ఓటీటీలోకి వచ్చేసిన 'పెద్ది'.. ఆ సీన్లు మార్చేశారు | Ram Charan Peddi Released In OTT Sparks Buzz, Netflix Removes Controversial Janhvi Kapoor Scene, Read Story Inside | Sakshi
Sakshi News home page

Peddi OTT: థియేటర్లలో ఒకలా.. ఓటీటీలో ఇంకోలా

Jul 9 2026 9:20 AM | Updated on Jul 9 2026 9:51 AM

Peddi Movie OTT Streaming Now

రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లలో చూసి మళ్లీ ఇప్పుడు ఓటీటీలో చూసిన వాళ్లు చాలానే తేడాలు గమనిస్తున్నారు. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ కూడా మొదలుపెట్టేశారు. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ డార్క్ కామెడీ సినిమా 'మాలీవుడ్ టైమ్స్' తెలుగు రివ్యూ)

'పెద్ది' సినిమా తెలుగులో తప్పితే మరెక్కడ అస్సలు ఆడలేదు. హిందీ, నార్త్ అమెరికా ఇలా అన్నిచోట్ల దారుణంగా ఫ్లాప్ ‍అయింది. అయితే తెలుగులో కలెక్షన్స్ వచ్చినప్పటికీ జాన్వీ కపూర్ సన్నివేశాలపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఈమె శరీరాన్ని గ్లామరస్‌గా చూపించడానికి తప్పితే మరో ఉద్దేశంతో తీసుకోలేదని ట్రోల్ చేశారు. ఓ సీన్‌లో అనుమతి లేకుండా జాన్వీని హీరో ముద్దు పెట్టే సీన్‌పైనా విమర్శలు వచ్చాయి.

హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర ఓ సన్నివేశంలో భాగంగా మార్కెట్‌లో మాట్లాడుతుంటే.. అక్కడికి వచ్చిన పెద్ది పాత్ర ఆమెని వర్ణిస్తూ 'కాటుకే అక్కర్లేని ఆ కళ్లు, ముక్కుపుడకే అక్కర్లేని ఆ ముక్కు, అసలు అలంకరణే అక్కర్లేని అరుదైన చికిరి రా ఇది' అని అంటాడు. ఈ టైంలో జాన్వీ రొమ్ము, నడుము భాగాన్ని చూపించారు. దీంతో ట్రోలర్స్ దర్శకుడు, కెమెరామ్యాన్‌ని గట్టిగానే తలంటారు. థియేటర్లలో ఇలా చూపించారు గానీ ఓటీటీలో మాత్రం కేవలం జాన్వీ ముఖాన్ని చూపించి సరిపెట్టారు. లేదంటే మరోసారి దారుణమైన ట్రోలింగ్‌కి గురయ్యేవారు.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ.. 3 గంటల 5 నిమిషాల నిడివితో అందుబాటులోకి వచ్చింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతిబాబు, శివరాజ్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించగా బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement