breaking news
BJP Party
-
భారతీయులకే అవమానం.. సోనియా క్షమాపణలు చెప్పాలిందే: అమిత్ షా
ఢిల్లీ: వందేమాతరం వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ దేశ ప్రజలను అవమానించిందని అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన అవమానాన్ని 140 కోట్ల మంది భారతీయులు కళ్లారా చూశారని అన్నారు. దేశభక్తికి ప్రతీకగా భావించే ‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండించాల్సిన అంశమని ఆయన పేర్కొన్నారు.అసలేం జరిగిందంటే.. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 15 సందర్బంగా శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల జరిగాయి. ఈ సందర్భంగా ‘వందేమాతరం’ పూర్తి రూపాన్ని ఆలపించారు. ఆ సమయంలో సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు వేదికపై ఉన్నారు. వందేమాతరం పాట ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ ఖర్గేతో మాట్లాడటం, కొన్ని సంజ్ఞలు చేయడం కనిపించిన వీడియో బయటకు రావడంతో వివాదం మొదలైంది. బీజేపీ ఆరోపణ ఏమిటంటే.. పూర్తి ‘వందేమాతరం’ ఆలాపనపై సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసి, దాన్ని ఆపేలా సంకేతాలు చేశారని మండిపడుతున్నారు.కాంగ్రెస్ ఏం చెబుతోంది?కాగా, బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పూర్తిగా ఖండించింది. సోనియా గాంధీ పాటను ఆపాలని సూచించలేదని, ఆమె ఖర్గేకు కుర్చీ ఏర్పాటు చేయాలని మాత్రమే సూచించారని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. దీంతో, రాజకీయం దుమారం రేగింది. ఇక్కడ ఒక చారిత్రక అంశం ఉంది. 1937లో కాంగ్రెస్ వందేమాతరం తొలి రెండు చరణాలను మాత్రమే బహిరంగ కార్యక్రమాల్లో పాడే విధానాన్ని అనుసరించింది. అయితే, 2026లో వందేమాతరం పూర్తి రూపంపై కేంద్రం కొత్తగా ప్రాధాన్యత ఇవ్వడంతో, పూర్తి ఆరు చరణాల ఆలాపనపై రాజకీయ చర్చ మళ్లీ మొదలైంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యక్రమంలో పూర్తి రూపం పాడుతున్న సమయంలో సోనియా గాంధీ చేసిన సంజ్ఞల వీడియో బీజేపీ చేతికి రాజకీయ ఆయుధంగా మారింది. బీజేపీ ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ మాత్రం తమ నేతలు వందేమాతరాన్ని అవమానించారనే ఆరోపణను తిరస్కరిస్తోంది. -
బెంగాల్లో మిస్టరీ మరణాలు.. టీఎంసీకి వరుస షాకులు!
బెంగాల్లో అధికారం మారింది.. కానీ రాజకీయ మంటలు మాత్రం చల్లారలేదు! బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత టీఎంసీ నేతలు, కార్యకర్తలపై దాడులు, వరుస మరణాలు, పోలీస్ కస్టడీలో డెత్, అనుమానాస్పద ఘటనలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఒకవైపు “టీఎంసీని టార్గెట్ చేస్తున్నారు” అంటూ మమతా బెనర్జీ పార్టీ ఆరోపిస్తుంటే.. మరోవైపు బీజేపీ “ప్రతి ఘటనను రాజకీయ హింసగా చిత్రీకరిస్తున్నారు” అని కౌంటర్ ఇస్తోంది. ఇంతకీ బెంగాల్లో నిజంగా ఏం జరుగుతోంది? ఎవరు చనిపోయారు? ఎవరి మీద దాడులు జరిగాయి? ఏ కేసుల్లో రాజకీయ కోణం ఉంది? ఏ మరణాల వెనుక అసలు కారణం ఇంకా మిస్టరీగానే ఉంది? అధికార మార్పు తర్వాత బెంగాల్లో చోటుచేసుకున్న కీలక ఘటనల ఇవే..బీజేపీ ప్రభుత్వం అధికారికంగా 2026 మే 9న ఏర్పడింది. సువేందు అధికారి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే మే 4 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే.. ప్రమాణం చేయకముందే పోస్ట్ పోల్ హింస మొదలైంది.1. అభిషేక్ బెనర్జీపై దాడి.. మే 30సోనార్‌పూర్‌లో పోస్ట్-పోల్ హింసలో మరణించిన టీఎంసీ కార్యకర్త సంజు కర్మాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై గుంపు దాడికి దిగింది. రాళ్లు, గుడ్లు, చెప్పులు విసిరారు. ఈ ఘటనలో ఆయన షర్ట్ చిరిగింది, కళ్లజోడు దెబ్బతింది. రక్షణ కోసం హెల్మెట్ ధరించాల్సి వచ్చింది. ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎంసీ దీనిని బీజేపీ మద్దతుదారుల దాడిగా ఆరోపించగా, బీజేపీ మాత్రం స్థానికుల ఆగ్రహంగా పేర్కొంది.2. కల్యాణ్ బెనర్జీపై దాడి.. మే 31అభిషేక్‌పై ఘటన జరిగిన మరుసటి రోజే టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై హూగ్లీ జిల్లా చందీతలలో దాడి జరిగిందని టీఎంసీ ఆరోపించింది. పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే తనపై కఠినమైన వస్తువుతో దాడి జరిగి తలకు గాయమైందని కల్యాణ్ చెప్పారు. బీజేపీ మాత్రం దాడి ఆరోపణలను ఖండించింది.3. బిశ్వజిత్ పట్టనాయక్ మృతి..మే 5న కోల్‌కతాలోని బెలేఘాటాలో టీఎంసీ కార్యకర్త బిశ్వజిత్ పట్టనాయక్ మృతదేహం లభించింది. టీఎంసీ దీనిని బీజేపీ దాడిగా ఆరోపించింది. పోలీసులు మాత్రం మరో కోణం చెప్పారు. కొంతమంది తన కోసం రావడంతో తప్పించుకునే క్రమంలో టెర్రస్ నుంచి పడిపోయి మరణించి ఉండొచ్చని తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగింది. అందువల్ల ఇది “అనుమానాస్పద మరణం”గా చిత్రీకరించబడింది.4. అబీర్ షేక్ హత్య.. మే 5బీర్భూమ్ నానూర్లో టీఎంసీ స్థానిక నేత అబీర్ షేక్ హత్యకు గురయ్యారు. పోలీసులు ఆయన మరో వర్గంతో జరిగిన ఘర్షణలో హత్యకు గురైనట్లు చెప్పారు. టీఎంసీ, కుటుంబ సభ్యులు మాత్రం బీజేపీ కార్యకర్తలే దాడి చేశారని ఆరోపించారు.5. సంజు కర్మాకర్ మరణం..సోనార్పూర్కు చెందిన 40 ఏళ్ల టీఎంసీ కార్యకర్త సంజు కర్మాకర్ మే 5న దాడికి గురై, కొద్దిరోజుల తర్వాత ఆస్పత్రిలో మరణించారని టీఎంసీ ఆరోపించింది. బీజేపీ వర్గాలు, కొందరు స్థానికులు ఆయనకు మెడికల్ ఎమర్జెన్సీ/బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉండొచ్చని, కుటుంబం రాజకీయ హింసపై ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఈ వివాదమే తర్వాత అభిషేక్ బెనర్జీ సోనార్పూర్ పర్యటనకు కారణమైంది.6. సహదేవ్ బాగ్ మృతదేహం.. మే 10హూగ్లీ జిల్లాలోని గోఘాట్‌లో టీఎంసీ పంచాయతీ సభ్యుడు సహదేవ్ బాగ్ మృతదేహం పొలంలో లభించింది. టీఎంసీ దీనిని పోస్ట్-పోల్ రాజకీయ హత్యగా పేర్కొంది. బీజేపీ మాత్రం తమ కార్యకర్తలకు సంబంధం లేదని, వ్యక్తిగత లేదా ఆర్థిక వివాదం కారణం కావచ్చని చెప్పింది. పోలీసులు కూడా రాజకీయ కోణంతో పాటు వ్యక్తిగత/బిజినెస్ వివాదాలన్నింటినీ పరిశీలిస్తున్నామని తెలిపారు.7. మహువా మోయిత్రాపై దాడి.. జూలై 1నదియా జిల్లాలోని కలిగంజ్‌లో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా పార్టీ సమావేశానికి వెళ్లిన సమయంలో ఆమె కార్యాలయం వెలుపల గుంపు నిరసనకు దిగింది. గుడ్లు, బురద, రాళ్లు విసిరారని మహువా ఆరోపించారు. దాదాపు నాలుగు గంటలపాటు తాను కార్యాలయంలో చిక్కుకుపోయానని చెప్పారు. ఆమె 16 మందిపై ఆరోపణలు చేశారు. పోలీసులు మాత్రం పరిస్థితిని అదుపులో ఉంచి, ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని తెలిపారు.8. బరుయిపూర్ ‘ఎన్కౌంటర్’.. జూలై 7ఇది టీఎంసీ నేత మరణం కాదు. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెంగాల్లో జరిగిన తొలి ప్రధాన పోలీస్ ఎన్కౌంటర్ కావడంతో రాజకీయంగా కీలకమైంది. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మండల్‌ను పోలీసులు కాల్చిచంపారు. పోలీసులు అతడు ఆయుధం లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించడంతో ఆత్మరక్షణలో కాల్పులు జరిపామని చెప్పారు. టీఎంసీ దీనిని “జంగిల్ రాజ్”గా విమర్శించగా, బీజేపీ “దైవ న్యాయం”గా అభివర్ణించింది.9. బిర్జు కియోట్ కస్టడీ మరణం..ఇది ప్రస్తుతం అత్యంత సీరియస్‌గా పరిశీలించాల్సిన కేసుల్లో ఒకటి. 48 ఏళ్ల టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్ పోలీస్ కస్టడీలో మరణించారు. కుటుంబం పోలీసు హింస వల్లే మరణించారని ఆరోపించింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా ఘటనపై స్పందిస్తూ, ఆయన పోలీస్ కస్టడీలోనే మరణించిన విషయం స్పష్టంగా ఉందని అన్నారు. అనంతరం దర్యాప్తు అధికారిని విధుల నుంచి తప్పించి, ఇన్స్పెక్టర్ ఇన్‌చార్జ్‌ను కూడా పక్కకు తప్పించి, మేజిస్ట్రియల్ విచారణకు ఆదేశించారు. ఇదే ఘటనపై మాజీ సీఎం మమతా బెనర్జీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఆమె కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు విసిరారని ఆమె ఆరోపించారు. దాడి చేసిన వారి రాజకీయ అనుబంధం మాత్రం స్పష్టంగా నిర్ధారించబడలేదు.10. మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ హత్య.. ఆగస్టు 16ఈరోజు వెలుగులోకి వచ్చిన తాజా షాకింగ్ ఘటన ఇదే. మాజీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మాజీ టీఎంసీ ఎమ్మెల్యే ఆశిష్ బెనర్జీ బీర్భూమ్లోని టీఎంసీ పార్టీ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఇది రాజకీయ హత్య అని ప్రస్తుతం చెప్పడానికి ఆధారం లేదు. మరణానికి అసలు కారణం, ఆత్మహత్యా? ఇతర పరిస్థితులా? అన్నది దర్యాప్తు తర్వాతే స్పష్టమవుతుంది. -
మళ్లీ తెరపైకి అంకిత కేసు.. రాహుల్ దెబ్బతో బీజేపీకి మరో షాక్!
బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.. అంకితా భండారీ హత్య కేసు మరోసారి కమలనాథులను రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నాలుగేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును రాహుల్ గాంధీ మళ్లీ తెరపైకి తీసుకురావడంతో.. ఉత్తరాఖండ్ రాజకీయాల్లో హీట్ పెరిగింది. “ఆ వీఐపీ ఎవరు? ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదు?” అంటూ రాహుల్ నేరుగా ప్రశ్నించడంతో.. బీజేపీపై మరోసారి విమర్శల వర్షం కురుస్తోంది. అసలు అంకితా కేసులో ఆ ‘వీఐపీ’ ఎపిసోడ్ ఏంటి? రాహుల్ ఆరోపణల్లో నిజమెంత? ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌గా మారింది.ఉత్తరాఖండ్‌లో 2022లో పౌరీ గఢ్వాల్లోని వనంతర రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న అంకిత అదృశ్యమైంది. కొన్ని రోజుల తర్వాత ఆమె మృతదేహం కాలువలో లభించింది. ఈ ఘటన అప్పట్లో ఉత్తరాఖండ్‌లో పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. అంకితను హత్య చేయడానికి ముందు.. రిసార్ట్‌కు వచ్చే ఓ ‘వీఐపీ’ అతిథికి ‘ప్రత్యేక సేవలు’ అందించాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చారని దర్యాప్తులో ఆరోపణలు వచ్చాయి. దీనికి అంకిత నిరాకరించడంతోనే ఆమెను హత్య చేశారని ప్రాసిక్యూషన్ కేసు వాదించింది.ఈ కేసులో రిసార్ట్ యజమాని సహా ముగ్గురు నిందితులు అరెస్టయ్యారు. అనంతరం వారు హత్య కేసులో దోషులుగా తేలారు. రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యతో పాటు మరో ఇద్దరు నిందితులకు కోర్టు ఇప్పటికే జీవిత ఖైదు విధించింది. అంటే హత్య కేసులో న్యాయపరమైన తీర్పు వచ్చినా.. ‘ఆ వీఐపీ ఎవరు?’ అనే ప్రశ్న మాత్రం ఇంకా రాజకీయంగా, సామాజికంగా చర్చకు దారితీస్తోంది. అయితే, ఇప్పుడు రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న ప్రశ్న వేరే. “ఆ వీఐపీ ఎవరు? ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?” అనేదే ఆయన ప్రశ్న. అంకిత కుటుంబాన్ని ఢిల్లీలో కలిసిన అనంతరం రాహుల్.. కేసులోని కొన్ని అంశాలపై మరోసారి ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యంగా దర్యాప్తు పూర్తికాకముందే రిసార్ట్‌లోని అంకిత గదిని కూల్చివేయడాన్ని ఆయన అనుమానాస్పదంగా పేర్కొన్నారు.“నాలుగేళ్లు గడిచినా అంకిత కుటుంబం న్యాయం కోసం ఎదురుచూస్తోంది. ఆ ‘వీఐపీ’ని ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది?” అంటూ రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఇక్కడ ఒక కీలక విషయం ఉంది. ‘వీఐపీ’ ఎవరనే అంశంపై రాజకీయ ఆరోపణలు ఉన్నప్పటికీ, దానిని న్యాయస్థానం నిర్ధారించిన వాస్తవంగా చెప్పలేం. ఇప్పటికే దోషులుగా తేలిన ముగ్గురు వ్యక్తులపై కోర్టు తీర్పు వేరుగా ఉంది. ఇప్పుడు అంకితా భండారీ కేసు మరోసారి రాజకీయ వేదికపైకి రావడంతో.. ‘ఆ వీఐపీ ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
48 గంటల మిస్టరీకి తెర.. బీజేపీ నేత దారుణ హత్యతో ఉద్రిక్తత
గుహవటి: అసోంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాదాపు 48 గంటలుగా కనిపించకుండా పోయిన 52 ఏళ్ల బీజేపీ బూత్ అధ్యక్షుడు బికాష్ రంజన్ ధర్ చివరకు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతదేహంగా కనిపించడం కలకలం రేపింది. దీంతో, ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అసోంలోని శ్రీభూమి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ బూత్ అధ్యక్షుడు బికాష్ రంజన్ ధర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. చాగల్మోవా గ్రామానికి చెందిన ధర్ ఆగస్టు 12న తన మోటార్‌సైకిల్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత ఆయనకు కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఆయన కాల్ రికార్డులను పరిశీలిస్తూ నిందితుల వరకు చేరుకున్నారు.శుక్రవారం ఉదయం అసోం-త్రిపుర సరిహద్దుకు సమీపంలోని జోగిచ్ఛరా ప్రాంతంలో ఓ చెరువు వద్ద ధర్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు ఈ హత్యలో నేరుగా పాల్గొన్నట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసుల ప్రకారం, విచారణలో ఒక నిందితుడు ధర్‌ను మాచెటీతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హత్యకు రాజకీయ కారణం ఉందా, లేక వ్యక్తిగత కక్షే కారణమా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రాథమిక దర్యాప్తులో మాత్రం వ్యక్తిగత వైరం కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం..దర్యాప్తు సమయంలో మరో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. నిందితుల్లో ఒకరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పాటు ఓ కానిస్టేబుల్‌పై పదునైన వస్తువుతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా, నిందితుడి ఎడమ కాలికి బుల్లెట్ గాయం అయింది. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.ఆందోళనలు, ఉద్రికత్త..ధర్ మృతదేహం లభ్యమైన వార్తతో చాగల్మోవా, బజారిచెర్రా, పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పలుచోట్ల విధ్వంసం, నిప్పంటించే ఘటనలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని దుకాణాలకు కూడా నిప్పంటించినట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పకుండా జిల్లా యంత్రాంగం BNSS సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో అసలు హత్యకు కారణం ఏమిటి? ఆరుగురు నిందితుల పాత్ర ఎంతవరకు ఉంది? రాజకీయ కోణం ఏమైనా ఉందా? అన్న ప్రశ్నలకు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమైన సమాధానం లభించనుంది. -
బీజేపీకి వార్నింగ్ బెల్స్.. సీఎం కుర్చీకే ముప్పు?
బీహార్ రాజకీయాల్లో ఒక్క ఉప ఎన్నిక.. ఎన్నో ప్రశ్నలకు తెరతీసింది. మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో ఆ పార్టీని ఓడిస్తూ జన సురాజ్ అధినేత ప్రశాంత్ కిశోర్ సాధించిన విజయం ఇప్పుడు బీజేపీ శిబిరంలో చర్చకు దారితీసింది. మరీ ముఖ్యంగా.. ఈ విజయాన్ని ముందుగానే బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి నాయకత్వంపై రెఫరెండంగా చిత్రీకరించిన పీకే.. ఫలితం వచ్చిన తర్వాత కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. దీంతో అసలు టార్గెట్ బంకీపూర్ సీటా? లేక బీహార్‌లో బీజేపీ నాయకత్వమా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.బంకీపూర్ అంటే బీజేపీకి సాధారణ నియోజకవర్గం కాదు. 1995 నుంచి వరుసగా ఆ పార్టీ గెలుస్తూ వచ్చిన బలమైన కోట. నితిన్ నబీన్ ఈ సీటును ఐదుసార్లు గెలిచారు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎదిగి రాజ్యసభకు వెళ్లడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. పార్టీకి అంత బలమైన సీటు కావడంతో.. మొదట బీజేపీ వర్గాల్లో ఈ ఎన్నికను పెద్ద సవాలుగా భావించలేదు. పైగా బీజేపీ శిబిరం పోటీని ‘నో కాంటెస్ట్’ అన్నంత ధీమాతో చూసింది. కానీ రంగంలోకి దిగిన వ్యక్తి ప్రశాంత్ కిశోర్. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన సురాజ్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన పరిస్థితి నుంచి.. తన తొలి ప్రత్యక్ష ఎన్నికల పోరులోనే బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టడం రాజకీయంగా పీకేకు భారీ బూస్ట్‌గా మారింది.అసలు ట్విస్ట్ ఇక్కడే..ఎన్నికలకు ముందే పీకే బంకీపూర్ పోరును కేవలం ఎమ్మెల్యే ఎన్నికగా చూడలేదు. సామ్రాట్ చౌదరి నాయకత్వంపై రెఫరెండంగా ప్రచారం చేశారు. బీజేపీ గెలిస్తే అది సీఎం నాయకత్వానికి ప్రజల ఆమోదంగా భావించాలని వ్యాఖ్యానించారు. అంటే.. ఎన్నిక ఫలితం తనకు అనుకూలంగా వస్తే దాన్ని నేరుగా సామ్రాట్ చౌదరి నాయకత్వానికి వ్యతిరేక తీర్పుగా మలుచుకోవాలన్నది పీకే వ్యూహం. దీంతో, ఇప్పుడు పీకే అడుగులు బంకీపూర్ దాటి.. నేరుగా సీఎం వైపు పడుతున్నాయి. ఎన్నికల ఫలితం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి బీహార్‌కు ‘సామర్థ్యం, సత్ప్రవర్తన ఉన్న’ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా కూడా సామ్రాట్ చౌదరినే రాజకీయంగా టార్గెట్ చేస్తూ విమర్శలు కొనసాగిస్తున్నారు.అయితే ఇక్కడ బీజేపీకి మరో చిక్కు ఉంది. బంకీపూర్ ఓటమి కేవలం సీఎం చౌదరికి సంబంధించినదేనా? లేక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ వ్యక్తిగత కంచుకోట కోల్పోవడమా? అనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు రెండో కోణాన్నీ బలంగా ప్రస్తావిస్తున్నారు. ఈ ఓటమి సామ్రాట్ కంటే నితిన్ నబిన్ కుటుంబానికి, మూడు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంపై ఉన్న పట్టు కోల్పోవడానికే ఎక్కువ సంకేతమని అభిప్రాయం వ్యక్తమైంది. ఎందుకంటే బంకీపూర్‌లో గెలిచింది మరో సంప్రదాయ పార్టీ ఆర్జేడీనో లేక కాంగ్రెస్ పార్టీనో కాదు. 2025 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన జన సురాజ్ పార్టీ. ఆ పార్టీ అధినేతగా పీకే స్వయంగా బరిలోకి దిగి.. బీజేపీకి చెందిన అత్యంత సురక్షితమైన పట్టణ నియోజకవర్గాన్ని చేజిక్కించుకున్నారు. ఇది జన సురాజ్‌కు ఒక సీటు మాత్రమే కాదు.. ‘బీజేపీకి ప్రత్యామ్నాయం కావచ్చు’ అనే రాజకీయ సందేశాన్ని పరీక్షించుకునే తొలి పెద్ద అవకాశంగా మారింది.ఆర్జేడీకి ఝలక్..మరో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే.. ఇక్కడ మరో పెద్ద రాజకీయ ట్విస్ట్ కూడా ఉంది. పీకే దెబ్బ బీజేపీతోనే ఆగలేదు. బంకీపూర్‌లో ఆర్జేడీ కూడా వెనుకబడింది. ఆ పార్టీ సంప్రదాయ ముస్లిం-యాదవ్ ఓటు బ్యాంక్‌లో కొంత భాగం జన సురాజ్ వైపు మళ్లిందన్న విశ్లేషణలు వచ్చాయి. ఈ ఓటమి తర్వాత ఆర్జేడీ తన సంస్థాగత వ్యవస్థపై పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే.. పీకే ఇప్పుడు బీజేపీ, ఆర్జేడీ రెండింటికీ మధ్యలోకి వచ్చి కొత్త రాజకీయ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.అయితే. పీకే గెలిచింది ఒక సీటు మాత్రమే కావచ్చు.. కానీ ఆయన గెలిచిన చోటు మాత్రం బీజేపీకి అత్యంత బలమైన కోట. ఇప్పుడు ఆ విజయాన్ని పీకే రాష్ట్రవ్యాప్త రాజకీయ ప్రచారంగా మలిస్తే? ఉద్యోగాలు, విద్య, అవినీతి, పాలన వంటి అంశాలతో యువతను ఆకర్షించగలిగితే? సంప్రదాయ కుల సమీకరణాలకు అతీతంగా ఓటర్లను కూడగట్టగలిగితే? అప్పుడు బీహార్‌లో పోటీ కేవలం బీజేపీ వర్సెస్ ఆర్జేడీగా ఉండకపోవచ్చు. మూడో శక్తిగా జన సురాజ్ ఎదగడం మొదలైతే.. అది ఎన్డీఏకే కాకుండా మొత్తం బీహార్ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంటుంది. -
ప్రభుత్వం మారితే సరిపోదు.. అదే నాకు బహుమతి: వాంగ్‌చుక్
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కేవలం ప్రభుత్వాలు మారడం సరిపోదని.. దేశ రాజకీయ వ్యవస్థలోనే మౌలిక మార్పులు రావాలని ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. దేశానికి ఇప్పుడు ఒక ‘శాంతియుత విప్లవం’ అవసరమని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధికి విద్యే పునాది అని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రాకుండా దేశం ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో వాంగ్‌చుక్ భారత్ భవిష్యత్తుపై తన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఒకప్పుడు భారత్‌తో సమానంగా లేదా వెనుకబడి ఉన్న థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు నేడు వేగంగా ముందుకు దూసుకెళ్లాయని ఆయన గుర్తుచేశారు. ‘ఇదే వేగంతో కొనసాగితే 2047 నాటికి భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమవుతుంది’ అని ఆయన హెచ్చరించారు.విద్య వెనుకబడితే.. దేశ అభివృద్ధికి విద్యే పునాది అని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రాకుండా దేశం ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నారు. ఇటీవల మార్పు కోసం ప్రజలు చేపట్టిన ఆందోళనలను ప్రస్తావించిన ఆయన.. కొన్ని సందర్భాల్లో మంత్రుల రాజీనామాలు జరిగినా, కేవలం వ్యక్తుల మార్పుతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఇదే సమయంలో తన విమర్శలు ఏ ఒక్క రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రజల గొంతుకలను అణచివేస్తున్నారనే ఆరోపణలు వివిధ ప్రభుత్వాలపై వస్తున్నాయని అన్నారు.2012-13లో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని గుర్తుచేస్తూ.. ఆ ఉద్యమం తర్వాత ప్రభుత్వం మారినా అవినీతి, అన్యాయం పూర్తిగా అంతం కాలేదని వ్యాఖ్యానించారు. సమస్యలు ఇప్పుడు మరో రూపంలో మరింత పెద్దవిగా కనిపిస్తున్నాయని అన్నారు. భారత్ రాజకీయ వ్యవస్థలో ప్రధాన సమస్య నాయకులను ఎన్నుకునే విధానమే అంటూ తన అభిప్రాయపడ్డారు. నాయకులు సరైనవారు కాకపోతే.. మొత్తం దేశమే తప్పుదారి పడుతుందని.. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్యపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.THIS INDIPENDENCE DAY, I NEED YOUR HELP...This country needs a peaceful revolution, at least in how we chose our leaders... if we are to remain even a respectable nation by 2047.Close to half of our MPs have criminal cases and a third have serious charges like murder, rape &… pic.twitter.com/10byPuzwtX— Sonam Wangchuk (@Wangchuk66) August 13, 2026అదే నాకు బహుమతి.. అయితే తాను అధికార పార్టీని కానీ, ప్రతిపక్షాన్ని కానీ లక్ష్యంగా చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘ఇది ఏ పార్టీ సమస్య కాదు.. దేశ సమస్య’ అని వ్యాఖ్యానించారు. దేశానికి కొత్త రాజకీయ దిశను చూపించగల వ్యక్తులను గుర్తించేందుకు ప్రజల సహకారం కోరారు. కేవలం మేధావులు మాత్రమే కాకుండా.. నిస్వార్థంగా పనిచేసే, మంచి వ్యక్తిత్వం కలిగిన, సూత్రాలకు కట్టుబడి ఉండే వ్యక్తులు కావాలని అన్నారు. దేశవ్యాప్తంగా అలాంటి వ్యక్తుల పేర్లను ప్రజలు సూచించాలని ఆయన కోరారు. వివిధ రాష్ట్రాలు, నగరాల్లో పర్యటించి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సూచనలు సేకరించనున్నట్లు తెలిపారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి నాకు ఇవ్వగలిగే ఉత్తమ బహుమతి.. అలాంటి మంచి వ్యక్తుల పేర్లను సూచించడమే అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. -
సీజేపీ దాస్ ఇంటికి పోలీసులు.. బీజేపీ ప్లాన్ మార్చిందా?
పుదుచ్చేరిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కుటుంబ సభ్యుల ఇంటికి పోలీసులు వెళ్లడం వివాదానికి దారితీసింది. పోలీసులు తమ కుటుంబాన్ని ప్రశ్నల పేరుతో భయబ్రాంతులకు గురిచేశారని దాస్ ఆరోపించగా.. పోలీసు శాఖ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో చేపట్టే సాధారణ భద్రతా చర్యల్లో భాగంగానే ఇంటికి వెళ్లామని స్పష్టం చేసింది.పోలీసులు తమ కుటుంబం వద్దకు వచ్చి రకరకాల ప్రశ్నలు అడిగారని దాస్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఇది కేవలం సాధారణ విచారణ కాదని, తనను మౌనం చేయించేందుకు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న చర్యగా ఆయన అభివర్ణించారు. పుదుచ్చేరిలో బీజేపీ ప్రభుత్వం తన కుటుంబాన్ని ఎందుకు భయపెడుతోందని దాస్ ప్రశ్నించారు. ఈ చర్య వెనుక కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయా? అసలు ఇలాంటి విచారణకు చట్టపరమైన ఆధారం ఏమిటని నిలదీశారు. తనను బెదిరించి మౌనం చేయించాలని చూస్తే అది సాధ్యం కాదని, ఇలాంటి చర్యలు తమ పోరాట సంకల్పాన్ని మరింత బలపరుస్తాయని అన్నారు.అంతేకాదు, రెండు రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుదుచ్చేరికి వచ్చి అక్కడి హోంమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్‌తో సమావేశమైన విషయాన్ని కూడా దాస్ ప్రస్తావించారు. ఆ సమావేశంలోనే తన కుటుంబాన్ని సందర్శించే నిర్ణయం తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. అయితే, పోలీసుల వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. దాస్ బంధువుల ఇంటికి పోలీసులు వెళ్లిన విషయం నిజమేనని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కానీ ఇందులో ఎలాంటి వేధింపులు, బెదిరింపులు లేవని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం వంటి ముఖ్యమైన రోజులకు ముందు భద్రతా చర్యల్లో భాగంగా కీలక మార్గాల సమీపంలో నివసించే ప్రజల ఇళ్లను పోలీసులు సందర్శించడం సాధారణమేనని చెప్పారు.#Alert🚨Two hours ago, the Pondicherry Police showed up at my family’s home and subjected them to all kinds of questioning. Why this harassment, @PuducheryPolice? Who ordered this and for what purpose? Is this the legal procedure? Why is the BJP government in Pondicherry…— Saurav Das (@SauravDassss) August 12, 2026ముఖ్యమైన రూట్లకు సమీపంలో నివసించే ప్రజలను కలిసి కొన్ని వివరాలు తెలుసుకోవడం, భద్రతకు సంబంధించిన సాధారణ ప్రశ్నలు అడగడం పోలీసుల రొటీన్ ప్రక్రియలో భాగమని అధికారి వివరించారు. దీంతో ఒకే ఘటనపై రెండు భిన్నమైన వాదనలు తెరపైకి వచ్చాయి. దాస్ మాత్రం దీన్ని రాజకీయ బెదిరింపుగా చూస్తుండగా.. పోలీసులు మాత్రం స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు చేపట్టే సాధారణ భద్రతా తనిఖీల్లో భాగమని చెబుతున్నారు. ఇక దాస్ చేసిన వ్యాఖ్యలు పుదుచ్చేరి రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా అమిత్ షా పర్యటనను ఈ ఘటనతో ముడిపెడుతూ ఆయన ప్రశ్నలు లేవనెత్తడంతో రాజకీయ కోణం కూడా తెరపైకి వచ్చింది. ఈ విషయం ఇప్పుడు పుదుచ్చేరిలో హాట్ టాపిక్‌గా మారింది. -
రాజ్యసభలో ‘లుంగీవాలా’ దుమారం.. బీజేపీ ఎంపీపై ఆగ్రహం
న్యూఢిల్లీ: పార్లమెంట్ వేదికగా మరోసారి ప్రాంతీయ గుర్తింపు, సంస్కృతి అంశం రాజకీయ దుమారం రేపింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్ చేసిన ‘లుంగీవాలా’ వ్యాఖ్యలపై కేరళకు చెందిన సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను లక్ష్యంగా చేసుకుని ఈ పదాన్ని ఉపయోగించారని ఆరోపించిన బ్రిట్టాస్.. ఇది వ్యక్తిగత వ్యాఖ్యగా చూడలేమని, దక్షిణ భారతీయుల సాంస్కృతిక గుర్తింపును కించపరిచే ప్రయత్నంగా భావించాల్సి ఉంటుందని అన్నారు. ఈ వ్యవహారంపై ఆయన ప్రత్యేక హక్కుల నోటీసు కూడా ఇచ్చారు.రాజ్యసభలో బుధవారం ఉదయం సభ ప్రారంభమైన తర్వాతే ఈ అంశం వేడెక్కింది. బ్రిట్టాస్ తనపై ‘లుంగీవాలా’ అనే పదాన్ని ఉపయోగించడంపై సభ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష సభ్యులు ఆయనకు మద్దతుగా నిలవగా.. అధికార పక్ష సభ్యులు మాత్రం సుస్మితా దేవ్ వాదనను కూడా సభ వినాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో సభలో కొంతసేపు తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. బ్రిట్టాస్ అభ్యంతరం కేవలం తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య వరకే పరిమితం కాలేదు. ప్రాంతం, భాష, సంప్రదాయ దుస్తులను ఆధారంగా చేసుకుని పార్లమెంట్లో ఒక సభ్యుడిని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన వాదించారు. ‘లుంగీవాలా’ అనే పదం దక్షిణ భారత ప్రజలను ఒక రకమైన సాంస్కృతిక మూసలో చూపించేందుకు చారిత్రకంగా ఉపయోగించబడిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అదే పదాన్ని పార్లమెంట్లో ఉపయోగించడం ద్వారా ప్రాంతీయ గుర్తింపును అవమానించే పరిస్థితి ఏర్పడుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు.#WATCH | Delhi: On BJP MP Sushmita Dev, CPI(M) MP John Brittas says, "... The other day, while I was speaking in the house, she made a derogatory remark, lungi wala, against me. I was wearing a dhoti, and I am proud to be a Malayali, proud to be a South Indian. And these are all… pic.twitter.com/tZqFwLa2Bq— ANI (@ANI) August 12, 2026“లుంగీ ధరించడం తప్పా? ఒకరి సంప్రదాయ దుస్తులు రాజకీయ విమర్శలకు ఆయుధంగా మారాలా?” అన్న ప్రశ్నను బ్రిట్టాస్ లేవనెత్తినట్టుగా నివేదికలు పేర్కొంటున్నాయి. దక్షిణ భారతదేశంలో లుంగీ ఒక సాధారణ సంప్రదాయ వస్త్రమని, దాన్ని అవహేళనకు ఉపయోగించడం ప్రాంతీయ వివక్షకు దారితీస్తుందని ఆయన వాదించారు. ఈ నేపథ్యంలోనే బ్రిట్టాస్ ప్రివిలేజ్ నోటీసు ఇవ్వడం ఈ వివాదానికి మరింత ప్రాధాన్యత తెచ్చింది. పార్లమెంట్ సభ్యుడి గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు జరిగాయా? సభా మర్యాదలకు అవి విరుద్ధమా? అన్న అంశాలు ఇప్పుడు చర్చకు వచ్చాయి. ప్రత్యేక హక్కుల అంశంపై తదుపరి చర్యలు సభా నిబంధనల ప్రకారం నిర్ణయించాల్సి ఉంటుంది.మరోవైపు అధికార పక్షం మాత్రం వెంటనే ఏకపక్ష నిర్ణయం తీసుకోకూడదని సూచించింది. సుస్మితా దేవ్ వాదనను కూడా పూర్తిగా వినిన తర్వాతే ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని అధికార పక్ష సభ్యులు కోరారు. దీంతో ఇది కేవలం ‘ఒక పదం’పై వివాదమా? లేక పార్లమెంటరీ ప్రవర్తన, ప్రాంతీయ గౌరవం, సభ్యుల హక్కులకు సంబంధించిన అంశమా? అన్న చర్చ మొదలైంది. ఇక్కడ మరో అంశం కూడా ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ అనేది దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే వేదిక. కేరళ నుంచి వచ్చిన ఒక ఎంపీని ఆయన దుస్తులు లేదా ప్రాంతీయ గుర్తింపుతో సంబోధించడం సముచితమా? అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యవహారంలో తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఒక ‘లుంగీ’ పదంతో మొదలైన వివాదం.. ఇప్పుడు ప్రాంతీయ గౌరవం, పార్లమెంటరీ మర్యాద, ఎంపీల హక్కుల వరకు వెళ్లింది. రాజ్యసభలో ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.CPI(M) MP John Brittas raises 'Lungiwala' remark made against him in Rajya Sabha.Chairman advises members to be careful and not hurt the sentiments and feelings of fellow MPs, says our culture is unique and inclusive. pic.twitter.com/w87tDizx1M— News Arena India (@NewsArenaIndia) August 12, 2026 -
బీజేపీకి బిగ్ షాక్.. ‘ఎయిర్‌పోర్టుకు పడవలు వస్తాయా?’
నోయిడా: ఆకాశంలో ఎగరాల్సిన విమానాశ్రయం.. వర్షం పడితే నీట మునిగింది. ప్రారంభించి ఐదు నెలలు కూడా పూర్తికాకముందే రూ.11,200 కోట్లతో నిర్మించిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ వర్షానికి టెర్మినల్-పార్కింగ్ మార్గంలో నీరు నిలిచిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దీంతో ‘అభివృద్ధి మోడల్’గా ప్రచారం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఇది ఊహించని ఎదురుదెబ్బగా మారింది.మంగళవారం గ్రేటర్ నోయిడాలో భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు జేవర్‌లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి వెళ్లే మార్గం నీటితో నిండిపోయింది. ప్రయాణికులు, వాహనాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటిని తొలగించేందుకు ఎయిర్‌పోర్టు సిబ్బంది రంగంలోకి దిగిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో రాజకీయ దుమారం మొదలైంది. భారీ పెట్టుబడులు, ఆధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన విమానాశ్రయంగా ప్రచారం పొందిన ప్రాజెక్టులో.. ఒక్క భారీ వర్షం పడితే నీరు నిలిచిపోవడమేంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధించారు.Heavy rainfall today caused severe waterlogging at Noida International Airport in Uttar Pradesh, India. The airport was inaugurated by Prime Minister Narendra Modi on March 28, 2026. pic.twitter.com/mVu12u7B7Z— Weather Monitor (@WeatherMonitors) August 11, 2026విమర్శలకు తోడు రాజకీయ కౌంటర్లు కూడా మొదలయ్యాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నేరుగా బీజేపీపై సెటైర్ వేశారు. “ఇక విమానాశ్రయంలో పడవలు నడుస్తాయా?” అంటూ ఎక్స్‌లో ప్రశ్నించారు. బీజేపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. అయితే ఎయిర్‌పోర్టు యాజమాన్యం మాత్రం ఈ ఘటనపై వివరణ ఇచ్చింది. తక్కువ వ్యవధిలో అత్యంత భారీ వర్షపాతం నమోదవడంతో టెర్మినల్, పార్కింగ్ ప్రాంతాన్ని కలిపే మార్గంలోకి వర్షపు నీరు వచ్చిందని తెలిపింది. తమ సిబ్బంది వెంటనే స్పందించి 30 నిమిషాల్లోపే నీటిని తొలగించారని వెల్లడించింది.నీరు నిలిచిన సమయంలో ప్రయాణికులు, వాహనాల రాకపోకలను ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లించారు. ప్రయాణికులను నేరుగా కర్బ్ వద్ద పికప్, డ్రాప్ చేసుకునే అవకాశం కల్పించారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. విమానాలు ఆగిపోయాయా లేదా అన్నది ఒక విషయం.. నీరు ఎందుకు నిలిచింది అన్నది మరో విషయం. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంలో వర్షపు నీటి నిర్వహణ వ్యవస్థ ఎంత సమర్థంగా ఉంది? భవిష్యత్తులో ఇంతకంటే భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.మరోవైపు సోషల్ మీడియాలో కొందరు ఈ ఘటనను వ్యంగ్యంగా తీసుకున్నారు. “ఇది ఎయిర్‌పోర్టా.. స్విమ్మింగ్ పూలా?” అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు మాత్రం ఒక్క ఘటన ఆధారంగా మొత్తం ప్రాజెక్టును తప్పుబట్టడం సరికాదని అంటున్నారు. వాస్తవానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది స్పందించి తక్కువ సమయంలోనే నీటిని తొలగించడంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 28, 2026న విమానాశ్రయాన్ని ప్రారంభించారు. తొలి దశ నిర్మాణానికి సుమారు రూ.11,200 కోట్లు ఖర్చయ్యాయి. అయితే రెగ్యులర్ కమర్షియల్ విమాన కార్యకలాపాలు జూన్ 15 నుంచి ప్రారంభమయ్యాయి.Noida International Airport amidst Heavy rains today🚨 #DelhiRains pic.twitter.com/rp0Ur3jaed— Mumbai Nowcast (@s_r_khandelwal) August 11, 2026 -
బీజేపీకి టెన్షన్.. బంకీపూర్‌కు పీకే బంపరాఫర్
బీహార్‌లో మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్‌ను బద్దలు కొట్టిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు ఆ పార్టీకి మరో టెన్షన్ మొదలుపెట్టారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే 10 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తానంటూ ప్రకటించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. “మీ పిల్లల సీవీలు, బయోడేటాలు పంపండి.. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తా” అంటూ ఆయన ఇచ్చిన పిలుపు.. ఓవైపు యువతలో కొత్త ఆశలు రేపుతుండగా, మరోవైపు బీజేపీకి ఇది కొత్త రాజకీయ సవాలుగా మారే అవకాశముందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా బీజేపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ప్రాంతంలో గెలిచి.. అదే నియోజకవర్గంలో ఉద్యోగాలు, అభివృద్ధిని అజెండాగా ముందుకు తీసుకెళ్లడం కమలనాథులకు టెన్షన్ పెంచే అంశంగా మారింది.బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన ప్రశాంత్ కిషోర్.. ఆగస్టు 3న జరిగిన ఉపఎన్నికలో తనపై నమ్మకం ఉంచిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. జన సురాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన.. దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో అనూహ్య విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. ఈ ఫలితంతో బంకీపూర్‌లో బీజేపీకి ఉన్న దాదాపు 30 ఏళ్ల ఆధిపత్యానికి బ్రేక్ పడింది.బయోడేటా పంపండి..విజయం తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్.. తాను ప్రజలకు దూరంగా ఉన్నానంటూ వస్తున్న విమర్శలకు కూడా సమాధానం ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఐదు, ఆరు రోజులుగా నియోజకవర్గంలో కనిపించలేదని కొందరు విమర్శిస్తున్నారని, కానీ తాను ఎక్కడికీ వెళ్లడం లేదని చెప్పారు. “నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. మీ కోసం పనిచేస్తున్నాను” అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు. బంకీపూర్‌లో చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేని యువత కుటుంబాలు తమ పిల్లల CVలు, బయోడేటాలను తన కార్యాలయానికి పంపాలని కోరారు. దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలు, వ్యక్తులతో తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించి అర్హత ఉన్న యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లభించేలా ప్రయత్నిస్తానని తెలిపారు.జనసూరజ్ ఎజెండా.. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాత్రం తాను హామీ ఇవ్వలేనని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసం కొంతమంది యువత ప్రారంభంలో బీహార్ వెలుపలికి వెళ్లాల్సి రావచ్చని కూడా చెప్పారు. అయినప్పటికీ వచ్చే ఒకటి నుంచి రెండేళ్లలో కనీసం 10 వేల కుటుంబాల పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించడం తన లక్ష్యమని ప్రకటించారు. ఇది కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన హామీగా కాకుండా.. భవిష్యత్తులో బీహార్‌లో జన సురాజ్ పార్టీ రాజకీయ అజెండాకు సంకేతంగా కూడా కనిపిస్తోంది. జన సురాజ్ పార్టీ బీహార్‌లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలోనే తగినన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించి.. యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు ప్రయత్నిస్తామని కిషోర్ చెప్పారు.బంకీపూర్ అభివృద్ధిపై కూడా ఆయన గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన నియోజకవర్గం ఒక్క రాత్రిలో బెంగళూరుగా మారిపోదని, అయితే రెండు మూడు నెలల్లోనే కనిపించే మార్పులు మొదలవుతాయని చెప్పారు. ఉద్యోగాలతో పాటు విద్య, నెలకు రూ.1,100 పెన్షన్, ఆహార ధాన్యాల పంపిణీ వంటి అంశాలను కూడా నియోజకవర్గంలోని తన ప్రాధాన్యతలుగా పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు అందరి చూపూ 10 వేల ఉద్యోగాల హామీపైనే ఉంది. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఉద్యోగాల నియామక హామీ కాదు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తన వ్యక్తిగత, రాజకీయ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తానన్న హామీ. అందుకే ఆయన కార్యాలయానికి ఎన్ని సీవీలు వస్తాయి? వాటిలో ఎంతమందికి నిజంగా ఉద్యోగాలు దక్కుతాయి? అన్నదే కీలకం. -
జెన్‌జీ ఎఫెక్ట్‌తో కొత్త పార్టీ.. నేతాజీ వారసుడి సంచలన ప్రకటన
నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు మరోసారి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నేతాజీ మనవడి తరానికి చెందిన చంద్ర కుమార్ బోస్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో తన రాజకీయ ప్రయాణాన్ని ముగించిన ఆయన.. ఇప్పుడు ‘ఆజాద్ హింద్ పార్టీ’ పేరుతో సొంత రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన జెన్-జెడ్ యువత నిరసనలు తనకు స్ఫూర్తినిచ్చాయని చంద్ర కుమార్ బోస్ చెబుతున్నారు. దేశంలో యువతలో పెరుగుతున్న అసంతృప్తికి రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన.. దేశంలో అవినీతి విస్తృతంగా పెరిగిపోయిందని ఆరోపించారు. రాజకీయాలు మాత్రమే కాకుండా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు వంటి రంగాల్లోనూ అవినీతి వ్యవస్థలో భాగమైందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు, పాలనా వ్యవస్థలు, ఇతర సంస్థలపై యువతలో అసంతృప్తి పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. తమ హక్కుల కోసం పోరాడేందుకు యువతకు ప్రత్యేక రాజకీయ వేదిక అవసరమని అన్నారు. అలాంటి పరిస్థితుల్లోనే నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ స్ఫూర్తితో ‘ఆజాద్ హింద్ పార్టీ’ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.బీజేపీ నుంచి టీఎంసీ.. ఇప్పుడు సొంత పార్టీచంద్ర కుమార్ బోస్ రాజకీయ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే ఉంది. 2016లో ఆయన బీజేపీలో చేరారు. దాదాపు ఏడేళ్ల పాటు ఆ పార్టీలో కొనసాగారు. తనకు బీజేపీ నాయకత్వం ‘ఆజాద్ హింద్ మోర్చా’ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, దానికి తానే నాయకత్వం వహిస్తానని భావించానని బోస్ తెలిపారు. అయితే ఏడేళ్లు ఎదురుచూసినా ఆ వేదిక ఏర్పడలేదని, అందుకే బీజేపీని వీడాల్సి వచ్చిందని చెప్పారు. 2023లో బీజేపీకి రాజీనామా చేసిన ఆయన.. అనంతరం 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరారు. నేతాజీ సిద్ధాంతాలపై పనిచేసేందుకు టీఎంసీ తనకు అవకాశం ఇచ్చిందని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. అయితే టీఎంసీలో ఆయన ప్రయాణం కూడా ఎక్కువ కాలం సాగలేదు. వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆ పార్టీకి రాజీనామా చేశారు.నేతాజీ సిద్ధాంతాలే పునాది?కొత్త పార్టీకి యువతే ప్రధాన బలంగా ఉండాలని బోస్ భావిస్తున్నారు. ప్రగతిశీల, సమగ్ర, లౌకిక భావజాలం ఉన్న యువతను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్నారు. నేతాజీ రాజకీయ ఆలోచనల్లోని జాతీయవాదం, సమగ్రత, మత సామరస్యం, దేశ నిర్మాణం వంటి అంశాలను కొత్త రాజకీయ వేదిక ద్వారా ముందుకు తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు.పేరు నేతాజీది.. ఓట్లు యువతవేనా?ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే. నేతాజీ పేరు, యువతలో ఉన్న అసంతృప్తి, అవినీతిపై వ్యతిరేకత.. ఈ మూడు అంశాలను కలిపి చంద్ర కుమార్ బోస్ ఒక కొత్త రాజకీయ శక్తిగా మార్చగలరా?. బీజేపీ, టీఎంసీ వంటి ప్రధాన పార్టీల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉన్నప్పటికీ.. సొంత పార్టీని నిర్మించడం మాత్రం పూర్తిగా భిన్నమైన సవాలు. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బలమైన కేడర్, నాయకత్వం, ఆర్థిక వనరులు, స్పష్టమైన విధానాలు, ఎన్నికల్లో పోటీ చేసే సామర్థ్యం ఇవన్నీ కొత్త పార్టీకి అవసరం. అందుకే ‘ఆజాద్ హింద్ పార్టీ’ ప్రకటన కేవలం మరో రాజకీయ పార్టీ ఆవిర్భావమా? లేక యువత అసంతృప్తికి కొత్త రాజకీయ చిరునామాగా మారుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
‘ప్యూర్ పెట్రోల్ కావాలంటారా?’.. బీజేపీ ఎంపీ షాకింగ్ వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌పై దుమారం కొనసాగుతున్న వేళ.. బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడాన్ని వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ప్యూర్ పెట్రోల్ మీ నాన్న ఇంటి నుంచి వస్తుందా?” అంటూ ప్రశ్నించిన మిశ్రా.. దేశంలో క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడుతున్న పరిస్థితుల్లో ఇథనాల్ బ్లెండింగ్ అవసరమేనని సమర్థించారు.మధ్యప్రదేశ్‌లోని రేవా ఎంపీ అయిన జనార్దన్ మిశ్రా.. ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని గట్టిగా సమర్థించారు. భారత్ తనకు అవసరమైన ముడి చమురులో దాదాపు 80 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో దేశీయంగా అవసరమైన ముడి చమురులో సుమారు 20 శాతం మాత్రమే ఉత్పత్తి అవుతోందని మిశ్రా అన్నారు. మిగిలిన 80 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని చెప్పారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, చమురు రవాణాలో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా భారత్‌కు క్రూడ్ ఆయిల్ చేరేందుకు ట్యాంకర్లు అదనంగా వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు.ఈ పరిస్థితుల్లో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని మిశ్రా విమర్శించారు. “ఇథనాల్ వద్దు.. ప్యూర్ పెట్రోల్ కావాలి” అంటూ ఉద్యమం చేస్తున్నారు. కానీ ప్యూర్ పెట్రోల్ మీ నాన్న ఇంటి నుంచి వస్తుందా? దేశంలో ప్యూర్ పెట్రోల్ లేకపోతే అది ఎక్కడి నుంచి వస్తుంది?” అంటూ ఆయన ప్రశ్నించారు.బ్రెజిల్‌ను ఉదాహరణగా చూపిన ఎంపీఇదే సమయంలో ఇథనాల్ వినియోగంలో బ్రెజిల్‌ను మిశ్రా ఉదాహరణగా ప్రస్తావించారు. అక్కడ వాహనాలు అధిక శాతం ఇథనాల్‌తో నడుస్తున్నాయని చెప్పారు. భారత్‌లోనూ ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో వాహనాలు నడపగల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ఇథనాల్ వినియోగం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయని వస్తున్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. భారత్‌లో నిపుణులు నిర్వహించిన పరీక్షల్లో ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఇంజిన్‌కు అసాధారణ నష్టం జరుగుతున్నట్లు తేలలేదని ఆయన అన్నారు.E20పై అసలు వివాదమేంటి?పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్‌పై ఆధారపడటం తగ్గడంతో పాటు దేశీయంగా ప్రత్యామ్నాయ ఇంధనాల ఉత్పత్తి పెరుగుతుందని కేంద్రం చెబుతోంది. అయితే E20 వల్ల మైలేజీ తగ్గడం, వాహనాల పనితీరుపై ప్రభావం, ఇంజిన్‌కు దీర్ఘకాలిక నష్టం వంటి అంశాలపై వాహనదారుల్లో ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనార్దన్ మిశ్రా చేసిన “మీ నాన్న ఇంటి నుంచి వస్తుందా?” వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీశాయి. ఇథనాల్‌పై కేంద్రం విధానం ఒకవైపు.. వినియోగదారుల ఆందోళనలు మరోవైపు.. ఈ నేపథ్యంలో E20పై వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. -
బీజేపీలో ఆయనే నా ఫేవరేట్.. ‘హలో అంకుల్’ అంటూ రాహుల్..
న్యూఢిల్లీ: రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సహజం. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. బీజేపీలో తనకు ఇష్టమైన నాయకుడు ఎవరో చెబుతూ.. మాజీ పంజాబ్ ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ పేరును రాహుల్‌గాంధీ ప్రస్తావించారు.ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ కార్యక్రమంలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ రాహుల్‌గాంధీ.. అమరీందర్ సింగ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. ‘‘ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన చాలా కూల్. సైనిక చరిత్రపై ఆయనకు మంచి పట్టు ఉంది. హలో అంకుల్ అమరీందర్’’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. జెన్ జెడ్, విద్యార్థులతో మరింతగా మమేకమయ్యేందుకు రాహుల్‌గాంధీ ఈ ఇన్స్టాగ్రామ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే అమరీందర్ సింగ్‌పై చేసిన వ్యాఖ్య వైరల్‌గా మారింది.రాహుల్ వ్యాఖ్యలపై అమరీందర్ సింగ్ కూడా స్పందించారు. తన గురించి రాహుల్‌గాంధీ మంచి మాటలు చెప్పడం సంతోషంగా ఉందన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీలను చిన్నప్పటి నుంచే తనకు తెలుసని గుర్తుచేశారు. రాహుల్ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తనకు క్లాస్మేట్, స్నేహితుడని చెప్పారు. అయితే వ్యక్తిగత సంబంధాలు, రాజకీయ అనుబంధాలు వేర్వేరు అని అమరీందర్ స్పష్టం చేశారు. రాహుల్, సోనియాగాంధీ కుటుంబంతో తన వ్యక్తిగత, కుటుంబ సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయని.. కానీ రాజకీయంగా మాత్రం తాను బీజేపీకి కట్టుబడి ఉన్నానని తెలిపారు.అమరీందర్ వ్యాఖ్యలకు పంజాబ్ బీజేపీ నేతలు కూడా స్పందించారు. పంజాబ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రీత్‌పాల్ సింగ్ బలియావాల్.. అమరీందర్ సింగ్‌ను పంజాబ్‌లో అత్యున్నత స్థాయి నాయకుడిగా అభివర్ణించారు. అయితే కాంగ్రెస్ పంజాబ్ యూనిట్లో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్న సమయంలోనే రాహుల్ ఆయనను గుర్తు చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేత రాణా గుర్జీత్ సింగ్ మాత్రం రాహుల్, అమరీందర్‌కు కుటుంబ సంబంధాలు ఉన్నాయని, అమరీందర్ గౌరవనీయమైన నాయకుడని అన్నారు. ఆయన కాంగ్రెస్‌ను వీడకుండా ఉంటే పార్టీలో అందరికీ మార్గదర్శకుడిగా ఉండేవారని అభిప్రాయపడ్డారు.అమరీందర్ సింగ్ ఒకప్పుడు కాంగ్రెస్‌లో కీలక ప్రాంతీయ నాయకుడిగా ఉన్నారు. 2017లో పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఘన విజయం అందించి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల నేపథ్యంలో 2021లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసి, 2022 ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో అనంతరం బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం అమరీందర్ కుటుంబ సభ్యులు కూడా బీజేపీలోనే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్‌తో రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ.. సోనియాగాంధీ కుటుంబంతో తన వ్యక్తిగత అనుబంధం కొనసాగుతుందని అమరీందర్ పలుమార్లు స్పష్టం చేశారు. దీంతో రాహుల్‌గాంధీ చేసిన ‘హలో అంకుల్ అమరీందర్’ వ్యాఖ్య మరోసారి ఆ పాత రాజకీయ, కుటుంబ అనుబంధాలను తెరపైకి తెచ్చింది."Hello, Uncle Amarinder!"LoP Shri @RahulGandhi gives a warm shoutout to his favourite politician from the BJP. pic.twitter.com/kwgQPDZ5SV— Congress (@INCIndia) August 6, 2026 -
అయోధ్యలో అక్రమాలు.. 500 ఏళ్ల త్యాగాల ప్రతీకపై మచ్చా
భోపాల్: అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల చోరీ ఆరోపణలపై రామ జన్మభూమి ఉద్యమ నేతల్లో ఒకరైన సాధ్వి రితంభర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంటూ.. బాధ్యులపై త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సాధ్వి రితంభర మాట్లాడుతూ.. రామ మందిర నిర్మాణం కోసం గత 500 ఏళ్లుగా ప్రజలు డబ్బుతో పాటు ప్రాణాలను కూడా త్యాగం చేశారని గుర్తు చేశారు. అలాంటి పవిత్ర స్థలానికి సమర్పించిన కానుకలపై దొంగతనం జరగడం భక్తులను తీవ్రంగా బాధించిందని అన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. ఇది మనందరినీ సిగ్గుపడేలా చేసింది. కొంతమంది చేసే పనులు దేశానికి, సమాజానికి, సంప్రదాయాలకు చెడ్డపేరు తెస్తాయి. ఇది అలాంటి ఘటనల్లో ఒకటి అని ఆమె వ్యాఖ్యానించారు. భక్తులు ఎంతో విశ్వాసంతో సమర్పించే కానుకలపై రాబందులాంటి కన్ను వేయడం బాధాకరమని సాధ్వి రితంభర అన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.ఇదే సమయంలో.. రామ మందిరం కోసం అనేక తరాలుగా ప్రజలు చేసిన పోరాటం, త్యాగాలను గుర్తు చేస్తూ.. ఇలాంటి ఘటనలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజల్లో విలువలు, నైతికతను బలపరచాల్సిన అవసరం ఉందన్నారు.ఇదిలా ఉండగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన జెన్ జెడ్ ఉద్యమంపై కూడా సాధ్వి రితంభర స్పందించారు. భారతదేశ వర్తమానం, భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అన్నారు. యువత దేశం, సంస్కృతి పట్ల అంకితభావంతో పనిచేయాలని, తమ ప్రతిభను సరైన మార్గంలో వినియోగించుకోవాలని సూచించారు. భారత యువత గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని మేము కోరుకుంటున్నాం. వారు దేశం నెరవేర్చాల్సిన కలలను సాకారం చేస్తారు. భారతీయ పిల్లలు తులసి మొక్కల లాంటివారు. వారికి విలువలనే గంగా జలంతో పోషించాలని అన్నారు. -
పంజాబ్ ఎన్నికల్లో ఆ పార్టీకే ఆధిక్యం.. బీజేపీకి భారీ ఎదురుదెబ్బ!
పంజాబ్‌లో 2027లో రాబోయే శాసనసభ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా జరగనున్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ చేపట్టిన తాజా మూడ్ సర్వేలో వెల్లడయింది. పంజాబ్ రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన విస్తృత క్షేత్రస్థాయి అధ్యయనం ప్రకారం... ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధాన ప్రత్యర్థులపై స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ విజయావకాశాల్లో ముందంజలో ఉంది. అయినప్పటికీ 2022 ఎన్నికల తరహాలో ఏకపక్ష తీర్పు కాకుండా ఈసారి ఎన్నికల సమరం పోటీగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 58 నుండి 63 సీట్లు గెలుచుకుని సాధారణ మెజారిటీ మార్కుకు అతి చేరువగా లేదా స్వల్పంగా దాటే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే అంచనా వేసింది. ప్రతిపక్షంలో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 36 నుండి 43 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే అవకాశం ఉన్నది. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ (డబ్ల్యూడీ) పార్టీ 4 నుండి 7 సీట్లు గెలుచుకుని గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2 నుండి 6 సీట్లు, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడీ) 2 నుండి 4 సీట్లు గెలుపొందే అవకాశాలుండగా, ఇండిపెండెంట్లు, ఇతరులు మిగిలిన స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది.పార్టీల వారీగా ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 37 శాతం, కాంగ్రెస్ 31 శాతం, వారిస్ పంజాబ్ దే 14 శాతం, బీజేపీ 8 శాతం, శిరోమణి అకాలీదళ్ 6 శాతం, ఇతరులు 4 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే పేర్కొంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎలాంటి ముందస్తు పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతాయనే ప్రాతిపదికన ఈ అంచనాలు రూపొందించడం జరిగింది. 2022 నాటి ఏకపక్ష అనుకూల వేవ్ నుంచి పంజాబ్ రాజకీయాలు ఇప్పుడు ప్రభుత్వ పాలనా పనితీరు ప్రాతిపదికగా జరిగే పోరు వైపు మళ్లాయని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. గత ఎన్నికల్లో సాంప్రదాయ పార్టీలపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆప్‌కు అనుకూల ప్రభంజనాన్ని సృష్టించగా, ఈసారి మాత్రం ఓటర్లు ప్రభుత్వం అందించిన సుపరిపాలన, సంక్షేమ పథకాల అమలు, నిరుద్యోగ నిర్మూలన-ఉపాధి కల్పన, వ్యవసాయ విధానాలు, ఆర్థిక నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణ, రాజకీయ నాయకుల విశ్వసనీయత ఆధారంగానే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు.రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. 40 శాతం మంది ఓటర్లు ఆయనకే మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంటూ మద్దతు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి 33 శాతం మంది మద్దతు లభించగా, అమృత్‌పాల్ సింగ్‌కు 13 శాతం మంది మద్దతు తెలిపారు. ఇతర నాయకులకు అత్యల్ప ప్రజాదరణ లభించింది. ఈ సర్వేలోని అత్యంత కీలకమైన అంశం ఏంటంటే... ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పట్ల ఉన్న ప్రజాదరణకు, క్షేత్రస్థాయిలోని ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ఉన్న అసంతృప్తికి మధ్య స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తున్నది. ముఖ్యమంత్రిపై వ్యక్తిగతంగా వ్యతిరేకత తక్కువగా ఉన్నప్పటికీ, అనేక నియోజకవర్గాలలో ఆప్ ఎమ్మెల్యేలపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందే ఎక్కువమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి కొత్తవారికి అవకాశమిస్తే ఆప్ విజయావకాశాలు గణనీయంగా మెరుగుపడతాయని ఈ మూడ్ సర్వేలో వెల్లడయింది. ప్రభుత్వంపై కాకుండా స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతే ఓటర్ల ప్రవర్తనను శాసించనున్నట్లు సర్వే అంచనా వేసింది.రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలమైన గ్రామస్థాయి సంస్థాగత నిర్మాణాత్మక బలాన్ని కలిగి ఉండి, ఆప్‌కు ప్రధాన సవాలుగా నిలుస్తోంది. కాంగ్రెస్ నాయకుల్లో మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకే అత్యధిక ప్రజాదరణ ఉన్నట్లు ఈ సర్వే వెల్లడయింది. కాంగ్రెస్ పార్టీ చన్నీని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి, పార్టీలోని అంతర్గత విబేధాలను నియంత్రిస్తూ సరైన అభ్యర్థులను పోటీలో నిలబెడితే అనేక నియోజకవర్గాల్లో ఆప్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) రాజకీయ ప్రభావం రోజురోజుకీ క్షీణిస్తున్నట్లు సర్వే స్పష్టం చేసింది. అకాలీదళ్‌కు సాంప్రదాయ ఓటు బ్యాంక్‌గా ఉన్న సిక్కు 'పంథిక్' ఓటర్లు, ముఖ్యంగా అమృత్సర్, గుర్దాస్పూర్, తరణ్ తారన్ వంటి సరిహద్దు జిల్లాల్లోని యువ సిక్కు ఓటర్లు వేగంగా 'వారిస్ పంజాబ్ దే' వైపు మొగ్గు చూపుతున్నారు. మత్తు పదార్థ రహిత పంజాబ్, సిక్కు అస్తిత్వ అంశాలపై స్పష్టమైన ప్రచారం చేయడంతో 'వారిస్ పంజాబ్ దే' కొన్ని ప్రాంతాల్లో కీలక శక్తిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా దీని ప్రభావం పరిమితంగా ఉన్నప్పటికీ, కొన్ని కీలక నియోజకవర్గాల్లో సాంప్రదాయ ఓట్ల విధానాన్ని మార్చడం ద్వారా ఫలితాలను తలకిందులు చేసే సామర్థ్యం ఈ ఈ పార్టీకి ఉన్నది.పంజాబ్‌లో బీజేపీ తన దీర్ఘకాలిక విస్తరణ వ్యూహాన్ని కొనసాగిస్తున్నది. లూథియానా, జలంధర్, అమృతసర్, హోషియార్పూర్, పటియాలా, ఎస్.ఎ.ఎస్ నగర్ (మొహాలి) వంటి ప్రధాన పట్టణ నియోజకవర్గాల్లో పార్టీ ఓటు బ్యాంకు విస్తరించేందుకు కృషి చేస్తున్నది. పట్టణ ప్రాంత హిందూ ఓటర్లు, వ్యాపారులు, చదువుకున్న యువతలో ఆదరణ పెరిగినప్పటికీ, సిక్కు రైతాంగంలో తిరిగి నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడం బీజేపీకి అతిపెద్ద సవాలుగా మిగిలిపోయింది. దీంతో కొన్ని పట్టణ స్థానాల్లో సీట్లు సాధించే అవకాశం ఉన్నా, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద మార్పును సృష్టించే పరిస్థితి బీజేపీకి ఇంకా రాలేదు.రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో పాటు కొంతమంది ఎంపీలు, ముఖ్య నేతలు ఆప్‌ని వీడటం పట్టణ ప్రాంతాల్లో రాజకీయంగా చర్చనీయాంశమైనప్పటికీ, ఎన్నికల ఫలితాలపై దీని తక్షణ ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని సర్వే నిర్ధారించింది. ఈ చేరికలు పట్టణ ప్రాంతాల్లో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచినప్పటికీ, సాధారణ ఓటర్ల ప్రాధాన్యతల్లో పెద్దగా మార్పు తేలేదు. ముఖ్యంగా గ్రామీణ పంజాబ్‌లో వ్యవసాయం, ఉపాధి, పాలన, స్థానిక అభ్యర్థుల బలం మాత్రమే ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. డేరా సచ్చా సౌదా, రాధా స్వామి సత్సంగ్ బియాస్, డేరా సచ్ ఖండ్ బల్లాన్, నామ్ధారి , నిరంకారి వంటి డేరాలు పంజాబ్‌లోని మాల్వా, దోఆబా ప్రాంతాల్లో దాదాపు సగం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సామాజికంగా గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. డేరాలు నేరుగా ఏ పార్టీకీ ఓటు వేయాలని ఆదేశాలు ఇవ్వకపోయినా, వారి సామాజిక ప్రభావం దగ్గరగా జరిగే పోటీల్లో ఫలితాలను ప్రభావితం చేస్తుంది. డేరాలతో మెరుగైన సంబంధాల వల్ల బీజేపీకి కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, అది మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద విజయాన్ని కట్టబెట్టలేదని సర్వే విశ్లేషించింది.మొత్తంగా చూస్తే, 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సిద్ధాంతాల కంటే ఎక్కువగా ప్రజాపాలన, నాయకత్వ విశ్వసనీయత, అభ్యర్థుల ఎంపిక మరియు స్థానిక సమస్యల ఆధారంగానే జరగనున్నాయి. ఏకపక్ష ప్రభంజనాలు లేకుండా వందలాది నియోజకవర్గాల్లో హోరాహోరీ స్థానిక పోటీలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, సంస్థాగత బలం, ప్రజల అంచనాలకు తగినట్లుగా స్పందించే తీరుపైనే అంతిమ విజయం ఆధారపడి ఉంటుంది.పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ డాక్టర్ రాజన్ పాండే పర్యవేక్షణలో, సీనియర్ పరిశోధకుడు అమిత్ ఓహ్లాన్ సమన్వయంలో 24 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లతో కూడిన 6 బృందాలు జూన్ 20 నుండి జూలై 31, 2026 వరకు (45 రోజుల పాటు) పంజాబ్‌లోని మాల్వా, మాఝా, దోఆబా ప్రాంతాలలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించాయి. ‘సిస్టమాటిక్ స్ట్రాటిఫైడ్ రాండమ్ శాంప్లింగ్’ పద్ధతిలో వివిధ సామాజిక వర్గాలు, వృత్తులు, వయస్సు, ఆర్థిక నేపథ్యాలు కలిగిన ఓటర్లతో ముఖాముఖి సంభాషించి మొత్తం 8,000 మంది ప్రతినిధుల నుండి శాంపిల్స్ సేకరించి ఈ నివేదికను తయారు చేశారు.-'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే. -
జెన్ జీకి తొలి వికెట్.. ‘వైరస్’ అన్న నబీన్‌కు ఓటుతో బదులు
బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలో జన సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిశోర్ విజయ దుందుభి మోగించారు. బీజేపీ దాదాపు మూడు దశాబ్దాలుగా గెలుస్తున్న నియోజక వర్గంలో మరో పార్టీ గెలవడమంటే సామాన్యమైన విషయం కాదు. తొలి ప్రత్యక్ష ఎన్నికల్లోనే ప్రశాంత్ కిశోర్ గెలుపొందారు. జన్ సూరజ్ పార్టీకి ఇది తొలి అసెంబ్లీ విజయం. తొలిసారి చట్టసభలో అడుగుపెట్టనున్నారు ప్రశాంత్ కిశోర్. బీజేపీకి 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో కేవలం 30 రోజుల పాటు శ్రమించి (ఎన్నికల ప్రచారం చేసి) ఆయన గెలుపొందారు. బీజేపీ ఓటమి వెనుక పలు ముఖ్యమైన అంశాలున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇటీవల నిర్వహించిన ఆందోళనల నేపథ్యంలో బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితంపై చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలను జెన్ జీలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఇచ్చిన ఝలక్‌గా అభివర్ణిస్తున్నారు.4 సార్లు ఇక్కడే నబీన్ గెలుపురాజ్యసభకు వెళ్లేందుకు ఆయన స్వయంగా వదులుకున్న సొంత నియోజకవర్గం బంకీపూర్లోనే బీజేపీ ఓటమి చెందింది. అంతకుముందు బంకీపూర్ నియోజకవర్గంలో వరసగా 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నబీన్ గెలిచారు. అలాగే, 1995 నుంచి బంకీపూర్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ ఎప్పుడూ కోల్పోలేదు. అంతగా బీజేపీకి పట్టున్న బంకీపూర్ నియోజక వర్గంలో ఆ పార్టీని ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఓడించారు.సీజేపీని వైరస్‌తో పోల్చిన నబీన్నితిన్ నబీన్ సీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ దానిని "వైరస్"తో పోల్చారు. ఆయన ఇటీవల మాట్లాడుతూ.. "దేశంలో వైరస్, కాక్రోచ్‌లాంటి పార్టీలు వస్తున్నాయి. ఇవి దేశాన్ని లోపల నుంచి బలహీనపరచాలని చూస్తున్నాయి. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే టుక్డే-టుక్డే గ్యాంగ్‌లో ఇవి భాగం" అని అన్నారు. అనంతరం ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందిస్తూ.. "మమ్మల్ని టెర్రరిస్టులు, వైరస్ అని పిలుస్తున్నారు. కానీ మేము విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్నాం" అని చెప్పారు.జెన్ జీ ఎఫెక్ట్- సంప్రదాయ ఓటు బ్యాంక్‌లో చీలికబంకీపూర్లో బీజేపీ ఓటమి జెన్ జీ ఎఫెక్టే అంటూ నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. యువ ఓటర్ల తీర్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ ఓటమికి జెన్ జీ ఉద్యమం ప్రభావం ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యువ ఓటర్లలో పెరిగిన అసంతృప్తి ఎన్నికల ఫలితంపై స్పష్టంగా కనిపించింది. జెన్ జీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉద్యోగాలు, పరీక్షల పారదర్శకత, విద్యా సంస్కరణల అంశాలను యువత బలంగా ప్రస్తావించింది. కాక్రోచ్ ఉద్యమంలో బిహార్ యువత కూడా పాల్గొన్నారు. జెన్ జీ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ యువ ఓటర్లను చైతన్యపరిచింది. మొదటిసారి ఓటు వేసిన యువతలో గణనీయమైన మార్పు కనిపించింది. ప్రతిపక్షాలకు మద్దతుగా డిజిటల్ ప్రచారం ఊపందుకుంది. జెన్ జీ ఉద్యమం స్థానిక సమస్యలను ఎన్నికల ప్రధాన అజెండాగా మార్చింది. దీంతో బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంక్‌లోనూ కొంత మేర చీలిక ఏర్పడినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ ఫలితం యువత రాజకీయ ప్రభావాన్ని మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చింది. -
నిరసనలపై బీజేపీ మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ: జంతర్‌మంతర్‌లో ఇటీవల జరిగిన విద్యార్థులు, సీజేపీ నిరసన కార్యక్రమంపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. నిరసనలో పాల్గొన్న వారిలో విద్యార్థుల కంటే "పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలు" ఎక్కువ మంది ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైనా తీవ్ర విమర్శలు చేశారు.తాజాగా మీడియాతో మాట్లాడిన బిధూరి మాట్లాడుతూ.. ‘జంతర్‌మంతర్‌లో జరిగిన నిరసనలో విద్యార్థుల కంటే పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలే ఎక్కువ మంది ఉన్నారు. పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలు ఎవరనేది మీకు తెలుసు’ అని అన్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిని ఉద్దేశిస్తూ.. "ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను దేశ ప్రధాని గురించి అలాంటి భాష మాట్లాడమని ప్రోత్సహించరు. మోదీ జీని దూషించే వారు పంక్చర్ వేసేవాళ్ల పిల్లలు లేదా వారి కుటుంబాలకు చెందినవారే" అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.నీట్ (NEET) అంశాన్ని అడ్డం పెట్టుకుని కొందరు సంఘ వ్యతిరేక శక్తులు జనరేషన్-జెడ్ (Gen Z) యువతను తప్పుదోవ పట్టించాయని బిధూరి ఆరోపించారు. ‘నీట్ సమస్య పేరుతో కొందరు సంఘ వ్యతిరేక శక్తులు జంతర్‌మంతర్ వద్ద యువతను సమీకరించాయి. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడం, పార్లమెంట్‌పై దాడికి ప్రయత్నించడం, దేశంలో అశాంతి సృష్టించడమే వారి లక్ష్యం’ అంటూ ఆయన అన్నారు.జెన్-జెడ్‌కు అవగాహన కల్పించాలి..గత 12 ఏళ్లలో దేశంలో జరిగిన మార్పులు, అభివృద్ధి, అంతకుముందు 12 ఏళ్ల పరిస్థితుల గురించి యువతకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బిధూరి పేర్కొన్నారు. తప్పుదోవ పట్టిన జనరేషన్-జెడ్‌ను సరైన మార్గంలోకి తీసుకురావాలి. గత 12 ఏళ్లలో దేశంలో ఏం జరిగిందో, అంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో వారికి వివరించాలని అన్నారు. అయితే, రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. గతంలో కూడా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈసారి కూడా నిరసనలో పాల్గొన్న వారిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వచ్చే అవకాశముంది. -
కాక్రోచ్ నిరసనల ఎఫెక్ట్.. ఢిల్లీ వీధుల్లో టెన్షన్!
నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు ముగిసిన తర్వాత ఢిల్లీలో కొత్త వివాదం మొదలైంది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, కార్యకర్తలపై దాడులు జరిగాయంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు నిరసనల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం, భద్రతా సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరికొన్ని వీడియోలు చర్చకు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు నీట్ పేపర్ లీక్, పరీక్షా వ్యవస్థలో లోపాలపై ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలు తీవ్రతరం కావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అనంతరం నిరసనలపై భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో నిరసనల్లో పాల్గొన్న వారిపై దాడులు జరిగినట్టు తాజాగా వీడియోలు బయటకు వస్తున్నాయి. పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.As Soon as Dharmendra Pradhan’s Resignation is Confirmed……• Sonam Wangchuk has left.• Abhijeet Deepke and Saurabh Das are celebrating.Meanwhile, in Delhi, the Sangh Parivar has put their most Notorious and Riotous Group, the Bajrang Dal, out on the Streets.They are… pic.twitter.com/yLa72eEdBA— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) July 28, 2026ఇటీవల సత్యం పండిట్ అనే వ్యక్తి ఇద్దరు నిరసనకారులపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన వీడియో చర్చకు వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు చూపించే మరికొన్ని వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో చిత్రీకరించినట్లు చెబుతున్న ఓ వీడియోలో, మైక్ పట్టుకున్న ఓ వ్యక్తి కొందరు నిరసనకారులను ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నిస్తూ నిలదీసినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ సమయంలో అతడి మెడపై చేయి వేసి మాట్లాడుతున్నట్లు, క్షమాపణ చెప్పాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆ వ్యక్తి క్షమాపణ చెప్పినట్లు వీడియోలో కనిపిస్తుంది.जो काॅकरोच जंतर-मंतर पर सनातन धर्म और मोदी जी को गाली दे रहे थे उनकी दिल्ली मेट्रो में जमकर धुलाई हो रही है...🤣😏 pic.twitter.com/XHtgERs9Hx— राजपूत सवित सिंह (@Savit12) July 29, 2026 మరో వీడియోలో ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు వెంబడించి కొట్టినట్లు, తన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంకొక వీడియోలో ఓ మహిళను పలువురు వ్యక్తులు చుట్టుముట్టి ప్రశ్నిస్తూ, ఆమెను మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనలపై నిరసనలకు మద్దతు ఇస్తున్న వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని లేదా విధానాలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో భాగమని, నిరసనకారులను బెదిరించడం, దాడి చేయడం సరైన విధానం కాదని వారు పేర్కొంటున్నారు.బీజేపీ అనుకూల వర్గాల వాదనమరోవైపు, బీజేపీకి మద్దతు ఇస్తున్న వర్గాలు నిరసనల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, పోలీసులపై అనుచిత నినాదాలు చేసినట్లు చూపించే కొన్ని వీడియోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నిరసనల పేరుతో చట్టపరమైన, సామాజిక పరిమితులు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు నిరసనల్లో పాల్గొన్న వ్యక్తుల ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ పోలీసులను ట్యాగ్ చేశాయి. అయితే, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకోవాల్సింది చట్టపరమైన వ్యవస్థ మాత్రమేనని, వ్యక్తులు లేదా ప్రైవేట్ గుంపులు స్వయంగా చర్యలకు దిగడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.THIS IS SHAMEFUL !!!If this is what young Indians have to face simply for supporting a protest then what kind of democracy are we becoming?This video appears to show Satyam Pandit confronting and slapping two youths on their way to the Jantar Mantar protest has sparked… pic.twitter.com/8zDPBMb1at— Ravi Prakash Official (@raviprakash_rtv) July 26, 2026ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం పౌరుల హక్కు. అదే సమయంలో నిరసనల సమయంలో హింస, బెదిరింపులు, దాడులు లేదా చట్ట ఉల్లంఘనలు జరిగితే వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు, న్యాయ వ్యవస్థలపై ఉంటుంది. కాగా, నీట్ నిరసనలు ముగిసినా, వాటి చుట్టూ రాజకీయ వాదోపవాదాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఒకవైపు నిరసనకారులపై దాడుల ఆరోపణలు, మరోవైపు నిరసనల్లో జరిగిన అనుచిత వ్యాఖ్యలపై విమర్శలు కొనసాగుతున్నాయి. The police have started their job. The Students movement is over. Now who will come forward to help these students?Unity of students is required. #cjpprotesters #india #arrested #students #police pic.twitter.com/6o7LxWowhb— भारतीय (@ramanswall) July 27, 2026 -
మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకారం: సీజేపీ
సీజేపీ ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. సీజేపీ విధించిన డెడ్‌లైన్‌లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో కేంద్రానికి మా సత్తా ఏంటో చూపించామంటూ సీజేపీ వ్యాఖ్యానించింది. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఉద్యమం ఆగదని.. ఈ విజయం విద్యార్థులందరిందని సీజేపీ పేర్కొంది. సీజేపీ నిరసనలు.. అప్డేట్స్..విద్యారంగంలో మంచి సంస్కరణలు తీసుకురావాలి: రాహుల్విద్యావ్యవస్థను బీజేపీ భ్రష్ఠు పట్టించిందివిద్యార్థులకు మోదీ క్షమాపణలు చెప్పాల్సిందేదేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ ఆక్రమించిందివిద్యా రంగాన్ని క్రమంగా ప్రైవేటీకరణ చేస్తున్నారువిద్యార్థులపై దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలి నీట్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం: జేపీ నడ్డాత్వరలోనే పరిహారం ఇస్తాంనిబంధనలకు లోబడే పరిహారం చెల్లిస్తాంసీజేపీ ప్రతిపాదించిన సంస్కరణలను పరిశీలిస్తాంమూడు డిమాండ్లకు కేంద్రం అంగీకారం: సీజేపీవిద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందిప్రధాన్ రాజీనామాతో మా మొదటి డిమాండ్ నెరవేరిందివిద్యార్థులపై కేసు ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందిపరిహారంపై కూడా స్పష్టత ఇచ్చిందివిద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలిఆందోళన విరమించిన సీజేపీసీజేపీ, కేంద్ర మధ్య ముగిసిన చర్చలుసీజేపీ ప్రతినిధులతో చర్చించిన నడ్డా, జితేంద్రసింగ్దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన చర్చలు కేంద్రంతో సీజేపీ మూడో విడత చర్చలుచర్చల్లో పాల్గొన్న జేపీ నడ్డా, జితేంద్ర సింగ్సీజేపీ నుంచి హాజరైన సౌరవ్ దాస్, అశుతోష్లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరిన సీజేపీసెంట్రల్ ఢిల్లీలో తెరుచుకున్న మెట్రో స్టేషన్లువిద్యార్థుల ఆందోళన విరమణతో మెట్రో స్టేషన్లు రీఓపెన్ఢిల్లీలో వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాలుఢిల్లీకి బయల్దేరి రావాలని ఫడ్నవీస్, షిండేలకు పిలుపుమరికొంతమంది రాజకీయ నాయకులకు ఢిల్లీ పిలుపుఇది ప్రజాస్వామ్య విజయం మల్లికార్జున ఖర్గేఇప్పటికైనా విద్యా వ్యవస్థను సరిదిద్దాలియువత ధైర్యంగా పోరాడిందిఢిల్లీ:ప్రధాని మోదీతో అమిత్ షా భేటీతాజా పరిణామాలపై మోదీ, అమిత్ షా చర్చలు కాసేపట్లో కేంద్రంతో సీజేపీ ప్రతినిధుల చర్చలుమిగతా రెండు డిమాండ్లను నెరవేర్చాలంటున్న సీజేపీప్రజాస్వామ్యం గెలిచింది: వాంగ్చుక్శాంతికి, సహనానికి చెందిన విజయం ఇదిఇప్పటికైనా విద్యారంగంలో సంస్కరణలు తేవాలిఇకపై కేంద్ర బాధ్యతాయుతంగా వ్యహరించాలిసీజేపీ, జెన్ జీలకు ధన్యవాదాలు జంతర్‌మంతర్ దగ్గర విద్యార్థుల సంబరాలుఒక డిమాండ్ నెరవేరింది: సీజేపీమిగతా 2 డిమాండ్లు నెరవేరే వరకు వేచి ఉందాంవిద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి ప్రజాస్వామ్యం గెలిచింది: సీజేపీకేంద్రానికి మా సత్తా ఏంటో చూపించాం: సీజేపీవిద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఉద్యమం ఆగదుఈ విజయం విద్యార్థులందరిదికేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ రాజీనామాసీజేపీ ఉద్యమంతో దిగొచ్చిన ధర్మేంద్ర ప్రధాన్సీజేపీ విధించిన డెడ్‌లైన్‌లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామారాజీనామా లేఖను ప్రధానికి పంపిన ధర్మేంద్ర ప్రధాన్జంతర్మంతర్ సమీపంలో ఉద్రిక్తతపోలీసులపై రాళ్లురువ్విన ఆందోళనకారులుఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగంజంతర్మంతర్లో కొనసాగుతున్న సీజేపీ నిరసనలు ఢిల్లీ పోలీసులకు సీజేపీ డిమాండ్జంతర్ మంతర్‌ను ముట్టడించడం ఆపండిదీక్షా స్థలికి వచ్చే ప్రజలను అడ్డుకోవద్దునిరసనకారులకు ఆహారం, మందులు చేరనివ్వాలిజంతర్ మంతర్ ముట్టడిని ఎత్తివేయాలని డిమాండ్ఢిల్లీ పోలీసుల సంచలన ప్రకటనజంతర్మంతర్ హింసాత్మక ఘటనలపై పోలీసుల ప్రెస్మీట్అందులో చాలా వరకు ఫేక్ వీడియోలు, ఫొటోలు ఉన్నాయిసోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారాలు చేశారుదీని వెనక పాకిస్తాన్ ప్రమేయం ఉందిపాక్ నుంచి ఏఐ వీడియోలను క్రియేట్ అయ్యాయి400కి పైగా పాక్ హ్యాండిల్స్‌ను బ్లాక్ చేశాంఏఐ కట్టడికి కృషి చేస్తున్నాంఏఐ ద్వారా ఫేక్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయిరేపు దేశవ్యాప్త నిరసనలను సీజేపీ పిలుపుమరోసారి దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చిన సీజేపీరేపు సాయంత్రం 6గం. క్యాండిల్ ర్యాలీలు చేపట్టాలని పిలుపుఇవాళ చర్చలు ఉంటాయా? ఉండవా? అనేదానిపై నెలకొన్న అనిశ్చితిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతున్న సీజేపీధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించకలేకపోతే.. మోదీనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్కేంద్రంతో చర్చకు ముందు సీజేపీ కీలక ట్వీట్రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదునిర్ణయం తీసుకోకపోతే.. చర్చలు కొనసాగించడంలో అర్థం లేదు“వాళ్లు అడిగే పరిస్థితి రాకముందే.. ఇప్పటికి బాధ్యత తీసుకుని స్వయంగా రాజీనామా చేసి ఉండాల్సింది.” అంటూ మరో ట్వీట్మధ్యాహ్నం 3.30గం. కు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులతో సీజేపీ భేటీ!నిన్న గంటన్నరపాటు జరిగిన చర్చలుకీలక డిమాండ్‌పై కొలిక్కి రాని చర్చలుఇవాళ ఏ నిర్ణయం ప్రకటిస్తామన్న కేంద్ర మంత్రులుమంత్రి రాజీనామాపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతి చేస్తామని ప్రకటనजिम्मेदारी लेकर बिना मांगे ही अब तक इस्तीफा दे देना चाहिए था 🥺— Cockroach Janta Party (@CJP_for_India) July 25, 2026 సీజేపీ నిరసనలకు ప్రొఫెసర్ కోదండరాం మద్దతుసీజేపీ నిరసనలకు ప్రొఫెసర్, తెలంగాణ ఎమ్మెల్సీ కోదండరాం మద్దతువిద్యార్థులు చేస్తున్న ఆందోళన సరైందిపేపర్ లీకేజీకి ధర్మేంద్ర ప్రధానే కారణంకచ్చితంగా ఆయన రాజీనామా చేయాలిసీజేపీ నిరసనలకు రాహుల్ గాంధీ సంఘీభావంశనివారం.. మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్ ప్రధాని అర్ధరాత్రి పూట వీడియోలు చేస్తున్నారు.. ఏం లాభం?ఢిల్లీ పోలీసులు విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తించారులాఠీలతో తలలు పగలకొట్టారుపిల్లలపై దాడి చేసిన వాళ్లు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందేధర్మేంద్రను ప్రధాని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలినీట్ లీక్‌పై విద్యార్థులకు ప్రధాని క్షమాపణలు చెప్పాలిఅవినీతికి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతీకధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు అంటున్నారుఆయన్ని మరో శాఖకు మార్చాలని అనుకుంటున్నారుఆయన శాఖ మార్చడం కూడా ఆమోద యోగ్యం కాదుఎంత బెదిరించినా.. జంతర్ మంతర్నుంచి విద్యార్థులు కదలరుయువతకు అభిజిత్ దీప్కే ధన్యవాదాలు టైఫాయిడ్‌తో బాధపడుతున్ను కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేచికిత్స తీసుకుంటున్న సీజేపీ చీఫ్శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న యువతకు ధన్యవాదాలుఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తే కేంద్రం తప్పకుండా దిగి వస్తుందిధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి తప్పకుండా రాజీనామా చేస్తారుపోరాటం ఇలాగే కొనసాగించాలని సూచనకోలుకోగానే తాను చేరతానని వ్యాఖ్యమోహన్ భగవత్ పరోక్ష వ్యాఖ్యలుఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలునేటి యువత దారితప్పిన వారు కాదని, వారిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న భగవత్యువతకు ఆదేశాలు ఇవ్వడం కాకుండా.. వారితో చర్చలు జరపాలని సూచనకొత్త తరం ఎక్కువగా ప్రశ్నలు అడుగుతోందని, వారికి సరైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని వ్యాఖ్యయువతకు మార్గనిర్దేశం చేయాలే తప్ప.. వారి అభిప్రాయాలను అణచివేయకూడదన్న ఆరెస్సెస్ చీఫ్“ఆదేశాలు కాదు.. చర్చలు, నియంతృత్వం కాదు.. ఏకాభిప్రాయం” అనే సందేశం ఇచ్చిన మోహన్ భగవత్యువత విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే సంభాషణ(మాటలు, చర్చల) ద్వారానే సాధ్యమని ఆసక్తికర వ్యాఖ్యరాజీనామా లేకుండానే దీక్ష విరమణ.. వాంగ్‌చుక్ వివరణధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ మినహా మిగతా వాటికి అంగీకరించిన సోనమ్ వాంగ్చుక్కేంద్ర మంత్రుల సమక్షంలో మొన్న దీక్ష విరమణప్రధాన డిమాండ్ నెరవేరక ముందే దీక్ష విరమించడంపై విమర్శలునిన్న రాత్రి వీడియోలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చిన వాంగ్చుక్కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ.. 26 రోజుల నిరాహార దీక్షను విరమించినట్లు సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు.రాజీనామా తనకు ప్రధాన అంశం కాదని.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు నమోదు కాకుండా చూడటమే తన ప్రాధాన్యత అని చెప్పారు.ఢిల్లీలోని ‘సీజేపీ’ (Cockroach Janta Party) ఆధ్వర్యంలో జరిగిన ‘సంసద్ చలో’ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండవని కేంద్రం రాతపూర్వక హామీ ఇచ్చిందని వెల్లడించారు.పరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్‌లపై పార్లమెంట్లో చర్చిస్తామని.. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారాన్ని పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని తాను చర్చల్లో ప్రస్తావించానని.. కానీ కేంద్రం మరింత సమయం కోరిందని వాంగ్‌చుక్ తెలిపారు.ప్రధాన్ రాజీనామా చివరికి జరిగే అవకాశం ఉందని తాను భావిస్తున్నానని.. అందుకే దానిపై పట్టుబట్టలేదని చెప్పారు."నా లక్ష్యం విద్యార్థులు నష్టపోకూడదనేది. వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు కాకుండా చూడటమే అత్యంత ముఖ్యమైన విషయం" అని స్పష్టం చేశారు.దీక్ష విరమణపై వచ్చిన ‘డీల్ కుదిరింది’ అనే ఆరోపణలను వాంగ్‌చుక్ ఖండించారు."డీల్ చేసుకోవాలనుకుంటే 26 రోజులు ఆకలితో ఉండాల్సిన అవసరం ఏముంది? ఏసీ గదిలో కూర్చునే ఒప్పందం చేసుకునేవాడిని" అని వ్యాఖ్యానించారు.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆస్పత్రికి వచ్చి హామీలు ఇచ్చారని.. అయితే రాతపూర్వక హామీ వచ్చే వరకు దీక్ష విరమించలేదని తెలిపారు.తనతో పాటు పోరాడిన విద్యార్థులు, ఎంపీలు, లద్దాఖ్ ప్రతినిధులు దీక్ష ముగింపు సమయంలో తన వద్ద లేకపోవడం బాధ కలిగించిందని వాంగ్‌చుక్ అన్నారు. AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026సమగ్ర కథనం కోసం👉 ఎలాంటి డీల్ లేదు: ఐసీయూ నుంచి వాంగ్‌చుక్ చర్చల వేళ సీజేపీ కీలక వ్యాఖ్యలుకేంద్ర ప్రభుత్వంతో మూడో విడత చర్చలకు ముందు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక ప్రకటన.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పష్టత లేకుండా చర్చలు కొనసాగించడంలో అర్థం లేదని స్పష్టీకరణ.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పనిసరి డిమాండ్ (నాన్-నెగోషియబుల్) అంటూ సీజీపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా వ్యాఖ్య ప్రభుత్వం రాజీనామాకు అంగీకరించకపోతే.. తదుపరి చర్చలకు వెళ్లడంలో ప్రయోజనం లేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు.కేంద్రం, సీజీపీ ప్రతినిధుల మధ్య మూడో విడత సమావేశానికి కొన్ని గంటల ముందు ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని సీజీపీ డిమాండ్ చేస్తోంది.సమగ్ర కథనం కోసం👉 కేంద్రానికి సీజేపీ సంచలన షరతువాంగ్చుక్ వైరల్ వీడియోపై సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వివరణసోనమ్ వాంగ్చుక్ను అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో రికార్డైన దృశ్యాలు బయటకు వైరల్‌గా మారిన వీడియో‘‘నేను వెళ్తున్నా.. నన్ను అరెస్ట్ చేయండి’’ అని పోలీసులకు సవాల్ విసిరిన వాంగ్చుక్వైరల్ వీడియోపై స్పందించిన సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి జూలై 21న ఆస్పత్రిలోని నో-వీడియోగ్రఫీ జోన్లో రికార్డు చేసినట్లు వెల్లడించింది.వాంగ్‌చుక్ అనుచరులు ఈ వీడియోను చిత్రీకరించారని స్పష్టీకరణరికార్డు చేసిన వెంటనే కాకుండా శుక్రవారం విడుదల చేశారని స్పష్టం చేసింది.ఆస్పత్రి నిబంధనలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరించారంటూ వివరణ ఇచ్చిన సర్దర్జంగ్ ఆస్పత్రికేంద్రం–సీజేపీ చర్చలు 3.0.. కీలక పరిణామాలుకేంద్రం, సీజేపీ మధ్య మూడో విడత చర్చలు నేడు జరగనున్నాయి.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పైనే ప్రధానంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది.శుక్రవారం జరిగిన దాదాపు రెండు గంటల చర్చల్లో ఎలాంటి తుది నిర్ణయం రాలేదు.సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లలో రెండింటికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు సమాచారం.శాంతియుత నిరసనకారులపై కేసులు ఎత్తివేయడం, మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అంశాలపై సానుకూలత వ్యక్తం చేసింది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మాత్రం కేంద్రం మరింత సమయం కోరింది.ఇవాళ మధ్యాహ్నం 3గం.లకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధుల భేటీ జరగనుందినీట్ నిరసనలు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలుపేపర్ లీక్ నేరాలకు కఠిన శిక్షలు విధించే ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.పేపర్ లీక్ మాఫియాకు కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష ప్రతిపాదించారు.నేర తీవ్రత ఆధారంగా శిక్షను 10 ఏళ్ల వరకు పెంచే అవకాశం కల్పించారు.వ్యవస్థీకృత పేపర్ లీక్ రాకెట్లకు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలు చేర్చారు.పేపర్ లీక్ కేసుల దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించారు.కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ చేపట్టనున్నారు.ఈ బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.మంత్రి రాజీనామాపై ఉత్కంఠ..విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాన్ని ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి.రాజీనామా చేయడం బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుందని కేంద్ర వర్గాల వాదన.ఎన్టీఏ సంస్కరణలు, పరీక్షల వ్యవస్థలో మార్పులే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం చెబుతోంది.సీజేపీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేస్తోంది.సీజేపీ హెచ్చరికలు..రాజీనామాపై స్పష్టమైన నిర్ణయం రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.ప్రభుత్వం స్పందన ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అశుతోష్ రాంకా తెలిపారు.కేంద్రం వైఖరిలో మార్పు లేకుంటే కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు.డిమాండ్లపై అశుతోష్ రాంకా కీలక వ్యాఖ్యలునిన్న జరిగిన సమావేశంలో పరిహారం, చట్టపరమైన కేసులకు సంబంధించిన అంశాలపై సానుకూల స్పందన వచ్చిందన్న రాంగాఈ అంశాలపై ప్రభుత్వం నుంచి సూత్రప్రాయ అంగీకారం లభించిందని, ఈరోజు లిఖితపూర్వక ఒప్పందం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాలేదన్నారు.మీడియా కథనాల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని సమాచారం వస్తోందని, అదే జరిగితే సమావేశాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని రాంకా అన్నారు.ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్‌ను పట్టించుకోకుండా రాజీనామాకు నిరాకరిస్తే, తదుపరి వ్యూహాన్ని ప్రకటిస్తామని తెలిపారు.ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే సీజేపీ కూడా మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని అశుతోష్ రాంకా కోరారు.VIDEO | Delhi Jantar Mantar Protest: CJP spokesperson Ashutosh Ranka, says, "In yesterday's meeting, we received a positive response regarding compensation and legal cases. We got an in-principle agreement, and we hope to receive the written agreement today as well. However,… pic.twitter.com/BFvGHOZWBm— Press Trust of India (@PTI_News) July 25, 2026సమగ్ర కథనం కోసం👉: నీట్ టైం బాంబ్.. ఎప్పుడైనా పేలొచ్చుజంతర్ మంతర్ వద్ద భద్రత కట్టుదిట్టం..సీజేపీ ఆందోళన నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద కట్టుదిట్టమైన భద్రతఢిల్లీ పోలీసులు భద్రతా చర్యలను పెంచారు.నిరసనలకు ప్రధాన వేదిక అయిన జంతర్ మంతర్ ప్రాంతం చుట్టూ అదనపు బారికేడ్ల ఏర్పాటు.బారికేడ్లను భారీ స్థాయి గొలుసులతో ఒకదానికొకటి అనుసంధానించారు.బారికేడ్లు కదలకుండా ఉండేందుకు వాటిని వెల్డింగ్ చేసి మరింత బలోపేతం.పెద్ద సంఖ్యలో ప్రజలు చేరే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు.జంతర్ మంతర్ పరిసరాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు.శాంతియుతంగా ఆందోళన కొనసాగించేలా పోలీసులు చర్యలు చేపట్టారుPolice Fortifies Jantar Mantar,A six-layer barricade setup is now in place on the road near Jantar Mantar and Jai Singh Marg. An attempt is being made to restrict the protesters to the area. The barricades have been anchored to the ground using iron rods and welding pic.twitter.com/NmwjZOfNPN— Amit Bhardwaj (@AmmyBhardwaj) July 24, 2026ఇంటర్నెట్ నిలిపివేత..సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సర్వీస్ నిలిపివేతపని చేయని మొబైల్ డేటా సర్వీసెస్బుకింగ్ కానీ క్యాబ్ సర్వీసులు, పని చేయని యూపీఐ పేమెంట్స్ యాప్సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు#WATCH | Security intensified around Jantar Mantar as Delhi Police set up additional barricades that have been interlinked with heavy duty chains and reinforced through welding. pic.twitter.com/I9tNCvGp6X— ANI (@ANI) July 25, 2026 మెట్రో మూసివేత..సీజేపీ నిరసనల నేపథ్యంలో మళ్ళీ మెట్రో స్టేషన్లు మూసివేత18 మెట్రో స్టేషన్లు క్లోజ్ లోక్ కల్యాణ్ మార్గ్రాజీవ్ చౌక్పటేల్ చౌక్రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్బారఖంబా రోడ్సుప్రీం కోర్ట్సేవా తీర్థ్జనపథ్మండి హౌస్సెంట్రల్ సెక్రటేరియట్ఐటీఓఢిల్లీ గేట్ఇంద్రప్రస్థఖాన్ మార్కెట్జోర్ బాగ్శివాజీ స్టేడియంఝండేవాలాన్న్యూ ఢిల్లీకేంద్రం, సీజేపీ చర్చల్లో ప్రతిష్టంభన..రాజీనామా చేయాల్సిందేనన్న కాక్రోచ్ జనతా పార్టీ24 గంటల్లో చెబుతామన్న మంత్రులు, నేడు మళ్లీ చర్చలు47 మంది ఎన్టీఏ సిబ్బందికి ఉద్వాసనధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరంటున్న ప్రభుత్వ వర్గాలుకేంద్ర ప్రభుత్వం, సీజేపీ చర్చలు శుక్రవారం అసంపూర్తిగా ముగిశాయి.ఏమీ తేల్చకుండా శనివారానికి ఉత్కంఠను మిగిల్చాయి.విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే ప్రధానంగా చర్చ నడిచింది.మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ పట్టుబట్టగా.. ప్రభుత్వం 24 గంటల సమయం కోరింది.శనివారం మధ్యాహ్నం ఏ విషయం చెబుతానంటూ వాయిదా వేసింది. -
బీజేపీపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉత్కంఠగా మారాయి. గత రాత్రి జరిగిన ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే స్పందిస్తూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ నిరసనలను ఉద్దేశపూర్వకంగా హింసాత్మకంగా మార్చేందుకు బీజేపీకి చెందిన వ్యక్తులు చొరబడ్డారని ఆయన ఆరోపించారు.తాజాగా అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడుతూ.. ‘కొందరు బయటి వ్యక్తులు మా నిరసనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి చెందిన వ్యక్తులు మా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వారి వల్లే హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సీజేపీకి చెడ్డపేరు తీసుకురావడమే వారి లక్ష్యం. కొందరు సివిల్ డ్రెస్సుల్లో వచ్చి విద్యార్థులపై దాడులు చేస్తున్నారు. జంతర్ మంతర్ ఎప్పుడూ ప్రజాస్వామ్య నిరసనలకు అందుబాటులో ఉండే ప్రదేశమే’ అని వ్యాఖ్యానించారు.#WATCH | Delhi: Founding President of Cockroach Janta Party, Abhijeet Dipke says, "I have already spoken about the lathi charge. It was very brutal, and we will take the police officers who carried it out to court, and today is the 34th day of our protest. Sonam Sir's hunger… pic.twitter.com/LuZgdavsIr— ANI (@ANI) July 23, 2026అలాగే, నిరసనల సందర్భంగా పోలీసులు చేపట్టిన లాఠీచార్జ్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లాఠీచార్జ్ అత్యంత దారుణంగా జరిగింది. ఈ చర్యకు బాధ్యులైన పోలీసు అధికారులపై కోర్టును ఆశ్రయిస్తాం. మా ఉద్యమానికి ఇవాళ 34వ రోజు. మా డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు.లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ కొనసాగిస్తున్న నిరాహార దీక్షపై కూడా దీప్కే స్పందించారు. ‘వాంగ్‌చుక్ సర్ నిరాహార దీక్షకు ఇవాళ 26వ రోజు. ఆయన ఆరోగ్యం మాకు ఆందోళన కలిగిస్తోంది. ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లకూడదని భావిస్తున్నాం. అందుకే దీక్ష విరమించాలని కోరుతున్నాం. అయినప్పటికీ మా డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం మాత్రం కొనసాగుతుంది’ అని తెలిపారు.Jantar Mantar: men in civvies walking the street with sticks. Students ask who they are. No answer. Riot police standing nearby.Police? Another agency? Someone private? That’s not a detail you shrug off. This needs a real investigation, not silence. pic.twitter.com/GX8vEnehdt— Dilip Ray 🇮🇳 (@dilipray) July 21, 2026 Sarthak Goswami covering a protest near New Delhi Railway Station. Video shows Delhi Police pushing and handling him in the crowd — arm yanked, phones out, total chaos. pic.twitter.com/Bw3feKQwij— Dilip Ray 🇮🇳 (@dilipray) July 22, 2026 -
విజయవాడలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల కొట్లాట
సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా విజయవాడలో బీజేపీ కౌంటర్ ఆందోళన చేపట్టింది. ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రజాస్వామ్య విరుద్ధమని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండాల కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు సమాచారం.వివరాల ప్రకారం.. విజయవాడలో మ్యూజియం రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు "డౌన్ డౌన్ రాహుల్ గాంధీ", "డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ" అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేస్తోందని వారు ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఒకేచోట చేరడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాంగ్రెస్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.అనంతరం, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ..‘మోదీ ఇంటి ముట్టడి వెనుక అసలు శక్తులు బయటపడ్డాయి. దాడి వెనుక కాంగ్రెస్ అగ్రనేతల హస్తం ఉంది. జంతర్ మంతర్ నిరసనలకు కాంగ్రెసే సూత్రధారి. సోనమ్ వాంగ్చుక్ను వెనుక ఉండి నడిపిస్తోంది కాంగ్రెస్ పార్టీనే. నిరసనల్లో ఒక్క నీట్ విద్యార్థి కూడా లేరు, కేవలం లెఫ్ట్ యూనియన్ నాయకులే ఉన్నారు. నిరసనల్లో అర్బన్ నక్సల్స్, 370 రద్దును వ్యతిరేకించే శక్తులు ఉన్నాయి. నీట్ లీకేజీకి సంబంధించి 15 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడే ధైర్యం ప్రతిపక్షాలకు లేదు. నేపాల్, బంగ్లాదేశ్ తరహా అలజడులు సృష్టిస్తే ఉపేక్షించం. విద్యార్థులకు భరోసా, నిజమైన నీట్ బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
కేంద్రం..కాక్రోచ్ జనతా పార్టీ మధ్య చర్చలు
కేంద్రం సీజేపీల మధ్య చర్చలు కాక్రోచ్ పార్టీ బృందంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చర్చలు నడ్డాకు విజ్ఞాపన పత్రాన్ని అందించింన సీజేపీ జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా భేటీ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలని భేటీలో స్పష్టతలేదంటే తమ నిరసన కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కాక్రోచ్ పార్టీ సీజేపీకి కేంద్రానికి మధ్య కొనసాగుతున్న చర్చలుప్రభుత్వంతో సీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్ చర్చలు డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్ ప్రభుత్వంతో సీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్ చర్చలు అయితే,ప్రభుత్వం వైపు చర్చలు జరుపుతున్నట్లు రాని అధికారిక ప్రకటన కేంద్ర మంత్రి జేపీ నడ్డా తమను చర్చలకు పిలిచారు చర్చలకు తాను, మరో అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా చర్చలు జరుపుతామని సౌరవ్ దాస్ వెల్లడి సీజేపీ ఛలో పార్లమెంట్ మార్చ్‌లో ఎంపీ డింపుల్ యాదవ్ సీజేపీ ఛలో పార్లమెంట్ మార్చ్‌లో ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ డింపుల్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారంటున్న ఎస్పీ నేతలు డింపుల్‌తో పాటు పలువురుని నిర్భందించారని ఆరోపణలు ఢిల్లీలో కొనసాగుతున్న ఉద్రిక్తత పార్లమెంట్‌ను ముట్టడించిన సీజేపీ కార్యకర్తలు పార్లమెంట్‌కు వెళ్లే మార్గాలలో సీజేపీ కార్యకర్తల భైటాయింపు కార్యకర్తలపై పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగం పలువురు ఆందోళన కారులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు పోలీసుల అదుపులో దీప్కేపోలీసుల అదుపులో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేదీప్కే దీక్షను విరమింపచేసిన పోలీసులుఅనంతరం పోలీసుల అదుపులో దీక్కే పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాపార్లమెంట్ ఉభయ సభలు వాయిదాప్రతిపక్షాల ఆందోళనతో లోక్‌సభ,రాజ్య సభ రేపటికి వాయిదా సీజేపీ ఆందోళనలో పాల్గొంటా పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనేందుకు తనకు అనుమతి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ సీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనకు స్వయంగా వెళ్లి మద్దతు తెలపాలని ఉందన్న సోనమ్ ఆస్పత్రి నుంచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సప్ధర్‌గంజ్ ఆస్పత్రి సూపరిటెండెంట్లేఖపార్లమెంట్ వద్ద హై అలర్ట్పార్లమెంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్లమెంట్ గేట్లను మూసివేసిన సీఐఎస్ఎఫ్పెద్ద ఎత్తున పార్లమెంట్ వైపు దూసుకొస్తున్న కాక్రోచ్ కార్యకర్తలు. ప్రధాన గేటు వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు. టియర్ గ్యాస్ ప్రయోగం.. To disperse protestors, security personnel lob tear gas shells at the crowd marching towards the parliament in Delhi. https://t.co/ltC8tB3Lht pic.twitter.com/WTqgbLSSrq— Piyush Rai (@Benarasiyaa) July 20, 2026బారికేడ్లను తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం. కాక్రోచ్ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు. నిరసనకారులను చెదరగొడుతున్న పోలీసులు.. పార్లమెంట్ లోపల సెక్యూరిటీ అలర్ట్.. Security beefed up at Parliament gate. Quick response teams take position with assault rifles as CJP protesters marks towards the parliament. Video via @Elizasherine pic.twitter.com/1cTjbf919T— Piyush Rai (@Benarasiyaa) July 20, 2026 పార్లమెంట్‌ను ముట్టడించిన సీజేపీసీజేపీ కార్యకర్తలు పార్లమెంట్‌ను ముట్టడించారు. పార్లమెంట్ వద్ద హైటెన్షన్ చోటుచేసుకుంది. పార్లమెంట్ ప్రధాన గేటు వద్దకు భారీ సంఖ్యలో సీజేపీ కార్యకర్తలు. కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. నిరసనకారులను చెడగొడుతున్న పోలీసులు. మరోవైపు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీపార్లమెంట్ గేట్లను మూసివేసిన పోలీసులు. ఆందోళకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం VIDEO | Delhi: As the CJP's march protest swells, a multi-tiered security lockdown has been put to place to prevent the thousands of marching protesters from breaching the area.Security personnel physically secured the massive iron gates of the Parliament complex. Red fire… pic.twitter.com/DbS6gWbRtX— Press Trust of India (@PTI_News) July 20, 2026 పార్లమెంట్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత..పార్లమెంట్ ప్రధాన గేటుకు చేరుకున్న సీజేపీ కార్యకర్తలు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్పోలీసులు, సీజేపీ కార్యకర్త మధ్య తోపులాట.ఆందోళకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం.సీజేపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు సీజేపీతో మేం చర్చలు జరపం: నడ్డాజేపీ నడ్డాతో చర్చలు ఉంటాయన్న సీజేపీసీజేపీ వ్యాఖ్యలను ఖండించిన నడ్డా.సీజేపీతో ఎలాంటి చర్చలు ఉండవన్న నడ్డాసీజేపీతో మేం చర్చలు జరపం: నడ్డా పార్లమెంట్ ముట్టడికి కాక్రోచ్ పార్టీ విఫలయత్నం.ప్రెస్‌క్లబ్ దగ్గర ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు. Cockroach Janta Party's March to Parliament Updates ll FOEJ Media ll pic.twitter.com/nIVfCdrYj2— FOEJ Media (@FoejMedia) July 20, 2026 పార్లమెంట్ వద్ద పనిచేయని ఫోన్స్..పార్లమెంట్ పరిసరాల్లో పనిచేయని మొబైల్ ఫోన్స్.సీజేపీ పార్లమెంట్ మార్చ్ పిలుపుతో మొబైల్ నెట్‌వర్క్‌పై నిషేధం.సెంట్రల్ ఢిల్లీలో మొబైల్ నెట్‌వర్క్‌పై నిషేధం.పార్లమెంట్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్.పార్లమెంట్‌కు వచ్చేందుకు ఎంపీల అవస్థలు.ఎక్కడికక్కడే భారీగా నిలిచిపోయిన వాహనాలు. बड़ी खबर,Jantar Mantar से संसद मार्च करने जा रहे युवाओं को Delhi Police खदेड़ रही है। https://t.co/CISITchlqB pic.twitter.com/3LF9DXoZfH— Neeraj Bhawani (@Neeraj_Bhawanii) July 20, 2026కేంద్రంపై విద్యార్థుల ఆగ్రహం.. జంతర్ మంతర్‌కు భారీగా తరలివచ్చిన యువతధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలువిద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాలని డిమాండ్నీట్ పేపర్ లీక్ సహా అనేక పోటీ పరీక్షల లీక్‌పై విద్యార్థుల ఆగ్రహంకేంద్ర ప్రభుత్వం స్పందించాలని నినాదాలునీట్ అక్రమాలకు నిరసనగా చల్ పార్లమెంట్ మార్చ్.. #WATCH | Delhi: Azad Samaj Party-Kanshiram President and MP, Chandrashekhar Azad and TMC MP Mahua Moitra at the CJP's protest march site.Protesters gathered for CJP's protest march clash with RPF personnel at Jantar Mantar; RPF personnel & police use lathis for crowd control. pic.twitter.com/UpZDIcbD5O— ANI (@ANI) July 20, 2026జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తత..జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తత..సీజేపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. సీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్. సీజేపీ ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు.పోలీసులతో సీజేపీ కార్యకర్తల వాగ్వాదం#WATCH | Delhi | Protesters gathered for CJP's protest march clash with RPF personnel at Jantar Mantar; RPF personnel & police use lathis for crowd control pic.twitter.com/gijaCjJksW— ANI (@ANI) July 20, 2026ఢిల్లీ:జంతర్ మంతర్‌లో ఇంటర్నెట్ సిగ్నల్ నిలిపివేతకాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ నేపథ్యంలో నెట్వర్క్ నిలిపివేతపనిచేయని ఫోన్ ఇంటర్నెట్ డేటామెట్రో స్టేషన్‌పై పోలీసులు ప్రత్యేక నిఘాఐదు మెట్రో స్టేషన్లు మూసివేత Govt closed the exits on Metro Stations near Jantar Mantar.People started jumping over and exiting.Now the Metros are not even stopping at these stations.This in itself proves that this movement is beyond our analysis.This is a Jan Andolan now 🔥🔥🔥 pic.twitter.com/t429dj25GT— Jatin (@ja3_bajaj) July 20, 2026 పోలీసుల తనిఖీలు..సీజేపీ మార్చ్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ఢిల్లీకి వచ్చే అన్ని దారుల్లో తనిఖీలు.ఢిల్లీ-గురుగ్రామ్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. #WATCH | Delhi Police continue their security checks in view of the CJP's call for a March to Parliament todayVisuals from the Delhi-Gurugram Border. pic.twitter.com/jmU7q0ysnc— ANI (@ANI) July 20, 2026 దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్‌లో ఉన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజున కాక్రోచ్ జనతా పార్టీ(CJP) తలపెట్టిన ‘చలో సంసద్’ మార్చ్ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా హై సెక్యూరిటీ జోన్లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.కాగా.. సీజేపీ జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చింది. నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు 5 వేల మందికి పైగా సిబ్బందిని భద్రత కోసం రంగంలోకి దించారు. అదనంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన 25కు పైగా బెటాలియన్లను కీలక ప్రాంతాల్లో మోహరించారు. మహిళా భద్రతా సిబ్బందిని కూడా విధుల్లో ఉంచారు.15 భద్రతా జోన్లుగా ఢిల్లీ విభజన.. భద్రతా చర్యల్లో భాగంగా న్యూఢిల్లీ ప్రాంతాన్ని 15 సెక్యూరిటీ జోన్లుగా విభజించారు. ప్రతీ జోన్‌కు సీనియర్ పోలీసు అధికారులను బాధ్యులుగా నియమించారు. ఇంటెలిజెన్స్ విభాగం, ఢిల్లీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్‌లు నిరసనకారుల రాకపోకలపై గంట గంటకు సమాచారం అందిస్తున్నాయి. సోమవారం ఉదయం 4 గంటల నుంచే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.Thousands of supporters gather at Jantar Mantar ahead of the 'Chalo Sansad' march organised by the #CockroachJantaParty . Delhi Police have deployed heavy security, multi-layer barricading and traffic arrangements to maintain law & order.#ChaloSansad #JantarMantar #Delhi… pic.twitter.com/z8MdcUDt9E— Ram Naresh (@RamNareshindian) July 20, 2026 పలు కీలక ప్రాంతాల్లో ఆంక్షలువిజయ్ చౌక్, పార్లమెంట్ స్ట్రీట్, ప్రధానమంత్రి నివాసం, సేవా తీర్థ, ఇండియా గేట్ పరిసరాలు, రాష్ట్రపతి భవన్ తదితర హై సెక్యూరిటీ ప్రాంతాల్లో ఎలాంటి నిరసనలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఢిల్లీలో సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. అనుమతి లేకుండా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం, ర్యాలీలు నిర్వహించడం నిషేధించారు.VIDEO | Delhi: Heavy security has been deployed on Jantar Mantar, Raisina Road and Parliament Circle ahead of the Cockroach Janta Party's proposed march to Parliament today, to press for education reforms. pic.twitter.com/OWFvMhv05t— Press Trust of India (@PTI_News) July 20, 2026వాటర్ క్యానన్లు, బారికేడ్లు సిద్ధంనిరసనల సమయంలో పరిస్థితులు అదుపు తప్పకుండా పోలీసులు వాటర్ క్యానన్లు, వజ్రా యాంటీ రయట్ వాహనాలు, ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు, రిజర్వ్ బలగాలను కూడా అప్రమత్తం చేశారు. మెట్రో స్టేషన్లపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. అవసరమైతే కొన్ని స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సమీప ఆసుపత్రులను కూడా అత్యవసర పరిస్థితుల కోసం అప్రమత్తం చేశారు. ఢిల్లీకి వచ్చే అన్ని మార్గాల్లో వాహన తనిఖీలు పెంచారు. బారికేడ్లు, సీసీటీవీ నిఘా, యాంటీ సబోటేజ్ తనిఖీలు, నిరంతర పెట్రోలింగ్ కొనసాగుతున్నాయి.#WATCH | Delhi: Founding President of the Cockroach Janta Party, Abhijeet Dipke, says, "The biggest march in India's history is about to take place. For the past 10-12 years, attempts have been made to destroy democracy in this country. By sitting at Jantar Mantar for a month,… pic.twitter.com/9qjO1ACNtY— ANI (@ANI) July 20, 2026అభిజీత్ కీలక వ్యాఖ్యలు.. ‘చలో సంసద్’ మార్చ్‌కు దేశ చరిత్రలోనే అతిపెద్ద నిరసనగా నిలిచే స్థాయిలో ప్రజలు తరలివస్తున్నారని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే తెలిపారు. జంతర్ మంతర్ వద్ద ఆయన మాట్లాడుతూ, గత 10–12 సంవత్సరాలుగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తి తిరిగి వచ్చిందని అన్నారు. “దేశం నలుమూలల నుంచి ప్రజలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. నేను అమెరికాలో ఉన్నప్పుడు చాలామంది రోడ్లపైకి ఎవరూ రారని, ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్గానే మిగిలిపోతుందని చెప్పారు. కానీ ఇప్పుడు జంతర్ మంతర్‌కు వచ్చే నాలుగు ప్రధాన రహదారులను చూడండి.. అవన్నీ పూర్తిగా నిండిపోయాయి” అని పేర్కొన్నారు. పార్లమెంట్‌కు వెళ్లే తమ మార్చ్‌ను ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు శాంతియుతంగా నిరసనలో పాల్గొంటారని, తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. -
టీఎంసీ రాజకీయం.. అభిషేక్‌పై మమత కీలక వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారీ రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. పార్టీకి ఎన్నో ఏళ్లుగా అండగా నిలిచిన సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా తిరుగుబాటు శిబిరంలో చేరుతుండగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం తన మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా టీఎంసీ సీనియర్ నేత, కమర్హాటి ఎమ్మెల్యే మదన్ మిత్రా తిరుగుబాటు వర్గంలో చేరడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. మూడు దశాబ్దాలకు పైగా మమతకు అత్యంత సన్నిహితుడిగా, పార్టీ ఆవిర్భావం నుంచే కీలక నేతగా ఉన్న మదన్ మిత్రా తీసుకున్న నిర్ణయం టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇటీవల ఆయన కుటుంబ సభ్యులకు పాఠశాల నియామకాల కేసులో ఈడీ నోటీసులు జారీ కావడం, ఆ తర్వాత ఈ రాజకీయ పరిణామం చోటుచేసుకోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు కూడా మమత శిబిరాన్ని వీడి తిరుగుబాటు వర్గంలో చేరారు. పార్టీలో నిర్ణయాలన్నీ కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయని, సీనియర్ నాయకులకు ప్రాధాన్యం తగ్గిందని తిరుగుబాటు నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ చుట్టూ ఏర్పడిన నాయకత్వ వ్యవస్థపై వారు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విమర్శలను మమతా బెనర్జీ పూర్తిగా తోసిపుచ్చారు. అభిషేక్ ఎలాంటి తప్పూ చేయలేదని, భవిష్యత్తులో కూడా ఆయన పార్టీకి కీలక నాయకుడిగానే కొనసాగుతారని స్పష్టం చేశారు. కొంతమంది పార్టీని వీడినా, టీఎంసీ బలహీనపడదని, నమ్మకమైన కార్యకర్తలు, ప్రజలే తమ అసలు బలమని ఆమె వ్యాఖ్యానించారు.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఎదుర్కొన్న పరాజయం తర్వాత పార్టీలో అసంతృప్తి మరింత పెరిగింది. ఎన్నికల ఫలితాలపై సమీక్ష, భవిష్యత్తు వ్యూహంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ఇప్పుడు బహిరంగ తిరుగుబాటుకు దారితీసినట్లు విశ్లేషిస్తున్నారు. మరోవైపు తిరుగుబాటు వర్గం పార్టీ గుర్తు, సంస్థాగత హక్కులపై కూడా పోరాటం కొనసాగిస్తోంది. ఈ అంశం ఎన్నికల సంఘం వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీపై తమకే అసలు హక్కు ఉందని తిరుగుబాటు నేతలు వాదిస్తుండగా, అధికారిక టీఎంసీ మాత్రం ఆ వాదనను ఖండిస్తోంది.ఈ పరిణామాలన్నింటి మధ్య మమతా బెనర్జీ పార్టీని తిరిగి బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టారు. ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, సంస్థాగతంగా పార్టీని పునర్నిర్మించాలని నాయకులకు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో అసలు ప్రశ్న ఒక్కటే... వరుసగా సీనియర్ నేతలు పార్టీని వీడుతున్న వేళ మమతా బెనర్జీ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారు? అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై వస్తున్న విమర్శలకు పార్టీ ఎలా సమాధానం చెబుతుంది? ఈ అంతర్గత పోరు టీఎంసీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది రానున్న రోజుల్లో తేలనుంది. -
సింగరేణి కార్మికులకు శుభవార్త.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, భూపాలపల్లి: తెలంగాణలో సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ తీవ్రంగా దెబ్బతీశాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణిని కేసీఆర్ కుటుంబం తమ జేబు సంస్థగా మార్చుకుని ఇష్టారాజ్యంగా దోపిడీ చేసిందన్నారు. ఇదే సమయంలో సింగరేణి కార్మికులపై ఆదాయపు పన్ను భారం తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.భూపాలపల్లిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘సింగరేణి కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సంస్థ ప్రస్తుతం కష్టనష్టాల్లో ఉంది. కేసీఆర్ పాలన వల్ల సింగరేణి 15 సంవత్సరాలు వెనుకబడింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. దేశంలో ఎక్కడా లేని సమస్యలు సింగరేణిలో ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఒక్కరోజైనా సింగరేణి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించరా?. సింగరేణిని కేసీఆర్ కుటుంబం తమ జేబు సంస్థగా మార్చుకున్నారు. ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో వ్యవహరిస్తోంంది. వాళ్ల తాత జాగీరు అన్నట్లు గత ప్రభుత్వం, తాజా ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి.బొగ్గు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, బొగ్గు లేకపోతే దేశం ఒక్కరోజు కూడా ముందుకు సాగదు. కేసీఆర్ హయాంలో జెన్కోకు రూ.8,958 కోట్ల అప్పు ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ రెండున్నరేళ్లలో మరో రూ.26,875 కోట్ల అప్పు చేసింది. అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శించారు.కర్ణాటకకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడిందని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌లో సుమారు 434 మిలియన్ టన్నుల గ్రేడ్-8 నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, దీనివల్ల సింగరేణికి రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ వచ్చే అవకాశముందని తెలిపారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కాంగ్రెస్ మంత్రులే రెండు వర్గాలుగా విడిపోయి వాటాల కోసం గొడవపడ్డారని ఆరోపించారు. యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం కోసం సింగరేణి నుంచి రూ.500 కోట్లు తీసుకున్నారని, మెస్సీ ఫుట్‌బాల్ కార్యక్రమానికి కూడా సింగరేణి నిధులను వినియోగించారని విమర్శించారు. -
ఉప ఎన్నిక రగడ.. మిశ్రా ఎపిసోడ్‌తో బీజేపీకి తలనొప్పి!
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దాతియా అసెంబ్లీ ఉపఎన్నిక బీజేపీలో అంతర్గత కలకలానికి కారణమైంది. పార్టీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాకు టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాతియా నుంచి ఆశుతోష్ తివారీని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడంతో స్థానికంగా నిరసనలు భగ్గుమన్నాయి.అయితే, దాతియా నియోజకవర్గంలో నరోత్తమ్ మిశ్రాకు బలమైన రాజకీయ పట్టు ఉందని భావిస్తున్న ఆయన వర్గం, ఉపఎన్నికలో ఆయనే బీజేపీ అభ్యర్థిగా ఉంటారని ఆశించింది. అయితే పార్టీ అధిష్ఠానం అనూహ్యంగా ఆశుతోష్ తివారీ పేరును ప్రకటించడంతో మిశ్రా మద్దతుదారుల్లో అసంతృప్తి మొదలైంది.🚨DATIA UPHEAVAL: BJP denies Datia by-election ticket to ex-HM Narottam Mishra, picking grassroots worker Ashutosh Tiwari. Enraged Mishra loyalists choke NH-44 and force markets to shut as the entire district party executive resigns! pic.twitter.com/nqXWxu6L51— HINT News (@9415st) July 10, 2026టికెట్ ప్రకటన అనంతరం దాతియాలో పలుచోట్ల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కొందరు మద్దతుదారులు రహదారులపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఝాన్సీ–గ్వాలియర్ హైవేను దిగ్బంధించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు వార్తలు వచ్చాయి. నరోత్తమ్ మిశ్రాకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ దాతియా జిల్లా అధ్యక్షుడు సహా పలువురు స్థానిక పార్టీ పదాధికారులు సామూహిక రాజీనామా చేసినట్లు సమాచారం. పార్టీ నాయకత్వం నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వారు డిమాండ్ చేశారు.#WATCH | Madhya Pradesh: Vehicles stranded on NH-44 amid heavy protests in Datia and a blockade by former State Home Minister Narottam Mishra's supporters after BJP denied him ticket for the upcoming assembly bypoll. Angered by the decision, thousands of his followers blocked… pic.twitter.com/HetLVNgUTZ— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 11, 2026నరోత్తమ్ మిశ్రా మధ్యప్రదేశ్ బీజేపీలో కీలక నేతగా ఎదిగిన సీనియర్ రాజకీయ నాయకుడు. దాతియా నియోజకవర్గం నుంచి ఆయనకు ప్రత్యేక రాజకీయ గుర్తింపు వచ్చింది. 1960లో జన్మించిన నరోత్తమ్ మిశ్రా బీజేపీలో దీర్ఘకాలంగా పనిచేస్తూ పలు కీలక పదవులు నిర్వహించారు. ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో హోం శాఖ, న్యాయ శాఖ, జైళ్లు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రిగా పనిచేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఆయన ప్రభావశీల మంత్రుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. దాతియా రాజకీయాల్లో నరోత్తమ్ మిశ్రాకు బలమైన పట్టు ఉండేది. ఆయన దాతియా నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర భారతి చేతిలో ఓటమి చవిచూశారు. Datia, Madhya Pradesh: Security has been tightened outside the BJP office in Datia, with heavy police deployment after supporters of BJP leader Narottam Mishra staged a protest over his denial of a ticket for the Assembly bypoll pic.twitter.com/sylfIaKIlh— IANS (@ians_india) July 11, 2026 -
భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతల రాకతో..
సాక్షి, వరంగల్: వరంగల్‌లోని భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రమాణాల పేరుతో ఆలయాన్ని అపవిత్రం చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో, ఆలయం మైల పండిందని బీజేపీ ఆధ్వర్యంలో ఆలయ శుద్దికి కాషాయ పార్టీ నేతలు అక్కడికి వెళ్లారు. అనంతరం, వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఆలయం వద్ద ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. భద్రకాళి ఆలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేశారు. దీంతో బీజేపీ నేతలు భద్రకాళి ఆలయం ఎదుట నిరసన తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా వేలం విషయంలో అవినీతికి పాల్పడ్డాయి. అలాంటి ఆ పార్టీ నాయకులు పవిత్రమైన భద్రకాళి దేవాలయంలో తడి బట్టలతో ప్రమాణాలకు రావడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నించారు. అంతేకాకుండా దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే భద్రకాళి దేవాలయంలో రాజకీయ పార్టీల నిరసనలు భక్తుల్లో ఆగ్రహం తెప్పిస్తున్నాయి. రాజకీయాలకు పవిత్ర దేవాలయాలను దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
నితిన్ నబీన్ పర్యటన పూర్తిగా ఫ్లాప్ షో: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటన పూర్తిగా ఫ్లాప్ షోగా ముగిసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ బీజేపీ నాయకులు చిన్న సమావేశాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని, అలాంటి పరిస్థితిలో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటనపై తాజాగా మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ..‘అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీ విభజన రాజకీయాలను ఇప్పటికే తిరస్కరించారు. జీహెచ్ఎంసీ గురించి మాట్లాడే ముందు హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విధించిన అన్ని అడ్డంకులను తొలగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు బీజేపీ సిద్ధంగా ఉందా?. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నా సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో నితిన్ నబీన్ సమాధానం చెప్పాలి.తెలంగాణలో బూత్‌లు గెలుస్తాం, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుస్తాం అని ప్రగల్భాలు పలికే ముందు గ్రౌండ్ రియాలిటీ చూసుకోవాలి. తెలంగాణలో బెంగాల్ తరహా విభజన రాజకీయాలు సాగవని హెచ్చరించిన ఆయన, నగరాల పేర్లు మార్చడంపైనే బీజేపీ దృష్టి ఉందని, ప్రజల జీవితాలను మార్చే అభివృద్ధి ప్రణాళిక మాత్రం కనిపించడం లేదని విమర్శించారు. సుష్మా స్వరాజ్‌పై తమకు గౌరవం ఉన్నప్పటికీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేయవద్దని అన్నారు. వారసత్వ రాజకీయాలను విమర్శించే బీజేపీ, ఎన్నికల అవసరాల కోసం వారసత్వ నాయకులను పార్టీలో చేర్చుకుంటోందని ఆరోపించారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, తెలంగాణకు రావాల్సిన కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రాజెక్టుల వంటి కీలక అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ జాతీయవాదం పేరును ఉపయోగిస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. -
కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు.. లిస్టులో ఆర్బీఐ మాజీ గవర్నర్?
సాక్షి, ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే భారీ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జూన్ 28 (ఆదివారం) లేదా జూన్ 29 (సోమవారం) మంత్రివర్గ విస్తరణ, శాఖల పునర్విభజన జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి భవన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.వివరాల ప్రకారం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన తేదీలపై చర్చించినట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సమాచారం అధికారికంగా ధృవీకరించబడలేదు. కాగా, ఈసారి యువత, ముఖ్యంగా జెన్-జీ (Gen Z) ఆశయాలకు అనుగుణంగా కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలనే ఆలోచనలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పనితీరు ఆధారంగా కొంతమంది సీనియర్ మంత్రులను తప్పించి, కొత్త ముఖాలకు అవకాశం కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.మాజీ ఆర్బీఐ గవర్నర్ చాన్స్.. ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు కేంద్ర కేబినెట్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే ప్రస్తుతం ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్‌ను విద్యాశాఖకు మార్చి, ఆర్థిక శాఖకు కొత్త నాయకత్వాన్ని తీసుకురావచ్చని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురిలను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అలాగే, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్‌కు మళ్లీ కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం కొనసాగుతోంది.ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా ప్రాధాన్యం పెంచే దిశగా కసరత్తు జరుగుతోందని సమాచారం. ముఖ్యంగా శివసేన (షిండే వర్గం) నుంచి ఎంపీ శ్రీకాంత్ షిండేకు కేబినెట్ మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే అరుణ్ గోవిల్, విష్ణుదత్ శర్మ, జనార్ధన్ సింగ్ సిగ్రీవాల్ పేర్లు కూడా కొత్త మంత్రుల జాబితాలో బలంగా వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరిని తప్పించే అవకాశం ఉందని, పంజాబ్‌లో రవ్నీత్ సింగ్ బిట్టూ స్థానంలో బీజేపీ నేత తరుణ్ చుగ్‌కు అవకాశం ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది.నితీశ్‌కు అవకాశం.. ఇదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక స్థానం కల్పించే అంశంపైనా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై కూడా అధికారిక స్పష్టత లేదు. ఇక కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ వద్ద ఉన్న ఆరోగ్య శాఖ సహాయ మంత్రి బాధ్యతలను మార్చి, ఆయుష్ శాఖను మాత్రమే కొనసాగించే అవకాశం ఉందని, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వద్ద ఉన్న విద్యుత్ శాఖను మరో మంత్రికి అప్పగించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా, పనితీరు సరిగా లేదనే అభిప్రాయంతో అరడజను మంది కేంద్ర సహాయ మంత్రులను (MoS) మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు కూడా ఉన్నాయని ఢిల్లీ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మోదీ కేబినెట్లో భారీ మార్పులు?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే భారీ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు జాతీయ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్లో మార్పులు, చేర్పులపై బీజేపీ అధిష్ఠానం అంతర్గతంగా విస్తృత కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో మరికొందరు మంత్రులను కూడా రాజీనామా చేయాలని పార్టీ నాయకత్వం కోరే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.సమాచారం మేరకు.. కేంద్ర మంత్రివర్గంలో దాదాపు 38 మంది మంత్రుల బాధ్యతల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పనితీరు ఆశించిన స్థాయిలో లేని మంత్రులకు ఉద్వాసన పలుకుతూ, ఎన్నికల దృష్ట్యా కీలక రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు మంత్రి పదవులు కట్టబెట్టే వ్యూహాన్ని బీజేపీ అమలు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెంచే దిశగా నిర్ణయాలు ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే మోదీ కేబినెట్లో చాలా కాలంగా కొనసాగుతున్న కొందరు సీనియర్ మంత్రులను తప్పించి, యువతకు, ముఖ్యంగా జెన్-జీ తరం నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. యువ ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో కొత్త తరానికి చెందిన నాయకులను మంత్రివర్గంలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.మంత్రి పదవుల రేసులో పలు పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ షిండే, ఈటల రాజేందర్, డీకే అరుణ, కకోలీ ఘోష్, తదితర నేతలకు అవకాశాలు ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నుంచి కూడా పలు కీలక మార్పులు ఉండొచ్చని సమాచారం. ఇక ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన ఎంపీలకు(రాఘవ్ చద్దా, టీఎంసీ నుంచి పలువురు, మహారాష్ట్ర నుంచి కొందరు) కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా చర్చలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.గతంలో మోదీ 2.0 ప్రభుత్వ హయాంలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో 12 మంది మంత్రులు రాజీనామా చేయగా, పలువురికి పదోన్నతులు లభించాయి. దాదాపు 30 మంది కొత్త వారికి మంత్రివర్గంలో చోటు దక్కింది. అదే తరహాలో ఈసారి కూడా భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ అధిష్ఠానం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాలపై ఆసక్తి నెలకొంది. రాజకీయంగా కీలకమైన రాష్ట్ర ఎన్నికల ముందు జరిగే ఈ పునర్వ్యవస్థీకరణ దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీయనుంది. -
కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఇటీవల జరిగిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ముఖ్యంగా బీజేపీ–జేడీఎస్ కూటమిలో క్రాస్ ఓటింగ్ ఆరోపణలు రెండు పార్టీల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను బయటపెట్టినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో, కర్ణాటక రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.కాగా, 2023 సెప్టెంబర్‌లో అధికారికంగా ఎన్డీయేలో చేరిన జేడీఎస్, బీజేపీతో కలిసి కాంగ్రెస్‌ను ఎదుర్కోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామికి కేంద్రంలో మంత్రి పదవి కూడా లభించింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన రెండు పార్టీలు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత అనుమానాల మేఘాల్లో చిక్కుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల బదిలీ ఆశించిన స్థాయిలో జరగలేదని, కూటమి ఎమ్మెల్యేలలో కొందరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ప్రచారం జోరుగా సాగుతోంది.దీంతో బీజేపీ–జేడీఎస్ మధ్య ఉన్న సత్సంబంధాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైకి ఐక్యత కనిపిస్తున్నప్పటికీ, లోలోపల అసంతృప్తి ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి కొట్టిపారేశారు. బెంగళూరులోని జేడీఎస్ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీతో తమ పొత్తులో ఎలాంటి సమస్య లేదన్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై పూర్తి వివరాలు తెలియజేస్తానని చెప్పారు.ఈ సందర్భంగా ఎన్నికల్లో కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని కుమారస్వామి ఆరోపించారు. ఈ విషయంపై దర్యాప్తు ఎవరు చేస్తారు? ఎవరికి ఫిర్యాదు చేయాలి? అని ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వెలుగులోకి వచ్చిన క్రాస్ ఓటింగ్ వివాదం కూటమి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
రాజ్‌నాథ్ నివాసంలో రహస్య భేటీ?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని వేదికగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పునకు తెరవెనుక భారీ కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగింది. తాజాగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో రహస్య భేటీ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు హాజరయ్యారని తెలిసింది.దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో రాబోయే ఎన్నికలు, ప్రభుత్వ పనితీరు, కీలక నియామకాలపై అధిష్టానం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్లో ఈసారి భారీగానే మార్పులుంటాయనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. దాదాపు 40 శాతం వరకు మంత్రివర్గంలో మార్పులకు అవకాశం ఉందంటున్నారు. మంత్రుల శాఖల్లో మార్పులు చేపట్టడంతోపాటు, కొందరికి ఉద్వాసన పలికే అవకాశముందని, కొత్త వారికీ చోటు కల్పిస్తారని సమాచారం. మంత్రుల పనితీరు, వయస్సు రీత్యా సమతుల్యత, ఎన్నికల్లో పార్టీకి చేకూరే లబ్ధి.. ఈ మూడు అంశాల ఆధారంగానే ఆర్ఎస్ఎస్ తన ప్రాధాన్యతలను బీజేపీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పాతవారికి కొన్ని అదనపు బాధ్యతలు అప్పగిస్తూనే, కేబినెట్లోకి యువ రక్తాన్ని ఎక్కించేందుకు సంఘ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.రాష్ట్రాలపైనా కన్ను..కేవలం మంత్రివర్గ విస్తరణే కాకుండా, రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చడం ద్వారా కేంద్రం, రాష్ట్రాల మధ్య పరిపాలనాపరమైన సమన్వయాన్ని మరింత పటిష్టం చేయాలని కేంద్రం భావిస్తోంది. భావజాలం, పరిపాలనాపరంగా గట్టి పట్టున్న వారినే గవర్నర్లుగా నియమించేలా ఆర్ఎస్ఎస్ తన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ జాతీయ పదాధికారుల కమిటీలోనూ కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. -
‘అఖిలేశ్ తన ఎంపీలను కాపాడుకోవాలి’
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన పార్లమెంట్ సభ్యులు కొందరు వేరు కుంపటి పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలపై యూపీ మంత్రి, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తమ ఎంపీలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసుకోవాలని సూచించారు.అలాగే.. ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. కొందరు తిరుగుబాటు ఎంపీలు బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వీరికి రెబల్ బల్లియా కుమారుడి నాయకత్వంలో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. పార్టీలో బ్రాహ్మణులకు జరుగుతున్న అవమానాలే ఇందుకు కారణమన్నారు. ఎస్పీలో చీలిక తథ్యమంటూ గత రెండు రోజులుగా ఆయన ఇలాంటి ప్రకటనలు చేస్తుండటం గమనార్హం. ఇందులో నేరుగా ఆయన ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ, సనాతన్ పాండేను ఉద్దేశించే అయి ఉండొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ పుకార్లను కొట్టివేసిన అఖిలేశ్ యాదవ్.. రాజ్‌భర్‌ను పుకార్ల శాఖ మంత్రిగా అభివర్ణించారు.ఎన్డీఏపై కాంగ్రెస్ ధ్వజం మరోవైపు.. ప్రతిపక్షాల నుంచి అధికార ఎన్డీఏలోకి కొనసాగుతున్న వలసలకు హోం మంత్రి అమిత్ షా కుట్రలే కారణమని కాంగ్రెస్ నిందించింది. ఎన్డీఏను అమిత్ షా నేషనల్ డిఫెక్టర్స్ అలయన్స్ (జాతీయ ఫిరాయింపుదారుల కూటమి)గా మార్చేశారని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ గురువారం మీడియాతో మాట్లాడారు. అధికార ఎన్డీఏ కూటమికి లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీని సాధించేందుకు అమిత్ షా చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టడానికి తమ పార్టీ మిత్రపక్షాలతో సంప్రదింపులు జరుపుతోందని ఆయన చెప్పారు. -
పొలిటికల్ హైడ్రామా.. హోటల్లో ఎన్డీయే ఎమ్మెల్యేల లాక్డౌన్!
రాంచీ: జార్ఖండ్‌లో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రేపు (జూన్ 18న) జరగనున్న ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తమ ఎమ్మెల్యేలను రాంచీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు తరలించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. క్రాస్ ఓటింగ్, ఫిరాయింపుల భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.జార్ఖండ్ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు రేపు ఎన్నిక జరగనుంది. అధికార ఇండియా కూటమి తరఫున జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేత బైజ్నాథ్ రామ్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా బరిలో ఉండగా.. ఎన్డీయే మద్దతుతో ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో రెండో సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. జార్ఖండ్ అసెంబ్లీలో ప్రస్తుతం ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యసభ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారింది. ఓటింగ్ ఓపెన్ బ్యాలెట్ విధానంలో జరిగినప్పటికీ, కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించే అవకాశం ఉందనే అనుమానాలు ఇరు కూటముల్లోనూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే తమ ఎమ్మెల్యేలందరినీ ఒకేచోట ఉంచి, ఎన్నిక పూర్తయ్యే వరకు పర్యవేక్షించాలని నిర్ణయించింది.ఇండియా కూటమి అలర్ట్.. సమాచారం మేరకు.. బీజేపీ, ఏజేఎస్‌యూ (AJSU), లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) తదితర ఎన్డీయే భాగస్వామ్య పార్టీల ఎమ్మెల్యేలు రాంచీలోని విలాసవంతమైన హోటల్లో బస చేస్తున్నారు. అక్కడే సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియ, బ్యాలెట్ నిర్వహణ, పార్టీ విప్‌కు అనుగుణంగా ఓటు వేయాల్సిన విధానంపై ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా సూచనలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికార ఇండియా కూటమి కూడా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) తదితర పార్టీల ఎమ్మెల్యేలను ఒకే వేదికపై ఉంచి ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఓటింగ్ విధానంపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం.సంఖ్యా బలమే..ఈ ఎన్నికలో పరిమల్ నత్వానీ అభ్యర్థిత్వం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కూడా జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయనకు అధికార, ప్రతిపక్ష శిబిరాల్లోనూ మంచి పరిచయాలు ఉండటంతో ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. దీంతో ఏ ఒక్క ఓటు కూడా వృథా కాకుండా చూసుకోవడానికి కూటములు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రాజ్యసభ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలను రిసార్ట్లు, హోటళ్లకు తరలించడం దేశ రాజకీయాల్లో కొత్త విషయం కాకపోయినా, జార్ఖండ్‌లో ఈసారి జరుగుతున్న పరిణామాలు ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార ఇండియా కూటమి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. జూన్ 18న జరిగే ఓటింగ్‌తో ఈ రాజకీయ హైడ్రామాకు తెరపడనుంది. -
బీజేపీ బిగ్ ప్లాన్.. వారిద్దరికీ కేంద్ర కేబినెట్ బెర్త్‌లు?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈసారి విస్తరణలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కీలక రాష్ట్రాల వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్‌కు కేంద్ర కేబినెట్లో చోటు దక్కడం దాదాపు ఖాయమైనట్లు ఢిల్లీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు బీజేపీ అధిష్టానం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. పంజాబ్‌కు చెందిన సీనియర్ నేత అయిన తరుణ్ చుగ్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడం ద్వారా సిక్కులు, స్థానిక వర్గాలను ఆకట్టుకోవచ్చని మోదీ–షా ద్వయం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన ఎంపీ రాఘవ్ చద్దాకు సైతం మోదీ కేబినెట్లో బెర్త్ ఖరారైనట్లు తెలుస్తోంది.హైకమాండ్‌కు నమ్మకస్తుడిగా పేరొందిన చుగ్.. పార్టీ తెలంగాణ ఇన్చార్జిగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 8 సీట్లు కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించినట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంకును పెంచడం, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయాలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలు గెలుచుకోవడంలోనూ ఆయన ప్రమేయం ఉందని చెబుతున్నాయి. -
బీజేపీని వీడినా తగ్గని పాపులారిటీ.. అన్నామలై క్రేజ్‌పై కొత్త చర్చ!
కోయంబత్తూరు: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా తన ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించారు. తాజాగా కోయంబత్తూరుకు చేరుకున్న అన్నామలైకి అభిమానులు, మద్దతుదారులు, యువత పెద్ద ఎత్తున స్వాగతం పలకడంతో నగరం రాజకీయ సందడితో మార్మోగిపోయింది. కాగా, విమానాశ్రయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల వరకు వందలాది వాహనాలతో ర్యాలీలు నిర్వహించగా, మద్దతుదారులు పూలమాలలు, నినాదాలతో అన్నామలైకి ఘన స్వాగతం పలికారు. ఆయన కొత్త రాజకీయ ప్రయాణానికి మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.బీజేపీకి రాజీనామా..గత కొంతకాలంగా తమిళనాడు రాజకీయాలపై తన ఆలోచనలు, బీజేపీ కేంద్ర నాయకత్వ వైఖరికి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని అన్నామలై బహిరంగంగానే చెప్పారు. చివరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన, ఈ నిర్ణయం ఒక్కసారిగా తీసుకున్నది కాదని గత 18 నెలలుగా పార్టీ అగ్రనేతలతో చర్చించిన తర్వాతే తీసుకున్నానని వెల్లడించారు.Annamalai 🔥 pic.twitter.com/ufI7oyRHGx— 𝙎𝙄𝙑𝘼Ⓖ (@mrharichandrar1) June 13, 2026కొత్త ఉద్యమానికి శ్రీకారంబీజేపీని వీడిన వెంటనే అన్నామలై "We The Leaders" పేరుతో కొత్త ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. వారసత్వ రాజకీయాలకు ప్రత్యామ్నాయం అందించడం, యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడం, ప్రజలే నాయకులుగా ఎదిగే వేదికను నిర్మించడమే ఈ ఉద్యమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. అన్నామలై ప్రారంభించిన కొత్త ఉద్యమానికి అనూహ్య స్పందన లభించింది. ఉద్యమం ప్రారంభమైన తొలి 24 గంటల్లోనే 13 లక్షల మందికి పైగా సభ్యత్వం నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇది తమిళనాడులో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావానికి సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, అన్నామలై రాజకీయ ప్రయాణంలో కోయంబత్తూరుకు ప్రత్యేక స్థానం ఉంది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆయన రాజకీయంగా ఎదిగిన ప్రాంతాల్లో కోయంబత్తూరు ఒకటి. భవిష్యత్తులో తన రాజకీయ ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా కూడా కోయంబత్తూరును అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.கோவையில் அண்ணாமலை அண்ணா அவர்களுக்கு உற்சாகமான வரவேற்பு! pic.twitter.com/GJJUEfnpL7— Army of Dheeran Annamalai (@annamalai_chap2) June 13, 2026బీజేపీలో కలకలంఅన్నామలై రాజీనామా తర్వాత తమిళనాడు బీజేపీలో అసంతృప్తి పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు నేతలు, కార్యకర్తలు కూడా పార్టీకి రాజీనామా చేయడంతో బీజేపీ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్ కార్యకర్తలను పార్టీని వీడవద్దని కోరుతూ ప్రత్యేక పిలుపునిచ్చారు. మరోవైపు.. అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమం భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఆయనకు లభిస్తున్న ప్రజా స్పందన చూస్తే, తమిళనాడు రాజకీయ సమీకరణాల్లో కొత్త మార్పులకు ఇది నాంది కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
మమతా బెనర్జీకి బిగ్ షాక్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. దీంతో, మమతకు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.కాగా, అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా మార్చి 9వ తేదీన కోల్‌కతాలోని ఎస్ప్లనేడ్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రెండు మతాల మధ్య శత్రుత్వాన్ని పురిగొల్పేలా ప్రసంగించారంటూ వచ్చిన ఫిర్యాదుపై శుక్రవారం నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్లో జీరో–ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం ఆ కేసును ఎస్ప్లనేడ్ పరిధిలోని హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దేశ సార్వభౌమత్వానికి, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మమత వ్యాఖ్యలు చేశారంటూ సిలిగురిలోని సైబర్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది.తుషార్ కాంతి దాస్ అనే వ్యక్తి జూన్ 5న నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, తృణమూల్ కాంగ్రెస్ ఈ కేసును రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించింది. మమతా బెనర్జీపై ఇటీవల నమోదైన పలు ఫిర్యాదుల్లో ఇది మరో కేసుగా మారింది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది. -
బీఆర్ఎస్ కు బిగ్ షాక్..! కమలం గూటికి మల్లారెడ్డి
-
బెంగాల్లో మరో సంచలనం.. మమతకు బిగ్ షాక్!
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ)లో సంక్షోభం మరింత ముదిరింది. టీఎంసీకి చెందిన మంది ఎంపీలు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే టీఎంసీలు ఎమ్మెల్యేలు 60 మంది వేరు కుంపటి పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు మాజీ సీఎం మమతా బెనర్జీకి ఊహించని షాక్ ఇస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై రాజకీయ చర్చలు బలంగా జరుగుతున్నాయి. ఇటీవల బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ మాట్లాడుతూ.. 18–20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో అంతర్గత అసంతృప్తి, పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని వార్తలు వచ్చాయి. పార్టీ తన కమిటీలు, అనుబంధ విభాగాలను రద్దు చేసి పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించింది. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 29 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో ఒకటిగా నిలిచింది.ఇదిలా ఉండగా, అంతకుముందు.. బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ చీలికతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నెగ్గిన రీతాబ్రత బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో భారీ తిరుగుబాటు చెలరేగింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది ఆయనకు మద్దతుగా సంతకాలు చేయడం.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై తీవ్ర సవాల్‌ను విసిరినట్లయ్యింది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిన వెంటనే పార్టీలో అసంతృప్తి వేగంగా పెరిగింది. పార్టీ అధినేత్రి నివాసంలో జరిగిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది(దాదాపు 60 మంది) గైర్హాజరు కావడం పరిస్థితి తీవ్రతను చూపించింది. అంతేకాకుండా, మమతా నిర్వహించిన బహిరంగ నిరసన కార్యక్రమానికి కూడా చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకావడం పార్టీలో లోతైన విభేదాలను బయటపెట్టింది. విశ్లేషకుల ప్రకారం.. ఇది సిద్ధాంత ఆధారిత తిరుగుబాటు కాదు. ఇది మమతా నాయకత్వంపై అసంతృప్తి, అలాగే ప్రతిపక్ష నేత పదవి సహా అధికార పంపకాలపై ఉన్న ఆగ్రహం కలయికగా కనిపిస్తోంది. -
ఎమ్మెల్సీ ఐదో సీటు ఎవరిది.. క్రాస్ ఓటింగ్?
శివాజీనగర: కర్ణాటక విధానసభ కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలపై కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లలోని అనేకమంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఒక్కో సీటు పొందాలంటే 28 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరముంది. 112 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ నుంచి నలుగురు సునాయాసంగా గెలుస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 135 కాగా, ఇంకా 23 ఓట్లు మిగిలి ఉంటాయి. దీంతో ఐదో సీటు మీద కూడా హస్తం నేతలు కన్నేశారు. సర్వోదయ కర్ణాటక పార్టీకి చెందిన దర్శన్ పుట్టణ్ణయ్య కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఎస్.టీ.సోమశేఖర్, శివరామ్ హెబ్బార్‌కు కాంగ్రెస్‌తో సత్సంబంధాలున్నాయి. మరో ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుతో ఐదో సీటును స్వాధీనం చేసుకోవచ్చని కేపీసీసీ నేతలు నిశ్చయించారు.క్రాస్ ఓటింగ్ జరిగేనా?బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 62 కాగా, 2 ఎమ్మెల్సీ సీట్లు పొందగలదు. ఇంకా 6 ఓట్లు మిగులుతాయి. జేడీఎస్ శిబిరంలో 18 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ మద్దతు కోరుతోంది. ఈ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ జరుగుతుంది. అందుచేత క్రాస్ ఓటింగ్ జరిగినా కూడా కనిపెట్టడం కష్టమని పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్‌లు క్రాస్ ఓటింగ్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కాంగ్రెస్ ఐదో స్థానం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఎవరిది పైచేయి అవుతుందనేది ఉత్కంఠభరితంగా మారింది. మొత్తం 7 స్థానాలకు అంతేమంది నామినేషన్ వేస్తే పోలింగ్ జరగదు. ఎనిమిది మంది బరిలో నిలిస్తే పోలింగ్ యుద్ధం తప్పదు. -
బీజేపీ ఎదుగుదల ఓర్వలేక ఈటలపై పోస్టర్లు: రామచందర్‌రావు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు. రైతుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. అలాగే, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై పోస్టర్ల విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో నెల రోజులు ఆలస్యంగా ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే ఇలా జరిగింది. రైతుల జీవితాలతో ఆడుకోవద్దు. బీజేపీ రాజేందర్‌పై పోస్టర్లు వేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఈ పోస్టర్లకు పార్టీ నేతలకు సంబంధం లేదు. బీజేపీ ఎదుగుదల ఓర్వలేక ఇలా పోస్టర్లు వేస్తున్నారు. దీనిపై డీజీపీ, కమిషనర్లకు ఫిర్యాదు చేశాం. ఢిల్లీ తెలంగాణ భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు’ అని చెప్పుకొచ్చారు.కాగా, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను విమర్శిస్తూ ఆయన ఇంటి వద్ద ఫ్లెక్సీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ‘నీ ఏడుపే బీజేపీకి శాపం.. బీజేపీ నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. బీజేపీకి నువ్ చేసిన ఒక్క మేలైనా చెప్పగలవా?’ అంటూ వెలిసిన ఫ్లెక్సీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఫ్లెక్సీలో ‘రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు’ అని విమర్శించారు.అలాగే బీజేపీ ఈటలకు చేసిన మేలును తెలుపుతూ ‘ఓడిపోయినా మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్ ఇచ్చింది.. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది.. మోదీ నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్‌తో గెలిచాను అనడం ఏ రాజకీయ నైతికత’ అని ఫ్లెక్సీలో ప్రశ్నించారు. ‘బీజేపీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు? ఇందూరు బిడ్డ ఎంపీ అర్వింద్‌కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మంట ఎందుకు? అని నిలదీశారు. గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. దీంతో, బీజేపీలో నేతల మధ్య ఉన్న విభేదాలు ఉన్నట్టు మరోసారి బహిర్గతమైంది. -
అన్నామలై కొత్త పార్టీ?
సాక్షి, చైన్నె: తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీతో రాజకీయాలలోకి రాబోతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఇందుకు అనుగుణంగా జూన్ 4వ తేదీన అన్నామలై పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన మద్దతుదారులు, అభిమానులు కోయంబత్తూరు నగరంలో పెద్దఎత్తున పోస్టర్లను హోరెత్తించడం చర్చకు దారి తీసింది. అయితే, తమిళనాడులో బీజేపి బలోపేతానికి కృషి చేసి అన్నామలైను అన్నాడీఎంకే ఒత్తిడితో అధ్యక్ష పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. కానీ, ఆయనకు ఇంత వరకు బీజేపీలో గానీ, కేంద్రంలోని ఎలాంటి పదవీ అన్నది ఇవ్వలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి సైత దూరంగా నిలబడ్డ అన్నామలై తాజాగా కొత్త పార్టీతో రాజకీయాలలోకి రాబోతున్నట్టు ఆదివారం ప్రచారం ఊపందుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా ‘మా నాయకుడా. ముందుండి నడిపించు అన్న నినాదంతో కోయంబత్తూరు మాజీ మేయర్ ఉత్తమ్ బాలాజీ రామస్వామికి చెందిన ఉత్తమ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నగరమంతటా అన్నామలైకు మద్దతుగా భారీ పోస్టర్లను అతికించారు. సింగనల్లూరు, అవినాశి రోడ్డుతో పాటు నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వాటిపై అన్నామలై చిత్రాలతో పాటు.. ‘మా నాయకా, ముందుకొచ్చి నాయకత్వం వహించండి..రా.. నాయకత్వం వహించు‘ అనే నినాదాలను ముద్రించడం చర్చకు దారి తీసింది.BIG NEWS - Annamalai to launch People’s Movement in Tamil Nadu.It won't be a political party. He will enrol like-minded people and build a strong volunteer base as per reports.Your thoughts?pic.twitter.com/eekuEIb1rK— News Algebra (@NewsAlgebraIND) May 31, 2026 -
బెంగాల్లో మరో సంచలనం.. మమత వార్నింగ్ ఆడియో లీక్
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా ఆందోళనకరంగా మారాయి. తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు రాళ్లు విసరడం, శారీరకంగా దాడి చేయడం వల్ల అభిషేక్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ క్రమంలో కోల్‌కతాలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రి సీఈవోకు ఆమె వార్నింగ్ ఇస్తున్న ఆడియో బయటకు వచ్చింది. దీంతో, ఇది కాస్త రాజకీయ దుమారం రేపింది. అభిషేక్ బెనర్జీపై సోనార్‌పుర్‌లో దాడి అనంతరం.. ఆయనను చికిత్స కోసం బెల్ వ్యూ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ బెల్ వ్యూ ఆసుపత్రి సీఈవో ప్రదీప్ టాండన్‌ను హెచ్చరిస్తున్న ఆడియో బయటకు వచ్చింది. ‘టాండన్ మీరు తప్పుచేశారు. మేము మీకు చేసిన సాయాన్ని గుర్తుచేసుకోండి. దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీ అహంకారాన్ని గుర్తుంచుకుంటాం. మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆస్పత్రిని నడుపుతున్నారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. తర్వాత వాళ్లు అధికారం కోల్పోతే.. మేం చేయాల్సింది చేస్తాం’ అని ఆడియోలో ఉంది.అయితే, అభిషేక్ పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ.. డిశ్చార్జ్ చేయాలంటూ బీజేపీ నాయకులు, ఓ సీనియర్ పోలీసు అధికారి ఆస్పత్రిపై ఒత్తిడి తెచ్చారని మమత ఆరోపించారు. తన మేనల్లుడికి ఏమైనా జరిగితే ఆసుపత్రిదే బాధ్యత అని మండిపడ్డారు. కాగా, ప్రస్తుతం అభిషేక్ బెనర్జీకి ఇంట్లోనే చికిత్స అందిస్తున్నట్లు మమత తెలిపారు. కాగా.. ఈ దాడికి సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.Last night Mamata Banerjee was shouting at the Hospital Authorities of Belle Vue & especially against Mr. Pradip Tandon (CEO), her arrogance isn't going away either. pic.twitter.com/CP8djkGYns— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) May 31, 2026ఇదిలా ఉండగా.. సోనార్‌పుర్‌లో అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి తర్వాత ఆయన ఛాతీలో రక్తపు గడ్డలు ఏర్పడ్డాయని మమత తెలిపారు. అభిషేక్‌కు హెల్మెట్ పెట్టకపోయి ఉంటే ఆయన చనిపోయి ఉండేవాడని ఆరోపించారు. ప్రజలు రాళ్లు విసరడం, శారీరకంగా దాడి చేయడం వల్ల తన మేనల్లుడి ఛాతీ, పక్కటెముకల ప్రాంతంలో గాయాలయ్యాయని పేర్కొన్నారు. అభిషేక్‌కు సరైన చికిత్స అందించకుండా ఉండేందుకు ఆసుపత్రులకు పైనుంచి ఒత్తిడి ఉందని విమర్శించారు. అలాగే, అభిషేక్ సోనార్‌పుర్ పర్యటన గురించి పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, వారు ఎందుకు తగిన భద్రత ఏర్పాట్లు కల్పించలేకపోయారని ప్రశ్నించారు. హింసను సృష్టించేందుకే బీజేపీ బయటి వ్యక్తులను రప్పించిందని ఆరోపించారు. బీజేపీ చట్ట ప్రకారం పనిచేయాలని కోరారు. ఆస్పత్రికి వచ్చినవారిలో ఎవరికి చికిత్స చేయాలి? ఎవరికి చేయకూడదు? అనే దానికి బీజేపీ నుంచి అనుమతి కావాలని మండిపడ్డారు. అంత అమానవీయంగా బీజేపీ తయారయ్యిందని ఫైర్ అయ్యారు. -
కర్ణాటక రాజకీయం.. సీఎం కుర్చీ శాపమేనా?
నిశ్చలత.. సుస్థిరత అనేది కన్నడ రాజకీయాలు, ప్రభుత్వాలలో ఎండమావిగానే మిగిలిపోయింది. ఉన్నత పదవికి సోపానమే ధ్యేయంగా, జీవిత లక్ష్యంగా నేతలకు మారడంతో పదవీ రాజకీయాలు పతాకస్థాయికి చేరాయి. ఓ పార్టీలో నుంచి అవలీలగా మరో పార్టీలోకి చేరడం, అంతే వేగంగా ఇంకో పక్షంలోకి దూకడం సాధారణ విషయాలయ్యాయి. ఎన్నికల సమయంలో అయితే ఈ విన్యాసాలకు అంతం ఉండదు. తాజాగా జరిగిన పరిణామాలు కొత్తవేమీ కాదనేది తేటతెల్లమే. గతంలోనూ దశాబ్దాలుగా కుర్చీ రాజకీయాలకు ప్రజలు సుపరిచితం. అందుకే ఎక్కువమంది ముఖ్యమంత్రులు ఐదేళ్ల పాటు సీటులో కూర్చోలేకపోయారు. రాష్ట్ర నేతల వ్యూహాలు, హైకమాండ్ల నిర్ణయాలు ముఖ్యమంత్రి పోస్టును మూణ్నాళ్ల ముచ్చట చేశాయి. కన్నడనాట ముఖ్యమంత్రి పీఠం అనేది ప్రతి ఒక్క ముఖ్య నేతకు ఓ కల.. ఈ కలను నెరవేర్చుకునేందుకు అనేక ఎత్తుకుపైఎత్తులు వేయాల్సి ఉంటుంది. సీఎం పీఠం దక్కాకా కూడా ఐదేళ్ల పాటు ఈ పదవిలో కూర్చొంటామనే గ్యారెంటీ లేదు. కర్ణాటక రాజకీయ ముఖచిత్రం గమనించే ఎవరికైనా ఈ విషయం సుస్పష్టంగా అర్థం అవుతుంది. చరిత్రలో ఒకరిద్దరు మినహాయించి ఏ ముఖ్యమంత్రి కూడా గట్టిగా ఐదేళ్ల పాటు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేదు. ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి వైకుంఠపాళిని తలపిస్తూ ముఖ్యమంత్రుల మార్పులు కర్ణాటకలో నిత్యకృత్యంగా మారిపోయాయి. సిద్దు– డీకే వార్ ప్రస్తుతం సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య జరుగుతున్న అధికార మారి్పడి వివాదం కొలిక్కి వచ్చింది. అయితే ఇలా ముఖ్యమంత్రి సీటు కోసం జరుగుతున్న పొలిటికల్ వార్ కర్ణాటకకు కొత్తేమీ కాదు.. గతంలో కూడా పలుమార్లు సీఎం పదవి కోసం చాలా మంది నేతలు యుద్ధాలు చేశారు. ఇందులో కొందరు పైచేయి సాధిస్తే మరికొందరు చతికిలపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అనే ఇద్దరు మేటి నాయకులు పోటీపడ్డారు. చాలా రోజుల చర్చల తర్వాత ఆ పార్టీ అధిష్టానం సిద్ధరామయ్యను సీఎంగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత కథ తెలిసిందే. ఎస్ఎం కృష్ణ హయాం నుంచీ గతంలోకెళ్తే ఎస్ఎం కృష్ణ పదవీకాలంలోనూ ఆ తర్వాత కుమారస్వామి–యడియూరప్ప సంకీర్ణ ప్రభుత్వంలోనూ సీఎం పదవి కోసం పోరాటాలు జరిగిన చరిత్ర ఉంది. 1980–1990 మధ్య కాలంలో కూడా ఇదే విధంగా సీఎం పదవి కోసం పలువురు పోటీపడ్డారు. జనతా పార్టీలో నెలకొన్న మనస్పర్థల కారణంగా తరచూ ముఖ్యమంత్రుల మార్పు జరిగింది. ఆరోపణలు, ప్రత్యర్థి వర్గం ఒత్తిళ్ల మేరకు అప్పట్లో రామకృష్ణ హెగ్డే అధికారం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 1990 దశాబ్దంలో కూడా జనాతదళ్తో గొడవలు తీవ్రతరం అవ్వడంతో పార్టీ విభజన జరిగిపోయింది. ఈ కారణంగా ఎస్ఎం కృష్ణ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2018–2019లో సంకీర్ణ ప్రభుత్వం తర్వాత కూడా హఠాత్తుగా సీఎం మార్పు జరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ మెజారిటీ నంబర్ 113కు దగ్గరగా వచ్చి ఆగింది. అయితే ఎన్నికల అనంతరం జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ సీఎం స్థానాన్ని హెచ్డీ కుమారస్వామికి అప్పగించింది. ఏడాదికే ఆపరేషన్ కమలతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 2019లో బీఎస్ యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత బీజేపీ హైకమాండ్ యడియూరప్పతో రాజీనామా చేయించి 2021లో బసవరాజు బొమ్మైకి సీఎం కుర్చీని కట్టబెట్టింది.యడియూరప్పకూ ఎదురుదెబ్బలు 2011లో బీజేపీ గెలిచి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిన బీఎస్ యడియూరప్పపై భారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత బీజేపీలో వర్గ పోరు వల్ల ఏ సీఎం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. నాలుగేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆపై సదానంద గౌడ కొన్నాళ్లు, జగదీశ్ శెట్టర్ కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో సీఎం పదవి కోసం జరిగిన ప్రధాన డ్రామాలు..2006 కుమారస్వామి సర్కార్ పతనం:కాంగ్రెస్ పార్టీతో పొత్తు వీగిపోవడంతో బీజేపీతో కలసి జేడీఎస్ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు2007 అధికార మార్పిడి వివాదం:బీజేపీ–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు. తరువాత అధికార మార్పిడి ఒప్పందంలో తలెత్తిన వివాదం, కుప్పకూలిన ప్రభుత్వం2018 స్పష్టమైన మెజారిటీ లేని ఫలితంబీజేపీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా గెలిచినప్పటికీ సంఖ్యాబలం లోపించింది. కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కటై సర్కారును ఏర్పాటు చేశాయి 2019 ఆపరేషన్ కమల: బీజేపీలోకి ఫిరాయించిన కాంగ్రెస్–జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. సామూహిక రాజీనామాలు, కూలిన సంకీర్ణ ప్రభుత్వం, మళ్లీ అధికారంలోకి బీజేపీ.2023 కాంగ్రెస్ పార్టీ గెలుపు: సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ. -
ఇండియా కూటమిపై మమత కీలక ప్రకటన
కోల్‌కతా: ప్రతిపక్ష ఇండియా కూటమిపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి భేటీ జూన్ మొదటి వారంలోనే జరిగే అవకాశాలున్నాయని మమతా బెనర్జీ చెప్పారు. ఈ భేటీలో ఉమ్మడి వ్యూహాన్ని చర్చిస్తామని చెప్పారు. అధికార బీజేపీతో సుదీర్ఘ రాజకీయ పోరాటానికి తమ కూటమి సిద్ధంగా ఉందని ఆమె ప్రకటించారు.ఈ సందర్భంగా ఇటీవలి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలకు బీజేపీ పాల్పడిందన్నారు. కనీసం 150 నియోజకవర్గాల్లో టీఎంసీకి దక్కాల్సిన ఓట్లను తారుమారు చేశారని ఆరోపించారు. ఓడిపోయే సీట్లను గెల్చుకుని, గెలవాల్సిన చోట్ల ఓడిపోయామన్నారు. లేకుంటే టీఎంసీకి 220 నుంచి 230 సీట్లు దక్కి ఉండేవని చెప్పారు.మమత వాదనను బీజేపీ నాయకురాలు కీయా ఘోష్ ఖండించారు. ప్రజల తీర్పును అంగీకరించేందుకు నిరాకరిస్తున్న మమతా బెనర్జీ, బదులుగా కుట్ర సిద్ధాంతాలతో ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. 2011, 2016, 2021 ఎన్నికల ఫలితాలను చట్టబద్ధమైనవిగా అంగీకరించి, ఇప్పుడెందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారంటూ మమతను నిలదీశారు. మమత దృష్టిలో గెలుపంటే.. బూత్‌లను ఆక్రమించుకోవడం, రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడటం, హింసను ప్రేరేపించడమేనని ఆమె వ్యాఖ్యానించారు. -
ఫల్తా రీపోలింగ్‌లో బీజేపీ లక్ష ఓట్ల తేడాతో ఘన విజయం.. ఇక టీఎంసీ..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గం రీపోలింగ్‌లో బీజేపీ భారీ విజయం సాధించింది. ఫల్తా స్థానానికి గురువారం (మే 21) రీపోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి దేవాంగ్షు పాండా తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి శంభు నాథ్ కుర్మీపై లక్షకు పైగా (1,09,021) ఓట్ల తేడాతో గెలిచారు.తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, తనను తాను ‘‘పుష్ప’’గా చెప్పుకున్న జహంగీర్ ఖాన్ గత వారం రీపోలింగ్ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ‘‘పుష్ప’’ సంగతి తాను చూసుకుంటానని ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా అన్నారు. ‘‘పుష్ప’’ సినిమాలో అల్లు అర్జున్‌లా జహంగీర్ ఖాన్ తనను తాను పోల్చుకునేవారు. అందుకే ఆయనను ‘‘పుష్ప’’ అని అంటుంటారు.ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ పోలింగ్ సమయంలో ఓటింగ్ యంత్రాల్లో జోక్యం జరిగిందన్న ఆరోపణలు, ఎన్నికల అక్రమాల ఫిర్యాదుల తర్వాత ఈ నియోజకవర్గంలోని మొత్తం 285 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించారు. గురువారం జరిగిన రీపోలింగ్‌లో మొత్తం 2.36 లక్షల ఓటర్లలో 87 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.రీపోలింగ్ సందర్భంగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఈ నియోజకవర్గంలో భద్రతను రెట్టింపు చేశారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరిపేందుకు కేంద్ర బలగాల 25 కంపెనీలను మోహరించారు.ఫల్తా నియోజక వర్గం తృణమూల్‌కు బలమైన కోటగా ఉండేది. లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆధిపత్యం ఉన్న డైమండ్ హార్బర్ పరిధిలో ఈ స్థానం ఉంది. 2011 నుంచి ఈ స్థానంలో తృణమూల్ గెలుస్తోంది. అయినప్పటికీ తృణమూల్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ కొన్ని రోజుల ముందే పోటీ నుంచి తప్పుకున్నారు.ఈ ఎన్నికలో దేవాంగ్షు పాండా (బీజేపీ)తో పాటు అబ్దుర్ రజాక్ మోల్లా (కాంగ్రెస్), శంభు నాథ్ కుర్మీ (సీపీఎం), ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. పాండాకు 1,49,666 ఓట్లు, కుర్మీకి 40,645 ఓట్లు, మోల్లాకు 10,084 ఓట్లు, ఖాన్‌కు 7,783 ఓట్లు వచ్చాయి. ఖాన్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ అప్పటికే నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ కూడా అయిపోవడంతో ఆయన పేరు, టీఎంసీ గుర్తు ఈవీఎంలపై ఉంది.రీపోలింగ్‌కు రెండు రోజుల ముందు జహంగీర్ ఖాన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఫల్తా ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చినందుకు తాను పోటీ నుంచి తప్పుకున్నానని చెప్పుకొచ్చారు. జహంగీర్ ఖాన్ నిర్ణయంతో తమకు సంబంధం లేదని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. “బీజేపీ బెదిరింపులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం” అని పేర్కొంది. -
తెలంగాణ నేతలకు బంపరాఫర్.. కేంద్ర కేబినెట్లో చోటు?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సాయంత్రం ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు తప్పనిసరిగా హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, త్వరలో కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఇద్దరికీ సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది సమాచారం.కాగా, కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల అవుతున్న నేపథ్యంలో మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయనున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పని తీరు సరిగా లేని మంత్రులకు ఉద్వాసన పలికి.. కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీజేపీలో ఆప్ రాజ్యసభ పక్షం విలీనంలో కీలకపాత్ర పోషించిన ఎంపీ రాఘవ్ చద్దాకు కేబినెట్ పదవి దక్కే అవకాశముంది. అలాగే, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓం బిర్లా స్థానంలో ఓ మహిళకు లోక్‌సభ స్పీకర్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.ఇక, తెలంగాణ నుంచి ఇద్దరికీ సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ఈటల రాజేందర్‌కు మంత్రివర్గంలో ఛాన్స్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే, కిషన్ రెడ్డికి శాఖ మార్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం మంత్రి మండలిలో 30 మంది కేబినెట్ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర మంత్రులు ఉన్నారు. వీరిలో ఎవరిని తప్పిస్తారనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరగబోయే ఈ సమావేశం ఆర్థిక, రాజకీయ పరంగా కీలకంగా మారింది. పశ్చిమ ఆసియా సంక్షోభం ప్రభావం, చమురు ధరల పెరుగుదలపై చర్చలు జరగనున్నాయి. -
టీఎంసీకి ఝలక్.. అభిషేక్ బెనర్జీనే కారణమా?
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన తర్వాత తృణముల్ కాంగ్రెస్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్ దేబాలినా బిస్వాస్ కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఆమె రాజీనామా లేఖ వెలుగులోకి రావడంతో టీఎంసీకి భారీ షాక్ తగిలింది. అయితే, టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కారణంగానే ఆమె తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.టీఎంసీ నియంత్రణలో ఉన్న కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ), అభిషేక్ బెనర్జీకి సంబంధించిన 17 ఆస్తులకు నోటీసులు జారీ చేసిన మరుసటి రోజు ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ సందర్బంగా దేబాలినా బిస్వాస్ మాట్లాడుతూ..‘నేను నా పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాలా రాయ్‌కి లేఖ పంపాను. కౌన్సిలర్‌గా కొనసాగుతూ, నా ప్రాంత ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఈ పదవిలో చాలా కాలంగా ఉన్నాను, కానీ ఇప్పుడు తప్పుకుంటున్నాను. నేను ఇది పూర్తిగా పార్టీ సంబంధిత కారణాల వల్ల చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. అయితే, అభిషేక్ బెనర్జీ నివాసం.. అక్రమ నిర్మాణంగా జరిగిందంటూ కేఎంసీ (KMC) నోటీసులు జారీ చేసిన తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మరియు పార్టీ అగ్ర నాయకత్వం తనపై ఒత్తిడి తెచ్చారని బిస్వాస్ ఆరోపించారు. ఈ క్రమంలో..‘నిన్న నోటీసు ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు. అకస్మాత్తుగా, అర్ధరాత్రి వేళ ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. ‘లేదు, ఇది సరికాదు’ అని నాకు అనిపించింది. తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వమని ఒకరిని బలవంతం చేయడం లేదా వారి ఇష్టానికి వ్యతిరేకంగా పనులు చేయమని ఒత్తిడి చేయడం పార్టీకి తగదని నేను భావిస్తున్నాను. విషయాన్ని కప్పిపుచ్చడం సరైన పద్ధతి కాదు. మనం అడగాలి. ఇది ఎందుకు జరిగింది? ఇది ఎలా జరిగింది? దీనికి ఎవరు బాధ్యులు?. కొన్ని విషయాలు నా పరిధిలోకి రావు’ అని వ్యాఖ్యానించారు.అభిషేక్ బెనర్జీ కంపెనీ, కుటుంబానికి సంబంధించి కేఎంసీ నోటీసులు అందుకున్న 17 చిరునామాలలో, 14 చిరునామాలు బిస్వాస్ అధ్యక్షత వహించిన బరో 9 పరిధిలోకి వస్తాయి. నోటీసులు జారీ చేసిన తర్వాత సోమవారం రాత్రి నుంచే పార్టీ నాయకుల నుంచి ఫోన్లు రావడం ప్రారంభమయ్యాయని ఆమె చెప్పారు. పార్టీ అగ్ర నాయకత్వంలోని ఒక వర్గం ఆదేశాల మేరకు బిస్వాస్ రాజీనామా చేశారని టీఎంసీ నాయకుల్లో ఒక వర్గం ఆరోపిస్తోంది. కాగా, తన రాజీనామా ఇంకా అధికారికంగా ఆమోదించబడలేదని బిస్వాస్ తెలిపారు. మరోవైపు.. నగరంలో అభిషేక్ బెనర్జీకి అనేక అక్రమ ఆస్తులు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. -
బీజేపీ రాజకీయం.. కేంద్ర కేబినెట్లో సమూల మార్పులు?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు అధికార బీజేపీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మంత్రివర్గ విస్తరణ తథ్యమంటూ ఢిల్లీలో రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీతోపాటు ప్రభుత్వంలోనూ కొత్త సమీకరణాలకు బీజేపీ అధిష్టానం తెరలేపే అవకాశముందని సమాచారం.ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈనెల 21వ తేదీన పూర్తిస్థాయి కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ పథకాల అమలు, వివిధ మంత్రిత్వ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై రేపటి కేబినెట్ సమావేశంలో సమీక్ష జరగనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాంలో మెరుగైన ఫలితాలు సాధించడం, పుదుచ్చేరిలో ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2027లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో ఎన్నికల రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త మంత్రివర్గం, పార్టీ జాతీయ బృందం రూపుదిద్దుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యువత, మహిళల్లో కొత్త వారికి అవకాశం కలి్పస్తూ, కొంతమంది సీనియర్ నేతలను పార్టీ సంస్థాగత బాధ్యతలకు అప్పగించేలా కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని రెండోసారి అధికారం చేపట్టాక 2.0 ప్రభుత్వంలో 2021 జూలైలో కేబినెట్లో భారీ మార్పులు చేపట్టారు. మొత్తం 12 మంది మంత్రులను తప్పించారు. కొత్తగా 36 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. -
సిరిసిల్లలో ఉద్రిక్తత.. పోలీసులు లాఠీచార్జ్
సాక్షి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘బండి సంజయ్ డౌన్ డౌన్’.. ‘కేటీఆర్ డౌన్ డౌన్’ అంటూ ఇరువర్గాల పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు సమాచారం. రెండు పార్టీ నేతల నిరసనలతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.వివరాల మేరకు.. సిరిసిల్లలోని నేతన్న చౌరస్తా వద్ద బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల పోటాపోటీ ధర్నాకు దిగాయి. ఈ క్రమంలో పరస్పర నినాదాలతో చౌరస్తా దద్దరిల్లింది. అనంతరం, బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణ కొట్టుకునే స్థాయికి చేరింది. ‘బండి సంజయ్ డౌన్ డౌన్’.. ‘కేటీఆర్ డౌన్ డౌన్’ అంటూ ఇరువర్గాల భారీ నినాదాలు చేశాయి. దీంతో, రంగంలోకి దిగి ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసుల లాఠీచార్జ్ చేశారు.కాగా, ఉభయ పార్టీల నేతలు.. పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీంతో, జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిరిసిల్ల నేతన్న చౌరస్తా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రెండు పార్టీ నేతలను అటువైపు రాకుండా అడ్డుకుంటున్నారు. -
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరాజయం నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ అన్నామలై బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ జాతీ నేత పీఎల్ సంతోష్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో మెజారిటీ శాతం మంది అన్నామలైకే మళ్లీ బాధ్యతలు అప్పగించాలని పట్టుబట్టినట్టు సమాచారాలు వెలువడ్డాయి.అసెంబ్లీకి ఎన్నికల ముందుగా అన్నాడీఎంకే ఒత్తిడి మేరకు అన్నామలైను అధ్యక్ష పదవి నుంచి బీజేపీ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నైనార్ నాగేంద్రన్ నియమితులయ్యారు. ఈ ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓటమి చవి చూసింది. నైనార్ నాగేంద్రన్ సైతం ఓటమి పాలు కావడంతో ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న నినాదం బీజేపీలో బయలు దేరింది. దీంతో అధ్యక్ష మార్పు విషయంగా పీఎల్ సంతోష్ ద్వారా అభిప్రాయాల సేకరణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నిర్ణయించినట్టుగా సమాచారాలు వెలువడ్డాయి.ఈ మేరకు పీఎల్ సంతోష్ అభిప్రాయాల సేకరణలో నిమగ్నమయ్యారు. మెజారిటీ శాతం మంది అన్నామలై ద్వారానే బీజేపీ బలోపేతం సాధ్యమన్నది స్పష్టం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆయన్ని మళ్లీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఆయనకు ఈసారి రాజ్యసభ పదవి కూడా ఇవ్వబోతున్నట్టుగా మద్దతుదారులు పేర్కొంటుండటం గమనార్హం. -
మమతకు బిగ్ షాక్.. సువేందు అధికారి అదిరిపోయే దెబ్బ
పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం, ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను, గుర్తులను సువేందు ప్రభుత్వం తొలగిస్తోంది. ఇందులో భాగంగా మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘బిస్వా బంగ్లా’ లోగోను రాష్ట్రవ్యాప్తంగా తొలగిస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారిక వేదికలు, ప్రజా మౌలిక సదుపాయాల నుండి అధికారికంగా తొలగించడం ప్రారంభించింది. దీనికి బదులుగా భారతదేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు.కాగా, మాజీ సీఎం మమతా బెనర్జీ సెప్టెంబర్ 16, 2013న బిస్వా బంగ్లా బ్రాండ్ లోగోను ప్రారంభించారు. బెంగాల్ సాంస్కృతిక గుర్తింపు, పర్యాటకం, సాంప్రదాయ కళలు మరియు చేతివృత్తులకు ప్రాతినిధ్యం వహించే చిహ్నంగా దీనిని రూపొందించారు. బెంగాలీ అక్షరం “B” చుట్టూ రూపొందించబడిన ఈ లోగో, తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ వెబ్సైట్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు మరియు సుందరీకరణ కార్యక్రమాలలో క్రమంగా అధికారిక బ్రాండింగ్ చిహ్నంగా మారింది.దశాబ్దానికి పైగా తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇది గుర్తింపుగా పనిచేసింది. కాగా, బెంగాల్ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం, ఈ లోగో స్థానంలో మరో కొత్త లోగోను తీసుకువచ్చారు. దీనికి బదులుగా భారతదేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా సాల్ట్ లేక్ స్టేడియంలో 'బిస్వా బంగ్లా' గుర్తును తొలగించి, దాని స్థానంలో జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. ఈ రీబ్రాండింగ్ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు కూడా విస్తరించింది. పలు ప్రభుత్వ విభాగాలు, సేవలకు లింక్‌లను అందించే 'ఎగియే బంగ్లా' పోర్టల్‌లో ఇప్పుడు బిస్వా బంగ్లా లోగో స్థానంలో అశోక స్తంభాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టల్ థీమ్‌లో కూడా మార్పు వచ్చింది. గతంలో ఉన్న తెలుపు-నీలం రంగుల స్థానంలో కాషాయ రంగును చేర్చారు.The 'Biswa Bangla' logo has been removed from the Salt Lake stadium in Kolkata. Its been replaced by India's national emblem - the Ashok StambhBiswa Bangla logo was introduced by former CM Mamata Banerjee as the state emblem for Bengal pic.twitter.com/dSGg4ViC9Q— Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) May 16, 2026అయితే, ఒక వ్యక్తి సృష్టించిన లోగో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక గుర్తింపుగా పనిచేయకూడదని వాదిస్తూ బీజేపీ నాయకులు ఈ నిర్ణయాన్ని సమర్థించారు. అధికారిక ప్రభుత్వ వినియోగానికి అశోక చిహ్నమే అత్యున్నతమైన మరియు అత్యంత సముచితమైన చిహ్నంగా ఉంటుందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. 2017లో 'బిస్వా బంగ్లా' లోగో ఒక రాజకీయ వివాదానికి కేంద్రంగా నిలిచింది. అప్పుడు మాజీ బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్, ఆ లోగో ప్రైవేట్ యాజమాన్యంలో ఉందని, అది ప్రభుత్వానిది కాదని ఆరోపించారు. ఈ ఆరోపణలను అభిషేక్ బెనర్జీ ఖండించగా మమతా బెనర్జీ అసెంబ్లీలో ఆ లోగోను తానే స్వయంగా సృష్టించానని, రాయల్టీ వసూలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం దానిని ఉపయోగించుకోవడానికి అనుమతించానని తరువాత స్పష్టం చేశారు.దాదాపు 13 సంవత్సరాలుగా బిస్వా బంగ్లా చిహ్నం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ గుర్తింపుతో మరియు ప్రజా సంబంధాలతో ముడిపడి ఉంది. అయితే, బీజేపీ ప్రభుత్వం వచ్చాక అధికారిక వ్యవస్థలు మరియు రాష్ట్ర నియంత్రిత వేదికల నుండి ఆ లోగో తొలగించడం ఎంతో కీలకంగా మారింది. ఇది బెంగాల్ రాజకీయ, పరిపాలనా బ్రాండింగ్‌లో ఒక ప్రతీకాత్మక మార్పును సూచిస్తుంది.రాజకీయ ప్రభావంటీఎంసీ గుర్తింపు తొలగింపు: బిశ్వ బంగ్లా లోగో తొలగించడం ద్వారా టీఎంసీ పాలనలో ఏర్పడిన గుర్తింపును తొలగిస్తున్నారు.బీజేపీ సంకేతం: అశోక స్తంభం ప్రవేశపెట్టడం ద్వారా జాతీయ చిహ్నాన్ని రాష్ట్ర గుర్తింపుగా మార్చి, “సాఫ్రన్ బ్రాండింగ్”ను బలపరుస్తోంది.సాంస్కృతిక ప్రభావం: దుర్గాపూజ వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా బీజేపీ ప్రభావం పెరుగుతుందని అంచనా. -
భారత బోర్డర్.. బెంగాల్ సీఎం సంచలన నిర్ణయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. మన దేశ బోర్డర్లో రక్షణ కోసం బీఎస్ఎఫ్కు ల్యాండ్ బదిలీ చేసే దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో దాదాపు 127 కిలోమీటర్ల మేర బీఎస్ఎఫ్ కోసం కేంద్ర హోంశాఖ ఫెన్సింగ్ వేయనుంది. రానున్న 45 రోజుల్లో బీఎస్ఎఫ్కు తగిన భూమిని అప్పగించనున్నట్టు సీఎం సువేందు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బీఎస్ఎఫ్ (BSF) కోసం సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి భూమి కేటాయింపులు ప్రారంభించింది. తాజాగా సీఎం సువేందు అధికారి బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద ఫెన్సింగ్ కోసం భూమి బదిలీకి ఆమోదం తెలిపారు. అయితే, కలకత్తా హైకోర్టు ఇప్పటివరకు కేటాయింపులు ఆలస్యం కావడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. కాగా, గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం బీఎస్ఎఫ్కు భూమి ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపించారని ఆరోపణలు ఉన్నాయి. 127 కిలోమీటర్లకు గాను.. కేవలం 8 కిలోమీటర్లే మమత సర్కార్ కేటాయింపులు చేసింది. ప్రభావం ఇలా.. సరిహద్దు భద్రత: బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద అక్రమ రవాణా, చొరబాటు తగ్గించడానికి ఫెన్సింగ్ కీలకం.బీఎస్ఎఫ్ బలోపేతం: కొత్త అవుట్‌పోస్టులు, ఫెన్సింగ్ వల్ల BSFకు పర్యవేక్షణ సులభం అవుతుంది.రాజకీయ ప్రభావం: సువేందు అధికారి ప్రభుత్వం బీఎస్ఎఫ్కు మద్దతు ఇస్తూ, కేంద్రంతో సంబంధాలను బలోపేతం చేస్తోంది.Suvendu government's first big move!▶️Suvendu transfers land for border fencing to BSF. #SuvenduAdhikari #WestBengal pic.twitter.com/xL3gHjmN83— IndiaToday (@IndiaToday) May 11, 2026 -
ఎస్ఐఆర్తో మాకూ లాభం జరిగిందేమో!: శశిథరూర్
ఎస్ఐఆర్పై దేశంలో ఒకపక్క దుమారం చెలరేగుతుండగా.. ఇంకోపక్క తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ఈ అంశంపై ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. బెంగళూరు (దక్షిణ) నియోజకవర్గ ఎంపీ తేజస్వీ సూర్యతో కలిసి ఆయన అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జరిగిన చర్చలో శశిథరూర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ పేరుతో వివిధ రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించిన ఎస్ఐఆర్ ప్రక్రియ కేరళలో తమకు లాభం చేకూర్చి ఉండవచ్చునని అన్నారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఇటీవలే వెల్లడై ఓట్ల చోరీ అంశం మరోసారి చర్చనీయాంశమైన ప్రస్తుత తరుణంలో శశిథరూర్ వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై కూడా శశిథరూర్ వ్యాఖ్యానిస్తూ.. ‘అక్కడ సుమారు 91 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. వీరిలో 34 లక్షల మంది తాము ఓటింగ్‌కు అర్హులమని, జాబితాలో తమ పేర్లు చేర్చాలని అప్పీల్ చేశారు కూడా. అయితే ఒకొక్కరి వివరాలను పరిశీలించి చేర్చాల్సి ఉన్నందున వీరిలో కొన్ని వందల మందికి మాత్రమే మళ్లీ అవకాశం దక్కింది. ఫలితంగా సుమారు 31 నుంచి 32 లక్షల మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. బెంగాల్లో టీఎంసీ కంటే బీజేపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం కూడా కొంచెం అటు ఇటుగా 30 లక్షలు కావడం’ అని ఆయన వ్యాఖ్యానించారు.#WATCH | San Francisco, USA: Speaking at the roundtable on 'India, That is Bharat: Growth Governance and Identity' at Stanford India Conference, Congress MP Shashi Tharoor says, "About the SIR... there are legitimate questions to answer. Look at the Bengal case. 91 lakh names… pic.twitter.com/QpysPZcVV1— ANI (@ANI) May 10, 2026ఓటర్ల జాబితాలో అవకతవకలను సవరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ అభ్యంతరం పెట్టలేదని, డూప్లికేట్ ఓటర్లు, మరణించిన, వలస వెళ్లిన వారి పేర్లు తొలగించడం అవసరం కూడా అని ఆయన అన్నారు ఈ క్రమంలోనే కేరళలో ఎస్ఐఆర్ ప్రక్రియ తమకు ఎలా ఉపయోగపడిందో వివరిస్తూ శశిథరూర్ ఏమన్నారంటే.. ‘వాస్తవానికి ఎస్ఐఆర్ అన్నది కేరళలో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చి ఉండవచ్చు. ఎందుకంటే లెఫ్ట్ ప్రభుత్వం చాలాకాలంగా ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోంది. ఒకే ఓటరు మూడు నాలుగు చోట్ల నమోదు చేసకోవడం, డూప్లికేట్ ఓటర్లు చాలామంది ఉన్నారు. వీరందరి తొలగింపు ఫలితంగా కాంగ్రెస్‌కు మెజార్టీ లాభించి ఉండవచ్చు’ అని అన్నారు.కొందరిని ఒంటరి వాళ్లను చేశారు..దేశంలో మైనార్టీ వర్గాలను ఒంటరులను చేయడం గత దశాబ్ద కాలంలో ఎక్కువైందని, బీజేపీ అగ్రనేతలు మొదలుకొని సామాన్యుల వరకూ మైనార్టీలను ఉగ్రవాదుల మాదిరిగా చూస్తూండటం దీనికి కారణమని శశిథరూర్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యతో తనకు వ్యక్తిగతంగా స్నేహం ఉన్నప్పటికీ బీజేపీ మార్కు రాజకీయాల విషయంలో మాత్రం తన వైఖరి నిక్కచ్చిగానే ఉంటుందని స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో ఈ దేశంలోని మైనార్టీలు తమ పట్ల ఎందుకింత వివక్ష ఏర్పడిందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. ‘మా పూర్వీకులు ఈ మట్టిలోనే కలిసిపోయారు. అయినా మమల్ని వేరుగా ఎందుకు చూస్తున్నారు’ అని వారు భావిస్తున్నారని, విభజన గాయాలను రెచ్చగొడుతూ మైనార్టీలను అణచివేసే ప్రయత్నం చేయడం ద్వారా బీజేపీ తప్పు చేస్తోందని వ్యాఖ్యానించారు. -
బెంగాల్లో టెన్షన్.. మమతకు తొలి షాక్
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. బెంగాల్లో బీజేపీ ఘన విజయం అందుకుంది. అయితే, ఫలితాల అనంతరం, బెంగాల్లో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. అర్ధరాత్రి తృణముల్ కాంగ్రెస్ యూనియన్ ఆఫీసుకు బుల్డోజర్లతో కూల్చివేయడం తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసింది. దీంతో, బెంగాల్లో బుల్డోజర్ల అంశం చర్చనీయాంశంగా మారింది.వివరాల మేరకు.. బెంగాల్‌లోని చారిత్రక హాగ్ మార్కెట్ (న్యూ మార్కెట్) ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే ఈ వ్యాపార కేంద్రంలో బుల్డోజర్ల గర్జన మొదలైంది. బుల్డోజర్లతో వచ్చిన ఓ గుంపు టీఎంసీ యూనియన్ కార్యాలయాన్ని కూల్చివేశారు. టీఎంసీకి చెందిన న్యూ మార్కెట్ యూనియన్ ఆఫీసు ఈ ఘటనలో పూర్తిగా నేలమట్టమైంది. దీంతో భయాందోళనకు గురైన వ్యాపారులు తమ షాపులను మూసేసి పరుగులు తీశారు.అయితే, బుల్డోజర్ కూల్చివేతపై టీఎంసీ నేతలు సంచలన విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై టీఎంసీ నేతలు స్పందిస్తూ.. ఇదే బీజేపీ అసలు రూపం. బీజేపీ ఎన్నికల నినాదమైన ‘పరివర్తన్’ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కోల్‌కతాలోని చారిత్రక న్యూ మార్కెట్.. బెంగాలీలు ఈ పరివర్తనాన్ని ఆస్వాదిస్తున్నారు. పోలీసుల పర్యవేక్షణలోనే ఈ కూల్చివేతలు జరిగాయని ఆరోపించారు. కేంద్ర బలగాలు (CAPF) అక్కడ చూస్తుండగానే, బీజేపీ విజయోత్సవాల్లో భాగంగా మాంసం దుకాణాలను కూల్చడానికి బుల్డోజర్లను తీసుకొచ్చారు అంటూ ఆరోపించారు. బెంగాల్లో ఈ ‘బుల్డోజర్ రాజకీయాలను’ అడ్డుకుంటామని నేతలు స్పష్టం చేశారు.Bulldozers are rolling across West BengalBJP is clearing West Bengal by demolishing illegal TMC party offices and shops in the New Market area pic.twitter.com/bHqlrjWa4X— Surajit (@surajit_ghosh2) May 5, 2026అనంతరం, పార్టీ ఆఫీసు కూల్చివేతపై టీఎంసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్బంగా టీఎంసీ..‘ఇది బీజేపీ మద్దతుదారుల గూండాయిజం, వ్యాపార సంస్థలను టార్గెట్ చేసుకుని హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించింది. బీజేపీ అగ్రనేతల అండదండలతోనే ఇదంతా జరుగుతోందని చెప్పుకొచ్చింది. అయితే, ఈ ఆరోపణలను స్థానిక నివాసితులు, కొందరు వ్యాపారులు తోసిపుచ్చారు. కూల్చివేసిన నిర్మాణం అక్రమంగా నిర్మించినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. కూల్చివేతల నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఏది ఏమైనా.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజే బెంగాల్లో ఇలా బుల్డోజర్లు బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
బీజేపీ ప్రభంజనం.. ఎన్నికల్లో భారీ విజయం
గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. గుజరాత్‌లోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా మరియు పంచాయతీలలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల మేరకు అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ భారీ ఆధిక్యాన్ని సాధించింది.గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. పోలింగ్ జరిగిన 15 మున్సిపల్ కార్పొరేషన్లలో నాలుగింటిలో విజయం సాధించి మెజారిటీని నిలబెట్టుకుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లు అయిన మెహసానా, మోర్బి, నడియాడ్, వాపిలలో బీజేపీ విజయాలు సాధించగా, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 15 కార్పొరేషన్లలోని 1,044 సీట్లలో ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ 718 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, 88 సీట్లతో ముందుకు సాగుతోంది. మిగతా పార్టీలు ప్రభావం చూపించలేకపోయాయి.అలాగే, ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. గుజరాత్‌లోని 84 మున్సిపాలిటీలలో మొత్తం 2624 స్థానాలు ఉండగా.. అధికార బీజేపీ 575 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 50 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. మరో 11 స్థానాల్లో ఇతర పార్టీలు ఆధిక్యంలో ఉన్నాయి.Gujarat Election Update-BJP wins Vapi, Navsari, Porbandar, Ahmedabad, Rajkot and Surendranagar Municipal Corporations.It is also leading in remaining Municipal Corporations.— News Arena India (@NewsArenaIndia) April 28, 2026 అహ్మదాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ సాధించిన 11 స్థానాల్లో ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా ఖాతాను తెరవలేకపోయింది.సూరత్‌లో బీజేపీ 24 స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో మరియు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.వడోదరలో బీజేపీ 76 స్థానాల ఆధిక్యాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ ఐదు స్థానాలో ఆధిక్యంలో ఉంది.రాజ్‌కోట్‌లో బీజేపీ 20 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.మోర్బి మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ఘన విజయం దిశగా ముందుకెళ్తోంది. ఇక్కడ బీజేపీ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఇంకా ఖాతాను తెరవలేకపోయింది. ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 52 స్థానాలు ఉన్నాయి.👉ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 26, 27 తేదీలలో 15 మున్సిపల్ కార్పొరేషన్లు, 84 మున్సిపాలిటీలు, 34 జిల్లా పంచాయతీలు, 260 తాలూకా పంచాయతీలలో పోలింగ్ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 66% ఓటింగ్ నమోదు అయ్యింది.Gujarat Local Body Election Result 2026 #Congratulations All @BJP4Gujarat 🪷🎉🌷BJP : Winning in 90% + seatsAll Others (MM Congress, SP, AIMIM, AAP, ABC, XYZ +++) : < 10% seats#GujaratVotesBJP#gujarattrustsbjp *Municipality ( Total Seats 1044 )BJP :- 43*Congress :-… pic.twitter.com/Ph6G8Ie43r— Bharat Sanghvi Jain (@rajamaka) April 28, 2026 -
‘చద్దా.. మా వల్లే నీ వివాహం జరిగింది’
ఢిల్లీ: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్‌కు షాకిస్తూ బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆప్ నేతల నుంచి సోషల్ మీడియాలో నెటిజన్ల వరకు చద్దాపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాను పార్టీ మారడాన్ని చద్దా సమర్ధించుకుంటూ.. జస్ట్ ఉద్యోగం మారినట్టు పార్టీ మారాను అని వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలకు ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.ఎంపీ రాఘవ్ చద్దా వ్యాఖ్యలపై ఆఫ్ నేత సౌరభ్ భరద్వాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా భరద్వాజ్.. ఏడాది కాలంగా బీజేపీతో కలిసి రాఘవ్ చద్దా కుట్ర పన్నాడు. మధ్య తరగతి ప్రజల సమస్యలపై ప్రస్తావించే నాయకుడిగా ఇమేజ్ బిల్డప్ చేసుకోవడం కూడా అందులో భాగంగానే జరిగింది. రాఘవ్ చద్దా ఎంపీ కావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కారణం. ఆప్ వల్లే ఆయన ఎంపీ అయ్యారు. రాజ్యసభ ఎంపీని చేయడం వల్లే రాఘవ్ చద్దాకు గుర్తింపు వచ్చింది. ఆ హోదా కారణంగా అతనికి పెళ్లి జరిగింది. ఓ సెలబ్రెటీ ఆయనను పెళ్లి చేసుకున్నారు. లేకపోతే రాఘవ్ చద్దాను ఎవరూ పట్టించుకునే వారు కాదు.రాజకీయాలను ఉద్యోగాలతో పోల్చవద్దు. మనం ఉద్యోగాలు మారినప్పుడు లేదా ఒక కంపెనీలో పనిచేసినప్పుడు, దానికి సిద్ధాంతంతో సంబంధం లేదు. మీరు సిద్ధాంతం కారణంగానే ఒక పార్టీలో చేరి, దానిలో ఉన్నారు. ప్రజలు ఉద్యోగాలు మారినప్పుడు కూడా, వారు తమ మాతృ సంస్థకు వ్యతిరేకంగా కుట్రలు చేయరు అని మండిపడ్డారు.Response to Raghav’s Video Raghav Chaddha says his changing party is like someone switching a job from one company to another.Though it’s not the same but even when people switch jobs, they don’t hatch conspiracy against their parent companyFor more than a year, Raghav… pic.twitter.com/RxfnTsv9Ms— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) April 27, 2026ఇదిలా ఉండగా.. రాఘవ్ చద్దా బీజేపీలో చేరిన తర్వాత ఒక వీడియో విడుదల చేశారు. ఆ సందర్బంగా ఆయన ఆప్‌ను “toxic work environment” అని పిలిచారు. ఆయన ప్రకారం, పార్టీలో పని చేయడాన్ని అడ్డుకోవడం, పార్లమెంట్లో మాట్లాడే అవకాశాన్ని నిరాకరించడం, పార్టీ అవినీతిలోకి వెళ్లడం వల్లే తాను ఆప్‌ను వీడినట్లు చెప్పారు. ఒక ఉద్యోగి ఎలా అయితే కంపెనీ మారుతారో అలాగే నేను కూడా పార్టీ మారాను అని అన్నారు. అంతటితో ఆగకుండా..‘నేను రాజకీయాల్లో కెరీర్ కోసం రాలేదు. నేను ఒక పార్టీని స్థాపించాను. నా యవ్వనంలో 15 సంవత్సరాలు రక్తం, చెమట, కష్టంతో ఈ పార్టీకి ఇచ్చాను. నేను భయంతో కాదు, నిరాశ, అసంతృప్తి, అసహ్యం వల్లే పార్టీని విడిచాను. ఒక వ్యక్తి తప్పు కావచ్చు, ఇద్దరు తప్పు కావచ్చు, కానీ ఏడు మంది తప్పు కావడం సాధ్యం కాదు’ అని కామెంట్స్ చేశారు. -
బీజేపీ పొలిటికల్ గేమ్.. బెంగాల్ తర్వాత ఆ రాష్ట్రమే!
కేంద్రంలోని అధికార బీజేపీ పక్కా ప్లాన్ ప్రకారం పొలిటికల్ గేమ్‌తో ముందుకు సాగుతోంది. ఇప్పటికే బీహార్ రాజకీయాల్లో బీజేపీకి తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠం దక్కింది. అటు బెంగాల్లో కూడా విజయం బీజేపీదేనని కాషాయ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, తదుపరి బీజేపీ టార్గెట్ పంజాబ్ అనే వార్తలు జాతీయ స్థాయిలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగానే బీజేపీలోకి రాఘవ్ చద్దా సహా పలువురు నేతల చేరికలు అనే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే బీజేపీ అడుగులు వేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. మరి పంజాబ్‌లో బీజేపీకి అధికారం అంత సులువు కాదనే విషయాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. బీహార్‌లో సంబరాలు జరుగుతుండగా గంగానది బీహార్ నుండి బెంగాల్‌కు ప్రవహిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించి.. తదుపరి ఎన్నికల పోరుకు సంకేతం ఇచ్చారు. ఇప్పుడు, బెంగాల్ దంగల్ ముగియక ముందే పంజాబ్ యుద్ధం మొదలైంది. బీజేపీ ఎన్నికల రథం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉందన్న సంకేతాలిస్తూ.. పంజాబ్‌లో 2027 ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలపై కాషాయ దళం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బీజేపీ పొలిటికల్ గేమ్‌లో భాగంగా పంజాబ్ రాజకీయాల్లోకి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఎంపీలు రాఘవ్ చద్దా, పంజాబ్‌కు చెందిన మరో ఐదుగురు ఎంపీలు బీజేపీలో చేరడం ఈ విషయాన్నే సూచిస్తుంది.బీజేపీ సమస్య.. అయితే, పంజాబ్‌లో బీజేపీ ఎన్నడూ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. పంజాబ్‌లో బీజేపీకి స్థానిక నాయకుల కొరత ఉంది. పంజాబ్‌లో బీజేపీకి ప్రధాన సవాళ్లు స్థానిక నాయకత్వం లోపం, సిక్కు రైతు వర్గం నమ్మకం పొందడం. అలాగే, దశాబ్దాలుగా శిరోమణి అకాలీ దళ్ (SAD)కు జూనియర్ భాగస్వామిగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం. వ్యవసాయ బిల్లుల విషయంలో 2020లో విడిపోవడానికి ముందు శిరోమణి.. బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో కాషాయ పార్టీకి అధికారం కావాలంటే దానికి రాష్ట్రంతో సంబంధం ఉన్న నాయకులు అవసరం. ప్రస్తుతం పంజాబ్‌లో బీజేపీకి ఉన్న ఏకైక ప్రముఖ నాయకుడు రవ్నీత్ సింగ్ బిట్టు. ఆయన కాంగ్రెస్ నుండి పార్టీలోకి మారారు. దీంతో, పాత నాయకులు, కొత్తగా చేరిన వారి మధ్య విభేదాలు, వ్యూహాత్మక గందరగోళం నెలకొంది.అవకాశాలు.. మరోవైపు.. ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలంటే మరి కొందరు కీలక నేతలు కావాల్సిందే. ఈ విషయంలోనే ఆప్ నుండి బీజేపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, ఇతర ఎంపీల పాత్ర పంజాబ్‌లో బీజేపీకి ఎంతో కీలకం కానుంది. ఎంపీలు రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, విక్రమ్ సాహ్నే వంటి ప్రముఖులు బీజేపీలో చేరడం ఆమ్ ఆద్మీ పార్టీలో విభజనను చూపిస్తోంది. దీంతో, బీజేపీకి కొత్త ఓటర్లను ఆకర్షించే అవకాశం ఏర్పడింది. రాఘవ్ చద్దా వంటి యువ నాయకులు బీజేపీకి పట్టణ, చదువుకున్న, మధ్యతరగతి ఓటర్లలో ప్రభావం చూపే అవకాశం ఉంది. అకాళీదళ్ బలహీనతతో సిక్కు మతపరమైన ఓటు బ్యాంక్ బీజేపీ వైపు మళ్లే చాన్స్ కూడా ఉంది. ఇదిలా ఉండగా.. పట్టణ హిందూ ఓటర్లలో కాంగ్రెస్ ప్రభావం తగ్గడం బీజేపీకి ప్రధానంగా లాభం కావచ్చు.బీజేపీ వ్యూహాలు.. రైతు వర్గం నమ్మకం పొందడం బీజేపీకి అత్యవసరం. వ్యవసాయ చట్టాలపై నిరసనల తర్వాత బీజేపీపై రైతు వర్గంలో వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతు ఇచ్చే విధానాలు, ఎంఎస్పీ హామీలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై బీజేపీ హామీ ఇస్తే అది పార్టీకి మైలేజ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఎంపీల చేరిక కూడా బీజేపీకి ప్లస్ కాగా.. అధికార ఆప్, కాంగ్రెస్ పార్టీలకు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి.గత ఫలితాలు.. పంజాబ్‌లో 2022లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. రాష్ట్రంలో 117 అసెంబ్లీలో 92 స్థానాలు గెలిచి, పంజాబ్‌లో తొలిసారి పూర్తి మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ కేవలం 18 స్థానాలకు పరిమితమైంది. ఇదే సమయంలో శిరోమణి అకాళీదల్ 15 నుంచి 3 స్థానాలకు పడిపోయింది. బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసినప్పటికీ, పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. -
ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్ర: రామచందర్ రావు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకి వెళ్లడం సరికాదన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్ర పటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు నివాళులు అర్పించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ..‘ఆర్టీసీ, కార్మికుల నాయకులను ప్రభుత్వం పిలిచి వారి డిమాండ్లను ఒప్పుకోవాలి. 41 రోజుల ముందే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. అయినా ప్రభుత్వం స్పందించకుంటే ఆర్టీసీ జేఏసీ తరపున సమ్మె తలపెట్టారు. ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకి వెళ్లడం సరికాదు. 2017 నుంచి రావాల్సిన పీఆర్సీ బకాయిలు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని న్యాయమైన కోరికలు అడుగుతున్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అందుకే ప్రైవేట్ వ్యక్తులతో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ 63 మంది కార్మికుల మరణానికి కారణమైంది. గతంలో ఆర్టీసీ సమ్మెకు రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చిన వీడియోను అందరూ చూడండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో విలీనం చేస్తానన్ని మూడేళ్లు అయ్యింది. రాష్ట్రంలో కొత్త బస్సులు లేవు, ఉన్న బస్సులను ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోంది. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుంది. బీజేపీ నేతలు ఎక్కడిక్కడ ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపి అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్న. రెండు పార్టీలు ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయి’ అని మండిపడ్డారు. -
బిల్లు వీగిపోవడమంటే బీజేపీ ఓడిపోవడమే: రేవంత్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిపోయిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిన్న సవరణతో మహిళా రిజర్వేషన్లు పెంచవచ్చు. సీట్లు పెంచడానికి మహిళా రిజర్వేషన్లు ముసుగు వేశారని మండిపడ్డారు. బీజేపీ విధానాలకి ఓటమి ఇది అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘దక్షిణ భారతానికి జరిగే అన్యాయాన్ని అడ్డుకున్నాం. మహిళా బిల్లు చాటున డీలిమిటేషన్ బిల్లును తెచ్చారు. ఎన్డీయే నిజాయితీగా బిల్లును తీసుకురాలేదు. బిల్లు వీగిపోవడం అంటే బీజేపీ ఓడిపోవడమే. బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని కాలరాయాలని చూసింది. ప్రధాని మోదీ కుట్రలను కాంగ్రెస్ సమర్థవంతంగా అడ్డుకుంది. దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలను కాంగ్రెస్ ఎండగట్టింది. ఇది రాజకీయ విధానాల ఓటమి కాదు.. బీజేపీ విధానాల ఓటమి. రాజ్యాంగం మార్చడానికి, రిజర్వేషన్లు రద్దు చేసేందుకు అబ్ కీబార్ చార్ సౌ అన్నారు బీజేపీకి 400 సీట్లు ఇచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తే రేపే మద్దతు ఇస్తాం. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటా పెట్టాలి. హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ జరగాలి అని వ్యాఖ్యలు చేశారు. 2023 మహిళా బిల్లును యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎంతో మంది మహిళా నేతలను కాంగ్రెస్ తయారుచేసింది’ అని చెప్పుకొచ్చారు. -
సీఎం రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావడంతో టెన్షన్ వాతవరణం నెలకొంది. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి నాయకత్వంలో వందలాది మంది మహిళా కార్యకర్తలు నిరసన ప్రదర్శనగా రేవంత్ రెడ్డి ఇంటి వైపు దూసుకెళ్లారు.ఈ క్రమంలో బీజేపీ మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, అక్కడ స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం, మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్లన్నీ బారికేడ్లతో మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విడతల వారీగా వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.మరోవైపు.. బీజేపీ నేతలను అడ్డుకోవడంపై రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘పక్ష నేతల తీరుకు నిరసనగా సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరితే అడ్డుకున్నారు. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నారు. మా ముట్టడి అడ్డుకున్నారు. నిన్న దేశానికి ఎమర్జెన్సీ కంటే చీకటి రోజు. ఇండియా కూటమి మహిళలకు వ్యతిరేకం. కేవలం మైనార్టీ, కుటుంబ ప్రాతినిధ్యం కోసమే తప్ప సామాన్య మహిళ కోసం కాంగ్రెస్ మాట్లాడదు. కామన్ ఉమెన్ చట్ట సభలోకి రావొద్దని కాంగ్రెస్ తీరు ఉంది. రిజర్వేషన్ రాబోతుందని మహిళలు ఎంతో సంతోషపడ్డారు. హైబ్రిడ్, ఉత్తరాది, దక్షిణాది కేవలం మహిళ రిజర్వేషన్ వ్యతిరేకించే అంశాలు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన పని క్షమించరానిది. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీనే. మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అంటూనే.. వ్యతిరేకంగా ఓట్లు వేశారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
విపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదు: ప్రియాంక గాంధీ
సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్ వెనుక ఉన్న బీజేపీ కుట్రను అడ్డుకున్నామని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తెలిపారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో విపక్షంపై బురద జల్లే కుట్ర చేసిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి ఇది మొదటి దెబ్బ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తాజాగా ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘కేంద్రం తెచ్చిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రజాస్వామ్యం గెలిచింది. కేంద్ర ప్రభుత్వానికి ఇది మొదటి ఎదురుదెబ్బ. విపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదని నిరూపితమైంది. ఇతర అంశాలతో మహిళా బిల్లును కలపొద్దు. 543 సీట్ల నుంచే మహిళలకు 33 శాతం ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అమిత్ షా మాటలను ప్రజలు నమ్మడం లేదు. బీజేపీ తీరును ప్రజలు గమనిస్తున్నారు. తమ మాటలు నమ్మాలని కేంద్రం పదేపదే చెబుతున్నా ప్రజలు మాత్రం నమ్మడం లేదు. దేశం మారింది.. ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నారు. #WATCH | Delhi: Congress MP Priyanka Gandhi Vadra says, "Our stand is very clear. The entire INDIA alliance has made its stand very clear, and this vote has made it even clearer that, in our understanding, this bill that was introduced and the three-day discussion was not about… pic.twitter.com/6GkCRVtPXK— ANI (@ANI) April 18, 2026భారత్ మేల్కొనడాన్ని కేంద్ర ప్రభుత్వం నమ్మలేకపోతోంది. కేంద్ర ప్రభుత్వం మహిళలను తప్పుదోవ పట్టించకూడదు. వారికి తమ హక్కులను వెంటనే కల్పించాలి. మా వైఖరి అత్యంత స్పష్టం. ఇండియా కూటమి మొత్తం వైఖరిని చాలా స్పష్టంగా తెలియజేసింది. ప్రవేశపెట్టిన ఈ బిల్లు, దానిపై జరిగిన మూడు రోజుల చర్చ మా అవగాహన ప్రకారం మహిళా రిజర్వేషన్లకు సంబంధించినవి కాదు. కేవలం నియోజకవర్గాల పునర్విభజనకు మాత్రమే సంబంధించింది. ఇదే విషయం ఓటింగ్ ద్వారా మరింత స్పష్టం చేసింది. ఈ విషయంపై మేమందరం మా అభిప్రాయాలను చాలా నిర్ద్వంద్వంగా వ్యక్తం చేశాం’ అని చెప్పుకొచ్చారు. -
వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు
మూడు కీలక బిల్లులకు సంబంధించి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో నేడు ఓటింగ్ ప్రక్రియ.. -
బీజేపీకి ఝలక్.. స్టాలిన్ వినూత్న నిరసన
చెన్నై: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మూడు ప్రధాన బిల్లులను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. మహిళా రిజర్వేషన్లు అమలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), కొత్త డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలను కలిగి ఉన్న ఈ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రం తీరు పట్ల వినూత్నంగా నిరసన తెలిపారు.పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. బిల్లుకు పూర్తిగా వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఎంకే స్టాలిక్ నల్ల దుస్తులు ధరించి నల్ల జెండాను ఎగురవేశారు. అలాగే, డీలిమిటేషన్ బిల్లు పేపర్లను కాల్చివేశారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా స్టాలిన్.. ‘ఈ ప్రతిఘటన తమిళనాడు అంతటా వ్యాపించాలి! ఫాసిస్ట్ బీజేపీ అహంకారం కూలిపోవాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్ల వద్ద నల్ల జెండాలు ఎగురవేయాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.Namakkal | DMK President and Tamil Nadu CM MK Stalin, wearing black attire, today hoisted a black flag in protest against the Centre's delimitation move. He also burned a copy of the proposed Delimitation bill. pic.twitter.com/AYno2V8UCn— ANI (@ANI) April 16, 2026అంతేకాకుండా.. గత హిందీ వ్యతిరేక ఆందోళనలతో పోలుస్తూ.. గతంలో తమిళనాడు నుండి వచ్చిన ప్రతిఘటన ఢిల్లీని లొంగిపోయేలా చేసిందని, అటువంటి ఉద్యమమే ప్రస్తుత ప్రతిపాదనను సవాలు చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ బిల్లు తమిళులను వారి సొంత భూమిలో శరణార్థులుగా మారుస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ అహంకారాన్ని అణచివేయడానికి ఈ ఆందోళన ద్రావిడ భూమి అంతటా వ్యాపిస్తుందని ఆయన అన్నారు. మరోవైపు.. డీఎంకే ఎంపీలు కూడా నల్ల దుస్తులు ధరించి నేడు పార్లమెంట్ సమావేశంలో పాల్గొననున్నారు.ఇదిలా ఉండగా.. పార్లమెంట్లో ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టనుండగా, ఒక్కో సభలో 18 గంటలపాటు చర్చకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమి మాత్రం ఈ బిల్లులపై స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. డీలిమిటేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించింది. దీంతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందుతుందా? లేక ప్రతిపక్షాల వ్యతిరేకతతో నిలిచిపోతుందా? అన్నది ఉత్కంఠగా మారింది.#WATCH | Chennai | Late DMK patriarch M. Karunanidhi's daughter, Selvi Karunanidhi, joins DMK protest against the Centre's proposed delimitation bill pic.twitter.com/EomzwcjQ4X— ANI (@ANI) April 16, 2026 -
డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల ఆరోపణలకు అమిత్‌షా కౌంటర్
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, డీ లిమిటేషన్ బిల్లు, పునర్విభజన కమిషన్ బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. -
డీలిమిటేషన్‌పై బీజేపీ కొత్త కుట్ర: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: డీలిమిటేషన్‌పై కొత్త కుట్రకు తెర లేపారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ కొత్త కుట్రకు తెర లేపుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో మా ప్రజల స్వరం తగ్గిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చంచారు. అలాగే, మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది.మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా మాట్లాడుతూ..‘డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాదికి అన్యాయం జరిగితే పెను ఉద్యమం తప్పదు. ఈ విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. మూడేళ్ల క్రితం తీసుకున్న దృఢమైన నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. మేమంతా గర్వించదగ్గ భారతీయులం. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలం మేము. జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం చేయడం సమంజసం కాదు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం.దేశ అత్యున్నత వేదిక అయిన పార్లమెంటులో మా ప్రజల స్వరాన్ని అణచివేయాలని చూస్తే.. మేము మాత్రం నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకోము. అవసరమైతే కేసీఆర్ ముందుండి కొట్లాడుతారు. దక్షిణ భారతీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తాం. ఇప్పటికైనా ఢిల్లీ పాలకులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని, విజ్ఞత ప్రదర్శించాలి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మా మద్దుతు ఉంటుంది’ అని స్పష్టం చేశారు. -
సామ్రాట్ చౌదరి అనే నేను.. సీఎంగా
పట్నా: బిహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో బిహార్‌లో బీజేపీ పార్టీ తరపున ప్రమాణ స్వీకారం చేసిన తొలి సీఎంగా సామ్రాట్ చౌదరి రికార్డు సాధించారు.కాగా నిన్న మాజీ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. పట్నాలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు. సామ్రాట్ చౌదరి నేపథ్యం సామ్రాట్ చౌదరి 1968 నవంబర్ 16న ముంగేర్ జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి శకుని చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తల్లి పార్వతీ దేవి 1998లో అదే స్థానంలో అప్పటి సమతా పార్టీ తరఫున గెలిచారు. గత 12 ఎన్నికల్లో 9 సార్లు తండ్రి, తల్లి, కుమారుడు కలిసి ఆ స్థానంలో గెలిచారు.సామ్రాట్ చౌదరికి 57 ఏళ్లు 1990లో రాజకీయ ప్రవేశం చేశారు. 1999లో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి ప్రభుత్వం నడిపిన సమయంలో, బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు సామ్రాట్ వ్యవసాయ మంత్రి అయ్యారు. 2000, 2010 ఎన్నికల్లో పర్బట్టా అసెంబ్లీ స్థానంలో గెలిచారు. 2010లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చీఫ్ విప్‌గా ఉన్నారు. 2023 మార్చి నుంచి 2024 జూలై వరకు బీజేపీ బిహార్ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రంలో క్రీడలు, ఆర్థిక, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి-గృహ నిర్మాణ శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయ, పరిపాలనా అనుభవం ఆయనకు ఉంది. ఆయన కుశ్వాహా సామాజిక వర్గానికి చెందినవారు. ఇది రాష్ట్ర జనాభాలో సుమారు 4.3 శాతం. బిహార్‌లో యాదవుల తర్వాత అతిపెద్ద ఓబీసీ వర్గం ఇదే. -
ఎన్నికల వేళ బెంగాల్లో కొత్త ట్విస్ట్?
సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ సిలిగురి కారిడార్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానాంశంగా మారింది. దేశ భద్రత దృష్ట్యా దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారంటూ మొదలైన ప్రచారం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దేశ సమాఖ్య స్వరూపాన్ని దెబ్బతీసేందుకు, రాష్ట్రాల హక్కులను కాలరాసేందుకే మోదీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరుగుతున్నారు. ఈ అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకుంటున్నారు.వ్యూహాత్మకంగా కీలకం భారత ప్రధాన భూభాగాన్ని తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతో కలిపే అతి సన్నని మార్గం సిలిగురి కారిడార్. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పుండే ఈ కారిడార్ భౌగోళికంగా చిన్నదైనా వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. దేశానికే ‘లైఫ్ లైన్’వంటిది. దీనికి ఓ వైపున నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్, ఇంకోవైపు భూటాన్, చైనా సరిహద్దు ప్రాంతాలున్నాయి. కోడి తల మాదిరిగా ఉండటంతో ఈ కారిడార్‌ను ‘చికెన్ నెక్’గా పిలుస్తారు. ఈశాన్య రాష్ట్రాలకు రోడ్డు, రైల్వే, సైనిక సరఫరా, వాణిజ్య రవాణా తదితరాలన్నీ ఈ మార్గంపైనే ఆధారపడి ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల వేళ ఈ మార్గం గనుక మూసుకుపోతే తూర్పు–ఈశాన్య ప్రాంతానికి మిగతా దేశంతో సంబంధాలే తెగిపోయే ప్రమాదముంది.తృణమూల్ మండిపాటు సరిహద్దు ప్రాంతాల పరిరక్షణ, భద్రతపై ఇటీవల పార్లమెంట్లో చర్చ సందర్భంగా సమయంలో సిలిగురిని కేంద్రపాలిత ప్రాంతం చేయవచ్చన్న వార్తలు తెరపైకొచ్చాయి. అలాగైతే ఉద్రిక్తతల వేళ ఆ ప్రాంత భద్రతపై కేంద్రానికి మెరుగైన నియంత్రణ ఉంటుందని, చైనాతో యుధ్ద పరిస్థితుల వంటివి తలెత్తితే త్వరిత నిర్ణయాలు, వ్యూహాత్మక కదలికలకు వీలుంటుందనే వాదన తెరపైకొచ్చింది. అలాంటి ప్రతిపాదనలేవీ లేవని కేంద్రం స్పష్టం చేసినా విపక్షాలు, ముఖ్యంగా తృణమూల్ మాత్రం దీన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. స్థానికుల్లో తాము బెంగాల్ నుంచి వేరుపడుతున్నామన్న భావన వస్తుందని ఆ పార్టీ వాదిస్తోంది.‘‘ఇలా ఒక రాష్ట్రం నుంచి కొంత ప్రాంతాన్ని విడదీసి కేంద్రపాలిత ప్రాంతం చేయడం సమాఖ్య నిర్మాణానికి విరుద్ధం. ఇది కేవలం పాలనాపరమైన మార్పు కాదు, రాష్ట్ర హక్కులపై దెబ్బ’’అంటూ జోరుగా ప్రచారం చేస్తోంది. మమత సర్కారుపై ఒత్తిడి పెంచడం, బెంగాలీల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం, భద్రతాపరమైన అంశాలను తెరపైకి తేవడం వంటి ఉద్దేశాలతో బీజేపీ తొలుత ఉద్దేశపూర్వకంగానే ‘కేంద్రపాలిత ప్రాంతం’అంశాన్ని ప్రచారంలో పెట్టిందనే విశ్లేషణలు విని్పస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయమేదీ ఉండకపోయినా భద్రతాపరంగా పరిస్థితులు మారి ఉద్రిక్తతలు పెరిగితే ఈ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.ఎన్నికలపై ప్రభావం..సిలిగురి కారిడార్‌పై రాజకీయ రచ్చ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇదే అంశాన్ని తృణమూల్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. గౌతమ్ దేవ్ వంటి ఆ పార్టీ నేతలు ‘కేంద్రపాలిత ప్రాంతం’అంశాన్ని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పట్టణ, గ్రామీణ, తేయాకు కార్మికుల మిశ్రమంగా ఉండే సిలిగురి ప్రాంతంలో కనీసం 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాల్లో ఈ ప్రచారం బాగా ప్రభావం చూపనుంది. దీనికి విరుగుడుగా స్థానిక సమస్యలు, ఉద్యోగాలు, వేతనాలు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను బీజేపీ నమ్ముకుంది. వాటిపైనే ముమ్మరంగా ప్రచారం చేస్తూ స్థానికులను ఆకట్టుకునే పనిలో పడింది. సిలిగురి ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లోని తేయాకు తోట కార్మికులు, గిరిజన వర్గాలు, రాజబన్షీలలో బీజేపీ ఇప్పటికే ప్రాబల్యాన్ని పెంచుకుంది. దాంతో ఇక్కడ తిరిగి పట్టు సాధించేందుకు తృణమూల్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. -
రాజీనామాకు సిద్ధం.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో కూటమి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏ పనులూ చేయడం లేదు.. అవసరమైతే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ డొల్లతనం మరోసారి బయటపడింది.జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ రాజీనామా అస్త్రాన్ని సంధించారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ఏ పనులూ చేయడం లేదు.. అవసరమైతే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. గండికోట నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇతర శాఖల్లోనూ పనులు నడవడం లేదు. ప్రజలకు మేలు చేయలేనప్పుడు ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు.ఇదే సమయంలో నాకేం పదవులు అవసరం లేదు.. ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, కూటమి పాలనలో కమ్మని ప్రభుత్వం అన్నందుకు ఆదినారాయణరెడ్డిపై కూటమి నేతలు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ డొల్లతనం మరో మారు బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఎన్డీయేకు టెన్షన్.. ఎన్నికల మీటింగ్‌లో హైడ్రామా
కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు తారస్థాయికి చేరింది. పాలక ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ కూటములు పోటాపోటీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. బీజేపీ కూడా ఈసారి రాష్ట్రంలో గట్టిగా ఉనికి చాటుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో ఎన్డీయేలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎన్నికలకు సంబంధించిన కీలక సమావేశంలో ఎన్డీయే అభ్యర్థి ఒకరు అసహనం వ్యక్తం చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తిరువనంతపురంలోని మాస్కాట్ హోటల్లో ఎన్డీయే కూటమి ఎన్నికల కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు, స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు. సమావేశంలో కేంద్రమంత్రి జైశంకర్ ప్రసంగిస్తున్న సమయంలో అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. జైశంకర్ కేవలం.. రాజీవ్ చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయన విజయాన్ని ఖాయం చేయాలని ఓటర్లను కోరారు. అయితే, ఆయన ప్రసంగంలో వట్టియూర్కావు నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఆర్. శ్రీలేఖ పేరును ప్రస్తావించకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అవమానంగా భావించారు.దీంతో, కూటమి అభ్యర్థి శ్రీలేఖ నిరసనగా వాకౌట్ చేయడంతో హై డ్రామా చోటుచేసుకుంది. అంతేకాకుండా ప్రారంభోపన్యాసంలో శ్రీలేఖ పేరును గానీ, ఆమె నియోజకవర్గాన్ని గానీ ప్రస్తావించలేదని తెలిసింది. ఈ క్రమంలో అసంతృప్తితో ఉన్న శ్రీలేఖ ఎన్డీయే నేతలను ప్రశ్నిస్తూ ఆ ప్రాంగణం నుండి నిష్క్రమించారు. ప్రచారం చివరి, కీలక దశలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఆమె అలా వెళ్లిపోవడం స్థానిక నాయకత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇంతలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు వేగంగా జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎస్. ఓమన, వి.వి. రాజేష్ సహా రాష్ట్ర నాయకులు, శ్రీలేఖ సమస్యలను పరిష్కరించడానికి ఆమెతో చర్చలు జరిపారు. వారు నచ్చజెప్పిన తర్వాత, ఆమె తిరిగి హోటల్‌కు చేరుకుని కార్యక్రమాలలో పాల్గొన్నారు.Heartwarming news coming out of Kerala: > S. Jaishankar was in Vattiyoorkavu to campaign for R. Sreelekha.> During his speech, Jaishankar mentioned Rajiv Chandrashekhar, who's fighting from another constituency.> But he forgot to mention Sreelekha. She left the stage in… pic.twitter.com/IpMe1ulQCr— Jawaharlal Nehru (@PMNehru) April 6, 2026ఇదిలా ఉండగా.. ఆర్. శ్రీలేఖ వట్టియూర్కావు నియోజకవర్గానికి ఎన్డీఏ అభ్యర్థి. ఆమె కేరళలో తొలి మహిళా ఐపీఎస్ అధికారి, అలాగే రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (DGP) పదవిని చేపట్టిన మొదటి మహిళ. రిటైర్మెంట్ తర్వాత బీజేపీలో చేరి, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి విజయాలు సాధించారు. ప్రస్తుతం ఆమె వట్టియూర్కావు నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, తరచూ వివాదాల్లో నిలవడం ఆమె ప్రచారానికి సవాలుగా మారుతోంది. -
మా మేనిఫెస్టోనే సూపర్‌స్టార్: స్టాలిన్
విరుధునగర్/విరాలిమలై: 2026 అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే మేనిఫెస్టో సూపర్ స్టార్ వంటిదని ఆ పార్టీ చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అభివర్ణించారు. హామీలు ఎవ్వరైనా ఇస్తారు కానీ, తమ పార్టీ ఇచ్చిన హామీలను మాత్ర మే ప్రజలు నమ్ముతారని చెప్పారు. విరుధునగర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో స్టాలిన్ ప్రసంగించారు.ఈ సందర్భంగా ‘అన్ని వయస్సుల వారు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు.. ఇలా అందరూ డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను ఇష్టపడతారు. ఇష్టం లేని వారంటూ ఎవ్వరూ ఉండరు. అందుకే నేను విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో 2026 ఎన్నికల క్షేత్రంలో సూపర్‌స్టార్ లాంటిది’అని ఆయన చెప్పారు. ‘‘విశ్వసనీయత కలిగిన వ్య క్తుల వాగ్దానాలనే ప్రజలు విశ్వసిస్తారు. ఇతరులు ఏది చెప్పినా జనం నమ్మరు’’ అని స్టాలిన్ అన్నారు.ఢిల్లీ టీమ్‌ను ఇంటికి పంపించాలి: ఉదయనిధితమిళనాడు రాష్ట్ర స్వయంప్రతిపత్తి కోసం ఈ ఎన్నికల్లో ఢిల్లీ టీమ్‌ను ఇంటికి సాగనంపాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి ప్రజలను కోరారు. ఈ ఎన్నికలను ఢిల్లీ టీమ్‌కు, తమిళనాడు టీమ్‌కు మధ్య జరిగే యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. డీఎంకే కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టడం ద్వారా ఢిల్లీ టీమ్‌ను ఇంటికి పంపించేయాలని పిలుపునిచ్చారు. తమిళనాడును నియంత్రించేందుకు ఢిల్లీ ఉపయోగిస్తున్న రిమోట్కంట్రోల్ను పగుల గొట్టాలన్నారు. -
ఖానాపూర్ మున్సిపాలిటీ.. బీజేపీ-బీఆర్ఎస్ కైవసం
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఖానాపూర్ మున్సిపాలిటీ పీఠాన్ని బీజేపీ-బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీజేపీ కార్పొరేటర్ మౌనిక ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్ మహమ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు.ఇదిలా ఉండగా.. శనివారం చైర్మన్ ఎన్నిక సందర్భంగా చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులతో ఎమ్మెల్యే బొజ్జు, కాంగ్రెస్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే సమావేశం నుంచి ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు. మరోవైపు మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులను ఆయన బెదిరిస్తున్నారని ఆక్షేపించారు.ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి, ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరింది. ముందుగా చైర్పర్సన్ ఎన్నిక వేళ బీజేపీ అభ్యర్థి మౌనిక పేరును అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ఎమ్మెల్యే బొజ్జు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా బీజేపీ అభ్యర్థి పేరు ఎలా ప్రతిపాదిస్తారంటూ ఆందోళనకు దిగారు. ఈ గందరగోళం నడుమే చైర్మన్ ఎన్నికను అధికారులు ఆదివారానికి వాయిదా వేశారు. -
దర్యాప్తు పేరుతో స్థానికులకు వేధింపులు: మమత ఆరోపణలు
మాల్దా: న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనకు బాధ్యులైన నేరగాళ్లు తప్పించుకుపోగా, దర్యాప్తు అధికారులు అమాయకులైన స్థానికులను వేధిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. మాల్దా జిల్లా మోతాబరిలో బుధవారం రాత్రి న్యాయాధికారులను గంటలపాటు నిర్బంధించిన ఘటనపై ఎన్ఐఐ దర్యాప్తు చేపట్టడం తెల్సిందే.శనివారం సీఎం మమత మాల్దాలోని మానిక్చక్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్), ఎంఐఎంలనుద్దేశించి పరోక్షంగా ఆమె.. ‘జడ్జీలను ఘెరావ్ చేసిన ఆ రెండు మత పార్టీల వాళ్లు తప్పించుకుపోయారు. ఎన్ఐఏ అధికారులు విచారణ పేరుతో స్థానికులను వేధిస్తున్నారు. సుమారు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు’అని ఆరోపించారు. సర్‌లో పేర్ల తొలగింపునకు గురైన వారు న్యాయాధికారుల దగ్గరికి వెళ్లవద్దని, ఓటరు జాబితాలో తిరిగి తమ పేర్లను చేర్చాలంటూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు కోల్పోయిన వారిని చేతులెత్తాలని ఆమె కోరగా సభలో పాల్గొన్న చాలా మంది స్పందించడంపై విస్మయం వ్యక్తం చేశారు. ‘ఓటరు జాబితాలో పేర్లు లేని వారిని ట్రిబ్యునళ్ల వద్దకు వెళ్లేలా చేయడమే మా కర్తవ్యం’అని అన్నారు. -
అబద్దాలు చెప్పడంలో రేవంత్‌కు ఆస్కార్: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌కు అబద్దాలు చెప్పడంలో ఆస్కార్ ఇవ్వొచ్చని అన్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలపై చర్యలు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘సెంట్రల్ యూనివర్సిటీలో అరాచకం చేశారు. అలా ఇక్కడ చేయవద్దు. నెమళ్లు, పక్షులు, ఉన్నాయి పర్యావరణాన్ని రక్షించాలి. డంప్ యార్టుకు బీజేపీ వ్యతిరేకం కాదు.. ప్రజలకు దూరంగా ఉన్న దగ్గర నిర్మించాలి. హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ గురించి సీఎంకు తెలిసే మాట్లాడాడు. ఓసారి డంపింగ్ యార్డ్ నిర్మాణ స్థలాన్ని సీఎం పరిశీలించాలి లేదా నివేదిక తెప్పించుకోవాలి. లాఠీ దెబ్బలు అయినా తింటాం కానీ హుజురాబాద్‌లో డంప్ యార్డును అడ్డుకుంటాం.బీహార్, మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కారణం. కేరళంలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఆరు గ్యారంటీలు తెలంగాణలో అమలు కావడం లేదు. నిరుద్యోగ భృతి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడం లేదు. హామీలు అమలవుతున్నాయని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా లేదంటే సీఎం రాజీనామా చేయాలి. ఢిల్లీకి పోయి డబ్బు మూటలు స్పెషల్ ఫ్లైట్లలో ఇచ్చారు. కేరళ మీడియా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు గురించి తెలుసుకోవాలి. ఆరు గ్యారంటీలపై చర్చకు సవాలు చేస్తున్నా.. నా సవాలుకు సీఎం సిద్ధమా?’ అని ప్రశ్నించారు. -
బీజేపీ గేమ్ ప్లాన్‌లో భాగమే: మమత ఫైర్
బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఎస్ఐఆర్ విధుల్లో భాగంగా బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఏడుగురు న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో, ఈ అంశం కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ వ్యవహారంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ ప్లాన్ అంటూ విమర్శలు చేశారు.తాజాగా మమత మాట్లాడుతూ..‘ఈ ఘటనతో మా ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)పై ప్రజాగ్రహమే దీనికి కారణం. న్యాయాధికారులను ముట్టడించిన ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలియదు. కానీ SIRపై ప్రజలు కోపంగా ఉన్నారని మాత్రం నేను చెప్పగలను. దీనిపై నాకు ఎలాంటి అధికారం లేదు. శాంతిభద్రతలు వంటి అన్ని అధికారాలను వారే నా నుండి లాగేసుకున్నారు అంటూ వ్యాఖ్యానించారు.అలాగే, మాల్దాలో జరిగిన ఘటన బీజేపీ ఎన్నికల వ్యూహంలో భాగమే. ఎన్నికల్లో ఓటమి తప్పదని భావిస్తున్న కాషాయ పార్టీ, ఈ నెల చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయించి, బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది. వారు శాంతిభద్రతలను నియంత్రించాలని కోరుకుంటున్నారు కానీ విఫలమయ్యారు’ అని ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో పేర్ల తొలగింపుపై విస్తృతమైన అశాంతి నెలకొన్న నేపథ్యంలో శాంతిని కాపాడుకోవాలని ప్రలోభాలకు లొంగవద్దని బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న అంటూ కామెంట్స్ చేశారు.Sagardighi, West Bengal: On Malda issue, Chief Minister Mamata Banerjee says, "The BJP is playing a game...They have removed 1 crore 20 lakhs voter names, which is why we approached the Supreme Court. The Supreme Court ruled that this cannot happen..." pic.twitter.com/HVyEGIdzjs— IANS (@ians_india) April 2, 2026 ఏం జరిగింది?బెంగాల్లో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ మాల్డా జిల్లాలో ఆందోళనకారులు బుధవారం ఆందోళనకు దిగారు. మొదట న్యాయాధికారులతో సమావేశం కావాలని నిరసనకారులు కోరారు. అందుకు అనుమతి నిరాకరించడంతో నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో కార్యాలయం చుట్టూ చేరి అధికారులను నిర్బంధించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ వీధుల్లో భాగంగా బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఏడుగురు న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అని ధర్మాసనం అభివర్ణించింది. బెంగాల్లో శాంతిభద్రతల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, ఈ ఘటనపై తగిన వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేశారు.Seven judicial officers including THREE female officials were kept at siege for over 17 hours by Trinamool goons inside Kaliachak BDO office in Malda ! These judges have been appointed by the Hon'ble Court for completing the SIR process. But Mamata Banerjee and Trinamool does not… pic.twitter.com/a38LCVcPev— Keya Ghosh (@keyakahe) April 2, 2026ముగ్గురు మహిళలు సహా ఏడుగురు న్యాయాధికారులను కొన్ని అసాంఘిక శక్తులు నిర్బందించాయని, ఈ అర్థరాత్రి వరకు తాను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించాల్సి వచ్చిందని సీజేఐ తెలిపారు. ఇది న్యాయాధికారులను భయపెట్టడమే కాకుండా కోర్టు అధికారాన్ని నేరుగా సవాలు చేయడమేనని ధర్మాసనం పేర్కొంది. న్యాయాధికారులపై మానసిక దాడులకు పాల్పడేందుకు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. ఈ ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ కోరేందుకు ఎన్నికల సంఘానికి సుప్రీం ధర్మాసనం అనుమతి ఇచ్చింది. -
బీజేపీ మేనిఫెస్టో.. 3,000 పెన్షన్, ఉచిత సిలిండర్!
తిరువనంతపురం: కేరళలో అధికారమే లక్ష్యంగా యూడీఎఫ్, ఎల్డీఎఫ్‌లతో పాటు బీజేపీ కూడా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తన ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది.కేరళలో అధికారంలోకి వస్తే నిరుపేద మహిళలు, వితంతువులు, 70 ఏళ్ల పైబడ్డ వృద్ధులకు నెలకు రూ.3,000 పెన్షన్ ఇస్తామని బీజేపీ ప్రకటించింది. పేద కుటుంబాలకు ఏటా రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందజేస్తామని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మేరకు పలు వరాలు గుప్పించింది. రాష్ట్రానికి ఎయిమ్స్, ప్రార్థనా స్థలాల పరిరక్షణకు చట్టం తదితర హామీలు ఇచ్చింది. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన ఎన్డీఏ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. హామీలు ఇవే..నిరుపేద కుటుంబాల్లో ఇంటి పెద్దగా ఉన్న మహిళలకు నెలకు రూ.3,000 పెన్షన్వితంతువులకు, 70 ఏళ్లు పైబడ్డ వృద్ధులకు కూడా నెలకు రూ.3,000 పెన్షన్ఓనం, క్రిస్మస్ పండుగలకు ఒక్కోటి చొప్పున నిరుపేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ సిలిండర్మెడికల్, కిరాణా దుకాణాల్లో నెలకు రూ.2,500 మేరకు కొనుగోళ్లకు వీలుగా ప్రతి పేద మహిళకూ భక్ష్య, ఆరోగ్య సురక్ష కార్డు. -
సర్వం ‘సర్’మయం!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మతపరమైన విభజన ప్రధానాంశంగా మారుతోంది. ముఖ్యంగా ప్రధాన పక్షాలైన అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ప్రచారమంతా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ చుట్టే తిరుగుతోంది! దాంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా నిలిచిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ వంటివి పూర్తిగా పక్కకు పోయాయి. సర్, చొరబాట్లు, మైనారిటీల సంతుష్టీకరణే ప్రచారాంశాలుగా మారాయి.సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 64 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఇంకా లక్షలాది ఓటర్ల తనిఖీ కొనసాగుతోంది. దాంతో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలే పూర్తిగా మారిపోతున్నాయి! 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 90 స్థానాల్లో మెజారిటీ 10 వేల లోపే నమోదైంది. భారీ ఓట్ల తొలగింపు కారణంగా ఆ స్థానాల్లో ఈసారి పార్టీల బలాబలాలే తారుమారయ్యే పరిస్థితి నెలకొంది! ఒక్క ముర్షీదాబాద్ జిల్లాలోనే ఏకంగా 11 లక్షల ఓట్లు తొలగింపునకు గురవడం విశేషం. 8.3 లక్షలతో మాల్డా రెండో స్థానంలో నిలిచింది. నార్త్, సౌత్ 24 పరగణా జిల్లాల్లో కలిపి 12 లక్షల పైచిలుకు ఓట్లు గల్లంతయ్యాయి. ఆ రెండు జిల్లాల్లో మరో 11 లక్షల ఓట్ల తనిఖీ కొనసాగుతోంది! ఇదంతా తమ ఓటుబ్యాంకుకు గండి కొట్టే కుట్రేనని టీఎంసీ ఆరోపిస్తుండగా, కేవలం చొరబాటుదారులను, దొంగ ఓటర్లను ఏరివేయడమే లక్ష్యమని బీజేపీ చెబుతోంది.అస్తిత్వవాదం దిశగా... బెంగాల్లో గతంలో ప్రధానంగా ఎన్నికల వేళ మాత్రమే పార్టీలు, మతపరమైన విభజన వంటివి తెరపైకి వచ్చేవి. ‘‘సర్ ప్రక్రియతో పరిస్థితే మారిపోయింది. కొంతకాలంగా ఏ జిల్లాను తీసుకున్నా మతపరమైన విభజన కొట్టొచ్చినట్టుగా కన్పిస్తోంది. అంతేగాక అది క్రమంగా శాశ్వత రూపు సంతరించుకుంటూ ఉండటం ఆందోళనకరం. స్థానికంగా చిన్న స్థాయిలో జరిగే శ్రీ రామనవమి ఉత్సవాలు ఈసారి భారీ జన సమీకరణ వేదికలుగా మారడం ఇందుకు నిదర్శనం’’ అని రాజకీయ విశ్లేషకులు సుమన్ భట్టాచార్య, మొయిదుల్ ఇస్లాం అభిప్రాయపడ్డారు. బెంగాల్ రాజకీయాలు వర్గ సమీకరణల నుంచి పూర్తిగా మతం, సంస్కృతి, పౌరసత్వం పేరిట క్రమంగా అస్తిత్వవాదం వైపు మళ్లుతున్నాయని వారన్నారు. -
తొమ్మిది స్థానాలే కీలకం.. ఎన్డీయే హోరాహోరీ
కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ కూటములు హోరాహోరీ తలపడుతున్నాయి. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా సత్తా చాటేందుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో 9 అసెంబ్లీ స్థానాల్లో మూడు కూటముల నడుమ నెలకొన్న ముక్కోణపు పోరు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ స్థానాల్లో గెలుపోటములు మొత్తంగా ఎన్నికల ఫలితాలనే నిర్దేశించవచ్చని పరిశీలకులు భావిస్తుండటం విశేషం.నీమమ్తిరువనంతపురం జిల్లాలో ఉంది. ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటిదాకా బీజేపీ నెగ్గిన ఏకైక అసెంబ్లీ స్థానం కావడం విశేషం. 2016లో ఎల్డీఎఫ్కు చెందిన కె.శివన్‌కుట్టిపై బీజేపీ సీనియర్ నేత ఒ.రాజగోపాల్ విజయం సాధించారు. అనంతరం 2021 ఎన్నికల్లో శివన్కుట్టి కేవలం 3,949 ఓట్ల మెజారిటీతో బీజేపీని ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. దాంతో ఈ స్థానాన్ని బీజేపీ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖరన్‌ను బరిలో దించింది. ఎల్డీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శివన్కుట్టి, యూడీఎఫ్ నుంచి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.శబరీనందన్ పోటీలో ఉన్నారు.కళక్కొట్టం బీజేపీ బలంగా కనిపిస్తున్న మరో అసెంబ్లీ స్థానమిది. గత రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది. ఎల్డీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కడకంపల్లి సురేంద్రన్ మరోసారి బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యరి్థగా బీజేపీ సీనియర్ నేత వి.మురళీధరన్ నిలిచారు. 2016లో సురేంద్రన్ చేతిలో ఆయన కేవలం 7,347 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇటీవలి తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి దూకుడు మీదున్న బీజేపీ ఈసారి కళక్కొట్టం తమ ఖాతాలో చేరడం ఖాయమని ధీమాగా ఉంది. యూడీఎఫ్ నుంచి మాజీ ఎమ్మెల్యే టి.శరచ్ఛంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు.వట్టియుర్కవుఇది కూడా బీజేపీకి మంచి పట్టున్న స్థానమే. 2016, 2012 రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు. కానీ 2019 ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. ఎల్డీఎఫ్ నుంచి ప్రశాంత్ హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈసారి ఎలాగైనా నెగ్గాలని భావిస్తున్న బీజేపీ మాజీ డీజీపీ ఆర్.శ్రీలేఖను బరిలో దించింది. 2011, 2016 ఎన్నికల్లో విజయం సాధించిన కె.మురళీధరన్‌నే యూడీఎఫ్ ఈసారీ పోటీకి పెట్టింది.మంజేశ్వరంబీజేపీకి అందినట్టే అంది చేజారుతూ వస్తున్న స్థానమిది. ఆ పార్టీ సీనియర్ నేత కె.సురేంద్రన్ 2016లో ఇక్కడ కేవలం 89 ఓట్లతో ఓటమి చవిచూశారు. 2021లో కూడా 855 ఓట్ల తేడాతో మరోసారి పరాజయం మూటగట్టుకున్నారు. ఈసారి మాత్రం యూడీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎ.కె.ఎం.అష్రఫ్‌ను ఓడించి తీరతానని సురేంద్రన్ ధీమాగా ఉన్నారు. ఎల్డీఎఫ్ తరఫున కె.ఆర్.జయనంద బరిలో ఉన్నారు.పాల చారిత్రకంగా ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ ఉండేది. ఈసారి మాత్రం కథ మారింది. ఎల్డీఎఫ్ నుంచి కేరళ కాంగ్రెస్ (మణి) చైర్మన్జోస్ కె.మణి బరిలో ఉన్నారు. యూడీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మణి సి.కప్పన్‌తో తలపడుతున్నారు. బీజేపీ వ్యూహాత్మకంగా బాగా ప్రజాదరణ ఉన్న మాజీ ఎమ్మెల్యే పి.సి.జార్జి కుమారుడు షోన్ జార్జిని బరిలో దించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.నట్టికగత ఎన్నికల్లో సీపీఐ తరఫున నెగ్గిన సిట్టింగ్ ఎమ్మెల్యే సి.సి.ముకుందన్ ఈసారి బీజేపీ టికెట్‌పై బరిలో దిగుతుండటం ఆసక్తికరం. నియోజకవర్గంలో ఆయనకు ఉన్న వ్యక్తిగత ఆదరణ బాగా కలిసొస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఎల్డీఎఫ్ ఈసారి మాజీ ఎమ్మెల్యే గీతా గోపీకి టికెటిచ్చింది. యూడీఎఫ్ నుంచి కూడా సునీల్ లాలూర్ రూపంలో గట్టి అభ్యర్థి బరిలో ఉండటంతో పోరు హోరాహోరీగా మారింది. మంజేశ్వరం బీజేపీకి అందినట్టే అంది చేజారుతూ వస్తున్న స్థానమిది. ఆ పార్టీ సీనియర్ నేత కె.సురేంద్రన్ 2016లో ఇక్కడ కేవలం 89 ఓట్లతో ఓటమి చవిచూశారు. 2021లో కూడా 855 ఓట్ల తేడాతో మరోసారి పరాజయం మూటగట్టుకున్నారు. ఈసారి మాత్రం యూడీఎఫ్ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎ.కె.ఎం.అష్రఫ్‌ను ఓడించి తీరతానని సురేంద్రన్ ధీమాగా ఉన్నారు. ఎల్డీఎఫ్ తరఫున కె.ఆర్.జయనంద బరిలో ఉన్నారు.అరన్ములపత్థనంతిట్ట జిల్లాలోని ఆలయ నగరమైన ఈ స్థానంపై కూడా బీజేపీ గట్టి ఆశలే పెట్టుకుంది. అరన్ముల విమానాశ్రయ ఆందోళనలతో మంచి జనాదరణ పొందిన రాజశేఖరన్‌ను బరిలో దించింది. ఎల్డీఎఫ్ నుంచి హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన ఆరోగ్య మంత్రి వీణా జార్జిని ఆయన ఢీకొడుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ ఈసారి వ్యూహాత్మకంగా అబిన్ వర్కుకి టికెట్ ఇచ్చింది. గత రెండు ఎన్నికల్లో వీణా జార్జికి దన్నుగా నిలిచిన పలు సామాజికవర్గాలకు చెందిన ఓటర్లను ఆయన కాంగ్రెస్‌వైపు తిప్పగలరని పార్టీ ఆశపడుతోంది.త్రిసూర్గత ఎన్నికల్లో ఇక్కడ అధికార, విపక్ష కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ఎల్డీఎఫ్ నుంచి సీపీఎం అభ్యర్థి పి.బాలచంద్రన్ కేవలం 946 ఓట్లతో గట్టెక్కారు. ఎన్డీఏ తరఫున సినీ నటుడు సురేశ్‌గోపి గట్టి పోటీ ఇచ్చినా మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్ స్థానం నుంచి విజయం సాధించారు. రాష్ట్రంలో బీజేపీకి దక్కిన తొలి లోక్‌సభ స్థానం అదే కావడం విశేషం. బీజేపీ ఈసారి సీనియర్ నాయ కుడు వేణుగోపాల్‌కు టికెట్ ఇచ్చింది. ఎల్డీఎఫ్ నుంచి అలంకొడె లీలాకృష్ణన్, యూడీఎఫ్ నుంచి మాజీ మేయర్ రాజన్ పల్లన్ పోటీలో ఉన్నారు.పాలక్కాడ్ఇక్కడ ఎల్డీఎఫ్, బీజేపీ తెర వెనక కుమ్మక్కయ్యాయని విపక్ష నేత వి.డి.సతీశన్ విమర్శలతో వాతావరణం బాగా వేడెక్కింది. యూడీఎఫ్‌కు పడే బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఎల్డీఎఫ్ కావాలనే హోటల్ వ్యాపారి ఎన్ఎంఆర్ రజాక్‌కు టికెటిచి్చందని సతీశన్ ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ‘మెట్రో మ్యాన్’ఇ.శ్రీధరన్‌కు టికెటిచి్చంది. ఆయన కేవలం 3,859 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ చేతిలో ఓటమి చవిచూశారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ రెండో స్థానంలో నిలిచిన శోభా సురేంద్రన్‌కు బీజేపీ ఈసారి టికెటిచి్చంది. షఫీ లోక్‌సభకు వెళ్లడంతో 2021లో ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ మమ్కూతటిల్ నెగ్గారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ ఈసారి ఆయన్ను పక్కన పెట్టి రమేశ్ పిశరోడికి టికెట్ ఇచ్చింది. -
బీజేపీకి ఝలక్.. ఎన్నికల వేళ ట్విస్ట్ ఇచ్చిన అన్నామలై!
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. అన్నాడీఎంకేతో సీట్లు సర్దుబాటు విషయమై రాష్ట్ర బీజేపీ మాజీ సారథి కె.అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇందుకు నిరసనగా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్టు వార్తలొస్తున్నాయి.ఈ మేరకు కేంద్ర నాయకత్వానికి అన్నామలై ఇప్పటికే లేఖ కూడా రాశారు. బీజేపీ సులువుగా గెలవగలిగే కినతుకడవు వంటి స్థానాలను అన్నాడీఎంకే అట్టిపెట్టుకోవడంపై అందులో తీవ్రంగా ఆక్షేపించారు. కినతుకడవు నుంచి బీజేపీ పోటీ చేయకపోవడాన్ని నిరసిస్తూ నియోజకవర్గంలో పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు రెండు రోజులుగా ఆందోళనకు కూడా దిగుతున్నాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే 169, బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎన్డీయేలోని ఇతర భాగస్వాములు పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 స్థానాలు దక్కాయి. బీఎల్ సంతోష్‌కు ఝలక్..ఇదిలా ఉండగా.. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ గురువారం చైన్నెలో నిర్వహించిన సమావేశానికి అన్నామలై గైర్హాజరు కావడం చర్చకు దారి తీసింది. గురువారం బీఎల్ సంతోష్ నేతృత్వంలో బీజేపీరాష్ట్ర కమిటీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో మాజీ అధ్యక్షుడు అన్నామలై పాల్గొన లేదు. తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదన్న లేఖను ఆయన పార్టీ అధిష్టానానికి పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన కోయంబత్తూరులోని సింగానల్లూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధమై, గత కొంత కాలంగా తన దృష్టిని కేంద్రీకరించారు. అయితే ఆ స్థానాన్ని అన్నాడీఎంకే నుంచి రాబట్టడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారు. దీంతో తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదని అధిష్టానానికి అన్నామలై లేఖ పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన ఎన్నికలలో పోటీ చేయాలని మహిళా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ పిలుపు నిచ్చినా ఆయన స్పందించక పోవడం గమనార్హం.ఢిల్లీకి అభ్యర్థుల జాబితా27 మంది అభ్యర్థుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసి ఢిల్లీకి పంపించినట్టు సమాచారం. ఇందులో అవినాశి–కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, మైలాపూర్– మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కోయంబత్తూరు నార్త్– ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్, నాగర్‌కోయిల్– మాజీ కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, సాత్తూరు– బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, తళి – అమరప్రసాద్ రెడ్డి, తిరుప్పూర్ సౌత్ – ఎ.పి. మురుగానందం, విలవంకోడ్ – విజయధరణి, మదురై సౌత్–రామ శ్రీనివాసన్, తిరువణ్ణామలై– అశ్వత్థామన్, తంజావూరు– కరుప్పు మురుగానందం, మొడకురిచ్చి –కృతికా శివకుమార్, పుదుక్కోట్టై– రామచంద్రన్..రామనాథపురం– జి.పి.ఎస్. నాగేంద్రన్,రాశిపురం– డాక్టర్ ప్రేమ్ కుమార్,వాసుదేవనల్లూర్ – ఆనందన్ అయ్యాస్వామి, ఆవడి– అశ్విన్, ఊటి– భోజ రాజన్ లేదా ఉమాదేవి, గంధర్వకోట్టై – పురట్చి కవి దాసన్, తిరుపత్తూరు– చోళ పళనిస్వామి, అరంతంగి– కవిత శ్రీకాంత్, రాధాపురం– బాలకృష్ణన్, తిరువారూర్ – శివ, మనమదురై– పొన్పాల గణపతి, తిరుచెందూర్– ఆర్.ఎం. రాధాకృష్ణన్, పద్మనాభపురం– ఎడ్విన్ జోస్,కులచల్– శివకుమార్ పేర్లు ఉన్నాయి. సుమారు 20 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తూ సిద్ధం చేసిన జాబితాను ఢిల్లీ ఆమోదంతో రెండు రోజులలో ప్రకటించనున్నారు. -
సీఎం హిమంత పోటీ.. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
గువాహటి: బీజేపీ పాలిత అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బరిలో నిలిచిన జలూక్బారీలో కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియాంగ్ నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. అయితే తిరస్కరణకు కారణాలను ఈసీ తన వెబ్సైట్లో ప్రస్తావించలేదు. మరోవైపు హాఫ్లాంగ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ లాంగ్థాసా నామినేషన్ తిరస్కరణకు గురైంది.అయితే అదే స్థానంలో పోటీకి నిలిచిన మరో కాంగ్రెస్ నాయకురాలు నందితా గార్లోసా నామినేషన్‌ను ఈసీ ఆమోదించింది. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆదివారమే ఆమె కాంగ్రెస్‌లో చేరి వెంటనే నామినేషన్ వేశారు. ధకౌఖానాలో కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద నరాహ్ నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. 126 స్థానాలున్న శాసనసభ ఎన్నికల కోసం 815 మంది అభ్యర్థుల నుంచి 1,389 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. పలువురు ఒకటి కంటే ఎక్కువ సెట్ల పేపర్లను సమర్పించారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపటిదాకా గడువు ఉంది. -
ఉత్తరాన గట్టిపోరు.. 54 స్థానాలు కీలకం
పశ్చిమబెంగాల్లో ఈసారి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నడుమ సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు అచ్చం దంగల్ కుస్తీ పోటీలను తలదన్నుతోంది. ఒకటి కేంద్రంలో, మరొకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పారీ్టలు కావడంతో ఈ ఎన్నికలను రెండు పక్షాలూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ బరిలో ఇప్పటికే విజయాల హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ వరుసగా నాలుగో విజయంపై కన్నేసింది.రాష్ట్రంలో కొన్నేళ్లుగా క్రమంగా విస్తరిస్తూ వస్తున్న కాషాయ దళం ఈసారి టీఎంసీని ఎలాగైనా ఓడించి తొలిసారి అధికారాన్ని ఒడిసిపట్టాలని పట్టుదలగా ఉంది. ఆ క్రమంలో కీలకమైన ఉత్తర బెంగాల్ ప్రాంతంపై 2 పార్టీలూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. తనకిప్పటికే పట్టున్న ఈ ప్రాంతాన్ని కంచుకోటగా మార్చుకునే ప్రయత్నాల్లో బీజేపీ తలమునకలుగా ఉంది. పలు ప్రాంతీయ హామీలతో ఉత్తర బెంగాల్వాసులను ఆకట్టుకునేందుకు, ఆదరణ పెంచుకునేందుకు తృణమూల్ ప్రయత్నిస్తోంది.నువ్వా, నేనా! బీజేపీ, టీఎంసీ ఎన్నికల పోరుకు ఉత్తర బెంగాల్ ప్రాంతం కీలకంగా మారింది. ఇక్కడ 54 అసెంబ్లీ సీట్లపై రెండు పార్టీలూ గట్టిగా దృష్టి పెట్టాయి. ఒకప్పుడు కొరకరాని కొయ్యగా ఉన్న ఈ ప్రాంతంలో బీజేపీలో కొన్నేళ్లుగా బలపడుతూ వస్తోంది. ఆ పట్టును ఈసారి మరింతగా పెంచుకోవడమే లక్ష్యంగా ఉత్తర బెంగాల్‌పై బీజేపీ జాతీయ నాయకత్వం గట్టిగా దృష్టి పెట్టింది. ఈసారి ఇక్కడ కనీసం 40 అసెంబ్లీ స్థానాలకు పైగా గెలిపించే బాధ్యతలను పార్టీ బెంగాల్ ఇన్చార్జి సునీల్ బన్సర్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌కు అప్పగించింది. వారు ఇటీవలే ముఖ్య స్థానిక నేతలతో కీలక సమావేశం నిర్వహించి సమగ్ర ప్రచార వ్యూహం సిద్ధం చేశారు. అందులో భాగంగా మూడంచెల ప్రచార పర్వానికి బీజేపీ తెర తీసింది. ఉత్తర బెంగాల్‌కు తృణమూల్‌కు అన్నివిధాలా ద్రోహం చేస్తోందంటూ హోరెత్తిస్తోంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వస్తోందని ఆరోపణలు గుప్పిస్తోంది. ‘సరికొత్త ఉత్తర బెంగాల్’ నినాదంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంటింటి ప్రచారంతో దూకుడు పెంచుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఉత్తర బెంగాల్‌కు దీదీ కేవలం 0.002 శాతం నిధులు విదిలించారన్న బీజేపీ ఆరోపణలు ఓటర్లను ఆలోచింపజేస్తున్నాయి. బాగ్డోగ్రా విమానాశ్రయ విస్తరణలో భూమి కోల్పోనున్న రైతులు, కార్మిక సంస్కరణల పేరిట తేయాకు పనివారికి అన్యాయం తదితరాలను కూడా బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కూడా అప్రమత్తమైంది. ఉత్తర బెంగాల్లో అధిక సంఖ్యలో ఉండే తేయాకు కార్మికుల సంక్షేమానికి ఇప్పటికే పలు హామీలిచ్చింది. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేస్తామని పేర్కొంది. రైతులకు ఎలాంటి అన్యాయమూ జరగకుండా చూసుకునే బాధ్యత మమతదేనంటూ టీఎంసీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బెంగాలీ అస్తిత్వ నినాదాన్ని ప్రధానంగా ముందుకు తెస్తున్నారు. ఎందుకు కీలకం.. ఉత్తర బెంగాల్ గిరిజనులు, మైనారిటీ ప్రాబల్య ప్రాంతం. ఇది చారిత్రకంగా తృణమూల్‌కు పెద్దగా పట్టు లేని ప్రాంతమనే చెప్పాలి. తొలినుంచీ ఇక్కడ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఆధిపత్యమే సాగుతూ వచ్చింది. అవి బలహీనపడ్డాక కొన్నేళ్లుగా వాటి స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తూ వస్తోంది. ఇక్కడి డార్జిలింగ్, కూచ్ బెహార్, జల్పాయ్గురి, దినాజ్‌పూర్ ప్రాంతాల్లో బీజేపీ హవా క్రమంగా పెరుగుతూ వస్తోంది. డార్జిలింగ్ లోక్‌సభ స్థానాన్ని 2009 నుంచీ బీజేపీయే నెగ్గుతోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ ఇక్కడ 25 స్థానాలు నెగ్గితే బీజేపీ కేవలం మూడింటితోనే సరిపెట్టుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారిపోయింది. ఉత్తర బెంగాల్‌లోని 8 సీట్లకుగాను బీజేపీ ఏడింటిని చేజిక్కించుకుంది. అదే ఊపులో 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏకంగా 30 సీట్లు ఒడిసిపట్టింది. తృణమూల్ 24 సీట్లతో సరిపెట్టుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 6 స్థానాలు నెగ్గింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బెంగాల్‌పై బీజేపీ ‘యూపీ’ వ్యూహం.. పోటీలో ఎవరంటే?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఫలించిన ఎన్నికల వ్యూహాన్ని పశ్చిమబెంగాల్లో అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సన్యాసులు, పూజారులు, ఆధ్యాత్మికవాదులను ఎన్నికల బరిలో దించుతోంది. యూపీలో గోరఖ్‌నాథ్ మఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ పలుమార్లు ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి కావడం తెలిసిందే.సన్యాసి వర్గం నుంచి వచ్చిన సాక్షి మహరాజ్, స్వామి అవైధ్యనాధ్, స్వామి చిన్మయానంద్ తదితరులు ఎన్నికల్లో గెలిచారు. బెంగాల్లో ఆధ్యాతి్మక రంగానికి చెందిన పలువురికి బీజేపీ టికెట్లిచి్చంది. భారత్ సేవాశ్రమంలో పని చేసిన ఉత్పల్ మహారాజ్‌ను కాలియాగంజ్ నుంచి బరిలో దించింది. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి 94 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన సౌమన్ రాయ్‌తో ఉత్పల్ పోటీ పడే అవకాశముంది.ఉల్బేరియా సౌత్ నుంచి స్వామి మంగళానంద పూరికి బీజేపీ టికెట్ దక్కింది. తృణమూల్‌కు చెందిన పులోక్ రాయ్‌తో ఆయన తలపడనున్నారు. మఠాలు, ఆశ్రమాలకు ఆదరణ బాగా ఉండే నవద్వీప్ నుంచి శ్రీ శృతి శేఖర్ గోస్వామిని బీజేపీ బరిలోకి దించింది. బెహలా పూర్బ నుంచి సునీల్ మహారాజ్ పోటీలో ఉన్నారు. హన్సన్ నుంచి చారిత్రక తారాపీఠ ఆలయ పూజారి నిఖిల్ బెనర్జీ పోలీకి టికెటిచి్చంది. వీటిలో చాలావరకు తృణమూల్ సిట్టింగ్ స్థానాలే ఉండటం విశేషం! -
కాషాయ పార్టీదే హవా.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోసం కాకుండా అధికారపక్షం కొనసాగింపు కోసం జరగనున్నాయని సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ అస్సాంలో తాజాగా నిర్వహించిన రెండో ట్రాకర్ పోల్ సర్వేలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇంకా ఐక్యతా లోపాలతో తడబతున్నట్టు వెల్లడైంది.2026 మార్చి 9 నుంచి 22 వరకు నిర్వహించిన ఈ క్షేత్రస్థాయి రెండో ట్రాకర్ పోల్ సర్వే అస్సాం ఓటర్ల మూడ్‌ను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఈ ఎన్నికలు అధికార మార్పు కోసం జరిగే పోరాటం మాత్రమే కాదు. ఇది అస్సాంలో గత ఐదేళ్ల పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం మీద వ్యతిరేకత అంతగా కనిపించడం లేదు. స్థిరత్వం, నాయకత్వం, అభివృద్ధి అనే మూడు అంశాలను ఆధారంగా చేసుకుని ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఈ సర్వేలో తేలింది. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే 69 నుంచి 73 సీట్లు గెలుచుకునే అవకాశముందని పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడైంది. అంటే, బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కును దాటే స్థాయిలో ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 26 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా. ఈ తేడా కేవలం సీట్ల సంఖ్యలోనే కాకుండా రాజకీయంగా స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపుతోంది.ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరింత బలపడే అవకాశం ఉంది. అస్సాంలో బీజేపీ మిత్రపక్షాలైన ఏజీపీ 8 నుంచి 11 సీట్లు, బీపీఎఫ్ 8 నుంచి 9 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఎన్డీయే కూటమి 90 సీట్లు కైవసం చేసుకునే అవకాశముంది. ఇది సాధారణ విజయం కాదు. ఇది స్పష్టమైన ప్రజా తీర్పు, స్థిరమైన ప్రభుత్వానికి సంకేతంగా చూడాలి. మరోవైపు ఏఐయూడీఎఫ్, రైజోర్ దల్, యూపీపీఎల్, ఏజీపీ, సీపీఐ(ఎం) వంటి పార్టీలు ఈ ఎన్నికల్లో పరిమిత స్థాయిలోనే ప్రభావం చూపే పరిస్థితి ఉంది.అయితే, ఈ ఎన్నికల్లో ఓటు షేర్ ఫలితాలను విశ్లేషిస్తే పరిస్థితి కాస్త వేరేలా కనిపిస్తుంది. పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్-2 సర్వేలో బీజేపీకి 39% ఓటు షేర్, కాంగ్రెస్‌కు 36.5% ఓటు షేర్ వస్తుందని అంచనా వేసింది. ఈ తేడా పెద్దది కాకపోయినా, అస్సాం రాజకీయాల్లో ఇది భారీ మెజారిటీకి దారి తీస్తుంది. ఎందుకంటే, ఇక్కడ బీజేపీ మిత్రపక్షాలతో కలిసి కట్టుగా ఓట్లను సీట్లుగా మార్చుకునే సామర్థ్యం కలిగి ఉండగా, ప్రతిపక్షం ఇప్పటికీ అంతర్గత కలహాలతో కాలం గడుపుతోంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో నాయకత్వం కూడా కీలక అంశంగా మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మకు ఉన్న ప్రజాదరణ బీజేపీకి ప్రధాన బలంగా మారింది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం 40% మంది అస్సాం ప్రజలు మళ్లీ ఆయననే ముఖ్యమంత్రిగా కోరుకుంటుండగా, కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గోగోయ్ 33% మద్దతుతో రెండో స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజన వర్గాల్లో ముఖ్యమంత్రి హిమంతకు ఉన్న మద్దతు బీజేపీకి, ఎన్డీయే కూటమి పక్షాలకు అదనపు బలాన్ని ఇస్తోంది.అస్సాం రాష్ట్రాన్ని ప్రధానంగా 5 పరిపాలనా విభాగాలుగా విభజించారు. ఈ ఐదింటిని ప్రాంతాల వారీగా చూసినప్పుడు, అస్సాం రాజకీయాలు ఏకరీతిగా కనిపించడం లేదు. ఎగువ అస్సాంలో ఎన్డీయే బలంగా ఉండి, అధికశాతం నియోజకవర్గాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల మాత్రమే కాంగ్రెస్, రైజోర్ దల్ కాస్త పుంజుకుంటున్న సంకేతాలు ఉన్నాయి. సిబ్సాగర్లో రైజోర్ దల్ పోటీగా ఉండగా, నజీరా, టియోక్, టిటాబర్, జోర్హాట్ లాంటి చోట్ల కాంగ్రెస్ బలపడింది. డూమ్ డూమా, డెర్గావ్, సోనారి లాంటి చోట్ల క్లోజ్ ఫైట్ కనిపిస్తోంది. మధ్య అస్సాంలో రాజకీయ సమీకరణాలు మరింత క్లిష్టంగా ఉన్నాయి. నాగావ్, హోజై, కార్బి ఆంగ్లాంగ్ వంటి జిల్లాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ తీసుకున్న కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు పార్టీకి నష్టం చేస్తున్నాయి. ధింగ్, దల్గావ్ వంటి బలమైన సీట్లు రైజోర్ దల్కు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ ఈ ప్రాంతంలో బలహీనపడింది. ఇదే సమయంలో కొన్ని చోట్ల ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఏఐయూడీఎఫ్కి అవకాశాలు కల్పిస్తోంది.దిగువ అస్సాంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఏఐయూడీఎఫ్ మెరుగైన స్థానంలో ఉంది. గౌరిపూర్, శ్రీజంగ్రామ్ లాంటి చోట్ల పార్టీ ముందంజలో ఉండగా, చెంగా, ధుబ్రి లాంటి చోట్ల గట్టి పోటీ ఇస్తోంది. అయినప్పటికీ మొత్తం ప్రాంతంగా అంచనాలను విశ్లేషిస్తే ఎన్డీయే ఆధిపత్యమే కొనసాగుతోంది. బరాక్ వ్యాలీలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. బీజేపీ ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కొన్ని చోట్ల బలంగా ఉంది. సోనై, బార్కోలా, అల్గాపూర్, కరీంఘంజ్ సౌత్ వంటి చోట్ల కాంగ్రెస్ గెలిచే అవకాశముంది. కరీంఘంజ్ నార్త్‌లో మాత్రం హోరాహోరీ పోటీ నెలకొంది.ఈ ఎన్నికల్లో కొన్ని కీలక ట్రెండ్స్ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏఐయూడీఎఫ్ గతంతో పోలిస్తే కొంత మెరుగైంది. కానీ ఇది ఆ పార్టీవైపు వీస్తున్న గాలివల్ల కాకుండా, ఆ పార్టీ నిలబెడుతున్న అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం వల్లే అని పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్-2 సర్వేలో వెల్లడయింది. గెలిచే అవకాశమున్న సీట్లు వదిలేయడం వల్ల కాంగ్రెస్–రైజోర్ దల్ కూటమిలో కాంగ్రెస్‌కే నష్టం చేస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీలో కూడా కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. టికెట్ కేటాయింపుల్లో చేసిన కొన్ని తప్పులు, పాత నాయకులను పక్కన పెట్టడం వల్ల కొంత అసంతృప్తి ఉంది. అయితే ఇవి పెద్ద స్థాయిలో ప్రభావం చూపేలా కనిపించడం లేదు.అస్సాంలో చిన్న పార్టీల పాత్ర కూడా ఆసక్తికరంగా ఉంది. జై భారత్ పార్టీ వంటి సంస్థలు టీ ట్రైబ్ ప్రాంతాల్లో ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఇది కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. టీ తోటలు అధికంగా ప్రాంతాల్లో జై భారత్ పార్టీ కొంత కనిపిస్తోంది. వీరికి జేఎంఎం పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తోంది. రంగాపర, సొనారి, మజ్బత్ నియోజకవర్గాల్లో జై భారత్ పార్టీ బీజేపీ ఓట్లను చీల్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీయేలోని ఏజీపీకి కేటాయించినవాటిలో అధికంగా ముస్లిం ప్రభావిత నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఏజీపీ తన పార్టీ తరఫున ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించింది. బీజేపీ మాత్రం రాష్ట్రం వ్యాప్తంగా ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వకపోవడం గమనార్హం.ఓటర్ల అభిప్రాయాలు కూడా స్పష్టంగా ఒక దిశలోనే ఉన్నాయి. 52% మంది రాష్ట్ర అభివృద్ధికి బీజేపీనే మంచిదని భావిస్తుండగా, 60% మంది మళ్లీ అదే ప్రభుత్వం వస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే 60% మంది మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇది ప్రభుత్వం పట్ల వీస్తున్న సానుకూల పవనాలకు నిదర్శనం. సామాజికంగా కూడా బీజేపీ తన పరిధిని విస్తరించుకుంది. గిరిజనులు, ఓబీసీ వర్గాల్లో మద్దతు పెంచుకుంది. గత ఎన్నికల్లో వచ్చిన విజయాలు పార్టీకి మరింత బలాన్నిచ్చాయి.మరోవైపు అక్రమ వలసలు, అక్రమంగా వచ్చినవారు భూముల ఆక్రమించారనే ఆరోపణలు కూడా రాజకీయ చర్చలో కీలకంగా మారడంతో... అవి ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నాయి. పీపుల్స్ పల్స్ రీసర్చ్ బృందం అస్సాంలోని మొత్తం 126 నియోజకవర్గాల్లో 5000 మందితో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించింది. కులం, మతం, వయస్సు, లింగం వంటి అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ ఈ సర్వే సాగింది. ఈ సర్వేలో వచ్చిన ఫలితాలను విశ్లేషకులు, జర్నలిస్టులతో చర్చించి డేటాను క్రాస్ చెక్ చేశారు.మొత్తానికి చూస్తే, మరికొన్ని రోజుల్లో జరగబోయే 2026 అస్సాం ఎన్నికల్లో ప్రతిపక్షం ఇంకా ఐక్యత లోపంతో పోరాడుతుండగా, బీజేపీ మాత్రం తన నాయకత్వం, సంస్థాగత బలం, ప్రభుత్వంపై ఉన్న సానుకూల అభిప్రాయంతో స్పష్టమైన ఆధిక్యాన్ని నిర్మించుకుంది. ఇదే ధోరణి కొనసాగితే, అస్సాం మరోసారి స్థిరమైన ప్రభుత్వాన్ని చూస్తుంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుంది!- ఆర్. దిలీప్ రెడ్డి,డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ. -
కేరళ కాంగ్రెస్‌లో ‘కుంపటి’?
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలో అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు రోజుల అంతర్గత చర్చల తర్వాత మొత్తం 92 అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. చివరగా 37 మంది పేర్లను గురువారం రాత్రి ప్రకటించింది. దీంతో, సీటు దక్కని నేతలు అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు సమాచారం. నేమోం, కన్నూర్, పెరుంబవూర్ వంటి కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది.అయితే, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా కన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి కేపీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ కే.సుధాకరన్‌కు టికెట్ ఇవ్వలేదు. ఆయన సూచించిన అభ్యర్థి కూడా తిరస్కరించబడ్డారు. బదులుగా కన్నూర్ మేయర్ మోహనన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ క్రమంలో ఎంపీ సుధాకరన్ స్పందిస్తూ.. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు. అలాగే, స్వతంత్రంగా పోటీ చేయను అని కూడా వెల్లడించారు. అయితే, ఆయన అనుచరులు మాత్రం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు మద్దతుగా కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారని సమాచారం.ఇక, మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎల్దోస్ కున్నాపిల్లిల్ పెరుంబపూర్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. అక్కడి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎల్దోస్ మాట్లాడుతూ.. పార్టీ కింద స్థాయి కార్యకర్త వరకు నన్ను అభ్యర్థిగా కోరుకుంటున్నారు. మేము మా నియోజకవర్గంలో దాదాపు 9,000 కొత్త ఓటర్లను జమ చేశాం. 15,000 ఇళ్లను సందర్శించాం. కానీ నా కృషిని హైకమాండ్ పట్టించుకోలేదు. అయినప్పటికీ, పార్టీని వదిలిపెట్టను. ఇది కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, పెరుంబవూర్‌లో ఎల్డోస్ స్థానంలో మనోజ్ మూథేదన్ను కాంగ్రెస్ పోటీలో నిలిపింది.మరోవైపు.. నేమోం నియోజకవర్గంలో కాంగ్రెస్ కేఎస్ సబరీనాథన్‌ను బరిలో నిలిపింది. ఇక్కడి నుంచే కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. ఇక, సీపీఎం నుంచి శివంకుట్ట పోటీ చేస్తున్నారు. నేమోం నియోజకవర్గం గత ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీని ప్రతిబింబిస్తున్నాయి. 2016లో బీజేపీ నుంచి రాజగోపాల్ మొదటిసారి విజయం సాధించగా, 2021లో సీపీఎం తిరిగి సీటు గెలుచుకుంది. 2021లో సీపీఎం నుంచి శివంకుట్టి విజయం సాధించారు. 2006లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొత్తంగా కాంగ్రెస్ జాబితాపై పలువురు అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నట్టు కార్యకర్తలు బహరంగంగానే చెబుతున్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరించి, నేతలు చివరికి విధేయత చూపుతున్నారు. -
బీజేపీ ఆఫీసులో కలకలం.. పార్టీ నేతపై మహిళ దాడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ఆఫీసులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పార్టీ కార్యవర్గ సభ్యుల అభినందన కార్యక్రమంలో ఓ మహిళ.. బీజేపీ నేతపై దాడి చేసింది. అతడిని చెంపదెబ్బ కొట్టి, అతడి కాలర్ పట్టుకుని బయటకు లాగేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో బుధవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమం గందరగోళానికి దారితీసింది. నామినేటెడ్ కౌన్సిలర్లు, పార్టీ కార్యవర్గ సభ్యులను అభినందించడానికి పార్టీ నేతలు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ మహిళ ప్రాంగణంలోకి ప్రవేశించి, ఆర్థిక వివాదంపై పార్టీ నేతను కార్యకర్తను నిలదీసింది. తనను లక్షల రూపాయలు మోసం చేశాడని ఆరోపించి, పార్టీ కార్యకర్తల సమక్షంలో అతనిపై దాడి చేసింది. చెంపదెబ్బ కొట్టి, అతని కాలర్ పట్టుకుని బయటకు లాగడానికి ప్రయత్నించింది. దీంతో ఆ ప్రాంగణంలో కలకలం రేగింది. దీంతో, అక్కడున్న వారంతా జోక్యం చేసుకోవడానికి పరుగెత్తుకొచ్చారు. ఈ ఘర్షణలో తోపులాటలు, మాటల దూషణలు, చెప్పులతో కొట్టుకోవడం వంటివి జరిగినట్లు సమాచారం.यूपी – जिला महराजगंज में BJP के कार्यक्रम में एक महिला कार्यकर्ता ने पुरुष कार्यकर्ता का कॉलर पकड़ लिया, हाथापाई की, उसे चप्पल दिखाई। महिला कार्यकर्ता का आरोप था कि LIC पॉलिसी के नाम पर साढ़े 4 लाख रुपए लिए, लेकिन इस व्यक्ति ने वो पैसे खाते में जमा .!#UttarPradesh #Maharganj pic.twitter.com/IzETG53KxF— Anil Yadav (Journalist) (@AnillYadavIN) March 19, 2026రూ.4.5 లక్షల మోసం ఆరోపణ..ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. తాను ఎల్ఐసీ డిపాజిట్ల పేరుతో సుమారు రూ.4.5 లక్షలు అతడికి అప్పగించానని.. అయితే నిందితుడు ఆ డబ్బును జమ చేయకపోగా దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. ఆమె చాలా కాలంగా తన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ఇవ్వడం లేదని మండిపడ్డారు. బుధవారం ఆమె తన కుమారుడితో కలిసి ఆ కార్యక్రమానికి హాజరైనట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, వారిద్దరూ వెంటనే డబ్బు తిరిగి చెల్లించాలని పట్టుబట్టారు.పోలీసుల జోక్యంసమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ వివాదంలో పాల్గొన్న మహిళను, ఇతరులను బీజేపీ కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్లడంతో, దాదాపు గంటపాటు అంతరాయం తర్వాత కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది.పార్టీ స్పందనఆర్థిక వివాదం కారణంగా ఈ ఘర్షణ అకస్మాత్తుగా చెలరేగిందని మాజీ జిల్లా అధ్యక్షుడు, మాజీ అభ్యర్థి సమీర్ త్రిపాఠి తెలిపారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ..‘నామినేటెడ్ కౌన్సిలర్లు మరియు మండల అధ్యక్షుల సన్మాన కార్యక్రమం సందర్భంగా, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక వివాదం తలెత్తింది. మాకు ముందే సమాచారం అంది ఉంటే, ఈ పరిస్థితిని నివారించే వాళ్లం. వీరిద్దరూ బీజేపీకి చెందినవారే. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించడానికి కృషి చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
‘నవ కేరళ సర్వే’ టార్గెట్.. బీజేపీ ప్లాన్ ఫలించిందా?
కేరళలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అయితే, ఎన్నికల వేళ కేరళలోని పినరయి విజయన్ సర్కార్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘నవ కేరళ సర్వే’ను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టులో సానుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.కేరళలో ఎల్డీఎఫ్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను సేకరించి “నవ కేరళ సర్వే” అనే అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో కేరళలో దాదాపు 95 లక్షల ఇళ్లలో ప్రజల అభిప్రాయాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, సర్వేలో భాగంగా కేవలం 49.42 లక్షలు మాత్రమే సేకరించినట్టు సమాచారం. కాగా, సర్వేల సందర్బంగా ప్రభుత్వ పెద్దల ఆడియో లీక్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. సర్వే అసలు ఉద్దేశ్యం ఎల్డీఎఫ్ను తిరిగి అధికారంలోకి తేవడమే అని బయటపడింది. దీంతో, కేరళ బీజేపీ నేతలు రంగంలోకి దిగి తీవ్ర ఆరోపణలు చేశారు.రాజకీయ ఉద్దేశంతోనే నవ కేరళ సర్వేను చేపట్టినట్టు ఆరోపించారు. అనంతరం, కాషాయ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. బీజేపీ నేతల పిటిషన్లపై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులను వాడటం అన్యాయమని పేర్కొంటూ సర్వేను రద్దు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ సర్వేను చేపట్టినట్టు తెలిపింది. అనంతరం, హైకోర్టు తీర్పుపై కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది పబ్లిక్ అవుట్‌రీచ్ & డెవలప్మెంట్ ఫీడ్‌బ్యాక్ ఇనిషియేటివ్ మాత్రమే, ఎన్నికల ప్రచారం కాదని తెలిపింది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. సర్వే కొనసాగించడానికి అనుమతించింది. ఇదే సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా? అని తెలుసుకోవడంలో తప్పు లేదంటూ వ్యాఖ్యలు చేసింది.అయితే, ఈ సర్వేలో ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్న నెంబర్ కంటే తక్కువ సంఖ్యలో సర్వే జరగడం, పలు చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకంగా కనిపించడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే, సర్వేలో తక్కువ సంఖ్యలో పాల్గొనడం వల్ల సర్వే విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి.సర్వే ముఖ్యాంశాలుసర్వే లక్ష్యం: 95 లక్షల ఇళ్లలో ప్రజల అభిప్రాయాలు సేకరించడం.నిజంగా చేరుకున్న ఇళ్లు: 49.42 లక్షలు.సేకరించిన అభిప్రాయాలు: కేవలం 4.5 లక్షలు.ఫోకస్ గ్రూప్ చర్చలు: కుడుంబశ్రీ వంటి సంఘాల ద్వారా 46,000 అభిప్రాయాలు మాత్రమే సేకరించబడ్డాయి.వాలంటీర్లు: 96,200 మంది నమోదు చేసుకున్నా, శిక్షణకు హాజరైన వారు చాలా తక్కువ.ఆర్థిక వ్యయాలుస్టేషనరీ, బ్రోచర్లు, పుస్తకాలు: సర్వే కోసం రూ.8 కోట్లు ఖర్చు చేశారు.85,000 బుక్లెట్లు ముద్రించబడ్డాయి.ఫారమ్‌లు, ఫీడ్‌బ్యాక్ ప్యాడ్లు, నోటు బుక్స్ కోసం భారీగా ఖర్చు జరిగింది.ఇక, నవ కేరళ సర్వేలో ప్రజలు ప్రధానంగా ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలపై సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాలు, గ్రామీణ ఆరోగ్య సదుపాయాలు, పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్, రహదారులు–నీటి సరఫరా, మహిళా సాధికారత, రైతు సహాయం వంటి అంశాలు ఎక్కువగా ప్రస్తావించబడ్డాయి.ప్రజలు ఇచ్చిన ప్రత్యేక సూచనలు1. ఉద్యోగాలు & ఉపాధికొత్త పరిశ్రమలు, ఐటీ పార్కులు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు.యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు పెంచాలని సూచించారు.ప్రభుత్వ రంగంలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని అభిప్రాయపడ్డారు.2. ఆరోగ్యంగ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది కొరతను తీర్చాలని కోరారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు, ఔషధాలు, అత్యవసర సేవలు పెంచాలని సూచించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు.3. విద్యపాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు పెంచాలని కోరారు.స్కాలర్షిప్లు మరియు ఆర్థిక సహాయం విస్తరించాలని సూచించారు.గ్రామీణ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని అభిప్రాయపడ్డారు.4. మౌలిక సదుపాయాలురహదారులు, నీటి సరఫరా, గృహ నిర్మాణం, శుద్ధి వ్యవస్థలు మెరుగుపరచాలని సూచించారు.పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు పెంచాలని కోరారు.5. సంక్షేమ పథకాలుకుడుంబశ్రీ వంటి మహిళా సాధికారత కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు.పింఛన్లు, రైతు సహాయం, గృహ పథకాలు మరింత పారదర్శకంగా అమలు చేయాలని కోరారు.సామాజిక భద్రతా పథకాలు విస్తరించాలని అభిప్రాయపడ్డారు. -
పొత్తుల కుమ్ములాట.. అభ్యర్థుల వేట!
బంగాళాఖాతం తీరంలో ఉన్న పుదుచ్చేరిలో రాజకీయ వేడి పారాకాష్టకు చేరింది. ఏప్రిల్ 9న జరగనున్న పోలింగ్‌కు గడువు సమీపిస్తున్నా ఇక్కడ ప్రధాన కూటముల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడం గమనార్హం. ఒకవైపు ఎన్డీఏ, మరోవైపు ఇండియా కూటమిలో మిత్ర భేదాలు రచ్చకెక్కుతున్నాయి. నామినేషన్ల పర్వం మొదలైనా అభ్యర్థులెవరో తేల్చుకోలేని అయోమయంలో పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి.ఇండియా కూటమిలో ఇలా..డీఎంకే, కాంగ్రెస్ మధ్య సాగుతున్న అంతర్గత చర్చలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. స్థానిక అభ్యర్థులను పొత్తు విషయం అడిగితే ‘అధిష్టానంతో మాట్లాడి చెబుతాం’ అనే సమాధానాలతోనే ముగిస్తున్నారు. 2021 ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నామని, ఈసారి 18 నుంచి 20 సీట్లలో తామే పోటీ చేస్తామని డీఎంకే పట్టుబడుతోంది. సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి మిత్రపక్షాలకు 4 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.కాంగ్రెస్ వాదనతమిళనాడులో డీఎంకే పెద్దన్న పాత్ర పోషించినట్లే పుదుచ్చేరిలో తమకే అగ్రతాంబూలం దక్కాలని కాంగ్రెస్ వాదిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ తన పట్టును వదులుకోవడానికి సిద్ధంగా లేదు. డీఎంకే దారికి రాకపోతే నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్టి కజగం (టీవీకే) వంటి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తామనే సంకేతాలను పంపడం గమనార్హం.ఎన్డీఏలో స్థానాల కోసం ఘర్షణఅధికార ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకం (బీజేపీకి 14, ఏఐఎన్ఆర్సీకి 16) పూర్తయినట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో అసలు చిక్కులు మొదలయ్యాయి. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ ఆధీనంలో ఉన్న స్థానాలను బీజేపీ కోరుతుండటంతో పేచీ మొదలైంది. కొన్నిచోట్ల పొత్తు తేలకముందే ఆశావహులు తమకు కేటాయించని స్థానాల్లో కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇది కూటమిలో అంతర్గత గందరగోళానికి దారితీస్తోంది. రంగస్వామికి ఉన్న పీపుల్స్ సీఎం ఇమేజ్‌తో పాటు కేంద్రంలోని బీజేపీ బలాన్ని వాడుకుని మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని ఎన్డీఏ భావిస్తోంది.గెలుపు గుర్రాలను మార్చే మార్చే ఇతర శక్తులుపుదుచ్చేరి రాజకీయాల్లో ఈసారి మూడో పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళగ వెట్టి కజగం(టీవీకే) అధినేత, నటుడు విజయ్ పార్టీ బహిరంగ సభలకు యువత భారీగా తరలివస్తుండటం ప్రధాన పార్టీల్లో వణుకు పుట్టిస్తోంది. సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే) ఇప్పటికే 28 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి దూసుకుపోతోంది.సంక్షిప్త విశ్లేషణ.. 2021 ఫలితాలు (మొత్తం 30 సీట్లు)కూటమి/పార్టీ గెలిచిన స్థానాలుఏఐఎన్ఆర్సీ 10బీజేపీ 06 డీఎంకే 06కాంగ్రెస్ 02ఇతరులు/స్వతంత్రులు 06నామినేషన్ల గడువు దగ్గరపడుతున్న తరుణంలో ఈ రాజకీయ చదరంగంలో ఎవరు ఎవరికి చెక్ పెడతారో చూడాలి.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
డ్రగ్స్ కేసు.. సిట్ అంటేనే కూర్చోవడం: బీజేపీ సెటైర్లు
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. సిట్ అంటేనే కూర్చోవడం అంటూ ఎద్దేవా చేశారు. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం అని వ్యాఖ్యానించారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలిస్తామని రేవంత్ చెప్పినవన్నీ ఉత్త మాటలే అలా జరిగితే.. ఫాంహౌస్‌కు డ్రగ్స్ ఎలా వచ్చాయి. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం. స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతోంది. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది. సిట్‌తో జరిగేదేమీ ఉండదు. డ్రగ్స్, ల్యాండ్, లిక్కర్ దందాలన్నీ కాంగ్రెస్ కనుసన్నల్లో సాగుతోందిఆర్ఎస్ఎస్ ని నిషేధించాలని కాంగ్రెస్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. భారత నిఘా విభాగం ‘రా’ను కూడా నిషేధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చండూరులో కాంగ్రెస్ దుండగులు బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశారు. ఆస్పత్రిలో చికిత్స అందించకుండా కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. తెలంగాణలో దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నల్లగొండలో ప్రజాస్వామ్యం లేదు. రాచరిక పాలన కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిపై పోలీసులు చేయి చేసుకున్నారు.పెద్దపల్లి, మంచిర్యాలలో పోలీసుల బలంతో బీజేపీని అణిచివేసే ప్రయత్నం జరుగుతోంది. బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేస్తే ఓ చిన్న కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకులు స్వార్థం కోసమే పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారు. తెలంగాణలో గూండా రాజ్యం నడుస్తోంది. బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తే తిరగబడతాం అని హెచ్చరించారు. అలాగే, తెలంగాణలో కరెంట్ కోతలు విపరీతంగా ఉన్నాయి. కరెంట్ సరఫరా పూర్తి స్థాయిలో కొనసాగించాలి. పంటలు కూడా ఎండిపోతున్నాయి అని వ్యాఖ్యలు చేశారు. -
‘మలయాళ’ రాజకీయం మారుతోందా?
కేరళలో పొలిటికల్ హీట్ పెరిగింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష కూటమి పక్కా ప్లాన్‌తో ఉండగా.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు హస్తం పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇక, తొలిసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాషాయ పార్టీ బీజేపీ.. ఉవ్విళ్లూరుతోంది. దీంతో,‘గాడ్స్ ఓన్ కంట్రీ’ కేరళలో ముక్కోణపు పోటీ నెలకొంది. ఎన్నికల వేళ పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? కేరళ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉందంటే..విజయన్ 3.0 సాధ్యమేనా?ప్రస్తుతం కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. గత రెండు ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి భారీ విజయాలను దక్కించుకుంది. దీంతో 'విజయన్ '3.0' కోసం వామపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. అభివృద్ధి మార్కు పాలనతో హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టించాలని సీపీఎం నాయకత్వంలోని కూటమి ఆశపడుతోంది. అయితే, విజయ్ పేరు, ఆయన నాయకత్వమే కూటమి పెద్ద సానుకూలత. ఆయన నాయకత్వంలో ఎన్నికలకు పోవడం కూటమికి కలిసొచ్చే అంశం. రాష్ట్రంలో ఏ కూటమికి, పార్టీకి కానీ ఇంత స్థాయి ఉన్న లీడర్ లేకపోవడం వామపక్షాలకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఇదే సమయంలో సీనియర్ లీడర్‌గా, సీఎంగా విజయన్‌కు అనుభవం కూడా ఉంది. అలాగే, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఎల్డీఎఫ్ భావిస్తోంది.మరోవైపు.. ఇటీవలి కాలంలో శబరిమల బంగారు ఆభరణాల మాయం వంటి అంశాలు విజయన్ ప్రభుత్వం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ఈ పరిణామం హిందూ ఓటర్లను ప్రభావితం చేయవచ్చు. అలాగే, శబరిమల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని పలువురు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కేరళకు రావాల్సిన నిధులను కేంద్రం ఆపేస్తోందని, అప్పుల పరిమితిని తగ్గించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోందని ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిలిస్తోంది. ఇక, వయనాడ్ భూకంప బాధితులకు కేంద్రం నుంచి ఆశించిన సాయం అందలేదని ప్రభుత్వం ఆరోపిస్తున్నప్పటికీ, రాష్ట్ర యంత్రాంగం వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి.హస్త‘గతం’ అవుతుందా?కేరళలో పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్‌కు ఈ ఎన్నికలు ఎంతో కీలకం కానున్నాయి. విజయన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని యూడీఎఫ్ భావిస్తోంది. రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ముస్లిం, క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడంలో యూడీఎఫ్ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా జేడీఎస్ వంటి పార్టీలు ఎన్డీఏ వైపు వెళ్లడం, విజయన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మైనారిటీలు యూడీఎఫ్‌కు దగ్గర అయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి సీట్ల సర్దుబాటు విషయంలో మిత్రపక్షాల మధ్య పెద్దగా వివాదాలు తలెత్తకపోవడం యూడీఎఫ్ కలిసొచ్చే అంశం.అలాగే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని 20 స్థానాలకు గానూ 18 స్థానాలను యూడీఎఫ్ గెల్చుకుంది. ఈ విజయం యూడీఎఫ్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అయితే, కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు యూడీఎఫ్‌కు ప్రతికూలంగా మారాయి. అలాగే, యూడీఎఫ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత లేదు. అన్నింటికి మించి పాలక్కాడ్ మాజీ ఎమ్మెల్యే రాహుల్ మామ్కూటత్తిల్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఈ వ్యవహారం కేరళలో తీవ్ర చర్చకు దారి తీసింది.కాషాయ జెండా ఎగిరేనా?కేరళ రాజకీయ చరిత్రలో బీజేపీ ఏనాడూ పెద్దగా విజయాలు సాధించిన దాఖలాలు లేవు. కేరళలో గతంలో ఒక్క సీటు కోసం పోరాడిన బీజేపీ ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా విజయాలను అందుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ గెలిచిన తర్వాత బీజేపీ కేడర్‌లో ఫుల్ జోష్ వచ్చింది. మరోవైపు.. కేంద్రంలోని పెద్దలు ప్రధాని మోదీ సహా పలువురు కేరళకు వెళ్లడం ప్రచారంలో పాల్గొనడం కాషాయదళానికి ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో కేరళంలో బలమైన ముద్ర వేయాలని బీజేపీ భావిస్తోంది. అలాగే, ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. దీంతో, హిందువుల ఓట్లపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.త్రిముఖ పోరు.. కేరళ రాజకీయాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుందనే ఆనవాయితీ గతంలో ఉండేది. కానీ, 2021లో ఎన్నికల్లో ఆ ఆనవాయితీని సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ బద్దలు కొట్టింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనే ఆసక్తి నెలకొంది. ఇక, 2021 ఎన్నికల్లో ఫలితాలు ఇలా ఉన్నాయి. ఎల్డీఎఫ్ మొత్తం 99 స్థానాలను గెల్చుకోగా.. అందులో సీపీఎం 62, సీపీఐ 17, కేరళ కాంగ్రెస్ (ఎం) 5, జేడీఎస్ 2, ఎన్సీపీ 2, ఇతరులు 11 సీట్లను సాధించాయి. ఇక యూడీఎఫ్ విషయానికి వస్తే, కాంగ్రెస్ 21 సీట్లు, ముస్లిం లీగ్ 15, కేరళ కాంగ్రెస్ 2, ఇతర మిత్రపక్షాలు 3 సీట్లను గెల్చుకున్నాయి. 2016 ఎన్నికల్లో గెలిచిన ఏకైక స్థానాన్ని (నెమమ్) కూడా బీజేపీ ఈ ఎన్నికల్లో కోల్పోయింది.మ్యాజిక్ ఫిగర్.. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 71 స్థానాల్లో విజయం సాధించాలి. -
తెలంగాణ అసెంబ్లీ.. కేటీఆర్ Vs కాంగ్రెస్..
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అప్డేట్స్..కేటీఆర్ కామెంట్స్..మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దు.మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు.రూ.16వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేయవచ్చు.ఎరువులు అడిగితే రైతులపై దాడులు చేస్తున్నారు.షాపులో ఇవ్వాల్సిన యూరియా యాప్‌లో ఇస్తామంటున్నారు.బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.ఈసారైనా బడ్జెట్లో బీసీలకు కేటాయింపులు చేయాలి.దళిత బంధును బొందపెట్టారు.. ఇప్పటికైనా ఇవ్వాలి.హిల్ట్ పాలసీలో పెద్దపెద్ద కుంభకోణాలు జరగబోతున్నాయి.20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కడతామన్నారు? ఏమైంది?.రాజకీయం, అధికారం శాశ్వతం కాదు.. కానీ, తెలంగాణ శాశ్వతం.తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం.ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణకు విఘాతం కలిగించేలా ఉన్నాయి.ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.వ్యవసాయాన్ని బాగు చేసింది కాళేశ్వరమే.మా మీద కోసం రైతుల మీద చూపెట్టకండి.మేము ఏ ప్రాజెక్ట్ కట్టినా దేవుళ్ల పేర్లు పెట్టాం.మీలా పార్టీ నాయకుల పేర్లు పెట్టలేదు.సింగరేణిలో పెద్దపెద్ద కుంభకోణాలు బయటపడుతున్నాయి.నైనీ టెండర్ రద్దు చేశారు. మిగతా టెండర్లు కూడా రద్దు చేయాలి.మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకిద్దాం.బస్తీ దవాఖానాలు మూతపడుతున్నాయి.బస్తీ దవాఖానాల్లో మందులు లేవు.మా ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నారు. కేటీఆర్ కామెంట్స్..మహిళలకు న్యాయం చేస్తున్నాం అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ ఇంగ్లాండ్ ఇండియా వదిలి వెళ్లారు.మిస్ ఇంగ్లాండ్ పట్ల అసభ్య ప్రవర్తన చేసి తెలంగాణ పరువు అంతర్జాతీయంగా చేశారు.మిస్ ఇంగ్లాండ్ ఘటనపై సిట్ వేయాలి. మంత్రి సీతక్క కామెంట్స్..కేటీఆర్‌కు మహిళలు అంటే అంత కోపం ఎందుకు?ఉచిత బస్సు ఇచ్చినా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేశారు.మేడారంలో మహిళలు 9 కోట్లు సంపాదించారు.పదేళ్లు మహిళలకు ఎందుకు న్యాయం చేయలేదు.పథకాలు ఎందుకు ఇవ్వలేదు.మహిళల అభయహస్తం నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుంది.మహిళలను ఎదుగనివ్వండి.మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..మాది జాతీయ పార్టీ.పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఢిల్లీకి ఎన్ని సార్లు వెళ్లింది.రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము ఢిల్లీకి వెళ్తాం.సోనియా గాంధీ నిర్ణయం మేరకే తెలంగాణ ఏర్పాటు జరిగింది.తెలంగాణ ఏర్పాటులో అందరిని ప్రభుత్వం గుర్తు పెట్టుకుంటుంది.సోనియా గాంధీ నిర్ణయం తీసుకోకపోతే బీఆర్ఎస్ ఎక్కడ ఉండేది.ఒక లక్ష్యంతో తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నాం.5లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి.బీఆర్ఎస్ పాలనను ముందుకు తీసుకెళ్లడం తప్పా?మహిళలు కోటీశ్వరులు కావడం తప్పా?తెలంగాణ ప్రజల విశ్వాసాలపై వ్యంగ్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. కేటీఆర్ విమర్శలు..గవర్నర్ ప్రసంగంలో గ్యారంటీ, డిక్లరేషన్ పదం రాకుండా చూసుకున్నారురెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో డైవర్షన్లు, కమీషన్లు మాత్రమే ఉన్నాయి.మొన్న ఇండియా టీ-20 గెలిచింది కానీ కాంగ్రెస్ పోటీలో ఉంటే 420 గెలుస్తారు.కాంగ్రెస్ పాలన అంటే పని చారానా.. ప్రచారం బారానా..గ్రాఫిక్స్ మాయాజాలంలో కాంగ్రెస్ కనికట్టు చేస్తోంది.కాంగ్రెస్ సినిమా బయట అభయహస్తం.. లోపల చూస్తే భస్మాసుర హస్తం!మీరు ఢిల్లీకి వెళ్తే మాకేం అభ్యంతరం లేదు.ఢిల్లీ నుంచి నిధులు తెస్తారనుకున్నాం.కానీ, నిధులు ఇచ్చి వస్తున్నారు.మొన్న రూ. వెయ్యి కోట్లు ఇస్తాం అన్నారు.కేబినెట్ ఆమోదించిన గవర్నర్ ప్రసంగంలోనూ విశ్వసనీయత లేదు. డిప్యూటీ సీఎం భట్టి కామెంట్స్..బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంత మందికి వచ్చాయి??మేము 4.5లక్షల ఇందిరమ్మ ఇండ్లను పేదలకు కట్టిస్తున్నాం.వీటి కోసం రూ.22500 కోట్లు ఖర్చు చేశాం. హామీల అమలుపై కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ కాదు.కోటీ ఆరు లక్షల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నాం.రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. తెలంగాణ శాసన సభలో గందరగోళంకేటీఆర్ కామెంట్స్..అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు.వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు కానందుకు ధన్యవాదాలు చెప్పాలా?గ్యారెంటీ కార్డు పేరుతో మోసం చేస్తే ధన్యవాదాలు చెప్పాలా?ఆరు గ్యారెంటీలపై మాట్లాడుతున్న కేటీఆర్ స్పీచ్‌ను అడ్డుకున్న మంత్రి కోమటిరెడ్డికోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్కేటీఆర్ మా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి.రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రుణమాఫీ చేసినందుకు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పాలి.మీలాగా దళిత ముఖ్యమంత్రి అని మాట తప్పలేదు.కేటీఆర్ ఓపికతో వినాలి.బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నం చేస్తున్నాంఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాలి.కేసీఆర్ చేసిన అప్పులు తీర్చుతున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి.తలసాని కామెంట్స్..సభలో సభ్యుల హక్కులను కాపాడాల్సింది స్పీకర్ప్రతీసారి ప్రసంగానికి అడ్డుతగలడం సరికాదు. రైతుల వినతిపత్రాలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలురైతుల వినతిపత్రాలతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలువినతిపత్రాలు లోపలికి తీసుకెళ్లకుండా అడ్డుకున్న పోలీసులుఅసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యేల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకున్న పోలీసులుతామే అసెంబ్లీలోనికి దరఖాస్తులు పంపిస్తామని తెలిపిన పోలీసులుపోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం 20న అసెంబ్లీలో బడ్జెట్..గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చఇవాళ, రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చబీఆర్ఎస్ తరపున శాసనసభలో మాట్లాడనున్న కేటీఆర్, పల్లా రాజేశ్వర్రెడ్డిబీఆర్ఎస్ తరపున మండలిలో మాట్లాడనున్న మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్ఈనెల 20న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వంరెండో రోజు ప్రశ్నోత్తరాలు రద్దుఅసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు ప్రశ్నోత్తరాలు రద్దుగవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నేడు అసెంబ్లీలో చర్చతీర్మానాన్ని ప్రతిపాదించనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్తీర్మానాన్ని బలపరచనున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్సభ ముందుకు ఇన్ఫర్మేషన్ కమిషన్ పెండింగ్ నివేదికలుబీఏసీ నిర్ణయాలను సభ ముందు ఉంచనున్న సీఎం రేవంత్రెడ్డిసభ టేబుల్‌పై తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ వార్షిక నివేదికలుబీజేపీ వాయిదా తీర్మానంశాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానంఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేయాలని వాయిదా తీర్మానంబీఆర్ఎస్, సీపీఐ వాయిదా తీర్మానంఉభయసభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానంరిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లింపు జాప్యంపై వాయిదా తీర్మానంరిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానంరిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్‌పై అసెంబ్లీలో చర్చించాలని సీపీఐ వాయిదా తీర్మానం -
లోక్ సభ రేపటికి వాయిదా
లోక్ సభ రేపటికి వాయిదా పశ్చిమాసియా యుద్ధం పై చర్చించాలని విపక్షాల పట్టుఅధికారపక్షం అంగీకరించకపోవడంతో సభా కార్యక్రమాలను అడ్డుకున్న విపక్షాలులోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముందుకు రావాలని కోరిన ప్యానెల్ స్పీకర్స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇరాన్ యుద్ధం పై చర్చించాలనడం ఏమిటని ప్రశ్నిస్తున్న అధికారపక్షంవిపక్ష పార్టీలు అయోమయంలో ఉన్నాయన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజులోక్సభ మరోసారి వాయిదా..మధ్యాహ్నం మూడు గంటల వరకు లోక్‌సభ వాయిదా.స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి విపక్ష ఎంపీల ఆందోళన.గల్ఫ్ యుద్ధంపై చర్చించాలని విపక్షాల పట్టు.విపక్షాల ఆందోళన మధ్య లోక్‌సభ వాయిదా. పెట్రోల్, గ్యాస్ ధరలపై జైశంకర్ ప్రకటనపశ్చిమాసియాలో యుద్ధంపై రాజ్యసభలో కేంద్రం ప్రకటన.రాజ్యసభలో ప్రకటన చేస్తున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.రాజ్యసభలో జైశంకర్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు.ముందుగా విపక్షాలకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేతల డిమాండ్. విపక్షాల ఆందోళనల మధ్యే ప్రకటన చేస్తున్నా మంత్రి జైశంకర్.మంత్రి జైశంకర్ కామెంట్స్..మార్చి ఒకటో తేదీ సీసీఎస్ సమావేశం నిర్వహించాం.ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నాం.యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం.సంబంధిత శాఖలన్నింటికీ తగిన చర్యలు తీసుకోవాలని సూచించాం.కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు.పెట్రోల్, గ్యాస్ ధరలపై దృష్టి సారించాం.ఇరాన్‌కు వెళ్లవద్దని జనవరిలోనే భారతీయులకు సూచించాం.ఇరాన్‌లోని భారతీయుల భద్రతకు ఎంబసీ అన్ని చర్యలు తీసుకుంటోంది.పరిస్థితులు చక్కబడగానే టెహ్రాన్‌లోని భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం. గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని భారత్ రప్పించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నాం.ఈరోజు 50 విమానాలు నడుస్తున్నాయి.పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధంపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది.ఫిబ్రవరి 28 నాటి పరిణామాల తర్వాత యుద్ధం తీవ్రరూపం దాల్చింది.యుద్ధ ప్రాంతాల నుంచి 67వేల మందిని సురక్షితంగా తరలించాం.ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు ఆమోదయోగ్యం కాదు.యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం ఉంది.హింస దేనికీ పరిష్కారం కాదు.తక్షణమే చర్యల బాట పట్టాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చాం.శాంతి స్థాపన కోసం భారత్ తన వంతు దౌత్య ప్రయత్నాలు చేస్తోంది.అంతర్జాతీయ మానవతా చట్టాలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలి. శాంతిని నెలకొల్పేందుకు అన్ని ప్రయత్నాలు జరగాలిఇంధన భద్రతకు, కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నాంఇరాన్ నౌకను డాకింగ్ చేసేందుకు సహకరించాంEAM Dr S Jaishankar makes a statement in the Rajya Sabha on the situation in West Asia, amid sloganeering by Opposition MPsEAM says," Our government had issued a statement on 20th February expressing deep concerns and urging all sides to exercise restraint. We continue to… pic.twitter.com/whk4pOE259— ANI (@ANI) March 9, 2026లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా.కాసేపట్లో పశ్చిమాసియా యుద్ధంపై విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన.పార్లమెంట్ ఆవరణలో సస్పెండ అయిన ఎంపీల ఆందోళనలు.పార్లమెంట్లో ఇండియా బ్లాక్ ఎంపీల సమావేశం. After making obituary references, the Lok Sabha adjourned to meet again at 12 Noon today. pic.twitter.com/7Twxxz1HUP— ANI (@ANI) March 9, 2026 👉పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంఅందుకే స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టాం: చామల కిరణ్కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కామెంట్స్..ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారుబీజేపీ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ప్రాధాన్యత ఇస్తున్నారుస్పీకర్ అనే వ్యక్తి లోక్‌సభలో ఉన్న అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి18వ లోక్ సభలో ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదురాహుల్ గాంధీ మాట్లాడే ప్రతీసారి అసౌకర్యం కల్పిస్తున్నారు.నిషికాంత్ దూబే, అనురాగ్ ఠాకూర్ లాంటి వాళ్లకు అవసరం లేకపోయినా మైక్ ఇస్తున్నారుదేశంలో ఉన్న ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా లోక్ సభను నడుపుతున్నారుమహిళా ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడి చేయాలని చూశారని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారుఅందుకే లోక్‌సభ స్పీకర్ పై అవిశ్వాసం పెట్టాముఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై లోక్ సభలో చర్చ చేయాలినరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కాకుండా ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నారుఅమెరికా నుంచి దిగుమతులపై సుంకాలను వైట్ హౌస్ నుంచి ట్రంప్ డిసైడ్ చేశారుపార్లమెంట్ లో చర్చ జరగాల్సిన అంశాలను ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తారుమోదీ ఎందుకు ట్రంప్‌తో కాంప్రమైజ్ అయ్యారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలిలోక్ సభలో ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేసిన అంశంపై చర్చ జరగాలిలోక్సభ స్పీకర్‌పై అవిశ్వాసం సందర్భంగా ఎనిమిది మంది ఎంపీలకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలిప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము ధర్నా చేస్తాముప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలిలోక్ సభలో ఉన్న 543 మంది ఎంపీలకు అవిశ్వాసంపై ఓటు వేసే అవకాశం ఉంటుందిగ్యాస్, క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెంచారు.దీనిపై లోక్‌సభలో చర్చ చేపట్టాలి. పార్లమెంట్‌కు చేరుకున్న ప్రియాంక, రాహుల్పశ్చిమ ఆసియాలో పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు.విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఏం చేబుతారో వినాలని ఉందన్న ప్రియాంక. #WATCH | Delhi: On EAM Dr S Jaishankar to make a statement in Parliament today on the situation in West Asia, Congress MP Priyanka Gandhi Vadra says, "I am keen to hear what he will say." pic.twitter.com/gc26kjlKuJ— ANI (@ANI) March 9, 2026బడ్జెట్ సమావేశాలు.. స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చనేటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలుఏప్రిల్ 2 వరకు కొనసాగనున్న సమావేశాలునేడు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చించనున్న లోక్సభతీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ఎంపీలు మహమ్మద్ జావేద్, కే సురేష్, మల్లు రవిఅవిశ్వాసం తీర్మానంపై చర్చలో స్పీకర్ స్థానంలో కాకుండా సభ్యుల మధ్యలో కూర్చొనున్న ఓం బిర్లా తొలి విడత సమావేశాల్లో లోక్‌సభ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ సహా విపక్షాలుస్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నోటీసుపై సంతకం పెట్టిన కాంగ్రెస్, సమాజ్‌వాద్ పార్టీ, డీఎంకే, లెఫ్ట్ పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలుతమ ఎంపీలకు విప్ జారీచేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలుతప్పనిసరిగా లోక్‌సభకు హాజరుకావాలని ఆదేశం#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi, Congress President Mallikarjun Kharge, arrive at the ParliamentThe second phase of the budget session of Parliament will commence today and will continue till the 2nd of April pic.twitter.com/GFIWWyVSMG— ANI (@ANI) March 9, 2026 -
కాంగ్రెస్ అంటేనే కూల్చివేతలు.. బీజేపీ ఉద్యమమే: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ నేతలకు రైతుభరోసా గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతలు అంటూ హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే... ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.కరీంనగర్లో కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..‘రైతులకు రైతు భరోసా ఇస్తానన్న మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోయారు. ముఖ్యమంత్రి నోటి నుండి వచ్చే మాటలు శాసనంలా ఉండాలి. బీఆర్ఎస్ ఏ విధంగా విమర్శలు, గూడు పుటానీలు చేసారో.. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అదే చేస్తున్నారు. రైతు భరోసా మొదటి విడత డబ్బులు ఎగ్గొట్టారు. ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా గుర్తుకు వస్తుందా?. రైతు భరోసా ఇవ్వకపోతే రైతులే వాతలు పెడుతారు. కేబినెట్ మీటింగ్‌లో రైతు భరోసా గురించి ఎందుకు చర్చించలేదు. మూడు విడతలు కలిపి 27000 కోట్లు ఇవ్వాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా రైతు భరోసా ఇవ్వాలని ఉత్తరం రాశాను. రైతు భరోసా ఇవ్వకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదు’ అని హెచ్చరించారు.అలాగే, ఖమ్మంలో కూల్చివేతల ఘటనపై స్పందిస్తూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతలు. కూల్చడానికి గల కారణాలు ఏంటి?. మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కలిసి అ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చుస్తున్నారు. హైడ్రా.. కూల్చివేతలతో ఆగమాగం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఇండ్లు కట్టడానికి పోటీ పడుతుంటే.. ఈ ప్రభుత్వం కూల్చివేయడానికి పోటీ పడుతుంది. ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరు అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటే.. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈరోజు 80% ముస్లిం మహిళలు బీజేపీకి ఓటేసే పరిస్థితి వచ్చింది. నిన్నటి దాక దోస్తీగా ఉన్నా కాంగ్రెస్, ఎంఐఎంలకు ఎక్కడ చెడిందో తెలియదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కవిత వ్యవహారంపై ప్రశ్నించగా.. తెలుసుకుని మాట్లాడతాను అని వ్యాఖ్యలు చేశారు. -
కూటమి సర్కార్‌కు షాకిచ్చిన సోము వీర్రాజు
సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు బిగ్ షాకిచ్చారు. లంక గ్రామాల్లో కూటమి అక్రమ మట్టి తవ్వకాల భాగోతాన్ని శాసన మండలి వేదికగా.. సోము వీర్రాజు బయటపెట్టారు. దీంతో, కూటమి సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది.ఏపీ శాసన మండలిలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ..‘లంక పరీవాహక ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వేస్తున్నారు. చొప్పెళ్ల, జొన్నాడ, మూలస్థానం ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ అక్రమంగా మట్టి తవ్వేస్తున్నారు. ట్రాక్టర్లు, జేసీబీలు పెట్టి 35 అడుగుల లోతు తవ్వేస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాల వల్ల రైతుల జీవనాధారం, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. తక్షణమే మట్టి తవ్వకాలను అరికట్టాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. దీంతో, కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. -
రాజ్యసభ సీట్లపై బీజేపీ వ్యూహాం.. 21 టార్గెట్!
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుచుకునేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 37 స్థానాల్లో కనీసంగా 21 స్థానాలను తన ఖాతాలో వేసుకునే దిశగా కసరత్తులు మొదలుపెట్టింది. మొత్తం సీట్లలో 19 స్థానాలు కచ్చితంగా ఎన్డీఏ పక్షాలకు దక్కుతాయని రాజకీయ పక్షాలు అంచనా వేస్తున్నాయి. మరో రెండు సీట్లను కొద్దిపాటి సర్దుబాట్లతో దక్కించుకోవచ్చన్న అంచనాతో ఆ దిశగా రాష్ట్రాల నేతలతో బీజేపీ అగ్రనాయకత్వం చర్చలు మొదలుపెట్టింది. మెజార్టీ సీట్లే లక్ష్యంగా కసరత్తు..ప్రస్తుతం 245 సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీయేకు 133 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీకి సొంతంగా 103 సీట్లున్నాయి. మెజారిటీకి అవసరమైన 123 సీట్లకు ఇంకా కొంత దూరంలోనే ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అధికార బీజేపీకి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో 10 రాష్ట్రాల ముఖ్య నేతలతో ఇప్పటికే బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబిన్, అగ్ర నేతలు చర్చలు మొదలుపెట్టారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. 288 మంది ఎమ్మెల్యేలున్న మహారాష్ట్రలో ఎన్డీయేకు 235 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఖాళీ అయిన 7 స్థానాల్లో కనీసం 6 స్థానాలు ఎన్డీఏ గెలుచుకునే అవకాశం ఉంది.బీహార్‌లో ఎన్డీఏ పక్షాలకు ఉన్న బలం ఆధారంగా 5 స్థానాలకుగాను 4 స్థానాలు గెలుచుకోవడం ఖాయంగా కని్పస్తోంది. ఐదో స్థానంపై ఎన్డీఏ కూటమి ఆశలు పెట్టుకుంది. ఐదో స్థానం గెలిచేందుకు ప్రతిపక్ష శిబిరం నుంచి ముగ్గురు శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేల బలం ఎన్డీఏకు దొరకడం అంత కష్టమేమీ కాదనేది పార్టీ వర్గాల అంచనా. ఒడిశాలో 4 స్థానాలకు గానూ రెండింటిలో ఎన్డీఏ, మరొక సీటును ప్రతిపక్ష పార్టీలు గెలుచుకునే అవకాశం ఉంది. మరో సీటును ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే బీజేడీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలెట్టినట్లు సమాచారం.హరియాణాలో రెండు సీట్లకుగాను ఒక సీటు బీజేపీ ఖాతాలో పడగా మరో సీటుకు ఏ పారీ్టకి తగినంత బలం లేదు. దీంతో ఆ సీటుపైనా బీజేపీ కన్నేసింది. వరుసగా రెండు పర్యాయాలు పూర్తిచేసిన వారిని పక్కనపెట్టడం, పార్టీ జాతీయస్థాయి పదవుల్లో ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం, వయోపరిమితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ మార్చినెల తొలివారంలో అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ఆరంభించింది.బీహార్ నుంచి నితిన్ నబిన్.. ప్రస్తుతం బీజేపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు బిహార్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జేడీయూకి చెందిన కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్లకు తిరిగి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను బిహార్ రాష్ట్రం నుంచే రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరుగుతోంది. కొత్తగా పార్టీ తీర్థం పుచ్చుకున్న భోజ్‌పురి నటుడు పవన్ సింగ్‌కు ఇదే రాష్ట్రం నుంచి సభ్యత్వం దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్‌దాస్ అథావాలేకు తిరిగి రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయి. ఒడిశా లేదా హరియాణా రాష్ట్రం నుంచి మాజీ కేంద్ర మహిళా మంత్రి స్మృతీ ఇరానీని రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. -
కామారెడ్డిలో అలర్ట్.. నేడు కలెక్టర్ వద్దకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి పొలిటికల్ హైటెన్షన్ కొనసాగుతోంది. కామారెడ్డిలో బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి.. నేడు కలెక్టర్ వద్దకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా తాను చేసిన ఆరోపణలపై సాక్ష్యాలతో రావాలని కాంగ్రెస్ నేతలకు మరోసారి సవాల్ విసిరారు. ఆయన సవాల్‌ను కాంగ్రెస్ నేతలు స్వీకరించడంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది.బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి సవాల్ నేపథ్యంలో పక్కా సాక్ష్యాలతో కలెక్టర్ వద్దకు వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు సన్నద్ధమయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములపై స్పష్టత ఇవ్వాలని అధికారులను బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో భూముల విషయంలో అవినీతి చేసినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ప్రకటన చేశారు. అయితే, రాజీనామాకు సిద్ధం కావాలంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. నేతల సవాల్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇరు పార్టీల నేతలను కలెక్టర్ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకుంటారా? అనే ఉత్కంఠ నెలకొంది. -
భారతీయులపై శ్యామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు
వాషింగ్టన్: కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగ చీఫ్ శ్యామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. భారతీయులు కేవలం విదేశాలకు సేవ చేసే ముడి సరుకులుగా మారిపోయారని, స్వదేశం కోసం సొంత ఆపరేటింగ్ సిస్టమ్ కూడా తయారుచేయలేదని పిట్రోడా వ్యాఖ్యానించారు. ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిట్రోడా మాట్లాడారు.ఈ సందర్భంగా పిట్రోడా మాట్లాడుతూ.. ‘ఇతర దేశాలకు సేవ చేసేందుకే భారత్ యువతను ముడి సరకులుగా తయారుచేస్తోంది. దేశీయంగా నూతన ఆవిష్కరణల కోసం వాళ్లను భారత్ సద్వినియోగం చేసుకోవట్లేదు. మనం పెద్ద సంఖ్యలో యువ నైపుణ్యాన్ని వృద్ధి చేస్తున్నాం కానీ అదంతా ముడిపదార్థంగా ఉండిపోతోంది. ఇది అంతిమంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు ఉపయోగపడుతోంది. మన యువతను వాళ్లు కంప్యూటర్ ప్రోగ్రామింగ్, బ్యాంకింగ్, లీగల్ సర్వీసులు, పరిశ్రమలు, తయారీరంగాలు, రవాణా వ్యవస్థల్లో విరివిగా వాడుకుంటున్నారు. భారత్ దేశీయంగా ఉపయోగించుకునేందుకు వీలుగా అంతర్జాతీయ స్థాయి సాంకేతికతను ఒక్కదానిని కూడా అభివృద్ధి చేసుకోలేకపోయింది’’ అని అన్నారు.పిట్రోడా వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘లష్కరే తోయిబా మాదిరిగా ‘లష్కరే కాంగ్రెస్’కు పిట్రోడా ప్రధాన సలహాదారుగా తయారయ్యారు. మరోసారి భారత్‌కు అబద్ధాల బురద పూయాలని చూస్తున్నారు. మొబైళ్ల కోసం కనీసం ఆపరేటింగ్ సిస్టమ్(ఓస్)ను భారతీయులు సృష్టించలేదని ఆయన అంటున్నాడు. ఆయన కనీసం బాస్ లైనక్స్, మాయా ఓఎస్, ప్రైమ్ ఓఎస్, భార్ ఓఎస్, ఇండస్ ఓఎస్, ఎన్ఎక్స్టీ క్వాంటమ్ ఓఎస్ పేర్లు వినలేదేమో. ఇవన్నీ భారతీయులు తయారుచేసిన ఓఎస్లే’’ అని అన్నారు. -
ఐదు లక్షల లంచం.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్
హుబ్లీ: కర్ణాటకలో సంచలన ఘటన చోటుచేసుకుంది. అవినీతి, లంచం కేసుల్లో దాడులు నిర్వహించే లోకాయుక్తకు ప్రతిపక్ష బీజేపీ శాసనసభ్యుడు చిక్కారు. లంచం తీసుకుంటూ గదగ్ జిల్లా సిరహట్టి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లామాణి పట్టుబడ్డారు. శనివారం మధ్యాహ్నం గదగ్ జిల్లా లక్ష్మేశ్వర పట్టణంలోని ఎమ్మెల్యేకు చెందిన బాలాజీ ఆస్పత్రిపై లోకయుక్త అధికారులు దాడి చేశారు.ఈ సందర్భంగా కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షలు డబ్బులు తీసుకుంటున్న ఎమ్మెల్యే చంద్రుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన ఇద్దరు పీఏలు మంజునాథ వాల్మీకి, గురు నాయక్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. చిన్ననీటి పారుదల పనులకు సంబంధించి కాంట్రాక్టర్ విజయ్ పూజార్ని ఎమ్మెల్యే రూ.11 లక్షలు డిమాండ్ చేశారని, అందులో రూ.5 లక్షలు తీసుకుంటుండగా దాడి చేసినట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు. ఈ సమయంలో ఓ పీఏ రూ.50 వేల నగదున్న కవరును బయటకు విసిరేయగా దానిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా, ధార్వాడ లోకాయుక్త ఎస్పీ సిద్ధలింగప్ప నేతృత్వంలో అధికారులు, సిబ్బంది, దాడిలో పాల్గొన్నారు. నగదు డిమాండ్ చేస్తూ విజయ్‌కు చేసిన ఫోన్ కాల్ ఆడియో ఆధారంగా ఎమ్మెల్యేపై నిఘా ఉంచినట్లు సమాచారం. అరెస్టు గురించి విధానసభ స్పీకర్ యూటీ ఖాదర్‌కు సమాచారం అందించారు. ఈ విషయంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాగా, 2023లో కూడా మరో బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే. -
తార్నాకలో ఉద్రిక్తత.. బీజేపీ రామచందర్ రావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాం చందర్ రావు కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఆయనను అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో, తార్నాకలోని రాంచందర్ రావు నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీజేపీ చీఫ్ రాంచందర్ రావు నేడు కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయనతో పాటు బీజేపీ శ్రేణులు కామారెడ్డికి ప్రారంభమవుతున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో, పోలీసుల వాహనాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. -
కామారెడ్డిలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేత కారుపై దాడి
కామారెడ్డి అప్డేట్స్.. తప్పు చేసినట్లు రుజువు చేస్తే రాజీనామా చేస్తాకామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డినాణ్యత లేకుండా పనులు చేస్తుంటే అడ్డుకున్నానుమార్పు కోసం నా ప్రయత్నంప్రోటోకాల్ లేకపోయినా ఇంచార్జి మంత్రులతో కలిసి షబ్బీర్ అలీ రాజకీయం చేస్తున్నారుకాలేజి భూముల్లో 140 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయిభూములను ఎవరు అమ్మలేదు.. లీజ్ అగ్రిమెంట్ మాత్రమే ఉందిచంపేస్తామని నన్ను బెదిరిస్తున్నారురక్షణ ఇవ్వాలని ఎస్పీ కి ఫిర్యాదు చేశానుఅవినీతి అక్రమాలు అడ్డుకున్నందుకే తన పై కక్షగట్టారుభూముల విషయంలో సోమవారం కలెక్టర్‌ను కలుస్తానేను తప్పు చేసినట్లు రుజువు చేస్తే రాజీనామా చేస్తాఅక్కడి నుంచే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేక పంపిస్తాటీబీజేపీ చీఫ్ రాంచందర్ రావును అడ్డుకున్న పోలీసులుకామారెడ్డి వెళ్లకుండా బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావును అడ్డుకున్న పోలీసులుహైదరాబాద్లోని ఆయన నివాసంలో అడ్డుకున్న పోలీసులుఎమ్మెల్సీ అంజిరెడ్డిని మేడ్చల్ వద్ద అడ్డుకున్న పోలీసులుబీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇద్దరి నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కామారెడ్డి వెళ్ళకుండా బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులుకామారెడ్డి వెళ్ళేందుకు ప్రయత్నించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కామారెడ్డిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులుకామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అరెస్ట్అనుచరులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులుకామారెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరికాసేపట్లో కామారెడ్డికి చేరుకోనున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు కామారెడ్డి ఘటనపై మీడియాతో మాట్లాడనున్న రాంచందర్ రావుకామారెడ్డిలో హైటెన్షన్..కాంగ్రెస్ నేత కారుపై బీజేపీ కార్యకర్తల దాడి.కారుకు నిప్పు పెట్టిన బీజేపీ కార్యకర్తలు.కారు నుంచి మంటలు.తోపులాటలో పోలీసులకు గాయాలు.కామారెడ్డిలో టెన్షన్..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..ఆరోరా భూములపై చర్చకు రావాలన్న బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి.ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు వచ్చిన కాంగ్రెస్ నేతలు.కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు.కాంగ్రెస్ నేత కారు ధ్వంసం.ఇరు వర్గాలను అడ్డుకున్న పోలీసులు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకున్న మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డిఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో కారు అద్దాలు ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలుమహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు.శిశుమందిర్ స్కూల్ వద్ద హైటెన్షన్..బీజేపీ, కాంగ్రెస్ నేతల సవాల్‌తో శిశుమందిర్ స్కూల్ వద్ద హైటెన్షన్.పోలీస్ భారీ బందోబస్తు మధ్య బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అరెస్టు.పట్టణంలోని శిశు మందిర్ పాఠశాల వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులుకామరెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి హౌస్ అరెస్ట్.👉కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. కాంగ్రెస్, బీజేపీ నేతల బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో, ఏం జరగనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.👉కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు, శిశు మందిర్ పాఠశాల, అరోరా కాలేజీ భూముల కబ్జా విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో నిజానిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సవాల్ విసిరారు. దీంతో, చర్చకు తాము సిద్ధమని కాంగ్రెస్ నేతలు ప్రతి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో శిశు మందిర్ వేదికగా చర్చకు రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి.. కాంగ్రెస్ నాయకులు సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. దీంతో, కామారెడ్డి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. -
బెంగాల్లో బీజేపీకి బిగ్ షాక్..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ప్రత్యేక గూర్ఖాల్యాండ్ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రంలోని తమ పార్టీ అనుకూలంగా లేదన్న ఆగ్రహంతో పశ్చిమబెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే బిష్ణు ప్రసాద్ శర్మ కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, గురువారం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.కుర్సియాంగ్ శాసనసభ్యుడైన శర్మ కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీఎంసీలో చేరారు. మరో రెండు నెలల్లో బెంగాల్లో ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ బీజేపీ రెబల్ ఎమ్మెల్యే పార్టీని వీడటం గమనార్హం. ‘కుర్సియాంగ్ ఓటర్ల మనోభీష్టానికి వ్యతిరేకంగా పనిచేయదల్చుకోలేదు. ఇప్పుడు నేను స్వేచ్ఛాజీవిని. ఎవరేం అనుకున్నా భయపడేదే లేదు’ అని పార్టీ మారాక బిష్ణుప్రసాద్ అన్నారు.బెంగాల్ కొండ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా విభాగం ఉండాలని గత రెండేళ్లుగా బీజేపీ అధిష్టానంతో బిష్ణు పోరాడుతున్నారు. పశ్చిమబెంగాల్ మాత్రమేకాదు నార్త్ బెంగాల్ కూడా ముఖ్యమే’ అని గతంలో వ్యాఖ్యానించారు. పార్టీ వద్దని వారించినాసరే బిష్ణు ప్రసాద్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో డార్జిలింగ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. -
మంత్రుల అవినీతి ఆడియోలు.. బాంబు పేల్చిన బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి మూటలు పంపేందుకు అధికారంలో ఉందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో మంత్రుల అవినీతికి సంబంధించిన చిట్టా, ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిని త్వరలోనే బయటపెడతామని బాంబు పేల్చారు.కరీంనగర్ పదో డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ కొమురయ్య బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీకి తొలి మేయర్‌ను అందించిన కేంద్రమంత్రి బండి సంజయ్‌కి అభినందనలు తెలిపారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ..‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సహకారంతో కరీంనగర్ గెలిచాం. రాష్ట్ర, జిల్లా నాయకత్వం సమిష్టిగా అగ్రెసివ్‌గా కొట్లాడం. బీఆర్ఎస్.. కాంగ్రెస్, ఎంఐఎంతో కుమ్మకైంది. బీజేపీని అడ్డుకునేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుమ్మక్కయ్యాయి. కానీ అక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లు వారి అధిష్టానం మాట ధిక్కరించి అవసరం వస్తే మాకు సపోర్ట్ ఇస్తామన్నారు. కరీంనగర్ స్పూర్తితో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తాం. ప్రజల కళ్లలో ఆనందం కంటే ఒవైసీ కళ్లలో ఆనందం చూడాలని రేవంత్ అనుకుంటారు. మజ్లిస్ కోసమే భాగ్యనగరాన్ని సీఎం రేవంత్‌రెడ్డి మూడు ముక్కలు చేశారు. మూడు ముక్కలు ఎందుకు ఎవరి కోసం చేశారో రేవంత్ చెప్పడం లేదు. భాగ్యనగరం గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తాం. ముంబై, ఢిల్లీ లాంటి పెద్ద నగరాలను కూడా విభజించలేదు. ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఎక్కడ ఉన్నాయి?. వచ్చిన పెట్టుబడులు అన్ని ఏఐసీసీకి పంపి దేశంలో పార్టీని బతికేస్తున్నారు. TPCC కాదు T4C అంటే తెలంగాణ కమీషన్ కలెక్షన్ కరప్షన్ కాంగ్రెస్. ఢిల్లీకి మూటలు మోయడానికే కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ మంత్రుల అవినీతి చిట్టా మా దగ్గర ఉంది. ఇంకా వివరాలు సేకరిస్తున్నాం. ఐఏఎస్ అధికారులు కూడా వీటికి మధ్యవర్తులుగా సహకరిస్తున్నారు. మేము ఒక్కో మంత్రి ఇంటి వద్ద అవినీతిపై ఆందోళన చేస్తాం అని హెచ్చరించారు. -
బీజేపీ కోవర్టులపై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కోవర్టులపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 20 ఏళ్ల నుంచి పార్టీని పట్టి పీడిస్తున్న కోవర్టులు వెంటనే వెళ్లిపోవాలన్నారు. ఇదే సమయంలో బీజేపీలో పలువురు పాత నాయకులను కోవర్టులతో పోల్చడం తీవ్ర చర్చకు దారి తీసింది. చివరగా.. నిజామాబాద్‌ను కరీంనగర్‌తో పోల్చలేమని చెప్పుకొచ్చారు.బీజేపీ ఆఫీసులో ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ..‘ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడింది.. దక్షిణ తెలంగాణలో బలోపేతం కావాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. కేసుల కోసమే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. వీళ్లూ ఇచ్చారు వాళ్ళు తీసుకున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక కుటుంబ అవినీతిని ఎవరు అడగకుండా ఉండేందుకు కొనడం మొదలు పెట్టారు. కేసీఆర్ వ్యవస్థను నాశనం చేశారు.. రేవంత్ రెడ్డి దాన్ని కొనసాగిస్తున్నారు. మేము ప్రక్షాళన చేయాలనుకున్నాం. అందుకే ఎవరితో కలవలేదు. అలాంటి వ్యవస్థను తెలంగాణలో పెంచుకోవాలి. కాంగ్రెస్ నేతలు కలిసి ఉండలేరు.. కలిసి ఉండటం అసంభవం.ఇదే సమయంలో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపైన ఎంపీ అర్వింద్ స్పందిస్తూ..‘ఎవరు ఎవరి వల్ల భూస్థాపితం అయ్యారో కవితకు తెలియదా?. ఆమె వ్యాఖ్యలకు అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాస్వామ్య విలువల్ని పాటించారు. బీజేపీకి భయపడి రాయకల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మెట్పల్లిలో పార్టీ కోవర్టు వెళ్ళిపోయారు.. పార్టీకి పట్టిన పీడ పోయింది. సుఖేందర్ కోవర్టు కేసు.. ఆయనకు, ఆయన భార్యకు ఇద్దరికీ టికెట్ ఇవ్వను అని చెప్పాం.సుఖేందర్ రెడ్డికి వీక్ క్యాండిడేట్ పెడుతామని కాంగ్రెస్ వాళ్లు కాల్ చేసి చెప్పారు. సుఖేందర్ లాంటి వారు 20 ఏళ్ల నుండి బీజేపీని మోస్తున్న అని చెప్పుకునే వారు. కానీ, అలాంటి వారు కొందరు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారు. ఇప్పుడు నా చేతికి మట్టి అంటకుండా ప్రక్షాళన జరిగింది. ఇలాంటి వారు ఎక్కడ ఉన్నా బయటకు వెళ్లిపోవాలి. ఇప్పటికే ఇందూర్ ప్రక్షాళన జరిగింది. జగిత్యాలను కూడా ప్రక్షాళన చేస్తా. కరీంనగర్‌ను నిజామాబాద్‌తో పోల్చలేము. నిజామాబాద్‌లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు. -
అంచనాలకు దూరంగా..
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒకింత నిరాశాజనక ఫలితాలే వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో పట్టున్న పార్టీగా మంచి ఫలితాలే సాధిస్తామని ఆ పార్టీ నేతలు ఆశించినా అది నెరవేరలేదని అంటున్నారు. మొత్తం 7 కార్పొరేషన్లలో కరీంనగర్, నిజామాబాద్ మేయర్ పీఠాలను, 116 మున్సిపాలిటీల్లో 15 నుంచి 20 దాకా చైర్పర్సన్ పదవులను సాధిస్తామని వేసుకున్న అంచనాలకు దగ్గరలో కూడా ఫలితాలు రాలేదని భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో దూకుడు చూపడంతోపాటు దక్షిణ తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో కనీసం ఒక్క డివిజన్లో గెలిచి బలాన్ని చాటుతామనుకున్న అంచనాలను అందుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 సీట్లలో 7, 8 ఎంపీ సీట్లలో మూడు, 3 ఎమ్మెల్సీ సీట్లలో 2 ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే గెలిచినందున... పుర ఎన్నికల్లో అక్కడ మంచి ప్రదర్శన కనబరుస్తామని భావించింది. అయితే ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ పీఠం మాత్రమే దక్కించుకోగలిగింది. దక్షిణాన నామమాత్రమే... దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో కనీసం ఒక్కసీటునైనా సాధించి ప్రాతినిధ్యం చాటుతామన్న కమలనాథుల ధీమా వాస్తవరూపం దాల్చలేదు. అదేవిధంగా కనీసం ఒక్క మున్సిపాలిటీనైనా కైవసం చేసుకుంటామన్న ఆశలు నెరవేరలేదు. మెదక్, నల్లగొండ జిల్లాల్లో నిరాశాజనక ఫలితాలు రాగా, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ఆశించినస్థాయిలో వార్డులు, డివిజన్లను గెలవలేకపోయింది. ఏతావాతా చూస్తే... 2020 మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన ఫలితాలనే కొంచెం అటుఇటుగా ఈసారి కూడా సాధించినట్టయ్యింది. అయితే, గత ఎన్నికల్లో 15 శాతం ఓటింగ్ సాధించగా, 20 శాతం ఓట్ల నమోదు ద్వారా మెరుగైన ఫలితాలను సాధించామని ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు. జాతీయ నాయకత్వం ధీమా మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించే అవకాశాలున్నాయని జాతీయ నాయకత్వం కూడా విశ్వసించింది. ఈ ఎన్నికలకు అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను అందజేసింది. ఎన్నికల ప్రచారాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహబూబ్‌నగర్‌లో పెద్దఎత్తున ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం నిర్వహించారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు భిన్నంగా... కాంగ్రెస్ సర్కార్‌పై చార్జీïÙట్ విడుదల చేసింది.. పురపోరు కోసమే ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా రూపొందించింది. మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మున్సిపాలిటీల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని హామీనిచి్చంది. అయితే, ఇవేవీ ఆశించిన స్థాయిలో పట్టణప్రాంతాల ప్రజల ఓట్లను రాబట్టుకోవడంలో సఫలీకృతం కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, 49 మున్సిపాలిటీల్లో కనీసం ఒక్క డివిజన్, వార్డులోనూ గెలవకపోవడంతో కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయిందని అంటున్నారు. -
ఎన్నికల ఫలితాల్లో ట్విస్ట్.. ఐదు చోట్ల హంగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో భాగంగా పలుచోట్ల హంగ్ ఏర్పడింది. కేస సముద్రం, అలంపూర్, ఇస్నాపూర్, కోహిర్, దేవరకద్ర మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీల ఇండిపెండెంట్లుగా గెలిచిన అభ్యర్థుల కోసం పార్టీలు పోటీపడే అవకాశం ఉంది.వివరాల మేరకు.. మహబూబాబాద్ జిల్లాలోని కేస సముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా.. చెరో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో, హంగ్ ఏర్పడింది. మరోవైపు.. అలంపూర్ మున్సిపాలిటీలో 10 వార్డులు ఉండగా.. చెరో ఐదు చోట్ల బీఆర్ఎస్, ఐదు చోట్ల కాంగ్రెస్ గెలుపొందింది. ఇక, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. ఇస్నాపూర్‌లో 26 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్-12, కాంగ్రెస్-10, ఇతరులు-4 విజయం సాధించారు. మ్యాజిక్ ఫిజర్ 13 కాగా, ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో, ఇండిపెండెంట్లపై పార్టీలు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులకు గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5 చోట్ల విజయం సాధించాయి. బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో చోట గెలిచారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలోనూ అదే తరహా పరిస్థితి నెలకొంది. అక్కడ మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4 స్థానాల్లో గెలవగా.. బీజేపీ, ఇతరులు ఒక్కో స్థానంలో విజయం సాధించారు.ఏఐఎఫ్బీ ప్రభంజనం.. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఓ మున్సిపాలిటీని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఏఐఎఫ్బీ) దక్కించుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. అక్కడ 10 వార్డుల్లో 8 చోట్ల ఏఐఎఫ్బీ గెలిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కో వార్డుకే పరిమితమయ్యాయి. తెలంగాణ జాగృతికి చెందిన నేతలు ఏఐఎఫ్బీ తరఫున ఎన్నికల బరిలో దిగి విజయం సాధించడం గమనార్హం.కాంగ్రెస్ హవా.. కారు జోరు.. కాంగ్రెస్: నేరేడుచర్ల, హుజూర్నగర్, హాలియా, నందికొండ, చండూరు, భూత్పూర్, ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపెడ, డోర్నకల్, అశ్వారావుపేట, నారాయణ ఖేడ్, స్టేషన్ ఘన్పూర్.బీఆర్ఎస్: గడ్డపోతారం, ఇంద్రేశం, అయిజ, తొర్రూర్ఫార్వర్డ్ బ్లాక్: వడ్డేపల్లి. -
మున్సిపల్ ఫలితాలు.. కాంగ్రెస్ హవా
Telangana Municipal Elections 2026 Results👉వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు వివరాలు👉వార్డుల వారీగా కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు.. నిజమాబాద్ : కార్పొరేషన్ 60 డివిజన్లో ముగిసిన ఓట్ల లెక్కింపుఅతిపెద్ద పార్టీ గా బీజేపీ ఏ పార్టీకి దక్కని మ్యాజిక్ ఫిగర్కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి శమంత రెడ్డి ఓటమిబీజేపీ 28కాంగ్రెస్ 18ఎంఐఎం 13బీఆర్ఎస్ 01తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా116 మున్సిపాలిటీల్లో 72 చోట్ల కాంగ్రెస్ విజయం15 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్మున్సిపల్ ఎన్నికల్లో ఖాతా తెరవని బీజేపీ రామగుండంలో కాంగ్రెస్ విజయం వెనుక మంత్రి శ్రీధర్‌బాబు కీలక పాత్రపెద్దపల్లి జిల్లాలో చక్రంతిప్పిన మంత్రి శ్రీధర్బాబుమంథని మున్సిపాలిటీలో 13 స్థానాలకు 11 కాంగ్రెస్ కైవసంరామగుండం కార్పొరేషన్ దక్కించుకున్న కాంగ్రెస్రామగుండంలో 60 స్థానాలకు 38 స్థానాల్లో కాంగ్రెస్ విజయం తెలంగాణ పలు మున్సిపాలిటీల్లో హంగ్హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో హీటెక్కిన పాలిటిక్స్చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ స్కెచ్ నిజమాబాద్ : కార్పొరేషన్ లో 60 డివిజన్లకు ఓట్ల లెక్కింపు26 డివిజన్ల లో ముందంజలో బీజేపీ అభ్యర్థులుకాంగ్రెస్ 17 డివిజన్లలో ముందంజఎంఐఎం 10 డివిజన్లలో ముందంజబీఆర్ఎస్ ఒక డివిజన్లో ముందంజ కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకుపోతాం: కేటీఆర్మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాంకాంగ్రెస్ ప్రభుత్వం మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టిందిఅధికారుల్ని అడ్డం పెట్టుకుని గెలవాలని చూశారుకాంగ్రెస్, బీజేపీలను నిరోధించే శక్తి బీఆర్ఎస్కే ఉందికాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్(మొత్తం 60 డివిజన్లు)ఏ పార్టీకి రాని స్పష్టమైన మెజార్టీసీపీఐ -24చోట్ల గెలుపుకాంగ్రెస్-20చోట్ల గెలుపుబీఆర్ఎస్-09సీపీఎం -01బీజేపీ -01 నల్లగొండ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసంమంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసంరామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్‌దే కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసంకరీంనగర్ జిల్లా:కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో 3 గంటల 50 నిమిషాల వరకు అప్డేట్స్బీజేపీ 33కాంగ్రెస్ 12బీఆర్ఎస్ 9ఇండిపెండెంట్స్ 6ఎంఐఎం 3ఆల్ ఇండియా ఫార్వబ్లాక్-3రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 3.17pmవరకు ఫలితాలు -48కాంగ్రెస్ 31బీఆర్ఎస్ 12బిజెపి 01ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 03ఇండిపెండెంట్ 01సిద్ధిపేట జిల్లాహుస్నాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం మెదక్: నారాయణఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంనారాయణపేట: మక్తల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంవరంగల్: పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమహబూబ్నగర్: కల్వకుర్తిమున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంరంగారెడ్డి: షాద్‌నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంరంగారెడ్డి: శంకరపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమహబూబాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమెదక్: రామాయంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్కైవసంమెదక్: తుప్రాన్మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసంకొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ ఆధిక్యందాదాపు 15 మున్సిపాలిటీల్లో హంగ్దేవరకద్ర, కేసముద్రం, జహీర్బాద్లో హంగ్అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామల్ హంగ్ఆసిఫాబాద్, జమ్మికుంట,జిన్నారంలో హంగ్మహబూబాబాద్,బోధన్, వేములవాడ, ఆలియాబాద్‌లో హంగ్ జగిత్యాల జిల్లా :ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్15/15 స్థానాలు కాంగ్రెస్ కైవసంమొత్తం స్థానాలు 1515స్థానాల్లో ఒక్క అభ్యర్థిని గెలిపించుకోలేక పోయిన బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ప్రభావం చూపని బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులుఖమ్మం:వైరా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం కొడంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంనిజామాబాద్ జిల్లా:ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతమాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆందోళన16 వ వార్డు రీ కౌంటింగ్ చెయ్యాలని జీవన్ రెడ్డి డిమాండ్కరీంనగర్ జిల్లా:తొలి రౌండ్ ముగిసేసరికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ల్లో 30 స్థానాల్లో లీడ్‌లో దూసుకుపోతున్న బీజేపీరాష్ట్ర వ్యాప్తంగా కౌటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది: ఎస్ఈసీ రాణి కుమిదినిఎక్కడా ఎలాంటి సమస్యలు మా దృష్టికి రాలేదు.సాయంత్రానికి పూర్తి ఫలితాలు విడుదల అవుతాయి.బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నేషనల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయించింది.16వ తేదీ మేయర్, చేర్మెన్ ఎన్నిక ఉంటుంది.మేయర్, చైర్మెన్ ఎన్నికలు టై అయితే లాటరీ విధానం అమలు చేస్తారు సిద్దిపేటచేర్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీఆర్ఎస్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:ఇల్లందు మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్మహబూబాబాద్ జిల్లా;మహబూబాబాద్ కౌంటింగ్ సెంటర్ వద్ద బీఆర్ఎస్_ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణమాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గో బ్యాక్ అంటూ కాంగ్రెసు కార్యకర్తల అందోళనకౌంటింగ్ సెంటర్ లోకి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లోపలికి ఎలా పంపించారంటూ పోలీసులతో వాగ్వివాదం4 వార్డు ఇండిపెండెంట్ ఆభ్యర్ది గుగులోత్ జ్యోతి రమేష్. 135 ఓట్ల తో గెలుపుజ్యోతి రమేష్ ను క్యాంపు కు తరలించడానికి మంతనాలుక్యాంప్ కి ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్పోలీసుల రంగ ప్రవేశంఆభ్యర్ధిని కౌంటింగ్ హలోకి పంపిన పోలీసులుమాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కారు ముందు కాంగ్రెసు కార్యకర్తలు.. నిరసనఖమ్మం జిల్లాకల్లూరు మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా:ఆర్మూర్ మున్సిపాలిటీని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీరాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో 1, 6, 26 వార్డుల్లో రీకౌంటింగ్ కు పట్టుబడుతున్న సమీప ప్రత్యర్థులుకౌంటింగ్ కేంద్రం వద్ద బైఠాయించిన ఆయా వార్డు అభ్యర్థులుబయటకు నెట్టేసిన పోలీసులు..కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతసిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపాలిటీ బీఆర్ఎస్ కైవసంకౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతమేడ్చల్ జిల్లా అలియాబాద్‌లో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతస్వతంత్ర అభ్యర్థి వెంకటేష్‌ను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులుఇండిపెండెంట్ అభ్యర్థి వెంకటేష్‌ను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లిన పోలీసులుపోలింగ్ కేంద్రం వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలు, తోపులాట ధర్మపురిలో సంచలన ఫలితాలు..ధర్మపురి రాజకీయాల్లో సంచలన ఫలితాలు.ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఘోర పరాభవం.15 స్థానాలకు 15 స్థానాలు కాంగ్రెస్ కైవసం..రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్న ధర్మపురి మున్సిపల్ ఫలితాలు.. హంగ్ ఎఫెక్ట్.. స్వంత్రులకు గిరాకీ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో పోటాపోటీ.కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ.దేవరకద్ర, కేససముద్రం, జహీరాబాద్‌లో హంగ్.అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామలో హంగ్.ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారంలోనూ హంగ్.బోధన్, వేములవాడ, అలియాబాద్‌లో హంగ్.ఈ నేపథ్యంలో కీలకం కానున్న స్వతంత్రులు. కాంగ్రెస్ ఆధిపత్యం.. మధిరలో కాంగ్రెస్ ఘన విజయంమధిర 22 వార్డుల్లో 21 వార్డులు కాంగ్రెస్ కైవసం.ఒక్క వార్డుకే పరిమితమైన బీఆర్ఎస్మెదక్ రామాయంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమహబూబ్నగర్ కొత్త మున్సిపాలిటీ కాంగ్రెస్ విజయంసంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం.మద్దూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.ఇల్లందు మున్సిపాలిటీ కాంగ్రెస్ విజయంపెబ్బేరు కాంగ్రెస్ కైవసం. పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమద్దూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంజమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యంఆత్మకూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంసిరిసిల్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం బీఆర్ఎస్ జోరు.. భీంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.తిరుమలగిరి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.15 వార్డుల్లో 11 చోట్ల బీఆర్ఎస్ విజయం.క్యాతనపల్లి మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం. కొడంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. మూడు చోట్ల హంగ్.. కేస సముద్రం, అలంపూర్, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో హంగ్.కేస సముద్రంలో చెరో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ విజయం.అలంపూర్‌లో చెరో ఐదు చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుపు. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ.. సిరిసిల్లలో బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం.39 వార్డులకు గాను 14 వార్డుల్లో ఫలితాలు వెల్లడి.14 వార్డుల్లోనూ బీఆర్ఎస్ విజయం.స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.ఘన్‌పూర్‌లో 18 స్థానాల్లో కాంగ్రెస్-13, బీఆర్ఎస్-5.హుజురాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.హుజురాబాద్ 30 స్థానాల్లో కాంగ్రెస్-16, బీఆర్ఎస్-8, బీజేపీ-5ఇస్నాపూర్ మున్సిపాలిటీలో హంగ్.ఇస్నాపూర్‌లో 26 స్థానాల్లో బీఆర్ఎస్-12, కాంగ్రెస్-10, ఇతరులు-4జనగామలో బీఆర్ఎస్ ఆధిక్యం.జనగామలో 30 స్థానాల్లో బీఆర్ఎస్-13, కాంగ్రెస్-12, ఇతరులు-4గాంధీభవన్‌లో సంబురాలు..హైదరాబాద్..గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల సంబురాలు.బాణాసంచా పేల్చి, స్వీట్లు తినిపించుకున్న కాంగ్రెస్ నేతలు. 👉ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ హవా.👉ఉమ్మడి జిల్లాలో కీలక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం.ఇప్పటి వరకు వెలువడిన 18 స్థానాల్లో ఫలితాల ప్రకారం..13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపుఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం. ఖమ్మంలో కాంగ్రెస్ హవా..మధిర, అశ్వారావుపేట, వైరా, ఇల్లందు మున్సిపాలిలీలు కాంగ్రెస్ కైవసం. కొల్లాపూర్, మంథని, నేరుడుచర్చ కాంగ్రెస్ వశం..ఐజా మున్సిపాలిటీ బీఆర్ఎస్ విజయం. కామారెడ్డిలో కాంగ్రెస్ హవా..బాన్సువాడ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్మ్యాజిక్ ఫిగర్ మెజార్టీ సాధించిన కాంగ్రెస్.19 వార్డులకు 11 వార్డుల్లో కాంగ్రెస్ విజయం.3 వార్డుల్లో బీజేపీ విజయం2 వార్డుల్లో స్వతంత్రులుఒక వార్డులో బీఆర్ఎస్ విజయం. కామారెడ్డిలో బిచ్కుంద మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.10 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం2 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం.బోణీ కొట్టని బీజేపీ.కొత్త మున్సిపాలిటీలో ఎగిరిన కాంగ్రెస్ జెండా. 👉ఇప్పటి వరకు 80 మున్సిపల్ వార్డుల ఫలితాలను స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు అందించిన అధికారులు👉52 వార్డులు కాంగ్రెస్, 21 బీఆర్ఎస్, 3 బీజేపీ, 3 ఇండిపెండెంట్, 1 ఇతరులు గెలుపు.దేవరకొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమొత్తం 20 వార్డులుకాంగ్రెస్-11బీఆర్ఎస్-6 ఇండిపెండెన్స్-2బీజేపీ-1 బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయంచిట్యాల, చండూరు, హాలియా, నందికొండలో కాంగ్రెస్ విజయం. మరిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. మరిపెడ 15..కాంగ్రెస్-8బీఆర్ఎస్-6 చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.చండూరు(10)కాంగ్రెస్-7బీఆర్ఎస్-2సీపీఐ-1చిట్యాల కాంగ్రెస్ విజయం.చిట్యాల (12)కాంగ్రెస్-9బీఆర్ఎస్-2 హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంహాలియా 12..కాంగ్రెస్-8బీఆర్ఎస్-2 గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.గుమ్మడిదల 22బీఆర్ఎస్-14కాంగ్రెస్-4బీజేపీ-2బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ.. హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఆధిక్యం.మధిర మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.22 వార్డుల్లో కాంగ్రెస్ 16 విజయం.వేములవాడలో బీజేపీ ఆధిక్యం.కోహిర్లో (16) ఇలా..కాంగ్రెస్-6బీఆర్ఎస్-5బీజేపీ-1 నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం.నందికొండ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నా కాంగ్రెస్నందికొండలో మొత్తం 12 వార్డులు.కాంగ్రెస్-11బీఆర్ఎస్-1 గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసంసంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో 18 వార్డులుబీఆర్ఎస్-14కాంగ్రెస్-3ఇండిపెండెంట్-1. ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కిషోర్ గెలుపు13వ వార్డు స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీ నరసింహ రెడ్డి గెలుపు17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటేష్ గెలుపుమూడో వార్డు అభ్యర్థి ప్రియాంక రెడ్డి బీజేపీ విజయం.16వ వార్డు అభ్యర్థి కె.లక్ష్మీ బీజేపీ విజయం కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంహుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 4 5 6 7 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు4 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి తిరుపతి విజయం5 వ వార్డులో బొలిశెట్టి రాజు విజయం6 వ వార్డులో భూక్యా సంపత్ నాయక్ విజయం7 వ వార్డులో చిత్తారి పద్మ రవీందర్ విజయంబీఆర్ఎస్ హవా..మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎనిమిది మంది బీఆర్ఎస్ అభ్యర్థులు విజయంఇబ్రహీంపట్నం 12వ వార్డులో 100 ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కుమార్ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత గెలుపుమేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డులో గెలిచిన అభ్యర్థి గురుక కుమార్మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి 39 ఓట్ల మెజార్టీతో గెలుపుసంగారెడ్డి జిల్లా గడ్డ పోతారం మున్సిపాలిటీలో నాలుగు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం... ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది.ఒకటో వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ 278 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.విజయాలు ఇలా.. జగిత్యాల పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజ.వరంగల్ నర్సంపేట మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ లీడ్.వైరా మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లో ఏడు వార్డుల్లో బీఆర్ఎస్ ఆధిక్యం.కొల్లాపూర్ 6,14 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు. అభ్యర్థుల విజయాలు..యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఫస్ట్ వార్డు బీజేపీ అభ్యర్థి రాధ గెలుపుమరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.మూడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యం.సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.ఇబ్రహీంపట్నం 12వ వార్డులో బీఆర్ఎస్ గెలుపు.100 ఓట్ల తేడాతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి.ఇంద్రేశం 15వ వార్డులో కాంగ్రెస్ గెలుపు.గడ్డిపోతారం 16వ వార్డులో బీఆర్ఎస్ విజయం. ఆధిక్యం ఇలా.. మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరులో కాంగ్రెస్ లీడ్.ఆసిఫాబాద్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ లీడ్.యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఫస్ట్ వార్డులో బీజేపీ గెలుపు.ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.నందికొండ, హాలియా, చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ లీడ్.నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యం. నల్లగొండ జిల్లాహాలియా మున్సిపాలిటీలోపోస్టల్ బ్యాలెట్ల ఫలితాలుకాంగ్రెస్ :32టీఆర్ఎస్ :8బీజేపీ : 1 ఇండిపెండెన్స్ :2నోటా: 1మొత్తం: 44చొప్పదండి మున్సిపల్ రెండవ వార్డులో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుబీజేపీ:1కాంగ్రెస్:2టీఆర్ఎస్:1 ఆధిక్యాలు ఇలా.. ఆదిలాబాద్..పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజ.ఖమ్మం జిల్లామధిర మున్సిపాలిటీ మొదటి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం.మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ముందంజ.కాంగ్రెస్ -29బీఆర్ఎస్ -5నోటా -1 సంగారెడ్డిసంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఫలితాలుమొత్తం 38 వార్డుల్లో 10 వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యం3 వార్డుల్లో BRS ఆధిక్యంక్యాంప్ రాజకీయాలకు కాంగ్రెస్ కసరత్తుహైదరాబాద్..క్యాంప్ రాజకీయాలకు కాంగ్రెస్ కసరత్తుఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తలునగర శివారుల్లోని పలు రిసార్టులలో రూమ్స్ బుక్ చేసిన హస్తం నేతలు350 రుమాలు బుక్ చేసిన కాంగ్రెస్నిన్న రాత్రే పలు మున్సిపాలిటీల అభ్యర్థులను క్యాంపులకు తరలింపుఈరోజు ఉదయం మరి కొందరిని క్యాంపునకు తరలించిన కాంగ్రెస్ నేతలుబీఆర్ఎస్ ఆగ్రహంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా..అశ్వారావుపేట కౌంటింగ్ హాల్లో అధికారుల తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం..అధికార పార్టీ అభ్యర్థితో ముగ్గురిని అనుమతిస్తూ, బీఆర్ఎస్ నుండి ఒక్కరినే అనుమతి ఇస్తున్నారని బీఆర్ఎస్ ఆందోళనఅందరికి ఒకే రూల్ ఉండాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలుబీజేపీ అభ్యర్థి మృతి.. మంచిర్యాల..లక్షెట్టిపేట పదో వార్డు బీజేపీ అభ్యర్థి మృతి.ఉదయం అనారోగ్యంతో మృతి చెందిన బత్తిని ఎల్లమ్మ.బీజేపీ లీడ్.. కరీంనగర్ జిల్లా:కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో బీజేపీ లీడ్.పలు వార్డుల్లో బీజేపీ ఆధిక్యత.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు తర్వాత ప్రకటించనున్న అధికారులు.కౌంటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేస్తున్న ఈసీ..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కౌంటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేస్తున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్.వెబ్ కాస్టింగ్ విధానాన్ని కమిషన్ ఆఫీసులో పరిశీలిస్తున్న చీఫ్ రాణి కుమిదిని.ఎన్నికల సిబ్బంది సమన్వయంతో ఉండాలని SEC ఆదేశం.పోలింగ్ రోజు తరహాలో రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతాయి.కౌంటింగ్ కేంద్రంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలి.కౌంటింగ్ జరగని చోట ఆలస్యానికి కారణం ఏంటని ఆరా తీసిన SEC. 👉మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుస్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్.కరీంనగర్ జిల్లా:హుజురాబాద్‌లో స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్.గడ్డపారతో స్ట్రాంగ్ రూం తాళాలు పగులగొట్టిన అధికారులు.కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంకౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రతఎన్నికలపై అన్ని పార్టీలు, అభ్యర్థుల్లో ఉత్కంఠకౌంటింగ్ కేంద్రాల సందడి వాతావరణం,. క్యూలో అభ్యర్థులను లోపలికి పంపుతున్న పోలీసులు ఎన్నికలు ఫలితాలు.. టీపీసీసీ చీఫ్ కీలక ఆదేశాలుఎన్నికల ఫలితాలపై ఉత్కంఠఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ఫలితాలపై అలర్ట్‌గా ఉండాలన్న పీసీసీ ఛీఫ్.హాంగ్ వచ్చే అవకాశం ఉన్న చోట వెంటనే పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రికి సమాచారం ఇవ్వాలని ఆదేశం..ఇంకా క్యాంప్‌లకు తరలించని అభ్యర్థులను వీలైనంత త్వరగా తరలించాలని సూచన..ఒకటి రెండు ఓట్లతో ఓడిపోయే వార్డులలో కచ్చితంగా రీ కౌంటింగ్‌కు అడగాలని సూచించిన మహేష్ కుమార్. ఈసీ ఆఫీసు వద్ద భారీ బందోబస్తు..తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వద్ద భారీ బందోబస్తు.పోలింగ్ రోజుతో పోల్చితే మూడింతల బందోబస్తు పెంచిన పోలీస్ శాఖ.పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలపై కేసులు నమోదు చేయాలని SEC ఆదేశం.SEC నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్, బీజేపీ, BRS నేతలు.కౌంటింగ్ దగ్గర ఏదైనా ఇబ్బంది అయితే SECకి చేరుకుంటారనే సమాచారంతో బందోబస్తు పెంచిన అధికారులు.ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపుఓట్ల లెక్కింపు కోసం మొత్తం 123 కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం2,981 వార్డుల్లో పోటీ చేసిన 12,944 మంది అభ్యర్థులుఇప్పటికే 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతఈనెల 16న మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికఈనెల 16న కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికఅభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్న అధికార, విపక్షాలుకట్టుదిట్టమైన భద్రత: డీజీపీకౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: డీజీపీ శివధర్రెడ్డిలెక్కింపు కేంద్రాల వద్ద 12వేల మంది పోలీసులతో భద్రతపోలీసులతో పాటు సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని సీసీటీవీ కెమెరాలతో నిఘాకమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షణకౌంటింగ్ కేంద్రాలకు 200 మీ దూరం వరకు ఆంక్షలుఅన్ని పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పోలీసులకు సహకరించాలి మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం.. ఉదయం 8 గంటలకే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం తేలనున్న 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం 3 నుంచి 8 రౌండ్లలో ఫలితాలు కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తుందా? బీఆర్ఎస్ పట్టునిలుపుకొనేనా? బీజేపీ నిలబడేనా?ఫలితాలపై సర్వత్రా ఆసక్తిమొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. -
బీఆర్ఎస్ Vs కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా పలు మున్సిపాలిటీల్లో ఉద్రికత్త చోటుచేసుకుంది. పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. భౌతిక దాడులు చేసుకున్నారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వారికి అక్కడి నుంచి చెదరగొట్టారు.కాంగ్రెస్ vs బీఆర్ఎస్.. కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి చేయి చేసుకున్నారు. మహబూబాబాద్ 14వ వార్డులో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరావుపై చేయి చేసుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణ. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారంటూ దాడి చేసిన కృష్ణ. దీంతో, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ, చెదరగొట్టిన పోలీసులు.బీఆర్ఎస్ శ్రేణుల డబ్బుల పంపిణీభూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల పంపిణీ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. స్థానికుల సమాచారంతో పోలింగ్ కేంద్రం వద్దకు పోలీసులు చేసుకున్నారు. దీంతో, బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరులు డబ్బులు వదిలేసి పరారీ అయ్యారు. లక్షకు పైగా డబ్బులు స్వాధీనం చేసుకున్న పోలీసులు.👉జగిత్యాల 31వ వార్డులో బీఆర్ఎస్, ఎంఐఎం వర్గీయుల వాగ్వాదం, తోపులాట జరిగింది. నినాదాల విషయంలో బీఆర్ఎస్, ఎంఐఎం వర్గీయుల వాగ్వాదం చోటుచేసుకుంది.👉వరంగల్‌లోని నర్సంపేట పరిధి 24వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల పంపిణీతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా డబ్బులు పంచుతుండగా కార్యకర్తలను పట్టుకున్న పోలీసులు. నిందితుడు ఫిరోజ్ ఖాన్ వద్ద రూ.10 వేలు స్వాధీనం.👉వికారాబాద్‌లోని పరిగిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల వాగ్వాదం నెలకొంది. 13వ వార్డు 27వ పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల ఘర్షణ నెలకొంది. బోగస్ ఓట్లు వేస్తున్నారని బీఆర్ఎస్ వర్గీయులు ఆరోపించారు. స్థానిక ఓటర్లే గుర్తింపు కార్డులతో ఓట్లు వేస్తున్నారన్న కాంగ్రెస్ వర్గీయులు. నిరసనకారులను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపిన పోలీసులు. ఐదు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 13వ వార్డు ఉండటంతో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు. -
మున్సిపల్ ఎన్నికల్లో 73.01 శాతం పోలింగ్ నమోదు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్.. -
బెంగళూరులో నాటకీయ పరిణామం.. తేజస్వీ సూర్య అరెస్ట్!
బెంగళూరు: కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటకలో మెట్రో చార్జీల పెంపు వ్యవహారంపై బీజేపీ నేతలు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో నిరసనల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి తర్వాత తేజస్వీని వదలిలేశారు. దీంతో, కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.బీజేపీ మెట్రో చార్జీల పెంపుపై ప్రతిపక్ష బీజేపీ నేతలు నిరసనలకు దిగారు. ఆర్వీ రోడ్ మెట్రో స్టేషన్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య, బీజేపీ నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తేజస్వీ సూర్య ఖాళీ ట్రంక్ పెట్టెలు పట్టుకుని నిరసనలకు దిగారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. తేజస్వీ సూర్యను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, తేజస్వీ సూర్యను వదిలిపెట్టారు. ఈ క్రమంలో తేజస్వీ మాట్లాడుతూ.. అరెస్ట్ చేయడం వల్ల నా నోరు మూయించలేరు. కర్ణాటక ఆర్థిక పరిస్థితి ఏంటో ప్రజలకు తెలియాలి. బడ్జెట్ సమావేశంలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం ఒత్తిడి వల్లే రెండోసారి మెట్రో చార్జీల పెంపు ఆగిపోయింది అని చెప్పుకొచ్చారు. అయితే, నిరసనల్లో పాల్గొనవద్దని ప్రభుత్వం తేజస్వీ సూర్యకు నిన్ననే నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ నిరసనల్లో పాల్గొనడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. VIDEO | BJYM president Tejasvi Surya (@Tejasvi_Surya), amid protests against the Bengaluru Metro fare hike says, "Metro fare hike has been put on hold for the second time due pressure from Union government. The state government should release a white paper on the economic… pic.twitter.com/WNn1yIrVdq— Press Trust of India (@PTI_News) February 9, 2026అంతకుముందు, సిద్దరామయ్య ప్రభుత్వం బెంగళూరులో నమ్మ మెట్రో రైలు ప్రయాణ ఛార్జీలు ఐదు శాతం పెంచేందుకు పచ్చజెండా ఊపింది. బీఎంఆర్సీఎల్ చేసిన ఈ ప్రతిపాదనను అంగీకరించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. కొత్త ఛార్జీలు నేటి నుంచి(ఫిబ్రవరి 9) అమలు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10, గరిష్ఠ ఛార్జీ రూ.90 అమలులో ఉన్న విషయం తెలిసిందే. పెంచిన ఛార్జీల ప్రకారం కనీస ఛార్జీ రూపాయి నుంచి రూ.5 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ నిరసనలకు దిగింది. అనంతరం, కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు స్థానిక బీజేపీ నేతలు లేఖలు రాశారు. దీంతో, చార్జీల పెంపు తాత్కాలికంగా నిలిపివేయాలని బీఎంఆర్‌సీఎల్‌ను ఆదేశించారని తెలిపారు. దీంతో, చార్జీల పెంపు ప్రక్రియ ఆగిపోయింది. అయితే, ఇప్పుడు చార్జీలను పెంచకపోయినా, మార్చిలో గాని ఏప్రిల్‌లో మాత్రం బాదుడు తప్పదని అధికారులు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఆ పెంపు 100 శాతం ఉన్నా ఆశ్చర్యం వద్దని మెట్రో వర్గాలు చెప్పడం విశేషం.#WATCH | Karnataka: BJP MP Tejasvi Surya was detained (now released) by the police today near Jayanagar Metro station in Bengaluru when he again tried to stage a protest in front of the metro station. He was served a notice yesterday for staging a protest at the Metro station… pic.twitter.com/LYtAjDKpPH— ANI (@ANI) February 9, 2026 -
‘మున్సిపల్ ఎన్నికలు అవగానే ఇంటి పన్ను పెంపు’
సాక్షి, కరీంనగర్: కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఇంటి పన్ను పెంపునకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్నారు. ఆరు గ్యాంరటీలు అమలు చేయని కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.కరీంనగర్ కిసాన్ నగర్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలి. రెండేళ్లలో మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్‌కు నయాపైసా ఇవ్వలేదు. బీఆర్ఎస్కు ఓటేస్తే డ్రైనేజీలో పడినట్టే. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ పైసలు ఎక్కడి నుండి తెస్తుంది?. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, కబ్జాలతో దోచుకుతిన్నారు. పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే.. కమీషన్ల కోసం కేంద్ర నిధులను దారి మళ్లిస్తుంది.కరీంనగర్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరిగింది. నేను పైసలు తీసుకొస్తే.. బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కొబ్బరికాయ కొట్టి మావేనని చెప్పుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే మరిన్ని నిధులు తెచ్చే బాధ్యత నాది. కరీంనగర్ కోసం నేను తెచ్చిన నిధుల వివరాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. గంగుల కమలాకర్ మూట ముల్లె సర్దుకుని కరీంనగర్ వదిలి వెళ్లిపో అని సంచలన వ్యాఖ్యలు చేశారు. -
ఢిల్లీలో మమత.. ఈసీపై తీవ్ర ఆరోపణలు
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. సర్(SIR) విషయంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన తమ మాటల్ని వినలేదని, తమను అవమానించారని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీ తీరుపై మండిపడ్డారు.పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం ‘సర్’ పేరిట ఓటర్ల రివ్యూ చేపట్టి.. లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించింది. ఈ నేపథ్యంలో సర్ ద్వారా కలిగిన నష్టంపై వివరించేందుకు, ఫిర్యాదు చేసేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. అనంతరం, మమతా బెనర్జీ.. సీఈసీ వ్యవహార శైలిపై విరుచుకుపడ్డారు. ఈసీతో సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మమత ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నేను ఎల్కే అద్వానీ గారిని గౌరవిస్తాను. ఆయన తన తల్లిదండ్రుల జనన ధృవీకరణ పత్రాలను అందించగలరా అని అడుగుతున్నాను. ‘సర్’ పొంతన లేనిది. తప్పుల తడకగా ఉంది, అసంబద్ధమైనది. ఈ ఎన్ఆర్సీ కారణంగా బీఎల్ఓలతో సహా 150 మందికి పైగా మరణించారు. నేను నా వెంట 100 మందిని తీసుకువచ్చాను. వారిలో కొందరిని ఓటర్ల జాబితాలో చనిపోయినట్లు ప్రకటించారు. కానీ వారు సజీవంగా ఇక్కడే ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు. Outside the @ECISVEEP office in Delhi, Mamata Banerjee questioned the cruel SIR rules asking how ordinary citizens can produce parents’ birth certificates.150+ BLO deaths. Living voters marked “dead.”This isn’t verification. This is voter suppression. Bengal won’t stay… pic.twitter.com/idewLmDaR4— Abhishek Banerjee Fans (@ABFansClub) February 2, 2026సర్ విషయంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించం. ఆయన మా మాటల్ని వినలేదు.. మమ్మల్ని అవమానించారు. ‘సర్’ వల్ల పశ్చిమ బెంగాల్లో చాలా కుటుంబాలు ఇబ్బందిపడ్డాయి. కొందరు సరైన డాక్యుమెంట్లు ఇవ్వలేకపోవడంతో ఓటరు జాబితాలో పేర్లు కోల్పోయారు. ఇంకొందరి ఓట్లు రకరకాల కారణాల వల్ల తొలగించారు అని అన్నారు.#WATCH | Delhi: Outside the Election Commission Office in Delhi, West Bengal CM Mamata Banerjee says, "... I respect Advani Ji and ask him whether he can provide the birth certificates of his father and mother. This is mismatch, a mismap, and unparliamentary... More than 150… pic.twitter.com/e6dhXl4AfN— ANI (@ANI) February 2, 2026అయితే, మమత చేసిన ఆరోపణలను ఈసీ వర్గాలు ఖండించాయి. టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో అనుచితంగా ప్రవర్తించారని, సీఈసీ చెప్పేది వినిపించుకోలేదని అధికారులు తెలిపారు. మమత ప్రశ్నలకు సీఈసీ సరిగ్గానే స్పందించారని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై బీజేపీ కూడా స్పందించింది. మమతా బెనర్జీది అంతా డ్రామా అంటూ కొట్టిపారేసింది. బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ మమతపై విమర్శలు గుప్పించారు. గంటసేపు ఈసీ ఆఫీసులో ఉండి, మాట్లాడి, సమావేశాన్ని బహిష్కరించానని చెప్పడం ఏంటని ఆయన విమర్శించారు. లోపల జరిగిందొకటి.. బయట మమత చెప్పిందొకటి అన్నారు. డ్రామా నడిపారని, పోలీసుల్ని ఇందులోకి లాగడం సరికాదని సూచించారు. -
ఎన్సీపీకి కొత్త కష్టం.. పవార్ ఫ్యామిలీకి టెస్టింగ్ టైమ్!
మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇదే సమయంలో అజిత్ తర్వాత ఎన్సీపీ పగ్గాలు ఎవరికి?.. పార్టీని ఎవరు నడిపిస్తారు? అనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లోని రెండు వర్గాల మధ్య ఏకీకరణ గురించి చర్చలు జరుగుతున్న సమయంలో అజిత్ మరణంతో ఎన్సీపీ భవిష్యత్తు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు.. అజిత్ వర్గం ఎన్సీపీ చీలకుండా.. బీజేపీ పక్కా వ్యూహం రచించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే, పార్టీపై పట్టు సాధించేందుకు అటు కుటుంబ సభ్యులతోపాటు.. ఇటు పార్టీలోని సీనియర్ నేతల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, పార్టీ బాధ్యతల విషయంలో అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ , కుమారుడు పార్థ్ పవార్ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీ అధికార పగ్గాలు ఎవరికి దక్కుతాయి అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.ఇక, మహారాష్ట్రలో జరిగిన కీలక పరిణామాలను పరిశీలిస్తే.. శరద్ పవార్ 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(NCP)ని స్థాపించారు. 2023లో అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి, పార్టీని చీల్చి సొంత పార్టీని పెట్టారు. ఎన్నికల సంఘం నుంచి ఆయన తన పార్టీకి ఎన్సీపీ పేరుని, చిహ్నాన్ని సొంతం చేసుకున్నారు. నిజానికి ముఖ్యమంత్రి కావాలనే రాజకీయ ఆకాంక్షల కారణంగా అజిత్ పవార్.. శరద్ పవార్ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. కానీ ఆయన ఆకాంక్ష నెరవేరలేదు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో అజిత్ పవార్ వర్గానికి 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉండగా, శరద్ పవార్ వర్గానికి 13-14 మంది మాత్రమే ఉన్నారు. అయితే అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్‌తో సంబంధాలు ఇటీవల పెరిగాయి. రెండు పార్టీల ఏకీకరణ చర్చలు కూడా ఊపందుకున్నాయి.ఇటీవల మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనవరి 2026లో ఈ రెండు వర్గాలు పుణె, పింప్రి-చించ్వాడ్లో ఎన్నికల కోసం కూటమిగా ఏర్పడ్డాయి. శరత్ పవార్ ఆధ్వర్యంలో ఈ రెండు వర్గాల మధ్య ఐక్యతకు సిద్ధంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. కాగా, రెండు వర్గాల మధ్య ఏకీకరణ జరిగితే శరద్ పవార్ వారసురాలిగా సుప్రియా సూలే ఉద్భవిస్తున్నారు. కానీ అజిత్ వర్గానికి వారసుడు ఎవరు అవుతారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానంగా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ముఖ్యంగా అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, ఆయన కుమారుడు పార్థ్ పవార్ పేర్లు ఉండగా.. కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్, ఓబీసీ నాయకుడు ఛగన్ భుజ్బాల్, పార్టీ అధ్యక్షుడు సునీల్ తత్కరే, ధనంజయ్ ముండే వంటి బలమైన నాయకులు కూడా ఉన్నారు.అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్..ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో అతిజ్ పవార్ భార్య సునేత్రా పవర్ చురుగ్గా ఉన్నారు. ఆమె 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం రాజ్యసభ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. అజిత్ పవార్ వారసురాలిగా ఆమె బలమైన పోటీదారు. బారామతి ప్రాంతంలో మహిళా సంఘాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా మంచి పట్టు సాధించారు. అజిత్ పవార్ మద్దతుదారుల సానుభూతిని ఓట్లుగా మార్చుకునేందుకు సునేత్రా పవార్ ముందుంచే అవకాశం ఉంది.అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్అజిత్ పవార్ పెద్ద కుమారుడు పార్థ్ పవార్.. 2019లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేనప్పటికీ.. అజిత్ పవార్ కుటుంబ వారసుడిగా పార్టీ కేడర్‌లో పార్థ్ పవార్‌కు మంచి గుర్తింపు ఉంది.ధనంజయ్ ముండేఅజిత్ పవార్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ధనంజయ్ ముండే.. బీడ్ జిల్లాలో బలమైన నేతగా ఉన్నారు. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. వివాదాల కారణంగా నాయకత్వ రేసులో ధనంజయ్ ముండే వెనుకబడి ఉండవచ్చు.కేంద్రమంత్రి ప్రఫుల్ పటేల్ఎన్సీపీ వ్యవస్థాపక నేతల్లో ప్రఫుల్ పటేల్ కూడా ఒకరు. ఆయనకు ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. దేశ రాజధానిలో ప్రముఖులతో కలిసి చక్రం తిప్పగలిగే సామర్థ్యం ఉంది. అజిత్ పవార్ చీలిక సమయంలో ఆయనకు ప్రఫుల్ పటేల్ వెన్నుదన్నుగా నిలిచారు. పరిపాలనా అనుభవం, జాతీయ రాజకీయాల్లో పరిచయాలు ఉండటంతో పార్టీని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రఫుల్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.బీజేపీ వ్యూహమేంటి?మరోవైపు.. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. మహారాష్ట్రపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. భవిష్యత్‌లో అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేల మధ్య చీలిక ఏర్పడే అవకాశం ఉందని.. వారిలో కొందరు శరద్ పవార్ వర్గంలోకి తిరిగి వెళ్ళవచ్చని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. దీనిని ఊహించిన బీజేపీ.. అజిత్ పవార్ కుటుంబం నుండి ఒకరికి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర అప్పగించాలని యోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ తిరిగి అసెంబ్లీలోకి తీసుకురావాలని బీజేపీ వ్యూహకర్తలు కోరుకుంటున్నారు. ఇది అజిత్ పవార్ మద్దతుదారులకు భావోద్వేగ సందేశాన్ని పంపడమే కాకుండా మహాకూటమి చెక్కుచెదరకుండా ఉండేలా కూడా చేస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా, క్యాబినెట్లోకి ఒక మహిళా మంత్రి ప్రవేశించడం రాజకీయంగా కూడా ముఖ్యమైనది. అయితే కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బీజేపీ ఇప్పటికీ షిండే సేనతో సంప్రదించాల్సి ఉంటుంది. -
ఫోన్ ట్యాపింగ్ డ్రామా నడుస్తోంది: రామచందర్ రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ డ్రామా నడుస్తోందని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలతో ఆటలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. నేతలపై యాక్షన్ ఎందుకు లేదు? అని ప్రశ్నించారు.బీజేపీ కార్యాలయంలో కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకలు జరిగాయి. కర్పూరి ఠాకూర్ జీవితం కార్యకర్తలకు ఆదర్శమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు అన్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలతో ఆటలాడుతున్నాయి. రెండేళ్లుగా దర్యాప్తు పేరుతో డ్రామాను తలపిస్తున్నాయి.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే యాక్షన్ ఉండాలి. అరెస్టులు చేయాలి. పక్క రాష్ట్రాల్లో ఛార్జ్షీట్లు, తెలంగాణలో ఎందుకు కాదు?. కాంగ్రెస్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందేమో అనే అనుమానం కలుగుతుంది. బీఆర్ఎస్ ఆరోపణలకు విలువ లేదు. అధికారులపై మాత్రమే చర్యలు ఉన్నాయి. నేతలపై యాక్షన్ ఎందుకు లేదు?. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. -
కర్ణాటకలో కలకలం.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు..
బెంగళూరు: కర్ణాటకలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించారు. బళ్లారిలోని కంటోన్మెంట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బళ్లారిలోని బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి మోడల్ హౌస్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. బళ్లారి శివార్లలో రూ.3 కోట్ల విలువైన గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్‌కు నిప్పుపెట్టడం తీవ్ర చర్చకు దారి తీసింది. దుండగులు ఇంటి.. కిటికీలు, తలుపులు పగులగొట్టి పెట్రోల్ పోసి దహనం చేయడంతో ఫర్నిచర్ కాలిపోయింది. అయితే, ఈ ఘటన వెనుక బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఉన్నారని గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. కాగా, ఇంటి నిప్పు పెట్టిన సమయంలో జనార్థన్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో గాలి జనార్థన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, జనవరి ఒకటో తేదీన గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై విచారణ జరుగుతుండగానే బళ్లారిలోని గాలి జనార్ధన్ రెడ్డి మోడల్ హౌస్‌కు నిప్పు పెట్టడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై స్థానిక బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కేరళపై బీజేపీ మాస్టర్ ప్లాన్.. మోదీ గ్యారంటీ అంటూ..
తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రం కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఇది వికసిత కేరళ సమయం.. రానున్నది ఎన్డీఏ ప్రభుత్వానికి సమయం అంటూ వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘కేరళలో అవినీతి అభివృద్ధిని తీవ్రంగా అడ్డుకుంది. ఎల్డీఎఫ్ హయాంలో బ్యాంకుల్లో జమ చేసిన పొదుపు కూడా ప్రభావితమైంది. సహకార బ్యాంకు కుంభకోణం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బు దోపిడీకి గురైంది. బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి. దోపిడీదారుల నుండి ప్రతి రూపాయిని తిరిగి తీసుకునేలా మేము చూస్తాం. అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)ల అవినీతిని అంతం చేస్తాం. రాబోయే ఎన్నికలు రాష్ట్ర పరిస్థితులను మార్చేస్తాయి. ఇప్పటివరకు మీరు ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌ల పాలన మాత్రమే చూశారు. అవి రాష్ట్రాన్ని నాశనం చేశాయి. మూడోవైపు ఉంది. అది బీజేపీ అభివృద్ధి, సుపరిపాలనను అందిస్తుంది. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకి వేర్వేరు జెండాలు ఉన్నప్పటికీ.. వాటి అజెండా ఒక్కటే. అదే అవినీతి, జవాబుదారీతనం లేకపోవడం. ఇప్పుడు ప్రజల అభివృద్ధికి తోడ్పడే ప్రభుత్వం అవసరం, ఆ పని మేం చేస్తాం. కేరళ ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచి.. మాతో చేతులు కలపాలి అని కోరారు.#WATCH | Thiruvananthapuram, Kerala: At a BJP rally, PM Modi says, "The upcoming elections will be the ones to change the condition and direction of Kerala. When it comes to the future of Kerala, you have seen just two sides so far. On one side, there is LDF, and on the other… pic.twitter.com/DmLIEmghQV— ANI (@ANI) January 23, 2026ఇదే సమయంలో శబరిమల ఆలయంలో బంగారు చోరీ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. మొత్తం దేశానికి, మనందరికీ అయ్యప్ప స్వామిపై అచంచలమైన విశ్వాసం ఉంది. అయితే, ఎల్డీఎఫ్ ప్రభుత్వం శబరిమల ఆలయ సంప్రదాయాలను దెబ్బతీయడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు, ఇక్కడ బంగారం దొంగతనం జరిగినట్లు నివేదికలు వస్తున్నాయి. స్వామివారి పక్కనుండే ఆలయం నుండి బంగారం దొంగిలించబడినట్లు నివేదికలు వస్తున్నాయి. నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. కేరళలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరుగుతుంది. దోషులను జైలుకు పంపిస్తాం. దీనిపై విచారణ జరిగేలా చూడటం ‘మోదీ గ్యారెంటీ’ అని పేర్కొన్నారు.కాగా, కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ భారీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ కేరళలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికలలో బీజేపీ.. 45 సంవత్సరాల తర్వాత ఎల్డీఎఫ్ నుండి తిరువనంతపురం కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ప్రధాని ఈ విజయాన్ని అసాధారణమైనదిగా, చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఇది కేరళలో బీజేపీ ప్రభుత్వానికి పునాది వేసిందని అన్నారు. ఇక, కేరళ అసెంబ్లీలోని 140 స్థానాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. -
ఎమ్మెల్యే కామినేని ఓవరాక్షన్.. షాకిచ్చిన కొల్లేరువాసులు
సాక్షి, ఏలూరు: కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్యే కామినేనిపై కొల్లేరు వాసులు తిరగబడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కామినేని శ్రీనివాస్‌ను ప్రజలు నిలదీశారు. దీంతో, అసహనానికి గురైన ఎమ్మెల్యే.. ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల మేరకు.. ఎన్నికల ముందు కూటమి అధికారంలోకి వస్తే కొల్లేరు స్థానికులకే ఇచ్చేస్తామని కామినేని శ్రీనివాస్, కూటమి నేతలు.. స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తాజాగా కొల్లేరు ప్రాంతానికి వెళ్లడంతో స్థానికులు హామీ విషయమై నిలదీశారు. చెరువుల విషయంలో ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ కామినేనితో స్థానికులు చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమకు ఏం చేశారంటూ కామినేనిని కొల్లేరు వాసులు నిలదీశారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో తాము ఎలాంటి ఇబ్బంది పడలేదని కొల్లేరు వాసులు చెప్పుకొచ్చారు. అనంతరం, చెరువుల విషయంలో కామినేనిని నిలదీయడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. కొల్లేరు వాసులపై అసహనం వ్యక్తం చేశారు. నేను పట్టించుకోను ఎక్కడికి వెళ్తారో వెళ్లండి.. ఓవరాక్షన్ చేశారు. నోరు మూయండి అంటూ కొల్లేరు వాసులపై నోరు పారేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి.. ఇలా మాట్లాడటం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. -
దావోస్.. డెస్టినేషన్ మీటింగ్ అడ్డలా మారింది: రామచందర్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కావాలని బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్ రావు. సింగరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అవకతవకలపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు దావోస్ వెళ్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ తీరుపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించి నాలుగు నెలలు పూర్తి, అనుబంధ విభాగాల పనితీరుపై ఆయన సమీక్ష చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర కమిటీ పనితీరుపై రామచందర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం, రామచందర్ రావు మాట్లాడుతూ.. బీజేపీ అగ్రనేతలతో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున ఐదు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నాం. జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ లాంటి వారి సభల కోసం బీఎల్ సంతోష్‌కి ప్రతిపాదనలు పంపాం అని అన్నారు.ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ..‘సింగరేణి నైనీ కోల్ టెండర్ల విషయంలో రాష్ట్రం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉంది. సీబీఐకి ఇస్తే 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరగాలన్నది బీజేపీ డిమాండ్. దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ లాస్ట్ టైం వెళ్లినప్పుడు తెచ్చిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో చూపెట్టాలి. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలి. దావోస్ వెళ్లి చేస్తున్నారు?. మంచు చూడటానికి వెళ్లారా?. దావోస్ డెస్టినేషన్ మీటింగ్ అడ్డలా మారింది. పెట్టుబడులు తేవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. రెండు దావోస్ పర్యటనల్లో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యం చెందాయి కాబట్టి ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. -
సింగరేణిపై వ్యాఖ్యలు.. కిషన్‌రెడ్డికి మహేష్ గౌడ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. సింగరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాసేపటి క్రితమే బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటరిచ్చారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ..‘కిషన్ రెడ్డి పలుకులు బీఆర్ఎస్ నేతలవి. కేటీఆర్, హరీష్ దారిలో కిషన్ రెడ్డి ఉన్నారు. గనుల శాఖ మంత్రిగా ఉన్నారు కదా విచారణ జరపమనండి.. ఎవరు వద్దన్నారు. టెండర్ల అవకతవకలపై చర్చకు రండి. ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే నిజాలపై చర్చకు రండి. గత బీఆర్ఎస్ హయంలో అవకతవకలపై దర్యాప్తు అవసరం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పారదర్శకత వచ్చింది’ అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు కిషన్ రెడ్డి టెండర్ల విషయమై సంచలన ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ తరహాలోనే పనిచేస్తోందన్నారు. టెండర్ల విషయాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని నివేదికలు వస్తున్నాయి. ఎక్కడా లేని సైట్ విజిట్ అనే కొత్త నిబంధన పెట్టారు. రాష్ట్ర పెద్దల ఆదేశంతోనే ఇది జరిగింది. దేశంలో అనేక గనులను కేంద్రం పారదర్శకంగా వేలం నిర్వహిస్తోంది. తెలంగాణ చేతిలో ఒక్క నైనీ కోల్ బ్లాక్ పెడితే అక్రమాలకు తెర లేపారు. ఈ వివాదంలోకి నన్ను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సింగరేణిని బంగారు బాతుగా కాంగ్రెస్ చూస్తోంది. సింగరేణి బొగ్గు క్వాలిటీ పడిపోయింది. దీనిపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సింగరేణిని కలుషితం చేశాయి. సింగరేణి భవిష్యత్ అంధకారంగా మారే పరిస్థితి ఉంది. అనేక జిల్లాలో సింగరేణి భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికి నచ్చిన విధంగా వారికి భూములు ఇస్తున్నారని అన్నారు. -
బీఆర్ఎస్, ఎంఐఎంపై కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం మీద కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. నీతి ఆయోగ్ సూచనలతో కొత్త ఉపాధి హామీ పథకంలో మార్పులు తెచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో బీఆర్ఎస్, ఎంఐఎంపై సంచలన విమర్శలు గుప్పించారు. ఎంఐఎం సూచనలు బీజేపీకి అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఉపాధి హామీ కొత్త చట్టంతో ఈ పథకంలో సాంకేతికత ఉపయోగించాం. పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చాం. వంద రోజుల పని దినాలను 125కి పెంచాం. వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నాం. వ్యవసాయ పీక్ సీజన్లో కూలీల కొరత లేకుండా ఈ పథకంతో లబ్ది జరుగుతుంది. వ్యవసాయ సీజన్ లేనప్పుడు 125 పని దినాలు దొరికేలా కొత్త చట్టం చేశాం. రాష్ట్రాలకి అదనపు భారం వేయడమే కాదు.. కేంద్రం కూడా అదనంగా ఖర్చు పెడుతుంది. కేంద్రం కూడా 340 కోట్లు లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ రాష్ట్రానికి వస్తాయి.కూలీల పేరుతో నకిలీ జాబ్ కార్డులు తయారు చేసే దళారీ వ్యవస్థను నిర్మూలించడం జరిగింది. నీతి ఆయోగ్ సూచనలతో కొత్త ఉపాధి హామీ పథకంలో మార్పులు చేశాం. పథకాన్ని నీరుగార్చడం కాదు పటిష్ఠం చేశాం. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. రాష్ట్రాలు కూడా బాధ్యత కూడా తీసుకోవాలి. కాంగ్రెస్ దేశంలో రెండు మూడు చిన్న రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది అని చెప్పుకొచ్చారు.బీఆర్ఎస్కు కౌంటర్..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి..‘బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి చూపించాం కదా. గాలివాటం అయితే దేశంలో మూడు సార్లు అధికారంలోకి వస్తామా?. మళ్లీ గెలిచి దేశంలో ప్రధానిగా మోదీ అధికారంలోకి వస్తారు. ఎవరిది గాలివాటమో ప్రజలకు తెలుసు’ అని అన్నారు.ఎంఐఎంపై వ్యాఖ్యలు..పాకిస్తాన్లో హిందువులు లేకుండా చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దేశంలో హిందువులు లేకుంటే ప్రజాస్వామ్యం ఉండదు. ముస్లిం మహిళ ప్రధాని కావాలని ఎంఐఎం నేత అనడంలో ఉద్దేశం ఏంటి?. దేశ ప్రజలను భయపెట్టే చర్యగా ఎంఐఎం నేతలు ఉన్నారు. అవగాహన లేకుండా దుందుడుకుగా వ్యవహరించడం అసద్‌కు అలవాటు. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాదులను మట్టుపెట్టారు. దేశం అభివృద్ధి చేసుకోవాలనే దృష్టి పెట్టాం. దేశ రక్షణకు మోదీ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎంఐఎం సూచనలు మాకు అవసరం లేదు అని ఘాటుగా విమర్శలు చేశారు. -
బీజేపీ Vs కాంగ్రెస్.. యాదగిరిగుట్టలో ఉద్రిక్తత
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్టలో రెండు గంటలుగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ స్థలం విషయంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. ఇరు వర్గాల మధ్య మాటా మాట పెరగడంతో ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు గాయలైనట్టు తెలుస్తోంది.వివరాల మేరకు.. యాదగిరిగుట్టలో ఓ వ్యక్తికి చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌కు బీజేపీ కార్యకర్తలు వెళ్లారు. ఇదే సమయంలో పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుపడ్డారు. దీంతో, ఇరు వర్గాల మధ్య మాటా మాట పెరగడంతో ఘర్షణ చోటుచేసుకుంది.ఈ క్రమంలో పరిస్థితి చేయి దాటిపోవడంతో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘర్షణలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలైనట్టు తెలిసింది. కాంగ్రెస్ నేత భరత్ అనుచరులు దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ శ్రేణుల ఆందోళనకు దిగాయి. దీంతో, బలవంతంగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
నాగరికతకు నిలువెత్తు నిదర్శనం
వెరావల్(గుజరాత్): గతంలో విదేశీ రాజుల దండయాత్రల్లో పలుమార్లు ధ్వంసమైనాసరే తెగించి నిలబడిన భారతదేశ నాగరికతకు సోమనాథ్ ఆలయం నిదర్శనమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మూడ్రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం గిర్ సోమనాథ్ జిల్లాలోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ఛైర్మన్ హోదాలో ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మోదీ తన సామాజిక మాధ్య ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ నాగరికత, తెగువకు నిదర్శనంగా భాసిల్లుతున్న సోమనా థ్ ఆలయాన్ని దర్శించుకోవడం నిజంగా నాకు దక్కిన భాగ్యం. 1026లో తొలిదాడి మొ దలు శతాబ్దాల కాలంలో ఎన్నో సార్లు విదేశీ రాజుల దాడులకు గురైనా సరే చెక్కుచెదరక భారతీయ నాగరికతా తెగువ నిదర్శనంగా నిలబడింది. ఇంతటి గొప్ప ఆలయంలోకి నాకు సాదర స్వాగతం పలికిన స్థానికులకు నా కృతజ్ఞతలు’’ అని మోదీ అన్నారు. సోమనాథ్ ఆలయం తొలిసారిగా మొహమ్మద్ గజనీ సారథ్యంలో 1026 ఏడాదిలో దాడికి గురై 1,000 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సోమనాథ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో పాల్గొనేందుకు మోదీ విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీ సోమ నాథ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్ హోదాలో సర్క్యూ ట్ హౌస్‌లో బోర్డ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, డెప్యూ సీఎం హర్‡్ష సంఘ్వీ, ఇతర ట్రస్టీలు, అధికారులు పాల్గొన్నా రు. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే వేలాది మంది భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కల్గకు ండా ఏర్పాట్లుచేయాలని అధికారులకు సూచి ంచారు. ఆలయ ప్రాంగణంలో మరమ్మతుల, ఆధునీకరణ, మౌలకవసతుల మెరుగు తదితర పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. #WATCH | Gujarat | Fireworks illuminate the night sky above Somnath Temple as the 72-hour 'Aum' chanting continues in the background during the ongoing Somnath Swabhiman Parv.Source: DD pic.twitter.com/bOkFqu5hbG— ANI (@ANI) January 10, 2026ఆకట్టుకున్న డ్రోన్ షో...తర్వాత సాయంత్రం ఆలయం ప్రాంగణంలో ఓంకార మంత్రాన్ని పఠించే కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత రాత్రి చిమ్మచీకట్లో అరేబియా సముద్రంపై వినువీధిలో 3,000 చిన్నపాటి డ్రోన్లతో ఏర్పాటుచేసిన షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సౌర మండలం, సోమనాథ్ ఆలయం, భారీ శివలింగం, త్రిశూలం, ఢమరుకం ఆకృతుల్లో డ్రోన్లు ఎగిరి అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. స్వాభిమాన్ పర్వ్ ఆదివారందాకా కొనసాగనుంది. ఆదివారం ఉదయాన్నే ఇక్కడ జరిగే శౌర్యయాత్రలో మోదీ పాల్గొంటారు. సోమనాథ్ ఆలయాన్ని కాపాడే క్రమంలో వీరమరణం పొందిన వాళ్లకు మోదీ నివాళులర్పిస్తారు. వీరుల త్యాగానికి ప్రతీకగా 108 అశ్వాలతో ర్యాలీ చేపట్టనున్నారు. పలు కార్యక్రమాలతో మోదీ బిజీ..తర్వాత మోదీ ఒక ప్రజాకార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మోదీ రాజ్‌కోట్‌కు వెళ్తారు. అక్కడ కఛ్, సౌరాష్ట్ర ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫెరెన్స్ సదస్సులో ప్రసంగిస్తారు. తర్వాత అక్కడి పారిశ్రామిక ఉత్పత్తుల వస్తు ప్రదర్శనశాలను ఆవిష్కరి స్తారు. తర్వాత గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ ప్రాంగణంలో 14 గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ ఎస్టేట్లు, వైద్య ఉపకరణాల పార్క్ అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. తర్వాత సాయంత్రం అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడ సెక్టార్ 10ఏ నుంచి మహాత్మా మందిర్ వరకు నిర్మించిన అహ్మదాబాద్ మెట్రో ఫేస్2ను ప్రారంభిస్తారు.#WATCH | Gujarat | PM Narendra Modi, Gujarat CM Bhupendra Patel, and Dy CM Harsh Sanghavi attend the drone show being organised as part of the Somnath Swabhiman Parv at the Somnath Temple.Source: DD pic.twitter.com/aCmBiqEcBB— ANI (@ANI) January 10, 2026 -
ముంబై మేయర్ పీఠం.. ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ముంబై మేయర్ స్థానం కోసం అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార మహాయుతి కూటమి నుంచే మేయర్ వస్తారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మేయర్ ఎంపిక విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ..దేశం ముందు అనే భావజాలాన్ని బీజేపీ అనుసరిస్తుంది. ముంబై మేయర్ సీటు మరాఠీ హిందువులకు రిజర్వ్ చేయబడింది. చెన్నైలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే అక్కడి ప్రజలు సహజంగానే మేయర్ తమిళుడు కావాలని చెబుతారు. అదేవిధంగా ముంబైలో కూడా మేయర్ మరాఠీ వ్యక్తే అవుతారు. మహాయతి కూటమి నుంచే ముంబై మేయర్ వస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను హిందువునని.. మరాఠీ వ్యక్తిగా గర్విస్తున్నానని.. మరాఠీల్లో ఎలాంటి వివక్ష లేదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారంతా ముంబై వాసులేనని పేర్కొన్నారు. ఒక్క బంగ్లాదేశీయుడిని కూడా ఇక్కడ నివసించడానికి అంగీకరించబోమని తేల్చి చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.అయితే, అంతకముందు మహారాష్ట్రకు చెందిన ఎంఐఎం నాయకుడు వారిస్ పఠాన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ముంబై మేయర్ పీఠం ఎంఐఎం పార్టీదేనని అన్నారు. ముంబై మేయర్‌గా ముస్లిం వ్యక్తే ఉంటారని వ్యాఖ్యనించారు. ఈ నేపథ్యంలోనే ఫడ్నవీస్ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇదే సమయంలో ఢిల్లీ, ముంబై ట్రాఫిక్ విషయమై ఫడ్నవీస్ స్పందించారు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఢిల్లీ ట్రాఫిక్ కంటే ముంబై ట్రాఫిక్ చాలా బెటర్. ఇక్కడ ఎవరూ లైన్లను బ్రేక్ చేయరు. ముంబై ప్రజలు చాలా క్రమశిక్షణతో ఉంటారని.. ట్రాఫిక్ నియమాలు చాలా ఓపికగా పాటిస్తారని పేర్కొన్నారు. ఢిల్లీలో రోడ్లపై కార్లు నలిగిపోవడం, కొన్ని సార్లు పక్కకు నెట్టేస్తారని.. అలాంటి పరిస్థితి ముంబైలో ఎక్కడా కనిపించదన్నారు. సబర్బన్ రైల్వే నుంచి మెట్రో వరకు అన్ని వ్యవస్థలు మెరుగ్గా ఉన్నాయని స్పష్టం చేశారు. మొత్తం ప్రయాణాన్ని ఒకే యాప్‌లో ప్లాన్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఒకే టికెట్‌తో ఎవరైనా ఏదైనా ప్రజా రవాణాను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.ఇదిలా ఉండగా.. ముంబైలో ఈనెల 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జనవరి 16న విడుదల కానున్నాయి. ఎన్నికల కోసం థాక్రే సోదరులు బరిలోకి దిగగా… మహాయతి కూటమి బరిలో ఉంది. రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మేయర్ స్థానం ఎవరిదో అనే ఆసక్తి నెలకొంది. -
తమిళ రాజకీయం.. టీవీకే విజయ్‌పై బీజేపీ బిగ్ ప్లాన్?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాట రాజకీయం ములుపులు తీరుతోంది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)(TVK Vijay) పార్టీతో పొత్తు కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇక, కాంగ్రెస్ పార్టీ మా సహజ మిత్రుడు అంటూ ఇటీవల టీవీకే జాతీయ ప్రతినిధి వ్యాఖ్యలు చేసిన వేళ.. బీజేపీ రంగంలోకి దిగింది. టీవీకేతో పొత్తు గురించి బీజేపీ నేతలు సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న తమిళనాడుపై (Tamil Nadu Politics) బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలతో పాటు అక్కడి అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పాటు ప్రాంతీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక, తమిళనాడులో కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన టీవీకే విజయ్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా ప్రజాక్షేత్రంలోకి వచ్చిన విజయ్ తన పార్టీని గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ పార్టీలు విజయ్ పార్టీపై ఫోకస్ పెట్టినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.బీజేపీ ప్లానేంటి? విజయ్ నేతృత్వంలోని టీవీకే తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుండటం అందరూ గమనిస్తున్నారు. ఈ క్రమంలో టీవీకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలను ఇప్పుడు బీజేపీ పరిశీలిస్తోంది. ఇదే సమయంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడాలని కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇక తన పర్యటనలో అమిత్ షా ఉద్దేశపూర్వకంగానే ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామిని కలవకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఎన్డీఏ కూటమి కేవలం ఒక పార్టీకే పరిమితం కాదని.. డీఎంకే పార్టీని ఎదుర్కొనేందుకు అన్ని శక్తులను ఏకం చేయాలనే బలమైన సందేశాన్ని అమిత్ షా తన మిత్ర పక్షాలకు పంపించారు. అలాగే, జనవరి 14వ తేదీన వచ్చే పొంగల్ (సంక్రాంతి) నాటికే మహాకూటమి రూపకల్పనపై స్పష్టత రావాలని అమిత్ షా.. తమిళనాడు బీజేపీ కార్యవర్గాన్ని ఆదేశించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా ముందే ప్రారంభించాలని సూచించారు.అయితే ఇప్పటికే తాము సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్న టీవీకే పార్టీ.. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఆసక్తి చూపిస్తోంది. మరోవైపు.. ప్రస్తుత తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం అధికార డీఎంకే పార్టీకి అనుకూలంగా ఉంది. టీవీకే పార్టీ ఏర్పాటు తర్వాత విజయ్ తమిళనాడులోని అధికార డీఎంకేను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలంటూ పలుమార్లు కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, విజయ్ మధ్య గ్యాప్‌ను ఉపయోగించుకుని టీవీకేను తన వైపు తిప్పుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.టీవీకే నేత సంచలన ప్రకటన..!ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ తమ సహజ మిత్రుడు అంటూ ఇటీవల టీవీకే జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లౌకికవాదం, మతత్వానికి వ్యతిరేకంగా వారి వైఖరి విషయంలో కాంగ్రెస్, టీవీకే సహజ మిత్రపక్షాలు. ఆ కోణంలో మేము ఎల్లప్పుడూ సహజ భాగస్వాములమై రాహుల్ గాంధీ, మా నాయకుడు విజయ్ కూడా స్నేహితులే అనే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో విజయ్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. రాజకీయంగా వ్యూహత్మకంగా ముందుకెళ్లే బీజేపీ.. టీవీకే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. మొత్తంగా తమిళ రాజకీయం పొలిటికల్ హీట్‌ను పెంచుతోంది. -
కవిత పార్టీతో నష్టం ఏమీ లేదు: రాంచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కల్వకుంట్ల కవిత పార్టీ ఏర్పాటుపై రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. కవిత పార్టీ పెట్టుకుంటే మారేది ఏమీ లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై కవిత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ వేయాలి. ఆరోపణలు చేసిన కవిత.. తన వద్ద ఉన్న ఆధారాలను ఆ కమిషన్‌కు ఇవ్వాలి. ఇన్నాళ్లు అవినీతిలో అంటకాగి పంపకాల్లో తేడాలతోనే కవిత బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారు. లిక్కర్ వ్యాపారం చేసి కవిత జైలుకు వెళ్లారు. లిక్కర్ కేసులో డబ్బులు సంపాదించారు.కవిత జైలుకు వెళ్లితే బీజేపీకి ఎం సంబంధం?. తప్పుచేసిన వారిని పార్టీలు జైలులో వేయవు. దర్యాప్తు సంస్థలు వేస్తాయి. కవితకు మాత్రమే ఆత్మగౌరవం ఉందా? తెలంగాణ ప్రజలకు లేదా?. ఆమె ఆత్మగౌరవం ఎలా దెబ్బతిందో అనేది వాళ్ల కుటుంబ అంశం మాత్రమే. ఇన్నాళ్లు వాళ్లతో ఉన్నప్పుడు కవిత ఎందుకు మాట్లాడలేదు. ఉద్యమ ద్రోహులు బీఆర్ఎస్లో చేరారని మేము మొదటి నుంచి చెప్పాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్/వైఎస్సార్: వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని(Sudheer Reddy) తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి.. హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. దీంతో, నార్సింగి పోలీసులు.. సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్టు చేయడంతో పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో శనివారం ఈగల్ టీమ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తన ఇంట్లోనే డ్రగ్స్(గంజాయి) సేవిస్తున్న కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. దీంతో, సుధీర్‌కు డ్రగ్స్ టెస్టులు చేయగా పాజిటివ్‌గా తేలింది. అనంతరం, సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి.. డీఅడిక్షన్ సెంటర్‌కు పంపించారు. ఈ క్రమంలో సుధీర్‌తో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇక, గతంలో కూడా సుధీర్ రెడ్డి రెండు సార్లు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడటం గమనార్హం. ఇదిలా ఉండగా.. సుధీర్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. డ్రగ్స్ కేసు నుంచి తప్పించేలా ఏపీ ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. -
సీఎంపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ అభ్యర్థికి బిగ్ షాక్
ముంబై: మహారాష్ట్రలో పూణే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ మహిళా అభ్యర్థి గతంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, సీఎం భార్యపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, బీజేపీ హైకమాండ్ ఒత్తిడితో సదరు మహిళా అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది.వివరాల మేరకు.. పూణేలో మన్సిపల్ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కోటా కింద వార్డ్ నంబర్-2 నుంచి పూజా మోర్ జాదవ్ పోటీలో నిలిచారు. బీజేపీ మద్దతుతో ఆమెకు ఏబీ ఫారమ్ కేటాయించారు. దీంతో, ఆమె నామినేషన్ సైతం దాఖలు చేశారు. అయితే, రెండు రోజుల క్రితం అనూహ్యంగా ఆమెకు సంబంధించిన పలు పాత వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. గతంలో మరాఠా విషయంలో ఆందోళనల్లో ఆమె పాల్గొన్నారు. ఆ సమయంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, సీఎం భార్యపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోలు తాజాగా వైరల్ కావడంతో స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. దీంతో, బీజేపీ హైకమాండ్ నిర్ణయం మేరకు ఆమె తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు.BJP Order Forces Pooja More to Withdraw Candidature; Breaks Down in TearsAfter receiving the BJP’s directive to withdraw her candidature, young leader Pooja More became emotional and broke down, saying she had worked hard and proved her capability, but the party’s strategic… pic.twitter.com/oej13BLK8V— Pune Mirror (@ThePuneMirror) January 1, 2026అనంతరం, ఈ వివాదంపై ఆమె స్పందిస్తూ..‘కొందరు వ్యక్తులు నా గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. నేను బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మను అని చిత్రీకరించడానికి ప్రయత్నించారు. బీజేపీ నేతల విమర్శల కారణంగా నా నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. వీడియోలలో కనిపించే వ్యాఖ్యలు నేను చేయలేదు. ఎవరో మహిళ చేసిన వ్యాఖ్యలను నాపై తప్పుగా ఆపాదించారు. నేను పోలీసుల లాఠీఛార్జీలు, క్రిమినల్ కేసులను కూడా ఎదుర్కొంటున్నాను. తరచుగా కోర్టుకు సైతం వెళ్లాల్సి వస్తోంది. చట్టపరమైన కేసులను ఎదుర్కోవడానికి నా దగ్గర డబ్బు కూడా లేని సందర్భాలు ఉన్నాయి. ఒక ప్రధాన రాజకీయ పార్టీ నుండి టికెట్ పొందడం నాలాంటి అట్టడుగు స్థాయి కార్యకర్తకు అరుదైన అవకాశం. కానీ, ఇలా జరగడం దురదృష్టకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. మరుసటి రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. She is "Pooja Jadhav" a BJP Candidate in PMCFor Her Terrorists Has No Religion & Now She Awarded BJP Ticket To Fight Municipal Election@BJP4India @BJP4Maharashtra Terrorist Has A Religion & Its IslamIslamic Terrorist Ki!!ed hindus In #PahalgamTerrorAttack#BJP #Congress pic.twitter.com/iTxvwJQUS1— 𝐃𝐢𝐠𝐯𝐢𝐣𝐚𝐲 𝐒𝐢𝐧𝐠𝐡 🇮🇳 (@Knight_riders18) January 1, 2026 -
తెలంగాణపై బీజేపీ ప్రత్యేక వ్యూహం!
తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం బీజేపీ పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో బీజేపీని బలపరిచేందుకు ఆర్ఆర్ఎస్ రంగంలోకి దిగింది. నేడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మరోవైపు, గురువారం హైదరాబాద్‌లో బీఎంఎస్(భారతీయ మజ్దూర్ సంఘ్) కార్యాలయాన్ని సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలె ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్కు బీఎంస్ అనుబంధ సంస్థగా కొనసాగుతోంది.కాగా, తెలంగాణలో ఆర్ఎస్ఎస్ ప్రముఖుల పర్యటనలు ఆసక్తి రేపుతున్నాయి. నగర శివారులోని కన్హా శాంతి వనంలో విశ్వ సేవక్ సంఘ్ శిబిరం గత మూడు రోజులుగా కొనసాగుతోంది. ఈ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరుకానున్నారు. అయితే, తెలంగాణపై ఆర్ఎస్ఎస్, బీజేపీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖుల పర్యటనలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, బీజేపీ బలోపేతంలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ శాఖల పెంపు, కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. 2025లో 392 కొత్త శాఖలను ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 3800 శాఖలు ఉండగా.. 2026 నాటికి 4000 శాఖల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. మరోవైపు.. ‘భాగ్యనగర్’ వంటి పేర్లతో సాంస్కృతిక పునరుద్ధరణకు ప్రయత్నిస్తోంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక రంగంలో ఒక ముఖ్యమైన అంశంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.బీఎంఎస్ ప్రారంభం.. సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలె గురువారం హైదరాబాద్‌లో బీఎంఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఎంఎస్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా అభివర్ణించారు. ఇక, ఆర్ఎస్ఎస్తో అనుబంధంగా కార్మిక రంగంలో ప్రత్యేక శక్తిగా బీఎంఎస్ ఎదుగుతోంది. బీఎంఎస్.. కార్మికుల హక్కులు, జాతీయ ప్రయోజనం, స్వదేశీ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఉంటుంది. ఇది కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తుంది. కార్మికులకు అవగాహన కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తోంది. కార్మికుల వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతపై ఫోకస్ చేస్తుంది.అలాగే, స్వదేశీ ఉత్పత్తులకు మద్దతుగా స్వదేశీ జాగరణ కార్యక్రమాలు చేపట్టింది. ఆర్ఎస్ఎస్ మద్దతుతో బీఎంస్కు రాజకీయ, సామాజిక స్థాయిలో విస్తృత ప్రభావం ఉంది. దీంతో, తెలంగాణ కార్మిక సంఘాల విషయంలో బీఎంస్ కొత్త ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ బలోపేతంగా దిశగా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నట్టు పొలిటికల్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
‘రుషికొండ’పై మా అభిప్రాయాలు తీసుకోలేదు: విష్ణుకుమార్ రాజు
సాక్షి, ఏయూ క్యాంపస్: రుషికొండ భవనాలపై బీజేపీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం బీచ్‌రోడ్డులోని మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. రుషికొండ భవనాల వినియోగంలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోవాలని కోరారు. రుషికొండను ఆదాయ వనరుగా చూడకూడదన్నారు. ఈ భవనాలను స్టార్ హోటల్స్‌కు ఇచ్చి సామాన్యులకు దూరం చేయవద్దని కోరారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీ పరంగా మాట్లాడటం లేదన్నారు. విశాఖ అంటే సాఫ్ట్వేర్ పెట్టుబడులే కాదని, ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలని అన్నారు. రుషికొండ భవనాల గురించి పునరాలోచించాలని సూచించారు. మంత్రుల కమిటీ తమ అభిప్రాయాలు తీసుకోలేదన్నారు. తనను కానీ, ఇతర ఎమ్మెల్యేలను కానీ ఎవరూ అభిప్రాయం అడగలేదన్నారు.ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని చెప్పారు. మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేస్తామనడం తగదన్నారు. బడా హోటల్స్‌కు ఈ భవనాలు ఇవ్వాలని నిర్ణయించిన విషయం వార్తాపత్రికల్లోనే తెలుసుకున్నానని తెలిపారు. ఈ భవనాలను టీటీడీకి ఇచ్చి వివాహ వేదిక నిర్మించి, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు తెలిపే వేదికగా నిలపాలని విష్ణుకుమార్ రాజు సూచించారు. -
రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర: రాహుల్ ఆరోపణ
బెర్లిన్: జర్మనీలోని బెర్లిన్‌లో గల హెర్టీ స్కూల్ విద్యార్థులతో జరిగిన సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ సమాన హక్కులు కల్పించే భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల మధ్య, భాషల మధ్య, మతాల మధ్య ఉన్న సమానత్వ భావనను దెబ్బతీస్తూ, రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను బీజేపీ కాలరాస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఒక గంట నిడివి గల వీడియోను విడుదల చేసింది.ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఇది కేవలం భారతీయుల ఆస్తి మాత్రమే కాదని, ప్రపంచ సంపద అని రాహుల్ అభివర్ణించారు. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న ఏ దాడి అయినా, దానిని అంతర్జాతీయ ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగే దాడిగానే పరిగణించాలని రాహుల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని రాజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లోకి తీసుకుని, రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు, వాటిని ఆయుధాలుగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. This battle is no longer just about elections. It’s about protecting the foundation of our Constitution and Democracy - One Person, One Vote. pic.twitter.com/QjecwCtjxr— Congress (@INCIndia) December 22, 2025దేశంలోని దర్యాప్తు సంస్థలైన ఈడీ (ఈడీ), సీబీఐ (సీబీఐ)ల పనితీరును రాహుల్ తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో కాంగ్రెస్ ఈ సంస్థలను నిర్మించడంలో సహకరించినప్పటికీ, బీజేపీ మాత్రం వాటిని తమ సొంత ఆస్తులుగా వాడుకుంటూ, ప్రతిపక్షాలపై రాజకీయ కేసులు పెడుతోందని విమర్శించారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని తాము నిరూపించామని, అలాగే మహారాష్ట్ర ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయని తాము భావించడం లేదని రాహుల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఆర్థిక నమూనాపై కూడా రాహుల్ విమర్శలు గుప్పించారు. మన్మోహన్ సింగ్ కాలం నాటి ఆర్థిక విధానాలనే బీజేపీ ముందుకు తీసుకెళ్తోందని, ప్రస్తుత మోదీ ఆర్థిక విధానం పూర్తిగా నిలిచిపోయిందని రాహుల్ అన్నారు. దేశంలోని సంస్థాగత వ్యవస్థపై జరుగుతున్న ఈ దాడిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఒక బలమైన ప్రతిఘటన వ్యవస్థను రూపొందిస్తున్నాయన్నాయన్నారు. కేవలం ఎన్నికల లోపాలను ఎత్తిచూపడమే కాకుండా గెలుపు వైపు నడిచే పద్ధతిని సిద్ధం చేస్తున్నామని రాహుల్ పేర్కొన్నారు.ఇండియా కూటమి పార్టీల మధ్య వ్యూహాత్మక విభేదాలు ఉన్నప్పటికీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఎదుర్కోవడంలో, రాజ్యాంగాన్ని రక్షించడంలో తామంతా చాలా ఐక్యంగా ఉన్నామని రాహుల్ గాంధీ తెలిపారు. పార్లమెంటులో ప్రతిరోజూ ప్రతిపక్షాల ఐక్యత కనిపిస్తున్నదని, తమకు సమ్మతం లేని చట్టాలపై బీజేపీని గట్టిగా నిలదీస్తామని రాహుల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: బోండి బీచ్ ఎఫెక్ట్.. ‘గన్ బైబ్యాక్’ సంచలనం! -
కమలదళంలో మిశ్రమ స్పందన
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై కమల దళంలో మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 200 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించడంపై బీజేపీ నాయకులు ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. పార్టీ బలం పెరుగుతోందని ప్రస్తుతం ఉన్న భావనకు అనుగుణంగా, ఆశించిన ఫలితాలు రాలేదనే అభిప్రాయం మరోవైపు విన్పిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే, లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీ, కౌన్సిల్ ఎన్నికల్లో మూడింట్లో రెండు సీట్లు గెలుపొందాక.. ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత క్రమంగా పెరుగుతోందని రాష్ట్ర నేతలు అంచనా వేశారు. అయితే ఈ పరిస్థితులకు తగ్గట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ విస్తరణ జరుగుతోందా లేదా అన్న సందేహాలు కొందరిలో వ్యక్తమౌతున్నాయి.ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే వివిధ ఎన్నికల్లో గెలిచినంత స్థాయిలో గ్రామాల్లో పార్టీకి ఆశించిన ప్రాతినిధ్యం రాలేదని అంటున్నారు. సానుకూలంగా చూడాలి.. గ్రామ పంచాయతీ ఎన్నికలనేవి పార్టీ రహితంగా, రాజకీయ పార్టీల ఎన్నికల చిహ్నాలు లేకుండా జరిగేవే అయినా, గ్రామాల్లో మద్దతుదారులను, కార్యకర్తలు, నాయకులను పార్టీలు వెనుకనుంచి బలపరుస్తాయనే విషయం తెలిసిందే. కాగా పార్టీలు క్షేత్రస్థాయిలో బలపడేందుకు, విస్తరణకు ఈ ఎన్నికలు కీలకమనే విషయం కూడా ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయినా బీజేపీ ఈ విషయాన్ని కాస్త తేలిగ్గా తీసుకుందని, ముఖ్యంగా నామినేషన్ల దాఖలుకు ముందు జిల్లా, మండల నాయకులతో రాష్ట్ర నాయకత్వం పెద్దగా సమన్వయంతో వ్యవహరించిన దాఖలాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అయితే ఈ ఎన్నికల బాధ్యత అంతా స్థానిక నేతలకే అప్పగించడంతో రాష్ట్ర పార్టీ నుంచి సమన్వయం, పర్యవేక్షణ అనేది నామమాత్రమై పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అన్ని చోట్లా పోటీ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు ప్రకటించారు. స్థానిక నేతలను సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిపించుకోవాలని, అన్ని స్థాయిల్లో సమన్వయంతో పని చేయాలని సూచించారు. అయితే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదనే విమర్శలు అప్పట్లోనే పార్టీ నాయకుల నుంచే వచ్చాయి.ఇలాంటి పరిస్థితుల్లో మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 200 దాకా సర్పంచ్ పదవులు గెలుచుకోవడాన్ని సానుకూల దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని కొందరు ముఖ్య నేతలంటున్నారు. గ్రామ రాజకీయాల్లో పెరుగుతున్న పార్టీ పట్టుకు ఇది నిదర్శనమని అంటున్నారు. ఇదే తీరున 2,3 దశల పంచాయతీ ఎన్నికల్లోనూ మంచి ప్రదర్శన కనబరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మరింత పట్టు బిగించేందుకు వీలవుతుందని నేతలు విశ్లేషిస్తున్నారు. సమన్వయం లోపించకపోతే మరింత మెరుగైన ఫలితాలు! అదే సమయంలో అన్ని జిల్లాల్లో అన్ని స్థానాలకు పార్టీ పోటీ చేయాలంటూ స్థానిక నేతలకు ఆదేశాలైతే ఇచ్చారు కానీ దాని అమలు గురించి ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలు, వార్డుల్లో పోటీచేసి బలం చాటాలనే పార్టీ ఉద్దేశానికి అనుగుణంగా నామినేషన్లు దాఖలయ్యాయా ? ఆ మేరకు క్షేత్రస్థాయిలో గట్టి ప్రయత్నమేదైనా జరిగిందా అని కొందరు నిలదీస్తున్నారు.పార్టీలో పోటీకి ఆసక్తి చూపేవారిని ప్రోత్సహించడం, అభ్యర్థులను గుర్తించి పోటీకి నిలపడం, పోల్ మేనేజ్మెంట్లో సమన్వయం వంటి అంశాలపై నిర్లక్ష్యం వహించారని అంటున్నారు. పంచాయతీల్లో పోటీకి ఆసక్తి, ఉత్సాహం కనబరిచే వారిని ప్రోత్సహించేందుకు ఈ ఎన్నికలను వినియోగించుకోవాల్సి ఉండగా అది అంతగా జరగలేదని చెబుతున్నారు. ఇవన్నీ సక్రమంగా జరిగి ఉంటే పార్టీ మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని బీజేపీ నేతలు కొందరంటున్నారు. -
ఓట్ చోరీ.. అమిత్ షా ఒత్తిడిలో ఉన్నారు: రాహుల్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాస్త ఒత్తిడితో కనిపిస్తున్నారు అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ చోరీ విషయంలో తాను సవాల్ విసిరినా అమిత్ షా ఎందుకు స్పందించలేదని రాహుల్ ప్రశ్నించారు.కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా మాట్లాడుతూ..‘ఓటు చోరీ అంశంపై నేను ఇప్పటికే మూడు ప్రెస్ కాన్ఫరెన్స్‌లపై పార్లమెంట్లో చర్చించాలని అమిత్ షాకు సవాల్ విసిరాను. అయినా అమిత్ షా నుంచి దానిపై ఎటువంటి సమాధానం రాలేదు. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా అమిత్ షా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారు. నిన్న అమిత్ షా చాలా ఆందోళనగా ఉన్నారు. ఆయన తప్పుడు భాష ఉపయోగించారు. ఆయన చేతులు వణికాయి. అమిత్ షా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఇది నిన్న అందరూ చూశారు.నేను ఆయన్ని అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఎలాంటి రుజువు ఇవ్వలేదు. పార్లమెంట్లో నా మీడియా సమావేశాల్లోని అన్ని అంశాల గురించి చర్చించడానికి నేరుగా క్షేత్రస్థాయికి రావాలని నేను అమిత్ షాకు సవాలు విసిరాను. నాకు ఎలాంటి సమాధానం రాలేదు. అందరికీ వాస్తవమేంటో తెలుసు అని ఆరోపించారు. దీంతో, రాహుల్ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. -
పార్లమెంట్ సమావేశాలు డే-3: రేణుకా చౌదరిపై ఫిర్యాదు
Parliament winter session 2025 Updates..రేణుకా చౌదరిపై చర్యలు తీసుకోవాల్సిందే!రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరిపై ఫిర్యాదుఓ కుక్కను రక్షించి తన కారులో పార్లమెంట్లో తీసుకొచ్చిన కాంగ్రెస్ ఎంపీదీనిపై అధికార పార్టీ నుంచి అభ్యంతరాలు అరిచేవారు.. కరిచేవారు పార్లమెంట్ లోపేల ఉన్నారంటూ వ్యాఖ్య‘మొరుగుడు’ వ్యాఖ్యలపై చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీలుఆమె వ్యాఖ్యలు పెద్దల సభ గౌరవానికి విరుద్ధంగా ఉన్నాయంటూ ఫిర్యాదు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలుమూడోరోజు ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలుసెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీల నిరసన..ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీల నిరసనఆక్సిజన్ మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేసిన ఎంపీలు దీపేందర్ సింగ్ హుడా సహా పలువురు విపక్ష ఎంపీలువాయు కాలుష్యం పైన చర్చించాలని వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన ఎంపీ దీపేందర్ హుడావిపక్షాల ధర్నా..పార్లమెంట్లో లేబర్ కోడ్‌కు వ్యతిరేకంగా విపక్షాల ధర్నాధర్నాలో పాల్గొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కనిమోలి సహా విపక్ష పార్టీ ఎంపీలు కార్పొరేట్లకు అనుకూలంగా లేబర్ కోడ్ చట్టాలను తీసుకొచ్చారని విపక్షాల ఆరోపణలేబర్ కోడ్‌ను ఉపసంహరించుకోవాలని నినాదాలు#WATCH | Delhi | Opposition leaders protest against Labour laws in Parliament premises pic.twitter.com/K8wtZdJtAH— ANI (@ANI) December 3, 2025కాసేపట్లో సమావేశాలు ప్రారంభం..నేడు మూడో రోజు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్‌సభలో ది సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఎస్ఐఆర్పై చర్చకు కేంద్రం అంగీకరించడంతో సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరిస్తామన్న విపక్షాలు .అఖిలపక్ష సమావేశంలో ఎస్ఐఆర్పై చర్చకు అంగీకరించిన ప్రభుత్వండిసెంబర్ 9న ఎన్నికల సంస్కరణలపై చర్చచర్చకు సమాధానం ఇవ్వనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ఎన్నికల సంస్కరణల చర్చలో భాగంగా ఎస్ఐఆర్పై కొనసాగనున్న చర్చచర్చకు 10 గంటల సమయం కేటాయింపుడిసెంబర్ 8వ తేదీన వందేమాతరంపై చర్చవందేమాతరంపై చర్చను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ#WATCH | Delhi | Congress MPs Sonia Gandhi and Priyanka Gandhi Vadra arrive at the Parliament for the third day of the #WinterSession2025 Congress MP Priyanka Gandhi Vadra says, "We should also discuss other things like pollution. We should discuss many other issues which are… pic.twitter.com/idFERZh21O— ANI (@ANI) December 3, 2025 -
ఎస్ఐఆర్పై ఆగని రగడ.. లోక్‌సభ వాయిదా
Parliament Winter Session Updates..లోక్‌సభ వాయిదా.. లోక్‌సభలో ఎస్ఐఆర్పై రగడలోక్సభ మధ్యాహ్నాం 12 గంటలకు వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా.. Lok Sabha adjourned to meet again at 12:00 Noon, after Opposition MPs entered the well of the House demanding a discussion on SIR pic.twitter.com/K2S4Pcu8FX— ANI (@ANI) December 2, 2025పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.రెండో రోజు సందర్భంగా ఎస్ఐఆర్ ప్రతిపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. #WATCH | Delhi | Opposition leaders, including Congress MP Sonia Gandhi, LoP Lok Sabha Rahul Gandhi and LoP Rajya Sabha, Mallikarjun Kharge, hold a protest against SIR in Parliament premises, on the second day of the winter session pic.twitter.com/wJDWl8tk5t— ANI (@ANI) December 2, 2025ఉభయ సభల్లో నిరసనలు.. ఎస్ఐఆర్పై చర్చించాలని రాజ్యసభలో విపక్షాల పట్టు.సభలో విపక్ష నేతల నినాదాలు.ఓట్ చోరీ ప్రభుత్వం అంటూ లోక్‌సభలో విమర్శలు. పార్లమెంట్ లోపల, వెలుపల సభ్యుల నినాదాలు.నిరసనల్లో పాల్గొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, ప్రతిపక్ష నేతలు. అయితే, ఎన్నికల సంస్కరణలపై సిద్ధమన్న కేంద్రం. #WATCH | Opposition MPs raise slogans of "Vote chor, gaddi chhor", raising the issue of SIR and demanding a discussion on it in Lok Sabha, as the House proceedings begin on the second day of the winter session of the Parliament(Video source: Sansad TV/ YouTube) pic.twitter.com/SCr37YmlXh— ANI (@ANI) December 2, 2025 -
‘సర్’పై పట్టు.. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్
పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడిగా.. -
మావోయిస్టుల ఎన్కౌంటర్లు.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో బీజేపీ నేతల విభేదాలు లేనవి క్లారిటీ ఇచ్చారు ఎంపీ ఈటల రాజేందర్. అన్ని పార్టీల్లో అంతర్గత విభేదాలు సాధారణంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో దేశంలో మావోయిస్టుల లొంగుబాటు, ఎన్కౌంటర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టాండే తమ స్టాండ్ అని స్పష్టం చేశారు.బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీలో విభేదాలు లేవు. విభేధాలు అనేవి సోషల్ మీడియా సృష్టి. అంతర్గత విభేదాలు సహాజం, అన్ని పార్టీల్లో ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసి పనిచేస్తాం. హుజురాబాద్‌లో జరిగే సమావేశాలకు నాకు సమాచారం ఉంది. వ్యక్తిగత కారణాలతో అన్ని కార్యక్రమాలకు రాలేకపోయాను’ అని చెప్పుకొచ్చారు. -
‘కాంగ్రెస్ ప్రభుత్వం.. నామినేట్ పోస్టుల్లో అర్బన్ నక్సలైట్లు’
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో అర్బన్ నక్సలైట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం అయ్యారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో నామినేట్ పోస్టుల్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు అంటూ విమర్శలు గుప్పించారు. మావోయిస్టులను అంతం చేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యం అంటూ వ్యాఖ్యలు చేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘అధికారంలో ఉన్నా, లేకున్నా నక్సలైట్ల అణచివేతే మా లక్ష్యం. తుపాకీ గొట్టంతో సాధించేది ఏమీలేదు. పౌరహక్కుల నాయకులే నక్సలిజం అంతరించి పోయిందని ఒప్పుకున్నారు. ఇన్ని రోజులు అమాయక పిల్లలు, యువకులను రెచ్చగొట్టింది అర్బన్ నక్సలైట్లే. వారికి ప్రజల బాధలు తెలియవు. వారిపైన కూడా చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేస్తే నేను భయపడను. తెలంగాణలో అర్బన్ నక్సలైట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం అయ్యారు.జంగల్లో ఉన్న నక్సలైట్లు పని పిల్లలకు తుపాకులు ఇస్తున్నారు. మావోయిస్టులను అంతం చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం. జంగల్ వదిలి, తుపాకులు విడిచిపెట్టి బయటకి రండి. తెలంగాణలోని కాంగ్రెస్ పాలనలో నామినేట్ పోస్టుల్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు. నక్సలిజన్ని ఎవరు ప్రోత్సహించినా వారు నేరస్తులే అవుతారు. మావోయిస్టులకు మద్దతు ఇచ్చే వారిపై కూడా చర్యలు ఉంటాయి అని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా ఎమ్మెల్యే.. రెండు గంటలు డ్యూటీ
బెంగళూరు: బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సురేష్ కుమార్ మంగళవారం ట్రాఫిక్ పోలీస్ అవతార మెత్తారు. నగరంలోని భాష్యం సర్కిల్ దగ్గర రెండు గంటలపాటు ట్రాఫిక్ పోలీస్‌గా విధులు నిర్వహించారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించిన ‘ట్రాఫిక్ కాప్ ఫర్ ఎ డే’అనే వినూత్న ప్రయోగంలో భాగంగా ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్ పాత్ర పోషించారు.ట్రాఫిక్ పోలీసు జాకెట్ ధరించిన ఆయన, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి పనిచేశారు. ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు ట్రాఫిక్ నిర్వహించడంతోపాటు వారితో సంభాషించారు. సిగ్నల్ కంట్రోల్ పోస్ట్‌ను నిర్వహించిన ఆయన.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారిని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ‘ఒక రోజు ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేయడం నాకు మంచి అనుభవం. ఈ పనిని నేను ఆస్వాదించాను. బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల ఈ చొరవ స్వాగతించదగినది.’ అని ఆయన ఫేస్బుక్లో పేర్కొన్నారు. అంతేకాదు, ఇక నుంచి ప్రతి సోమవాకం ఒక గంట పాటు ట్రాఫిక్ నిర్వహణలో పోలీసులకు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.‘ఈ రోజు నాకు ఒక పండుగలా ఉంది. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారా? వాటికి ఎలా స్పందిస్తున్నారు? వంటి విషయాలను వ్యక్తిగతంగా తెలుసుకున్నాను. ఇది జీవితంలో మంచి అనుభవం’ ఓ వీడియోలో పేర్కొన్నారు. ట్రాఫిక్ నిర్వహణలో పోలీసులకు సహకరించాలనుకునే పౌరులకు ‘బీటీపీ ఏఎస్‌టీఆర్‌ఏఎమ్’ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కల్పించారు. ఇందులో నమోదు చేసుకున్న పౌరులు ఆ పరిధిలోని స్టేషన్ అధికారులు లేదా సిబ్బందితో కలిసి పనిచేసే అవకాశాన్ని అందిస్తుంది. -
బీజేపీ ఓటమి.. కిషన్‌రెడ్డి రియాక్షన్ ఇదే..
ఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమిని విశ్లేషించుకుంటామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రజా తీర్పును గౌరవిస్తామని చెప్పుకొచ్చారు. ఎంఐఎం సహకరించడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఏం చేశాడని అనుకూలంగా ఆయనకు ఓటేయాలి అని ఆయన ప్రశ్నించారు.కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘జూబ్లీహిల్స్‌లో మేము ఎప్పుడూ ఒక కార్పొరేటర్ కూడా గెలవలేదు. స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి ఎప్పుడు గెలవలేదు. మేము ఉన్నంతలో ప్రయత్నం చేశాం. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్రత్యేక పరిస్థితులలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగాయి. మా పార్టీ అక్కడ బలహీనంగా ఉంది. ఓటమిని విశ్లేషించుకుంటాము. ఓల్డ్ సిటీలో కూడా ఏ పార్టీ గెలవదు. ప్రజా తీర్పును మేము శిరసా వహిస్తాం. ఎంఐఎం సహకరించడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రేవంత్ రెడ్డి ఏం చేశాడని అనుకూలంగా ఆయనకు ఓటేయాలి?. రెండు పార్టీలు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. దీనిపై మేము ఫిర్యాదు చేస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టిపెట్టాం. జీహెచ్ఎంసీ మేయర్ పదవి గెలుచుకోవడమే మా లక్ష్యం. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనేక చోట్ల డిపాజిట్లు దక్కలేదు’ అని చెప్పుకొచ్చారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి బీహార్ ప్రజలు పట్టడం కట్టారు. మేము ఊహించనంత భారీ విజయాన్ని ప్రజలు ఇచ్చారు. ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాన్ని తిప్పికొట్టారు. దేశమంతా ఎస్ఐఆర్ జరగాలి. జూబ్లీహిల్స్‌లో ఓటర్ జాబితా తప్పులు తడకగా ఉంది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ప్రజల దృష్టిలో రాహుల్ గాంధీ నవ్వుల పాలయ్యారు అని ఎద్దేవా చేశారు. -
డిపాజిట్ వస్తుందని భావిస్తున్నాం: బీజేపీ దీపక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మూడో స్థానంలో వెనుకంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలపై దీపక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ..‘ఈ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎక్కువ ఉంది. డిపాజిట్ వస్తుందనే భావిస్తున్నాం. బీజేపీ ఓట్లకు డబ్బులు పంచదు. చివరి మూడు రౌండ్లు మాకు అనుకూలంగా ఉంటాయి. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులను కొన్నారు. చీరలు పంపిణీ చేశారు. బహుమతులు ఇచ్చారు. అధికార దుర్వినియోగం చేశారు. అని వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఇప్పటి వరకు దాదాపు 16వేల ఓట్లకు పైగా లీడ్‌లో కొనసాగుతోంది. బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి విజయం దాదాపుగా ఖాయం కావడంతో హస్తం పార్టీ శ్రేణులు గాంధీ భవన్ వద్ద సంబురాలు చేసుకుంటున్నాయి. -
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించి... -
అద్వానీపై శశిథరూర్ ప్రశంసలు.. కాంగ్రెస్‌కు టెన్షన్!
న్యూఢిల్లీ: బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీకి శనివారం 98వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేత శశి థరూర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘకాలం దేశానికి సేవలందించిన అద్వానీ వంటి నేత గుణగణాలను కేవలం ఒకే ఒక్క ఘటనతో నిర్థారించడం సరికాదంటూ అభిప్రాయపడ్డారు.అదేవిధంగా, చైనాతో జరిగిన యుద్ధంలో ఓటమి కారణంగా అప్పటి ప్రధాని నెహ్రూను, దేశంలో అత్యవసర పరిస్థితి విధించినందుకు ఇందిరాగాంధీ వ్యక్తిత్వాన్ని లెక్కగట్టలేమని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయం, లాల్ కృష్ణ అద్వానీకి వర్తిస్తుందని తెలిపారు. అదెంత ప్రాముఖ్యం కలిగినదై నప్పటికీ కేవలం ఒకే ఒక్క పరిణామాన్ని ప్రాతిపదికగా తీసుకుని, వారి సుదీర్ఘ సేవలను బేరీజు వేయడం అన్యాయమన్నారు. అద్వానీ నిరాడంబరత, యోగ్యత, ఆధునిక భారత దేశ పథాన్ని నిర్ణయించడంలో ఆయన పాత్ర ఎవరూ కాదన లేనిదన్నారు. ఇక, 1990లో రామ జన్మభూమి ఉద్యమాన్ని దేశ వ్యాప్త రథయాత్రతో ముందుండి నడిపిన అద్వానీ, బీజేపీని జాతీయ రాజకీయాల్లో ప్రబల శక్తిగా తీర్చిదిద్దిన నేతగా ఖ్యాతి గడించారు. మరోవైపు.. థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ఈ క్రమంలో.. అద్వానీని ప్రశంసిస్తూ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పేర్కొంది. అవి ఆయన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలే అని వివరణ ఇచ్చింది. ఇక, అద్వానీపై శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై పలు కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. శశిథరూర్ వ్యాఖ్యలను ‘ఎక్స్’లోనే ఓ న్యాయవాది విమర్శించారు. రామజన్మభూమి ఉద్యమం సందర్భంగా రథయాత్రతో దేశంలో అద్వానీ విద్వేష బీజాలు నాటారని, ఆయన చేసింది ప్రజాసేవ కాదని పోస్టు చేశారు. దీనికి థరూర్ సమాధానమిస్తూ, ఒక్క ఘటనతో సుదీర్ఘకాలం పాటు ఆయన చేసిన సేవలను తక్కువ చేయడం సమంజసం కాదన్నారు.Wishing the venerable Shri L.K. Advani a very happy 98th birthday! His unwavering commitment to public service, his modesty & decency, and his role in shaping the trajectory of modern India are indelible. A true statesman whose life of service has been exemplary. 🙏 pic.twitter.com/5EJh4zvmVC— Shashi Tharoor (@ShashiTharoor) November 8, 2025 -
బిహార్ తొలిదశ ఎన్నికల్లో 64.66 శాతం పోలింగ్ నమోదు
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి దశ పోలింగ్ అప్డేట్స్.. -
పాకిస్తాన్ ఉగ్రవాదులకు అమిత్ షా హెచ్చరిక
దర్భంగా: భారత్‌పై మరోసారి దాడికి దిగే సాహసం చేస్తే తూటాలకు ఫిరంగులతో సమాధానం చెప్తామని పాకిస్తాన్ ఉగ్రవాదులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పహల్గాంలో మన పౌరులపై దాడి చేసి, ఆడబిడ్డల నుదుటిపై సిందూరాన్ని తుడిచేసిన ముష్కరులపై 20 రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను అంతం చేశామని తెలిపారు.అమిత్ షా మంగళవారం బీహార్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఇక్కడ తయారయ్యే ఫిరంగులను పాక్ ముష్కర మూకలపై ఎక్కుపెట్టనున్నట్లు స్పష్టంచేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ భద్రతను నిర్లక్ష్యం చేశామని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు. నేరగాళ్లను నీరాజనాలు పలుకుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్–ఆర్జేడీ కూటమికి ఓటు వేస్తే బీహార్‌లో మళ్లీ జంగిల్‌రాజ్ వస్తుందని ప్రజలను అమిత్ షా అప్రమత్తం చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ నేరగాళ్లను నీరాజనాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ‘షాబుద్దీన్ అమర్ రహే’అంటున్నారని ఆక్షేపించారు. జంగిల్‌రాజ్‌ను మళ్లీ తీసుకురావాలని ప్రతిపక్ష నాయకులు ఆరాటపడుతున్నారని, ప్రజలు అందుకు అంగీకరించబోరని తేలి్చచెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంపైనున్న కమలం గుర్తుపై మీటను నొక్కితే సుపరిపాలన వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రను అమిత్ షా తప్పుపట్టారు. చొరబాటుదారులను కాపాడే ప్రయత్నాలు మానుకోవాలని రాహుల్‌కు హితవు పలికారు. -
కిషన్ రెడ్డి.. మీకేం తెలుసు: అజారుద్దీన్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి అజారుద్దీన్ కౌంటరిచ్చారు. దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన తనను దేశ ద్రోహి అంటూ వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రి అజారుద్దీన్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘కిషన్ రెడ్డి.. మీరేం మాట్లాడుతున్నారు. నా గురించి మీకు ఏం తెలుసు. నేను హిందూ, ముస్లిం అన్ని వర్గాల వాడిని.. అందరివాడిని. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే బీజేపీ నన్ను టార్గెట్ చేసింది. దేశ గొప్పతనాన్ని చాటి చెప్పిన నేను దేశ ద్రోహినా?. నా దేశభక్తిపై ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఎన్నికలకు తన మంత్రి పదవికి సంబంధం లేదని తెలిపారు. తనను కేబినెట్లోకి తీసుకోవడం సీఎం రేవంత్ రెడ్డి, హైకమాండ్ నిర్ణయమని పేర్కొన్నారు. సీఎం ఏ శాఖలు ఇచ్చినా సంతోషమే.. నాకు ఇవి ఇవ్వాలని నేను అడగడం లేదు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తాననే నమ్మకం ఉందని అన్నారు.కిషన్‌రెడ్డి ఆరోపణలు.. ఇక, అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. అజారుద్దీన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. దేశ ద్రోహానికి పాల్పడి భారత్‌కు చెడ్డపేరు తెచ్చిన వ్యక్తి అజారుద్దీన్ అని విమర్శించారు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ మంత్రి పదవి ఇవ్వడం ప్రజాస్వామ్యానికి అవమానమని వ్యాఖ్యానించారు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. దేశ గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తిని గవర్నర్ కోటాలో కాంగ్రెస్ ఎలా ఎమ్మెల్సీని చేస్తుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.టీపీసీసీ విమర్శలు..మరోవైపు.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు టీపీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటరిచ్చారు. తాజాగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. అజారుద్దీన్‌పై కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయనకు మంత్రి పదవి ఇస్తే బీజేపీ నేతలకు ఎందుకంత అక్కసు అని ఫైర్ అయ్యారు. అజార్‌కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో మూడు నెలల ముందే హైకమాండ్ నిర్ణయం తీసుకుందన్నారు. సుదీర్ఘ కాలం దేశానికి ఆయన సేవలందించారని, ఈ నేపథ్యంలో అజార్ విషయంలో కాంగ్రెస్ ప్రత్యేక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇండియా క్రికెట్ టీం కెప్టెన్‌గా దేశానికి అజారుద్దీన్ ఎన్నో విజయాలు సాధించి పెట్టారని, ఎంపీగా ప్రజలకు సేవ చేశారని గుర్తుచేశారు. అజార్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్రంలోని మైనార్టీలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
ఎంపీ రవి కిషన్‌కి హత్యా బెదిరింపులు.. చంపేస్తామంటూ..
గోరఖ్‌పూర్: బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్‌ను హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. తమ వర్గాన్ని అనుమానించేలా రవి కిషన్ మాట్లాడారంటూ నిందితుడు ఆవేశంతో రగిలిపోయాడు. అయితే, ఈ బెదిరింపులపై ఎంపీ రవి కిషన్ స్పందిస్తూ ఇలాంటి ఫోన్ కాల్స్‌కు తాను భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. దీంతో, బెదిరింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ ఘటనలో నిందితుడు బీహార్‌లోని అరా జిల్లాకు చెందిన అజయ్ కుమార్.. ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదీకి ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ద్వివేది స్పందిస్తూ.. ‘రవి కిషన్ మా వర్గాన్ని అవమానించేలా మాట్లాడాడు. కాబట్టి అతన్ని కాల్చేస్తాం. ఎంపీకి సంబంధించి ప్రతీ కదలిక నాకు తెలుసు. నాలుగు రోజుల్లో అతను బీహార్‌కు వచ్చేటప్పుడు.. చంపేస్తాం’ అని హెచ్చరించాడు. ఇదే సమయంలో ఎంపీని ఉద్దేశిస్తూ నిందితుడు పలు అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశాడని తెలిపారు.ఇదిలా ఉండగా, రవికిషన్ ఏ వర్గాన్ని ఉద్దేశిస్తూ.. ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదని ద్వివేది పేర్కొన్నారు. ఈ ఘటనపై గోరఖ్‌పుర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఎంపీ సిబ్బంది ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీకి భద్రత పెంచాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.మరోవైపు, ఈ బెదిరింపు ఫోన్ కాల్‌పై గోరఖ్‌పూర్ ఎంపీ రవి కిషన్ స్పందిస్తూ..‘నన్ను ఫోన్లో దుర్భాషలాడారు, నా తల్లి గురించి కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపేస్తామని బెదిరించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ప్రజాస్వామ్య బలం, సైద్ధాంతిక సంకల్పంతో ఇలాంటి వాటిని ఎదుర్కొంటాను. ఇటువంటి వ్యక్తులే సమాజంలో ద్వేషం, అరాచకత్వాన్ని వ్యాప్తి చేస్తారు. ప్రజాసేవ, ధర్మమార్గంలో నడవాలనేది నా రాజకీయ వ్యూహం. ఇది నా వ్యక్తిగత గౌరవంపై ప్రత్యక్ష దాడి మాత్రమే కాదు.. మనందరిపై దాడి’ అని వ్యాఖ్యలు చేశారు. -
బీహార్ పాలి‘ట్రిక్స్’.. బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేత
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీహార్‌లో నేతల జంప్ జిలానీ వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఆర్జేడీ నేత అనిల్ సహానీ బుధవారం బీజేపీలో చేరారు. విశేషం ఏమిటంటే ఈయనను మూడేళ్ల క్రితం మోసం కేసులో సీబీఐ కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించటంతో అనర్హత వేటు పడి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయారు.2012లో ఆయన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఫోర్జరీ విమాన టికెట్లు సమర్పించారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసులో సీబీఐ కోర్టు విచారణ జరుపుతుండగానే 2020లో ఆర్జేడీ తరఫున కుర్హానీ నియోజవర్గంలో పోటీచేసి బీజేపీ నేత కేదార్ గుప్తను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడేళ్ల క్రితం కోర్టు అనిల్‌ను దోషిగా తేల్చటంతో అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కేదార్ గుప్త గెలిచి, రాష్ట్ర మంత్రి అయ్యారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డేల సమక్షంలో అనిత్ సహానీ బీజేపీలో చేరు. -
బీహార్‌కు పైసలిస్తారు.. విద్యార్థులకు లేవా?.. మంత్రులకు బండి హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress Govt) కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని అడిగితే విజిలెన్స్ దాడులంటూ బ్లాక్మెయిల్ చేస్తారా అని మండిపడ్డారు. బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల, యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోంది అని విమర్శలు చేశారు.హైదరాబాద్‌లోని నల్లకుంట పరిధిలోని ఉన్న శంకర్‌మఠ్‌కు బుధవారం ఉదయం బండి సంజయ్ వెళ్లారు. శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం, బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా?. కమీషన్లు రావనే సాకుతోనే సర్కార్ పెద్దలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదా?. అసెంబ్లీ (Telangana Assembly) సాక్షిగా ఇచ్చిన హామీని కూడా కాలరాస్తారా?. పదేపదే ఇచ్చిన మాటను తప్పే వాళ్లను ఏమనాలి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.బీహార్ ఎన్నికల(Bihar Elections) కోసం తెలంగాణ నుంచే పైసలు పంపుతున్నారు కదా. మరి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేని దిన స్థితిలో ప్రభుత్వం ఉందా?. తక్షణమే బకాయిలు రూ.10 వేల కోట్లు చెల్లించాలి. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి. విద్యార్థులు, యాజమాన్యాలతో కలిసి నిరసనలకు దిగుతాం. ఖబడ్దార్ మంత్రులను రోడ్లపై తిరగనీయబోమని హెచ్చరిస్తున్నాం. ఇదే సమయంలో కళాశాలల యజమాన్యాలు కూడా ప్రభుత్వానికి భయపడి సమ్మె విరమిస్తే అంతే సంగతులని అన్నారు. అలా చేస్తే.. భవిష్యత్తులో వారికి ఎవరూ అండగా నిలబడే పరిస్థితి ఉండదన్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ బకాయిలపైనా ప్రైవేటు ఆసుపత్రులు రోడ్డెక్కడం తథ్యమని అన్నారు. మంత్రులు ప్రతి పనికి కమీషన్లు వసూలు చేస్తున్నారని.. వచ్చిన సొమ్మును కాంగ్రెస్ హైకమాండ్‌కు కప్పం కడుతున్నారు అంటూ విమర్శలు చేశారు. -
బీహార్‌లో బిగ్ ట్విస్ట్.. బీజేపీ బెదిరింపుల వల్లే తప్పుకున్నాం: పీకే సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్ ఎన్నికల్లో(bihar Assembly Election) బీజేపీ ఒత్తిళ్ల కారణంగానే తాము ముగ్గురు అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయాల్సి వచ్చిందని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(prashant Kishor) ఆరోపించారు. మంగళవారం ఆయన పట్నాలో మీడియాతో మాట్లాడారు. దానాపూర్, బ్రహాంపూర్, గోపాల్‌గంజ్ సీట్ల నుంచి ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ఓటమి భయంతోనే ఎన్డీయే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు గురి చేస్తోందన్నారు.ఈ సందర్బంగా ప్రశాంత్ కిషోర్.. ‘ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఇలాంటి పరిణామాలు దేశంలో ఇంతకుముందెన్నడూ జరగలేదు. ఎన్నికల సంఘం అభ్యర్థులకు తగు భద్రత కల్పించాలి’ అని ఆయన కోరారు. ఆదివారం వరకు పార్టీ తరఫున చురుగ్గా పనిచేసిన బ్రహాంపూర్‌లో తమ అభ్యర్థి సత్యప్రకాశ్ తివారీ సోమవారం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ(BJP Party) ఎన్నికల ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం తివారీ ఇంటికి వెళ్లి తీవ్రంగా బెదిరించారన్నారు.బీజేపీ నేతలు బెదిరింపుల వల్లే పోటీ నుంచి వైదొలగుతున్నట్లు గోపాల్‌గంజ్‌లోని తమ అభ్యర్థి శేఖర్ సిన్హా, దాన్‌పూర్‌లో అభ్యర్థి అఖిలేశ్ షా తనకు చెప్పారని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని, ప్రజల్లో సడలుతున్న విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పాలన్నారు. అభ్యర్థులనే కాపాడలేని ఈసీ, ఓటర్లకు ఎలా రక్షణ కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించింది. ఎవరూ పట్టించుకోవడం లేదని భావించిన ప్రశాంత్ కిశోర్ బీజేపీ నేతలపై ఆరోపణల ద్వారా ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. -
ఆ రెండు పార్టీలు తలచుకుంటే ఆపేదెవరు?
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల పెంపు పేరిట కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు ఆడుతు న్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇస్తే బీసీ రిజర్వేషన్ల పెంపుదలను ఎవరు ఆపగలరు? అని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం హరీశ్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంటులో బీజేపీకి 240, కాంగ్రెస్‌కు 99 మంది ఎంపీల బలం ఉన్నా బీసీలను మభ్య పెడుతూ ఢిల్లీలో కొట్లాడకుండా గల్లీలో డ్రామాలు చేస్తున్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్పుడు కులగణన చేయని కాంగ్రెస్, నాలుగేళ్లుగా జనగణనను వాయిదా వేస్తూ వచ్చిన బీజేపీ.. బీసీలపై కపట ప్రేమ చూపుతున్నాయని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీలకు మంత్రిత్వ శాఖను కోరిందే కేసీఆర్: కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని 2005లోనే కేసీఆర్ కోరా రని, బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ అసెంబ్లీలో రెండు సార్లు తీ ర్మానం చేయడంతో పాటు ప్రధానిని కూడా స్వయంగా కలిశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. జనాభా సంఖ్యకు అనుగుణంగా రిజర్వే షన్లు కావాలని కోరుతున్న రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రైవే టు బిల్లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని నిలదీశారు. -
అదే జరిగితే బెంగాల్లో రాష్ట్రపతి పాలనే.. సువేందు అధికారి హెచ్చరిక
జల్పాయ్గురి: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి 2026లో జరగనున్న ఎన్నికలతో ప్రభుత్వం మారనుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి జోస్యం చెప్పారు. సకాలంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.జల్పాయ్గురి జిల్లా నగ్రాకటలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తికాని పక్షంలో ఎన్నికలు జరగవన్నారు. ‘వచ్చే ఏడాది మే 4వ తేదీకల్లా ఎస్ఐఆర్ పూర్తి చేయాల్సి ఉంది. లేకుంటే ఆ తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలవుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ఎన్నికల ముందు సెమీఫైనల్స్ వంటిది. ఎన్నికల్లో టీఎంసీకి ఓటమి తప్పదు’ అని సువేందు వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో ‘2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీలు పొందిన ఓట్లలో తేడా 42 లక్షలు మాత్రమే. అప్పట్లో అక్రమంగా చేర్చిన 2.4 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఎస్ఐఆర్లో తొలగిస్తారు. అక్రమ వలసదారులు, ఇతరత్రా అనర్హుల పేర్లు సైతం ఉండవు. భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీకి తన చేతిలో ఓటమి తప్పదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
కర్నూలు చేరుకున్న మోదీ
సాక్షి, కర్నూలు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi Kurnool tour) కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలు శివారులోని నన్నూరు టోల్గేట్ సమీపంలో ‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ పేరుతో భారీ బహిరంగ సభ జరుగనుంది. సభ వేదిక కోసం 450 ఎకరాల్లో ప్రాంగణం సిద్ధం చేశారు. పర్యటన సందర్బంగా ప్రధాని.. కర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.పర్యటన ఇలా.. 7.50 AM: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం10.20 AM: కర్నూలు ఎయిర్పోర్ట్10.25 AM: సున్నిపెంటకు హెలికాఫ్టర్11.10 AM: శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరిక11.45 AM: భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం12.45 PM: భ్రమరాంబ గెస్ట్ హౌస్ తిరిగి చేరిక1.25 PM: సున్నిపెంటకు రోడ్డు మార్గంలో బయల్దేరి1.40 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక2.30 PM: రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు4.00 PM: బహిరంగ సభ4.15 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక4.40 PM: కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కి బయల్దేరి7.15 PM: ఢిల్లీకి చేరి పర్యటన ముగింపుకర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులు..రూ.2,880 కోట్లతో కర్నూలు-3 పూలింగ్ స్టేషన్‌ను అనుసంధానించేలా ఏర్పాటుచేసిన ట్రాన్స్మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని.రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పనులకు ప్రధాని శంకుస్థాపన.రెండు కారిడార్లలో సుమారు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తాయన్న కేంద్రం.రెండు కారిడార్ల ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని ప్రకటించిన కేంద్రం.రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్లు ఆస్కారం కల్పిస్తాయన్న కేంద్రం.రూ.960 కోట్లతో సబ్బవరం-షీలానగర్ రహదారికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని.రూ.1,140 కోట్లతో పీలేరు-కాలురు నాలుగు వరుసల రహదారి విస్తరణకు శంకుస్థాపన.గుడివాడ-నూజెండ్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ. -
బీజేపీ ఆఫీసులో ఉద్రిక్తత.. తన్నుకున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర బీజేపీ ఆఫీస్‌లో(BJP state office) బీసీ నేతల మధ్య కొట్లాట(BC leaders fight) తీవ్ర కలకలం రేపింది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు(ramachander Rao), బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య.. ఎదుటే నేతలు ఇలా తన్నుకోవడం విశేషం. దీంతో, ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈనెల 18న బీసీ జేఏసీ నిర్వహించ తలపెట్టిన బంద్‌కు(BC Bandh) మద్దతు ఇవ్వాలని బీజేపీని కోరేందుకు ఇవాళ ఆర్.కృష్ణయ్యతో(R.Krishnaiah) పాటు బీసీ సంఘాల నేతలు బీజేపీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టే సమయంలో జూనియర్ అయి ఉండి ఫొటోలకు ఎలా ముందుకు వెళ్తావ్ అని ఒకరినొకరు తిట్టుకున్నారు. దీంతో, రెండు వర్గాల నేతలు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. అనంతరం, ఒక్కసారిగా బీజేపీ ఆఫీసులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘర్షణకు దిగిన నేతలను మిగతా బీసీ నాయకులు అడ్డుకున్నారు. కొట్లాటకు దిగిన నేతలపై మిగతా బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.


