాలు కూడా  ఉన్నాయి. 

నిజానికి పెరుగు, మామిడికాయల కలయిక రుచికరంగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. మామిడి, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో విషపదార్థాలు ఏర్పడతాయి. ఇది జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలకు దారితీస్తుంది.

పెరుగన్నం , మామిడిని కలిపి తీసుకోవడం వల్ల, వాటి విరుద్ధ గుణాల (చల్లని పెరుగు, వేడి చేసే మామిడి) కారణంగా సున్నితమైన వ్యక్తులలో అజీర్ణం, కడుపు ఉబ్బరం , గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఈ కలయిక జీవక్రియ సంబంధిత విషపదార్థాలను సృష్టించి, మొటిమలు లేదా దద్దుర్లు వంటి చర్మ సమస్యలకు కారణం కావచ్చని ఆయుర్వేదం సూచిస్తుంది. అయితే, ఇది చాలా వరకు వ్యక్తిగత జీర్ణశక్తిపై ఆధారపడి ఉంటుంది.

ప్రధానంగా ఇది జీర్ణవ్యవస్థపై (అగ్ని) అధిక భారాన్ని మోపవచ్చు. తీపి మామిడి మరియు పుల్లని, చల్లని పెరుగు కలయిక కడుపులో పులిసి, ఎసిడిటీ, గ్యాస్ లేదా ఉబ్బరానికి కారణమవుతుంది. మామిడిలోని విరుద్ధమైన వేడి, పెరుగు గుణాలు విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.  అయితే ఈ లక్షణాలు  వారి వారి శారీరక ఆరోగ్యం, సామర్థ్యం మీద కూడా ఆధారపడి ఉంటాయి. 

ఇదీ చదవండి: రూ. 2 వేల నుంచి కోటి టర్నోవర్‌ దాకా : హోంమేకర్‌ సక్సెస్‌ స్టోరీ

జాగ్రత్తలు: మన శరీర తీరును, జీర్ణవ్యవస్థ పనితీరును గమనించుకోవాలి. మితంగా తినాలి. వీలైనంతవరకు రాత్రి పూట తినకుండా ఉండటం మంచిది.

 నోట్‌ : అవగాహనకోసం అందించిన  సమాచారం మాత్రమే.  సందేహాల నివృత్తికోసం, ఆయుర్వేద, ఇతర ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 
 

Advertisement
 
Advertisement
Advertisement