breaking news
Nirmal
-
‘బాలలను పనిలో పెట్టుకోవద్దు’
భైంసారూరల్: 6–14 ఏళ్లలోపు బాలలను పని లో పెట్టుకుంటే చర్యలు తప్పవని కార్మికశాఖ చైల్డ్ వెల్ఫేర్ న్యాయ సలహాదారు నరేందర్ హె చ్చరించారు. మంగళవారం మండలంలోని తి మ్మాపూర్ గ్రామంలో ఇద్దరు బాల కార్మికులను గుర్తించిన ఆయన గ్రామ సర్పంచ్ సంజీవ్‌రావు సమక్షంలో వారిని ప్రభుత్వోన్నత పాఠశాలలో చేర్పించారు. చదువుకునే వయస్సు పిల్లలను పనులకు పంపించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎస్సై దయాల్‌సింగ్, సిబ్బంది ఉన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
నిర్మల్ రూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. నిర్మల్ మండలంలోని కౌట్ల (కె) గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించా రు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారు మూ డ నాగవ్వ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నా రు. అధికారులతో కలిసి ఇంటిని పరిశీలించారు. ఆ యన మాట్లాడుతూ.. గుడిసెలు లేని రాష్ట్రంగా తె లంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పే ర్కొన్నారు. అంతకుముందు గ్రామ శివారులోని డ బుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధి కారులను ఆదేశించారు. ఇళ్ల స్థలాలు లేని అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు అందేలా చర్యలు తీ సుకుంటామని వివరించారు. సొంత స్థలాలున్న ఇ ళ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామంలో నిర్మిస్తున్న ఫామ్‌పాండ్‌ను పరిశీలించారు. రైతులంతా ఫామ్పాండ్ల నిర్మాణాలకు ముందుకురావాలని సూచించారు. అ దనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ శ్రీని వాస్‌రెడ్డి, తహసీల్దార్ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, ఎంపీడీవో సుధాకర్, సర్పంచ్ దు మాల రాజు, ఉపసర్పంచ్ రఘు తదితరులున్నారు. -
‘వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం’
లక్ష్మణచాంద: వ్యవసాయ రంగాన్ని మరింత సులభతరం చేసి, రైతులకు లాభదాయకంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన ‘రైతు నేస్తం’ 100వ ఎపిసోడ్ ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. రైతు వేదికలో అధికారులు, రైతులు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేసుకోవాలని సూ చించారు. ఆరుతడి, ఉద్యానవన పంటలు, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ, నేల స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పంట మార్పిడి విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పంట మార్పిడి ద్వారా విజయాలు సాధించిన ఆదర్శ రైతులను సన్మానించారు. సోన్ రైతువేదిక నుంచి కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొని మాట్లాడారు. రైతు నేస్తం కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని శాసీ్త్రయ పద్ధతులు పాటించాలని సూచించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన రైతులు, వ్యవసాయ అధికారులను అభినందించి జ్ఞాపికలు అందజేశారు. జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి బీవీ రమణ, తహసీల్దార్ సంతోష్, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
ఓవర్ టు పైలట్
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టుతో పాటు ఇండియన్ ఎయిర్‌పోర్స్‌కు చెందిన శిక్షణ కేంద్రం ఏర్పాటు కానున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలు కూడా ఈ ప్రాంతంపై దృష్టి సారించాయి. ప్రైవేట్ పైలట్ శిక్షణ సంస్థలు రెండు ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నాయి. అలాగే ఆరు ఎంఆర్ఓ (నిర్వహణ), రిపేర్ (మరమ్మతు), ఓవర్‌హాల్ (సమగ్ర తనిఖీ) కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలో సివిల్ ఏవియేషన్ ఎన్క్లేవ్ ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనుండగా, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రంతో పాటు ఎంఆర్వో ఇతరత్రా సదుపాయాలతో ఏర్పాటు కానుంది. ఇందుకోసం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2009 ఎకరాల భూసేకరణకు గాను రూ.2278 కోట్ల నిధుల మంజూరు చేస్తూ ఈనెల 25న జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. భూసేకరణతో పాటు ప్రతిపాదిత ప్రాజెక్ట్ నిర్మాణంలో అడ్డంకులు తొలగించేందుకు వివిధ పనుల కోసం ఈ నిధులు వెచ్చింనున్నారు. ప్రైవేట్ అకాడమీల దృష్టి.. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టుతో పాటు వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుండగా ఇక్కడ ప్రైవేట్ అకాడమీలు కూడా శిక్షణకు ముందుకు వస్తున్నాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వివిధ ప్రైవేట్ అకాడమీలను సంప్రదించగా వారు ఈ ప్రాంతంలో ఏర్పాటుకు ఆసక్తి కనబర్చుతూ తమ దరఖాస్తులు అందజేశారు. తాజాగా ఎమ్మెల్యే ద్వారా వాటిని కేంద్ర రక్షణ శాఖకు అందజేశారు. అకాడమీలు ఇలా.. పైలెట్ శిక్షణ ఆసక్తి కనబర్చే వారికి విమానం నడపడం నేర్పిస్తారు. దాంతో పాటు పైలట్ లైసెన్సులు, రేటింగ్‌ల కోసం శిక్షణ ఇవ్వడానికి విమానయాన అధికార సంస్థ (డీజీసీఏ, ఈఏఎస్ఏ) నుంచి అధికారిక ఆమోదం పొంది ఉండాలి. అలాంటి సంస్థలే శిక్షణ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. మారుమూల నుంచి కూడా పైలట్లు.. మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ నుంచి కూడా పైలట్ శిక్షణ పొందేందుకు ఇలాంటి అకాడమీలు ఉపయుక్తంగా ఉంటాయి. ప్రైవేట్ శిక్షణ కేంద్రాలను సంప్రదించి వాటి ఏర్పాటు విషయంలో రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకునేలా చూస్తున్నాం. రానున్న రోజుల్లో ఆదిలాబాద్‌లో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక అభివృద్దితో పాటు శిక్షణ సంస్థలు కూడా ఏర్పాటు కానున్నాయి. – పాయల్ శంకర్, ఎమ్మెల్యే ఆదిలాబాద్ దరఖాస్తు చేసుకున్న సంస్థలు.. ఎఫ్‌టీవో (పైలట్ శిక్షణ సంస్థలు) 2. వింగ్ ఏవియేషన్ అకాడమీ 1. ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీఎంఆర్ఓ కేంద్రాలు.. 1. జెట్ సెట్ గో 2. డెక్కన్ 3. గోల్డన్ ఈగల్ ఏవియేషన్ 4. స్టార్ ఎయిర్ 5. యథి ఏవియేషన్ 6. థంబై ఏవియేషన్ -
నిర్మల్
ఆధ్యాత్మికతకు ప్రతీక బాసర క్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రం విశిష్టమైందనివేద పండితుడు శశికాంత్ జోషి పేర్కొన్నారు. గురుపౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు క్షేత్ర వైభవంపై ప్రవచనం చేశారు.జలిసిరితో అదనపు ఆదాయం దస్తురాబాద్: జలసిరితో రైతన్నలు అదనపు ఆ దాయం పొందవచ్చని డీఆర్డీవో విజయలక్ష్మి సూచించారు. మంగళవారం మండలంలోని భూత్కూర్ పంచాయతీ పరిధి రాంపూర్ గ్రా మంలో రైతు నిర్మించుకున్న ఫామ్‌పాండ్‌లో చే పపిల్లలు విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇంటింటికీ ఇంకుడుగుంత, ప్ర తీ గ్రామానికి ఊరకుంట, ప్రతీ రైతు పొలంలో నీటికుంట నిర్మించుకున్నప్పుడే భూగర్భ జలా ల పెంపు సాధ్యమవుతుందన్నారు. ఎంపీడీవో సయ్యద్ జావేద్ అలీ, ఎంపీవో రమేశ్‌రెడ్డి, ఏపీవో రవిప్రసాద్, పంచాయతీ కార్యదర్శి అనిల్, ఫీల్డ్అసిస్టెంట్ అంజలి, కిషన్ పాల్గొన్నారు.నిర్మల్: జిల్లాకేంద్రంలోని ట్రాఫిక్ సమస్యకు క్రమంగా ఊరట లభిస్తోంది. ‘సాక్షి’ ఇటీవల వరుస కథనాలు ప్రచురించి అధికా రుల దృష్టికి సమస్య తీసుకువచ్చింది. ఇప్పటికే ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల ప్ర త్యేకంగా దృష్టిపె ట్టారు. ప్రధానంగా బస్టాండ్ ప్రాంతంలో సమస్య లే కుండా చేశారు. జిల్లాకేంద్రంలో ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు ప్ర త్యేకంగా పోలీస్ బృందాల ను నియమించాలని డీజీపీ సీవీ ఆనంద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అతిత్వరలో ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా పోలీసులను కేటాయిస్తామని ఎస్పీ జానకీ షర్మిల పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా, వాహనాలు జిల్లాకేంద్రం జాతీయ రహదారులైన 44, 61కి కూ డలిగా ఉంది. పైగా, ఆదిలాబాద్, నిజామాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ప్రధానకేంద్రంగా మారింది. రోజూ వేలాది కార్లు, లారీలు, బస్సులు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పట్టణ జనాభాతోపాటు వాహనాల సంఖ్య అధికమవుతుండగా ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారుతోంది. ప్రధానంగా పాత బస్టాండ్, వివేక్చౌ క్, శివాజీచౌక్, ఈద్గాం లాంటి ప్రాంతాల్లో తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రహదారులపై అక్ర మ పార్కింగ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు సమస్య ను తీవ్రతరం చేస్తున్నాయి. పండుగలు, మార్కెట్ రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. వీటిపై సంబంధిత శాఖల అధికారుల స్పందన లేక గతంలోనూ కొందరు కోర్టుల వరకూ వెళ్లిన సందర్భాలున్నాయి. మున్సిపల్ కూడా స్పందిస్తే.. జిల్లాకేంద్రంలో ప్రధానంగా రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు, దుకాణాలు, షాపింగ్‌మాల్స్ ఎదుట టేలాలను మున్సిపల్ అధికారులు తొలగించాల్సి ఉంది. కూరగాయలు, పండ్లు విక్రయించడానికి ప్రత్యేకంగా వేర్వేరు మార్కెట్లు ఏర్పాటు చే యాలి. ప్రధానంగా ఎడమవైపు వాహనాలు వెళ్లడానికి ‘ఫ్రీ లెఫ్ట్’ కోసం చౌరస్తాల విస్తరణ పనులూ చే పట్టాలి. ఇదే విషయాన్ని ఇటీవల మున్సిపల్ సమావేశంలోనూ పలువురు కౌన్సిలర్లు లేవనెత్తారు. ఈద్గాం, శివాజీచౌక్, జయశంకర్‌సార్ సర్కిల్, వివేక్‌చౌక్, అంబేడ్కర్‌చౌక్‌లో ఆక్రమణలు తొలగించి, నలువైపులా చౌరస్తాలను విస్తరించాలి. అప్పుడే ఫ్రీ లెఫ్ట్, ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చర్యలు చేపడుతున్నాం జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీస్‌శాఖ తరఫున బాధ్యతాయుతంగా చర్యలు చేపడుతున్నాం. ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేయాలన్న డీజీపీ ఆదేశాల మేరకు త్వరలోనే సిబ్బందిని నియమిస్తాం. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రజలూ సహకరించాలి. – డాక్టర్ జానకీషర్మిల, ఎస్పీ నిర్మల్ బస్టాండ్ వద్ద ప్రశాంతంగా వాహనాల రాకపోకలు జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో నిధుల కొరతతో కనీసం ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాల మరమ్మతులు చేయించడానికి నెలలపాటు సమయం తీసుకుంటున్నారు. జిల్లాకేంద్రంలో సమస్యలపై విమర్శలు తీవ్రం కాగా పోలీస్‌శాఖ తరఫున ఎస్పీ జానకీషర్మిల చొరవ తీసుకున్నారు. ప్రధానంగా బస్టాండ్ ప్రాంతంలో సీఐ, ఎస్సైలు, సిబ్బందితో రోజంతా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. పండ్ల దుకాణాలు, తోపుడు బండ్లు రోడ్డుపైకి తీసుకువచ్చి, రాకపోకలకు ఇబ్బంది కలిగించవద్దని ఎస్పీ స్వయంగా వచ్చి చెప్పారు. దాదాపు 20రోజులుగా బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య క్లియర్ కావడంతో పట్టణ వాసులూ హర్షం వ్యక్తంచేస్తున్నారు. ట్రాఫిక్ ఠాణా ఇప్పట్లో లేనట్లే! ప్రత్యేక ట్రాఫిక్ బృందం ఏర్పాటు కానున్న నేపథ్యంలో నిర్మల్‌లో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు ఇప్పట్లో ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం జిల్లా పోలీస్ కార్యాలయం ఆధ్వర్యంలోనే ట్రాఫిక్ విభాగం పనిచేసే అవకాశముంది. జిల్లా నుంచి ఠాణా కోసం ప్రతిపాదనలు పంపించినా.. ప్రస్తుతానికి ప్రత్యేక పోలీసులతో సరిపెట్టారు. భవిష్యత్‌లో అవసరాలను బట్టి పూర్తిస్థాయి ట్రాఫిక్ ఠాణా ఏర్పాటు చేస్తారని అధికారులు చెబుతున్నారు. -
కొత్త ఆశలు!
నిర్మల్‌చైన్‌గేట్: నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల కో సం ఎదురుచూస్తున్న అర్హులైన దరఖాస్తుదారు ల కల ఎట్టకేలకు ఫలించనుంది. వచ్చే పంద్రాగస్టుకు పంపిణీ చేసేలా ప్రభుత్వం కసరత్తు చే స్తోంది. జిల్లాలో వివిధ కేటగిరీల్లో 1,44,773 మంది చేయూత పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 చొప్పున బ్యాంక్‌లు, పోస్టాఫీస్‌ల ద్వారా పింఛన్ ఇస్తున్నారు. ఇక నుంచి పింఛన్లు బ్యాంక్ ఖాతాల ద్వారానే అందజేయాలని ప్ర భుత్వం నిర్ణయించింది. ఇటీవలే పోస్టాఫీస్ల్లో తీసుకునే వారికీ బ్యాంక్‌ల ద్వారా ఇచ్చేలా ఖా తాలు తెరిపించారు. వారంతా ప్రతీ మూడు నె లలకోసారి బ్యాంక్‌కు వెళ్లి ఎఫ్ఆర్ఎస్ ద్వారా అప్డేట్ చేసుకోవాలనే నిబంధన విధించారు. అనర్హుల ఏరివేత పింఛన్ లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోతే వారి స్థానంలో భర్త లేదా భార్యకు రెండున్నరేళ్లుగా పింఛన్ ఇస్తూ వస్తున్నారు. దీంతో అర్హులైన కొత్తవారు నిత్యం పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేశా రు. జిల్లాలో అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిని జాబితా నుంచి తొలగించేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్ర యాప్ ద్వారా ఇంటింటికీ వెళ్లి లైవ్ అథెంటికేషన్ ద్వారా లబ్ధిదారుడి ఫొటో క్యాప్చర్ చేసి వివరాలు నమోదు చేశారు. ఇలా జిల్లాలో అక్రమంగా పెన్షన్ పొందుతున్న 323 మందిని గుర్తించి జాబితా నుంచి తొలగించారు. పెండింగ్‌లో 3,320 దరఖాస్తులు జిల్లాలోని 18 మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో 3,320 మందికి పైగా వివిధ కేటగిరీల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా అధికారులు ద్వారా అర్హులుగా గుర్తించబడి ప్రభుత్వానికి సిఫార్సు చేయబడినవారే. వీరే కాకుండా పరిశీలన పూర్తి కాకుండా పెండింగ్ దరఖాస్తులు జిల్లా, మండల స్థాయిలో కోకొల్లలుగా ఉన్నాయి. కాగా, ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నవారికి ఎప్పుడు పింఛన్లు వస్తాయనే సమాచారం తమ వద్ద లేదని అధికారులు చెబుతున్నారు. ఆదేశాలు రాలేదు కొత్త పింఛన్లు మంజూరైనట్లు ఇప్పటివరకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వెంటనే నిబంధనల ప్రకారం కొత్త పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకుంటాం. – గంగన్న, డీపీఎం పంద్రాగస్టు రోజు పంపిణీకి కసరత్తు మండలం లబ్ధిదారులసంఖ్య బాసర 2,851 భైంసా 8,039 భైంసా (బల్దియా) 7,794 దస్తురాబాద్ 3,601 దిలావర్పూర్ 5,990 కడెం 7,243 ఖానాపూర్ 6,761 ఖానాపూర్(బల్దియా) 3,904 కుభీర్ 9,251 కుంటాల 5,610 లక్ష్మణచాంద 7,906 లోకేశ్వరం 9,448 మామడ 6,511 ముధోల్ 6,181 నర్సాపూర్ (జి) 5,814 నిర్మల్ రూరల్ 7,017 నిర్మల్ (బల్దియా) 14,847 పెంబి 1,794 సారంగపూర్ 11,587 సోన్ 7,022 తానూరు 5,602 జిల్లాలో పెన్షన్లు ఇలా.. మొత్తం పెన్షన్లు 1,44,773 వద్ధాప్య.. 33,890 వితంతు.. 35,664 వికలాంగ.. 9,822 గీత కార్మికులు 266 పైలేరియా రోగులు 221 డయాలసిస్ పేషెంట్లు 110 ఒంటరి మహిళలు 2,093 బీడీ కార్మికులు 61,933 -
పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
మామడ: మండలంలోని దిమ్మదుర్తి తుర్కం చె రువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ వినయ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని దిమ్మదుర్తి అటవీ క్షేత్రం పరిధి లోని తుర్కం చెరువును సందర్శించారు. చెరు వు పరిసరాల్లో అభివృద్ధి చేయాల్సిన స్థలాలను అధికారులకు సూచించారు. ఈ ప్రాంతం ఆహ్లా దకరంగా ఉందని పేర్కొన్నారు. సీఎఫ్ అర్ఫణ, జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుకుదే వ్ బొబ్డ, ఫారెస్ట్ డివిజన్ అధికారి నాగిని భా ను, ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు ఉన్నారు. -
స్వచ్ఛంద సేవకు సభ్యత్వం
నిర్మల్: విపత్తుల వేళ ‘మేమున్నాం..’ అంటూ అండగా నిలవాలనే సంకల్పం ఉన్నవారికి ఓ వేదిక ‘రెడ్‌క్రాస్ సొసైటీ’. ఇందులో సభ్యత్వం ఎన్నో సామాజిక సేవలు చేసేందుకు ఓ మంచి అవకాశం. యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, వరదలు, అగ్నిప్రమాదాలు లాంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సాయం అందించడంలో రెడ్‌క్రాస్ కీలకపాత్ర పోషిస్తోంది. రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ప్రథమ చికిత్స శిక్షణ ఇవ్వడం, పేదలకు వైద్య సహాయం అందించడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సొసైటీ ఇప్పుడు జిల్లాలోనూ సభ్యత్వ సేకరణ చేపడుతోంది. సమాజానికి సేవ చేయాలనే తపన ఉన్న ప్రతిఒక్కరూ ఈ సేవామార్గంలో భాగస్వాములు కావాలని పిలుస్తోంది. కలెక్టర్ అధ్యక్షతన.. సమాజంలో 18ఏళ్లు నిండిన యువత, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు.. ఇలా ఎవరైనా రెడ్‌క్రాస్‌లో సభ్యత్వం తీసుకుని స్వచ్ఛంద సేవకులుగా ముందుకురావచ్చు. ప్రపంచవ్యాప్తంగా కో ట్లాదిమంది జీవితాల్లో వెలుగునింపిన ఈ సంస్థ ప్రస్తుతం జిల్లాలోనూ సభ్యులను చేర్చుకుంటోంది. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీకి కలెక్టర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలో గవర్నర్ అధ్యక్షతన ఈ సొసైటీ కార్యకలాపాలు సాగిస్తుంది. రక్తదాన శిబిరాల నిర్వహణ, బ్లడ్‌బ్యాంకుల ఏర్పాటు, ప్రకృతి విపత్తుల సమయంలో ఆహారం, దుస్తులు, మందుల పంపిణీ, పేదలకు వైద్య సహాయం, ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) శిక్షణలు, అంబులెన్స్ సేవలు, దివ్యాంగులకు వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, సహాయక పరికరాల పంపిణీ, వృద్ధులు, అనాథలు, నిరుపేదలకు సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. యు వతలో సేవాభావాన్ని పెంపొందించే జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ కార్యక్రమాలనూ చేపడుతోంది. సభ్యులుగా చేరిన రిటైర్డ్ ఉద్యోగులు జిల్లాలో ప్రస్తుతం రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత సేకరణ కొనసాగుతోంది. ఈ సొసైటీకి నోడల్ అధికారిగా జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి విజయలక్ష్మిని కలెక్టర్ భవేశ్‌మిశ్రా నియమించారు. జిల్లాకేంద్రంలో ఇటీవల చేపట్టిన కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోంది. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నుంచి అధ్యక్షుడు ఎంసీ లింగన్న ఆధ్వర్యంలో ఇప్పటికే 60మంది సొసైటీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. మిగతా సంఘాలు, యువకులూ ముందుకు వస్తున్నారు. -
ఉపసర్పంచులకు గౌరవవేతనం ఇవ్వాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఉపసర్పంచులకు గౌరవవేతనం ఇ వ్వాలని ఉపసర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పొ ద్దుటూరి సంపత్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఉపసర్పంచులు నిరసన తెలిపారు. అనంతరం సంపత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపసర్పంచులకు గౌరవ వే తనం నెలకు రూ.5వేలు, వార్డు మెంబర్లకు రూ.3 వేల చొప్పున ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రా మపంచాయతీ తీర్మాన పత్రాలపై ఉపసర్పంచుల కు కూడా సంతకం చేసే హక్కు కల్పించాలని కోరా రు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకా లపై ఉపసర్పంచుల పేర్లు ముద్రించాలని, మండల స్థాయిలో జరిగే సర్వసభ్య సమావేశాలకు ఉపసర్పంచులను ఆహ్వానించాలని, గ్రామపంచాయతీ స్టాండింగ్ కమిటీల్లో సర్పంచ్ చైర్మన్‌గా ఉంటే, ఉపసర్పంచ్‌ను వైస్‌చైర్మన్‌గా గుర్తించాలని కోరారు. -
మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా వంశీ
నిర్మల్: మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జిల్లా కేంద్రానికి చెందిన అప్పాల వంశీ నియమితులయ్యారు. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం బలోపేతం, మున్నూరుకాపు యువత సంక్షేమం, సామాజిక అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర నాయకత్వం సూచించింది. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని వంశీ తెలిపారు. కార్యక్రమంలో మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యాదా క్రాంతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి అనిల్ కుమార్, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్చార్జి ఎర్రం సంజీవ్, సంఘ నాయకులు పాల్గొన్నారు. -
ఇళ్లలోకి పురుగులు వస్తున్నాయని ఆందోళన
లక్ష్మణచాంద: గోదాంల నుంచి తమ ఇళ్లలోకివస్తున్న లక్కపురుగులతో ఇబ్బందిగా ఉందని సోమవారం బోరిగాం తండావాసులు గోదాంల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోరిగాంలో 20వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కల్గి న గోదాములలో బియ్యం నిల్వ చేశారన్నా రు. ఇటీవల గోదాంల నుంచి పురుగులు ఇళ్లలోకి వస్తుండటంతో ఇబ్బంది పడుతున్నా మన్నారు. ఎంపీడీవో నసీరుద్దీన్ సంఘటన స్థలానికి వెళ్లి వేర్‌హౌస్ గోదాం మేనేజర్ శివరామకృష్ణతో ఫోనన్‌లో మాట్లాడి.. గ్రామస్తులతోనూ మాట్లాడించారు. పురుగులు రాకుండా చర్యలు చేపడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
అర్జీల పరిష్కారంలో ఆలస్యం వద్దు
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయవద్దని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి 96 దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తొమ్మిదేళ్ల క్రితం నాటివే..
ప్రభుత్వం తొమ్మిదేళ్ల క్రితం అద్దె నిర్ణయించింది. అదే ఇప్పటి వరకు కొనసాగుతోంది. డీజిల్, పెట్రోలు ధరలు నిత్యావసరాలు పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చే అద్దె సరిపోవడం లేదు. అద్దె పెంచితేనే గిట్టుబాటు అవుతుంది. – రాజశేఖర్, అద్దె వాహన యజమాని వాహనాల అద్దె పెంచాలి 2023 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అద్దె వాహనాలను కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఉత్తర్వులు వస్తేనే పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామంటున్నారు. ప్రభుత్వం మా బాధలు అర్థం చేసుకుని వాహనాల అద్దె పెంచాలి. – మహిపాల్, అద్దె వాహన యజమాని -
పట్టణవాసి.. ఎందుకీ లేజీ..!
నిర్మల్స్వయం ఉపాధిలో అతివ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరిన మహిళలు బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.బాసరలో వ్యాసపౌర్ణమి ఉత్సవాలు బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వ్యాస పౌర్ణమి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. మెరుగైన వైద్యసేవలు అందించాలి భైంసాటౌన్: ముధోల్ నియోజకవర్గ ప్రజ లకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను కోరారు. హైదరాబాద్‌లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రికి విన్నవించారు. భైంసా ఏరియా ఆస్పత్రిని 150 పడకలకు పెంచాలని, డయాలసిస్ పడకలు పెంచాలని, వంద పడకలతో మెటర్నటీ ఆస్పత్రి నిర్మించాలని, కుభీర్ ఆస్పత్రిని 30 పడకలకు పెంచాలని, ముధోల్ ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తి చేయాలని విన్నవించారు. అన్ని ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, స్టాఫ్ నర్స్, ఇతర పోస్టులు భర్తీ చేయాలన్నారు. కుభీర్, బాసరతో పాటు భైంసాకు అదనంగా అంబులెన్స్ కేటాయించాలని కోరారు. నిర్మల్: పట్టణ ప్రాంత ప్రజలు ప్రతీ విషయంలో ముందుంటారనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. కానీ.. చాలా విషయాల్లో అది తప్పవుతోంది. ప్రధానంగా ఓటు వేయడం, ఓట్లను కాపాడుకోవడం వంటి ముఖ్యమైన విషయాల్లోనూ ఇదే పరిస్థితి. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్ఐఆర్) విషయంలో జిల్లాలో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల ప్రజలు వెనుకంజలో ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియడానికి మరో వారమే గడువు ఉండగా, జిల్లాలోని నిర్మల్, భైంసా మున్సిపాలిటీలలో కలిపి ఇప్పటికీ వేలసంఖ్యలో ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్వోలకు తిరిగి చేరకపోవడం గమనార్హం. వెనుకంజలో నిర్మల్, భైంసా.. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో గణనీయ సంఖ్యలో ఓటర్లు ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించలేదు. ఖానాపూర్ 98 శాతంతో కొంతమేర ఫర్వాలేదు. కానీ.. నిర్మల్‌అర్బన్‌లో ఈనెల 27 ఉదయం వరకు 81.15 శాతం పూర్తయింది. ఇంకా 17,495 మంది డిజిటలైజేషన్ పెండింగ్ ఉంది. భైంసా అర్బన్‌లో 90.34 శాతం పూర్తయింది. ఇంకా 8,292 మంది డిజిటలైజేషన్ పూర్తి చేసుకోవడానికి ఫారాలు ఇవ్వలేదు. పల్లెలు భేష్.. జిల్లా కలెక్టర్ భవేశ్‌మిశ్రా, ఉన్నతాధికారులు ముందునుంచీ చెబుతున్న విషయాలన్నింటినీ పల్లెప్రజలు తు.చా.తప్పకుండా పాటిస్తున్నారు. బీఎల్వోలు వచ్చిఇచ్చిన వెంటనే అవసరమైన పత్రాలతో ఎన్యూమరేషన్ ఫారాలు నింపి అప్పగించారు. గడువుకంటే పదిరోజుల ముందే జిల్లాలోని దస్తురాబాద్, కడెం, పెంబి, మామడ, దిలావర్పూర్, లక్ష్మణచాంద, నర్సాపూర్(జి), నిర్మల్‌రూరల్, సారంగపూర్, సోన్, బాసర, కుభీర్, కుంటాల, ముధోల్ మండలాల్లో వందశాతం సర్ ప్రక్రియను సిబ్బంది పూర్తి చేశారు. లోకేశ్వరం 99.90, తానూరు 99.98 శాతంతో మొత్తం ప్రక్రియ పూర్తికి అతిసమీపంలో ఉన్నాయి. వారమే గడువు.. ఎస్ఐఆర్ ఆగస్టు 3తో ముగియనుంది. ఆలోపే తమ ఓటును కాపాడుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. మున్ముందూ ఓటుహక్కు పొందడంలో ఇబ్బందులూ ఏర్పడవచ్చు. ఇప్పటికై నా పట్టణ ప్రాంత ఓటర్లు సోమరితనం, నిర్లక్ష్యం వీడి అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు. అద్దె ‘ఓనర్ల’ గోస!లక్షకు పైగా ఓట్లు పోయినట్లే..! ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పూర్తయిన తర్వాత దాదాపు లక్షకు పైగా ఓట్లు జాబి తాలో నుంచి పోనున్నాయి. ప్రస్తుత జాబి తా ప్రకారం జిల్లాలో 925 పోలింగ్ కేంద్రా ల పరిధిలో 7,55,344 మంది ఓటర్లు ఉ న్నారు. ఇందులో ఇప్పటి వరకు 7,27,503 మంది ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. ఇక వందశాతం డిజిటలైజేషన్ పూర్తయిన పోలింగ్ కేంద్రాల పరిధిలో ఏఎస్డీ జాబితాలను కూడా పూర్తిచేశారు. ఏఎస్డీ అంటే.. అబ్సెంట్(ఫారాలు ఇవ్వనివారు), ఫిఫ్టెడ్(తరలివెళ్లినవారు), డెత్(చనిపోయినవారు) అలాగే డబుల్ఓట్ (రెండుచోట్ల ఓట్లు ఉన్నవారు) అని అర్థం. ఈ జాబితా ఈ కేటగిరీల వారికి సంబంధించిన వివరాలన్నీ నమోదు చేస్తారు. వీటితో పాటు ఆ ఓటు ఎందుకు తిరస్కరణకు గురైందనే కారణాన్నీ అందులో నోట్ చేస్తారు. సదరు జాబితాపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, చివరకు కలెక్టర్ సంతకాలు తీసుకుని ఫైనల్ చేస్తారు. ఈనెల 27 వరకు ఏఎస్డీ జాబితాల్లో మొత్తం 91,484 మంది ఓటర్ల పేర్లు నమోదయ్యాయి. అంటే వీరందరి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోనున్నాయి. వచ్చేనెల 3న గడువు ముగిసే వరకు జిల్లాలో లక్షకు పైగా ఓటర్ల పేర్లు పోనున్నట్లు అంచనా వేస్తున్నారు.ఈనెల 27వరకు ఎస్ఐఆర్ వివరాలు.. మొత్తం పోలింగ్ స్టేషన్లు 925 మొత్తం ఓటర్లు 7,55,344 పంపిణీ చేసిన ఎన్యూరేషన్ ఫారాలు 7,55,344 ఆఫ్‌లైన్‌లో డిజిటలైజ్ చేసినవి 6,36,019 ఆన్లైన్లో డిజిటలైజ్ చేసినవి 91,484 మొత్తం డిజిటలైజ్ చేసినవి 7,27,503 డిజిటలైజేషన్ శాతం 96.31 డిజిటలైజేషన్ చేయాల్సిన ఫారాలు 27,841 డిజిటలైజేషన్ పూర్తయిన పోలింగ్ స్టేషన్లు 742 సిద్ధం చేసిన ఏఎస్డీ జాబితాలు 925 ఏఎస్డీ జాబితాలో ఉన్న ఓటర్లు 91,484 పట్టణాల్లో స్పందనేదీ..!? గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లిన బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఎక్కువశాతం ఫారాలను సేకరించగా పట్టణాల్లో మాత్రం స్పందన ఆశించిన స్థాయిలో లేదు. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల కారణంగా కొంతమంది ఇవ్వడం లేదు. కొందరు రేపోమాపో ఇద్దామంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంట్లో ఫారాలను తిరిగి ఇచ్చేవారు లేకపోవడం, మరికొందరు చివరి రోజుల్లో ఇస్తామని వాయిదా వేయడం, తదితర కారణాలతో అర్బన్ ప్రాంతాల్లో సర్ నెమ్మదించింది. ఎన్నికల సమయాల్లోనూ అర్బన్ ఓటర్లు సోమరితనం ప్రదర్శిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటర్లు 88 శాతం పోలింగ్ నమోదు చేయగా, మున్సిపాలిటీ ఎన్నికల్లో నిర్మల్‌లో పట్టణ ఓటర్లు 65.60 శాతమే నమోదు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పట్టణ ప్రాంతాల్లో చాలామంది ఓటర్లు ఓటేసేందుకు ముందుకు రాలేదు. ఏ ఒక్కరూ మిస్ కావొద్దు.. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అనేది చాలా ప్రధానమైనది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకున్నవారు వెంటనే నింపి బీఎల్వోలకు తిరిగి ఇచ్చేయాలి. నిర్మల్, భైంసాలో కొంత వెనుకంజలో ఉన్నాం. మిగితా మండలాల్లో ప్రక్రియను వందశాతం పూర్తి చేశాం. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఏఎస్డీ జాబితాలనూ పూర్తి చేశాం. – భవేశ్‌మిశ్రా, కలెక్టర్ -
వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. రుతుపవనాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. వాతావరణం చల్లగా ఉంటుంది. ఎల్‌నినోను ఎదుర్కోవాలంటే పంటమార్పిడి తప్పనిసరి నిర్మల్‌రూరల్: ఎల్‌నినోను ఎదుర్కోవాలంటే రైతులు పంటమార్పిడి విధానాలను అవలంబించి, తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు మళ్లాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. సోమవారం నిర్మల్ మండలం చిట్యాల రైతు వేదికలో జిల్లాస్థాయి విత్తన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పత్తి, కూరగాయలు, తదితర విత్తనాలను పంపిణీ చేశా రు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ని నోను దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాలను సంరక్షిస్తూ తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు, ఉద్యానవన పంటలు, కూరగాయల సా గును ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు దీర్ఘకాలికంగా లాభదాయకమన్నారు. జిల్లాలో ప్రస్తుతం 8,751 ఎకరాల్లో సాగు చేస్తుండగా వచ్చే ఏడాది మరో 5 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్ర ణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు అవసరానికి మించి రసాయనిక ఎరువులు వినియోగించకుండా, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. భూసారాన్ని కాపాడేందుకు నానో యూరియా వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి రమణ, ఏవో వసంతరావు, సర్పంచ్ సుప్రియ, రైతులు పాల్గొన్నారు. డిప్యూటీ ఈఈ బాధ్యతల స్వీకరణ బాసర: శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానంలో నూతన డిప్యూటీ ఈఈగా నియమితులైన శేషగిరిరావు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈవో గంగ శ్రీనివాస్ వేదపండితుల సమక్షంలో శేషగిరిరావును శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. -
ఉపాధ్యాయుల మౌఖిక డిప్యూటేషన్లు రద్దు చేయాలి
నిర్మల్‌రూరల్: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఉపాధ్యాయుల మౌఖిక డిప్యూటేషన్లు వెంటనే రద్దు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశ్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని దస్తురాబాద్, ఖానా పూర్, కుంటాల, కుభీర్, ముధోల్, భైంసా మండలాల్లో జరుగుతున్న అక్రమ మౌఖిక డి ప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని కోరా రు. జీవో 25 ప్రకారం డిప్యూటేషన్లను కలెక్టర్ అనుమతితో ఇవ్వాల్సి ఉండగా ఇందుకు వి రుద్ధంగా నడుస్తున్నాయన్నారు. కలెక్టర్ జో క్యం చేసుకుని అవసరం ఉన్న మేరకే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని కోరారు. స మావేశంలో ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
అటవీశాఖ చీఫ్ సెక్రెటరీని కలిసిన ఎమ్మెల్యే
ఖానాపూర్: నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం సచివాలయంలో రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ సెక్రటరీ అహ్మద్ నదీమ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అటవీ శాఖ అధికారుల వేధింపులు, అనవసర ఆంక్షలను అరిక ట్టి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. టైగర్ రిజర్వ్ పరిధిలోని మండలాల్లో ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎస్‌జెడ్) అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలు, అపోహలను నివృత్తి చేస్తూ విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రోడ్ల అభివృద్ధి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగేందుకు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల నిర్వహణకు అటవీ శాఖ నుంచి అనవసర అడ్డంకులు కల్పించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరారు. -
పార్‌పెల్లిలో మహావృక్షం
లక్ష్మణచాంద: మండలంలోని పార్పెల్లి గ్రామ సమీ పానగల గోదావరి నది ఒడ్డునున్న రామాలయం వె నుక భారీ మర్రి వృక్షం ఉంది. దాదాపు మూడు గుంటల విస్తీర్ణంలో ఇది విస్తరించింది. ఊడలు భూ మిలోకి దిగి మరిన్ని వృక్షాలుగా ఎదిగాయి. గోదా వరి నీటి ప్రవాహానికి చెట్టు దెబ్బతినకుండా ఉండేందుకు గ్రామస్తులు చుట్టూ సిమెంట్ గద్దె నిర్మించారు. ఇది గ్రామస్తులు, మూగజీవాలకు నీడనిస్తూ సేద తీరుస్తోంది. ఈ వృక్షం గురించి సారంగపూర్ డిప్యూటీ ఎఫ్ఆర్వో నజీర్ఖాన్ను సంప్రదించగా.. ఇది 80ఏళ్ల మర్రి వృక్షమని పేర్కొన్నారు. -
నూతన నియామకం
నిర్మల్: అఖిల భారత యాదవ మహాసభ యు వజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా శీల మణిదీప్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేర కు రాష్ట్ర అధ్యక్షుడు గోర్ల యశ్వంత్‌రాజ్ యాద వ్, జాతీయ ప్రధానకార్యదర్శి లక్ష్మ ణ్‌యాదవ్ చేతుల మీదుగా ఆదివారం హైదరాబాద్‌లో నియామక పత్రాన్ని అందుకున్నారు. యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్రనాథ్ యాదవ్ ఆమోదంతో ఈ నియామకం చేపట్టినట్లు యశ్వంత్‌రాజ్ యాదవ్ పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర నాయకత్వానికి మణిదీప్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ పట్టణంలోని అత్యంత పురాతాన గండి రామన్న దత్తసాయి ఆలయ ధర్మకర్తల కమిటీ చైర్మన్‌గా పట్టణానికి చెందిన కొట్టే శేఖర్ నియమితులయ్యరు. ఈమేరకు దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మ కర్తలుగా ఓద్నామ్ నర్సయ్య, ఆనంద్, రాథోడ్ పంచపూల, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రోహిత్ కుమార్ గౌతమ్‌ను నియమించారు. వీరి పదవీకాలం రెండేళ్లపాటు ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. ఆలయాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. -
ఈ కేవైసీ పూర్తయ్యేనా?
భైంసాటౌన్: పౌరసరఫరాల శాఖ తెల్లరేషన్‌కార్డు దారులకు ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. ఈనెల 31లోపు కార్డులోని కుటుంబ స భ్యులంతా సమీప రేషన్ డీలర్ వద్ద ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది. ఈ కేవైసీ చేసుకోనివారికి ఆగస్టు నుంచి రేషన్ కోటా నిలిపివేస్తామని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారంలో పంపిణీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులు కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకున్నవారికే ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. లబ్ధి దారులందరికీ రేషన్ సక్రమంగా అందించేందుకు, మరణించిన, అనర్హుల పేర్లు తొలగింపు, నకిలీ కార్డులు ఏరివేసేందుకే కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లాలో 412 రేషన్ దుకాణాలున్నాయి. వీటి పరిధిలో అన్నపూర్ణ, అంత్యోదయ, తెల్లకా ర్డుదారులకు ప్రతీనెల 4,867.16 మెట్రిక్ ట న్నుల బియ్యం అందిస్తున్నారు. ఆగస్టు నుంచి మూడునెలల కోటా ఒకేసారి పంపిణీ చేయనున్నారు. జిల్లాలో మొత్తం 2,49,606 కార్డులుండగా, ఇప్పటివరకు 91.17 శాతం కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయింది. అ లాగే, 7,74,020 మంది లబ్ధిదారులుండగా, 73.27 శాతమే ప్రక్రియ పూర్తయింది. మిగతావారూ గడువులోపు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా చేయించుకోవాలి ప్రభుత్వం రేషన్‌కార్డులకు ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. ఈనెలాఖరుతో గడువు ముగుస్తుంది. సమీప రేషన్ దుకాణాల్లో ఎక్కడైనా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దూరప్రాంతాల్లో పిల్లలుంటే అక్కడి రేషన్ దుకాణాల్లోనూ చేయించుకోవచ్చు. – రాజేందర్, డీసీఎస్వో జిల్లాలోని రేషన్ సమాచారం మొత్తం రేషన్‌కార్డులు 2,49,606 లబ్ధిదారుల సంఖ్య 7,74,020 కేవైసీ పూర్తయిన కార్డులు 2,27,554 కేవైసీ పూర్తయిన లబ్ధిదారులు 5,67,129 -
నిర్మల్
నిర్మల్ డాక్టర్‌కు పురస్కారం నిర్మల్: జిల్లాకేంద్రానికి చెందిన ఫెర్టిలిటి వైద్యురాలు చంద్రిక అవినాష్ రాష్ట్రస్థాయి ఎక్సలెన్సీ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రదానోత్సవంలో గైనకాలజీ విభా గంలో రోగులకు మెరుగైన సేవలు అందించినందుకుగాను ఈ పురస్కారం దక్కింది. మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా డాక్టర్ చంద్రిక అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు, కుటుంబ సభ్యులు, దేవీ బాయి ఆస్పత్రి సిబ్బంది హర్షం వ్యక్తంచేశారు. నిర్మల్‌చైన్‌గేట్: ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపునకు దరఖాస్తుదారులు పెద్దగా స్పందించడం లేదు. ఎల్ఆర్ఎస్–2020 స్కీం కింద ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ ఈ నెల 31తో గడువు విధించినా జిల్లాలో ఆశించిన స్థా యిలో చెల్లింపుదారులు ముందుకు రావడంలేదు. దరఖాస్తుదారుల్లో చాలామంది ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, కొందరు ప్లాట్లు కూడా విక్రయించారు. దీంతో రెండు విడతల్లో ప్రభుత్వం రాయితీ ప్రకటిస్తే.. అంతంత మాత్రంగానే ముందుకువకొ చ్చారు. జిల్లాలో మున్సిపాలిటీలకు దరఖాస్తులు అ ధికసంఖ్యలో వచ్చినా ఫీజు చెల్లింపులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్లాట్ల క్షేత్రస్థాయి పరిశీలనను అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటంతో పాటు ఫీజు చెల్లించిన వారికి ప్రొసీడింగ్స్ జారీలో తీవ్రజాప్యం జరుగుతుండటంతోనే దరఖాస్తుదారులు ఫీజు చెల్లింపునకు ముందుకు రావడంలేదని తె లుస్తోంది. అప్పట్లో చాలామందికి అవగాహన లేక ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయలేదు. దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తే, ప్రభుత్వానికి ఫీజుల రూపంలో మరింత ఆదాయం సమకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రచారంలో వెనుకబాటు అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినవా రు ఇంటి నిర్మాణ అనుమతుల కోసం ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అమలు చేసింది. కానీ, 25శాతం రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మున్సి పాలిటీలు వెనుకబడ్డాయి. విస్తృత ప్రచారం చేపట్టకపోవడంతో చాలామంది రాయితీపై ఫీజు చెల్లించేందుకు ముందుకు రాలేదనే ఆరోపణలున్నాయి. మొ దట్లో బ్యానర్ల ద్వారా కొద్దిరోజులు ప్రచారం నిర్వ హించి వదిలేసినట్లు ప్రచారం సాగుతోంది. ఫలితంగా ఫీజు చెల్లింపు గడువు ముగిసే సమయానికి ప్ర భుత్వానికి రావాల్సిన ఆదాయం సమకూరే అవకా శం కనిపించడం లేదు. గడువు ముగిసిన తర్వాత 25శాతం రాయితీ వర్తించకపోవచ్చని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లబ్ధిపొందాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో లక్ష్యం దాటలే.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మంది కూడా ఫీజు చెల్లించలేదు. మొత్తం 26,537 మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయగా.. ప్లాట్ల యజమానులకు నేరుగా ఫీజు చెల్లింపు సమాచారాన్ని పంపించారు. ఇందులో 3,126 దరఖాస్తులను వివిధ దశల్లో తిరస్కరించారు. 21,850 దరఖాస్తులను ఆమోదించారు. ఇప్పటివరకు చేపట్టిన మూడు విడతల్లో 5,104 మంది ఫీజు చెల్లించారు. ఇంకా 16,746 మంది ఫీజు చెల్లించాల్సి ఉంది. గజ్జలమ్మా.. కరుణించమ్మా.. కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాల్లో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ పూజలు చేశారు. కుంటాలకు చెందిన చేపూరి లక్ష్మీవిశారద, ది వంగత చంద్రప్రకాశ్ కుమారుడు వినయబా బు రూ.35వేల విలువైన 2.2 గ్రాముల బంగా రు పుస్తెలు చేయించి మొక్కు చెల్లించుకున్నా రు. వీరిని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. అర్చకులు శ్రీకాంత్ రామానుజదాస్, న గేశ్ ఆధ్వర్యంలో గజ్జలమ్మకు అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి, పల్లకీసేవ తదితర పూ జలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. జిల్లాకు సంబంధించి దరఖాస్తుల వివరాలు వచ్చిన దరఖాస్తులు 44,602 చెల్లింపునకు అర్హత పొందినవి 37,939 ఫీజు చెల్లించిన వారు 10,446 ఇంకా చెల్లించాల్సినవారు 29,624మండలాల వారీగా దరఖాస్తులు ఇలా.. మండలం దరఖాస్తులు ఫీజు అనుమతి ఫీజు చెల్లించినవి చెల్లించాల్సినవి పొందినవి బాసర 2,607 2,384 547 1,837 భైంసా 1,581 1,415 227 1,188 దస్తురాబాద్ 6 6 0 6 దిలావర్పూర్ 174 148 19 129 కడెం 77 66 9 57 ఖానాపూర్ 1,650 1,574 278 1,296 కుభీర్ 622 301 20 281 కుంటాల 388 350 74 276 లక్ష్మణచాంద 269 253 28 225 లోకేశ్వరం 346 294 50 244 మామడ 59 58 5 53 ముధోల్ 650 559 79 480 నర్సాపూర్(జి) 218 190 53 137 నిర్మల్‌రూరల్ 5,607 5,128 1,158 3,970 పెంబి 65 40 4 36 సారంగపూర్ 1,991 1,889 385 1,504 సోన్ 1,588 1,299 270 1,029 తానూర్ 167 135 24 111 ఖానాపూర్ 1,929 1,518 219 1,299 నిర్మల్ 15,550 12,987 3,788 9,199 భైంసా 9,058 7,345 1,097 6,248 సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం కల్పించిన 25శాతం ఎల్ఆర్ఎస్ ఫీజు రిబేట్ ఈ నెల 31వ తేదీతో ముగుస్తుంది. అర్హులైన దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తక్కువ ఫీజుతో తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలి. మున్సిపాలిటీ తరఫున దీనిపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. చివరి నిమిషం వరకు వేచిచూడకుండా దరఖాస్తుదారులు వెంటనే ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. – రవిబాబు, నిర్మల్ మున్సిపల్ కమిషనర్ మూడు దశల్లో పరిశీలన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన మూడు దశల్లో చేపడుతున్నారు. మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులు సంయుక్తంగా ప్లాట్లను పరిశీలించి.. నిబంధనల మేరకు క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మొదటి దశలో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాల్సి ఉంది. రెండో దశలో మరోసారి వివరాలు ధ్రువీకరించి ఆన్లైన్లో నమోదు చేయాలి. చివరి దశలో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే మున్సిపల్ కమిషనర్ తుది ప్రొసీడింగ్ జారీ చేస్తున్నారు. -
నిర్మల్
ఓపెన్ యూనివర్సిటీకి ఎంపిక ముధోల్: నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సి టీ) అధ్యయన కేంద్రంగా ఎంపికై నట్లు కళాశా ల ప్రిన్సిపాల్ కర్రోల్ల బుచ్చయ్య తెలిపారు. శనివారం భైంసా పట్టణంలో ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ను అధ్యాపకులతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఓపెన్ యూనివర్సిటీ మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేను శాలువా తో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌తోపాటు కోఆర్డినేటర్ పవన్ పాండే, అధ్యాపకుడు సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ.. అధ్యయన కేంద్రం ఏర్పాటుతో ముధోల్ పరిసర ప్రాంతాల విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు. -
● రెండేళ్లయినా అందని రుణాలు ● తీవ్ర నైరాశ్యంలో నిరుద్యోగులు ● కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ ● సర్కారు నుంచి స్పష్టత కరువు
నిర్మల్‌చైన్‌గేట్: నిరుద్యోగ యువతకు స్వయం ఉ పాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపె ట్టిన రాజీవ్ యువ వికాసం అమలు ప్రశ్నార్థకంగా మారింది. వివిధ యూనిట్లకు సబ్సిడీ రుణాల కో సం దరఖాస్తు చేసుకున్న వేలాదిమంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నిత్యం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వ మూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. జిల్లాలో 35వేలకు పైగా దరఖాస్తులు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి రాజీవ్ యువ వికాసం పథకం కింద రాయితీ ర ణాలు ఇవ్వడానికి నిర్ణయించింది. 2025 జూన్ 2 నుంచి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుద్యోగ యువత నుంచి సుమారు 35వేలకు పైగా దరఖాస్తులు స్వీకరించింది. అర్హులను ఎంపిక చేసి మంజూరైన యూని ట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. చివరి క్షణంలో రుణాల పంపిణీ వాయిదా వేసింది. యూనిట్లు.. సబ్సిడీలు ఇలా.. రాజీవ్ యువ వికాసం కింద వివిధ యూనిట్లకు ఇ చ్చే సబ్సిడీ రుణ మొత్తాన్ని ఐదు రకాలుగా ప్రభుత్వం విభజించింది. రూ.50వేల యూనిట్‌కు మాత్ర మే 100శాతం సబ్సిడీతో రుణం ఇవ్వనున్నట్లు తెలి పింది. రూ.లక్ష యూనిట్లో రూ.90వేలు ప్రభుత్వం రాయితీ ఇవ్వనుండగా, రూ.10వేలు బ్యాంక్ రుణంగా, రూ.2లక్షల యూనిట్లో రూ.1.60 లక్షలు ప్రభుత్వం, రూ.40 వేలు రుణం, రూ.3లక్షల యూనిట్లో రూ.2.10 లక్షలు ప్రభుత్వం, రూ.90 వేలు రుణం, రూ.4లక్షల యూనిట్లో రూ.2.80 ల క్షలు ప్రభుత్వం రాయితీ ఇవ్వనుండగా, రూ.1.20 లక్షలు బ్యాంక్ రుణంగా ఇవ్వాలని నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకటించి.. లబ్ధిదారులను ఎంపిక చేసి ఐదు విడతల్లో రుణాలు మంజూరు చేస్తామని ప్రభుత్వం షెడ్యూల్ కూడా ప్రకటించింది. 2025 జూన్‌లో రూ.50వేల నుంచి రూ.లక్ష యూనిట్లను లక్ష మందికి, జూలైలో రూ.లక్ష నుంచి రూ.2లక్షల యూనిట్లను లక్ష మందికి, ఆగస్టులో రూ.2లక్షల నుంచి రూ.3 లక్షల యూనిట్లను లక్ష మందికి, సెప్టెంబర్‌లో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల యూనిట్లను లక్ష మందికి, అక్టోబర్‌లో రూ.4 లక్షల యూనిట్లను మరో లక్ష మందికి ఇవ్వనున్నట్లు నిర్ణయించింది. దరఖాస్తుదారుల్లో నిరాశ తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం యూ నిట్ల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేయడంతో దరఖాస్తుదారులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. తొలుత దరఖాస్తుదారులకు మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఆ తర్వాత అర్హులైన వారికి యూనిట్ విలువ ప్రకారం ఐదు విడతల్లో గత అక్టోబర్ వరకు మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలివిడతలో కేటగిరి–1లో రూ.50 వేలు, కేటగిరి–2లో రూ.లక్ష వరకు ఎంపికై న వారికి మంజూరు పత్రాలు పంపిణీ చేసి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, ఈ ప్రక్రియ వాయిదా పడటంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఆదేశాలు రావాల్సి ఉంది రాజీవ్ యువ వికాసానికి సంబంధించి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించాం. రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని జూన్ 2న ప్రారంభించాలని భావించినా కొన్ని కారణాలతో వాయిదా వేసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తాం. – శ్రీనివాస్, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి మండలాలు, కార్పొరేషన్ల వారీగా వచ్చిన దరఖాస్తులు మండలం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ బాసర 25 196 403 115 భైంసా 82 638 1,228 253 దస్తురాబాద్ 161 302 488 2 దిలావర్పూర్ 130 191 534 163 కడెం 412 690 930 83 ఖానాపూర్ 274 536 957 67 కుభీర్ 469 431 1,234 107 కుంటాల 94 261 799 89 లక్ష్మణచాంద 103 280 717 78 లోకేశ్వరం 110 431 811 74 మామడ 325 238 501 124 ముధోల్ 95 338 586 298 నర్సాపూర్ (జి) 88 229 644 164 నిర్మల్ రూరల్ 178 334 869 70 పెంబి 207 97 234 20 సారంగపూర్ 499 425 1,387 160 సోన్ 101 204 722 75 తానూర్ 143 375 755 95 భైంసా (ము) 21 383 952 1,218 ఖానాపూర్ (ము) 28 259 784 340 నిర్మల్ (ము) 82 514 2,757 2,376జిల్లా కేంద్రానికి చెందిన పరమేశ్వర్ ఆటో కొనుగోలు చేయడానికి రాజీవ్ యువ వికాసం కింద రూ.4లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సిబిల్ స్కోర్ బాగుండటంతో బ్యాంకర్లు అతనికి జాబితాలో మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. రెండేళ్లయినా పరమేశ్వర్‌కు రుణం మంజూరు కాలేదు. ఆటో నడిపి ఉపాధి పొందుతామని ఆశించిన అతడు ఆందోళన చెందుతున్నాడు. ఇలా జిల్లాలోని చాలామంది దరఖాస్తుదారులు రాయితీ రుణాల కోసం ఎదురుచూస్తున్నారు.కార్పొరేషన్ దరఖాస్తులు మంజూరైన రాయితీ యూనిట్లు (రూ.కోట్లలో) ఎస్సీ 7,350 2,894 39.96 ఎస్టీ 3,627 2,325 25.35 బీసీ 17,286 3,876 41.00 ఏంబీసీ/ ఈబీసీ 923 842 8.90 మైనార్టీ 5,926 1,045 17.41 క్రిస్టియన్ 65 27 0.42 -
మంత్రి రాజీనామా విద్యార్థులు, కాంగ్రెస్ విజయం
లక్ష్మణచాంద: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థులు, కాంగ్రెస్ సాధించిన విజయంగా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు పేర్కొన్నారు. శనివారం కనకాపూర్ చౌరస్తాలో ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీతో లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలు తారుమారయ్యాయని తెలిపారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంతో కేంద్ర మంత్రి రాజీనామా చేయడం విద్యార్థులు, కాంగ్రెస్ సాధించిన విజయంగా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఎంసీ చైర్మన్ భీంరెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్, పార్టీ మండలాధ్యక్షుడు నరేశ్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్, నాయకులు ప్రతాప్‌రెడ్డి, వెంకటరాజు, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ
నిర్మల్ రూరల్: ఉపాధ్యాయులు, ఉద్యోగుల హక్కుల సాధనకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 1న హైదరాబాద్‌లో తలపెట్టిన మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు శశిరాజ్ మాట్లాడుతూ.. ధర్నాకు ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్, రాష్ట్ర బాధ్యుడు రాజేశ్వర్, జిల్లా బాధ్యులు ముత్యం, అశోక్, రాజేశ్వర్, వాసుదేవరెడ్డి, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయులు -
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళి
ముధోల్: నీట్ పేపర్ లీకేజీతో ఆత్మహత్యకు పాల్ప డ్డ విద్యార్థులకు శనివారం మాజీ ఎమ్మెల్యే విఠల్‌రె డ్డి, కాంగ్రెస్ నాయకులు మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కు టుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇ వ్వాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి పోతన్నయాదవ్, మండలాధ్యక్షుడు సాపేవార్ కిష్టయ్య, అఫ్రోజ్‌ఖాన్, మగ్ధమ్, సూర్యంరెడ్డి, విశ్వంభర్, బాబు, సమీఉల్లాఖాన్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. నిర్మల్‌చైన్‌గేట్: నీట్ పేపర్ లీకేజీ ఘటన, విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడిని నిరసిస్తూ పట్టణంలో వివేకానంద చౌక్ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి శ్రీహరిరావు, మాజీ మంత్రి ఐకేరెడ్డి, నిర్మల్ ఏఎంసీ చైర్మన్ సోమ భీంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, అధికసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణ, ఫిట్నెస్ తప్పనిసరి
నిర్మల్‌టౌన్: పోలీస్ అధికారులు, సిబ్బందికి క్రమశిక్షణ, ఫిట్నెస్ తప్పనిసరి అని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. శనివారం జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్‌లో జిల్లాలోని సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. సిబ్బంది ప్రదర్శించిన డ్రిల్, స్క్వాడ్ డ్రిల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్ ఫిజి కల్ ఫిట్‌నెస్‌కు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు బా గా ఉపయోగపడుతుందని తెలిపారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. విధి నిర్వహణ, ఆరోగ్య, వ్యక్తిగత స మస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని తెలి పారు. చెడు వ్యసనాలతో విధులను నిర్లక్ష్యం చేసి పోలీస్‌శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించరాదని సూచించారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్, డీఎస్పీ శ్రీనివాస్, అధికారులు సమ్మయ్య, గోవర్ధ న్, కృష్ణ, ప్రవీణ్, రాంనిరంజన్, శేఖర్ పాల్గొన్నారు. పుష్కరాల భద్రత ఏర్పాట్లపై సమీక్ష గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా భక్తుల కు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం క ల్పించేందుకు చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లపై డీజీపీ కార్యాలయం నుంచి ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ మురళీధర్ భగవత్ రాష్ట్రంలోని పుష్కర జి ల్లాల పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి ఎస్పీ జానకీ షర్మిల పాల్గొన్నారు. పుష్కర ఘాట్ల వద్ద వాచ్ టవర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, సీసీటీవీ నిఘా వ్యవస్థలు, డ్రోన్ సర్వైలై న్స్, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర స్పందన బృందాలు లాంటి భద్రత ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఏడీజీపీ ఆదేశించారు. బాసర, సోన్, సావర్గాం ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూ చించారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్, డీఎస్పీ శ్రీని వాస్, ఇన్స్పెక్టర్లు ప్రవీణ్, కృష్ణ, సత్యనారాయణ, దీపక్, రవీందర్, ఆర్ఐ రామ్‌నిరంజన్, సబ్ ఇన్స్పెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
‘జలసిరి’ని పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్‌చైన్‌గేట్: జలసిరి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మంత్రి సీతక్క, సెర్ప్ సీఈవో, పంచాయతీరాజ్ గ్రా మీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, ఇత ర అధికారులతో కలిసి అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులతో శనివారం జలసిరి, వీబీజీ రామ్ జీ పనులు, గ్రామపంచాయ తీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. భవిష్యత్‌లో నీటి సమ స్య తలెత్తకుండా ఉండేందుకు ‘జలసిరి’లో భాగంగా నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ‘ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత.. ప్రతీ పంట కు పంట కుంట.. ప్రతీ ఊరికి ఊట కుంట’ నినా దంతో భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. ప్రతీ రైతు పంట పొలాల్లో ఫామ్‌పాండ్ నిర్మించుకునేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల ద్వారా భూగర్భ జలాల సంరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. వీబీజీ రామ్ జీ కా ర్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప నుల్లో దేశంలోనే ముందువరుసలో ఉన్నామని పే ర్కొన్నారు. అర్హులైన పేద కూలీలందరికీ పని దినా లు కల్పించాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో విజ యలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా అధికారులు -
ఫసల్ బీమా యోజనను అమలు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణలో ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కిసా న్ మోర్చా కార్యదర్శి పడిపెల్లి గంగాధర్ డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్కుల సత్తయ్య యాదవ్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో అన్నదాతలు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. దేశంలోని 23 రాష్ట్రాల్లో పథకం అమలు చేస్తుండగా, తెలంగాణలో ఎందు కు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల ఆ దాయ భద్రత, వ్యవసాయ స్థిరత్వం కోసం, ప్రస్తు త ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఫసల్ బీమా అ త్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల రవీందర్‌రెడ్డి, జిల్లా కార్యాలయ కార్యదర్శి రాచకొండ సాగర్, జిల్లా మీడియా కన్వీనర్ బుర్ర రమేశ్‌గౌడ్, బీజేపీ నాయకులు కు మ్మరి వెంకటేశ్, సూరజ్, అయిండ్ల సాత్విక్, గణేశ్ కులకర్ణి, నారాయణ, తిరుమలేశ్ పాల్గొన్నారు. -
అధికారులను అవమానిస్తారా?
నిర్మల్: మున్సిపల్ కమిషనర్ సహా అధికారులపై ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి వ్యవహరించిన తీరు సరికా దని పలువురు కౌన్సిలర్లు మండిపడటంతో నిర్మల్ బల్దియా సమావేశం రసాభాసగా సాగింది. జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం వైస్‌చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇటీవల సమీక్ష పేరిట మున్సిపల్ అధికారులను రాజకీయ కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే అవమానించడం సరైన పద్ధతి కాదంటూ అధికార పార్టీకి చెందిన పలువురు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికా రులను గౌరవించే విధంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని, ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. సంబంధిత అధికారులు ఎస్సీ, బీసీ వర్గాలకు చెందినవారు కావడంతోనే ఇలా వ్యవహరించారా..? అదే స్థానాల్లో అగ్రవర్ణాలకు చెందిన అధికారులు ఉంటే ఇలా ప్రవర్తిస్తారా..? పట్టణంలో అభివృద్ధి పనులకు బీసీ చైర్‌పర్సన్‌ను ఆహ్వానించకుండా అడ్డుకుంటారా..? అంటూ కొందరు కౌన్సిలర్లు ప్రశ్నించారు. పట్టణ అభివృద్ధి పనుల విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని, ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని పలువు రు సభ్యులు పేర్కొన్నారు. వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణల కంటే పట్టణ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలని విపక్ష కౌన్సిలర్లు సూచించా రు. ఇందిరమ్మ ఇళ్లు, గుంతలు పడ్డ రోడ్లు, రూ.15 కోట్ల పనుల్లో నిధుల పెంపు, వీధిదీపాలు, తాగునీరు తదితర అంశాలపై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ రవిబాబు సమాధానాలిచ్చారు. అభివృద్ధికి సహకరించాలి నిర్మల్ ఎమ్మెల్యేగా మున్సిపల్ అభివృద్ధికి మహేశ్వర్‌రెడ్డి సహకరించాలని వైస్‌చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి సూచించారు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో చైర్‌పర్సన్‌ను ఆహ్వానించకపోవ డం ఏమిటని ప్రశ్నించారు. పక్కనున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యేలాగా నిర్మల్‌కూ నిధులు తీసుకువచ్చేందు కు ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి సహకరించాలని కోరా రు. కలిసికట్టుగా నిర్మల్‌ను అభివృద్ధి చేసేందుకు క ట్టుబడి ఉంటామని, మున్సిపల్ సమావేశాలకు వ స్తే ప్రతీదానికి సమాధానం చెబుతామని చెప్పారు. మార్కెట్, ట్రాఫిక్ సమస్య తీర్చాలి గాంధీ కూరగాయల మార్కెట్ సమస్యలు, ఫ్రీలెఫ్ట్ లేని చౌరస్తాలు, దుకాణాల ఎదుట టేలాల ఏర్పాటుపై కౌన్సిలర్లు శ్రీకాంత్‌యాదవ్, ఎస్.పీ.రాజు బ ల్దియా దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై త్వరలోనే చర్యలు చేపడతామని కమిషనర్ తెలిపారు. సమావేశంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులున్నారు.మాట్లాడుతున్న గణేశ్ చక్రవర్తిసమావేశంలో వాగ్వాదానికి దిగుతున్న కౌన్సిలర్లు -
సవతి కొడుకును సుపారీ ఇచ్చి చంపించిన సవతితల్లి
నిర్మల్‌టౌన్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 15న సంచలనం సృష్టించిన ఆటోడ్రైవర్ అస్లాంఖాన్ హత్య కేసు మిస్టరీ వీడింది. రూ.6లక్షలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని సవతి తల్లి హత్య చేయించింది. ప్రధాన కుట్రదారు అన్వరీబేగంతోపాటు మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్‌లోని ప్రధాన పోలీసు కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మీల శుక్రవారం వివరాలు వెల్లడించారు. నిర్మల్ పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన అస్లాంఖాన్(23)కు సవతి తల్లి అన్వరీబేగంతో కొంతకాలంగా వివాహేతరసంబంధం ఉంది. అతడు మరో యు వతిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోవద్దని, తమ సంబంధాన్ని కొనసాగించాలని ఒత్తిడి చేసింది.పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరించింది. ఈ విషయం అస్లాంఖాన్ తన బాబాయికి చెప్పడంతో కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిసి వివాదం ఏర్పడింది. అస్లాంఖాన్ భయంతో అదే కాలనీలోని తన బాబా యి ఇంటి వద్ద ఉంటూ ఆటో నడుపుతుండేవాడు. తమ సంబంధం అందరికీ తెలిసి పరువు పోయిందని, తనకు దూరమై మరో వివాహం చేసుకుంటాడని అన్వరీబేగం కక్ష పెంచుకుంది. రూ.6లక్షలతో సుపారీ హత్యకు మహారాష్ట్రకు చెందిన తన పరిచయస్తుడు ముఖీద్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.50వేలు చెల్లించి హత్య తర్వాత మిగతా మొత్తం చెల్లించడానికి ఒప్పందం చేసుకుంది. అస్లాంఖాన్ ఫొటోలు, వ్యక్తిగత వివరాలు అందజేసింది. తన సోదరుడు షేక్ మహమ్మద్‌కు కూడా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఈ కుట్రలో భాగస్వామిని చేసింది.అస్లాంఖాన్ హత్యకు ముఖీద్, అఫ్రోజ్, సాయినాథ్ పవార్ జూలై ఒకటిన నిర్మల్‌కు వచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద హత్యకు యత్నించగా.. జన సంచారం ఎక్కువగా ఉండడంతో వెనక్కి తగ్గి మహారాష్ట్రకు వెళ్లిపోయారు. తొలి ప్రయత్నం విఫలం కావడంతో జూలై 14న ముఖీద్, అఫ్రోజ్, షేక్ షాహిద్ అలియాస్ సల్మాన్, సాయినాథ్ పవార్ అద్దె స్కార్పియోలో మహారాష్ట్ర నుంచి బయల్దేరి నిర్మల్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అన్వరీబేగం, షేక్ మహమ్మద్‌లను కలిశారు. అస్లాంఖాన్ కదలికలను ఎప్పటికప్పుడు అన్వరీబేగం నిందితులకు చేరవేసింది. అస్లాంఖాన్ ప్రయాణికులతో ఆటోలో నిర్మల్ బస్టాండ్ వైపు వెళ్తుండగా.. ముఖీద్, అఫ్రోజ్ స్కారి్పయో వాహనం నుంచి దిగి అడ్డగించారు. అస్లాంఖాన్‌ను బయ టకు లాగి విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు.తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు మృతిచెందాడు. ఘటన అనంతరం నిందితులు నాందేడ్ వైపు పారిపోయారు. పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల ఆచూకీ గుర్తించారు. ముఖిద్, అఫ్రోజ్, షేక్ షాహిద్ అలియాస్ సల్మాన్, సాయినాథ్ పవార్, షేక్ మహమ్మద్‌లను అరెస్ట్ చేసి స్కార్పియో కారు, మోటార్‌సైకిల్, రెండు కత్తులు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.అన్వరీబేగంను ఈ నెల 17న అరెస్ట్ చేసి విచారించగా విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా పనిచేసిన నిర్మల్ డీఎస్పీ పి.శ్రీనివాస్, సీఐలు ఎం.కృష్ణ, రవీంద్రనాయక్, ఎస్సైలు జి.లింబాద్రి, ఎస్.శ్రీకాంత్, గోపి, గణేష్, అశోక్, దర్యాప్తు బృందాన్ని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
భైంసాటౌన్: యువత మత్తు పదార్థాలకు దూ రంగా ఉండాలని, విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడవద్దని భైంసా జూనియర్ సివిల్ జడ్జి ఆర్కే వెంకటరమణ సుహాస్ సూచించారు. ప ట్టణంలోని గురుకుల వొకేషనల్ కళాశాలలో ‘మాదకద్రవ్యాలు–యాంటీ ర్యాగింగ్‘పై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు హా జరై మాట్లాడారు. డ్రగ్స్ వినియోగం సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని తెలిపా రు. ర్యాగింగ్ చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణతో మె లగాలని సూచించారు. పట్టణ సీఐ సాయికుమార్, న్యాయవాదులు అమ్జద్ షేక్, చిన్నన్న, కళాశాల చైర్మన్ రామకృష్ణగౌడ్ పాల్గొన్నారు. -
చీడపీడల నివారణకు చర్యలు
కుంటాల: పత్తి, సోయాలో చీడపీడల నివారణకు చర్యలు చేపట్టాలని ముధోల్ ఏరువాక శాస్త్రవేత్తలు రాహుల్ విశ్వకర్మ, దినేశ్ సూచించారు. కుంటాల, ఓలా శివారులోగల పత్తి, సో యా పంటలను శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరి శీలించారు. రైతు సీపతి ముత్యం పత్తి పంటను పరిశీలించి అధిక సాంద్రత పత్తి సాగు, బోదెల విధానం, చీడ పీడల నియంత్రణపై మెళకువలు వివరించారు. రైతు సబ్బిడి గజేందర్ సో యా పంటను పరిశీలించి తెల్ల దోమ ఉధృతి ఎ క్కువగా ఉందని గుర్తించారు. ఎల్లో వీన్ మొజా యిక్ నివారణకు ఫిప్రోనిల్ లీటర్ నీటికి 2ఎంఎల్, ఉలాలా లీటర్ నీటికి 10ఎంఎల్ పిచికారీ చేయాలని సూచించారు. ఏఈవోలు శ్రీనివాస్, హర్షిత, రైతులు సబ్బిడి రాకేశ్, కుమ్మరి రమేశ్, గొల్ల గజేందర్ తదితరులున్నారు. -
ఎస్పీకి ఆహ్వాన పత్రిక
నిర్మల్‌టౌన్: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఈ నెల 27నుంచి 29వరకు నిర్వహించనున్న వ్యాస పూర్ణిమ ఉత్సవాలకు ఎస్పీ జానకీ షర్మిలను ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఆలయ ఈవో అంజనీదేవి, స్థానాచార్యుడు ప్రవీణ్ పాఠక్, ఉప ప్రధానా చార్యుడు శ్రీపాద్ దీక్షితులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని మ ర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదా శీర్వచనాలు అందించి, వ్యాస పూర్ణిమ ఉత్సవా ల ఆధ్యాత్మిక, వైదిక విశిష్టతను వివరించారు. -
ఇక స్మార్ట్‌గా రేషన్
నిర్మల్ప్రతి నీటిబొట్టూ ఒడిసి పట్టాలి లక్ష్మణచాంద: ప్రతీ వర్షపు చుక్కను ఒడిసి పట్టి భూగర్భ జలాల పెంపునకు తోడ్పాలని అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. జలసిరిలో భాగంగా మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరై ఫామ్‌పాండ్ పనులు ప్రారంభించారు. అనంతరం మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతీ రైతు పంట చేనులో ఫామ్‌పాండ్స్, బోరు బావుల వద్ద రీచార్జీ గుంతలు, ఇళ్లలో సోక్ ఫీ ట్స్ నిర్మించుకోవాలని సూచించారు. ప్రతీ గ్రా మంలో ఐదు ఫామ్‌పాండ్స్ నిర్మించేలాగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సర్పంచ్ ఓస కవిత రాజు, ఎంపీడీవో రమాకాంత్, ఎంపీవో నసీరుద్దీన్, ఏపీవో ప్రమీల, ఉప సర్పంచ్ వర్ష రవి, టీఏలు దినేశ్, భీమ్, నాయకులు రమేశ్, ఓస రాజు, పంచాయతీ కార్యదర్శి సుధాకర్ తదితరులున్నారు.నిర్మల్‌చైన్‌గేట్: ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంపు, లబ్ధిదారులకు మెరుగై న సేవలందించడమే ల క్ష్యంగా ప్రభుత్వం స్మా ర్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తీ సుకురానుంది. జిల్లా కు అవసరమైన కార్డులు ఇప్పటికే వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపా యి. ప్రభుత్వం నుంచి పంపిణీ కి తుది అనుమతి రాగానే దశలవారీ గా లబ్ధిదారులకు అందజేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2,49,606 రేషన్‌కార్డులు జారీ కానున్నా యి. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న కాగితపు ల్యామినేషన్ కార్డుల స్థానంలో ఏటీఎం కార్డు తరహాలో ఉండే పీవీసీ స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు. వీటిలో లబ్ధిదారుల పూర్తి వివరాలు, కుటుంబ స భ్యుల సమాచారం, ప్రత్యేక గుర్తింపు వివరాలు డిజి టల్ రూపంలో పొందుపరిచారు. కార్డు చిరిగిపోకుండా, నీటిలో తడిచినా వివరాలు చెరిగిపోకుండా దీర్ఘకాలం ఉపయోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. జిల్లాలో 2,49,606 కార్డులు జిల్లాలో 421 రేషన్ దుకాణాలు న్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,49,606 కార్డులున్నాయి. ఇందులో ఆహారభద్రత కా ర్డులు 2,36,562, అంత్యోదయకార్డులు 13,012, అన్నపూర్ణ కార్డులు 32 ఉండగా, నెలకు 4,867.168 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు జిల్లాలో లబ్ధిదారులకు ప్రత్యేకంగా రేషన్‌కార్డులు లేవు. గతంలో కొంత మందికి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆన్లైన్లో వచ్చే కాగితాలనే వాడుతున్నారు. రేషన్ కార్డు నంబర్ చెప్పినా డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏవైనా కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఆదాయం సర్టిఫికెట్, ఆరోగ్యశ్రీ పథకం కింద చికి త్స పొందాలన్నా రేషన్ కార్డులు అందుబాటులో లేక లబ్ధిదారులు ఇబ్బంది పడేవారు. పారదర్శకతకు పెద్దపీట స్మార్ట్ కార్డుపై యజమాని పేరు, చిరునామా ఉండటంతో పాటు సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటో ఉంటుంది. లబ్ధిదారు రేషన్ దుకాణానికి వెళ్లి డీలర్‌కు కార్డు ఇస్తే తన వద్ద ఉన్న ఈపాస్ యంత్రంలో స్కాన్ చేస్తారు. అందులో లబ్ధిదారుల వివరాలతో పాటు ఇప్పటివరకు తీసుకున్న, తీసుకోవాల్సిన రేషన్ సరుకుల వివరాలు కనిపిస్తాయి. స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. కార్డులో పొందుపరిచిన డిజిటల్ వివరాల ఆధారంగా లబ్ధిదారుల గుర్తింపు సులభమవుతుంది. బోగస్ కార్డులు, డూప్లికేట్ నమోదు లాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశముంది. ప్రభుత్వానికి కూడా లబ్ధిదారుల వివరాల నిర్వహణ మరింత సులభతరం కానుంది. ఆదేశాలు రాగానే పంపిణీ లబ్ధిదారులకు నూతనంగా స్మార్ట్‌కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా కుటుంబానికి ఒకటి చొప్పున స్మార్ట్ కార్డులు జిల్లాకు వచ్చాయి. ప్రభుత్వం నిర్ణయించిన తేదీ ప్రకారం పంపిణీ చేయనున్నాం. – రాజేందర్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారిసీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలిపన్నుల చెల్లింపు ఇక సులభం పురపాలక సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ పారదర్శకంగా, వేగంగా సేవలందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏకీకృత పన్ను విధానానికి శ్రీకారం చుట్టింది.ఒకే కార్డు.. సేవలు అనేకం! స్మార్ట్ రేషన్‌కార్డు కేవలం బియ్యం పంపిణీకే పరిమితం కాకుండా భవిష్యత్‌లో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేసే అవకాశాలున్నాయి. కుటుంబ వివరాల ధ్రువీకరణ, ప్రభుత్వ సేవల వినియోగం, లబ్ధిదారుల గుర్తింపు లాంటి అవసరాలకు కూడా ఈ కార్డు ఉపయోగపడేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతో ఒకే కార్డు ద్వారా బహుళ ప్రయోజనా లు పొందే అవకాశం ఏర్పడనుంది.జిల్లాలో ‘రేషన్’ వివరాలు రేషన్ షాపులు 412నెల బియ్యం కోటా 4867.168 మెట్రిక్ టన్నులు మొత్తం రేషన్ కార్డులు 2,49,606ఆహార భద్రత కార్డులు 2,36,562అంత్యోదయ కార్డులు 13,012అన్నపూర్ణ కార్డులు 32పంపిణీకి ఏర్పాట్లుజిల్లాకు స్మార్ట్ కార్డులు చేరుకోవడంతో పౌర సరఫరాల శాఖ పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించింది. ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వచ్చిన వెంటనే నియోజకవర్గాలు, మండలాల వారీగా పంపిణీ చేపట్టేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రేషన్ షాపులు లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శి బిరాల్లో లబ్ధిదారులకు కార్డులను అందజేసే అవకాశముంది. -
వెదురు సాగుతో లాభాలు
తొలి తెలుగు పండుగ ఏకాదశి హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. భక్తిశ్రద్ధలతో జరుపుకొనే ఈ పండుగ నుంచే కొత్త తెలుగు పండుగలు ప్రారంభమవుతాయి. మామడ: వ్యవసాయ రంగాన్ని బలోపేతం చే సేందుకు, పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు, గ్రామీణులకు జీ వనోపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ( VBRAMG) వికసిత్ భారత్ గ్రామీణ రోజ్‌గార్ ఆజ్వికా మిషన్ గ్రామీణ్ పథకం కింద వె దురు సాగును ప్రోత్సహిస్తోంది. జిల్లాలో సెర్ప్ ఆధ్వర్యంలో నర్సరీలు నిర్వహించి వెదురు సాగు చేసె రైతులను సర్వే ద్వారా గుర్తించారు. జిల్లాలో వెదురు సాగుకు అనుకూలంగా ఉన్న మండలాలను గుర్తించి సాగుకు ఎంపిక చేశారు. ఇందుకోసం సెర్ప్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి రైతులను ఎంపిక చేశారు. మామడ మండలంలో 145మంది రైతులు 700 ఎకరాలు, సారంగపూర్ మండలంలో 122 మంది రైతులు 600 ఎకరాలు, పెంబి మండలంలో 71మంది రైతులు 700 ఎకరాల్లో వెదురు సాగు చేసేందుకు ముందుకువచ్చారు. వీరికి వెదురు సాగులో ఎరువుల వినియోగం, సంరక్షణ పద్ధతుల గురించి అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. సాగు విధానం.. లాభాలు వెదురు మొక్కల పెంపకం నర్సరీల నిర్వహణను మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వెదురు మొక్కలను పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. సాగు చేసేందుకు ముందుకు వచ్చిన రైతులకు ఉచితంగా మొక్కలు అందిస్తారు. ఎకరంలో 160 మొక్కలు నాటాలి. మొక్క నాటేందుకు ఒక్కో గుంత తవ్వేందుకు రూ.78, మొక్క నాటేందుకు రూ.41, మొక్క సంరక్షణకు నెలకు రూ.41 వీబీ జీ రాంజీ పథకం ద్వారా రైతుకు అందజేస్తారు. మూడేళ్లలో ఎకరంలో సాగు చేసిన రైతులకు ఒక్కొక్కరికి నిర్వహణ కోసం రూ.1.12 లక్షలు ఇస్తారు. వెదురుసాగు చేసే భూముల్లో మూడేళ్లపాటు అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకా శం మేఘావృతమవుతుంది. గాలిలో తేమ పెరుగుతుంది. అక్కడక్కడా వాన కురుస్తుంది. -
‘తొలి ముద్ద’ ప్రారంభమెప్పుడో!
● అంగన్వాడీల్లో అందని పోషకాహారం లక్ష్మణచాంద: అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందిస్తోంది. కేంద్రాలను మరింత పటిష్టం చేయడం, చిన్నారుల్లోని పోషకాహార లోపాన్ని నివారించాలనే సంకల్పంతో ప్రభుత్వం ‘తొలిముద్ద’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నూతన విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఈ పథకం అమలు చేస్తామని మార్చిలో జరిగిన సమీక్షలో రాష్ట్ర మంత్రి సీతక్క ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఉదయమే పోషక విలువలతో కూడిన అల్పాహారం అందిస్తే నిరుపేద కుటుంబాల చిన్నారులకు మేలు జరుగుతుందని అంతా భావించారు. కానీ, నెల గడిచినా తొలిముద్ద కార్యక్రమం ప్రారంభం కాలేదు. జిల్లాలో 931 కేంద్రాలు జిల్లాలో 400 గ్రామపంచాయతీల పరిధిలో నాలు గు ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. ఇందులో 931 అంగన్వాడీ కేంద్రాలుండగా, వీటి పరిధిలో ఆరేళ్లలోపు చిన్నారులు 18,891 మంది ఉన్నారు. కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్లు, కందిపప్పు, బియ్యం, బాలామృతం, మురుకులు తదితర పోషకాహారాన్ని అందజేస్తున్నారు. ఈ పోషకాహారం ఒక్క పూటే అందిస్తుండడంతో చాలామంది చిన్నారుల్లో పోషకాహార లోపం కనిపిస్తోంది. దీంతో చిన్నారుల్లో వయస్సుకు తగిన ఎత్తు, బరువు ఉండటం లేదు. శారీరక, మానసిక ఎదుగుదల లేదు. ఆరేళ్లలోపు చిన్నారులకు తొలిముద్ద పథకం ద్వారా పోషకాహారం, అల్పాహారం అందించడంతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మేలు జరుగుతుందని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే తొలిముద్ద పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. ఎలాంటి ఆదేశాలు రాలేదు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఉదయం అల్పాహారం అందజేసే పథకం తొలిముద్దపై ఇప్పటివరకు ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి ఎ లాంటి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వస్తే తొలిముద్దను అమలు చేస్తాం. – వినూత్న, డీడబ్ల్యూవో, నిర్మల్ -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
నిర్మల్‌ఖిల్లా: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దుకు చేపట్టిన జన జాగరణ యాత్ర’ గురువారం రాత్రి జిల్లాకేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా సిటీ కన్వెన్షన్ సెంటర్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో క్యాంపు ఇన్చార్జికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడగా, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్ రద్దు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు సీఎంకు లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. ఆగస్టు 23వ తేదీన నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్, వెంకటేశ్, చంద్రకాంత్, అంజన్న, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం భూమన్న, ఆయా సంఘాల నాయకులు రామారావు, రేవంత్, రవిబాబు, సత్యనారాయణ, దేవేందర్, భూమన్న యాదవ్, లక్ష్మణ్, స్వామి, సురేశ్చంద్రగౌడ్ తదితరులున్నారు. -
‘కడెం’పైనే ఆశలు
కడెం ప్రాజెక్ట్ కడెం: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు న్నా కడెం ప్రాజెక్ట్‌పైనే ఆశలు పెట్టుకుని ఆయకట్టు రైతులు సాగుబాట పట్టారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీ టిమట్టం 700 అడుగులు(3.495టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 681.550 (207.736 టీఎంసీల) అడుగుల నీటిమట్టం ఉండగా, గతేడాది జూలై 24న 694.950 అడుగుల నీటిమట్టం ఉంది. కాగా, ప్రాజె క్ట్ పూర్తి స్థాయిలో నిండగా 2021 జూలై 10న వరద గేట్లు ఎత్తారు. 2022లో జూలై 5న, 2023లో 19న, 2024లో 20న, 2025లో జూలై 10న గేట్లెత్తారు. కొనసాగుతున్న మరమ్మతులు ప్రాజెక్ట్ ఎడమ కాలువ తూము గేట్ల మరమ్మతులు కొనసాగుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపా రు. ట్రాష్‌రాక్ పనుల్లో భాగంగా ప్రాజెక్ట్ ఎడమ (ప్రధాన) కాలువ పాత తూము గేట్లు తొలగించి ఇ టీవలే కొత్తవి బిగించగా, వాటికి మోటర్లు అమర్చా లి ఉంది. ఎడమ కాలువకు రక్షణగా రూ.2.48 కోట్ల తో చేపట్టిన ట్రాష్‌రాక్ పనులు కొనసాగుతున్నా యి. ప్రాజెక్ట్‌లో నీటిమట్టం పెరిగితే పనులు తాత్కాలికంగా నిలిపివేసి ఆ తర్వాత పూర్తి చేయనున్నారు. వరి వైపే రైతాంగం మొగ్గు కడెం ప్రాజెక్ట్ ద్వారా నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ని కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని 68,150 ఎకరాల కు సాగు నీరందుతుంది. వానాకాలం సీజన్లో రై తులు వరి, పసుపు, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు సాగు చేస్తుంటారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభా వంతో వర్షభావ పరిస్థితులున్నాయని, ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయాధికారులు చె బుతున్నారు. అయితే, కడెం ఆయకట్టు రైతులు వరి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రాజెక్ట్ నిండితే ఎలాగైనా వరి పండుతుందని భరోసాతో ఉన్నారు. -
అవగాహన కల్పించాం
జిల్లాలో వెదురు సాగుకు అనుకూలమైనవిగా సారంగపూర్, మామడ, పెంబి మండలాలను మొదటి విడతలో సర్వే చేసి గుర్తించాం. సెర్ప్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించాం. 338 మంది రైతులు 2వేల ఎకరాల్లో సాగు చేసేందుకు ముందుకువచ్చారు. ఒక్కో రైతుకు సాగు నిర్వహణ కోసం మూడేళ్లలో రూ.1.12లక్షలు అందజేస్తాం. – విజయలక్ష్మి, డీఆర్డీవో రైతులకు అదనపు ఆదాయం వెదురు సాగుతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. పంట సాగు ఆరంభంలో అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. వెదురు సాగు చేసేందుకు చాలామంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. పంట సాగుతో కలిగే లాభాలను రైతులకు వివరించాం. సాగులో మెళకువలు తెలిపాం. ఆసక్తిగల రైతులు సాగుకు ముందుకు రావాలి. – బీక్సింగ్, సెర్ప్ సీసీ, మామడ -
ఇంటర్ విద్యకు నూతన సాంకేతికత
లక్ష్మణచాంద: ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మౌలిక వసతులు కల్పించడమే కాకుండా ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తోంది. ఖాన్ అకాడమీ ఆధ్వర్యంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కార్పొరేట్‌కు దీటుగా నీట్, జేఈఈ, ఎఫ్‌సెట్, క్లాట్ తరగతులను డిజిటల్ ప్యా నెల్ బోర్డుల ద్వారా నిర్వహిస్తోంది. ఇంటరాక్టివ్ ఫ్లా ట్ ప్యానెల్స్, కంప్యూటర్, ప్రొజెక్టర్, టీవీ, వైట్ స్క్రీ న్ కలయికతో కూడిన అధునాతన టచ్ స్క్రీన్ పరికరాలు బోధనను అత్యంత ఆకర్శణీయంగా, సులభంగా మారుస్తున్నాయి. వీటి సాయంతో బోధనతోపాటు యానిమేటెడ్ వీడియోలు, చిత్రాలు, త్రీడీ నమూనాలు, ఆన్లైన్ సిమ్యులేషన్స్ ద్వారా విద్యార్థులకు అత్యంత క్లిష్టతరమైన భావనలను కూడా సులభంగా అర్థమయ్యేలా వివరించే అవకాశముంది. విద్యార్ధులు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లను ప్యానెల్‌కు కనెక్ట్ చేసి తాము చేసిన ప్రాజెక్టుల ను తరగతి గదిలో ప్రదర్శించే వీలుంది. అధ్యాపకులు బోధించే పాఠ్యాంశాలను ముందుగానే సిద్ధం చే సుకోవచ్చు. తెరపై నమోదు చేసిన డేటా, నోట్స్‌ను డిజిటల్ ఫార్మాట్లో పీడీఎఫ్ లేదా ఇమేజ్‌లుగా సేవ్ చేసి విద్యార్థుల వాట్సాప్ లేదా ఈ మెయిల్‌కు పంపవచ్చు. జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలుండగా ప్రతీ కళాశాలకు నాలుగు చొప్పున ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ వచ్చినట్లు డీఐఈవో పరశురామ్ నాయక్ తెలిపారు. -
సంపత్‌కుమార్‌కు విశిష్ట కథా రచయితగా గుర్తింపు
నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన కథా రచయిత టి.సంపత్‌కుమార్‌కు ముల్కనూరు సాహితీ పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన సాహిత్యోత్సవంలో విశిష్ట కథా రచయితగా అరుదైన గుర్తింపు లభించింది. తెలుగు కథా సాహిత్యానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ మొత్తం ఐదుగురు రచయితల్లో ఒకరిగా ఎంపిక చేసి సత్కరించారు. ఈ నెల 19న సంపత్‌కుమార్ రచించిన నాలుగో కథాసంపుటి ‘అందమైన నరకం‘ను సీఎం కార్యాలయ ఓఎస్డీ వేముల శ్రీనివాసులు ఆవిష్కరించారు. సన్మాన సభకు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రజాగాయకుడు జయరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై సంపత్‌కుమార్‌కు రూ.5వేల నగదు, జ్ఞాపిక అందజేసి సత్కరించారు. 1979 నుంచి ఆయన తెలుగు, ఇంగ్లిష్‌లో విశిష్ట రచనలు, 70 కథలు, మూడు కథాసంపుటాలు, 250కిపైగా వ్యాసాలు వెలువరించారు. ఖానాపూర్‌కు చెందిన ఆయన నిర్మల్, హైదరాబాద్, ఢిల్లీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఉద్యోగరీత్యా 35 ఏళ్లు ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయంలో సేవలందించి, రిటైర్డ్ అయ్యాక 2016 నుంచి జిల్లాకేంద్రంలో స్థిర నివాసముంటున్నారు. భార్య మాధవీలత సహకారంతో ప్రకృతికి చేరువగా వ్యవసాయం, పశుపోషణ, కూరగాయల సాగులో నిమగ్నమై సాహిత్య సృజనను కొనసాగిస్తున్నారు. -
మనకు నై..
మధిరకు సై.. నిర్మల్: ‘నాన్నా.. ఇంకెంత దూరం వెళ్లాలి. ఈ బస్ సీట్ల గంటల కొద్ది కూర్చుంటున్నందుకేమో కాళ్లు, నడుము నొస్తుంది నాన్నా..’ ఇది ఇంజినీరింగ్ చదవడానికి బోథ్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి న ఓ విద్యార్థి అవస్థ. ‘ఏం చేస్తాం బిడ్డా..! మన ప్రాంత పరిస్థితులు అట్లున్నయ్. ఓట్లేయించుకునేందుకే తప్పా.. ఇక్కడి ప్రజల కష్టాలను ఓళ్లు కూడా పెద్దగా పట్టించుకోరు. మన ఉమ్మడి ఆదిలాబాద్ అంటేనే చిన్నచూపు. మేం చదువుకున్నప్పటి నుంచి అడుగుతున్నం. నిర్మల్ల్లన్న, ఆదిలాబాద్ల్లన్న ఇంజినీరింగ్ కాలేజీ పెట్టాలని. కానీ.. ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు బిడ్డా..?! మీ భవిష్యత్ బాగుండాలని మాలాంటి తల్లిదండ్రులం కాయకష్టం చేసుకుంట, ఎంత కష్టనష్టమైనా వంద ల కిలోమీటర్ల దూరంల ఉన్న హైదరాబాద్‌ల మి మ్మల్ని సదివించుకుంటున్నం..’ అని ఆ తండ్రి ఆవేదన వ్యక్తంచేశాడు. ఆదిలాబాద్–నిర్మల్ జిల్లాలకు కనీసం వంద కిలోమీటర్ల దూరంలోనూ ఒక్క ప్రభు త్వ ఇంజినీరింగ్ కాలేజీ లేదు. ఆదిలాబాద్ నుంచి 310కిలో మీటర్ల నిర్మల్ నుంచి 220కిలో మీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ వరకు వెళ్లాల్సిందే. జిల్లాలతో దోబూచులాటగత ప్రభుత్వమైనా, ఇప్పటి సర్కారైనా నిర్మల్, ఆది లాబాద్ ప్రాంతాలతో విద్యారంగం విషయంలో దో బూచులాడుతున్నాయే గాని ముందడుగు వేయ డం లేదన్నది స్పష్టమవుతోంది. ముందుగా ఆదిలా బాద్ సభలో జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం నిర్మల్ సభలో ఇదే జిల్లాలో తాత్కాలికంగా బాసరలోనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు చె ప్పారు. ఇలా రెండు జిల్లాల్లో మాటిచ్చారు. కానీ.. ఆరునెలలైనా ఎక్కడా యూనివర్సిటీకి సంబంధించి అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక గతంలో నిర్మల్‌లో ఇంజినీరింగ్ కాలేజీ కావాలని అడిగితే అప్పటి సీఎం కేసీఆర్ ఆదిలాబాద్‌కు ఇస్తున్నట్లు చెప్పారు. అక్కడైనా ఏర్పాటు చేశారా.. అంటే అదీ లేదు. ఇలా ప్రభుత్వాలే దోబూచులాడటంపై రెండుజిల్లాల ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చదువులతల్లి కొలువైన ప్రాంతంలో పూర్తిస్థాయి విద్యాభివృద్ధి ఇంకెప్పుడు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.10న హామీ.. 18న జీవోఈనెల 10న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డిని మధిర ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమకు ఇంజినీరింగ్ కాలేజీ కావాలని కోరారు. వెంటనే సీఎం సుముఖత వ్యక్తంచేశారు. అంతే కాదు.. వారం వ్యవధిలోనే మధిరకు ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేస్తూ ఈనెల 18న జీవో జారీచేశారు. మధిరకు కేవలం 84కిలో మీటర్ల దూరంలోగల ఇదే ఖమ్మం జిల్లా పాలేరులో ఇప్పటికే ప్రభుత్వ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ ఉండటం గమనార్హం. మూడేళ్లు దాటినా ముచ్చటేది?నిర్మల్ జిల్లా కేంద్రంలో 2023 జూన్ 4న కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. అప్పటి సీఎం కేసీఆర్ హాజరు కాగా, అప్పటి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు కేసీఆర్ స్పందిస్తూ నిర్మల్ పేరు చెప్పకుండా ఉమ్మడి జిల్లాలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రెండ్రోజుల తర్వాత దానిని ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పటిదాకా ఇంజినీరింగ్ కాలేజీ ముచ్చటే లేదు. అడిగిన నిర్మల్‌కు ఇవ్వలేదు.. ఇస్తామన్న ఆదిలాబాద్‌కూ దక్కలేదు. అక్కడలా.. ఇక్కడెందుకిలా..?రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకూ ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. మాటిచ్చిన వారంలోనే మధిరకు ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపడం అభినందనీయమే. కానీ.. ఇదే సమయంలో ఇప్పటివరకూ కనీసం యూనివర్సిటీ కూడా లేని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానూ లెక్కలోకి తీసుకోవాలన్నదే ఈ ప్రాంతవాసుల వాదన. మధిరకు 210కిలో మీటర్ల దూరంలో హైదరాబా ద్, కేవలం 75కిలో మీటర్ల దూరంలో విజయవా డ ఉంది. పైగా రెండు నగరాలకు మధ్యన గల ఈ నియోజకవర్గానికి రైల్వేమార్గం కూడా ఉంది. అలాంటి చోటును కరుణించిన తెలంగాణ స ర్కారు.. వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న మన ప్రాంతాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం జనాల్లో బలపడుతోంది. -
ఎస్ఐఆర్ నమోదులో వేగం పెంచాలి
ఖానాపూర్: ఎస్ఐఆర్ నమోదులో వేగం పెంచి త్వ రగా పూర్తి చేయాలని, అర్హులైన ప్రతీ ఓటరును వంద శాతం నమోదు చేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఖా నాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఎల్ఏ సూపర్వైజర్లు, ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఎస్ఐఆర్ న మోదు ప్రక్రియ పూర్తయ్యే వరకు రోజూ క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తూ పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, ఎస్ఐఆర్ అబ్జర్వర్, మాజీ ఎ మ్మెల్యే ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ నమోదును విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని పి లుపునిచ్చారు. నాయకులు ఎంబడి రాజేశ్వర్, దు ర్గాభవాని, చిన్నం సత్యం, జంగిల్ శంకర్, గొర్రె గంగాధర్, గుడిసె రమేశ్, గంగన్న తదితరులున్నారు. -
శిక్షణ తరగతులను ఉపయోగించుకోవాలి
నిర్మల్ రూరల్: ఉపాధ్యాయులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను సద్విని యోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి భో జన్న సూచించారు. జిల్లాలోని గణిత ఉపాధ్యాయులకు మూడురోజులుగా నారాయణ పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా డీ ఈవో శిక్షణ తరగతులను పరిశీలించారు. ఆ యన మాట్లాడుతూ.. విద్యార్థులకు గుణాత్మ క విద్యను అందించి, సర్కారు పాఠశాలలపై ప్రజల నమ్మకాన్ని పెంచాలని సూచించారు. విద్యార్థుల నమోదు పెంచడంలో గణిత ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఉ పాధ్యాయులు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ పద్ధతి ద్వారా బోధించి విద్యా ప్రమాణాలు పెంచా లని సూచించారు. కార్యక్రమంలో ఏఎంవో నర్సయ్య, కోర్సు ఇన్చార్జీలు పరమేశ్వర్, జ నార్దన్, రిసోర్స్ పర్సన్లు పద్మ, సదానందం, విజయకుమార్, అపర్ణ, హరిప్రసాద్, శేఖర్ వర్మ, పరాజ్, రవీందర్ తదితరులున్నారు. -
పంట పోతే పరిహారమేది?
భైంసా: వాతావరణంలో వస్తున్న మార్పులు వ్యవసాయరంగాన్ని తీవ్ర నష్టాల్లోకి తీసుకెళ్తున్నాయి. అకాల వర్షాలు, కరువు, వరదలు, తెగుళ్ల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు ఆదుకోలేకపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వరి, సోయాబీన్, పత్తి, పసుపు, మిర్చి, మొక్కజొన్న, కంది తది తర పంటలు లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తుంటారు. ఒక్కో ఎకరాకు రూ.20వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. ప్రకృతి వైపరీ త్యాలతో పంట నష్టపోయినప్పుడు అన్నదాతలంతా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అక్కడ అలా.. ఇక్కడ ఇలా..జిల్లాతోపాటు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోనూ ఒకే తరహా వాతావరణ పరిస్థితులుంటాయి. అక్క డి రైతులు ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్లుగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో ఆదుకుంటోంది. రైతులు నామమాత్రపు ప్రీమియంతో బీమా చేయించుకుని ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్నపుడు పరిహారం పొందుతున్నారు. రెండు, మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో మహారాష్ట్రలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. బాధిత రైతులకు ఫసల్ బీమా కింద పరిహారం అందింది. అదే సమయంలో నిర్మల్ జిల్లాలోనూ భారీ వర్షాలకు వరి, పత్తి, సోయాబీన్, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి పొలాలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు.అయినప్పటికీ బీమా పరిహారం అందలేదని రైతులు వాపోతున్నారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రైతు వాటా చాలా తక్కువ. మిగతా ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ప్రీమియం చెల్లించకపోవడంతో తెలంగాణలో ఈ పథకం అమలులో లేకుండా పోయింది. ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులువాతావరణ నిపుణులు తెలిపిన ప్రకారం ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో అకస్మాత్తుగా భారీ వర్షాలు లేదా దీర్ఘకాల వర్షాభావం, గాలివానలు, తెగుళ్లు, పురుగుల ఉధృతి పెరిగే అవకాశముంది. దీంతో పంటల దిగుబడి తగ్గి రైతులకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు మరింత పెరిగే అవకాశమున్నందున జిల్లా రైతాంగానికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా అవసరం తప్పనిసరి నిపుణులు సూచిస్తున్నారు. -
అర్హుల ఓట్లు తొలగకుండా చూడాలి
భైంసాటౌన్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూడాలని కాంగ్రెస్ ఎస్ ఐఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి ఆరెపల్లి మోహన్ సూచించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరావు పటేల్ అధ్యక్షతన గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎస్ఐఆర్పై నిర్వహించిన అవగాహన సమావేశానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ సానుకూల ఓట్లు తొలగించాలన్న దురాలోచనతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్ఐఆర్ చేపట్టిందని ఆరోపించారు. దీన్ని తిప్పి కొట్టేందుకు అర్హుల ఓట్లు తొలగిపోకుండా క్షేత్ర స్థాయిలో పార్టీ బీఎల్ఏలు చూడాలని సూ చించారు. ప్రతీ నాయకుడు, కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి ఓటర్లు వందశాతం ఎస్ఐఆర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అనంత రం డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలా చారి, ముధోల్ ఎస్ఐఆర్ ఇన్చార్జి రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్‌రెడ్డి ఎస్ఐఆర్పై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏఎంసీ చైర్మన్ ఆనంద్‌రా వు పటేల్, పార్టీ పట్టణాధ్యక్షుడు అరవింద్, మండలాధ్యక్షులు, ఆత్మ చైర్మన్లు పాల్గొన్నారు. -
భూగర్భ జలాల పెంపునకే నీటికుంటలు
కుభీర్: భూగర్భ జలాల పెంపునకే జిల్లాలో నీటి కుంటల తవ్వకం పనులు చేపట్టినట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా మండలంలోని దొడర్నాలో గురువారం నీటికుంటల నిర్మాణాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నీటి కుంటలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని, నిర్మాణాలు వేగవంతం చే యాలని సూచించారు. జిల్లాలో గురువారం ఏకకా లంలో 573 నీటికుంటల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రైతు దంపతులను కలెక్టర్ సన్మానించారు. డీఆర్డీవో విజయలక్ష్మి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్రీదే వి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో భీమేశ్, ఏవో సా రిక, ఏపీఎం హరిలాల్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చవాన్ శంకర్, స్థానిక సర్పంచ్ జాదవ్ నిర్మల, మాజీ సర్పంచ్ రాథోడ్ శంకర్ తదితరులున్నారు. -
‘సరిహద్దులో అప్రమత్తంగా ఉండాలి’
తానూరు: సరిహద్దు ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. బుధవా రం తానూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల గౌర వ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అ ప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి వేళ పో లీసులతో పెట్రోలింగ్ మమ్మరంగా నిర్వహించి అ వాంఛనీయ ఘటనలు, చోరీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గతంలో పోలీస్‌స్టేష న్లో నమోదైన కేసుల వివరాలు తెలుసుకుని రికా ర్డులు పరిశీలించారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. మహారాష్ట్రకు సరిహద్దులోని గ్రామాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా గ్రామ కమిటీ సభ్యులకు అవగాహన కల్పించాలని తెలిపారు. మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లోని దుకా ణా సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే లా చూడాలని పేర్కొన్నారు. బోల్సా గ్రామానికి చెందిన ఫిరాజీ భూ విషయంలో ఆత్మహత్యకు పా ల్పడగా అతడి కుటుంబ సభ్యులు ఎస్పీ జానకీ షర్మి లను కలిసి భూ సమస్య పరిష్కరించేలా చూడాలని కోరారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నా టి నీరు పోశారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్, ము థోల్ సీఐ రవీందర్‌నాయక్, ఎస్సై షేక్ జుబేర్, స ర్పంచ్ సుగంధ, ఉపసర్పంచ్ షారూక్ పాల్గొన్నారు. సత్వర న్యాయం అందించాలి భైంసాటౌన్: పోలీస్‌స్టేషనకు వచ్చే బాధితుల కు సత్వర న్యాయం అందేలా చూడాలని ఎస్పీ జానకీ షర్మిల ఆదేశించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజావాణికి హాజరై డివిజన్ పరిధిలోని వి విధ గ్రామాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని ఎస్‌హెచ్‌వోలను ఫోన్లో ఆదేశించారు. షీటీం నిర్వహిస్తున్న భరోసా కేంద్రాన్ని సందర్శించి ఇరు కుటుంబాలు కౌన్సిలింగ్ ద్వారా తి రిగి కలుసుకునేలా చర్యలు తీసుకోవడంతో సంతృప్తి వ్యక్తంజేశారు. పెండింగ్ ఫిర్యాదులపై సమీక్షించారు. ఏఎస్పీ సాయికిరణ్ ఉన్నారు. -
కాలంతో పోటీ పడాలి
దిలావర్పూర్: కాలంతో పోటీపడి లక్ష్య సాధన కు నిరంతరం సాధన చేయాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి జాదవ్ పరశురామ్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలను బుధవారం సందర్శించారు. తరగతి గదుల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి అన్ని గ్రూపుల వారికి మొదటి సంవత్సరం నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. గతేడాదితో పోలిస్తే కళాశాలలో పురోగతి సాధించి అధ్యాపకులు, ప్రన్సిపాల్ సుదర్శన్‌ను అభినందించారు. -
మెరుగైన వసతులు కల్పించాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన వసతులు క ల్పించడమే లక్ష్యమని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మె ల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు బుధవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే (ఎంజేపీ) బాలుర పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. బోధన, వసతులు, పరిశుభ్రత, తాగునీ రు, వంటశాల, ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వసతిగృహంలో ని ఒకే గదిలో 25 మంది ఉండాల్సి వస్తోందని వి ద్యార్థులు తెలుపగా, శాశ్వత భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, కౌన్సిలర్లు గంజి రాజు, శశాంక్, సూరి, అర్జున్, సా త్విక్, విఠల్, నరేశ్, నాయకులు సాగర్, జమాల్, నారాయణగౌడ్, హరీశ్, భరత్ తదితరులున్నారు. -
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి
నిర్మల్‌చైన్‌గేట్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో రాజేందర్ సూచించారు. బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో సీజనల్ వ్యాధులు, వివిధ ఆరోగ్య కార్యక్రమాల ప్రగతి గురించి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డెంగీ, చికున్ గున్యా, డయేరియా, డీసెంట్రీ మొదలైన వ్యాధులు వ్యాపించే అవకాశముందని, క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ శుక్ర, మంగళవారాల్లో డ్రైడే పాటించాలని, ఫీవర్ స ర్వే నిర్వహించాలని, అధికంగా వ్యాధులు ప్రబ లిన ప్రాంతాల్లో ఆరోగ్యశిబిరాలు నిర్వహించా లని సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరో గ్యకేంద్రాల వారీగా వివిధ ఆరోగ్య కార్యక్రమా ల లక్ష్యాలు, వారు సాధించిన ప్రగతిని సమీక్షించారు. లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్య ల గురించి వివరించారు. కార్యక్రమ నిర్వహణ అధికారులు డాక్టర్ నయనారెడ్డి, డాక్టర్ రాజారమేశ్, డాక్టర్ రాకేశ్, డాక్టర్ సౌమ్య, డాక్టర్ పవన్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆకాశ్, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి రవీందర్, ఆరోగ్య పర్యవేక్షకులు పాల్గొన్నారు. -
‘కొయ్యబొమ్మలకు ఆదరణ కరువు’
నిర్మల్‌చైన్‌గేట్: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నిర్మల్ కొయ్య బొమ్మలకు రాష్ట్ర ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వడంలేదని బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆరోపించారు. బుధవారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో కలిసి నిర్మల్ కొయ్యబొమ్మలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొనికి చెట్లు పెంచకపోవడంతో కొయ్యబొమ్మల తయారీకి తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలిపారు. నిర్మల్ బొమ్మలకు మార్కెటింగ్ అవకాశాలను మరింత మెరుగుపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా ప్రధాని మోదీ నిర్మల్ బొమ్మలకు జీఐ ట్యాగ్ (భౌగోళిక గుర్తింపు) కల్పించి, మార్కెటింగ్‌కు సరైన అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు, జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ నాయకులు రావుల రాంనాథ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. సేంద్రియ రైతులతో ఆత్మీయ సమావేశం సహజ ఎరువులతో సేంద్రియ వ్యవసాయం చేస్తు న్న రైతులతో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు గౌతమ్‌రావు, రితేశ్ రాథోడ్, రాంనాథ్ పాల్గొన్నారు. -
నిర్మల్
ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశం కోసం చాలాకాలంగా నిరీక్షిస్తున్న టీచర్లలో హర్షం వ్యక్తమవుతోంది. దూరవిద్య.. చదువుకు దగ్గర చదువు మధ్యలో మానేసినవారిలో ఓపెన్ స్కూల్ విధానం కొత్త ఆశలు నింపుతోంది. స్వీయ అధ్యయనంతోపాటు అనుకూల సమయంలో పరీక్షలు రాసే వెసులుబాటు దక్కనుంది. జై.. జగన్నాథా.. జగన్నాథుని నామస్మరణతో బుధవారం జిల్లా కేంద్రం మార్మోగింది. గాంధీచౌక్‌లోని మురళీకృష్ణ ఆలయం నుంచి నిర్వహించిన జగన్నాథ రథయాత్ర భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా సాగింది. భక్తులు అధికసంఖ్యలో రావడంతో ప్రధాన వీధులు జనసంద్రంగా మారాయి. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి భక్తులతో కలిసి స్వామివారి రథాన్ని లాగారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా రథం ముందు చీపుర్లతో ఊడుస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. రథయాత్ర గాంధీ చౌక్ మురళీకృష్ణ ఆలయం నుంచి ప్రారంభమై బుధవార్‌పేట్, పాత బస్టాండ్, వివేకానంద చౌక్, జయశంకర్ చౌక్, నగేశ్వరవాడ, చింతకుంటవాడ, టౌన్ పోలీస్‌స్టేషన్ మీదుగా కొనసాగింది. దీంతో పట్టణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, నాయకులు రావుల రాంనాథ్, ముత్యంరెడ్డి, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. – నిర్మల్‌టౌన్ -
అప్రమత్తంగా ఉండాలి
దస్తురాబాద్: వర్షాలు కురుస్తున్నందున విద్యుత్ వి నియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఖానా పూర్ ఇన్చార్జి ఏడీఈ శ్రీనివాస్ సూచించారు. బుధవారం మండలంలోని మున్యాల గ్రామంలో ఇనుప స్తంభాలు తీసివేసి నూతనంగా వేస్తున్న స్తంభాలను ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశా రు. ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్నందున తడి చేతులతో విద్యుత్ వైర్లను ముట్టవద్దని, దుస్తులు ఆరవేసే దండాలను వైర్లకు దూరంగా క ట్టాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గ్రామాల్లో నెలకొ న్న విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలి పారు. గ్రామాల్లో విద్యుత్ పనులు చేపట్టినప్పుడు వినియోగదారులు సహకరించాలని సూచించారు. ఇన్చార్జి ఏఈ శ్రావణ్, సిబ్బంది సత్యనారాయణ, ప్రేమ్, నవీన్‌రెడ్డి, రాజేశ్ తదితరులున్నారు. -
‘అరెస్ట్‌లతో ఉద్యమాన్ని అడ్డుకోలేరు’
నిర్మల్‌చైన్‌గేట్: అరెస్ట్‌లతో విద్యార్థులు, రాహుల్ గాంధీ చేస్తున్న ఉద్యమాన్ని అడ్డుకోలేరని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సమరసింహారెడ్డి ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి వ్యతిరేకంగా, ఢిల్లీలో విద్యార్థులకు మద్దతుగా ఆందోళన ని ర్వహించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహు ల్ గాంధీ అరెస్ట్, విచక్షణారహితంగా విద్యార్థులపై లాఠీచార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. అనంతరం ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయ డం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నీట్ పరీక్షల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. యువతకు కాంగ్రెస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. -
ఆర్థికసాయం చెక్కు అందజేత
మామడ: దిమ్మదుర్తి అటవీరేంజ్ పరిధిలోని సింగాపూర్ బేస్ క్యాంపులో పనిచేసిన రెడ్డి కిషన్ ఇటీవల మృతి చెందాడు. అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.1.20లక్షల విరాళాలు సేకరించిన బుధవారం నిర్మల్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి నాగినిబాను ఎక్బాల్‌పూర్‌లో కిషన్ భార్య కమలకు చెక్కు అందించారు. ఎఫ్ఆర్వో శ్రీనివాస్‌రావు, ఎఫ్‌ఎస్‌వోలు అలేఖ్య, జాఫర్, బీట్ అధికారులు రాజు, స్వాతి పాల్గొన్నారు. డిమాండ్లు నెరవేర్చాలి నిర్మల్‌ఖిల్లా: తెలంగాణ ఉద్యమకారుల డి మాండ్లు నెరవేర్చాలని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు హైదరాబాద్‌లోని అమరజ్యోతి స్తూ పం ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన వై ద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టుల సలహా సమావేశంలో కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీలు అ ద్దంకి దయాకర్, రాములునాయక్‌కు వినతిపత్రం ఇచ్చారు. నిర్మల్ మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో వైద్యులు, ల్యాబ్, ఎక్స్‌రే, టెక్నీషియన్లు, సి బ్బంది, వైద్యసహాయకులు ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. మెడికల్ జేఏసీ జిల్లా ప్రతిని ధులు సంతోష్, చక్రపాణి తదితరులున్నారు. -
డ్రాపౌట్స్ లేకుండా చూడాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రభుత్వ బడుల్లో డ్రాపౌట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధి కారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ స మావేశ మందిరంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, సౌకర్యాలు తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. రోజూ తప్పనిసరిగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేయాలని చెప్పారు. ఉపాధ్యాయుల హాజరు రోజూ 90శాతానికి తగ్గకుండా చూడాలని సూచించారు. నూతన విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ మిగిలి ఉంటే పూర్తి చేయాలని తెలిపారు. బడికి దీర్ఘకాలికంగా హాజరుకాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారు వచ్చేలా చొర వ చూపాలని సూచించారు. విద్యార్థుల అపార్ ఐడీ నమోదు పూర్తి చేయాలని, ఐడీ నమోదులో సాంకేతిక ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల సంఖ్య మరింత పెంచేలా చూడాలని తెలిపారు. అ ధునాతన బోధన పద్ధతులు, బృంద చర్చలు, వి ద్యార్థులు–ఉపాధ్యాయుల ముఖాముఖి, నిరంతర ప్రోత్సాహం తదితర అంశాల ద్వారా చదువులో వె నుకబడిన పిల్లల ప్రగతికి పాటుపడాలని సూచించారు. ఎప్పటికప్పుడు పోషకులతో సమావేశాలు నిర్వహిస్తూ, అన్ని విషయాలు చర్చించాలని తెలిపా రు. పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. డీఈవో భోజన్న, ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
నిర్మల్: తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ తెలంగాణ సంఘటన మంత్రి చంద్రశేఖర్ తివారీ అన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి, ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేస్తే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. నిర్మల్‌రూరల్ మండలంలోని తల్వేదలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలన్నారు. బూత్‌స్థాయి నుంచి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, ప్రజలు బీజేపీ వైపు ఆశతో చూస్తున్నారన్నారు. పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలో కూడా బీజేపీ విజయాన్ని నమోదు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు, జిల్లా ఇన్చార్జి గోపిడి స్రవంతిరెడ్డి, మాజీ అధ్యక్షులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు దత్తాత్రి, మౌనిక, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్ రెడ్డి, నగర్ నారాయణరెడ్డి, మేడిసెమ్మె రాజు, పడిపెల్లి గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నల్లా రవీందర్ రెడ్డి, కరిపే విలాస్, తదితరులు పాల్గొన్నారు. -
ఆరుతడి పంటలు సాగు చేయాలి
లక్ష్మణచాంద: రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ సూచించారు. మంగళవారం మండలంలోని చామన్‌పెల్లి గ్రామసభలో ఆయన మాట్లాడారు. సూపర్ ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు కంది, పెసర, మినుములు, జొన్న, సజ్జలు, వేరుశనగ, సన్ ప్లవర్, నువ్వులు వంటి పంటలు సాగు చేయాలని కోరారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతీరైతు తమ పంటచేలలో ఫాంపాండ్ నిర్మించుకోవాలని సూచించారు. ఆయిల్ పాం సాగుతో వచ్చే లాభాలు రైతులకు వివరించారు. ఈ సందర్భంగా 11 మంది రైతులు 27 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. అనంతరం మండల కేంద్రంలోని పీఏసీఎస్, గ్రోమోర్ ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి.నాగరాజు, వ్యవసాయ విస్తరణ అధికారి వి.పవిత్ర, సర్పంచ్ అయిట్ల లక్ష్మి సుదర్శన్, ఉప సర్పంచ్ గంగారెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
జల్లులేనా..!
నిర్మల్● ఎత్తిపోయిన సోయా, పత్తి పంటలు హరి ఓం విఠల..! ఏటా ఆషాఢ మాసంలో లక్షలాది మంది భక్తులు పండరీపూర్‌కు పాదయాత్రగా వెళ్తుంటారు. మార్గమధ్యలో భజనలు ఆలపిస్తూ.. పాండురంగడి భక్తిలో మైమరచిపోతారు.డాగ్‌స్క్వాడ్ సేవలు అమూల్యం నిర్మల్‌టౌన్: నేరాల దర్యాప్తులో డాగ్‌స్క్వాడ్ అందించే సేవలు అమూల్యమని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. తెలంగాణ పోలీసు ఇంటెలిజెన్‌న్స్ విభాగం విడుదల చేసిన 2026 తొలి అర్ధవార్షిక సేవా నివేదికలో జిల్లా పోలీసు శునక దళం అత్యుత్తమ పనితీరుకు రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకుంది. జనవరి నుంచి జూన్ వరకు హత్యలు, అనుమానాస్పద మృతులు, చోరీలు, మాదకద్రవ్యాల కేసులతో పాటు పలు కీలక కేసుల దర్యాప్తులో పోలీసు శునకాలు యామి, జెస్సీ, బోల్ట్ కీలక ఆధారాలను గుర్తించి నిందితుల జాడ కనిపెట్టడంలో సహకరించాయి. ఈ సందర్భంగా శునకాలతో సమన్వయంగా విధులు నిర్వహించిన ఏఆర్పీసీలు జి.పరమేశ్వర్, కె.శ్రీనివాస్, జి.సాయేందర్‌కు మంగళవారం ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కృష్ణ, డాగ్‌స్క్వాడ్ ఇనన్‌చార్జి ఆర్ఐ శేఖర్, ఆర్ఎస్ఐలు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు. నిర్మల్: జిల్లాలో మూడు, నాలుగు రోజు లుగా ముసురు పట్టింది. నల్లమబ్బులు కమ్ముకుంటున్నా.. భారీ వానలు మాత్రం కురవడం లేదు. అప్పుడప్పుడు చిరుజల్లులు కురుస్తుండడంతో చల్ల ని వాతావరణం ఏర్పడినా, వ్యవసాయానికి మాత్రం పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. పడుతున్న వర్షం నేలను తడిపిందే తప్ప చెరువులు, కుంటలు, వాగులు నిండే పరిస్థితి లేదు. దీంతో రైతులు మబ్బులతో నిండిన ఆకాశం వైపు భారీ వర్షాల కోసం ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ, వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. నీటిపై ఆధారపడకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని చెబుతూ ఉన్నారు. కానీ కొంతమంది రైతులు మాత్రం ఇంకా వరిపై ఆశలు వదలడం లేదు. చెరువుల్లోకి చేరని నీరు ముసురు పెట్టి కురుస్తున్న వర్షపునీరు భూమిలో ఇంకిపోతోంది. కానీ చెరువులు, కుంటలు, వాగుల్లోకి ప్రవహించేంత తీవ్రత లేకపోవడంతో జలాశయాల్లో నీటినిల్వలు పెరగడం లేదు. జిల్లాలోని చాలా చెరువులు ఇప్పటికీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సాగునీటి సమస్య తీవ్రం కావచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికీ చెరువుల కింద సాగుచేస్తున్న రైతులు వేలల్లో ఉన్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే.. మరో రెండు మూడు నెలల్లో నీటికి ఎంత ఇబ్బంది అవుతుందోనన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. విస్తారంగా కురిస్తేనే.. వ్యవసాయ అధికారుల అంచనాల ప్రకారం చిరుజల్లులు మొక్కలకు తాత్కాలిక ఉపశమనం కలిగించినా, పంటలు బాగా ఎదగాలంటే ఒకటి రెండురోజుల పాటు విస్తారంగా కురిసే వర్షాలు అవసరం. ముఖ్యంగా పత్తి, సోయాబీన్ పంటల కాలం ఎత్తిపోయింది. గత నెలలో వేసిన చోట ప్రస్తుతం ఎదుగుదల దశలో ఉండటంతో తగినంత తేమ లేకపోతే దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. లోటు వర్షపాతం.. గతేడాది జూన్, జూలై మాసాల్లో మొత్తం 376 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, ఈ ఏడాది ఈనెల 19 నాటికి కేవలం 237.8 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే గతేడాదితో పోలిస్తే ఇప్పటికే 138.2 మిల్లీమీటర్ల తక్కువ వర్షపాతం కురిసింది. మిగిలిన రోజుల్లో భారీ వర్షాలు కురవకపోతే ఈ లోటు మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పెంబి మండలం మినహా మిగిలిన 18 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. పెంబిలో మాత్రం సాధారణం కంటే ఒక్కపాయింట్ ఎక్కువ నమోదైంది. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మోస్తరు జల్లులు పడుతుండగా, ఎక్కువ ప్రాంతాల్లో ముసురు వాతావరణమే కొనసాగుతోంది. దీంతో ఇప్పటికే విత్తిన పత్తి, సోయాబీన్, మొక్కజొన్న పంటలకు తగినంత తేమ అందడం లేదు. కొన్నిచోట్ల రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తూ విత్తనాలు వేయడానికే వెనుకాడుతున్నారు. గతేడాదితో పోలిస్తే.. 2025 జూన్‌లో 141.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్‌లో 147.3 మి.మీ. వర్షం కురిసింది. అంటే గతేడాది కంటే 6 మి.మీ. ఎక్కువే కురిసింది. జూలై వచ్చేసరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. గత జూలై నెలాఖరుకు 234.7 మి.మీ. వర్షపాతం నమోదుకాగా ప్రస్తుతం ఈ నెల 19 వరకు 90.5 మి.మీ. మాత్రమే వర్షం కురిసింది. ఈలెక్కన ఇప్పటికే 144.2 మి.మీ. తక్కువ వర్షం కురిసింది. జూన్‌లో గతేడాది కంటే స్వల్పంగా ఎక్కువ వర్షం కురిసినా, జూలైలో ఎల్‌నినో ప్రభావంతో పరిస్థితి పూర్తిగా మారింది. నెల సగం దాటినా సాధారణ వర్షపాతంలో సగం కూడా నమోదు కాకపోవడంతో జిల్లాలో 48 శాతం లోటు ఏర్పడింది. గతేడాది జూలైలో ఇదే సమయానికి నమోదైన స్థాయికి కూడా చేరుకోకపోవడం గమనార్హం.ఇంకా ఆశల్లో రైతన్న.. ‘ఒక్క మంచి వాన పడితే సాలు.. పంటలు ఊపిరి పోసుకుంటాయి..’ అంటూ చాలామంది రైతులు ఇంకా ఈ సీజన్‌పై ఆశలు పెట్టుకునే ఉన్నారు. ఆగస్టులో వర్షం వస్తుందని, చెరువులు కూడా కళకళలాడుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రైతుల్లో చాలామంది ఇప్పటికీ వరిసాగు దిశగా ఆలోచిస్తుండడం గమనార్హం. కలెక్టర్, అధికారులు ఎల్‌నినో ప్రభావం కారణంగా వరి వద్దని చెబుతున్నా.. ‘అది తప్పా ఏదీ పండనప్పుడు ఏం చేయాలె..’అంటూ వరిసాగుకు సిద్ధమవుతున్నారు.ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. దీనికి అనుగుణంగానే జిల్లాలో ఇప్పటివరకు ఒక్క భారీవర్షం కూడా నమోదు కాకపోవడం రైతుల్లో ఆందోళనను పెంచుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖరీఫ్ సాగుపై ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్‌నినో ప్రభావంతో .. 2025–26 వర్షపాతం తేడా (మిల్లిమీటర్లలో) నెల 2025 2026 తేడా జూన్ 141.3 147.3 +6.0 జూలై 247.7 90.5 –144.2 -
మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమివ్వాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఘన వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలన్నారు. ప్లాస్టిక్ నిషేధం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్లు రవిబాబు, సుందర్ సింగ్, యాదయ్య, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జల సంరక్షణకు ఫారం పాండ్స్ తప్పనిసరి కుంటాల: వ్యవసాయ భూముల్లో జల సంరక్షణ కోసం ఫారం పాండ్స్ తప్పనిసరిగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. అంబుగామలో తాగునీటి సమస్య ఉందని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. రెండు ఎకరాలు భూమి కలిగిన ప్రతీ రైతు ఫారం పాండ్స్ నిర్మించుకుంటే భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని సూచించారు. ఎకరాకు ఒక ఫారం పాండ్ నిర్మిస్తే ఐదు లక్షల లీటర్ల నీరు భూమిలో ఇంకుతుందన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య ఉన్నందున తక్షణమే బోరుబావి మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో విద్యుత్, టెలికాం, మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో విజయలక్ష్మి, ఏపీడీ ఓస ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, తహసీల్దార్ కమల్ సింగ్, ఎంపీడీవో అల్లాడి వనజ, సర్పంచ్ శివాజీ, తదితరులు పాల్గొన్నారు. -
మహిళా రిజర్వేషన్లు అమలుపర్చాలి
నిర్మల్: కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలుపాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి డిమాండ్ చేశారు. ఢిల్లీలో మంగళవారం జాతీయ అధ్యక్షురాలు అల్కాలాంబ అధ్యక్షతన నిర్వహించిన ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచీ మహిళల పక్షాన నిలుస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ఓట్ చోరీ, సీట్ చోరీ చేసిన బీజేపీ ప్రభుత్వం మహిళ రిజర్వేషన్లనూ చోరీ చేయవద్దన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నేరేళ్ల శారద, తదితరులు పాల్గొన్నారు. -
‘సీజనల్’ ముప్పు..!
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో సీజనల్ వ్యాధులు క్రమంగా విజృంభిస్తున్నాయి. వర్షాకా లం ప్రారంభం కావ డం, వాతావరణంలో మార్పుల ప్రభా వంతో జలుబు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురో జుకూ పెరుగుతోంది. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి నిత్యం వందల సంఖ్యలో జ్వరపీడితులు వస్తున్నారు. వారం రోజులుగా ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఓపీ విభాగంలో రద్దీ నెలకొంటోంది. మున్ముందు సీజనల్ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. రోజుకు 1200కు పైగా ఓపీ.. ప్రస్తుతం జిల్లాలో సీజనల్ వ్యాధులు పెరుగుతుండడంతో ప్రభుత్వ ఆస్పత్రికి రోగుల సంఖ్య కూడా పెరిగింది. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో ఈ నెల ప్రారంభం నుంచి రోజుకు 1200కు పైగా ఓపీ కేసులు వస్తున్నాయి. ఇందులో 400 మందికి పైగా జ్వర బాధితులే ఉంటున్నారు. ఉదయం ఆస్పత్రిలో ఓపీ సేవలు ప్రారంభమయ్యే సమయానికంటే ముందుగానే వచ్చి రోగులు క్యూ కడుతున్నారు. దీంతో ఓపీ విభాగంలో తీవ్ర రద్దీ నెలకొంటోంది. వైద్యులను కలిసేందుకు, పరీక్షలు చేయించుకునేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. విద్యార్థులూ.. జర జాగ్రత్త! జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉంటూ.. చదువుకునే విద్యార్థులు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా సంబంధిత వార్డెన్లు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. పరిశుభ్రమైన ఆహారం, తాగునీటితో పాటు పరిసర ప్రాంతాలు, నిద్రించే గదులను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. దోమలను నివారించాలి.. వ్యాధుల వ్యాప్తి అరికట్టాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. అవసరాల కోసం ఇంటి పరిసరాల్లో సిమెంట్ కుండీల్లో నీ రు నిల్వ చేసుకుంటారని, ప్రస్తుత సీజన్లో అది ప్ర మాదకరమని హెచ్చరిస్తున్నారు. నిల్వ నీరు మూ డురోజుల్లో పారబోయకుంటే వాటిలో దోమలు గు డ్లు పెట్టే ప్రమాదం ఉంటుంది. దీంతో అవి వృద్ధి చెంది మలేరియా, డెంగీ, చికున్ గున్యా వంటి వ్యా ధులకు కారణమవుతాయి. కూలర్లలో నీటిని అలా గే ఉంచినా, పాత టైర్లు, వాడి పడేసిన కొబ్బరిబొండాల్లో నీరున్నా దోమలు వృద్ధి చెంది వ్యాధుల వ్యా ప్తికి కారణమవుతాయి. ఇంటి పరిసరాల్లో గుంతలు ఉండకుండా చూసుకోవాలి. కలుషితమైన నీటితో డయేరియా వంటి వ్యాధులు సైతం వ్యాప్తి చెందుతాయి. ఈ సీజన్లో పరిశుభ్రమైన నీరు, తాజాగా వండిన ఆహార పదార్థాలు తీసుకుంటేనే మంచిది. డయేరియా లక్షణాలు రోటా వైరస్ వల్ల డయోరియా వ్యాపిస్తుంది. విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, దాహం, నోరు ఎండిపోవడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం వంటివి ఉంటాయి. దీని నివారణకు ఓఆర్ఎస్, ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం.. వాతావరణ మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు జ్వరం, దగ్గు, జలుబు, వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అలాంటి కేసులే ఆస్పత్రుల్లో పెరుగుతున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. వేడిగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలి. రోడ్లపై ఉండే అల్పాహారం తీసుకోవద్దు. ఇళ్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. – డాక్టర్ కాశీనాథ్, జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షకులు వారం రోజులుగా జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఓపీల వివరాలు తేదీ ఓపీలు 13 1300 14 1100 15 1078 16 1190 17 1180 18 1000 20 1280 జ్వరాల లక్షణాలివే.. ఎడిస్ అనే దోమ వల్ల డెంగీ వ్యాపిస్తుంది. ఈ దోమ పగటిపూట మాత్రమే కుడుతుంది. చలితో కూడిన తీవ్రమైన జ్వరం, కీళ్ల, ఒంటినొప్పులు అధికంగా ఉంటాయి. ఆడ అనాఫిలస్ దోమ వల్ల మలేరియా వ్యాపిస్తుంది. తరచూ జ్వరం రావడం, చలి, తలనొ ప్పి ఉంటాయి. చికున్ గున్యాకు కూడా డెంగీ లక్షణా లే ఉంటాయి. టైఫాయిడ్ సాల్మొ నెల్లాటైఫీ అనే బ్యా క్టీరియా ద్వారా సోకుతుంది. ఇది నోటి ద్వారా వ్యా ప్తి చెందుతుంది. ఈగలు వాలిన ఆహార పదార్థాలు తీసుకుంటే వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. కలుషిత నీటివల్ల కూడా వస్తుంది. -
‘రాహుల్‌గాంధీ అరెస్టు అక్రమం’
నిర్మల్: రాహుల్ గాంధీ అరెస్టు అప్రజాస్వామికమని, కేంద్రంలోని బీజేపీ ప్రజాగొంతుకలను అణచివేస్తోందని మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీ అరెస్టుకు నిరసనగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్, శివాజీ చౌక్‌లలో మంగళవారం రాత్రి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఐకేరెడ్డి మాట్లాడుతూ ప్రజల తరపున గొంతెత్తిన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య, వైస్‌చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్‌అలీ, డీసీసీబీ వైస్‌చైర్మన్ రఘునందన్‌రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మ న్ ధర్మాజీ రాజేందర్, ఆకుల హరీశ్, రాజేశ్వర్‌రెడ్డి, రమణారెడ్డి, మతిన్, జునైద్, నర్సింహారె డ్డి, సత్యనారాయణ, చిన్ను పాల్గొన్నారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
లక్ష్మణచాంద: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఒక్కో సర్పంచ్‌తో మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అభివృద్ధి పనులపై ఎప్పటి కప్పుడు మండల స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ తనకు వివరాలు తెలియజేయాలన్నారు. సమావేశంలో జిల్లా హార్టికల్చర్ అధికారి బీవి.రమణ, తహసీల్దార్ సంతోష్ కుమార్, ఎంపీడీవో రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యం నిర్మల్‌చైన్‌గేట్: పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని దివ్యనగర్ కాలనీలో రూ.5 లక్షల కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన కామన్ కమ్యూనిటీ షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వినీష లక్ష్మి, గంజి రాజు, రావులవార్ విఠల్, కూన శశాంక్, శ్రీరామోజీ నరేష్, బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, జుట్టు దినేష్, సాదం అరవింద్, చందు, ఈశ్వర్, ఆనంద్, ప్రజోత్, జమాల్, విజయ్, తదితరులు పాల్గొన్నారు. -
ఎల్‌నినోను సమష్టిగా ఎదుర్కొందాం
ఉట్నూర్‌రూరల్: ఎల్‌నినో విపత్తు నుంచి బయటపడేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ సమష్టిగా కృషి చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి అన్నారు. ఉట్నూర్‌లోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో ఎల్‌నినో ప్రభావం– ప్రత్యామ్నాయ చర్యలపై సోమవారం ఉమ్మడి జిల్లా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోగ్య సమస్య దృష్ట్యా రాలేకపోయారని, మంత్రి ఆదేశాల మేరకే తాను హాజరైనట్లు ఇల్లంబర్తి స్పష్టం చేశారు. ఉట్నూర్ పీవోగా గతంలో విధులు నిర్వర్తించానని, ఉమ్మడి జిల్లాపై పూర్తి అవగాహన ఉందన్నారు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో వర్షాకాలంలో తీవ్ర వ్యాధులు సంక్రమించేవని ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడం హర్షించదగ్గ విషయమన్నారు. ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ రంగానికే పరిమితం చేయకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు వర్షాభావ పరిస్థితులు, నీటి వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్త్తృత అవగాహన కల్పించాలన్నారు. కంది, పెసర, నువ్వు, వేరుశనగ, చిరుధాన్యాలు, ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా జలాశయాలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి లభ్యత, సాగునీటి పరిస్థితులు, విద్యుత్ సరఫరా, పంటల స్థితిగతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం 40–45 శాతం వరకు వర్షపాత లోటు నమోదయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, ప్రజలను కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని శాఖల సిబ్బంది సమష్టిగా పనిచేస్తే ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమని ఆయన అన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ శాఖల యాక్షన్ ప్లాన్, కంటింజెన్సీ ప్రణాళికలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో బుక్లెట్, తెలంగాణ జలసిరి పోస్టర్‌ను ప్రత్యేక అధికారి, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రా, కుమురంభీం కలెక్టర్ హరిత, ఐటీడీఏ పీవో మంద మకరందు హాజరుకాగా మంచిర్యాల కలెక్టర్ కుమార్‌దీపక్ గైర్హాజరయ్యారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి సమావేశంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రామగోపాల్వర్మ పాల్గొని ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులు, పంటల సాగులో తీసుకోవాల్సి న జాగ్రత్తలు, రక్షణ చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో చర్చించిన కీలక అంశాలను, క్షేత్రస్థాయి సమస్యలను త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఇల్లంబర్తి హామీ ఇచ్చారు. సమావేశంలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్ఎస్ చిత్రు, బి. వెంకటేశ్వర్లు, పి. చంద్రయ్య, యువరాజ్ మర్మాట్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సంధ్యారాణి, చెన్నూర్ మున్సిపల్ చైర్పర్సన్ పి.పద్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో లేక...
జిల్లా కేంద్రానికి చెందిన విహారి స్థానిక దీక్ష డిగ్రీ కళాశాలలో బీఎస్సీ డాటాసైన్స్ పూర్తి చేసింది. ఈ కోర్సుకు మంచి డిమాండ్ ఉన్నా ఇందులో పీజీతో పాటు అదనపు కోర్సులు చేస్తేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పీజీ కోర్సులు అందుబాటులో లేవు. సాధారణ కుటుంబం కావడం, ఆర్థిక పరిస్థితులూ తనను హైదరాబాద్ వంటి దూరప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. అదే.. నిర్మల్‌లోనే పీజీకోర్సులు అందుబాటులో ఉంటే తనలాంటి ఎంతోమంది విద్యార్థినులు కంటున్న కలలు సాకారం అవుతాయని విహారి ఆవేదన వ్యక్తం చేస్తోంది -
వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. రుతుపవనాల ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ‘వాల్టా’కు తూట్లు తెలంగాణను పచ్చదనంగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ఏటా వన మహోత్సవం నిర్వహిస్తోంది. కొందరు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ చెట్లను నరికేస్తున్నారు.మళ్లీ మూడు నెలల రేషన్..!భైంసాటౌన్: తెల్ల రేషన్‌కార్డు దారులకు మరోమారు మూడునెలల బియ్యం పంపిణీ ఒ కేసారి చేయనున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి కోటాను వచ్చే నెల 1 నుంచి అందించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందిన ట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో మూడునెలల రేషన్ బియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులు, నిల్వ సమస్యల దృష్ట్యా కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో సైతం మూడునెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేసిన సందర్భాలున్నాయి. తాజాగా ఏప్రిల్, మే, జూన్‌కు సంబంధించి ఏప్రిల్ నెలలోనే బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు నెలాఖరు వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంచి బియ్యం పంపిణీ చేసేలా అధికారులు సన్నద్ధమవుతున్నారు. పూర్తయిన జూలై కోటా.. జిల్లాలో 412 రేషన్ దుకాణాలు ఉన్నాయి. జూలై నెలకు సంబంధించి రేషన్ బియ్యం పంపిణీ ఈనెల 18తో పూర్తయింది. జిల్లాలోని తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులకు ప్రతినెలా 4867.168 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అందిస్తున్నారు. మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ నేపథ్యంలో ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం సరఫరా, ఎప్పటికప్పుడు రేషన్ డీలర్లు, అక్కడి నుంచి లబ్ధిదారులకు ఒకేసారి బియ్యం అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆదేశాలు రాలేదు... మూడు నెలలకు సంబంధించి రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని మౌఖిక ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేషన్ కార్డుదారులకు బియ్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. – రాజేందర్, డీసీఎస్వో, నిర్మల్‌జిల్లా వివరాలు జిల్లాలో రేషన్‌కార్డులు : 2,49,606 ఎఫ్ఎస్సీ కార్డులు : 2,36,562(6 కేజీలు) ఏఎఫ్ఎస్సీ కార్డులు : 13,012(35 కేజీలు) అన్నపూర్ణ కార్డులు : 32(10 కేజీలు) మొత్తం లబ్ధిదారులు : 7,74,020 నెల బియ్యం కోటా : 4,867.168 మె.ట మూడు నెలలకు (దాదాపు) : 14,601.504 మె.ట -
అటవీశాఖ అధికారులపై ఎమ్మెల్యే బొజ్జు ఆగ్రహం
అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశానికి అటవీశాఖ అధికారులు హాజరుకాకపోవడంపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు ఉమ్మడి జిల్లాలో పోడు సమస్య, మరోవైపు గిరిజనుల ఇళ్ల నిర్మాణాలను ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో సమస్యలపై చర్చించేందుకు రాకపోవడం సరికాదన్నారు. కడెం ప్రాజెక్టు నీటి నిల్వపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పైపులైన్ లీకేజీలు వెంటనే మరమ్మతు చేసి నీటి వృథా అరికట్టాలని సూచించారు. మాట్లాడుతున్న ఎమ్మెల్యే బొజ్జు -
పైచదువుల చింత
చదువులమ్మ చెంత.. ● యూనివర్సిటీ ఉంటేనే చదువు ఈజీనిర్మల్: చదువులతల్లి జ్ఞానసరస్వతీ కొలువైన జిల్లాలో పైచదువులకు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పీజీ, పీహెచ్డీ, ఎంఫిల్, తదితర చదువుల కోసం హైదరాబాద్ వంటి దూరప్రాంతాలకు వెళ్లాల్సిందే. అబ్బాయిలు ఎలాగోలా వెళ్లి చదువుకుంటున్నా.. చాలామంది గ్రామీణ ప్రాంత అమ్మాయిలు చదవాలన్న ఆశ ఉన్నా.. దూరభారం కావడంతో మధ్యలోనే పైచదువుల ఆశలు వదులుకుంటున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్నిజిల్లాల్లో యూనివర్సిటీలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ యూనివర్సిటీల ఏర్పాటు ముందుకు కదలడం లేదు. వేలాదిమంది విద్యార్థుల పైచదువుల కలను ప్రభుత్వాలు సాకారం చేయడం లేదు. ఆగుతున్న అమ్మాయిల చదువు.. ఆర్థికంగా బలమైన కుటుంబాలు తమ పిల్లలను బయటకు పంపుతున్నా.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు అది భారంగా మారుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థినుల ఉన్నతవిద్య కలలు చాలాసార్లు ఇంటి గడప దాటకుండానే ఆగిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా కుటుంబాలు తమ కుమార్తెలను దూర ప్రాంతాలకు పంపేందుకు వెనుకంజ వేస్తున్నాయి. పీజీ చదవాలన్న ఆసక్తి ఉన్నా భద్రత, వసతి, ఆర్థిక పరిస్థితులు, సామాజిక కారణాల వల్ల చాలామంది యువతులు డిగ్రీకే పరిమితం అవుతున్నారు. జిల్లాలోనే యూనివర్సిటీ ఉంటే ఇలాంటి ఎంతోమందికి ఉన్నతవిద్య అందుబాటులోకి వస్తుందని విద్యార్థులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఉన్నవి మూసి.. కొత్తవి మరిచి.. జిల్లాలో గతంలో కాకతీయ యూనివర్సిటీ పీజీసెంటర్ ఉండేది. ఇప్పటికీ ఉంది.. కానీ అది నామ్ కే వాస్తేగా సాగుతోంది. ఒకప్పుడు వందలమంది విద్యార్థులతో సోషియాలజీ, ఎంఏ ఇంగ్లీష్ వంటి అరుదైన కోర్సులతో కళకళలాడేది. అలాంటి పీజీసెంటర్ను ఉందా..లేదా.. అనే స్థితికి తీసుకొచ్చారు. ఇక జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. జేఎన్టీయూ నుంచి జిల్లాలో ఓ కళాశాల పెట్టించాలని గత ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి నిర్మల్ సభలోనే తీసుకువస్తే.. అప్పుడు ఆదిలాబాద్‌కు ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత అదీ ముందడుగు పడలేదు. చాలాసార్లు పాలకుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకునేవారు కరువయ్యారు. -
‘జీవో 12 రద్దు చేయాలి’
నిర్మల్‌టౌన్: భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలను వెల్ఫేర్ బోర్డు ద్వారానే అమలు చేయాలని, ప్రైవేట్ బీమా సంస్థలకు అప్పగించిన జీవో 12 వెంటనే రద్దు చేయాలని సీఐ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మి కుల సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్‌న్స్ కంపెనీలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ భవ న నిర్మాణ కార్మికులు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. నాయకులు బి.రాకేష్, మల్లేశ్, శంకర్ లింగం, రాజేశ్, ప్రదీప్, ప్రశాంత్, నరేష్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. నేడు వాహనాల వేలం నిర్మల్‌టౌన్: వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకు న్న వాహనాలకు ఈనెల 22న వేలం నిర్వహించనున్నట్లు ఎకై ్సజ్ పోలీసులు సోమవారం ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ ఆదేశాల మేరకు బుఽ దవారం ఉదయం 10 గంటలకు నిర్మల్ పట్టణ ఎకై ్సజ్ స్టేషన్లో వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలవారు నిర్ణీత డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు. -
హమాలీల సమస్యలు పరిష్కరించాలి
నిర్మల్‌టౌన్: సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్యా రమేష్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఏఐటీయూసీ అనుబంధ సివిల్ సప్లై హమాలీ కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీలపై అధిక పనిభారం మోపడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. రెండు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పెండరి ముత్యం, పుండలిక్, పిట్టల భీమేష్, పిల్లి రమేష్, జాదవ్ రమేష్, శివాజీ, హమాలీ కార్మికులు పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తులు సత్వరం పరిష్కరించాలి
నిర్మల్‌టౌన్: ప్రజావాణి దరఖాస్తులు సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులు సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఇన్స్పైర్’చేస్తే ప్రోత్సాహకం
ఈ ఫొటోలో కనిపిస్తున్న విద్యార్థి ఆర్నవ్. భైంసాలోని అల్ఫోర్స్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆర్నవ్ 2024–25లో తయారు చేసిన స్మార్ట్ వీల్‌చైర్ ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపికై ంది. ఈ వీల్‌చైర్ శారీరక వై కల్యం ఉన్న వ్యక్తులకు, వృద్ధులకు, రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వైకల్యం ఉన్నవారి జీవితాన్ని సులభతరం చేయడానికి రూపొందించిన వినూత్న సాంకేతిక పరిష్కారం. ఇతనికి రూ.30 వేలు వచ్చాయి.లక్ష్మణచాంద: కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను శాస్త్ర సాంకేతిక, విజ్ఞానరంగాలవైపు మళ్లించడానికి ఏటా ఇన్స్పైర్ మనక్ పేరుతో అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏటా జిల్లా స్థాయిలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థుల ప్రాజెక్టులు పంపిస్తున్నా, ఈసారి వినూత్నమైన, ప్రజలకు, రైతులకు, ఇతర రంగాలకు ప్రయోజనకరంగా ఉండే ప్రాజెక్టులను విద్యార్థులు తయారు చేయాలని, అందుకు సంబంధిత ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. వీరు అర్హులు.. 10 నుంచి 17 ఏళ్ల వయసు ఉండి, 6 నుంచి 12వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ అవార్డులకు అర్హులు. ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల, మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుల సహకారంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతీ పాఠశాల నుంచి గరిష్టంగా 5 నామినేషన్లు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా నుంచి ఎంపికలుదరఖాస్తు విధానం, చివరి తేదీఇన్స్పైర్ మనక్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https: //www.inspire.gov.inలోకి వెళ్లి ‘న్యూ రిజిస్ట్రేషన్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దరఖా స్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 15 అని జిల్లా విద్యా శాఖ అధికారులు తెలిపారు. -
నిర్మల్
● ఆందోళనలో విద్యార్థులు, ప్రజలుఒడిసి పడితేనే జలసిరి ఎల్‌నినో ప్రభావంతో ఈఏడాది ఇప్పటి వరకు ఆ శించిన వర్షాలు కురవలేదు. ఈనేపథ్యంలో రా ష్ట్ర ప్రభుత్వం జలసిరి కార్యక్రమం ద్వారా భూగర్భజలాల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తోంది.కడెం ఎడమ కాలువకు గేట్ల బిగింపు కడెం: కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ మరమ్మతుల్లో భాగంగా ప్రాజెక్టు ఎడమ(ప్రధాన) కా లువకు నూతన గేట్లను బిగించారు. రెండు నెల ల క్రితం ట్రాష్ రాక్ నిర్మాణంతో పాటు, కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ పాత గేట్లను తొలగించారు. వాటి స్థానంలో నూతన గేట్లను బిగించినట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. నిర్మల్: ‘నిర్మల్ జిల్లా బాసరలో ట్రిపుల్ఐటీ ఉంది కదా..! ఇంకా జిల్లాకు యూనివర్సిటీ ఎందుకు..! సీఎం ప్రకటించిన విశ్వవిద్యాలయాన్ని పక్క జిల్లాలో ఏర్పాటుచేస్తాం..’ అంటూ అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇటీవల ఓ సమావేశంలో ప్రకటించారు. దీంతో జిల్లాకు ఇక యూనివర్సిటీ లేనట్టేనన్న విషయం స్పష్టమవుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్మల్ జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని, తాత్కాలికంగా బాసర ట్రిపుల్‌ఐటీలో తరగతులు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఆరునెలల్లో సీన్ మొత్తం మారిపోయినట్లు తెలుస్తోంది. ట్రిపుల్‌ఐటీని సాకుగాచూపి యూనివర్సిటీని పక్కజిల్లాకు తరలించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే జిల్లా నుంచి పీజీ సెంటర్, మహిళ డిగ్రీ కాలేజీ తరలిపోయాయి. జిల్లాకు అడిగిన ఇంజినీరింగ్ కాలేజీని ఆదిలాబాద్‌కు కేటాయించారు. ఇప్పుడు బహిరంగ సభ సాక్షిగా సీఎం ప్రకటించిన వర్సిటీ కూడా వెళ్లిపోనుంది. అయినా.. జిల్లా పాలకులు, అధికారులు, రాజకీయ నేతలూ ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. పక్క జిల్లాకు తరలించేలా..! సీఎం హామీ అమలుపైనే అధికారపార్టీ ప్ర జాప్రతినిఽధి వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి చూస్తుంటే నిర్మల్‌కు యూనివర్సిటీ వస్తుందా? లేదా? అన్న సందేహం మరింత పెరిగింది. తాజా పరిస్థితులు కూడా సీఎం హామీ ఉట్టిదేనని, ఇక్కడ ప్రకటించిన యూనివర్సిటీ పక్క జిల్లాలో ఏర్పాటు అవుతుందని సదరు ప్రజాప్రతినిధుల మాటల్లో స్పష్టమవుతోంది. విద్యార్థుల్లో ఆందోళన.. యూనివర్సిటీ ఏర్పాటులో కనీసం అడుగు కూడా ముందుకు పడకపోవడం, అసలు జిల్లాలో ఏర్పాటు చేస్తారా.. అనే విషయంలో అనిశ్చితి నెలకొనడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుని నిర్మల్‌లోనే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇలా ప్రతీ విద్యాసంస్థను కోల్పోతే నిర్మల్ జిల్లా ఉన్నతవిద్యలో ఎప్పటికీ వెనుకబడే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో యూనివర్సిటీ కోసం ఆందోళనలతో పాటు అవసరమైతే న్యాయపోరాటం చేస్తామంటున్నారు. నీటి సంరక్షణ అందరి బాధ్యత నిర్మల్‌టౌన్: భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జల్ సంచయ్ జన్ భాగీదారి 3.0 కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని మున్సిపల్ కమిషనర్ రవిబాబు కోరారు. వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల ఏర్పాటు, నీటి వృథా నివారణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పరిరక్షణ, ప్రతీ ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, యువత కలిసి ఈ ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేసి భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకీ మౌనం..!? యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో జరుగుతున్న జాప్యం, తరలింపు వ్యాఖ్యలపై జిల్లా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన సమయంలో మౌనం పాటించడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్‌ఐటీని సాకుగా.. చదువులమ్మ కొలువైన నిర్మల్ జిల్లాలో ‘జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయం’ ఏర్పాటు చేయాలని ఏళ్లుగా డిమాండ్ ఉంది. ఈక్రమంలోనే జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి యూనివర్సిటీని ప్రకటించారు. కానీ ఉమ్మడిజిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు మాత్రం బాసరలో ఉన్న ట్రిపుల్‌ఐటీని సాకుగా చూపుతూ జిల్లాలో యూనివర్సిటీ అవసరం లేదన్న వాదన తెరపైకి తెచ్చారు. కానీ.. ఇక్కడ ట్రిపుల్‌ఐటీలో వేలమంది విద్యార్థులు ఉన్నప్పటికీ అందులో నిర్మల్ జిల్లా నుంచి ఎంతమంది ఉంటున్నారో లెక్కతేల్చాలని విద్యావంతులు పేర్కొంటున్నారు. ట్రిపుల్ఐటీ కేవలం సాంకేతిక విద్యకు సంబంధించినది మాత్రమేనని, యూనివర్సిటీ అనేది అన్ని ఉన్నతవిద్యలకు కేంద్రమని వివరిస్తున్నారు. చుట్టూ ఉన్న జిల్లాలకూ అందుబాటులో ఉండేలా నిర్మల్ కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
దామెర సాహితీసేవ స్ఫూర్తిదాయకం
నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ రచయితల వేదిక గౌరవ అధ్యక్షుడు దామెర రాములు సాహితీరంగంలో చేస్తున్న సేవలు వర్ధమానకవులకు స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు అన్నారు. రాములు జన్మదినం నిర్మల్ నర్సింగ్ హోమ్‌లోని దామెర సాహితి క్షేత్రంలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దామెరను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సాహితీగోష్టిలో పలువురు కవులు తమ కవిత్వంతో దామెర సాహిత్య సేవలను, కవిత్వంలోని సామాజిక స్పృహను, తెలంగాణ భాషా–సాహిత్య అభివృద్ధికి అందించిన సేవలను కొనియాడారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల హనుమంతు, ఉపాధ్యక్షుడు అంబటి నారాయణ, సలహాదారులు డాక్టర్ తుమ్మల దేవరావు, పత్తి శివప్రసాద్, సాహిత్య విమర్శకుడు అబ్బడి రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా కోశాధికారి పోలీస్ భీమేష్, అలాగే సంతోష్, ఫక్రుద్దీన్, రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఇల్లు పూర్తయినా.. బిల్లు రాలే!
నిర్మల్‌చైన్‌గేట్: పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు ప్రారంభించింది. మొదట సొంత స్థలం ఉన్నవారిని ఎంపిక చేసింది. జిల్లాలో 8,166 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 2,241 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అయితే నిర్మాణంలో నిబంధనల ప్రకారం బిల్లులు విడతల వారీగా విడుదల చేస్తున్నారు. కేంద్ర నిధుల కోసం ఎదురు చూపు.. పేదల ఇంటి నిర్మాణం కోసం కేంద్రం అమలు చేస్తున్న పీఎం ఆవాస్ యోజన గ్రామీణ పథకం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేలు, పట్టణాల్లో రూ.1.50 లక్షల వరకు కేంద్రం సహాయం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధుల కోసం ఎదురు చూస్తోంది. ఈ నిధులు వచ్చిన తర్వాత లబ్ధిదారులకు చివరి బిల్లుగా ఇవ్వాలని భావిస్తోంది. పీఎంఏవై ప్లస్ యాప్‌లో నమోదు.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు దశల్లో సర్వే చేపట్టింది. కేంద్ర పథకం పీఎంఏవైజీ మార్గదర్శకాల ప్రకారం పూరిగుడిసెలు లేదా తాత్కాలిక ఆవాసాల్లో ఉన్న వారికి మాత్రమే ఇళ్లు మంజూరు చేయాలని నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు మరోసారి సర్వే చేపట్టి, పీఎంఏవై ప్లస్ యాప్‌లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా ఇప్పటికే మంజూరైన ఇళ్ల లబ్దిదారుల ఆర్థిక పరిస్థితి తెలుసుకోవడంతోపాటు కొత్త అర్హులను గుర్తించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వే పూర్తయిన తర్వాత కేంద్రం నుంచి నిధులు విడుదల కావచ్చని భావిస్తున్నారు. లబ్దిదారులు వెంటనే బకాయి బిల్లులు విడుదల చేయాలని, లేదా కేంద్ర నిధులు వచ్చే వరకు తాత్కాలిక ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం వివరాలు మొత్తం సాంక్షన్ 8,166 విల్లింగ్ ఉన్నవారు 7,029 ముగ్గు పోసినవి 1,331 బేస్మెంట్ లెవెల్ 1,052 గోడలు పూర్తయినవి 747 స్లాబ్ పూర్తయినవి 1,658 నిర్మాణం పూర్తయినవి 2,241 చివరి విడత పెండింగ్.. నిర్మాణ నిబంధనల ప్రకారం.. బేస్మెంట్ పూర్తయి న తర్వాత రూ.లక్ష, గోడలు నిర్మించిన తర్వాత మ రో రూ.లక్ష, స్లాబ్ పడ్డాక రూ.1.40 లక్షలు విడుదల చేశారు. మిగిలిన రూ.1.60 లక్షలు బకాయిగా ఉన్నాయి. ఈ చివరి విడత బిల్లులు రాకపోవడంతో లబ్దిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినా చివరి బిల్లులు రాకపోగా, రెండో విడత ఇళ్ల మంజూరుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.లబ్ధిదారులపై వడ్డీల భారం.. ఇందిరమ్మ ఇంటి బిల్లులు సకాలంలో రాకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు అప్పులు తెచ్చుకుని ఇంటి నిర్మాణం చేపట్టారు. బేస్మెంట్, గోడలు, స్లాబ్ పూర్తయిన తర్వాత కూడా బిల్లులు ఆలస్యంగా రావడంతో కొందరు బంగారం, భూములు కుదవ పెట్టి అప్పులు తెచ్చుకున్నారు. కొందరు బేస్మెంట్, గోడల వరకే నిర్మాణం చేసి మిగిలిన పని ఆపేశారు. అధికారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు సైతం సమకూర్చారు. అయితే బిల్లులు రాకపోవడంతో వడ్డీలు పెరుగుతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి
నిర్మల్‌టౌన్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జిల్లా కళాకారులు ఆదివారం ప్రొఫెసర్ కోదండరామ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోలో ఎమ్మెల్సీని కలిసి ఉద్యమ సమయంలో కళాకారులు చేసిన సేవలను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథ్యంలో తగిన ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరారు. కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సీనియర్ జానపద కళాకారులు ఎక్కొండ ధనరాజ్, మహిపాల్, సురేశ్, మమత, సాయికృప, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పోషకాహార లోపం అధిగమిద్దాం
లోకేశ్వరం: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పేద పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి, పోషకాహార లోపాలను అధిగమించేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. అంగన్వాడీల బలోపేతం, చి న్నారుల ఆరోగ్యంపై సంపూర్ణ శ్రద్ధ చూపుతోంది. చిన్నారుల్లో పోషకాహారాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం చాలా అవసరం. ఎదుగుతున్న పిల్లలు అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే సమతుల్య ఆహారం కీలకం. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు, బాలామృతం, మధ్యాహ్న భోజనం వంటి పోషకాహారాలను అందిస్తున్నారు. జిల్లాలో పోషకాహార లోపం.. జిల్లాలో ముధోల్, భైంసా, ఖానాపూర్, నిర్మల్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 931 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ కేంద్రాల్లో 0 నుంచి 6 ఏళ్లలోపు 49,081 చిన్నారులు ఉన్నారు. వీరిలో తీవ్ర పోషకాహార లోపంతో 101 మంది, మితమైన పోషకాహార లోపంతో 1,404 మంది బాధపడుతున్నారు. మొత్తం 1,505 చిన్నారుల్లో పోషకాహార లోపం ఉంది. వీరందరికీ పోషణ లోప సమస్యలను దూరం చేయడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా చర్యలు తీసుకుంటున్నారు. నెలవారీ పర్యవేక్షణ.. ప్రతీనెల అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల బరువు, ఎత్తులను అంగన్వాడీ టీచర్లు నమోదు చేస్తారు. ఈ వివరాలను ఎన్హెచ్ఎం యాప్‌లో అప్లోడ్ చేయాలి. దీని ఆధారంగా పిల్లల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని అధికారులు చర్యలు తీసుకుంటారు. తక్కువ లేదా తీవ్ర పోషకాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారికి బాలామృతం ప్లస్ అందించడం, ఒక గుడ్డుకు బదులుగా రెండు గుడ్లు అందించడం వంటి చర్యలు తీసుకుంటారు. మరింత అనారోగ్య సమస్యలు ఉంటే చిన్నారి తల్లిదండ్రులతో కలిసి అంగన్వాడీ టీచర్ సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయిస్తారు. పోషకాహార లోపంతో నష్టాలు.. చిన్నారుల్లో వయస్సుకు తగ్గ బరువు, ఎదుగుదల తగ్గడం వల్ల తీవ్ర నష్టాలు కలుగుతాయి. పోషకాహారం అందుబాటులో లేకపోవడం, తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునే సామర్థ్యం దెబ్బతినడం వారి పెరుగుదలను దెబ్బతీస్తుంది. తరచూ అనారోగ్య సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గి త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. మెదడు అభివృద్ధి, జ్ఞానాత్మక నైపుణ్యాలపై ప్రభావం పడుతుంది. ఇది అభ్యసన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
ముందుగా గర్భిణుల నమోదుతోనే..
మంచిర్యాల జిల్లాలో హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి రెగ్యులర్‌గా చెకప్‌లు చేయించడం, ప్రసవం అయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవడంతోనే మృత శిశు మరణాలు తగ్గాయి. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు ముందుగానే రక్తం ఎక్కించేలా ఏర్పాట్లు చేయడం, సరైన పౌష్టికాహారం తీసుకునేలా వైద్య సిబ్బంది, ఆశా ఆరోగ్య కార్యకర్తలతో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం చేస్తున్నాం. ఇద్దరు గైనకాలజిస్టులు, మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో గర్భం దాల్చిన నుంచి ప్రసవం అయ్యే వరకు పరీక్షించడం వంటి చర్యలు తీసుకున్నాం. – నరేందర్‌రాథోడ్, మంచిర్యాల డీఎంహెచ్‌వో -
నిర్మల్
వారసత్వం పుణికిపుచ్చుకో..7రేపు ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్మల్‌చైన్‌గేట్/ఆదిలాబాద్‌టౌన్: ఎల్‌నినో ప్రభావం, ఉమ్మడి జిల్లాలో వర్షాభావ పరిస్థితుల సన్నద్ధతపై ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉట్నూర్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని నా లుగు జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధి కారులు హాజరు కానున్నారు. వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలుకు సంబంధించి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం ఉంటుంది. వ్యవసాయ, ఉద్యానవన, మార్క్‌ఫెడ్, సాగునీటి శాఖ, మిషన్ భగీరథ, మున్సి పల్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ, అటవీ, పౌరసరఫరాలు, వైద్యారోగ్య శాఖ, మహిళ, శిశు సంక్షేమ శాఖల అధికారులు పాల్గొని సన్నద్ధంపై వివరాలు సమర్పించనున్నారు.లక్ష్మణచాంద: ప్రపంచంలోని అనేక దేశాలు భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను చూసి గౌరవిస్తున్నాయి. విదేశీ యువత భారతీయ శాసీ్త్రయ కళలను నేర్చుకోవడానికి దేశానికి వచ్చి, మన సంప్రదాయిక వస్త్రధారణ, బొట్టు, నిండైన సంస్కృతిని చూసి మంత్రముగ్ధులవుతున్నారు. మన సంస్కృతిని అలవర్చుకుంటున్నారు. అయితే మన యువత విదేశీ సంస్కృతి మోజులో పడి పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తున్నారు. మార్పునకు స్పిక్ మెకే శ్రీకారం.. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యువతలో భారతీయ శాసీ్త్రయ సంగీతం, నృత్యం, సంస్కృతిని ప్రోత్సహించేందుకు 1977లో స్పిక్ మెకే(సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండియ న్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కల్చర్ అమంగ్స్ట్ యూత్) అనే స్వచ్ఛంద సంస్థ చర్యలు చేపట్టింది. రాజకీయ రహిత జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ సంస్థను ఐఐటీ ఢిల్లీ ఎమెరిటస్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ సేథ్ ప్రారంభించారు. కళారంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా 2009లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు 500కి పైగా విభాగాలు ఉన్నాయి. సంస్థ ప్రధాన లక్ష్యాలు.. నేటి విద్యార్థులు దేశ అభివృద్ధికి మూలస్తంభాలు. అయినప్పటికీ మొబైల్ ఫోన్ వ్యసనం, ఇతర ఆకర్షణల వల్ల యువత తప్పుడు మార్గంలో పయనిస్తోంది. దీనిని అరికట్టి యువతను సరైన దారిలో నడిపించడం, భారతీయ కళారూపాలను స్వయంగా అనుభవించేలా చేయడం స్పిక్ మెకే ముఖ్య ఉద్దేశం. యువతను భాగస్వాముల ను చేయడం ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని వారికి అందించాలని సంస్థ భావిస్తోంది. కళాకారుల నృత్య ప్రదర్శనలు ప్రముఖ కళాకారులు తమ జీవితా న్ని కళకు అంకితం చేసి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. విద్యార్థులు, యువ త ఈ ప్రదర్శనలను నేరుగా వీక్షించి అనుభూ తి చెందడం ద్వారా భారతదేశ సంపన్న సాంస్కృతిక మూ లాలతో మళ్లీ అనుసంధానమవుతున్నారు. జిల్లాలో 20 పాఠశాలలు ఎంపిక.. జిల్లాలోని 20 పాఠశాలల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి ప్రముఖ ఒడిస్సీ, కూచిపూడి నృత్య కళాకారులు వచ్చారు. వీరిలో ఆశాకుమారీ (ఒడిస్సీ నృత్య కళాకారిణి), సాత్విక రెడ్డి (కూచిపూడి నృత్య కళాకారిణి) ఉన్నారు. నాట్యం చేస్తూ అర్థం వివరించారు ఇటీవల వడ్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కూచిపూడి నృత్య కళాకారిణి సాత్వికారెడ్డి నృత్య ప్రధర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక్కో స్టెప్ వేస్తూ దాని అర్థం కూడా వివరించారు. చాలా బాగా అనిపించింది. నాట్యం నేర్చుకోవాలన్న ఆసక్తి పెరిగింది. – రాజేశ్వరి, విద్యార్థి, వడ్యాల్ మాకు నేర్పించారు.. జిల్లాలో ఆశాకుమారి, సాత్వికరెడ్డి ఇద్దరు కళాకారిణిలు మన సంస్కృతిలో భాగమైన ఒడిస్పీ, కూచిపూడి, భరత నాట్యం వంటివి ప్రభుత్వ పాఠశాలలో ప్రదర్శన చేయడంతోపాటు ఇష్టం ఉన్న వారికి నేర్పించారు. ముందు ముందు మరింత నేర్చుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. – శ్రావణి, విద్యార్థి, లక్ష్మణచాంద సంస్కృతిని కాపాడాలి.. నేడు ప్రపంచ దేశాలు మన సంస్కృతిని అవలంబిస్తున్నాయి. యువత మన దేశ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ బాధ్యతగా తీసుకోవాలి. విద్యార్థి దశ నుంచే మన సంస్కృతి సంప్రదాయాలు తెలిపేలా ప్రదర్శనలు ఇస్తున్నాం. ఇక్కడ సంస్కృతి చాలా బాగుంది. – సాత్వికరెడ్డి, కూచిపూడి కళాకారిణి ఎంపిక చేసిన పాఠశాలలు.. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సారంగాపూర్, టీఎస్‌డబ్ల్యూఆర్ పాఠశాల, జామ్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, దిలావార్పూర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నర్సాపూర్(జీ), ప్రభుత్వ ఉన్నత పాఠశాల, లోకేశ్వరం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బోసి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సోన్, టీజీ గరల్స్ రెసిడెన్షియల్ స్కూల్, లెఫ్ట్ పోచంపాడ్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జులాపూర్, బాలికల ఉన్నత పాఠశాల, జుమ్మెరత్పేట్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వడ్యాల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, లక్ష్మణచాంద పీఎంశ్రీ పాఠశాల, కొరిటికల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ది గ్రేట్ విరాసత్–2026.. తెలంగాణ విభాగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జనవరి నెలలో ‘ది గ్రేట్ విరాసత్ 2026’ అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది.రాష్ట్రంలోని 500 పాఠశాలల్లో శాసీ్త్రయ సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్నుదేవ్‌వర్మ ప్రారంభించారు. యువతలో అంతర్గత జ్ఞానం, జిజ్ఞాసను పెంపొందించడం ఈ కార్యక్రమ ధ్యేయం. మన సంస్కృతి చాలా గొప్పది మన సంస్కృతి చాలా గొప్పది. ప్రతీ విద్యార్థి, యువత ముందుగా మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలి. అందరిలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దానిని గుర్తించండి, సాధన చేయండి, మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి. కళ అనేది కేవలం నృత్యం లేదా సంగీతం మాత్రమే కాదు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, గౌరవం, మన సంస్కృతిలో భాగమే. – ఆశాకుమారి, ఒడిస్సీ కళాకారిణి -
హత్యాయత్నానికి దారితీసిన భూవివాదం
తిర్యాణి: ఇంటి సమీపంలోని చిన్నపాటి పెరటి భూమి వివాదం హత్యాయత్నానికి దారి తీసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని తలండి గ్రామానికి చెందిన కుర్సింగ జ్యోతి అదే గ్రామానికి చెందిన వరుసకు అన్న అయ్యే టేకం తిరుపతితో కొన్ని రోజులుగా భూ వివాదం నడుస్తోంది. శుక్రవారం రాత్రి గ్రామంలో దండారీ ఉత్సవాలను చూసేందుకు కుటుంబ సభ్యులు వెళ్లగా జ్యోతి ఇంట్లో ఒంటరిగా ఉంది. గమనించిన తిరుపతి మద్యం మత్తులో ఆమె మెడపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. అరుపులు వినిపించడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలించారు. జ్యోతి మామ కుడిమెత బాదిరావు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, నిందితుడు తిరుపతి పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. -
కబ్జాదారుల నుంచి ఆలయ భూమి స్వాధీనం
చెన్నూర్: చెన్నూర్ జాతీయరహదారి పక్కన గల సర్వేనంబర్ 869/21లో 3.20 ఎకరాల జగన్నాథాలయ భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకున్నామని ఈవో ముక్త రవి తెలిపారు. స్థానిక జగన్నాథాలయంలో ఎండోమెంట్ అధికారులతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూకల సతీశ్‌తోపాటు అనుచరులు ఆలయానికి చెందిన భూమిని ఆక్రమించుకుని 200 మామిడి చెట్లను నాటి చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారని తెలిపారు. చెన్నూర్, కోటపల్లి, భీమారం పోలీసుల సహాయంతో రెండు జేసీబీలు ఏర్పాటు చేసి మామిడి చెట్లు, కంచె తొలగించామన్నారు. అధికారులను అడ్డుకునేందుకు ఇనుప రాడ్లు, కారంపొడి, బండరాళ్లు పెట్రోల్‌తో కబ్జాదా రులు దాడికి ప్రయత్నించారని పేర్కొన్నారు.అధి కారుల వద్ద ఉన్న రికార్డులను కనుకుంట్ల వెంకట రాజం ఎత్తుకెళ్లారు. అధికారుల ఫిర్యాదుతో నూకల సతీశ్, కనుకుంట్ల వెంకటరాజం, బడికల వెంకటేశ్, కేదాసు సతీశ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ బ న్సీలాల్ తెలిపారు. ఆదిలాబాద్ అసిస్టెంట్ కమిషనర్ సూపరింటెండెంట్ రవికిషన్, ఈవోలు భూ మ య్య,చంద్రశేఖర్, భూమయ్య, రాజేశ్ పాల్గొన్నారు. -
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ
ఖానాపూర్: రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మండలంలోని బాదనకుర్తి సమీపంలోని గోదావరి వంతెనపై శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వెనుక నుంచి కారు ఓ బస్సును ఢీకొట్టడంతో మూడు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. బస్సుడ్రైవర్ మురళితోపాటు ప్రయాణికురాలు ఎల్లమ్మ, మరికొందరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ నుంచి జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, మెట్పల్లి నుంచి ఖానాపూర్‌కు వస్తున్న మరో బస్సు గోదావరి వంతెనపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒక బస్సు ముందు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. కొందరు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, వాహనదారులు క్షతగాత్రులను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గోదావరి వంతెనపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులకు పక్కకు తొలగించడంతో రాకపోకలు పునరుద్ధరించారు. ప్రమాద ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టారు. -
రేషన్ బియ్యం పట్టివేత
నస్పూర్: సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్, నార్కోటిక్, పోలీసు బృందాలు శనివారం ఆకస్మిక దాడులు చేసి పట్టుకున్నాయి. ఉమామహేశ్వర కాలనీలో కొందరు రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేశారని సమాచారం అందిందినట్లు సీసీసీ నస్పూర్ ఎస్సై ప్రశాంత్ తెలిపారు. వెంటనే సిబ్బందితో అక్కడికి చేరుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించామన్నారు. పట్టుకున్న బియ్యం సుమారు 30 క్వింటాళ్లు, రూ.1.35 లక్షల ఉంటుందని పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ ఎస్సై డి.రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. జన్నారం: ఇందన్పల్లి శివారు ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద శనివారం తనిఖీల్లో రేషన్ బియ్యం తరలి స్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపారు. 11.26 క్వింటాళ్ల బియ్యం బస్తాలు ఉన్నాయని, వీటి విలువ సు మారు రూ.40 వేలు ఉంటుందని పేర్కొన్నారు. బియ్యం తరలిస్తున్న ఖా నాపూర్ మండలం సూర్జాపూర్కు చెందిన కడమంచి లచ్చన్న, డ్రైవర్ మోర్తాడ్ అరవింద్‌ను విచారించగా ఆర్థికఅవసరాల నిమిత్తం జన్నారం చుట్టుపక్కల గ్రామాల్లో తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా లక్ష్మ ణచాంద మండలం వడ్యాల్‌కు చెందిన నరేశ్‌కు వీటిని విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ పనుల కోసం ఎవరైన వీల్స్‌తో ట్రాక్టర్లను రోడ్డుపై నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. -
వర్షాలు కురవాలని కారడవిలోకి..
దస్తురాబాద్: వర్షాలు సమృద్ధిగా కురవాలని దస్తురాబాద్ మండల కేంద్రానికి చెందిన గ్రామస్తులు శనివారం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. గండి నరసింహస్వామికి పూజలు చేశారు. స్వామివారిని పూజిస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండతాయని, పశువులకు వ్యాధులు రావని భక్తుల నమ్మకం. ఈ సంప్రదాయం ప్రకారం శుక్రవారం గ్రామంలో యువకులు, పెద్దలు కప్పతల్లి ఆటలు ఆడుతూ, అర్చకులు గ్రామ సమీపంలో వరద పాశం చేసి ప్రసాదం పంచారు. శనివారం కొండ మీది లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి బయలుదేరారు. నాలుగు కిలోమీటర్లు నడిచి కొండ మీది ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. ముందుగా గుట్టల కింది భాగంలో ఉన్న పెద్ద బండరాయి వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు, దీపారాధన చేసి యాత్రను ప్రారంభించారు. పూజల అనంతరం అన్నదానం చేశారు. -
వృద్ధుడి హత్య కేసు ఛేదన
రెబ్బెన: మండలంలో సంచలనం రేపిన వృద్ధుడి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మండలకేంద్రంలోని పోలీసుస్టేషన్లో ఎస్సై వెంకటకృష్ణతో కలిసి సీఐ సంజయ్ శనివా రం వివరాలు వెల్లడించారు. తుంగెడ పంచాయతీ పరిధిలోని కొత్తగూడకు చెందిన బోగారపు నగేశ్ మద్యానికి బానిసయ్యాడు. తాగేందుకు అందరినీ డబ్బులు అడిగేవాడు. శుక్రవారం పర్సనంబాలకు చెందిన మాసాడే సోమయ్య(65) తన భార్య కరుణబాయి, చిన్న కూతురు సుజాతతో కలిసి పెద్ద కూతురైన లక్ష్మిని రైలు ఎక్కించేందుకు రెబ్బెనలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. టీ తాగి వస్తానని వారికి చెప్పి సోమయ్య బస్టాండ్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో బోగారపు నగేశ్ అక్కడే ఉండగా సోమయ్య టీ తాగి తిరిగి రైల్వేస్టేషన్ వస్తున్నాడు. సోమయ్య వద్ద డబ్బులను చూసిన నగేశ్ తనకు ఇవ్వాలని అడుగగా నిరాకరించాడు. ఆగ్రహానికి గురై సోమయ్యను చంపాలని వెంబడించాడు. తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో సోమయ్య మెడపై దాడి చేసి తల మొండెం వేరుచేశాడు. తర్వాత భయంతో పారిపోయాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ అశోక్, సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ.. ఘటనస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. సీసీపుటేజీలను పరిశీలించారు. నిందితుడు రైల్వే మార్గం ద్వారా తప్పించుకున్నట్లు గుర్తించారు. ఎస్పీ నితికపంత్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీపుటేజీ ఆధారంగా సిర్పూర్ (టి) రైల్వేస్టేషన్లో ఉన్నట్లు గుర్తించి పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. తాగేందుకు డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కారణంతో హత్య చేసినట్లు వెల్లడించారు. చాకచక్యంగా నిందితుడిని గంటల వ్యవధిలో పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్సై నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
కుస్తీ.. పట్టేదెలా?
సమకూర్చాల్సినవి..ఆదిలాబాద్: కుస్తీ క్రీడాకారులకు ఆదిలోనే సమస్యలు పలుకరిస్తున్నాయి. అరకొర వసతులు, మ్యాట్, షూ లేకుండానే జిల్లా కేంద్రంలోని తెలంగాణ క్రీడా పాఠశాల విద్యార్థులు అసౌకర్యాల మధ్య సాధన చేయాల్సి వస్తోంది. ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో వినియోగంలో లేని రెజ్లింగ్ హాల్ కేటాయించారు. వర్షం కురిస్తే మ్యాట్ వరకు నీరు రావడం, పైనుంచి ఊరుస్తోంది. కుస్తీపై ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించలేపోతున్నారు. మ్యాట్ లేకపాయే.. కుస్తీ సాధనకు రెజ్లింగ్ మ్యాట్ తప్పనిసరి. మ్యాట్ ఉపరితలంపై సాధన చేయడం వల్ల బ్యాలెన్స్, వేగవంతమైన కదలికలు, క్రీడా సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలన్నీ మ్యాట్‌పై నిర్వహిస్తుండడంతో క్రీడాకారులు అదే తరహా ఉపరితలంపై శిక్షణ పొందడం అవసరం. ప్రస్తుతం మ్యాట్ లేకపోవడంతో క్రీడా పాఠశాల విద్యార్థులకు శిక్షకుడు ఫోమ్ ఏర్పాటు చేసి దానిపై కవర్ పర్చి సాధన చేయిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు గాయాలపాలవుతుండగా, ఈ కారణంగా రాష్ట్ర, జాతీయస్థాయి పతకాల వేటలో వెనుకబడుతున్నారు. కిట్లు కొంటున్నారుకుస్తీ క్రీడాకారులు ధరించే ప్రత్యేక దుస్తులను ‘రెజ్లింగ్ సింగ్లెట్’అని పిలుస్తారు. శరీర కదలికలు స్పష్టంగా కనిపించేలా వీటిని రూపొందిస్తారు. నాణ్యతను బట్టి వీటి ధర సుమారు రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు ఉంటుంది. ప్రత్యేకంగా తయారు చేసిన షూస్ మ్యాట్‌పై జారకుండా ఉండేలా డిజైన్ చేస్తారు. క్రీడా పాఠశాల నుంచి ఈ కిట్లు అందకపోవడంతో తల్లిదండ్రులు సొంత ఖర్చులతో కొనుగోలు చేసి ఇస్తున్నారు. త్వరలో అందుబాటులోకి.. కుస్తీ క్రీడాకారులకు అవసరమైన రెజ్లింగ్ మ్యాట్‌కు ప్రతిపాదనలు పంపించాం. అనుమతి సైతం లభించింది. నెలల్లోపు మ్యాట్ అందుబాటులోకి తీసుకువస్తాం. విద్యార్థులకు అవసరమైన కిట్లు అందిస్తాం. క్రీడాకారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. – దయానందరెడ్డి, డీవైఎస్వో, ఆదిలాబాద్ -
రాష్ట్రస్థాయి పోటీల్లో మెరిసిన అథ్లెట్లు
ఆదిలాబాద్: మెదక్‌లోని ఇందిరాగాంధీ స్టేడియంలో మెదక్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ‘4వ తెలంగాణ స్టేట్ మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ అథ్లెటిక్స్ మీట్’లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. మొత్తం ఐదు పతకాలు (3 స్వర్ణాలు, 2 రజతం) సాధించారు. పోటీల్లో పడ్వా ల్ పూజ (మహిళల 800 మీటర్లు), రాథోడ్ సోను (బాయ్స్– అండర్ 14 ట్రయాథ్లాన్–సి), కోట్నాక్ జాకేశ్ (బాయ్స్–అండర్ 14 ట్రయాథ్లాన్–ఏ) స్వర్ణ పతకాలు కై వసం చేసుకోగా, తొడసం తుకారం (బాయ్స్–14 ట్ర యాథ్లాన్–సి), కుమ్రే ఐశ్వర్య (మహిళల 30 00 మీటర్లు) రజతం పతకాలు సాధించి జిల్లా కీర్తిని చాటారు. విజేతలను అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, డీవైఎస్వో దయానంద్‌రెడ్డి, అభినందించారు. రాష్ట్ర అథ్లెటిక్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ పి.రాజేష్, వి.జి.ఎస్ అకాడమీ చైర్మన్ వి.జి.ఎస్ రాకేశ్, పీ.డీలు రాహుల్ అగార్కర్, లక్ష్మి పాల్గొని విజేతలను అభినందించారు. -
రాయితో పోయేది..కిడ్నీ తీసేదాక
ఆదిలాబాద్‌టౌన్: గోరుతో పోయేది.. గొడ్డలితోదాక అన్న సామెత ఇక్కడ అ చ్చంగా వర్తిస్తుంది. కిడ్నీలో ఉన్నరాళ్లు తీయకపోవడంతో ఏకంగా కిడ్నీనే తొలగించే పరిస్థితి ఏర్పడింది. రిమ్స్ యూరాలజీ వైద్యుడు కార్తీక్ అరుదైన శస్త్రచికిత్స చేసి కిడ్నీలో ఉన్న రాయిని, చెడిపోయిన కిడ్నీ తొలగించి ఓ నిండుప్రాణాన్ని కా పాడారు. ఆదిలాబాద్ రూరల్ మండలం మాలే బోరిగాం గ్రామానికి చెందిన గిరిజన మహిళ సెడ్మకి దేవుబాయి(35) ఏడాదిగా కడుపు నొప్పితో బాధపడుతుంది. ఈనెల 8న సమీప బంధువు సహాయంతో రిమ్స్‌లో చేరింది. వైద్యుడు కార్తీక్ ఆమెను పరీక్షించి మూత్రపిండంలో పెద్దసైజు గల రాయి (స్టోన్) ఉందని నిర్ధారించారు. ఈనెల 17న శస్త్రచికిత్స చేయగా 9x10x9 పెద్ద సైజులో ఉన్న రాయి తొలగించారు. కొన్ని నెలలుగా మూత్రపిండంలో ఉన్న రాయి.. మూత్రం బయటకు రాకుండా అడ్డుగా ఉండడంతో దానిపై ప్రభావం పడి ఒక కిడ్నీ చెడిపోయిందని వైద్యుడు తెలిపారు. సదరు వైద్యుడిని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అభినందించారు. -
ఫలించిన బేసిక్ పోరాటం
శ్రీరాంపూర్: తమకు జరుగుతున్న నష్టాన్ని సవరించాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో కోర్టు మెట్లెక్కిన సింగరేణి కార్మికులకు న్యాయం దక్కింది. వీరి పోరాటం అనేకమందికి ప్రయోజనం కలిగిస్తోంది. సింగరేణి కంపెనీలో డిపెండెంట్ కింద ఉద్యోగంలో చేరిన వారికి అండర్‌గ్రౌండ్‌లో జనరల్ అసిస్టెంట్ డిజిగ్నేషన్ కల్పించి ఒకటో కేటగిరి బేసిక్ వేతనం చెల్లిస్తారు. సర్వీసు పెరిగిన కొద్దీ వేతనం పెరుగుతుంది. కానీ 30ఏళ్లు పనిచేసిన జనరల్ అసిస్టెంట్ ఏదైనా కారణాలతో సర్ఫేస్కు వస్తే వేతనం ఒక్కసారిగా తగ్గిస్తున్నారు. తనకున్న సర్వీసుతో అప్పటివరకు భూగర్భంలో 4వ కేటగిరి బేసిక వేతనం పొందినప్పటికీ సర్ఫేస్‌లోకి వస్తే తిరిగి ఒకటో కేటగిరి బేసిక్ కట్టిస్తున్నారు. ఉద్యోగంలో చేరినప్పుడు ఎంత ఉందో అంతే కట్టిస్తూ వేతనం చెల్లిస్తున్నారు. ఇది డీ ప్రమోట్‌ను తలపిస్తుంది. నిబంధనలకు పాతరఅండర్గ్రౌండ్ జనరల్ అసిస్టెంట్లు సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్‌గా మారడానికి సంస్థ నిబంధనల ప్రకా రం రెండు రకాల విధానాలు ఉన్నాయి. భూగర్భంలో పనికి ఆరోగ్యం సహకరించకపోతే కార్మికుడు స్వచ్ఛందంగా సర్ఫేస్ పోస్టు కోరుకుంటే 1వ కేటగి రి బేసిక్ వేతనం చెల్లిస్తారు. దీంతో కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు ఎంత ఉందో అంతే దక్కుతుంది. సర్ఫేస్‌లో ఖాళీల భర్తీకి కంపెనీ దరఖాస్తులు స్వీకరించి సీనియారిటీ ఆధారంగా భర్తీ చేస్తుంది. వీరి వేతనాన్ని ఏమాత్రం తగ్గించకుండా బేసిక్ ప్రొటెక్షన్ కల్పిస్తూ సర్ఫేస్ పోస్టింగ్ ఇవ్వాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన చాలా ఏళ్లుగా అమలు చేయకపోవడంతో సర్ఫేస్‌లోకి మారిన ఒక్కో కార్మికుడు నెలకు రూ.10వేలకు పైగా నష్టపోతున్నారు. ఐదేళ్లుగా న్యాయపోరాటంకార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో 2020లో సత్తుపల్లి కిష్టాపూర్ ఓసీపీలోని 12మంది, 2021లో భూపాలపల్లిలోని మరో 11మంది జనరల్ అసిస్టెంట్లు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం బేసిక్ వేజ్ ప్రొటెక్షన్ కల్పించాలని, ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో నష్టపోతున్నామని విన్నవించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కార్మికులకు న్యాయం చేస్తూ వేజ్ ప్రొటెక్షన్ కల్పించాలని ఈ నెల 15న ఆదేశాలు ఇచ్చింది. అండర్‌గ్రౌండ్‌లో ఎంత బేసిక్ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ సర్ఫేస్లోనూ కట్టివ్వాలని పేర్కొంది. అంతేగాకుండా అప్పటివరకు వచ్చిన ఎస్ఎల్పీలు, ప్రమోషన్లు ఉంటే వాటిని కూడా కట్టివ్వాలని, గత కాలానికి ఏరియర్స్‌తో మూడు నెలల్లో అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఎట్టకేలకు ఐదేళ్ల తర్వాత న్యాయం జరిగింది. ఈ కేసులో ఉన్న 23మందికే కాకుండా కంపెనీవ్యాప్తంగా ఉన్న 2,500మంది జనరల్ అసిస్టెంట్లకు తీర్పు వర్తించి ప్రయోజనం కలుగనుంది. కోర్టు ఆదేశాల ఆధారంగా సదరు కార్మికులు కంపెనీకి దరఖాస్తు చేసుకుంటున్నారు. సీనియర్ కార్మికులకు నెలకు రూ.10వేల వరకు వేతనం పెరగనుంది. గ్రాట్యూటీ, పింఛన్ కూడా పెరుగుతుంది. -
ఉపాధ్యాయులు నైపుణ్యం పెంచుకోవాలి
● డీఈవో భోజన్న నిర్మల్ రూరల్: ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలు పెంచుకోవాలని డీఈవో భోజన్న సూచించారు. జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో సాంఘిక శాస్త్రం, జీవశాస్త్ర ఉపాధ్యాయులకు మూడు రోజులుగా జరుగుతున్న శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి డీఈవో హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు నేటితరం విద్యార్థులకు అనుగుణంగా విద్యాబోధన చేయాలని సూచించారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పాఠాలు నేర్పాలని, సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దేలా బోధించాలని తెలిపారు. ఇందులో ఏఎంవో నరసయ్య, కోర్స్ డైరెక్టర్లు రామచందర్, శ్రీనివాస్‌రెడ్డి, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. -
బైక్‌చోరీ ముఠా అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో శనివారం వివరాలు వెల్లడించారు. జిల్లాలో వాహన చోరీలకు పా ల్పడుతున్న ముఠా కేసును టూటౌన్ పోలీసులు ఛేదించారని తెలిపారు. గతేడాది డిసెంబర్ 23న రా త్రి జైనథ్ మండలానికి చెందిన ఫొటోగ్రాఫర్ కుంట రవితేజ తన బైక్‌ను జిల్లా కేంద్రంలోని హోటల్ స మీపంలో పార్కింగ్ చేశాడు. గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటే జీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితుల ను అరెస్ట్ చేసి, వారి నుంచి దొంగిలించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అరెస్ట్ అ యిన వారిలో ఇంద్రానగర్‌కు చెందిన కరణ్ షిండే, మెస్రం సాయికిరణ్, ఫర్దీన్ ఖాన్, గాంధీనగర్‌కు చెందిన పవార్ విక్రమ్‌లు ఉండగా, భాగ్యనగర్‌కు చెందిన అబ్దుల్ సాహిల్, ఇంద్రానగర్‌కు చెందిన అజర్ ఖాన్, పొల్లేకర్ గణేష్ పరారీలో ఉన్నట్లు వివరించారు. సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, టూటౌన్ సీఐ నాగరాజు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సైలు ప్రణయ్, విష్ణుప్రకాష్ పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి పోలీస్ దర్బార్
నిర్మల్‌టౌన్: పోలీసుల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందుంటుందని ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. పోలీసుల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు జిల్లా కేంద్రంలోని ఆర్మ్డ్ రిజర్వ్(ఏఆర్) హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం ప్రత్యేక దర్బార్ నిర్వహించారు. కార్యక్రమానికి ముందు వారాంతపు పరేడ్‌ను నిర్వహించి, సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం ఏఆర్ కానిస్టేబుళ్లు, హోంగార్డులతో ముఖాముఖి సమావేశమైన ఎస్పీ, విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ పోలీసు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్‌లు, మద్యం, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. వ్యక్తిగత లేదా విధి నిర్వహణలో ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా ఉన్నతాధికారులు, సహచరులతో మాట్లాడి పరిష్కారం వెతకాలన్నారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ వారి సంక్షేమంపైనా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా హోంగార్డులు, మహిళా పోలీసు సిబ్బంది తమకు ఎదురయ్యే సమస్యలను నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐలు రామ్ నిరంజన్‌రావు(అడ్మిన్), శేఖర్, రామకృష్ణ, ఆర్ఎస్సైలు, పోలీసు సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు. -
వేగంగా క్రిమినల్ కేసుల విచారణ
నిర్మల్‌టౌన్: క్రిమినల్ కేసుల విచారణ వేగవంతం చేసి త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా జడ్జి శ్రీవాణి తెలిపారు. హైకోర్టు మార్గదర్శకాల మేరకు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా ప్రధాన కోర్టులో శనివారం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల పురోగతి, అండర్ ట్రయల్ ఖైదీల కేసుల త్వరిత విచారణ, చార్జ్ షీట్లను సకాలంలో దాఖలు చేయడం, సాక్షుల హాజరును నిర్ధారించడం, కోర్టు సమన్లు, వారెంట్లను వెంటనే అమలు చేయడం, నాణ్యమైన దర్యాప్తుతో పటిష్టమైన సాక్ష్యాధారాలను సమర్పించడం వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. అండర్ ట్రయల్ ఖైదీలకు సంబంధించిన కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు పోలీసు, ప్రాసిక్యూషన్, న్యాయస్థాన అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ.. ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్, న్యాయస్థానాల మధ్య సమన్వయం కీలకమన్నారు. ప్రతీ దర్యాప్తు అధికారి చట్టపరమైన ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, కోర్టు ఆదేశాల అమలులో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. శాసీ్త్రయ ఆధారాలతో నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రవీందర్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి భవిష్య, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి నిఖిత, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, జైలర్ సూర్యప్రకాశ్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీఐలు, ఎస్సైలు, సీడీవోలు, న్యాయస్థాన, అధికారులు పాల్గొన్నారు. -
‘జలసిరి’కి శ్రీకారం
భైంసా: భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ జలసిరి పథకాన్ని కలెక్టర్ భవేశ్ మిశ్రా, డీఆర్డీవో విజయలక్ష్మి శనివారం ప్రారంభించారు. జిల్లాలో వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే దిశగా అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పథకం కింద మూడు రకాల రీచార్జి నిర్మాణాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ ఇంటికి ఇంకుడు గుంతలు, ప్రతీ ఊరికి ఊట కుంటలు, ప్రతీ పంటకు నీటి కుంటలు నిర్మించడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచేలా చర్యలు చేపడతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణతోపాటు రైతులకు సాగునీటి లభ్యత మెరుగుపడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు తెలిపారు. జిల్లాలో అన్ని గ్రామపంచాయతీల పరిధిలో ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. మండలాలు 18 గ్రామపంచాయతీలు (జీపీలు) 400 ఫాంపాండ్లు 2,000 పీటీ పనులు 400 వ్యక్తిగత సోక్పిట్లు 70 వేలు కమ్యూనిటీ సోక్పిట్లు 400 బోర్వెల్ రీచార్జి 400 ఓపెన్‌వెల్ రీచార్జి 18 -
అర్హులైన ఓటరు పేరు జాబితాలో ఉండాలి
నిర్మల్‌చైన్‌గేట్/లక్ష్మణచాంద: అర్హులైన ప్రతీ ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. జిల్లా కేంద్రంలో, సోన్ మండల కేంద్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావుతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గాజులపేట్, బుధవార్‌పేట్, బంగల్పేట్, బెస్తవారిపేట్, గుల్జార్ మార్కెట్, బాగులవాడ, భాగ్యనగర్ కాలనీ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్వోలు), కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. ఓటరు నమోదు సమయంలో ఎదురవుతున్న సమస్యలను బీఎల్వోలు, బీఎల్ఏలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, కౌన్సిలర్లు పెండెం శ్రీనివాస్, నాందేడపు చిన్ను, జాకీర్, ఇమ్రాన్ ఉల్లా, ఎస్పీ రాజు, లక్కాకుల హరీశ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్, సోన్ మండల అధ్యక్షుడు మొయినుద్దీన్, మధుకర్‌రెడ్డి, వేణుగోపాల్, విలాస్, భూమారెడ్డి, ముత్యంరెడ్డి, జి.శ్రీనివాస్‌గౌడ్, భుజంగ శ్రీనివాస్‌రెడ్డి, సోన్ సర్పంచ్ అంపోలి వనజ, పార్టీ మండల అధ్యక్షుడు మోయినుద్దీన్, మధుకర్‌రెడ్డి, ఆత్మా డైరెక్టర్ గాండ్ల లింగన్న, మురళీధర్‌రెడ్డి, రాజా నరసింహారెడ్డి, అజహర్, వినోద్, కాంతయ్య, అనిల్, జగన్ తదితరులుపాల్గొన్నారు. -
‘మున్నూరుకాపుల సంఖ్య తక్కువ చూపే కుట్ర’
జైపూర్: రాష్ట్రవ్యాప్తంగా బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న మున్నూరు కాపుల సంఖ్యను తక్కువ చూపే కుట్ర సాగుతుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుట్టం పురుషోత్తం ఆరోపించారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన చెన్నూర్ నియోజకవర్గ స్థాయి మున్నూరుకాపు సంఘం సమావేశంలో మాట్లాడారు. కాపుల విచ్ఛిన్నానికి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో వాడుకుంటున్నాయన్నారు. అధిక జనాభా ఉన్న కాపులు రాజకీయ వెనుకబడ్డారని తెలిపారు. సంఘం ద్వారా గ్రామానికి ముగ్గురు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5వేల మందికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రామస్థాయి నుంచి మండలం, జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా కాపుల ఐక్యత చూపించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్రకార్యదర్శి ఇందూరి తిరుపతి, జిల్లా అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్రకార్యదర్శి గాదె సత్యం, ఆర్నే సమ్మయ్య, కాసెట్టి కుమార్, జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి మండలాల అధ్యక్షులు సత్యనారాయణ, శ్రీనివాస్, కిష్టయ్య, సమ్మయ్య పాల్గొన్నారు. -
ఏఐని సమర్థవంతంగా వినియోగించాలి
నిర్మల్‌టౌన్: ప్రతీ దర్యాప్తు అధికారి సీసీటీఎన్ఎస్ ఏఐ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించి కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకీషర్మిల ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, దర్యాప్తు అధికారులు, సిబ్బందితో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తును మరింత వేగవంతంగా, నాణ్యంగా నిర్వహించేందుకు కృత్రిమ మేధస్సు(ఏఐ) ఆధారిత సీసీటీఎన్ఎస్–ఏఐ పైలట్ ప్రాజెక్టును సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు. అలాగే సీసీటీఎన్‌ఎస్‌తో కేసుల దర్యాప్తునకు అవసరమైన సమాచారం, చట్టపరమైన అంశాలు, కేసు విశ్లేషణ, డిజిటల్ ఆధారాల పరిశీలన వంటి అంశాల్లో దర్యాప్తు అధికారులకు సాంకేతిక సహకారం లభిస్తుందని తెలిపారు. శాసీ్త్రయ విధానాలతో, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు పూర్తి చేసి కోర్టుల్లో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించి, కన్విక్షన్ రేటు పెంచడమే ఈ పైలట్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. దర్యాప్తులో నిర్లక్ష్యానికి తావు లేకుండా నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు. -
వెయిట్ లిఫ్టర్‌కు అభినందన
ఖానాపూర్: సూర్యాపేట జిల్లా కోదాడలో ఈ నెల 12న నిర్వహించిన అస్మిత ఖేలో ఇండియా మహిళల రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో ఖానాపూర్ మండలం మస్కాపూర్ జెడ్పీఎస్ఎస్ హైస్కూల్ విద్యార్థిని రాగం విజ్ఞత విశేష ప్రతిభ కనబర్చి ప్రత్యేక ప్రతిభా పురస్కారం అందుకుంది. విజ్ఞత సాధించిన విజ యాన్ని పురస్కరించుకుని ఖానాపూర్ కేబుల్ టీవీ ఆపరేటర్ల యూనియన్ సభ్యులు శుక్రవా రం అభినందించారు. చిన్ననాటి నుంచే కుమార్తెకు క్రీడలపై ఆసక్తి పెంపొందించి, ప్రతీ పోటీలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న తండ్రి రాగం గణేశ్‌ను అభినందించారు. విజ్ఞత భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి ఖానాపూర్తోపాటు తెలంగాణకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కేబుల్ టీవీ ఆపరేటర్ల యూనియన్ ప్రతినిధులు ముజిగెల రవికిరణ్(ఎంఎస్‌వో), కందాల నాగరాజు, బూసి నరేందర్, కందాల చక్రి, సాయి పాల్గొన్నారు. -
బోనమెత్తిన ఆదర్శనగర్
ఆషాఢ మాసం నేపథ్యంలో నిర్మల్ పట్టణంలో బోనాల వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్థానిక ఆదర్శనగర్ కాలనీలో అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. యువతులు కూడా భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఊరేగింపులో శివసత్తులు పూనకాలు, పోతురాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. జోగినులు అమ్మవారి నామస్మరణతో సంప్రదాయ నృత్యం చేశారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. – నిర్మల్‌టౌన్ -
డీఆర్వో తనిఖీలు
దిలావర్పూర్: మండలంలోని పలు గ్రామాల్లో మండల ప్రత్యేక అధికారి, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఎంపీవో గోవర్ధన్ శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎంపీవో గోవర్ధన్ మాయాపూర్ పంచాయతీని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, నర్సరీలను తనిఖీ చేశారు. అలాగే స్థానిక ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థుల హాజరును, అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. డీఆర్వో రాథోడ్ రమేశ్, ఎంపీవో గోవర్ధన్‌తో కలిసి గుండంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, కిచెన్ గార్డెన్, ఆర్ఓ ప్లాంట్, మరుగుదొడ్లను పరిశీలించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులతో మాట్లాడుతున్న డీఆర్వో -
బల్దియా ఉద్యోగం.. ఇష్టారాజ్యం..!
● ఒకరికి బదులు మరొకరు విధులు భైంసాటౌన్: భైంసా బల్దియాలో ఉద్యోగం ఇష్టారాజ్యం అన్నట్టుగా నడుస్తోంది. కొందరు ఉద్యోగులు విధులకు రాకున్నా ప్రతినెలా ఠంచనుగా వేతనం పొందుతున్నారు. ఆరోగ్య, ఇతర కారణాలను సాకుగా చూపుతూ తమకు బదులు బంధువులు, ప్రైవేట్ వ్యక్తులతో పనిచేయిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరైతే మొత్తంగానే విధులకు దూరంగా ఉంటూ సంబంధిత విభాగం అధికారులను మేనేజ్ చేసుకుంటున్నట్లు సమాచారం. విధులకు రాకున్నా.. ఒక్క సెలవు కూడా వినియోగించలేదని హాజరు రిజిస్టర్లో చూపుతూ పూర్తి వేతనం పొందుతున్నారు. కిందిస్థాయి ఉద్యోగులే ఎక్కువ... మున్సిపాలిటీలో పారిశుద్ధ్య విభాగంలో పలువురు రెగ్యులర్ ఉద్యోగులు ఎక్కువగా విధులకు రాకుండా వేతనం పొందుతున్నట్లు తెలుస్తోంది. వేతనాలు ఎక్కువగా ఉండడం, పారిశుద్ధ్య పనులు చేయాల్సి వస్తుండడంతో నామోషీగా భావించి తమకు బదులు ప్రైవేట్ వ్యక్తులతో పని చేయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట్లో కొన్నిరోజులు విధులకు పంపించి, తరువాత అది కూడా చేయడం లేదని వినికిడి. ఫలితంగా పారిశుద్ధ్య నిర్వహణ గాడితప్పుతోంది. ఔట్సోర్సింగ్ కార్మికులతోనే పనులు చేయిస్తున్నారు. ఫలితంగా వారు శ్రమదోపిడీకి గురవుతున్నారు. అంతేగాక, అటెండర్ విధులు నిర్వహించే ఇద్దరు ఉద్యోగులు సైతం విధులకు రాకుండా వేతనం పొందుతున్నట్లు తెలిసింది. ఔట్సోర్సింగ్ విభాగంలోనూ కొందరు విధులకు రావడం లేదని, ఇష్టారాజ్యంగా నియామకాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చర్చనీయంగా ఉద్యోగి నియామకం... బల్దియాలోని పర్యావరణ విభాగంలో ఓ ఉద్యోగిని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించడం విమర్శలకు తావిస్తోంది. ఎలాంటి ప్రకటన లేకుండా, గుట్టుచప్పుడు కాకుండా నియమించడం, కొందరు ముఖ్యుల పాత్ర ఉండడం అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ విషయమై సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. బల్దియాలో జరుగుతున్న ఈ తంతుపై కమిషనర్ లింగయ్యను వివరణ కోరగా, తన దృష్టికి రాలేదని తెలిపారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగి నియామకంపై స్పందిస్తూ గత కమిషనర్ హయాంలో నియమించినట్లు చెప్పారు. -
పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
లక్ష్మణచాంద/ఖానాపూర్: రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోన్, ఖానాపూర్ మండలాల్లోని పుష్కర ఘాట్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఘాట్ల వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. పుష్కరాల నాటికి ఘాట్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని సూచించారు. గత పుష్కరాల్లో నమోదైన భక్తుల రద్దీ వివరాలను తెలుసుకుని, ఈసారి అంచనా మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు. చేపట్టే అన్ని పనులు నాణ్యతతో, మన్నికగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పుష్కర ఘాట్లకు చేరుకునే మార్గాల్లో స్పష్టమైన సూచికల బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు, తగిన పార్కింగ్ సౌకర్యాలు, రాకపోకలకు అనువైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. భక్తుల భద్రత, పరిశుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, లైటింగ్ తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి.. ఖానాపూర్: పట్టణంలో ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. డిజిటలైజేషన్ గడువులోగా ఆన్లైన్ పూర్తి చేయాలని సూచించారు. మొత్తం ఓటర్ల సంఖ్య, స్వీకరించిన ఫారాలు, డిజిటలైజేషన్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీఎల్వో యాప్‌ను పరిశీలించిన ఆయన ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఓటర్లకు అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ అనిల్, తహసీల్దార్లు సంతోష్, సుజాత, ఎంపీడీవో రాధారాథోడ్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, మున్సిపల్ వైస్ చైర్మన్ సోయబ్, అధికారులు, సిబ్బంది ఉన్నారు. సర్.. 75 శాతం పూర్తి నిర్మల్: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ 75 శాతం డిజిటైజేషన్ పూర్తయ్యిందని, గ్రామసభల్లో ఖరారు చేసిన అన్ కలెక్టెడ్ ఫారాలను కలిపితే 81 శాతం పూర్తయినట్లు కలెక్టర్ భవేశ్‌మిశ్రా పేర్కొన్నారు. సర్ ప్రక్రియ పూర్తిలో రాష్ట్రంలో టాప్‌టెన్‌లో ఉన్నామన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే, నిర్మల్, భైంసా వంటి పట్టణ ప్రాంత ఓటర్లే ఎన్యూమరేషన్ ఫారాలను అందించడంలో వెనుకంజలో ఉన్నారన్నారు. వచ్చేనెల 3 వరకు సర్ ప్రక్రియ గడువు పెంచినప్పటికీ.. ఈనెల 20లోపు సదరు ఫారాలను అందించి, డిజిటైజేషన్ చేయించుకోవాలని సూచించా రు. ఫారాలను తీసుకోనివారు, తిరిగి ఇవ్వని వారు, గుర్తించనివారు, చనిపోయినవారికి సంబంధించి గ్రామ/వార్డు సభల్లో అందరి సమక్షంలో కారణాలు రాసి ఫైనల్ రిపోర్టు పంపిస్తున్నామని వివరించారు. అర్హులైన ఓట ర్లు ఆలస్యం చేయకుండా సర్ ప్రక్రియ త్వరగా పూర్తిచేయించుకోవాలని సూచించారు. -
క్రీడాకారులకు సువర్ణావకాశం
నిర్మల్‌టౌన్: క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరాలనుకునే యువ క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. 2026–27 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ స్పోర్ట్స్ అకాడమీలు, ప్రాంతీయ క్రీడా వసతిగృహాల్లో ప్రవేశాల కోసం ఈ నెల 20నుంచి 28వరకు ఎంపిక పోటీలు నిర్వహించనుంది. జిల్లాలోని అర్హులైన బాలబాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్మల్ జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి బి.శ్రీకాంత్‌రెడ్డి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, ఖమ్మం, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్, హనుమకొండ, వనపర్తి లాంటి కేంద్రాల్లో సైక్లింగ్, రెజ్లింగ్, హాకీ, అథ్లెటిక్స్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, ఫుట్బా ల్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, కబడ్డీ తదితర క్రీడల్లో ఎంపిక పోటీలు ని ర్వహించనున్నారు. ఆయా క్రీడల కు నిర్ణయించిన తేదీల్లో సంబంధిత కేంద్రాలకు నే రుగా హాజరుకావాలని అధికారులు సూచించారు. ఎంపిక విధానం, వయోపరిమితి ఎంపిక పోటీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వయస్సు నిర్ధారణతో పాటు శారీరక దారుఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి గత ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ విభాగాలకు 10–12 ఏళ్ల మధ్య, సరూర్‌నగర్ వాలీబాల్ అకాడమీకి 16–18 ఏళ్ల మధ్య, మిగతా అన్ని క్రీడలకు 14–16 ఏళ్లలోపు వయస్సు గల క్రీడాకారులు అర్హులు. తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు పాఠశా ల లేదా కళాశాల బోనఫైడ్, వయస్సు ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మెమో, ఆధార్ కార్డు లేదా నివాస ధ్రువీకరణ పత్రం, 10 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో ఎంపిక కేంద్రాలకు హాజరుకావాలని అఽ దికారులు తెలిపారు. పూర్తి వివరాలకు నిర్మల్ జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. తేదీ క్రీడ బాలురు/బాలికలు వేదిక జూలై 20 సైక్లింగ్, రెజ్లింగ్ బాలురు ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ జూలై 20, 21 హాకీ, అథ్లెటిక్స్ బాలురు, బాలికలు గచ్చిబౌలి అకాడమీ, హైదరాబాద్ జూలై 20, 21 వాలీబాల్ బాలురు, బాలికలు సరూర్‌నగర్ వాలీబాల్ అకాడమీ జూలై 20, 21 హాకీ బాలురు వనపర్తి అకాడమీ జూలై 20, 21 హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్ బాలురు ఎల్బీ స్టేడియం, హైదరాబాద్ జూలై 21 అథ్లెటిక్స్ బాలురు ఖమ్మం అకాడమీ జూలై 22, 23 వాలీబాల్ బాలురు, బాలికలు సిద్దిపేట అకాడమీ జూలై 22, 23 వాలీబాల్ బాలురు సిరిసిల్ల అకాడమీ జూలై 25, 26 వాలీబాల్ బాలురు, బాలికలు మహబూబ్‌నగర్ అకాడమీ జూలై 25, 26 కబడ్డీ బాలురు మహబూబ్‌నగర్ అకాడమీ జూలై 27, 28 జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ బాలురు, బాలికలు హనుమకొండ ప్రాంతీయ క్రీడా వసతిగృహం జూలై 27, 28 స్విమ్మింగ్, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్ బాలురు హనుమకొండ ప్రాంతీయ క్రీడా వసతిగృహం -
పాముల దినోత్సవం
సారంగపూర్: మండల కేంద్రంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాలలో స్థానిక డీఆర్వో నజీర్‌ఖాన్, ప్రముఖ స్నేక్ క్యాచర్ యాసీన్ ఆధ్వర్యంలో ప్రపంచ పాముల దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా డీఆర్వో, స్నేక్ క్యాచర్ విష రహిత, విష సహిత పా ముల గురించి విద్యార్థులకు అవగాహన క ల్పించారు. పాములు పర్యావరణానికి మేలు చేసే విధానాలు తెలియజేశారు. జీవ వైవి ద్యంలో పాములపాత్ర గురించి తెలిపారు. విష రహిత, విష సహిత పాముల ముఖాల పై ఉండే వివిధ ఆకారాలను వివరించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమఫలాలు అందాలి
నిర్మల్‌చైన్‌గేట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ఎస్సీ, ఎస్టీలకు అందాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, రిజర్వేషన్ ని బంధనల అమలుపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ భవేశ్ మిశ్రా అధ్యక్షత వహించారు. సమావేశం ప్రారంభంలో చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల, కమిషన్ సభ్యులు డాక్టర్ బీఆర్. అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల పురోగతి, అట్రాసిటీ కేసుల నమోదు, దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు, బాధితులకు పరిహారం చెల్లింపు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వివరాలు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం, కులాంతర వివాహాల ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇళ్లు, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద ఉపాధి కల్పన వంటి అంశాలను శాఖల వారీగా సమీక్షించారు. సమన్వయంతో పనిచేయాలి..అనంతరం వెంకటయ్య మాట్లాడుతూ అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్ర యోజనాలు ఆలస్యం లేకుండా అందేలా అన్ని శా ఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. ప్రతీనెల చివరి వారంలో మండల స్థాయిలో సివిల్ రైట్స్ డే నిర్వహించి చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మూడు నెలలకోసారి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. సమర్థవంతంగా అమలు..జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలవుతున్నాయని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపా రు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తూ కామన్ మెనూ అమలు చేస్తున్న ట్లు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనా లు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం, కులాంతర వివాహాల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 4,306 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు, ఈజీఎస్‌లో ఎస్సీ, ఎస్టీ కూలీలకు ఉపాధి కల్పనలో జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉన్నట్లు తెలిపారు. బ్యాంకుల ద్వారా 199 ద్విచక్ర, త్రిచక్ర విద్యుత్ వాహనాలు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అందించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో అట్రా సిటీ కేసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్త్రం నీలాదేవి, రాంబాబు నాయక్, ప్రవీణ్, లక్ష్మణారాయణ, అదనపు కలెక్ట ర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, భైంసా సబ్‌కలెక్టర్ సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయికిరణ్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, డీఎస్పీ శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఉపాధి కల్పించాలి.. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద జాబ్‌కార్డు కలిగిన ప్రతి కూలీకి తగిన పని దినాలు కల్పించాలని, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని మౌలిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వెంకటయ్య సూచించారు. అభివృద్ధి నిధులు ఎక్కడైనా పెండింగ్‌లో ఉంటే ముఖ్యమంత్రితో మాట్లాడి విడుదల చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 60 ఏళ్లు నిండిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. -
సర్వేతో భూవివాదాలు పరిష్కారం
భైంసారూరల్: జిల్లాలో భూ భారతి రీసర్వే ప్రక్రియ ను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. భైంసా మండలం ఎగ్గాం గ్రామపంచాయతీ పరిధి లోని బాబుల్‌గాం శివారులో కొనసాగుతున్న భూ భారతి రీసర్వేను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీ లించారు. సర్వే పొరపాట్లకు తావులేకుండా చూడాలని రెవెన్యూ, సర్వే అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రతీ భూ సరిహద్దును క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం రైతులకు భూ భారతి రీ సర్వేతో కలిగే ప్రయోజనాలను వివరించారు. రైతులు ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి పెట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయన్నారు. వాతా వరణ పరిస్థితులు, నీటి లభ్యత, వర్షాలను బట్టి పంటలు సాగుచేయాలని, పంట మార్పిడి విధానా లపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచాలని కలెక్టర్‌ను కోరారు. సమస్యలను పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, తహసీల్దార్ శశిభూషణ్, సర్వేయర్ నరసింహమూర్తి, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆకలితోనే చదువులు
లక్ష్మణచాంద: ఈ ఏడాది నూతన విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థుల మాదిరి ప్రభుత్వ జూని యర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటించింది. ఉదయాన్నే కళాశాలలకు హాజర య్యే విద్యార్థులు మధ్యాహ్నం ఖాళీ కడుపులతో పా ఠాలపై శ్రద్ధ చూపరని భావించిన ప్రభుత్వం ఉద యం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో విద్యార్థులు, పోషకులు హర్షం వ్యక్తం చేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని సంబరపడ్డారు. కానీ విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా ఉ మ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో తరగతులకు హాజరవు తూ ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పాఠాలపై శ్రద్ధచూపలేకపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.ఉమ్మడి జిల్లా సమాచారంజిల్లా కళాశాలలు మొత్తం విద్యార్థులు నిర్మల్ 13 4,930 మంచిర్యాల 10 4,320 ఆదిలాబాద్ 13 6,606 కుమురంభీం 11 4,810 -
మహిళ ఆత్మహత్యాయత్నం
బాసర: నిర్మల్ పట్టణంలోని రాంనగర్‌కు చెందిన ఉమాబాయి భర్తతో జరిగిన గొడవ కారణంగా ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం బాసర గోదావరినదిలో దూకేందుకు యత్నించింది. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది గమనించి వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించి అప్పగించినట్లు ఎస్‌హెచ్‌వో సీఐ దీపక్ తెలిపారు. ముగ్గురి బైండోవర్భైంసారూరల్: దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో మండలంలోని తిమ్మాపూర్‌లో స్థానికులు ఐక్యంగా గస్తీ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో బుధవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు అనుమానస్పందంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సుప్రియ గ్రామానికి చేరుకుని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. -
వర్సిటీ.. వర్రీ!
నిర్మల్: జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ఈ ఏడాది జనవరి 16న నిర్మల్‌లో నిర్వహించి న సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తాత్కాలికంగా బాసర ట్రిపుల్‌ఐటీలో వర్సిటీని ప్రారంభిస్తామని చెప్పారు. ప్రజాపాలన సభలో సీఎం స్వయంగా ఈ హామీ ఇవ్వడంతో జిల్లావాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆరునెలలు దాటినా ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. స్థలం ఎంపిక, నిధుల కేటాయింపు, పరిపాలనా ఏర్పాట్లు వంటి అంశాల్లోనూ ఎలాంటి పురోగతి లేదు. దీంతో హామీకే పరిమితమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు కూడా ఈ విషయమై ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకపోవడంతో ప్రజల్లో నిరాశ పెరుగుతోంది. ఆరునెలలు.. ఏవీ అడుగులు!హామీ ఇచ్చి ఆరునెలలు గడిచినా ప్రభుత్వం నుంచి యూనివర్సిటీ ఏర్పాటుకు జీవో విడుదల కాలేదు. విశ్వవిద్యాలయం పేరుపై, నిర్వహణపై, కోర్సులపై, తాత్కాలిక కేంద్రంపై కూడా స్పష్టత లేదు. సంబంధిత ఉన్నత విద్యాశాఖ నుంచి ఎలాంటి ప్రకటనలు, కాన్సెప్ట్ నోట్, డీపీఆర్.. అసలు ఎలాంటి కదలికలూ లేకపోవడంతో ఈ హామీ కూడా ఇతర హామీల మాదిరిగానే మరుగున పడుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాకు అవసరం..నిర్మల్‌తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నతవిద్య అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి. డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు పీజీ, ఉన్నతవిద్య, పరిశో ధ న కోర్సుల కోసం హైదరాబాద్, వరంగల్, నిజా మాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగా విశ్వవిద్యాలయం ఏర్పడితే వేలాది మంది విద్యార్థులకు ఉన్నత, ఉపాధినిచ్చే విద్యలు అందుబాటులోకి వస్తాయి. వర్సిటీ రావడంతో చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలకు, పరిశోధనలు, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. పాలకుల మౌనం..జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు సీఎం ఇచ్చిన హామీ అమలుపై ఇప్పటివరకు బహిరంగంగా ఒత్తిడి తీసుకొచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ఉన్నత విద్యాశాఖతో సమీక్షలు నిర్వహించడం, కాలపరిమితి నిర్ణయించేలా ప్రయత్నించడం వంటి చర్యలు కనిపించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. హామీ అమలు కోసం ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు చొరవ చూపాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది.జిల్లాలో పరిస్థితి తెలిపే ఏఐ చిత్రం సీఎం ప్రకటనతో సర్వత్రా హర్షం..కొన్నేళ్లుగా చదువులతల్లి కొలువైన నిర్మల్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. ఇదేక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాకు విశ్వవిద్యాలయం అవసరాన్ని గుర్తిస్తున్నామని చెప్పడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. పూర్తి స్థాయి క్యాంపస్ ఏర్పాటుకు కొంత సమయం పట్టే అవకాశం ఉ న్నందున.. అప్పటి వరకు బాసర ట్రిపుల్ఐటీ ప్రాంగణంలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావుల్లో ఆశలు చిగురించాయి. -
నేనింతే..
కడెం: ‘నేనింతే.. ముక్కుసూటిగా వెళ్లడమే నా వ్యక్తిత్వం. దానిని చూసి కొందరు ఎమ్మెల్యే అయ్యాక మారిపోయాడు అంటున్నరు’ అని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కడెం మండలంలో సర్ కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. ఇటీవలి రాజకీయ పరిణామాలపై ఘాటుగా స్పందించారు. తనకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదన్నారు. రూ.2 కోట్ల వరకు అప్పులు ఉన్నాయని తెలిపారు. కడెం, దస్తురాబాద్ మండలాల్లో ఏ పని కోసం, పదవుల కోసం ఒక్క రూపాయి తీసుకున్నానో నిరూపించాలని సవాల్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి, తనను గెలిపించిన ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తానని ప్రకటించారు. ఆదివాసీ బిడ్డనని, ఎమ్మెల్యేగా నా ఎదుగుదలను కొందరు చూడలేక అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోసం కాదు.. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని, పార్టీలో మీ పనితనంతో నా మనసును గెలిచి పదవులు పొందాలని కార్యకర్తలకు సూచించారు. ఎమ్మెల్యేకు పైసలు ఇస్తే పదవి వస్తదన్న ఆలోచన మానుకోవాలని తెలిపారు. పార్టీలో జూనియర్లు, సీనియర్లు అంటూ విభేదాలు సృష్టించొద్దని నాయకులకు సూచించారు. -
ఆరా తీసి..అప్పగించి..
దండేపల్లి: లక్సెట్టిపేటకు చెందిన బాలిక దండేపల్లి పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. రోజు స్నేహితులతో కలిసి వచ్చే ఆమె గురువారం ఒంటరిగా వచ్చింది. పాఠశాల నుండి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో తప్పి పోయి దండేపల్లి బస్టాప్ వద్ద ఏడుస్తుండడంతో కానిస్టేబుల్ దివ్య బాలిక వద్దకు వెళ్లి వివరాలు ఆరా తీసింది. బాలిక నోట్‌బుక్‌పై తండ్రి ఫోన్‌నంబర్ రాసి ఉండటంతో అతనికి ఫోన్ చేసి విషయం చెప్పింది. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన తల్లి మల్ల వ్వకు బాలికను అప్పగించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ దివ్యను ఎస్సై రాజర్దన్, సీఐ రమణమూర్తి అభినందించారు. -
సోయా కలుపు పెరుగుతోంది!
భైంసా: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సుమారు 70 వేల ఎకరాల్లో సోయాబీన్ సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో మొలకలు బాగా వచ్చాయి. పంటకు ప్రస్తుతం సుమారు 24 రోజుల వయసు వచ్చింది. ఈ దశలో అత్యంత కీలకమైన పని కలుపు నియంత్రణ. వర్షాలు లేక కలుపు మందు పిచికారీ చేయడం లేదు. దీంతో పంట, కలుపు పోటీపడి పెరుగుతున్నాయి. ఆగిన గడ్డి మందు స్ప్రే..20 రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో పొలాల్లో తేమ తగ్గిపోయింది. ఫలితంగా రైతులు గడ్డి మందు(కలుపు మందు) పిచికారీ చేయలేక ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా సోయాబీన్ మొలకలు వచ్చిన మూడు వారాల్లో ఎంపిక చేసిన గడ్డి మందులను పిచికారీ చేస్తారు. ఈ మందులు సమర్థవంతంగా పని చేయాలంటే పొలంలో తగినంత తేమ ఉండాలి. ప్రస్తుతం వర్షాలు లేక నేల పొడిగా మారింది. ఈ పరిస్థితుల్లో గడ్డి మందు పిచికారీ చేసినా ఆశించిన ఫలితం రాదని రైతులు, వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వర్షాలు కురిస్తేనే పిచికారీ..ప్రస్తుతం రైతులు గడ్డి మందు కొనుగోలు చేసినా, పిచికారీ చేయడానికి వెనుకాడుతున్నారు. ముందుగా వర్షం కురిసి నేలలో తేమ పెరిగిన తర్వాతే మందు పిచికారీ చేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఆలస్యం అయిన కొద్దీ కలుపు మొక్కలు బలపడి వాటిని నియంత్రించడం మరింత కష్టమవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలుపు పెరుగుతోంది నేను ఈఖరీఫ్‌లో సోయా వేసిన . మొలకలు వచ్చి 24 రోజులు అయింది. ఈ సమయంలో గడ్డి మందు పిచికారీ చేయాలి. వర్షాలు లేక పొలం పూర్తిగా పొడిగా మారింది. ఇప్పుడు మందు కొడితే పనిచేయ దు. గడ్డి చావదు. పంటను మించి కలుపు వేగంగా పె రుగుతోంది. రెండు మూడు రోజుల్లో వర్షం పడితేనే పంటను కాపాడుకోగలం. లేకపోతే దిగుబడిపై ప్రభావం పడుతుంది. – శంకర్, వాలేగాం, రైతుఏపుగా కలుపు..ఒకవైపు సోయాబీన్ మొక్కలు పెరుగుతుండగా, మరోవైపు కలుపు మొక్కలు వేగంగా విస్తరిస్తున్నాయి. సోయాబీన్ మొక్కలకు అవసరమైన తేమ, పోషకాలు, సూర్యరశ్మిని కలుపు మొక్కలే ఎక్కువగా తీసుకుంటున్నాయి. దీంతో పంట ఎదుగుదల మందగించే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో మంచి వర్షాలు కురవకపోతే కలుపు మరింతగా పెరిగి దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
కుంటాల: మండలంలోని లింబా(కె) గ్రామంలో గురువారం జరగాల్సిన బాల్య వివాహా న్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన బాలికను నిజామాబాద్ పట్టణంలోని గౌతమ్నగర్కు చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు. గ్రామంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం అందించా రు. దీంతో అధికారులు గ్రామానికి చేరుకుని వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేశారు. తమ అమ్మాయికి 18 ఏళ్లు నిండే వరకూ వివాహం చేయమని లిఖిత పూర్వకంగా హామీ తీసుకున్నారు. బా ల్య వివాహాలు జరిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి మురళి, సర్పంచ్ సుంకరోళ్ల గీత, ఎస్సై సిరివేని అశోక్, ఆర్ఐ అడెల్లు, ఐసీడీఎస్ సూపర్ వైజర్ శ్రీజని, కౌ న్సిలర్లు శైలజ, కరుణశ్రీ, హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడుల్లో క్రీడామెరికలు
ఖానాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మ స్కాపూర్ పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆర్.విజ్ఞత ఈనెల 12న సూ ర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన అస్మిత్ ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో 58 కిలోల విభాగంలో పాల్గొని ఐదోస్థానంలో నిలిచింది. భైంసా డివిజన్‌కు చెందిన విద్యార్థులు ఈనెల 11, 12 తేదీల్లో జోగులాంబ గద్వాల జిల్లా నల్లకుంటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వుషూ పోటీల్లో అ త్యంత ప్రతిభ కనబర్చి 4 బంగారు, 3 వెండి, 7 కా ంస్య పతకాలు సాధించి జిల్లా పేరును నిలబెట్టారు. స్ఫూర్తిదాయక విజయాలు గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వరుసగా రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తుండటంతో నిర్మల్ జిల్లాలో క్రీడలపై ఆసక్తి పెరుగుతోంది. సరైన శిక్షణ, పట్టుదల ఉంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా అత్యున్నత స్థాయికి చేరగలరని ఈ విజయాలు మరోసారి నిరూపించాయి. బంగారు పతకం విజేతలు డి.రాజేశ్వరి, ఎ.అబ్దుల్ రహేమాన్, వాగ్మారే కరణ్, అక్షర వెండి పతకం విజేతలు శ్రీరాముల ప్రణీల్రాజ్, శ్రీరాముల కషిక, మహేందర్ కాంస్య పతకం విజేతలు జంగం గంగాప్రసాద్, విష్ణుప్రియ, అభిమన్యు, అనన్య, రూమిక, మనస్విక, స్నేహ -
హోంగార్డు మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ అరెస్ట్
జైపూర్: మండలంలోని ఇందారం ఫ్లైవోవర్ వద్ద ఈనెల 11న జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌ను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై భూమేష్ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఔట్సోర్సింగ్ డ్రైవర్ జంగిటి రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బస్సు ఆసిఫాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన లక్ష్మణ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు డ్రైవర్ రాజేశ్‌ను కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. -
నకిలీ టీపౌడర్ ప్యాకెట్లు పట్టివేత
మందమర్రిరూరల్: పట్టణంలోని జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద గురువారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాలీ ఆటోలో 50 వంద గ్రాముల నకిలీ జెమినీ టీపౌడర్ ప్యాకెట్లు లభించాయి. పోలీసులు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసురామ్కు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సదరు వాహనదారుడు సంపత్‌రెడ్డిని టీ పౌడర్ ప్యాకెట్స్ ఎక్కడ కొనుగోలు చేశావని ప్రశ్నించగా మార్కెట్లోని మహేశ్వరీ ట్రేడర్స్‌లో కొనుగోలు చేసినట్లు చెప్పాడు. వెంటనే దుకాణంలో తనిఖీ చేయగా ఎలాంటి జీరో పౌడర్ ప్యాకెట్లు లభించలేదు. టోల్గేట్ వద్ద దొరికిన ప్యాకెట్లను టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించామని, కిరాణ దుకాణానికి లైసెన్స్ లేకపోవడంతో నిర్వాహకునికి నోటీస్ ఇచ్చినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. -
కొడుకును సాకుతూ.. ‘సాగు’తూ..
వీల్‌చైర్‌లో కుమారుడిని చూసుకుంటూ పని చేస్తున్న రేవతిఅమ్మ ప్రేమకు ఎలాంటి నిర్వచనం అవసరం లేదు. బిడ్డల కోసం తమ జీవితాలను అంకితం చేస్తున్న మాతృమూర్తులు ఎందరో.. భోరజ్ మండలం సిర్సన గ్రామానికి చెందిన నాగరాడే విఠల్, రేవతి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సాయికిరణ్ మానసిక దివ్యాంగుడు. ఇంటి వద్ద అతడిని చూసేవారు ఎవరూ లేరు. దీంతో తల్లి రేవతి సాయి కిరణ్‌ను నిత్యం చేను వద్దకు తీసుకువస్తోంది. ఓ వైపు సాగు పనులు చేసుకుంటూనే కుమారుడికి అన్నం తినిపించడం, నీళ్లు తాగించడం తదితర సపర్యలు చేస్తోంది. బిడ్డ క్షేమమే తనకు ముఖ్యమని, కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారమైన నేపథ్యంలో అతని వెంట తీసుకురావడం తప్ప మరోమార్గం లేదని ఆమె చెబుతోంది. – సాత్నాల -
దివ్యాంగులకు చేయూతనిస్తాం
లోకేశ్వరం: దివ్యాంగులకు చేయూతనిచ్చి అన్ని వి ధాలా అదుకుంటామని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మండలంలోని గొడిసెరా గ్రామంలో రూ.20 లక్షలతో పాఠశాల ప్రహ రీ, మండల కేంద్రంలోని కేజీబీపాఠశాలలో రూ. 45.12 లక్షలతో నిర్మించే అదనపు తరగతులు, రూ. 10 లక్షలతో నిర్మించే భవిత పాఠశాల భవనానికి గురువారం భూమిపూజ చేశారు. దివ్యాంగులకు 4 వీల్ చైర్లు, 2 వినికిడి పరికరాలు, ఎలక్ట్రికల్ సామగ్రి ని అందజేశారు. కేజీబీవీ పాఠశాలలో సమస్యలు పరిష్కారిస్తామన్నారు. పిప్రి ఎత్తిపోతల పథకంను త్వరగా పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరంది స్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ బోడికే సాయన్న, మండల విద్యాధికారి చంద్రకాంత్, గొడిసెరా పాఠశాల హెచ్ఎం రవి, కేజీబీవీ ప్రిన్సిపాల్ అనసూయ, భవిత ఇన్చార్జి సంతోష్, లోకేశ్వరం సర్పంచ్ దర్వాడి కపిల్, కిష్టాపూర్ సర్పంచ్ భోజన్న, నాయకులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం
ఇంద్రవెల్లి: ఆదివాసీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేద్దామని రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ సోయం బాపూరావ్ పేర్కొన్నారు. గురువారం కేస్లాపూర్ నాగోబా దర్బార్ హాల్లో ఏర్పాటు చేసిన రాయిసెంటర్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయిసెంటర్ సార్మేడిలు, ఆయా గ్రామాల పటేళ్లతో సమస్యలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీల న్యాయమైన డిమాండ్లు, సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్‌గోండ్ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు సిడాం ఆర్జు, రాజ్‌గోండ్ సేవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విషంరావ్, ఆదిలాబాద్ జిల్లా మేడి తొడసం అమృత్‌రావ్, కుమురం భీం జిల్లా మేడి కుర్సేంగ మోతీరాం, రాయిసెంటర్ సార్మేడిలు మెస్రం వెంకట్రావ్, కొట్నాక్ పాండురంగ్, మెస్రం ఆనంద్‌రావ్, నాగ్నాథ్, సిడాం తిరుపతి, మడావి నర్సింగ్‌రావ్, తదితరులు పాల్గొన్నారు. -
అగ్రికల్చర్ గోదాంకు శంకుస్థాపన
నిర్మల్ రూరల్: మండలంలోని కౌట్ల(కె) గ్రామంలో రూ.30 లక్షలతో ఫుడ్‌గ్రైన్ స్టోరేజీ అగ్రికల్చర్ గో దాం నిర్మాణానికి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి గురువా రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గోదాం నిర్మాణం పూర్తయిన తర్వాత రైతులకు ధాన్యం నిల్వ సులభం అవుతుందని పేర్కొన్నారు. ఇందులో సర్పంచ్ రాజు, నాయకులు జమాల్, వెంకట్‌రెడ్డి, నర్సారెడ్డి, కొండ శ్రీనివాస్, గడ్డం హరీశ్, భూమేష్ పాల్గొన్నారు. అనంతరం డ్యాంగాపూర్లోని ఎస్ఆర్ ప్రైమ్స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఇందులో సర్పంచ్ నవీన్, నాయకులు జమాల్, శ్రీనివాస్, నరేందర్, కౌన్సిలర్లు గంజి రాజు, నరేశ్, జింక సూరి తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ రాజుకున్న పోడు వివాదం
వేమనపల్లి: చామనపల్లి శివారులో వివాదస్పద భూమిలో మళ్లీ అలజడి రేగింది. తమకు జీవనాధారమైన భూమిలో అటవీ అధికారులు మొక్కలు నాటుతున్నారని గ్రామానికి చెందిన నూకల తిరుపతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ శివారులోని భూమి 20 ఏళ్లుగా అటవీ, రెవెన్యూ శాఖల మధ్య పెండింగ్‌లో ఉంది. ఆ భూమి చెన్నూర్ రిజర్వ్ ఫారెస్ట్ 125, 126 కంపార్ట్మెంట్గా అటవీ అధికారులు పేర్కొంటుండగా 3 నెలల క్రితం హద్దులు ఏర్పాటు చేసి కందకం తవ్వారు. గురువారం మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. గ్రామస్తులు అభ్యంతరం చెప్పడంతో చెన్నూర్ ఎఫ్‌డీవో సర్వేశ్వర్ రావ్, రూరల్ సీఐ కృష్ణ, ఎఫ్ఆర్వో హఫీజోద్దీన్, ఎస్సై జగదీశ్వర్ రెడ్డి గ్రామానికి వెళ్లగా మా జీవనాధారం పోతుందని గ్రామస్తులు వారితో వాగ్వాదానికి దిగారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వేనంబర్ 67లో కొందరికి పట్టాలు ఉన్నాయని చూపించారు. జాయింట్ సర్వే చేపడతామని అధికారులు చెప్పారు. అంతలోనే రైతు నూకల తిరుపతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడంతో సర్పంచ్ విగ్నేష్ బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏమాజీ పరామర్శించారు. రైతు ఆత్మహత్యాయత్నానికి కారకులైన అటవీ అధికారులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
అనారోగ్య సమస్యతో మహిళ ఆత్మహత్య
దండేపల్లి: అనారోగ్య సమస్యలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజవర్ధన్ తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన ముడిమడుగుల లక్ష్మి (50) కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఇటీవల వ్యాధి తీవ్రత పెరిగింది. భర్త పెద్దన్న బుధవారం చొప్పదండిలో ఉన్న తన చెల్లెలు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూలేని స మయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం గమనించిన స్థా నికులు పెద్దన్నకు సమాచారం అందించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యా ప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. పురుగుల మందు తాగి డ్రైవర్..ఆదిలాబాద్‌టౌన్: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బట్టిసావర్గాంకు చెందిన కారు డ్రైవర్ దర్శనాల విజయ్ కుమార్ (38) టీచర్స్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. గురువారం సాయంత్రం తిర్పెల్లి వద్ద గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో రిమ్స్‌కు తరలిస్తుండగా మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియలేదన్నారు. ఉరేసుకుని యువకుడు..నిర్మల్‌టౌన్: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బంగాల్ పేట్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో నివాసం ఉంటున్న వినోద్ (20) కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చి ఉరేసుకున్నాడు. మృతుని తల్లి లసుంబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. -
న్యాయం చేయాలని మృతదేహంతో నిరసన
సిర్పూర్(టి): మండలంలోని హీరాపూర్‌కు చెందిన రైతు టేకం పెంటు (26) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విధితమే. భూకబ్జాదారుడు కె.వేణుగోపాల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి ఆవరణలో గిరిజన సంఘ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మన్నెవార్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య మాట్లాడుతూ ప్రభుత్వం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఉద్యమకారులను గుర్తించాలి
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి త్వరగా ఐడీ కార్డులు, 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ మంజూరు చేయాలని హైదరాబాద్‌లో గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు, ఎమ్మెల్సీ కోదండరామ్‌ను జిల్లా కమిటీ సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంసీ లింగన్న, కొట్టే శేఖర్, విజయ్‌కుమార్, పాకాల రాంచందర్, గోజ్జ జనార్దన్, నాగారావు, ఆరే శ్రీకాంత్, ద్యాగ ప్రశాంత్, ఆకోజి కిషన్, లావణ్య, వాజిద్, షరీఫ్, రామ్‌లక్ష్మణ్, మోహన్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి, శ్రీనివాస్, శంకర్, అజయ్ ఉన్నారు. -
పూడిక తొలగించండి
కడెం: కడెం ప్రాజెక్ట్ కుడి కాలువలోని సిల్ట్ తొలగించాలని మండలంలోని చిట్యాల్ గ్రామ రైతులు బుధవారం జిల్లా కేంద్రంలో ఇరిగేషన్ ఎస్ ఈ రాజేంద్రప్రసాద్, ఈఈ ప్రవీణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడు తూ.. కడెం నుంచి పెద్దబెల్లాల్ వరకు కాలువ పూడికతో నిండగా సాగునీరు చివరి ఆయకట్టుకు వరకు సక్రమంగా అందడం లేదని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. సర్పంచ్ చీమల భీమేశ్, ఉపసర్పంచ్ భగవంత్రావుతోపాటు రైతులు ధర్మాజీ రమేశ్, నిమ్మల నరేందర్, బత్తుల నర్సయ్య తదితరులున్నారు. -
‘ఎస్ఐఆర్’లో వేగం పెంచాలి
భైంసాటౌన్: ఎస్ఐఆర్ ప్రక్రియలో వేగం పెంచాల ని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పట్టణంలోని పులేనగర్‌లో బుధవారం ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన ఫారాల పంపిణీ, స్వీకరించిన ఫారాలు, డిజిటలైజేషన్, తదితర వివరాలు తహసీల్దార్ శశిభూషణ్‌ను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో 51,489 మంది ఓటర్లుండగా, వీరిలో 23,940 మంది ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మిగతా ప్రక్రియనూ వేగంగా పూర్తి చేయాలని సూచించారు. చిరునామా తెలియని ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీకి స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని బీఎల్వోలకు తెలిపారు. ప్రక్రియ మొత్తం పారదర్శకంగా పూర్తిచేయాలని ఆదేశించారు. సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, సిబ్బంది ఉన్నారు. -
ఎస్ఐఆర్లో తరోడ ఆదర్శం
భైంసా: ముధోల్ మండలంలోని తరోడ గ్రామం ఎ స్ఐఆర్ ప్రక్రియలో ఆదర్శంగా నిలిచింది. గ్రామంలోని 221 పోలింగ్ కేంద్రంలో 763 మంది ఓటర్లుండగా వివిధ కారణాలతో 60 మంది పేర్లు తొలగించారు. మిగతా 703 మంది ఓటర్ల వివరాల నమో దు ప్రక్రియ పూర్తయింది. 222 పోలింగ్ కేంద్రంలో 819 మంది ఓటర్లుండగా వివిధ కారణాలతో 76 మంది పేర్లు తొలగించారు. మిగతా 743 మంది ఓ టర్లలో 694 మంది వివరాలు ఇప్పటికే నమోదు చే శారు. మిగతా 47మందిని వ్యక్తిగతంగా సంప్రదించి వివరాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామస్తులకు ముందుగానే అవగాహన కల్పించడంతో వేగంగా వివరాలు అందించారు. సూపర్వైజర్ నారాయణరావు పటేల్ మార్గదర్శకత్వంలో సర్పంచ్ ఆరిఫ్ ఉద్దీన్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఆనంద్, బీఎల్వోలు రేష్మా, హర్షియా బేగం సమన్వయంతో పని చేస్తూ ఓటర్ల వివరాల నమోదును త్వరగా పూర్తి చేశారు. రాత్రి 10.30 నుంచి 11గంటల వరకు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయడం విశేషం. కలెక్టర్ రాకతో వేగంగా ప్రక్రియ కలెక్టర్ భవేశ్ మిశ్రా గతంలో తరోడ గ్రామాన్ని సందర్శించి ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీ లించారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చే యాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ పర్యటన అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు మ రింత చొరవ చూపడంతో ప్రక్రియలో వేగం పుంజుకుంది. సమన్వయంతో పనిచేస్తే తక్కువ సమయంలోనే లక్ష్యాన్ని చేరుకోవచ్చని తరోడ నిరూపించింది. జిల్లాలో ఇప్పటివరకు 15 గ్రామాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయింది. తరోడ తరహాలో ప్రజాప్రతినిధులు, గ్రామ సిబ్బంది, బీఎల్వోలు సమష్టిగా పనిచేస్తే జిల్లావ్యాప్తంగా ప్రక్రియ త్వరగా పూర్తి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
మధ్యాహ్నం.. చద్దన్నం!
ముధోల్ మండల కేంద్రంలోని విఠోలి సమీపాన బోరున్న ఓ పెద్ద రైతు బుధవారం తన పొలంలో వరి నాటు వేయించాడు. నాటు వేసేందుకు వచ్చిన కూలీలు మధ్యాహ్నం కాగానే ఇలా అంతా పక్కనే ఉన్న రోడ్డుపైకి వచ్చారు. అంతా ఒక్కచోట కూర్చుని చద్దన్నం తింటూ కబుర్లు చెప్పుకొంటూ కనిపించారు. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా నిలిచే ఈ చిత్రం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. – ముధోల్● చాలాశాఖల్లో పెరిగిన అవినీతి 7నిర్మల్పర్యావరణాన్ని పరిరక్షించాలి భైంసారూరల్: పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎస్పీ జానకిషర్మిల పేర్కొన్నారు. వనమహోత్సవంలో భాగంగా బుధవారం భైంసారూరల్ పోలీస్‌స్టేషన్‌లో విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి చెట్టుగా ఎదిగే దాకా బాధ్యతగా సంరక్షించాలని సూచించారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్, పట్టణ, రూరల్, ముధోల్ సీఐలు సాయికుమార్, ప్రవీణ్‌కుమార్, రవీందర్‌నాయక్, ఎస్సైలు సుప్రియ, అశోక్, జుబేర్, కేజీబీవీ ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. నిర్మల్: ప్రభుత్వ ఉద్యోగం ప్రజాసేవ కోసం. ఇందుకు రూ.వేలు, రూ.లక్షల్లో వేతనాలు వస్తున్నా.. చాలామంది అధికారులు తమ విధిని అక్రమార్జనకు వేదికగా మార్చుకుంటున్నారు. పక్క జిల్లాల్లో అక్రమార్కులు పట్టుబడుతు న్నా.. కేసుల్లో ఇరుక్కుని జైలుకు వె ళ్తున్నా.. జిల్లాలోని కొందరు అ క్రమార్జనను ఆపడం లేదు. చా లామంది అధికారులు, ఉద్యోగులు, చివరకు కింది స్థాయి సిబ్బంది కూడా ప్రతి పనికీ ఎంతో కొంత ముట్ట జెప్పందే చేయడం లేదు. వారి ఆదా యానికి, కూడబెట్టే ఆస్తులకు ఏ మాత్రం సంబంధం ఉండటం లేదు. వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లుల్లో వాటాల నుంచి చివరకు తరగతిలో పాఠా లు బోధించే ఉపాధ్యాయుల దాకా అవినీతికి పాల్పడుతుండటం విస్తుగొల్పుతోంది. చిన్నపనికి కూడా పైసలే.. భర్త చనిపోయిన తర్వాత న్యాయబద్ధంగా భార్య పే రిట పంటభూమిని విరాసత్ చేయాలి. ఇందుకు ఎకరాకు, ఏరియాను బట్టి కొంతమొత్తంలో మీసేవలో చలాన్ కడితే సరిపోతుంది. కానీ.. క్షేత్రస్థాయి పరి శీలనకు వెళ్లే రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ) పరిస్థితిని బట్టి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు తీసుకుంటున్నారు. కొన్ని మండలాల్లో ధరణి ఆపరేటర్, తహసీల్దార్ కలిసి ఎంత తక్కువ అన్నా రూ.3వేల వరకు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులున్నాయి. డబ్బులివ్వకపోతే ఆ విరాసత్‌లో ఒకదాని వెనుక ఒకటి కొ ర్రీలు పెడుతూనే ఉంటారు. ఇదంటే భూమి పంచా యితీ. చివరకు చదువుకునే పిల్లలకు ధ్రువపత్రాలు ఇవ్వడానికీ డబ్బులివ్వాల్సిందే. జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల్లో కాంట్రాక్ట్, ప్రైవే ట్ చిరుద్యోగులతో ఈ వసూళ్లు చేయిస్తున్నారు. జిల్లాలో గతంలో ల్యాండ్ సర్వే, మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖల్లో ఏసీబీకి చిక్కిన కేసులన్నింటిలో ఇలా ప్రైవేట్ వ్యక్తుల ద్వారానే వసూళ్లకు పాల్పడ్డారు. ఫిర్యాదులున్నా స్పందన శూన్యం ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్నచిన్న పనులు కూడా లంచం లేకుండా జరగడం లేదన్న అభిప్రాయం ప్ర జల్లో పెరుగుతోంది. ఆదాయం, భూములు, నిర్మాణాలు, సంక్షేమ పథకాలు, అనుమతులు తదితర అనేక సేవలకు సంబంధించి దరఖాస్తుదారులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అధికారిక ఫీజులతో పాటు ఈ అక్రమ వసూళ్లు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. భరించలేని పరిస్థితుల్లో పైఅధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. బిల్లలిస్తేనే బిల్లులు..! జిల్లాలో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తనకున్న కొద్దిపాటి రాజకీయ సంబంధాలు, ఆర్థిక సహకారంతో ఓ శాఖలో కాంట్రాక్ట్ పనులు చేశాడు. సదరు పనులు పూర్తయి, ఏడాది దాటినా బిల్లులు మాత్రం రాలేదు. సంబంధిత అధికారులను అడిగితే.. ‘నువ్వు కాంట్రాక్ట్ పనులకు కొత్త కదా..!’ అంటూ ఓ వెకిలి నవ్వు నవ్వారు. బిల్లులు రావాలంటే కింది నుంచి మీది దాకా డబ్బులు ఇవ్వాల్సిందే అన్న విషయం ఆ యువకుడికి స్పష్టమైంది. ఇలా.. ఆ ఒక్కశాఖలోనే కాదు.. కాంట్రాక్టర్లకు పనులిచ్చే అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి. ‘అన్న.. సార్లందరికీ పైసలిచ్చినంక మేం పక్కాగా పనులు యాడికెళ్లి చేయాల్నె. అందుకే ఏసిన రోడ్లు, కట్టిన మోరీలు, బడుల బిల్డింగులు, పైప్లైన్లు అన్నీ.. కొన్ని నెలలకే పనికి రాకుండా పోతున్నయ్..’ అని ఓ యువ కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తంచేశాడు.కళ్లముందే ఉల్లంఘనలుజిల్లాలో అనుమతులు లేకుండా నిర్మాణాలు, ఇసుక అక్రమ రవాణా, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు, పర్యావరణ ఉల్లంఘనలు తదితర అనేక అంశాలు బహిరంగంగానే కనిపిస్తున్నా.. సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు కూడా వాటాలు ఆశిస్తుండటం, పట్టించుకోక పోవడంతో అక్రమాలకు పాల్ప డుతున్న వారికి మరింత ధైర్యన్నిస్తోంది. -
ఆర్జీయూకేటీలో మెరుగైన వసతులు కల్పించాలి
బాసర: బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చై ర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. బుధవారం ఆ యన కళాశాలను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. క్యాంపస్‌లో నిరంతర విద్యుత్, సురక్షిత తా గునీరు, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన భోజన సదుపాయాలు కల్పించడంలో రాజీ పడొద్దని సూచించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. ఏ విద్యార్థి చదువు మధ్యలో నిలిపివేయకుండా చూడాలని, చదువు పూర్తయ్యాక ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అడ్మిషన్ల ప్రక్రియ, విద్యాబోధన తీరు గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, విద్యా ప్రమాణాల మెరుగుదలకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పారు. చదువు పూర్తిచేసిన వారికి మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వర్సిటీ అభివృద్ధి, వసతులను చైర్మన్‌కు వివరించారు. కమిషన్ సభ్యులు రాంబాబునాయక్, కుస్త్రం నీలాదేవి, వీసీ గోవర్ధన్, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, డీఎస్పీ వెంకటరామయ్య, ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్ అజయ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మెరుగైన సేవలందించడమే లక్ష్యం
తానూరు: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే రామారావ్ పటే ల్ పేర్కొన్నారు. బుధవారం కోలూరు, జౌలా(బి) లో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్ర భవ నాన్ని ప్రారంభించారు. మండలంలో కాళేశ్వరం 28 ప్యాకేజీ కాలువ పనులు పూర్తికాలేదని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పనులు పూర్తిచేయించి రైతుల భూములకు సాగునీరు అందేలా కృషిచేస్తామని చెప్పారు. బీటీ రోడ్ల మరమ్మతుకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీడీవో శ్రీధర్, సర్పంచులు మాధవ్‌రావ్, శివకాంత, ఉపసర్పంచ్ అంకుష్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చి న్నరెడ్డి, మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి, నాయకులు శివాజీపటేల్, గోపాసాయినాథ్ తదితరులున్నారు. -
‘కేంద్రం నిధులతో గ్రామాలాభివృద్ధి’
లక్ష్మణచాంద: కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రాచాపూర్ గ్రామంలో రూ.10లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించిన ఎస్‌హెచ్‌జీ (వీవో) భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మండల కేంద్రంలో రూ.30 లక్షలతో చేపట్టిన గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. వ్యవసాయరంగ అభివృద్ధి, రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సర్పంచులు ముత్యం, ఓస కవిత రాజు, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో రమాకాంత్, ఏవో నాగరాజు, ఎంఈవో రాజునాయక్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గంగామణి, బీజేపీ మండలాధ్యక్షుడు చిన్నయ్య, నాయకులు రమేశ్, ముత్యంరెడ్డి, రవి, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో వివిధ శా ఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే స మీక్ష నిర్వహించారు. ఒక్కో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులతో విడివిడిగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మల్లాపూర్, పార్పెల్లి, బాబాపూర్ ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించాలని ఎంఈవోను ఆదేశించారు. పొట్టపెల్లి (కే), చింతల్‌చాంద గ్రామాల్లోని పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని అధికారి శ్రీనివాస్‌ను, గ్రామాల్లో చేపట్టాల్సి న అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు పంపాలని ఏపీవో ప్రమీలను ఆదేశించారు. ప్రతీనెల సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులను అరికడతాం
వ్యాధులు వ్యాపించే సీజన్ వానాకాలంలో దోమలు, ఈగల ప్రభావం ఎ క్కువగా ఉంటుంది. తాగునీరు కలుషితమవుతుంది. వర్షాల కారణంగా పరిసరాలు అపరిశుభ్రంగా మారుతాయి. దీంతో మలేరియా, మెదడువాపు, పైలేరియా, చికున్‌గున్యా, డెంగీ, డ యేరియా, కలరా, టైఫాయిడ్, స్వైన్ఫ్లూతోపా టు వివిధ రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. వాటిని అధిగమించడానికి వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో డ్రెయినేజీలను శుభ్రం చే యడం, మురుగునీటి గుంటల్లో మట్టి పోయించడం లాంటి పనులకు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుంటాం. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయిస్తాం. ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు ఇంటిగ్రేటెడ్ డిసీస్ సర్వైలైన్స్ ప్రోగ్రాం కింద ప్రత్యేకంగా జిల్లా, మండల స్థాయిలో ర్యాపిడ్ రె స్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాల్లో ఫిజీషియన్, పిడియాట్రిక్ పాటు మరో ఇద్దరు వైద్యులు, ఏఎన్ఎం, ఎల్డీలు, ఆశ కార్యకర్తలు ఉంటారు. జిల్లాలో ఎక్కడైనా సీజనల్ వ్యాధులు ప్రబలితే ఈ బృందం వెంటనే అక్కడికి చేరుకుని వైద్యసేవలు అందిస్తుంది. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యులు, సిబ్బందిని స్థానికంగా ఉండాలని ఇప్పటికే ఆదేశించాం. స్థానికంగా ఉండని వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. పీహెచ్‌సీల వారీగా రోజూ నివేదికలు తెప్పించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. రాజేందర్, డీఎంహెచ్‌వో పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి వానాకాలంలో ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. పరిసరాల్లో నీటి గుంటలు ఉంటే వాటిలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా మూతలు పెట్టుకోవాలి. తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తినాలి. తాగునీటి ట్యాంకుల్లో క్లోరిన్ బిల్లలు వేసుకోవాలి. ఆరోగ్య సమస్యలుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. క్షేత్రస్థాయిలో అవగాహన సీజనల్ వ్యాధులపై గ్రామాలు, పట్టణాల్లో మా సబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటించి నీటి తొట్లు, నీళ్ల ట్యాంకుల్లో నిల్వ నీటిని తొలగించేలా అవగాహన కల్పిస్తున్నాం. ఇంటింటా స ర్వే నిర్వహిస్తాం. ఎవరైనా జ్వరం లేదా ఇ తర వ్యాధులతో బాధపడితే గుర్తించి అవసరమైన మందులిస్తాం. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంట ర్లు, పల్లె, బస్తీ దవాఖానాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాం. ‘వానాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాం. వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం’ అని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ తెలిపారు. వానాకాలంలో వ్యాధుల నియంత్రణకు తీసుకున్న చర్యల గురించి బుధవారం ఆయన ‘సాక్షి’కి తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే.. – నిర్మల్‌చైన్‌గేట్ -
రూ.లక్ష ప్రోత్సాహకం
ఖానాపూర్: పదో తరగతిలో 575 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని శ్రీవల్లికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.లక్ష నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. ఈ సందర్భంగా శ్రీవల్లి సంస్థకు కృతజ్ఞతలు తెలిపింది. తల్లిదండ్రులు అశ్విని, సాగర్, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొంది. కార్యక్రమంలో ఖానాపూర్ బ్రాంచ్ మేనేజర్ పి.వినోద్ కుమార్, డీవోలు లోకిని రాము, కేసరి రాజేందర్, అనూష, బిజినెస్ డెవలప్మెంట్ అధికారి కళ్యాణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఖానాపూర్ కోర్టుకు రెగ్యులర్ జడ్జిని నియమించాలి
ఖానాపూర్: ఖానాపూర్ కోర్టుకు రెగ్యులర్ జడ్జిని నియమించడంతోపాటు శాశ్వత న్యాయస్థాన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఖానాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మట్టేరి రాజశేఖర్ ఆధ్వర్యంలోని న్యాయవాదుల బృందం హైకోర్టులో నిర్మల్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి జస్టిస్ కె.సుజనను కోరారు. మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. రెగ్యులర్ జడ్జి లేకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. శాశ్వత కోర్టు భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం స్వీకరించిన జస్టిస్ కె.సుజన సానుకూలంగా స్పందించారు. అనంతరం న్యాయవాదుల బృందం ఇటీవల తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై న సురేందర్‌రెడ్డిని కలిసి సన్మానించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సురేందర్‌రెడ్డి హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. సీనియర్ న్యాయవాదులు వెంకట్ మహేంద్ర, బక్కశెట్టి కిశోర్, ఏజీపీ ఆసిఫ్ అలీ, న్యాయవాదులు చిన్నం సత్యం, బాసెట్టి శివ, సురేందర్, ఐదు వెంకటేశ్, నరేంద్రనాథ్, ఖదిర్, అశోక్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులకు పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలి
నిర్మల్ రూరల్: ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆ ర్సీ, ఆరు డీఏ బకాయిలను ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు శశిరాజ్ మాట్లాడు తూ.. పీఆర్సీ రిపోర్టును ముఖ్యమంత్రి వెంటనే తెప్పించుకుని 51 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక నష్టం జరుగుతున్నందున ప్రజాసంక్షేమంపై దృష్టి పెడుతున్న ముఖ్యమంత్రి ఆ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందజేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలపై చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు సీపీఎస్ రద్దుచేసి వోపీఎస్ అమలు చేయాలన్నారు. కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఇందులో ప్రధాన కార్యదర్శి సుదర్శన్, రాజేశ్వర్, రామ్‌నరేశ్, చంద్రప్రకాశ్, శ్రీనివాస్, సాయన్న పాల్గొన్నారు. -
భూభారతి రీసర్వేను సద్వినియోగం చేసుకోవాలి
భైంసారూరల్: భూభారతి రీసర్వేను సద్వినియోగం చేసుకుని తమ భూముల వివరాలను పారదర్శకంగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ సూచించారు. మండలంలోని ఎగ్గాం గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన బాబుల్గాంలో మంగళవారం కొనసాగుతున్న భూభారతి రీసర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహణ తీరును పరిశీలించిన అదనపు కలెక్టర్ సంబంధిత రెవెన్యూ, సర్వే అధికారులకు సూచనలు చేశారు. అనంతరం రైతులతో మాట్లాడిన ఆయన రీసర్వేతో కలిగే ప్రయోజనాలను వివరించారు. భూవివాదాల పరిష్కారం, కచ్చితమైన భూ రికార్డుల నమోదు, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల అమలులో ఈ సర్వే కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద భైంసా మండలం బాబుల్‌గాం, లక్ష్మణచాంద మండలం మల్లాపూర్, కడెం మండలం బాబాపూర్ ఎంపికయ్యాయన్నా రు. ఆయన వెంట తహసీల్దార్ శశిభూషణ్, సర్వేయర్ జవహర్‌సింగ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
సర్.. వేగంగా పూర్తిచేద్దాం
నిర్మల్రైతులకు నాణ్యమైన విద్యుత్ లోకేశ్వరం: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని టీజీ ఎన్పీడీసీఎల్ నిర్మల్ ఎస్ఈ జాదవ్ సుభాష్ అన్నారు. మండలంలోని ధర్మోర విద్యుత్ సబ్ స్టేషన్లో నూతనంగా బిగించిన 5 ఎంవీఏ పీటీఆర్ ట్రాన్స్ఫార్మర్ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లులు చెల్లించాలన్నారు. రైతులకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అటంకం లేకుండా చేస్తామన్నారు. విద్యుత్‌లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు, విద్యుత్ వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడాలని సూచించారు. కార్యక్రమంలో నిర్మల్ ఎమ్మార్టీ, భైంసా డీఈ తిలక్, ఎస్పీం ఏడీఈ రమేశ్, బాసర ఇన్చార్జి ఏడీఈ శ్రీని వాస్, లోకేశ్వరం ఏఈ శివకుమార్, లోకేశ్వర్ సబ్ ఇంజినీర్ శ్రీనివాస్, ఎల్ఐ దశరథ్, సాయిబాబా, జెఎల్ఎం గంగాధర్ పాల్గొన్నారు.నమోదు చేసుకుంటేనే బోనస్సాక్షి : అసలు.. ‘సర్’లో ఓటర్లు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? కలెక్టర్: ఎన్యూమరేషన్ ఫారంలో మూడు అంశాలు చాలా కీలకం. ప్రధానంగా ఈ ఫారంలో 1. శాసనసభ నియోజకవర్గం సంఖ్య, 2. పోలింగ్ కేంద్రం సంఖ్య, 3. ఓటరు జాబితాలో క్రమసంఖ్య. ఈ మూడు తప్పులు లేకుండా చూసుకోవాలి. ఎలాంటి సందేహాలు ఉన్నా బీఎల్వో లేదా మండల అధికారులను సంప్రదించాలి. లేదంటే నేరుగా ఫోన్లో నన్ను కూడా అడగవచ్చు. మిగితాచోట్ల ‘ఫారాలు’ పూర్తిచేసివ్వాలి సాక్షి : జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ ఏ దశలో ఉంది? కలెక్టర్: ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. సర్ ప్రక్రియ జూన్ 25న ప్రారంభం కాగా, జూలై 6వరకు జిల్లాలోని 925 పోలింగ్ కేంద్రాల పరిధిలో 7,55,344 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశాం. ప్రస్తుతం బీఎల్వోలు పూర్తిచేసిన ఫారాలను తీసుకోవడం, డిజిటలైజేషన్(ఆన్లైన్) చేసే ప్రక్రియ కొనసాగుతోంది. సాక్షి : ఇప్పటి వరకు ఎంతమేర నమోదైంది..? కలెక్టర్:మంగళవారం సాయంత్రం వరకు పూర్తిచేసి అందిన ఫారాల్లో 64 శాతం వివరాలను ఆన్లైన్లో నమోదు(డిజిటైజేషన్) చేశాం. మిగిలిన వివరాలను కూడా వేగంగా నమోదు చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో జిల్లా ఈ అంశంలో టాప్‌టెన్‌లో ఉంది. సాక్షి : పదిరోజుల్లో లక్ష్యాన్ని చేరుకుంటారా? కలెక్టర్: అవును. మరో పది రోజుల్లో ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. బీఎల్వోలు, పర్యవేక్షక అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నారు. రోజుకు 8 శాతం చొప్పున డిజిటైజేషన్ కొనసాగుతోంది. ఈలెక్కన ఈనెల 20లోపే వందశాతం పూర్తి చేద్దామన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. సాక్షి : ఇంకా ఫారాలు సమర్పించని ఓటర్లకు ఏం చెబుతారు..? కలెక్టర్: ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్లు వెంటనే తమ బీఎల్వోను సంప్రదించి పూర్తి చేసిన ఫారాలను అందజేయాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా సమర్పిస్తే వివరాలను సకాలంలో నమోదు చేయడం సులభమవుతుంది. ఆన్లైన్ సర్వర్లకు సంబంధించి ఇబ్బంది ఉండదు. సాక్షి : ‘సర్’లో అధికారులు ఏమేం పరిశీలిస్తారు..? కలెక్టర్: ఈ ప్రక్రియలో ఓటర్‌కు సంబంధించిన పూర్తివివరాలు తెలిసిపోతాయి. ఇకపై డబుల్ ఓటుకూ అవకాశం ఉండదు. జిల్లాలో ఇప్పటికే 15 పోలింగ్ కేంద్రాల్లో వందశాతం డిజిటైజేషన్ కూడా పూర్తిచేసి, ఏఎస్డీ(అబ్సెంట్,షిఫ్టెడ్,డెత్, డబుల్ఓట్) పక్కాగా పూర్తిచేశాం. సాక్షి : ఏఎస్డీ అంటే ఏంటి.... కలెక్టర్: సర్ ప్రక్రియ మొత్తం పూర్తయిన పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు, బీఎల్ఏలు, సూపర్వైజర్లు, సంబంధిత గ్రామ పెద్దలంతా కలిసి పూర్తిచేసే జాబితానే ఏఎస్డీగా పేర్కొంటారు. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇందులో అబ్సెంట్(ఫారాలు ఇవ్వనివారు), ఫిఫ్టెడ్(తరలివెళ్లినవారు), డెత్(చనిపోయినవారు) డబుల్ ఓట్(రెండుచోట్ల ఓట్లు ఉన్నవారు) ఇలా వీరికి సంబంధించి వివరాలన్నీ రాస్తారు. వీటితోపాటు ఓటు ఎందుకు తిరస్కరణకు గురైందనే కారణాన్నీ అందులో నోట్ చేస్తారు. సాక్షి : ఎస్ఐఆర్ వల్ల ఓటర్లకు కలిగే ప్రయోజనం ఏమిటి? కలెక్టర్: అర్హులైన ప్రతిఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, తప్పులు సరిచేసేలా, మరణించినవారి లేదా అనర్హుల పేర్లను తొలగించేలా ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. దీంతో మరింత ఖచ్చితమైన ఓటరు జాబితా సిద్ధమవుతుంది. సాక్షి : జిల్లావాసులకు మీ సందేశం..? కలెక్టర్:ఓటు హక్కు ప్రతీ పౌరుడి బాధ్యత. అందువల్ల అర్హుడైన ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియలో యాక్టివ్ భాగస్వామి కావాలి. ఇంకా ఫారాలు సమర్పించని వారు వెంటనే సమర్పించాలి. పట్టణ ప్రాంత ఓటర్లు వేగం పెంచాలి. ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియను ప్రతీ ఓటరు సీరియస్‌గా తీసుకోవాలి. మరో పదిరోజుల్లో సర్ ముగియనుంది. ఈనెల 20లోపే జిల్లాలో దాదాపు ప్రక్రియ అంతా పూర్తిచేసే దిశగా వెళ్తున్నాం. ఎన్యూమరేషన్ ఫారాలను త్వరగా నింపి, బీఎల్వోలకు అందించాలి. లేనిపక్షంలో ఓటును కోల్పోయే అవకాశం ఉంటుంది..’ అని కలెక్టర్ భవేశ్‌మిశ్రా తెలిపారు. ఎస్ఐఆర్కు మరో పదిరోజులు మాత్రమే గడువు ఉండటంతో ఈ ప్రక్రియలో పురోగతి, ప్రజల సహకారం, తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ... – నిర్మల్సాక్షి : 2002 ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే ఎలా..? కలెక్టర్: ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్‌లో 2002లో నిర్వహించిన సర్ ప్రకారమే వివరాలు పొందుపర్చాలి. ఒకవేళ పేర్లు, తండ్రి/తల్లిపేరు, పుట్టినతేదీ, ఫొటోతో పాటు పోలింగ్‌కేంద్రం మార్పులనూ జూలై 31న వచ్చే డ్రాఫ్ట్ తర్వాత చేసుకోవచ్చు. ఇందుకు ఏమేం మార్పులను కోరుకుంటున్నామో వాటి వివరాలను ఫామ్–8లో నింపి ఇవ్వాలి. -
సబ్‌స్టేషన్... ఆటోమేషన్
లక్ష్మణచాంద: విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్వహణలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్ సరఫరా అందించేందుకు టీఎస్ ఎన్పీడీసీఎల్ అధికారులు విస్తృత చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మానవ రహిత నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమేషన్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఈ విధానం విజయవంతంగా అమలు అవుతోంది. తెలంగాణలో మొదటిసారిగా ఖమ్మం జిల్లాలో ఈ ఆటోమేషన్ విధానాన్ని అమలు చేశారు. అక్కడ విజయవంతంగా నడుస్తుండటంతో, టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలోని మిగిలిన జిల్లాల్లోని 33/11 కేవీ సబ్ స్టేషన్లలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది. జిల్లాలోని మూడు సబ్స్టేషన్లలో.. జిల్లాలో సోన్ మండలం మాదాపూర్, మామడ మండల కేంద్రం, దిలావార్పూర్ సబ్ స్టేషన్లలో ఆటోమేషన్ అమలు చేయాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఈమేరకు తగిన చర్యలు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మూడు సబ్ స్టేషన్లలో ఆటోమేషన్ విధానం అమలు చేసేందుకు సీసీ కెమెరాలు అమర్చే పనులు జరుగుతున్నాయి. పనులను త్వరలోనే పూర్తి చేసి ఈ నెలాఖరు వరకు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు డీఈ నాగరాజు తెలిపారు. రియల్ టైమ్ ఫీడర్ మేనేజ్మెంట్ విధానం సబ్ స్టేషన్ల ఆటోమేషన్‌కు రియల్ టైమ్ ఫీడర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేస్తారు. దీంతో 11 కేవీ విద్యుత్ సరఫరా ఫీడర్ల ఆన్–ఆఫ్‌ను ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థలతో అనుసంధానిస్తారు. తద్వారా సిబ్బంది అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా సబ్‌స్టేషన్‌ను ఆపరేట్ చేసే అవకాశం ఏర్పడుతుంది. సబ్ స్టేషన్‌కు సంబంధించిన సరఫరా, అంతరాయాలు, ఇతర సాంకేతిక సమస్యలు ఏర్పడితే వెంటనే కంపెనీ హెడ్‌క్వార్టర్స్‌లోని కంట్రోల్ రూమ్‌కు, సంబంధిత అధికారుల సెల్ఫోన్లకు సమాచారం చేరుతుంది. దీంతో ఎక్కడైనా ఇబ్బంది ఎదురైనా తక్షణమే తెలుసుకుని మరమ్మత్తు చేసి, విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరిస్తారు. ఫలితంగా ఎక్కువ సమయం అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. -
బాసరలో భద్రత డొల్ల!
బాసర: బాసర రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు భద్రత కరువైంది. సెక్యూరిటీ వైఫల్యాలను అలుసుగా తీసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ చోరీలు పెరుగుతున్నాయి. తాజాగా నాగర్సోల్–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో చైన్ స్నాచింగ్ జరిగింది. షిరిడి సాయిబాబా దర్శనం ముగించుకుని కుటుంబ సభ్యులతో కాజీపేటకు తిరుగు ప్రయాణం చేస్తున్న రవికుమార్ కుటుంబానికి చెందిన ఓ వృద్ధురాలు ఆదివారం రాత్రి ఎస్9 బోగీలో కిటికీ పక్కన కూర్చుంది. రైలు బాసర స్టేషన్లో ఆగిన సమయంలో గుర్తు తెలియని దుండగుడు కిటికీలోంచి చేయి పెట్టి ఆమె మెడలో ఉన్న సుమారు ఆరు తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ప్రయాణికులు అప్రమత్తమై దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ చీకట్లో తప్పించుకున్నాడు. కాజీపేటలో ఫిర్యాదు.. బాధితురాలు కాజీపేట రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసును నిజామాబాద్ రైల్వే పోలీసులకు బదిలీ చేశారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు మంగళవారం బాసర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి. ప్లాట్‌ఫారాలు, ట్రాక్ పరిసర ప్రాంతాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి ఆధారాలు సేకరించారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. భద్రతా లోపాలు బహిర్గతం ఈ ఘటనతో బాసర రైల్వే స్టేషన్లో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్టేషన్ ఆవరణ, ప్లాట్‌ఫారాలు, ప్రవేశ ద్వారాలు, ట్రాక్ పరిసరాల్లో సీసీ కెమెరాలు లేక దొంగలు సులభంగా తప్పించుకుంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైరిజల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పటిష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రత పెంచాలని డిమాండ్ బాసర రైల్వే స్టేషన్ జిల్లాలో అత్యంత కీలకమైన రైల్వే స్టేషన్లలో ఒకటి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి, ఆర్జీయూకేటీ(ట్రిపుల్ ఐటీ) విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు ఈ స్టేషన్‌ను వినియోగిస్తున్నారు. ఇంత రద్దీగా ఉండే స్టేషన్లో భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచడంతోపాటు రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్), జీఆర్పీ పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుని ప్రయాణికులు, భక్తులకు పూర్తి భద్రత కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆరుతడి పంటలు వేసుకోవాలి
లక్ష్మణచాంద: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని తెలంగాణ వ్యవసాయ విద్యాలయం శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ సూచించారు. సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో ఎల్‌నినో ప్రభావంపై రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. పప్పు దినుసులు, చిరు ధాన్యాలు, నునె గింజల పంటలు సాగు చేయాలని తెలిపారు. నీటి సంరక్షణ, నేలలో తేమ పరిరక్షణ, పంటల వైవిధ్యీకరణ, శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతుల ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు. రైతులు వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. తక్కువ నీటితో సాగుచేయగల పంటలను ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్ రాజురెడ్డి, ఏవో వినోద్, ఏఈవో సంధ్య, ఉప సర్పంచ్ మధుకర్ పాల్గొన్నారు. -
● సన్నాలు సాగుచేసే రైతులు ఆన్లైన్ చేసుకోవాలి ● ఈనెలాఖరు వరకు అవకాశం
ఖానాపూర్: రాష్ట్ర ప్రభుత్వం సన్నాల వరి సాగును ప్రోత్సహించేందుకు బోనస్ పథకాన్ని ప్రకటించింది. ఈ బోనస్ పొందాలంటే అర్హులైన రైతులు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం నోటిఫై చేసి న ఏడు రకాల సన్నాల వరి వంగడాల విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు సంబంధిత విత్తన విక్ర య డీలర్ల ద్వారా ఆన్లైన్ నమోదు పూర్తి చేసుకోవా లని అధికారులు సూచించారు. నమోదు గడువు ఈనెల 30 వరకు ఉంది. రైతులు ఆలస్యం చేయవద్దని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో వరిసాగు ఇలా.. జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో ఏ టా లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. 2025 పంట సంవత్సరంలో వానాకాలం సీజన్లో జిల్లాలో మొత్తం 4,37,885.66 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, అందులో 1,41,392.30 ఎకరాల్లో వరి సాగైంది. కడెం, లోకేశ్వరం మండలాలు వరి సాగులో ముందంజలో ఉన్నాయి. యాసంగి సీజన్లో మొత్తం 3,52,678.89 ఎకరాల్లో పంటలు సాగు కాగా, అందులో 1,29,296.43 ఎకరాల్లో వరి పండించారు. ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి.. ప్రభుత్వం బోనస్ ప్రకటించిన బీపీటీ–5204 (సాంబా మసూరి), ఆర్ఎన్ఆర్–15048 (తెలంగాణ సోనా), హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కెఎన్ఎమ్–1638, డబ్ల్యూజీఎల్–44, జేఎన్‌ఎమ్–7715 వరి వంగడాల విత్తనాలను ఫర్టిలైజర్ దుకాణాల్లో కొనుగోలు చేసిన రైతులు తప్పనిసరిగా ఆన్లైన్ నమోదు చేయించుకోవాలి. రైతులు విత్తనాల కొనుగోలు రసీదు, పట్టాదారు పాస్‌బుక్ వివరాలు, మొబైల్ నంబర్‌తో సంబంధిత విత్తన విక్రయ దుకాణాలను సంప్రదించి నమోదు పూర్తి చేయాలి. గడువు ముగిసిన తర్వాత నమోదుకు అవకాశం ఉండదు. – జగదీశ్వర్, ఏవో, ఖానాపూర్ -
వరిపై ఎల్‌నినో ప్రభావం
కుంటాల: ఈ వానాకాలంలో వరి పంటపై ఎల్‌నినో ప్రభావం చూపుతుందని డీఏవో అంజిప్రసాద్ తెలిపారు. మండలంలోని అందకూర్, కుంటాల గ్రామాల్లో వరినారు, సోయా పంటను మంగళవారం పరిశీలించారు. వర్షాలు కురుస్తాయన్న ఆశతో రైతులు పత్తి, సోయా సాగుచేశారన్నారు. జూలై మాసం సగం పూర్తయినా ఆశించిన వర్షాలు లేక పంటలు ఎండు ముఖం పట్టాయని పేర్కొన్నారు. రైతులు పొద్దు తిరుగుడు, నువ్వులు, ఆముదం, కందులు, వేరుశనగ పంటలతోపాటు కూరగాయలను మాత్రమే సాగు చేయాలని సూచించారు. ఆరుతడి పంటలు వేస్తేనే ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ జక్కుల గజేందర్, ఏఈవో హర్షిత, రైతులు ఉన్నారు. -
విద్య, వైద్యం అందరికీ అందాలి
కడెం: ప్రభుత్వ ఉచిత విద్య, వైద్యం అందరికీ అందాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేజీబీవీని మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూ, ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన విద్యను అందించాలన్నారు. వసతి గృహాన్ని పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు క్విజ్ నిర్వహించి, విద్యార్థులకు పెన్నులు బహుమతులుగా ఇచ్చారు. ఆస్పత్రికి సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీరోజు వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ చికిత్స అందించాలని తెలిపారు. అనంతరం ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. డీఈవో భోజన్న, డీఎంహెచ్‌వో రాజేందర్, తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో అరుణ, ఎస్వో విమల, డాక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి నిర్మల్‌చైన్‌గేట్: ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖపై సంబంధిత అధికా రులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ బోధన చేయాలన్నారు. ప్రతీ రోజు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఉపాధ్యాయులు కచ్చితంగా ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేయాలన్నారు. విద్యార్థుల సామర్థ్యాలు అంచనా వేయడానికి వారాలు, నెల వారీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత విద్యార్థులు సబ్జెక్టులు చదువుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఈవో భోజన్న పాల్గొన్నారు. -
‘మధ్యాహ్న’ కార్మికులకు ముందస్తు జీతాలు
లక్ష్మణచాంద: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట చేసే కార్మికులకు శుభవార్త చెప్పింది. 2026–27 విద్యా సంవత్సరం కోసం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసే వంట కార్మికులకు నాలుగు నెలల గౌరవ వేతనాలను ముందుగానే విడుదల చేసింది. గతంలోని జాప్యాలు.. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట చేసే కార్మికులకు బిల్లుల చెల్లింపు, గౌరవ వేతనాల చెల్లింపులో జాప్యం జరిగేది. దీంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం బిల్లుల నమోదు, చెల్లింపులకు ఆన్లైన్ విధానాన్ని అమలు చేసింది. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో మొత్తం 830 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా యి. వీటిలో 577 ప్రాథమిక పాఠశాలల్లో 23,398 మంది, 89 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6,373 మంది, 165 ఉన్నత పాఠశాలల్లో 37,019 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 66,790 మంది విద్యార్థులు ఉండగా, జిల్లాలోని 830 ప్రభుత్వ పాఠశాలల్లో 748 వంట ఏజెన్సీలు పని చేస్తున్నాయి. వీటిలో 1,305 మంది వంట కార్మికులు ఉన్నారు. ప్రభుత్వం వీరికి నెలకు రూ.2 వేల గౌరవ వేతనం అందజేస్తోంది. కార్మికుల సంతోషం 2026–27 విద్యా సంవత్సరం కోసం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల గౌరవ వేతనాల కోసం జిల్లాకు రూ.1,73,66,000 విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. దీంతో జిల్లా వ్యాప్తంగా వంట కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంతోషంగా ఉంది.. గతంలో మధ్యాహ్న భోజనం తయారు చేసే మాకు నెలల తరబడి బిల్లులు రాకపోవడంతోపాటు, గౌరవ వేతనం కోసం వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఈసారి ప్రభుత్వం ముందుగానే మాకు నాలుగు నెలల గౌరవ వేతనాలు విడుదల చేయడం సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – మేకల రాధిక, వంట కార్మికురాలు, మాచాపూర్ -
మేం అర్హులం కాదా?
‘శారీరక అంగవైకల్యంతో కొన్నేళ్లుగా మంచానికే అంకితమై బాధపడుతున్నం. ప్రభుత్వం ఆదుకోవాలని కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా మాకు న్యాయం చేయడంలేదు’ అని ఈ యువ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మా వైకల్యం కనిపించడం లేదా.. పింఛన్‌కు మేం అర్హులం కాదా అని’ అని ప్రశ్నిస్తున్నారు. పింఛన్ కోసం ప్రజావాణిలో ఎన్నిసార్లు దరఖాస్తు ఇచ్చినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలని వేడుకున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
రుణాల చెల్లింపులో చేతివాటం
ఖానాపూర్: జిల్లాలో సీ్త్రనిధి, డ్వాక్రా సంఘాల రుణాల దుర్వినియోగ ఘటనలు వరుసగా వెలుగుచూస్తుండటం మహిళా సంఘాల సభ్యుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఖానాపూర్ మండలంలోని గోసంపల్లి, పాత ఎల్లాపూర్ గ్రామాల్లో సీ్త్రనిధి రుణాల రికవరీలో జరిగిన అక్రమాలు, నిర్మల్ పట్టణంలోని బ్రహ్మపురి కాలనీ డ్వాక్రా గ్రూపు నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు అందడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ ఆడిట్లో వెలుగులోకి.. గోసంపల్లి, పాత ఎల్లాపూర్ గ్రామాల్లో నిర్వహించిన సోషల్ ఆడిట్లో సుమారు రూ.28 లక్షలకుపైగా నిధులు దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. మహిళలు చెల్లించిన రుణ వాయిదాలు సంబంధిత ఖాతాల్లో జమ కాకపోవడం, నగదు లావాదేవీల్లో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలు ఈ ఘటనలకు ప్రధాన కారణాలుగా అధికారులు భావిస్తున్నారు. ఇదే తరహాలో నిర్మల్ పట్టణంలోని బ్రహ్మపురి కాలనీకి చెందిన డ్వాక్రా గ్రూపుకు సంబంధించిన రూ.25 లక్షల నిధులు సభ్యులకు తెలియకుండా దుర్వినియోగం చేశారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు అందడం కూడా మహిళా సంఘాల్లో ఆందోళనకు దారితీసింది. నగదు లావాదేవీలతో అక్రమాలు.. ప్రస్తుతం నగదు రూపంలో చెల్లింపులు చేయడం వల్లే ఎక్కువగా దుర్వినియోగాలకు అవకాశం ఏర్పడుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రుణ వాయిదాలు నేరుగా ఖాతాల్లో జమ కాకపోవడం, మధ్యవర్తుల ప్రమేయం వంటి సమస్యలు మహిళలను ఆర్థికంగా నష్టపరుస్తున్నాయి. డిజిటల్ విధానంతో ప్రయోజనాలు.. డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రతి లావాదేవీకి వెంటనే రసీదు, బ్యాంకు ఎస్ఎంఎస్, ట్రాన్సాక్షన్ ఐడీ లభిస్తాయి. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తినా సభ్యులకు స్పష్టమైన ఆధారాలు అందుబాటులో ఉంటాయి. డబ్బు నేరుగా సంస్థ ఖాతాలో జమ కావడంతో మధ్యవర్తుల ప్రమేయానికి అవకాశం ఉండదు. దీంతో పారదర్శకత పెరిగి, ఇలాంటి దుర్వినియోగాలకు అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. డిజిటల్ చెల్లింపులే శాశ్వత పరిష్కారం ఈ అక్రమాలను అరికట్టేందుకు ప్రతి మహిళా సంఘం సభ్యురాలు డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రుణ వాయిదాలను నేరుగా అధికారిక బ్యాంకు ఖాతాలకు జమ చేసే విధానాన్ని అనుసరించాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ‘మన సీ్త్రనిధి యాప్’ ద్వారా సభ్యులు తమ రుణ ఖాతా వివరాలు, డీసీబీ, బకాయిలు, చెల్లించిన వాయిదాల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. యూపీఐ ద్వారా నేరుగా చెల్లింపులు చేసే అవకాశం కూడా ఉంది. -
ఏం చేయాలో అర్థం కావడం లేదు
నా కుమారుడు బెస్ట్ అవైలబుల్ స్కీం కింద పట్టణంలోని వశిష్ఠ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని సార్లు చెబుతున్నారు. పుస్తకాలు, టై, బెల్ట్, దుస్తులకోసం రూ.5,500 ఖర్చు అవుతాయని చెబుతున్నారు. ప్రభుత్వం ఫీజులు చెల్లించకుంటే మీరే ఇవ్వాలని అంటున్నారు. ఫీజులు చెల్లించే స్థోమత లేదు. పిల్లవాడి చదువు ఆగం అవుతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – మసీదు రమేశ్, విద్యార్థి తండ్రి రమ్మనేవారు లేరు.. మా కొడుకుని పట్టణంలోని వశిష్ఠ స్కూల్లో బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా చేర్పించాను. ఇప్పుడు ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని మా పిల్లలని పాఠశాల యజమాన్యం పట్టించుకోవడం లేదు. దళితులమైన మేం.. బిడ్డలు ప్రైవేట్ పాఠశాలల్లో చదివితే మంచిగా చదువు వస్తదని నమ్మి చేర్పించాం. ఇప్పుడు పట్టించుకోకపోతే ఎలా. బడికి రమ్మనేవారు లేరు. – ఎల్లయ్య, విద్యార్థి తండ్రి, నిర్మల్


