భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దాతియా అసెంబ్లీ ఉపఎన్నిక బీజేపీలో అంతర్గత కలకలానికి కారణమైంది. పార్టీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాకు టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాతియా నుంచి ఆశుతోష్ తివారీని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడంతో స్థానికంగా నిరసనలు భగ్గుమన్నాయి.
అయితే, దాతియా నియోజకవర్గంలో నరోత్తమ్ మిశ్రాకు బలమైన రాజకీయ పట్టు ఉందని భావిస్తున్న ఆయన వర్గం, ఉపఎన్నికలో ఆయనే బీజేపీ అభ్యర్థిగా ఉంటారని ఆశించింది. అయితే పార్టీ అధిష్ఠానం అనూహ్యంగా ఆశుతోష్ తివారీ పేరును ప్రకటించడంతో మిశ్రా మద్దతుదారుల్లో అసంతృప్తి మొదలైంది.
🚨DATIA UPHEAVAL: BJP denies Datia by-election ticket to ex-HM Narottam Mishra, picking grassroots worker Ashutosh Tiwari. Enraged Mishra loyalists choke NH-44 and force markets to shut as the entire district party executive resigns! pic.twitter.com/nqXWxu6L51
— HINT News (@9415st) July 10, 2026
టికెట్ ప్రకటన అనంతరం దాతియాలో పలుచోట్ల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కొందరు మద్దతుదారులు రహదారులపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఝాన్సీ–గ్వాలియర్ హైవేను దిగ్బంధించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు వార్తలు వచ్చాయి. నరోత్తమ్ మిశ్రాకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ దాతియా జిల్లా అధ్యక్షుడు సహా పలువురు స్థానిక పార్టీ పదాధికారులు సామూహిక రాజీనామా చేసినట్లు సమాచారం. పార్టీ నాయకత్వం నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వారు డిమాండ్ చేశారు.
#WATCH | Madhya Pradesh: Vehicles stranded on NH-44 amid heavy protests in Datia and a blockade by former State Home Minister Narottam Mishra's supporters after BJP denied him ticket for the upcoming assembly bypoll.
Angered by the decision, thousands of his followers blocked… pic.twitter.com/HetLVNgUTZ— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 11, 2026
నరోత్తమ్ మిశ్రా మధ్యప్రదేశ్ బీజేపీలో కీలక నేతగా ఎదిగిన సీనియర్ రాజకీయ నాయకుడు. దాతియా నియోజకవర్గం నుంచి ఆయనకు ప్రత్యేక రాజకీయ గుర్తింపు వచ్చింది. 1960లో జన్మించిన నరోత్తమ్ మిశ్రా బీజేపీలో దీర్ఘకాలంగా పనిచేస్తూ పలు కీలక పదవులు నిర్వహించారు. ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో హోం శాఖ, న్యాయ శాఖ, జైళ్లు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రిగా పనిచేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఆయన ప్రభావశీల మంత్రుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. దాతియా రాజకీయాల్లో నరోత్తమ్ మిశ్రాకు బలమైన పట్టు ఉండేది. ఆయన దాతియా నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర భారతి చేతిలో ఓటమి చవిచూశారు.
Datia, Madhya Pradesh: Security has been tightened outside the BJP office in Datia, with heavy police deployment after supporters of BJP leader Narottam Mishra staged a protest over his denial of a ticket for the Assembly bypoll pic.twitter.com/sylfIaKIlh
— IANS (@ians_india) July 11, 2026


