ఆ అమ్మకు ఆ జర్నీ అత్యంత స్పెషల్‌..! | Mothers special journey with her two pilot sons wins hearts online | Sakshi
Sakshi News home page

ఆ అమ్మకు ఆ జర్నీ అత్యంత స్పెషల్‌..!

Jun 12 2026 4:11 PM | Updated on Jun 12 2026 4:17 PM

Mothers special journey with her two pilot sons wins hearts online

కొన్ని చిత్రాలు చెప్పే కథ ఎంతో అపురూపంగా మనసుని తాకేలా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా చిత్ర చెప్పే కథే. అచ్చం అలాంటి స్టోరీనే నెట్టింట వైరల్‌గా మారింది. పైగా ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలు అంటూ అంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇంతకీ ఏంటా కథా చిత్రం అంటే..ఒక తల్లి ప్రయాణి ఇద్దరు కుమారుల కారణంగా అత్యంత ప్రత్యేకంగా మారింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవ్వుతూ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. ఒక కుమారుడు ఆమెను విమానం ఎక్కించడానికి ఎయిర్‌పోర్ట్‌కి రాగ, మరోక కుమారుడు ఆమెను పైలట్‌గా గమ్యస్థానానికి చేర్చడానికి వేచి ఉన్నాడు. అందుకు సంబంధించిన భావోద్వేగ క్షణాన్ని పంచుకుంటూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. 

తన పులులతో గర్వపడే తల్లి అనే క్యాప్షన్‌ జోడిస్తూ ఇలా పేర్కొన్నారు. అమ్మను నా తమ్ముడికి అప్పగిస్తున్నందుకు గర్వంగా ఉంది. నా తమ్ముడి కెప్టన్‌ అమన్‌ సక్సేనా సారథ్యంలో అమ్మ తన గూటికి తిరిగి వెళ్తోంది. అని రాసుకొచ్చారు. అందుకు సంబంధించిన రెండు ఫోటోలు ఎంతో అందంగా రెండు విషయాలను వివరించాయి. మొదటి పోటో.. ఆ తల్లి తన పెద్దకొడుకు అక్షత్‌తో కలిసి విమానాశ్రయంలో దిగిన చిత్రం . 

అక్కడ అతను ఆమెకు వీడ్కోలు పలుకుతున్నాడు. ఇక రెండో ఫోటోలో విమానం దిగిన తర్వాత దిగిన ఫోటో. అందులో ఆ విమానాన్ని నడిపిన చిన్న కొడుకు కెప్టెన్‌  అమన్ సక్సేనాతో దిగిన చిత్రం. ఓ అమ్మకు ఇంతకు మించిన ధైర్యం ఇంకే కావలంటూ ప్రశంసలు జల్లు కురిపిస్తు పోస్టులు పెట్టారు నెటిజన్లు.

 

(చదవండి: అమ్మ కలను నెరవేర్చిన కూతురు..! 73 ఏళ్ల​ వయసులో ఆమె ..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement