జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇజ్రాయెల్ రాజకీయం మరో టర్న్ తీసుకుంది. యుద్ధాలు బిజీగా ఉన్న ప్రస్తుత ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థులు చేతులు కలిపారు. రాబోయే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో నెతన్యాహును ఓడించేందుకు కొత్త రాజకీయ పార్టీ ఏర్పటైంది. ఇజ్రాయెల్ మాజీ ప్రధానులు ఇద్దరు కలిసి నెతన్యాహును గద్దె దించే లక్ష్యంతో కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణంతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్‌కు ఎన్నికల హీట్ తోడైంది.
ఇజ్రాయెల్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం ఇజ్రాయెల్ మాజీ ప్రధానులు నఫ్తాలి బెన్నెట్, యైర్ లాపిడ్ కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. ఈ కొత్త పార్టీకి 'టుగెదర్, లెడ్ బై బెన్నెట్' అని నామకరణం చేశారు. ఈ ఏడాది జరగబోయే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒకే కూటమిగా పోటీ చేయనున్నాయి. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహును గద్దె దించే లక్ష్యంతో తమ పార్టీలైన యెష్ అటిడ్ (యైర్ లాపిడ్), బెన్నెట్ 2026 (నఫ్తాలి బెన్నెట్)ను విలీనం చేశారు. అయితే, విచ్ఛిన్నమైన ప్రతిపక్షాన్ని ఏకం చేయడమే ఈ ఇద్దరు రాజకీయ నాయకుల కూటమి లక్ష్యం. కాగా, నెతన్యాహుకు నఫ్తాలి బెన్నెట్, యైర్ లాపిడ్ ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు.
Former Israeli PMs Bennett and Lapid formed a new 'TOGETHER' party to topple Netanyahu's government. Bennett and Lapid: "The State of Israel must change direction." pic.twitter.com/wpHuAedDTP
— World Vibe (@world_vibe_en) April 27, 2026
అయితే, కొత్త పార్టీ ప్రధానంగా జాతీయ భద్రత, సైనిక సేవా సంస్కరణలు, మరియు సామాజిక సమానత్వంపై దృష్టి పెట్టింది. ఈ పార్టీకి మద్దతు ప్రధానంగా మధ్యతరగతి, సెంటర్-రైట్ మరియు సెక్యులర్ వర్గాల నుండి వస్తోంది. తాజా సర్వేలు ప్రకారం, ఈ కూటమి నెతన్యాహు ఆధ్వర్యంలోని లికుడ్ పార్టీకి గట్టి సవాలు విసరగలదని సూచిస్తున్నాయి.
రాజకీయ నేపథ్యం..
ఇజ్రాయెల్‌లో అస్థిర రాజకీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత నాలుగేళ్లలో ఐదు సార్లు ఎన్నికలు జరిగాయి.
నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ, మెజారిటీ సాధించలేకపోయింది.
చిన్న పార్టీల మధ్య కూటమి విభేదాలు తరచూ ప్రభుత్వ పతనానికి దారితీస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బెన్నెట్–లాపిడ్ కొత్త పార్టీ, ప్రతిపక్షాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
2026 చివరిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
ప్రభావం
ఈ కొత్త పార్టీ ఏర్పాటుతో ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ప్రతిపక్షం ఏకమైతే, నెతన్యాహు ఆధిపత్యానికి సవాలు ఏర్పడుతుంది.
అయితే, ఇజ్రాయెల్ రాజకీయ చరిత్రలో కూటమి ప్రభుత్వాలు ఎక్కువకాలం నిలవలేకపోవడం ఒక పెద్ద సవాలుగా ఉంది.
సవాళ్లు..
అరబ్ పార్టీలతో కూటమి లేకపోవడం వల్ల కొత్త పార్టీకి క్లిష్టం కావచ్చు.
గతంలో బెన్నెట్–లాపిడ్ ప్రభుత్వ అనుభవం (2021–22) తక్కువకాలం మాత్రమే నిలవడం ఓటర్లలో అనుమానం కలిగించవచ్చు.


