Peddi Movie
-
టాలీవుడ్లో పర్సంటేజీ వివాదం.. పెద్ది మూవీకే ప్లస్ కానుందా?
ప్రస్తుతం టాలీవుడ్లో బిగ్ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. సరిగ్గా ఈ సమయంలోనే టాలీవుడ్లో సమస్య మొదలైంది. సింగిల్ స్క్రీన్స్ ఎగ్జిబిటర్స్ తమకు పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పెద్ది రిలీజ్‌కు ముందే టాలీవుడ్లో వివాదం ముదురుతోంది. అది కాస్తా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్‌కు మధ్య వార్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఇది టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారంది. పెద్ది సమయంలో ఇలాంటి వివాదం తలెత్తడంతో నిర్మాతలు రవిశంకర్, నాగవంశీ ఫైరయ్యారు.ఇక వివాదం పక్కనపెడితే.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పెద్ది కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ మూవీ రిలీజ్‌పై ప్రభావం పడనుందా? అనే చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితిలో ‘పెద్ది’ సినిమాకు స్క్రీన్ సమస్యలు రావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు రెంటల్ సిస్టమ్‌కు వ్యతిరేకంగా పెద్దికి థియేటర్లు ఇవ్వొద్దనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరోవైపు ఈ వివాదం కూడా టాలీవుడ్‌కు ప్లస్ అవుతుందా? అని కొందరు భావిస్తున్నారు. టాలీవుడ్ ఫ్యూచర్‌కే టర్నింగ్ పాయింట్ అవుతుందా? అన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మేకర్స్ అదే ఛాలెంజ్‌ను అవకాశంగా మార్చుకుంటే? పీవీఆర్ ఐనాక్స్, ప్రసాద్స్, అల్లు సినిమాస్ వంటి ఇండిపెండెంట్ థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేసి.. పరిమిత స్క్రీన్లతోనే భారీ కలెక్షన్లు కొడితే మాత్రం ఇండస్ట్రీ డైనమిక్స్ పూర్తిగా మారిపోవచ్చని అంచనా వేస్తున్నారు.ఎందుకంటే.. స్టార్ హీరోల సినిమాలు తక్కువ స్క్రీన్లతో సక్సెస్ అయితే.. భవిష్యత్తులో పెద్ద నిర్మాతలు సింగిల్ స్క్రీన్ నెట్‌వర్క్‌పై ఆధారపడే అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ లాంటి నిర్మాణ సంస్థ వద్ద ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ లాంటి భారీ ప్రాజెక్టులు కూడా లైనప్‌లో ఉన్నాయి. ఈ వివాదం ఇలాగే కొనసాగితే.. చివరికి ఎక్కువ నష్టం ఎవరికి? నిర్మాతలకా? ఎగ్జిబిటర్లకా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందో మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
పెద్ది రిలీజ్ ముందు ఈ గలాటా ఏంటి..!
-
చాలా బాధగా ఉంది... పెద్ది అప్పుడే ఎందుకు ఇలా..!
-
‘పెద్ది’లో ఆటే కాదు.. అసలు కథే వేరే!
టాలీవుడ్ బాక్సాఫీస్ గత కొంతకాలంగా డల్ అయిపోయింది. చాలా వారాలుగా పెద్ద సినిమాలేవి విడుదల కావడం లేదు. చిన్న చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో థియేటర్స్ దగ్గర సందడే కనిపించడం లేదు. మళ్లీ ఆ సందడి రావాలంటే ఓ భారీ చిత్రం రావాలి.. సూపర్ హిట్ కొట్టాలి. అందుకే ఇప్పుడు అందరి చూపులు ‘పెద్ది’వైపు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత తెలుగు నుంచి విడుదల అవుతున్న పాన్ ఇండియా చిత్రం ఇది. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఒక్క రోజు ముందే అంటే జూన్ 3నే ప్రీమియర్లతో పెద్ది సందడి మొదలవుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలయ్యాయి. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మే 18న ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా ప్రమోషన్లలో పాల్గొంటాడు. ఇలా నెల మొత్తం ఇండస్ట్రీలో పెద్ది టాపిక్కే నడుతుంది.ఇదిలా ఉండగా.. పెద్దికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇది కేవలం గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదట. అంతకు మించిన స్టోరీ సినిమాలో ఉందట. ఆటతో పాటు ఊరికి సంబంధించిన ఎమోషన్ని ఈ కథలో బలంగా చూపించబోతున్నాడట దర్శకుడు బుచ్చిబాబు. ఊరి బాగుకోసం హీరో ఏం చేశాడనేది ఈ సినిమా కథ. దానికి స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌ని ఎంచుకొని.. అద్భుతమైన సన్నివేశాలను అల్లాడట బుచ్చిబాబు.కోచ్‌గా శివరాజ్ కుమార్, హీరో తండ్రిగా జగపతిబాబు పాత్రలను కూడా బలంగా తీర్చిదిద్దాడట. హీరోతో పాటు ఈ రెండు పాత్రల నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. సినిమాలలో కీలక పాత్రల తీరు ఎలా ఉంటుందో ట్రైలర్లో చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పెద్ది కథ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఎక్కడ లీక్ కూడా కాలేదు. ట్రైలర్ వస్తే కానీ అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది తెలియదు. కుస్తీ, క్రికెట్ ఆటలకు ఈ కథతో ఉన్న సంబంధం ఏంటనేది కూడా ట్రైలర్లో చూపించే అవకాశం ఉంది. -
రామ్ చరణ్ పెద్ది.. నార్త్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ పెద్ది. ఈ మూవీలోని రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. పెద్ది ట్రైలర్‌ను మే 18న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.తాజాగా ఈ మూవీ నార్త్ ఇండియా రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ దక్కించుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. హీందీతో పాటు తెలుగు హక్కులను కూడా జియో స్టూడియోస్ సొంతం చేసుకుంది. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. పెద్ది మూవీ స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ స్టెప్పులు వేయనుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. Excited to bring Peddi to theatres across North India in Hindi & Telugu.Peddi in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani… pic.twitter.com/TvSYP8hRzt— Jio Studios (@jiostudios) May 12, 2026 -
PEDDI ఐటెం సాంగ్ అరాచకం..! చరణ్ అన్న ఇరగదీసాడు
-
వెయిటింగ్ ఈజ్ ఓవర్.. పెద్ది ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.ఈనెల 18న పెద్ది మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సనా ప్రకటించారు. ఈ మేరకు పెద్ది మూవీ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ బిగ్ ఈవెంట్ ఎక్కడనేది అనేది మాత్రం వెల్లడించలేదు. ఈ సారి పుష్ప-2 తరహాలో నార్త్‌లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే వేదికపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.#PEDDI will stay in your hearts❤️TRAILER From 18th May💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th, with PREMIERES on JUNE 3rd Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani… pic.twitter.com/4Ub5AiwEGH— BuchiBabuSana (@BuchiBabuSana) May 11, 2026 -
రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'పెద్ది' ట్రైలర్ ఈవెంట్ డేట్ ఫిక్స్?
-
రామ్ చరణ్ పెద్ది గాయాల కథ...
-
పుష్ప-2 బాటలో పెద్ది.. రన్ టైమ్ అన్ని గంటలా?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. త్వరలోనే పెద్ది ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, రామ్ చరణ్ లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు సనా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా ఈ మూవీ రన్‌టైమ్ నెట్టింట చర్చ మొదలైంది. ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటల 20 నిమిషాలు ఉండనుందని తెలుస్తోంది. గతంలో రిలీజైన యానిమల్, కల్కి, పుష్ప-2, ఆర్ఆర్ఆర్ సినిమా రన్ టైమ్ కూడా 3 గంటలకు పైగానే ఉంది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. తాజాగా ఈ రన్ టైమ్ చూస్తుంటే పెద్ది కూడా సూపర్ హిట్ కావడం ఖాయమని సినీ వర్గాల టాక్. అంతేకాకుండాఉత్తరాదిలో ట్రైలర్ రిలీజ్..పెద్ది ట్రైలర్ విషయంలో బుచ్చిబాబు పుష్ప-2 ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పుష్ప-2 ట్రైలర్‌ను బిహార్‌లోని పాట్నాలో రిలీజ్ చేశారు. దీంతో నార్త్ ఆడియన్స్‌లోనూ ఓ రేంజ్లో వసూళ్లు సాధించింది. ఇప్పుడు అదే బాటలో పెద్ది మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 17న ఇండోర్ లేదా పాట్నాలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాలీవుడ్లో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా.. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
పెద్ది సెట్స్‌లో మెగాస్టార్ సందడి.. వీడియో వైరల్
రామ్ చరణ్ మూవీ పెద్ది షూటింగ్ సెట్లో మెగాస్టార్ సందడి చేశారు. షూటింగ్ సెట్‌కు వెళ్లిన దర్శకుడు బుచ్చిబాబు, సుకుమార్‌తో ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను బుచ్చిబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ది బాస్, మై గురు పెద్ది సెట్స్‌లో అడుగుపెట్టారని.. ఇది నా జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకమంటూ పోస్ట్ చేశారు. పెద్దిని ఆదర్శంగా తీసుకుని నా కండలు పెంచానని ఫన్నీగా రాసుకొచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి చేయనుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. త్వరలోనే పెద్ది ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.The BOSS and my GURU on sets of #Peddi...It's one of the best memories ❤️And yes...I've built a bit of muscle with my Peddi's inspiration 💪🏻😅@KChiruTweets Sir @AlwaysRamCharan Sir ❤️❤️❤️🤗🤗🤗 pic.twitter.com/gvgcNmkffZ— BuchiBabuSana (@BuchiBabuSana) May 8, 2026 -
ఇంకా ట్రైలర్ రాలేదు.. అప్పుడే పెద్ది రికార్డ్..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. గురువారం నుంచే ఓవర్సీస్ ఆడియన్స్‌కు టికెట్స్ బుకింగ్స్ అందుబాటులోకి వచ్చేశాయి.ఓవర్సీస్లో తొలి రోజే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన 24 గంటల్లోపే లక్ష టికెట్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. నార్త్ అమెరికాలో అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. జూన్ 3వ తేదీన ప్రీమియర్ షోల టికెట్స్ ఓపెన్ అవ్వగా కేవలం కొన్ని గంటల్లోనే కొనేశారు. దీంతో ఉత్తర అమెరికాలో అత్యంత వేగంగా లక్షకు పైగా టికెట్స్ అమ్ముడైన చిత్రంగా పెద్ది నిలిచింది. ఇటీవలే ఈ మూవీ ఫైనల్ కాపీ కూడా రెడీ అయిందని మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే పెద్ది ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు.ట్రైలర్ రిలీజ్ కాకపోయినా పెద్దికి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, రామ్ చరణ్ లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు సనా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ALL TIME RECORD 💥#PEDDI - FASTEST $100K+ Pre-Sales for North America Premieres🔥🔥🔥#PEDDITakeOver 🧨⚡️MEGA POWERSTAR #RamCharan's MASS HYSTERIA 💥💥MASSIVE Release by @PrathyangiraUS, Premieres On JUNE 3rd 🔥@AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana… pic.twitter.com/NkA8VDFKwi— Prathyangira Cinemas (@PrathyangiraUS) May 8, 2026 -
రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ రెడీ.. మూడో లుక్ పై సస్పెన్స్..
-
రామ్ చరణ్ 'పెద్ది' గాయాల కథ
పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ ఊహించని విధంగా గాయపడిన విషయం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. కంటికి దెబ్బ తగిలిన వెంటనే అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నపాటి సర్జరీ చేసి ఇంటికి పంపించారు. ఒక్క రోజు విశ్రాంతి తీసుకుని చరణ్ మళ్లీ వెంటనే సెట్స్‌లో జాయిన్ కావడం అతడి ప్రొఫెషనలిజాన్ని చూపించింది. కంటిపైన ప్లాస్టర్‌తో చరణ్ కనిపించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అభిమానులు ఎంతో బాధపడ్డారు. అయితే తాజాగా ఆ గాయానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకొచ్చాయి. చాలామంది అది క్రికెట్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో చరణ్‌కి బాల్ తగిలి గాయమైందని అనుకున్నారు. కానీ నిజానికి పహిల్వాన్ గెటప్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఏదో బరువైన వస్తువు కంటికి తగిలి గాయం జరిగింది. ఆ గాయం ఇప్పటికీ చరణ్ కంటి పైభాగంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అది బయటపడింది. చరణ్‌కి ఇది మాత్రమే కాదు, జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు, 'చికిరి చికిరి' పాట షూటింగ్ సమయంలో కూడా గాయాల పాలయ్యాడని సమాచారం. ఇక పెద్ది విషయానికి వస్తే.. రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ట్రయిలర్ రిలీజ్‌కానుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్‌పైనే ఉంది. ముఖ్యంగా చరణ్ మూడో లుక్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
రామ్ చరణ్ పెద్ది.. ఫైనల్ కాపీ రెడీ.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఐటమ్ సాంగ్ షూటింగ్ కూడా పూర్తి కావడంతో మేకర్స్ ఫైనల్ కాపీని రెడీ చేస్తున్నారు. తాజాగా పెద్ది ఫైనల్ కాపీ కూడా పూర్తయిందని మేకర్స్ వెల్లడించారు. ఎడిటింగ్ పూర్తి కావడంతో ఎడిటర్‌తో కలిసి దర్శకుడు బుచ్చిబాబు దిగిన ఫోటోను షేర్ చేశారు.పెద్ది ఫైనల్ కాపీ సిద్ధం కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ప్రీమియర్స్ ఉన్నాయని నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ప్రకటించింది. జూన్ 3న సాయంత్రం నుంచే పెద్ది ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని ప్రత్యేక సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి చేయనుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన సంగతి తెలిసిందే. The #PEDDI Edit has been locked🔒All set and ready for massive premieres from JUNE 3rd 2026💥💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON June 4th ❤🔥#GetReadyForPeddi 💥💥Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/e240haEItl— Vriddhi Cinemas (@vriddhicinemas) May 7, 2026 -
పెద్ది కథ విన్నాక తేరుకోలేకపోయా..! ఆర్ట్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
-
‘పెద్ది’లో వాటిని గుర్తుపట్టలేరు.. నేనే షాకయ్యా : అవినాష్
‘‘పెద్ది’ కథ విని షాక్ అయ్యాను. నా పదేళ్ల కెరీర్లో ఒక సినిమా కథకు ఇంతలా ఎగ్జైట్ కావడం ఇదే తొలిసారి. ఈ సినిమా కథ అంతలా నన్ను కదిలించింది’’ అని తెలిపారు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో అవినాష్ కొల్లా మాట్లాడుతూ– ‘‘విజయనగరం నేపథ్యంలో 1970–1980 కాలంలో జరిగే కథ ఇది. గతంలో కొన్ని పీరియాడికల్ సినిమాలకు పని చేసిన అనుభవం నాకు ఉంది. అది ‘పెద్ది’కి ఉపయోగపడింది. ఈ సినిమాలో స్క్రాచ్ నుంచి వేసిన సెట్స్ 24 ఉంటాయి. అలా కాకుండా సెటప్స్ అయితే దాదాపు 60–70 పైనే ఉంటాయి. విజయనగరం ఏరియాలోని క్లాక్ టవర్, అక్కడి వీధులు... వీటన్నింటిని రీ క్రియేట్ చేశాం. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలను కూడా డిజైన్ చేశాం. కుస్తీ సన్నివేశాల కోసం అండర్‌గ్రౌండ్ సెటప్ వేశాం. ఒక సినిమాకి సెట్ వేసినప్పుడు అది ప్రేక్షకులకు సెట్ అని తెలియకూడదు. నా వరకు ‘పెద్ది’ సినిమాకు వేసిన సెట్స్‌ను అవి సెట్స్ అని ప్రేక్షకులు గ్రహించలేరు. ఈ సినిమాకి ఓ హిల్ స్టేషన్లా ఉండే ఊరు కావాలి. ఈ సెట్‌ను హైదరాబాద్‌లోని బూత్ బంగ్లాలో వేశాం. ఈ సెట్ వేయడం సవాల్‌గా అనిపించింది. ప్రస్తుతం నానీగారి ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్నాను. అలాగే చిరంజీవి–బాబీగార్ల కాంబినేషన్లోని సినిమాకు వర్క్ చేస్తున్నాను’’ అని చెప్పారు. -
రామ్ చరణ్ 'పెద్ది' ట్రయిలర్ రెడీ.. మూడో లుక్‌పై సస్పెన్స్
రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు లుక్స్ విడుదలయ్యాయి. మొదట పల్లెటూరి క్రికెటర్‌గా, ఆ తర్వాత పహిల్వాన్ గెటప్‌లో కనిపించిన చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ రెండింటికీ అదనంగా మూడో లుక్ కూడా ఉందన్న విషయం ఇటీవలే ప్రచారంలోకి వచ్చింది. కానీ దాన్ని మాత్రం చిత్రబృందం రహస్యంగా ఉంచుతోంది. తాజా సమాచారం ఏంటంటే పెద్ది సినిమా ట్రయిలర్ కట్ ఇప్పటికే రెడీ అయింది. దాన్ని ఈ నెల మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ట్రయిలర్లో మూడో లుక్‌ను చూపిస్తారా లేక సినిమా విడుదలయ్యాక థియేటర్లోనే చూడాలా అనేది ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్. దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటివరకు ఈ సినిమా కథాంశంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ట్రయిలర్లో మాత్రం కథను కొంతవరకు టచ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పెద్ది సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏఆర్ రెహమాన్ రీ-రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శృతిహాసన్ ఓ ఐటెం సాంగ్ చేసింది. ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్‌పైనే ఉంది. ముఖ్యంగా చరణ్ మూడో లుక్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
పెద్దిలో చరణ్ మూడో లుక్.. మెగా అభిమానులకు సర్ ప్రైజ్
-
'ఆ విషయంలో నన్ను క్షమించండి.. పెద్ది తీసేయడం అంత ఈజీ కాదు'
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మేకర్స్ రిలీజ్ తేదీని ముందుకు తీసుకొచ్చారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన పెద్ది డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.బుచ్చిబాబు మాట్లాడుతూ.. 'ఏప్రిల్ 30న మేం రానందుకు నన్ను క్షమించండి. జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ సో మచ్. పెద్ది మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. పెద్దిని మీ హృదయాల్లోంచి తీసేయడం అంత ఈజీ కాదు. జూన్ 4న చరణ్ సార్‌పై ఉన్న నా ప్రేమను చూస్తారు. ఈ అవకాశమిచ్చిన చరణ్ సార్‌కు ధన్యవాదాలు' తెలిపారు. ఈ ప్రెస్‌మీట్‌కు దర్శకుడు సుకుమార్, నిర్మాత సతీశ్ కిలారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా హాజరయ్యారు. -
మెగా ఫ్యాన్స్‌కు పండగే.. కాస్తా ముందుగానే పెద్ది రిలీజ్
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. దీంతో కాస్తా ముందుగానే పెద్దిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని ఐటమ్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సాంగ్ షూట్ కూడా పూర్తయింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన పెద్దిని ఎట్టకేలకు జూన్ 4న బిగ్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
విసుగెత్తిస్తున్న 'వాయిదాలు'.. దీనికి పరిష్కారం లేదా?
ఏదైనా పని ఫలానా సమయానికల్లా పూర్తి చేస్తానని చెప్పి.. చేయకపోతే ఎలా ఉంటుంది? కచ్చితంగా కోపం వస్తుంది. ఒకవేళ ఇలా రెండు మూడుసార్లు జరిగితే నిజంగా పని పూర్తయినా సరే చేయలేదేమో అనే అనుమానం కలుగుతుంది. అలానే పని ఫెర్ఫెక్ట్గా చేసినా ఇంప్రెసివ్‌గా అనిపించకపోవచ్చు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తెలుగులో కొన్ని సినిమాల పరిస్థితి ఇలానే తయారైంది. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ప్రేక్షకులకే చిరాకు తెప్పిస్తున్నారు. దీనికి కారణమేంటి? పరిష్కారం లేదా?(ఇదీ చదవండి: ఎట్టకేలకు కొరటాల కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ అంటే ప్రతిఒక్కరూ కమిట్మెంట్లా ఫీలయ్యేవారు. ఒకవేళ చెప్పిన తేదీకి రిలీజ్ చేయకపోతే నెగిటివ్ సెంటిమెంట్లా భావించేవారు. కానీ ఇప్పుడు వాయిదాలు అనేవి చాలా సాధారణం అయిపోయాయి. టెక్నికల్ అంశాల వల్ల ఇలా చేస్తున్నామని దాదాపు ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. కరోనా టైంలో షూటింగ్స్ సరిగా నడవక ఈ వాయిదాల పర్వం మొదలైంది. తర్వాత కరోనా వెళ్లిపోయింది గానీ వాయిదాలు మాత్రం అలానే ఉండిపోయాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. స్టార్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు. వేల కోట్ల కలెక్షన్స్ సాధిస్తున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ సరైన్ ప్లానింగ్ లేకపోవడంతో షూటింగ్స్ అనుకున్న టైంకి జరగకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి వాటి వల్ల పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడం తదితర అంశాలు విడుదల తేదీలని పదేపదే మార్చేందుకు కారణమవుతున్నాయి. కొన్ని సినిమాలైతే అంతా సిద్ధమైపోయినా సరే ఎందుకో వాయిదా వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)గతం గురించి అక్కర్లేదు. టాలీవుడ్లో ప్రస్తుత పరిస్థితి ఓసారి చూసుకుంటే.. రామ్ చరణ్ 'పెద్ది'ని తొలుత మార్చి 27న రిలీజ్ చేస్తామని అన్నారు. ఆపై ఏప్రిల్ 30 అన్నారు. ఇప్పుడేమో జూన్‌లో థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అక్కినేని అఖిల్ 'లెనిన్' చిత్రాన్ని తొలుత మే 01న రిలీజ్ అని ప్రకటించారు. 'పెద్ది' కారణంగా జూన్ 26కి వాయిదా వేశారు. ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీని లెక్క ప్రకారం ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితం వెల్లడించారు. తీరా చూస్తే ఏకంగా ఏడాది వాయిదా వేసి వచ్చే జూన్ అని పోస్టర్ వదిలారు. కన్నడ డబ్బింగ్ చిత్రం 'టాక్సిక్' అయితే ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి.సరే పైన చెప్పినవన్నీ స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ షెడ్యూల్స్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి వాటి వల్ల ఆలస్యమైందిలే అనుకోవచ్చు. కానీ సమంత లీడ్ రోల్ చేసిన 'మా ఇంటి బంగారం'ని మే 15 నుంచి జూన్ 4కి మార్చారని టాక్ వినిపిస్తోంది. నిఖిల్ చేసిన పీరియాడిక్ మూవీ 'స్వయంభు' అయితే ఫిబ్రవరి నుంచి అప్పుడు ఇప్పుడు అని చెబుతున్నారు గానీ రిలీజ్ డేట్ ప్రకటించలేకపోతున్నారు. నాని 'ప్యారడైజ్' అయితే తొలుత మార్చి అన్నారు. తర్వాత ఆగస్టు అన్నారు. ఇప్పుడసలు ఈ ఏడాది రాకపోవచ్చని అంటున్నారు. సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు' అయితే అనుకున్న బడ్జెట్ దాటేసిందని, షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయిందని అంటున్నారు. ఎప్పుడో విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: సత్య 'జెట్లీ' సినిమా రివ్యూ)ఇలా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ పోతే సదరు సినిమాలపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడిపోతుంది. థియేటర్‌కి వెళ్లి చూసిన తర్వాత నచ్చితే పర్లేదు. ఒకవేళ అలా కాకపోతే మాత్రం ఇంతోటి దానికి ఇన్ని వాయిదాలు వేశారా అని ముఖం మీదే అనేస్తారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఇది కేవలం ఆ ఒక్క సినిమాపైనే ప్రభావం చూపడం కాదు. మొత్తం టాలీవుడ్ వ్యవస్థ నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అదే జరిగితే తెలుగు ప్రేక్షకుడు ఇంకా థియేటర్‌కి దూరమయ్యే పరిస్థితి ఏర్పడొచ్చు.మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉండొచ్చు. స్టార్ హీరోల చిత్రాల్ని ప్రకటించేటప్పుడు ఆర్భాటంగా డేట్స్ కూడా ప్రకటించేయకుండా ఔట్పుట్ రెడీ అయిన దానిబట్టి విడుదల తేదీపై క్లారిటీ ఇస్తే బెటర్. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
'పెద్ది'లో చరణ్ మూడో లుక్..? మెగా అభిమానులకు సర్ ప్రైజ్!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పెద్ది. పెద్దిపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లుక్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో చరణ్‌కు మూడో లుక్ కూడా ఉందని తెలుస్తోంది. కానీ దాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారట. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఫిట్నెస్ ట్రయినర్ వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.పెద్ది సినిమా తొలి టీజర్లో చరణ్ పల్లెటూరి క్రికెటర్‌గా కనిపించాడు. ఇటీవల పెద్ది పహిల్వాన్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ రెండూ మాత్రమే కాకుండా చరణ్‌కు ఈ చిత్రంలో మరో లుక్ కూడా ఉందనేది తాజా సమాచారం. ఈ మూడో లుక్ మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరికీ పెద్ద సర్ప్రైజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.ఇక ఇదిలా ఉంటే.. మరోవైపు పెద్ది విడుదల తేదీపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు జూన్ చివరి వారం రిలీజ్ అని ప్రకటించాడు. కానీ ఇప్పుడు కొత్త ఊహాగానం చెలరేగుతోంది. టాక్సిక్ విడుదల వాయిదా పడటంతో ఆ తేదీకి, అంటే జూన్ 4వ తేదీకి పెద్ది వస్తుందనే ప్రచారం మొదలైంది.చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
రామ్ చరణ్ పెద్ది.. రిలీజ్ డేట్ మారనుందా?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామి బుచ్చిబాబు ఇటీవలే ఓ ఈవెంట్లో ప్రకటించారు. ఓ ఐటమ్ సాంగ్ షూట్ పెండింగ్‌లో ఉండగా.. దాదాపు అది కూడా ఈ రోజుతో పూర్తయింది. దీంతో మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.రిలీజ్ డేట్ మారే ఛాన్స్..?అయితే పెద్ది మూవీ కాస్తా త్వరగానే ప్రేక్షకుల ముందుకు రానుందని నెట్టంట టాక్ వినిపిస్తోంది. జూన్ 4 రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఆ రోజు విడుదల కావాల్సిన యశ్ టాక్సిక్ ఊహించినట్లే వాయిదా పడింది. దీంతో పెద్దిని 4 వ తేదీని రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మెగా ఫ్యాన్స్‌కు పండగే. అనుకున్న టైమ్ కంటే ముందుగానే పెద్దిని బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం రానుంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
కొత్త అఖిల్‌ని చూస్తారు.. నాగార్జున ఫస్ట్ రివ్యూ
హీరోగా 100వ సినిమా చేస్తున్న నాగార్జున.. మరోవైపు కొడుకు అఖిల్ 'లెనిన్' చిత్ర బాధ్యతలని కూడా చూసుకుంటున్నారు. ఇప్పటికే ఐదు సినిమాలు చేసినప్పటికీ అఖిల్‌కి సక్సెస్ దక్కలేదు. దీంతో ఈసారి అంతా పక్కాగా ఉండేలా చూసుకుని 'లెనిన్' తీశారు. కానీ షూటింగ్ ఆలస్యం, 'పెద్ది' కారణంగా ఇది వాయిదా పడింది. చరణ్ సినిమా మరోసారి వాయిదా పడి జూన్ 25కి షిఫ్ట్ కావడంతో అఖిల్ తప్పుకొంటాడని అనుకున్నారు. కానీ ఇప్పుడా విషయంపైనా క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..)అఖిల్, భాగ్య శ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన 'లెనిన్' మూవీని మే 01న థియేటర్లలోకి తీసుకొస్తామని తొలుత ప్రకటించారు. కానీ షూటింగ్, ఇతరత్రా పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసుకున్నారు. జూన్ 26న రిలీజ్ చేస్తామని అధికారికంగా అనౌన్స్ చేశారు. కానీ రామ్ చరణ్ 'పెద్ది' కూడా జూన్ 25న వస్తుందనేసరికి అఖిల్ సైడ్ అవుతాడని అనుకున్నారు. కానీ చెప్పిన తేదీకే వస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన నాగార్జున స్పష్టం చేశారు.'నిన్న రాత్రి 'లెనిన్' సినిమా ఫస్ట్ కట్ చూశాను. మీరు కొత్త అఖిల్‌ని చూస్తారని గర్వంతో నమ్మకంగా చెబుతున్నా. డేట్ గుర్తుపెట్టుకోండి జూన్ 26న థియేటర్లలో కలుద్దాం' అని నాగార్జున ట్వీట్ చేశారు. అంటే 'పెద్ది' చిత్రం 25న వస్తుందని తెలిసినా సరే బరిలో ఉన్నారంటే ఈసారి బాక్సాఫీస్ దగ్గర మెగా vs అక్కినేని అనమాట. ఈ రెండు చిత్రాలు కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ నేపథ్య కథతో తీయడం విశేషం. మరి చెప్పిన మాటకు కట్టుబడి ఒకరోజు తేడాతో వస్తారా? లేదంటే 'లెనిన్' వాయిదా బాట పడతాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: హీరో విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన సినిమా! ఓటీటీలో స్ట్రీమింగ్) -
శృతి హాసన్ స్పెషల్ సాంగ్ కోసం 5 కోట్ల...?
-
పెద్ది, ది ప్యారడైజ్ చిత్రాలకు ఒకేరోజు లీకుల షాక్
టాలీవుడ్ అభిమానులు రెండు భారీ బడ్జెట్ సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ 'పెద్ది', నాని 'ది ప్యారడైజ్' ఈ రెండు చిత్రాలు ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి విడుదల కావాల్సి ఉండగా తర్వాత వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, ఒకేరోజు ఈ రెండు సినిమాల షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని వీడియో క్లిప్ప్ లీక్ అయ్యాయి. దీంతో మేకర్స్ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.దర్శకుడు బుచ్చిబాబు ఒక సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ.. జూన్ 25న పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ సాంగ్ షూటింగ్ చేస్తున్నామని బుచ్చిబాబు అన్నారు. హైదరాబాద్‌లో వేసిన ఒక సెట్స్‌లో పెద్ది ఐటెమ్ సాంగ్ జరుగుతుంది. తాజాగా రామ్ చరణ్, శ్రుతి హాసన్ డ్యాన్స్ క్లిప్పింగ్స్ షూటింగ్ ప్రదేశం నుంచి లీక్ అయ్యాయి. పెద్ది ఐటెమ్ సాంగ్‌పై భారీ క్రేజ్ ఉంది. ‘ఆగడు’ సినిమాలో ‘జంక్షన్లో...’ అంటూ మహేష్ బాబుతో స్టెప్పులు వేసిన శ్రుతి హాసన్.. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి ఐటెమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్‌లో క్రేజ్‌ను పెంచారు.నాని 'ది ప్యారడైజ్' నుంచి కూడా ఒక ఒక ఫైట్ సీన్ లీక్ అయింది. ఇలా రెండు భారీ సినిమాల నుంచి కొన్ని వీడియోలు లీక్ కావడంతో అభిమానులలో ఉత్సాహం పెరిగినప్పటికీ, చిత్రనిర్మాతలలో ఆందోళన నెలకొంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న 'ది ప్యారడైజ్' ఆగష్టు 21, 2026న రానుంది. -
రెండోసారి పెద్ది వాయిదా.. అసలు కారణం ఇదే..!
రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. ఈ స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ రామ్ చరణ్‌తో కలిసి డ్యాన్స్ చేయనుంది. అయితే పెద్ది మూవీ జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ రెండుసార్లు వాయిదా పడడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అసలు కారణాలేంటని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్ వల్లే వాయిదా వేశారని కొందరు భావిస్తున్నారు. కానీ ఇతర కారణాల వల్లే రెండోసారి వాయిదా వేశారని అంటున్నారు. అసలు ప్రధాన కారణం ఇదేనని సోషల్ మీడియాలో వైరలవుతోంది.పెద్ది మూవీ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో చరణ్ గెటప్‌కు సంబంధించిన సీజీ వర్క్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం. అందువల్లే ఏప్రిల్ 30 నుంచి జూన్‌కు పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. పీరియాడిక్ నేపథ్యానికి తగ్గనట్లుగా ప్రతి ఫ్రేమ్‌ను జాగ్రత్తగా రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అభిమానులకు మరింత అనుభూతి ఇచ్చేందుకే ఈ మూవీని వాయిదా వేయాల్సి వచ్చిందని మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని జూన్ 25 రిలీజ్ చేయనున్నారు. -
టాలీవుడ్ అప్డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడో తెలుసా?
టాలీవుడ్ నుంచి ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలంతా ఇప్పుడు షూటింగ్లో బిజీ అయిపోయారు. వీరితో పాటు సీనియర్ హీరోలు నాగార్జున, బాలకృష్ణ, వెంకటెశ్ కూడా సమ్మర్‌లోనూ సెట్స్‌లోనే ఉంటున్నారు. మరి ఏ హీరో ఎక్కడ ఉన్నాడు? కొత్త సినిమాల షూటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది? ఓ లుక్కేయండి.🎥 ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది🎥 అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న రాకా మూవీ షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ప్రస్తుతం బన్నీ ముంబైలోనే ఉన్నాడు.🎥 ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అక్కడ వేసిన ఓ సెట్లో కీలకమైన సన్నివేశలు షూట్ చేస్తున్నారు.🎥 రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా షూటింగ్ వన్ స్టూడియో శంకరపల్లి లో జరుగుతోంది. అక్కడే ఓ సెట్లో ఐటమ్ సాంగ్ షూట్ చేస్తున్నారు.🎥 నందమూరి బాలకృష్ణ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ జన్వాడ గుంటూరు కారం సెట్ లో జరుగుతోంది.🎥 కార్తీక్ డైరెక్షన్లో నాగార్జున హీరోగా కెక్కుతున్న సినిమా షూటింగ్ ఎల్బీ నగర్ లో జరుగుతుంది. నాగార్జున కెరీర్లో 100వ సినిమా ఇది.🎥 వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది.🎥 నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతుంది.🎥 విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నటిస్తున్న రణబాలి సినిమా షూటింగ్ గండిపేట సెట్ లో జరుగుతుంది.🎥 రవితేజ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.🎥 శర్వానంద్ సంపత్ నంది కాంబోలో తెరకెక్కుతున్న భోగి సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతోంది.🎥 రష్మిక , రవీంద్ర పుల్లే డైరెక్షన్ లో నటిస్తున్న మైసా సినిమా షూటింగ్ కేరళ లో జరుగుతోంది.🎥 శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ శంకర పల్లి లో జరుగుతుంది.🎥 గోపీచంద్ సంకల్ప్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న భరతవర్ష సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. -
'పెద్ది' సందేహాలన్నీ క్లియర్ చేసిన బుచ్చిబాబు
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు జూన్‌లో వస్తుందని అధికారికంగా ప్రకటించారు గానీ తేదీ ఎప్పుడనేది ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. అలానే ఐటమ్ సాంగ్ షూటింగ్ ఎప్పుడు చేస్తారు? అందులో చేసే బ్యూటీ ఎవరు? తదితర వివరాలపై స్పష్టత రాకపోయేసరికి అభిమానులు ఫ్రస్టేట్ అవుతున్నారు. ఇప్పుడు వీటన్నింటిపై దర్శకుడు బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)ధనుష్ 'కర' సినిమా ఈనెల 30న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న దర్శకుడు బుచ్చిబాబు.. జూన్ 25న 'పెద్ది' సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రకటించాడు. అలానే ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుందని చెప్పాడు. దీంతో చరణ్ అభిమానులు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో 'పెద్ది' తీస్తున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తుండగా.. జగపతిబాబు, దివ్యేందు తదితరుల ఇతర పాత్రలు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా అవి రెండూ సూపర్ హిట్ అయ్యాయి.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే?)#Peddi - 25th June 🔒#RamCharan pic.twitter.com/Jnrer2KFrY— Suresh PRO (@SureshPRO_) April 26, 2026 -
రామ్ చరణ్ పెద్ది రిలీజ్.. భారీ రికార్డ్‌కు మేకర్స్ ప్లాన్..!
రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఈ సాంగ్‌ను హైదరాబాద్‌లోనే షూట్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులు వేయనుంది.అయితే పెద్ది మూవీ జూన్‌లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతలోనే పెద్ది ప్రీమియర్స్‌కు సంబంధించిన మరో క్రేజీ టాక్ వినిపిస్తోంది. పెద్ది సినిమా ప్రీమియర్స్ విషయంలో కొత్త రికార్డ్ సెట్ చేయనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూన్ 24 న సాయంత్రం ఆరు గంటల నుంచే పెద్దఎత్తున ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు రామ్‌చరణ్ స్పెషల్ సాంగ్‌లో స్టెప్స్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు. దీంతో పెద్ది మూవీపై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. త్వరలోనే పెద్ది రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. -
పెద్ది ఐటమ్ సాంగ్.. శృతి హాసన్‌కు భారీ రెమ్యునరేషన్..!
రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. పెద్ది ఐటమ్ సాంగ్ కోసం పలువురు హీరోయిన్స్‌ను పరిశీలించగా.. చివరికీ కోలీవుడ్ భామ శృతిహాసన్ పేరు ఖరారు చేశారు.ప్రస్తుతం ఈ సాంగ్‌ను హైదరాబాద్‌లోనే షూట్ చేస్తున్నారు. ఇవాళ ఈ సాంగ్ షూటింగ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శృతిహాసన్ రెమ్యునరేషన్‌పై టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ ఐటమ్ సాంగ్ కోసం దాదాపు రూ.3 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఈ కోలీవుడ్ బ్యూటీ జాక్‌పాట్ కొట్టేసినట్లే. కాగా.. ఈ పాటను టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌ను ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా.. పెద్ది మూవీ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే. రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్‌కు పోస్ట్‌పోన్ చేశారు. -
రామ్ చరణ్ పెద్ది రిలీజ్.. ఆ డేట్‌నే ఫిక్స్ చేశారా?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఓ ఐటమ్ సాంగ్ మినహా దాదాపు షూటింగ్ అంతా పూర్తయింది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ రెండోసారి కూడా వాయిదా పడింది. ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావాల్సిన పెద్దిని జూన్‌కు షిఫ్ట్ చేశారు.అయితే రిలీజ్ తేదీని మాత్రం అఫీషియల్‌గా ప్రకటించలేదు. దీంతో పెద్ది విడుదల తేదీపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ మూవీ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్దిని జూన్ 25న విడుదల చేస్తారని లేటేస్ట్ టాక్. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందన్న వార్త హల్చల్ చేస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు పెద్ది మేకర్స్ స్పందించలేదు. రాబోయే రోజుల్లో పెద్ది రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుంది.కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కోసం శృతి హాసన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. -
పెద్దిలో శృతి స్పెషల్ సాంగ్.. బుచ్చి ప్లాన్ మాములుగా లేదుగా
-
పెద్ది ఐటమ్ సాంగ్.. ఎట్టకేలకు స్టార్ హీరోయిన్ ఫిక్స్..!
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ వాయిదా వేయడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇంకా ఓ ఐటమ్ సాంగ్ షూట్ పెండింగ్‌లో ఉండడంతో ఏప్రిల్ 30న రావాల్సిన పెద్ది జూన్‌కు షిఫ్టయ్యాడు. అయితే ఇప్పటి వరకు ఐటమ్ సాంగ్ కోసం హీరోయిన్ ఎంపిక చేయకపోవడంతో ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. రోజుకొక హీరోయిన్ పేరు వినిపిస్తున్న వీటిపై అధికారిక ప్రకటనైతే రాలేదు.ఇటీవలే సంయుక్త మీనన్ ఈ ఐటమ్ సాంగ్ చేయనుందని టాక్ వినిపించింది. గతంలో మృణాల్ ఠాకూర్, మానస అని పలువురు కూడా తెరపైకొచ్చాయి. కానీ అంతలోనే ఊహించని మరో స్టార్ హీరోయిన్ పేరు బయటకొచ్చింది. పెద్ది ఐటమ్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతి హాసన్ చేయనుందని లేటేస్ట్ టాక్ నడుస్తోంది. దాదాపు శృతిని మేకర్స్ ఖరారు చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఒకవేళ ఇదే నిజమైతే పెద్ది సరసన శృతి హాసన్ చిందులేయనుంది. ఈ ఐటమ్ సాంగ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ సాంగ్ కచ్చితంగా స్పెషల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. -
'పెద్ది' ఇంకెన్నాళ్లు? అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా షూటింగ్ సాగుతూ..నే ఉంది. లెక్క ప్రకారం గత నెలలో రిలీజ్ అని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు. తీరా డేట్ దగ్గరపడేసరికి నెల తర్వాత అంటే ఏప్రిల్ 30 పక్కా విడుదల చేస్తామని ఏకంగా పోస్టర్ వదిలారు. కొన్నిరోజుల ముందు మళ్లీ వాయిదా అని షాకిచ్చారు. జూన్‌లో వస్తుందని ప్రకటించారు కానీ డేట్ చెప్పలేదు. జూన్ కూడా వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ టైంలో దర్శకుడు బుచ్చిబాబు.. షూటింగ్ అప్డేట్ ఇచ్చాడు. పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా)మరో ఆరు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుందని చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు.. 'మై పెద్ది' అని క్యాప్షన్ ఇచ్చి రామ్ చరణ్‌తో దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే ఐటమ్ సాంగ్ చిత్రీకరణ చివరలో పెట్టుకున్నారనమాట. ఈ పాటలో చరణ్‌తో డ్యాన్స్ చేసేందుకు హీరోయిన్ సంయుక్తని తీసుకున్నారని రూమర్స్ వచ్చాయి. బహుశా ఈమెనే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయితే రెహమాన్ వర్క్ మొదలవుతుంది. ఈయన టైంకి ఔట్పుట్ డెలివరీ చేస్తేనే జూన్‌కి సినిమా వస్తుంది. లేదంటే మళ్లీ వాయిదా తప్పదు.విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా తీస్తున్న 'పెద్ది'లో చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లు. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులోని ఐటమ్ సాంగ్ కోసం మృణాల్ ఠాకుర్, మానస వారణాసి తదితరుల పేర్లు వినిపించాయి. ఈ స్పెషల్ సాంగ్ కోసం బ్యూటీ దొరక్కే షూటింగ్ ఇన్నాళ్ల పాటు ఆలస్యమైందనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఏదైతేనేం ఎట్టకేలకు షూటింగ్ అయితే ముగించేస్తున్నారనమాట.(ఇదీ చదవండి: అందరూ ఫెయిల్! మలయాళీ సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?) View this post on Instagram A post shared by Buchi babu sana (@buchibabu_sana) -
'పెద్ది' కష్టం.. 5 నిమిషాల సీన్‌కు 3నెలల సమయం
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పెద్ది’.. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కోసం పనిచేసిన ఫ్రేమ్ ఎక్స్ వీఎఫ్ఎక్స్ సంస్థ అధినేత నిలేష్ పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మూవీ వీఎఫ్ఎక్స్ పనిగురించి మాట్లాడారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీత స్వరకర్త.పెద్ది సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్‌కు సంబంధించి ఫ్రేమ్ ఎక్స్ అనే సంస్ధ పనిచేస్తుంది. మూవీలోని కొన్ని సీన్స్ గురించి ఆ సంస్థ అధినేత నిలేష్ పలు వ్యాఖ్యలు చేశారు.పెద్ది సినిమాలోని 5 నిమిషాల రెజ్లింగ్ సీన్ వీఎఫ్ఎక్స్ కోసం చాలా ఎక్కువ సమయం పడిందని ఆయన అన్నారు. ఈ సీన్ పూర్తి చేసేందుకు సుమారు 3నెలల సమయం పడినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. వీఎఫ్ఎక్స్ పని ఫ్రేమ్ వారీగా ఉంటుందని, ఒక నిమిషానికి 1440 ఫ్రేమ్‌లు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల, ప్రతి ఫ్రేమ్‌లో చేసిన మెరుగుదల పరిధిని బట్టి పని ఖర్చు మారుతుంది" అని ఆయన చెప్పారు.పెద్ది గురించి నిలేష్ ఇచ్చిన అప్డేట్ అభిమానులను ఖచ్చితంగా సంతోషపరుస్తుంది. ఎందుకంటే ఎలాంటి రాజీ లేకుండా ప్రేక్షకులకు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభూతిని అందించాలనే లక్ష్యంతో చిత్ర బృందం విఎఫ్ఎక్స్ (VFX) కోసం తగినంత సమయాన్ని కేటాయిస్తోంది. పెద్ది మూవీలో రామ్‌చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. -
'పెద్ది' ఐటమ్ కోసం ఊహించని హీరోయిన్?
రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు మామూలు కష్టాలు లేవు. మార్చి, ఏప్రిల్‌లో రిలీజ్ అనుకుంటే రెండుసార్లు వాయిదా పడింది. జూన్‌లో కచ్చితంగా వస్తుందని నిర్మాత ప్రకటించారు కానీ తేదీ ఎప్పుడు అనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు 'పెద్ది'తో కాలు కదిపేందుకు ఐటమ్ సాంగ్ హీరోయిన్ దొరకట్లేదు. మృణాల్, మానస అని పలువురు బ్యూటీస్ పేర్లు గతంలో వినిపించగా ఇప్పుడు ఊహించని భామ పేరు తెరపైకి వచ్చింది.(ఇదీ చదవండి: 'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)మలయాళ భామ సంయుక్తని ప్రస్తుతం 'పెద్ది' ఐటమ్ కోసం పరిశీలిస్తున్నారట. ఈమె అయినా ఫిక్సవుతుందా లేదా అనేది పక్కనబెడితే సంయుక్త పేరు మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. కెరీర్ ప్రారంభం నుంచి పెద్దగా గ్లామర్ చూపించని ఈమె.. గత చిత్రం 'అఖండ 2'లో జాజికాయ అంటూ సాగే పాటలో మాత్రం అందాలన్ని ఆరబోసింది. అటు డ్యాన్స్, ఇటు అందంతో ఆకట్టుకుంది. బహుశా ఆ సాంగ్ చూసి 'పెద్ది' కోసం అడిగారేమో అనిపిస్తుంది.సంయుక్త హీరోయిన్గా చేసిన 'స్వయంభు'.. పాన్ ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు 'బ్లాక్ గోల్డ్' అనే లేడీ ఓరియెంటెడ్ తెలుగు మూవీ చేస్తోంది. విజయ్ సేతుపతితో చేసిన 'స్లమ్ డాగ్' కూడా రిలీజ్ కావాల్సి ఉంది. హిందీ, తమిళ, మలయాళంలో తలో చిత్రం చేస్తోంది.భీమ్లా నాయక్, బింబిసార, సర్, విరూపాక్ష, నారీ నారీ నడుమ మురారీ తదితర చిత్రాలతో సక్సెస్‌లు అందుకున్న సంయుక్త.. 'పెద్ది'లో ఐటమ్ సాంగ్ చేస్తే మాత్రం కచ్చితంగా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అవుతుంది.(ఇదీ చదవండి: లెజెండరీ డైరెక్టర్ ఇలా అయిపోయారేంటి? వైరల్ వీడియో) -
లేట్ అయినా లేటెస్ట్గా...
చిత్ర పరిశ్రమలో సినిమాకి కొబ్బరికాయ కొట్టిన రోజే విడుదల తేదీ ప్రకటిస్తుంటారు కొందరు మేకర్స్. మరికొందరు సినిమా షూటింగ్, ఔట్పుట్, పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యే సమయాన్ని బట్టి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తుంటారు. ఇంకొందరేమో సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండగలతో పాటు వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని తమ సినిమాలను ఫలానా తేదీకి విడుదల చేస్తామని ప్రకటిస్తుంటారు. అయితే చెప్పిన తేదీకి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పరిస్థితులు ఒక్కోసారి ఉండక పోవచ్చు.షూటింగ్స్ ఆలస్యం, పోస్ట్ ప్రోడక్షన్, వీఎఫ్ఎక్స్, డేట్స్ క్లాష్... వంటి కారణాల వల్ల సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చేర్పులు జరుగుతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో కామన్ అయింది. ఏది ఏమైనా కానీ కంటెంట్, ఔట్పుట్, క్వాలిటీ... ఇలా ఏ విషయంలోనూ తగ్గేదే లే అంటూ లేట్ అయినా లేటెస్ట్గా వస్తాం అంటున్నారు తమ సినిమా విడుదలను వాయిదా వేసుకున్న కొందరు దర్శక–నిర్మాతలు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’, ఎన్టీఆర్ ‘ఎన్టీఆర్‌నీల్’, రామ్‌చరణ్ ‘ పెద్ది’, నాని ‘ది ప్యారడైస్’, అఖిల్ ‘లెనిన్’, నిఖిల్ ‘స్వయంభు’, సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, తమిళ హీరో విజయ్ ‘జన నాయగన్’ వంటి సినిమాల విడుదల తేదీలు ముందే ఖరారు అయినప్పటికీ వాయిదా పడ్డాయి. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం... విశ్వంభర ఎప్పుడు? చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. తనయుడు రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం తన ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేసుకున్నారు చిరంజీవి. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న రిలీజ్ చేశారు. ‘‘గేమ్ చేంజర్’ సినిమా కోసం ‘దిల్’ రాజుగారు అడగడంతో ‘విశ్వంభర’ సినిమా విడుదలను వాయిదా వేశాం’’ అంటూ నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతికి విడుదల వాయిదా పడిన ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందని అందరూ భావించినప్పటికీ రిలీజ్ కాలేదు. 2025 మే 9న సినిమా విడుదల కానుందనే వార్తలు గతంలో వినిపించాయి. ఆ తర్వాత జూలై 24న ‘విశ్వంభర’ థియేటర్లలోకి రానున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ రాలేదు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్కి ప్రాధాన్యం ఉందట. ఈ పనుల ఆలస్యం వల్లే రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. 2025 జనవరి 10న రిలీజ్ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తన పుట్టినరోజున (ఆగస్టు 22) చిరంజీవి ఓ వీడియో రిలీజ్ చేసి, ‘‘చందమామ కథలాంటి ‘విశ్వంభర’ సినిమా 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది’’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే వేసవి మొదలైనప్పటికీ ఈ చిత్రం విడుదల తేదీపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. మరి... ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు వచ్చేదెన్నడు? అనే ప్రశ్నకు సమాధానం కోసం మరికొన్ని రోజులు నిరీక్షణ తప్పదు. జూన్‌లో ఎన్టీఆర్ నీల్? ‘దేవర: పార్ట్ 1’ వంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్ 1, 2, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ మేకోవర్ అయిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో కాస్త బొద్దుగా కనిపించే ఆయన మరో పాత్ర కోసం బాగా సన్నబడ్డారు. జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫొటోని ఇటీవల ఆయన షేర్ చేయగా కండలు తిరిగిన దేహంతో ఉన్న ఈ పిక్ వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతిదీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్, అలాగే సుమారు 2000 మందితో తెరకెక్కించిన ఓ పాట, హైదరాబాద్ సమీపంలోని ఓ స్టూడియోలో సుమారు రూ. 15 కోట్ల తో ఎన్టీఆర్ ఇంటి సెట్‌ని నిర్మించడం హైలెట్‌గా మారాయి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియన్ మూవీని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీకి సినిమాని రిలీజ్ చేయడం లేదని యూనిట్ ప్రకటించింది. జనవరి 9న కాకుండా జూన్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ జూన్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదా అన్నది వేచి చూడాలి. జూన్‌లో పెద్ది రెడీరామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండి యన్ మూవీ ‘పెద్ది’. తొలి సినిమా ‘ఉప్పెన’తో (2021) బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ కోసం రామ్‌చరణ్ ఫుల్æమాస్ లుక్‌లోకి మారి పోయారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లకి అద్భుతమైన స్పందన వచ్చింది.ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి రిలీజైన ‘చికిరి చికిరి..., రై రై రారా...’ పాటలు చార్ట్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘పెద్ది’ నుంచి విడుదల చేసిన రామ్ చరణ్ శక్తివంతమైన కొత్త పోస్టర్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే... రామ్‌చరణ్ బర్త్ డే కానుకగా 2026 మార్చి 27న ‘పెద్ది’ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించినప్పటికీ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ రెండోసారి వాయిదా వేశారు.జూన్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ‘‘మాపై మీరు (ప్రేక్షకులు) చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. మీ ఓపికకు తగిన ప్రతిఫలం దక్కేలా అత్యుత్తమమైన కంటెంట్‌తో వస్తాం. విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తాం’’ అని ‘పెద్ది’ చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... సినిమాలోని టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కేవలం ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్, నేపథ్య సంగీతం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆగస్టులో ప్యారడైస్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. ఈ చిత్రంలో నానీని ఫుల్ మాస్ లుక్‌లో చూపించారు శ్రీకాంత్ ఓదెల. కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైస్’. ఈ మూవీలో మంచు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషి స్తున్నారు.పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు నాని. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్‌లో కనిపించగా అద్భుతమైన స్పందన వచ్చింది. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రయూనిట్ ప్రకటించింది.అయితే మార్చి 27న రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల అవుతుండటంతో డేట్స్ క్లాష్ అయ్యే కారణం వల్ల ఈ మూవీ రిలీజ్ ఉండక పోవచ్చనే చర్చ జరిగింది కూడా. అనుకున్నట్టుగానే ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలు, పాటలు, ఫైట్స్ దాదాపు పూర్తయినప్పటికీ టాకీ పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. అందుకే లేట్ అయినా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా లేటెస్ట్గా ఆడియన్స్ ముందుకు రావాలన్నది మేకర్స్ ఆలోచన.ఇదిలా ఉంటే.. ఆగస్టు 21న ‘ది ప్యారడైస్’ రిలీజ్ డేట్‌కి వరుసగా మూడు వారాల పాటు ఓనం, మిలాద్–ఉన్–నబీ, రాఖీ, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండగలు కలిసి రానున్నాయి. ఈ సెలవులు తమ సినిమాకి కలిసొస్తాయని చిత్రబృందం భావించి, ఈ తేదీ ఫిక్స్ చేసినట్లు టాక్. కాగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి నానీపై ఇప్పటికే విడుదల చేసిన ‘ఆయా షేర్..’ అంటూ సాగే ఇంట్రో సాంగ్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. లెనిన్ డేట్ ఫిక్స్అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘లెనిన్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం పక్కా మాస్ లుక్‌లోకి మారి పోయారు అఖిల్. పోడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో మేకోవర్ అయిన లుక్ ఆకట్టుకుంటోంది. పైగా రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగులకు కూడా మంచి స్పందన వస్తోంది.తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్ ‘వారేవా వారేవా...’కి చాలా మంచి స్పందన వచ్చింది. అదే విధంగా ఈ నెల 16న ఈ మూవీలోని ‘ఎట్టా ఎట్టా..’ అంటూ సాగే సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో హైలైట్‌గా నిలిచింది. అఖిల్ తన మాస్ స్టెప్స్‌తో అదరగొట్టగా, భాగ్యశ్రీ తన చార్మ్‌తో మెప్పించారు. ఇదిలా ఉంటే... ‘లెనిన్’ని మే 1న విడుదల చేయనున్నట్లు తొలుత అధికారికంగా ప్రకటించింది యూనిట్. అయితే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలను మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రెండు సినిమాల మధ్య కేవలం ఒక రోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో ‘లెనిన్’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ మూవీ విడుదలను మే 1వ తేదీ నుంచి జూన్ 26వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. అయితే అనూహ్యంగా ‘పెద్ది’ సినిమా కూడా ఏప్రిల్ 30 నుంచి జూన్‌కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కానీ తేదీ మాత్రం ఖరారు కాలేదు. ఈ లెక్కన చూస్తే ఇటు ‘పెద్ది’, అటు ‘లెనిన్’ సినిమాలు జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘లెనిన్’. బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథతో మురళీ కిశోర్ తెరకెక్కిస్తున్నారు. మా మూవీ ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. మేలో స్వయంభు ‘కార్తికేయ 2’ (2022) సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకోవడంతో పాటు అదే స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో నిఖిల్ సిద్ధార్థ. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన మరో పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. నిఖిల్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా ఈ మూవీ రూపొందింది. ఈ సినిమాకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మించారు. భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో 2026 ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తొలుత అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే టాకీ పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ వల్ల ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 10కి విడుదల వాయిదా వేశారు. కానీ ఆ తేదీకి కూడా రిలీజ్‌ని పోస్ట్ పోన్ చేశారు. అయితే కొత్త విడుదల తేదీ ఎప్పుడనే విషయాన్ని చిత్రయూనిట్ స్పష్టం చేయాలి. వార్తల్లో ఉన్న ప్రకారం మేలో విడుదలయ్యే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే... నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారాయన. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పూర్తి కాక పోవడంతో రిలీజ్ వాయిదా పడిందని ఫిల్మ్‌నగర్ టాక్.ఈ మూవీని 2డీ, త్రీడీ ఫార్మాట్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ మూవీస్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ‘‘దర్శకుడు భరత్ కృష్ణమాచారి తన విజన్‌ను ‘స్వయంభు’లో భారీ స్థాయిలో ప్రజెంట్ చేశారు. ప్రత్యేకించి యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి. ‘స్వయంభు’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది’’ అని యూనిట్ పేర్కొంది. సంబరాలు ఎప్పుడు?సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటించగా, జగపతి బాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘హను–మాన్’ (2024) వంటి పాన్ ఇండియన్ హిట్ మూవీ నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘సంబరాల ఏటిగట్టు’ రూపొందించారు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం కోసం సాయిదుర్గా తేజ్ ప్రత్యేకంగా కండలు తిరిగిన దేహంతో, గుబురు గడ్డంతో ఫుల్‌గా మేకోవర్ అయ్యారు. ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2025 సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. అనంతరం పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనే విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాల విడుదల తేదీల్లోనూ మార్పులు జరిగే అవకాశం లేక పోలేదు. – డేరంగుల జగన్ మోహన్ -
'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి కష్టాలు మామూలుగా లేవు. తొలుత మార్చిలో రిలీజ్ అన్నారు. పని ఇంకా పూర్తవ్వకపోయేసరికి ఏప్రిల్ చివరలో కచ్చితంగా విడుదల చేస్తాం అని మాటిచ్చారు. తీరా ఈసారి కూడా మాట తప్పి జూన్‌లో థియేటర్లలోకి వస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈసారి తేదీ వెల్లడించనప్పటికీ బయట రూమర్స్ మాత్రం వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్)ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రకారం.. 'పెద్ది' మూవీని జూన్ 4న థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. ఈ తేదీ దాదాపుగా ఖరారు అయినప్పటికీ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత దీనిని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ డేట్‌కి వస్తామని ఇప్పటికే యష్ 'టాక్సిక్' సినిమా ఖర్చీఫ్ వేసుకుంది. మరి 'పెద్ది' కూడా అదే తేదీకి వస్తే రెండు పాన్ ఇండియా చిత్రాల మధ్య పోటీ నెలకొంటుంది. అప్పుడు ఇద్దరిలో పైచేయి ఎవరిది అవుతుందో చూడాలి?స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న 'పెద్ది'లో చరణ్.. క్రికెట్, కుస్తీ క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకుడు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడేసరికి చాలామంది దీనిపై మెల్లగా ఆసక్తి తగ్గుతోంది. ఒకవేళ మూడోసారి కూడా వాయిదా పడితే గనుక మరింత డ్యామేజీ కావడం గ్యారంటీ. మరి టీమ్ ఈసారి ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'దేవర 2' కంటే ముందు కొరటాల నుంచి మరో హిట్ సినిమా సీక్వెల్?) -
పెద్ది స్పెషల్ సాంగ్ లో మృణాల్ ఫిక్స్.. హింట్ ఇచ్చిన చెర్రీ..!
-
వైట్ డ్రెస్ ఔట్ఫిట్లో జాన్వీ కపూర్ (ఫోటోలు)
-
పెద్ది మరోసారి వాయిదా...రామ్ చరణ్ అనుకున్నదే జరిగింది.
-
అనుకున్నదే జరిగింది.. పెద్ది మరోసారి వాయిదా
రామ్ చరణ్ పెద్ది విషయంలో అనుకున్నదే జరిగింది. ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది మూవీ టీమ్. ఈ చిత్రాన్ని జూన్‌కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దీంతో మెగా ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మార్చి 19న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఏప్రిల్ 30న రానుందని ముందుగా ప్రకటించారు. తాజాగా మరోసారి వాయిదా వేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ నోట్ రిలీజ్ చేసింది.నిర్మాణ సంస్థ తమ నోట్లో రాస్తూ.. 'మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. గ్లింప్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పెద్ది మూవీ పట్ల మీ ప్రేమకు చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పటికే సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. కేవలం ఓ సాంగ్ షూట్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడే ఎడిట్ కాపీని చూశాం. అద్భుతంగా వచ్చింది. కానీ మీకు మరింత అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించడం కోసం కృషి చేస్తున్నాం. మరింత ఫర్ఫెక్షన్తో మీ ముందుకొస్తాం. జూన్‌లో పెద్దిని మీ ముందుకు తీసుకొస్తాం. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. మీ సపోర్ట్, ఓపికకు మరోసారి ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. ఈ సినిమాకు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో గ్లోబల్ స్టార్ చెర్రీ రెజ్లర్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకున్నారు.We want to give our audience nothing but the best.#PEDDI in cinemas this June ❤🔥 pic.twitter.com/jA5aq7dnW0— Vriddhi Cinemas (@vriddhicinemas) April 15, 2026 -
'పెద్ది' సర్ప్రైజ్.. పదేళ్ల తర్వాత మళ్లీ చరణ్‌తో సినిమా
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ ‘పెద్ది’. కొద్దిరోజుల క్రితం విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. దీంతో పెద్ది రాక కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి సీనియర్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడైంది. సడెన్ సర్ప్రైజ్ ఇచ్చేలా ఉన్న ఈ అప్డేట్ చాలామందిలో ఆసక్తిని పెంచుతుంది.గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న 'పెద్ది'లో సినీయర్ నటుడు సాయికుమార్ నటిస్తున్నారని క్లారిటీ వచ్చేసింది. ఇటీవల ఒక అభిమాని చిత్రీకరించిన వీడియోతో ఈ చిత్రంలో ఆయన కూడా భాగమని వెల్లడైంది. పదేళ్ల క్రితం విడుదలైన 'ఎవడు' తర్వాత రామ్ చరణ్‌తో ఆయన తిరిగి కలవడం ఇదే మొదటిసారి. ఈ వార్త అభిమానులను ఉత్సాహపరుస్తున్నప్పటికీ, ఆయన పాత్ర వివరాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి. ఈ అంశం పెద్దిపై మరింత క్రేజ్ పెంచుతోంది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణపు చివరి దశలో ఉంది. ఇంకా ఒక ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించాల్సి ఉంది. అది పూర్తయిన తర్వాత, చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో ఘనంగా విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఏప్రిల్ 30న ‘పెద్ది’ విడుదల కానుందని ప్రకటించారు. అయితే, మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉంది. -
పెద్దిలో స్పెషల్ సాంగ్..?
-
ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్ మానస వారణాసి (ఫోటోలు)
-
పెద్ది ఐటమ్ సాంగ్.. టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌కు ఛాన్స్.!
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీని రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో ఈ స్టోరీ ఉండనుంది. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ హైలెట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 30న పెద్ది థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ కూడా ఉండనుంది. ఈ పాటకు ఇప్పటికే మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.తాజాగా టాలీవుడ్లో మరో యంగ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీలో హిట్ కొట్టిన మానస వారణాసిని ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. యంగ్ హీరోయిన్ అయితే ఈ పాట మరింత హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సాంగ్ చేసేందుకు మృణాల్ ఠాకూర్ నో చెప్పినట్లు సమాచారం. అయితే మానస వారణాసి ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతకుముందు మానస వారణాసి మహేశ్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. -
'పెద్ది'.. అనుకున్నదే జరగనుంది!
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ఇప్పటికే రెండోసారి వాయిదా పడింది. ఈ నెల 30న థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే చెప్పినట్లు వస్తుందా రాదా అనేది ఇప్పటికీ సస్పెన్సే. రీసెంట్‌గానే ఓ మూవీ ప్రమోషన్లలో భాగంగానే 'పెద్ది' కూడా టైంకి వస్తుందని చెప్పండ్రా అంటూ స్వయంగానే చరణే అన్నాడు. కానీ తర్వాత హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో తేదీ ఏం వేయలేదు. దీంతో కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి.(ఇదీ చదవండి: 'అశ్వత్థామ'గా రామ్‌చరణ్.. ఆదిత్య ధర్‌తో చర్చలు?)ప్రస్తుతం చాలామంది అభిప్రాయపడుతున్నట్లే 'పెద్ది' మరోసారి వాయిదా పడటం దాదాపు కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. జూన్ నెలలోనే తొలివారం లేదా చివరి వారాన్ని పరిశీలిస్తున్నారట. రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటించబోతుందని టాక్. ఇది జరగడానికి చాలానే కారణాలున్నాయి. అందులో మొదటిది షూటింగ్ సమయానికి పూర్తి కాకపోవడం. ఇప్పటికీ ఓ పాట షూటింగ్‌తో పాటు రీ రికార్డింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.పాన్ ఇండియా మూవీ కాబట్టి అందుకు తగ్గట్లే దేశమంతా తిరిగి ప్రమోషన్లు చేయాల్సి ఉంది. చేతిలో మరో 20 రోజులు కూడా లేవు. ఇన్ని పనులు పూర్తి చేసి సినిమాని 30వ తేదీన తీసుకురావడం కష్టమే అనిపిస్తుంది. అందుకు జూన్ 4 లేదా 25వ తేదీకి వాయిదా పడనుందనే రూమర్స్ మళ్లీ వస్తున్నాయి. ఇకపోతే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది'లో జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రలు చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బుచ్చిబాబు దర్శకుడు.(ఇదీ చదవండి: అక్షయ్ కుమార్ 'భూత్ బంగ్లా' ట్రైలర్ రిలీజ్) -
పెద్దిలో ఐటం సాంగ్? భలే తప్పించుకుందే!
సీతారామం చిత్రంతో సెన్సేషన్ అయింది మృణాల్ ఠాకూర్. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా తను ప్రధాన పాత్రలో నటించిన మూవీ డెకాయిట్. ఇందులో సరస్వతిగా యాక్ట్ చేసింది. మరోవైపు రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న పెద్దిలోనూ ఐటం సాంగ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.పెద్దిలో ఐటం సాంగ్?తాజాగా డెకాయిట్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న మృణాల్‌కు పెద్దిలో ఐటం సాంగ్ గురించి ప్రశ్న ఎదురైంది. కానీ మృణాల్ సమాధానం చెప్పకుండా చాలా తెలివిగా తప్పించుకుంది. ఆమె మాట్లాడుతూ.. డెకాయిట్ కోసం ఏమైనా అడుగుతారని చూస్తున్నాను. సరే కానీ మీకో ఆసక్తికర విషయం చెప్పాలి. నా మాతృభాష మరాఠి. మరాఠి సినిమా కోసం పుణెలో షూటింగ్ చేస్తున్నాను. అదే సంతోషంఅక్కడున్న జనం మరాఠి చాలా చక్కగా మాట్లాడుతున్నానని ఆశ్చర్యపోయారు. నేను మరాఠీ అమ్మాయినే అని చెప్పినా సరే, కాదు.. తెలుగమ్మాయినే అనుకుంటున్నారు. ఒకరకంగా అది నాకు సంతోషంగానే ఉంది. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చాలామంది హిందీ ప్రేక్షకులు ఎటువంటి సబ్‌టైటిల్స్ లేకుండా తెలుగులోనే చూశారు. ఒక మహిళ అయితే ఎయిర్‌పోర్టులో నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంది.అదే నాకు దక్కిన గౌరవంతెలుగు సినిమాల్ని హిందీలో రిలీజ్ చేసినందుకు థాంక్యూ అని తెగ సంతోషపడిపోయింది. ఆమె ఆనందం చూస్తుంటే ముచ్చటేసింది. అదే నాకు దక్కిన గౌరవంగా భావించాను అంటూ అసలు సమాధానానికి బదులుగా ఏదేదో చెప్పింది. కానీ పెద్ది గురించి మాత్రం పెదవి విప్పలేదు. ఇకపోతే సీతారామం, హాయ్ నాన్నలు తనకు ఒక బెంచ్‌మార్క్ సెట్ చేశాయని, దానివల్ల పలు భారీ బడ్జెట్ సినిమాలను తిరస్కరించక తప్పలేదని మృణాల్ తెలిపింది.చదవండి: ఐదేళ్లుగా పాటలకు దూరం.. ఆ కారణం వల్లే: సింగర్ -
చరణ్, నాని.. షేర్ ఎవరు..?
ది ప్యారడైజ్ సినిమాలోని ఆయా షేర్ పాట ప్రేక్షకులను మెప్పించింది. యూట్యూబ్ లైక్‌ల విషయంలో రామ్ చరణ్ ‘పెద్ది’లోని ‘చికిరి చికిరి’ పాటను చాలా తక్కువ సమయంలోనే అధిగమించింది. డిజిటల్ వ్యూస్ పరంగా అరుదైన మైలురాయిని చేరుకుంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. ఇందులోని ‘చికిరి చికిరి’ (Chikiri Chikiri) అంటూ సాగే ఈ పాట 24గంటల్లోనే 46 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక్కరోజులో ఇన్ని వ్యూస్ సాధించిన తొలిసాంగ్‌గా రికార్డు నెలకొల్పింది.ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘పెద్ది’ పాట (తెలుగు) నాలుగు నెలల్లో 13,32,838 లైక్‌లను సాధించింది. దీనితో పోలిస్తే, అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ‘ఆయా షేర్ (తెలుగు)’ పాట విడుదలైన కేవలం ఒక నెలలోనే 13,35,424 లైక్‌లను దాటింది. సంఖ్యాపరంగా ఈ వ్యత్యాసం స్వల్పంగా ఉన్నప్పటికీ లాంగ్ రన్లో మరింత ఈ నంబర్ పెరగవచ్చు. అయితే, వ్యూస్ పరంగా చికిరి పాట 197 మిలియన్లు సాధించి టాప్‌లో ఉంది... ఆయా షేర్ పాట 91 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ‘చికిరి చికిరి’ పాటకు స్థిరమైన, దీర్ఘకాలిక ఆదరణ లభించగా, ‘ఆయా షేర్’ ప్రారంభంలో మాత్రమే జోరు చూపింది. అయితే, ఇప్పటికీ రామ్ చరణ్ చికిరి పాటనే టాప్‌లో కొనసాగుతుంది. పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుండగా.. ది ప్యారడైజ్ చిత్రం ఆగస్టు 21న రిలీజ్ కానుంది. -
'అశ్లీల సైట్లో నా ఫోటోలు.. బాయ్స్ చూసేవారు'
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా అభిమానులను మెప్పించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన టీనేజ్‌లో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. తనకు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ అశ్లీల సైట్లో తన మార్ఫింగ్ చిత్రాన్ని చూశానని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తాను పాఠశాలలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందని జాన్వీ కపూర్ గుర్తుచేసుకున్నారు. మా క్లాస్‌లో కొందరు అబ్బాయిలు సరదా కోసం అలాంటి సైట్స్ చూసేవారని.. ఆ సమయంలో నా ఫోటోలు చూశానని తెలిపింది. నేను చదివే పాఠశాలలోనే ఇలా జరగడంతో చాలా వింత అనుభవాన్ని ఎదురైందని జాన్వీ కపూర్ వివరించింది.ఆ సమయంలో తాను ఆ పరిస్థితిని సర్దుకుపోవడానికి ప్రయత్నించానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. అలా నా ఫోటోలు చూశాక సోషల్ మీడియాకు సంబంధించి ఇలాంటి చాలా విషయాలలో నైతికత లేదని అనిపించిందని జాన్వీ తెలిపింది. అయితే ఇప్పుడు వాటిపై తన దృక్పథం మారిందని.. ఏఐ (AI) రూపొందించిన ఈ చిత్రాలు ఈ రోజుకు తనను ప్రభావితం చేస్తున్నాయని జాన్వీ కపూర్ తన బాధను పంచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు సంతోషం అనేది లేదని జాన్వీ వెల్లడించింది. ఏఐ రూపొందించిన తన ఫోటోలు ఆన్లైన్లో ప్రచారంలో ఉన్నాయని.. కొన్నిసార్లు అధికారిక వార్తా పేజీలు కూడా వాటిని షేర్ చేస్తున్నాయని వివరించింది. ఇలాంటి మార్ఫింగ్, ఏఐ ఫోటోల్లో తాను ఎప్పుడూ ధరించని దుస్తులు, పోజులు ఉన్నాయని జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఇలా సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసేవారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రియులు కోరుతున్నారు. -
పెద్ది అడ్వాన్స్ బుకింగ్స్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ రెడీ అయిపోండమ్మా..!
-
పెద్ది రిలీజ్ పై స్వయంగా క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
-
హనుమాన్ జయంతి సందర్భంగా...
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ ‘పెద్ది’. ‘ఉప్పెన’ మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. క్రీడల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.క్రికెట్, కుస్తీ వంటి క్రీడలతో పాటు కబడ్డీ కూడా ఈ సినిమాలో ఉంటుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ‘పెద్ది’ నుంచి రామ్ చరణ్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. -
ఫిబ్రవరి, మార్చి పాయే.. ఏప్రిల్ ఏమవుతుందో?
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ అద్భుతమైన హిట్స్ అందుకుంది. చిరంజీవి, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ తదితరులు తమ సినిమాలతో హిట్స్ అందుకుని మంచి ఆరంభం ఇచ్చారు. కానీ దీన్ని ఫిబ్రవరి, మార్చి నెలల్లో టాలీవుడ్ కొనసాగించలేకపోయింది. కానీ ఏప్రిల్ మాత్రం సక్సెస్ అవుతుందనే ఆశలు రేపుతోంది. ఇంతకీ ఈ నెలలో తెలుగులో రాబోతున్న చిత్రాలేంటి? వాటిపై హైప్ ఎలా ఉంది?(ఇదీ చదవండి: 'ధురంధర్'లా హిట్ అవుతుందనుకున్నా.. కానీ జనాలు చూడలేదు: గుణశేఖర్)ఈనెల తొలివారంలో శర్వానంద్ 'బైకర్' మూవీతో రాబోతున్నాడు. ట్రైలర్ బాగుండేసరికి దీనిపై కాస్త బజ్ ఏర్పడింది. సంక్రాంతికి సక్సెస్ అందుకున్న శర్వా.. దీనితోనూ హిట్ కొట్టేలానే ఉన్నాడు. దీనితోపాటు 'రాకాస' అనే హారర్ కామెడీ చిత్రం రాబోతుంది. ట్రైలర్, పాటల్లాంటివి ఓకే ఓకే అనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో? వీటితోపాటు సముద్రఖని 'కార్మేని సెల్వం', శరవణనన్ 'లీడర్' లాంటి మూవీస్ కూడా జాబితాలో ఉన్నాయి కానీ వీటిపై ఎలాంటి బజ్ లేదు.రెండో వారంలో ప్రస్తుతానికైతే నాలుగు సినిమాలున్నాయి. నిఖిల్ 'స్వయంభు' ఇదే తేదీన రావాల్సి ఉంది కానీ ప్రమోషన్స్ ప్రస్తుతానికి ఏం చేయట్లేదు. దీంతో వాయిదా పడుతుందా అనే అనుమానం కలుగుతోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత అడివి శేష్ నుంచి 'డకాయిట్' అనే చిత్రం వస్తోంది. ఈ రెండు కాస్త ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నప్పటికీ హైప్ ఓ మాదిరిగానే ఉంది. వీటితో పాటు పల్లి చట్టంబి అనే మలయాళ డబ్బింగ్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే తమిళ డబ్బింగ్ మూవీస్ లైనులో ఉన్నాయి. ఇవి సక్సెస్ అయితే ఆశ్చర్యమే.మూడోవారంలో మూడు తెలుగు సినిమాలొస్తున్నప్పటికీ అవన్నీ చిన్నవే. మూడేళ్ల తర్వాత నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తిక్'గా వస్తున్నాడు. తిరువీర్ 'పాపం ప్రతాప్', హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్రాలు కూడా లిస్టులో ఉన్నాయి. వీటిపై ప్రస్తుతానికి ఎలాంటి బజ్ లేదు. హిట్ అయితే అదృష్టమే అనే చెప్పొచ్చు.చివరివారంలో రామ్ చరణ్ 'పెద్ది' ఉన్న నేపథ్యంలో అంతకుముందు తెలుగు చిత్రాలు రిలీజ్ ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు. లెజెండరీ మైకేల్ జాక్సన్ బయోపిక్ 'మైకేల్'.. 24వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఇక చరణ్ 'పెద్ది' మూవీపై హైప్ బాగానే ఉంది. ఇప్పటికే రిలీజైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దీనికి పోటీగా ధనుష్ 'కర' మూవీ ఉంది. దీని ప్రమోషన్స్ కూడా ఇంతవరకు మొదలుపెట్టలేదు. చూడాలి మరి ఎలాంటి ఫలితం అందుకుంటుందో?ఏప్రిల్‌లో రిలీజయ్యే వాటిలో 'పెద్ది' మాత్రమే పెద్ద సినిమా. అందుకు తగ్గట్లే హైప్ ఉంది. మిగతా మూవీస్ పర్లేదనిపించే హైప్ ఉన్నప్పటికీ ఏవి హిట్ అవుతాయనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పెద్ది' విడుదలపై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్) -
'పెద్ది' విడుదలపై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
రామ్ చరణ్ కొత్త సినిమా 'పెద్ది' విడుదల తేదీపై ప్రస్తుతం గందరగోళం నెలకొంది. లెక్క ప్రకారం మార్చి 27న రావాలి. కానీ అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. అయితే ఈ తేదీన కూడా రావట్లేదని చెప్పి కొన్నిరోజుల నుంచి ప్రచారం సాగుతోంది. రీసెంట్గా మరో మూవీ ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్ కూడా జూన్ 26న 'పెద్ది' వస్తుందనేసరికి అభిమానులు కంగారుపడ్డారు. తర్వాత తనకు తెలియకుండానే చెప్పేశానని క్లారిటీ ఇచ్చినప్పటికీ అందరికీ విడుదల తేదీపై సందేహం అలానే ఉండిపోయింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా)సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ అన్నింటికీ ఇప్పుడు స్వయంగా రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చేశారు. మెగా డాటర్ నిహారిక నిర్మించిన 'రాకాస' ప్రమోషన్ల సందర్భంగా టీమ్ అంతా వెళ్లి చరణ్‌ని కలిశారు. మాటల మధ్యలో 'పెద్ది' లేట్ అవ్వట్లేదని కొంచెం ప్రమోట్ చెయ్యండ్రా అని ఫన్నీగా చెబుతూనే క్లారిటీ ఇచ్చేశారు. చెప్పిన తేదీకి రావడం పక్కా అనే స్పష్టత వచ్చేసింది.విడుదలకు మరో నెల కూడా లేదు. అయినా ఇప్పటికీ షూటింగ్ జరుగుతోంది. ఒకటి రెండు పాటలు పెండింగ్‌లో ఉన్నాయని టాక్. మరి షూటింగ్ పూర్తి చేసి, పాన్ ఇండియా మూవీ కాబట్టి అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేసుకోవడానికి టైమ్ ఉంటుందా? లేదంటే చివరి నిమిషంలో మళ్లీ వాయిదా అని చెప్పి ఏమైనా షాకిస్తారా అనేది చూడాలి?స్పోర్ట్స్ డ్రామాగా తీస్తున్న 'పెద్ది'లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లు. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రలు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించగా.. రిలీజ్ చేసిన రెండు పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. బుచ్చిబాబు దర్శకుడు.(ఇదీ చదవండి: 'ధురంధర్'లా హిట్ అవుతుందనుకున్నా.. కానీ జనాలు చూడలేదు: గుణశేఖర్) -
పెద్ది కోసం చరణ్ బిస్ట్ లుక్ ఆ కండల వెనుక రహస్యం ఇదే..!
-
పెద్ది రిలీజ్ పై బిగ్ ట్విస్ట్.. మళ్లీ వాయిదా!
-
పెద్ది రిలీజ్ డేట్.. నన్ను క్షమించండి: నిర్మాత ఎస్కేఎన్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న పెద్ది మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే చెర్రీ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రెజ్లర్ లుక్‌లో కనిపించిన ఆకట్టుకున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్‌పై టాలీవుడ్లో మాత్రం పెద్ద సస్పెన్స్ కొనసాగుతోంది. మరోసారి వాయిదా పడనుందని టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ పెద్ది రిలీజ్ డేట్‌పై గందరగోళం క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన క్లారిటీ ఇచ్చారు.చెన్నై లవ్ స్టోరీ సాంగ్ ఈవెంట్లో మా సినిమా రిలీజ్ డేట్ గురించి చర్చించుకున్నామని ఎస్కేఎన్ తెలిపారు. అదే సందర్భంలో జూన్ 25న పెద్ది రిలీజ్ అవుతుందేమోనని సాయి రాజేశ్ అన్నారు. కానీ అక్కడ గందరగోళంలో పెద్ది రిలీజ్ అనౌన్స్ చేశారమో అనుకున్నానని వెల్లడించారు. నేను తప్పుగా అర్థం చేసుకుని అలా చెప్పా.. అంతేకానీ పెద్ది మూవీ రిలీజ్ వాయిదా అనేది అఫీషియల్‌గా రాలేదని చెప్పారు. నా కామెంట్స్ వల్ల చిన్న పొరపాటు జరిగిందని.. ఇలా అయినందుకు మీ అందరికీ సారీ అంటూ నిర్మాత ఎస్కేఎన్ క్లారిటీ ఇచ్చారు.కాగా.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో పెద్ది మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఓ సారి వాయిదా పడిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. Producer @SKNonline clarification regarding #Peddi release date which he announced at #ChennaiLoveStory song launch Event #KiranAbbavaram #SKN #Ramcharan pic.twitter.com/uDCbkinMbJ— Milagro Movies (@MilagroMovies) March 30, 2026 -
'పెద్ది' మళ్లీ వాయిదా నిజమే.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మరోసారి వాయిదా పడింది. మీరు విన్నది నిజమే. గత కొన్నిరోజుల నుంచి ఈ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. టీమ్ మౌనవ్రతం పాటిస్తుండగా.. అభిమానుల మాత్రం అలాంటిదేం ఉండదని అనుకున్నారు. కానీ ఇప్పుడు చిత్రబృందం ఏం చెప్పనప్పటికీ.. టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్, సోమవారం సాయంత్రం జరిగిన ఓ మూవీ ఈవెంట్లో మాట్లాడుతూ 'పెద్ది' కొత్త విడుదల తేదీని బయటపెట్టేశాడు.(ఇదీ చదవండి: తెలుగు సినిమా 'చైనా పీస్'పై కేంద్రం నిఘా?)మార్చి 27న చరణ్ పుట్టినరోజున 'పెద్ది' రిలీజ్ చేస్తామని తొలుత అనౌన్స్ చేశారు. తీరా డేట్ దగ్గరపడేసరికి ఏప్రిల్ 30న వస్తామని అన్నారు. కానీ ఐటమ్ సాంగ్‌తో పాటు మరో పాట షూటింగ్ పెండింగ్‌లో ఉండటం, ఈ మధ్యే చరణ్ కంటికి గాయం కావడం తదితర అంశాలతో చెప్పిన తేదీకి రావడం కష్టమే అని అంతా భావించారు. ఇప్పుడు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముందే లీకులు వచ్చేస్తున్నాయి.జూన్ 25న 'పెద్ది' సినిమా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఇది రిలీజ్ అవుతుందని అఖిల్ 'లెనిన్'ని జూన్ 26కి వాయిదా వేశారు. మరి 'పెద్ది' తప్పుకొంది కాబట్టి 'లెనిన్'.. ముందే చెప్పినట్లు మే 1న థియేటర్లలోకి వస్తాడా లేదంటే మరో తేదీ చూసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.'పెద్ది' తప్పుకొంటే అదే తేదీకి వచ్చేయాలని నిఖిల్ 'స్వయంభు' సినిమాతో సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు అదే టైంలో తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం', ధనుష్ 'కర'తో పాటు పలు చిత్రాలు లైనులో ఉన్నాయి. ఇప్పుడు ఇంకెన్ని అదే తేదీని టార్గెట్ చేసుకుంటాయో చూడాలి? ఈ వేసవిలో స్టార్ హీరోల సినిమాలేం లేవు. ఇప్పుడు 'పెద్ది' కూడా తప్పుకొంది. దీంతో ఈసారి కూడా స్టార్స్ లేకుండానే సమ్మర్ ఉండబోతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
అప్పుడు శ్రీ రాముడు.. ఇప్పుడు హనుమాన్.. వైరల్ అవుతోన్న చెర్రీ లుక్స్
-
సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బెస్ట్ ఫ్రెండ్స్
ఇప్పటి హీరోలు క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడ్డానికైనా సిద్దంగా ఉంటారు. తమ మేకోవర్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. రీసెంట్గా వచ్చిన ఇద్దరు హీరోల లుక్స్ చూస్తే ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది. ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, మరొకరు అతడి బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్.వీరిద్దరూ తమ మేకోవర్స్‌తో టోటల్ ఇండస్ట్రీని ఆకర్షిస్తున్నారు. ముందుగా రామ్ చరణ్ విషయానికొస్తే, తాజాగా తన పుట్టినరోజు నాడు రిలీజైన 'పెద్ది' సినిమా రెండో గ్లింప్స్ లో అందర్నీ ఆకట్టుకున్న అంశం చరణ్ బాడీ. ఆ పహిల్వాన్ లుక్ కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడో ఆ లుక్ చూస్తుంటే ఇట్టే అర్థమైపోతుంది.చరణ్ ఈ లుక్ కోసం కొన్ని నెలల పాటు మాంసాహారం మానేశాడని సమాచారం. ఓవైపు అయ్యప్ప దీక్షలో ఉంటూనే, మరోవైపు పహిల్వాన్ లుక్ కోసం కసరత్తులు చేశాడు. పహిల్వాన్ లుక్ కోసం నిజమైన పహిల్వాన్లు చేసే కసరత్తులనే చరణ్ చేశాడు. అలా దాదాపు 8 నెలల పాటు ఎంతో కష్టపడి మరీ ఈ కండలు తిరిగే దేహాన్ని చరణ్ సొంతం చేసుకున్నాడు.అయితే శర్వానంద్ బైకర్ రోల్ కోసం మరింత స్ఫూర్తిదాయకమైన ప్రయాణం చేశాడు. ఆ రోల్ కోసం ఇతడు పడిన కష్టం అంతా ఇంతా కాదనే చెప్పాలి. బైకర్ చిత్ర దర్శకుడు శర్వాను 6-8 కిలోలు తగ్గితే చాలన్నాడట. కానీ శర్వానంద్ మాత్రం అంతకుమించి కష్టపడ్డాడు. అక్షరాలా రోజుకు 32 కిలోమీటర్లు పరుగెత్తేవాడని సమాచారం.42 సంవత్సరాల శర్వానంద్ 18 ఏళ్ల బైక్ రేసర్‌గా కనిపించేందుకు తన శరీరంలోని ప్రతి అణువునూ కరిగించేలా కసరత్తు చేశాడట. ప్రస్తుతం తన ఒంట్లో ఏమాత్రం కొవ్వు లేనంత బక్కపల్చగా తయారయ్యాడు. ఇలా టీనేజర్ గా కనిపించడం కోసం శర్వానంద్ ఏకంగా రెండేళ్లు కష్టపడ్డాడు. ఇక బైకర్ ట్రయిలర్ ఎంత క్లిక్ అయిందో, అందులో శర్వా లుక్ అంతకంటే ఎక్కువగా అందరి ప్రశంసలు పొందింది. -
పెద్ది పహిల్వాన్ లుక్.. రామ్ చరణ్ అంతలా కష్టపడ్డారా?
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.ఈ గ్లింప్స్‌లో రామ్ చరణ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పహిల్వాన్‌గా చెర్రీ లుక్ అదిరిపోయింది. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. అయితే ఇలా రెజ్లర్‌గా కనిపించేందుకు గ్లోబల్ స్టార్ కఠినంగా డైట్ తీసుకున్నారు. పహిల్వాన్లా కనిపించేందుకు దాదాపు 8 నెలల పాటు కేవలం కఠోర నియమాలు పాటించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ ఈ లుక్ కోసం తీవ్రంగా శ్రమించారని ఇటీవల డైరెక్టర్ బుచ్చిబాబు రివీల్ చేశారు.కఠినమైన డైట్..పహిల్వాన్ ఫిజిక్ రావాలంటే ప్రత్యేక డైట్ పాటించాల్సి ఉంటుంది. కేవలం జిమ్‌లో వర్కౌట్స్ చేయడం మాత్రమే కాదు..కఠిన ఆహార నియమాలు కూడా ఫాలో కావాల్సిందే. ఈ ట్రైనింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో ఉంటూ కఠిన నియమాలు పాటించారు. ఎక్కడా కూడా తన ఫిట్నెస్ రూల్స్ బ్రేక్ చేయలేదని బుచ్చిబాబు సనా తెలిపారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
'పెద్ది'కి దారి ఇచ్చేసిన 'లెనిన్'.. కొత్త రిలీజ్ డేట్
అక్కినేని హీరో అఖిల్.. ఎలాగైనా సరే ఈసారి హిట్ కొట్టాలని అనుకుంటూ చేసిన సినిమా 'లెనిన్'. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది. లెక్క ప్రకారం మే 01న థియేటర్లలోకి వస్తామని ప్రకటించారు. కానీ వాయిదా పడిన 'పెద్ది'.. ఏప్రిల్ 30న థియేటర్లలోకి వస్తుందని కొన్నాళ్ల క్రితం క్లారిటీ ఇచ్చారు. దీంతో 'లెనిన్' వాయిదా పక్కా అని అంతా అనుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. అధికారికంగా కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: రెండు వారాలుగా బెడ్‌పైనే స్టార్ హీరో ప్రియురాలు.. అదే కారణం?)'లెనిన్'లో అఖిల్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడు. నాగార్జున, నాగవంశీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 30న వస్తున్న 'పెద్ది'కి అండగా నిలబడదాం అని చెప్పిన 'లెనిన్' మేకర్స్.. రామ్ చరణ్, అఖిల్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని గుర్తుచేసుకున్నారు. అందుకే తమ చిత్రాన్ని జూన్ 26కు వాయిదా వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.జూన్ నెల ప్రారంభంలో అంటే 4వ తేదీన యష్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' రిలీజ్ కానుంది. ఇదొచ్చిన మూడు వారాలకు అఖిల్ 'లెనిన్' థియేటర్లలోకి రాబోతుంది. ప్రస్తుతానికైతే ఈ నెలలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. కాబట్టి కంటెంట్, టైమ్ కలిసొచ్చి అఖిల్ ఈసారైనా హిట్ కొడతాడేమో చూడాలి? ఇదివరకే ఓ పాట రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పింది నేనే) View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) -
పెద్ది సినిమా గ్లింప్స్ రిలీజ్
-
పెద్ది పవర్ఫుల్ గ్లింప్స్ వచ్చేసింది
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్ సినిమా ‘పెద్ది’ నుంచి అదిరిపోయే అప్డేట్ను ఇచ్చారు. నేడు చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ అభిమానులను మెప్పించాయి. తాజాగా విడుదలైన గ్లింప్స్ మరింత పవర్‌ఫుల్‌గా ఉండటంతో మూవీపై భారీ అంచనాలు పెరిగాయి.పెద్ది షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఒక భారీ యాక్షన్ సీన్లో భాగంగా చరణ్ కంటికి గాయమైంది. కొన్ని రోజుల విశ్రాంతి అవసరం ఉన్నప్పటికీ చరణ్ మళ్లీ షూటింగ్లో పాల్గొనడం విశేషం. ఇందులో చర్కు జోడీగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తుంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, బోమన్ ఇరానీ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం సమకూరుస్తున్నారు. ఏప్రిల్ 30న పాన్ ఇండియా భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
గాయంతో తిరిగి సెట్స్‌పైకి రామ్ చరణ్
టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ఎడమ కంటికి తగిలిన దెబ్బ కారణంగా చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చింది. యూనిట్ ఈ గాయం పెద్దది కాదని ప్రకటించినప్పటికీ, తన అభిమానులు మాత్రం కొంత ఆందోళన చెందారు. అయితే గాయమైన గంటల వ్యవధిలోనే చరణ్ తిరిగి సెట్స్‌పైకి వచ్చాడు. గురువారం 'పెద్ది' చిత్ర షూటింగ్లో పాల్గొన్నాడు. దాంతో వందల సంఖ్యలో మెగా అభిమానులు సెట్స్‌కు చేరుకుని ఆయనను కలుసుకున్నారు. చరణ్ వారందరితో మాట్లాడి, సెల్ఫీ వీడియో కూడా దిగాడు. ఆ వీడియోను యూనిట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో చరణ్ స్వయంగా తన గాయంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. చరణ్‌కు సుధాకర్ ప్రసాద్ అనే వైద్యుడు మైనర్ సర్జరీ చేసినట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించారు. డాక్టర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇక మార్చి 27 (శుక్రవారం) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9.45 గంటలకు పెద్ది నుంచి సర్ప్రైజ్ రాబోతోందని యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అవుతుందని మరోసారి ధృవీకరించారు. -
పెద్ది బర్త్ డే స్పెషల్.. ఇప్పుడు చేతిలో ఉండేది బ్యాట్ కాదు....!
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక్క రోజు ముందే రామ్ చరణ్ ఎడమ కన్నుకు చిన్న గాయం కావడంతో కాస్తా గ్యాప్ ఇచ్చారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారుతాజాగా పెద్ది మూవీ టీమ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు అప్డేట్ రానుందని ప్రకటించారు. ఇక ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది..ఇప్పటిదాకా బ్యాట్ పట్టుకుని అతన్ని చూశారు కదా.. ఇప్పుడు గదతో విరుచుకుపడబోతున్నాడు.. రేపు (మార్చి 27) ఉదయం 9:45 గంటలకు అతను రణరంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు అంటూ గదతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. చెర్రీ పుట్టినరోజు కానుకగా పెద్ది టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ONE DAY TO GO 🔥You've seen him hold the bat, now unleashing him with a mace ❤🔥He enters the arena tomorrow (March 27th) at 9.45 AM 💥#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/EvpXHy0LX5— BuchiBabuSana (@BuchiBabuSana) March 26, 2026 -
పెద్ది వాయిదా తప్పదా.. అందుకే ఆ డేట్ మార్చారా?
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక్క రోజు ముందే రామ్ చరణ్ ఎడమ కన్నుకు చిన్న గాయం కావడంతో కాస్తా గ్యాప్ ఇచ్చారు. ఈ రోజు నుంచి యథావిధిగా పెద్ది షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.అయితే ఇప్పటికే ఓసారి వాయిదా పడిన పెద్ది మూవీపై మరోసారి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్‌పోన్ కానుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈనెల 27 నుంచి ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేస్తామని ముందుగానే ప్రకటించారు. కానీ ఈ డేట్ కూడా ఏప్రిల్ 8కి మార్చారు. దీంతో మరోసారి పెద్ది వాయిదా పడనుందనే టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది.తాజా అప్డేట్ ప్రకారం చూస్తే.. ఈ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూ ఉండడం.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల మరింత ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. ఏదేమైనా బుచ్చిబాబు ఏప్రిల్ 30న రిలీజ్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తయితే చెప్పిన డేట్ ప్రకారమే పెద్ది థియేటర్లలో సందడి చేయనుంది. లేదంటే మే 21వ తేదీకి మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది. మరోవైపు శుక్రవారం రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. -
రామ్ చరణ్ కంటికి సర్జరీ.. చిరంజీవి ట్వీట్ వైరల్
‘పెద్ది’ సినిమా షూటింగ్లో రామ్ చరణ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఓ హై ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదంలో రామ్ చరణ్ ఎడమ కంటికి స్వల్ప గాయం అయింది. దీంతో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి ఆస్పత్రికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా చరణ్‌కి కంటికి చిన్న సర్జరీ చేశారట. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. సర్జరీ చేసిన డాక్టర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ‘డాక్టర్ సుధాకర్ ప్రసాద్ గారు,చరణ్ కనురెప్పకు మీరు ఎంతో నైపుణ్యంతో సర్జరీ చేసినందుకు ధన్యవాదాలు. తొలుత మాకు కొంత ఆందోళన కలిగినప్పటికీ.. మీరు చెప్పిన మాటలు మా భయాన్ని పోగొట్టి, ధైర్యాన్ని ఇచ్చాయి. సకాలంలో స్పందించి, శస్త్రచికిత్స అందించినందుకు కృతజ్ఞతలు’ అని చిరంజీవి చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వార్త తెలుసుకున్న మెగా అభిమానులు.. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. పెద్ది విషయానికొస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘పెద్ది’ గ్లింప్స్‌ని రిలీజ్ కానుంది. Dr. Sudhakar Prasad garu,Your timely and skilful surgery on Charan’s eyelid has truly been a blessing. What was a moment of concern for us was eased entirely by your precision, care, and expertise.Your craftsmanship made all the difference, and we are truly grateful.Thank… pic.twitter.com/j53rRIpOKB— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2026 -
చరణ్‌కు గాయం.. 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఇటీవల ప్రమాదవశాత్తూ గాయపడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి రాబోయే అప్డేట్ ఆలస్యమవుతుందేమోనని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే యూనిట్ తాజాగా ఇచ్చిన స్పష్టతతో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి. చరణ్ ఎడమ కంటికి చిన్నపాటి గాయం మాత్రమే జరిగింది. దానికి వెంటనే ట్రీట్మెంట్ జరిగిందని 'పెద్ది' టీమ్ తెలిపింది. రేపట్నుంచే ఆయన తిరిగి సెట్స్‌లో పాల్గొనబోతున్నారని కూడా ప్రకటించింది. ఇక అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. చరణ్ పుట్టినరోజు కానుకగా 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్ రాబోతోంది. మార్చి 27 ఉదయం 11:07 గంటలకు దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే రెడీ చేసిన టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే చరణ్ చేసిన బ్యాట్ విన్యాసం సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. అదే తరహాలో ఈ బర్త్‌డే టీజర్ కూడా భారీ విజయాన్ని సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అంటే రామ్ చరణ్ గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పెద్ది సినిమాకు సంబంధించిన అప్డేట్స్, సంబరాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పెద్ది టీమ్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. -
రామ్ చరణ్‌కు గాయం.. పెద్ది టీమ్ క్లారిటీ
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గాయంపై పెద్ది టీమ్ స్పందించింది. ప్రస్తుతం అంతా బాగానే ఉందని.. ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. షూటింగ్లో చరణ్ ఎడమకన్నుకు చిన్న గాయమైందని వెల్లడించింది. అనంతరం రామ్ చరణ్‌కు చికిత్స అందించామని ప్రకటించింది. రేపటి నుంచి యథావిధిగా షూటింగ్ ప్రారంభమవుతుందని పెద్ది టీమ్ నోట్ విడుదల చేసింది. దయచేసి ఎటువంటి ఊహాగానాలు నమ్మవద్దని అభిమానులకు సూచించింది. పెద్ది షూటింగ్‌కు ఎలాంటి ఆటంకం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సైతం ఈ మూవీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.An update regarding @AlwaysRamCharan Garu's injury on the sets of #Peddi.We promise everything is safe and on track ❤️Kindly do not speculate. Thank you. pic.twitter.com/5Abhs2QyHb— PEDDI (@PeddiMovieOffl) March 25, 2026 -
రామ్ చరణ్‌కు గాయం.. షూటింగ్‌కు బ్రేక్
రామ్ చరణ్ గాయపడ్డారని సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా సెట్స్‌లో చరణ్‌కు స్వల్ప గాయం అయినట్లు సమాచారం. ఆయన కంటి దగ్గర గాయమైనట్లు తెలుస్తోంది. కానీ, అది స్వల్పమైనదేనని చెబుతున్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోషల్‌మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. రామ్ చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని, తిరిగి సెట్స్‌లో చేరతారని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే చరణ్‌తో ఉన్న కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఒక ప్రత్యేక గీతాన్ని షూట్ చేయనున్నారట. రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) శుక్రవారం కావడంతో, ఆ రోజున ఒక టీజర్‌ను విడుదల చేస్తారని టాక్..గ్రామీణ నేపథ్యంలో జరిగే స్పోర్ట్స్ డ్రామా మూవీగా ‘పెద్ది’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 27న బాక్సాఫీసు ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ తేదీలో కూడా పెద్ది విడుదల కావడం కష్టమేనని వార్తలు వస్తున్నాయి. -
వినోదాల సందడి
మార్చి నెల ముగింపుకు వచ్చింది. దీంతో ఏప్రిల్ నెలలో ఏయే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయనే చర్చ ఆడియన్స్‌లో మొదలైంది. వచ్చే నెలలో డిఫరెంట్ జానర్స్‌లోని సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ జాబితాలో ‘పెద్ది’ వంటి పెద్ద చిత్రం నుంచి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ వంటి చిన్న చిత్రాలు చాలానే ఉన్నాయి. మరి... ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆ సినిమా ఎలా ఉండబోతోంది? అనే విషయాలు ఈ విధంగా...పెద్ది పోరాటం వచ్చే నెల చివర్లో థియేటర్స్‌లోకి రానున్నాడు పెద్ది. రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ అండ్ పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ పాల్గొంటుండగా క్లైమాక్స్‌కు చెందిన టాకీ పార్టు చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. అయితే ఇంకా సాంగ్స్ చిత్రీకరించాల్సి ఉంది. తొలుత ‘పెద్ది’ని రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయా లనుకున్నారు మేకర్స్. కానీ ఏప్రిల్ 30కి వాయిదా వేశారు.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో టీమ్ చాలా స్పీడ్‌గా షూటింగ్ చేస్తోంది. ఆల్రెడీ ఒకసారి సినిమా రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో మరోసారి ఇలా జరగకూడదని పక్కా ప్లాన్‌తో షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో పాటల చిత్రీకరణను ప్లాన్ చేశారు. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని తెలిసింది. ఈ స్పెషల్ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ చేస్తారని, ఇదే సాంగ్‌లో ఈ చిత్రం హీరో హీరోయిన్లు రామ్ చరణ్, జాన్వీ సైతం కాలు కదుపుతారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.అలాగే ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ నుంచి సర్ప్రైజింగ్గా ఓ యాక్షన్ టీజర్‌ను రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేసిందని తెలిసింది. ‘పెద్ది’ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌లో రామ్‌చరణ్ క్రికెటర్‌గానే కనిపించారు. కానీ రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా రాబోతున్న యాక్షన్ టీజర్లో చరణ్ కుస్తీ పడుతున్న సన్నివేశాలు ఉంటాయని తెలిసింది. ఇంకా ‘పెద్ది’ చిత్రంలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి ఇతర క్రీడల ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది.అంతేకాదు... ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఊరిలో నెలకొన్న ఓ సమస్య కోసం హీరో పాత్ర పోరాటం చేస్తుందని సమాచారం. ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎమోషనల్ బైకర్ ఏప్రిల్ 3న థియేటర్స్‌లోకి దూసుకు రానున్నాడు బైకర్. శర్వానంద్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’. మాళవికా నాయర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘వాడికి రేసింగ్ అంటే ప్రాణం..’, ‘నువ్వు అందరికంటే ముందు రాలేదు... నీ కంటే అందరూ వెనకాల వచ్చారు.రెండింటికి చాలా తేడా ఉంది’, ‘విక్కీతో కొంచెం మాములుగా ఉండొచ్చు కదా... ఎందుకంత కంట్రోల్ చేస్తావ్..., ఈగో ఇంపార్టెంట్ కాదు సుదర్శన్... నథింగ్ ఈజ్ బిగ్గర్ థేన్ స్పోర్ట్’, ‘నీలాంటి పిరికివాడితో పని చేయడం నాకు తెలియదు రా..’, ‘వాళ్ల నాన్నకు విక్కీ కొడుకు కాదు... రేసర్ అంతే..’, ‘కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రిని ఒక్కర్ని చూపించు’ వంటి డైలాగ్స్ ‘బైకర్’ సినిమా ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రంలో వికాస్ నారాయణన్ పాత్రలో శర్వానంద్, బుల్లెట్ సునిల్ పాత్రలో రాజశేఖర్ నటించారు. ఇందులో రాజశేఖర్, శర్వానంద్ తండ్రీకొడుకులుగా చేశారు.‘బైకర్’ సినిమాలో రైసింగ్ అంశాలతో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమా కథ 1990, 2000... ఇలా రెండు డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో సాగుతుంది. ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించగా, జిబ్రాన్ సంగీతం అందించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇక ‘బైకర్’ సినిమాను తొలుత గత ఏడాది డిసెంబరు 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్‌లో రాజీ పడకూడదని, యూనిట్ ఈ సినిమా రిలీజ్‌ను ఏప్రిల్ 3కి వాయిదా వేసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత శర్వానంద్ నుంచి రానున్న ‘బైకర్’ చిత్రంపై ఆడియన్స్‌లో అంచనాలు ఉన్నాయి.మాజీ ప్రేమికుల ప్రయాణం బ్రేకప్ తర్వాత ఇద్దరు మాజీ ప్రేమికులు మళ్లీ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఆ ప్రేమికులు తిరిగి ప్రేమలో పడతారా? ఈ ప్రయాణంలో వారు వాళ్ల గురించి ఏం తెలుసుకున్నారు? అన్న అంశాల నేపథ్యంలో ‘డెకాయిట్’ సినిమా తెరకెక్కిందని తెలిసింది. ఈ చిత్రంలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర చేశారు. దర్శక–నిర్మాత మన్సూర్ ఖాన్ కుమార్తె, ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు.అనురాగ్ కశ్యప్, జైన్ మేరీ... ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దాదాపు 150 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా కథనం రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో వచ్చే ఓ రాబరీ ఎపిసోడ్, అలాగే ‘కన్నె పిట్టరో..’ పాట హైలైట్స్‌గా ఉంటాయని సమాచారం. షానియల్ డియో దర్శకత్వంలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో స్వరకర్త. సునీల్ నారంగ్ సహ–నిర్మాతగా వ్యవహరించారు.తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. తొలుత ‘డెకాయిట్’ సినిమాను మార్చి 19న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ తేదీకి రణ్వీర్ సింగ్ ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా రిలీజ్‌కు షెడ్యూల్ కావడంతో ‘డెకాయిట్’ను ఏప్రిల్ 10కి వాయిదా వేశారు. ఈ నెల 28న ఈ సినిమా నుంచి ‘చిచ్చుబడ్డి’ అనే పాట లిరికల్ వీడియో రిలీజ్ కానుంది.ఈ సంగతి ఇలా ఉంచితే... 2022లో అడివి శేష్ హీరోగా ‘హిట్: ది సెకండ్ కేసు’ సినిమా వచ్చింది. ఈ చిత్రం తర్వాత అడివి శేష్ సోలో హీరోగా మరో సినిమా థియేటర్స్‌కు రాలేదు. మూడు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా అడివి శేష్ నుంచి రాబోతున్న ‘డెకాయిట్’ సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి ఆడియన్స్‌లో నెలకొని ఉంది. ఇక గత ఏడాది నాని హీరోగా నటించిన ‘హిట్: ది థర్డ్ కేసు’ చిత్రంలో అడివి శేష్ ఓ అతిథి పాత్రలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.కాపాడే కవచం నిఖిల్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘స్వయంభూ’. సంయుక్త, నభా నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిం చారు. ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించారు. అయితే ‘స్వయంభూ’ సినిమాను తొలుత ఫిబ్రవరి 13న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. అయితే ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని, దీంతో ఏప్రిల్ 10న విడుదల కాకపోవచ్చనే టాక్ తెరపైకి వచ్చింది.అంతేకాదు... ఏప్రిల్ 30న ‘పెద్ది’ సినిమా ఒకవేళ విడుదల కాకపోతే, ఆ తేదీకి తమ సినిమా విడుదలయ్యేలా ‘స్వయంభూ’ టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇక ఇటీవల ‘స్వయంభూ’ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘సాక్షాత్తు ఆ సదాశివుడే దిగి వచ్చి, శ్రీరాముడికి అందించిన ఈ సింగోలుకి కూడా అరణ్యవాసమా?’, ‘యుద్ధమా?’, ‘అంతర్యుద్ధం..’, ‘కాలం కత్తై దూస్తే కాపాడే కవచం ఒకటి కావాలి కదా..’, ‘బలం ఏదో ఒక చోట నశిస్తుంది మిత్రమా... కానీ తెగింపు ఎంత దూరమైనా వెళ్తుంది’ వంటి డైలాగ్స్ ఈ టీజర్లో ఉన్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు.అమెరికా రిటర్న్స్ సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఫ్యాంటసీ అండ్ అడ్వెంచరస్ కామెడీ సినిమా ‘రాకాస’. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్ సిరీస్‌కు రైటర్‌గా, ‘బెంచ్లైఫ్’ సిరీస్‌కు దర్శకురాలిగా చేసిన మానసా శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మానసా శర్మకు ఇది తొలి ఫీచర్ ఫిల్మ్. ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్గా నటించారు. ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఇటీవల ‘రాకాస’ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘నరకం నుండి సందేశం వస్తుంది.ఇక సమయం లేదు’, ‘మన ఊరి శాపం ఇది’, ‘మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత’, ‘ఐయామ్ వీరూ సార్... అమెరికా రిటర్న్స్’, ‘నేను రైట్ అడ్రస్‌కు వచ్చిన రాంగ్ పర్స్‌ని సార్... నాకు, ఈ ఊరికి అస్సలు సంబంధం లేదు సార్...’, ‘ఇది ఆఖరి హెచ్చరిక’ వంటి డైలాగ్స్ ఈ సినిమా టీజర్లో ఉన్నాయి. అయితే టీజర్‌లోని కంటెంట్, డైలాగ్స్‌ను బట్టి ‘రాకాస’ కథనం ఓ ఊరు, అక్కడ నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో వినోదాత్మకంగా సాగుతుందని తెలుస్తోంది. నేడు (బుధవారం) ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది.ఇక ‘మ్యాడ్, మ్యాడ్ 2’ వంటి ఫీచర్ ఫిల్మ్స్‌లో సంగీత్ శోభన్ ఓ లీడ్ రోల్లో నటించారు. అలాగే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ సిరీస్‌లో హీరోగా చేశారు. కానీ ‘రాకాస’ చిత్రంలో మాత్రం సంగీత్ శోభన్ సోలో హీరోగా చేశారు. మరి... ఈ సినిమా సంగీత్ కెరీర్‌కు ఎంత మైలేజ్ ఇస్తుందన్న విషయం మరో పది రోజుల్లో తెలిసిపోతుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఓ స్నేక్ డ్యాన్స్ ఉంది. ఇందులో హీరో హీరోయిన్లతో పాటు ఈ చిత్రనిర్మాత–నటి నిహారిక కొణిదెల గెస్ట్ రోల్ చేశారని తెలిసింది. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.తిమ్మరాజుపల్లిలో ఏం జరిగింది? సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడికల్ సినిమాకు వి. మునిరాజు దర్శకత్వం వహిం చారు. 1990 కాలంలో ఈ సినిమా కథనం సాగుతుంది. తేజ వేల్పుచర్లతో కలిసి హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కానుంది. ఈ సినిమా ప్రధాన కథాంశం తిమ్మరాజుపల్లి అనే ఊరి బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఆ ఊరి ప్రజలు, హీరో ప్రేమకథ, శివరాత్రి జాగారం సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు... ఇలాంటి అంశాలతో ఈ సినిమా కథనం సాగుతుందట. వంశీకాంత్ రేఖన ఈ చిత్రానికి సంగీతం అందించారు.పాపం ప్రతాప్ ఇటీవలే ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు తిరువీర్. ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం ‘పాపం ప్రతాప్’. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అజయ్ ఘోష్, ప్రసాద్ బెహరా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్.పి దుర్గా నరేష్ దర్శకత్వంలో రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ భార్యాభర్తలుగా నటించారు.అనువాద చిత్రాలూ ఉన్నాయికోలీవుడ్లో ఏప్రిల్‌లో విడుదలవుతున్న ముఖ్యమైన సినిమాల్లో ‘కర’ ఒకటి. ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించగా, మమితా బైజు హీరోయిన్గా నటించారు. కేఎస్ రవికుమార్, జయరామ్, సురాజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి కె. గణేష్ ఈ సినిమాను నిర్మించారు. రివెంజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. మంగళవారం ఈ సినిమా నుంచి మమితా బైజు, కేఎస్ రవికుమార్‌ల ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేశారు.‘కర’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక తమిళ యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పత్య్రేకంగా చె΄్పాల్సిన అవసరం లేదు. ‘లవ్ టుడే, డ్రాగన్ (తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’), డ్యూడ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ప్రదీప్ దగ్గరయ్యారు. ఈ కుర్ర హీరో పటించిన తాజా చిత్రం ‘ఎల్.ఐ.కే ’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్గా నటించారు. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నయనతార, ఎస్ఎస్ లలిత్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేయాలనుకున్నారు.కానీ ఈ సినిమా ఏప్రిల్ 10కి వాయిదా పడిందని టాక్. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. శరవణన్ ‘లీడర్’ చిత్రం కూడా ఏప్రిల్‌లోనే రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇక బాలీవుడ్లో వచ్చే నెల రిలీజ్ కానున్న సినిమా ‘భూత్ బంగ్లా’. అక్షయ్ కుమార్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ హారర్ సినిమాలో పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, టబు, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి మంగళవారం ‘తుహీ దిస్దా’ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను అర్జిత్ సింగ్ పాడారు.అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. మరోవైపు మాలీవుడ్‌లో ఏప్రిల్ 10న ‘పళ్లి చట్టంబి’ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. టొవినో థామస్, కయదు లోహర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమాకు డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. నౌఫల్, బ్రిజీష్, చాణక్య చైతన్య చరణ్ నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.1950–1960 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. కన్నడలో ధ్రువ సర్జా నటించిన ‘కేడీ: ది డెవిల్’ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రేమ్ దర్శకత్వంలో ఈ సినిమాను వెంకట్ కె. నారాయణ నిర్మించారు. సంజయ్ దత్, శిల్పా శెట్టి, వి. రామచంద్రన్ ఈ మూవీలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఇలా వచ్చే నెల తెలుగులో రిలీజ్ కానున్న మరికొన్ని అనువాద సినిమాలు కూడా ఉన్నాయి.ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఏప్రిల్‌లో రిలీజ్ కావడానికి సిద్ధం అవుతున్నాయి. – ముసిమి శివాంజనేయులు -
పెద్ది స్పెషల్ సాంగ్ అప్డేట్ చరణ్ తో మృణాల్ స్టెప్స్
-
'పెద్ది'కి ఐటమ్ బ్యూటీ దొరికేసింది!
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'పెద్ది'.. మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే షూటింగ్ నడుస్తుండటంతో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని రూమర్స్ వస్తున్నాయి. మరోవైపు చరణ్ పుట్టినరోజున ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని అధికారికంగా ప్రకటించడంతో వాయిదా లాంటిది లేదని పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లయింది. అయితే ఈ మూవీలోని ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారా అనే ప్రశ్న కూడా ఇంకా అలానే మిగిలిపోయింది. ఫైనల్‌గా దానికి సమాధానం దొరికేసినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!)గతంలో 'పెద్ది' ఐటమ్ కోసం పూజా హెగ్డే, ఆయేషా ఖాన్, మృణాల్ ఠాకుర్.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ పాట షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండేసరికి ఎవరిని తీసుకున్నారనే విషయం బయటకు రాలేదు. చివరకు ఇప్పుడు ముందు అనుకున్న వాళ్లలో మృణాల్ ఠాకుర్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఈమె హీరోయిన్గా చేసిన 'డకాయిట్' రిలీజ్ కానుంది. దీని ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు ప్లస్ 'పెద్ది' సాంగ్ చేసేందుకుగానూ రాబోయే కొన్నిరోజులు ఈమె హైదరాబాద్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.ఈ ఐటమ్ పాటలో చరణ్-మృణాల్తో పాటు జాన్వీ కపూర్ కూడా కాసేపు కనిపిస్తుందని అంటున్నారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ విలేజ్ డ్రామాగా తెరకెక్కించారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ కాగా రెండూ సూపర్ హిట్ అయ్యాయి. (ఇదీ చదవండి: క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు) -
ఇప్పుడు ఫైట్... నెక్ట్స్ పాట
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ రూరల్ యాక్షన్ మూవీ ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ సెట్లో జరుగుతోందని సమాచారం. రామ్‌చరణ్ పాల్గొంటుండగా క్లైమాక్స్ సీక్వెన్స్ లోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.ఈ చిత్రీకరణలో భాగంగా ఓ ఫైట్ కూడా ఉందని భోగట్టా. ఈ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయితే ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తవుతుందట. ఏప్రిల్ మొదటి వారంలో పాటల చిత్రీకరణను ప్లాన్ చేశారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. -
'పెద్ది' వాయిదా రూమర్స్.. ఏం జరుగుతోంది?
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'పెద్ది'. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. లెక్క ప్రకారం ఈనెల 27న చరణ్ పుట్టినరోజు కానుకగా థియేటర్లలోకి తీసుకొస్తామని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యమయ్యేసరికి నెలరోజులు వాయిదా వేశారు. ఏప్రిల్ 30న తీసుకొస్తామని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇది చాలారోజులైపోయింది. ఇప్పుడు మళ్లీ 'పెద్ది' వాయిదా గురించి రూమర్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!)'పెద్ది' ప్రస్తుత పరిస్థితి చూస్తే మరో 4 రోజుల టాకీతో పాటు రెండు పాటల చిత్రీకరణ ఇంకా చేయాల్సి ఉందట. రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. టీమ్ మాత్రం కచ్చితంగా చెప్పిన తేదీకే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ చేస్తున్నారు. కానీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌తోపాటు షూటింగ్ ఇన్ టైంలో పూర్తి చేస్తారా సందేహం కలుగుతోంది.మరోవైపు 'పెద్ది' వాయిదాపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. చరణ్ పుట్టినరోజున ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని అధికారికంగా ప్రకటించారు. దీనిబట్టి చూస్తే దాదాపు ఏప్రిల్ 30నే పాన్ ఇండియా రిలీజ్ అని అనుకోవచ్చు. కానీ ఏమైనా ఆలస్యమైతే మాత్రం జూలైలో తేదీని పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'తో హిట్ కొట్టారు. రీసెంట్గా పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చింది. దీనికి ఏమంత పాజిటివ్ టాక్ అయితే రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ తమ అశలన్నీ 'పెద్ది'పైనే పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: ఉస్తాద్ భగత్‌సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్) -
పెద్ది విడుదల మళ్ళీ వాయిదా? వార్తల్లో నిజమెంత?
-
పెద్ది మళ్ళీ పోస్ట్ పోన్.. ఏప్రిల్ 30 రిలీజ్ లేనట్టే..!
-
తిలక్ వర్మకు పెద్ది బ్యాట్ గిఫ్ట్ V ఇచ్చిన రామ్ చరణ్
-
తిలక్ వర్మకు గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్.. అదేంటంటే?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి, రైరై రారా అంటూ సాంగ్స్ ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.తాజాగా పెద్ది మూవీ సెట్స్‌లో వరల్డ్ కప్ హీరో, టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశారు. మూవీ షూటింగ్ సెట్స్‌కు వెళ్లిన తిలక్ వర్మ.. రామ్ చరణ్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మకు రామ్ చరణ్ ఓ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. పెద్ది మూవీ షూట్లో వాడిన పాత బ్యాట్‌ను తిలక్ వర్మకు బహుమతిగా అందించారు. అంతేకాకుండా వరల్డ్ కప్‌లో తిలక్ వర్మ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను పెద్ది మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా.. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. T20 World Cup champion @TilakV9 visited the sets of #Peddi ❤🔥He caught a glimpse of the film’s sports sequences and was thoroughly impressed.#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/Csyce4KCNH— Vriddhi Cinemas (@vriddhicinemas) March 18, 2026 -
పెద్ది స్పెషల్ సాంగ్ లో ఐదుగురు బ్యూటీలు..!
-
డాల్బీ సినిమాస్ ఫార్మాట్లో...
రామ్‌చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. కాగా ఈ చిత్రాన్ని డాల్బీ సినిమాస్ ఫార్మాట్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, రామ్‌చరణ్ కొత్త ఫొటోను విడుదల చేశారు.‘‘యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘పెద్ది’. ఈ మూవీని అత్యాధునిక డాల్బీ సినిమాస్ ఫార్మాట్లో కూడా విడుదల చేస్తున్నాం. రామ్‌చరణ్ మాస్ రగ్డ్ అవతార్‌ను డాల్బీ సినిమాస్ ఫార్మాట్లో చూడడం ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతి దక్కేలా చేస్తుంది. అలాగే ‘పెద్ది’ వంటి భారీ యాక్షన్, ఎమోషన్ కలిగిన ఈ చిత్రాన్ని డాల్బీ సినిమాస్‌లో చూడడం వల్ల ప్రేక్షకులు పూర్తిగా సినిమాలో లీనమయ్యే అవకాశం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
జాన్వీ కపూర్ బర్త్ డే.. రామ్ చరణ్ స్పెషల్ విషెస్
పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్‌కు మెగా హీరో రామ్ చరణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. పెద్ది మూవీ సెట్లో జాన్వీ కపూర్‌తో ఉన్న స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన సీన్స్‌ను చెర్రీ పంచుకున్నారు. ఈ వీడియోలో జాన్వీ తన పాత్ర 'అచ్చియమ్మ' గెటప్‌లో కనిపిస్తూ సందడి చేశారు. ఆమెకు తన వృత్తి పట్ల ఆమెకున్న మక్కువ, నిబద్ధత చూడటం చాలా సంతోషంగా ఉంది.. ఈ ఏడాది తనకి మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీని శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మొదటి సాంగ్ చికిరి చికిరి అభిమానులను ఓ ఊపు ఊపేయగా.. ఇటీవల రిలీజైన రైరై రారా అంటూ సాగే పాట కూడా అదే రేంజ్లో అలరిస్తోంది.కాగా.. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
పెద్ది మళ్ళీ పోస్టుపోన్..! APR 30 కాదు.. ఎప్పుడంటే..?
-
పెద్ది హీరోయిన్ బర్త్ డే.. కాలి నడకన తిరుమలకు..!
బాలీవుడ్ భామ, పెద్ది మూవీ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల చేరుకున్నారు. ఈ శుక్రవారం ఆమె బర్త్ డే కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అలిపిరి నడకదారిలో నడుచుకుంటూ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల కొండపైకి చేరుకున్నారు. జాన్వీ కపూర్‌తో పాటు నటి మహేశ్వరి రేపు స్వామివారిని దర్శించుకోనున్నారుబాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది మూవీలో హీరోయిన్గా కనిపిచంనుంది. ఈ సినిమా కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న పెద్ది రన్ టైం..!
-
'రైరై రారా' పాట రాసేందుకు 2 నెలలు: అనంత శ్రీరామ్
ఒక మంచి పాట రాయడం, మాస్ పాట రాయడం అనేది కష్టం కాదు. కానీ, పెద్ది సినిమా కోసం రై రై రా రారా.. పాటలో మాస్ పరిభాషలో ఫిలాసఫీ చెప్పడం అనేది కత్తిమీద సాములా అనిపించింది. రెహమాన్ గారి బాణీ అర్థం చేసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాను. ఈ పాట రాయడానికి దాదాపు రెండు నెలలు పట్టింది అని పాటల రచయిత అనంత శ్రీరామ్ తెలిపారు.పెద్ది సెకండ్ సాంగ్రామ్చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి రై రై రారా.. అంటూ సాగే రెండో పాటను మార్చి 2న విడుదల చేశారు.అదే జరిగితే..ఈ పాట రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో టాప్ వన్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాట రాసిన అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. రామ్‌చరణ్‌గారి రుద్రతాండవం, రెహమాన్ గారి ధీర శంఖారావం, రత్నవేలుగారి చిత్రీకరణలో ఉన్న మాయాజాలం, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ.. వీటన్నిటి మధ్యలో నుంచి కూడా రై రై రారా.. పాటలోని లిరిక్స్ బాగున్నాయి అనడం.. సాహిత్యానికి ప్రశంసలు రావడం ఆనందాన్నిచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాళ్లు ఆ ఆలోచన విరమించుకునేలా నా పాట స్ఫూర్తి నింపితే నా రచన సార్థకమైనట్లే అని చెబుతుంటాను. ఆ లక్షణం ఈ పాటకు ఉంది అని చెప్పాడు. -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. 24 గంటల్లోనే రికార్డ్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. వ్యూస్ పరంగా రికార్డ్ స్థాయిలో దూసుకెళ్లింది.తాజాగా రిలీజైన రైరై రారా అంటూ సాగే సాంగ్ సైతం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట రిలీజైన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే 31 మిలియన్ల వ్యూస్, 5లక్షల 30వేల లైక్స్‌ను సొంతం చేసుకుంది. కాగా.. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్ పాడారు. ఈ మోటివేషనల్ సాంగ్‌ను రెహమాన్ కంపోజ్ చేశారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. -
స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెద్ది
-
రామ్ చరణ్ 'పెద్ది' రన్‌టైమ్.. 4 గంటలపైనే?
పెద్ద సినిమాలు భారీ నిడివితో రావడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇటీవల యానిమల్ సినిమా రన్‌టైమ్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇకపై వస్తున్న ధురంధర్-2 కూడా అంతకుమించిన నిడివితో వస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో పెద్ది కూడా భారీ రన్టైమ్తో వస్తోందనే ప్రచారం మొదలైంది. సినిమా టోటల్ ఫుటేజ్ 4 గంటలపైనే ఉందని, ఫైనల్ రన్‌టైమ్ 3 గంటలకు పైగా ఉంటుందనే కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై పెద్ది యూనిట్ స్పందించింది. పెద్ది రన్‌టైమ్‌పై వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం కేవలం తొలి సగం మాత్రమే లాక్ అయింది. రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతం పెద్ది నుంచి విడుదలైన రెండో పాట 'రయ్ రయ్ రారా'పై చర్చ జోరుగా సాగుతోంది. చరణ్ డాన్స్‌ను చిరంజీవి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దాంతో అభిమానుల్లో పెద్ది చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, ఆ డాన్స్ చేస్తున్న సమయంలో చరణ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. షూట్ ఆపుదామని చెప్పినా వినకుండా జ్వరంతోనే డాన్స్ చేశారని గుర్తుచేసుకున్నారు.ప్రస్తుతం 'రయ్ రయ్ రారా' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దీంతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది. పెద్ది సినిమా రన్‌టైమ్‌పై వస్తున్న ప్రచారాలు నిజం కావని యూనిట్ స్పష్టతనిచ్చింది. అభిమానులు మాత్రం సినిమా ఫైనల్ రన్‌టైమ్‌పై అధికారిక అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. -
ట్రెండింగ్ లో PEDDI డ్యాన్స్ తో కుమ్మేసిన రామ్ చరణ్
-
రైరై రారా అంటోన్న రామ్ చరణ్.. పెద్ది సాంగ్ రిలీజ్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది.తాజాగా ఈ సినిమా నుంచి రైరై రారా అంటూ సాగే మరో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్ పాడారు. ఈ మోటివేషనల్ సాంగ్‌ను రెహమాన్ కంపోజ్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.When grit finds its voice 🔥When grace finds its moves 🤩#Peddi Second Single #RaiRaiRaaRaa (Telugu) Out Now❤️🔥▶️https://t.co/yrdKeTtKJ9#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026 pic.twitter.com/dHIWPRp8hR— PEDDI (@PeddiMovieOffl) March 2, 2026 -
'పెద్ది' మొదలుపెట్టేశాడు.. బుచ్చిబాబుని ఆడుకున్న చరణ్
మెగాహీరో రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా 'పెద్ది'. బుచ్చిబాబు దర్శకుడు. లెక్క ప్రకారం మార్చి 27న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అని ప్రకటించారు. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండేసరికి వాయిదా వేశారు. ఏప్రిల్ 30న థియేటర్లలో తమ మూవీ విడుదల కానుందని కొన్నిరోజుల క్రితం పోస్టర్ వదిలారు. తాజాగా ఓ వైపు చివరి దశ చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు డబ్బింగ్ కూడా మొదలుపెట్టేశారు. తాజాగా ఆ వీడియోని చరణ్.. తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా)'ఏమది' అనే డైలాగ్ చెబుతున్న వీడియోని పోస్ చేసిన చరణ్.. ఇందులో దర్శకుడు బుచ్చిబాబుని కూడా ఓ రేంజులో ఆటాడుకున్నట్లు కనిపించాడు. 'చికిరి చికిరి పాటలో మోహిత్ చౌహన్ వాయిస్‌కి నువ్వు ఎంత యాక్టింగ్ చేశావంటే ఆయనే పాడాడా అని డౌట్ వచ్చిందయ్యా. నా డబ్బింగ్లో అలా యాక్ట్ చేయకు' అని చరణ్ తెగ ఏడిపించేశాడు. ఈ వీడియో ఫన్నీగా అనిపిస్తూ అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తోంది.'పెద్ది' నుంచి వచ్చిన తొలి పాట 'చికిరి చికిరి' అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సోమవారం(మార్చి 02) ఈ మూవీ నుంచి రెండో సాంగ్ రిలీజ్ కానుంది. ఇకపోతే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తీసిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.(ఇదీ చదవండి: శరత్ కుమార్ రెండో భార్యని తెగ పొగిడేసిన మొదటి భార్య) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. సెకండ్ సింగిల్ అప్డేట్
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీని ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి రెండో తేదీన ఈ మాస్ సాంగ్‌ను విడుదల చేస్తామని డైరెక్టర్ ట్వీట్ చేశారు. నీ అయ్య వడ్డీ... నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే.. రై రై రారా రై రై రారా అంటూ సాగే పాట ఆడియన్స్‌ను అలరించనుంది.కాగా.. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ అభిమానులను ఓ రేంజ్లో ఊపేసింది. ఈ పాటకు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఆడియన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. నీ అయ్య వడ్డీ...నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే!! రై రై రారా రై రై రారా… 🔥🔥🔥COMING SOON… Nee Ayya Vaddee… Nee Bidda Kadithe…Nuvvemi Podichaavanee… RAI RAI RAA RAA🔥🔥🔥This is the anthem of GRIT, GUTS & GLORY 🔥🔥🔥#Peddi second single #RaiRaiRaaRaa out… pic.twitter.com/Xzruw0SZPh— BuchiBabuSana (@BuchiBabuSana) February 26, 2026 -
రామ్ చరణ్ 'పెద్ది'కి భారీ డిజిటల్, ఆడియో డీల్
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాత సతీష్ కిలారు ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం ఎఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఓటిటి మార్కెట్ డౌన్ కాకముందే డిజిటల్ హక్కుల డీల్ ఫినిష్ చేసుకోవడం నిర్మాతల అదృష్టమనే చెప్పాలి. ఆ రోజుల్లో దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి పెద్ది(Peddi) చిత్రాన్ని కోనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.ఆడియో హక్కులు మరో 18 కోట్ల మేరకు వచ్చాయి. శాటిలైట్ హక్కులు ఇంకా ఫైనల్ కాలేదు. కానీ మంచి మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను నేరుగా హిందీలో కూడా విడుదల చేయనున్నారు. అందువల్ల హిందీ డబ్బింగ్ అవసరం లేదు. కానీ హిందీ శాటిలైట్ హక్కులు వేరుగా ఉంటాయి. నాన్-థియేట్రికల్ ఆదాయం మొత్తం కలిపి 150 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'పెద్ది' విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తోందనే చెప్పాలి. -
వారణాసి, పెద్ది, ప్యారడైస్.. ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతుంది?
టాలీవుడ్లో షూటింగ్స్ సందడి మళ్లీ పెరిగింది. సంక్రాంతి సెలవులు, ఇతర విరామాల తర్వాత స్టార్ హీరోలందరూ మేకప్ వేసుకుని లొకేషన్లలో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఏ హీరో ఎక్కడ, ఏ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారో ఓ లుక్కేద్దాం.📽️ ప్రభాస్ - ఫౌజీ: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియడ్ వార్ డ్రామా ఫౌజీ. ఈ సినిమా కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని దండు మైలారంలో జరుగుతోంది. ఇక్కడ భారీ సెట్లు వేసి యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.📽️ రామ్ చరణ్ - పెద్ది: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే చిత్రం పెద్ది. ఈ సినిమా షూటింగ్ సోమవారం వరకు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. ఈ షెడ్యూల్ నిన్నటి పూర్తయిపోయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.📽️ మహేష్ బాబు - వారణాసి: రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ షెడ్యూల్ ప్రస్తుతం గండిపేట పరిసరాల్లో జరుగుతోంది.📽️ ఎన్టీఆర్ - డ్రాగన్: తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ డ్రాగన్.. ప్రస్తుతం జోర్డాన్ ఎడారిలో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకుంటోంది.📽️ అల్లు అర్జున్ - AA22: అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం ముంబైలో మకాం వేశారు. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఉండబోతోంది.📽️ రవితేజ - ఇరుముడి: శివ నిర్వాణ డైరెక్షన్లో మాస్ రాజా నటిస్తున్న ఇరుముడి షూటింగ్ ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని సీలేరు పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది.📽️ విజయ్ దేవరకొండ - రణబాలి: రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్హీరోగా నటిస్తున్న రణబాలి మూవీ షూటింగ్ గండిపేట ఏరియాలో జరుగుతోంది.📽️ నాని - ప్యారడైజ్: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ప్యారడైజ్ షూటింగ్ ముచ్చింతల్ (హెలో నేటివ్ స్టూడియోస్)లో వేసిన ప్రత్యేక సెట్స్‌లో జరుగుతోంది.📽️ వెంకటేష్ - ఆదర్శకుటుంబం: త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) అనే సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో శరవేగంగా సాగుతోంది.📽️ గోపీచంద్ - సంకల్ప రెడ్డి: వీరి యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ అజీజ్ నగర్ సమీపంలో జరుగుతోంది.📽️ కిరణ్ అబ్బవరం - చెన్నై లవ్ స్టోరీ: ఈ యంగ్ హీరో ప్రస్తుతం పాండిచ్చేరిలో తన సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. -
పెద్ది నటుడి బర్త్ డే గిఫ్ట్.. బుచ్చిబాబు ట్వీట్
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మార్చి 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ విషెస్ తెలిపారు. దర్శకుడితో షూట్లో ఉన్న ఫోటోను షేర్ చేశారు. తాజాగా పెద్ది మూవీ నటుడు శివరాజ్‌కుమార్ డైరెక్టర్ బుచ్చికి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా బుచ్చిబాబు వెల్లడించారు. ట్విటర్ వేదికగా శివరాజ్‌కుమార్‌తో ఉన్న ఫోటోను పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్లీ గిఫ్ట్ అంటూ బుచ్చిబాబు ట్వీట్ చేశారు.Thank you so much for the lovely gift @NimmaShivanna Sir ❤️❤️🤗🤗It truly means a lot Sirrr. Love U Sirrr❤️❤️ pic.twitter.com/0YnhB48okh— BuchiBabuSana (@BuchiBabuSana) February 17, 2026 -
పెద్దికి సీక్వెల్ రాబోతుందా?
-
'పెద్ది' సెట్లో బుచ్చిబాబు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
'చికిరి చికిరి' బ్యాట్ స్టెప్ ఐడియా రామ్చరణ్దా?
గతేడాది బాగా హిట్టయిన సాంగ్స్‌లో 'చికిరి చికిరి' ఒకటి. ఇందులో రామ్‌చరణ్ డ్యాన్స్ స్టెప్స్ బాగా వైరలయ్యాయి. ఆ పాట రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ హుక్ స్టిప్ క్రేయేట్ చేసిన వీడియోలే దర్శనమిచ్చాయి. సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చిన ఈ పాటను ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేయగా మోహిత్ చౌహాన్ ఆలపించాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.కంపోజ్ ఎవరు చేశారంటే?తాజాగా జానీ మాస్టర్ ఓ డ్యాన్స్ షోలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. కూర్చుని లేసే స్టెప్స్ తాను కంపోజ్ చేశానని.. కానీ, క్రికెట్ బ్యాట్ స్టెప్ మాత్రం చరణ్ కంపోజ్ చేశాడని తెలిపాడు. జానీ మాట్లాడుతూ.. హుక్ స్టెప్ చరణ్ అన్న వేరేలా కంపోజ్ చేశారు. బ్యాట్ స్టెప్, దాన్ని పట్టుకునేముందు వచ్చే డ్యాన్స్ స్టెప్ ఆయనే క్రియేట్ చేశారు. ఏరోజూ ఆయన క్రెడిట్ తీసుకోరు, మనకే ఇచ్చేస్తారు. సినిమాఎందుకలా అని అడిగితే.. ఐడియా నాది, కానీ దాన్ని ఇంకాస్త బెటర్‌గా మార్చి.. ఇది వర్కవుట్ అవుతుందని నమ్మినందుకు ఆ క్రెడిట్ మీకే చెందాలి అన్నారు. రామ్‌చరణ్ విషయానికి వస్తే.. ఆయన చివరగా నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం పెద్ది అనే స్పోర్ట్స్ డ్రామా మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. జాన్వీ కపూర్ కథానాయిక. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. చదవండి: రెండు గంటలు హాయిగా నవ్వుకుంటారు -
మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పెద్ది రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
-
పెద్ది, డకాయిట్.. ఇక ది ప్యారడైజ్ వంతు..!
ఇటీవల కొద్దికాలంగా టాలీవుడ్ సినిమా పరిస్థితి కాస్తా అయోమయానికి గురి చేస్తోంది. పెద్ద హీరోల చిత్రాల రిలీజ్ డేట్లను ముందుగానే అనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది.. ఎప్పుడు రిలీజవుతుందనేది పక్కాగా ముందే చెప్పేస్తున్నారు. ఆ రోజే గ్రాండ్ రిలీజ్ అంటూ పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. తీరా డేట్ దగ్గరికొచ్చేసరికి వాయిదా వేసుకుంటూ పోతున్నారు. భారీ బడ్జెట్, స్టార్ హీరో ఉన్నా సరే విడుదలకు వెనకాడుతున్నారు. తాజాగా టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. ఏకంగా ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. గ్లోబల్ స్టార్ చెర్రీ- బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ వాయిదా పడడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. ఈ మార్చిలో పెద్ది చూడాలనుకున్న సినీ ప్రియులకు కూడా ఈ నిరాశే మిగిల్చింది.అంతేకాకుండా అడివి శేష్ డకాయిట్ సైతం మరోసారి వాయిదా పడింది. గతంలో చాలాసార్లు వాయిదా పడినా.. ఈ ఏడాది మార్చి 19న వస్తామని ప్రకటించారు. అంతలోనే డకాయిట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా కనిపించనుంది.ఇక మార్చిలో వస్తోన్న టాలీవుడ్ మూవీ ది ప్యారడైజ్. నాని హీరోగా వస్తోన్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అదే రోజు ఉస్తాగ్ భగత్ సింగ్ విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో నాని మూవీ కూడా దాదాపు వాయిదా పడిందనే వార్తలొస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. దీంతో ఈ చిత్రాలన్నీ సమ్మర్‌కు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.దురంధర్-3 దెబ్బకేనా?ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వాయిదా వేయడం అభిమానుల్లో నిరాశ పెంచుతోంది. తమ అభిమాన హీరోల చిత్రాలు పోస్ట్‌పోన్ కావడం వల్ల ఫ్యాన్స్‌లో ఉన్న క్యూరియాసిటీ తగ్గుతోంది. అయితే ఇలా వరుసగా టాలీవుడ్ సినిమాలు వాయిదా పడడానికి ప్రధాన కారణం ఆ ఒక్క సినిమానేనా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మార్చి 19న రానున్న దురంధర్-2 దెబ్బకేనని సగటు సినీ ప్రియుడు భావిస్తున్నారు. లేదంటే నిజంగానే షూటింగ్ పెండింగ్ వల్ల వాయిదా వేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. వరుసగా మూడు టాలీవుడ్ చిత్రాలు వాయిదా పడడంతో సినీ ప్రియుల్లో అసలేం జరుగుతోందనే డౌటానుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ధురంధర్ దెబ్బకి వెనక్కి తగ్గిన పెద్ది..
-
మెగా ఫ్యాన్స్‌కు షాక్.. పెద్ది మూవీ రిలీజ్ వాయిదా
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ ఏడాది మార్చి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ తాజాగా అభిమానులకు బిగ్ షాకిచ్చింది మూవీ టీమ్. పెద్ది విడుదలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.పెద్ది మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. దాదాపు నెల రోజుల పాటు ఈ సినిమాను వాయిదా వేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో మార్చిలో పెద్ది చూడాలనుకున్న మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. దురంధర్-2 వల్లేనా?అయితే పెద్ది మూవీ వాయిదా వేయడంపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ దురంధర్-2 మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సారి దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్దిని వాయిదా వేసి ఉంటారని నెటిజన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే అడివి శేష్ నటించిన డకాయిట్ సైతం వాయిదా పడిన సంగతి తెలిసిందే. #PEDDI will see you on 30th APRIL, 2026 💪🏻🔥@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @vriddhicinemas @VenkataSKilaru @MythriOfficial @SukumarWritings @PeddiMovieOffl pic.twitter.com/TTfrxi773W— Ram Charan (@AlwaysRamCharan) February 4, 2026 -
"ది ప్యారడైజ్" రిలీజ్‌పై క్లారిటీ.."పెద్ది" ఇంకా సస్పెన్స్‌లోనే!
నాని, రామ్ చరణ్ సినిమాలు అనధికారికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు కొత్త రిలీజ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో "ది ప్యారడైజ్" సినిమాపై దాదాపు స్పష్టత వచ్చింది. మార్చి నుంచి తప్పుకున్న ఈ సినిమాను జూన్ చివర్లో విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. షూటింగ్‌తో పాటు గ్రాఫిక్స్ పనులకు కూడా ఓ డెడ్‌లైన్స్ పెట్టి, ఆ గడువులోగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇవి కేవలం యూనిట్ నిర్ణయించిన తేదీలు మాత్రమే. పూర్తిగా క్లారిటీ వచ్చాకనే అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు కాస్త ఎక్కువ టైమ్‌నే తీసుకుంటున్నారు. మరోవైపు రామ్ చరణ్ "పెద్ది" సినిమా రిలీజ్ విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ప్యారడైజ్తో పోలిస్తే పెద్ది షూటింగ్ ముందే పూర్తి అవుతోంది. మొన్నటి వరకూ మే 1న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తేదీపై కూడా యూనిట్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన "చికిరి" సాంగ్ పెద్ద హిట్ అయింది. త్వరలోనే సెకండ్ సింగిల్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఇక అదే సమయంలో రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. -
రామ్ చరణ్ పెద్ది స్టోరీ లీక్..! ఎవరూ ఊహించి ఉండరు..!
-
టాలీవుడ్లో మరోసారి విడుదల తేదీల గందరగోళం
టాలీవుడ్లో మరోసారి విడుదల తేదీల గజిబిజి మొదలైంది. ఇప్పటికే ఏ నెలలో ఏ సినిమా వస్తుందో లెక్కలు వేసుకుని, హీరోల అభిమానులు కౌంట్‌డౌన్ పోస్టర్లు, సోషల్ మీడియాలో ట్రెండింగులు కూడా మొదలుపెట్టారు. కానీ ముందు అనుకున్నట్టుగా కాకుండా వరుసగా సినిమాలు వాయిదా పడుతుండటంతో పరిశ్రమలో గందరగోళం నెలకొంది. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన స్వయంభు ఏప్రిల్‌కు వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా వాయిదా పడినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. మార్చి చివర్లో విడుదల కావాల్సిన రామ్ చరణ్ 'పెద్ది' మే నెలాఖరుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రచారం కోసం అదనపు సమయం తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ మార్చి నుంచి వాయిదా పడుతూ మే 1న విడుదల చేస్తారనే ప్రచారం ఉంది. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి నెలకే ముందుకు జరిపే అవకాశం ఉందని టాక్. గూఢచారి 2 మే 1న రిలీజ్ అవుతుందని ముందుగా ప్రకటించారు. కానీ అదే తేదీకి ది ప్యారడైజ్ కూడా వస్తుందనే గాసిప్పులు వినిపిస్తున్నాయి. విశ్వంభర జూన్‌లో విడుదల చేయాలనే ప్లాన్ ఉంది. కానీ అప్పటికే వాయిదా పడిన సినిమాలు జూన్‌లో స్లాట్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. ఈ వరుస వాయిదాలతో టాలీవుడ్లో రిలీజ్ షెడ్యూల్ పూర్తిగా గందరగోళంగా మారింది. ఒక సినిమా వాయిదా పడితే దాని ప్రభావం మరో సినిమాపై పడుతోంది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు అందరూ అయోమయంలో ఉన్నారు. మరో 10 రోజుల్లో ఈ సినిమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాంతో అభిమానులు అధికారిక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ఊ అంటావా ని మించి..! పెద్దిలో మృణాల్ ఎంట్రీ
-
మెగా హీరో సినిమాలో మృణాల్ ఐటమ్ సాంగ్?
తెలుగులో చేసినవి రెండు మూడు సినిమాలే అయినా మృణాల్ ఠాకుర్ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో అయితే ఈమె గురించి సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వినిపించాయి. తమిళ హీరో ధనుష్‌ని పెళ్లి చేసుకోనుందని, ఫిబ్రవరి 14న డేట్ కూడా ఫిక్స్ చేశారని అన్నారు. తీరా చూస్తే ఇవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని మృణాల్ టీమ్ క్లారిటీ ఇవ్వడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. ఈ విషయాలని పక్కనబెడితే ఇప్పుడు మెగా హీరో మూవీలో ఐటమ్ సాంగ్ చేయనుందనే రూమర్ వినబడుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)ప్రస్తుతం తెలుగులో అడివి శేష్ 'డకాయిట్'లో మృణాల్ హీరోయిన్. మార్చి 19న ఈ మూవీ తెలుగు, హిందీలో రిలీజ్ కానుంది. ఫిబ్రవరిలో ఓ హిందీ సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు రామ్ చరణ్ 'పెద్ది'లోనూ ఈమె స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేయనుందనే పుకారు తెగ వైరల్ అవుతోంది. 'జిగేలు రాణి' టైపులో దీన్ని ప్లాన్ చేశారని అంటున్నారు. ప్రస్తుతానికి ఇది రూమర్ మాత్రమే. ఒకవేళ నిజమైతే మాత్రం అభిమానులకు పండగే!మరోవైపు 'పెద్ది' వాయిదా పడనుందనే రూమర్స్ గట్టిగా వినబడుతున్నాయి. లెక్క ప్రకారం అయితే మార్చి 27న పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ వర్క్ పెండింగ్ ఉండటం, మార్చిలోనే 'ధురంధర్ 2' రిలీజ్ కానుండటం తదితర కారణాల వల్ల వాయిదా గ్యారంటీ అని అంటున్నారు. మే లేదా జూన్‌లో 'పెద్ది' థియేటర్లలోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. 'పెద్ది' ఈ తేదీన రాకపోతే.. పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ప్రేక్షకుల ముందుకు రావొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి వీటిలో ఏదేది నిజమనేది తెలియల్సి ఉంది.(ఇదీ చదవండి: స్మృతి మంధాన మాజీ ప్రియుడిపై చీటింగ్ కేసు) -
పెద్ది పోస్ట్ పోన్..!
-
తర్వాతి రెండు నెలలు డ్రై?
2026 సంవత్సరానికి టాలీవుడ్ ఘనంగా శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కళకళలాడాయి. ఒక్క సినిమా తప్ప మిగతావన్నీ క్లిక్ అవ్వడం సినీ పరిశ్రమకు ప్రత్యేకమైన శుభారంభం. ప్రేక్షకులు కూడా ఈ విజయాలతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే సంక్రాంతి ఊపు కొనసాగించాల్సిన సమయంలో షెడ్యూల్లో ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా సైడ్ అవ్వడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. జనవరి చివరి వారాల్లో చెప్పుకోదగ్గ పెద్ద సినిమా లేదు. చిన్న సినిమాలే వరుసగా రావడం వల్ల బాక్సాఫీస్‌లో స్పష్టమైన గ్యాప్ కనిపిస్తోంది. ఫిబ్రవరిలో పెద్ద సినిమా స్వయంభూ మాత్రమే కనిపిస్తోంది. కానీ ఈ సినిమా విడుదల తేదీపై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. వాయిదా పడుతుందేమో అనే వార్తలు రోజురోజుకు బలపడుతున్నాయి. స్వయంభూ వాయిదా పడితే ఫిబ్రవరిలో మరో పెద్ద సినిమా లేదు. మార్చి నుంచి మళ్లీ పెద్ద సినిమాల హవా మొదలవుతుందని అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే మార్చి కూడా డ్రైగానే ముగిసేలా ఉంది. ది ప్యారడైజ్ సినిమా వాయిదా పడినట్టే. పెద్ది సినిమా కూడా బాలీవుడ్ పోటీ కారణంగా తటపటాయిస్తోంది. కొంతమంది మాత్రం పెద్ది కూడా వాయిదా పడుతుందని అంటున్నారు. కానీ చెప్పలేం ఏం జరుగుతుందో చూడాలి.ఒకవేళ మార్చిలో పెద్ది కూడా వాయిదా పడితే డెకాయిట్ తప్ప మరో పెద్ద సినిమా లేకపోవడం ఖాయం. దీంతో మొత్తం పరిస్థితి టాక్సిక్ సినిమాకే దారిచ్చినట్టవుతుంది. రాబోయే రెండు నెలలు పెద్ద సినిమాల లేని డ్రై సీజన్‌గా మారే అవకాశం ఉంది. ప్రేక్షకులు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.కానీ విడుదలల అనిశ్చితి వల్ల ఆ ఉత్సాహం తగ్గిపోయే అవకాశం ఉంది. -
రామ్‌చరణ్ కండల సీక్రెట్ అతడే
టాలీవుడ్లో ఇప్పుడు బెస్ట్ ఫిజిక్‌ను స్క్రీన్‌పై చూపించడానికి స్టార్స్ పోటీపడుతున్నారు. పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ కఠినమైన కసరత్తులతో ఫిజిక్‌ను తీర్చిదిద్దుకుంటున్నాడు.దీనికి నిదర్శనంగానా అన్నట్టు... లేటెస్ట్గా బయటకు వచ్చిన ఆయన ఫిట్ లుక్ బాగా వైరల్ అయింది. సినిమాకి డైరెక్టర్ ఎంత ముఖ్యమో హీరోల ఫిజిక్లకు ట్రైనర్ కూడా అంతే. మరి రామ్ చరణ్ లుక్‌ని ఈ రేంజ్లో క్లిక్ అయ్యేలా చేసిన ఆ ట్రైనర్ ఎవరు? ఆయన నేపధ్యం ఏమిటి?ఆయనే ముంబయికి చెందిన రాకేష్ ఉడియార్. ఆమిర్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఫిట్నెస్ ట్రైనర్‌గా బాలీవుడ్‌కి సుపరిచితుడైన రాకేష్ ఇప్పుడు దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సెలబ్రిటీ ట్రైనర్స్‌లో ఒకడు. ఎంత శ్రద్ధగా సెలబ్రిటీల శరీరాలను తీర్చిదిద్దుతున్నాడో అంతే శ్రద్ధగా ఆయన తన జీవితాన్ని కూడా నిర్మించుకున్నారని ఆయన విజయాల వెనుక ఉన్న కధ వెల్లడిస్తుంది. ఆయన గతంలో ఒకసారి తన స్ఫూర్తిదాయక జీవితం గురించి మీడియాతో పంచుకున్నాడు.రాకేష్ జీవితం చాలా కష్టాలతో గడిచింది.అతని తండ్రికి పక్షవాతం వచ్చిన తర్వాత, చిన్న వయసులోనే రాకేష్ లోకల్ రైళ్లలో చిన్న చిన్న వస్తువులు అమ్మేవాడు. అతని సోదరుడితో కలిసి రోజుకు సుమారు 25 రూపాయలు సంపాదించేవారు. తర్వాత, రాకేష్ తల్లికి ఒక ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగం దొరికింది, ఆ ఇంటి యజమాని ఆ ఇద్దరు తోబుట్టువులను పాఠశాలకు పంపడానికి ముందుకొచ్చారు. రాకేష్ అదే సమయంలో ఒక దాబాలో కూడా పనిచేశాడు.‘‘నాకు ఎప్పుడూ ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉండేది దాని గురించి విస్త్రుతంగా పుస్తకాలు చదివేవాడిని. 16 ఏళ్ల వయసులో, నాకు ఒక జిమ్‌లో స్వీపర్‌గా ఉద్యోగం వచ్చింది, ఆ తర్వాత ఫ్లోర్ ట్రైనర్‌గా పదోన్నతి పొందాను. చివరికి, నేను ఫ్రీలాన్సర్‌గా మారి సెలబ్రిటీలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను,’’ అని ఫిట్నెస్ రంగంలోకి తన ప్రవేశాన్ని గుర్తుచేసుకుంటూ రాకేష్ చెప్పాడు. సల్మాన్ ఖాన్ రాకేష్ ప్రముఖ క్లయింట్లలో ఒకరు. ‘‘నేను అర్బాజ్ ఖాన్(సల్మాన్ సోదరుడు) కు శిక్షణ ఇస్తున్నప్పుడు, సల్మాన్ నాకు ఫోన్ చేసి, బాడీగార్డ్ సినిమా కోసం తనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు’’ అంటూ రాకేష్ గుర్తు చేసుకుంటాడు. అప్పటి నుంచీ రాకేష్ సల్మాన్‌కు పర్సనల్ ట్రైనర్‌గా కొనసాగుతున్నాడు. ఇక మరో బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్‌ఖాన్ తన పీకే సినిమా ప్రారంభించడానికి ముందే, రాకేష్‌కు ఫోన్ చేసి తన ట్రైనర్‌గా ఉండమని అడిగాడట. అప్పటి నుంచీ వీరిద్దరి జోడీ కూడా కంటిన్యూ అవుతోంది.రామ్‌చరణ్‌తో పరిచయం అలా...‘ధ్రువ’ సినిమా సమయంలో తొలిసారి పూర్తిగా కండలు తిరిగిన గ్రీకు శిల్పం లాంటి శరీరం కావాలనుకున్నప్పుడు మన టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్‌కు రాకేష్ పేరును సూచించింది సల్మానే. ‘‘చరణ్ సల్మాన్ లు మంచి స్నేహితులు.ఆ సినిమా కోసం ది బెస్ట్ ఫిజిక్‌తో ఫిట్‌గా కనపడాలని చరణ్ అనుకున్నాడు’’ అని రాకేష్ చెప్పాడు. అప్పటి నుంచి రామ్ చరణ్‌తో రాకేష్ పనిచేస్తున్నాడు. ‘‘చరణ్‌కు శిక్షణ ఇవ్వడానికి నేను హైదరాబాద్, ముంబయి మధ్య రాకపోకలు సాగిస్తుంటాను. చరణ్ తరచుగా నన్ను సంప్రదిస్తాడు. ఆయన అవసరాలకు అనుగుణంగా తన వర్కవుట్, పోషకాహారం మొదలైన వాటి గురించి నేను ఒక ప్రణాళికను రూపొందిస్తుంటాను’’ అంటూ రాకేష్ వివరిస్తున్నాడు.రామ్‌చరణ్ మాత్రమే కాదు దియా మీర్జా, కునాల్ కపూర్, డైసీ షా పుల్కిత్ సామ్రాట్‌తో సహా తారలెందరికో రాకేష్ శిక్షణ ఇచ్చాడు. ‘‘నటీనటులు తమ పాత్రల కోసం బరువు తగ్గుతూ, పెరుగుతూ ఉంటారు, ఆ సమయంలో వారికి వైద్యులు శిక్షకులు దగ్గరగా పనిచేస్తాం; ఆ లుక్ పొందడానికి ఒక ఫిట్నెస్ ప్రణాళిక ఆహారం అందిస్తాం. ఉదాహరణకు దంగల్ సినిమా కోసం, ఆమిర్‌ఖాన్ 97 కిలోల నుంచి బరువు తగ్గాల్సి వచ్చింది దానిని సాధించడానికి అతనికి సరైన బృందం సహాయం చేసింది.’అదే విధంగా మరో సినిమా కోసం రామ్ చరణ్ సన్నగా మారాలని ఆశించారు’’ అంటూ రాకేష్ గుర్తు చేసుకుంటాడు. ’ ఆమిర్ సల్మాన్, రామ్ చరణ్ లు ఎంత పెద్ద బిజీ హీరోలైనా తమ వర్కౌట్ సెషన్ల విషయంలో అలసత్వం చూపరని చాలా పట్టుదలగా ఉంటారని రాకేష్ వెల్లడించాడు. ‘సల్మాన్ ఎంత అలసిపోయినా లేదా ఇంటికి ఆలస్యంగా వచ్చినా, జిమ్‌కు వెళ్లడం మానడు. అతనికి తినడం అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా తన తల్లి వంటకం అంటే మరీ ఇష్టం, కానీ అతను ఎప్పుడూ అదనపు కేలరీలు పెరగనివ్వడు,‘ అని రాకేష్ చెప్పాడు. -
మార్చి రిలీజ్‌లపై సందేహాలు.. ఏవి వస్తాయి? ఏవి వాయిదా?
సినీ పరిశ్రమలో ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది మార్చి నెల రిలీజ్లు. ఇప్పటికే ప్రకటించిన సినిమాలు పెద్ది, పారడైజ్, దురంధర్ 2 – నిజంగా ఆ టైమ్‌లో వస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. నాని హీరోగా వస్తున్న పారడైజ్ సినిమాకు ఇంకా చాలా వర్క్ మిగిలి ఉంది. అందువల్ల మార్చిలో రిలీజ్ అవ్వడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది. పెద్ది సినిమాకు ఇంకా ముప్పై రోజుల షూట్ మిగిలి ఉంది. సంక్రాంతి తర్వాత నాన్‌స్టాప్‌గా షూట్ చేసినా, రిలీజ్‌కు కావాల్సిన పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ టైమ్ ఒక్క నెలలో పూర్తవడం కష్టమే. కానీ ఇటీవల రిలీజ్ చేసిన రామ్ చరణ్ పోస్టర్లలో మాత్ర మార్చి నెల రిలీజ్ అంటూ ప్రకటించారు. చూడాలి ఆ టైమ్‌కు పెద్ది రిలీజ్ అవుతుంతో లేదో. ఇక ఇటీవలే రిలీజ్ డేట్ ప్రకటించిన దురంధర్ 2 మాత్రం బాలీవుడ్ స్టైల్లో డేట్ ఫిక్స్ చేస్తే ఎక్కువగా వాయిదా లేకుండా వస్తుందని అంచనా. అయితే మార్చి నెల ఎగ్జామ్స్ సీజన్. దాంతో ఆ టైమ్‌లో రిలీజ్ చేస్తారా.. లేదా అనే సందేహం ఉంది. దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కిస్తున్న ప్రభాస్ సినిమా 2027 మార్చికి ప్లాన్ చేశారు. ఇది పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు కలిగిస్తోంది. రాజమౌళి వారణాసి ప్రాజెక్ట్ కూడా అదే టైమ్‌లో వస్తుందని టాక్ ఉంది. కానీ అధికారిక డేట్ మాత్రం ఇంకా రాలేదు. సంక్రాంతి రిలీజ్‌ల మాదిరిగానే ప్రీ సమ్మర్ రిలీజ్లు కూడా ఇప్పుడు మంచి ఆప్షన్‌గా మారుతున్నాయి. ఎగ్జామ్స్ సీజన్ ఉన్నా, పెద్ద సినిమాలు వేసవి హాలిడేలకు దగ్గరగా రిలీజ్ అవ్వడం వల్ల బాక్సాఫీస్‌లో మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి మార్చి 2026లో ప్రకటించిన సినిమాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ 2027 మార్చి మాత్రం పాన్ ఇండియా లెవెల్లో భారీ సినిమాలతో హాట్‌గా మారనుంది. -
నెట్‌ఫ్లిక్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది.. ఈ ఏడాది స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలివే!
ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత పెద్ద సినిమా అయినా సరే థియేటర్స్‌లో రిలీజ్ అయిన నాలుగు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మొన్నటి వరకు రిలీజ్‌కి ముందు సదరు సినిమా నిర్మాతలు ఓటీటీ సంస్థలతో డీల్ కుదుర్చుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా షూటింగ్ ప్రారంభంలోనే ఓటీటీ డీల్‌ను పూర్తి చేసుకుంటున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ని దృష్టిలో పెట్టుకొని సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అలా తమతో డీల్ కుదుర్చుకొని.. ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాల జాబితాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్రకటించింది. అందులో పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ ‘పెద్ది’తో పాటు ‘ఛాంపియన్, ఫంకీ లాంటి చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.2026లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా అలరించే చిత్రాలివే..టైటిల్: ఉస్తాద్ భగత్ సింగ్నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీలదర్శకత్వం : హరీశ్ శంకర్టైటిల్: పెద్దినటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్దర్శకత్వం : బుచ్చిబాబుటైటిల్: ది ప్యారడైజ్నటీనటులు: నాని, సొనాలి కులకర్ణి, మోహన్ బాబుదర్శకత్వం: శ్రీకాంత్ ఓదెలటైటిల్: ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47నటీనటులు: వెంకటేశ్, శ్రీనిధి శెట్టిదర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్టైటిల్: ఆకాశంలో ఒక తారనటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లిదర్శకత్వం: పవన్ సాదినేనిటైటిల్: ఛాంపియన్నటీనటులు : రోషన్, అనస్వర రాజన్దర్శకత్వం: ప్రదీప్ అద్వైతంటైటిల్: ఫంకీనటీనటులు: విశ్వక్ సేన్, కయాదు లోహార్దర్శకత్వం : అనుదీప్ కేవీటైటిల్: ‘రాకాస’సంగీత్ శోభన్, నయనసారికదర్శకత్వం: మాససా శర్మటైటిల్: బైకర్నటీనటులు : శర్వానంద్, రాజశేఖర్దర్శకత్వం : . అభిలాష్ రెడ్డిటైటిల్: వీడీ 14(వర్కింగ్ టైటిల్)నటీనటులు: విజయదేవరకొండ, రష్మికదర్శకత్వం : రాహుల్ సాంకృత్యన్ -
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాలివే.. ‘స్పిరిట్’ ఏ స్థానంలో ఉందంటే..
సినిమాలకు సంబంధించి రేటింగ్ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్లైన్ వేదికగా పేరున్న ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ).. ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా మోస్ట్ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించింది. 250 మిలియన్లకు పైగా ఐఎండీబీ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా తీసిన ఈ లిస్ట్‌ను తాజాగా ప్రకటించింది. ఈ లిస్ట్‌లో టాప్ పొజిషన్లో షారుఖ్‌ఖాన్ కింగ్ సినిమా ఉండగా.. ప్రభాస్-సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ నాలుగో స్థానం దక్కించుకుంది. అలాగే ప్రభాస్ మరో చిత్రం పౌజీ పదో స్టానంలో ఉంది. ఇక రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది 13వ స్థానం దక్కించుకుంది. మొత్తంగా టాప్ 20లో 5 తెలుగు సినిమాలు ఉండడం విశేషం. ఐఎండీబీ ప్రకటించిన టాప్ 20 సినిమాలివే...1) కింగ్ (హిందీ) :‘పఠాన్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రమింది. ఇందులో షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్ర పోషిస్త్ననారు. దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్స్ కూడా ఇందులో నటిస్తున్నారు.2) రామాయణ (హిందీ)రణ్‌బీర్ ప్రధాన పాత్రలో నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రెండు భాగాలుగా ‘రామాయణ’ రానున్న ఈ మూవీ మొదటి పార్ట్ ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.2027లో రెండో భాగం విడుదల కానుంది. ఇందులో రణ్‌బీర్ రాముడిగా నటించగా.. సాయి పల్లవి సీత పాత్రని పోషించింది. కన్నడ స్టార్ హీరో యశ్.. రావణుడిగా కనిపించబోతున్నాడు.3) జననాయగన్(తమిళ్)తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో పూజా హెగ్దే, మమితా బైజు, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.4) స్పిరిట్(తెలుగు)ప్రభాస్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటించగా,.బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.5) టాక్సిక్(కన్నడ)యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టాక్సిక్. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది.6) బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్సల్మాన్ఖాన్ హీరోగా అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’. ఇందులో సల్మాన్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా చిత్రాంగద సింగ్ నటిస్తోంది. హిమేష్ రేష్మియా సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.7) ఆల్ఫా(హిందీ)అలియా భట్. శార్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో రాబోతున్న ఈ మొదటి మహిళా గూఢచారి చిత్రాన్ని శివ్ రావేల్ తెరకెక్కిస్తున్నారు.8) దురంధర్ 2 (హిందీ)బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్ చిత్రానికి సీక్వెల్ ఇది. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.9) బోర్డర్ 2 (హిందీ)1997 నాటి ఐకానిక్ వార్ డ్రామా ‘బోర్డర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. ఈ సీక్వెల్లో సన్నీ డియోల్‌తో పాటు వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.10) ఫౌజీహను రాఘవపూడి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతన్న చిత్రమిది. దేశభక్తి అంశాలతో ముడిపడి ఉన్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా.. జయప్రద, అనుపమ్ ఖేర్, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.11) లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK) (తమిళ్) : ప్రదీప్ రంగనాథన్(హీరో)12) ది ప్యారడైజ్(తెలుగు) : నాని13) పెద్ది(తెలుగు): రామ్ చరణ్14) డ్రాగన్(తెలుగు): ఎన్టీఆర్15) లవ్ అండ్ వార్(హిందీ): రన్బీర్ కపూర్16) బూత్ బంగ్లా(హిందీ): అక్షయ్ కుమార్17) బెంజ్(తమిళ్): లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)నుంచి రాబోతున్న చిత్రమిది.18) శక్తి శాలిని(హిందీ): హారర్-కామెడీ ఫ్రాంచైజీ19) ‘పేట్రియాట్ (మలయాళం) - మమ్మూట్టీ, మోహన్‌లాల్20) ఓ రోమియో (హిందీ): షాహిద్ కపూర్ -
Peddi : హైదరాబాద్ లో పెద్ది రచ్చ..!
-
ఎ.ఆర్. రెహమాన్ బర్త్‌డే వేడుకలు.. సందడిగా సెలబ్రిటీలు (ఫోటోలు)
-
2026నే టార్గెట్ చేసిన స్టార్ హీరోలు.. ఎవరికి కలిసొస్తుందో?
గతేడాది చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు.. థియేటర్లలో కనిపించలేదు. కారణం ఏదైనా గానీ ఈ ఏడాది మాత్రం తలో రెండుసార్లు కనిపించబోతున్నారు. వీళ్లతో పాటు చాలామంది స్టార్ హీరోలు కూడా 2026నే టార్గెట్ చేశారు. ఒకటి రెండు కాదు 10కి పైగా భారీ బడ్జెట్ లేదా బజ్ ఉన్న చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటిపై హైప్ ఎలా ఉంది?సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలంటే 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు'. వీటిలో ప్రభాస్ చిత్రానికి ట్రైలర్స్‌తో బజ్ వచ్చింది. హారర్ కామెడీ కాబట్టి క్లిక్ అయ్యే ఛాన్సుంది. చిరంజీవి మూవీని కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ చేసి తీశారు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ అయితే బాగుంది. కానీ ట్రైలర్ బట్టి చూడాలా వద్దా అని చాలామంది డిసైడ్ అయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: బ్లూ డ్రమ్ కేసు గుర్తుందా? దీనిపై వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్కి రెడీ)వీటి తర్వాత అంటే మార్చిలో ప్యారడైజ్', 'పెద్ది' చిత్రాలు రాబోతున్నాయి. నాని 'ప్యారడైజ్', రామ్ చరణ్ 'పెద్ది'.. ఒకరోజు గ్యాప్‌లో థియేటర్లలోకి రానున్నాయి. వీటిపై ప్రస్తుతం బోలెడంత హైప్ ఉంది. కంటెంట్ కూడా అదే రేంజులో ఉంటే బ్లాక్ బస్టర్ టాక్ గ్యారంటీ.ఏప్రిల్‌లో పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రానుంది. దీనిపై రీమేక్ అని రూమర్ చాన్నాళ్లుగా వస్తుంది. టీమ్ మాత్రం అలాంటిదేం లేదని అంటోంది. ప్రమోషనల్ కంటెంట్ ఏమైనా బయటకు వస్తే అప్పుడు హైప్ పెరగడం, తగ్గడం లాంటివి ఉంటాయి. జూన్ లేదా జూలైలో చిరంజీవి నుంచి ఈ ఏడాది మరో మూవీ వచ్చే అవకాశముంది. అదే 'విశ్వంభర'. ఇప్పటికే ఇది రిలీజైపోవాలి. కానీ గ్రాఫిక్స్ వచ్చిన ఘోరమైన విమర్శల దెబ్బకు ఆలస్యమైపోయింది. ఈ మూవీపై అయితే ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాల్లేవు.ఈ ఏడాది ద్వితియార్థంలో రాబోయే భారీ సినిమాల్లో ప్రభాస్ 'ఫౌజీ', ఎన్టీఆర్ 'డ్రాగన్'. ఈ రెండు చిత్రాల నుంచి ఇప్పటివరకు పోస్టర్స్ కూడా పెద్దగా రాలేదు. అలా అని బజ్ లేదనుకుంటే పొరపాటే. హైప్ అయితే చాలానే ఉంది. ప్రభాస్ది పీరియాడికల్ వార్ డ్రామా కాగా.. తారక్‌ది మూవీ. ఇవి ఏ మాత్రం క్లిక్ అయినా సరే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ గ్యారంటీ.పైనవన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలు. ఇవి కాకుండా ఈ ఏడాది రిలీజయ్యే వాటిలో డకాయిట్, స్వయంభు, గూఢచారి 2, రౌడీ జనార్ధన, వృషకర్మ లాంటి మూవీస్ ఉన్నాయి. వీటిలో అడివి శేష్వి రెండున్నాయి. ఇతడి నుంచి సినిమా వచ్చి చాన్నాళ్లయిపోయింది. కానీ గట్టిగానే హిట్ కొడతానని ధీమాగా ఉన్నాడు.మరోవైపు నిఖిల్ చేసిన పీరియాడికల్ డ్రామా 'స్వయంభు', విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన', నాగచైతన్య 'వృషకర్మ'పై ప్రస్తుతానికి పెద్దగా బజ్ లేదు గానీ కంటెంట్‌తో హిట్ కొట్టే ఛాన్సులు వీటికి చాలా ఉన్నాయి. మరి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి?(ఇదీ చదవండి: 'జన నాయకుడు' ట్రైలర్ రిలీజ్.. ఇది రీమేకేగా) -
'పెద్ది'లో మరో స్టార్.. ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ చివరి దశ చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ మధ్య ఢిల్లీ పలు సీన్స్ తీశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. చెప్పినట్లుగానే మార్చి 27న థియేటర్లలో రిలీజ్ చేయడమే లక్ష్యంగా మూవీని సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో నటిస్తున్న ఓ స్టార్ నటుడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చూసిన వెంటనే ఆయనెవరో గుర్తుపట్టడం కష్టమే.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' కొత్త ట్రైలర్ రిలీజ్)పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి జగపతిబాబు. అప్పట్లో హీరోగా చేశాడు. గత కొన్నాళ్లుగా మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈయన్ని మాస్ లేదా క్లాస్ పాత్రలు చేస్తూ వచ్చారు. కాకపోతే లుక్ మాత్రం దాదాపు ఒకేలా ఉండేది. 'పెద్ది' కోసం మాత్రం గుర్తుపట్టలేనంతగా మార్చేశారని చెప్పొచ్చు. అప్పలసూరి అనే పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నాడని మూవీ టీమ్ ప్రకటించింది. మరి ఈయనది పాజిటివ్ క్యారెక్టరా నెగిటివ్ క్యారెక్టరా అనేది సినిమా రిలీజ్ అయితే తప్ప తెలియదు.'పెద్ది' చిత్రాన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం 'చికిరి చికిరి' అనే సాగే పాట రిలీజ్ చేస్తే ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఫస్ట్ లుక్స్‌తోనూ మూవీ టీమ్ ఆశ్చర్యపరుస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)Honoured and super glad to be 'APPALASOORI' in #Peddi ❤🔥Thoroughly enjoyed playing this role. #PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/fYmuVeeTxc— Jaggu Bhai (@IamJagguBhai) December 29, 2025 -
శివాజీ డర్టీ 'సామాను' గోల 'పెద్ది'పై పడిందా..?
'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ మాట్లాడుతూ.. హీరోయిన్లు కొంచెం డ్రెస్ సెన్స్ పాటించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రామ్‌చరణ్ పెద్ది సినిమాను కూడా తాకుతున్నాయి. ఇంతకీ శివాజీ ఏమన్నాడంటే.. 'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందంటూ.. మీ అందం చీరలోనూ, నిండుగా కట్టుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ‘సామాను’ కనబడే వాటిలో ఏమీ ఉండదమ్మా అని సూక్తులు చెప్పాడు. అయితే, సామాజిక కార్యకర్తలతో పాటు సినీ రంగం నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో తనతప్పు తెలుసుకుని సారీ చెప్పాడు.అయితే, శివాజీ చేసిన డర్టీ సామాను వ్యాఖ్యలు అటు తిరిగి ఇటు తిరిగి పెద్ది సినిమాపై పడ్డాయి. రీసెంట్గా భారీ హిట్ అయిన చికిరి పాట తెరపైకి వచ్చింది. ఈ సాంగ్‌లో కూడా 'సరుకు సామాను' అనే పదాలను రచయిత వాడారు. పనిలో పనిగా ఇందులో ఉన్న మరికొన్ని ఇలాంటి పదాలే బయటకు తవ్వారు. ఈ పాటలో ఒకచోట 'ఆ చంద్రుల్లో ముక్క.. జారిందే 'దీనక్క'.. నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా' అంటూ రాసుకుంటూ పోయాడు. సరుకు సామాను అనే పదాన్ని వాడుకలో ఉపయోగిస్తాం కదా అని కొందరు పక్కన పెడితే.. దీనక్క అనేది అభ్యంతరంగానే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో శివాజీతో పాటు పెద్ది సాంగ్ రచయితను కూడా ఏకిపారేస్తున్నారు.రవితేజ నటించిన మాస్ జాతరలో కూడా ఇలాంటి పదాలే కనిపించాయి. శ్రీలీలతో 'ఓలే ఓలే' సాంగ్ కోసం స్టెప్పులేసిన రవితేజ కూడా ఆ పాటకు అభ్యంతరం చెప్పలేదు. చెప్పలేని పదాలతో ఎక్కడపడితే అక్కడ బూతులతో రెచ్చిపోయారు. ఓ ఇంటర్వ్యూలో కూడా మేకర్స్ ఆ పాటను సమర్థించుకోవడం మరింత నీచం. శివాజీ వ్యాఖ్యల తర్వాత ఇలాంటి డర్జీ చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి సాంగ్స్, డైలాగ్స్ వచ్చినప్పుడు శివాజీ అడ్డుచెప్పలేదు ఎందుకు.. అతని వ్యాఖ్యలను సమర్థించే వారు ఈ డర్టీ సంప్రదాయాన్ని కూడా మెచ్చుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.“సరుకు సామాను”………ఈ సాంగ్‌లో వాడారు కదా, అప్పుడు కూడా అందరూ రియాక్ట్ అయ్యారా?జస్ట్ అనిపించింది… ఎవరు అయినా రియాక్ట్ అయితే మంచిదే……#justasking pic.twitter.com/dQJJu6pcvF— 9iMedia (@9iMediaNews) December 23, 2025 -
ఢిల్లీలో పెద్ది
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’ మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోంది. రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు బుచ్చిబాబు.ఈ సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. చేతిలో సంచితో మాస్ లుక్‌లో నడుచుకుంటూ వెళుతున్న రామ్ చరణ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి...’పాట 150 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించినట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా, కెమెరా: ఆర్. రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్. -
పెద్ది మూవీతో బాక్సాఫీస్ క్లాష్.. ది ప్యారడైజ్ నిర్మాత ఏమన్నారంటే?
నాని హీరోగా వస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల-నాని కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ది ప్యారడైజ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో కమెడియన్ సంపూర్ణేశ్ బాబు బిర్యానీ పాత్రలో కనిపించనున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత సుధాకర్ చెరుకూరి రిలీజ్ డేట్‌పై అడిగిన ప్రశ్నకు స్పందించారు.ఇప్పటికే ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 26న పెద్దిని రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీ కూడా మార్చి 27 రోజున రిలీజవుతోంది. ఒక్క వ్యవధిలోనే రెండు పెద్ద సినిమాలు రానుండడంతో బాక్సాఫీస్ క్లాష్ తప్పేలే లేదు. దీంతో ది ప్యారడైజ్‌కు రామ్ చరణ్ పెద్ది మూవీతో క్లాష్ తప్పదా? లేదా లాస్ట్‌లో విడుదల తేదీని మారుస్తారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.దీనిపై నిర్మాత సుధాకర్ చెరుకూరి స్పందించారు. మేము సాధ్యమైనంత త్వరగా మూవీని కంప్లీట్ చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నామని వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తయితే తప్పకుండా మార్చి 26నే ది ప్యారడైజ్ రిలీజ్ అవుతుందన్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద నాని వర్సెస్ రామ్ చరణ్ తప్పలా లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లేదంటే అప్పటికల్లా ఏదో ఒక మూవీ పోస్ట్‌పోస్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రిపోర్టర్: #Peddi తో #Paradise క్లాష్ తప్పదా? లేదా లాస్ట్‌లో మారుస్తారా?ప్రొడ్యూసర్ #SudhakarCherukuri: మార్చి 26న రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నాం. అంతా పూర్తి అయితే మార్చి 26నే వస్తాం. pic.twitter.com/23VOD188Ao— greatandhra (@greatandhranews) December 20, 2025 -
పెద్ది మూవీపై చీప్ కామెంట్స్.. విశ్వక్ సేన్ ఫైర్..!
సినిమా ఇండస్ట్రీలో కామెంట్స్ చేయడం ప్రతి ఒక్కడికీ అదో ఫ్యాషన్ అయిపోయింది. ఎవడు పడితే మూవీలపై రివ్యూలు ఇస్తున్నారు. యూట్యూబ్ ఛానెల్ ఉన్న ప్రతి ఒక్కరూ తామేదో మేధావుల్లా ఫీలయి సినిమాలపై రివ్యూలు ఇచ్చేస్తున్నారు. సినిమా గురించి ఓనమాలు తెలియనివాళ్లు కూడా ఇష్టమొచ్చినట్లు సోషల్ మీడియాలో మాట్లాడేస్తున్నారు. టాలీవుడ్ చిత్రాలపై ఎలా పడితే అలా కామెంట్స్ చేసి చాలామంది తమ పబ్బం గడుపుకుంటున్నారు. అలాంటి యూట్యూబ్ రివ్యూవర్స్‌పై టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఫైరయ్యారు. తాజాగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ పెద్ది మూవీని ఉద్దేశించి కొందరు చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మండిపడ్డారు. ఇండస్ట్రీని ప్రయోజనం పొందుతూ కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లను పరాన్నజీవి అని పిలవడం సమంజసం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ ద్వారా తనతో పాటు కుటుంబాన్ని పోషించుకుంటూ.. ఒక సినిమా రిలీజ్ కాకముందే నాశనం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను చూస్తుంటే తాను తినే పళ్లెంలోనే ఉమ్మేసినట్లు ఉందని విశ్వక్ సేన్ ఫైరయ్యారు.ఈ వీడియో ఓ వ్యక్తి రామ్ చరణ్ పెద్ది సినిమాను ఉద్దేశించి అవహేళన చేస్తూ మాట్లాడారు. పెద్ది మూవీ స్టోరీ మీకు తెలుసా? నాకు తెలుసంటూ దర్శకుడిని కించపరిచేలా కామెంట్స్ చేశారు. ఇలాంటి స్టోరీ సినిమాకు చికిరి చికిరీలు అవసరమా? అంటూ ఎగతాళి చేశాడు. ఇది చూసిన విశ్వక్ సేన్ తనదైన స్టైల్లో వీరికి ఇచ్చిపడేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.Isn’t it fair to call someone like him a parasite to cinema? He benefits from the industry, feeds himself and his family through it, yet tries to destroy a film even before it’s released. It’s like spitting on the very plate he eats from. pic.twitter.com/WcLPOGA69k— VishwakSen (@VishwakSenActor) December 19, 2025 -
చికిరి చికిరి 100M వ్యూస్..
-
చికిరి రికార్డ్
‘చికిరి చికిరి...’ అంటూ ‘పెద్ది’ సినిమా లో రామ్‌చరణ్ వేసిన స్టెప్పులకు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాట విడుదలైన నెలలోనే తెలుగులో వంద మిలియన్ల వ్యూస్ దాటిందని, అలాగే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం ఓ రికార్డ్ అని చిత్రబృందం పేర్కొంది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘చికిరి చికిరి...’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియోను నవంబరులో విడుదల చేశారు. బాలాజీ సాహిత్యం అందించిన ఈ పాటని మోహిత్ చౌహాన్ పాడగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.చాంపియన్‌కి అతిథిగా... రోషన్, అనస్వర రాజన్ జోడీగా నటించిన చిత్రం ‘చాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ నెల 18న జరగనున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి హీరో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని యూనిట్ ప్రకటించింది. -
2026లో ‘మెగా’ బ్లాస్ట్.. నలుగురు హీరోలు.. ఐదు సినిమాలు!
ఈ ఏడాది మెగా అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. ఓజీ మినహా.. మెగా హీరోల సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. మరోవైపు చిరంజీవి నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. హిట్,ఫ్లాప్ పక్కన పెడితే..కనీసం సినిమా వచ్చినా చాలు అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులకు వచ్చే ఏడాది ప్రారంభంలో ఫలితం దక్కనుంది. రెండు నెలల గ్యాపులోనే ఒకరు కాదు ఇద్దరు కాదు..ఏకంగా నలుగు మెగా హీరోల సినిమాలు రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది సంకాంత్రికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మనశంకర వరప్రసాద్ గారు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్వకత్వం వహించిన ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో మెగాస్టార్‌ని ఏకంగా రూ. 500 కోట్ల క్లబ్లో చేర్చాలని భావిస్తున్నారు. వెంకటేశ్‌తో అనిల్ తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై రూ. 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ సినిమాకు హిట్ టాక్ వస్తే.. రూ. 500 కోట్ల కలెక్షన్స్ పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.ఇక మార్చిలో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హిట్ పక్కకు పెడితే.. చరణ్(Ram charan) ఈ సినిమాతో రూ. 1000 కోట్ల క్లబ్లో చేరతాడా లేదా అనేదానిపై మెగా ఫ్యాన్స్ డిబెట్ జరుపుతున్నారు. మార్చి 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా కంటే ముందుగానే మరో మెగా హీరో సాయిదుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ రిలీజ్ కానుంది. డేట్ ఫిక్స్ కాలేదు కానీ.. మార్చి రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏప్రిల్‌లో మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్(Pawan Kalyan) బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నారు. ఈ నెలలోనే చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. సమ్మర్లో రాబోతున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. మార్చిలోపు సీజీ పనులన్నీ పూర్తి చేసుకొని ఏప్రిల్‌లో రిలీజ్ చేయలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదే నెలలో పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్ ’కూడా రిలీజ్ కాబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. ఇప్పటికే పవన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ అంతా పూర్తి అయింది. మార్చికల్లా అన్ని పనులు పూర్తి చేసుకొని..ఏప్రిల్‌లోనే రిలీజ్ చేయాలని హరీశ్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2026 ప్రారంభం నుంచే మెగా ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ ప్రారంభం అవుతాయి. -
హైదరాబాద్ టు ఢిల్లీ
చిన్న బ్రేక్ తర్వాత పెద్ది’ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన ఓ లాంగ్ షూటింగ్ షెడ్యూల్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ తర్వాత ‘పెద్ది’ టీమ్ చిన్న బ్రేక్ తీసుకుంది. కొత్త షెడ్యూల్ మళ్లీ హైదరాబాద్లోనేప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అలాగే కొన్ని సన్నివేశాలను ఢిల్లీలో చిత్రీకరించేందుకు ‘పెద్ది’ టీమ్ ప్లాన్ చేసింది.జనవరి నెలాఖరు వరకు ఈ షూటింగ్ షెడ్యూల్ కొనసాగుతుంది. ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యేలా టీమ్ ప్లాన్ చేసింది. ‘‘పెద్ది’ షూటింగ్ అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. నిర్మాణ పనులన్నీ సజావుగా సాగుతున్నాయి. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. -
పెద్ది, ప్యారడైజ్ కి పోటీగా వెంకటేష్ సినిమా
-
పెద్దికి పెద్ద కష్టం..! పాన్ ఇండియా స్టార్స్
-
రామ్ చరణ్‌పై అభిమానం.. జపాన్ నుంచి వచ్చిన యువతులు
టాలీవుడ్ హీరోలకు జపాన్‌లో ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసేందుకు ఒక యువతి ఏకంగా జపాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ (Ram Charan)పై అభిమానం పెంచుకున్న కొందరు జపాన్ ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చరణ్ వారందరినీ ఇంటికి పిలిపించి మాట్లాడారు. వారందరితో కొంత సమయం పాటు ఆయన సరదాగా గడపడమే కాకుండా ఫోటోలు దిగారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూశామని చాలాబాగా నచ్చిందని వారు చెప్పారు. అయితే, వారందరూ కూడా పెద్ది సినిమా టీషర్ట్స్ వేసుకుని కనిపించి మెప్పించారు. వారి అభిమానానికి చరణ్ ఫిదా అయ్యారు. వారందరికీ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. Ram Charan is one of the few Telugu heroes who enjoys strong fandom in Japan. Today, he met fans who travelled all the way from Japan to see him and spent quality time with them.#Peddi #RamCharan pic.twitter.com/qK6rvh8Ald— Telugu Chitraalu (@CineChitraalu) December 8, 2025Dream for Other Heros Japan God #RamCharan 🇯🇵🛐🔥 !! pic.twitter.com/IzObh6k1ZO— Perfect Wala (@Perfectwala5) December 8, 2025 -
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ 'ఆట' మొదలైంది!
సినిమా ఇండస్ట్రీలో స్పోర్ట్స్ జానర్ చిత్రాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు స్పోర్ట్స్ చిత్రాలు వస్తుంటాయి. ఈ చిత్రాల్లోని స్పోర్ట్స్, నటీనటుల ఎమోషన్స్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే చాలు... భాషతో కూడా పని లేకుండా సూపర్ హిట్ అయిన స్పోర్ట్స్ మూవీస్ చాలానే ఉన్నాయి. తాజాగా తెలుగులో కొన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలు రూపొందుతున్నాయి. మరి.. ఏయే హీరోలు స్పోర్ట్స్‌కి సై అంటూ... బరిలోకి దిగి, ఆట మొదలుపెట్టారో ఓ లుక్ వేయండి.క్రికెట్... కబడ్డీ ఏదైనా స్పోర్ట్స్ డ్రామా సినిమా వెండితెరపైకి వస్తే, ఆ సినిమాలో ఒక స్పోర్ట్ గురించిన ప్రస్తావనే ఉంటుంది. కానీ ‘పెద్ది’ సినిమాలో ఆడియన్స్ మూడ్నాలుగు క్రీడలను చూడబోతున్నారు. అవును... రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో ప్రధానంగా క్రికెట్ కనపడుతుంది. అలాగే ఈ సినిమాలో కోకో, కబడ్డీ, కుస్తీ వంటి ఆటల ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ను బట్టి ‘పెద్ది’ సినిమాలో రామ్‌చరణ్ క్రికెటర్‌గా కనిపిస్తారనే విషయంపై క్లారిటీ వచ్చింది.మరి... మిగతా ఆటలతో రామ్‌చరణ్ పాత్ర ఏ విధంగా కనెక్ట్ అయ్యుంటుందనే విషయంపై వచ్చే ఏడాది మార్చిలో స్పష్టత రానుంది. మల్టీస్పోర్ట్స్ పీరియాడికల్ రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘పెద్ది’లో రామ్‌చరణ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణను ప్లాన్ చేశారు. ‘దంగల్’ ఫేమ్ షామ్ కౌశల్ (బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి) పర్యవేక్షణలో, నవనీత్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు కొరియోగ్రఫీ వహిస్తున్నారు.హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత, ‘పెద్ది’ టీమ్ ఢిల్లీకి వెళ్లనుందని తెలిసింది. ఢిల్లీలో ఓ పెద్ద క్రికెట్ మ్యాచ్‌ను షూట్ చేస్తారని సమాచారం. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో జరిగే ఓ లాంగ్ షెడ్యూల్‌తో ‘పెద్ది’ షూటింగ్ ఓ కొలిక్కి వస్తుందని తెలిసింది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.బైకర్ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ వారంలో అంటే... ఈ నెల 6న ‘బైకర్’ సినిమా థియేటర్స్‌కి వచ్చి ఉండేది. కానీ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకూడదని, ఆడియన్స్‌కు నిజమైన స్పోర్ట్స్ సినిమా చూసిన మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వాలని ‘బైకర్’ సినిమా టీమ్ తమ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసింది. శర్వానంద్ హీరోగా నటించిన మోటో క్రాస్ రేసింగ్ ఫిల్మ్ ‘బైకర్’. ఈ చిత్రంలో శర్వానంద్ బైకర్‌గా నటించారు. ఈ సినిమా కోసం శర్వానంద్ తనను తాను కొత్తగా మలచుకున్నారు.వెండితెరపై పర్ఫెక్ట్ బైకర్‌గా కనిపించేందుకు సరైన ఫిట్నెస్ ట్రైనింగ్‌తో బైకర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఈ పాత్ర కోసం బాగా బరువు తగ్గారు కూడా. ఈ సినిమాలోని బైక్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లను ఇండోనేషియాలో చిత్రీకరించారు. అలాగే ‘బైకర్’ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ కావొచ్చు కానీ ఈ సినిమాలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నట్లుగా తెలిసింది. మూడు తరాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. 1990, 2000ల టైమ్ పీరియడ్‌లో ‘బైకర్’ సినిమా ఉంటుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మాళవికా నాయర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటించారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో విక్రమ్ సమర్పణలో వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.తొలిసారి స్పోర్ట్స్ డ్రామా దాదాపు ఐదేళ్ల క్రితం విజయ్ దేవరకొండ ‘హీరో’ (అప్పట్లో ప్రచారంలోకి వచ్చిన టైటిల్) అనే ఓ బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామా చేయాల్సింది. ఈ స్పోర్ట్స్ బేస్డ్ మ్యూజికల్ మూవీలో మాళవికా మోహనన్ హీరోయిన్. ఈ సినిమాకు ఆనంద్ అన్నామలై దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించాల్సింది. ఈ మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. అలా అప్పట్లో విజయ్ దేవరకొండ చేయాల్సిన స్పోర్ట్స్ మూవీ పట్టాలెక్కలేదు. కానీ ఐదేళ్లకు మళ్లీ విజయ్ దేవరకొండకు ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథ నచ్చిందట.‘ఇష్క్, మనం, 24’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఓ స్పోర్ట్స్ డ్రామా కథను అనుకుంటున్నారట. ఈ కథను ఇటీవల విజయ్ దేవరకొండకు వినిపించగా, ఈ హీరో ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారని తెలిసింది. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట విక్రమ్ కె. కుమార్. అయితే ప్రస్తుతం దర్శకుడు రవికిరణ్ కోలాతో విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ అనే సినిమా చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యాన్‌తో విజయ్ మరో సినిమా చేయాల్సి ఉంది. ఇలా... ‘రౌడీ జనార్ధన, రాహుల్ సంకృత్యాన్లతో విజయ్ చేయాల్సిన సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత విక్రమ్ కె. కుమార్ సినిమాను విజయ్ టేకప్ చేస్తారని ఊహించవచ్చు. అయితే విజయ్ దేవరకొండకు విక్రమ్ కె. కుమార్ ఎలాంటి కథ చెప్పారనే విషయంపై స్పష్టత లేదు. లబ్బరు పందు మేక్... క్రికెట్ నేపథ్యానికి లవ్ అండ్ ఫ్యామిలీ అంశాలను జోడించి తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా ‘లబ్బరు పందు’. హరీష్ కల్యాణ్, దినేష్, శ్వాసిక, సంజన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2024 సెప్టెంబరులో విడుదలై, సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్నట్లుగా తెలిసింది. ఈ తెలుగు రీమేక్‌లో రాజశేఖర్, రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్, రమ్యకృష్ణ, ‘35’ సినిమా ఫేమ్ విశ్వదేవ్, ప్రధాన తారాగణంగా నటిస్తున్నారని సమాచారం.ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనట్లుగా తెలిసింది. ఈ సినిమాలో రాజశేఖర్, విశ్వ తేజ్ క్రికెటర్లుగా కనిపిస్తారు. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరోవైపు దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత రాజశేఖర్, రమ్యకృష్ణ ఈ సినిమా కోసం మళ్లీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండం విశేషం.థండర్ హీరో ఆది పినిశెట్టి ఫిట్నెస్, కటౌట్ ఓ స్పోర్ట్స్ డ్రామాకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇందుకు తగ్గట్లుగానే ఆది పినిశెట్టి ‘థండర్’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. ఈ మూవీ కోసం ఆది కొత్తగా మేకోవర్ అయ్యారట. ఈ సినిమా గురించి త్వరలోనే మరికొన్ని కొత్త విషయాలను తెలియజేస్తానని ఆది పినిశెట్టి ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు.మట్టి కుస్తీ సీక్వెల్ విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మి హీరో హీరోయిన్లుగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘గట్టా కుస్తీ’. చెల్లా అయ్యావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలుగు హీరో రవితేజ ఓ నిర్మాత. ఈ చిత్రం 2022లో విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తెలుగులో ‘మట్టి కుస్తీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా సీక్వెల్ రూపొందుతోంది.ఇటీవలే ‘మట్టి కుస్తీ 2’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. తొలి భాగంలో నటించిన విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మిలే మలి భాగంలోనూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే చెల్లా అయ్యావుయే సీక్వెల్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వేల్స్ ఇంటర్నేషనల్ ఫిలింస్‌తో కలిసి విష్ణు విశాల్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.మండాడి తమిళ నటుడు సూరి హీరోగా, తెలుగు హీరో సుహాస్ విలన్‌గా నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘మండాడి’. ఈ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా సినిమాకు మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. అయితే గత ఏడాది అక్టోబరులో ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరిగింది. యూనిట్ సభ్యులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ, సామాగ్రి పాడైపోయింది. మరి... ఈ సినిమా నెక్ట్స్ అప్డేట్ గురించి మేకర్స్ మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.ఇటు క్రికెట్... అటు లవ్ ‘సుడిగాలి’ సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జీఓఏటీ’. ఈ చిత్రంలో దివ్య భారతి హీరోయిన్గా నటించారు. మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమా కథ ప్రధానంగా క్రికెట్ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. కథనం క్రికెట్ నేపథ్యంలో సాగినా, లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్‌లు కూడా ఉంటాయని సమాచారం. మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వీ, ఆడుకులం నరైన్, ఆనంద రామరాజు, పమ్మి సాయి, చమ్మక్ చంద్ర, నవీన్ నేని ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.పతంగుల పోటీ ఇప్పటివరకూ ఎన్నో స్పోర్ట్స్ డ్రామా సినిమాలు చూసి ఉంటాం. కానీ గాలి పటాల పోటీ నేపథ్యంలో సినిమా వచ్చి ఉండదు. పతంగుల పోటీ అనే కాన్సెప్ట్‌తో రాబోతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన తారాగణంగా, సింగర్ ఎస్పీ చరణ్ మరో కీలక పాత్రలో నటించిన సినిమా ‘పతంగ్’. ఈ కామెడీ స్పోర్ట్స్ మూవీకి ప్రణీత్ పత్తిపాటి దర్శకత్వం వహించారు. డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది.ఇంకా మరికొన్ని స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు సెట్స్‌పై ఉండగా, ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్... రిలీజ్‌కు ముందే సంచలనం!
ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మధ్యే రిలీజ్ అయితే ‘చికిరి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తోంది. అంతకు ముందు విడుదలైన గ్లింప్స్‌తో పాటు ఈ పాట కూడా హిట్ కావడంతో పెద్దిపై అంచనాలు అమాంతం పెరిగాయి.సినిమాకు వచ్చిన బజ్‌తో పలు ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ కోసం పోటీపడ్డాయట. ముఖ్యంగా రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీలో నిలవగా.. భారీ ధరకు నెటిఫ్లిక్స్ డిజిటల్ రైట్స్‌ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి పెద్ది(Peddi) కోనుగోలు చేసిందట నెట్‌ఫ్లిక్స్. అన్ని భాషలకు గాను ఈ మొత్తాన్ని చెల్లించబోతుందట. షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ కాబోతున్న చిత్రాలకే ఓటీటీ బిజినెస్ అవ్వడం లేదు. అలాంటిది ఇంకా షూటింగ్ కూడా పూర్తికాని పెద్ది చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సిద్ధం చేయించిన భారీ సెట్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతోంది. రామ్‌చరణ్, ఇతర ఫైటర్లతో పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ కూడా పాల్గొంటున్నారు. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తండ్రి, ప్రముఖ స్టంట్ డైరెక్టర్ ‘దంగల్’ ఫేమ్ షామ్ కౌశల్ ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పర్యవేక్షిస్తుండగా, నవకాంత్ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘ప్రతి ఫైట్ సీక్వెన్స్‌ను ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో, ఉత్కంఠభరితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బుచ్చిబాబు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఫైట్ సీక్వెన్స్ ఓ హైలైట్‌గా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. -
'పెద్ది' ఫైట్.. స్టార్ హీరో తండ్రి ఆధ్వర్యంలో!
మెగాహీరో రామ్ చరణ్.. 'పెద్ది' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'చికిరి' హిట్ కాగా.. డిసెంబరులో మరో పాట వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈసారి ఎలాంటి సాంగ్ రాబోతుందోనని అభిమానులు అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్‌లో ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఇది బాలీవుడ్ స్టార్ హీరో తండ్రి ఆధ్వర్యంలో తీస్తుండటం విశేషం. ఇంతకీ సంగతేంటి?'పెద్ది' మూవీ ప్రకటించినప్పుడు ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే గ్లింప్స్, చికిరి చికిరి సాంగ్ వచ్చిందో.. తర్వాత నుంచి హైప్ పెరుగుతూ వస్తోంది. అందుకు తగ్గట్లే దర్శకుడు బుచ్చిబాబు పనిచేస్తున్నాడని తెలుస్తోంది. మూవీలో ఏకంగా ఎనిమిది ఫైట్ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో ఒకటి ఇప్పుడు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తీస్తున్నారట. దీనంతటినీ హిందీ హీరో విక్కీ కౌశల్ తండ్రి శామ్ కౌశల్.. దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. ఈయన గతంలో 'దంగల్' చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫీ చేశారు.'పెద్ది' చిత్రాన్ని ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ స్టోరీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. క్రికెట్, కబడ్డీ లాంటి గేమ్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇందులో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలో రిలీజ్ అని అన్నారు. రీసెంట్ టైంలో పాన్ ఇండియా సినిమాలన్నీ చెప్పిన తేదీకి అస్సలు రావడం లేదు. మరి 'పెద్ది' చెప్పిన టైంకి వస్తాడా లేదంటే వాయిదా వేస్తాడా అనేది చూడాలి? -
పెద్ది ప్రమోషన్స్ కు ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ కి పండగే...
-
'చికిరి చికిరి' పాట లొకేషన్ ఎక్కడో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా నుంచి కొన్నిరోజుల క్రితం 'చికిరి చికిరి' అని సాగే తొలి పాట రిలీజైంది. వెంటనే సంగీత ప్రియులకు నచ్చేసింది. అప్పటినుంచి రీల్స్, షార్ట్స్.. ఇలా ప్రతిచోట ఈ పాట వీడియోలే కనిపించాయి. తాజాగా ఈ గీతం అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల మార్క్ అందుకుంది. ఈ క్రమంలోనే మూవీ నుంచి చిన్న సర్ప్రైజ్ వచ్చింది. మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)ఈ వీడియోలో టీమ్ అంతా దాదాపు 45 నిమిషాల పాటు కష్టపడి ట్రెక్కింగ్ చేసి కొండపైన ఉన్న లొకేషన్‌కి చేరుకున్నారు. రామ్ చరణ్ కూడా కొండ ఎక్కుతూ అలసిపోయి ఆగుతూ ఎక్కడం ఇందులో మీరు చూడొచ్చు. చివరలో 'చిరుత' గురించి దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్ మాట్లాడుకోవడం ఆసక్తికరంగా అనిపించింది.అసలు విషయానికొస్తే.. 'చికిరి' పాటని నిజమైన లొకేషన్లో తీశారు. మహారాష్ట్రలోని పుణెలో సవల్య ఘాట్ (Savlya Ghat) అనే ప్రాంతం ఉంది. ఎత్తయిన కొండలు, చుట్టూ పచ్చదనంతో కనువిందుగా ఉంటుంది. అక్కడే కొండపైన 'చికిరి చికిరి' పాట షూటింగ్ చేశారు. దీనిపై ఎలాంటి వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేదు. ఎవరైనా సరే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. మూవీ టీమ్ అలానే వెళ్లింది. దాదాపు 45 నిమిషాల పాటు చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబుతోపాటు టీమ్ అంతా వెళ్లడం ఈ వీడియోలో మీరు చూడొచ్చు.(ఇదీ చదవండి: నేనెంత బాధపడ్డానో నాకే తెలుసు.. కుటుంబ వివాదంపై మంచు లక్ష్మీ) -
పెద్ది పోస్ట్ పోన్ అంటున్న కన్నడ ఇండస్ట్రీ..!
-
ప్రపంచ వ్యాప్తంగా చితకొడ్తున్న చికిరి..!
-
రామ్ చరణ్ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్ క్రేజీ రికార్డ్!
రామ్‌చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది(Peddi Movie). ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. చికిరి చికిరి(chikiri chikiri song) అంటూ సాగే పాటను విడుదల చేయగా కుర్రకారుతో పాటు ప్రతి ఒక్కరినీ ఊపేస్తోంది. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. తొలిరోజే వ్యూస్ పరంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ పాట మరో క్రేజీ రికార్డ్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఏకంగా 80 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌కు బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. #ChikiriChikiri hits 80M+ VIEWS on YouTube ❤🔥Everyone is grooving to the Chikiri Vibe 💥🕺💃🔗 https://t.co/Fd9ALDmIcs#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026.Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop… pic.twitter.com/TZwUAdY8is— Vriddhi Cinemas (@vriddhicinemas) November 16, 2025 -
రామ్ చరణ్ పెద్ది సినిమాపై క్రేజీ అప్ డేట్..
-
ఎర్రకోట ఘటన.. 'పెద్ది' టీమ్ జస్ట్ మిస్!
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఈ నెల 10వ తేదీ రాత్రి జరిగిన కారు పేలుడు ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇది ఉగ్రచర్య అని కేంద్రం ప్రకటించింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ విషయమై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. అయితే ఈ ఘటన నుంచి రామ్ చరణ్ 'పెద్ది' మూవీ టీమ్ కొద్దిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓవైపు తల్లి పాత్రలు.. మరోవైపు ఐటమ్ సాంగ్స్.. శ్రియ తగ్గేదే లే)ఈనెల 15, 16 తేదీల్లో పేలుడు జరిగిన ఎర్రకోట సమీప ప్రాంతంలోనే షూటింగ్ చేసేందుకుగానూ 'పెద్ది' టీమ్ అనుమతి తీసుకుందట. కానీ ఇప్పుడిలా జరగడంతో మరో ఆలోచన లేకుండా చిత్రీకరణ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మూవీ షూటింగ్ చేయడానికి కొన్నిరోజుల ముందే ఇలా జరగడంతో టీమ్ అంతా షాక్‌కి గురవుతున్నారట. రష్మిక కొత్త సినిమా షూటింగ్ కూడా అక్కడే ప్లాన్ చేసుకున్నారట. ఇప్పుడు ఇది కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇంకొన్నిరోజుల పాటు ఎర్రకోట ప్రాంతంలో ఎలాంటి షూటింగ్ ఉండే అవకాశం లేదు.'పెద్ది' షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రావాలనే టార్గెట్ పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే ఈ మధ్యే 'చికిరి.. చికిరి' అనే పాటని రిలీజ్ చేశారు. అదెంత వైరల్ అయిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రూరల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు.(ఇదీ చదవండి: న్యూయార్క్‌లో అనిరుధ్-కావ్య మారన్.. ఏం జరుగుతోంది?) -
'నా కెరీర్లో ఇదే ఫస్ట్ టైమ్'.. చికిరి సాంగ్ లిరిసిస్ట్ బాలాజీ కామెంట్స్!
రామ్‌చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. చికిరి చికిరి అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్లింది. ఒక్క రోజులోనే మిలియన్ల వీక్షణలతో సరికొత్త రికార్డ్ సాధించింది. కాగా.. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌కు బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.తాజాగా ఈ పాట గురించి లిరిసిస్ట్ బాలాజీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సిటీమార్, ఎంసీఏ పాటలకంటే నా కెరీర్లో ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్ వచ్చిన పాట ఇదేనని తెలిపారు. చికిరి.. చికిరి అనే పాట ఉత్తరాంధ్రలోని గ్రామీణ నేపథ్యంలోని వెనకబడిన జాతి నుంచి వచ్చిన యువకుడికి.. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఏమనిపించింది అనేదే కాన్సెప్ట్‌తో పుట్టుకొచ్చిందే ఈ పాట.చికిరి అంటే ప్రత్యేకంగా అర్థమేమి లేదన్నారు. ఆ అబ్బాయిని.. అమ్మాయిని పొగుడుతూ తన కోరికను ఇలా చికిరి పాట రూపంలో చెప్తాడని బాలాజీ తెలిపారు. ఈ సాంగ్ కోసం దాదాపు ఎనిమిది నెలలు ప్రయాణం చేశానన్నారు.ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జాన్వీకపూర్ అచ్చియ్యమ్మ పాత్రలో కనిపించనుంది. శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రెహమాన్ కన్సర్ట్ జ్ఞాపకాలతో మంగ్లీ (ఫొటోలు)
-
పెద్ది తో టాలీవుడ్ లో రెహమాన్ రీ-ఎంట్రీ.. బద్దలవుతున్న మ్యూజిక్ రికార్డ్స్
-
ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)
-
నా చిన్ననాటి కల.. 'పెద్ది'తో నిజమవుతుంది: రామ్ చరణ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో దర్శకుడు బుచ్చిబాబు చేస్తున్న చిత్రం పెద్ది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇందులో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే ఏర్పడ్డ భారీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బుచ్చిబాబు పెద్ది చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా పెద్ది సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు.ఇదిలా ఉంటే, తాజాగా హైదరాబాద్‌లో ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్ జరిగింది. అందులో రెహమాన్ తాను చేసిన పాటలతో ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాడు. భారీగా జరిగిన ఈ కాన్సర్ట్‌కు పెద్ది సినిమా టీం రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సనా హాజరయ్యారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఏఆర్ రెహమాన్ గారితో సినిమా చేయడం నా చిన్ననాటి కల.. ఆ అవకాశం నాకు బాగా నచ్చిన పెద్ది లాంటి కథతో నిజం అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. తాజాగా రిలీజైన చికిరి సాంగ్ అదిరిపోయింది. పెద్ది సినిమా కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది, అంటూ రెహమాన్‌పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ కామెంట్స్‌తో పెద్ది సినిమా చరణ్‌కు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే పెద్ది సినిమాపై అంచనాలు ఇంకా పెంచుతున్నాయి. -
హైదరాబాద్‌లో సందడిగా రెహమాన్ కన్సర్ట్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్.. హైదరాబాద్‌లో శనివారం రాత్రి కన్సర్ట్ నిర్వహించారు. తన లైవ్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి రెహమాన్ అభిమానులు, సంగీత ప్రియులు వేలాది తరలివచ్చారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ కన్సర్ట్‌లో రెహమాన్.. తమిళ, హిందీ పాటలు ఆలపించారు. అలానే తెలుగులోని కొన్ని సాంగ్స్ కూడా పాడారు. 'పెద్ది' హీరోహీరోయిన్ల రామ్ చరణ్, జాన్వీ కపూర్‌తో పాటు దర్శకుడు బుచ్చిబాబు సందడి చేశారు. ఇక స్క్రీన్ పై 'పెద్ది' నుంచి ఈ మధ్యే రిలీజైన 'చికిరి' పాటని ప్లే చేయడం విశేషం. -
కొత్త ఇంట్లోకి సతీసమేతంగా 'బుచ్చిబాబు' గృహప్రవేశం
'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి, జాతీయ అవార్డు అందుకున్న బుచ్చిబాబు కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. మొదటి సినిమానే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగులో ఉత్తమ చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కలిసి పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది'ని తెరకెక్కిస్తున్నారు.కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన బుచ్చిబాబు తాజాగా పిఠాపురంలో కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. శనివారం సతీ సమేతంగా గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు పాల్గొన్నారు. అభిమానులు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. గృహప్రవేశం కార్యక్రమంలో వల్ల గత రాత్రి జరిగిన ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్‌కు బుచ్చిబాబు రాలేకపోయారు. కానీ, ఆయన తెరకెక్కిస్తున్న పెద్ది సినిమా సాంగ్ ఈ కార్యక్రమంలో మరోసారి ప్రేక్షకులకు లైవ్‌లో వినిపించారు.లైఫ్ ఇచ్చిన సుకుమార్బుచ్చిబాబు, సుకుమార్‌లది గురు-శిష్యుల బంధమని తెలిసిందే. సుకుమార్ కాకినాడలోని ఓ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేశారని తెలిసిందే. అయితే, అదే కాలేజీలో బుచ్చిబాబు స్టూడెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో సుకుమార్ చెప్పే పాఠాలంటే బుచ్చిబాబుకు బాగా ఇష్టం ఉండేది. దీంతో వారిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అయితే, గురువు దర్శకుడిగా మారడంతో తాను కూడా అదే దారిలో అడుగులు వేశారు. అలా ‘ఆర్య 2’ నుంచి సహాయ దర్శకుడిగా బుచ్చిబాబు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత సుకుమార్ తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో, రంగస్థలం,100% లవ్ వంటి చిత్రాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశారు.పిఠాపురం లో కొత్త ఇల్లు కట్టుకున్న పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సానా. శనివారం గృహ ప్రవేశ వేడుక జరిగింది.#Peddi #BuchiBabuSana #RamCharan pic.twitter.com/cOSJ3aIZLq— Tollywoodtopics (@filmytopics) November 9, 2025


