జాన్వీ కపూర్ సీన్స్‌ కట్.. పెద్ది మేకర్స్ సాహసం చేస్తున్నారా? | Peddi makers Removed Janhvi Kapoor Scenes after controversey | Sakshi
Sakshi News home page

Peddi Movie: జాన్వీ కపూర్ సీన్స్‌ కట్.. పెద్ది మేకర్స్ సాహసం చేస్తున్నారా?

Jun 9 2026 7:30 PM | Updated on Jun 9 2026 7:41 PM

Peddi makers Removed Janhvi Kapoor Scenes after controversey

పెద్ది మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాన్వీ కపూర్ సీన్స్‌పై తీవ్రమైన విమర్శలు రావడంతో ఆ సన్నివేశాలను తొలగించారు. ఈ విషయాన్ని పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు స్వయంగా ప్రకటించారు. పెద్దిలో జాన్వీ రోల్‌కు అపార్థం చేసుకున్నారని అన్నారు. ఈ కథను ఉప్పెన కంటే చాలా భిన్నంగా రాసుకున్నానని వెల్లడించారు. అయితే విమర్శలు రావడం వల్లే జాన్వీ కపూర్ సీన్స్‌ను తొలగిస్తున్నామని డైరెక్టర్ స్పష్టం చేశారు.

కొత్త సీన్స్ యాడ్?

అయితే జాన్వీ కపూర్‌ సీన్స్‌ తొలగించినప్పటికీ పెద్ది మేకర్స్ మరో ఆలోచనలో ఉన్నారట. మరిన్ని కొత్త సన్నివేశాలు యాడ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే సెన్సార్ అయిన వర్షన్ నుంచి జాన్వీ కపూర్ సీన్స్ మాత్రమే కాకుండా మరికొన్ని సీన్స్ తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా మరిన్ని సీన్స్ యాడ్ చేయనున్నారని సమాచారం. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ తొలగించి రామ్ చరణ్, జగపతి బాబు మధ్య ఎమోషనల్ సీన్స్ యాడ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే మళ్లీ సెన్సార్ చేయించి థియేటర్స్‌లో పెద్ది కొత్త వర్షన్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement