శెనగకు కూలీల కొరత | - | Sakshi
Sakshi News home page

శెనగకు కూలీల కొరత

Feb 23 2026 7:11 AM | Updated on Feb 23 2026 7:11 AM

శెనగకు కూలీల కొరత

శెనగకు కూలీల కొరత

● ఎకరాకు రూ.4 వేల వరకు కోత ఖర్చు ● 38 వేల ఎకరాల్లో సాగు

భైంసా: జిల్లాలో శెనగ పంటలు కోత దశకు చేరుకున్నప్పటికీ కూలీల కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ సీజన్‌లో జిల్లాలో సుమారు 38 వేల ఎకరాల్లో శెనగ సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అంచనా. యాసంగి పంటల నమోదు ఇంకా పూర్తిస్థాయిలో చేపట్టలేదు. పంట ప్రస్తుతం కోత దశకు వచ్చింది. కూలీలు దొరకక రైతులు ఆందోళన చెందుతున్నారు.

పెరిగిన కోత ఖర్చులు

కూలీల కొరతతో కోత చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. గతంలో ఎకరాకు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఉండే ఖర్చు ఈసారి రూ.3,400 నుంచి రూ.4వేల వరకు చేరింది. చిన్న, సన్నకారు రైతులకు ఇది అదనపు భారం అవుతోంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరగడంతో ఖర్చులు అధికమయ్యాయని రైతులు వాపోతున్నారు.

ఆలస్యమైతే నష్టం

శెనగ పంట కోత ఆలస్యం అయితే గింజలు నేలరా లే ప్రమాదం ఉంది. అకాల వర్షాలు కురిస్తే దిగుబ డి తగ్గే అవకాశముంది. దీంతో రైతులు తక్షణమే కో త పూర్తిచేయాలనే ఆత్రుతలో ఉన్నారు. కూలీలు ఇ తర ప్రాంతాలకు పనులకు వెళ్లడంతో కోతలు నిలి చిపోతున్నాయి. మహారాష్ట్ర నుంచి ఇక్కడికి కూ లీలు వస్తున్నా రవాణా భారం రైతులపై పడుతోంది. దీంతో చేసేదేంలేక పంటలు కోయిస్తున్నారు.

యంత్రాల కొరత...

కొంతమంది రైతులు హార్వెస్టర్‌ యంత్రాల కోసం ప్రయత్నిస్తున్నా జిల్లాలో అందుబాటులో ఉన్న యంత్రాలు పరిమితంగానే ఉన్నాయి. ఒకేసారి ఎక్కువ మంది రైతులు యంత్రాల కోసం అడుగుతుండటంతో సమయానికి అందడం లేదు. దీంతో యంత్రాల అద్దె కూడా పెరిగినట్లు రైతులు పేర్కొంటున్నారు. గతేడాది 50 కేజీల శెనగ సంచి నూర్పిడి చేసేందుకు రాజస్థాన్‌ నుంచి వచ్చే ట్రాక్టర్‌ యజమానులు రూ.110 తీసుకోగా ఈ ఏడాది రూ.110 నుంచి రూ.130 వరకు తీసుకుంటున్నారు. దీంతో పంట నూర్పిడి చేసే విషయంలోనూ రైతులపై భారం పడుతోంది. శెనగ పంటపై ఆశలు పెట్టుకున్న నిర్మల్‌ రైతులకు కూలీల కొరత పెద్ద సవాల్‌గా మారింది.

దృష్టి సారిస్తే...

వ్యవసాయ పనులకు కూలీల కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద రైతులకు కాస్త చేయూతనందించాలి. కూలీలను వ్యవసాయ పనులకు మళ్లించేలా కార్యాచరణ రూపొందించాలి. పంట కోతలకు ప్రభుత్వం సబ్సిడీపై యంత్రాలు అందించాలని రైతులు కోరుతున్నారు. తగిన మద్దతు లేకపోతే ఈ సీజన్‌లో లాభాల కంటే నష్టాలే మిగిలే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement