లోక్ సభ రేపటికి వాయిదా
పశ్చిమాసియా యుద్ధం పై చర్చించాలని విపక్షాల పట్టు
అధికారపక్షం అంగీకరించకపోవడంతో సభా కార్యక్రమాలను అడ్డుకున్న విపక్షాలు
లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముందుకు రావాలని కోరిన ప్యానెల్ స్పీకర్
స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇరాన్ యుద్ధం పై చర్చించాలనడం ఏమిటని ప్రశ్నిస్తున్న అధికారపక్షం
విపక్ష పార్టీలు అయోమయంలో ఉన్నాయన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు
లోక్‌సభ మరోసారి వాయిదా..
మధ్యాహ్నం మూడు గంటల వరకు లోక్‌సభ వాయిదా.
స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి విపక్ష ఎంపీల ఆందోళన.
గల్ఫ్ యుద్ధంపై చర్చించాలని విపక్షాల పట్టు.
విపక్షాల ఆందోళన మధ్య లోక్‌సభ వాయిదా.
పెట్రోల్, గ్యాస్ ధరలపై జైశంకర్ ప్రకటన
పశ్చిమాసియాలో యుద్ధంపై రాజ్యసభలో కేంద్రం ప్రకటన.
రాజ్యసభలో ప్రకటన చేస్తున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.
రాజ్యసభలో జైశంకర్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు.
ముందుగా విపక్షాలకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేతల డిమాండ్.
విపక్షాల ఆందోళనల మధ్యే ప్రకటన చేస్తున్నా మంత్రి జైశంకర్.
మంత్రి జైశంకర్ కామెంట్స్..
మార్చి ఒకటో తేదీ సీసీఎస్ సమావేశం నిర్వహించాం.
ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నాం.
యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం.
సంబంధిత శాఖలన్నింటికీ తగిన చర్యలు తీసుకోవాలని సూచించాం.
కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు.
పెట్రోల్, గ్యాస్ ధరలపై దృష్టి సారించాం.
ఇరాన్‌కు వెళ్లవద్దని జనవరిలోనే భారతీయులకు సూచించాం.
ఇరాన్‌లోని భారతీయుల భద్రతకు ఎంబసీ అన్ని చర్యలు తీసుకుంటోంది.
పరిస్థితులు చక్కబడగానే టెహ్రాన్‌లోని భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం.
గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని భారత్ రప్పించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నాం.
ఈరోజు 50 విమానాలు నడుస్తున్నాయి.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధంపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది.
ఫిబ్రవరి 28 నాటి పరిణామాల తర్వాత యుద్ధం తీవ్రరూపం దాల్చింది.
యుద్ధ ప్రాంతాల నుంచి 67వేల మందిని సురక్షితంగా తరలించాం.
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు ఆమోదయోగ్యం కాదు.
యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం ఉంది.
హింస దేనికీ పరిష్కారం కాదు.
తక్షణమే చర్యల బాట పట్టాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చాం.
శాంతి స్థాపన కోసం భారత్ తన వంతు దౌత్య ప్రయత్నాలు చేస్తోంది.
అంతర్జాతీయ మానవతా చట్టాలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలి.
శాంతిని నెలకొల్పేందుకు అన్ని ప్రయత్నాలు జరగాలి
ఇంధన భద్రతకు, కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం
ఇరాన్ నౌకను డాకింగ్ చేసేందుకు సహకరించాం
EAM Dr S Jaishankar makes a statement in the Rajya Sabha on the situation in West Asia, amid sloganeering by Opposition MPs
EAM says," Our government had issued a statement on 20th February expressing deep concerns and urging all sides to exercise restraint. We continue to… pic.twitter.com/whk4pOE259— ANI (@ANI) March 9, 2026
లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా.
కాసేపట్లో పశ్చిమాసియా యుద్ధంపై విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన.
పార్లమెంట్ ఆవరణలో సస్పెండ అయిన ఎంపీల ఆందోళనలు.
పార్లమెంట్‌లో ఇండియా బ్లాక్ ఎంపీల సమావేశం.
After making obituary references, the Lok Sabha adjourned to meet again at 12 Noon today. pic.twitter.com/7Twxxz1HUP
— ANI (@ANI) March 9, 2026
👉పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
అందుకే స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టాం: చామల కిరణ్
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కామెంట్స్..
ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారు
బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ప్రాధాన్యత ఇస్తున్నారు
స్పీకర్ అనే వ్యక్తి లోక్‌సభలో ఉన్న అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి
18వ లోక్ సభలో ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు
రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతీసారి అసౌకర్యం కల్పిస్తున్నారు.
నిషికాంత్ దూబే, అనురాగ్ ఠాకూర్ లాంటి వాళ్లకు అవసరం లేకపోయినా మైక్ ఇస్తున్నారు
దేశంలో ఉన్న ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా లోక్ సభను నడుపుతున్నారు
మహిళా ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడి చేయాలని చూశారని తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చారు
అందుకే లోక్‌సభ స్పీకర్ పై అవిశ్వాసం పెట్టాము
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై లోక్ సభలో చర్చ చేయాలి
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కాకుండా ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నారు
అమెరికా నుంచి దిగుమతులపై సుంకాలను వైట్ హౌస్ నుంచి ట్రంప్ డిసైడ్ చేశారు
పార్లమెంట్ లో చర్చ జరగాల్సిన అంశాలను ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తారు
మోదీ ఎందుకు ట్రంప్‌తో కాంప్రమైజ్ అయ్యారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి
లోక్ సభలో ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేసిన అంశంపై చర్చ జరగాలి
లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం సందర్భంగా ఎనిమిది మంది ఎంపీలకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలి
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము ధర్నా చేస్తాము
ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలి
లోక్ సభలో ఉన్న 543 మంది ఎంపీలకు అవిశ్వాసంపై ఓటు వేసే అవకాశం ఉంటుంది
గ్యాస్, క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెంచారు.
దీనిపై లోక్‌సభలో చర్చ చేపట్టాలి.
పార్లమెంట్‌కు చేరుకున్న ప్రియాంక, రాహుల్
పశ్చిమ ఆసియాలో పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు.
విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఏం చేబుతారో వినాలని ఉందన్న ప్రియాంక.
#WATCH | Delhi: On EAM Dr S Jaishankar to make a statement in Parliament today on the situation in West Asia, Congress MP Priyanka Gandhi Vadra says, "I am keen to hear what he will say." pic.twitter.com/gc26kjlKuJ
— ANI (@ANI) March 9, 2026
బడ్జెట్ సమావేశాలు.. స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ
నేటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు
ఏప్రిల్ 2 వరకు కొనసాగనున్న సమావేశాలు
నేడు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చించనున్న లోక్‌సభ
తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ఎంపీలు మహమ్మద్ జావేద్, కే సురేష్, మల్లు రవి
అవిశ్వాసం తీర్మానంపై చర్చలో స్పీకర్ స్థానంలో కాకుండా సభ్యుల మధ్యలో కూర్చొనున్న ఓం బిర్లా
తొలి విడత సమావేశాల్లో లోక్‌సభ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ సహా విపక్షాలు
స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
నోటీసుపై సంతకం పెట్టిన కాంగ్రెస్, సమాజ్‌వాద్ పార్టీ, డీఎంకే, లెఫ్ట్ పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలు
తమ ఎంపీలకు విప్ జారీచేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు
తప్పనిసరిగా లోక్‌సభకు హాజరుకావాలని ఆదేశం
#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi, Congress President Mallikarjun Kharge, arrive at the Parliament
The second phase of the budget session of Parliament will commence today and will continue till the 2nd of April pic.twitter.com/GFIWWyVSMG— ANI (@ANI) March 9, 2026


