సండే క్లాస్‌లో స్టూడెంట్స్ అందరూ బిజీగా ఉన్నారు. లంచ్ బ్రేక్ అవుతున్నా కూడా అందరూ క్లాస్‌లో మునిగి పోయారు. ఇది చూసిన ఒక ప్రొఫెసర్‌కి ఒక ఆలోచన తట్టింది. ఆ విద్యార్థుల కోసం ఏకంగా డామినోస్ (Domino’s) పిజాలను ఆర్డర్ చేశారు. ఈ స్వీట్ జెస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
IIM షిల్లాంగ్ విద్యార్థి రోహన్ సాహా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సాధారణంగా ఐఐఎమ్‌లలో వీకెండ్స్‌లో కూడా క్లాసులు జరగడం సహజమే, కానీ ఈ సమయంలో కొందరు ప్రొఫెసర్లు ఆ కష్టాన్ని అర్థం చేసుకుంటారు అని రోహన్ పేర్కొన్నారు.
వీకెండ్ క్లాసులను కొందరు ప్రొఫెసర్లు ఆ తరగతులను ఎంతో ఆహ్లాదకరంగా మారుస్తారు! అలా ప్రొఫెసర్ అరుణి సర్ ఎంతో దయాహృదయుడు. షెడ్యూల్ వల్ల మేం లంచ్ మిస్ అవుతున్నామని తెలుసుకుని, మా అందరి కోసం పిజాలు ఆర్డర్ చేశారు. థాంక్యూ సర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. వీడియోలో క్లాస్‌రూమ్‌లో డామినోస్ పిజా బాక్సుల వరస కనిపిస్తుంది. విద్యార్థులందరూ ఎంతో సంతోషంగా వచ్చి తమ పిజా స్లైసులను ఆరగించారు.
నెటిజన్ల కామెంట్స్
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు ప్రొఫెసర్ అరుణిపై ప్రశంసల వర్షం కురిపించారు. తమ పాత కాలేజ్ రోజులను గుర్తుచేసుకుంటూ రకరకాల కామెంట్లు చేశారు. చాలా అక్కీ స్టూడెండ్స్. నిజంగా ఆ ప్రొఫెసర్ చాలా గ్రేట్ అంటూ కొందరు ఆయన్ని పొగిడేశారు. "ఈ ప్రొఫెసర్ పూకీ (Pookie) లాంటివారు" అని మరొకరు కామెంట్ చేశారు.
ఒకవేళ మీరు ఆ రోజే డైటింగ్ చేస్తుంటే పరిస్థితి ఏంటి?" అని ఒకరు జోక్ చేయగా, "నేను తప్పుడు సబ్జెక్టులను ఎంచుకున్నాను అని మరొకరు ఫన్నీగా స్పందించారు. మరికొందరు తమ ప్రొఫెసర్లతో పోల్చు కున్నారు. అదే మా ప్రొఫెసర్ అయితేనా మళ్లీ వచ్చే ఆదివారం కలుద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయేవారు అని ఒకరంటే, మనకెందుకు దొరకరు భయ్యా ఇలాంటి ప్రొఫెసర్లు దొరకరు మరికొందరు సరదాగా జెలస్ ఫీలవ్వడం విశేషం.
ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసింది


